నక్సల్బరీ ప్రాంతంలో చారు మజుందర్ అధ్వర్యంలో మార్క్సిస్ట్-లెనినిస్ట్
తిరుగుబాటు జరిగి 50 యేళ్ళు అయిన సందర్భంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో
చాలామంది మేధావులు ఎన్నో కోణాల నుంచి పరిశెలిస్తూ వ్యాసాలు రాశారు,ఇకముందు కూడా రాస్తారేమో!ఇప్పట్ వరకు
రాసినవాళ్ళలో ఉద్యమంలోకి వెళ్ళినవాళ్ళు తాము యవ్వనంలో ఉన్న కాలాన్ని - తమ కుర్రతనపు సినిమాల షికార్ల కబుర్లతో
సహా - గుర్తు చేసుకుని తాము ఆ దారిలోకి వెళ్ళడానికి తమ వైపు నుంచి కారణాలు చెప్పుకున్నారు!మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండునని
ఆశాభావాన్ని వ్యక్తం చేశారు - వారి నోస్టాల్జియా నాకూ నచ్చింది!కానీ,"మొదటి తరంలోని యువకుల్ని అంత
తీవ్రస్థాయిలో ఉద్రేకింప జేసిన విప్లవ సిద్ద్గాంతం తర్వాత తరాల్లోని యువకుల్ని
ఎందుకు నిరాశకు గురిచేసి ప్రజాదరణ కోల్పోయింది?" అనే
మౌలికమైన ప్రశ్నకు జవాబు చెప్పే విషయంలో మాత్రం అందరిలోనూ తొట్రుపాటు, గందరగోళం, కంగారు మాత్రమే కనిపించాయి.ప్రపంచంలో ఏ భావజాలం, ఏ ఉద్యమం, ఏ రాజకీయ పార్టీ, ఏ మతం, ఏ సినిమా, ఏ
నాటకం, ఏ కవిత, ఏ నాట్యం, ఏ
రేఖాచిత్రం, ఏ వ్యసనం, ఏ
దుర్మార్గం ప్రజల్ని సమ్మోహితుల్ని చెయ్యాలన్నా అందులో క్లారిటీ ఉండాలి.ఒక విషయం
గురించి ఒక వాక్యమే చెప్పినా వెయ్యి వాక్యాలు చెప్పినంత క్లారిటీ ఇవ్వగలిగిన వాడు
దోపిడీని కూడా ధర్మమే అని చెప్పి ఒప్పించి సకలజనుల్ని తనవెంట నడిపించుకోగలడు!మరి, ప్రజల్ని దోపిడీ నుంచి విముక్తం చేసే మహోన్నతమైన మార్క్సిస్టు సిద్ధాంతం
గురించి ప్రజలకు చెప్పి ఒప్పించడానికి ఈ మేధావు లందరికీ క్లారిటీ ఎందుకు లేదు?
కొందరు ఉద్యమంలోకి వెళ్ళనివారు - వారిలో కొందరు ఉద్యమంలోకి వెళ్ళినవారి సహాధ్యాయులే - వెళ్ళినవారికి "మీరు ఈ 50 యేళ్ళలో ఎంత ప్రగతిని సాధించారు?" అనే ప్రశ్నని సంధించారు.ఇంత కాలం పాటు మౌనం రాజ్యమేలి,ఇక యెవరూ చెప్పలేరనుకుంటున్న సందర్భంలో ముప్పాళ రంగనాయకమ్మ గారు రంగంలోకి దిగారు - "మరో ప్రపంచాన్ని రేపు చూస్తాం!" అని గొప్ప ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు.వ్యాసం చాలా చిన్నది, పత్రికవారు కూడా ఎక్కువ స్థలం ఇవ్వరు కాబట్టి తక్కువగానే చెప్పాల్సిన అవసరం కోసం తన సహజసిద్ధమైన వెకిలితనాన్ని తగ్గించుకుని పాయింట్ల వారీ జవాబులు చెప్పడం నాకు ఎంతగానో నచ్చింది - ఆమె ఎజెండా కక్కుర్తితో చేసే తక్కువస్థాయి వెక్కిరింతలు లేకుండా మాట్లాడటం బహుశా ఇదే మొదటిసారీ ఇదే ఆఖరుసారీ కావచ్చు!ఆమె ఇతరులు చాలాకాలంగా కమ్యూనిష్టుల్ని అడుగుతున్న ప్రశ్నలని అక్కడ ఉటంకించి వాటికి జవాబులు చెప్పారు.అయితే, మొదటి జవాబులోనే విప్లవాభిమానులకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు - "మరో ప్రపంచానికి నమూనా ఏదైనా ఉందా?" అనే ప్రశ్నకి "నమూనా ఇప్పటికీ లేదు!" అని బల్లగుద్ది చెప్పేశారు, ప్రణాళిక మాత్రం ఉందట, గ్రహింపులు గాఢంగా లేక రష్యా-చైనాలు మంచి నమొనాలు కాలేకపోయాయట, అక్కడి అపజయాలకు కారణాలేమిటో అక్కడా ఇక్కడా కూడా ఇంకా గ్రహించలేదట, త్వరలోనే గ్రహిస్తారట.
ఎప్పటికి గ్రహింపులు పూర్తవుతాయని తొందర పెట్టకూడదు,"నక్సల్బరీ ఒక లగ్జరీ కాదు.విప్లవం ఒక వ్యాపకం కాదు.విప్లవకారులకు త్యాగాలు భుజకీర్తులు తెచ్చిపెట్టవు.కేవలం ఉద్యమకారులే కాదు, వాళ్లను కాపాడుకోవటానికి ప్రజలూ ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.ఆ త్యాగాలు ఎందుకు కొనసాగుతున్నాయి?మనిషిని, ప్రకృతిని, సామాజికవిలువలను ధ్వంసం చేసే నయా ఉదారవాద రాజకీయ ప్రక్రియ కొనసాగుతుంటే, దానికి ఎదురు నిలబడి పోరాడుతున్న ప్రజలనూ పార్టీలనూ బుద్ధిజీవుల మనుకునేవాళ్ళు 'మీ మరోప్రపంచం ఎక్కడ?' అని వెటకారం చెయ్యడం సరికాదు.నిజాయితీగా మరో ప్రపంచాన్ని కోరుకునేవాళ్ళు వారికి మద్దతు నివ్వటం కనీస కర్తవ్యం." అని అశోక్ కుంబము గారు పక్కనుంచి సలహాలు ఇస్తున్నారు, విని గ్రహింపు లేక ఎఱుక లేక తెలివిడి తెచ్చుకుని వారిని తొందర పెట్టకండి.రంగనాయకమ్మ గారు కూడా ప్రపంచంలో అనేకచోట్ల ఈ గ్రహింపులు జరుగుతూనే ఉన్నాయనీ,"మంచి" కోసం జరిగే ప్రయత్నాలు ఆగిపోవనీ,ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒకరోజున నమూనా ఏర్పడకపోదనీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ హేతుబద్ధమైన క్లారిటీ ఇచ్చి తీరాల్సిన ఈ ప్రశ్నకి జవాబుని సెంటిమెంటు ముక్తాయింపులతో ముగించారు.దీనితోనే ఈమె పాండిత్యమూ, ఆమెకి ఆ పాండిత్యాన్ని ప్రసాదించిన మార్క్సిజమూ ఎంత దిక్కుమాలినవో అర్ధమై నాకు హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి వారి కాటిసీను గుర్తొచ్చి జాలిగా అనిపించింది, నిజం!
