పురాణకధలకి కూడా మసాలా జోడింపుల కోసం డబ్బు పిచ్చి డ్రామారావు మొదలు భక్తి పిచ్చిలా ఎక్కిన కార్టూనిస్టు బాపు వరకు మార్చి తీసిన సినిమాలు చూట్టం తప్ప మూలకధ తెలియక పోవటం వల్ల ధర్మరాజులో హీరో మెటీరియల్ లేదనుకుంటున్నారు.మూలకధని చెప్పాల్సిన పండితులు సామాన్యుల కన్న అజ్ఞానంలో ఉన్నారు.కాబట్టి,ధర్మరాజు పుట్టుక మొదలు స్వర్గారోహణ వరకు నడిచిన కధలో కొన్ని గూస్ బంప్స్ అంటారే,అలాంటి జలదరింపులు వచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి.ఒక్కొక్కదాన్నీ క్లుప్తంగా విశ్లేషిస్తాను.
01. గాంధారీ కుంతీ ఒకేసారి గర్భం ధరించారు.ఇద్దరూ రెండో కొంపలో చారుల్ని పెట్టి ఆ రెండో ఆడదాని గర్భం ఏ దశలో ఉంది అనే విషయాలు కూపీలు లాగుతూ గడిపారు.ఆఖరికి కుంతి ధర్మరాజుని కనేసింది,మరోసారి గర్భం దాల్చింది,గాంధారి ఈర్ష్యతో అసూయతో దుఃఖంతో రగిలిపోయి గర్భస్థ పిండాన్ని ముక్కలు చేసుకుంది,వ్యాసుడు 101 incubation chambersలో పెట్టి Timer ఏర్పాటు చేశాడు.కలి తనకు అనుకూలమైన సమయం చూసుకుని దూరటంతో మొదటి కుండ నుంచి దుర్యోధనుడు పుట్టాడు.అక్కడ కుంతికి భీముడు పుట్టాడు.ఇద్దరూ ఒకేసారి పుట్టటం కేవలం random coexistence - అయిదుగురు మహాబలులు ఒకేసారి పుట్టటమూ వాళ్ళలో మొదట ఎవడు ఇంకోణ్ణి చంపితే మిగిలిన ముగ్గుర్నీ కూడా మొదటివాడే చంపుతాడనటమూ అంతా ట్రాష్.
కొంతమంది బ్రాహణోత్తములూ ముప్పాళ రంగనాయకమ్మ లాంటి కమ్యూనిష్టులూ జ్యేష్ఠుడైన ధృతరాష్ట్రుడికి పుట్టాడు గనక హస్తినాపుర రాజ్యానికి న్యాయమైన వారసత్వం దుర్యోధనుడిదే అని వాదిస్తున్నారు గాబట్టి దానికి జవాబు చెప్పాలి.నేను కాదు,బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కుండబద్దలు కొట్టి చెప్పేశారు.ఒక తరంలో అన్నదమ్ములు ఇద్దరు ఉన్నా వందమంది ఉన్నా వాళ్ళలో ఎవరికి మొదట మగపిల్లవాడు పుడితే వాడే అన్నదమ్ములు అందరికీ వచ్చే తరంలో జ్యేష్ఠపుత్రుడు అవుతాడు.ఇది మహాభారత కాలానికి చాలా కాలం ముందు నుంచీ వస్తున్న వారసత్వ నియమం.ఇప్పటికీ అదే నియమం కొనసాగడం వల్లనే శుభలేఖలని వధూవరుల తల్లిదండ్రుల పేర్లతో గాక ముందు తరంలో బతికి ఉన్న పెద్దమనిషి పేరు మీద వ్రాయించుతున్నారు.అలా ధృతరాష్ట్రుడు అనే అన్నకి గాంధారి వల్ల తర్వాత పుట్టిన దుర్యోధనుడు గాక పాండురాజు అనే తమ్ముడికి కుంతి వల్ల ముందు పుట్టిన ధర్మరాజు జ్యేష్ఠపుత్రుడై హస్తినాపురానికి న్యాయమైన వారసుడు ఐపోయాడు.గాంధారికి శోకం కలిగింది అందుకే.
ఏ మాట కా మాటే చెప్పాలి - అక్కడ కొంత కాలం పాటు ఈర్ష్య పడటం మినహాయిస్తే గాంధారిలో మరే లోపమూ లేదు.కానీ, గర్భిణీ అయి ఉన్న సమయంలో చూపించిన అతి ఉద్రేకం పెద్ద కొడుక్కి అంటుకుని తనే ఎన్ని సార్లు చావుతిట్లు తిట్టినప్పటికీ మారి మంచివాడు కాలేకపోయాడు దుర్యోధనుడు.అందుకే,గర్భిణీ స్త్రీలని పుట్టింటికి పంపించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచమని పెద్దలు చెప్పారు, చెప్తున్నారు, చెప్తారు.శాస్త్రం మీద గౌరవం ఉన్నవాళ్ళు పాటిస్తున్నారు.
పేరు ముందు "దు" ఉండటం negative అనుకున్నాడు కాబోలు - సంస్కృతంలో సమగ్ర పాండిత్యం లేని డ్రామారావు తను నటించిన సినిమాల్లో దుర్యోధనుడికి "సుయోధనుడు" అని పేరు పెట్టి ఇతర పాత్రలతో అలానే పిలిపించుకున్నాడు.అయితే, "దుర్యోధనుడు" అనే పదానికి "ఇతరులకి జయింప శక్యం కానివాడు" అనే అర్ధమూ "సుయోధనుడు" అనే పదానికి "ఇతరులకి తేలికగా వోడిపోయేవాడు" అనే అర్ధమూ వస్తాయి - ఏది పాజిటివ్ ఏది నెగటివ్?
02. ధర్మరాజు పుట్టేటప్పటికి హస్తినాపురంలో ధృతరాష్టుడు కొలువు దీరి ఉన్నాడు.అది నిజానికి పాండురాజు పెద్ద ముండా వాడు కుళ్ళి చస్తాడని చొరవ తీసుకుని అన్నని కూర్చోబెట్టడం వల్ల సంక్రమించిన అధికారం.అప్పటి వారసత్వ నియమం ప్రకారం చిన్నవాడైన పాండురాజుకి మొదట పుట్టిన యుధిష్ఠిరుడికి పుట్టుకతోనే హస్తినాపురం యొక్క వారసత్వం నిర్ధారణ అయిపోయింది.
ప్రవచన కర్తలు ఎవరూ చెప్పని ఒక కొత్త విషయం చెప్తున్నాను - చాలా ముఖ్యమైన పాయింటు ఇది,గుర్తుంచుకోండి.ప్రవచన కర్తలు మహాభారతంలో ప్రతి పాత్రలోనూ మంచీ చెడూ కలగలిసి ఉంటాయి అని చెప్తారు గానీ అది అబధ్ధం.ఇవ్వాళ్టి సినిమాల్లో మెయిన్ విలనూ సబ్బు విలన్లూ ఉన్నట్టు వ్యాసుల వారు జయేతిహాసం అన్న పేరున వ్రాసిన మూలకధలోనూ కవిత్రయ భారతంలోనూ పూర్తి మంచితనం ఉన్న వాళ్ళూ పూర్తి చెడ్డతనం ఉన్నవాళ్ళూ కొల్లలు కొల్లలై ఉన్నారు.మనవాళ్ళు తీసిన అన్ని పౌరాణికాల్లోనూ ఫోకస్ ఎక్కువ దుర్యోధనుడి మీద పెట్టి ధృతరాష్ట్రుణ్ణి ఒక సైడున కూర్చోబెట్టి చూపించారు గానీ అసలు కధలో ధృతరాష్ట్రుడే మెయిన్ విలన్.మహాభారతం జరిగిన కధ కాకపోతే ప్రపంచ సాహిత్యంలో ఇంతకన్న నీచమైన పాత్రని ఏ రచయితా సృష్టించలేదని ఒప్పుకోవాలి.మహాభారతం జరిగిన కధ అయితే ప్రపంచ దేశాల్లో ఇంతకన్న నీచమైన రాజపురుషుడు ఏ వంశంలోనూ పుట్టలేదని ఒప్పుకోవాలి.
అన్నకు ఇచ్చింది కేవలం కుర్చీ మీద కూచుని రాజముద్రలు వెయ్యటం తప్ప ఇంకే పనీ లేని హోదాయే.పరిపాలన అంతా మంత్రుల సమాలోచనలతో సలహాలతో జరుగుతూ ఉండేది.తను జైత్రయాత్రలకి వెళ్ళి రాజ్యాన్ని విస్తరించి ఆదాయాన్ని పెంచాక ఋష్యాశ్రమాల్లో కాలం గడుపుతున్నప్పుడు పిల్లలు పుట్టారు.శాపవసాన పాండురాజుకి చావు తప్పని పరిస్థితిలో మాద్రి పాండురాజుతో సహగమనం చేస్తే కుంతి ఒక్కతే అడివిలో మిగిలింది.నగరానికి రమ్మని పిలవాలని అనిపించలేదు గుడ్డివాడికి.ఆఖరికి ధర్మరాజుకి యుక్తవయస్సు వచ్చేనాటికి భీష్ముడు కలగజేసుకుని కొంచెం సుత్తేసి రాజ్యానికి వారసుడు ధర్మరాజే అని గుర్తు చేసి ఒక విధాన ములుగర్ర పోట్లు పొడిస్తే అప్పుడు పిలిపించి అందరికీ చదువులు చెప్పించటం మొదలు పెట్టాడు.
భీష్ముడు ధృతరాష్ట్రుడికి వేసిన సుత్తిలో అంధతమసుడు అనే ఒక గుడ్డి ఋషి కధ వస్తుంది.పనిగట్టుకుని భీష్ముడు ఆ కధనే ఎందుకు చెప్పాడో తెలుసా - ఆ ఇద్దరిలోనూ పూర్వకృతం వల్లనో ఏమో గానీ తమకు ప్రాప్తించిన గుడ్డితనం దేవుడు తనకు చేసిన అన్యాయం అనుకుని "దేవుడే నాకు అన్యయం చేసినప్పుడు ఇతర్లకి నేను అన్యాయం చేస్తే తప్పేమిటి?" అనే తప్పుడు ఆలోచనలతో చెయ్యగూడని అకార్యాలు చేస్తూ కూడా కనీసపు పశ్చాత్తాపం లేని స్వభావం ఉంది.ఒక కుటుంబ యజమాని స్థానంలో ఉన్న అంధతమసుడి యేడుపుగొట్టు అరాచకత్వం వల్ల అతని కుటుంబం ఒక్కటే బాధలు పడింది,ఒక మహాసామ్రాజ్యానికి ఆధిపత్యం వహిస్తున్న ధృతరాష్ట్రుడి యేడుపుగొట్టు అరాచకత్వం వల్ల ఒక మహాసామ్రాజ్యం అంతరించిపోయింది!
మూలకధను చదవకపోవడం వల్ల చాలామందికి తెలియదు గానీ ధృతరాష్టుడు ఖాండవప్రస్థం పొమ్మనే నాటికి ధర్మరాజుకి యౌవరాజ్య పట్టాభిషేకం జరిగిపోయింది.జరక్కపోయినా మించిపోయిందీ లేదు - కుంతితో పాటు అయిదుగురు పిల్లలూ నగరానికి వస్తున్నప్పుడు వాళ్ళకి ప్రజలు యువరాజులకి పలికే స్థాయిలో ఆహ్వానాలు పలికి పండగ చేసుకున్నారు.ఖాండవప్రస్థం అనే ప్రాంతాన్ని సెలక్ట్ చెయ్యటంలోనే ధృతరాష్ట్రుడి దుర్మార్గం కనిపిస్తుంది.అది అటవీ ప్రాంతం,పైన మయాసురుడి కబ్జాలో ఉంది.తమ పాటికి తాము ధర్మరాజుకి న్యాయం చేశామన్నట్టూ ఉంటుంది,రాజ్యస్థాపన చెయ్యలేక ధర్మరాజు సంకనాకిపోతే తమకు న్యాయం జరిపించుకున్నట్టూ ఉంటుంది అనేది గుడ్డివాడి దురాలోచన.
కృష్ణుడూ అర్జునుడూ కలిసి కొన్ని అతీంద్రియాల్ని చూపించటం వంటివి పిట్టకధల కింద తీసేస్తే అలాంటి చోట కూడా రాజ్యస్థాపన చేసి అతి తక్కువ కాలంలోనే హస్తినాపురాన్ని మించిన వైభవాన్ని సాధించి ఖాండవప్రస్థం అన్న పేరుని ఇంద్రప్రస్థం చేసి రాజసూయం కూడా చెయ్యగలిగాడు ధర్మరాజు.పెదనాన్న,"మావాడి గోల భరించలేకపోతున్నాను.నువ్వు మంచివాడివి కదూ!ఈ రాజ్యాన్ని మావాడికి ఇచ్చేసి నువ్వు ఖాండవప్రస్థం పోదూ!" అని అన్నప్పుడు లేదు కాదని అనక హక్కుని కూడా వొదులుకోవటం అమాయకత్వం వల్ల కాదు.తన సమర్ధత మీద తనకి ఉన్న నమ్మకమూ ఆత్మవిశ్వాసమే ధర్మరాజుని వడ్డించిన విస్తరి లాంటి హస్తినాపురాన్ని వదులుకునేలా చేసి ఖాండవప్రస్థం వైపుకి నడిపించింది.అది ధర్మరాజు యొక్క హీరో మెటీరియల్,కాదూ!
03. ధర్మరాజు ఖాండవప్రస్థం రావడం ద్రౌపదిని పెళ్ళి చేసుకున్నాకనే జరిగింది.అయితే,ద్రౌపదీ పరిణయం నాటికి పాండవులు ప్రఛ్చన్నంగా ఉన్నారు.అది ఎందుకు జరిగింది?భీష్ముడి సూచన మేరకు కుంతితో సహా పాండు కుమారులను హస్తినాపురం రప్పించాడు ధృతరాష్ట్రుడు.ఒక సంవత్సరం గడువు ముగిసిన తరువాత, ధృతరాష్ట్రుడు , ప్రజల పట్ల దయతో కదిలి, అతని దృఢత్వం, దృఢత్వం, సహనం, పరోపకారం, నిజాయితీ మరియు అచంచలమైన నిజాయితీ (హృదయం) కారణంగా రాజ్యానికి వారసుడిగా యుధిష్ఠిరుడిని ప్రతిష్టించాడు.
రెండవ పాండవుడు, వృకోదరుడు , ఖడ్గం మరియు గదాదండం మరియు రథంపై సంకర్షణ బలరాముని నుండి నిరంతర పాఠాలు పొందడం ప్రారంభించాడు . భీముని విద్యాభ్యాసం ముగిసిన తరువాత అతను ద్యుమత్సేనుడి వలె బలవంతుడయ్యాడు మరియు తన సోదరులతో సామరస్యంగా జీవించడం కొనసాగించాడు. అర్జునుడు అతని కదలికలోని కౌశలం, లక్ష్యం యొక్క ఖచ్చితత్వం సాధించి క్షుర, నారచ, బల మరియు విపథ ఆయుధాలను ఉపయోగించడంలో అతని ప్రావీణ్యం వలన కీర్తించబడ్డాడు.
సహదేవుడు ఖగోళ ఆధ్యాత్మిక అధిపతి అయిన బృహస్పతి నుండి మొత్తం నైతికత మరియు విధులను పొందాడు మరియు అతని సోదరుల నియంత్రణలో జీవించడం కొనసాగించాడు. ద్రోణుడు బోధించిన తన సోదరులకు ఇష్టమైన నకులుడు , నైపుణ్యం కలిగిన యోధుడు మరియు గొప్ప కారు-యోధుడు అతి-రథుడు అని పేరు పొందాడు. నిజానికి, అర్జునుడు మరియు ఇతర పాండవ యువరాజులు ఎంత శక్తివంతమయ్యారు అంటే, వారు గంధర్వుల దాడులకు భయపడకుండా మూడు సంవత్సరాల పాటు యాగం చేసిన గొప్ప సౌవీరుని యుద్ధంలో చంపారు . బలవంతుడైన పాండు కూడా లొంగదీసుకోవడంలో విఫలమైన యవనుల రాజును అర్జునుడు అదుపులోకి తెచ్చాడు.
ఆ విధంగా మనుష్యులలో అగ్రగణ్యులైన పాండవులు, ఇతర రాజుల భూభాగాలను జయించి, తమ సొంత రాజ్య పరిమితులను విస్తరించారు. కానీ ఆ పరాక్రమం మరియు బలాన్ని చూసి పాండవుల పట్ల రాజు ధృతరాష్ట్రుడి మనోభావాలు అకస్మాత్తుగా విషపూరితమయ్యాయి.చక్రవర్తి చాలా ఆందోళన చెందాడు.అధిక శక్తితో కూడిన పాండు యొక్క వీర కుమారులు చాలా పరాక్రమవంతులుగా మారారని విని, రాజు ధృతరాష్ట్రుడు ఆందోళనతో చాలా దయనీయంగా ఉన్నాడు. అప్పుడు మంత్రిలో అగ్రగామి, రాజనీతి శాస్త్రంలో ప్రావీణ్యం కలవాడు, సలహాలు చెప్పడంలో నిపుణుడైన కణికను తన వైపుకు పిలిచి రాజు ఇలా అన్నాడు, “ఓ బ్రాహ్మణులలో శ్రేష్ఠులారా, పాండవులు ప్రతిరోజూ భూమిని కప్పివేస్తున్నారు. నేను వారి పట్ల విపరీతమైన అసూయతో ఉన్నాను. నేను వారితో శాంతితో సహజీవనం చెయ్యాలా, యుద్ధం చేయాలా? ఓ కనికా, నాకు నిజంగా సలహా ఇవ్వు, ఎందుకంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను." అని అడిగాడు.
