Saturday 5 January 2019

వూరవతల ఏటి గట్టున చుక్కల చూరు కింద పొదరిల్లు కడదామా?ఓ గజ్జెల గుర్రమంటి సినదానా!

అబ్బాయి:వూరవతల  ఏటి గట్టున చుక్కల చూరు కింద పొదరిల్లు కడదామా?
ఓ గజ్జెల గుర్రమంటి సినదానా!

అమ్మాయి:ఒంటికి చెమట పట్టని మారాజులకి 
ఏసీలూ డబల్ కాటు బెడ్డులూ నిదర మాత్రలూ 
ఇవ్వలేని నిద్రని - 
పొద్దున్న తిన్న చద్దన్నం,ఎండల్ల పడ్డ కాయకష్టం,
సంజేళ ఏణ్ణీళ్ళ స్నానం,రెల్లుగడ్డి పరుపు, 
సందిట్ల కదిలేటి పక్కతోడు,  కన్నిప్పితే తొంగిచూసేటి 
కుందేలు కూన ఇస్తాయి!

అబ్బాయి:ఉరుకుల పరుగుల బతుకుల లంచ్ బాక్సులో 
కుక్కిన గ్యాస్ స్టవ్వు మీద వండిన కుక్కరు వంటలూ,
కేయ్యఫ్సీ చికెన్లూ,మెక్డోనాల్డు పిజ్జాలూ, లాట్వినా బర్గర్లూ
ఇవ్వలేని రుచిని 
మిగలపండి చెట్టునుంచి రాలిపడి 
జన్మనేస్తం కాకెంగిలి చేసిన జాంపండు ఇస్తుంది!

అమ్మాయి:ఇంటిపక్క సినిమాహాళ్ళూ, రోడ్డుకవతలి వాల్మార్టులూ,
వీధి మొగదల బారండ్రెస్టారెంట్లూ,ట్రాఫిక్ జాముల హారన్మోతలూ
ఇవ్వలేని పరవశాన్ని 
చెట్లగుబురుల్లో దాక్కున్న పాటకత్తెల లాంటి కోయిలలూ,
జాంపండ్లని రుచి చూసి కిందకి వదిలే రామచిలకలూ,
మనం చూరులో కట్టిన వరికంకుల్ని కడుపారగ తిని
కిచకిచలతో దీవించే పిచ్చుకలూ ఇచ్చేవి - ఒకప్పుడు!

అబ్బాయి:డబ్బుని కరెన్సీ రూపంలో చూడకముందు
కొనడం, అమ్మడం అంటే తెలియని అమాయకత్వం పోయి
అమ్మకాలూ కొనుగోళ్ళూ లాభమూ అనే వెంపర్లాట పెరిగి
డబ్బుని కరెన్సీ రూపంలో చూపిస్తున్న చెట్టుని మర్చిపోయిన మనిషి
చెట్టుకి క్షమాపణ చెప్పాల్సిందే!
తనని తను రక్షించుకోవటానికైనా 
చెట్టు నీడకి చేరాల్సిందే!

అమ్మాయి:వూపిరిలో,కనుపాపలో,చెవి గూబలో,కాలిపిక్కలో,
పొత్తికడుపులో,పాలిండ్లలో,తలలో చేరిన కాలుష్యవిషాన్ని
కాంక్రీటూ,ప్లాస్టిక్కూ,గ్యాడ్జెట్లూ,ఫ్యాషన్లూ,ప్యాషన్లూ
తప్ప ఇంకేమీ లేని మోడ్రన్ స్టైల్ అనే డెడ్ ఎండ్
విరిచెయ్యలేదు గనక - 
నా మాటిను. 

అమ్మాయి:వూరవతల ఏటిగట్టున చుక్కల చూరు కింద 
పొదరిల్లు కట్టాలిసిందే! ఇంకా చూస్తావేంటి మావా?

3 comments:

  1. Puducherry 1

    What are the possibilities of Congi gaining 100 MP seats in 2019 elections.

    Let us see the possibilities of the Congi getting the MP seats area wise.
    1.North east consist of Arunacal,Assam,Meghalaya, Manipur,Tripura,Mizoram and Nagaland. The total strength of seats is 2+14+2+2+2+1+1=24. As per the latest tally the congress or its ally may get one seat in the entire north east. The BJP or a local party candidate will be get elected. The chances of Congi are very bleak. Tally=0

    ReplyDelete
  2. 2. West Benagal, there are three forces here, Trinamul in power in the state. Remaining forces are BJP,CPM and congi. As per presnt tally the BJP is occupying the second place and the CPM is pushed to third place and congi in the fourth place. Didi is not interested to share seats with congi in W.B, elsewhere she will support Congi. The total number of seats are 42. Congi cannot field even candidates to contest in some constituencies. The major seats will be won by Trinamul and CPM and BJP. The chances of congi winning a good number of seats in WB is an imagination. If it wins a few seats in WB it is a wonder. Hence the score may be…2
    3.UP. This is the biggest state which decides the fate of the party ruling at centre. At present congi is not in a position to field candidates in this state. The last desersion from congi is its secretary Rita Bahuguna. The latest news says that the SP and BSP are making a trial to field 38+38 candidates and congi is left without a seat in the Gahtbandhan. Finally congi winning a seat in UP is far from reality. The total strength of MPs from UP are..80 .
    4.Bihar. This state will send a contingent of MPs half that of UP. There are four forces. BJP and Nitish on one side and the RLD and congi on the other. RLD leader is in jail and debarred from politics. His sons are bickering with each other. Nitish already made astrike with BJP and they are in a better position. The congi with the support of RLD may get seats in single digit and the same may be around 5.
    By this time the total seats are 186 (24+42+80+40=186) and congress possibility is around 9 at the heighest.
    5.Delhi and Punjab (7+13=20) In Delhi the forces are BJP,Congi and AK. The congi may get one seat and the remaining to be shared by the two other. In Punjab, if the selection of candidates is to be left to the CM the possibility of winning 5 seats is possible…5
    6.Haryana,Jammu Kashmir,HP (10+6+4) In this three states the congi’s voice is nil almost. May win one or two seats on local candidates influence….1
    7.Gujarat. The strength is 26. This is the state of PM and people of Gujarat will vote for Modi this time also and congi may get 5 seats as the fight is in between two parties only. ..5
    After the fist tally of 186 seats now 186+20+20+26=253 are over and the congress seats are 9+5+1+5=20 out of 253 seats.
    8.Mharastra. The strength is 48 and there are four forces. BJP,Congi,Sarad pawar and Tiger. Now the state is ruled by BJP and local party. Pawar is also a force and Congi is likely to win at least 10 seats….10
    9.Rjasthan and MP,Chattis gadh,Orissa ( 25+29+11+21=86) In the recent state elections the BJP lost power in the states due to incumbency . Still the BJP is a force and congi ruling the states with very thin majority and in 2019 elections the congi may bag 25 seats from these two states, the biggest win so far.…. Chattisgadh5+odisha 2. ……..25+7=32
    10. Now before coming to the south as the total seats lapsed so far after the first tally of 253. 253+48+86=387 the congress tally is 20+32=52
    11. Karnataka. 28 and there are three forces. Congi,BJP and the Devegowda. The BJP missed the chance of forming the Govt narrowly as in the case of MP,Rajashan. Here the cahnaces of Congi winning is possible in 12 seats and in Kerala out of 20 it may win 10 seats. So that is the end of congress. 52+12+10=74. This is the biggest victory for congress.
    12. In the remaining states of AP,Telangana,Tamilnadu 25+16+39=80 the congress may not get a single seat.
    As the congress is below 100 seats it cannot unite the the local parties and forma Govt, even if CBN backed the congress. Even the TDP wont support congress in AP but support Congi in Telanagana. So the chances of congi forming Govt. at centre are very remote.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...