ఇక్కడ నేను బ్లాగుల్లో కమ్యూనిష్టు భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కుర్రనాగన్నల నందర్నీ ఎన్నోసార్లు "మీ సిద్ధాంతంలోని అతి ముఖ్యమైన వర్గరహితప్రపంచం అనే లక్ష్యం గురించి మార్క్సుగారు చెప్పినవాటిలో కనీసం నాలుగు శాస్త్రీయమైన లక్షణాలని చెప్పండి!" అని అడిగాను - ఒక్కడూ ముందుకు రాలేదు.ఇప్పుడు వాళ్ళు ఓపిక తెచ్చుకుని వెతికి చూపించడానికి కూడా వీల్లేకుండా ఈ సీనియర్ మోస్ట్ కమ్యూనిస్ట్ మేధావి అసలు మార్క్సుగారు ఏ మోడలూ చెప్పలేదని స్పష్టం చేసింది - శుభం పలకరా మంకెన్నా అంటే పెళ్ళికూతురు ముండేదని అన్నాట్ట వెనకటి కెవడో!ఈవిడ ఈ వ్యాసం రాయకుండా ఉంటే ఇంకొన్నాళ్ళు విప్లవం లోకి వెళ్ళినవాళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్పుకునే వాళ్ళు,ఇప్పుడు వీళ్ళంతా గమ్యం తెలియని ప్రయాణం చేశారని ప్రజలకి అర్ధమైతే ఇప్పటివరకు వచ్చినట్టు ఇకముందు వీళ్ళ వెంట కళ్ళు మూసుకుని రాగలరా?పోనీ కళ్ళు తెరుచుకుని వీళ్ళ వెంట నడవటానికైనా వీళ్ళు యెక్కడికి వెళ్తున్నారో తెలియకుండా తమని యెక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా వీళ్ళ వెనక ఎవరు వస్తారు?అలా రమ్మని అడిగే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు?మతాలని విమర్శించేటప్పుడు "వీటిలో స్పష్టత లేదు,మేము అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోతున్నారు - వూరికే నమ్మితే చాలునంటున్నారు" అని పడుతున్న తప్పునే వీళ్ళూ చేస్తున్నారు కదా!వర్గరహితప్రపంచం గురించి "అటువంటి 'మంచి' ప్రపంచం ఏర్పడితే, అది 'మాదే' కాదు, 'మీదే' కాదు, 'అందరిదీ' అవుతుంది" అని సుద్దులు చెప్పటం వరకూ బాగానే ఉంది - కానీ మనం అడిగిన ప్రశ్నలకి శాస్త్రీయమైన జవాబులు చెప్పకుండా సెంటిమెంటు ఒలకబోసి వీరు విమర్శిస్త్రున్న మతవాదుల లాగె వీరు కూడా ప్రవర్తించడం దేనికి?
ఇక రెండవదైన "మరో ప్రపంచంలో కూడా ఏదో ఒక ప్రభుత్వం ఉండాల్సిందే కదా?" అనే ప్రశ్నకి ఈమె చెప్పిన జవాబు మరింత అయోమయాన్ని పెంచింది, నిజం!ఒకటి గుర్తుంచుకోండి, నేను ఈ వ్యాసాన్ని అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు గానీ మీకు నా విశ్లేషణల్ని చెబుతున్నప్పుడు గానీ ఆమె పట్ల గానీ కమ్యునిష్టు సిద్ద్గాంతం పట్ల గానీ నేను నెగెటివ్ యాటిట్యూడ్ చూపించటం లేదు - ప్రస్తావన గంభీరమైనది అయిన సందర్భంలో నేనెప్పుడూ చవకబారుగా ప్రవర్తించను - అది మీకు తెలిసే ఉంటుంది.ఎంత సానుకూలంగా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించినా ఈ సమాధానం నాకు గందరగోళాన్నే మిగిల్చింది.ఎందుకంటే,వర్గరహితప్రపంచానికి ఒక మోడల్ ఇప్పటికి యేదీ లేదని చెప్పేశాక అది యెట్లా ఉంటుందో తెలియని స్థితిలో ఉండి "'మరో ప్రపంచం' అంటే, దాని అర్ధం వేరు.'ప్రభుత్వం' ప్రసక్త్రి మరో ప్రపంచానికి వర్తించదు" అని తేల్చి చెప్పేసి మొదలుపెట్టడం ఎట్లా సాధ్యం?
ప్రభుత్వం ఆనెది అణచివేత మొదలైన కాలంలో పుట్టిందని తెలిస్తే అణచివేత పోయినప్పుడు ప్రభుత్వం కూడా అంతరించిపోతుందని యెంత తేలిగ్గా చెబుతున్నది - ఇది అమాయకత్వమా, అహంకారమా, అంధకారమా!ఈ ప్రస్తావన లోని కీలకమైన భావం యేమిటంటే క్రైస్తవులు వూహించి చెప్పిన ఈడెను స్వర్గం లాంటి స్థితిలో మానవసమాజం ఒకప్పుడు ఉండేదని ఈమె నమ్మి మనకి చెబుతున్నది - నిజంగా అలాంటి మంచికాలం ఒకటి ఉన్నదని ఈమె మరియూ ఈమె నమ్ముతున్న సిద్ధాంతాన్ని సూత్రీకరించిన మార్క్సు గారూ చెబుతున్నప్పుడు మొదటి ప్రశ్నకి జవాబుగా ఈమె నమూనా లేదని యెందుకు చెప్పినట్టు?అప్పటి నమూనాని కనుక్కోవడానికి సెంటిమెంట్లు అక్కరలేదు - పరిశోధన చాలు, ఆధారాలు సేకరించితే చాలు, శాస్త్రీయమైన విశ్లేషణ చేస్తే చాలు కదా!