కణికుడు తొలిదశలో "పాపం లేని రాజా, నేను నీకు జవాబిచ్చేది వినండి. నేను చెప్పేదంతా విని మీరు నాపై కోపగించుకోవద్దు. రాజులు అవసరమైనప్పుడు కొట్టడానికి ఎత్తబడిన దండలతో ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి మరియు వారు ఎప్పుడైనా తమ పరాక్రమాన్ని పెంచుకోవాలి. అన్ని దోషాలను జాగ్రత్తగా తప్పించుకుంటూ, వారు తమ శత్రువుల లోపాలను నిరంతరం గమనించాలి మరియు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. రాజు ఎప్పుడూ కొట్టడానికి సిద్ధంగా ఉంటే, అందరూ అతనికి భయపడతారు. కావున రాజు తాను చేసే ప్రతి పనిలో శిక్షను ఆశ్రయించాలి. తన శత్రువు తనలోని ఏ బలహీనమైన కోణాన్ని గుర్తించలేనంతగా అతను తన ప్రవర్తనను కలిగి ఉండాలి. కానీ అతను తన శత్రువులో గుర్తించిన బలహీనత ద్వారా అతన్ని నాశనం చేయడానికి వెంబడించాలి.
నీకు చెడు చేసే శత్రువును వధించడం ఎల్లప్పుడూ స్తుతించదగినది.మీ శత్రువు మీ అధీనంలో ఉన్నప్పుడు, బహిరంగంగా లేదా రహస్యంగా అతన్ని నాశనం చేయండి. అతను మీ రక్షణను కోరినప్పటికీ, అతనిపై దయ చూపవద్దు. ఒక శత్రువు, లేదా ఒకసారి మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తి, అవసరమైతే, డబ్బును విపరీతంగా ఖర్చు చేయడం ద్వారా నాశనం చేయాలి, ఎందుకంటే అతన్ని చంపడం ద్వారా మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. చనిపోయినవారు ఎప్పుడూ భయాన్ని కలిగించలేరు. పండ్లను తీయడంలో అనుసరించే పద్ధతి శత్రువులను నాశనం చేసే పద్ధతిగా ఉండాలి.సంధి కళల ద్వారా లేదా ధన వ్యయంతో శత్రువును చంపాలి. అతని మిత్రుల మధ్య అనైక్యతను సృష్టించడం ద్వారా లేదా బలవంతంగా ఉపయోగించడం ద్వారా, వాస్తవానికి మీ శక్తిలో ఉన్న అన్ని మార్గాల ద్వారా మీరు మీ శత్రువును నాశనం చేయాలి." అని సాత్విక రాజనీతిని బోధించాడు.
ఇందులో ఉన్న సూక్ష్మాన్ని పసిగట్టిన ధర్మచక్షువు "శత్రువు సంధి కళల ద్వారా లేదా డబ్బు ఖర్చు చేయడం ద్వారా లేదా అనైక్యతను సృష్టించడం ద్వారా లేదా బలవంతంగా ఎలా నాశనం చేయవచ్చో నాకు నిజంగా చెప్పండి." అని అడిగాడు.ఈసారి కణికుడు స్నేహితులను మోసం చేసి తన పబ్బం గడుపుకున్న ఒక నక్క కధను చెప్పాడు.కానీ, అదంత వర్కౌట్ అయ్యేది కాదని తెలుసుకున్న గుడ్డిరాజు అప్పటికి కణికుణ్ణి పంపించేసి బెంగతో రోజులు గడుపుతున్నాడు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు దుర్యోధనుడు భీమసేనుడు శక్తిలో అందరినీ అధిగమించడం మరియు ఆయుధాలలో అత్యున్నత నిష్ణాతుడైన అర్జునుడు విజృంభించటం గమనించాడు. కర్ణుడు మరియు శకుని, పాండవులను చంపివెయ్యటానికి వివిధ మార్గాల ద్వారా ప్రయత్నించారు. పాండవులు కూడా ఆ కుట్రలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి తిప్పికొట్టారు.అయితే, విదురుడి సలహాలకు విధేయత చూపుతూ వాటి గురించి మాట్లాడలేదు.కానీ,పౌరులకు విషయాలు తెలుస్తున్నాయి,వారు పాండు యుధిష్ఠిరుని పెద్ద కొడుకు రాజ్యాన్ని పాలించే అర్హతలు కలిగి ఉన్నాడని మాట్లాడుకుంటున్నారు.
ఈ మాటలు విన్న దౌర్భాగ్యుడైన దుర్యోధనుడు చాలా బాధపడ్డాడు. తీవ్ర బాధకు గురైన దుష్ట యువరాజు ఆ ప్రసంగాలను సహించలేకపోయాడు. అసూయతో మండిపడి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి, ఒంటరిగా ఉన్న అతనిని కనుగొని, యుధిష్ఠిరుని పట్ల పౌరుల పక్షపాతాన్ని చూసి బాధతో, భక్తితో నమస్కరించి, చక్రవర్తిని ఉద్దేశించి ఇలా అన్నాడు:“ఓ తండ్రీ, పౌరులు విడిపోవడాన్ని నేను విన్నాను. చెడు శకున పదాలు. నిన్ను దాటి భీష్ముడు కూడా పాండు కుమారుడే తమ రాజుగా ఉండాలని కోరుకుంటారు. భీష్ముడు దీనిని మంజూరు చేస్తాడు, ఎందుకంటే అతను రాజ్యాన్ని పాలించడు. అందువల్ల, పౌరులు మాకు పెద్ద గాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది.
పాండు కుమారుడు ఇప్పుడు రాజ్యాన్ని పొందినట్లయితే, అతని తర్వాత అతని కొడుకు మరియు ఆ కొడుకు కొడుకు కూడా దానిని పొందుతాడు.అలాంటప్పుడు, రాజవంశం నుండి మినహాయించబడిన మన పిల్లలతో మనం ఖచ్చితంగా పురుషులందరిచే విస్మరించబడతాము. కాబట్టి, మన ఆహారం కోసం ఇతరులపై ఆధారపడకుండా, మనం నిత్యం కష్టాలను అనుభవించకుండా ఉండేలా అలాంటి సలహాలను పాటించండి."
ఇక్కడ పౌరాణిక ప్రవచనకర్తలు చెప్పని మరొక విషయాన్ని చెప్తున్నాను.ధృతరాష్ట్రుడికి "ధర్మచక్షువు" అనే ప్రశస్తి ఉంది.కేవలం తన కొడుకు మీద మాత్రమే ఎక్కువ ప్రేమ ఉన్నది గానీ తమ్ముణ్ణీ తమ్ముడి కొడుకుల్నీ ద్వేషించలేదు.కొడుకు మాటలకి కొంత మెత్త బడ్డాడు గానీ దుర్యోధనుడు చెయ్యాలనుకుంటున్న నీచత్వానికి పూర్తి మద్దత్తు ఇవ్వలేదు.
దాంతో దుర్యోధనుడు తన శ్రేయోభిలాషులైన కర్ణుడు,శకుని,దుశ్శాసనులతో కలిసి ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు.అదే ధర్మరాజుని వారణావతం వెళ్ళేలా చెయ్యటం.యువరాజు దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు: “ఓ తండ్రీ, కొంత తెలివితో పాండవులను వారణావత పట్టణానికి పంపండి. అప్పుడు మేము వారికి భయపడము."
తన కొడుకు చెప్పిన ఈ మాటలు విన్న ధృతరాష్ట్రుడు ఒక్క క్షణం ఆలోచించి దుర్యోధనుడికి ఇలా జవాబిచ్చాడు, “పాండురాజు ఎప్పుడూ ధర్మానికి అంకితమైనవాడు. ఎల్లప్పుడూ తన బంధువులందరి పట్ల,ముఖ్యంగా నాపట్ల విధిగా ప్రవర్తించేవాడు. అతను ప్రపంచంలోని ఆనందాల పట్ల చాలా తక్కువ శ్రద్ధ వహించాడు, కానీ అంకితభావంతో నాకు రాజ్యాన్ని కూడా ఇచ్చాడు. అతని కొడుకు తనలాగే పుణ్యం కోసం అంకితభావంతో ఉన్నాడు. ప్రజల అభిమానం పొందాడు. అతను మిత్రులను కలిగి ఉన్నాడు; అతని పూర్వీకుల రాజ్యం నుండి బలవంతంగా ఎలా బహిష్కరించగలము? రాష్ట్రంలోని మంత్రులు మరియు సైనికులు మరియు వారి కుమారులు మరియు మనుమలు అందరూ పాండురాజుచే ప్రతిష్టించబడ్డారు. ఓ బిడ్డా, ఇప్పుడు యుధిష్ఠిరుని కారణంగా పౌరులు మన స్నేహితులు మరియు బంధువులందరితో కలిసి మమ్మల్ని చంపలేరా?"
దానికి దుర్యోధనుడు, “ఓ తండ్రీ, నువ్వు చెప్పేది చాలా నిజం. కానీ భవిష్యత్తులో నీకే పొంచి ఉన్న చెడును దృష్టిలో ఉంచుకుని, మనం ప్రజలతో మమేకమై సంపదలు, గౌరవాలు కల్పిస్తే, మన శక్తికి ఈ నిదర్శనాల కోసం వారు ఖచ్చితంగా మన పక్షాన నిలుస్తారు. ఖజానా మరియు రాష్ట్ర మంత్రులు, ఈ సమయంలో మా నియంత్రణలో ఉన్నారు. కావున, పాండవులను వరణావత పట్టణానికి కొంత సున్నితంగా బహిష్కరించడం ఇప్పుడు మీకు కనిపిస్తోంది; ఓ రాజా, సార్వభౌమాధికారం నాకు అప్పగించబడినప్పుడు, కుంతి తన పిల్లలతో ఆ ప్రదేశం నుండి తిరిగి రావాలి." అని అక్కడే చంపించాలనే ప్లానుని గాక తను ప్రభుత్వంలో పాతుకుపోయాక తిరిగి రప్పించుదాం అనేటట్టు మాట్లాడాడు.
దానికి ధృతరాష్ట్రుడు కొంత బాధపడి కొంత మోజుపడి మళ్ళీ అంత దుర్మార్గం చెయ్యడానికి సంకోచిస్తుంటే దుర్యోధనుడు ఇలా సమాధానమిచ్చాడు, “భీష్మునికి ఇరువైపుల పట్ల మక్కువ ఉండదు, కాబట్టి వివాదాల విషయంలో తటస్థంగా ఉంటాడు. ద్రోణుని కొడుకు అశ్వత్ధామ నా వైపు ఉన్నాడు. కొడుకు ఎక్కడ ఉంటాడో అక్కడ తండ్రి ఉంటాడు అనడంలో సందేహం లేదు. ద్రోణుడు, అశ్వత్థామనుడు ఉండే వైపు కృపాచార్యుడు కూడా ఉండాలి. అతను ద్రోణుని, అశ్వత్థామను ఎప్పటికీ విడిచిపెట్టడు. క్షత్రియ విదురుడు శత్రువుతో రహస్యంగా ఉన్నప్పటికీ తన జీవన సాధన కోసం మనపైనే ఆధారపడి ఉన్నాడు. అతను పాండవుల పక్షం వహిస్తాడు, అతను ఒంటరిగా మనకు ఎటువంటి గాయం చేయలేడు, కాబట్టి పాండవులను ఎటువంటి భయం లేకుండా వారణావతానికి బహిష్కరించు. మరియు వారు ఈ రోజు అక్కడికి వెళ్లేలా చర్యలు తీసుకోండి."చూశారు కదా తండ్రీ కొడుకుల దురాలోచనలు!
ఆ తర్వాత జరిగిన రాజకీయం ఇది:యువరాజు దుర్యోధనుడు, తన సోదరులతో కలిసి సంపద మరియు గౌరవాల మంజూరు ద్వారా ప్రజలను క్రమంగా తన వైపుకు గెలుచుకోవడం ప్రారంభించాడు. ధృతరాష్ట్రునిచే ఉపదేశించబడిన ఉద్యోగులు పాండవులకు వినబడేటట్లు వారణావతాన్ని గురించి మాట్లాడారు, పాండవులకు ఆ రమణీయమైన పట్టణానికి వెళ్లాలని కోరిక కలిగింది.వాళ్ళు ముచ్చట పడుతున్నారని తెలిశాక ధృతరాష్ట్రుడు తనే కలగజేసుకుని వారణావ్తం వెళ్ళమని సలహా ఇచ్చాడు.ధర్మరాజుకి విషయం అర్ధమయ్యింది.కానీ, ఇదివరకటి విదురుని సూచన మేరకు "అలాగే పెదనాన్నా!" అని మాత్రమే అన్నాడు.
పాండు కుమారులలో పెద్దవారిని ఉద్దేశించి కౌరవ నాయకులందరూ ఉల్లాసంగా వారిపై దీవెనలు పలికారు, “పాండు కుమారులారా, మీ మార్గంలో అన్ని అంశాలు మిమ్మల్ని ఆశీర్వదించనివ్వండి మరియు మీకు చిన్న చెడు కూడా రానివ్వండి.” పాండవులు, రాజ్యంలో తమ వాటాను పొందడం కోసం ప్రాయశ్చిత్త కర్మలు చేసి తమ సన్నాహాలు ముగించుకుని వారణావతానికి బయలుదేరారు.అటు పాండవులు ప్రయాన అస్న్నాహాలలఓ ఉంటే ఇటు దుర్యోధనుడు పురోచనుడిని ఏకాంతంగా పిలిచి పాందవుల కన్న ముందే వెళ్ళి విడిదికి లక్కైంటిని నిర్మించాని పురమాయించాడు.తెలుగులో మనం "లక్క ఇల్లు" అంటున్న దానికి సంస్కృతంలో "లాక్షాగృహం,జతుగృహం" వంటి చాలా పేర్లు ఉన్నాయి.
ఇక్కడ కూడా ధర్మరాజు అమాయకంగా కనిపిస్తాడు గానీ అది అమాయకత్వం కాదు.మొదట ధృతరాష్ట్రుడి మనుషులు వారణావతం గురించి చెప్తున్నప్పుడు అమాయకంగానే విన్నాడు గానీ ధృతరాష్ట్రుడి నోటివెంట ఆ కబురు వింటున్నప్పుడే అనుమానించాడు.ధర్మరాజుకే కాదు,పాందవులను అభిమానించే పౌరులకు కూడా ఇందులో ఏదో కుట్ర ఉందనే అనుమానం వచ్చింది.కుట్ర అంటూ జరిగితే పాండవుల తరపున నిలబడటానికి వాళ్ళు కూడా బయల్దేరారు. “రాజు మా తండ్రి, గౌరవనీయుడు, మా ఆధ్యాత్మిక మార్గదర్శకుడు మరియు మా ఉన్నతాధికారి. అనుమానం లేని హృదయాలతో అతను ఏది వేలం వేసినా, అది నిజంగా మన కర్తవ్యం. మీరు మా స్నేహితులు. మా చుట్టూ తిరుగుతూ, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని సంతోషపరుస్తూ, మిమ్మల్ని మీ నివాసాలకు తిరిగి పంపండి. మీరు మా కోసం ఏదైనా చేయవలసిన సమయం వచ్చినప్పుడు, వాస్తవానికి, మాకు ఆమోదయోగ్యమైన మరియు ప్రయోజనకరమైనవన్నీ సాధించండి. ” అని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించేశాడు.
అలా పౌరులు అనుసరించడం మానివేసిన తర్వాతనే విదురుడు ధర్మరాజుకి మ్లేఛ్చభాషలో రహస్య సందేశాన్ని వినిపిస్తాడు.దానికి ధర్మరాజు "నేను నిన్ను అర్థం చేసుకున్నాను." అనే జవాబు చెప్పాడు.భీమార్జున నకుల సహదేవులకు అసలు అర్ధం కాలేదు.కుంతికి కొంత అనుమానం వచ్చింది.వారణావతం వెళ్ళగానే "ఏంట్రా అబ్బాయ్!విదురుడు నీతో అన్నది,నీకేం అర్ధం అయ్యింది?" అని అడిగేసింది.అగ్నిప్రమాదం సృష్టించి తమని చంపడానికి దుర్యోధనుడు ప్లాన్ చేశాడని చెప్పాడు.తప్పించుకోవాలి,కానీ వెంటనే బయటపడక కొంతకాలంపాటు ప్రఛ్చన్నులై ఉండాలి అనే తన కౌంటర్ ప్లాను కూడా చెప్పాడు.
పాండవులు ఫాల్గుణ మాసంలో ఎనిమిదవ రోజున రోహిణి నక్షత్రం ఉధృతంగా ఉన్నప్పుడు బయలుదేరి , వారణావతానికి చేరుకుని పట్టణాన్ని మరియు ప్రజలను చూశారు.వారణావతం చేరిన పాండవులకు, కుంతీదేవికి వారణావత ప్రజలు ఘనంగా స్వాగతం చెప్పారు. వారికోసం పురోచనుడు నిర్మించిన గృహాలను చూపి ఉండమన్నారు. శిల్పాచారుడైన పురోచనుని పాండవులు తగిన విధంగా పూజించి సత్కరించారు. పుణ్యాహవచనం చేసి గృహప్రవేశం చేసారు. ఆ గృహాన్ని అణువణువు పరిశీలించిన ధర్మరాజుకు అందులో ఏదో కృత్రిమత్వం గోచరించింది.
భీముని పిలిచి ఆగోడలను చూపి వాటి నుండి ఏదో వింత వాసన వస్తుందని చెప్పాడు. భీముడు అది చూసి "అన్నయ్యా వీటి నుండి లక్క, తైలం కలిపిన వాసన వస్తుంది. గృహం సమీపంలో ఆయుధాగారం ఉంది. ప్రమాదం పొంచి ఉంది" అని అభిప్రాయం వెలిబుచ్చాడు.విదురుడు చెప్పిన విషాగ్నులు ఇవే నని వారికి అర్ధం అయింది. భీముడు ఆవేశపడి "అన్నయ్యా మనం ఇప్పటి వరకూ ఉన్న పాత ఇంటిలో ఉండి పురోచనుని ఇంటితో తగులపెడదాము" అన్నాడు. దర్మరాజు భీమునితో "భీమా తొందరపడకు. విషయం మనకు తెలిసింది కనుక ప్రమత్తంగా ఉందాము. మనకు ఈ విషయం తెలిసిందని తెలిస్తే దుర్యోధనుడు పురోచనుడు వేరే ఉపాయం పన్నుతారు. అది మనకు తెలిసే అవకాశం రాక పోవచ్చు కనుక ఏమీ తెలియనట్లు ఉందాము" అన్నాడు. పురోచనుడు పాండవుల సేవ నిమిత్తం ఒక బోయ వనితను నియమించాడు. ఆమెకు ఐదుగురు కొడుకులు. వారంతా పాండవుల కదలికలను ఎప్పటికప్పుడు పురోచనునికి చేరవేస్తున్నారు.
హస్థినలో దుర్యోధనుని కుతంత్రం తెలుసుకున్న విదురుడు ఒక మనిషిని పాండవుల వద్దకు పంపాడు. విదురుడు చెప్పిన సంకేతం చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు. అతడు ధర్మరాజుతో "ధర్మ నందనా రాబోవు కృష్ణ చతుర్ధశి నాడు పురోచనుడు లక్క ఇంటిని తగుల పెట్టకలడు. కాబట్టి ఈ గృహం నుండి సొరంగ మార్గం త్రవ్వమని విదురుడు నన్ను పంపాడు" అన్నాడు. ధర్మరాజు విదురుని దూరదృష్టికి ఆశ్చర్య పడి ఆ ఖనకుడికి అనుమతి ఇచ్చాడు. ఖనకుడు లక్క ఇంటి నుండి వెలుపలికి బిల మార్గం ఏర్పాటు చేసాడు. భీముడు దానిని పరిశీలించి తృప్తి పడ్డాడు.
కృష్ణ చతుర్ధశి నాడు కుంతీదేవి వారణావతంలోని ముత్తైదువలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణలిచ్చి సత్కరించింది. ఆ రోజు రాత్రి బోయ వనిత కొడుకులతో కల్లు సేవించింది అందరూ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు. తరువాత భీముడు తల్లిని సోదరులను సొరంగ మార్గంలో పంపించి ముందుగా పురోచనుని ఇంటికి నిప్పు పెట్టి ఆ తరువాత తాము నివసించిన ఇంటికి నిప్పు పెట్టి ఆఖరుగా ఆయుధాగారానికి నిప్పు పెట్టి ఖనకుడికి తాము క్షేమంగా ఉన్నామని చెప్పాడు. ఆ తరువాత తాను కూడా సొరంగ మార్గం ద్వారా అన్న తమ్ములను, తల్లిని కలుసుకున్నాడు. వడి వడిగా నడుస్తూ వెళుతున్న వారు భీముని వేగాన్ని మిగిలిన వారు అందుకోలేక పోయారు. భీముడు తల్లిని వీపు మీద ఎక్కించుకుని ధర్మరాజుని, అర్జునిని చెరిఒక భుజంపై ఎక్కించుకుని నకుల, సహదేవులను రెండు చేతులతో ఎత్తుకుని వడి వడిగా నడిచాడు.
తెల్లవారగానే వారణావత ప్రజలకు లక్క ఇల్లు తగలబడిన విషయం తెలిసింది. దృతరాష్ట్రుని కుయుక్తికి ప్రజలు ఎంతగాగానో అతనిని నిందించారు. అందరూ వచ్చి బూడిదకుప్పలలోని బోయ వనితను ఆమె కుమారుల శవాలను చూసి కుంతీదేవి పాడవులనుకుని భోరున విలపించారు. ఖనకుడు జనంలో చేరి పోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్లు నటిస్తూ తాను త్రవ్విన సొరంగ మార్గంలో పోసి దానిని కనపడకుండా చేసాడు. వెంటనే హస్థినా పురానికి వెళ్ళి విదురునికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని చెప్పాడు. భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఎంతో దుఃఖించారు. వారితో చేరి విదురుడు దుఃఖిస్తున్నట్లు నటించాడు.
వారణావత పౌరులు పాండవుల విధికి విలపించి, ఆ ఇంటి చుట్టూ రాత్రంతా వేచి ఉన్నారు. అయితే, పాండవులు తమ తల్లితో పాటు భూగర్భ మార్గం నుండి బయటకు వస్తున్నారు. భయంకరమైన పరాక్రమం మరియు వేగవంతమైన చలనం కలిగిన భీమసేనుడు తన సోదరులు మరియు తల్లి అందరినీ తన శరీరం మీద మోస్తూ లక్క ఇంటి నుంచి బైటికి తీసుకువెళ్లాడు.చీకటిని అధిగమించడం ప్రారంభించాడు. తన తల్లిని తన భుజంపై, కవలలను తన రెండు చేతులపై, యుధిష్ఠిరుడు మరియు అర్జునుడు తన రెండు చేతులపై ఉంచి, గొప్ప శక్తి మరియు బలాన్ని కలిగి ఉన్న వృకోదరుడు మరియు గాలి వేగాన్ని తట్టుకుంటూ తన కవాతును ప్రారంభించాడు.ఇక్కడ మీకొక అనుమానం రావాలి - ఒక్క భీముడు అయిదుగుర్ని ఎలా మొయ్యగలిగాడు?పాండవులలోని ప్రతి ఒక్కరూ వేదవిద్యల పటల గౌరవం ఉండి యోగశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారే!యోగులు సాధన చేత అణిమాది అష్టసిధ్ధులను సాధించగలరు.వాటిలో భీముడు గరిమ అనే సిధ్ధిని ప్రదర్శించి తన దేహాన్ని పెంచితే తప్ప శరీర దారుఢ్యం కలిగి ఆజానుబాహులైన నలుగురు పురుషుల్ని మోస్తూ అంత దూరం నడవటం సాధ్యం కాదు.
"కులము నీరుజేసే గురువును జంపించె,పొసగ యేనుగంత బొంకు బొంకె,పేరు ధర్మరాజు పెను వేప విత్తయా - విశ్వదాభిరామ వినుర వేమా!!" అన్న వేమన పద్యం నుంచి ఒక ముక్కని మాత్రమే తీసుకుని ధర్మరాజుని వాడూ వీడూ అనటమూ జూదరి వ్యసనపరుడు అనే నెగటివ్ లక్షణాల్ని మాత్రమే హైలైట్ చేసిన డ్రామారావుకి ఇవేమీ కనపడలేదా!
వేమన తిట్టాడు కదా అంటారేమో, వేమన లాంటి యోగి ధార్మికుల్ని తిడతాడా - కవిత్వంలో ఉన్న నిందాస్తుతి, వ్యతిరేకాలంకారం వాడుతూ ధర్మరాజుని పొగిడాడే తప్ప విమర్శించలేదు. పరమ సాత్వికుడైన ధర్మరాజుని పెనువేపవిత్తని తిట్టి పరమ దుర్మార్గుడైన దుర్యోధనుణ్ణి కులకలంకమహాపాపపంకిలమును పరక్షాలన గావించిన సంస్కర్త అని పొగిడిన వాడు తెలుగువాళ్ళకి పుంసాం మోహనరూపుడూ ప్రత్యక్షదైవమూ ఎలా అయ్యాడో అర్ధం కావడం లేదు నాకు.
ధర్మరాజు భీమునితో "భీమా తొందరపడకు. విషయం మనకు తెలిసింది కనుక ప్రమత్తంగా ఉందాము. మనకు ఈ విషయం తెలిసిందని తెలిస్తే దుర్యోధనుడు పురోచనుడు వేరే ఉపాయం పన్నుతారు. అది మనకు తెలిసే అవకాశం రాక పోవచ్చు కనుక ఏమీ తెలియనట్లు ఉందాము" అన్న మాటలు అమాయకమైనవి కాదు - అది ధర్మరాజు యొక్క సాత్విక రాజనీతిని చూపించే హీరో మెటీరియల్!
04. వారణావతం నుంచి తప్పించుకున్న పాందవులు విదురుడు చేసిన అంచేలన్క్గెల ఏర్పాటల్ని ఉపయోగించుకుని నావలతో నదుల్ని దాటి కొండలు దాటి కోనలు దాటి అటు తిరిగి ఇటు తిరిగి ఏకచక్రపురం చేరారు.క్షత్రియత్వాన్ని వదిలి బ్రాహ్మణ్యాన్ని స్వీకరించారు.నిజానికి అప్పటి కులధర్మానుసారం క్షత్రియ జన్మ ఎత్తిన వాడు బిక్షం స్వీకరించకూడదు.పోనీ వైశ్య,శూద్ర వంటి ఇతర కులధర్మాలను అనుసరించి బతకవచ్చు కదా అంటే ఖాండవప్రస్థాన్ని ఇంద్రపస్థం చేసిన సమర్ధత వల్ల ఆఖరికి మళ్ళీ రాజ్యపాలన తప్పనిసరి అవుతుంది.అలా కాక లాక్షాగృహం నుంచి తప్పించుకున్న వెంటనే హస్తినాపురానికే పోయి దుర్యోధనుడి నీచత్వాన్ని ఎక్స్పోజ్ చేసి తండ్రీ కొడుకుల్ని తన్ని తగిలేసి హస్తినాపురాన్నే ఆక్రమించుకోవచ్చు కదా!
కుదరదు!సైన్యం అనేది రాజ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే శత్రువులని నిర్జించడానికే ఉన్నది తప్ప రాజ్యాధినేతల సొంత పగలను తీర్చడం కోసం కాదు అన్న సాత్విక రాజనీతిని ధర్మరాజు ఆజీవపర్యంతం పాటించాడు.వారణావతం వెళ్ళేటప్పుడు తనతో వస్తానన్న ప్రజల్ని వెనక్కి పంపించింది అందుకే.శ్రీకృష్ణుణ్ణి రాయబారం పేరున హస్తినాపురం పంపిస్తున్నప్పుడు ద్రౌపది "వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు బాండు భూవరునకు గోడలైతి జనవంద్యుల బొందితి, నీతి విక్రమ స్థిరులగు పుత్రులం బడసితిన్, సహజన్ముల ప్రాపు గాంచితిన్ సరసిజనాభ! యిన్నిట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్" అని ఆత్మప్రశస్తి చేసుకుని "ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి దొలుతగాఁ బోరిలో, దుస్ససేను తను వింత లింతలు తునియలై చెదరి రూపఱి యున్నఁ గని ఉడుకాఱుఁ గాక! యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది? పెనుగద వట్టిన భీమసేను బాహుబలంబునుఁ బాటించి గాండీవమను నొక విల్లెప్పుడును వహించు కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే - యిట్లు బన్నములు వడిన ధర్మనందనుడును నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁగానఁ బడయమైతి మేనిఁ గృష్ణ!" అంటూ ఒత్తిడి పెట్టినప్పటికీ,అది మనకి కూడా న్యాయమైన కోరికయే అనిపించినప్పటికీ పట్టించుకోకపోవడం కూడా "సైన్యం అనేది రాజ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే శత్రువులని నిర్జించడానికే ఉన్నది తప్ప రాజ్యాధినేతల సొంత పగలను తీర్చడం కోసం కాదు" అనే పాయింటుకి కట్టుబడిన ధర్మరాజులోని హీరో మెటీరియలే!
అసలు ద్రౌపది పద్యం ఎత్తుకోవడమే చూడండి - కౌరవులు అనగానే దుశ్శాసనుడి చెయ్యే గుర్తుకు రావడం సహజం. ఈ వెంట్రుకలు పట్టి ఈడ్చిన ఆ చేయి అని, అంతలోనే, కాదు కాదు, అన్నిటికన్నా ముందే, శరీరమంతా చిన్న చిన్న ముక్కలై చెదిరి రూపు మాసి పడివుంటే, చూసిన తర్వాత గానీ ఆరిపోని చిచ్చు ఇది, అనడంలో ఎంత దహించుకుపోయే ఆవేశం కనుపడుతోంది!
అంతే కాదు దుర్యోధనుడి పీనుగను తనూ ధర్మరాజూ చూడలేక పోయినట్లైతే, భీముడి గదా, అర్జునుడి విల్లూ – ఇవి ఎందుకు, కాల్పనా? ఎంత తీసిపారేసినట్లు మాట్లాడిందో చూడండి, భీమార్జునులను గురించి.భయంకరమైన అవమానానికి గురైన ఒక కులసతి గుండెకోతకు ఎక్స్-రే చిత్రం కదా ఆ పద్యం.కోపమూ, శోకమూ, ఆక్రోశమూ ముప్పిరిగొన్న ద్రౌపది సంభాషణా ప్రవాహానికి సూర్యుడూ, చంద్రుడు, మహర్షులూ తలకాయలు వొంచుకుని నిలబడినట్టు సూర్య, ఇంద్ర, చంద్ర గణాలూ, యతులూ ఈ పద్యంలో ఎంత అద్భుతంగా ఒదిగిపోయాయో మీరే చూడండి!
ఏకచక్రపురంలో అతి సామాన్యుల వలె ఉన్నప్పుడూ బకాసురవధని ప్రజల కష్టాల్ని తీర్చడం కోసమే చేశారు గానీ అప్పటి దుర్యోధనుడిలా ఇప్పటి కేసీయారులా జగనులా తనకన్న సమర్ధుల్ని చంపించేసి ప్రజలకి ఉచితాలూ కానుకలూ లంచాలూ ఇచ్చి తమవైపుకు తిప్పుకోవాలనే తప్పుడు రాజకీయం చెయ్యలేదు.నిజానికి ద్రౌపదీ స్వయంవరం జరిగి పాండవులు బయటికి రావడం అనేది జరగకపోయి ఉంటే దురోధనుడు కలలు గన్నట్టు వాళూ వాళ్ల పిల్లలూ హస్తినాపురాన్ని అననతకాలం వరకు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు కాదు.భీష్మ ద్రోణులకి ఆయుష్షు తీరిన మరుక్షణం ఏ గొట్టాంగాడో హస్తినాపురాన్ని ఆక్రమించుకుని కురువంశాన్ని అనామకం చేసిపారేసి ఉండేవాడు.
తండ్రీ కొడుకులు వాళ్ళిద్దరి అదృష్టం కొద్దీ అక్కడ పుట్టినందుకు సంతోషిస్తూ కుడిచి కూర్చుని భోగాలు అనుభవిస్తూ సుఖజీవితం గడపటానికి బదులు పాండురాజూ భీమార్జునులూ పెంచిన రాజ్యాన్ని అనుభవించడం తమ హక్కు అనుకున్నారే తప్ప ధర్మరాజుకి ఉన్న కారడవి నుంచి కూడా కనకవర్షం కురిపించే పరిపాలనా దక్షత లేదు.
ఎలాగూ కధ ద్రౌపదీ స్వయంవరం దగ్గర నిలబడింది గనక ద్రౌపది కర్ణుణ్ణి సూతపుత్రుడని అవమానించటం ఎంతవరకు న్యాయం అనే ప్రశ్నకి జవాబు చెప్పి తీరాలి,కదా!యాంటీ హిందూ బ్యాచ్చి అడుగుతున్న కొన్ని న్యాయమైన ప్రశ్నలకి పాయింట్ల వారీ జవాబులు ఇద్దాం:
1. ఆహ్వానం పంపితే కర్ణుడు వచ్చాడా? ఆహ్వానం లేకుండా వచ్చాడా? ఆహ్వానం అవసరమా?
స్వయంవర ఆహ్వానం అంటే , మా అమ్మాయికి స్వయంవరం నిశ్చయించాము ఫలానా సమయంలో రావలసింది అని. ద్రౌపదిని పెళ్లాడదలిచిన వాళ్ళు మాత్రమే కాక , ఆ స్వయంవరం వేడుక చూడదలచిన వాళ్ళు కూడా రావచ్చు.
బ్రాహ్మణులకు ఆహ్వానం కూడా అక్కర లేదు. ఎక్కడెక్కడి వారు రావచ్చు. రాజులందరూ , మిత్రులూ , శత్రువులూ కూడా కలుస్తారు అక్కడ. వీరులకు ఆహ్వానం అక్కర లేదు.
ఉదాహరణకు అవంతి రాజకుమారి మిత్రవింద స్వయంవరానికి ఆమె అన్నదమ్ములు విందానువిందులు , దుర్యోధనుడి మిత్రులు వెళ్ళారు. కృష్ణుడికి ఆహ్వానం పంపలేదు. కృష్ణుడే , మిత్రవింద మనసుని తన చెల్లెలు సుభద్ర ద్వారా తెలుసుకుని , స్వయంవరానికి వెళ్లి ఆమెను రథంలో ఎక్కించుకుని వచ్చేసాడు. అడ్డు వచ్చిన వీరులను వెంట వచ్చిన అర్జునుడు ఓడించి సహాయం చేశాడు. అందుచేత ఆహ్వానం పంపి, తీరా వచ్చాక అవమానం చేశారా అన్న ప్రశ్న ఉదయించదు.
ఒకవేళ ఆహ్వానం పంపకున్నా కర్ణుడు వచ్చి ఉంటే అవమానం చెయ్యచ్చా, అది సబబా అంటే , అది కూడా సబబు కాదు.ఆహ్వానం పంపకున్నా వచ్చిన అతిధులను అవమానం చేయరాదు. కర్ణుడిని , సభ నిర్వాహకులు అవమానం చేయలేదు. సముచితమయిన ఆసనం ఇచ్చి గౌరవించారు. అందరు రాజులను పరిచయం చేసినట్లే కర్ణుడిని కూడా పరిచయం చేశారు.
2 . స్వయంవర నియమాలు ఏమిటి?
స్వయంవర నియమాలను ధృష్టద్యుమ్నుడు అందరికీ వివరించి , చివరగా ఇలా అంటాడు. " ..... ఈ గొప్ప పని ఎవడు చేస్తాడో ,కులం, రూపం, బలం కలిగిన ఆ వ్యక్తికీ నా చెల్లెలు భార్య అవుతుంది.నేను అబద్ధం చెప్పను."
అంటే ఏమన్న మాట?
బలం అన్నది ఒక్కటే ఆ పరీక్షలో తేలేది. కులం అన్నది నిర్ధారితం. రూపం అన్నది ద్రౌపది , ఆమె తరఫు వారు అభ్యంతర పెట్టరానిదయి ఉండాలి.ఆ తరువాత జరిగే వర్ణనలో కూడా , ' రూపం, బలం, కులం, శీలం, దానం, యోవనం మొదలయిన దర్పాలతో రాజులు ఆమెకొరకు పోటీ పడ్డారు అని ఉంటుంది.
3 . మరి కర్ణుడిని ఎందుకు పరిచయం చేశారు?
వచ్చిన రాజులందరినీ పరిచయం చేశాడు. బలరాముడు, కృష్ణుడు, సాత్యకితో సహా. జరాసంధుడు, శల్యుడు కొడుకులతో సహా వచ్చారు. వారు గెలిచినా వారే చేసుకోవాలని లేదు. గెలుచుకున్నాక మళ్ళీ వారిలో ఎవరు చేసుకోవాలి అన్నది వారు నిశ్చయం చేసుకోవాలి, దానికి వధువు తరఫు వారు సమ్మతించాలి అనుకుంటాను - తర్వాత కథ నడిచిన తీరు బట్టి అలాగ అర్ధం అవుతుంది.అర్జునుడు గెలిచిన తర్వాత కూడా అన్నల పెళ్లి కానిదే నేను పెళ్లి చేసుకోను అన్నాడు. నువ్వు గెలిచావు కాబట్టి నువ్వే చేసుకు తీరాలి అనలేదు ద్రుపదుడు.మీలో ఎవరు చేసుకున్న సమ్మతమే అన్నాడు ద్రుపదుడు. అవీ ఆనాటి క్షత్రియ సంప్రదాయాలు.
ధృష్టద్యుమ్నుడు కర్ణుడిని ఎలా పరిచయం చేశాడో చూద్దాము - "దుర్యోధనుడు, దుశ్శాసనుడు, .......................మరెందరో ధృతరాష్ట్ర కుమారులు కర్ణునితో కలిసి, నీ కోసం వచ్చారు" అన్నాడు. కర్ణుడు నీ కోసం వచ్చాడు అనలేదు, ఎందుకని?
4 . కర్ణుడు విల్లు ఎక్కు పెట్టడం సబబా?
సబబు మాట వచ్చింది కాబట్టి, ఒక ప్రశ్న కూడా వస్తుంది. మొత్తం అక్కడున్న రాజకులంలో కర్ణుడు తప్ప అందరూ క్షత్రియ వంశజులే. ధృష్టద్యుమ్నుడు ముందే చెప్పాడు నియమాలు. బలం, రూపం, కులం మూడూ ఉండాలని.కర్ణుడు ఛేదించడం ద్వారా బలం నిరూపించుకోగలడు.అద్భుతమయిన రూపం అతనిది. సూర్యుని తేజస్సు. కానీ అతను , తనను తాను క్షత్రియుడని చెప్పుకునే వీలు లేదు. ఎందుకని కర్ణుడు ప్రయత్నించా లనుకున్నాడు? తాను గెలిచినా ఆ ప్రశ్న వస్తుంది కదా?
5 . ద్రౌపది ఏమంది, ఎప్పుడంది?
కర్ణుడు మిగిలిన రాజులనేకమంది విల్లునెక్కుపెట్టలేకపోవడం చూసి, వెంటనే ఆ ధనుస్సును ఎక్కుపెట్టి బాణాలు సంధించాడు. ఇంకా లక్ష్యాన్ని భేదించడం జరుగ లేదు. కర్ణుడు తప్పక లక్ష్యాన్ని భేదిస్తాడు అని అందరూ అనుకున్నారు.అసలు కర్ణుడు విద్య నేర్చుకోవడానికి వెళ్ళిన ప్రతిచోటా నిజాన్ని దాచడమో, అసత్యం చెప్పడమో చేసి ప్రతిచోటా శాపాలను కొనితెచ్చుకోవడంతో తను నేర్చుకున్న ఏ విద్య ఎప్పుడూ పనికిరాకుండా పోయింది. ఏ శాపమూ ఇవ్వని ఒకే ఒక గురువు ద్రోణాచార్యుడిపై కూడా అతనికి గౌరవం కంటే అర్జునుడి కారణంగా ద్వేషభావమే కనిపిస్తుంది. మరి అలాంటి వానికి విజయమెలా వస్తుంది?
ఆ సమయంలో ద్రౌపది పెద్దగా ( చిన్నగా అంటే వినపడదుగా ) ," నాహం వరయామి సూతం" ( నేను సూతుని వరించను) అన్నది.భేదించిన వరకూ ఆగలేదు. తన మనసులో మాట , అన్నగారి నియమాలను గుర్తు చెయ్యడానికి అతడి కులం గుర్తు చేసింది. నేను కర్ణుడిని చేసుకోను అనలేదు, తనకి ఆ స్వాతంత్య్రం లేదు. జరాసంధుడిని అనలేదు, శిశుపాలుడిని అనలేదు , దుర్యోధనుడిని అనలేదు. కర్ణుడిని ఎందుకు అన్నదీ అంటే నియమాలు ఒప్పుకోవు, తనకీ నియమభంగం చేసి చేసుకోవలసిన అగత్యమూ లేదు.
6. కర్ణుడి స్పందన ఏమిటి? మిత్రుడు దుర్యోధనుడి స్పందన ఏమిటి? మిగిలిన సభాసదుల స్పందన ఏమిటి? ఎవరన్నా అది బేసబబు అన్నారా? ఎందుకు అనలేదు ?
కర్ణుడి స్పందన: కోపంతో నవ్వాడు. సూర్యుడి వైపు చూశాడు. ధనుస్సు వదిలేశాడు. సభనుండి బయటకు పోలేదు కాబట్టి తిరిగి తన స్థానంలోకి వెళ్లి కూర్చున్నాడని భావించాలి. అతడు ఎవరినీ నిందించలేదు. సూర్యుడి కేసి చూడడంలో అతడు ఎవర్ని నిందించాడో అనిపిస్తోంది. కోపానికి కారణం ఊహించుకోవచ్చు. నవ్వింది ఎందుకు? తనమీద తనకే నవ్వు.వెళ్లకుండా ఉండాల్సింది అనుకుంటున్నాడు అనిపిస్తుంది.
మిత్రుడికి అవమానం జరిగిందని దుర్యోధనుడు భావించాడా? మనకు తెలియదు. తరువాత తాను కూడా వెళ్లి భంగపడ్డాడు. మిగిలిన క్షత్రియులెవరూ ఈ విషయం పట్టించుకోకుండా కార్యక్రమాన్ని కొనసాగించారు. అదే ఆమోదమా? అదే క్షత్రియులు ద్రౌపదిని ఒక బ్రాహ్మణుడు గెలుచుకుంటే ఏకమయ్యి యుద్ధం చేశారు. కర్ణుడి అవమానం వారికి పట్టలేదు. ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు కూడా ద్రౌపదిది తప్పు అనలేదు. వారే అనేవారేమో, ద్రౌపది అనకుంటే అనిపిస్తుంది. వారి మనసులోని మాటే ద్రౌపది పలికింది.
8 .ఇంతకీ ఇలాగే జరిగిందా?
లేదంటున్నారు చాలామంది. ఒకవేళ జరిగితే సబబా అన్నదానికి నేను సమాధానమిచ్చాను. అసలు జరగకపోతేనో?అప్పుడు జవాబు ఇలా ఉంటుంది.ఆ నాటి క్షత్రియులు మంచి సంస్కార హృదయులు. సూతులకు కూడ పరాక్రమం ప్రదర్శించి స్వయంంవరంలో పాల్గొనే అవకాశం ఉంది కర్ణుడిని ద్రౌపది ఏమీ అనలేదు. అతడికి పూర్తి వీలు కల్పించారు. అతడే లక్ష్యం బేధించలేక విఫలుడయినాడు. ద్రౌపది ఆలా ఎప్పుడూ అనలేదు.అన్ని సంస్కృత ప్రతులనూ పరిశోధనాత్మక దృష్టితో పరిశీలించిన భండార్కర్ ఇన్స్టిట్యూట్ వారు ద్రౌపది అటువంటి మాట అనలేదని తేల్చి చెప్పారు. మన కవిత్రయ భారతంలో కూడా కర్ణుడు వెంట్రుక వాసిలో భేదించలేకపోయాడనే ఉంది.
ఇక ద్రౌపదికి పంచభర్తృత్వం సంభవించిన సన్నివేశం గురించి సొంత మాత ఒకటి చెప్పాలి.ప్రస్తుతం సమర్ధన కోసం చెప్తున్న కధల్లోనూ కొన్ని దోషాలు ఉన్నాయి.ఉదాహరణకి,పూర్వజన్మలో పెళ్ళి కోసం తపస్సు చేసి తీరా శివుడు ప్రత్యక్షం అయ్యాక తడబడి "పతి,పతి,పతి,పతి,పతి!" అనేసరికి శివుడు ఇప్పటి జన్మలో అయిదుగురు భర్తల్ని ఇచ్చాడనే కధని వినగానే "అదేంటి?అయిదు సార్లు రిపీట్ చేసినా పదిసార్లు రిపీట్ చేసినా పతి అనేది ఏకవచనం కదా - శివుడికి అది బహువచనం అని ఎలా అర్ధం అయ్యింది!" అనిపించింది నాకు.
వాళ్ళందరూ అక్కడ నిలబడిన సన్నివేశాన్ని మామూలు తర్కంతో విశ్లేషించి చూపిస్తాను.ద్రుపదుడు ద్రౌపదిని "అర్జునపత్ని" అనే లక్ష్యంతోనే పుట్టించాడు.అప్పటికే ధృష్టద్యుమ్నుణ్ణి "ద్రోణహంత" అనే లక్ష్యంతో పుట్టించి ద్రోణుడితో శత్రుత్వం ఏర్పడాలంటే పాండవులతో మైత్రి అవసరం అనే పొలిటికల్ స్ట్రాటజీతో రెండవ సారి యజ్ఞం చేసేటప్పుడు "అర్జునపత్ని" అయ్యే ఆడబిడ్డ పుట్టాలని సంకల్పించాడు.అందుకే, అర్జునుడు తప్ప మరెవరూ గెలవలేని పరీక్ష పెట్టాడు.
రచయితలు వాచ్యం చేసి చెప్పలేదు గానీ ద్రౌపదీ స్వయంవరం పాండవులు బతికే ఉన్నారని నమ్మి వాళ్ళని బయటికి రప్పించడానికి ద్రుపదుడు చేసిన ఉపాయం కూడా అయి ఉండవచ్చు.మాకు మీ బ్రాహ్మణుల వివాహ క్రతువుల సంగతి తెలియదు కాబట్టి ఆ ఏర్పాట్లు మీరే చేసుకోండి అని కన్యాదానం అక్కడే కానిచ్చి ద్రౌపదిని కట్టుబట్టలతో వాళ్ళవెంట పంపించేసి కూడా మళ్ళీ రాత్రికి ధృష్టద్యుమ్నుణ్ణి కూపీ లాగమని పంపించడం కూడా ద్రుపదుడు వాళ్ళు పాండవులని అనుమానించాడని మనం అనుకోవడానికి సాక్ష్యం, కదూ! ధృష్టద్యుమ్నుడు అక్కడికి వెళ్ళి కిటికీలోంచి చూసేసరికి కృష్ణుడూ వ్యాసుడూ కనిపించారు,లోపలికి వెళ్ళారు,నిర్ణ్యం జరిగిపోయింది.తండ్రీకొడుకులు కోరుకున్నది పాండవులతో వియ్యం కాబట్టి మాకూ ఓకే అన్నారు.
ఒకసారి కామన్ సెన్సు ఉపయోగించి చూద్దాం:మూడోవాడు ద్రౌపదిని గెల్చుకున్నాడు,సంప్రదాయం ప్రకారం అన్నలిద్దరూ పెళ్ళి చేసుకోకుండా అర్జునుడు ద్రౌపదిని పెళ్ళాడెయ్యకూడదు.అయిదుగురు మగాళ్ళు తిరుగుతున్న ఇంట ఒక పెళ్ళి కావల్సిన ఆడపిల్లని ఉంచకూడదు.అప్పటి కప్పుడు పెద్దవాళ్ళకి ఏ రాజకన్యల్ని తెచ్చి పెళ్ళి చెయ్యాలి?ఇన్ని తంటాలకి పరిష్కారమే అందరూ ద్రౌపదిని పెళ్ళి చేసుకోవటం.
అక్కడ ఇంకొక తమాషా కూడా ఉంది.తల్లిని ఆటపట్టిద్దామని "అమ్మా!భిక్ష తెచ్చాం" అని అన్నప్పుడు "ఎప్పట్లానే అందరూ పంచుకోండి నాయనా!" అనగానే అయ్తిదుగురికీ ఒళ్ళు జలదరించింది - ద్రౌపది పట్ల శృంగార వాంచలు కలిగాయి."శృంగారం విషయంలో నటించకూడదు,సహచరులను మోసం చెయ్యకూడదు" - ఇది ప్రపంచ వ్యాప్తం ఉన్న మానవజాతికి నీతిశాస్త్రవేత్తలు ఇచ్చిన సలహా!ఒక విధాన హెచ్చరిక కూడా.
అప్పటికీ ఇప్పటికీ పెళ్ళి అనేది రొమాన్సుకి లైసెన్సు కాదు,వారసత్వానికి పేటెంట్ కోసం మాత్రమే ఆయా ప్రాంతాల కాలాల వివాహ చట్టాలను అనుసరించి వావివరుసలు చూసుకుని పెళ్ళి చహెసుకోవాలి.అందుకే యముడికి పుట్టాడు అన్న ధర్మరాజు పాండు కుమారుడు అయ్యాడు.ద్రౌపది కూడా రాజనీతి తెలిసినదే - తండ్రీ అన్నలతో పాటు అర్జునుణ్ణి ఒక్కణ్ణే పెళ్ళి చేసుకుంటే తన పిల్లలు రాజులు కాకపోవచ్చు, కానీ ధర్మరాజుకి కూడా పెద్ద భర్య ఆయితే ధర్మరాజు వల్ల తనకి పుట్టిన సంతానానికే వారసత్వ హక్కులు వస్తాయి అనే లాభాన్ని చూసి ఒప్పుకుని ఉంటుంది.రుక్మిణి పెళ్ళి చేసుకునే ముందు శ్రీకృష్ణుడు బ్రందావనంలో రాసలీలా వినోదం చేశాడు,కుబ్జతో శృంగారం చేశాడు.అవన్నీ తెలిసే రుక్మిణి కృష్ణుణ్ణీ పెళ్ళి చేసుకున్నది - ఇవన్నీ శృంగారం కేవలం భార్యాభర్తల మధ్యనే జరగాలనే నియమం వారసత్వ హక్కుల కోసం చేసిన ఏర్పాటు అనేదానికి సాక్ష్యాలు.అశ్వత్ధామ చంపకపోయి ఉంటే ద్రౌపదికి ధర్మరాజు వల్ల పుట్టిన ప్రతివింధ్యుడు రాజయ్యేవాడు కదా!
అదీ గాక,అక్కడ ఉన్నవాళ్ళు అందరూ రక్తసంబంధం ఉన్న బంధువులే అయినప్పుడు వాళ్ళలో వాళ్ళు చేసుకున్న ఏర్పాటును గురించి ఇతర్లు ఎందుకు తీర్పులు ఇవ్వాలి,ఇస్తున్నారు?తప్పు కదా!ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్యన జరిగే దాంపత్యంలో కూడా మూడో వ్యక్తి "వాళ్ళు రోజుకెన్ని సార్లు ముద్దులు పెట్టుకుంటున్నారు,వాళ్ళు వారాని కెన్నిసార్లు సెక్సులో పాల్గొంటున్నారు?" అనే లెక్కలు అడక్కూడదు.అలాంటిది అటువైపువాళ్ళూ ఇటువైపువాళ్ళూ ఆమోదించి చేసుకున్న పెళ్ళిళ్ళ గురించి "అది వ్యభిచారం,పంచభర్తృక కాబట్టి ద్రౌపది పతివ్రత కాదు - బంధకి!" అని రెచ్చిపోవటం తప్పు.
అందరికీ ద్రౌపది అంటే మొదటి ద్యూతం నాడు "నన్నోడి తన్నోడెనా,తన్నోడి నన్నోడెనా?" అన్న ద్రౌపదియే గుర్తుకొస్తుంది.ఇంకాస్త ముందుకెళ్ళి కవిత్రయాన్ని చదివితే ధర్మరాజు శ్రీక్టృష్ణుణ్ణి రాయబారానికి పంపిస్తుంటే దుశ్శాసనుడు లాగినప్పుడు తెగిన తన కేశాల్ని గుర్తుంచుకోమని ఛాలెంజి చేసిన ద్రౌపది కనిపిస్తుంది.కానీ, భాగవతంలో తన బిడ్డల్ని చంపిన అశ్వత్ధామని అర్జునుడు పట్టి తెచ్చి తనముందు నిలబెట్టినప్పుడు ఎలా ప్రవర్రించి ఉంటుందో వూహించగలరా మీరు?
చిన్న పిల్లల ప్రాణాలు తీసిన తన నీచత్వానికి సిగ్గుతో అశ్వత్థామ ద్రౌపది ముందు తల ఎత్తలేకపోయాడు. సుగుణవతి అయిన ద్రౌపది పరాజ్ముఖుడైన అశ్వత్థామను చూసి, నమస్కరించి, ఇలా అన్నది:
"పరఁగన్ మా మగవార లందఱును మున్ బాణప్రయోగోపసం
హరణాద్యాయుధవిద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి; పుత్త్రాకృతి నున్న ద్రోణుడవు; నీ చిత్తంబులో లేశముం
గరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే?
భూసురుఁడవు, బుద్ధిదయా
భాసురుఁడవు, శుద్ధవీరభటసందోహా
గ్రేసరుఁడవు, శిశుమారణ,
మాసురకృత్యంబు ధర్మ మగునే? తండ్రీ!
ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం
చిద్రోహంబును నీకుఁ జేయరు, బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ, బిన్నపాఁపల, రణప్రౌఢక్రియాహీనులన్,
నిద్రాసక్తుల సంహరింప నకటానీ చేతు లెట్లాడెనో?
అక్కట! పుత్త్ర శోక జనితాకులభార విషణ్ణచిత్తనై
పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ
డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత, నేఁ
డెక్కడ నిట్టి శోకమున నేక్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో?"
ఎంత జాలి గుండె ద్రౌపదిది!ఇందులోని ప్రతి అక్షరంలోనూ ఆర్తి మాత్రమే ఉంది,ఒక్క తిట్టు లేదు."ద్రోణుని కొడుకు అశ్వత్ధామ నా వైపు ఉన్నాడు." అన్న దుర్యోధనుడి ధీమా చూశారు కదా!ప్రవచన కర్తలు చెప్తున్నట్టు ద్రోణ అశ్వత్ధామలకి పాండవుల మీద ప్రత్యేకమైన అభిమానం లేదు.అది పాండవులకీ తెలిసే ఉంటుంది.అయినప్పటికీ తన శోకాన్ని తగ్గించుకుని కృపి శోకాన్ని గుర్తుకు తెచ్చుకుని అశ్వత్ధామని వదిలెయ్యమని అంటుంది.
"కొడుకులఁ బట్టి చంపె నని కోపము నొందదు; బాలఘాతుకున్ విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది, వీఁడు విప్రుఁడే?విడువఁగ నేల? చంపుఁ డిటు వీనిని మీరలు సంపరేని నా పిడికిటిపోటునన్ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱున్." అని పిచ్చికోపంతో అశవత్ధామ మీదకి దూసుకెళ్తున్న భీముడికి అడ్డం వస్తుంది.
ఇక్కడ ప్రవచన కర్తల్లు చెప్పని మరొక విషయం బయటపడుతున్నది గమనించండి - "విశ్వమంతా కొనియాడ దగినవాడు, వీరాధివీరుడు, యింద్రపుత్రుడు అయిన అర్జునుడు శ్రీకృష్ణుని అభిప్రాయానుసారం పదునైన కత్తితో అశ్వత్థామ శిరోజాలు ఖండించి లోపల మెరుస్తున్న మహామణిని వశం చేసుకున్నాడు. విశాలమైన కీర్తిని పొందాడు. తరువాత కట్టిన త్రాళ్లన్నీ విప్పదీసి శిబిరం బయటికి గెంటేశాడు.బాలకులను నిర్భయంగా హత్యచేసిన అశ్వత్థామ భరింపరాని అవమానంతో మర్యాదను, మణిని కోల్పోయి, సిగ్గుతో తలవంచుకొని, అతిశయించిన ఆవేదనతో వెలవెలపోయి వేగంగా వెళ్లిపోయాడు."అని మాత్రమే చెప్పి పోతన మహాకవి సరిపెట్టేశాడు గానీ అశ్వత్ధామని 3000 యేళ్ళపాటు వ్రణాల్తో బతకమని శాపం ఇచ్చినట్టు లేదు.
అంత సౌశీల్యవతి అయిన ద్రౌపదిని పట్టుకుని "వంతువంతున మాసమున కొక్క మగని చొప్పున పచ్చి పచ్చి భోగాల తేలియాడు ఆ మదవతి.." అని పళ్ళు పటపట కొరకటం - ఇప్పుడు చూస్తే భరించగలమా?ఇప్పుడు రామారావు బతికుంటే ఓ పట్టు పట్టకుందుమా!
05. ద్రౌపదీ మానసంరక్షణం అనీ ద్రౌపదీ వస్త్రాపహరణం అనీ రెండు పేర్లతో ఎవడు పడితే వాడు ఎక్కడ బడితే అక్కడ వినిపించిన చూపించిన దృశ్యాల తీరు ఒక రకమైన దరిద్రం అయితే వ్యాసకృతం,కవిత్రయం చూపిస్తున్న అసలైన సన్నివేశం పది రకాల దరిద్రాలతో నిండి ఉన్నది.వ్యాసుల వారూ కవిత్రయం వారూ ఎలా అంత ఓపిక చేసుకుని అంత చిన్న చిన్న విషయాలను సైతం మనకి ఎలా చూపించగలిగారో గానీ వారే చేసిన వర్ణన ప్రకారం సభలో ఉన్న పుణ్యాత్ములు అందరూ చేతుల్తో కళ్ళు మూసుకున్నారు.అంత అసహ్యకరమైన ప్రవర్తన దుష్ట చతుష్టయానిది.
దరిద్రం ఏంటంటే, వీళ్ళ నీచత్వాన్ని సమర్ధించటానికి ఇప్పటి వాళ్ళ ఫ్యాన్లు స్వయంవరం అప్పుడు ద్రౌపది " నాహం వరయామి సూతం" ( నేను సూతుని వరించను) అని అవమానించిందనీ మయసభలో దుర్యోధనుడు తడబడుతున్నప్పుడు ద్రౌపది నవ్విందనీ మూలంలో లేని కధల్ని వీళ్ళు పుట్టించి వాటి సాక్ష్యంతో ద్రౌపది తమకు చేసిన అవమానాలకి ప్రతీకారం తీర్చుకోవడం అనే హీరోయిజాన్ని కర్ణదుర్యోధనులకి తగిలిస్తున్నారు.
ఇప్పుడు ఈ సన్నివేశంలో నేను ధర్మరాజు ప్రవర్తనని మాత్రమే చూపిస్తే అది హీరో మెటీరియల్ అని ఎలా జస్టిఫై చెయ్యాలి అనే మరొక ప్రశ్న వస్తుంది.కాబట్టి మొదట కర్ణ దుర్యోధనులు ఆక్కడ మాట్లాడిన మాటల్ని మూలకావ్యం నుంచె ఎత్తిపోసి అది విలనీయే అని నిరూపిస్తాను.అప్పుడిక ఆ విలన్ల దాడికి ధర్మరాజు అలా ప్రతిస్పందించటం కరెక్టేనా లేక ఇంకెలా రెస్పాండ్ అయితే హీరోయిజం బయటపడేది అనే శైలిలో విశ్లేషిస్తాను.
చాలామంది ప్రవచన కర్తలు రావణుడు సీత సౌందర్యాన్ని చూసి స్త్రీవ్యామోహంతోనూ దుర్యోధనుడు మయసభ వైభవం చూసి ధర్మరాజు పట్ల ఈర్ష్యతోనూ నశించిపోయారని ఒకరికి కేవలం కామానికి ఒకరికి కేవలం ఈర్ష్యకి ప్రాతినిధ్యం ఇచ్చేశారు.కానీ, మయసభను చూసి హస్తినకు తిరిగొచ్చాక దుర్యోధనుడి పిచ్చ వాలకాన్ని కొన్ని రోజుల పాటు గమనించీ గమనించీ తనే చెప్తాడని ఎదురు చూసీ చూసీ విసుగు పుట్టి శకుని "ఏంటల్లుడూ!ఇంద్రప్రస్థం వెళ్ళొచ్చిన నాటినుంచి మొహం వేళ్ళాడేసుకుని కూర్చున్నావు.అయినవాణ్ణీ అమ్మతమ్ముణ్ణీ నాదగ్గిర దాపరికం దేనికి?పైకి చెబితే లోపల బెంగ తీరొచ్చు.నేను చెయ్యగలిగినది చేసి బెంగ తీరుస్తాను." అన్నప్పుడు ధర్మరాజు వైభవం గురించిన చుప్పనాతి కబుర్లలో "ద్రౌపదిని ధర్మరాజుకి భార్యగా చూసి తట్టుకోలేకపోతున్నాను.ఇప్పటికీ కళ్ళముందు కనబడి పిచ్చెక్కిపోతున్నాను" అనేశాడు కూడాను.
కేవలం ధర్మరాజు వైభవం పట్ల ఈర్ష్య అయితే శకుని దగ్గిర్నుంచి గాంధారి వరకు తిట్టిన తిట్లతో ఈర్ష్యని తగ్గించుకునే అవకాశం ఉంది గానీ స్వయంవరం నాడు ద్రౌపది మీద పడిన కన్ను తనకన్న పెద్దవాడైన ధర్మరాజుకి భార్య అయినప్పటికీ మనస్సు తిప్పుకోలేక డ్రామారావు నోట మనం వింటున్న "వంతువంతున మాసమున కొక్క మగని చొప్పున పచ్చి పచ్చి భోగాల తేలియాడు ఆ మదవతి" అనే వెకిలి ఆలోచనలతో కొనసాగి కుక్కచావు వరకు తెచ్చుకున్నాడు.కుక్కచావు ఛస్తున్నప్పుడు కూడా "నాకేంటి?యవ్వనం అంతటినీ ఇంద్రసమభోగాలు అనుభవించాను.ధర్మరాజులా అడవులు పట్టి తిరగలేదు." అని బోడిగొప్పలు చెప్పుకున్నాడు.వీడిది హీరో మెటీరియలా?ధర్మరాజులో అది లేదా!
యుధ్ధంలో భీమార్జునుల్ని దేవతలు కూడా గెలవలేరనేది ఇక్కడ శకుని కూడా తెగేసి చెప్పాడు.అయితే, అల్లుడి మేలు కోరి తల్లి రెండుసార్లు చెప్పిన "ధర్మరాజు తనంతట తను నీకు హాని చెయ్యడు.ధర్మరాజుతో వైరం నీకే ప్రమాదకరం.స్నేహంగా ఉండటం వల్ల లాభాలే ఎక్కువ" అని చెప్పాక కూడా దుర్యోధనుడి ఏడుపుగొట్టు మొహం చూసి కలిపురుషుడి ప్రభావం వల్ల "మీ నాన్నని ఒప్పించి ధర్మరాజుని నాతో ద్యూతానికి పిలిస్తే అతన్ని ఓడించి నీకు కావలసినవి సాధించి పెడతాను" అని కూటనీతిని గురించి చెప్పేసరికి ఎగిరి గంతేసి అదే కావాలి నాకు అని లటక్కన పట్టేసుకున్నాడు.ఇద్దరూ కలిసి ధృతరాష్ట్రుడి దగ్గిరికి వెళ్ళాడు.
ధృతరాష్ట్రుడు ససేమిరా మిరాససే కుదరదన్నాడు.అసలు ధర్మరాజుని ఖాండవప్రస్థం పంపించడమే తప్పన్నాడు.పాండురాజు నాకు అర్హత లేని రాజ్యాన్ని ఇచ్చి కూడా ఏనాడూ నన్ను అవమానించ లేదన్నాడు.ధర్మరాజు కూడా నన్ను ఎంతో గౌరవిస్తున్నాడన్నాడు.ద్యూతంతో ఇతరుల రాజ్యాల్ని సంగ్రహించడం పౌరుషహీన మన్నాడు.నేను ఛస్తే చెయ్యనన్నాడు.
అప్పుడు దుర్యోధనుడు అయితే నేను ఛస్తానని బెదిరించాడు.శ్రీకృష్ణపాండవీయమూ దానవీరశూరకర్ణా ప్రామాణికం అనుకునేవాళ్ళు నమ్మలేరు గానీ తెలుగు సంస్కృత మూలకావ్యాల్లో దుర్యోధనుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాకనే ధృతత్రాష్ట్రుడు ద్యూతానికి రమ్మని ధర్మరాజుని పిలిపించటానికి ఒప్పుకున్నాడు.
శకుని మాయాద్యూతం వల్ల గెలిచాడని అంటున్నారు గానీ పిలుపులోనే మోసం ఉంది.విదురుణ్ణే పంపించారు.పిలిచింది పందేలు వెయ్యకూడని ఆస్తులు సంగహించడం గానీ బానిసల్ని చేసుకుని పెత్తనం చెయ్యడానికి అవకాశం ఇచ్చే నిబంధనలు లేని సుహృద్ద్యూతానికే.ధర్మరాజుకి ప్రతిస్పర్ధిగా దుర్యోధనుడే ఆడతాడని చెప్పి పిలిచారు.పిలవటానికి వెళ్ళిన విదురుడు నాకిప్పుడు మూడ్ లేదనో తరవాత వస్తాననో చెప్పి ఆహ్వానాన్ని తిరస్కరించమని సలహా కూడా ఇచ్చాడు.
కానీ, ధర్మరాజు ఆలోచన వేరు.రామారావూ ఇతరులు చూపించినట్టు ధర్మరాజు హీరో మెటీరియల్ లేని అమయాక చక్రవర్తి కాదు.దురోధనుడు స్వతంత్రంగా ఉన్నంతకాలం తనకు నిద్రపట్టనివ్వడనేది ఖాండవప్రస్థానికి తరలి వచ్చేటప్పుడే అర్ధం అయిపోయింది.తనకన్న ద్యూతంలో ప్రావీణ్యత తక్కువ ఉన్నవాడు గనక దుర్యోధనుణ్ణి తను ఓడించితే తన పెత్తనం కిందకి వస్తాడు.ఇది ధర్మరాజు రాజనీతి.వ్యూహం చాలా గొప్పది.శకుని ఆటలో మాయలు వాడటం వల్ల వ్యూహం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు,అంతే!
హస్తినాపురం వచ్చి ద్యూతసభను చూడగానే ధర్మరాజుకి దుర్యోధనుడు ఎంత స్థాయి ఈర్ష్యతో రగిపోతున్నాదనేది అర్ధం అయ్యింది - ద్యూతసభను దుర్యోధనుడు ఇంద్రప్రస్థంలోని ధర్మరాజు సభాభవనం యొక్క నకలులా నిర్మించాడు.ఆటగాళ్లని మార్చినప్పుడూ సుహృద్ద్యూతాన్ని కాదని ఆస్తుల్ని పణం పెట్టాలన్న నియమం వచ్చినప్పుడూ ధర్మరాజుకి మార్చిన ప్రతిపాదనలు తనకు సమ్మతం కాదని వెనక్కి వెళ్ళిపోవడం కూడా అప్పటికి అద్భుతమైన నిర్ణయం అయి ఉండేది - ద్రౌపదికి అవమానం జరిగేది కాదు,పాండవులకి వనవాసం తప్పేది.
ధర్మరాజుది దుర్యోధనుడిలా తన ఒక్కడి శరీరసుఖం కోసం భీష్మద్రోణాది మహావీరుల పౌరుషాల్ని మంటగలిపి పధ్ధెనిమిది అక్షౌహిణిల సైన్యాన్ని బలిపెట్టి కుక్కచావు ఛస్తున్నప్పుడు కూడా "నాకేంటి?యవ్వనం అంతటినీ ఇంద్రసమభోగాలు అనుభవించాను.ధర్మరాజులా అడవులు పట్టి తిరగలేదు." అని బోడిగొప్పలు చెప్పుకునే విలన్ మెటీరియల్ కాదు.అతని అసలు పేరు యుధిష్ఠిరుడు - యుధ్ధం అంటూ వస్తే వెనుకడుగు వెయ్యక స్థిరంగా నిలబడేవాడు అని ఆ పేరుకి అర్ధం.
ఆటకి పిలిచినప్పటి ప్రతిపాదనల్ని మార్చి దుష్టచతుష్టయం తనమీదకి ఒక ఛాలెంజి విసురుతూ చేస్తున్నది ఏమిటి, కపటయుధ్ధమే కదా!కొందరికి,మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి వారికి కూడా కొంత తెలివితక్కువతనం అనిపించిన ఆటను కొనసాగించాలన్న ధర్మరాజు నిర్ణయం సముచితమే అనిపిస్తుంది నాకు.పోనీ అప్పటికి ప్రతిపాదన మరియు వాస్తవికత లోని మోసాన్ని బయటపెట్టి వెనక్కి వెళ్ళాక, అదే దుర్యోధనుడి ఆఖరు ఎత్తుగడ అవుతుందా?మరోసారి మరో ప్రతిపాదనతో వస్తే!
శకుని గెల్చింది కూడా మాయాద్యూతం వల్లనే.తండ్రి ఎముకలతో పాచికలు చేశాడనేది కూడా డ్రామారావు అండ్ కో కల్పించిన పిట్టకధయే గానీ శకునికి మాంత్రికవిద్యలు వచ్చు.కురుక్షేత్రంలో కూడా అర్జునుడితో ప్రత్యక్షయుధ్ధం సంభవించినప్పుడు కొన్ని మాయల్ని వాడతాడు.శకుని సృష్టించిన మాయాజంతువుల్ని తన దివ్యాస్త్రాలతో చంపేశాడు అర్జునుడు.శకుని ఆట మొదలు పెట్టి వేసిన 20 సార్లలో ధర్మరాజు చేతికి పాచికలు రానే లేదు.అవి ఎలా పడితే తను గెలుస్తానో అలా పడినట్టు చూపించాడు.అలా కాక ఏ ఒక్క సారి అయినా శకుని ఓడిపోయి ఉంటే పాచికలు వేసే అవకాశం ధర్మరాజుకి వచ్చేది.
ధర్మరాజు ఆస్తుల్ని లాక్కోవటం,ద్రౌపదిని కూడా దాసిని చేసుకోవటం వరకు జరిగినది శకుని మాయాద్యూతం వల్లనే జరిగింది.కర్ణుడు మొదట పాండవుల్ని వస్త్రాలు విప్పి పక్కన పెట్టమని ఆజ్ఞాపిస్తాడు.మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పిన దాని ప్రకారం దుష్తచతుష్తయంలో ఏ ఒక్కడికీ శాస్త్రజ్ఞానం లేకపోవటం మూలాన వాళ్ళకి తాము గెలిచామా లేదా అని సందేహం వచ్చి మనం చెప్పింది చెప్పినట్టు వాళ్ళు చేస్తే గనక మనం గెలిచినట్టే కదా అన్న పిచ్చ లాజిక్కుతో గెలుపుని నిర్ధారించుకోవదానికి చేసిన చేతుల్ని గిల్లి చూసుకోవడం లాంటి ఉలిపికట్టె ఆజ్ఞ అది.పాండవులు దాసధర్మాన్ని పాటించి నగ్నంగా నిలబదేసరికి ఇది కలా నిజమా అని అనుకుంటున్నప్పుడు అది నిజమే అని తెలిసినప్పటి మైకంలో "ద్రౌపదిని కూడా లాక్కొస్తే!ద్రౌపది కూడా నగ్నంగా నిలబడితే కదా గెలుపు పూర్తయ్యేది!" అన్న వెకిలి వూహ చేసింది కర్ణుడు.
ఇక్కడ కర్ణుడు వాగిన - "ఏకో భర్తా స్త్రియా దేవైః విహితః కురునందనా, ఇయం త్వనేన వశగా బంధకేతి వినిశ్చితా, ఏకాంబర ధరత్వం వాప్యధ వాపి వివస్త్రతా, పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యాశ్చా వ్యుపాహర(A woman with five husbands is akin to a prostitute.Don't bother even if draupadi is in her mensuration and, start disrobing her cloths.)" అనే చెత్తవాగుడు శాస్త్రవాక్యమా డ్రామారావు ఫ్యాన్లకి?ఇక్కడ చూపించడానికే అసహ్యం వేస్తున్నది నాకు.కానీ,"ద్రౌపది రంకు చేస్తే తప్పు లేదు గానీ రామారావు చూపిస్తే తప్పొచ్చిందా!" అంటున్నాడు ఒక డ్రామారావు ఫ్యాన్.ఏం చెయ్యాలి వీళ్ళని?
మొదట ద్రౌపదిని సభకి రమ్మనే ఆజ్ఞతో ప్రాతిగామిని పంపించి ద్రౌపది వేసిన "తన్నోడి నన్నోడెనా?నన్నోడి తన్నోడెనా" అన్న ప్రశ్నతో వెనక్కి వచ్చినప్పుడు పాండవపక్షపాతి అయిన ద్రోణుడు మహావీరుడైన్ కర్ణుణ్ణి సూతపుత్రుదని అవమానిస్తే "ఆచార్య దేవా!ఏమణ్టివి, ఏమంటివి?జాతి నెపమున సూతపుత్రునికి ఇందు నిలువ అర్హత లేదందువా?నీది ఏ ఖులము?" అని శతధా సహస్రధా,సహస్రధా లక్షధా,లక్షధా కోటిధా అని పుట్టుకల తప్పుడు లెక్కలు బెయిటపెట్టి జాత్యహంకారులందర్నీ చావుతిట్లు తిట్టి అదే కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చి కులకళంకమహాపాపపంకిలమును శాశ్వతముగ ప్రక్షాళన గావించిన సంస్కర్తలుంగారు "దుఃశాసనైష మమ సూతపుత్రః, వృకోదరాదు ద్విజతేల్ప చేతాః(This infernal servant of mine,praatikaami,is the son of a Suta Which is why he is a dumb-headed.So,Dushasana,you go and bring draupadi)" అని ప్రాతిగామిని కులం పేరు చెప్పి తిట్టాడు.డ్రామారావుకీ డ్రామారావు ఫ్యాన్లకీ డ్రామారావు కులం వాళ్ళకీ ఇది హీరో మెటీరియల్ అనిపించింది కాబోలు.
ఈ హడావిడి జరుగుతూ ఉండగానే ధర్మరాజు తనకి దగ్గిరగా ఉన్న తన మనుషుల్లో ఒకణ్ణి పిలిచి ద్రౌపదికి కబురు పంపించాడు."ఈ తరహా ధార్మిక చర్చలకి జవాబులు చెప్పే ఓపికా తీరికా సద్బుధ్ధీ వాళ్లకి లేవు.సభకి వచ్చి ఇక్కడే నువ్వేం చెయ్యదల్చుకున్నావో అది చెయ్యి" అని సూచన ఇచ్చాడు.నిజానికి భర్త దాసుడు అయినప్పుడు భార్య కూడా దాసియే అవుతుంది కాబట్టి ద్రౌపది ధర్మవిజితయే.భీష్ముడూ దుర్యోధనుడూ ఇతరులూ చాలాసార్లు ద్రౌపది వేసిన "తన్నోడి నన్నోడెనా?నన్నోడి తన్నోడెనా" అన్న ప్రశ్నకి జవాబు చేప్పే బాధ్యతని ధర్మరాజు మీదకే నెట్టేసినప్పుడు ఆ ఒక్క ముక్క చెప్పకపోవటమే ధర్మరాజు యొక్క నిగూఢమైన రాజనీతిశాస్త్రజ్ఞతని సూచిస్తుంది - తన కాలపు రాజకీయాల్లో ఆరితేరి ఉన్న తిక్కన గారు ధర్మరాజుకి "మెత్తని పులి!" అనే బిరుదు తొడిగాడు.
ఒకవేళ ధర్మరాజు నిజం చెబితే ఏమవుతుంది?తను ధర్మవిజితయే అయినప్పటికీ ద్రౌపది ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణదుర్యోధనాది నీచపురుషులకి లొంగదు.ద్రౌపది అయోనిజ కావటమే కాదు వేదశాస్త్రాలు అధ్యయనం చేసి యోగసాధన చేసిన శక్తిస్వరూపం.అగ్నిసంభవ అయిన ద్రౌపది తన యోగశక్తితో దుష్తత్రయాన్ని కలచ్గి బూడిద చేసి ఉండేది.అదీ కాకుంటే,భీముణ్ణి ఫ్రెచ్చ్గొట్టి అక్కడి కక్కడే దుర్యోధనుణ్ణి చంపించి ఉండది.అయితే, దాసధర్మమలో ఉండగా వాళ్ల బానిసత్వాన్ని వదిలించే అవకాసం ఉన్న ఒకే ఒక యజమాని ఛచ్చిపోయాక పాందవులు హస్తినాపురానికి శూద్రసేవకులై గడపాల్సిన దుస్థితి దాపరించేది.
మూలకావ్యాల్లోని ద్రౌపది కృష్ణుణ్ణి ప్రార్ధించి మానం కాపాడుకున్న అసహాయురాలు కాదు.నందమూరి తారక రామారావు అనే పొట్టకూటి పగటివేషగాడు చూపించిన ద్రౌపదికీ వ్యాసప్రోక్తంలోనూ కవిత్రయ భారతంలోనూ కనిపించే ద్రౌపదికీ కంచర గాడిదకీ పంచకల్యాణి గుర్రానికీ ఉన్నంత తేడా ఉంది. దుశ్శాసనుడు రాణివాసంలోకి వెళ్తాడు.ధర్మరాజు పంపిన దూత చెప్పిన తర్వాత కూడా ద్రౌపది సభకి వెళ్ళడానికి భయపడి అక్కడున్న అంతఃపుర స్త్రీలను సహాయం అడిగి లేదనిపించుకుని వాళ్ళ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది.దుశ్శాసనుడు వెంటపడి తరుముతూ అక్కడికీ వెళ్ళి జుట్టు పట్టుకుని సభకి లాక్కుని వస్తాడు.
సభకి వచ్చిన తర్వాత తను ఇదివరకు ధర్మరాజుకు వేసిన ప్రశ్నని ఇప్పుడు అందరికీ వేస్తుంది "నేను ధర్మ విజితనా?అధర్మ విజితనా?అసలు దాసిని అయితే మాత్రం నిండుసభలో అవమానించటం ధర్మమా?తేల్చి చెప్పండి!" అని.ప్రపంచ రాజకీయ చరిత్రలోని ఏ రాజనీతి కోవిదుడూ రాజనీతిని రంగరించుకున్న చదరంగం ఆటలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏ ఆటగాడూ అంత తక్కువ సమయంలో శత్రువు వేసిన అత్యంత ప్రమాదకరమైన ఎత్తుకి అంత ప్రతిభావంతమైన ఎత్తుగడ వెయ్యలేదు.ఒక్క రాజనీతి శాస్త్రం మటుకే కాదు,తర్క మీమాంసాది శాస్త్రాలలో కనీస పరిజ్ఞానం లేని సాధారణ స్త్రీకి ఆ ప్రశ్న తోచదు.ఒక కల్పిత పాత్ర చేత అలాంటి ప్రశ్న వేయించడానికి ఆ రచయితకి కూడా ఒక్క రాజనీతి శాస్త్రం మటుకే కాదు,తర్క మీమాంసాది శాస్త్రాలలో కనీస పరిజ్ఞానం ఉండి తీరాలి.
ఈలోపు ద్రౌపది ఏకవస్త్రం లాగెయ్యటానికి ముందుకు కదిలిన దుశ్శాసనుడు ద్రౌపదిని సమీపించాడు,ఏకవస్త్రం చివర్లని దొరకబుచ్చుకుని లాగాడు.ద్రౌపది ఇక తన శరీర బలాన్నీ మనోబలన్నీ నమ్ముకుని ఏకవస్త్రాన్ని దుశ్శసనుడి చేతినుంచి వెనక్కి గుంజుకున్నది - ద్రౌపదిలో అంతటి శారీరక బలాన్ని వూహించని ఏమరుపాటు వల్ల దుశ్శాసనుడు తొట్రుపడి ముందుకు తూలి ద్రౌపది ముందు మోకాళ్ళ మీద కూలబడ్డాడు.అప్పటికి చెవిన పడిన ప్రేక్షక సమూహపు తిట్లకి సిగ్గు కూడా వేసి వెనక్కి పోయి తల దించుకు కూర్చున్నాడు.
విదురుడు లేచి ప్రేక్షక సమూహాన్ని సముదాయించి సభని నిశ్శబ్దం చేసి,"ద్రౌపది పదే పదే ఒక ప్రశ్నను అడుగుతూ తనకు న్యాయం జరిపించమని రోదిస్తున్నది.వికర్ణుడు ఒక్కడే ఇక్కడ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు.మరి,మిగిలిన వారు ఎందుకు మౌనం వహించారు?" అని అడిగాడు.ఒక పిట్టకధను కూడా చెప్పాడు.ఎవ్వరూ నోరు మెదపక పోవడంతో దానకర్ణుడు ఈసారి దుశ్శాసనుడికి ద్రౌపదిని తన ఇంటికి తీసుకుపోయి అన్ని సేవలూ చేయించుకోమని ఉచితబోడిసలహా ఇచ్చాడు.
భీష్ముల వారు మళ్ళీ "ధర్మం,సూక్ష్మం - ధర్మరాజే చెప్పగలడు.తననే అడుగు" అని సుత్తేశాడు.దుర్యోధనుడు ఛాన్సు దొరికింది గదాని తనకు లేని పెద్దరికం నటిస్తూ ద్రౌపదికి పాండవుల నుంచే జవాబు తెచ్చుకోమని ఉచితబోడిసలహా లాంటి వెకిలితీర్పు ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు.దుర్యోధనుడు అలా మెలిక వెయ్యగానే మళ్ళీ ప్రేక్షక సమూహంలో ఒక పెద్ద కోలాహలపు సుడిగుండం పుట్టేసింది - కొందరు దుర్యోధనుణ్ణి ప్రశంసిస్తూ కేకలు వేస్తున్నారు.కొందరు దుర్యోధనుణ్ణి అనుమానిస్తూ కేకలు వేస్తున్నారు.అందరూ పాండవులు ఏమి జవాబు చెప్తారో అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అతన్ని మించిన ధర్మక్రోధుడు మరొకడు లేడన్న ఖ్యాతిని గడించిన భీమసేన పాండవుడు ఒక్కడే లేచి, "ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు మా అన్నగారు కాకపోయి ఉంటే దుర్మార్గులైన కౌరవులు చేస్తున్న అవమానాన్ని సహించేవాళ్ళం కాదు.ఆయన మా ప్రభువు.నన్నొక్కణ్ణి పందెంలో పెట్టకుండా ఉంటే ద్రౌపది దేహం మీద చెయ్యి వేసినవాడు బతికి బట్టకట్టటం అసంభవం.మా అన్నగారు కనుసైగ చేసినా చాలు,ఇక్కడికిక్కడే కౌరవులందర్నీ ఉత్త చేతుల్తోనే ఛంపేస్తాను" అన్నాడు.భీష్ముడూ,ద్రోణుదూ,విదురుడూ "భీమసేనా!నువ్వలా చంపగలవాడివే.కానీ,కొంచెం నిదానించు.మమ్మల్ని క్షమించి అలాంటి కూదని పనులు చెయ్యకు!" అని భీముణ్ణి శాంతపరిచారు.వాళ్ళు అలా ఆపకపోయి ఉంటే లోపల్నుంచి పెల్లుబుకుతున్న ధర్మక్రోధం పెరిగి పెరిగి అన్నగారు అనుజ్ఞ ఇవ్వకపోయినా భీముడు అంతపనీ చేసేవాడు.భీష్ముడూ,ద్రోణుదూ,విదురుడూ భీముణ్ణి శాంతపరిచడం చూసిన అంగరాజు కర్ణుడు మరోసారి దాసికి శీలం ఏమిటని హుంకరిస్తూ రెచ్చిపోయాడు.దుర్యోధనుడు తన తీట తీర్చుకోవాలని మరోసారి ధర్మరాజుకి ద్రౌపది ప్రశ్నకి జవాబు చెప్పమని వేళాకోళపు ఉచితబోడిసలహా ఇచ్చి ద్రౌపది వైపుకి తిరిగి "నీ భర్తలు నిన్ను రక్షించలేరు, నీకు రక్షణ ఇవ్వగల చోటు ఇదే!" అంటూ వస్త్రం తొలగదీసి తన ఎడమతొడను చూపించాడు.
విదురుడు మరోసారి కల్పించుకుని తీవ్రమైన స్వరంతో దుర్యోధనుడి ధర్మభ్రష్టత్వాన్ని ఖండించాడు.తను ఒక్కడూ దుష్తచతుష్టయాన్ని ఆపలేనని గాంధారి దగ్గిరకి వెళ్ళి జరిగినదీ జరుగుతున్నదీ వినిపించాడు.అప్పటికే వినపడుతున్న కలకలాన్ని బట్టి కొంత గ్రహించి ఉన్న గాంధారి విదురుడితో కలిసి ధృతరాష్ట్రుడి దగ్గిరకి వెళ్ళి ధృతరాష్టుడికి సలహా ఇస్తే సభని ఆపి ఎవరిళ్ళకి వాళ్ళని పొమ్మని ఆజ్ఞాపించాడు.మొదటి ద్యూతసభ అలా ముగిసింది.సభలో గాంధారీ విదురుడూ చెప్పిన విషయాల్ని బట్టి ధృతరాష్ట్రుడు తనిప్పుడు ధర్మబధ్ధంగా ఉండకపోతే మొత్త కురువంశానికే అపకీర్తి వస్తుందని భయపడ్డాడు.సాటి ఆడదాని స్థానంలో గాంధారి ద్రౌపదికి అన్యాయం జరిగిందని కుండబద్దలు కొట్టి చెప్పడం కూడా కొంత మెత్తబడేలా చేసింది.ద్రౌపదిని తన మందిరానికి పిలిపించుకున్నాడు."కోడలు కూతురుతో సమానం అంటారు.నా కొడుకు నీకు చేసిన ద్రోహం నిజంగా దారుణమే.నువ్వు కోరిన వరాలు అన్నీ ఇస్తాను,కోరుకో!" అన్నాడు.
ద్రౌపది ఇక్కడ మళ్ళీ తన మేధస్సుని చూపిస్తుంది మనకి.క్షత్రియ కాంతకు రెండు వరాలే హక్కు అని చెప్పి మొదటి వరం కింద ధర్మరాజు దాసత్వాన్ని తొలగించి శస్త్రాస్త్ర సహితం స్వతంత్రుణ్ణి చెయ్యమని అడిగింది.తర్వాత రెండవ వరం కింద మిగిలిన నలుగురు పాందవులకీ దాసత్వాన్ని తొలగించి శస్త్రాస్త్ర సహితం స్వతంత్రుల్ని చెయ్యమని అడిగింది.భర్తల దాస్యాన్ని మాత్రమే వదిలించింది గానీ తన దాసత్వం అలాగే ఉంది.అంటే,తన ఔదార్యం చూపించుకోవడానికి వరాలు ఇస్తానన్న ధృతరాష్టుడికి "క్షత్రియులు యుధ్ధంలో గెలవాల్సిన రాజ్యాన్ని వ్యాపారులు చేసినట్టు మోసం చేసి గెలిచి నన్ను అబల అనుకుని అవమానించిన మీరు నా భర్తలు శస్త్ర సమేతం హస్తినాపురం మీద యుధ్ధం చేసి తమ ప్రతిజ్ఞలని నెరవేర్చుకుంటూ నన్ను విడిపించుకోగలిగే అవకాశం ఇవ్వండి మామగారూ!" అని బెదిరిస్తున్నది.నిజానికి ద్రౌపది హస్తినాపురంతో సహా మొత్తం రాజ్యాన్నీ సంపదల్నీ తమకు అప్పగించమనే వరమూ ధృతరాష్ట్రుడితో సహా కౌరవాదులు తమకు దాస్యం చెయ్యాలనే వరమూ అడిగి ఉంటే ఎలా ఉండేది?
తండ్రీ కొడుకులు కుక్కిన పేనుల్లా పాండవులకి నౌకర్లయి సంకనాకిపొయ్యేవాళ్ళు!కానీ,ద్రౌపది కోరిన రెండు వరాలూ అంతకన్న ప్రమాదకరమైనవని ధృతరాష్ట్రుడికి అర్ధమయ్యింది.దాసధర్మమ వదిలిన మరుక్షణం భీమార్జునులు ఇద్దరూ కౌరవులని నరికి పోగులు పెట్టేసి హస్తినాపురాన్ని తమ ఇంద్రపర్ష్తహ రాజ్యంలో కలిపేసుకునేవాళ్ళు.ధర్మరాజు కూడా అడ్డు చెప్పేవాడు కాదు.అలా జరిగి ఉంటే ఆ కధ ఇప్పటివరకు నిలిచి ఇప్పుడు మనం ధర్మరాజులో హీరో మెటీరియల్ చూస్తూనూ నందమూరి తారక రామారావు అనే పొట్టకూటివేషగడు కర్ణదుర్యోధనుల్లో హీరో మెటీరియల్ చూస్తూనూ ఉండేవాళ్ళం కాదు.
ప్రస్తుతం మనం చదువుతున్న కధని బట్టి ద్రౌపది ధర్మవిజితయే గానీ ద్యూతం జరిగిన తీరును గమనిస్తే అసలు ధర్మరాజే పరాజితుడు కాదు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పంపించినప్పటి పిలుపు చాలా స్పష్టంగా ఉంది.సుహృద్ద్యూతం అంటే డబ్బూ ఆస్తులూ పందెం పెట్టకూడని కాలక్షేపం ఆట.ధర్మరాజుతో ఆడేది దుర్యోధనుడు అని కూడా పిలుపులో ఉంది.ఇక్కడికి వచ్చాక ఆటగాణ్ణి మారుస్తున్నప్పుడూ పందెం ఒడ్డే ఏర్పాట్లు చేస్తున్నప్పుడూ ధర్మరాజు అభ్యంతరం చెప్పనూ వచ్చు, ధర్మరాజుతో ఆడేది దుర్యోధనుడు అని చెబితే వచ్చాను గాబట్టి ఆటగాళ్ళని మార్చకూడదు అని పట్టుబడితే ధర్మరాజే గిలిచి ఉండేవాడు.
పాండవులు ఇలా హస్తినాపురం దాటారో లేదో దుసటచతుసటయం మళ్ళీ గుడ్డిరాజుని బతిమిలాడుకుని ఆఖరి ఒకే ఒక ఆట అని పిలుపు పంపిస్తే వెనక్కి వచ్చిన ధర్మరాజు కొనసాగించిన అనుద్యూతం కూడా గెలుపుని శకునికే ఇవ్వడంతో పాండవులకి వనవాసమూ ఆజ్ఞాతవాసమూ ప్రాప్తించాయి. కర్ణ దుస్ససేన దుర్యోధనులు ముగ్గురూ ద్రౌపదిని అంతలా అవమానించడం వల్ల భీముడి రెండు శపధాలూ న్యాయమైనవి అయి చెల్లిపోయాయి కానీ సహజమైన యుధ్ధ నియమాల ప్రకారం ప్రమాద వశాత్తు చేసినప్పటికీ అవి జీవిత కాలపు నిషేధం విధించదగిన తప్పులు.
తమను తాము "ఇదిగో,మేము ఎంత చెత్తగా మాట్లాడగలమో చూడండి!ఇదిగో,మేము ఎంత నీచపు పనులు చెయ్యగలమో చూడండి!ఇదిగో,మేము ఎంత క్రూరంగా ఆలోచించగలమో చూడండి!" అని బయటపెట్టుకుంటుంటే దాన్ని ఇతరులకు తెలియజెప్పడం కోసం ధర్మరాజు ప్రదర్శిస్తున్న మౌనాన్ని చేతకానితనం అనుకుని ఇంకాస్త ఇంకాస్త రెచ్చిపోతున్న దుష్టచతుష్టయాన్ని కళ్ళముందు చూస్తున్నప్పుడు భయం వేస్తుంది గానీ తన పొట్టకూటి కోసం కర్ణుడు చెప్పిన అబధ్ధాల్ని నమ్మి చంకనాకిపోయిన తెలివితక్కువదద్దమ్మ దుర్యోధనుడు అనిపించి జాలివేస్తుంది ఉషశ్రీ అనువాదం మొదలు వ్యాసప్రోక్తం అయిన మూలకధని కూడా చదివిన నాకు.
06. ఇప్పుడు ఉన్న అతి కొద్ది పురాణ కధా పరిచయం అరణ్యవాసంలో యక్షప్రశ్నలకి జవాబు చెప్పిన సన్నివేశంలో ధర్మరాజుకి హీరోయిజం కట్టబెట్టేశారు సర్వులూ.అయితే, నందమూరి తారక రామారావు అనే పొట్టకూటి పగటి వేషగాడు వనవాసానికి సంబంధించిన కధల్లో సెక్సప్పీలు కోసం భీముణ్ణీ అర్జునుణ్ణీ హీరోల్ని చేసి దీన్ని వదిలేశాడు గనక "ఆ ప్రశ్నలకి ఆ జవాబులు కరెక్టేనా?ఒకవేళ మనం మన జ్ఞానం ప్రకారం వూహించి చెప్పిన జవాబులు తప్పు అని చెప్పడానికి తగ్గ లాజిక్ ఆ ప్రశ్నలు వేసిన యక్షుడికి ఉందా?ధర్మరాజు చెప్పిన జవాబులు ర్యాండం ఛాన్స్ ఫ్యాక్టర్ కింద నిజం అయిపోయాయా లేక శాస్త్రప్రమాణం చూపించి చెప్పాడా?" లాంటి అనుమానాలు కూడా ఎవరికీ రాలేదు.
కానీ వనవాస కాలంలో ధర్మరాజు తన హీరోయిజం చూపించి అందరి మెప్పునీ పొందాడు - ఒకటి కాదు,అలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి.అక్షయ పాత్ర అనేది తనను చూడటానికి వచ్చే అతిధి అభ్యాగతుల ఆకలిని తీర్చడానికి ఒక ఏర్పాటు చెయ్యమని సూర్యుణ్ణి ప్రార్ధిస్తే వచ్చిన ఇప్పటి సోలార్ ఎనర్జీతో నడిచే ప్రెషర్ కుక్కర్ లాంటి యంత్రం.ఇక్కడ ధర్మరాజు తపస్సు చెయ్యలేదు,కేవలం మంచిమనస్సితో ధర్మరాజు చేసిన ప్రార్ధన వల్ల జరిగిన అద్భుతం!"అలా జరుగుతుందా?ఇది అలౌకికం కదా?ధర్మరాజుకి అతి మానుష శక్తులు ఉన్నాయా?" అనే అనుమానాలు వస్తే ఒకసారి భీముడు లాక్షాగృహం నుంచి కుంతితో సహా సోదరుల్ని నలుగుర్నీ ఎలా మొయ్యగలిగాడో చూడాలి.పాండవులలోని ప్రతి ఒక్కరూ వేదవిద్యల పటల గౌరవం ఉండి యోగశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారే!యోగులు సాధన చేత అణిమాది అష్టసిధ్ధులను సాధించగలరు.వాటిలో భీముడు గరిమ అనే సిధ్ధిని ప్రదర్శించి తన దేహాన్ని పెంచితే తప్ప శరీర దారుఢ్యం కలిగి ఆజానుబాహులైన నలుగురు పురుషుల్ని మోస్తూ అంత దూరం నడవటం సాధ్యం కాదు.
"అగ్నిః పూర్వేభిః ఋషిభి రీఢ్యో నూతనైరుత, స దేవామ్ ఏహ వక్షతి!" అనే ఋగ్వేద మంత్రానికి అర్ధం "పూర్వుల చేత మరియు క్రొత్తవారి చేత ఋషుల చేత నిత్యము అన్వేషింపదగు అగ్ని, ఈ లోకము నందు అన్ని వైపుల నుండి దివ్య ఇంద్రియములను ప్రాప్తింపజేయును (గాక)" అని.మనం దృష్టిదోషాన్ని సవరించుకోవడానికి కంటికి పెట్టుకునే కళ్ళజోడు నుంచి శీఘ్రయానానికి వాడే విమానాల వరకు గల వస్తు సముదాయం అన్నీ దివ్య ఇంద్రియాలే!పాండవులూ ద్రౌపదీ వేదశాస్త్రాల పరిచయం ఉన్న మంత్ర తంత్ర యంత్ర నిర్మాణం చెయ్యగలిగిన ప్రజ్ఞ ఉన్నవాళ్ళే.అర్జునుడు సాధించాడంటున్న అస్త్రాలు కూడా ఇప్పటి మిస్సల్స్ లాంటి ఆయుధాలే కదా!
వీళ్ళు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు బకాసురుణి చంపి రమ్మని కుంతీదేవి భీముణ్ణి పంపిస్తున్నప్పుడు “అమ్మా! ఎందులకు నీవు పుత్రత్యాగము చేయుచున్నావు? ఎవ్వని బాహుబలము వలన మనము లాక్షాగృహము నుండి బయపడ్డామో ఎవ్వని శక్తి సామర్థ్యాలవల్ల దుష్టుడైన పురోచనుడు నశించాడో ఎవ్వని బలపరాక్రమాలు మనల్ని ఎల్లవేళలా దుర్యోధనుని బాఱినుండి కాపాడుతున్నాయో ఏ వీరుని అండ చూసుకుని మనము సుఖముగా జీవిస్తున్నామో ఏ మహాబలశాలి కౌరవాదులకు గుండెదిగులు అయ్యాడో ఎవ్వనిపై భారం మోపి పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మఱల పొందుదామనుకుంటున్నామో అట్టి నాగాయుధ బలసంపన్నుడైన భీమసేనుని ఎందులకు త్యాగము చేస్తున్నావు తల్లీ”? అని బకాసురునికి ఆహారముగా వెళుతున్న తమ్ముని చూసి తల్లి అయిన కుంతీదేవిని అడిగాడు ధర్మరాజు.“నాయనా! ప్రస్తుతము మనము ఈ విప్రోత్తముని ఇంటిలో ఆశ్రయము తీసుకుంటున్నాము. ఆ విప్రుని కుమారుడు బకాసురునకు ఆహారము కాకుండా కాపాడి ఆయన మనపై చూపిన వాత్సల్యానికి కృతజ్ఞతను చూపించాలి. ప్రత్యుపకారం మన కనీస కర్తవ్యమ్. సాటి వారు బాధలలో ఉన్నప్పుడు ఆదుకోవటం మానవతాధర్మమ్. అదీ కాక ఇటువంటి పండితోత్తముని రక్షించటం మహాపుణ్యదాయకమ్. లోభం వల్లకానీ తెలియక గానీ మోహము వల్లకానీ నేనీ నిర్ణయము తీసుకోలేదు.
వెయ్యి ఏనుగుల బలమున్న భీమసేనుని పరాక్రమము మనకు తెలియనిది కాదు. హిడింబాసురుని వధించినప్పుడు మనకి అతని శక్తి ఎంతటిదో తెలిసిపోయింది. ఆ భీమసేనుడు పుట్టిన రోజే నా చేయిజారి క్రింద పడినప్పుడు అతని క్రింద ఉన్న రాయి నుగ్గునుగ్గైపోయింది! యుద్ధములో వజ్రిని కూడా ఢీకొనే బలమున్నది భీమునికి. కనుక ఇతడు నిస్సందేహముగా బకాసురుని వధించి ఈ ఊరికి ఉపకారం చేస్తాడనే నా నమ్మకమ్. ఆ పైన శ్రీకృష్ణుని దయ” అని హితబోధ చేసింది మహాసాధ్వి అయిన కుంతీదేవి.ధర్మజుడు తల్లి మాటలు విని ఎంతో సంతోషించి పుత్రవాత్సల్యంతో తమ్ముని మనసారా దీవించి పంపించాడు.అది పాండవుల హీరోయిజం.
అక్షయపాత్రను అడిగింది కూడా తమ సొంతానికి వైభవాలు పొందడానికి కాదు,ఇతరుల ఆకలిని తీర్చడానికి.ధర్మరాజులా తన స్వశక్తితోనే తనకు కావలసిన సమస్తాన్నీ సాధించుకుని నగరంలోనూ అరణ్యంలోనూ ఒకే స్థాయి వైభవాన్ని ప్రదర్శించే హీరో మెటీరియల్ లేని దుర్యోధనుడు పాండవశ్రీని కుట్రలతో దోచుకుని హత్యలతో పాండవుల్ని నశింపజెయ్యాలనే చావుతెలివిని చూపించి కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు కులపాంశనుడనే దుష్కీర్తి గడించి అన్ని ధర్మాలూ తెలిసి ధర్మచక్షువు అనే కీర్తిని గడించి కూడా కేవలం తనమీద ప్రేమతో తెలిసి తెలిసీ ఘోరమైన తప్పుల్ని చేసిన పిచ్చితండ్రికి ముసలి వయసులో చచ్చిన కొడుకుని తల్చుకుని కుళ్ళి కుళ్ళి యేడ్చే గతి పట్టిస్తూ హతమారి పోయాడు.
వీణ్ణి హీరోని చేసి పతివ్రత అయి ధర్మతత్వజ్ఞురాలైన ద్రౌపదిని "వంతువంతున మాసమున కొక్క మగని చొప్పున పచ్చి పచ్చి భోగాల తేలియాడు మదవతి" అని అవమానిస్తూ పళ్ళు పటపట కొరికిన పొట్టకూటి పగటి వేషగాడికి కూడా తన భార్యని జీవితంలో పిల్లల్ని కనదగిన (45-16=)30 యేళ్ల కాలంలో 12 సార్లు పురిటి గదికి పంపించి కన్న సంతానంలో ఒక్కరు కూడా ముసలితనంలో తోడు నిలవని ధృతత్రాష్ట్రుడి నికృష్టపు బతుకు దాపరించింది - యద్భావం తద్భవతి, తస్మాత్ జాగ్రత్త!
07. ఘోషయాత్ర - ఎలా మొదలై ఎలా అంతమై ఎవరెవరికి ఏయే దృశ్యాలు చూపించి మూలకధకి పెట్టిన అసలు పేరు జయేతిహాసం అయితే "మహత్వాత్ భారవత్యేన అగ్రతమం ఇతి మహాభారతం(విషయంలోని గాంభీర్యత గొప్పదిగా ఉంటూనే అంతర్లీనమైన విషాదం చేత భారమైనదీ కాబట్టి దీనిని మహాభారతం అనడం జరుగుతున్నది)" అని పొగడ్తలు అందుకున్న నేటికి కధావశిష్టం అయిన పూ.సా(BCE) 3000 సంవత్సరాల వెనకటి చరిత్రని ఏ మలుపు తిప్పిందో తల్చుకుంటే మరొక కధావశిష్టం అయిన రెండు కోట్ల సంవత్సరాల వెనకటి చరిత్ర అయిన రామకధలోని కిష్కింధ సుందరకాండలతో పోల్చదగిన పర్వం ఇది.
"పాండవు లిప్పుడు పరమదుఃఖార్తు లగుచు ద్వైతవన సరోవర సమీపంబున నున్నవారని వింటిమి; నీవు సకల సామ్రాజ్య విభవంబు మెఱసి చని యందు నీ తేజంబు ఘర్మ సమయము నాఁటి తపను తేజంబై పగతుర కన్నులు గదుర నతి దుస్సహంబగునట్లుగాఁ జేయుము; దొల్లి నహుష పుత్రుండైన యయాతియుం బోలె నుజ్జ్వలుండవై యున్న నిన్నుం జూచి పాండవులు హృదయ భేదంబుగా వగచెదరు. మిత్రజన మోదంబును శత్రుజన ఖేదంబును సంపదలకుం దగియెడు ఫలంబు" అనేది కర్ణుడి ఉచితబోడిసలహా.
మహాభారత కావ్యం గురించి పెద్దలు చాలామంది "ధర్మతత్వజ్ఞుల కిది ధార్మిక బోధ;నీతికోవిదుల కిది నీతి శాస్త్రం;లాక్షణికుల కిది మధుర కావ్యం" అంటూ చాలా రకాల పొగిడారు గానీ వారెవరూ చెప్పని నాకు తోచిన విశేషం ఏమిటంటే ఒకే కావ్యం ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించడం అనే వింతకి మూలం వాటన్నిటికీ వెనకాల దాక్కుని చదువుతున్న వింటున్న అర్ధం చేసుకుంటున్న వాళ్ల గుండెల్ని మెలిపెట్టేస్తున్న దుర్భరమైన విషాదపు మాయతెర ఒకటి ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది.
ఈ వ్యాసపరంపర మొదలు పెట్టటానికి కొద్ది రోజుల ముందు బారతకధలో మెయిన్ విలన్ ధృతరాష్ట్రుడు అని బలంగా నమ్ముతున్న నేను దీనికోసం పరిశోధన మొదలు పెట్టిన కొద్ది రోజుల తర్వాత "అయ్యో పాపం ధృతరాష్ట్రుడు" అని జాలిపడటం మొదలు పెట్టాను.చూడండి, ఇక్కడ కర్ణుడి సూచనకి నువ్వు చెప్పింది నాకూ నచ్చింది గానీ భీష్ముడికి నచ్చదు,విదురుడు అడ్డుపడతాడు అని వెళ్ళబోసుకుంటున్న ఎడుపుగొట్టు వాగుడులో తండ్రి గురించి అన్న మాటలు ఇవి:"నా తలపును నిట్టిదఁ!నీవే తెఱ గెఱిగించి తది యభీష్టము; మనమా ద్వైతవనంబున కరుగుట భూతలపతి యనుమతింపఁ బోలడు మదిలోన్.అదియునుం గాక, ఉరుతర విక్రమాఢ్యు లనియున్ తపోవిశేష సుస్థిరు లనియుం బృధాసుతుల దిక్కునఁ దద్దయు భీతుడై నిరంతరమును మానవేంద్రుఁ డెద దాపము నొందుచు నుండు; వింటె ఇక్కురు విభుఁ డింతసేపు గడుఁ గూర్చి విలాపము సేసె వారికిన్?" - తండ్రి మీద కూడా ప్రేమ లేదు దుర్యోధనుడికి.
దుర్యోధనుడు పాండవులకి చెయ్యలనుకుంటున్న ప్రతి దుర్మార్గానికీ పాపం ధృతరాష్ట్రుడు బాధ పడుతూనే ఒప్పుకున్నాడు.కొడుకు తనకన్న ముందే చచ్చి ముసలి వయసులో చచ్చిన కొడుకుని తల్చుకుని కుళ్ళి కుళ్ళి యేడ్చే గతి పట్టకూడదని అనుకుంటూ కొడుకు చేస్తున్న ఏ పనులకి అనుజ్ఞ ఇచ్చాడో ఆ పనులు ఆఖరికి అదే గతిని పట్టించాయి.కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తుందనీ త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాల నడుస్తందనీ ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాల నడుస్తుందనీ కల్యుగంలో ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుందనీ ఒకో యుగానికీ మానువుల స్వభావం ఒకోలా ఉంటుందనీ చెప్తారు గానీ నిన్నటి ద్వాపరయుగపు ఈ తండ్రీ కొడుకుల విచిత్రమైన అనుబంధాన్ని ఇప్పటి కలియుగంలో ఎన్నిచోట్ల చూడటం లేదూ!
ఇలాంటివాళ్ళు కుటుంబ స్థాయికి పరిమితం అయితే ఆ ఒక్క కుటుంబమే నాశనం అవుతుంది.మహాభారతం అంతటా పరుచుకున్న విషాదానికి వీళ్ళిద్దరూ రాజ్యాధినేతల స్థానంలో ఉండటం ఒక్కటే అసలు సిసలైన విషవృక్షబీజ సమమైన కారణం.కవిత్రయకర్తలు కర్ణుణ్ణి గురించి ఒకచోట కృష్ణుడి నోట దుర్యోధనుడనే విషవృక్షానికి కర్ణుడు తల్లివేరు అని చెప్పించారు.అదీగాక కర్ణుని తల భారతం అనే విశేషవాక్యం కర్ణుణ్ణి పొగుడుతూ పుట్టించినది కాదు,కురుక్షేత్రం జరగటానికి కారణమైన అన్ని సన్నివేశాలూ కర్ణుని తలనుంచి పుట్టిన ఉపాయాలు ఎదురు తన్నిన ఎడుపుగొట్టు దరిద్రాలే అన్న సూచన ఉంది అందులో.దాయాదుల్ని పధ్నాలుగేళ్ళ పాటు అడవులు పట్టించానన్న సంతోషాన్ని కొంత కాలం పాటు కొనసాగనివ్వ వచ్చు కదా,తింటూ తాగుతూ తూలుతూ సుఖాన ఉన్నవాణ్ణి పనిగట్టుకుని "మన వైభవాన్ని చూసి వాళ్ళు యేడుస్తుంటే చూసి మనం నవ్వుకుందాం" అనే ఉచితబోడిసలహా ఇవ్వకపోతే ఏం?
అక్కడికీ ధృతరాష్ట్రుడు "తగు గోరక్ష యొనర్ప; దుష్టమృగ విధ్వంసంబు నూహింప మేలగు; నైనన్ వినుఁ డవ్వనాంతరమునం దాసక్తిమై నున్నవారు గరిష్ఠాత్ములు పాండురాజతనయుల్ రూఢప్రతాపాఢ్యు; లట్లగుటన్ మీ గమనంబు నా మదిఁ బ్రియంబై తోఁప దెబ్భంగులన్. మున్నును మీచేత గడున్ బన్నము పడి నొచ్చినారు పార్ధులు; మిమ్ముం గన్నంత నలుగ కుండునె, పన్నగరిపు సన్నిభుండు పవనజుఁ డాత్మన్?" అని మొత్తుకున్నాడు.అయినా సరే "అబ్బెబ్బే!మన గోవులని రక్షించుకుని వచ్చేస్తాం.పాండవుల వైపు కన్నెత్తి చూడం" అని ఒట్లు పెట్టుకుని పర్మిషన్ తీసుకున్నారు - అవసరమా రాజపురుషులకి అంత అతి వినయం!
ఇంతవరకు జరిగిన కధలో క్యామిడీ యేంటో తెలుసా - దుర్యోధనుడు అనుమానాలు వెలిబుచ్చిన వెంఠనే ధృతరాష్ట్రుడికి వెయ్యాల్సిన ఠస్సాకి దగ్గ పిట్టకధ కర్ణుడికీ రెడీగా బుర్రకి తట్టలేదు.ఉసూరుమంటూ తల వేళ్ళాడేసుకుని కొంపకి పోయి తెల్లార్లూ ఆలోచించీ చించీ పొద్దున్నే లగెత్తుకొచ్చి దుర్యోధనుడికి చెప్పిన పిచ్చ ప్లాను దైతవనంలో ఉన్న గోపాలకుల్లో ఒకడికి లంచం ఇచ్చి ధృతరాష్ట్రుడికి "రాజుగారూ, రాజుగారూ, మరండీ....ద్వైతవనంలో మనం మేపుకుంటున్న గోవుల్ని పక్కనే ఉన్న అడివినుంచి సింహాలూ పులులూ వొచ్చి తినేస్తున్నాయండి. రాజకుమారులుంగార్ని పంపించండీ!" అని మొర్రలు పెట్టుకోమని ఆ తర్వాత వీళ్ళు ధృతరాష్ట్రుడి ముందుకి వెళ్ళారు.తమ కింద పనిచేస్తున్న పనివాళ్ళకి లంచం ఇచ్చి తప్పుడు రిపోర్టులు వ్రాసి రాజుగారికి పంపించమనటం - అవసరమా రాజపురుషులకి అంత బేఖారీతనం!
తర్వాత జరిగిన పెద్ద క్యామిడీ యేంటో తెలుసా - ద్వైతవనం వెళ్ళే దారిలోనే విడిది చేసి పోటుగాళ్ళలా హడావిడి చేసి చిత్రసేనుడనే గంధర్వుడితో వైరం తెచ్చుకున్నారు.కర్ణుడు అక్కడున్న గంధర్వుల్ని చితక్కొట్టాడు గానీ స్వయాన చిత్రసేనుడు రంగంలోకి వచ్చి కర్ణుడి రధాన్ని విరగ్గొడితే వికర్ణుడి రధం ఎక్కి కర్ణుడు యుధ్ధరంగం నుంచి పారిపోయాడు.చిత్రసేనుడు దుర్యోధనుడి రధాన్ని విరగ్గొట్టి దుర్యోధనుడి జుట్టు పట్టుకుని లాగుతూ నేలమీద పండబెట్టి విజయోత్సవ సింహనాదం చేశాడు. చిత్రసేనుడి సైనికులు ఆటపాటల వినోదాల కోసం వీళ్ళు తెచ్చుకున్న డ్యాన్సింగు గర్లుసుతో సహా అందర్నీ పెడరెక్కలు విరిచిపట్టి తాళ్ళతో కట్టేసి చిత్రసేనుడి ముందు నిల్చోబెట్టారు.
యుధ్ధరంగం నుంచి పారిపోయిన వాళ్ళలో ఒకడు ధర్మరాజుకి సంగతి చెప్పాడు.భీముడు పగలబడి నవ్వుతూ "కాగల కార్యం గంధర్వులు తీర్చారు!" అన్నాడు.అప్పుడు ధర్మరాజు,"తమ్ముడూ! మనలో మనం పోట్లాడుకునేటప్పుడు మనం అయిదుగురం వాళ్ళు నూర్గురు, కానీ, వేరేవాళ్ళు మనమీదకి వచ్చినప్పుడు మనం నూట అయిదుగురం" అనే అద్భుతమైన మాట చెప్పాడు.
ధర్మరాజు యొక్క మంచితనపు విశ్వరూపం చూడండి - "అనుమాన మొక్కింతయును లేక యలిగి జలంబులఁ ద్రోచె, విషంబు వెట్టె, గృహదాహ మొనరించె, విహిత దురోదర కపటుఁడై రాజ్యంబు నపహరించె, జనులెల్లఁ జూడంగ వనజాక్షిఁ బాంచాలిఁ దల వట్టి యీడ్పించె,వలువ లొలువ బనిచెఁ, బుట్టిన కోలె మనకు నక్కట సుయోధనుఁ డెగ్గు సేయని దినముఁ గలదె? వాని చేఁత లొకటి యేనియుఁ దలపవు, నీవు, మనుజనాధ!కేవలంపు కరుణఁ పూని యుండు;దరయ నెప్పుడు నిట్టు, లైన మనకుఁ గార్యహాని గాదె" అని పూర్వవైరస్మృతిని చూపిస్తున్న భీముడితో "కావరయ్య యనినఁ గార్ము దుర్బలుఁడైన,జెనసి యోపినంతఁ సేయుమనిన నూఅర్కుండ్ నయ్య! యుత్తమ శూరుఁడు దీనజనుల యున్న తెఱగు సూచి? శరణం బని వచ్చిన భీకర శత్రువు నయినఁ బ్రీతిఁ గావఁగ వలయుం గరుణా పరుల తెఱంగిది; యిరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్" అంటున్న ధర్మరాజుని ఆ దృశ్యంలో నిలబడి చూస్తుంటే మనకి గూస్బంప్స్ రావూ!
క్లైమాక్సులో వచ్చే మరొక క్యామిడీ యేంటో తెలుసా - చిత్రసేనుడికి సైతం భీమార్జునుల ప్రవర్తన అయోమయం,గందరగోళం అనిపించింది - "ఈ దురాత్ముఁడు మిమ్ము నివ్వనంబున నితాంతాయాస పీడితులైన వారిఁ బరమ ధర్మాత్ముల భార్యాసమేతుల నపహసింపఁ దలంచి యరుగు దెంచె; నింతయు నెఱిఁగి సురేంద్రుండు గలుషించి యనుజ వధూసహాయాన్వితముగఁ బాపవర్తను వీనిఁ బట్టి తెమ్మని నను బనిచిన వచ్చితి బార్ధ వినవె! శక్రుపాలికి నిదె కొని చనుచు నున్నవాడ; నీవింక నొండన వలదు,వినుము!మత్సఖుండవు గావున మత్సరంబు,నలుకయును లేదు నీదెస నాకు ననఘ" అని తెగేసి చెప్పి అర్జునుడు సొంత పెత్తనాలు చేస్తూ దుర్యోధనుడి వైపుకు ఫిరాయించేస్తున్నాడనీ పెద్దన్నని మోసం చేస్తున్నాడనీ అనుమానం కూడా వచ్చేసి తీర్పు కోసం బందీల్ని ధర్మారజు దగ్గిరకే తోలుకొచ్చాడు.
చిత్రసేనుడికి చెప్పాల్సింది చెప్పి పంపించేసి తనమీద కక్షతో రగిలిపోతున్న దుర్యోధనుడికి "ఎన్నఁడు నిట్టి సాహసము లింక నొనర్పకు మయ్య!దుర్జనుం డన్నున సాహసక్రియల యందుఁ గడంగి నశించుఁ; గావునం గ్రన్నన తమ్ములన్ దొరలఁ గైకొని యిమ్ముల బొమ్ము వీటికిన్! సన్నుత, దీని కొండొక విషాదముఁ బొందకుమీ మనంబునన్" అని హితవు చెప్తున్న ధర్మరాజుని దృశ్యంలో నిలబడి చూస్తుంటే మనకి గూస్బంప్స్ రావూ!
ధర్మరాజు తెలుసుకుని జాగ్రత్తపడిన "దుర్జనుం డన్నున సాహసక్రియల యందుఁ గడంగి నశించుఁ" ననే పరమసత్యం పధ్ధెనిమిది అక్షౌహిణుల్ని తన సొంత పగ కోసం శలభాల లాగ మలమల మాడ్చి చంపి తను కుక్కచావు చచ్చేటప్పుడు కూడా కర్ణుడి విషపు కూతలకు మతిపోయిన దుర్యోధనుడికి ఎక్కలేదు - అదే మహాభారత కావ్యం గురించి పెద్దలు చాలామంది "ధర్మతత్వజ్ఞుల కిది ధార్మిక బోధ; నీతికోవిదుల కిది నీతి శాస్త్రం; లాక్షణికుల కిది మధుర కావ్యం" అంటూ అనేక రకాల పొగడ్డానికీ ఒకే కావ్యం ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తున్న వింతకీ మూలమై వాటన్నిటికీ వెనకాల దాక్కుని చదువుతున్న, వింటున్న, తెలుసుకుంటున్న వాళ్ల గుండెల్ని మెలిపెట్టేస్తున్న దుర్భరమైన విషాదపు మాయతెర!
ధర్మరాజు తెలుసుకుని జాగ్రత్తపడిన "దుర్జనుం డన్నున సాహసక్రియల యందుఁ గడంగి నశించుఁ" ననే పరమసత్యం కేసీయారుకీ రేవంతు రెడ్డికీ,చంద్రబాబు నాయుడికీ జగన్మోహన రెడ్డికీ,జోసెఫ్ స్టాలినుకీ అణ్ణామలైకే గాక నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ద్వయానికి సైతం తెలియడం లేదు, జాగ్రత్త పడటం లేదు,నేలను విడిచిన సాములు చేస్తున్నారు - అదే నవీనకాలపు భారత ప్రజల విషాదం!అసలు వీళ్ళకి కాదు, ధర్మరాజు తెలుసుకుని జాగ్రత్తపడిన "దుర్జనుం డన్నున సాహసక్రియల యందుఁ గడంగి నశించుఁ" ననే పరమసత్యం తెలియాల్సింది - వీళ్ళకి వోట్లు వేసి వీళ్ళని అధికారంలో కూర్చోబెడుతున్న వాళ్ళకి తెలియాలి.
సశేషం(WAIT for NEXT)
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు