Saturday, 20 February 2016

గతమెంతొ ఘనకీర్తి గలవోడ!చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ!!

          2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 79 మిలియన్లు!ప్రపంచం మొత్తం మీద ఫ్రెంచ్ మాతృభాష అయినవాళు 75 మిలియన్లు.ఆంధ్రప్రదేశ్.తెలంగాణ రాష్ట్ర్రాలు రెండింటిలో కలిపి  61 మిలియన్లు,తమిళనాడులో 3 మిలియన్లు,కర్నాటకా చత్తీస్ గడ్ మహారాష్ట్రల్లో ఒక్కో మిలియన్ చొప్ప్పున వ్యాపించి ఉన్నారు.లక్షద్వీప్ నుంచి ఒరిస్సా వరకూ తెలుగువాళ్ళు అసలు లేని చోటంటూ లేదు.ఈ మధ్యన తెలుగువాణి తరపున స.వెం.రమేష్ గారు ప్రపంచమంతటా చుడుతున్నారు తెలుగువాళ్ళ జాడలు కనిపెట్టటానికి.ఇప్పటికి శ్రీలంక, బంగ్లాదేశ్, బెంగాల్ లాంటి చోట్ల ఉన్న తెలుగువాళ్ల వివరాలు చదువుతుంటే చదువుతున్న ప్రతిసారీ అశ్చర్యం, ఆనందం, విషాదం అన్నీఒకేసారి ముప్పిరిగొంటున్నాయి నన్ను. ఆశ్చర్యం దేనికంటే, ఇన్నాళ్ళూ తెలుగువాళ్ళు అంటే ఒక్క రాష్త్రంలో ఉన్నవాళ్ళ గురించే వూహించుకుంటూ గడిపేశాం గానీ ఎక్కడెక్కడికి వ్యాపించిపోయారు మనవాళ్ళు అని. ఆనందం దేనికంటే ఇక్కడున్న తెలుగువాళ్ళలా "అండి","రి" గురించీ "చెప్పాలె","చెప్పాలి"ల గురించీ కొట్టుకు చావకుండా భాషని నిజంగా ప్రేమిస్తూ దాన్ని వొదులుకోకుండా ఉంటున్నందుకు. విషాదం దేనికంటే పాపం వీళ్ళంతా పొట్ట చేతపట్టుకుని పోయి ఇప్పటికీ దిక్కు లేనివాళ్లలా బతుకున్నందుకు. వాళ్ళు తమ మూల రాష్ట్రాల నుంచి అండ అవసరమైన కడుబీదవాళ్ళు - కానీ ఇప్పుడిక్కడ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఇద్దరికిద్దరూ తెలుగుదనం మీద ప్రీతి లేని బందిపోట్లు!

          పక్కనున్న తమిళనాడులో అక్కడి ప్రభుత్వం దుర్మార్గంగా వేధిస్తుంటే కోర్టులు కలగజేసుకుని ఆపినాయే తప్ప చీమ కుట్టినంతగా కూడా చలించని వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళ గురించి ఆలోచిస్తారా?అదీగాక వాళ్ళు వమెరికాల్లోనూ సింగప్పూరుల్లోనూ ఉండి రెండు చేతులా సంపాదిస్తూ బలిసిన వాళ్ళు కూడా కాదాయె - బుక్కా పకీరు వెధవలు, ఎందుకు పనికొస్తారు వీళ్ళు?కులము గల్గువాడు, గోత్రంబు గల్గువాడు, విద్యచేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిస కొడుకులు అన్నాడు కదూ వేమన్న ఎప్పుడో! కులగోత్రాలను అడ్డుపెట్టుకుని గొప్పవాళ్ళవ్వాలని అనుకునేవాళ్ళూ, చదువుకున్నవాళ్ళం అని గొప్పగా చెప్పుకునేవాళ్ళూ పోయి పోయి డబ్బున్నవాళ్ళ చంకలు నాకడానికి ఎట్లా పోటీలు పడుతున్నారో ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం గదా!అలా డబ్బు కోసం ఆత్మలని అమ్ముకునే వాళ్ళు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సంస్కృతిని మర్చిపోవడంలో ఆశ్చర్య మేముంది?చక్కని భాష  కానివ్వండి,మంచితనం కానివ్వండి, తరాల తరబడి కొనసాగించుకుంటూ రావలసిన జీవనవిధానం కానివ్వండి - ఈ దబ్బుపిచ్చి లేనివాళ్ల దగ్గిరే సజీవంగా ఉంటున్నాయి!

          మియన్మార్ దేశంలో ఎన్నో తెలుగు సమూహాలు ఉన్నాయి.1960ల వరకు స్కూళ్ళలో తెలుగు సబ్జెక్ట్ ఉండేది.మౌల్మీన్ నగరంలో ఒక వీధికి "మల్లెపూల దిబ్బ" అని పేరు పేట్టుకున్నారు, ఎంత బావుంది!.తూర్పు మియన్మార్ ప్రాంతంలో తైలంగ్ సమూహం ఉంది - బహుశా చోళుల కాలంలో ఇక్కడి నుండి వెళ్ళిన వారు కావచ్చు!వారి నోట వినపడే ఒక జోలపాటలో దూరాన ఉన్న తెలంగాణ అనే ప్రాంతం గురించి గుర్తు తెచ్చుకంటున్నట్టు ఉంటుంది. "తెలుగదేల యన్న దేశంబు తెలుగు" అన్న శ్రీకృష్ణదేవరాయలు మరొక మాట కూడా అన్నాడు,"తెలుగు తలచిన దేశంబు తెలంగాణ్యము" అని కూడా అన్నాడు.అయితే ఆ తెలంగాణ 2014లో ఏర్పడిన పదిజిల్లాల తెలంగాణ కాదు, మొత్తం తేలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలనీ భాషాపరంగా కలిపేసి తెలంగాణ ఆని పిలిచేవాళ్ళు అప్పట్లో!

          ఇవ్వాళ ప్రాచీన భాష హోదా కోసం గోదాలో దిగి పోటీలు పడుతున్నభాషలలో ఏ ఒక్క భాషని గురించి కూడా ఎప్పుడు పుట్టిందో నిర్ధారణగా ఎవరూ చెప్పలేరు.నిర్ధారణగా చెప్పాలంటే ఆధారాలు కావాలి, అదీ లిఖిత పూర్వకమైనవి కావాలి.కానీ అసలు తొలి మానవుడు గొంతు పెకలించి కేకలూ,అరుపులూ,గర్జనలూ,ధ్వనుల నుంచి ఒక లయను సృష్టించుకుంటున్నప్పుడు అతను వెంటనే దాన్ని వ్రాసి చూసుకోవాలని అనుకోలేదు - కొత్తగా పుట్టిన నాలుగైదు మాటల్ని తేలికగానే గుర్తుంచుకోవచ్చు కదా!మెల్లమెల్లగా పదాల వాడకం పెరిగి భాష విస్తృతమైనాకనే లిపి అవసరమైంది. ఒక విచిత్రం చూడండి - ఒక భాష చాలా ముందుగానే పుట్టినా చాలా కాలం వరకూ లిపి ఏర్పారుచుకోకుండా ఉండిపోయి,మరొక భాష దాని తర్వాత పుట్టినా ముందు లిపిని ఏర్పాటు చేసుకుంటే రెండవది ముందు పుట్టిందని తీర్మానించితే మొదటి భాషకి అన్యాయం జరిగినట్టే కదా!కానీ ప్రస్తుతానికి భాషల ప్రాచీనతని కొలవడానికి అంతకన్నా శాస్త్రీయమైన పద్ధతి కూడా లేదు గాబట్టి ప్రాచీనతకి లిపినే తీసుకుంటున్నారు.అలా చూస్తే తెలుగుభాష వయస్సు 2,400 సంవత్సరాలు. 

          క్రీ.పూ 525 నాటి చోళ రాజుల శాసనాలలో మరాఠీ ప్రాకృతంలో కలిసిపోయిన కొన్ని తెఉగు పదాల ఆనవాళ్ళు కనబడుతున్నాయి.క్రీ.పూ 200 నుండి క్రీ.శ 200 మధ్యలో రచించబడినదని భావిస్తున్న గాధాసప్తశతి మహారాష్త్ర ప్రాకృత భాషలో ఉన్నదే అయినా అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు కూడా కనబడుతున్నాయి.గాధ అంటే ఇప్పటి అర్ధంలో మనం చెప్పుకంటున్న కధ అని కాదు.ప్రేమ,హాస్యం,వేదాంతం మొదలైన అన్నింటినీ స్పృశిస్తూ హుషారును పుట్టించే పులిసిన ఫ్రెంఛి మద్యం లాంటి తొలి వచన కవితా రూపం!ఇప్పటి హైకూల మాదిరి చిన్నవిగా ఉంటాయి.కానీ చెళ్ళున తగిలే చెణుకులోనూ భావంలోని విరుపులోనూ ఇప్పటి హైకూలు అప్పటి గాధల ముందు దిగదుడుపే!

          తెలుగు భాష మొదట్లో ద్రవిడ మూలం నుంచి ఎదిగినా మిగిలిన అన్ని ద్రవిడ భాషల కన్నా ఎక్కువగా సంస్కృతంతోనూ కలిసిపోయి దానికి దీటుగా నిలబడగలిగింది. ప్రపంచంలోని ఏ భాషకైనా రెండు రూపాలు ఉంటాయి - గద్యం, పద్యం.అయితే ప్రపంచంలోని భాష లన్నిటిలోనూ దేనివలన సంస్కృతం ప్రత్యేకంగా నిలబడుతున్నదో ఆ చందస్సుని ఒక్క తెలుగు మాత్రమే సమర్ధవంతంగా ఇముడ్చుకుని కావ్యరచనలో సంస్కృత సాహిత్యానికి దీటుగా నిలబడింది.నన్నయ్యకు పూర్వమే తెలుగులో చందోబద్ధమైన కవితారచన గొప్పగానే జరిగింది.కానీ కావ్యరచనయే జరగలేదు. ఆ లోటును పూరించడానికే నన్నయ భారతాంధ్రీకరణ మొదలుపెట్టాడు. దానికన్నా తెలుగుభాషకి నన్నయ చేసిన మహోపకారం ఒకటి ఉంది. తెలుగుకి ఒక శుద్ధమైన వ్యాకరణం వ్రాయటం - అందుకే ఆయనని వాగనుశాసనుడు అన్నారు!ముందుగా తరతరాలకూ తరగని వెలుగై నిలవాలంటే భాష ఎట్లా ఉండాలో తీర్చిదిద్ది ఆ తర్వాత దానిని ఇట్లా ఉపయోగించుకోవాలి అని మహాభారత కావ్యరచన ద్వారా కొత్తదారి చూపించాడు.తర్వాతి కవులందరూ ఆయన చూపిన దారినే నడిచారు.అందువల్లనే ఆయనని ఆదికవి అంటున్నది. అప్పటి కాలంలోనే మనవాళ్ళు వ్రాసిన ఒక పాలిండ్రోం చూదండి:

కాళిదాసళిదాయోమా చంద్రంతేరిపురంజకమ్ |
కంజరంపురితేంద్రంచ మాయోదాళిసదాళికా|

          కర్ణాటక సంగీతం మొత్తం దక్షిణ భారతదేశ మంతటా వ్యాపించినా వాగ్గేయకారులు ఏ ప్రాంతం వారైనా తమ కృతుల రచనకి సంస్కృతం తర్వాత తెలుగునే ఎన్నుకోవటానికి కారణం దీని అజంత మాధుర్యమే!వినడానికి ఇంత తియ్యగా ఉన్నప్పటికీ దీన్ని నేర్చుకోవడం మాత్రం చాలా కష్టం,ఎందుకంటే, ఇది అల్లాటప్పా భాష కాదు, దీని వ్యాకరణం విభక్తులు,ప్రత్యయాలు,సంధులు,సమాసాలు వంటివాటితో కూడి ఉండి అచ్చు కుందేళ్ళ వంటి చిన్న చిన్న సాధుజంతువుల నుంచి సింహశార్దూలమత్తేభాల వంటి పెద్ద పెద్ద క్రూరజంతువులతో నిండి ఉన్న గహనాటవిని తలపిస్తుంది మరి!సంస్కృతం తర్వాత అంత సుసంపన్నమైనదీ,సంక్లిష్తమైనదీ అయిన తెలుగుభాష మీద గట్టిపట్టును సాధించటం మట్టిబుర్రలకి ఒక పట్టాన సాధ్యం కాదు!

          తెలుగుభాష కున్న అసలైన స్పెషాల్టీ ఒత్తులండోయ్!రెండు మూడు రకాల ధ్వనుల్ని పలికే అక్షరాల్ని కూడా ఒక్కటిగా కలిపి మాట్లాడెయ్యొచ్చు, దాదాపు అన్ని భాషల్లోనూ సంయుక్తాక్షరాలు ఉన్నాయి గానీ తెలుగుకి ఈ ప్రత్యేకత లిపిలో కూడా ఉండటం మరింత అపురూపం!దీనివల్ల మనం వింటున్న ప్రతి ధ్వనినీ పలకగలం, రాయగలం, చదవగలం!తెలుగుభాషని దాని ఒత్తులూ గుణింతాలూ దీర్ఘాలతో సహా స్వచ్చంగా పలకగలిగితే ప్రపంచంలోని ఏ భాషనయినా దాని సొంత ఉచ్చారణతో చాలా తేలిగ్గా మాట్లాడవచ్చు.దీని మీదనే ఒక తెలుగు  పండితుడు మంచి పద్యం కూడా రాసేశాడు!

క్రమముగ "శ్రీమ త్సకల గుణ సంపన్న"
యని యున్న జదివెడు నఱవవాడు

కడగి "చిరిమదు చగల కుణ చంపన్న"
యని,కన్నడము వాడు యొనసి

"సిరిమతు సగల గోణ" యని తోడనే
"శంపణ్ణ" యని,మహారాష్ట్రుండు పని వడివడి

జెలగుచు "శ్రీమతూ సెకల గుణానె
సంపన్నాసె" యని,యోఢ్రభాషణుండు

వెలయు "శ్రీమొతో సొకొలొ గుణ సొంపన్నో"
యని,యికెన్ని వేల యన్య భాష
లాంధ్రు డున్నయట్లెయలరు బఠించు
నంచు హాస్యవేది యాడు నాడు....
                                                                                           - శ్రీ కొక్కొండ వేంకతరత్నం పంతులు గారు


          చూశారుగా, తెలుగుభాష వేళాకోళానికి పనికివచ్చినంతగా మరే భాషా పనికిరాదు:-)తెలుగు కున్న మరో స్పెషాళ్టీ సామేత లండోయ్!ప్రోవెర్బులనీ అవనీ ఇవనీ అన్ని భాషల్లోనూ ఉన్నాయి గానీ తెలుగు సామేతల కున్న ప్రత్యేకఫ భావాన్ని బట్టి పదాల ఎంపిక విపరీతమైన తేడా వచ్చేస్తుంది.హాస్యం చిలికే సామెతల్లో వచ్చే పదాలు గుర్తుకొస్తే చాలు చక్కిలిగింతలు పెట్టినట్టు ఉంటుంది.అదే తాత్వికమైన సామెతలు గుర్తుకొస్తే మనస్సు గంభీరంగా మారిపోతుంది!ఈ వైవిధ్యం తెలుగుకి మాత్రమే సొంతం.

          తెలుగుభాష కున్న మరో ప్రత్యేకత కొత్త పదాల్ని పుట్టించుకోగలగటం, ఇతర భాషల పదాల్ని ఇముడ్చుకోగలగటం.ఏ భాషలోని ఎలాంటి పదానికైనా సరే చివర్న ప్రధమా విభక్తి ప్రత్యయాల్ని అతికించేస్తే చాలు అసలది ముందునుంచీ తెలుగు పదమేనేమో అనిపించేటట్టు తెలుగు పదమై కూర్చుంటుంది!కొత్తపదాల్ని పుట్టించటానికి ఉదాహారణ చెప్పాల్సి వస్తే స్వర్ణయుగపు తెలుగు సినిమా మాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారినే చెప్పాలి. తన ప్రతి సినిమాలోనూ పాత్రల పేర్లలో గానీ పాటల్లో గానీ పాత్రధారుల సంభాషణల్లో గానీ ఎన్నో కొత్త మాటల్ని పరిచయం చేశారు.

          వడ్డెర, చెంచు భాషలు తెలుగుకి కొంచెం దగ్గిరగా ఉంటాయి.తెలుగు భాష లోని కొన్ని ప్రముఖమైన యాసలు దొమ్మర,దాసరి,సాలెవారి,తెలంగాణి,వరంగల్,పాలమూరు,గద్వాల,నారాయణపేట,శ్రీకాకుళం,విశాఖపట్నం,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,నెల్లూరు,ప్రకాశం,గుంటూరు,తిరుపతి.సాధారణంగా ప్రపంచంలోని ప్రతి భాషలోనూ మంచి సాహిత్యం తన జన్మస్థానంలోనే పుడుతుంది. కానీ తెలుగు జన్మభూమి,కర్మభూమి అనే భేదం లేకుండా ఎక్కడున్నా చిలవలు పలవలుగా సాహితీ నిర్మాణం జరిగిపోతుంది.దీనికి కారణం అతి తేలిక్గా మౌఖిక సాహిత్యాన్ని పుట్టించగలిగే వెసులుబాటు ఉండటం - తన వేదనకి సాంత్వన కోసం గొంతెత్తి పాడుకోవటానికి అనువైన భాషలో సాహిత్యం పుట్టటానికి నిరుపహతి స్థలములూ,రమణీ ప్రీయదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెములూ,ఇంకెవరో తొడిగే గండపెండేరములూ అక్కర్లేదు కదా!

          తెలుగు మౌఖిక సాహిత్యం కుల పురాణాలు,కొలువులు-గేయ కధలు,సామేతలు అనే మూడు విభాగాల్లోనూ ఎంతో అద్భుతమైన స్థాయిని అందుకున్నది. తెలుగునాట ఉన్న 196 కుల్లాల్లో ప్రతి కులానికీ అనుబంధంగా వారి కులపురాణం ఉంది.గౌడ కులస్తులకు గౌడ పురాణం, చాకలి కులస్తులకు రజక పురాణం - ఈ కుల పురాణం ప్రతి కులం వారికీ తమ తమ సంప్రదాయిక విధుల్ని శాస్త్రోక్తంగా నెరవేర్చుకోవటానికి చాలా అవసరం.ఎవరో ఒకరు నిష్ణాతుడైన వ్యక్తి గానం చేసే పద్ధతిలో 3 గంటల నుంచి 14 రాత్రుల పాటు గానం చెయ్యగలిగిన విస్తృత స్థాయిలో ఈ కులపురాణసాహిత్యం ఉన్నది.దీనిని బట్టి ప్రస్తుతం మనం నమ్ముతున్నట్టు ప్రతి కులం వారూ తమ కులం మిగతా కులాల కన్నా తక్కువస్థాయిది అని అనుకోకుండా తమ కుల వారసత్వం పట్ల ఒక రకమైన గర్వాన్ని కలిగి ఉండేవారని అర్ధమవుతుంది!కొలువులు అంటే దేవతలకి జరిగే జాతరల వంటి ఉత్సవాలలో ప్రత్యేకించి ఆ దేవతని కొలుస్తూ పాడే పాటలూ, చెయ్యాల్సిన పూజల సంగతులూ ఉంటాయి.ఇక్కడ దేవత,సన్నివేశం,సాహిత్యం - ఈ మూడింటిలో దేన్నీ విడదియ్యలేనంత చిక్కురొక్కురుగా అల్లేసిన సాహిత్య రూపం కొలువు దరువు!ఈ మౌఖిక సాహిత్య సృష్టికర్తలలో ఉన్న ముఖ్యవిశేషం ఆవసరమైన చోట గీర్వాణ భాషనీ,గ్రాంధిక  రూపాల్నీ కూడా ఏమాత్రం నదురూ బెదురూ లేకుండా వాడుకోగలగటం!బుర్రకధలు,హరికధలు చెప్పేవారిలో కొందరు పౌరాణిక కధల్ని సంప్రదాయిక పండితుల కన్నా గొప్పగా వ్యాఖ్యానిస్తూ చెప్పగలగటం మనకు తెలిసిందే కదా!నిజానికి ఒక చందోబద్ధమైన కావ్యరచన కన్నా ఒక మౌఖిక సాహిత్య రూపాన్ని సృజించటానికే ఎక్కువ ప్రతిభ కావాలి.

          తెలుగుభాషకీ నేటి కాలపు తెలుగు,కన్నడ ప్రాంతాలను పరిపాలించిన ఆంధ్రశాతవాహనులకీ అవినాభావ సంబంధం ఉంది.మౌర్యులకు సామంతులైన వీరు మౌర్యుల మాదిరిగానే బ్రాహ్మీ లిపిని ఉపయోగించారు.దాదాపు చాలా ద్రవిడ భాషలు బ్రాహ్మీ లిపి నుంచే తమ భాషలకు లిపిని తీర్చి దిద్దుకున్నాయి.వాటిలో తెలుగుభాష ఒక్కటే తన లిపిని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుకోగలిగింది - ఈ అక్షరాల్ని చూస్తుంటేనే వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల వలె ఎంతో ముద్దొస్తూ ఉంటాయి!



          ప్రతి అక్షరానికీ తిక్క లేని ఒక లెక్క ఉంది - అచ్చులు,హల్లులు అని రెండు ముఖ్యమైన వర్గాలు ఉన్నాయి. వీటిలో మళ్ళీ ఉచ్చారణలో నాలుక దేన్ని తగులుతుందనే దాన్ని బట్టి చేసిన దంత్యములు, తాలవ్యములు, ఓష్ఠ్యములు అనే మరొక విభజన కూడా ఉంది.సున్నా,అరసున్నా,విసర్గలు కూడా భావవ్యక్తీకరణలో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుని ఉండేవి.అరసున్నాని ఇప్పుడెవరూ వాడటం లేదు గానీ ఒకప్పుడు దీనినీ విరివిగానే వాడేవాళ్ళు.పండితులు సభదీర్చి తీర్మానం చేసి దీనిని తొలగించదల్చినప్పుడు ఒక పండితుడు ఎలిజీ రాసి మరీ దుఃఖించాడు!

          జంతుశాస్త్రం చెప్తున్న దాని ప్రకారం ఇండియన్ అయినా,అమెరికన్ అయినా,రష్యన్ అయినా,చైనీస్ అయినా,జపనీస్ అయినా అందరూ ఒకే జాతి - మానవ జాతి.కానీ ఈ మానవ జాతిలో ఇవ్వాళ ప్రత్యేకించి విడదీసి జాతులుగా చూస్తున్న మానవ సమూహాల్లో ప్రతి జాతికీ ఒక మాతృభాష ఉంటుంది!రాజకీయంగా,సామాజికంగా ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ భాషకి సంబంధించిన అస్తిత్వాన్ని కోల్పోవడం రెండు విధాలుగా మాత్రమే జరుగుతుంది - ఒకటి ఆ జాతి పూర్తిగా నశించిపోవడం,రెండు ఆ జాతి మరొక జాతి అధిపత్యంలోకి వెళ్ళడం!ప్రపంచంలో ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేని సంస్కృతుల చరిత్రలలో ఎక్కువగా ఇదే జరిగింది.తెలుగుభాషకీ తెలుగుజాతికీ ఈ రెండింటిలో ఒకటి గానీ మూడవది గానీ అయిన దుర్గతి పట్టగూడదని కోరుకుంటున్నాను.దానికి మనం చెయ్యవలసింది స.వెం.రమేస్ లాంటివారికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడం.ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల లోని ప్రజలు రాజకీయ నాయకుల విద్వేష ప్రసంగాలకి ఉద్రేకపూరితులు కాకుండా ఈ రెండు రాష్ట్రాల లోనే కాదు ప్రపంచంలోని అన్నిచోట్లా ఉన్న ప్రతి తెలుగు సమూహం గురించీ ఆలోచించాలి. వారిలో కొందరు మనకన్నా ఎంతో అధ్వాన్న స్థితిలో ఉన్నారు. మన ప్రభుత్వాల నుంచి సహాయాన్ని కోరుకుంటున్నారు.అంతటి అధ్వాన్న స్థితిలో ఉండి కూడా వారు తమని పలకరించటానికి వచ్చిన సాటి తెలుగువాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తుంటే వారికన్నా ఎంతో కొంత మెరుగైన స్థితిలో ఉన్న మనం ఇక్కడ చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ సతమతమైపోతున్నాం!

          రాష్ట్రాన్ని విడదీసిన వాళ్ళు మీలాంటి నాలాంటి ప్రజల గురించి ఆలోచించి విడదియ్యలేదు - పై స్థాయిలో చేతులు మారే వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులను ఎవరు దక్కించుకోవాలన్న లెక్కలతో కొందరూ,ఒక రాష్ట్రం రెండయితే అదనంగా సృష్టించబడే రాజకీయ పదవుల కోసం కొందరూ - తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు చేశారు. అందుకే మనల్ని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచిన అన్ని పార్టీల వాళ్ళూ ఇప్పుడు పదవుల్ని పంచుకోవడం కోసం వాళ్ళలో వాళ్ళు అంత ఐకమత్యంగా కలిసిపోగలుగుతున్నారు - కళ్ళు తెరుచుకుని చూదండి!ఈ మేకమెడచంటిపాల కోసం ఎంత ఆశపడినా లాభం లేదని త్వరలోనే తేటతెల్ల మవుతుంది ఎల్లరకూ!ఏ మనిషి ఏ దేశంలో ఏ కాలంలో వృద్ధిలోకి వచ్చినా అతని నైపుణ్యమే కారణం. మీలోని నైపుణ్యాన్ని పెంచుకోండి,అది ఆర్జనని పెంచుతుంది,అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది - అప్పుడు ఈ విభేదాలూ ద్వేషాలూ వాతంతటవే మాయమై పోతాయి.ఆ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే అనవసరంగా ఆవేశపడ్డామని పశ్చాత్తాపపడకుండా ఉండటానికయినా ఈరోజున కొంచెం విచక్షణతో ప్రవర్తించండి!

మనుషుల్ని కలపటానికి పుట్టిన భాషని మనుషుల్ని విడదియ్యటానికి వాడటం పైశాచికత్వం!

Friday, 19 February 2016

ఇలాంటి బుద్ధిమట్టం వాగుడుకే గదా తెలంగాణలో తెదెపా ఖాళీ ఐపోయింది!ఇంకా పునర్వైభవానికి కార్యకర్తల్ని పిలుస్తాడేంటి?

          చంద్రబాబుకి మీడియా కనిపిస్తే చాలు పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒక మాట అనకుండా ఉండలేని నరాల బలీనత ఉంది.దాని మూలంగా ఇదివరకు లేనిపోని తద్దినాలు కొన్నింటిని నెత్తిమీదకి కూడా తెచ్చుకున్నాడు,అయినా బుద్ధి తెచ్చుకోవటం లేదు!అమరావతి శంకుస్థాపన జరుగుతుంది."ఆహా అమరావతి ఓహో అమరావతి" అని ఎన్నైనా పొగుడుకోవచ్చు కదా,మధ్యలో పుసుక్కున "హైదరాబాదును తీసేస్తే తెలంగాణలో ఏముంది? అనేశాడు!వినగానే నాకు తెగ నవ్వొచ్చింది,తెలంగాణలో తెదెపా భూస్థాపితం అవడం మంచిదే అనిపించింది.లేకపోతే ఏంటి, రాష్త్రం విడిపోవటానికి తెలంగాణ వాళ్ళు చెప్తున్నదీ ఆంధ్ర ప్రాంతపు నాయకులు హైదరాబాదును తప్ప తెలంగాణలో దేన్నీ డెవలప్ చెయ్యలేదనే గదా!తెలంగాణలో హైదరాబాదు తప్ప ఏదీ కనబడకపోవటానికి తన బాధ్యత ఏమీ లేదా?

          కేసీఆర్ వాహనాల రీరిజిస్ట్రేషన్,గుడుంబాను తగ్గించటానికి కల్తీకల్లు పరిష్కారం లాంటి ఎన్ని పిచ్చిపనులు చేసినా మాట్లాడే మాటల్లో మాత్రం ఎక్కడా తప్పు పట్టటానికి వీల్లేకుండా మాట్లాడతాడు.హుస్సేన్ సాగర్ చుట్టూ 69 అంతస్థుల భవనాలు అన్నా, ఫలానా భవనం వాస్తు బాలేదు కూల్చి కొత్తది కడదాం అన్నా అవన్నీ కనీసం అతను ఇప్పుడున్న దాన్ని బాగు చేద్దామ నై కలగంటున్నాడు అన్నట్టు ఎలుస్తుంది - అవి నిజం చెయ్యగలడా,డాబుసరి కబుర్లా అనేది రేపటిరోజున గానీ తెలియదు.కానీ ఇవ్వాళ వింటున్నవాళ్ళకి వాటిలో తప్పు కనబదదు,క్రూరమైన కేసీఆర్ ద్వేషులకి తప్ప.ఎక్కదయిన అదొరుకుతాడు గానీ కరణం రాతలో ఒరకడన్ననత నిక్కచ్చిగా మాట్లాదతాడు కేసీఆర్!

          నేను విభజన తర్వాతి ఎన్నికల విశ్లేషనలోనే చెప్పాను తెలంగాణని కేసీఆర్ కొదిలేసి బాబు ఆంధ్రాకి పరిమితమవటం ఈ రెందు రాష్ట్రాలకీ మంచింది అని.కేసీఆర్ వోటుకు నోటు లాంటి వ్యూహం వేస్తాదని నేను అప్పడే వూహించాను.ఆగండాగండి,భవైష్యత్ దర్శనం లాంటి సక్తుల్ని గురించి సొంత దబ్బా కొట్టుకుంటునానై అనుకోకండి.బాబు కేసీఆర్ ప్రజ్ఞని తక్కువ అంచనా వేశాడు గానీ నాకు మాత్రం కేసీయార్ గురించి ఎలాంటి తక్కువ స్థాయి అభిప్రాయమూ లేదు.తెదెపాని ఖాళీ చేయించకపోతే కేసీయార్ ఖాళీ అయిపోతాడు!

          తెదెపాని ఖాళీ చేయించటం కేసీయార్ యొక్క ప్రధమావసరం గనక ఖచ్చితంగా ఇప్పుడు  కనబడుతున్న వోటుకు నోటు కేసు లాంటిదాన్ని సినిమా కధలాగా నేను వూహించ లేదు గానీ అలాంటి వ్యూహం ఒకటి తప్పకుండా వేస్తాడు అని అనుకుంటూనే ఉన్నాను, వేశాడు!ఆంధ్రావాడిగా కేసీయార్ దాడిని వ్యతిరేకించినా అది బాబు స్వయంకృతం అని మీకూ నాకే కాదు బాబుకి కూడా తెలుసు.కేవలం తెలంగాణని విడగొట్టి వదిలెయ్యకుండా అభివృద్ధి లోకి తీసుకు రావడం కోసం ఇప్పుడు మొత్తం తెలంగాణలో కేసీయార్ కన్న సమర్ధుడు మరొకడు లేడు.కాబట్టి అతనికి ఇబ్బందులు కలిగించకుండా ఉంటమే ఉత్తమం.అందుకోసం అన్ని పార్టీల లోని పనికొచ్చే వాళ్ళని ఆకర్షించినా తప్పు లేదు.మరి ఇంతకాలం హెందుకయ్యా హరిబాబూ నిప్పులు చెరిగావు కేసీయార్ మీద అంటారా - విషయాని బట్టి తప్ప ఏ మనిషినీ నేను దుర్మార్గుడు,సన్మార్గుడు అని గీత గియ్యను!నేను నిలబడిన ఒక సన్నివేశంలో నా ఎదుట నిలబడిన మనిషి తప్పు చేస్తే వ్యతిరేకిస్తాను,అదే మనిషి మరో సన్నివేశంలో ఒప్పు చేస్తే మెచ్చుకుంటాను - అదీ నా పద్ధతి.

          ఇకనుంచయినా బాబు "రెండు కళ్ళు","తెలుగువాళ్ళని కలపటం" మర్చిపోతే బాగుంటుందని నా కోరిక.ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు చీమలూ జెర్రులూ పకౌతున్నట్టు ఉండేవి.విడిపోయిన మూడేళ్ళ తర్వాత కూడా ఎప్పుడో మమ్మల్ని వెక్కిరించారనీ "చెప్పాలె" అనుకోనివ్వలేదనీ ఏడ్చేవాళ్ళతో ఎవడు కలవగలడు?పాపం ఇప్పుడు బాబుకీ అనిపిస్తుంటుందేమో లెండి రెండు కళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా గుడ్డికన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అని:-(

పెరుగు పెరుగే,మజ్జిగ మజ్జిగే!ఆంధ్రా ఆంధ్రాయే,తెలంగాణ తెలంగాణయే

Thursday, 11 February 2016

ఏందిరా ఫణీంద్రా!పక్కోని యాసని తప్పుడు బాసంటుండావు,నీ కతేంది?

          మంచి గొడ్డుకో దెబ్బ,మంచి మనిషిలో మాట!మాటంటే మాటలు గాదురా బోసడికే!?అసలెందుకు మాట్టాడాలె మనిషి?మాట ఎందుకు పుట్టింది!సమస్త జంతుజాలం నుంచీ మనిషనే జంతువు ఎట్టా విడిపడిందో తెలుసునా?మొదట తిన్నంగ నిలబడుడు నేర్చుకునె,దాని మూలంగ గరిమనాభి సెంటరు కొచ్చి మోతబరువు తగ్గి దూరాభారం పోవుడులో యాష్త తగ్గిండ్లా!అందును జేసి బుర్ర కొంచెం పెరిగిండ్లా?రెండోటిది బొటనేలు, మనిషికి దగ్గిర చుట్టమైన కోతుల్లో గూడ బొటనేలు అన్నింటి తీర్న ఒక పక్కకే ఉండంగ మనిషి కొక్కనికే సుట్టుదిరిగి ఎదురుబొదురు కొచ్చినాది!పనిముట్లని వాడనీకి పట్టు దొరికి మనిషి పూనుకుని పనులు జేసెడి సౌకర్యం అమిరిపాయె!అన్ని జంతువులూ దొరికింది తింటుండంగ మనిషి మాత్రం వండుకుని తినుడు నేర్చిండు!ఉపాయం తోని పనిముట్లు వాడుకుంటు నాగరీకం నేర్చిండు.తొలి పనిముట్టు చక్రం,ఇప్పుడు గూద వాచీల కాడి నుంచి అన్ని మెషీన్లల తిరిగేటి చక్రమొకటి ఉంటాది,యెర్కనా?!

          ఒక్కడు జేసేటి పనికి సాయమక్కర్లె, మాటలూ అక్కర్లె - తలొంచుకుని తనపని తను జేస్కొనుడు జాలు!మరి తోటి మనిషి సాయం లేంది పని జరగనప్పుడు ఏం జెయ్యాలె?పక్కోనికి నీకేం గావాలో సమజయ్యే తీర్న చెప్పాలె,వాని సాయం అడిగి పుచ్చుకోవాలె.అందుకోసరం పుట్టినాయిరా సమస్త భాషలూ ఇడియట్టాఫిండియా!అచ్చరాలే గాదు బొమ్మలూ గీతలూ గూడ భాషలోని భాగమే!గీతల్నె కంటికింపుగ వొంపులు దిప్పితె అచ్చరాలుగ మారబట్టె!నీ సాటోడు గుండు మధుసూదన కవిగారు ఏ జెప్పిండో ఇనలే - తీర్ల తీర్ల సక్కంగ జెప్పుండె!తెలుగు భాష నాలుగు రూపాల్లో ఉంటది.శుద్ధ గ్రాంధికం:నువ్వూ నేనూ గూడా దాన్ని గురుముఖతా నేర్వంది పట్టుబడనిది - తెలియనోనికి ఇనుప గుగ్గిళ్ళు నమిలినట్టే ఉంటాది.సరళ గ్రాంధికం,విశ్వనాధ సత్యనారాయణ రాసిండు - సోషల్ నవల్సు గూడ అందులోనె జమాయించిండు!గిది కొంచెం పర్వాలె, కూడదీసుకుని సద్వంగ అర్ధమయితది!ఇంగ సరళ వ్యావహారికం,ఇక్కడినుంచే నీ ప్రాంతానికీ నా ప్రాంతానికీ తేడా ఉంటది.ఇందుల గూడ గబుక్కున కొత్తమాట వినబడితె కష్టముంటది గాని సరళ గ్రాంధికమల్లె సోంచాయిస్తె  అర్ధమయితది!శుద్ధ గ్రామ్యం,ఇంగ జూస్కో నాస్సామిరంగా - ఇందుల గానీ నువు రెచ్చిపోయి నీ జిల్లా యాస మాట్టాడ్తివా ఆంధ్రోడు గాదు నీ తెలంగాణలో నీ పొరుగు జిల్లావోడే దిమ్మదిరిగి గింజుకుంటడు - కొంచెం ట్రై జేసి చూస్తవా బిడ్డా!

          నీ ప్రాంతంల నీకు నచ్చి నువ్వు వాడే "చెప్పాలె" వాడిక ప్రశస్తం అంటవు,మేము మా ప్రాంతంల మా ఇష్టం కొద్ద్ వాడే "చెప్పాలి" వాడిక దౌర్భాగ్యం అంటవు తెలుగు భాష నీ యబ్బ సొత్తా - 23 జిల్లాల తెలుగోళ్ళందరి ఉమ్మడి సొత్తురా బటాచోర్!తాతల నాడు ఎవడు ఎవణ్ణి ఏమన్నడో గా చరిత్రల సొడ్డు గిప్పుడేల!చెప్పాలె అనొద్దని యేబదేండ్లుగ మెడమీద కత్తిపెట్టి ఎవడైన ఆపిండా నిన్ను?అన్నా,ఒకటి జెప్త ఇను!నీ లెక్కనే రైటనుకుంటె మావోడు మీవోణ్ణి అన్నడని ఒపుకుంటె పడ్డవాడు చెడ్డవాడు గాడనీ అన్నవాదే చెడ్డవాడనీ నేనొప్పుకుంట,మరి గీ దినాన "చెప్పాలి" ప్రామాణికం గాదని మా యాసను గేలి చేస్తుండవ్, నువ్వు మంచోని వెట్లయితవ్?యెన్ని తరాల ముందరి నుండి మీ ప్రాంతమోళ్ళు "చెప్పాలె"నీ మా ప్రాంతమోళ్ళు "చెప్పాలి"నీ వాడుతున్నరో నీకు దెల్వకుంటె అది మావైపు వాడికెలో లేనే లేనట్టు "లి"లోని ఇకారం ఎరిక పరమాత్ముడు జెప్పాలని గూడ కూసినావు దేముడు నీ ఇంటి కుక్కా?నీ యాసని దేముడు పుట్టించిండా,  మా యాసని దెయ్యాలు పుట్టించినయ్యా!

          మాట్లాడే భాషకి రాసేటి భాషల సాక్ష్యమడుగుతవు, గ్రాంధికంల ఉన్న "చెప్పవలె"కి నువ్వు వాడే "చెప్పాలె" దగ్గిరా మేము వాడే "చెప్పాలి" దూరమూ అంటవు - అయితే ఏంది నీ గొప్ప?నీ లెక్క జూసినా అచ్చ తెలుగు మాది అద్దె తెలుగు నీదీ అయితది లెక్క జూసుకో!ముఖే ముఖే సరస్వతి అన్నది సర్వభాషలకీ వర్తించే లెక్క!రాసెడి భాషలో లేనివి గూడ వాడుక భాషలో ఉంటవి,కన్యాశుల్కంల గురజాడ లంజన్నడు,ముండన్నడు - మరి కవులందరు వాదరేంది?చనువుంటే బామ్మర్దినీ బావనీ గూడ బూతుమాటతోని పలకరిస్తవు - అయ్యన్ని పుస్తకాల కెక్కవు!గాన నువ్వు "చెప్పాలి"కి ప్రామాణిక సాక్ష్యం గ్రాంధికంల జూసుడు తప్ప!అందరి తెలుగుల మా చెప్పాలె గొప్పది మీ చెప్పాలి చెత్తది అంటున్న నువ్వు మంచోనివా మా చెప్పాలి గొప్పదే మీ చెప్పాలె గొప్పదే అంటున్న నేను మంచోడినా -  తమ్ముడు తనవాదైనా తగువులో ధర్మం జెప్పాలనే బుద్ధిమంతుడు నీ గడ్డ మీద ఉండినట్లయితే అడిగి తేల్చుకో!

          నీ పేరుల ఉన్న ఆచార్యత్వం నీ తీరుల యేది?ఆచార్యత్వ మనంగనె సమదృష్టి ఉండాలె!సమదృష్టి ఉంటె "చెప్పాలె"నీ "చెప్పాలి"నీ ఒక్క తీర్న జూసెటోనివి - సమదృష్టి లేని నీకు ఆచార్యత్వ మేల దాన్ని తీసిపారెయ్!విడిపోయి రెండేండ్లాయె,విడిపోయి కలిసుందమన్న గాడ్దెలు గమ్మునైన ఉండక రోజుకో గాడిద గత్తరేంది?నిన్న గాక మొన్న శ్రీకాంత చారి గోదావరోళ్ళ "అండి" మీద బడి వాక్యంల బరువని ఏడుస్తడు మోసేది గోదావరోడు గద వానికేంది నెప్పి,నువ్వీ దినాన "చెప్పాలి" మీద యాడికెల్లి వచ్చిందో తెల్వదని ఏడుస్తవు - ఏందిర మీ యేడుపు?!నీ యాస నీది నా యాస నీది - యేల రంధి?నా కృష్ణ యాస ఇసుమంత గూడ నాకెర్క లేదు,అందుకు నేను యేద్వను గూడ లేదు!దేని కేడ్వాల నేను?నా మాట అందరికి మంచి చెప్పెడిది గాన అందరికి బోధపర్చనీకి యాస లేని భాషల జెప్తున్న!నీకు నీ ప్రాంతపు యాస ఒక్కటే ప్రీతి గాన నా ప్రాంతపు యాసను జూసి ఏదుస్తున్నవు,నాకు అన్ని యాసలూ ప్రీతి గాన నీ ప్రాంతపు యాసను జూసి యేడుస్తలేదు - గిదే ఫైనల్,మర్ల మా యాసను తప్పుడు దనకు!

          యేందిరా బొంకుల దిబ్బ పౌరాణిక పాండిత్యంతోని విశ్వామిత్రుడి శాపం మాకొక్కనికే తగుల్తదని వాగుతున్నవు?నిన్నటి దంక మేమే అసలైన ఆంధ్రుల మంటివి,నా బ్లాగు తలకట్టున ఆంధ్ర రసజ్ఞ అని ఉంచితి నంటివి -  మరి నీవెప్పుడు ఆంధ్రత్వం నుండి జారిపోతివి?మొన్ననా  అటు మొన్ననా లేక గిరీశం లెక్కన ట్వంటీ ఫోరవర్సు ముంగల ట్రూ రెపెంటెన్సు అధాట్న నిన్ను ఆంధ్రత్వం నుండి లాగేసినట్టు ఈ బుర్రతిరుగుడు మాటలేంది?నీ చెత్త మాటల్ని గూడ నెత్తిన బెట్టుకున్నోడే తెలంగాణనీ ఇష్టపడినట్టు దీర్ఘాలు తియ్యకు.తెలంగాణ అంటే నువ్వొక్కనివే గాదు.మర్యాద తెలిసిన తెలంగాణ గడ్డ మీద బుట్టిన యే పెద్దమనిషి గాని నన్ను తప్పు బట్టడు!నువ్వు నా యాస మీద కచ్చి బట్టి చేస్తున్న దాడిని తిప్పికొడుతున్న నాలోని శౌర్యాన్ని చూస్తడు!మర్ల మర్ల చెప్పలేదనకు, నేను శ్యామలీయం వోలె శాంతమూర్తిని గాదు - నేను సర్వశక్తులూ క్రోడీకరించుకుని పూర్తి బలంతో కొడితే తట్టుకోగలిగినోడు ఈ సమస్త భూ మంలం మీదనే లేడు - ఇది మైక్ టెస్టింగు లాంటి రెహార్సల్ మాత్రమే!


మీ ఇంటికి మా ఐల్లెంత దూరమొ మా ఐంటికి మీ ఇల్లంతె దూరము - బుద్ధి గలిగి ఉండు, లొల్లి బెట్టకు!

ఏది ప్రణయ మేది ప్రళయం - ఏది సాధుజీవనవైభవం?

ప్రణయం అంటే మనసుల్ని కలిపేది - హాయి నిస్తుంది,అవునా?
ప్రళయం అంటే తనువుల్ని నలిపేది - చావు తెస్తుంది,అవునా?

ఒకరికి ఒకరై ఒద్దికగా కలిసుంటేనే అది దాంపత్యం,అవునా?
ఎవరికి వారై దారులు వేరైతే బలవంతపు తద్దినం,అవునా?

"జనం కోరింది మనం శాయడమా?మనం చేసింది జనం చూడడమా?" అని పింగళి డింగరి శిస్యుణ్ణి అడిగాడు!
"కోరికల వెంట అడ్డదిడ్డాన పరిగెత్తడమా?కోర్కెలకి కళ్ళెమేసి రహదారిన పోవడమా?"  -  చిచ్చరపిడుగు ప్రశ్న?

శృంగారం రుచిచూపించి బాలచంద్రుణ్ణి తన కడకొంగున కట్టెయ్యడమా?
రసభంగం చేసి తన పతిదేవుణ్ణి హంవీర చూడామణిగా నిలబెట్టడమా?
మగువ మాంచాలకి కలిగిన సందేహానికి కన్నతల్లి చెప్పిన ధర్మసూక్ష్మం -
ఒకటి నీ సౌభాగ్యాన్ని నిలబెడుతుంది, ఒకటి నీ భర్త శౌర్యాన్ని నిలబెడుతుంది,
అయితే ఇట్లాంటివి పరులు నీమీద రుద్దరానివి గనక నీకు నువ్వే తేల్చుకో అని!
మాంచాల రెండవది కోరుకున్నది గనకనే దంపతు లిద్దరూ ధన్యజీవు లయ్యారు,లేకుంటే?!

భర్త సానిని మరిగాడని తనూ తప్పుదారిన నడిస్తే మాంచాలని ఇప్పుడెవరు తలిచేవారు?
మాల కొంపల్లోనూ మహా పతివ్రత లుంటారు రాచ కుటుంబాల్లోనూ రంకులాడు లుంటారు!
సతీత్వం పుట్టుకతో రాదు - ఋణమూలం,నదిమూలం,స్త్రీమూలం ఎప్పుడూ అడగకూడదు.

మనసునూ తనువునూ కలిపి మగనికి అంకితమిచ్చిన మగువ పతివ్రత గాని
మనసును చంపి తనువును పదిమందికి పంచిన మగపోడుముల పడతి కాదు.

మనసు నొకనారికే అంకితమిచ్చి ఆలిని రాణిని చేసినవాడల్లా రాముడు గాని
కులకాంతను కాలదన్ని సానుల కోసం పోయేవాడు అసలు పురుషుడే కాడు.

స్వాధీన మనస్కులు కానివారు కోరికల పద్మవ్యూహంలోకి దూకి క్షేమంగా బయటపడే దెట్లాగ?
హరోంహర యని నైతికపతనపు అగ్గిలో దూకినాక చివరకు మిగిలేది గాలికెగిరే బూదియే కదా!

వస్తువాహనాల్లో వైభవాల్ని లెక్కిస్తే అవి పగిలిపోయినప్పుదు దుఃఖం కలుగుతుంది.
మనుషుల్ని దబ్బుని బట్టికాక దమ్ముని బట్టి తూచినప్పుడు దుఃఖం తొలగుతుంది.
మనసున పుండై పరులకు పండై జలపాతంలా కాక సెలయేరులా బతికేది సాధుజీవనవైభవం!

Tuesday, 9 February 2016

రాష్ట్రం వచ్చెననీ జీహెచ్చెంసీ పీఠం దక్కెననీ సంబరపడగానే సరిపొలేదోయ్!చెప్పినవన్నీ చేసి చూపించి అప్పుడు కాలరెగరెయ్యవోయ్!

          గొప్పగా పరిపాలించి ప్రజల్ని మెప్పించటం ఎన్నికల్లో గెలవటం ఒకటి కాదు.ఎన్నికల్లో గెలవటానికి సంబంధించి సెఫాలజీ అని ఒక సైన్సే ఉంది.దాని ప్రకారం ప్రతి ఎన్నికకీ ఒక స్వింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది.అది 4% ఏ అభ్యర్ధి వైపుకి మొగ్గినా వూహించని ఫలితం వస్తుంది.అన్ని పార్టీలూ మైనారిటీలని బుజ్జగించడం దగ్గిర్నుంచీ తెరాసా బృందమంతా సెటిలర్లని బుజ్జగించడం కోసం పడరాని పాట్లు పడేది ఆ ఉయ్యాల తమవైపుకి వూగి తమని అందలం ఎక్కించే వూపు రావడం కోసమే!అన్ని ఎన్నికల్లోనూ ఇప్పటిలాగా సెటిలర్ల మాదిరి స్వింగ్ స్పష్టంగా ఉండదు,ఒక్కోసారి అప్పటివరకూ స్వింగ్ ఫ్యాక్టర్ అనుకున్నది కాక మరొకటి స్వింగ్ ఫ్యాక్టర్ స్థానంలోకి రావచ్చు,ఎన్నికలకి ఒక్కరోజు ముందు ఈ స్వింగ్ ఫ్యాక్టర్ ఎదురుతన్నినా చాలు అద్భుతమైన తెలివితేటలు చూపించి ఆరునెల్లు ముందునుంచీ ప్లానులేసి చేసిన ప్రయత్నాలన్నీ మట్టిపాలే,రిజల్టు ఢాం తుస్సు మనాల్సిందే:-)


          అందుకే నేను కేటీఆర్ సైలంటుగా పనిచేసి గెలుపు ఖాయం అనిపించుకుంటే కేసీఆర్ వైలెంటుగా పోయి స్వింగుని రివర్స్ చేస్తున్నాడేమోనని కంగారు పడ్డాను.కానీ జనం తెలివి జనం చూపించారు.వాళ్లముందు ఉన్నది ఒకే ఒక ఆప్షన్,తెరాసాని సమర్ధించడం - కేసీఆర్ దాన్నే బలంగా నొక్కి చెప్పాడు!ఒకవేళ పంతానికి పోయి వేరే పార్టీని గెలిపించినా మనోడు గెల్చినవాళ్ళని ఆ పార్టీలో ఉండనివ్వడు గదా:-)గెల్చినోడికల్లా గులాబీ కండువా కప్పేస్తుంటే జనం మళ్ళీ వేరే పార్టీకి వోటెయ్యడం దేనికి:-(కాబట్టి కేసీఆర్ గారికి ఖర్చూ రిస్కూ తగ్గించారు సెటిలర్లు!ఇక ఈ సెటిలర్లు ఆ ముద్ర చెరిపేసుకుని తెలంగాణలో మనస్పూర్తిగా లీనమైపోయి బతకడం బెస్టు!పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి ఎంతకాలం హైదరాబాదులో ఉంటాడు వీళ్లని కాపలా కాయడం కోసం - అందుకే చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా నీరసంగా ఉంది. ఓటుకు నోటు కేసుకి ముందు తేలంగాన అంతా పరవళ్ళు తిరిగినప్పటి ధీమా లేకపోవడం తెలుస్తూనే ఉంది.అయితే రెరాసాతో సహా గుర్తుంచుకోవలసిన విషయం ఈ స్వింగు మహా ప్రమాదకారి.కాబట్టి తెలంగాన సెంటిమెంటు ఎప్పటికీ స్వింఫులా ఉండకపోవచ్చు.తేలంగాణా తెలుగుదేశం కూడా మరీ నీరసించి పోవాల్సిన పని లేదు.కలం గడిచే కొద్దీ ప్రభుత్వ పనితీరు లోని లోపాలు అధికార్ అపక్షానికి ప్రతికూఅల స్వింగుని తయారు చహెస్తాయి - దాని పట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి.కాకపోతే ప్రతీదానికీ బాబు మీదా చినబాబు మీదా ఆధారపదకుండా సొంతంగా నిలబడాలి.నాయకులు ఫ్యాక్తరీలో పుట్టుకురారు గానీ అవస్రమేఅ న్నిట్నీ నేర్పిస్తుంది.తెలంగాణ భాజపా కూడా తెలుగుదేశంతో అంటకాగడం మానేసి సొంత బలాన్ని పెంచుకోవాలి.మిత్రపక్షంగా ఉన్నందువల్ల కేసీఆర్ 667678 పత్ల ఖచ్చితంగా ఉదారంగా ఉంటాడు.ISIS బ్రాంచీలనే తెరిచిన దుస్థితిని ఎదుర్కోవాలంటే భాజపా బలం పెంచుకోక తప్పదు!ప్రస్తుతానికి ఆంధ్రాలో మిత్రపక్షంగా కొనసాగుతున్నందువల్ల ఇక్కడ ఒకరినొకరు విమర్శించుకుంటే ఇద్దరూ లోకవ అయ్యే ప్రమాదం ఉంది గనక మరీ తిట్టుకుని తన్నుకుని విడిపోయే ప్రేయసీప్రియుల మాదిరి ఓవరాక్షన్ చెయ్యకుండా హుందాగా విడిపోయి ఎవరి బలాన్ని వారు పెంచుకుంటే ఇద్దరికీ మంచిది!


          ఇప్పటి వరకూ రాజదానిలో పాగా వెయ్యలేని బెంగ తీరింది గనక తెలంగాణ ముఖ్యమంత్రి ప్రశాంతంగా పని చేసుకోవచ్చు.ఎన్నికల సమయలో తాము వస్తే తెలంగాణకి చేస్తామని చెప్పిన అప్పటి భవిష్యత్ ప్రణాళికల నుంచీ అధికారంలోకి వచ్చాక కూడా తప్పనిసరిగా చేస్తాం అంటూ చాలా ఆశల్ని జనంలో మొలకెత్తించారు.అయిదేళ్ల పాలనాకాలంలో మూడేళ్ళు గడిచిపోయినాయి.ఏ రాజకీయ పార్టీ నాయకుడూ చెప్పని విధంగా నాలుగేళ్ళు తిరిగేసరికి మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తాం,అలా చెయ్యలేకపోతే మిమ్మల్ని వోట్లు అడగం అన్నారు.ఆ మాటని జనం చెక్ చేసుకోవటానికి ఇంకొక్క సంవత్సరమే ఉంది.మామూలు రొడ్డకొట్టుడు వాగ్దానాలని జనం తేలిగ్గానే మర్చిపోయి ఉండేవాళ్ళేమో గానీ ఇది మీరు ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నది గాబట్టి ప్రజలు కూడా గట్టిగానే గుర్తుంచుకుంటారు,ఒకవేళ ప్రజలు మర్చిపోయినా ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తాయి.కొన్ని పనులు మొదలుపెట్టి చాలామటుకు పూర్తి చేశారని వింటున్నాం గానీ మరి కొన్ని అనేకరకాల అడ్దంకుల వల్ల మొదలవుతాయో లేదో తెలియని పరిస్థితి ఉంది - ఈ ఒక్క సంవత్సరంలో ఎన్నింటిని పూర్తి చెయ్యగలరు?

          తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్భాటంగా మొదలుపెట్టి అర్ధాంతరంగా ఆపేసిన చాలా కార్యక్రమాల్లో వాహనాల రీరిజిస్ట్రేషన్ మరియూ కల్తీకల్లు-గుడుంబా లాంటివి అసలు ప్రతిపాదన లోనే ఒక రకమైన తెలివితక్కువతనం ఉండటం వల్ల అభాసుపాలు అయినాయి,కొంచెం లౌక్యం చూపించి ఇతరేతర సాంకేతిక కారణాలు ఏవైనా చెప్పకుండా వాస్తు ప్రస్తావన తీసుకు రావడంతో సెక్రటేరియట్ మార్పు లాంటివి అవహేళనకి గురయ్యాయి,హుస్సేన్ సాగర్ ప్రక్షాళన లాంటివి కోర్టులు అడ్డుపడడం వల్ల ఆగిపోయినాయి.అదొక్కటే కాకుండా చాలా నిర్ణయాలు కోర్టుల వల్లనే ఆగిపోవడంతో ఆంధ్రా హైకోర్టు అనే పల్లవి ఎత్తుకున్నారు.ఇప్పటికే ఈ ఆంధ్ర-తెలంగాణ గొడవల్ని ఉద్యోగవర్గాలకి పాకించి చాలా తప్పు చేశారు.ఈ పాలిటిక్స్ వల్ల తెలంగాణ ఉద్యోగుల పంతీరు ఏమీ మెరుగుపలేదు సరికదా వారూ కొత్తగా నేర్చిన  రాజకీయపు తెలివితో తెలంగాణ ప్రబుత్వానికి కూడా సమస్యగా మారినట్టు కనిపిస్తున్నది.ఇంక ఈ ఆంధ్ర-తెలంగాణ గొడవల్ని న్యాయవ్యవస్థకి కూడా పాకిస్తే తెలంగాణేతరులు న్యాయం కోసం కోర్టులకి వెళ్ళడానికి కూడా భయపడాల్సిన అరిస్థితి దాపురిస్తుంది.ఒకవేళ తెలంగాణ న్యాయ్మూర్తులు అయినప్పటికీ లొసుగులతో ఉన్న చట్టాన్ని "రాష్త్రం మనదే తోసెయ్" అనే లెక్కన ప్రభుత్వానికి అనుకూలంగా ఫిరాయించితే అది ఆ న్యాయమూర్తి వృత్తి జీవితానికి కళంకం కాదా!ఒక రాజకీయ వేత్త తనమీద లక్ష కోట్ల కుంభకోణం తన మీద ఆరోపించబడినా తన పార్టీ మీద పట్టు ఉన్నంతకాలం అతడికి ఏ హానీ జరగదు.ఆ నాయకుడు ఎన్నికల్లో గెలిచి ప్రజాభిమానం ద్వారా తన కళంకాన్ని పోగొట్టుకునే అవ్కాశం ఉంటుంది.న్యాయవ్యవస్థలోని ప్రతి ఒక్కరూ ఇండియన్ బార్ కన్సిల్ అనేదానికి జవాబుదారీగా ఉండాలి.ఒక న్యాయమూర్తి పైన స్వచ్చమైన ప్రాంతీయాభిమానంతోనే అయినా ఒక తప్పులతడక చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా వొదిలెయ్యటానికి సంబంధించి మచ్చ పడితే ఆ న్యాయమూర్తి తన మరకని కడుక్కోగలిగిన అవకాశం ఉందా?లేదు, కనుక తెలంగాణ ముఖ్యమంత్రి మరియూ మంత్రివర్గం కాస్త నిదానించి న్యాయవ్యవస్థని కూడా మితిమీరిన ప్రాంతీయాభిమానంతో భ్రష్టు పట్టించకుండా ఉంటే బాగుంటుంది!చట్టాలు చేసే సమయంలోనే లోపాలు లేకుండా జాగ్రతపడితే కోర్టులు ఎందుకు కొట్టేస్తాయి?ఒకసారి న్యాయవ్యవస్థ మీద ప్రజలకి విశ్వాసం పోతే మళ్ళీ పునరుద్ధరించటం చాలా కష్టం - అది రాజకీయ వ్యవస్థ లాంటి మొండి బంద వ్యవహారం కాదు!అసలు ప్రజలకి న్యాయవ్యవస్థ మీదే విశ్వాసం పోయిన తర్వాత ప్రభుత్వం ఉండి కూడా లేనట్టే!ఎవడు ఏ రకమైన దొంగల దోపిడీ నుంచి అరాచకత్వం వరకు ఏమి చేసినా చెడిపోయిన న్యాయవ్య్వస్థని అడ్డు చేసుకుంటే చాలు ప్రభుత్వం వాడి కాలిగోరుని కూడా పెకలించలేదు - గోటితో పోయేదానికి గొడ్దలి వాని వివేకం తెలంగాణ ప్రభుత్వాని కుండాలి.

          ఈ లోపాలు సవరించుకోకుండా సమర్ధవంతమైన పరిపాలనను ప్రజలకు అందించడం అసంభవం.కాబట్టి ప్రభుత్వపక్షం ఎక్కువకాలం గాలిలో తేలిపోకుండా తొందరగా నేలమీదకి రావాలి.సెటిలర్లు బుట్టలో పడిపోయి వోటు వెయడం వరకు బాగానే ఉంది,కానీ ఉద్యమ కాలంలో మీరేమి చెప్పారో గుర్తుందా?మన ఉద్యోగాలు ఆంధ్రోళ్ళు లాక్కున్నారు,వాళ్ళని వెళ్లగొట్టేస్తే చాలు ఆఉద్యోగాలన్నీ మీకు వస్తాయి అన్నారు - అనలేదంటే చెయ్యగలిగింది లేదు.మరి ఇప్పుడు వీళ్లందర్నీ ఆంధ్రాకి వెళ్లగొట్టకుండా తెలంగాణ ప్రజలకి ఉద్యోగాలు చూపించాలి.ఉపాధి కల్పనా రంగాన్ని వీళ్ళందరికీ అవకాశాల్ని కల్పించేటంతగా విస్తరించాలి,లేని పక్షంలో గంప లాభం చిల్లి తీసినట్టు తెలంగాణ జనం మీకు పెద్ద బొక్క చూపిస్తారు.

తెలంగాణ ప్రాధమికంగా ఓక భౌగోళిక నామం,అంతిమంగా ఒక సాంస్కృతిక రాజకీయ వారసత్వం

Friday, 5 February 2016

చచ్చిపోయినవాడు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను మొర్రో అని రాసిపెట్టినా ఇంకా అది హత్య అనీ హంతకుల్ని శిక్షించాలనీ అంటున్నారు - వీళ్ళకేం పిచ్చా వెర్రా:-)

     "ఒక్కడు కొట్టుకుంటే మూర్చ,ఇద్దరు కొట్టుకుంటే కుస్తీ,ముగ్గురు కొట్టుకుంటే మస్తీ,పదిమంది కొట్టుకుంటే దొమ్మీ - మరి ఒక్కడు వందమందిని కొట్టితే ఏమవుద్దిరా" అన్న చెత్తమాటని పంచ్ దయలాగుగా వెండితెరమీద ఎవడైనా హెరో వేషగాడు వేస్తే నువ్వు వాడి ఫ్యానయితే ఎగిరెగిరి గంతులేస్తావు ఈల వేస్తావు, అలా కాక ఆ వేషగాడు నీ అభిమాన హీరో కాకపోతే కిందపడి గిలగిలా కొట్టుకుంటావు గోల చేస్తావు.కానీ ఇదేంటి, యూనివర్శిటీ లెవెల్లోకి వచ్చేసరికి టీనేజి లవ్వులు పోయి ఒంట్లో కొవ్వు పెరిగేసరికి పోటుగాళ్ళ మాదిరి భావి భారత సమాజం మనకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నదనే కొత్త పిచ్చి తగులుకుని అందులో ఎవడికి నచ్చిన గ్రూపులో వాడు చేరి బయటకెళ్ళాక ఎటూ ఇవన్నీ వేస్ట్ అని తెలుస్తుంది గానీ ఇప్పటి మత్తులో మాత్రం కిందామీదా తెలియకుండా తన్నుకునే కుర్రసన్నాసుల గొడవని దేశం మొత్తానికి అంటిస్తున్నారు పనిలేక పిల్లితల గొరిగే కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ?
      చూట్టానికి బావున్నాడు,చచ్చిపోయాడనగానే ఎవరికయినా బాధ కలిగించేట్టు ఉన్నాడు.అంటే చూట్టానికి బాగోకపోతే నీకు జాలి పుట్టదా యేంటి అని మీరడగొచ్చు.కానీ జనాలు ఫీలవడంలో ఆ తేడా అప్పుడప్పుడూ ఉంటుంది.జనంలో చూపులకి బావుండటమే అందం అనుకునే ధోరణి ఎక్కువ గనక బావుండని వాడు పోతే "ఇంత అనాకారిగా ఉన్నాడు,వీడు పోయినంతలో అందగాళ్ళకి కొదవేం రాలేదులే!" అనీ బావున్నవాడు చచ్చిపోతే "ఎంత బావున్నాడో,అక్కడొకడూ ఇక్కడొకడూ అన్నట్టున్న అందగాళ్ళలో ఒకడు తగ్గాడు గదా!" అనీ అనిపించటం సహజం.

      మొదట ఈ ఆత్మహత్య వ్యవహారంలో ఇతని కులం ప్రస్తావన ఎందుకొచ్చిందో చూద్దాం.ఆత్మహత్య తనెందుకు చేసుకుంటున్నాడో స్పష్టంగా తేల్చి చెప్పకపోయినా తన ఉత్తరం ద్వారా తనని ఎవరూ భయపెట్టలేదనీ ఆత్మహత్యకు ప్రేరేపించలేదనీ స్పష్టంగా తేల్చి చెప్పాడు.ఇప్పుడు వీళ్ళు దానికి బాధ్యులైన వారిని హంతకులుగా నమోదు చేసి శిక్షించమంటున్నారు.అలా చెయ్యాలంటే నిర్భయ చట్టంలో స్త్రీ మీద జరిగిన అత్యాచారం అనే క్యాటగిరీని తీసుకున్నట్టు ఒక దళితుణ్ణి భౌతికంగా ఏమీ చెయ్యకపోయినా మానసికంగా వేదనకి గురి చేసి అతని చావుకి కారణమయ్యారు అనే కోణంలో తప్ప ఇతరుల్ని నిందితులుగా నమోదు చెయ్యటం కుదరదు - అది ఖాయం!ఆ ఉత్తరంలో ఎవరి పేరునయినా ప్రస్తావించి ఉంటే అప్పుడు వాళ్ళని అరెస్టు చెయ్యొచ్చు.తల్లి పరంగా కులాన్ని అన్వయించి సర్టిఫికెట్ తీసుకున్నా ఇప్పుడు ప్రభుత్వాధికారులు అది సరయినది కాదనీ అలా ఇచ్చిన అధికార్లని విచారించి చర్యలు తీసుకోవాలనీ ప్రయత్నిస్తున్నట్టు వింటున్నాం.మామూలు పరిస్థితుల్లో అయితే కులనిర్ధారణకు తండ్రినే చట్టాలు ప్రామాణికంగా తీసుకుంటాయి - ఇప్పటికిప్పుడు మారిస్తే తప్ప!

      2016 జనవరి 30వ తేదీకి వేముల రోహిత్ చక్రవర్తి 27వ సంవత్సరం లోకి అడుగుపెట్టి ఉండేవాడు!కానీ గత జులై నెల నుంచీ అతనికి రావలసిన నెలవారీ స్టెయిఫండ్ 28,000 రాకపోవదం వల్ల జనవరి 17కు ఒక రోజు ముందు స్నేహితులతో నా పుట్టిన రోజుకి మీకు చిన్న ట్రీట్ కూడా ఇవ్వలేను అని చెప్పిన కొద్ది గంటల్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు.పోలీసులకి దొరికిన ఆఖరి ఉత్తరం ఒక మహాకవి రాసిన విషాదకావ్యంలా ఉంది!కొంత కవిత్వం కొంత పశ్చాత్తాపం కలిసి ఉంది - ఆఖర్లో స్టెయిఫండ్ వచ్చాక ఇంటికి పంపించాల్సిన డబ్బుల గురించీ స్నేహితుడు రాంజీకి తీర్చాల్సిన అప్పు గురించీ చెప్పే భాగం తప్ప!తండ్రి యేమో మా అబ్బాయి చాలా తెలివైన వాడు, ర్యాంక్ హొల్దర్! దళితుడని చెప్పుకుని రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగం తెచ్చుకోవాల్సిన ఖర్మ పట్ట లేదు అంటూ కులం మార్చినందుకు కొంత వ్యతిరేకంగా ఉన్నట్టు కనబడుతుంది.మావాడు చాలా ధైర్యస్థుడు,ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదు,విచారణ జరిపించాలి అంటున్నాడు.బహుశా ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా భ్రమింప జేస్తున్నారనే అనుమానం అతని మాటల్లో కనిపిస్తున్నది.ఏమో, ఎజెండాల కోసం  గెలుపు కోసం, అహాలు చల్లార్చుకోవటం కోసం, సంచలనం కోసం, ఫోకస్ కోసం పరమ క్రూరమైన రాజకీయాలు నడుసున్న ఈ కాలంలో ఏదయినా జరగొచ్చు!తండ్రి ఒక హాస్పిటల్ ఆవరణలో గార్దు.తల్లి టైలర్ అని చదివినట్టు గుర్తు - కాబట్టి పెద్దగా ఆదాయం ఉన్న కుటుంబం కాదు గనక నా వరకు నేను దళిత ముద్ర వేసుకుని స్టెయుఫండ్ తీసుకోవటం గురించి తప్పు పట్టలేను.జగన్ లాంటి వాళ్ళు నొక్కేస్తున్న కోట్లతోనూ 2జీ,3జీ,4జీ స్కాములతోనూ పోలిస్తే అది పెద్ద నేరమా!కానీ ఇతను తన బాల్యం గురించి "My birth is my fatal accident. I can never recover from my childhood loneliness. The unappreciated child from my past." అని మరీ నిర్వేదంగా అంటున్నాడంటే తలిదండ్రులు విడిపోవటం ద్వారా కలిగే మామూలు ఒంటరితనం కన్నా మరింత భయంకరమైన ఒంటరితనాన్ని దేన్నయినా అనుభవించాడా!

      మంచి మార్కులతో ప్యాసయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యామసులో సైన్సు స్టూడెంటుగా అడుగుపెట్టి తర్వాత ఆర్ట్స్ గ్రూపుకి మారిన రోహిత్ మొట్టమొదటి స్టూడెంట్ ఎన్నికల్లో ఏబీవీపెకి వోటు వేశాడట!అంటే, అప్పటివరకు చదువు తప్ప మరో సంగతి పట్టించుకోనివాడు అతి తక్కువ కాలంలో మొదట SFIలో ఉత్సాహంగా పాల్గొని తర్వాత ASAలోకి మారి అక్కడ కూడా మరింత నాయకత్వ లక్షణాలతో ఒక వెలుగు వెలిగి చివరాఖరికి ఎంత హఠాత్తుగా ఈ రాజకీయ ఉద్యమాల ప్రభావానికి గురయ్యాడో అంతటి అనూహ్యమైన నాటకీయ శైలిలో I feel a growing gap between my soul and my body. And I have become a monster. అనే అవగాహనకి వచ్చి బీజప్రాయంగా తను రాక్షసంగా మారడం పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ అస్తమించడం అనే సంక్లిష్టతని అర్ధం చేసుకోవాలంటే మొత్తం అతని ప్రవర్తనని ఆది నుంచీ అంతం వరకూ పరిశీలించాలి!

      తొలిసారి అమాయకంగా ఏబీవీపీకి వోటు వేసిన నాటి నుంచీ ఆఖరి రోజు వరకూ నడిచిన ఆరు సంవత్సరాల జీవితంలో ఎంతో నాటకీయత ఉంది.అన్ని దశల్లోనూ అతనిలో విశిష్టంగా కనిపించేది భావ వ్యక్తీకరణలో అతని కున్న అద్భుతమైన ప్రతిభ - తెలుగుని ఎంతగానో ఇష్తపడిన ఇతనికి భాష మీద ఉన్న పట్టు!తెలుగునే కాదు ఇంగ్లీషుని ఉపయోగించినా భావ వ్యక్తీకరణ సామర్ధ్యమే అతన్ని అతి తక్కువ కాలంలో అగ్రగణ్యుణ్ణి చేసింది.ఆ రకంగా చూస్తే ఇదే యూనివర్సిటీలో ఇంతకుముందు జరిగిన అన్ని ఆత్మహత్యల కన్నా అన్ని విద్యాసంస్థలలో కలుపుకుని ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఆత్మహత్యల కన్నా ఇతని ఆత్మహత్య నిజంగా ప్రత్యేకమైనదే!దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి గనక, ఇప్పటికైనా క్రియాశీలంగా ఈ రకమైన ఆత్మహత్యల పరంపరని ఆపడానికి ప్రయత్నం జరిగి తీరాలనే గట్టి పట్టుదలతో ఉన్నాను గనక ఈ పోష్టు చాలా పెద్దగా ఉండవచ్చు.ఆసక్తిని కలిగించడానికి నేను మామూలుగా వేసే చెణుకులు కూడా ఉంకపోవచ్చు,అయినా కొంచెం ఓపిక చేసుకుని చదువుతారని ఆశిస్తున్నాను.అంత ఓపిక లేనివారు ఇక్కడితో చదవడం ఆపెయ్యవచ్చు - నాకు ఎంతమాత్రం అభ్యంతరం లేదు అనగా నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్:-)

      ఇంతకు ముందు ఇతను చదివిన కొడిగెనహళ్ళి లోని ఆంధ్రప్రదేశ్ జూనియర్ రెసిడెన్షియల్ కాలెజిలో ఇప్పుడు  ప్రిన్సిపాల్  అయిన బి.కొండయ్య గారు 2004లో రోహిత్ అక్కద విద్యార్ధిగా ఉన్నప్పుడు లెక్చరర్ ఉద్యోగంలో ఉండేవారు.ఆయన రోహిత్ గురించి "అతను చాలా చురుకైన విద్యార్ధి.ఈ కాలేజిలో ప్రవేశం అంత సులభం కాదు,ఎందుకంటే మేము కేవలం పల్లెటూళ్లలో ఉన్న తెలివైన పిల్లల్ని మాత్రమే ఎంచుకుని ఎంట్రన్సు టెస్టు పెట్టి తీసుకుంటాం.అప్పట్లో రాజకీయాల గొడవ లేకుండా అందరితోనూ స్నేహంగా ఉండేవాడు." అని చెప్తున్నారు.ఇంక అతను ప్లస్ టూ లో 521/600 మార్కులు సాధించి 86% దగ్గిర నిలబడటం గురించి కూడా గుర్తు తెచ్చుకున్నారు.రోహిత్ అక్కడ BiPC చదివాడు.అతని కెమిస్ట్రీ లెక్చరర్ జె.వి.కృష్ణయ్య గారు మెయిన్ సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే గాకుండా ఇంగ్లీషులో మంచి మార్కులూ తెలుగులో ఇంకా ఎక్కువ మార్కులూ తెచ్చుకున్నట్టు చెప్తున్నారు.సహజంగా అందరూ చేసేది ఏంటంటే ర్యాంకులు వాటిల్లోనే వస్తాయి గాబట్టి మెయిన్ సబ్జెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ర్యాంకులు కలవడంలో ప్రాధాన్యత లేకపోవటంతో లాంగ్వేజి సబ్జెక్టుల్ని పెద్దగా పట్టించుకోరు - ఇతనిలాంటి నాలాంటి కొద్దిమంది తప్ప:-)

      హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా రోహిత్ సహ విద్యార్ధిగా ఉండి ఆఖరి ఉత్తరంలో కూడా ప్రస్తావించబడిన అప్పటి సహ విద్యార్ధి రాంజీ చింతగడ "ఆ రోజుల్లో రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది కాదు.సైన్సు సహాయంతో ప్రపంచాన్ని మార్చడం గురించి ఎక్కువగా ఆలోచించేవాడు,ఒకరకంగా అప్పట్లో అతనొక టెక్నోక్రాట్" అని గుర్తు చేసుకున్నాడు.తనకి రావలసిన డబ్బు గురించిన ప్రస్తావనలో రాంజీ "40,000 రూపాయలు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడో నాకే అర్ధం కావట్లేదు.ఇచ్చేటప్పుడు నేను లెఖ్ఖ పెట్టుకోలేదు - అడిగినప్పుడల్లా 5000 గానీ 8000 గానీ ఇవ్వడమే తప్ప!" అంటున్నాడు.రవితేజ దొనేపూడి అనే హైదరాబాద్ యూనివర్సిటీ SFI శాఖకి మాజీ అద్యక్షుడు 2009లో జరిగిన వాళ్ళ మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ తొలి ఎన్నికల్లో అప్పటికి ABVPకీ SFIకీ మధ్య తేడా ఏమిటో తెలియకపోవటం వల్లనే రోహిత్ ABVPకి వోటు వేశాడని చెప్తున్నాడు.ఇతను కూడా రోహిత్ మాదిరిగానే సైన్సులో మాస్టర్స్ డిగ్రీ కోసం తనతో పాటు అదే సంవత్సరంలో జాయినయ్యాడు.రవితేజ "సైన్సు డిపార్టుమెంటులో ABVP ప్రభావం ఎక్కువగా ఉండటంతో స్నేహితులు చెప్పారు గాబట్టి వేసేశాడు" అంటున్నాడు. ఈ తొలినాటి రోజుల్లో అతను రాజకీయాల కన్నా సైన్సు గురించే ఎక్కువగా ఆలోచించేవాడట.రవితేజ "యూనివర్సిటీ క్యాంపసులో డస్ట్ బిన్స్ తగినన్ని లేకపోవటం గురించీ పరిశుభ్రత గురించీ ఎక్కువగా మాట్లాదేవాడు.ఒకసారి నన్ను కలిసినప్పుదు తెలుగులో ఒక సైన్సు మ్యాగజైన్ పెట్టి సైన్సు గురించి ప్రచారం చెయ్యాలనే ఐడియా ఉన్నట్టు చెప్పాడు." అని చెప్పటాన్ని బట్టి మొదట్లో అతనికి రాజకీయాల కన్నా సైంటిఫిక్ విషయాల పట్లనే ఆసక్తి ఎక్కువని తెలుస్తుంది.జులై 22,2010 నాటి తన ముఖపుస్తకం మీద "Me joined in hyd central uni. the environment here is fantastic………nice people around………feeling quiet (quite) happy………seeking for some good friends here." అని రాశాడు!

          ఇతనితో పాటు సస్పెండయిన అయిదుగురిలో ఒకతను సుంకన్న వేల్పుల.అతను "నాకు ఈ పుస్తకం ఆ పుస్తకం అని తేడా లేదు ఏది దొరికినా చదువుతాను" అని రోహిత్ అన్నట్టు గుర్తు చేసుకున్నాడు.అలా అతను చదివిన వాటిల్లో ముఖ్యమైనవి బి.ఆర్.అంబేద్కర్ రచనలు,కార్ల్ మార్క్స్ రచనలు!

      2011 నాటికి 22 సంవత్సరాల రోహిత్ కొత్తగా పరిచయమైన భావజాలం అతన్ని ఆకర్షించడమే కాక్ నిష్క్రియాత్మకంగా ఉండనివ్వకపోవటంతో స్టూదెంట్ పాలిటిక్సులోకి ప్రవేశించాడు.అందుకోసం తన Ph.D సబ్జెక్టుని కూడా మార్చుకున్నాడు.జీవశాస్త్ర పరిశోధకుడిగా పేరు తెచ్చుకోవాలనుకున్న రోహిత్ మారిన రాజకీయ దృక్పధం వల్ల రోజంతా ప్రయోగశాలాలో గడపటానికి ఇష్టపడక సోషల్ డిపార్టుమెంటుకి మారాడు.2012లో రోహిత్ SFIలో చేరాడు,కాలేజి రోజుల నాటి పాత మిత్రుడు రాంజీ అప్పటికే అందులో ఉన్నాడు.SFI సభ్యుడైన శేఖర్ "ఆ సంవత్సరమే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడు.జీవితంలో కేవలం చదువుకోవటం కన్నా చెయ్యాల్సిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి అంటుండేవాడు.2012లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా అతన్ని ప్రభావితం చేసినాయి" అంటున్నాడు.డిసెంబర్ 16న న్యూడిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ గురించి "A nation where 545 elected members (with 33% women candidates) failed to take a stand on the side of a girl child…… A nation where politicians behave as elected brokers, where no one does any work without a commission…. A nation where students feel shy, timid and embraced (embarrassed) of raising their voice against an odd thing….. A nation where educated intellectuals run for money like machines…… In a nation like our’s, death could be the only thing which can rescue us …." అని ప్రతిస్పందించాడు!

      రోహిత్ స్నేహితుల్లో ఒకడైన విజయ్ "ఒకసారి తనకి చిన్నప్పటినుంచీ కమ్యునిష్టులంటే అభిమానమని చెప్పాడు.వాళ్ళ వూళ్ళో అతని ఇంటికి దగ్గిర్లోనే CPI ఆఫీసు ఉండేదట.తరచుగా వాళ్ళ ప్రసంగాలు వినటం వల్లనే అతను కమ్యునిజాన్ని ఇష్టపడి SFIలో చేరానని అన్నాడు" అని చెప్తున్నాడు.కాబట్టి రోహిత్ అత్మహత్యని హత్యగా మలిచి హంతకుల్ని శిక్షించాలి అని ఉద్యమం చేసేవాళ్ళు అతని హంతకుల లిస్టుని అతని చిన్నప్పుడు అక్కడ ప్రసంగాలు దంచిన CPI నాయకుల నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది!

      ASA సభ్యుడైన జమీర్ "రోహిత్ SFIలో చేరినప్పుడు పెద్ద ప్రత్యేకంగా కనపడలేదు,కానీ ఇంగ్లీషులో,ముఖ్యంగా మాటల పొందికలో మంచి ప్రతిభ చూపించేవాడు - అతను డిజైన్ చేసిన పోస్టర్లలో మాటలు తక్కువగా ఉన్నా ఎఫెక్టు చాలా గొప్పగా ఉండేది.దానితో అతి తక్కువ కాలంలో SFIలో పాప్యులర్ అయిపోయాడు" అంటున్నాడు.2013లో యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యం.వెంకటేష్ అనే విద్యార్ధి ఆత్మహత్య చాలామందిని కదిలించింది."దానికి వ్యతిరేకంగా SFI,ASAలు సంయుక్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో రోహిత్ కూడా పాల్గొన్నాడు.ఆ తరవాత రెండు ఎన్నికల్లో SFI తరపున ప్రచారం చేసినా 2014 నాటికి ASA వైపుకి జరిగాం నేనూ రొహిత్.అయితే SFI పట్ల మాకున్న అభిప్రాయాల్లో చాలా తేడా ఉంది.నాకేమో వాళ్లది కేవలం మానిప్యులేషన్ మాత్రమే అనిపించేది.రోహిత్ మాత్రం SFI వాళ్లతో చాలా సుదీర్ఘంగా కులాన్ని పట్టించుకోకుండా వర్గాన్ని మాత్రమే పట్టుకు వేలాడటం గురించి వాదించేవాడు" అని రాంజీ అంటున్నాడు.

      నిజమే, పిచ్చి కుదిరితే గానీ పెళ్ళీ కుదరదు పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదన్నట్టు మురమ్నా ఏమో "బుద్ధుడూ చాలడు, అంబేద్కరుడూ పనికిరాడు, మార్క్సు మాత్రమే సమర్ధుడు" అంటుంది,ఐలయ్య ఏమో "కమ్యునిష్టులు గొప్పకి పోకుండా అంబేద్కర్ ప్రవచనాల్ని ఒప్పుకుని ఎన్నికల్ని సీరియస్సుగా తీసుకుని సిగ్గు పడకుండా కులసమీకరణల్ని వాడుకుని ఎట్లాగోట్లా ముందు జాతీయ స్థాయిలో అధికారం తెచ్చుకుని అప్పుడు పైనుంచి కమ్యునిజాన్ని రుద్దవచ్చు కదా" అని ఉభయచర కమ్యునిష్టులకి ఉబోస లిస్తున్నాడు.వర్గాన్ని వదిలేస్తే ఆ సిద్ధాంతం పిడకలేరుకోవటానికి కూడా పనికిరాదాయె మరి!సాయుధ పోరాటం కాన్సెప్టు వదిలేస్తే పిల్లులు కూడా భౌ భౌ మని మొరుగుతాయి వాళ్ళని చూస్తే,ఇంకెష్లా:-)వాళ్ళు వర్గాన్ని వదిలేసి కులాన్ని కావిలించుకోరు వీళ్ళు కులాన్ని వదిలేసి వర్గాన్ని కావిలించుకోరు.ఇద్దరిలో ఎవరో ఒకరు తమ మూర్ఖత్వాన్ని తగ్గించుకుని ఇద్దరూ కలిసి ప్రయత్నించనంత కాలం కులదోపిడీ,వర్గదోపిడీ రెంటిలో ఏదీ పోదు - మీకు నమ్మకం లేకపోతే నేను స్టాంపు పేపరు మీద రాసిమ్మన్నా రాసిస్తా!

      రోహిత్ ASAలో చేరడం వాళ్లకి ఒక సహజ నాయకత్వం వికసించిన మేధావిని సమకూర్చి పెట్టింది!"ASAకి అతను తెచ్చిన గొప్ప ఆయుధం ఇంగ్లీషు.అతను చేరక ముందు తెలుగుకి మాత్రమే పరిమితమైన ASA రోహిత్ అలవాటు చేసిన ఇంగ్లీషుతో మంచి వూపు తెచ్చుకుంది" అని ఉమామహేశ్వర్ అంటున్నాడు.ఇతనికే రోహిత్ అతని రూములో ఆత్మహత్య చేసుకుని ఆఖరి ఉత్తరంలో క్షమాపణ చెప్పింది."కమ్యునిష్తు సిద్ధాంతంలో దొరకని సాంత్వన అతనికి అంబేద్కర్ బొధనల్లో లభించింది.కమ్యునిష్టులు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా కనీసం క్యాంపస్ వరకూ అయినా కులాన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా మొత్తానికి తిరస్కరించడంతో దళితులు ఎందుకు అణిచివేయబడ్డారు,కులనిర్మూలన ఎందుకు అవసరం అనే విషయాలకి సంబంధించి పూర్తిగా అంబేద్కర్ మార్గమే సరైనదని అతనికి అనిపించింది" అని అంటున్నాడు సుంకన్న.ఈ రకమైన అవగాహనతో అప్పటి నుంచి అతనొక సహజ కవచ కుందల శోభితుడిన వీరయోధుడిలా మారిపోయాడు.ఇతనితో పాటు సస్పెండ్ అయినవారిలో ఒకడైన విజయ్ "పోట్లాట అంటూ వస్తే ఏమాత్రం వెనక్కి తగ్గేవాడు కాదు,అది ఒకరకంగా బలహీనతగా కూడా తయారై ఉండవచ్చు.చిన్న చిన్న విషయాలకి కూదా ఆవేశం తెచ్చుకునే వాడు" అని అంటున్నాడు.రోహిత్ తన ముఖపుస్తకం మీద తన గురించి తను "A small time sociology student, with uncontrollable reactive reflexes :)" అని వర్ణించుకున్నాడు!

      కాబట్టి అతని హంతకుల లిస్టులో ప్రముఖ ముద్దాయిలుగా అంబేద్కర్ గారినీ కారల్ మార్క్సు గారినీ కూడా చేర్చాలి.ఇంకా గతంలో అతనితో పోట్లాడి అతనిలో పోట్లాడటాన్ని ఒక బలహీనతగా మార్చిన ప్రతి ఒక్కడినీ హంతకుల లిస్టులో చేర్చాలి.పైగా అతను నిర్భయ ఉదంతం జరిగిన సందర్భంలో వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం వారు వీరని తేడా లేకుండా ఒక్కణ్ణి కూడా మినహాయించకుండా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న ఈ దేశంలోని రాజకీయ నాయకు లందర్నీ హంతకుల లిస్టు లోకి ఎక్కించి వురి తియ్యాలి!

          "అంబేద్కర్ గురించయినా పూలే గురించయినా చర్చకి దిగితే తనే గెలుస్తానని గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు రోహిత్.ఎవరయినా అతనితో చర్చ మొదలుపెదితే ఆపడం కష్టం - ఒక్కోసారి కోపం కూడా వచ్చేది" అంటున్నాడు విజయ్.శేషయ్య "మేమూ ఇంగ్లీషు మాట్లాదతాం.కానీ రోహిత్ ఇంగ్లీషు లెవెల్ చాలా పెద్దది!ఆఖరి ఉత్తరాన్ని చూడండి ఎంత గొప్పగా రాశాడో, అతని రచనలతో ASAని కొత్త ఎత్తులకి ఎక్కించాడు" అని అంటున్నాడు.అతని రచనా వ్యాసంగం విస్తరించిన మరొక రంగస్థలం ముఖపుస్తకం.అక్కడ తనకి ఎక్కువగా నచ్చిన కొటేషన్లలో "Never be a spectator of unfairness or stupidity. Seek out argument and disputation for their own sake; the grave will supply plenty of time for silence…." అనే కొటేషన్ అతనికి నచ్చిందని చెప్పాడట!

          చిన్నతనం నుంచీ జీవశాస్త్ర పరిశోధకుడు అవ్వాలనే కలలతో పెరిగి యూనివర్సిటెకి వచ్చేవరకూ క్లాసు పుస్తకాలు తప్ప ఇతరాలు ముట్టుకోకుండా ర్యాంకులు తెచ్చుకుని యూనివర్సిటెకి అడుగుపెట్టి అక్కడ పరిచయమైన కొత్త భావజాలం ప్రభావానికి గురయి సంటిస్టు కావడం కన్నా ఇతరమైన ఘనకార్యాలు చేయడం గొప్ప అనుకుని కొంచెం అరిందాతనం వచ్చేసరికి దానితోనే ఉబ్బితబ్బిబ్బైపోయి తానొక్కడే ఈ పద్మవ్యూహాన్ని చేదించి విజయవంతంగా బయటకు రాగలనని భ్రమపడి మితిమీరిన ఆవేశంతో ముందుకు దూకి ఆఖరి నిమిషంలో అది పద్మవ్యూహం కాదనీ నైరాశ్యపు చలిగుబుళ్ళు ఈచుకున్న ఒక నైరూప్య చిత్రమనే కఠినసత్యం బోధపడి అస్మదీయుడి వలె కనిపిస్తూ చాటుదెబ్బలు కొట్టగలిగిన పొంచి ఉన్న రాహువు వంటి అసలైన ఆజ్ఞాతశత్రువు బలమెంతో తెలిసి నిశ్చేష్టుడై ఒక అప్రస్తుతవీరవరేణ్యుడు చేసిన ఆయుధవిసర్జన - రోహిత్ ఆత్మహత్య!

            SFIలో ఉన్నప్పుడూ ASAలో ఉన్నప్పుడూ బహిరంగ ముద్దులు,బీఫ్ ఫెస్టివల్స్,మెమన్ ఉరితీతకు వ్యతిరేకంగా చేసిన ప్రదర్సనలు లాంటి ఎన్నో సంచలనాత్మకమైన కార్యక్రమాలలో ఏమాత్రం సంకోచం లేకుండా పాల్గొన్నాడు.ASAలోకి వచ్చాక హిందూత్వ భావజాలాన్ని సంస్కరణ శీలమైన వివేకానందుడి బోధనలతో సహా ఉతికి ఆరేస్తూ ముఖపుస్తకంలో తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు,ఆఖరికి చిన్నప్పుడు ప్రసంగాలు విని ఇష్టపడ్డానని చెప్పుకున్న కమ్యునిష్టుల్ని కూడా వదలకుండా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ ఆగ్రహం వెళ్ళగక్కాడు - అయినా ఆనాడెవరూ అతని మీద దాడి చేసి ఉరికి ప్రేరేపించ లేదు.పైగా ఐతనే ABVP వాళ్ళ బ్యానర్లు చింపి పోగులు పెట్టి "కాషాయ రంగు కనపడింది,కోపమొచ్చింది - చింపాను" అని వాళ్లతోనే వాగ్యుద్ధానికి దిగి నదురూ బెదురూ లేకుండా మాట్లాడాడు.ఇవ్వాళ యూనివర్సిటీలో బలంగా ఉన్న ఇంకో విద్యార్ధి సంస్థ   ABVPకి చెందిన నాయకుడితో అతని రూముకే వెళ్ళి బలవంతంగా క్షమాపణ పత్రం రాయించుకోగలిగాడు.శిక్షపడినప్పుడు వైస్ చాన్సలర్ దగ్గిర కెళ్ళి బతిమలాడుకోలేదు.పైన, వైస్ చాన్సలర్ గార్కి రాసిన ఉత్తరంలో కూడా దళిత విద్యార్ధులకు ఉరితాళ్ళు,విషం,కారుణ్యమరణం కానుకలుగా ఐవ్వండి అని వ్యంగ్యాలు విసిరాడే తప్ప రాజీ కోసం ఆలోచించి వెనకడుగు వెయ్యలేదు.మరి అప్పటి వరకు అంత ధైర్యంగా ఉన్నవాడు అంత హఠాత్తుగా పశ్చాత్తాపంతో రగిలిపోతూ ప్రపంచం నుంచి ఎందుకు నిష్క్రమించాడు?

          ఆ దురదృష్టకరమైన రోజున ఆత్మహత్య చేసుకుని ఈరోజు అందరి సానుభూతినీ పొందుతున్నాడు గానీ 2016 జనవరి 18న హైకోర్టుకు హాజరయ్యేందుకు సమన్లు అందుకుని ఉన్నాడు.ఆ కేసు పూర్తిగా తనకి ప్రతికూలమైనదే,నిర్దోషిగా బయటపడే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే అతనితో పాటు 5గురు విద్యార్ధుల్ని యూనివర్సిటీ ప్రోక్టొరల్ కమిటీ సస్పెండ్ చేసింది కూడా అతను మరొక విద్యార్ధి సంస్థ అయిన ABVPలో సభ్యుడైన సుశీల్ కుమార్ రూముకే వెళ్ళి భౌతికదాడి చేశారని నిర్ధారించుకోవటం వల్లనే!దాని మూలం తెలియాలంటే యాకూబ్ మెమన్ ఉరి కరెక్టా కాదా అని తేల్చుకోవాలి.అప్పటి వరకు ఒక సామాజిక సిద్ధాంతానికి కట్టుబడి అంబేద్కర్ మార్గంలో పోరాడుతున్న వీరకిశోరంలా కనబడిన రోహిత్ అప్పటి నుండి ఒక టెర్రరిస్టును సమర్ధించటానికి "ఒక వీరుడు మరణిస్తే వేలాదిమంది ప్రభవింతురు" అని భగత్ సింగు లాంటివాళ్ళకి వాడాల్సిన గొప్ప వాక్యాన్ని అధమాధమ స్థాయికి దిగజార్చిన తన వైఖరిని నైతికంగా సమర్ధించుకోలేక తప్పు మీద తప్పు చేస్తూ నడిచి  ఆఖరి క్షణాల్లో ఒకనాడు రాంజీకి SFI గురించి బోధపడిన "ఇదంతా మానిప్యులేషన్ మాత్రమే" అన్న సత్యమే తనకూ ASA గురించి బోధపడినందువల్ల కాళ్లకింది భూమి కదిలిపోయి ఆ భూకంపం ధాటికి తట్టుకోలేక తనను తనే అంతం చేసుకున్నాడు గనక అక్కడి నుంచి మొదలుపెడితే అతని వివేకభ్రష్టత్వం పూర్తిగా గోచరిస్తుంది.

          బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహించటం లాంటి చెత్తపనులకు ఎక్కువసేపు ల్యాబరేటరీలో గడపాల్సిన సైన్సు గ్రూపును వదిలి ఆర్ట్స్ గ్రూపుకి మారడమే అతని మొదటి తప్పు!అయినా యాకూబ్ మెమన్ ఉరితీతకు తెలిపిన నిరసనకు ముందరి కార్యక్రమాలకి సమర్ధించుకోవడానికి ఎంతో కొంత సబబైన కారణాలు ఉంటే ఉండవచ్చు గానీ యాకూబ్ మెమన్ ఉరికి ప్రతీకారంగా ప్రతి ఇంటి నుంచీ ఒక యాకూబ్ మెమన్ లాంటి ఉగ్రవాదిని పుట్టించమని విజ్ఞప్తి చెయ్యడం మాత్రం సమర్ధనీయం కాదు.1993లో జరిగిన పేలుళ్ళకి 2015లో శిక్ష పడింది - అంత సుదీర్ఘకాలం పాటు ఈ దేశపు సర్వోన్నత న్యాయస్థానం అన్ని రకాల సాక్ష్యాధారాల్నీ పరిశీలించి అంబేద్కర్ రచించిన రాజ్యాగం ప్రకారమే విధించిన శిక్షని వ్యతిరేకించినవాళ్ళు అంబేద్కర్ వాదులు ఎట్లా అవుతారు?అతడేదో అమాయక బీద ముస్లిం అయినట్టూ దేశంలో ఉన్న బ్రాహ్మణులంతా కత్తులు తీసుకుని అతని కుత్తుకని కోసినట్టూ అల్లల్లాడిపోతూ తాటిచెట్టెందుకు ఎక్కావంటే దూడగడ్డి కొసమన్నట్టు ఇప్పటి వరకూ ఉరి తియ్యబడిన వాళ్ళలో ఎక్కువమంది దళితులు గనక గతంలోని ఉరిశిక్షల్ని వ్యతిరేకించినట్టుగానే ఇప్పుడూ మేము వ్యతిరేకించాము అంటున్నారు గానీ మెమన్ ఉరిశిక్షకి సంబంధించిన నిజాలు ఇవి:నిజానికి ఈ పేలుళ్ళు జరిపించింది ముస్లిముల మనోభావాల్ని పట్టించుకోకుండా అయోధ్యలో బాబ్రీ మసీదుని కూలగొట్టడానికి ప్రతీకారంగా చేశామని చెప్పుకుంటారు గానీ వీళ్ళు బాంబులు పేల్చటానికి పనిముట్లుగా వాడుకున్నది చదువూ సంధ్యా లేని బీద ముస్లిముల్నే అని వీళ్ళకి నిజంగానే తెలియదా!అప్రూవరుగా మారి తనంతట తను లొంగిపోయాడంటారు గానీ అతని అరెస్టు మాత్రం అనుకోకుండా అతను దొరికిపోవటంతో జరిగింది.పేలుళ్ళ ద్వారా తాము ఆశించినంత ఫలితం రాలేదు.పాకిస్తాన్ గడ్డ మీద ఎక్కువ కాలం ఉంటే పాకిస్తానుకీ అంతర్జాతీయ సమాజం నుంచి చివాట్లు వస్తాయి,అప్పటికే వస్తున్నాయి!దాంతో మారుపేరుతో నేపాల్ వెళ్ళాడు.అక్కడికి ఒక మిత్రుణ్ణి రప్పించుకుని తను అమాయకుణ్ణి అని చెప్తే ఇండియాలో నమ్ముతారా అని వాకబు చేస్తే అతను తనపేరు కూడా నిందితుల లిస్టులో ఉందని ఉన్న విషయం చెప్పాడు.దానితో నిరాశపడి చేసేది లేక బొంబాయి మీదుగా కరాచీకి వెళ్ళిపోదామనుకున్నాడు.ఎయిర్ పోర్టులో చెకింగు దగ్గిర తన బ్రీఫ్ కేసులో ఉన్న తాళాల గుత్తి తుపాకీ ఆకారంలో కనబడటంతో ఎయిర్ పోర్టు అధికార్లు బ్రీఫ్ కేస్ తెరిచి చూస్తే ఇండియన్ పాస్పోర్టు కనబడింది.అసలు మనిషి ఫలానా అని తెలియగానే వాళ్ళు సిబీఇకి అప్పగీంచారు.అసలు నిజం ఇదయితే ఇండియాలో ఉన్న యాకూబ్ అభిమానులు "అతను లొంగిపోదామని వస్తే భారత పోలీసులు అబద్దాలు చెప్పి పట్టుకున్నారు.తనంతట తను లొంగీపోయి కేసు విచారణలో సహకరించిన సజ్జనుణ్ణి ఉరితియ్యడం అన్యాయం, ఇతన్ని ఉరి తీస్తే టైగర్ ఎట్లా దొరుకుతాడు" అని తలాతోకా లేని మాటలు మాట్లాడుతున్నారు.తనంతట తను లొంగిపోదామనుకుంటే నేపాల్ నుంచి డిల్లీకి వస్తాడు గానీ కరాచీ ఎందుకు వెళ్ళాలనుకుంటాడో ఈ కోడిమెదడు మేతావులు చెప్పగలరా?అప్పటికి కొన్నేళ్ళుగా దావూద్ ఇబ్రహీం వంటివారితో సంబంధాలు ఉండి స్వయంగా అండర్ వరల్డ్ డాన్ అయిన టైగర్ మెమన్ తమ్ముడై ఉండి, బాంబులు పేల్చటానికి అయిన ఖర్చునంతా తనే పెట్టుకుని ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో నిర్దేశించుకుని మనుషుల్ని కూడా మాట్లాడుకుని ఆర్గనైజ్ చేసి, ఇంకో రెండు గంటల్లో తన మూలంగా అంతమంది చస్తారని తెలిసి కూడా పశ్చాత్తాపం లేకుండా తన ప్రాణం రక్షించుకోవడానికి పాకిస్తాన్ పారిపోయిన వాడిని పెద్దమనిషిగా కలరు పులమడానికి అన్ని కట్టుకధలు అల్లుతున్నవాళ్ళు నిజంగా పెద్దమనుషులేనా!పట్టుబడినాక కూడా తన ఒక్కడి ప్రాణమే విలువైనదన్నట్టు తనకోసమే లాయర్లని పెట్టుకున్నాడు గానీ తనిచ్చిన పదివేల కోసం తను పెట్టమన్నచోట బాంబులు పెట్టి అమాయకంగా దొరికిపోయి ఉరిశిక్షకి గురయిన కడుబీద ముస్లిముల ప్రాణాల్ని గురించి ఏమాత్రం పట్టించుకోని స్వార్ధపరుణ్ణి మంచివాడని అనటం నిజంగా అమాయకత్వమేనా?ఆ బీద ముస్లిముల గురించి పట్టించుకుని నిజానిజాలు తెలుసుకుని కింది కోర్టులు వీళ్ళ తరపున గట్టిగా వాదించినవాళ్ళు ఎవరూ లేకపోవటం వల్ల తొందరపాటుతో వేసిన ఉరిని రద్దు చేసిన సుప్రీంకోర్టు కేవలం ఇతనికి ఉరి వేసినందుకే దుర్మార్గమైపోయింది వీళ్ళ దృష్టిలో - ఏమిటీ వికటత్వం?

          2015 జులై 30న అంటే యాకూబ్ మెమన్ ఉరిని గురించి రోహిత్ తన ముఖపుస్తకంలో Black Day for Indian Democracy Shame on Judiciary and government for hanging yakub memom అని పోష్టు చేశాడు - ఏమిటి దీనర్ధం?రోహిత్ ఫేస్ బుక్ పోష్టుల్ని దశల వారీగా చూస్తుంటే నాకు "ఆకాశంబు నందుండి, శంభుని శిరంబందుండి, శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి, పవనాంధో లోకమున్ జేరె గంగా కూలంకష - పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్!" అన్న భర్తృహరి సుభాషితం గుర్తొచ్చి ఎంతో జాలిగా అన్పించింది!బయాలజీ సైంటిస్టు కావాలని యూనివర్సిటీలో చేరి బుద్ధిగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని తన కలల్ని నెరవేర్చుకోవడానికి అన్ని అవకాశాలూ ఉండి కూడా తన్ను మాలిన ధర్మం చందాన తల్లి పట్ల తన బాధ్యతని గాలికొదిలి మొన్నటి రోజున సాటివాళ్లలో హీరో అనిపించుకుని నిన్నటి రోజున తొండ ముదిరి వూసరవెల్లి అయినట్టు రౌడీగా కూడా మారి ఇవ్వాళ్టి రోజున జీరోగా మిగిలాడు - ఈ ముగింపుని ముందే తెలుసుకుని ఉంటే ఈ చెత్త రాజకీయాల్లోకి వచ్చి ఉండేవాడు కాదు గదా?!

          ఆగస్టు 3న వీళ్ళు MIM యాకూబ్ మెమన్ మృతికి సంతాపసూచకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చేసిన పనుల్ని అవహేళన చేస్తూ ABVPకి చెందిన సుశీల్ కుమార్ తన ముఖపుస్తకం మీద వీళ్ళని "గూన్స్" అని పిలుస్తూ ఒక పోష్టు వేశాడు.అప్పటికే వివేకానందుణ్ణి గురించి కూడా Vivekananda is an apologist of Caste system, misogynistic and a fake intellectual. He is an overrated, half-witted person who has no scientific references to his rants, there was no actual n original ideas or knowledge production from this guy. I am surprised and disappointed at the kind of institutionalised celebration of his birthday in HCU అనేటంత ముదురు కామెంట్లు వేసినవాడు ఈ చిన్నమాటకే విపరీతంగా కోపం తెచ్చుకున్నాడు.అదేమిటో ఈ రోహిత్ ఒక్కడే కాదు,కంచె ఐలయ్య లాంటివాళ్ళు కూడా ఇదే వరస, మా భావజాలంలో ప్రజాస్వామ్యం పగలబడిపోతున్నది, మేము హిందువుల్లాగ పెత్తందార్లం కాము అంటూనే తమకు నచ్చినవాటిని మిగతావాళ్ళు కూడా చచ్చినట్టు మెచ్చుకు తీరాల్సిందేనని పట్టుబట్టటం, తమకు నచ్చనివి అసలు తమ కంటికే కనబడకూడదని వీరంగాలు వేస్తూ ఇతర్ల మీద పెత్తనాలు చెయ్యటం - ఇదేమి ప్రజాస్వామ్య స్పూర్తియో వీళ్ళ పిండాలు పిల్లులకి బెట్ట?!

          ఆగస్ట్ 3న సుశీల్ కుమార్ తన ఫేస్ బుక్ పోష్టు అప్డేట్ చేస్తే అదే రోజు రాత్రి రోహిత్ ఒక పెద్ద బృందాన్ని వెంటబెట్టుకుని సుశీల్ కుమార్ రూముకి వెళ్ళి గొడవ చేసి బలవంతంగా అతనితో క్షమాపణ పత్రం రాయించుకున్నాడు.అయితే ఆగష్టు 4,2016న సుశీల్ కుమార్ అతని సోదరుడు విష్ణు సాయంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయినయి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకున్నాడు.అక్కడ అది మెడికో లీగల్ కేసుగా నమోదు చెయ్యటంతో క్రిందటి రోజు రాత్రి రోహిత్ బృందం అతని పైన భౌతికంగా దాడి చేశారని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది!అయితే సుశీల్ పేషెంటుగా ఉండగానే సుశీల్ బంధువు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా యూనివర్సిటీ ప్రోక్టొరల్ కమిటీ విచారణ జరిపి ఇరువర్గాలనూ మందలించి వొదిలెయ్యాలని తీర్మానించింది.హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాక తన వైపు నుంచి వాదన వినకుండా తన పరోక్షంలో విచారణ జరపడం అన్యాయం అని తనకు న్యాయం జరిపించమని సుశీల్ బండారు దత్తాత్రేయ గారిని కలిశాడు.ఆయన యూనివర్సిటీ విషయాల్లో జోక్యం చేసుకోవటం దేనికని భావించి కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి ఒక లేఖ రాసి సుశీల్ అభ్యర్ధనను కూదా జత చేసి పంపించారు. కేంద్రం నుంచి యూనివర్సిటీకి తగిన చర్య తీఎసుకోవటం కోసం సూచన పంపించారు.ఈలోపు సుశీల్ తల్లి తన కొడుకు మీద జరిగిన దాడి గురించి కేసు వెయ్యటం జరిగింది.దానితో విషయం తీవ్రతని బట్టి రెండవ సారి సుశీల్ కూడా హాజరయిన ప్రోక్టొరల్ కమిటీ 5గురు విద్యార్ధుల్ని సస్పెండ్ చేసింది.ఈ మొదటి సస్పెన్షన్ చాలా తీవ్రమైనది.

          అపెండిసైటిస్ అనగానే చాలా సిల్లీగా తీసిపారేస్తున్నారు కేజ్రీవాల్ దగ్గిర్నుంచి ప్రతి ఓక్కరూ.దీని చరిత్ర ఇది:మనిషి ఆహారాన్ని వండుకు తినటం నేర్చుకోక ముందు మాంసాన్ని అన్ని మాంసాహార జంతువుల లాగే పీక్కు తినేవాడు,కందమూలా లయితే కోతుల మాదిరిగా కొరుక్కు తినేవాడు.ఈ కఠినమైన ఆహారాన్ని జీర్ణం చేసుకునేటందుకు కొన్ని రకల బాక్టీరియా జీర్ణవ్యవస్థలో కుదురుకుని ఉండి సహాయపడుతూ ఉండేది.అయితే తర్వాతి కాలంలో మారిన ఆహారపు అలవాట్ల వల్ల ఆ భాగం ఆవసరం తగ్గిపోయి కుంచించుకుపోయి అవశేషంగా ఉండిపోయింది.మనిషి శరీరంలో ఇలాంటి అవశేషాంగాలు చాలా ఉన్నాయి.ఆ శరీర భాగం ఎటూ ఉంది గనక ఆ బాక్టీరియా కూడా అపెండిక్స్ లోనే ఉండి  రక్తం ద్వారా ఆ భాగం లోకి చేరిన ఆహారం మీద బతికేస్తున్నది.వెనకటి కాలంలో అవి ఉపయోగకారులే అయినా ఇప్పుడు గనక అవి రీరం లోని ఇతర భాగాల లోకి వ్యాపిస్తే హానికరమైనవి అవుతాయి.సాధారణంగా డాక్టర్లు ఇతర రోగాల కోసం పొట్టను కోసినా కుట్లు వేసేటప్పుడు ఈ అపెండిక్సుని కత్తిరించి తీసేస్తారు - భవిష్యత్తులో సమస్య రాకుండా!పొట్ట మీద బలంగా దెబ్బ తగలనిదే లోపలెక్కడో ఉన్న అపెండిక్స్ చిట్లే అవకాశం లేదు.అపెండిక్స్ పగిలి బాక్టీరియా వ్యాపించినప్పుడు వెంటనే అపరేషన్ చెయ్యకపోతే మనిషి ప్రాణానికి ప్రమాదమే - 24 గంటల కడుపు నెప్పి అంటారు దీన్ని!మెడికల్ ర్రిపోర్టులో భుజం మీద దెబ్బ తగిలినట్టుగా కూడా ఉంది - అంత దుర్మార్గం చేసిన వాడు సూయిసైడ్ చేసుకునేసరికి ట్రాజిక్ హీరో లెక్కన పేరు తెచ్చుకుంటున్నాడు!

          మొదటి సారి సస్పెండ్ చెయ్యటం కాంగ్రెస్ పార్టీ నియమించిన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయాల ప్రకారం జరిగింది.రెండు నెలల క్రితం భాజపా ప్రభుత్వం నియమించిన కొత్త వైస్ చాన్సలర్ సెప్టెంబర్ 7న జరిగిన ఈ కథినమైన శిక్షని తగ్గించి కేవలం ఆర్నెల్ల పాటు హాస్టల్ నుంచి మాత్రమే బహిష్కరిస్తూ చదువులు కొనసాగించుకోవటానికి వీలుగా క్లాసులకి హాజరు కావటానికీ లైబ్రరీకి వెళ్ళడానికీ అనుమతులు ఇచ్చి గుంపుగా తిరగటాన్ని మాత్రమే నిషేధించారు.సెప్టెంబర్ 7న కథినమైన శిక్షని వేసిన పాత వైస్ చాన్సలర్ మీద కాకండా శిక్షల్ని సవరించిన కొత్త వైస్ చాన్సలర్ మీద ఉద్యమం చేయ్యడం లోని మతలబు ఏంటి?

          ఈ మతలబు వల్ల తొలిసారి రోహిత్ గందరగోళానికి గురయ్యాడు.స్కాలర్ షిప్ ఆగిపోవడంతో ఇంటికి డబ్బు పంపటానికి అప్పులు చేస్తున్నప్పుడు ఆర్ధికం మెదడులో ప్రమాద ఘంటికల్ని మోగించి ఉంటుంది.ఇంకో వైపున సుశీల్ తల్లి వేసిన కేసు కూడా బలమైనదే!మామూలుగా అయితే రోహిత్ లాంటి ఉద్యమవీరులకి తమ మీద ఇలాంటి కేసులు పడితే ఉత్సాహం పుడుతుంది.వీర భగత్సింగు లెవేల్లో కోర్టు హాలులో ఉపన్యాసాలు దంచగలిగే సువర్ణావకాశం తలుపు తడుతున్న సమయంలో రోహిత్ లాంటి భాషాపరశేషభోగి దాన్ని వొదులుకుని ఆత్మహత్య చేసుకోడు!రోసస్పెన్షన్లు పూర్తిగా ఎత్తేసినా ఉద్యమం ఉధృతం చేస్తున్న వాళ్ళు ఆ ప్రసక్తినే తీసుకు రావటం లేదు గానీ సుశీల్ నమ్మకంగా చెప్తున్నాడు రోహిత్ రాజీ ఫార్ములాతో వచ్చాడని!ఆందోళన విరమించుకోవడం ద్వారా ఆ కొంచెం సస్పెన్షన్ కూడా ఎత్తేయించుకుని సుశీల్ కేసు వాపస్ చేసుకునేలా ఒప్పందం జరిగి ఉండవచ్చు.అయితే తను చేసిన రాజీ ప్రయత్నాల గురించీ సుశీల్ సానుకూలంగా స్పందించటాన్నీ మిగిలిన వాళ్లకి చెప్పినప్పుడు వాళ్ళు బయటపెట్టిన ఒక విషయం రోహిత్ ఆశల్ని నీరుగార్చేసింది.వీళ్ళకి పై స్థాయిలో ఉన్న పెద్దలు ఈ ఆందోళనని ఇంకా పెంచి కేంద్రం లోని భాజపా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టమని సూచించారట!ASA లోకి వచ్చేటప్పుడు రాంజీకి SFI గురించి బోధపడిన నిష్ఠురసత్యమే ఇప్పుడు ASA గురించి మనవాడికి బోధపడింది.కళ్ళు తెరుచుకున్నాయి కానీ బతకటానికి పనికొచ్చే దారులన్నీ మూసుకుపోయి ఒకే ఒక్క దారి మిగిలింది - వీరమరణం లాంటి గౌరవప్రదమైన ఓటమి!

          రోహిత్ తన ఆఖరి ఉత్తరంలో రాసి కొట్టేసిన భాగాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా సేకరించి టైమ్స్ ఆఫ్ ఇండియా జనవరి 22న ప్రచురించింది."ASA,SFI వాటి ఉనికిని చాటుకోవడం కోసమే పనిచేస్తున్నాయి.ఆయా సంస్థల సిద్ధాంతాలు అందులో పనిచేసే వ్యక్తుల ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి.అధికారం చలాయించడం కోసం,ప్రచారంలో ఉండడం కోసం,తమ ప్రాముఖ్యత చాటుకోవడం కోసం మాత్రమే పనిచేస్తున్నాయి.పైగా సమాజంలో మార్పుకోసమే పనిచేస్తున్నామంటూ తమను తాము మభ్యపెట్టుకుంటూ ఉంటున్నాయి" అని రోహిత్ రాసి కొట్టేసి తనే దాన్ని కొట్టేసినట్టు పక్కన నోట్ పెట్టి సంతకం చేశాడు!ఈ రాసి కొట్టేసి తనే కొట్టేశానని చెప్పడం వెనక ఉన్న చిదంబర రహస్యమేమిటో మరి?

          రోహిత్ సుశీల్ మధ్య జరిగిన రాజీ వ్యవహారం నిజమే అయితే ఈ కొట్టేసిన భాగంలో రోహిత్ వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం రోహిత్ ప్రతిపాదించిన రాజీకి ఒప్పుకోని ASA సహచరుల్ని కూడా హంతకుల లిస్టులోకి ఎక్కించాలి.కొత్తగా తెలిసిన రోహిత్ కుటుంబ వివరాల ప్రకారం తండ్రి మణికుమార్ ఇంటర్ చదివి ఒక హాస్పటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వడ్డెర కులస్థుడు.తల్లి రాధిక మాల కులంలో పుట్టినా దత్తత ద్వారా అంజనీదేవికి పెంపుడు కూతురుగా పెరిగింది.ఒక పాత సినిమాలో "సంతానమే లేక" అని ఒక హాస్యగీతం ఉంది - మీరెవరయినా విన్నారా?అప్పట్లో పిల్లలు పుట్టకపోతే పూజలూ పునస్కారాలూ తీర్ధయాత్రలూ చెయ్యమని చెప్పేవాళ్ళు!వాటిలోనే ఒక వింతయిన పరిష్కారం ఎవర్నయినా దత్తత తీసుకోమనటం.ఈ పరిష్కారాలు కొన్నిచోట్ల పని చేసేవి కూదా!దత్తత తీసుకుంటున్నప్పుడు నిస్సంతుగా ఉన్నవాళ్లకి కొంతకాలమయ్యాక పిల్లలు పుట్టేవాళ్ళు.అసలు పిల్లలు పుట్టనప్పుడు గారాబంగా పెరిగిన మొదటి సంతానం పరిస్థితి తర్వాత తమకంటూ సొంతంగా పిల్లలు పుట్టాక దయనీయంగా తయారయ్యేది.దానినే కవిగారు "సంతు గలిగిందంటేను చిన్ని పాపాయి గతి శ్రీమతే రామానుజాయ నమః" అని కామిడీగా చెప్పారు.పాట యొక్క శైలి హాస్యసోరకంగా ఉందటం వల్ల మనకి నవ్వొచ్చినా అనుభవించినవాళ్లకి నరకమే కదా - అలాంటి బాధల్నే రాధిక అనుభవించి ఉంటుంది!రాధిక పెంపుడు తల్లి వడ్డెర కావడంతో వడ్డెర కులస్థుడికే ఇచ్చి పెళ్ళీ చేశారు.తీరా రాధిక కులం తెలిశాక అబద్ధం చెప్పి మాలదాన్ని నాకంటగట్టారు అని ఆ ప్రబుద్ధుడు విడాకు లిచ్చేశాడు.పైకి వాచ్యంగా చెప్పకపోయినా తన కులం గురించీ తన గురించీ గొప్పగా చెప్పుకుని కొడుకు కులాన్ని మార్చడం గురించి తిరస్కారంగా మాట్లాడినందువల్ల విడాకులకి కారణం అదే అయ్యుండాలి - నిజమేమిటో ఎవరూ చెప్పడం లేదు,మన కనవసరం గూడా!రాధిక పెంపుడు తల్లి అంజనీ దేవిని చూశాను, తెలుగు రాకనో చాలామందికి లాగ స్టయిలు కోసమో అంతా ఇంగ్లీషులోనే మాట్లాడటం కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు.

          2012లో రమెష్ బాయ్ డి.నాయికా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సాధారణ అరిస్థితిలో బిడ్డలు తండ్రి కులాన్ని స్వీకరిస్తారనే విషయాన్ని ఒప్పుకుంటూనే తల్లి పుట్టుక కారణంగా "జీవితమంతా  అవమానాలకు,తలవంపులకు,తిరస్కారాలకు(Deprivation,Indignities,Humiliation,Handicaps) లాంటివాటికి గురయిన పక్షంలో పిల్లల్ని దళితులుగా గుర్తించవచ్చు" అని స్పష్టంగా ఉండటం వల్ల రోహిత్ దళితుడేనని నా అభిప్రాయం.నా దృష్టిలో ఈ విషయానికి అసలు ప్రాధాన్యత లేదు.అతనికి వస్తున్న స్కా;లర్ షిప్ మెరిట్ స్కాలర్ షిప్ అంటున్నారు.అది క్యాన్సిల్ అయ్యే ప్రమాదం లేదు.ఇప్పుడు రోహిత్ దళితుడని ఒప్పుకోవటం వల్ల వీళ్ళు ఉఢృతం చెయ్యాలనుకుంటున్న ఉద్యమానికీ ఏ విధంగానూ లాభం ఉండదు.ఎవరిమీదయినా ఆట్రాసిటీ కేసు పెట్టటం కోసం మాత్రం పనికొస్తుంది - కానీ ఎవరిని హంతకులుగా నిర్ధారించాలి?కర్ణుడి చావుకి మల్లే చిన్నప్పుడు ఇంటి పక్కన ఉన్న పార్టీ ఆఫీసు నుంచి ప్రసంగాలు దంచిన CPI నాయకుల నుంచి రోహిత్ రాజీ ప్రతిపాదనని ఒప్పుకోకుండా అతనికి విరక్తిని కలిగించిన ASA సహచరుల వరకూ అందరి బాధ్యతా ఎంతో కొంత ఉంది కదా!

          రోహిత్ బృందం దాడిచేసిన సుశీల్ కుమార్ కూడా వెనకబడిన కులానికి చెందినవాడే.రోహిత్ ఆత్మహత్యను దళితుల మీద అగ్రవర్ణ హిందువుల దాడిగా చూస్తే మరి సుశీల్ కుమార్ మీద జరిగిన దాడిని ఎలా చూడాలి?ఈ గందరగొళం వల్ల సరళతరం చేసిన కాస్తపాటి సస్పెన్షన్ ఎత్తేశాక కూడా చదువును కొనసాగించకుండా ఇప్పుడు ఆందోళన చేస్తున్న విద్యార్దులు మూర్ఖంగా ఇంకా ముందుకెళితే ప్రతి ఒక్కరి నుంచీ ఈ ప్రశ్న రావడం ఖాయం!హైదరాబాద్ యూనివర్సిటీలో ఈ విద్యార్ధులు పొందుతున్న ఏ సౌకర్యమూ వైస్ చాన్సలర్ గానీ యూజీసీ చైర్మన్ గానీ విద్యాశాఖ మంత్రులు గానీ వారి జేబుల్లో నుంచి ఖర్చుపెడితే రావటం లేదు.రోహిత్ హక్కుగా పొందుతున్న 30000 ఎక్కడ నుంచి వస్తున్నాయి?భారతదేశపు పౌరులుగా ఉన్న ఈ దేశప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా - ఈ దేశప్రజల ఉమ్మడిసొమ్మును అనుభవిస్తూ ఈ దేశప్రజల మీద బాంబులు పేల్చి చంపినవాణ్ణి ఉరితీస్తే "Black Day for Indian Democracy Shame on Judiciary and government" అని వ్యాఖ్యానించినా ఏమీ చెయ్యకూడదా?వివేకానందుణ్ణి "fake intellectual" అన్న పండితులు సుశీల్ వాడిన "గూన్స్" అన్న చిన్నమాటను పట్టుకుని బృందంగా వెళ్ళి ఉద్ధరించిన ఘనకార్యం ఏమిటి?"గూన్స్" అన్న మాటకి వీళ్ళు తగిన వాళ్ళే అని నిరూపించుకోవటం కాదా!

         మార్క్సిష్టు భావజాలం గల హరగోపాల్ ఇదివరలో 21 మంది విద్యార్ధుల్ని ఇప్పటికన్నా కఠినమైన శిక్షలు వేసినప్పుడు ఆందోళన చెయ్యలేదు - ఎందుకని?కొందరిని ఇఇక్కడ సస్పెండయినా ఇంకో చోట జాయినయ్యే వీలు లేకుండా ఇతర యూనివర్సిటీలో అడ్మిట్ కాకుండా నిషేధించటం లాంటి క్రూరమైన శిక్షలు కూడా వేశారు గదా!నిజానికి ఇవ్వాళ కులపిచ్చి చదువు రానివాళ్లలో కన్నా చదువుకున్నవాళ్ళలోనే ఎక్కువ ఉంది.స్టూడెంట్లకే కాదు ప్రొఫెసర్లకీ ఉంది కులపిచ్చి - ఒప్పుకుందాం!అయితే ఒక కులపిచ్చి ఉన్న ప్రొఫెసర్ మీద చర్య తీసుకోవాల్సిన మంత్రిగారు కులసమీకరణల ప్రకారమే ఎన్నికవుతున్నప్పుడు నిష్పక్షపాతంగా అతనెలా  వ్యవహరించగలుగుతాడు?ఇవ్వాళ ప్రతి రాజకీయ పార్టీ ఫలానా నియోజక వర్గంలో ఏ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆ కులంవాణ్ణి అభ్యర్ధిగా నిలబెడుతున్నది,వాళ్ళు ఢంకా మీద దెబ్బ గొట్టినట్టు గెలుస్తున్నారు, గెలుపోటముల విశ్లేషణలు చెసే మీడియా మేధావులు కూడా ఫలానా నొయోజకవర్గంలో ఫలానా కులస్థులు ఎక్కువ ఉండటం గమనించి కూడా వేరే కులంవాణ్ణి నిలబెట్టటం వల్లనే ఫలానా పార్టీ ఆ స్థానంలో వోడిపోయినట్టు బల్లగుద్ది చెప్తున్నారు.ఈ రకంగా తమ కులం వల్లనే గెల్చినవాళ్ళు కులరహితులుగా ఉండగలరా?రాజకీయ పార్టీలు ఏ ప్రాంతంలోనైనా ఏ అబ్యర్ధినైనా అర్హతల్ని బట్టి గాక అక్కడ ఒక కులం ప్రభావశాలి అని తీర్మానించి ఆ కులం నుంచి నిర్ణయిస్తే ఆ కులంవాళ్ళు సిగ్గుపడిన రోజున ఆ ప్రాంతం కులపిచ్చికి దూరమయినట్టు - అప్పటివరకు ఎన్ని ఉపన్యాసాలు దంచినా కులపిచ్చి పోదు!

          దళితులు అధికారం లోకి వచ్చి కులరహిత సమాజం స్థాపించితే గానీ అసమానతలు తొలగవు అని చెప్తున్న కంచె ఐలయ్య దళిత అనుకూల ప్రభుత్వం రావాలంటే దళితులు తమ కులాల వాళ్ళకే వోటు వెయ్యాలని సూచిస్తూ ఎడంచెయ్యి తీసి పుర్రచెయ్యి పెట్టమన్న తలతిక్క పరిష్కారాలు చెప్తున్నా మేధావి అని గౌరవిస్తున్నారు.ఒక కంచె ఐలయ్య వందమంది యాకూబ్ మెమన్ లాంటి ఉగ్రవాదుల కన్నా ప్రమాదకారి!కుల రహిత సమాజం ఏర్పడాలి అంటాదు,తన కురుమ గొల్ల కులం విశ్వవ్యాప్తం కావాలి అంటాడు - రెంటికీ అస్సలు పొసగదు కదా!కుల రహిత సమాజం కావాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాలి - అప్పుడు కురుమ గొల్ల కులం ఉనికిలోనే ఉండదు!లేదంటే ప్రతి కురుమ గొల్ల పురుషుడూ పదిమంది కురుమ గొల్ల స్త్రీలని పెళ్ళాడి ప్రతి స్త్రీ నుంచి పదిమంది సంతానాన్ని కనాలి.వీళ్ళందర్నీ పెరిగి పెద్దయ్యే లోపు చావకుండా పోషించటానికి దారులు కొట్టటం దగ్గిర్నుంచి హవాలా కుంభకోణాల వరకూ ఏ దిక్కుమాలిన పనయినా సరే చేసి విపరీతంగా డబ్బు సంపాదించాలి!అప్పుడు కురుమ గొల్ల కులం విశ్వవ్యాప్తమవుతుంది దళితులకి రాజ్యాధికారం దానంతటదే వచ్చేస్తుంది.వినేవాడు ఉంటే పంది పురాణం చెప్తుందన్నట్టు చెలరేగిపోతున్నాడు - వినేవాళ్ళు ఎలా వింటున్నారో పిడకలేరుకోవటానికి కూడా పనికిరాని ఈ పోచికోలు కబుర్లు?

          ఈ కమినిష్టు దళితిష్టు మేధావులు ఎంత ఛండాలంగా ప్రవర్తించగలరో సాతులూరి చలపతి రావుకి పడిన ఉరిశిక్షని తప్పించటానికి ఆడిన నాటకాన్ని బట్టి తెలుసుకోవచ్చు.1993లో చిలకలూరి పేటలో కొందరు దళితులు ఒక ఆర్టీసీ బస్సుని తగలబెడితే అందులో ఉన్న 23 మంది ప్రయాణీకులు చనిపోయారు.నిందితుల్లో సాతులూరి చలపతి రావు, గంటెల విజయవర్ధన రావు అనే ఇద్దరికి ఉరిశిక్ష పడింది.ఇంక చూసుకోండి!దళిత ప్రజా సంఘాల నుంచి మానవ హక్కుల సంఘాల లోని మేధావు లంతా రంగం లోకి దిగి జరగరాని ఘోరం జరిగిపోయినట్టు ఆందోళన పడిపోయి రాష్త్రపతి నుంచి క్షమాబిక్ష రాబట్టుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.వీళ్ళకి చచ్చిపోయిన 23 మంది కోన్ కిస్కా గొట్టాం గాళ్లలా కనిపించి ఉంటారు, నిందితులు అంత ఘోరం చేసినా వాళ్ళు దళితులు గాబట్టి ఉరి తీయటం అమానుషం అని వీళ్ళ వాదన.కొన్ని గంటల్లో ఉరిశిక్ష అమలు జరుగుతుందనగా ప్రఖ్యాత రచయిత్రి మహాశ్వేతాదేవిని కూడా కలుపుకుని ఆఖరుసారిగా మళ్ళీ అప్పటి రాష్త్రపతి శంకర్ దయాళ్ శర్మ గారిని కలిస్తే ఆయన "నేను బాగా ఆలోచించాకనే రెండుసార్లు తిరస్కరించాను,వెళ్ళి రండి" అని చెప్పి పంపించేశాడు.అది రాత్రి 9 గంతలకు జరిగింది.ఇక నిరాశతో కార్లు ఎక్కబోతూ ఉండగా ఒక మహిళా న్యాయవాది "సుప్రీం కోర్టు జడ్జి ఇంటికి వెళ్ళి రాష్ట్రపతి మన పిటిషన్ గురించి సానుభూతితో పరిశీలిస్తామని చెప్పారని అబద్ధం చెబుదాం.విషయం పరిశీలనలో ఉంది కాబట్టి ఉరిని ఒక వారం వాయిదా వెయ్యమని అడుగుదాం"   అనేసరికి రాత్రి పది గంటల కల్లా ఒక సుప్రీం కోర్టు జడ్జి ఇంటికి వెళ్ళి అంత పచ్చి అబద్ధమూ తడుముకోకుండా చెప్పేశారు.ఆయన నేను ఒక్కణ్ణీ నిర్ణయం తీసుకోలేను.కనీసం ఇద్దరయినా ఉండాలి అంటే అప్పటికప్పుడు ఈ బృందం మరో జడ్జి ఇంటికి వెళ్ళి ఆయనకీ అబద్ధం చెప్పి తీసుకొచ్చారు.ఇద్దరు న్యాయమూర్తులూ కలిసి చర్చించుకుని ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉరి తియ్యవద్దని ఆదేశాలు జారీ చేశారు.అప్పుడు వీళ్ళు కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఆదేశాలు చూపిస్తే ఆయన ఆంధ్రప్రదేశ్ హోం సెక్రెటరీకి చెప్పాడు.ఆయన గోదావరి జిల్లా కలెక్టరుకి చెప్పాడు.ఆయన చెప్పగా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఉరిని ఆపేశారు.ఇంకా వీళ్ళ నాటకాలు అయిపోలేదు -ఇప్పుడు జరిగింది ఉరిని వాయిదా వేయించడమే కదా!మళ్ళీ ఉరి తీసే సమయానికి దేవెగౌడ ప్రభుత్వం కూలిపోయింది.రాష్ట్రపతి దానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉండటంతో మళ్ళీ ఈ బృందం సుప్రీం కోర్టు జడ్జిలను కలిసి ప్రస్తుతం రాష్త్రపతి బిజీగా ఉండటం వల్ల నిర్ణయం తీసుకోలేకపోతున్నారని మరో అబద్ధమాడి ఇంకో మూడు నెలలు వ్యవధి అడిగి సాధించుకున్నారు.ఆ గడువు ముగిసే సమయానికి శంకర్ దయాళ్ సర్మ పదవీకాలం ముగిసి కే.ఆర్.నారాయణన్ రాష్ట్రపతి అయ్యారు.ఆయనకి "మీరు దళితులై ఉండి దళితుడికి క్షమాబిక్ష పెట్ట్టకపోతే ఎలా?"అని పొడి వేసి యావజ్జీవ శిక్షగా మార్పించారు.వీళ్ళు అంత కాలం పాటు దేశాధినేతలతో ప్రధాన న్యాయమూర్తులతో అబద్ద్ఘాలు చెప్పి ప్రాణాలు రక్షించినవాడు కనీసం సమసమాజ స్థాపన కోసం పాటుపడుతున్న నక్సలైట్ యోధుడు అయినా బాగుండేది - ఎవరినో ఒకరిని చంపాలనే వెర్రి ఆవేశం తప్ప వాళ్ళని చంపడానికి సరైన కారణం కూడా లేకుండా 23 మంది ప్రాణాల్ని అగ్నికీలలకి ఆహుతి చేసిన దుర్మార్గుడి కోసం చేశారు అన్ని నీచమైన పనుల్ని!ఒకే ఒక ప్రశ్న,"బ్రాహ్మణులు పుట్టుకని బట్టి కొన్ని కులాల్ని అణిచివేయ్యటానికి కులవ్యవస్థని ఉపయోగించుకోవటం అన్యాయం" అంటున్న ప్రబుద్ధులు మరి ఒక నేరస్థుణ్ణీ పుట్టుకని బట్టి అన్ని నీచమైన పనులు చేసి ఎందుకు రక్షించారు?

          వీళ్ళకి సిగ్గూ శరమూ ఉండవా అని అడక్కండి, ఆ అవకాశం రాదు.ఎందుకంటే,వీళ్ళు తెలివైన వాళ్ళకి దూరంగా ఉంటారు - కొంచెం కొత్తగా కనబడితే చాలు ఎంత చెత్తనైనా నెత్తికెత్తుకునే దేభ్యం మొహాలే వీళ్ళకి దొరుకుతారు - రోహిత్ లాంటివాళ్ళు!ఎదటివాళ్ళు తెలివైన వాళ్ళు అని తెలిస్తే వాళ్లకి దూరంగా ఉందటం వీళ్ళు తీసుకునే జాగ్రత్త.కాబట్టి దొరికిపోయి సిగ్గుపడాల్సిన అవసరం వీళ్ళ కెప్పుడూ రాదు.వీళ్ళు ఎప్పుడూ పాడే పాట "ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ వల్లనే ఎంత ప్రయత్నించినా మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు.దీన్ని ఇట్లా అమిర్చి పెట్టింది బ్రాహ్మణులే.బ్రాహ్మణాధిపత్యాన్ని కూలదోసి దళిత రాజ్యం స్థాపిస్తే గానీ మీ సమస్యలు తీరవు" అని. ఎక్కడ లేదు నిచ్చెన మెట్ల అమరిక?మన చుట్టూ ఉన్న Eco System యెట్లా ఉంది!ప్లాంక్టాన్ దగ్గిర్నుంచి మహావృక్షాల వరకూ క్లోరోఫిల్ ఉన్న స్వయంపోషకాలు,వీటిని తిని బతికే శాఖాహారులు,వీటిని తిని బతికే మాంసాహారులు -ఇదొక పిరమిడ్.కింద ఉన్న స్వయంపోషకాలు 1000 ఉంటే వాటిపైన 100 శాకాహారులు వుంటాయి,మళ్ళీ ఈ శాకాహారుల మీద ఆధారపడిన 10 మాంసాహారులు ఉంటాయి.మాంసాహారులు లేకపోతే శాకాహారులు కింద వరస నంతా నాకేసి స్వయంపోషకాలు పూర్తిగా మాయమైపోయి వీటిని తిని బతికే శాకాహారులు  కూడా మాయమై పోతాయి  అంతా శూన్యం!అందుకే ఒకటి పెరిగితే మరొకటి దీన్ని తగ్గిస్తూ ప్రకృతి ఎప్పుడూ సమతౌల్యాన్ని పాటిస్తుంది.సమ సమాజం అంటే మనుషుల్ని అతిగా పెరిగిన కొమ్మల్ని కత్తిరించి క్రోటను మొక్కల్లా ఒకే లెవెల్లోకి తీసుకొచ్చి నిలబెట్టడం కాదు ప్రకృతి చేస్తున్నట్టే అన్ని అర్గాల మధ్యనా సమతౌల్యాన్ని సాధించటం - తమ వర్గరహితసమాజం కాన్సెప్టుని ఒప్పుకోనివాళ్లని వర్గశత్రువులుగా ప్రకటించేసి సాయుధపోరాటంతో వాళ్లని చంపేసి మిగిలిన వాళ్ళకి ఇదే వర్గరహితసమాజం అని మోళీ చెయ్యాలని చూసేవాళ్లకి ఇదెప్పటికీ అర్ధం కాదు!

          అసలు కులవ్యవస్థ బ్రాహ్మణులు అందరికన్నా పైన ఉండి నిర్మించినది కాదు.వాళ్ళు కూడా అందులోని ఒక భాగమే!కులవ్యవస్థ అనేది రాజ్యం ఏర్పడి వ్యవసాయం,వ్యాపారం బాగా వృద్ధి అయ్యాక అవి లాభసాటిగా మారిన తర్వాత ఆయా వృత్తులకి సంబంధించిన ఆదాయం మీద మోనాపలీ కోసం కొన్ని తరాల పాటు ఒకే వీధిలో నివసించటం వాళ్లలో వాళ్లే పెళ్ళిళ్ళు చేసుకోవటం లాంటి పద్ధతుల ద్వారా నడిచిన వ్యవహారం.సొంతంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే వృత్తుల్ని ఆధారం చేసుకుని మిగిలిన కులాలు సర్దుకున్నాక బ్రాహ్మణులకి ప్రత్యేకంగా ఆదాయం తెచ్చిపెట్టే వృత్తి ఏదీ లేకపోవటంతో జీవిక కోసం మిగిలిన కులాల మీద ఆధారపడాల్సి వచ్చింది.నాలుగు వర్ణాల్లోనూ బ్రాహ్మణ వర్ణమే బ్రాహ్మణ కులంగా ఏర్పడి మిగిలిన ఏ వర్ణమూ కులంగా మారకపోవటమే దీనికి సాక్ష్యం!మొదట్లో దానశాసనాల ద్వారా భూమికి హక్కుదారులై వ్యవసాయం చేసినా తర్వాతి కాలంలో మిగిలిన కులాలకి వ్యవసాయాన్ని ఇచ్చేసి యాచనకీ కర్మకాండకీ సెటిలై పోయిన తెలివి తక్కువ వాళ్ళు బ్రాహ్మణులు!వీళ్ళు ఏ స్వార్ధమూ లేకుండా వైదిక వాజ్మయాన్ని దాచకపోతే ఇవ్వాళ గొప్పగా చెప్పుకోవడానికి మనకి గుండుసున్నా మిగిలి ఉండేది - దానికి కూడా తిట్లు తింటున్నారు వీళ్ళు!బుద్ధుడి కాలం గురించి నిక్కచ్చిగా వర్ణించిన హిస్టారికల్ బుద్ధ రచయిత కులవ్యవస్థ పూర్తి ఆకారం తీసుకున్న అప్పటి కాలంలో కూడా కులాలు స్థిరంగా లేవనీ ఒక కులం నుంచి ఇంకో కులానికి మారడం కూడా ఉన్నదనీ చెప్పాడు - నమ్మాలి!

          కులాలు అంతరించిపోతాయి అని ఎవ్వరూ భ్రమల్లో మునిగి తేలకండి.ఎందుకంటే ప్రతి కులానికీ ఒక చరిత్ర,గొప్పదనం,సాహిత్యం ఉన్నాయి!"ఆఖరి చర్మకారుని మీద దాక్యుమెంటరీ" అని కొన్ని నెలల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఒక కధ చదివాను.అందులో విదేశాల్లో మంచి పొజిషనులో ఉన్న ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి తమలో తరతరాల నుంచీ వస్తున్న సంగీతకళకి సంబంధించిన వారసత్వాన్ని చాలా అత్మీయంగా కొనసాగిస్తుండటం గురించి రాశారు.అలా తమ కులంలోని ఒక విశిష్టతని గురించి గర్విస్తున్న వాళ్ళు కాల్పనిక వ్యక్తులు కాదు - వాస్తవ వ్యక్తులే!నేనయితే కులాలు మాయమై పోవాలని కోరుకోవడం లేదు.నదీనాం సాగరో గతిః అన్నట్టు కులానికి సంబంధించిన సామాజిక న్యూనతా భావం లేకపోతే అన్ని కులాలూ గొప్పవే.కులాలు మాయమై పోవడం కాదు ప్రతి కులమూ జవజీవాలతో తొణికిస లాడుతూ ఉండాల్సిందే!

          అంతకుముందు కాంగ్రెసు ఒక పదేళ్ళు పరిపాలించి దేశపు ఆర్ధికశక్తిని ఛిన్నాభిన్నం చేసేటంత స్థాయిలో కుంభకోణాలు చేసి అవినీతితో గబ్బు పట్టిపోయి అప్పటికే జనం ఛీకొడుతున్నారనీ మళ్ళీ అధికారం  హుళక్కేయేనని తెలిసిపోయినా, అంతకు పదేళ్ళ క్రితమే  తెలంగాణ ఇస్తానని వాగుదానం చేసినా దాన్ని ఇన్నేళ్ళూ మతిమరుపు చెరువులో కలిపేసి, ఇప్పుడు వస్తే ఇస్తానంటున్న భాజపాకి ఆ చాన్సు దక్కనివ్వకూడదనీ తనకి వాళ్ళు ఇవ్వటానికి పెట్టిన కండిషన్ అయిన ఆర్టీకిల్ మూడు ప్రకారం బిల్లును నెగ్గించుకోవడానికి తగిన మెజార్టీ కూడా లేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నానని తెలిసితెలిసీ ఎన్నికలకి ముందే తెలంగాణ ఇచ్చిపారెయ్యాలని తీర్మానించేసుకుని, అదృష్టం కలిసొస్తే ఆ ఒక్క మంచిపనితోనే  పదేళ్ళ పాతతప్పులన్నీ దేశం మొత్తం జనం మర్చిపోయి తనకి మళ్ళీ అధికారం కట్టబెట్టవచ్చుననే దురాశతో పరమ దౌర్భాగ్యమయిన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడితే - ఆ విబఃజన వల్ల ఫలితం అనుభవించే వాళ్ళే గాకుండా వీళ్ళు అంత సొంపుగా చేసిన విభజన తంతుని చూసిన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకీ అంతకుముందుకన్నా మూడింతలు కాలిపోయి కాంగ్రెసుని కొనవూపిరితో మాత్రం మిగిల్చి అటువైపున ఉన్న మోదీకి గుజరాత్ రాస్ట్రాన్ని అవినీతికి అతీతంగా పరిపాలించిన మంచిపేరూ ఆయన సమకూర్చుకున్న ప్రచారవ్యూహమూ కలిసొచ్చి అఖండమైన మెజార్టీ వచ్చినప్పటి నుంచీ ఈ దేశపు వామపక్ష మేధావుల్లోనూ కాంగ్రెసు పార్టీలోనూ ఇంకా వీరిద్దరి మిత్రపక్షాల లోనూ అసహనం తెగ పెరిగిపోయింది.

          దీనికి తోడు అన్ని విశ్వ విస్యాలయాల్ల్లోనూ ఉన్న వామపక్ష బావజాలం ప్రభావంతో ఉన్న ఎమినెంట్ ప్రొఫెసర్ల బండారం బయటపడి మెడలు పట్టి గెంటించుకునే దిక్కుమాలిన స్థితి దాపరించింది.రోమిల్లా ధపార్ అత్యుత్సాహంతో ఒక జీవిత కాలం పాటు ప్రచారం చేసిన "స్థానికులైన ద్రవిడుల మీద నూతనులైన ఆర్యుల దాడి" సిద్ధాంతం డుల్లిపోయింది.అయోధ్య కేసులో సాక్ష్యానికి వెళ్ళిన వాళ్ళని అలహాబాద్ హైకోర్టు అడిగిన మామూలు ప్రశ్నలకే సరైన జవాబులు చెప్పలేక నీళ్ళు నమిలారు.మెల్లమెల్లగా వారిని అర్హత లేకుండా అధిష్టించిన ఆచార్యపెఠాల నుంచి లాగిపారెయ్యటం మొదలయ్యింది.అదేమని గట్టిగా వ్యతిరేకించడానికి గొంతు పెగలటం లేదు, కొత్త తప్పులు నయటపడతాయేమోనని భయం కాబోలు - కిక్కురుమనకుండా తప్పుకోవలసి వస్తున్నది పాపం!ఇన్ని దశాబ్దాల పాటు దేశం మొత్తం మీద అక్కడొక వోటు ఇక్కడొక వోటు అన్నట్టున్న వామపక్షాలు ఇంతకాలం బతికి బట్టగట్టడానికి ఎలాంటి పీఠాధిపతులే కారణం గనుక భవిష్యత్తుని తల్చుకుని మరింత బెంగ పట్టుకుంది!

          మోదీ ఒక్కడే కాదు అమాయకంగా తమకి మంచి భవిష్యత్తుని కోరుకుని భాజపాకి అనుకూలంగా వోటు వేసిన ప్రతివాడూ వీళ్ళ దృష్టిలో కరుడు గట్టిన మతతత్వవాది ఐపోయాడు.అప్పటి వరకూ స్సవిత్రి గురించి సొల్లుకబుర్లు చెప్పే సరదామనుషులు కూడా ఎర్రబడిపోయారు.దేశంలో ఎక్కడ ఏం జరిగినా అది మోదీయే పురమాయించి చేయిస్తున్నట్టు ఆవేశంతో వూగిపోతున్నారు.ఎప్పటిదో అయిన గోద్రా అల్లర్లని ఇప్పటికీ కధలు కధలుగా సంవత్సరం గడిచింది రెండు సంవత్సరాలు గడిచాయి అని లెక్కలు చెప్పి బుర్రలు తింటున్నవాళ్ళు మాల్డా గురించి నోరైనా మెదపరేం!సైద్ధాంతికంగా విభేదించినా ఈ దేశప్రజలకి ప్రతింధి కాబ్ట్టి కనీస మర్యాదల్ని పాటించాలి.ఒకప్పుడు పి.వి.నరసింహా రావు గారికి దౌత్యపతంగా ఒక సున్నితమైన సమస్య వచ్చింది.దానికి ఆయన వాజపేయి గారిని ఎన్నుకున్నాడు.నా పార్టీలో ఇంతమంది ఉండగా ప్రతిపక్షం వాణ్ణి ఎన్నుకోవటం దేనికని ఆయనా అనుకోలేదు,ఈ పని నేను చేస్తే అధికార పక్షం మంచిపేరు కొట్టేస్తుంది గాబట్టి నేనెందుకు వెళ్ళాలని ఆయనా అనుకోలేదు - ఇద్దరూ హుందా అయిన వాళ్ళు గనక!కానీ ఈ మధ్యనే ఒక కాంగ్రెసు పెద్దమనిషి మోదీ అధికారంలో ఉన్నంత వరకు భారత పాకిస్థాన్ సంబంధాలు మెరుగు పడవు అని వాగేశాడు - ఇంతకుముందు అద్భుతంగా విరగబడిపోతున్నట్టు, అయినా ఏం మెరుగుపడాలి?ఇన్ని దశాబ్దాలుగా చర్చలతో ఏమి సాధించారని మెరుగుపడటానికి!ఇలా ఉంది వీళ్ళ మనస్తత్వం - కనీసపు ఆలోచన కూడా పోయిన వెర్రితనం!

          నిర్భయ చట్టం లాగ రోహిత్ చట్టం రావాలని కోరుకుంటున్నవాళ్ళు అందులో ఉండాల్సిన అంశాల గురించి చెప్తే బాగుండేది!రోహిత్ మాదిరే అర్ధరాత్రి ఎవడి రూముకైనా వెళ్ళి అపెండిక్సు బద్దలయ్యేట్టు చితకబాదినా MIM చేతిలో తన్నులు తిని పాముకు పాలు పోశాం అని వగచే కాంగ్రెసువారి మాదిరి కుయ్యోమొర్రో అని వూర్కోవాలే తప్ప సుశీల్ కుమార్ చేసీంట్టు కోర్టులో కేసు వేసి ఆత్మహత్యలకి ప్రేరేపించకూడదనే విధంగా ఉంటాయేమో అందులోని సెక్షన్లు!

          ఏ కాలంలో అయినా మనిషికి ఏమి కావాలి?తన కడుపు తను నింపుకునే ఆర్జన!ఒకనాడు భారతదేశంలో ఏర్పడిన కులవ్యవస్థ ఇతర దేశాలలోని బానిసల వ్యవస్థ కంటే భిన్నంగా ఏ కులాని కా కులానికి వారి వృత్తి మీద అధిపత్యాన్ని కట్టబెట్ట్టి ఆదాయం పట్ల భరోసా నిచ్చింది కులవృత్తికి సాటిరాదని వారికి వారే గర్వంగా చెప్పుకున్నారే, ఇంకా ఇంగ్లీషు వాళ్ళు చెప్పిన తప్పుల తదక చరిత్రని నమ్ముతూ అప్పుడెప్పుడో మమ్మంల్ని విద్యకి దూరం చేశారు బ్రాహ్మణులు అందుకే ఇవ్వాళ మేము వెనకబడిపోయాము అంటారు గదా - ఒక మగ్గం పనివాడు తన పని తను చహెసుకోవటానికి మధుచ్చంద సూక్తంతో ఏమి పని?వ్యవసాయం చెయ్యటానికి వేదం చహ్ద్వాల్సిన పని లేదు కదా!వృత్తి విద్యలో నైపుణ్యం కావాలంటే తండ్రి దగ్గిరో మరొకరి దగ్గిరో సహాయకుడిగా చేరి నేర్చుకోవాలి - వీళ్ళ కవసరం లేఎని చహ్దువులు నేర్పలేదని ఏడుస్తారేనంటి?ఇంగ్లీషు వాళ్ళు వచ్చేవరకూ ముస్లిం పరిపాలకులు కూడా ఆర్ధిక మూలాన్ని ఏమాత్రం మార్చలేదు,ఔరంగజేబు కూడా గోవధ నిషేధాన్ని పాటించాడంటే ఎవరయినా నమ్మగలరా?ఇంగ్లీషు వాళ్ళు తమ కొత్తరకం ఆర్ధిక విధానాలతో కొన్నివేల ఏళ్లుగా ఉన్న వ్యవస్థని బద్దలు గొట్టారు.దాని తర్వాతనే భారతీయ సమాజం సంక్షోభానికి గురవడం మొదలైంది.ఇవ్వాళ అమ్న కళ్ళముందున్న సమస్యకి నిన్నటివాళ్లని తిట్టి ఉపయోగ మేమిటి?

          ఇవ్వాళ్టి కులాల కుమ్ములాటలకీ నిరుద్యోగానికీ సంబంధం ఉంది.ఈ నిరుద్యోగానికీ ఇప్పుడు మనం అనుసరిస్తున్న విద్యావిధానానికీ సంబంధం ఉంది.విద్యా ఉపాధి రంగాలలో మూడు ముఖ్యమైన మార్పుల్ని చేస్తే పరిస్థితి కొంత మెరుగు పడవచ్చు.మొదటిది ప్రాదమిక విద్య మాతృభాషలోనే జరగాలి.రోహిత్ వీర విక్రమోపేతమైన విజృంభణకి అతనికి తెలుగు భాష మీద ఉన్న గట్టి పట్టు కారణం అని మీకూ తెలుసు!ఇంగ్లీషు వ్యామోహాన్ని వదులుకుని ప్రపంచంలో ఉన్న ప్రముఖమైన భాష లన్నిట్నీ నేర్పి మన కుర్రాళ్ళని ఎక్కడైనా బతకగలిగే విధంగా తీర్చిదిద్దాలి.రెంవది ప్రతి డిగ్రీకి ఒక ఉపాధిని తప్పనిసరిగా లింకప్ చెయ్యాలి.ప్యూర్ సైన్స్,క్లీన్ ఆర్ట్స్ అనే చెత్త కోర్సులు అనవసరం.వీలుంటే వీటిని మిగతా వాటికి బ్యాక్ ఎండ్ సబ్జక్టులుగా మారిస్తే మంచిది.మూవది ఉపాధి రంగాన్ని ఒకే పెద్ద పిరమిద్ మాదిరిగా కేంద్రీకరించి ఉంచకుండా పది చిన్న చిన్న పిరమిడ్లుగా విగొట్టి వికేంద్రీకరించాలి.వీటివల్ల విద్యలోనూ ఉపాధిలోనూ పోటీ తగ్గి మనుషుల మధ్య పరస్పర సహకారం పెరుగురుంది.

          కులరహిత సమాజం కోరుకునే దళితబ్రాహ్మణశ్రేష్ఠులు అది సాధించాలంటే కులాంతర వివాహాలు చేసుకోవడాన్ని సమర్ధించాలి.కానీ రిజర్వేషన్ల కోటాలో వాటా కావాలంటే కులం శుద్ధంగా ఉండాలి గాబట్టి పైకెదిగిన కులాల వారికన్నా దానివల్ల జరిగబోయే కులసంకరాన్ని మార్పుని వ్యతిరేకించిన ఒకప్పటి బ్రాహ్మణుల కన్నా ఇవ్వాళ అణగారిన కులనేతలే గట్టిగా వ్యతిరేకిస్తారు!రిజర్వేషన్లు ఎత్తెయ్యనిదే కులాల కుమ్ములాటలు పోవు - అది సత్యం!కులాల కుమ్ములాటలు పోనిదే హిందువులు ప్రశాంతంగా ఉండలేరు - అది పరమసత్యం!!హిందువులు ఐక్యంగా ఉండనంతకాలం దేశానికి భద్రత ఉండదు - అది నిష్ఠుర సత్యం!!!

          ఋగ్వేదంలో ఒకచోట దేవీభాగం అనే అద్భుతమైన విషయం గురించిన ప్రస్తావన ఉంది. ఆ భావన లోని గొప్పదనాన్ని గుణదోషాల మధ్య తారతమ్యాలు తెలిసిన ఒక మంచి కమ్యునిష్టు మేధావి "వర్గరహితసమాజం అనే భావనకి మన పూర్వులు చాలా కాలం క్రితమే ఎంతో దగ్గిరగా వెళ్ళినట్లు తెలుస్తున్నది" అని ప్రశంసించారు.

శ్లో|| సంగచ్చద్వం సంవదద్వం
       సంవో మనాసి జానతాం
       దేవీభాగం యధా పూర్వే
       సంజా నానా ఉపాసతే!

          ఋగ్వేదం లోని ఈ మంత్రం యొక్క సారాంశ మిది - "కలిసి నడుద్దాం.కలిసి మాట్లాడుకుందాం.కలిసి మెలిసి ఒకరి మనస్సు లొకరం తెలుసుకుందాం.మన పూర్వులు దేవీభాగాన్ని యెలా పంచుకునేవారో అలాంటి జ్ఞానాన్ని ఉపాసింధుదాం!"దేవీభాగం అంటే - పసిపిల్లలకూ, దంతాలు లేని వృద్ధులకూ మెత్తని మాంసం మొదట ఇవ్వాలి.తర్వాత దౌహృదులకి - రెండు హృదయాలు ఉండే గర్భవతులకి రెట్టింపు మాంసం ఇవ్వాలి.అలా వారందరికీ పంచగా మిగిలిన మాంసాన్ని యువతీ యువకులకీ, జవసత్వాలు గలిగి సంపద పెంచే ఇతరులకీ పెట్టాలి.ఇటువంటి మంచి విషయాలు తెలుసుకుంటే విద్యార్ధుల కైనా ఉద్యోగార్ధుల కైనా ఆత్మహత్య చేసుకోవాలని అనిపించదు, జీవితం మీద ఆశ పుదుతుంది!


సర్వే జనాః సుఖినో భవంతు!

Monday, 1 February 2016

నీ ప్రేమ నాకు భవరాగ బంధమోక్షణం!శ్రీ రుక్మిణీనాధ, నీ ప్రేమ నాకు దివ్యౌషధం!

పల్లవి:నీ ప్రేమ నాకు భవరాగ బంధమోక్షణం!
            శ్రీ రుక్మిణీనాధ,నీ ప్రేమ నాకు దివ్యౌషధం!

చరణం 1:  ఆలుబిడ్డలు అన్నదమ్ము లైనాను
                   బ్బుదస్క ముంటేనె ఇష్టంగ వస్తారు
                   డబ్బు లేని కాలాన దూరంగ పోతారు
                   నన్ను మెచ్చనివారి రాకపోకలు లెక్కజెయ్యను
                   నువ్వు నాకు దూరమైతేనె నీరసించి అణగారి అల్లాడిపోతాను - హరిఓం!
||పల్లవి||
చరణం 2:  చచ్చీ చావక బతికే బానిసీడులు కొందరు
                   చచ్చీ చావక నిలిచే పుణ్యమూర్తులు కొందరు
                   మందిని చంపి పెరిగే ధూర్తజనులు కొందరు
                   కాలాని కెదురీది దేహధారు లెవ్వరు బతకలేరు
                   నువ్వు చూపిన దారిలో నడిస్తేను అందరి బంధువులై నిలుస్తారు- హరిఓం!
||పల్లవి||
చరణం 3:  తన్ను కాదన్నాదని ముఖాన్ని మైలజేసి పాడుజేసేది
                   తన పక్కకు రాలేదని ఇంకెవ్వరి పక్కకు పోనివ్వనిది
                   తను మెచ్చింది తనకే దక్కాలనేది సహజప్రేమ కాదు
                   మెచ్చినది పచ్చగ ఉండాలని కోరుకునేది గొప్పమనసు
                   బతికించేది తప్ప చంపిపాతరేసేది దౌర్జన్యప్రేమ నాకొద్దు నాకొద్దు - హరిఓం!
||పల్లవి||
చరణం 4:  గట్టిగ రాసిన పరిక్ష తన్నేసిందని చచ్చేటివాళ్ళు
                   మెచ్చిన పడుచు పక్కకు రాలేదని చచ్చేటివాళ్ళు
                   హెచ్చుగ భోగాలు ఒరిగిపడలేదని చచ్చేటివాళ్ళు
                   నీ తత్వ మెరుగలేరు నిన్నెన్నడు కనుగొనలేరు
                   నిన్ను నమ్మిన వాడెవ్వ డనాధ కాడు, నన్ను మాత్రమట్లు చావనీకు - హరిఓం!
||పల్లవి||
చరణం 5:  ఆకలిదప్పులకు మాడి చావనివ్వకు
                   ఆలుబిడ్డల దుఃఖము చూడనివ్వకు
                   తీర్చలేని అప్పుల బారిన పడనివ్వకు
                   రాకపోకల మర్యాదలందు లోటు రానివ్వకు
                   తిండీబట్టాఇల్లూపరువు లివ్వుచాలు నిన్ను పొగుడుకుంటు కాలం గడిపేస్తాను - హరిఓం!
||పల్లవి||
-----------------------------------------------------------------------------------------------------------------
(01/02/2016)

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...