నాకు తెలిసినంతవరకు మార్క్సు మొత్తం మానవ చరిత్రని నాలుగు దశల కింద విడగొట్టాడు - తర్వాతై దశలకి రాజస్వామ్య దశ,భూస్వామ్య దశ,పారిశ్రామిక దశ అని పేరు పెట్టినవాడు మొదటి ఆటవిక దశని మాత్రం ఆదిమ కమ్యునిష్టు సంస్కృతిని ప్రదర్శించే మౌలిక దశ అన్నాడు.భవిష్యత్తులో ఏర్పడబొయే వర్గరహితసమాజం కూడా కొద్ది తేడాలతో ఈ లక్షణాలనే ప్రదర్శిస్తుందని కూడా చెప్పాడు, అవునా కాదా?మార్క్సు దగ్గిర్నుంచీ రంగనాయకమ్మ వరకు వారి సిద్ధాంతం పట్ల స్పష్తత లేకపోవటానికీ ఈమె రెండు ప్రశ్నలకీ రెండు పరస్పర విరుద్ధమైన జవాబులు ఇవ్వటానికీ ఈ ఆటవిక దశ పట్ల ఉన్న మితిమీరిన ప్రేమయే కారణం!నిజానికి ఈ దశ అంత ఉన్నతమైనది కాదు, దీనిలోని లోపాలు బయటపడటం వల్ల లేదా వీరి సిద్ధాంతం విశ్లేషిస్తున్న యాంటీ ధీసిస్ ఈ వ్యవస్థలో ప్రవేశించటం వల్లనే మానవసమాజం తర్వాతి దశలోకి అడుగు పెట్టిందనేది వాస్తవం.అంటే, ప్రభుత్వం లేని కమ్యునిష్టు సమాజం స్థిరంగా ఉండదనేది కూడా వాస్తవమే అవుతుంది కదా!వీరు భవిష్యతులో ప్రపంచ ప్రజలను అందర్నీ నడిపించటానికి ప్రయత్నిస్తున్న ప్రోటోటైప్ ఒకప్పుడు కొంతకాలం భూమిమీద ఉనికిలో ఉండి, వీరు చెబుతున్న గతితార్కికభౌతికవాదం ప్రకారమే వైరుధ్యాలు పెరిగి తర్వాతి దశలోకి ప్రవేశించింది, అవునా?మరి, ఆ దశనుంచి ముందుకి వచ్చిన ఇన్ని వేల సంవత్సరాలు గడిచాక ఇప్పుడు మళ్ళీ ఆ దశలోకి వెళ్ళటం ఎట్లా కుదురుతుంది?సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా సెల్ ఫోన్ల వాడకం తగ్గించుకోలేని వాళ్ళని ఆటవిక సమాజాన్ని అనుసరించమని చెప్పడం ఏమి తెలివి?
ఇక మూడవదైన "మీ మరో ప్రపంచంలో కూడా పెత్తనం కొందరి చేతుల్లోనే ఉంటుంది కదా?" అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబుతో నాకు విభేదం యేమీ లేదు - అది యుక్తియుక్తంగానే ఉన్నది!కాకపోతే అడిగినవారు ప్రశ్నని మరింత నిర్దుష్టంగా అడగకపోవటం వల్ల ఈమెకి వచ్చిన వెసులుబాటు అది."కొందరి" అనే పదానికి బదులు "కమ్యూనిష్టు పార్టీ సభ్యుల" అని ఉండాల్సింది.వర్గరహితసమాజం అనే భావనని మొత్తం సమాజానికి లక్ష్యంగా నిర్దేశిస్తున్నది కమ్యూనిష్టు పార్టీయే కాబట్టి దానికి జవాబుదారీగా వర్గరహితసమాజాన్ని వైరుధ్యాలు ప్రవేశించి అది కొత్త దశలోకి అడుగుపెట్టనివ్వకుండా అనంతకాలం వరకూ పట్టి ఉంచే గురుతరమైన బాధ్యతని కమ్యూనిష్టు పార్టీయే తీసుకుంటుంది - అది వారి గతితార్కికచారిత్రకభౌతికవాదానికి విరుద్ధమైనా సరే!వర్గరహితప్రపంచం ఏర్పడితే దోపిడీ అంతమౌతుందని మాత్రమే చెబుతున్నారు గానీ మేము కమ్యూనిష్టు పార్టీని రద్దు చేసుకుంటామని చెప్పడం లేదు, అవునా?ఈమె ఒకే రకం వాక్యనిర్మాణాన్ని ఉపయోగించి "స్వంత శ్రమ లేకుండా జీవించే హక్కు ఎవరికీ లేదు, అందరూ శ్రమ చెయ్యాలి అని నిబంధన పెడితే అది పెత్తనం కాదు - శ్రామికవర్గం దోపిడీ నుంచి విముక్తి చెందే ఆత్మరక్షణ మార్గం!" అని చెప్తున్నవన్నీ ఆదర్శాలే తప్ప వాటిని సాధించాల్సిన సిద్ధాంతం లోని శాస్త్రీయతకీ వాటికీ ఎలాంటి సంబంధమూ లేదు.
నాల్గవ ప్రశ్న మూడవ ప్రశ్నకి నకలు,ఐదవ ప్రశ్న నాల్గవ ప్రశ్నకి నకలు,ఆరవ ప్రశ్న ఐదవ ప్రశ్నకి నకలు - అడిగిన వారికి మార్క్సిస్టు సిద్ధాంతం మీద సరయిన అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన తంటా అది!అందుకే,ఆమె కూడా "నేటి పోలీసు వ్యవస్థ వంటిది ఉంటుందా లేదా?" అన్న ప్రశ్నకి "దోపిడీయే లేకపోతే పోలీసులు ఎందుకు?" అనే ప్రశ్ననీ "పోలీసు వ్యవస్థ లేని రాజ్యం ఉంటుందా?" అన్న ప్రశ్నకి "రాజ్యమే ఉందదంటున్నప్పుడు పోలీసుల ఉనికి దేనికి" అనే ప్రశ్నకి సరిపోయే "దోపిడీ అదృశ్యమే రాజ్యం అదృశ్యం" అనే ప్రతిపాదననీ "మరో ప్రపంచంలో శాంతిభద్రతల సమస్యలే తలెత్తవా?" అన్న ప్రశ్నకి "ఒకచోటుకి చేరే ధనరాసులు లేకపోతే శాంతి భద్రతల మాట దేనికి?నిరుపేద గుడిసె ముందు వాచ్‌మెన్ ఉంటాడా?" అనే ప్రశ్ననీ జవాబుగా చెప్పేసి సరిపెట్టేసింది!
ఏడవ ప్రశ్నకి చెప్పిన జవాబును మాత్రం కొంచెం ప్రత్యేకించి చూడాలి - "మీ పాలన నచ్చని అసమ్మతివాదుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తారు" అన్నదానికి ఈమె చెప్పిన పరిష్కారం అద్భుతంగా ఉంది!హిట్లర్ సినిమాలో రాజేంద్రప్రసాదు క్యారెక్టరు చిరంజీవి క్యారెక్టరు గురించి "ఇద్దరు వెళ్ళారు,ఇద్దరు వచ్చారు - మీ అన్నయ్యకి ఎప్పుడూ నలుగురు చెల్లెళ్ళకి తక్కువుంటే తోచదు కాబోలు!" అన్నట్టు ఇప్పటి వరకు అడవుల్లో వున్న నక్సలైట్లు నగరానికి వస్తారు,ఇప్పటి వరకు నగరాల్లో ఉన్న విప్లవ వ్యతిరేకులు అడవుల్లోకి వెళ్తారు - భలే పరిష్కారం,ఒక్క టిక్కట్టుకి రెండు సినిమాలు "జింబో నగర ప్రవేశం","పాండవ వనవాసం"!గబుక్కున తియానన్మెన్ స్క్వేరులోనూ బెంగాల్లోనూ కేరళాలోనూ చేసినట్టు జాలీ దయా లేకుండా చంపేస్తాం అని చెప్పడానికి ఇబ్బంది పడినట్టున్నారు కాబోలు,కాగితాలు ఖరాబు చెయ్యడమే తప్ప ఈవిడ ఎప్పుడూ తుపాకి పట్టుకున్న దాఖలా లేదు గదా!అడిగిన ప్రశ్నల కన్నిటికీ హేతుబద్ధమైన జవాబులు చెప్పేశాననుకున్న భ్రమతో కూడిన సంతృప్తితో మరిన్ని ప్రశ్నలు అడగలేదని అసంతృప్తిని వ్యక్తం చేసి బిచ్చగత్తె తన బొచ్చెలో తనే బిచ్చం వేసుకున్నట్టు కొన్ని అయాచిత ప్రశ్నలకి కూడా ఎంతో శ్రమపడి జవాబులు చెప్పారు.
కానీ, డూప్లికేట్ ప్రశ్నల్నీ వాటికి చెప్పిన ఫ్లాంబొయంట్ జవాబుల్నీ కలిపి చూస్తే అడిగింది ముష్టి మూడు ప్రశ్నలు - మొదటి రెండు ప్రశ్నలకీ ఒకే జవాబు చెప్పిఉంటే, మిగిలిన జవాబులు దానికి అనుగుణంగా ఉంటే, అప్పుడు ఈ జవాబులు అడిగిన ప్రశ్నలకి సరయిన జవాబులు అయి ఉండేవి.అక్కడే బొక్కబోర్ల పడిపోవడం వల్ల ఈవిడ పడ్డ శ్రమకి పూచికపుల్ల విలువ కూడా లేకుండా పోయింది!ఇంతవరకు వెక్కి వెక్కి ఏడుస్తున్న కమ్యునిష్టు భావజాలపు అభిమానులు గుక్కపట్టి ఏడ్చేలా చెయ్యటానికే పనికొస్తుందే తప్ప వార్ని ఓదార్చటానికి అస్సలు పనికిరాదు ఈమె రాసిన వ్యాసం - కమ్యూనిస్టు సానుభూతి పరులు ఇప్పుడు ఏమి చెయ్యాలి?ఈమె అధాటున రష్యాతో పాటు చైనాని కూడా పనికిమాలిన మోడల్ అనేశారు.మరి దీన్ని చైనా ఫ్యాన్లు యెలా ఒప్పుకుంటారు?
అసలు వర్గరహితసమాజం ఏర్పడటమే చరిత్ర యొక్క అంతిమదశ అని చెప్పటం "వ్యవస్థల యొక్క చరిత్ర ధీసిస్,యాంటిధీసిస్ - వీటి సంఘర్షణ నుంచి పుట్టే సింధీసిస్ అనే ప్రక్రియలతో నడుస్తుంది" అనే వీరి గతితార్కిక చారిత్రక భౌతికవాదపు సూత్రానికి విరుద్ధం.ఎందుకంటే,అప్పటికి ధీసిస్ అయిన వర్గరహిత సమాజంలో యాంటిధీసిస్ పుట్టదని గ్యారంటీ యేమిటి?ఆ గ్యారంటీ ఇవ్వాలంటే ఆ మోడల్ ఎట్లా ఉంటుందో వీళ్ళకి తెలియాలి!తమకే తెలియని విసయంలో వీళు మనకి గ్యారెంటీ యెలా ఇవ్వగలరు?గ్యారెంటీ లేకుండా వీళ్ళని మనం ఎందుకు నమ్మాలి?ఇన్నేళ్ళు సిద్ధాతంలో తలబంటి ముణిగిన ఈమెకే అసలు విషయంలో క్లారిటీ లేని స్థితిలో ఉన్న రంగనాయకమ్మ గారు దొసో కొపిత్యలో పవిత్రగ్రంధంలో అన్ని ప్రశ్నలకీ జవాబులు ఉన్నాయి చదువుకుని తరించండని మనకి ఉబోస ఇస్తున్నారు - హవ్వ!ఒక్క అక్షరంలో కూడా హేతుబద్ధతను ప్రదర్శించలేని ఈ వ్యాసాన్ని రంగనాయకమ్మ గారు రాయకుండా ఉంటే ఎంత బాగుండేది - మరి కొంతకాలం పాటు కమ్యునిష్టు సిద్ధాంతం త్యాగధనుల కన్నీటి కధల పేరున సానుభూతి తెచ్చుకుని చచ్చేది!మూలిగే నక్కమీద తాటిపండు పడింది, వేసింది దాని కన్నబిడ్డే.తల్లి ఏం చెయ్యగలదు?తన బాధకి తను మూలగటమే తప్ప కన్నబిడ్డని తిట్టుకోనూ లేదు తన్ని తగిలెయ్యనూ లేదు - పాపం!
ఏడవ ప్రశ్నకి చెప్పిన జవాబును మాత్రం కొంచెం ప్రత్యేకించి చూడాలి - "మీ పాలన నచ్చని అసమ్మతివాదుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తారు" అన్నదానికి ఈమె చెప్పిన పరిష్కారం అద్భుతంగా ఉంది!హిట్లర్ సినిమాలో రాజేంద్రప్రసాదు క్యారెక్టరు చిరంజీవి క్యారెక్టరు గురించి "ఇద్దరు వెళ్ళారు,ఇద్దరు వచ్చారు - మీ అన్నయ్యకి ఎప్పుడూ నలుగురు చెల్లెళ్ళకి తక్కువుంటే తోచదు కాబోలు!" అన్నట్టు ఇప్పటి వరకు అడవుల్లో వున్న నక్సలైట్లు నగరానికి వస్తారు,ఇప్పటి వరకు నగరాల్లో ఉన్న విప్లవ వ్యతిరేకులు అడవుల్లోకి వెళ్తారు - భలే పరిష్కారం,ఒక్క టిక్కట్టుకి రెండు సినిమాలు "జింబో నగర ప్రవేశం","పాండవ వనవాసం"!గబుక్కున తియానన్మెన్ స్క్వేరులోనూ బెంగాల్లోనూ కేరళాలోనూ చేసినట్టు జాలీ దయా లేకుండా చంపేస్తాం అని చెప్పడానికి ఇబ్బంది పడినట్టున్నారు కాబోలు,కాగితాలు ఖరాబు చెయ్యడమే తప్ప ఈవిడ ఎప్పుడూ తుపాకి పట్టుకున్న దాఖలా లేదు గదా!అడిగిన ప్రశ్నల కన్నిటికీ హేతుబద్ధమైన జవాబులు చెప్పేశాననుకున్న భ్రమతో కూడిన సంతృప్తితో మరిన్ని ప్రశ్నలు అడగలేదని అసంతృప్తిని వ్యక్తం చేసి బిచ్చగత్తె తన బొచ్చెలో తనే బిచ్చం వేసుకున్నట్టు కొన్ని అయాచిత ప్రశ్నలకి కూడా ఎంతో శ్రమపడి జవాబులు చెప్పారు.
కానీ, డూప్లికేట్ ప్రశ్నల్నీ వాటికి చెప్పిన ఫ్లాంబొయంట్ జవాబుల్నీ కలిపి చూస్తే అడిగింది ముష్టి మూడు ప్రశ్నలు - మొదటి రెండు ప్రశ్నలకీ ఒకే జవాబు చెప్పిఉంటే, మిగిలిన జవాబులు దానికి అనుగుణంగా ఉంటే, అప్పుడు ఈ జవాబులు అడిగిన ప్రశ్నలకి సరయిన జవాబులు అయి ఉండేవి.అక్కడే బొక్కబోర్ల పడిపోవడం వల్ల ఈవిడ పడ్డ శ్రమకి పూచికపుల్ల విలువ కూడా లేకుండా పోయింది!ఇంతవరకు వెక్కి వెక్కి ఏడుస్తున్న కమ్యునిష్టు భావజాలపు అభిమానులు గుక్కపట్టి ఏడ్చేలా చెయ్యటానికే పనికొస్తుందే తప్ప వార్ని ఓదార్చటానికి అస్సలు పనికిరాదు ఈమె రాసిన వ్యాసం - కమ్యూనిస్టు సానుభూతి పరులు ఇప్పుడు ఏమి చెయ్యాలి?ఈమె అధాటున రష్యాతో పాటు చైనాని కూడా పనికిమాలిన మోడల్ అనేశారు.మరి దీన్ని చైనా ఫ్యాన్లు యెలా ఒప్పుకుంటారు?
అసలు వర్గరహితసమాజం ఏర్పడటమే చరిత్ర యొక్క అంతిమదశ అని చెప్పటం "వ్యవస్థల యొక్క చరిత్ర ధీసిస్,యాంటిధీసిస్ - వీటి సంఘర్షణ నుంచి పుట్టే సింధీసిస్ అనే ప్రక్రియలతో నడుస్తుంది" అనే వీరి గతితార్కిక చారిత్రక భౌతికవాదపు సూత్రానికి విరుద్ధం.ఎందుకంటే,అప్పటికి ధీసిస్ అయిన వర్గరహిత సమాజంలో యాంటిధీసిస్ పుట్టదని గ్యారంటీ యేమిటి?ఆ గ్యారంటీ ఇవ్వాలంటే ఆ మోడల్ ఎట్లా ఉంటుందో వీళ్ళకి తెలియాలి!తమకే తెలియని విసయంలో వీళు మనకి గ్యారెంటీ యెలా ఇవ్వగలరు?గ్యారెంటీ లేకుండా వీళ్ళని మనం ఎందుకు నమ్మాలి?ఇన్నేళ్ళు సిద్ధాతంలో తలబంటి ముణిగిన ఈమెకే అసలు విషయంలో క్లారిటీ లేని స్థితిలో ఉన్న రంగనాయకమ్మ గారు దొసో కొపిత్యలో పవిత్రగ్రంధంలో అన్ని ప్రశ్నలకీ జవాబులు ఉన్నాయి చదువుకుని తరించండని మనకి ఉబోస ఇస్తున్నారు - హవ్వ!ఒక్క అక్షరంలో కూడా హేతుబద్ధతను ప్రదర్శించలేని ఈ వ్యాసాన్ని రంగనాయకమ్మ గారు రాయకుండా ఉంటే ఎంత బాగుండేది - మరి కొంతకాలం పాటు కమ్యునిష్టు సిద్ధాంతం త్యాగధనుల కన్నీటి కధల పేరున సానుభూతి తెచ్చుకుని చచ్చేది!మూలిగే నక్కమీద తాటిపండు పడింది, వేసింది దాని కన్నబిడ్డే.తల్లి ఏం చెయ్యగలదు?తన బాధకి తను మూలగటమే తప్ప కన్నబిడ్డని తిట్టుకోనూ లేదు తన్ని తగిలెయ్యనూ లేదు - పాపం!
ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ!
This comment has been removed by the author.
ReplyDelete@ Sakshyam magazine Editor : K.S.Chowdary
ReplyDeleteఆయన ఏవైతే ఇస్లాం గురించి వ్రాసారో అవన్నీ కేవలం బ్రిటీష్ కల్పిత చరిత్ర అనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోయారు.
hari.S.babu
ఎదటివాడు చూపించిన సాక్ష్యాధారాల్ని తిరస్కరించే దమ్ము లేని ప్రతి అడ్డగాడిదకీ "బ్రిటీష్ కల్పిత చరిత్ర" అనేదొక వూతపదం అయిపోయింది!నేను రాసింది బ్రిటిష్ చరిత్రకారులు రాసిన భారత దేశపు చరిత్ర కాదు.ఖురాన్ సురాల నంబర్లు కూడా ఇచ్చాను కదా!తమరి దగ్గిర అధికారికమైన ఖురాన్ ప్రతి ఉంటే ఆ సురా యొక్క అసలు పాఠం చెప్పి నేను చూపించిన సురా అబద్ధం అని రుజువు చెయవచ్చును కదా అనే విషయాన్ని వీరెందుకు గ్రహించలేకపోయారు?
@ Sakshyam magazine Editor : K.S.Chowdary
ReplyDeleteఇస్లాం రహిత ప్రపంచం సాధించడం మీ లక్ష్యమా? మీకు సాధ్యమయ్యే పనేనా?
hari.S.babu
అవును, ఇస్లాం రహిత ప్రపంచం సాధించడం నా లక్ష్యమే?అది నాకు సాధ్యమయ్యే పనే!
పక్కా ప్లాను తయారై ఉంది - ఇరవయేళ్ళ తర్వాత మక్కా లోని కాబా మందిరం వేదఘోషతో ప్రతిధ్వనిస్తుంది.అహ్మద్ ఖూరేషీ మేనమమ రచించిన శివస్తుతి దిక్కులు మార్మోగిపోయేలా పఠించబడుతుంది
చాణక్యుడికి గురువుని మించిన శిష్యుణ్ణి నేను-- సాధించి చూపిస్తాను.మరి,నా పొర్ష్టుల్లో నేను ఉటంకించిన ఖురాన్ సురాలు అబద్ధాం అని నిరూపించే ప్రయత్నం Sakshyam magazine Editor : K.S.Chowdary చెయ్యగలదా?నా పోష్టుల్లోని విషయం అబధమని నిరూపించడం Sakshyam magazine వారికి సాధ్యమా?
Ram Karnam latest post about die hard fans......
ReplyDeleteచంద్రబాబు నాయుడు, జగన్ కలిసి ప్రజా సంక్షేమం దృష్ట్యా ఒక్క సారి అన్నీ పక్కన బెట్టి పెద్దమనసుతో క్రింది విధంగా ఒక సంయుక్త ప్రకటన జారీ చెయ్యాలి.
“ యువకులారా, ఒకరినొకరు బూతులు తిట్టుకోమాకండి. ఒకవేళ తిట్టుకుంటే అవి మాకోసం తిట్టుకోమాకండి. అవి మీకు తలకి మించిన భారాలు. ఎన్ని గొడవలైనా మేము ఏ క్షణమైనా మిత్రులైపోతాం. చరిత్ర ఒక్కసారి తిరగెయ్యండి , కళ్ళు భైర్లుకమ్ముతాయి.
మాకు మీకుండేలాంటి కులాభిమానం, ఆవేశం, వ్యక్తి ఆరాధన, అమాయకత్వం ఉండవు. చిరకాలం అవి మీకు ఉంటూ మాకు ఉపయోగపడాలనుకుంటాం తప్ప అవేవో గొప్ప లక్షణాలని మేం ఏనాడూ అనుకోం. మాక్కావల్సింది - అధికారం, వ్యాపార లావా దేవీలు, ఐశ్వర్యం, సంఘంలో పలుకుబడి. మాలో ఒకరిని ఎంత తిట్టుకున్నా, ఒకరిని ఎంత ఆరాధించినా మేమేమీ impress అయ్యి మీకు ఒరగబెట్టేది ఏమీ లేదు. . ఎందుకంటే మేం ఏం ఒరగబెట్టాలన్నా పొందడానికి సిద్ధంగా మా ఇంట్లోనూ, మరియు మా చుట్టుపక్కలా మా వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. మా ఇంట్లో వారికి పోను మిగతా అవకాశాలు ఇతర కులాల,మతాల వారికి సర్దుతాం. మాకులం వారయ్యీ మా ఇంట్లో వాళ్ళు కాని మీరు ఎంత తాపత్రయ పడ్డా అనవసరంగా శత్రువులని సంపాదించుకోవడం తప్ప వేరే ప్రయోజనమేదీ లేదు.
మా సహాయం పొందినట్టు మీరు నమ్మే మా కులస్తులని తలచుకుని మాకు కులాభిమానం ఉందనీ, కులపింటి వాళ్లకి ఏదో చేస్తామని అనుకుంటున్నారేమో. కాని మేము నిలువునా ముంచేసిన, నిర్దాక్షిణ్యంగా తొక్కేసిన టాప్ 10 మనుషులని చూడండి. వాళ్ళు కూడా మా కులస్తులే అయి ఉంటారు. మాకు లేనిది ఉందని భ్రమిస్తూ మీకు సంబంధం లేనిది తెచ్చి నెత్తిన పెట్టుకుని క్రుంగి పోకండి.
కులగజ్జి ఒక మానసిక రోగం. ఆ గజ్జితో మీరెలాగూ మా కొట్టాంలో పశువుల్లాగా మా పార్టీలో ఎప్పుడూ పడి ఉంటారు కాబట్టి మా ఫోకస్ అంతా మిగతా కులాలూ, మతాలూ, ప్రాంతాల వారిని ఆకర్షించడం మీదే ఉంటుంది. మాకు ఎంత ‘లోతుగా’ ఎంత కాలంపాటు ఎంతమంది అభిమానిస్తారన్నది అనవసరం , ఈ దఫా ఎంత “మంది” ఓట్లు వేస్తారన్నది ముఖ్యం. నిజానికి ఎవరైతే ఎక్కువ విధేయులుగా మా తరఫున నోరు చేసుకుంటూ ఉంటారో వారికి అవతలి పార్టీలోకి దూరే అవకాశం గానీ, అవతలి పార్టీ వాళ్ళు స్వీకరించే అవకాశం గానీ తక్కువ కాబట్టి వారిని అందరికంటే ఎక్కువ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మా కులాల జనం ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటారో ఆ ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాల మీదే ఎక్కువ ప్రచార ఫోకస్ పెట్టి ఇతరులని ఆకర్షించేపనిలో ఉంటాం. ఇవన్నీ రాజకీయంలో ఓనమాలు లాంటివి.
సరే గానీ, మీరు రెండు వర్గాలుగా తయారయి తిట్టుకోవడం, కొట్టుకోవడమే గాని .. మేమెందుకు పరస్పరం ఎదురు బొదురుగా TV స్టూడియోలో కూర్చుని ఒకరి ప్రశ్నలకు ఒకరు సమాధానం చెప్పుకోవడం లేదో, నిపుణులు అడిగే ప్రశ్నలకి ఒకరి తరువాత ఒకరు సమాధానాలు చెప్పే పని చెయ్యడం లేదో తెలుసా..? అప్పుడు ఇద్దరమూ ఒకేసారి దొరికిపోతాం కనుక. కలిసి నిలదీయాలన్న ఆలోచన మీకు ఎలాగూ రాదు. ఎందుకంటే ఒక్కరిని ఎంచుకుని బూతులు తిట్టడం , అచ్చం అలాంటి ఇంకొకడిని ఆరాధిస్తూ ఉండడం మీకున్న బలహీనత. అదే మా అదృష్టం. అదే మా విచ్చలవిడి తనానికి కారణం.
కాబట్టి ఒకరి మీద అభిమానంతో మరొకరి మీద దూషణలు చెయ్యడం అనవసరమూ మరియు అనారోగ్యలక్షణం. మానేసి ప్రశాంతంగా ఉండండి. ఇంత ఫ్రాంక్ గా ఎప్పుడో గాని మేము చెప్పము. ఈ రోజు చెప్పాలనిపించింది “
*****
నోట్: ఇది కేవలం కమ్మోడవడం చేత బాబుని అభిమానించే కమ్మ సోదరులకీ , కేవలం రెడ్డి అనో, క్రైస్తవుడనో జగన్ ని అభిమానించే రెడ్డి లేదా క్రైస్తవ సోదరుల కోసం రాశాను. ఎప్పుడో చిన్నప్పుడు విశ్లేషించి తెలుసుకున్న విషయాలు. గ్రామర్ తప్పులుంటే మన్నించండి. అసలు అర్ధమే తప్పనుకుంటే ' భరించండి ' .
>>>"ఇద్దరు వెళ్ళారు,ఇద్దరు వచ్చారు - మీ అన్నయ్యకి ఎప్పుడూ నలుగురు చెల్లెళ్ళకి తక్కువుంటే తోచదు కాబోలు!" అన్నట్టు ఇప్పటి వరకు అడవుల్లో వున్న నక్సలైట్లు నగరానికి వస్తారు,ఇప్పటి వరకు నగరాల్లో ఉన్న విప్లవ వ్యతిరేకులు అడవుల్లోకి వెళ్తారు - భలే పరిష్కారం,ఒక్క టిక్కట్టుకి రెండు సినిమాలు "జింబో నగర ప్రవేశం","పాండవ వనవాసం"!>>>>
ReplyDelete>>>కాగితాలు ఖరాబు చెయ్యడమే తప్ప ఈవిడ ఎప్పుడూ తుపాకి పట్టుకున్న దాఖలా లేదు గదా!>>>
>>ప్రశ్నలు అడగలేదని అసంతృప్తిని వ్యక్తం చేసి బిచ్చగత్తె తన బొచ్చెలో తనే బిచ్చం వేసుకున్నట్టు కొన్ని అయాచిత ప్రశ్నలకి కూడా ఎంతో శ్రమపడి జవాబులు చెప్పారు.>>>
ఈ వ్యాసంలో ఎన్ని పంచ్ లు ఉన్నాయో !
బాగా వ్రాసారు.
Thanks for catching all the punches!
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteDear Mr. Sakshyam magazine Editor : K.S.Chowdary,
ReplyDeleteఒకసారి నేను మీ బ్లాగును సందర్శించనని చెప్పాక మీరు నన్ను వదిలేసి ఉండాల్సింది!ఎందుకు పేరు మాత్రం ప్రస్తావించకుండా నా గురించి ఈ పోస్టు వేశారో నాకు అర్ధం కావటం లేదు.మీ ఉద్దేశం ఏమిటి?
నేను ఇప్పటికి మూడుసార్లు - నేను ఆ 18 పోష్టులు మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఒకసారి,పోష్టులు అన్నీ పొర్తయ్యాక ఒకసారి,"మహనీయులపై అభాండాలకు కారణం ఏమిటి?" పోష్టు దగ్గిర ఒకసారి,నాకు గుర్తు లేని మరొక పోష్టు దగ్గిర ఒకసారి నా వ్యాసాలను పరిశీలించి వీలయితే వాటిని అబద్ధం అని నిరూపించమని చాలెంజి చేశాను.
ఆ చాలెంజిని స్వీకరించి మీ విశ్వసనీయతని చూపించుకోకుండా ఈ కప్పదాటు, చొప్పదంటు పోష్టుల వల్ల ప్రయోజనం ఏమిటి?మీకు వాటిని అబద్ధాలు అని నిరూపించగలిగిన పాండిత్యం ఉంటే ఆ పని చెయ్యండి,లేదంటే మీ ఇదివరకటి ధోరణిలో మీ పోష్టుల్ని మీరు రాసుకోండి.దానికి నా అభ్యంతరం గానీ అనుమతి గానీ మీకు అఖ్ఖర్లేదు,అవునా?
"మహనీయులపై అభాండాలు" పోష్టు దగ్గిర నేను ఉదహరించిన "A year after his arrival in Medina, and thirteen years after his ‘call’, the apostle of Allah prepared himself for war in obedience to the command of Allah that he should attack the idolaters. He was then fifty‑three years old." అంటూ మొదలయ్యే దోపిడీల చరిత్ర మీరంటున్న బ్రిటిషర్లు మార్చిన తప్పుడు చరిత్ర కాదే!తొలినాళ్ళలో అహ్మద్ ఖూరేషీ జీవిత చరిత్ర రాసిన ముస్లిం Ibn Hisham రచించిన మొదటి అధికారికమైన జీవిత చరిత్రలోని భాగం - Ibn Hisham కూడా మతద్రోహియే అని మీరు తీర్మానిస్తే నాకు మరింత ఆనందం కలుగుతుంది, బహుశా మీరు అంతకు సాహసించరనే అనుకుంటాను.
P.S:ఒకసారి నేను ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉంటాను.నా ప్రశ్నలకి ఏమైనా జవాబు చెప్పి నేను వేసిన చాలెంజిని స్వీకరించే ఉద్దేశం ఉందేమోనని చూడటానికే ఇటువైపుకు వచ్చాను.మీకు ఆ ఉద్దేశం లేదని ఈ కప్పదాటు పోష్టు వెయ్యడంతో స్పష్టమైపోయింది.
మీకు నా చాలెంజిని టేకప్ చేసే ఉద్దేశం లేకపోతే నన్ను మీరు పట్టించుకోవద్దు.అల్-బులేహి గారి ఇంటర్వ్యూ పాఠం మొదట నా పోష్టు దగ్గిర వేసుకున్నాను.మీ కెలుకుడు చూశాకే ఇక్కడ వేశాను - అది మీ బ్లాగుని నేను మర్చిపోయానని చెప్పడానికి సాక్ష్యం.Ibn Hisham,al-buleihi లాంటి వారిని కూడా ఇస్లాం మతద్రోహులు అనడానికి సిద్ధపడితేనే నన్ను పదే పదే కెలకండి.లేని పక్షంలో మీ పని మీరు చూసుకోండి - దట్సాల్!
సర్, మీరు చెప్పింది తప్పు అని మహమ్మదు చౌదరి గానీ లేక వాళ్ళ ముల్లాలు గానీ అనుకుంటే వాళ్ళే ఎప్పుడో సాక్శ్యం లో టపాలు ద్వారా లేక మీ బ్లాగులోనే కామెంట్ల ద్వారా తమ వాదన చేసేవారు. మీ పాత టపాలను చూసినమీదట మీకు ఇస్లాం గురించిన వాస్తవమైన మరియు సంపూర్ణ మైన అవగాఃఅన ఉంది అని అర్థమవుతుంది. మీతో వాదించి వెఱ్ఱివెధవలయ్యే తలివితక్కువ పని మహమ్మదు చౌదరి కానీ మరే ముల్లాగానీ చేస్తారని అనుకోవడం లేదు. ఇస్లాం మీద మీ రచనలను ఉచిత పి.డి.ఎఫ్ రుపంలో తీసుకు వస్తే బాహుంటిందని మా అభిలాష.
ReplyDeleteAnonymous18 August 2017 at 21:55
ReplyDeleteఇస్లాం మీద మీ రచనలను ఉచిత పి.డి.ఎఫ్ రుపంలో తీసుకు వస్తే బాహుంటిందని మా అభిలాష.
hari.S.babu
Sure!అదే ఆలోచన నాకూ ఉంది.త్వరలో ఈ 18 వ్యాసాలూ పుస్తకరూపంలో వస్తాయి.
మీకో మద్దతు దారుడు దొరికాడు.
Deleteమోదీ కేబినెట్‌లో వివాదాల ఎంపీ
సిర్సి పట్టణంలోని టీఎస్‌ఎస్ ఆస్పత్రిలో ఈ యేడాది జనవరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన తల్లికి వైద్యం అందించటంలో నిర్లక్ష్యం వహించారనే వైద్యుడిపై ఇలా దాడిచేయగా, హేగ్డేపై కేసు కూడా నమోదు అయ్యింది. వీడియో పాతదే అయినా ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కావటంతో వీడియో వైరల్ అవుతోంది.
ఇక ఆయనకు వివాదాలు కొత్తేం కాదు. ఇస్లాం ఉన్నంత కాలం టెర్రరిజం ఉంటుందని, ఆ మతాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తేనే టెర్రరిజం అంతమవుతుందని మంటపుట్టించే వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కున్నారు కూడా.
http://www.sakshi.com/news/national/controversial-hegde-in-modi-cabinet-504141
Ram Karnam
ReplyDelete9 hrs ·
===== రాజరికం vs ఇల్లరికం =====
రాజరికం అంటే ఒక రాజ కుటుంబం ఉండడం, ఆ కుటుంబంలో పుట్టిన వారిలో ఎవరో ఒకరు ప్రభువు అవుతూ, అతని చేత మనమంతా ఏలబడుతూ ఉండడం అన్నమాట. మనం అంటే జనం.
ఇల్లరికం అంటే పైకి ప్రజాస్వామ్యంలా చిరుదరహాసాలొలికిస్తూ, లోపల రాజరికంలాగా వికటాట్టహాసం చేసే ఒక తమాషా వ్యవస్థ. మన లాంటిది అన్నమాట.
నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అంటే మనమంతా కలిసి రాజకుటుంబం అవుతాము. మరీ ఇన్నికోట్ల మంది రాజకుటుంబీకులు రోజువారీ ఎవరిపాటికి వారు నిర్ణయాలు తీసుకుంటే కిష్కింద కాండ అవుతుంది కాబట్టి అందరం కలిసి మనలో నుంచి కొందరిని “ అన్ని విధాలా అలోచించి అందరికీ ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే వారు ” గా పెట్టుకుని వారి సాయంతో మనం మన సామ్రాజ్యాన్ని నడుపుకుంటూ ఉండాలి. వారికి తృణమో పణమో ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉండాలి. వాళ్ళని తీసెయ్యడం, ఉంచడం మనిష్టం. రోజూ సమీక్షించడం కష్టం కనుక ఐదేళ్ళకి ఒకసారి ఉంచాలా తీసెయ్యాలా అని నిర్ణయించుకుంటాం.
కాని ఇప్పుడు పరిస్థితి ఎలా తయారయిందంటే మనం ఎన్నుకునే ప్రతినిధులు కోటానుకోట్ల సభ్యులున్న మన రాజకుటుంబానికి ఇల్లిరికపు “అల్లుళ్ళు” లాగా తయారయ్యారు. వాళ్ళు మేస్తూ ఉంటే మనం చూస్తూ చూస్తూనే ఐదేళ్ళు మోస్తూ ఉండాల్సి వస్తుంది కాబట్టి మన వ్యవస్థని “ఇల్లరికం “ అంటాన్నేను.
రాజరికం కంటే ఉన్నతం కావాల్సిన ప్రజాస్వామ్యం ఈ ఇల్లరికం పోకడల వల్ల ఏ విధంగా మరింత చెత్తది అయిందో చూద్దాం.
1. రాజరికంలో జన్మరీత్యా అర్హులైన వారందరికీ చిన్నప్పటినుంచి పాలనకి అవసరమైన అన్ని విద్యల్లో తర్ఫీదు ఇచ్చి ఎవరు ఎక్కువ సమర్ధులో వారికి పట్టాభిషేకం చేసేవారు. ఇల్లరికంలో అయితే ఫలానా వారి కొడుకులో కూతుర్లో అయితే చాలు. వాళ్ళు ముప్పయ్యేళ్ళు గాలికి తిరిగో, ఇంకేదో పనిచేసుకంటూనో ఉండి మంచి టైమింగ్ చూసి ప్రభుత్వంలోకి డైరెక్ట్ గా దూకుతుంటారు. దూకి వాళ్ళకంటే పనిమంతులందరికి నాయకులయ్యి, సీనియర్లని… మనసులో వినోదం అనుభవిస్తూ పైకి వినయం ప్రదర్శించాల్సిన దీన స్థితిలోకి నెడతారు. కోట్ల సభ్యులున్న మన రాజకుటుంబంలో ఉన్న కొందరు గొర్రెల్ని మంచి చేసుకుని ప్రాతినిధ్యం చక్కబెట్టుకుంటారు.
కాబట్టి సమర్ధత అనేది రాజరికంలోనే వెయ్యి రెట్లు ఎక్కువ.
2. బయటినుండి గానీ , లోపల నుండి గానీ రాజ్యానికి ప్రమాదమొచ్చినపుడు రాజరికంలో నయితే స్వయంగా రాజు యుద్ధంలో దిగి ముందుండి నడిపించే తెగువ ప్రదర్శిస్తాడు. ఇల్లరికంలో ప్రతినిధులైన అల్లుళ్ళకి ఎలాగూ పోలీసులు రాచమర్యాదలతో అరెస్ట్ చేసి విలాసవంతమైన విడిది ఇస్తారని తెలుసు కాబట్టి ఊపుకుంటూ వీధి పోరాటానికి వెళ్లి హాయిగా అరెస్ట్ అవుతారు. వారి వెంట వచ్చిన రాజకుటుంబ సభ్యులైన మనలని మాత్రం పోలీసులు చెత్త రేగ కొడుతుంటారు.
కాబట్టి ప్రతినిధుల్లో ఉండాల్సిన తెగింపు కూడా రాజరికంలోనే ఎక్కువ ఉంటుంది.
3. రాజరికంలో - రాజు మంత్రులతోనూ, నిపుణులతోనూ కొలువుదీరి పాలనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంతా నిశ్చబ్దంగా ఉంటుంది. అవసరమైనవి తప్ప అధిక ప్రసంగం చేసే ధైర్యం ఎవరికీ ఉండదు కాబట్టి “పని” తప్ప వేరేదానికి సమయం వృధా కాదు. ప్రతి కొన్ని రోజులకి ఒకసారి కొలువు దీరి సమీక్షించుకుంటూ ఉంటారు కాబట్టి కార్య నిర్వహణ పట్ల కూడా మంచి పట్టు ఉంటుంది. ఇల్లరికంలోనయితే ప్రతినిధులందరూ స్పీకర్ అనబడే ఒక ఎంపైర్ ని పెట్టుకుని కేకల పోటీ పెట్టుకుంటూ ఉంటారు కనుక పని జరగదు. శీతాకాలం కేకల పోటీ, ఎండాకాలం కేకలపోటీ, వర్షాకాలం కేకల పోటీ పేరుతో వరుసగా కొన్ని రోజులు స్టేడియంలో అరచుకోవడం, ఆ పోటీ ఫలితాలు పక్కరోజు పత్రికల్లో రావడం, మిగతా టైం లో రోడ్లమీద అరచుకుంటూ ఉంటారు కనుక రాజ కుటుంబీకులమైన మనకి అల్లుళ్ళ అరుపులు గుర్తుంటాయి గాని పనులు గుర్తుండవు (ఒక వేళ పనులనేవి ఉంటే)
ReplyDeleteకాబట్టి అభివృద్ధి విషయంలో కూడా రాజరికమే వెయ్యి రెట్లు బెటర్.
4. రాజరికంలో అధికారానికి ధోకా ఉండదు కాబట్టి కొన్ని ప్రత్యేక గ్రూపుల మెప్పు కోసం అరాటపడాల్సిన అవసరం లేదు కాబట్టి నిష్పక్షపాతంగా కేవలం ప్రతిభ ఆధారంగా క్రీడాకారులనీ, కళాకారులనీ, ఆంతరంగికులనీ, ఆస్థాన ఉద్యోగులనీ నియమించుకుంటారు. ఇల్లరికం లోనయితే గెలిచిన దగ్గరనుండీ వచ్చేసారి గెలవడమే లక్ష్యంగా పనిచేస్తూ ఎంత పనికిమాలిన వాడైనా ఈ సారి గెలవడానికి పనికొస్తాడా లేదా అన్న ప్రాతిపదిక మీదనే నామినేట్ చేస్తారు కనుక ప్రతిభకి పెద్దపీట వెయ్యలేరు.
కాబట్టి ప్రతిభకి తగ్గ ఫలితమూ, సమాన అవకాశాలు కూడా రాజరికంలోనే ఎక్కువ ఉంటాయి.
5. రాజరికంలో సార్వభౌమాధికారం పూర్తిగా రాజకుటుంబం చేతిలో ఉంటుంది కనుక వారిని ఎదురు ప్రశ్నించడం , వాళ్ళు విలాస జీవితం గురించి రచ్చ చెయ్యడం ఉండదు. ముక్త కంఠంతో రాజు ఆదేశాల్ని అంగీకరించవలసివస్తుంది కాబట్టి సామాన్య జనాల్లో వర్గాలూ, సంఘర్షణ వాతావరణం తక్కువ ఉంటుంది. ఇల్లరికంలో రెండు , అంతకంటే ఎక్కువ అల్లుళ్ళ గ్రూపులు నిరంతరం రాజకుటుంబీకులమయిన మనని వర్గాలుగా చేసి ఘర్షణలు సృష్టిస్తుంటారు. ఈ వర్గాలు నిలబెట్టుకోవడం కోసం వారు మేసే మేతలో మనకి కూడా కొద్దిగా తినిపించి “మన సొమ్ముతో మనలనే కొనడం”, “అత్త సొమ్ము అల్లుడి దానం” లాంటి వికృత అచారాలని పాటిస్తుంటారు.
కాబట్టి. శాంతియుత, అవినీతి రహిత వాతావరణం కూడా రాజరికం లోనే ఎక్కువ ఉంటుంది.
****
పై కారణాల వలన మనం ముందుకు వెళ్ళాల్సింది వెనక్కి బడ్డాము. రాజకుటుంబీకులమైన మనం మన ప్రతినిధులని ఎన్నుకోవడంలో పరిణితి చూపించి ప్రజాస్వామ్యం మరింత ఇల్లరికంలోకి జారి అల్లరయిపోకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది.