Thursday 31 January 2019

వరమిస్తావా ఓ సుకుమారీ, నీ కళ్ళను ఎపుడూ నానుంచి మరలిపోనివ్వనని!

అబ్బాయి:
వరమిస్తావా ఓ సుకుమారీ,
నీ కళ్ళను ఎపుడూ నానుంచి మరలిపోనివ్వనని!

చరణం:
అందం చూడకనే అనుబంధం పేనవేసుకుని
బంధం వీడకనే అనుక్షణం గిరిగీసుకుని
అందరు కోరుకునే పూర్ణమిదం సాధించాలని
పిచ్చివాడిలా నీచుట్టూ తిరుగుతున్న నాకు...
||ప||

చరణం:
అహం పోవడానికి ఉపాయాలు చెప్తావని
భవం దాటడానికి సహాయాలు చేస్తావని
అభయానికి ఏకమేవాద్వితీయం నేర్పుతావని
పిల్లవాడిలా నీ కడకొంగును పట్టుకున్న నాకు...
||ప||

చరణం:
నన్ను నీతో కలుపుకుని మనం అనుకోవడానికి
మనం ఇల్లొకటి కట్టుకుని కుటుంబం అవడానికి
కుటుంబం పెరిగి బంధువులై సమాజం అవడానికి
బిచ్చగాడిలా దోసిలిపట్టి నీముందు నిలుచున్న నాకు...
||ప||

చరణం:
నువ్వు తప్ప ఇంకెవరూ నాకు అక్కరలేదని
నేను తప్ప ఇంకెవరూ నీకు ఉండకూడదని
మనకి మనం త్వమేవాహం అయిపోవాలని
భక్తిలోని సంపూర్ణశరణాగతిని అందుకున్న నాకు...
||ప||

అమ్మాయి:
వరమిస్తావా ఓ ముచికుందా,
నీ కళ్ళను ఎపుడూ నానుంచి మరలిపోనివ్వనని!

చరణం:
అందం చూడకనే అనుబంధం పేనవేసుకుని
బంధం వీడకనే అనుక్షణం గిరిగీసుకుని
అందరు కోరుకునే పూర్ణమిదం సాధించాలని
పిచ్చిదానిలా నీచుట్టూ తిరుగుతున్న నాకు...
||ప||

చరణం:
అహం పోవడానికి ఉపాయాలు చెప్తావని
భవం దాటడానికి సహాయాలు చేస్తావని
అభయానికి ఏకమేవాద్వితీయం నేర్పుతావని
చిన్నపిల్లలా నీ ఉత్తరీయం పట్టుకున్న నాకు...
||ప||

చరణం:
నన్ను నీతో కలుపుకుని మనం అనుకోవడానికి
మనం ఇల్లొకటి కట్టుకుని కుటుంబం అవడానికి
కుటుంబం పెరిగి బంధువులై సమాజం అవడానికి
బిచ్చగత్తెలా దోసిలిపట్టి నీముందు నిలుచున్న నాకు...
||ప||

చరణం:
నువ్వు తప్ప ఇంకెవరూ నాకు అక్కరలేదని
నేను తప్ప ఇంకెవరూ నీకు ఉండకూడదని
మనకి మనం త్వమేవాహం అయిపోవాలని
భక్తిలోని సంపూర్ణశరణాగతిని అందుకున్న నాకు...
||ప||

P.S:అమ్మాయిలూ అబ్బాయిలూ I LOVE YOU చెప్పుకోవడానికి ఎవరి version వాళ్ళకి రాశాను, బాగుంది కదూ!

5 comments:

  1. Write an article on Union and AP budgets.

    ReplyDelete
  2. . . . బాగుంది కదూ! . . .
    ఏం బాగో యేమో!
    నే నిలాంటివి అస్సలు చదవను.
    నిజానికి ఈ P.S. మాత్రమే చూచాను.
    మనలో మనమాట. నాబోటి వాడి కవిత్వాలూ ఎవ్వరూ చదవరు లెండి. బ్లాగుల్లో ఇరవైనాలుగ్గంటలూ పద్యాల్తోనూ కవిత్వాలతోనూ కుస్తీలు పడుతున్నవాళ్ళూ ఆకుస్తీలు నిర్వహిస్తున్న వాళ్ళతో సహా! :(

    ReplyDelete
  3. నేను ఎవరు?నువ్వు ఎవరు?తను ఎవరు?
    నేనూ నువ్వూ తనూ ఎవరం?

    నేను నేనేనా?నువ్వు నువ్వేనా?తను తనేనా?
    నేనూ నువ్వూ తనూ ఒకరేనా?

    నేను ఎప్పుడు ఎవరికి ఎలా పుట్టాను?
    నువ్వు ఎప్పుడు ఎవరికి ఎలా పుట్టావు?

    నా గురించి నాకు ఎట్లా తెలిసింది?
    నీ గురించి నీకు ఎట్లా తెలిసింది?

    తన గురించి తనకి ఎంత తెలుసు?
    తన గురించి తనకి ఎట్లా తెలిసింది?

    అసలు తెలియాల్సినది ఏమిటి?
    అది తెలియకపోతే ఏమౌతుంది?
    తెలుసుకుంటే ఏమి లాభం?
    తెలియకుంటే ఏమి నష్టం?

    ఇదంతా ఏమిటి?

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యలో "ప్రశ్నోపనిషత్తు" అమోఘం. Very profound & thought provoking!

      Delete
    2. వేదం గురించి చదువుతున్నాను కదా!
      ఆ inspiration ఇలా బయటపడింది.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...