నక్సల్బరీ ప్రాంతంలో చారు మజుందర్ అధ్వర్యంలో మార్క్సిస్ట్-లెనినిస్ట్
తిరుగుబాటు జరిగి 50 యేళ్ళు అయిన సందర్భంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో
చాలామంది మేధావులు ఎన్నో కోణాల నుంచి పరిశెలిస్తూ వ్యాసాలు రాశారు,ఇకముందు కూడా రాస్తారేమో!ఇప్పట్ వరకు
రాసినవాళ్ళలో ఉద్యమంలోకి వెళ్ళినవాళ్ళు తాము యవ్వనంలో ఉన్న కాలాన్ని - తమ కుర్రతనపు సినిమాల షికార్ల కబుర్లతో
సహా - గుర్తు చేసుకుని తాము ఆ దారిలోకి వెళ్ళడానికి తమ వైపు నుంచి కారణాలు చెప్పుకున్నారు!మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండునని
ఆశాభావాన్ని వ్యక్తం చేశారు - వారి నోస్టాల్జియా నాకూ నచ్చింది!కానీ,"మొదటి తరంలోని యువకుల్ని అంత
తీవ్రస్థాయిలో ఉద్రేకింప జేసిన విప్లవ సిద్ద్గాంతం తర్వాత తరాల్లోని యువకుల్ని
ఎందుకు నిరాశకు గురిచేసి ప్రజాదరణ కోల్పోయింది?" అనే
మౌలికమైన ప్రశ్నకు జవాబు చెప్పే విషయంలో మాత్రం అందరిలోనూ తొట్రుపాటు, గందరగోళం, కంగారు మాత్రమే కనిపించాయి.ప్రపంచంలో ఏ భావజాలం, ఏ ఉద్యమం, ఏ రాజకీయ పార్టీ, ఏ మతం, ఏ సినిమా, ఏ
నాటకం, ఏ కవిత, ఏ నాట్యం, ఏ
రేఖాచిత్రం, ఏ వ్యసనం, ఏ
దుర్మార్గం ప్రజల్ని సమ్మోహితుల్ని చెయ్యాలన్నా అందులో క్లారిటీ ఉండాలి.ఒక విషయం
గురించి ఒక వాక్యమే చెప్పినా వెయ్యి వాక్యాలు చెప్పినంత క్లారిటీ ఇవ్వగలిగిన వాడు
దోపిడీని కూడా ధర్మమే అని చెప్పి ఒప్పించి సకలజనుల్ని తనవెంట నడిపించుకోగలడు!మరి, ప్రజల్ని దోపిడీ నుంచి విముక్తం చేసే మహోన్నతమైన మార్క్సిస్టు సిద్ధాంతం
గురించి ప్రజలకు చెప్పి ఒప్పించడానికి ఈ మేధావు లందరికీ క్లారిటీ ఎందుకు లేదు?
కొందరు ఉద్యమంలోకి వెళ్ళనివారు - వారిలో కొందరు ఉద్యమంలోకి వెళ్ళినవారి సహాధ్యాయులే - వెళ్ళినవారికి "మీరు ఈ 50 యేళ్ళలో ఎంత ప్రగతిని సాధించారు?" అనే ప్రశ్నని సంధించారు.ఇంత కాలం పాటు మౌనం రాజ్యమేలి,ఇక యెవరూ చెప్పలేరనుకుంటున్న సందర్భంలో ముప్పాళ రంగనాయకమ్మ గారు రంగంలోకి దిగారు - "మరో ప్రపంచాన్ని రేపు చూస్తాం!" అని గొప్ప ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు.వ్యాసం చాలా చిన్నది, పత్రికవారు కూడా ఎక్కువ స్థలం ఇవ్వరు కాబట్టి తక్కువగానే చెప్పాల్సిన అవసరం కోసం తన సహజసిద్ధమైన వెకిలితనాన్ని తగ్గించుకుని పాయింట్ల వారీ జవాబులు చెప్పడం నాకు ఎంతగానో నచ్చింది - ఆమె ఎజెండా కక్కుర్తితో చేసే తక్కువస్థాయి వెక్కిరింతలు లేకుండా మాట్లాడటం బహుశా ఇదే మొదటిసారీ ఇదే ఆఖరుసారీ కావచ్చు!ఆమె ఇతరులు చాలాకాలంగా కమ్యూనిష్టుల్ని అడుగుతున్న ప్రశ్నలని అక్కడ ఉటంకించి వాటికి జవాబులు చెప్పారు.అయితే, మొదటి జవాబులోనే విప్లవాభిమానులకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు - "మరో ప్రపంచానికి నమూనా ఏదైనా ఉందా?" అనే ప్రశ్నకి "నమూనా ఇప్పటికీ లేదు!" అని బల్లగుద్ది చెప్పేశారు, ప్రణాళిక మాత్రం ఉందట, గ్రహింపులు గాఢంగా లేక రష్యా-చైనాలు మంచి నమొనాలు కాలేకపోయాయట, అక్కడి అపజయాలకు కారణాలేమిటో అక్కడా ఇక్కడా కూడా ఇంకా గ్రహించలేదట, త్వరలోనే గ్రహిస్తారట.
ఎప్పటికి గ్రహింపులు పూర్తవుతాయని తొందర పెట్టకూడదు,"నక్సల్బరీ ఒక లగ్జరీ కాదు.విప్లవం ఒక వ్యాపకం కాదు.విప్లవకారులకు త్యాగాలు భుజకీర్తులు తెచ్చిపెట్టవు.కేవలం ఉద్యమకారులే కాదు, వాళ్లను కాపాడుకోవటానికి ప్రజలూ ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.ఆ త్యాగాలు ఎందుకు కొనసాగుతున్నాయి?మనిషిని, ప్రకృతిని, సామాజికవిలువలను ధ్వంసం చేసే నయా ఉదారవాద రాజకీయ ప్రక్రియ కొనసాగుతుంటే, దానికి ఎదురు నిలబడి పోరాడుతున్న ప్రజలనూ పార్టీలనూ బుద్ధిజీవుల మనుకునేవాళ్ళు 'మీ మరోప్రపంచం ఎక్కడ?' అని వెటకారం చెయ్యడం సరికాదు.నిజాయితీగా మరో ప్రపంచాన్ని కోరుకునేవాళ్ళు వారికి మద్దతు నివ్వటం కనీస కర్తవ్యం." అని అశోక్ కుంబము గారు పక్కనుంచి సలహాలు ఇస్తున్నారు, విని గ్రహింపు లేక ఎఱుక లేక తెలివిడి తెచ్చుకుని వారిని తొందర పెట్టకండి.రంగనాయకమ్మ గారు కూడా ప్రపంచంలో అనేకచోట్ల ఈ గ్రహింపులు జరుగుతూనే ఉన్నాయనీ,"మంచి" కోసం జరిగే ప్రయత్నాలు ఆగిపోవనీ,ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒకరోజున నమూనా ఏర్పడకపోదనీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ హేతుబద్ధమైన క్లారిటీ ఇచ్చి తీరాల్సిన ఈ ప్రశ్నకి జవాబుని సెంటిమెంటు ముక్తాయింపులతో ముగించారు.దీనితోనే ఈమె పాండిత్యమూ, ఆమెకి ఆ పాండిత్యాన్ని ప్రసాదించిన మార్క్సిజమూ ఎంత దిక్కుమాలినవో అర్ధమై నాకు హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి వారి కాటిసీను గుర్తొచ్చి జాలిగా అనిపించింది, నిజం!
ఇక్కడ నేను బ్లాగుల్లో కమ్యూనిష్టు భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కుర్రనాగన్నల నందర్నీ ఎన్నోసార్లు "మీ సిద్ధాంతంలోని అతి ముఖ్యమైన వర్గరహితప్రపంచం అనే లక్ష్యం గురించి మార్క్సుగారు చెప్పినవాటిలో కనీసం నాలుగు శాస్త్రీయమైన లక్షణాలని చెప్పండి!" అని అడిగాను - ఒక్కడూ ముందుకు రాలేదు.ఇప్పుడు వాళ్ళు ఓపిక తెచ్చుకుని వెతికి చూపించడానికి కూడా వీల్లేకుండా ఈ సీనియర్ మోస్ట్ కమ్యూనిస్ట్ మేధావి అసలు మార్క్సుగారు ఏ మోడలూ చెప్పలేదని స్పష్టం చేసింది - శుభం పలకరా మంకెన్నా అంటే పెళ్ళికూతురు ముండేదని అన్నాట్ట వెనకటి కెవడో!ఈవిడ ఈ వ్యాసం రాయకుండా ఉంటే ఇంకొన్నాళ్ళు విప్లవం లోకి వెళ్ళినవాళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్పుకునే వాళ్ళు,ఇప్పుడు వీళ్ళంతా గమ్యం తెలియని ప్రయాణం చేశారని ప్రజలకి అర్ధమైతే ఇప్పటివరకు వచ్చినట్టు ఇకముందు వీళ్ళ వెంట కళ్ళు మూసుకుని రాగలరా?పోనీ కళ్ళు తెరుచుకుని వీళ్ళ వెంట నడవటానికైనా వీళ్ళు యెక్కడికి వెళ్తున్నారో తెలియకుండా తమని యెక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా వీళ్ళ వెనక ఎవరు వస్తారు?అలా రమ్మని అడిగే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు?మతాలని విమర్శించేటప్పుడు "వీటిలో స్పష్టత లేదు,మేము అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోతున్నారు - వూరికే నమ్మితే చాలునంటున్నారు" అని పడుతున్న తప్పునే వీళ్ళూ చేస్తున్నారు కదా!వర్గరహితప్రపంచం గురించి "అటువంటి 'మంచి' ప్రపంచం ఏర్పడితే, అది 'మాదే' కాదు, 'మీదే' కాదు, 'అందరిదీ' అవుతుంది" అని సుద్దులు చెప్పటం వరకూ బాగానే ఉంది - కానీ మనం అడిగిన ప్రశ్నలకి శాస్త్రీయమైన జవాబులు చెప్పకుండా సెంటిమెంటు ఒలకబోసి వీరు విమర్శిస్త్రున్న మతవాదుల లాగె వీరు కూడా ప్రవర్తించడం దేనికి?
ఇక రెండవదైన "మరో ప్రపంచంలో కూడా ఏదో ఒక ప్రభుత్వం ఉండాల్సిందే కదా?" అనే ప్రశ్నకి ఈమె చెప్పిన జవాబు మరింత అయోమయాన్ని పెంచింది, నిజం!ఒకటి గుర్తుంచుకోండి, నేను ఈ వ్యాసాన్ని అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు గానీ మీకు నా విశ్లేషణల్ని చెబుతున్నప్పుడు గానీ ఆమె పట్ల గానీ కమ్యునిష్టు సిద్ద్గాంతం పట్ల గానీ నేను నెగెటివ్ యాటిట్యూడ్ చూపించటం లేదు - ప్రస్తావన గంభీరమైనది అయిన సందర్భంలో నేనెప్పుడూ చవకబారుగా ప్రవర్తించను - అది మీకు తెలిసే ఉంటుంది.ఎంత సానుకూలంగా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించినా ఈ సమాధానం నాకు గందరగోళాన్నే మిగిల్చింది.ఎందుకంటే,వర్గరహితప్రపంచానికి ఒక మోడల్ ఇప్పటికి యేదీ లేదని చెప్పేశాక అది యెట్లా ఉంటుందో తెలియని స్థితిలో ఉండి "'మరో ప్రపంచం' అంటే, దాని అర్ధం వేరు.'ప్రభుత్వం' ప్రసక్త్రి మరో ప్రపంచానికి వర్తించదు" అని తేల్చి చెప్పేసి మొదలుపెట్టడం ఎట్లా సాధ్యం?
ప్రభుత్వం ఆనెది అణచివేత మొదలైన కాలంలో పుట్టిందని తెలిస్తే అణచివేత పోయినప్పుడు ప్రభుత్వం కూడా అంతరించిపోతుందని యెంత తేలిగ్గా చెబుతున్నది - ఇది అమాయకత్వమా, అహంకారమా, అంధకారమా!ఈ ప్రస్తావన లోని కీలకమైన భావం యేమిటంటే క్రైస్తవులు వూహించి చెప్పిన ఈడెను స్వర్గం లాంటి స్థితిలో మానవసమాజం ఒకప్పుడు ఉండేదని ఈమె నమ్మి మనకి చెబుతున్నది - నిజంగా అలాంటి మంచికాలం ఒకటి ఉన్నదని ఈమె మరియూ ఈమె నమ్ముతున్న సిద్ధాంతాన్ని సూత్రీకరించిన మార్క్సు గారూ చెబుతున్నప్పుడు మొదటి ప్రశ్నకి జవాబుగా ఈమె నమూనా లేదని యెందుకు చెప్పినట్టు?అప్పటి నమూనాని కనుక్కోవడానికి సెంటిమెంట్లు అక్కరలేదు - పరిశోధన చాలు, ఆధారాలు సేకరించితే చాలు, శాస్త్రీయమైన విశ్లేషణ చేస్తే చాలు కదా!
నాకు తెలిసినంతవరకు మార్క్సు మొత్తం మానవ చరిత్రని నాలుగు దశల కింద విడగొట్టాడు - తర్వాతై దశలకి రాజస్వామ్య దశ,భూస్వామ్య దశ,పారిశ్రామిక దశ అని పేరు పెట్టినవాడు మొదటి ఆటవిక దశని మాత్రం ఆదిమ కమ్యునిష్టు సంస్కృతిని ప్రదర్శించే మౌలిక దశ అన్నాడు.భవిష్యత్తులో ఏర్పడబొయే వర్గరహితసమాజం కూడా కొద్ది తేడాలతో ఈ లక్షణాలనే ప్రదర్శిస్తుందని కూడా చెప్పాడు, అవునా కాదా?మార్క్సు దగ్గిర్నుంచీ రంగనాయకమ్మ వరకు వారి సిద్ధాంతం పట్ల స్పష్తత లేకపోవటానికీ ఈమె రెండు ప్రశ్నలకీ రెండు పరస్పర విరుద్ధమైన జవాబులు ఇవ్వటానికీ ఈ ఆటవిక దశ పట్ల ఉన్న మితిమీరిన ప్రేమయే కారణం!నిజానికి ఈ దశ అంత ఉన్నతమైనది కాదు, దీనిలోని లోపాలు బయటపడటం వల్ల లేదా వీరి సిద్ధాంతం విశ్లేషిస్తున్న యాంటీ ధీసిస్ ఈ వ్యవస్థలో ప్రవేశించటం వల్లనే మానవసమాజం తర్వాతి దశలోకి అడుగు పెట్టిందనేది వాస్తవం.అంటే, ప్రభుత్వం లేని కమ్యునిష్టు సమాజం స్థిరంగా ఉండదనేది కూడా వాస్తవమే అవుతుంది కదా!వీరు భవిష్యతులో ప్రపంచ ప్రజలను అందర్నీ నడిపించటానికి ప్రయత్నిస్తున్న ప్రోటోటైప్ ఒకప్పుడు కొంతకాలం భూమిమీద ఉనికిలో ఉండి, వీరు చెబుతున్న గతితార్కికభౌతికవాదం ప్రకారమే వైరుధ్యాలు పెరిగి తర్వాతి దశలోకి ప్రవేశించింది, అవునా?మరి, ఆ దశనుంచి ముందుకి వచ్చిన ఇన్ని వేల సంవత్సరాలు గడిచాక ఇప్పుడు మళ్ళీ ఆ దశలోకి వెళ్ళటం ఎట్లా కుదురుతుంది?సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా సెల్ ఫోన్ల వాడకం తగ్గించుకోలేని వాళ్ళని ఆటవిక సమాజాన్ని అనుసరించమని చెప్పడం ఏమి తెలివి?
ఇక మూడవదైన "మీ మరో ప్రపంచంలో కూడా పెత్తనం కొందరి చేతుల్లోనే ఉంటుంది కదా?" అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబుతో నాకు విభేదం యేమీ లేదు - అది యుక్తియుక్తంగానే ఉన్నది!కాకపోతే అడిగినవారు ప్రశ్నని మరింత నిర్దుష్టంగా అడగకపోవటం వల్ల ఈమెకి వచ్చిన వెసులుబాటు అది."కొందరి" అనే పదానికి బదులు "కమ్యూనిష్టు పార్టీ సభ్యుల" అని ఉండాల్సింది.వర్గరహితసమాజం అనే భావనని మొత్తం సమాజానికి లక్ష్యంగా నిర్దేశిస్తున్నది కమ్యూనిష్టు పార్టీయే కాబట్టి దానికి జవాబుదారీగా వర్గరహితసమాజాన్ని వైరుధ్యాలు ప్రవేశించి అది కొత్త దశలోకి అడుగుపెట్టనివ్వకుండా అనంతకాలం వరకూ పట్టి ఉంచే గురుతరమైన బాధ్యతని కమ్యూనిష్టు పార్టీయే తీసుకుంటుంది - అది వారి గతితార్కికచారిత్రకభౌతికవాదానికి విరుద్ధమైనా సరే!వర్గరహితప్రపంచం ఏర్పడితే దోపిడీ అంతమౌతుందని మాత్రమే చెబుతున్నారు గానీ మేము కమ్యూనిష్టు పార్టీని రద్దు చేసుకుంటామని చెప్పడం లేదు, అవునా?ఈమె ఒకే రకం వాక్యనిర్మాణాన్ని ఉపయోగించి "స్వంత శ్రమ లేకుండా జీవించే హక్కు ఎవరికీ లేదు, అందరూ శ్రమ చెయ్యాలి అని నిబంధన పెడితే అది పెత్తనం కాదు - శ్రామికవర్గం దోపిడీ నుంచి విముక్తి చెందే ఆత్మరక్షణ మార్గం!" అని చెప్తున్నవన్నీ ఆదర్శాలే తప్ప వాటిని సాధించాల్సిన సిద్ధాంతం లోని శాస్త్రీయతకీ వాటికీ ఎలాంటి సంబంధమూ లేదు.
నాల్గవ ప్రశ్న మూడవ ప్రశ్నకి నకలు,ఐదవ ప్రశ్న నాల్గవ ప్రశ్నకి నకలు,ఆరవ ప్రశ్న ఐదవ ప్రశ్నకి నకలు - అడిగిన వారికి మార్క్సిస్టు సిద్ధాంతం మీద సరయిన అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన తంటా అది!అందుకే,ఆమె కూడా "నేటి పోలీసు వ్యవస్థ వంటిది ఉంటుందా లేదా?" అన్న ప్రశ్నకి "దోపిడీయే లేకపోతే పోలీసులు ఎందుకు?" అనే ప్రశ్ననీ "పోలీసు వ్యవస్థ లేని రాజ్యం ఉంటుందా?" అన్న ప్రశ్నకి "రాజ్యమే ఉందదంటున్నప్పుడు పోలీసుల ఉనికి దేనికి" అనే ప్రశ్నకి సరిపోయే "దోపిడీ అదృశ్యమే రాజ్యం అదృశ్యం" అనే ప్రతిపాదననీ "మరో ప్రపంచంలో శాంతిభద్రతల సమస్యలే తలెత్తవా?" అన్న ప్రశ్నకి "ఒకచోటుకి చేరే ధనరాసులు లేకపోతే శాంతి భద్రతల మాట దేనికి?నిరుపేద గుడిసె ముందు వాచ్‌మెన్ ఉంటాడా?" అనే ప్రశ్ననీ జవాబుగా చెప్పేసి సరిపెట్టేసింది!
ఏడవ ప్రశ్నకి చెప్పిన జవాబును మాత్రం కొంచెం ప్రత్యేకించి చూడాలి - "మీ పాలన నచ్చని అసమ్మతివాదుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తారు" అన్నదానికి ఈమె చెప్పిన పరిష్కారం అద్భుతంగా ఉంది!హిట్లర్ సినిమాలో రాజేంద్రప్రసాదు క్యారెక్టరు చిరంజీవి క్యారెక్టరు గురించి "ఇద్దరు వెళ్ళారు,ఇద్దరు వచ్చారు - మీ అన్నయ్యకి ఎప్పుడూ నలుగురు చెల్లెళ్ళకి తక్కువుంటే తోచదు కాబోలు!" అన్నట్టు ఇప్పటి వరకు అడవుల్లో వున్న నక్సలైట్లు నగరానికి వస్తారు,ఇప్పటి వరకు నగరాల్లో ఉన్న విప్లవ వ్యతిరేకులు అడవుల్లోకి వెళ్తారు - భలే పరిష్కారం,ఒక్క టిక్కట్టుకి రెండు సినిమాలు "జింబో నగర ప్రవేశం","పాండవ వనవాసం"!గబుక్కున తియానన్మెన్ స్క్వేరులోనూ బెంగాల్లోనూ కేరళాలోనూ చేసినట్టు జాలీ దయా లేకుండా చంపేస్తాం అని చెప్పడానికి ఇబ్బంది పడినట్టున్నారు కాబోలు,కాగితాలు ఖరాబు చెయ్యడమే తప్ప ఈవిడ ఎప్పుడూ తుపాకి పట్టుకున్న దాఖలా లేదు గదా!అడిగిన ప్రశ్నల కన్నిటికీ హేతుబద్ధమైన జవాబులు చెప్పేశాననుకున్న భ్రమతో కూడిన సంతృప్తితో మరిన్ని ప్రశ్నలు అడగలేదని అసంతృప్తిని వ్యక్తం చేసి బిచ్చగత్తె తన బొచ్చెలో తనే బిచ్చం వేసుకున్నట్టు కొన్ని అయాచిత ప్రశ్నలకి కూడా ఎంతో శ్రమపడి జవాబులు చెప్పారు.
కానీ, డూప్లికేట్ ప్రశ్నల్నీ వాటికి చెప్పిన ఫ్లాంబొయంట్ జవాబుల్నీ కలిపి చూస్తే అడిగింది ముష్టి మూడు ప్రశ్నలు - మొదటి రెండు ప్రశ్నలకీ ఒకే జవాబు చెప్పిఉంటే, మిగిలిన జవాబులు దానికి అనుగుణంగా ఉంటే, అప్పుడు ఈ జవాబులు అడిగిన ప్రశ్నలకి సరయిన జవాబులు అయి ఉండేవి.అక్కడే బొక్కబోర్ల పడిపోవడం వల్ల ఈవిడ పడ్డ శ్రమకి పూచికపుల్ల విలువ కూడా లేకుండా పోయింది!ఇంతవరకు వెక్కి వెక్కి ఏడుస్తున్న కమ్యునిష్టు భావజాలపు అభిమానులు గుక్కపట్టి ఏడ్చేలా చెయ్యటానికే పనికొస్తుందే తప్ప వార్ని ఓదార్చటానికి అస్సలు పనికిరాదు ఈమె రాసిన వ్యాసం - కమ్యూనిస్టు సానుభూతి పరులు ఇప్పుడు ఏమి చెయ్యాలి?ఈమె అధాటున రష్యాతో పాటు చైనాని కూడా పనికిమాలిన మోడల్ అనేశారు.మరి దీన్ని చైనా ఫ్యాన్లు యెలా ఒప్పుకుంటారు?
అసలు వర్గరహితసమాజం ఏర్పడటమే చరిత్ర యొక్క అంతిమదశ అని చెప్పటం "వ్యవస్థల యొక్క చరిత్ర ధీసిస్,యాంటిధీసిస్ - వీటి సంఘర్షణ నుంచి పుట్టే సింధీసిస్ అనే ప్రక్రియలతో నడుస్తుంది" అనే వీరి గతితార్కిక చారిత్రక భౌతికవాదపు సూత్రానికి విరుద్ధం.ఎందుకంటే,అప్పటికి ధీసిస్ అయిన వర్గరహిత సమాజంలో యాంటిధీసిస్ పుట్టదని గ్యారంటీ యేమిటి?ఆ గ్యారంటీ ఇవ్వాలంటే ఆ మోడల్ ఎట్లా ఉంటుందో వీళ్ళకి తెలియాలి!తమకే తెలియని విసయంలో వీళు మనకి గ్యారెంటీ యెలా ఇవ్వగలరు?గ్యారెంటీ లేకుండా వీళ్ళని మనం ఎందుకు నమ్మాలి?ఇన్నేళ్ళు సిద్ధాతంలో తలబంటి ముణిగిన ఈమెకే అసలు విషయంలో క్లారిటీ లేని స్థితిలో ఉన్న రంగనాయకమ్మ గారు దొసో కొపిత్యలో పవిత్రగ్రంధంలో అన్ని ప్రశ్నలకీ జవాబులు ఉన్నాయి చదువుకుని తరించండని మనకి ఉబోస ఇస్తున్నారు - హవ్వ!ఒక్క అక్షరంలో కూడా హేతుబద్ధతను ప్రదర్శించలేని ఈ వ్యాసాన్ని రంగనాయకమ్మ గారు రాయకుండా ఉంటే ఎంత బాగుండేది - మరి కొంతకాలం పాటు కమ్యునిష్టు సిద్ధాంతం త్యాగధనుల కన్నీటి కధల పేరున సానుభూతి తెచ్చుకుని చచ్చేది!మూలిగే నక్కమీద తాటిపండు పడింది, వేసింది దాని కన్నబిడ్డే.తల్లి ఏం చెయ్యగలదు?తన బాధకి తను మూలగటమే తప్ప కన్నబిడ్డని తిట్టుకోనూ లేదు తన్ని తగిలెయ్యనూ లేదు - పాపం!

ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ!