Tuesday 22 August 2017

చైనా - భారత్ అనే రెండు మదపుటేనుగులు నిజంగానే ఢీకొంటాయా?యుద్ధం ఈ రెండు దేశాలకే పరిమితమా లేక జరిగేది మరో ప్రపంచయుద్ధమా?

          Afghanistanతో 76 క్ల్.మీ,Bhutanతో 470 క్ల్.మీ,Hong Kongతో 30 క్ల్.మీ,Indiaతో 3380 క్ల్.మీ,Kazakhstanతో 1533 క్ల్.మీ,Kyrgyzstanతో 858 క్ల్.మీ,Laosతో 423 క్ల్.మీ,Macauతో 3 క్ల్.మీ,Mongoliaతో 4677 క్ల్.మీ,Myanmarతో 2185 క్ల్.మీ,Nepalతో 1236 క్ల్.మీ,North Koreaతో 1416 క్ల్.మీ,Pakistanతో 523 క్ల్.మీ,Russiaతో 3645 క్ల్.మీ,Tajikistanతో 414 క్ల్.మీ,Vietnamతో 1281 క్ల్.మీ - తన చుట్టూ ఉన్న 16 దేశాలతో భౌగోళిక సరిహద్దును పంచుకుంటూ మోరెత్తి కలహకుక్కుటనాదం చేస్తున్న బలిసిన కోడిపుంజులా కనిపించే చైనా స్వభావంలో కూడా పందెపుకోడినే తలపిస్తున్నది.
          తన చుట్టూ ఉన్న  ఈ దేశాల్లో దాదాపు ప్రతి దేశంతొనూ ఏదో ఒక దశలో సరిహద్దు వివాదం రావటం,అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అన్న చందాన మొదట చిన్న చిన్న దాడులతో విసిగించటం గానీ లేదా పెద్ద యుద్ఢం చేసి గానీ తన శక్తిని చూపించి భయపెట్టి తర్వాత వ్యాపార ఒప్పందాల లాభసాటి ఆశలను ఎర చూపించడం ద్వారా ఏకపక్షమైన ప్రయోజనాలనే సాధించింది.అయితే,1962లో భారత్ మీద జరిగిన యుద్ధంలో పూర్తి గెలుపు దాదాపు ఖాయమైన స్థితిలో కూడా ముందుకు వెళ్ళి గెలుపును పూర్తి చేసుకోవటానికి బదులు నిర్నిబంధమైన యుద్ధవిరమణ ప్రకటించి McMahon Line వెనక్కి వెళ్ళి సర్దుకోవడం విశేషం!

          North Koreaతో సరిహద్దుకు సంబంధించిన ఒక ఒప్పందం 1962లో చేసుకున్నప్పటికీ అది Yalu, Tumen అనే రెండు నదులతో కలిసి ఉంది కాబట్టి దాని లంకల విషయంలోనూ ఈ రెండు నదుల జన్మస్థానమైన Mount Paektu విషయంలోనూ రెండు దేశాల మధ్యన గొడవలు మొదలయ్యాయి.దీనికన్న పెద్ద సమస్య Tumen నది చివర్న సాగి రష్యాని కొరియాతో కలుపుతుంది.కొరియా వాళ్ళు చైనాకి ఉన్న అతి తక్కువ తీర ప్రాంతంలో 200 మైళ్ళ Fishing Zone ఏర్పాటు చేసుకున్నారు - ఇది చైనా యొక్క maritime military strategic borderకి బొక్క వేసింది!రష్యా 1990ల నాడు North Koreaతో సర్దుబాటు చేసేసుకున్నది గానీ చైనాకీ North Koreaకీ మధ్యన మాత్రం గొడవలు అలాగె ఉన్నాయి - దీనికి రెండు కారణాలు.

          ఆర్ధిక కోణంలో చూస్తే చైనా కుదుర్చుకునే ఏ ఒప్పందంలోనైనా లాభం పూర్తిగా గానీ లేదా ఎక్కువ గానీ తనకే రావాలనుకుంటుంది తప్ప 50-50 పద్ధతికి కూడా ఒప్పుకోదు - చైనా "విన్-విన్" దారిని ఎంచుకోవడం చాలా అరుదు!రాజకీయ కోణంలో చూస్తే North Korea పాక్షికంగా చైనా మీద ఆధారపడి ఉంది - అది North Korea పట్ల ఔదార్యంతో కూడిన ఉపేక్ష కాక ఎప్పుడో ఒకప్పుడు దారికి వచ్చే వీలున్నప్పుడు ఇప్పుడే తొందరపడి తక్కువ లాభంతో సర్దుకుపోవడం దేనికనే ఎదురు చూపు కావచ్చు.1998లో Kazakhstanతో Baimurz pass దగిర 680 square-kmల భూమి కోసం,Sary-Charndy River దగ్గిర 380 square-kmల భూమి కోసం చైనా Kazakhstanకి ధారాళంగా నూనె గనుల్లో పెద్ద యెత్తున పెట్టుబడులు,Kazakhstan అంతణినీ కలుపుతూ 3,000 కిలోమీటర్ల పొడుగున gas pipeline వెయ్యటం,15 సంవత్సరాల పాటు ఆర్ధికపరమైన సహకారం అందిస్తానని వాగ్దానం చేసింది.తన ప్రయోజనం కోసం దెబ్బ కొట్టటానికీ దబ్బు చల్లటానికీ - కూడా సిద్ధంగా ఉంటుంది చైనా - మొహమాటం లేదు!

          Afghanistanతో చైనాకి నిన్నమొన్నటి వరకు మంచి సంబంధాలే ఉండేవి.Wakhan Corridor అని పిలిచే ఈ రెండు దేశాల సరిహద్దు ప్రాంతం కొన్ని శతాబ్దాలుగా తేయాకు,పండ్ల క్యార్వాన్లు తిరుగుతూ మంచి లాభసాటి అయినది.ఒక సరిహద్దు ఒప్పందం 1963లోనే ఏర్పడింది,Cold War సమయంలో కూడా రెండు దేశాల స్నేహం చెదరలేదు.Afghanistanలో Taliban regime మొదలయ్యాకనే Afghanistanతో చైనాకి సమస్యలు మొదలయ్యాయి.వాళ్ళు చైనాలోని Xinjiang provinceలో ‘East Turkestan Islamic Movement’ పేరుతో Uyghur separatistsని రెచ్చగొట్టటం మొదలు పెట్టారు!అయితే, Afghanistan ప్రభుత్వం మాత్రం చైనాతో స్నేహంగానే ఉంటున్నది.

          మనకీ చైనాకీ గొడవలు మొదలైనది ఇంగ్లీషు వాళ్ళ పుణ్యమే!ఇంగ్లీషు వాళ్ళు వాళ్ళ సౌకర్యం కోసం చేసిన అడ్డదిడ్డం సరిహద్దుల మార్పులే ఈ రెండు దేశాల మధ్యన పెద్ద యెత్తున ఉద్రిక్తతలు పెరగడానికి కారణం.ఈ గొడవలు లేని మిందరి కాలంలో కొన్ని సహస్రాబ్దా పాటు ఈ రెండు దేశాల మధ్యన రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక మేళవింపు జరిగి రెండు దేశాల్నీ తమ అత్యున్నతమైన గత కాలపు వైభవాన్ని చూసులుని గర్వించేలా చేసింది!సాంస్కృతికంగా,సామాజికంగా,ఆధ్యాత్మికంగా,వైజ్ఞానిక విజయాల పరంగా ప్రాచీన కాలంలోనే సాటి వారెవ్వరూ చేరుకోలేని అత్యున్నత శిఖరాలను అందుకుని ఇప్పటికీ చెక్కు చెదరని తేజస్సునీ ఓజస్సునీ చూపిస్తున్నవి ఈ రెండు దేశాలే!ఈ రోజున గుర్తింపు పొందిన సరిహద్దులు ఒకనాడు లేకపోయినా ప్రాంతం పరిధిని బట్టి చూస్తే ఇప్పుడు ప్రపంచంలో గురింపు పొందిన నూట యాభై పైచిలుకు దేశాలలో అత్యంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది ఈ రెండు దేశాలకే.అలాంటి ఈ రెండు దేశాల మధ్యన యుద్ధం కోరుకోకూడనిదే!

          ఇప్పుడు దేశంలో చైనాతో యుద్ధం వస్తేనే బాగుండునని కోరుకుంటున్నవారిలో చాలామందికి అలా అనిపించడానికి 1962 నాటి యుద్ధం చేసిన గాయమే ముఖ్యమైన కారణం - అప్పటి దెబ్బకి ఇప్పుడు దెబ్బ తీసి జరిగిన అవమానానికి ప్రతెకారం తీర్చుకోవాలనే భావన ఉంది - సహజమే!కానీ ఆ యుద్ధానికి కారణాలు ఎన్ని, చైనా ఏయే కారణాలతో దూకుడుగా వచ్చి దాడి చేసిందో ఆయా కారణాలకి సమబంధించి ఏ లాభమూ పొందకుండా నెల రోజుల తర్వాత యుద్ధంలో తనదే పైచేయి అని తెలిసి కూడా తన కోరికల్ని తీర్చాల్సిందేనని పట్టు పటకుండా యుద్ధం ఆపేసి ఎందుకు నిశ్శబ్దం అయిపోయింది అనే విషయాలని పరిశీలిస్తే చాలా విచిత్రమైన విషయాలు తెలుస్తాయి!అసలు ఈ రెండు దేశాల మధ్యన నెల రోజుల పాటు అంత తీచ్రమైన యుద్ధం జరిగాక కూడా కొద్ది రోజుల్లోనే తమ మద్జ్యన ఏమీ జరగనట్టు వ్యాపార ఒప్పందాలూ దౌత్య సమబంధాలూ రెండు దేశాల ప్రభుత్వాలూ యధావిధిగా నడుపుకోవటం ఎలా సంభవించింది?సామాన్య ప్రజల్లో ఇప్పటికీ రగులుతున్న క్రోధం ప్రభుత్వ,అధికార వర్గాలలో ఎందుకు కనిపించ లేదు?ఈ అనుమానాలకి సరయిన కారణాలు తెలిస్తే ఇప్పుడు భారత్ ఎట్లా ప్రవర్తిస్తే బాగుంటుందో తెలుస్తుంది.

          వాస్తవానికి 1962లో అసలు యుద్ధం జరిగినప్పటికీ, సరిహద్దుకు సంబంధించిన సమస్యలు చాలాకాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ 1959లో జరిగిన Tibetan uprising తర్వాత జరిగిన గొడవల్లో వాళ్ళు తరిమసిన దలై లామాకి మన దేశం ఆశ్రయం ఇవ్వడం ముఖ్యమైనది.నిజానికి అంతర్గత సమస్యల వల్ల ఈ కలహం 1950ల నుంచీ ఉన్నప్పటికీ 1959లో ఉద్గృతం కావడానికి United States ప్రమేయమే కారణం.టిబెటన్ గెరిల్లాలకి CIA తన అధ్వర్యంలో శిక్షణ ఇచ్చి పంపిస్తున్నదని తెలిసినప్పుడు చైనా తన దేశంలో విదేశీయుల సహాయంతో జరుగుతున్న తిరుగుబాటుని అణిచివేయాలనుకోవడం తప్పూ కాదు, దాని నాయకుడైన దలై లామా తన వైపు నుంచి దోషమేమీ లేని అమాయకుడూ కాదు - అవునా?

          Mao Zedong టిబెటన్ గెరిల్లాల తిరుగుబాటు బలం పెంచుకోవడానికి సంబంధించిన వార్తలు తెలిసినప్పుడు 1959 February 18వ తేదీన “The more chaotic [the situation] in Tibet becomes the better; for it will help train our troops and toughen the masses. Furthermore, [the chaos] will provide a sufficient reason to crush the rebellion and carry out reforms in the future.” అని అనటాన్ని బటి వ్యతిరేకుల పట్ల చైనా ఎట్లా వ్యవహరిస్తుందో తెలుసుకోవచ్చు - ఎంత ఉద్గృతంగా గొడవ చేస్తే అంత క్రూరంగా అణిచివెయ్యడమే తప్ప సమస్యని ఉభయతారకమైన పద్ధతిలో పరిష్కరించడం చైనా ఎప్పటికీ చెయ్యదు.భారత్ చైనాతో వ్యవహరించేటప్పుడు ఈ విషయంలో హెచ్చరికగా ఉండాలి!

          చైనా మొత్తానికి దలై లామా ఒక్కడే బౌద్ధ మతస్థుడు కాదు,మిగిలిన వాళ్ళు ఇప్పటికీ చైనా ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నారు.అతని సొంత రాజకీయపరమైన కారణాలతో అతను చైనా ప్త్రభుత్వాన్ని వ్యతిరేకించి ఉండవచ్చు - ఏ మతానికి సంబంధించినవైనా సరే ఆలయాలు, విహారాలు, చర్చిలు, మసీదులు, దర్గాలు వంటి స్థలాలు ఆర్ధికంగా బలమైనవి అయితే అవి రాజకీయాలకి అతీతంగా ఉండలేవు!ఈ రకమైన సంక్లిష్టతని అర్ధం చేసుకోలేని పండితుడు నెహ్రూ మానవత్వం, తొక్కా, తోలు అంటూ అడుసులో కాలెట్టాడు.చైనాకి కాలగూడని చోట కాలింది.వార్నింగులు ఇచ్చింది.అయినా పట్టించుకోలేదు.దీనికి తోడు "చైనా మనమీద దాడి చెయ్యటమా?నెవ్వర్!" అనుకుంటూనే ప్రతిపక్షాల నుంచి విమర్శల్ని తప్పించుకోవడం కోసం భారత్ Forward Policy అంటూ అప్పటికే వివాదాస్పదమైన McMahon Line వెంబడి Military Outpostలని పెంచింది - ఎందుకు పెంచాలో తెలియకుండా, ఎంత సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందో తెలుసుకోకుండా, ముందు వెనకలు చూసుకోకుండా చేసిన ఈ దుందుడుకు పనితోనే భారత్ అవమానానికి కారణమైన దిక్కుమాలిన యుద్ధం మొదలయ్యింది!

          ఈ Forward Policy అనేది  1961 November 2న నెహ్రూ అధ్యక్షతన defence minister Krishna Menon, foreign secretary M.J. Desai, Army Chief General P.N. Thapar, Intelligence Bureau director B.N. Mullick సభ్యులుగా ఉన్న ఒక కమిటీ ఆలోచించి పన్నిన వ్యూహం తెలివి తక్కువ నిర్ణయమేమీ కాదు.1962, February 4న ఢిల్లీలో Home Minister చేసిన "If the Chinese will not vacate the areas occupied by her, India will have to repeat what she did in Goa. She will certainly drive out the Chinese forces." అనే ప్రకటన కూడా గొప్పగానే ఉంది.

          కానీ యుద్ధం ముంచుకు వచ్చినప్పుడు కఠినమైన నిర్ణయాలు సత్వరం తీసుకోగలిగిన నెహ్రూ,మీనన్ ఇద్దరూ తమకున్న వామపక్ష భావజాలం పట్ల ఉన్న మక్కువ వల్ల చైనాతో సరైన పద్ధతిలో వ్యవహరించలేకపోవడమే ఆనాడు యుద్ధం రావడానికీ మన దేశం దుర్భరమైన అవమానానికి గురి కావడానికీ ఉన్న ముఖ్యమైన కారణం!వీళ్ళిద్దరూ చెయ్యకుండా మిగిల్చిన దరిద్రం ఏదైనా ఉంటే ఆ కొరతని Lieutenant General Brij Mohan Kaul తీర్చాడు.ఈ ముగ్గురు మూర్ఖులూ ఎవడికి తోచిన తలతిక్క పని వాడు చేసుకుంటూ పోయిన గందరగోళం వల్లనే ఆ యుద్ధం అంత తెలివితక్కువగా మొదలై ఒక నెల రోజుల పాటు భారత సైన్యాన్ని దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేసి అంత హఠాతుగానూ ఆగిపోయింది - చైనాకి జాలిపుట్టి యుద్ధవిరమణ ప్రకటించింది గానీ ఇంకాస్త ముందుకెళ్ళి యుధాన్ని పూర్తి చేసి మన దేశాన్ని ఆక్రమించుకుంటే మనం చెయగలిగినది ఏమిటి?మన బంగారాలు మంచివి కాక ఓడిపోయామని ఏడవటం తప్ప చైనాని తిట్టుకుని ప్రయోజనం లేదు.

         ప్రాచీన కాలం నుంచి ఎన్నో రాజవంశాల చేత పరిపాలించబడిన టిబెట్ క్రీ.శ 1912 నుంచి 13వ దలై లామా అధికారం కిందకి వచ్చింది.దలై లామా కేవలం ఒక బౌధ సన్యాసి కాదు.టిబెట్ ప్రాంతానికి రాజకీయ అధిపతి!ఇప్పుడు మనం చూస్తున్న ది 14వ దలై లామాని.క్రీ.శ 1914లో టిబెట్ బ్రిటిష్ ఇండియాతో ఒపందం కుదుర్చుకున్నది.స్వతంత్రం వచ్చాక సాంకేతికంగా తన స్థానాన్ని భరతదేశానికి దఖలు పరిచింది బ్రిటిష్ ఇండియా.కానీ,1949లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సాంస్కృతిక సారూప్యత పేరుతో టిబెట్,అరుణాచల్ ప్రదేశ్‌లని తమకి దఖలు పరచమని చైనా వాదనతో పొరపొచ్చాలు మొదలయ్యాయి!నిజానికి అది సాధ్యమా?ఆ లెక్కన అంతకు ముందెప్పుడో ఏ భారత దేశానికి చెందిన ప్రభువో చైనా ప్రాంతం మొత్తాన్ని పరిపాలించాడనేది రుజువైతే చైనా భారతదేశంలో కలిసి పోతుందా?

          అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచీ చైనా కమ్యునిష్టు పార్టీ దక్షీణ టిబెట్ కోసం అడుగుతూనే ఉంది,భారత్ చైనాకి అన్ని రకాల సహాయాలూ చేస్తూనే ఉన్నది,1950లో భారత్  "Indo-Chinese border" విషయంలో పర్వర్తిస్తున్న తీరుని గురించి చైనా నుంచి ప్రశంసలు పొందింది కూడా!భారత ప్రధాని పార్లమెంటులో అధికారికమైన బారత దేశపు map చూపించి "Our maps show that the McMahon Line is our boundary and that is our boundary...we stand by that boundary and we will not let anyone else come across that boundary" అని స్పష్తం చేశాడు,చైనా కూడా విన్నది,దాని మీద ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు,1851లో మన దేశం లడఖ్ దగ్గిర పాకిస్తానుతో పోరాడుతునన్ సమయంలో Aksai Chin దగ్గిర హదావిడి పెంచింది,తనకూ భరతదేశానికీ ఎలాంటి సరిహదు వివాదాలు లేవని చైనా చెప్తూనే ఉన్నది,అంతర్జాతీయ రాజకీయ రంగం చైనాని ఒంటరిని చేసిన సమయంలో భారత్ చైనాకి నామినీగా పని చేస్తూనే ఉన్నది,1950లో చైనా యొక్క People's Liberation Army ఉత్తర టిబెట్ సైన్యాన్ని ఓడించి తన అధికారాన్ని స్థాపించుకున్నది,భారత్ చైనాతో పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది,చైనా వెళ్ళగొట్టిన టిబెట్ రాజకీయ ప్రభువుని చేరదీసింది - మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే CIA 1956లో టిబెటన్ గెరిల్లాలకి శిక్షణ ఇచ్చిన స్థావరం భార్తదేశంలోని Kalimpong.ఇన్ని వరస తప్పులు మనవైపున ఉన్నప్పుడు చైనాని నిందించి ప్రయోజనం ఏమిటి?

          పై స్థాయిలో జరిగిన రాజకీయ నిర్ణయాల వెనక ఉన్న తప్పిదాలకి కృష్ణ మీనన్ కన్న తమ Forward Policyని చైనా తీవ్రంగా పరిగణించదని నమ్మబలికిన IB chief Mullickదే ఎక్కువ బాధ్యత ఉంది.అప్పటి ప్రతిపక్షాల అజ్ఞానం వల్ల జరిగిన రాజకీయ దాడికి కృష్ణ మెనన్ బలయ్యాడు - అతని తప్పులూ ఉన్నాయి గానీ IB chief హోదాలో ఉన్న Mullick సరయిన సమాచారం ఇవ్వడంలో ఫెయిలయినప్పుడు నెహ్రూ గానీ మీనన గానీ చెయ్యగలిగింది ఏముంది?మిగిలిన సగం దరిద్రాన్ని General B.M.Kaul పూర్తి చేశాడు.

          యుద్దం తర్వాత బలవంతంగా గెంటించుకున్న Brij Mohan Kaul అనే ఈ అతి మేధావి  Royal Military College నుంచి బయటికి వచ్చాక 1933 ఆగస్టు 31న Indian Armyలో Unattached List కింద Second Lieutenant హోదాలో చేరాడు.అప్పటి నుంచి ఇంగ్లీషు వాళ్ళ కాలంలోనూ స్వతంత్రం వచ్చాకనూ ఇతను పై స్థానాలకి ఎదగడంలో సైనికుడికి కావలసిన లక్షణాల కన్న అధికారంలో ఉన్నవాళ్లతో పరిచయాలే ముఖ్యపాత్ర వహించాయి - సాటి సైనికాధికారులకి ఇతని ఎదుగుదల అసహ్యాన్ని కలిగించేది!junior officer రోజుల నుంచీ జవహర్ లాల్ నెహ్రూకి ఇతను "personal favourite" అయ్యాడు.ఈ పరిచయం వల్ల అతను కెరీర్ మొత్తంలో ఏనాడూ సైనికుడిగా జీవించలేదు, అర్హతలేని అందలాల్ని అందుకోవడంలో ఎలాంటి సిగ్గునీ చూపించలేదు!ఇటువంటి వెధవలకి personal favorite హోదా ఇవ్వడంలోనే నెహ్రూ వెధవాయిత్వం కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది.

          అప్పటి వరకు Chief of General Staff (CGS) హోదాలో ఉన్న Lt General B.M. Kaul మన దరిద్రం కొద్దీ General officer Commanding (GOC) అయ్యాడు.మొట్టమొదటి రోజునే పటాలం పాండులా Namkachu లోయలోకి పోయి హడావిడి మొదలెట్టాడు.ఇతని నాయకత్వంలో భారత సైన్యం చైనా అధీనంలో ఉన్న Tse Jong స్థావరాన్ని పటుకున్నది,కానీ ఈ పెద్దమనిషి జబ్బుపడి తిరుగుటపాలో ఢిల్లీ చేరుకోగానే చైనా సైనికులు 800 మంది విరుచుకు పడి భార్త సైన్యాన్ని తుడిచి పెట్టేశారు.నిజానికి భారత్ యొక్క Forward Policyకి ఇది పూర్తి విరుద్ధం - వీలున్నంతవరకు చైనాని రెచ్చగొట్టకుండా defensive game ఆడాలనేది మంచి ప్లానే,చైనా కూడా తనంతట తను యుద్ధానికి రాకుండా చర్చలకి పిలుస్తూనే ఉంది.కానీ ఈ B.M. Kaul నెహ్రూ దగ్గిర తనకున్న personal favorite హోదాని అడ్డం పెట్టుకుని సొంత పెత్తనం చేశాడు.మనలో చాలామంది అనుకుంటున్నట్టు తొలిదాడి చైనా చెయ్యలేదు,భారత్ వైపునుంచి కౌల్ తొలిదాడి చేశాకానె చైనా తనకి కావలసిన సన్నివేశం జరగగానే తన శైలిలో తను రెచ్చిపోయింది.

          ఎంత సేపూ చైనా తమ Forward Policyని తీవ్రంగా తీసుకుని భారత్ మీద పెద్ద యెత్తున దాడి చెయ్యదు అన్న గట్టి నమ్మకంతో నెహ్రూ నుంచి కౌల్ వరకు అమాయకంగా ఉంటే చైనా వ్యూహం వీళ్ళ కెవరికీ తర్వాతెప్పుడో చైనా చెబితే తప్ప తెలియనంత రహస్యమైనది!కలింపాంగ్ విషయం తెలిసి చైనాకి భారత్ టిబెట్ వ్యవహారంలో కుట్ర చేస్తున్నదని చైనా అనుమానించినట్టు కొందరు చేస్తున్న విశ్లేషణ ఆధారాలు ఉన్నదే గానీ అసలు కారణం మరింత లోతైనది.ఆ లోతు తెలియక పోవడం వల్లనే భారత్, ముఖ్యంగా నెహ్రూ తనకి చేస్తున్న సహాయాల్ని మర్చిపోయి ఆ ఒక్క విషయానికి కనీసపు కృతజ్ఞత కూడా లేకుండా రెచ్చిపోయిందంటే మనలో చాలామందికి కష్టం అనిపిస్తున్నది!

          దాడికి దిగడంలోనూ వెనక్కి తగ్గడంలోనూ చైనాకి ఉన్న priorities వేరు,.RS Kalhaఅనే Iraqలో పనిచేసిన Indian ambassador ఒక వ్యాసంలో The then Chinese President Liu Shaoqi told the Sri Lankan leader Felix Bandaranaike that the 1962 conflict was ‘to demolish India’s arrogance and illusions of grandeur. China had taught India a lesson and would do so again and again.’ Mao Zedung confirmed this line of thinking when he told a Nepalese delegation in 1964 that the ‘major problem between India and China was not the McMahon Line, but the Tibetan question’. In 1973, Zhou Enlai was to tell Kissinger that the conflict took place because Nehru was getting ‘cocky’. అని చెప్పడాన్ని బట్టి చైనా కమ్యూనిష్టు పార్టీ ఎంత దుర్మార్గమైనదో వూహించుకోవచ్చు.ప్రపంచ స్థాయిలో తనకి లభిస్తున్న ఆదరణని చూసుకుని మురిసిపోతున్న నెహ్రూకి ఝలక్ ఇచ్చి కంగు తినిపించడమే చైనా లక్ష్యం - అది నేరవేరగానే యుద్ధం ఆపేసింది,అంతా తన క్రూరమైన లెక్క ప్రకారమే చేసింది చైనా.ఇవ్వాళ చైనాతో యుద్ధం వస్తే బాగుండునని కోరుకునేవాళ్ళు దీన్ని గుర్తుంచుకోవాలి!ఇంత క్రూరమైన చైనాతో యుద్ధం ఎంత ప్రమాదకరమైనదో తెలియని అవివేకులే చైనాతో యుద్ధానికి ఉవ్విళ్ళూరుతారు.

          భారతీయులు 1962 ఓటమిని ఎక్కువ చేసుకుని కుంగిపోవాల్సిన అవసరం లేదు. సరిగ్గా అయిదేళ్ళ తర్వాత 1967లో సిక్కిం సరిహదుల దగ్గిర భారత సైన్యం కేవలం 88 మందిని పోగొట్టుకుని హద్దును దాటి వచ్చిన చైనా సైనికుల్లో 340 మందిని మట్టుబెట్టి 450 మందిని క్షతగాత్రుల్ని చేసి 1962 నాటి అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నది.అసలు 1962 నాటి యుద్ధంలోనే అన్ని ప్రతికూలతల మధ్య మన సైనికుల పోరాట పటిమ చూసి చైనా సైనికులు జోహారు లర్పించారు.On October 10, these 50 Indian troops were met by an emplaced Chinese position of some 1,000 soldiers. The Chinese troops opened fire on the Indians believing that the Indians had intruded upon Chinese land. The Indians were surrounded by a Chinese positions which used mortar fire. However, they managed to hold off the first Chinese assault, inflicting heavy casualties. In the second assault, the Indians began their retreat, realising the situation was hopeless. The Indian patrol suffered 25 casualties, with the Chinese suffering 33. The Chinese troops held their fire as the Indians retreated, and then buried the Indian dead with military honors, as witnessed by the retreating soldiers. This was the first occurrence of heavy fighting in the war.చరిత్రలో ఒక దేశపు సైన్యం శత్రు దేశపు సైనికులకి గౌరవ వందనం చేసిన సన్నివేశం బహుశా ఇదొక్కటే కాబోలు!

          1949లో red army యొక్క ప్రపంచాన్ని కుదిపేసిన పది రోజుల తిరుగుబాటు జైత్రయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన చైనా కమ్యూనిష్టు పార్టీ 1962లో నిర్నిబంధ యుద్ధవిరమణ నాటి నుంచి మిగతా అన్ని సరిహద్దు దేశాలతో సమస్యల్ని సామ,దాన,భేద,దండాలలో ఏది వీలయితే అది ఉపయొర్గించి పరిష్కరించుకుని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడానికి కొంతకాలం పాటు చీకటి తెర వెనక దాక్కుంది.బయటికి రావడం రెండు విధాల దారుల్లో జరిగింది - 1990ల నుంచి economic infastructure పూర్తి చేసుకుని ప్రపంచ వాణిజ్యరంగంలోకి వచ్చి పెనుతుఫాను సృష్టించడం,ముత్యాల హారం లాంటి అమరికతో భారతదేశాన్ని కబళించడానికి తిరుగులేని సైనికవ్యూహం పన్నడం.

          1990ల వరకు భారత్,చైనాలు ఆర్ధిక విషయంలో దాదాపు సరిసమానంగానే ఉండేవి.ఆ తర్వాతనే చైనా అనూహ్యమైన వేగంతో మన దేశాన్ని దాటి ముందుకు వెళ్ళింది.చైనా 1979లో ఇంటికి ఒకే బిడ్డ అనే నియమాన్ని గట్టిగా అమలు చెయ్యడంతో పనిచేసేవాళ్ళ మీద పోషించాల్సిన వాళ్ళ బరువు తగ్గింది.మావో జనాభాని తగ్గించడంలో కృషి చేసి వూరుకోకుండా ఆ తక్కువ మనుషుల్ని చక్కగా ఉపయోగించుకున్నాడు.విద్య,ఆరోగ్యం అనే రెంటినీ యెంత గట్టిగా సాధించాడంటే 1981 నాటికే చదువుకున్న చైనా ఆడవాళ్ళు చదువుకున్న ఇండియన్ ఆడవాళ్ళ కన్న రెట్టింపు అయ్యారు - ఇప్పటికీ మనం ఈ రెంటిలో వెనకబడిపోయే ఉన్నాం.మనవైపున చూస్తే నెహ్రూ అంతర్జాతీయ విషయాలపైన మక్కువతో కీర్తి ప్రతిష్థల వ్యామోహంలో క్షేత్రస్థాయి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు.చైనాకి విద్య,ఆరోగ్య రంగాల్లో ధృఢంగా ఉండి మానవవనరులు పుష్కలంగా ఉండటం వల్ల అభివృద్ధికి కావలసిన రోడ్లు,భవనాలు,రైల్వేలు,విమానాశ్రయాల వంటి infra structure ఏర్పరచుకోవడం సులువైంది.భారత్ మొదటి దానిలో వెనకబడటం వల్ల రెండో దానిలో కూడా వేగం మందగించింది.ఇలా ఆర్ధికంగా కొంత పుంజుకున్నాక చైనా భారతదేశాన్ని కబళించడం కోసం ముత్యాల హారం ప్లాను వెయ్యడం మొదలు పెట్టింది.
          ఇప్పటికి ముత్యాల హారం దాదాపు పూర్తయిపోయింది.China-Pakistan Economic Corridor (CPEC) పూర్తయితే ఆ కొసన ఉన్న పాకిస్తాన్ నౌకాశ్రయం చైనా అధీనంలోకి వస్తుంది - అదే ఆఖరు ముత్యం!ఈ 15 ముత్యాలు పరుచుకుని ఉన్న దేశాలలో ముఖ్యమైనవి - Myanmar, Bangladesh, SriLanka, Pakistan.చైనా Myanmarలో ఉన్న Kyaukpyu portని ఉపయోగించుకునే సౌకర్యం కోసం ఆ దేశంలో 2400 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ వేస్తున్నది.శ్రీలంకతో భారతదేశానికి కొన్ని శతాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి,అయినా చైనా అక్కడ కూడా అడుగు మోపి ఒక ముత్యాన్ని నాటింది!ఇక పాకిస్తాను ఇండియా మీద ద్వేషంతో ఇవ్వాళ చైనాకి వలస కన్న హీనంగా తయారైంది.అప్పుడు బ్రిటిష్ అద్గీనంలో ఉన్న ఇండియాని బ్రిటిష్-ఇండియా అని పిల్చినట్టు  ఇప్పుడు చైనా-పాకిస్తాన్ అని పిలిపించుకుంటున్న దుస్థితి పాకిస్తానుది.

          అయితే,చైనా ఇంత గొప్ప ప్లాను వేసినా మన దేశపు సైనిక వర్గాల ముందుచూపు వల్ల బంగాళాఖాతం,హిందూమహాసముద్రం రెండింటిలోనూ భారత్ దుర్నిరీక్ధ్యంగానే ఉంది కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు.విదేశాంగ విధాన రూపకర్తలు కూడా Look East policyని ప్రతిపాదించారు.మోదీ అధికారంలోకి రాగానే Look East policyని Act East policy చేసి ముత్యాల హారాన్ని బదలు కొట్టాలనే ప్రయత్నాలు మొదలైనాయి - ఆ పని కూడా దాదాపు పూర్తయింది!ఇరాన్-ఇండియా సంయుక్తంగా chabahar portని వాడుకునే ఒపందం వల్ల ఇండియాకి central asia వైపుకి పాకిస్తానుతో సంబంధం లేకుండా ఒక అడ్డదారి ఏర్పడింది,ఇది చైనా పీఠం వేసుకుని కూర్చున్న పాకిస్తాన్ పోర్టు Gawadarకి కేవలం 70 కి.మీ దూరంలో ఉంది.ఇండీయాకి Maldivesతో ఉన్న సుదీర్ఘమైన చారిత్రక సంబంధాల వల్ల ఆ దేశం చైనా స్థావరాల్ని తమ గడ్డ మీద అనుమతించనని మనకి వాగ్దానం చేసింది.మనకీ Maldivesకీ మధ్యన సైనిక సహకారం కూడా నడుస్తున్నది.

          శ్రీలంకలో చైనాని అనుమతించిన rajaPaksa ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయి పదవి నుంచి దిగిపోవటంతో పాటు చైనాతో అతను చేసుకున్న ఒపందాలు కూడా రద్దయినాయి.అక్కడ ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారత్ వైపుకి మొగ్గు చూపుతున్నది - ఒక ముత్యం దానంతటదే పగిలింది!Andaman-Nicobar దీవుల్ని ఇదివరకటి కన్న ఎక్కువ ఉపయోగించుకోవాలని నౌకాదళం పెద్ద సంఖ్యలో యుధనౌకల్నీ యుద్ధవిమానాల్నీ చేరుస్తున్నది.ఈ మధ్యనే మోదీ Bangladesh వెళ్ళినప్పుడు Hassinaతో ఒప్పందం కుదుర్చుకుని chittagang ముత్యాన్ని చైనా నుంచి లాగి వేశాడు.చైనాకి ఇదివరకే Miyanmarలోని coco దీవి స్థావరంలా ఉపయోగపడుతున్నది,కానీ భారత్ కూడా చైనా వ్యతిరేకతని లెక్క చెయ్యకుండా ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల్ని మెరుగు పరుచుకుంటున్నది.Myanmar తన సైనిక దళాలకి సాగర సంబంధమైన రక్షణ విషయంలో చైనా కన్న భారత్ మీదనే ఎక్కువ ఆధార పడాల్సిన పరిస్థితి ఉంది - ఇండియా దాన్ని ఉపయోగించుకుని Myanmarకి దగ్గరవుతున్నది.చైనా వల్ల ఇబ్బందులకి గురయిన Vietnam సహజంగానే మనవైపుకి వస్తుంది = రెండు దేశాలూ ఈ మధ్యనే సైనిక సహకారం కోసం ఒపందాలను కుదుర్చుకున్నాయి.మోదీ గారు దేశాలు పట్టి తిరుగుతున్నది పిల్లి తల గొరగడానికి కాదు, చైనా దురాక్రమణ నుంచి మన దేశాన్ని రక్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడు!

          కమ్యూనిష్టులు మోదీ ఎప్పుడు అమెరికా వెళ్ళినా తనేదో అమెరికా పాదాల మీద పడిపోతున్నట్టు గగ్గోలు పెడుతున్నది మన దేశాన్ని పాకిస్తాను వాళ్ళు చేసినట్టు తమ కిష్టమైన చైనా పక్కలో పడుకోబెట్టకుండా అడ్డుకుంటున్నందుకే తప్ప దేశభక్తితో కాదు!నిజానికి అమెరికాయె "బాబ్బాబు!మీ మార్కెట్లో కొంచెం వాటా ఇవ్వు, హందూమహాసముద్రంలో కాస్త చోటివ్వ"మని బతిమిలాడుకుంటున్నది.ఆర్ధిక రంగాన్ని మినహాయిస్తే రాజకీయం, సాంస్కృతికం, సామాజికం, సైనికం వంటి రంగాల్లో ఏ దేశమూ మన దేశపు కాలిగోటికి కూడా సరిపోలదు!ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడూ మనం ఎవరినీ దేబిరించాల్సిన దుస్థితిలో లేము.ఆర్ధికంగా ఎదగకపోవడానికి Quality Education లేకపోవడమే కారణం.అది ఒక్కటీ సమకూర్చుకోగలిగితే పది చైనాలు కలిసి వచ్చినా తల తిరిగి ముద్ద నోట్లోకొచ్చేలా జవాబు చెప్పగలం!చైనా నుంచి దురాక్రమణ భయం లేకపోతే అమెరికా నుంచి ఇరాన్ వరకు గల పెద్దా చిన్నా అదెశాల్ని ఈ కాస్త సహాయం కూడా అడగాల్సిన పని లేదు - తమకి నచ్చిన చైనా మన దేశాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళకి నెప్పి  దేనికి ఉంటుంది?ఉంటే గింటే చమ్మగా ఉంటుంది గానీ - కోవర్టు పనులు చేసి భారత్ ఓడిపోయేలా చెయ్యటానికైనా సిద్ధమే!

          ఇప్పుడు కూడా చైనా యొక్క దూకుడుకి అసలు కారణం డోక్లా వివాదం కానే కాదు,దెబ్బ తిన్నాకనే నెహ్రూకి అసలు నిజం తెలిసింది.కానీ, తన మాయకత్వానికి మూల్యం చెల్లిస్తూ నెహ్రూ పతనం కూడా మొదలై తప్పును సరిదిద్దుకునే సమయం అతని చేతి నుంచి జారిపోయింది!అప్పుడు తనకు సమ ఉజ్జీ స్థానాన్ని కోరుకున్నందుకు అన్ని సహాయాలు చేసిన నెహ్రూనే క్షమించని చైనా ఇప్పుడు మోదీని సమ ఉజ్జీ స్థానంలోకి రానివ్వకుండా జెల్ల కొట్టటానికి డోక్లాం వివాదం ఒక ముసుగు మాత్రమే!చైనాలో కమ్యూనిజం యొక్క ఉన్నతాదర్శాలు ఎప్పుడో చచ్చిపోయాయి - ఇప్పుడు అది కూడా కమ్యునిష్టులు విమర్శించే పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదపు నియంతలు చేసే అన్ని దుర్మార్గాల్ని చేసేసి మానవుల సామాజిక జీవితంలోని నైతికపతనానికి పరాకాష్ఠకి ఉదాహరణగా నిలుస్తున్నది.ప్రపంచ మానవాళి యొక్క నాగరికతని ముందుకు తీసుకెళ్ళడంలో ఉపయోగపడిన కాగితం, అచ్చు యంత్రం, తుపాకి మందు వంటి వాటిని ఆవిష్కరించిన చైనాకీ ఇప్పటి చైనాకీ పోలికే లేదు!

          ఇవ్వాళ చైనా తయారీ అంటే చవక ఫోన్లు మాత్రమే గుర్తుకు వస్తున్నాయి.చైనా ప్రపంచ మార్కెట్టులోకి .వచ్చి సాధించినది ఇతర దేశాల వాళ్ళ వస్తువుల్ని దొరకబుచ్చుకుని రివర్స్ ఇంజనీరింగ్ చేసి లేబరు చవగ్గా దొరుకుతుంది గనక అతి తక్కువ రేట్లకి అసలు వస్తువులకి పోటీగా వదలటం.ఒక పదిహేడేళ్ళ కుర్రాడికి మీరో సెల్ ఫోను ఇచ్చారు,వాడు ఒక్కొక్క స్క్రూ వరసగా విప్పుతూ ఏ వరసలో విప్పాడో గుర్తు పెట్టుకుని మళ్ళీ బిగించి పని చేయించగలిగితే అతనికి దాన్ని తయారుచెయ్యడం తెలిసిపోయినట్టే కదా!విడి పార్టులు గనక చవగ్గా దొరికితే వాడే సెల్ ఫోను తయారు చెయ్యగలడు.షాపు పెట్టేస్తాడు.చైనా యెదుగుదల కూడా ఇలాగే జరిగింది. చైనాలో కమ్యునిష్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రపంచానికి ఇచ్చ్గిన సొంత క్వాలిటీ ప్రోడక్టులు చాలా తక్కువ.

          మనిషైనా దేశమైనా యెదగడానికి రెండే దారులు ఉన్నాయి - ఇతరుల్ని కూడా ప్రోత్సహిస్తూ తన శక్తికి తగిన స్థానం వరకు ఎదిగి ఆగిపోవడం, శిఖరాగ్రానికి చేరుకోవడం కోసం ఇతరుల్ని వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళడం - రెండవ దారిని యెంచుకుంది చైనా భారత్ విషయంలో.ఈ దారిని యెంచుకున్నవాళ్ళు యెవరూ సామరస్యానికి లొంగరు,కాబట్టి రెండు అదెశాల మధ్యన యుద్ధం తప్పదు - కాస్త వెనకా ముందూ,అంతే!విజయావకాశాల్ని లెక్కించేటప్పుడు సహజంగా చైనాకి పెద్ద దేశం,జనాభా యెకువ,ఒకసారి గెలిచి ఉంది ఆనెవి సానుకూలమైన అంశాలు.బహుశా,చైనా లోని నాయకులూ మీదీయా వీటిని చూసుకునే దూకుడు చూపిస్తున్నారు కాబోలు!కానీ,ఇప్పటి పరిస్థితి అంత ఏకపక్షం కాదు.

          ఇవ్వాళ భారత్ త్రివిధ దళాలూ మహా శక్తివంతమైనవి.చైనాతో యుద్ధం గనక వస్తే ఈసారి పదాతిదళానికి అప్పటి వ్యతిరేకతలు లేకపోగా యుద్ధరంగం చాలా అనుకూలమైనది.చైనాకు ఇప్పటికీ బలమైన నౌకాదళం లేదు.భారత్ మూడు రంగాలతోనూ ధృఢంగా ఉన్న స్థితిలో ఒక్క వాయుసేనతో చైనా గెలవడం అంత తేలిక కాదు.రాజకీయ నాయకులు బహిరంగ ప్రకటనలు ఎన్ని చేసినా యుధానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాల విషయంలో సైనికాధికారుల యొక్క నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది,అవి రహస్యంగానే ఉంటాయి.అయినాసరే, మొండికెత్తి యుద్ధానికి దిగితే భారత్ కన్న చైనాకే నష్టం యెక్కువ!

          ఆయుధ రంగ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చైనా బలహీనతలలో లోకల్ మేడ్ ఆర్టిలరీ కూదా ఒకటి.భారత్ వద్ద ఉన్న ప్రతి ఆయుధమూ ప్రతి క్షిపణీ ప్రతి జలాంతర్గామీ బ్రాండ్ వాల్యూ ఉన్నది కాగా చైనా ఎక్కడా ఆయుధాలు కొన్న దాఖలాలు లేవు, అవి కూడా రివర్స్ ఇంజనీరింగ్ ముద్దుబిడ్డలే కాబోలు - ఎంత గొప్పగా పనిచేస్తాయో ఇప్పుడు జరగబోయే యుద్ధంలో భారత్ మీద ప్రయోగించాకే తెలుస్తుంది.

          అయితే,రాజకీయంగా సామాజికంగా చైనాకు ప్రతిపక్షం లేకపోవడం వల్లనూ ప్రజల నుంచి వ్యతిరేకత ఉండనందువల్లనూ యుద్ధం ఎంత క్రూరమైన స్థాయిలో చేసినా అడిగేవాళ్ళు ఉండరు.కానీ భారత్ మాత్రం ఇంటిలోనిపోరును ఎదుర్కోవలసి వస్తుంది.ఇక్కడ చైనా గెలిస్తే బాగుండునని కోరుకునేవాళ్ళు కూడా ఉన్నారు.యుద్ధంలో గెలిచిన చైనా యోధులకి "మానవత్వం పరిమళించిన మంచిమనిషికి స్వాగతం" టైపు ఆహ్వానపు వీడియోలు కూడా వస్తాయేమో!ఇప్పుడు విజయశాంతి కాస్త ఒళ్ళు చేసింది గనక ఆ పార్టు బీవీ రాఘవులు ప్లే చేస్తే వరవరరావూ హరగోపాలూ కజీరు కనాయక్కూ అహస్తఫా ముస్తాఖు పక్కతాళం ముత్తయిదువుల వేషాలు వేస్తారు.హీరోగా సుమన్ అస్సలు ఉండకూడదు పొట్టివీరయ్యని తీసుకురావల్సిందే,ఎట్లాగూ ఆ వచ్చే చైనావాడు పొట్టిబుడంకాయే కదా!

          యుద్ధం రావడమంటూ జరిగితే సైనికులకి వాళ్ళ జీవితలక్ష్యమే అది కాబట్టి ప్రాణాల్ని పణం పెట్టి పోరాడుతారు.కానీ మామూలు జనానికి మాత్రం పంబ రేగుతుంది.యుద్ధం వార్తల్ని చూసి సంతోషించడానికి క్రికెట్టు పోటీల్లా రంజుగా ఉండవు,అంత హింస!వ్యాపారస్తులు వెంటనే సరుకుల్ని దాచేసి కొంచెం కొంచెం వదులుతూ రేట్లు పెంచిపారెస్తారు.అమ్ముడుపోకుండా మిగిలిపోయిన పాత సరుకుల్ని కూడా బయటికి తీసుకొస్తారు.1962 యుద్ధం నెల రోజులు జరిగింది.సిక్కిం దగ్గిర దాడిని తిప్పి కొట్టటానికి పది రొర్జులు పట్టింది.నాలుగు నెలల కన్న ఎక్కువ సాగితే సామాన్య పౌర జీవనం అస్తవ్యస్తం కాక తప్పదు.పెద్ద నోట్ల రద్దు వరకు జరిగిన అన్ని నిర్ణయాలు మిశ్రమ ఫలితాలని ఇచ్చాయి గానీ "ఒక దేశం ఒక పన్ను" విధానం మాత్రం అమలు చేసిన ఇన్ని రోజుల తర్వాత కూడా గందరగోళం,అనుమానం కలిగిస్తున్నదే తప్ప సత్ఫలితాల నిస్తున్నట్టు కనబడటం లేదు.ఇప్పటి కిప్పుడు యుద్ధం వచ్చి అది సుదీర్ఘకాలం కొనసాగితే తట్టుకోగలమో లేదో తెలియదు.భారత ప్రభుత్వం తొందర పడకూడదు.వీలున్నంత వరకు యుద్ధాన్ని పనిబడి నెత్తిమీదకి తెచ్చుకోకూడదు.చైనా వేసిన ముత్యాల హారం అక్కడ ఉన్నంతవరకు భారత్ యుద్ధానికి దిగకపోవటమే మంచిది - ముత్యాల హారం పగలగొట్టాకనే భారత్ ప్రశాంతంగా ఉండగలదు!

          నేను పరిశీలించిన మేరకు  చైనా కూడా ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని కోరుకోవడం లేదు, వర్షాకాలం వరకు స్టేట్మెంట్ల ద్వారా బెట్టు చేసి అప్పుడు పనులు ఆపివేస్తున్నామని సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది - మోర్టారు పనులూ యుద్ధమూ ఈ రెండూ తలకు మాసినవాడు తప్ప వర్షాకాలంలో ఎవడూ చెయ్యడు.ఎందుకంటే, భారత్ ఇదివరకులా నంగిరిపింగిరి కబుర్లు చెప్పడం లేదు.చైనా గనక యుద్ధానికి దిగితే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నది.1962 గురించిన డైలాగులు అటువాళ్ళూ ఇటువాళ్ళూ పేల్చారు గానీ 1962లో భారత సైనికులు ఎదుర్కొన్న ప్రతికూలతల మధ్యన కూడా వారి పోరాటపటిమ చైనా సైన్యాధికారుల్ని చాలా భయపెట్టింది.

          రెండు దేశాలకీ తమకంటూ బలమైన సైన్యమూ,వ్యూహ నిర్మాణ చాత్రుర్యమూ ఇతరుల నుంచి సహాయాన్ని ఆశించని స్వాభిమానమూ ఉన్నాయి కాబటి యుద్ధం ఈ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కావచ్చు.అలాగే ఎవరికీ సంపూర్ణ విజయం దక్కకపోవచ్చు.భారత్ గనక టిబెట్ ప్రాంతాన్ని పట్టుకుని దలై లామాని అక్కడ నిలబెడితే చైనాకి నడుం విరిగినట్టు అవుతుంది.ఇది యుద్ధసమయంలో కుదరకపోయినా గెలుపోటములతో సంబంధం లేకుండా తర్వాతనైనా చెయ్యాల్సిన పని.ఎందుకంటే విస్తీర్ణం ఎక్కువయినప్పటికీ చైనాలో జనావాసానికి తగిన భూమి తక్కువ.ఒక్క టిబెట్ ప్రాంతమే మిగిలిన వాటికన్న మెరుగు.మొత్తం చైనా జనాభాలో 12% ఉండి వ్యాపారులకి లాభం తెచ్చిపెట్టేది అది ఒక్కటే - అప్పుడు చైనా దాన్ని వశపరచుకోవడానికి ప్రయత్నించిందీ దలై లామా తిరగబడిందీ అందుకే.దాన్ని గనక చైనా నుంచి వేరు చేస్తే ఇక మళ్ళీ భారత్ వైపుకి కన్నెత్తి చూసే ధైర్యం చెయ్యదు చైనా!

ప్రేమలోనూ యుద్ధంలొనూ గెలుపే ముఖ్యం - ఎలా గెల్చినా తప్పు లేదు!

64 comments:

  1. >>> ప్రేమలోనూ యుద్ధంలొనూ గెలుపే ముఖ్యం - ఎలా గెల్చినా తప్పు లేదు !>>>
    అంతేనంటారా ? ఇలాగే చైనా కూడా అనుకుంటుందేమో కదా ?

    ReplyDelete
    Replies
    1. I thought somebody would counter it!You countered AS eI expected!

      Delete
    2. >>ఇలాగే చైనా కూడా అనుకుంటుందేమో కదా ?

      hari.S.babu
      చైనా ఒక్కటే అలా అనుకోవడం వల్ల వచ్చిన తంటా అది, ఇండియా కూడా అలాగే అనుకుంటే బ్యాలెన్సు నిల్లవుతుంది - అదీ నా లెఖ్ఖ!

      Delete
  2. హరిబాబు గారూ, పరిశోధన & విషయ సేకరణ బాగుంది.

    చైనా ప్రస్తుతం ఎన్నో బయటకు కనిపించని సమస్యల మయం. కమ్యూనిస్టు నాయకత్వమే కాక సైన్యం కూడా అవినీతిలో కమ్ముకు పోయింది. నాణ్యత ప్రపంచ బాజారులలో మేడ్ ఇన్ చైనా అంటేనే రోత పుట్టే స్థాయికి పడిపోయింది. తైనాన్మెన్ దమనకాండ తరువాత ఇన్ని రోజులకు మళ్ళీ అవే సంకేతాలు పునరావృత్తం అవుతున్నాయి.

    టిబ్బెట్టు ఇంకా మేలుకోలేదు కానీ మునుపటి చీకటి తగ్గుతుంది. జిన్జియాంగ్ కొద్దోగొప్పో అలజడులు మొదలయ్యాయి. అల్ప సంఖ్యాకులలో హన్ ఆధిపత్య వ్యతిరేకత ఇప్పుడిప్పుడే పెరుగుతుంది.

    ReplyDelete
    Replies
    1. టిబెట్టూ,జింజియాంగూ విడిపోతే మన దేశం కన్న చిన్న దేశం అవుతుంది చైనా - ముఖ్యంగా కమ్యూనిజం కూడా ఎగిరిపోబ=వచ్చు!

      Delete
    2. సోవియట్ యూనియన్ పతనం కూడా ఇలాగే. కమ్యూనిస్ట్ పార్టీ ఆధిపత్యం, నాన్-రషియన్ జాతుల విముక్తి రెండూ ఒకేసారి జరిగాయి.

      Those who forget the past are condemned to repeat it: George Santayana

      Delete
  3. The vanishing Hindus of India, facts, figures, maps based on census and media links. View & spread the word

    https://t.co/xK8nqPaahR

    ReplyDelete
  4. Cihna is Waste country

    https://www.youtube.com/watch?v=GCiU1FeWJFc

    ReplyDelete

  5. Understanding that tens of thousands of Indian artefacts have been looted over the centuries, Anuraag Saxena and his friends have embarked on a mission to bring that heritage back home. The India Pride Project is raising awareness of the magnitude of the plunder and the current locations of stolen statues, manuscripts, and other valuables—often acquired unwittingly by their present owners. His organization is part of a growing movement that is prompting museums, art collectors, and world leaders to restitute these items to India, piece by treasured piece

    https://www.youtube.com/watch?v=uq6b07Ln0Pc&t=34s

    ABOUT ANURAAG SAXENA: Anuraag Saxena is the Asia-Head for the World Education Foundation, UK and leads the Asia partnerships and entry-strategy. He spent his corporate years with GE Capital, Deutsche Bank and Credit Suisse, where he was heading strategy and change teams across the Americas, Europe, Asia and Australia. Anuraag passionately believes that skills from academia and corporate-life, can and should be applied to solve social challenges as much as they solve economic ones.

    ReplyDelete
  6. క్రైస్తవ మత ప్రచారం: భారత దేశ విచ్చిన్నానికి జరుగుతున్న కుట్రలు ఏమిటి? వారి లక్ష్యం ఏంటి? | ధర్మపీఠం



    https://youtube.com/watch?v=hOaykizLEkw

    ReplyDelete
    Replies
    1. ఇద్దర్ని రేప్ చేసిన బాబా ని కోర్టు తప్పుపట్టినందుకు, భక్తుల భారీ విధ్వంసం..

      Delete
    2. ఈయన దళిత బాబా. కంచి శంకరాచార్యలా బ్రాహ్మణ స్వాములోరు కాదు. అర్రెస్ట్ చేస్తే దళిత ప్రజలు వారికి తెలిసిన రీతిలో తిర్గబడ్డారు. ఈ దేశంలో కోర్ట్ లు ఉండెది హిందు బాబాలను మాత్రం తప్పు పడతాయి. ప్రభుత్వం కూడా సి.బి.ఐ. విచారణ వేస్తుంది. అదే డిల్లి షాహి ఇమాం పై నాన్ బైలబుల్ వారెంట్ ఉంటే ఇప్పటివరకు అర్రెస్త్ చేయలేదు. సరికదా అరవింద్ కెజ్రివాల్ ప్రభుత్వం కోర్ట్ కేమిచెప్పిందంటే

      షాహి ఇమాం అర్రెస్త్ చేస్తే మతకలహాలు జరుగుతాయట. అందువలన ఆయనను అర్రెస్త్ చేయకుడదు అని కోర్ట్ కి చెప్పింది. 16 ఏళ్ళు కేసు నడచి, ఆయనను ఇప్పటివరకు అర్రెస్త్ చేయలేదు. ఇక క్రైస్తవ మతంలో చిన్నపిల్లల పై లెక్కలేనన్ని అత్యాచారాలు ఎన్నో జరుగుతూంటాయి. విదేశాలలో పోప్ గారి ఆదాయంలో బిలియన్ డాలర్లు ఫైన్ కడుతూంటారు. అందులో కొందరి బిషప్ లను ఇండియా చర్చ్ లకు బదలీ చేస్తూంటారు. మనదేశంలో చర్చ్ లో వాళ్ళు చేసే చెత్త పనులపై ఎక్కడైనా కోర్ట్లు చర్యలు తీసుకొన్నట్లు చూశామా?

      The proscution had sought closure of the case, submitting that the petitioner being the Shahi Imam of Jama Masjid could not be arrested in this case as there was grave and genuine apprehensions of an outburst and communal tension following his arrest. The MM court had rejected the prosecution’s plea saying that it was not maintainable. The Imam had challenged the order in an appeal in the court of the Additional Sessions Judge.

      ఒక్క హిందువులకు మాత్రమే ఈదేశ చట్టాలు వర్తించేది.మిగతా మతాల వారైతే కోర్ట్ పరిధిలోకే రారు.

      http://www.thehindu.com/news/cities/Delhi/Court-nixes-Imam%E2%80%99s-plea-to-close-case/article16712472.ece

      Delete
    3. కోర్టు తీర్పు అనంతరం చెలరేగిన హింసాకాండను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఖండించారు. హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తిచేశారు. ‘‘ ఇవాళ్టి కోర్టు తీర్పుపై హింస చెలరేగడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేయడం నూటికినూరుపాళ్లూ ఖండనీయం. శాంతి నెలకొనేలా ప్రజలంతా సహకరించాలి’’ అని రాష్ట్రపతి తన అధికార ట్విట్టర్‌ ఖాతాలో వ్యాఖ్యానించారు.


      అదేదో సినేమాలో కోటా గుర్తుకురావాట్లా??

      Delete
    4. సెక్కులర్, ఇస్లాం తమ్ముళ్ళారా !! కంగారు పడకండి .. ఈ బాబా మీ వాడే!

      ---------------------------------------------

      అమాయక హిందువులు : గుర్మీత్ రామ్ రహీమ్ హిందూ సాధువు. హిందువులని ప్రొటెక్ట్ చేస్తున్న హిందూ సాధువు.
      సిక్యులర్ మేధావులు : ఈ హిందూ సాధువులున్నారే ?అందరు రేపిస్టులు.
      అగ్నివీర్ :
      1) గురుమీత్ బాబా కి సంబంధించినంత వరకు హిందూ సంప్రదాయం ఒక్కటి కూడా ఫాలో అవ్వడు. ఆయన పేరే సగం హిందూ సగం ముస్లిం. ఆయన పూర్తి పేరు : సంత్ గురుమీత్ రామ్ రహీమ్ జి ఇన్సాన్. రహీమ్ , ఇన్సాన్ ఏ మతానికి చెందిన పేర్లో అందరికి తెలుసు. అతనిని ఒక రిలీజియన్ కి లిమిట్ చెయ్యాలి అంటే కుదరని పని.
      2) డేరా సఛా సౌధ అనే అతని ఆర్గనిసైషన్ లో ఉన్న రెండు పదాలు ఇసలాము చెందినవే - డేరా మరియు సౌధ . సఛా అనేది అన్ని మతాలూ ఉపయోగించే పేరు.
      3) వారి స్లోగన్ ఏంటి? "కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్ రెలిజియన్స్ " (అన్ని మతాల సమ్మేళనం ) .. మీరు వారి వెబ్సైటు చూసినచో వారి సెక్యూలర్ ఫీలింగ్ అర్ధం అవుతుంది. అంతే కానీ హిందూ అనే భావన కలుగదు.
      4) వారికి ఒక కన్వర్షన్ ప్రాసెస్ ఉంది ..దాని పేరు "జామ్ ఈ ఇన్సాన్" ..పేరు బట్టి అది ఏ మతానికి చెందినదో అర్ధం చేసుకోవటం అవసరం. దానిని "మానవి అమృత్ " అని అనొచ్చు ఒక వేళ హిందూ సంస్థ అయ్యివుండుంటే. ఆలా అనలేదు కదా.
      5) ప్రతి సభ్యుడు తన చివరిపేరు గా "ఇన్సాన్ " అని తగిలించుకోవాలి , ఉన్న చివరి పేరు తీసివేసి. ఒక వేళ అది హిందూ సంస్థ అయ్యిఉంటే సంస్కృత చివరి పేరు ఉపయోగించి ఉండవచ్చు. అలా చెయ్యలేదు.
      6) డేరా యొక్క మొట్టమొదటి స్లోగన్ ఏంటంటే "అన్ని మతాలూ ఒక్కటే ". వెళ్లి వెబ్సైట్ చూస్కోవాల్సిందిగా ప్రార్ధన. అలాగే హిందూ మత వివాహ,జన్మ , చావు కి సంబంధించిన అచారాలన్నీ ఆపాలని చెప్తుంది ఆ సంస్థ సభ్యులకి. తమ సొంత ఆచారాల్ని ఎంకరేజ్ చేస్తుంది.
      7) తమ యొక్క మీటింగ్స్ ని "మజ్లీస్ " అని పిలుస్తుంది.
      ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా డేరా సఛా సౌధా అనే సంస్థ ఎక్కువగా సెక్కులర్ లేక ఇస్లామ్ మూలాలు కలిగి ఉండినది కానీ హిందూ మూలాలు కలిగిలేదు. గుర్మీత్ రామ్ రహీమ్ రేపిస్ట్ అయినందుకు ఆ మూలాలు కలిగిఉన్న సెక్కులర్ లేక శాంతియుతమైన మతాలు సిగ్గుపడాలి తప్ప హిందువుల మీదకి నెట్టటానికి ఎటు వంటి ఆధారం లేదు.

      Delete
    5. ప్రభుత్వం ఎటువంటి వత్తిడులకు లొంగకుండా గుర్మీత్ సింగ్ బాబా పై వచ్చిన ఆరోపణల పై చట్ట ప్రకారం చర్యలు తిసుకోవాలి. నలుగురు గోల చేశారని వెనకడు వేయనవసరం లేదు.

      Delete
    6. >>ఈయన దళిత బాబా.కంచి శంకరాచార్యలా బ్రాహ్మణ స్వాములోరు కాదు..

      >>ఇక క్రైస్తవ మతంలో చిన్నపిల్లల పై లెక్కలేనన్ని అత్యాచారాలు ఎన్నో జరుగుతూంటాయి.

      మతం లోనించి కులానికి దిగారన్నమాట. బ్రాహ్మణ సాములోరైతే తప్ప మీ లెఖ్ఖలోకి రారన్నమాట..ఈ మధ్యే, ఒక బ్రాహ్మణ సాములోరు.. మనల్ని హిదువులు అంటే అవమానించినట్టే అన్నారు మరి..

      >>షాహి ఇమాం అర్రెస్త్ చేస్తే మతకలహాలు జరుగుతాయట. అందువలన ఆయనను అర్రెస్త్ చేయకుడదు అని కోర్ట్ కి చెప్పింది

      ఇలాంటివి నేన్ను కూడా ఖండిస్తాను


      >>విదేశాలలో పోప్ గారి ఆదాయంలో బిలియన్ డాలర్లు ఫైన్ కడుతూంటారు. అందులో కొందరి బిషప్ లను ఇండియా చర్చ్ లకు బదలీ చేస్తూంటారు. మనదేశంలో చర్చ్ లో వాళ్ళు చేసే చెత్త పనులపై ఎక్కడైనా కోర్ట్లు చర్యలు తీసుకొన్నట్లు చూశామా?

      మీరు చూసే విధానం మార్చుకోవాలి మొదట.. వాడు చేశాడు కాబట్టి నేను కూడా చేస్తే తప్పులేదు అనే భావనలుండి బయటపడండి ముందు.. వాడు క్రిస్టీయనైనా, హిందువైనా, ముస్లీమైనా.. తప్పు జరిగినప్పుడు దండించి తీరవలసిందే.. అంతేగాని, బాబాలు అవతార పురుషులని, పైనుంచి ఊడిపడ్డారని, వాల్లేం చేసినా లోకకళ్యాణానికే అనుకుంటూ వాళ్ళ పాదాలమీద నిలువుగాపడిపోను..

      మీ మాటలో.. చాలా వరకు.. దలితుల్ని మీరు, మీరు అనే సంభొదన ఎక్కువగా ఉంటుంది.. అంటే.. హిందూమతంలో ఉన్నా గాని, వాళ్ళని మీతో కలుపుఓడానికి సిద్దంగా లేరని మొహమాటంలేకుండా చెపుతున్నారు.. మళ్ళీ మీరే.. వాళ్ళు డబ్బుతీసుకోని.. క్రిష్టీయన్లుగా మారుతున్నారని గగ్గోలు.. మీకు మందబలం కోసమే వాల్లు కావాలా??

      అయ్యా శ్రీ రాంగారూ!.. క్రిష్టీయన్లుగా మారిన బ్రాహ్మణులు నాకు వందల్లో తెలుసు.. కేరళలోనైతే.. దాదాపుగా బ్రాహ్మణులంతా క్రిష్టియన్లుగా మారిపొయ్యారు.. మరి వాల్లకి ఎంత ముడితే.. మారిపొయ్యారంటారూ?

      ఒకపక్క హిందూ మతం అందరినీ కలుపుకు పోతుందీ అని అంటూనే.. మళ్ళీ డేరాబాబా.. "అన్ని మతాలు సమానమే అన్నాడు.. కావాలంటే వెతుక్కో" అంటే దానర్ధం ఏమిటి? హిందు మతం అన్ని మతాలని సమానంగా చూడదనే మీరు చెప్పాలనుకున్నారా??

      Delete
    7. One wonders why the CBI didn't investigate this case of documented sexual abuse in the church in India https://t.co/LyyyZdNwOB


      A Former Nun's Memoirs Rock India's Catholic Church

      After 26 years as a nun, Jesme Raphael gave up her robes and walked out of the Congregation of the Mother of Carmel, the Catholic order in Kerala, India, that had been her home for three decades. Two years later, Raphael, now 53, has come out with her memoirs, Amen: An Autobiography of a Nun, cataloging lurid details of bullying, sexual abuse and homosexuality in the oldest Catholic women's order in the idyllic coastal state in southern India.

      A spokesman for the Syro-Malabar order of the Catholic Church, Father Paul Thelakkat, said that Raphael's allegations are "not especially serious." "The church never claims there's no sin within the church," he said. "We're not angels — we're human beings of flesh and blood — so some omissions and failures can happen.

      On Feb. 11, Sister Josephine, a nun in the Daughters of Mary congregation in Trivandrum, Kerala's state capital, was found dead in her room in an apparent suicide. Members of the congregation said the 38-year-old nun had been under treatment for depression. After news of the incident spread, a crowd gathered around the house and shouted slogans alleging that harassment had led Sister Josephine to kill herself. The police had to intervene, and an inquiry into the case was later ordered. Six months earlier, on Aug. 11 of last year, 23-year-old Sister Anoopa Mary had been found hanging in her room in St. Mary's Convent in Kollam, north of the capital. In what was purportedly her suicide note, she had said she could no longer withstand the senior nuns' harassment. Her father, a cook in the local bishop's house, charged that sexual exploitation had led his daughter to take her life. The convent has denied the allegations, though a court investigation is still ongoing.

      http://content.time.com/time/world/article/0,8599,1882176,00.html

      Delete
    8. http://telugu.greatandhra.com/politics/political-news/dera-baba-jail-loki-desam-mantalloki-83421.html

      Delete
    9. @UG SriRam25 August 2017 at 19:02:

      శ్రీరామ్ గారూ, మీరు ఇచ్చిన వార్తా లింకులో ఢిల్లీ ప్రభుత్వం గురించిన విషయం ఏమీ లేదు. నాకు తెలిసి నగర శాంతి భద్రతలు కేంద్రం కిందికి వస్తాయి. ఈ విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదు.

      Delete
    10. This comment has been removed by the author.

      Delete
    11. ఎవడి గోల వాడిది!
      అక్కడ టాపిక్కు ఒకటయితే ఒక బాబు ద్వేషి నారా బాబా అని సుత్తి మొదలు పెట్టాడు!ఇంతకీ అక్కడ ఒకాయన అనుమానించినట్టు కేసు విషయంలో క్లారిటీ లేదు,బాబా అనుచరులు చేస్తున్న ఆందోళనలోనూ న్యాయం ఉందేమో!వాళ్ళకి నచ్చి వాళ్ళు ఫాలో అవుతుంటే అతను ఏ డ్రసు వేస్తే మన కెందుకు?ఏ డ్యాన్సులు చేస్తే మన కెందుకు?మనకి నచ్చలేదు గాబట్టి మనం చెయ్యడం లేదు గాబట్టి అది చెత్త,తప్పు,పిచ్చి అనకూడదు.కేసు నిజం అయ్యుండి గందరగోళం ఏమీ లేనప్పుడే మనం డేరా బాబాని కానీ అతని అనుచరుల్ని కానీ తప్పు పట్టొచ్చు.అలా కానప్పుడు మనకి కొత్త అనిపించినది కాబట్టి చెత్త అనటం దేనికి?ఇస్లాములో ఉన్నది ఏమిటి?అంతమంది అనుసరిస్తునారు - వాళ్ళని మనం ఆపగలగడం సాధ్యమా?గతంలో ఎన్ని మతాలు పుట్టలేదు,ఎన్ని మతాలు గిట్టలేదు?మహా సామ్రాజ్యాలూ గొప్ప నాగరికతలూ కూడా పుట్టినప్పుడు ఇలాగే ఉండేవి.దేని మంచి చెడులనైనా కాలమే నిర్ణయిస్తుంది.
      యద్భావం తద్భవతి!
      యద్దృశ్యం తన్నశ్యం!!

      Delete
    12. Chiranjeevi Y గారి కామెంట్ ఆలోచనాత్మకంగా ఉంది.

      Delete
    13. >>నారా బాబా అని సుత్తి మొదలు పెట్టాడు!

      దాని పైన ఇంకొక బాబు క్రిష్టియన్లు అని పెట్టాడు. అది తమకు కనపడలేదు కామోసు :P

      Delete
    14. Chiranjeevi Y
      ఒకపక్క హిందూ మతం అందరినీ కలుపుకు పోతుందీ అని అంటూనే.. మళ్ళీ డేరాబాబా.. "అన్ని మతాలు సమానమే అన్నాడు.. కావాలంటే వెతుక్కో" అంటే దానర్ధం ఏమిటి? హిందు మతం అన్ని మతాలని సమానంగా చూడదనే మీరు చెప్పాలనుకున్నారా??

      hari.S.babu
      "అన్ని మతాలూ ఒకటే!" అని డేరా బాబా అన్నా సాక్ష్యం గ్రూప్ అన్నా అక్కద వాళ్ళు చహెస్తునది అన్ని మతాలనీ సమానం చెయ్యడం కాదు,సాక్ష్యం గ్రూపు వారు హిందూమతంలో విగ్రహారాధాన్ అనే పాపం ఉంది అని గగ్గోలు పెట్టడం,అదే ఇస్లాము దగ్గిర కొచ్చేసరైకి అంతకన్న గొప్ప మతం ంకొకటి లేదన్నటు డబ్బా కొట్టుకోవడం చేస్తున్నారని నేను స్పష్టంగా రుజువు చేశాను.డేరా బాబా వాడిన పదాలు సాక్ష్యం కూడా చూపించారి కదా!అందులో మీరు శ్రీరామ గార్న్ వెక్కిరించాల్సిన విషయం ఏముంది?

      అన్ని మతాలూ ఒకటే అయినప్పుడు సాక్ష్యం గ్రూపు వారు ఇస్లామును వదిలేసి హిందూమాతంలోకి రావచ్చు కదా?రమడాను మాసపు మహత్యాలు వొదిలేసి ధనుర్మాసమ రోజుల్లో హిందువులతో కలిసి చాతుర్మాస్యం వ్చ్రతం చేస్తారా?అన్నీ సొల్లు కబుర్లు!వస్తారా!అని మతాలూ ఒకటే అనేది ఒక పెద్ద బొంకు!సాక్ష్యం గ్రూపు వారు గీత-బైబిలు-ఖురాను నా ఉమ్మడి మతాలు అంటున్నది మిగతా రెంటినీ విమర్శించడానికి కావలసిన లైసెన్సు కోసం,కాదంటారా సాక్ష్యం గ్రూపు వారూ?

      దయచేసి ఈ గబ్బు పట్టిన సెక్యులరిజం కబుర్లు చెప్పి హిందువుల్ని ఇంకా ఎర్రిపప్పల కింద చూడకండి సార్!

      Delete
    15. Chiranjeevi
      మీ మాటలో.. చాలా వరకు.. దలితుల్ని మీరు, మీరు అనే సంభొదన ఎక్కువగా ఉంటుంది.. అంటే.. హిందూమతంలో ఉన్నా గాని, వాళ్ళని మీతో కలుపుఓడానికి సిద్దంగా లేరని మొహమాటంలేకుండా చెపుతున్నారు.. మళ్ళీ మీరే.. వాళ్ళు డబ్బుతీసుకోని.. క్రిష్టీయన్లుగా మారుతున్నారని గగ్గోలు.. మీకు మందబలం కోసమే వాల్లు కావాలా?

      hari.S.babu
      I myself object this argument!
      ఈ ప్రశ్న నాకు వింతగా ఉంది కాబట్టి ఆయనతో సంబంధం లేకుండా నేను స్పందిస్తున్నాను.ఆయన మీరు అంటున్నది "మేము దళితులం,బ్రాహ్మణ వర్గాల వల్ల అణచివేతకి గురయ్యాం!" అని ప్రకటించుకుని మాట్లాడుతున్న వాళ్ళకి జవాబు చెప్తూ సంబోధించిన పిలుపు కదా అది,అందులో అందరు దళితుల్ని కలుపుకోకూడని వేరుతనం ఏముంది?వాదనలో అవతలి వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నకి జవాబు చెబుతూ మీరు అనడంలో కూడా దురుద్దేశం అంటగడితే ఎట్లా?

      Delete
    16. >>ఆయన మీరు అంటున్నది "మేము దళితులం,బ్రాహ్మణ వర్గాల వల్ల అణచివేతకి గురయ్యాం!" అని ప్రకటించుకుని మాట్లాడుతున్న వాళ్ళకి జవాబు చెప్తూ సంబోధించిన పిలుపు కదా

      శ్రీరాం గారి కామెంట్లు నేను కొన్ని అలాంటివి చూశాను కాబట్టే మాట్లాడాను..

      తన కామెంట్లని నెనెక్కువగా పట్టించుకోను.. పిప్పర్మెంటుకోసం ఏడ్చే చిన్నపిల్లాడి చేష్టల మాదిరిగానే ఉంటాయి..

      మరి ఇప్పుడెందుకు పట్టించుకున్నారని వేరే వారికి సందేహం రావొచ్చు గాని మీకు అర్ధం అవుతుందనే అనుకుంటున్నాను...

      Delete
    17. >>దయచేసి ఈ గబ్బు పట్టిన సెక్యులరిజం కబుర్లు చెప్పి హిందువుల్ని ఇంకా ఎర్రిపప్పల కింద చూడకండి సార్!

      సాక్షం గ్రూప్ అన్నదానికి నన్నెందుకు సమాధానం అడిగారో తెలుసుకోవచ్చా??

      Delete
    18. Chiranjeevi Y26 August 2017 at 22:53
      సాక్షం గ్రూప్ అన్నదానికి నన్నెందుకు సమాధానం అడిగారో తెలుసుకోవచ్చా??

      hari.S.babu
      "కాదంటారా సాక్ష్యం గ్రూపు వారూ?" అని సంబోధించి అడిగిన ప్రశ్న ఉన్న పేరా మొత్తం మీరు పట్టించుకోనక్కర అలెదు.మిగిలిన విషయం జనరల్,కానీ అది మాత్రం కేవలం వారిని ఉద్దేశించి వేసిందే!
      P.S:దీన్ని బట్టి సాక్ష్యం గ్రూపు వారు నా బ్లాగుని చూస్తూనే ఉన్నారు,వ్యాసాన్నే కాక ప్రత్ కామెంటునీ గుచ్వ్హ్చి గుచ్చి చూస్తూనే ఉన్నారు - అయినా నా 18 పోష్టుల వరసకీ అందులోని విషయాలను బట్టి నేను వారికి వేసిన చాలెంజికీ జవాబు చెప్పగలిగిన దమ్ము లేకనే నిశ్శబ్దంగా ఉండిపోయారని తెలుస్తున్నది.

      జువారియా!ఓ జువారియా!అంత చిన్న వయసులోనే అరేబియా కల్లా పేరుమోసిన విదుషీమణివా నువ్వు జువారియా!బవామరదళ్ళు చిలకాగోరింకల్లా కలకాలం పిల్లాపాపలతో కళకళలాడుతు బతకాలని ముత్తయిదువలు దీవించినప్పుడు మురిసిపోయిన మామూలు ఆడపిల్లవా నువ్వు జువారియా!ఒక జీవితకాలపు స్వర్గాన్ని ఒక ఘూకం కేకా భేకం బాకా ఒకే ఒక్క రోజులో మాయం చేస్తే బిక్కమొగం వేసిన రెక్కలు లేని దేవకన్యవా నువ్వు జువారియా!రాబందుల నోటికి చిక్కిన దిక్కులేని రాజహంసవా నువ్వు జువారియా!విడుదల కోసం కన్నీళ్ళని దోసిటపట్టి అర్ధించిన ఇరవయ్యేళ్ళ పడుచుపిల్లని తన మేఢ్రం గులని తీర్చుకోవడానికి వాడుకున్న అరవయ్యేళ్ళ ముసలితొక్కుని ప్రీయమారగ వలచిన కులస్త్రీవా నువ్వు జువారియా!బలవంతపు చావు చావలేక క్షణక్షణం కమ్ముకొచ్చే దుఃఖాన్ని దాచుకోవటానికి ముఖాన్ని చేతుల్తో కప్పుకున్న కన్నెతాపసివా నువ్వు జువారియా!తల్లికి చెల్లెల్ని కూడా పక్కలోకి లాగిన కామ రోగపీడితుణ్ణి మానవోత్తముడని పొగుడుకు చచ్చే ముండమోపులకు తల్లివా నువ్వు జువారియా!జువారియా ఓ జువారియా!ఏ ఆదికవీ రాయలేని మానిషాద శ్లోకమా నువ్వు జువారియా!రాస్తే వెయ్యి మానిషాదలు చాలని విషాద కావ్యమా నువ్వు జువారియా!దేవుడు నిన్నొక్కదాన్నీ వీళ్ళ బారిన పడకుండా కాపాడితే ఎంత బాగుండేది జువారియా!ఇస్లామిక్ భూతం తెంచిన మాంగల్యాల బరువును మొయ్యలేక కాలం చెంపల మీదనుంచి జారిన అతిపెద్ద కన్నీటిచుక్కవా నువ్వు జువారియా!జువారియా!ఓ జువారియా!

      Delete
    19. హరిబాబు, దళిత బాబా,బ్రాహ్మణ స్వాములోరు అని ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ఒక్కొక్క గురువుకి ఒక్కొక్కవిధమైన ఫాలోయర్స్ ఉంటారు. వాళ్ళ స్పందన వారి వారి బాక్ గ్రౌండ్ బట్టి ఉంట్టుంది. కంచి ఫాలోయర్స్ చదువుకొన్న,మధ్యతరగతి వర్గాల వారు. ఆయన అరెస్ట్ కు నిరసనగా కోర్ట్ పోరాటం చేస్తే, దళిత బాబా ఫాలొయర్స్ డిప్రైవేడ్ క్లాస్ వాళ్ళు, అరెస్ట్ కు నిరసనగా వెంటనే ఎదురు తిరిగి తిరగబడి ప్రతీకారచర్యలకు దిగారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇందులో క్లాస్ కోణం కూడా ఉందని చెప్పాలనుకొన్నాను.

      Delete
    20. >>క్లాస్ కోణం

      మతం > కులం > క్లాసు.....

      ఏమి మలుపులు.. ఏమి మలుపులు...

      కొంపదీసి, గోరక్కసులు కూడా ఈ క్ల్లాసు పీపులేనా సారూ????????

      Delete
    21. ఆ క్లాసులో కోహ్లీ లాంటివారు కూడా ఉన్నారు కదా

      Delete



    22. Jama Masjid runs up Rs 4-cr power bill,spat over dues has area in dark
      Jama Masjid in the Walled City has run up a power bill of Rs 4.16 crore as the charges have not been paid for the past several years.

      residents in the vicinity of the mosque have been suffering as power distribution company (discom) BSES often snaps power supply to the area as penalty for unpaid dues.

      http://indianexpress.com/article/cities/delhi/jama-masjid-runs-up-rs-4cr-power-bill-spat-over-dues-has-area-in-dark/lite/

      Delete
    23. అమెరికాలో లఇంగీక నేరారోపణలూ ఎదురుకొంట్టున్న వారిని, అక్కడ నుంచి తప్పించి, కాథలిక్ చర్చ్ ఇండియా కు బదలీ ఎలా చేసిందో చూడండి

      Why has South India’s Catholic Church re-inducted a convicted child molester priest?

      On August 24, 2005, the diocese of Crookton in Minnesota received an anonymous complaint stating that an Indian priest, Father Joseph Palanivel Jeyapaul, working at the church had sexually assaulted a minor.

      A second victim later came forward. Another young girl who had wanted to become a nun had been sexually assaulted by Father Jeyapaul. The man hailing from Tamil Nadu rushed back to India and after almost a decade of legal wrangles, he was convicted by the Minnesota court and sentenced to a year in prison in 2015.

      After serving a shorter prison term, Jeyapaul returned to India a few months ago. And in a move that has shocked child right activists in the state; the Roman Catholic Church of Southern India has now lifted the suspension against him.

      While the international media had first reported on the lifting of the suspension, the Ootacamund Diocese in Tamil Nadu confirmed to The News Minute that the church was not averse to allotting a role to Father Jeyapaul in the church ministry.

      Sebastian Selvanathan, Spokesperson, Ooty Diocese told TNM, “He was released from the prison in USA through a court order. His case was then referred to the Doctrine of Faith in Rome. According to the direction from there, the suspension was lifted. He has not been given ministry now, if he is given, it will be given with certain restrictions.” Doctrine of Faith is a congregation of the Roman Curia.

      Catholic Bishops' Conference of India refuses to comment

      http://www.thenewsminute.com/article/why-has-south-india%E2%80%99s-catholic-church-re-inducted-convicted-child-molester-priest-39078

      Delete
    24. వార్నీ.. గోరక్కసులు, కోహ్లీ ఎట్సెట్రాల గురించి అడిగితే, నువ్వు అదేం మాట్లాడ కుండా, క్రిస్టియన్లు, ఫాదరీలు అంటూ సొల్లు చెబుతావెందుకు..

      Delete
    25. హరిబాబు గారు,
      రాజా షంషుద్దీన్ శర్మ హిందువులకు వేసిన ప్రశ్నకు
      సమాధానం ఇచ్చాను. మీరు చదవండి.

      https://www.facebook.com/groups/1667115550174617/permalink/2005189679700534/

      Delete
  7. Ram Karnam
    11 hrs ·

    సందర్భం వచ్చిందీ మరియు అతని పట్టుదల ఈ వారం మరోసారి నిరూపితమయింది కాబట్టి అతని గుణగణాల మీద గతంలో నేను రాసిన వ్యాసపరంపర నుంచి మచ్చుకు ఒకటి రీపోస్ట్ చేస్తున్నా.

    ******
    ===== పట్టు వదలని వక్ర మూర్ఖుడు - 3 ======

    పట్టువదలని వక్ర మూర్ఖుడు అర్ధం తక్కువ, అచ్చుతప్పులు ఎక్కువ ఉన్న ఆరు లైన్ల కామెంటు ఒకటి సిద్దం చేసుకుని, ఒక అందమైన సాయంత్రం ఎవరిపాటికి వారు పోస్టులు పెట్టుకుంటూ ఉంటే ప్రతి పోస్టులోకి వచ్చి ఆ ఆరులైన్ల కామెంటుని పేస్టు చేసి తోకూపుకుంటూ పోసాగాడు.

    ఒకే కామెంట్ ఎక్కువ సార్లు రావడం గమనించిన ఫేస్బుక్ లోని డూప్లికేట్ కంటెంట్ ప్రివెన్షన్ టీం ఆ విషయం మార్క్ జూకర్బర్గ్ దృష్టికి తీసుకుపోగా, మార్క్ వెంటనే స్పందించి వక్రమూర్ఖుడికి ఫోన్ చేసి ఇలా అన్నాడు - “ ఒరే సుబ్బిగా, నీకేమైనా మెంటలా? లేక ఫేస్బుక్ తో కిండలా? ఫ్రీ గదా అని ఒక అర్ధం పర్ధం లేని కామెంట్ ని అన్ని పోస్టుల్లో పేస్టు చేస్తావేంది? మాకెందుకీ storage బొక్క? ఆ ‘ధ్వంస రచన’ ఏదో ఒక చోట పెడితే , అందులో విషయము ఉందనిపిస్తే అందరూ అక్కడికొచ్చి చదువుతారు కదా! నువ్వేమైనా మాకు ఫీజు ఇస్తున్నావా? ఫినాయిలే గదా అని దుర్వినియోగం చేశావంటే మర్యాద దక్కదు.

    ఆ ఏడుపేదో కనీసం ఒకే id తో అఘోరించవచ్చుగా!. ఒక్కొకరికి అన్నేసి ప్రొఫైల్ లు maintain చెయ్యాలంటే మా డేటా సెంటర్ కి ఎంత బొక్క?. బూతులకి కొన్ని id లూ, non-బూతులకి కొన్నీనా? బూతుల id లతో బూతులు తిట్టడం, వాడు తిరిగి బూతులు తిడితే non-బూతుల id లతో screenshot లు తీసుకుని ప్రచారం చేసి వాడిని వెధవని చెయ్యడం... అదే screenshot లు వంద చోట్ల పెట్టడం. ఎంత storage అవుతుందో తెలుసా? నీ వల్ల రెండేళ్ళ నుండీ మా డేటా సెంటర్ కి లోడ్ ఎక్కువై సర్వర్ లన్నీ పొగలు గక్కుతున్నాయి.

    మరో విషయం - ఆ మాధవి రెడ్డి అనే లింగ రహిత, రూప రహిత వ్యక్తి ఏదో చెత్త రాయడమూ, దానికి నువ్వు ఏదో రోత కామెంట్ పెట్టడమూ.. లేదా నువ్వు ఏదో చెత్త రాయడమూ, దానికి అతడామె ఏదో రోత కామెంట్ పెట్టడమూ .. ఏందిరా మీ ఎదవ గిల్లికజ్జాలు, ఉచిత సరస ప్రదర్శనలు? ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవచ్చుగా! లేకపోతే మీరు అసూయతో రగిలిపోయే వ్యక్తి ఇంటికి వెళ్లి డైరెక్ట్ గా తిట్టవచ్చు కదా. కాకులని చూసి నేర్చుకోండిరా. వెయ్యాలనుకున్న నెత్తి మీద ధైర్యంగా, ఖచ్చితంగా పడేలా వేస్తాయి రెట్ట.

    అద్సరే గాని అదేపనిగా అంగాలని క్లోజప్ లో ఫోటో తీసి enlarge చేసి పెడతావేందిరా పర్వర్ట్? అలాంటివి ఎన్నో చూసిన మా స్టాఫ్ కూడా నువ్వు పెట్టే ఫొటోలకి బెంబేలెత్తిపోతున్నారు. కొందరు బలహీన మనస్కులు కోమాలోకి కూడా వెళుతున్నారు. నీకయితే “ఆ ప్లేస్” లో మాత్రం ఎవరూ ఏ ఇబ్బంది చెయ్యకూడదని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నా. చేస్తే ఆ ఫోటోలు తట్టుకోలేక ఫేస్బుక్ సైట్ మొత్తం డౌన్ చెయ్యాల్సిన పరిస్థితి రావచ్చు మాకు.

    నువ్వు మొదటినుంచీ దాపురించిన కస్టమర్ వన్న జాలితో కఠిన చర్యలేమీ తీసుకోవట్లేదు.. కాని రెండు ఆప్షన్స్ ఇస్తాను . ఒకటి పిక్ చేసుకో. 1) ఒకే ఒక ID maintain చెయ్యి. దాంతో ఎంత ద్వేషం కావాలంటే అంత వెదజల్లుకో 2) ఎన్ని ID లు అయినా maintain చేసుకో , కాని ఏ ఒక్క ID ద్వేషానికి వాడినా అన్ని ID లూ కోల్పోతావు. నీ ఇష్టం. ఐదు నిమిషాల్లో ఫోన్ చేసి చెప్పు. “ ............

    మార్క్ వాయింపుడు విని బిక్క చచ్చిపోయిన వక్ర మూర్ఖుడు ఆ రెండు దారుణమైన ఆప్షన్స్ లో ఏది ఎన్నుకోవాలో తెలియక సతమతమవుతూ ఉండగా తన శ్రేయోభిలాషి అయిన ‘మాడ’వి వచ్చి “ Honey, మనం దేశాన్నైనా వదిలేసి బతకగలం గాని , ద్వేషాన్ని వదిలి ఒక్క క్షణమైనా బతకగలమా ?’ అనడంతో కర్తవ్యం బోధపడి వెంటనే వక్ర మూర్ఖుడు మార్క్ కి ఫోన్ చేసి “ నాకు ద్వేషమే ప్రాణాధారం.. ఒక్క id తోనే తంటాలుపడదామని నిర్ణయించుకున్నా” అని చెప్పి గర్వ భంగం కలిగించుకోగానే మార్క్ సుబ్బిగాడివి ఒక్కటి తప్ప మిగతా ID లు అన్నింటినీ తొలగించి ఒక్కో కామెంట్ ఒక్క పోస్ట్ లోనే అనుమతించే విధంగా కంట్రోల్స్ పెట్టాల్సిందిగా వాలిడేషన్ టీం ని ఆదేశించి వాళ్ళందరికి జీతం పెంచాడు.

    ReplyDelete
    Replies
    1. రామ్ కరణం ను FB లో ఫాలో అవుతున్నాం. నువ్వు మళ్లీ ఇక్కడ తెచ్చి కాపీ పేస్ట్ వేయవద్దు.
      ఇందులో వ్యంగ్యం, వ్యక్తిగత అనుభవాలు తప్పించి ఒక అంశానికి సంభంధించి చర్చించాల్సిన విషయం ఏమి లేదు.

      Delete
    2. Hello Anon, you are mistaken. Ther are not indivivdual experiences. They are mirroring, exposing so called "baaduga" and "Perverted" intellectuals, and facebook soldiers, marshals. These hate mongers are destroying our socity's secular fabric. That's why, as I am a ardent follower of him, try to popularise with the help of this blog. If there is any objecion to it, then blog owner will not publish it. So, you need not worry.

      Delete
    3. బ్లాగ్ లోకంలో ఇంతకన్నా ఎక్కువ చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. ఆయన కన్నా అద్భుతంగా రాసినవారు ఉన్నారు.రాం కరణం రాసేవి నీకు నచ్చవచ్చు బ్లాగులోకం వాళ్లకి కాదు.

      Delete
    4. sO wHat? If the blog owner doesn't like it, He will remove it. >>>>>
      You can influence him to remove or not publish these posts. There is no such thing that was praised by all the folk of Blog world.

      ????opinions vary. To publish and to encourage some reasonable opinions is the fineest quality of this blog owner.

      Delete
  8. హరిబాబు గారు అన్నట్టు ఎవడి గోల వాడిది!

    యూజీ శ్రీరామ్ గారి కోసం:

    Locating Constructs of Privacy within Classical Hindu Law

    https://cis-india.org/internet-governance/blog/loading-constructs-of-privacy-within-classical-hindu-law

    ReplyDelete
  9. డేరా బాబా పై >>>>> రామ్ కరణం పోస్ట్
    ***** మహాత్ములెవరూ లేరు. అందరూ మనుషులే *****

    (ఇది పోయిన సంవత్సరం ఇదే రోజు ఎవరో ఒక సినీ హీరో అభిమాని అయిన కుర్రాడొకడు కొట్లాటల్లో చనిపోయిన సందర్భంలో రాశాను. ఇప్పుడు కూడా ఇలాంటిదే రాయాల్సిన పరిస్థితి వచ్చినందున దీన్ని రీపోస్ట్ చేస్తున్నా .

    డేరాబాబా అనబడే వాడికి చట్టం వర్తించకుండా చెయ్యాలనుకునే పిచ్చోళ్ళు బీభత్సం సృస్తిస్తుంటే పవన్ కళ్యాణ్ ని ఏదో విమర్శించినందుకు మహేష్ కత్తి అనే అతని మీద కొందరు మూర్ఖంగా విరుచుకు పడుతున్నారు.

    మతం, దేవుడు తరవాత సంగతి. "ఒక మనిషి మీద కొందరు మనుషులకి ఉన్న మూఢభక్తి" సమాజానికి అతి పెద్ద ప్రమాదం.)

    *********

    కళాకారులనీ, ఆటగాళ్ళనీ, రాజకీయనాయకుల్నీ, బాబాలనీ దేవుళ్ళంత చేసి ఆరాధించే అర్ధ జ్ఞానపు వ్యర్ధ జీవులు కళ్ళ ముందు ఉండగా పైనున్న అసలు దేవుడు ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? . బతికి ఉన్న ఇలాంటి దేవుళ్ళ ముసుగులన్నీ తొలగించి యువతరానికి వాళ్ళని కేవలం మనుషులుగానే చూపించడం కోసం కొత్త తరం హేతువాదులు సమాజానికి అవసరం.

    ఒక మనిషి మీద మూఢ భక్తి అతని పనుల్లో మంచి చెడ్డలు సహేతుకంగా విశ్లేషించే విచక్షణ పోగొడుతుంది.

    “గొప్ప మనుషులు” ఉండరు. “గొప్ప పనులు” ఉంటాయంతే. కొంతమంది మనుషులు ఎక్కువ గొప్ప పనులు చేసే విధంగా చుట్టూ ఉన్న సమాజం మారుస్తుంది అంతే.

    అనేకమంది కళాకారులు, క్రీడాకారులూ, రాజకీయవేత్తలూ, ఆధ్యాత్మిక గురువుల విషయంలోనైతే ఆ పని తప్ప వేరే ఏ పని చెయ్యలేని బలహీనత కూడా ఆ పని చేయిస్తుంటుంది. వాళ్ళ బలహీనతని బలంగా భావించే బలహీన యువకులు fans అసోసియేషన్ లాంటి చెత్త కుప్పలు పెట్టుకుని ఆ గత్తరు వాసననే అత్తరు వాసనలా భావించి అందులో పురుగుల్లాగా తిరగడం మరుగుతారు. చివరికి ...ఇదిగో ఈ విధంగా నేలకొరుగుతారు.

    పదో తరగతో , పన్నెండో తరగతో పాస్ కాలేక గాలి తిరుగుళ్ళు తిరుగుతూఉంటే అన్నో, నాన్నో , తాతో ఎందులోనోపని ఇప్పిస్తే కాలం కలిసొచ్చి కోట్లతో పొట్ట పోసుకునే సామాన్యుల్ని మహానుభావులుగా ప్రచారం చేస్తూ వారి కోసం కొట్లాటలు పెట్టుకుని .. ఇంటర్లూ, ఎంసెట్ లూ, ఇంజనీరింగ్ లూ స్వంతంగా పాస్ అయ్యి గౌరవనీయ, భాద్యతాయుత జీవితాల్లో స్థిరపడాల్సిన యువకులు చిల్లరగా హత్య చెయ్యడం/కాబడడం సామూహిక సాంఘిక అవమానం.

    *******

    మహాత్ములెవరూ లేరు. అందరూ మనుషులే
    కొందరు యాదృచ్చికంగా గొప్పవారయిపోతుంటారు

    ఎవడి అహంకారం సమాజానికి ఆ క్షణంలో అక్కరకొస్తుందో
    ఎవడి స్వార్ధానికి సైడ్ ఎఫెక్ట్ గా సమాజానికి మేలు జరుగుతుందో ..
    ఎవడి బలహీనత సమాజానికి అనుకోకుండా బలుపునిస్తుందో ..
    ఎవడి ఆపుకోలేని ఆవేశం సమాజానికి ధైర్యాన్నిస్తుందో ..
    ఎవడి అనివార్య చర్య సమాజానికి అవసరమైన పని అవుతుందో
    ఎవడి అవమాన భారం తన జాతి వారికి ఆత్మగౌరవం నేర్పిస్తుందో ..
    ఎవడి కీర్తి కండూతి చుట్టుపక్కల వారి కడుపు నింపుతుందో ..
    ఎవడి అత్యాశ అనేకమందికి ఉద్యోగ అవకాశాలిస్తుందో ..
    ఎవడి ఆదాయ మార్గం ఆడియెన్సుకి ఆనందం అందిస్తుందో ...
    ఎవడు దూకిన చితి పక్క వాళ్లకి చలిమంట అవుతుందో..
    వాడే పండుగాడు, మనం భ్రమించే గొప్పవాడు.

    ReplyDelete
  10. https://www.youtube.com/watch?v=yGkventPG0Q&feature=share

    ReplyDelete
  11. డెరా బాబా కేసుపై సందేహాలున్నయన్న హరిబాబూ! మీరు రియల్లీ గ్రేట్..

    సంత్ రాంపాల్ బాబాని ఒదిలెయ్యటంలో ప్లాన్ లో భాగంగానే డోర బాబా అనే బకరాని పట్టుకున్నారని ఈ రోజు పేపర్ చూస్తే అర్దం ఐంది..

    ReplyDelete
  12. భారతీయులు హిందువులు కాదా? హిందువంటే దౌర్భాగ్యుడని అర్ధమా? వివాదాస్పద చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం?

    http://rachabanda.sakshyammagazine.com/2017/08/blog-post.html

    ReplyDelete
  13. నిజమే. ఈ సంతు కేసు లేకపోతే, డెరా బాబా.. ఇంకా డేరాలో అమ్మాయిలతో ఆడుకుంటూండేవాడు. సంతు కేసు డేరా జైలుకొచ్చింది. B(

    ReplyDelete
  14. Chief Imam of All India Imam organisation wants cow to be declared India’s national animalః

    http://www.opindia.com/2017/08/chief-imam-of-all-india-imam-organisation-wants-cow-to-be-declared-indias-national-animal/

    ReplyDelete
  15. భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్నవాడు వాస్కోడిగామా అనడం ఎంతవరకు సత్యం? అని సాక్ష్యం వారి ఒక వ్యాసం వేశారు.

    సుప్రసిద్ధ పురాతత్వ వేత్త, పద్మశ్రీ డా. విష్ణు శ్రీధర వాకణ్‌కర్ ఇలా తెలిపినారు: “నేను నా పర్యటనలో భాగంగా ఒకసారి స్పెయిన్ వెళ్ళినాను. అక్కడ నాకు వాస్కోడగామా డైరీ లభించింది. దానిలో వాస్కోడగామా భారత్‌కు ఎలా వచ్చాడో వివరంగా ఉంది. అందులో ఆయనిలా వ్రాసినాడు: నా పడవ ఆఫ్రికాలోని జాంజిబారు తీరం చేరుకొన్నప్పుడు నా ఓడ కన్నా మూడురెట్లు పెద్దగా ఉన్న ఓడను అక్కడ నేను చూసినాను. ఒక ఆఫ్రికన్ దుబాసిని తీసికొని ఆ పెద్ద ఓడయొక్క యజమానిని కలిసినాను. ఆ యజమాని పేరు స్కందుడు – గుజరాతీ వ్యాపారి. భారతదేశం నుండి జాజి చెట్టు మరియు టేకు చెట్టు కలపను, మసాలా ద్రవ్యములు తీసికొని వచ్చాడు. వానికి బదులుగా ముత్యములు తీసికొని కొచ్చిన్ ఓడరేవుకు వచ్చి వ్యాపారం చేసేవాడు. వాస్కోడగామా స్కందుడను పేరు గల ఆ వ్యాపారిని కలుసుకొనుటకు వెళ్ళినపుడాతడు సాధారణ వేషంలో ఒక చిన్న మంచముపై కూర్చుండియున్నాడు. అతడు వాస్కోడగామాతో ఎక్కడికి వెళ్ళుచున్నారని అడిగినాడు. వాస్కోడగామా హిందూదేశం చూడటానికి వెళ్తున్నానన్నాడు. అప్పుడా వ్యాపారి నేనూ రేపు అటే వెళ్తున్నాను. నా వెనుక అనుసరించి రమ్మన్నాడు.” ఆ విధంగా ఆ వ్యాపారి ఓడను అనుసరించి వచ్చి వాస్కోడగామా భారత్ చేరినాడు. ఈ సత్యం స్వతంత్ర భారతంలోనైనా మన నవతరానికి చెప్పవలసింది. కాని దురదృష్టవశాత్తు అలా జరగటం లేదు.

    hari.S.babu
    హిందూమతం విషయంలో చేస్తునన్ దానికి దాని ధోరణిలో జవాబు చెప్పినందువల్ల నేను దీనిని కొడా పీకి పాకం పేట్టి అవమానించే ధోరణిలో నేను లేను.ఒక రకంగా చూస్తే మన దేశస్థుల గొప్పదనాన్ని ఉగ్గడించహె విధంగా ఉన్నపుడు కూడా మనం వారిని విమర్శించితే తప్పు మనదే అవుతుంది.

    కానీ ఈ కధనంలో వాస్తవ విరుద్ధమైన విషయాలు కొన్ని ఉన్నాయి - బహుశా విషయం పూర్తిగా అర్ధం చేసుకోకుండా ముక్కల్ని మాత్రమే పట్టించుకునే అలవాటు చొప్పున సాక్ష్యం గ్రూపు వారు ఏదో హిందూవీరాభిమానబ్లాగు నుంచి లిఫ్టు కరాడే చేసి ఉంటారని నా అనుమానం!

    నా మొదటి అనుమానం చెప్పబోయేముందు ఎంత పూర్వ కాలంలో అయినా ఎంత చిన్న రాజ్యం అయినా statistics/logistics లేకుండా ఒక్క రోజు కూడా పరిపాలన చెయ్యలేదు అనే విషయం మీకు తెలుసా లేదా అనేది నాకు తెలియాలి.

    అట్లా తమ ఓడ రేవులో స్కందుడు అనే వ్యాపారి సుబ్బరంగా భారత దేశం నుంచి వచ్చి మకాం చేసి ఉన్నాడని తెలిశాక మళ్ళీ రాజు వాస్కోడిగామాని ఆ పనికి ఎందుకు పురమాయిస్తాడు?వాస్కో తన సొంత ఖర్చులతో ఇండియాకి రాలేదు,ప్రభుత్వం ఇతనే అందుకు సమర్ధుడని నమ్మి డబ్బిచ్చి పంపిస్తే వచ్చాడు, అవునా?
    అంత ఖర్చు పెట్టుకుని రాగలిగిన స్థోమతు వాస్కోకి ఉందా?అదీ గాక రాజుకి స్కందుడి గురించి తెలియకపోయినా దేశం మొత్తం చూసినా వాస్కో తప్ప ఇతర నావికులు లేరా?వారికి కూడా తెలియనంత రహస్యంగా రాలేదే స్కందుడు!అంత తేలిగ్గా గుర్తింపు కొట్టేసే చాన్సుని వాస్కోకి మాత్రమే ఎందుకు దక్కనిస్తారు?

    నాకు ఈ స్కందుడి కధ మితిమీరిన హిందూవీరాభిమానుల కల్పన కావచ్చు ననిపిస్తున్నది - ఇంతకన్న వివరాలు నాకూ ఎక్కువ తెలియదు గనక తెలిసిన వారు నదిస్తే సందేహం తీరుతుంది.మనవాళ్ళ నిజమైన గొపదనాన్ని పొగుడుకోవటం వరకు పర్వాలేదు,మన దేశం గొప్పదని చెప్పుకోవటానికి అబద్ధాలు చెబితే ఆ విషయం బయటపడినప్పుడు పరువు పోవటం తప్ప ఒరిగేది ఉండదు.

    తెలిసిన వారి నుంచి సమాచారం ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారూ: పై విషయం సురేష్ సోనీ అనే ఆరెస్సెస్ నాయకుడు బయటికి తీసుకు వచ్చారు, దీంట్లో వాస్తవం ఎంతో తెలీదు.

      ఇందులో కొన్ని విషయాలు గమనించాలి. భారత నౌకలు ఐరోపా దాకా వెళ్లేవని వారు అనలేదు. ఆఫ్రికా ఖండంలో (ఉ. జాంజిబార్) భారత వర్తకులకు సంబంధం ఉండేదని, భారత నౌకలు ఆఫ్రికా మార్గంలో వెళ్లేవని మాత్రమే అన్నారు.

      పై కథనం ప్రకారం వాస్కో డగామా సముద్రమార్గంలో ఐరోపా నుండి భారత్ వెళ్తూ మధ్యలో జాంజిబార్ దగ్గర ఆగినప్పుడు స్కందుడిని కలిసాడు, భారత నౌకాయానం అప్పటికే సాధించిన ప్రగతిని చూసాడు. భారత్ దాకా సాగే తదుపరి మజిలీ మార్గాన్ని స్కందుడే వాస్కోకు చెప్పినట్టు సురేష్ సోనీ అంటారు.

      వాస్కో-స్కందుల కలయికకు ముందే పోర్టుగల్ దేశం వాస్కో ప్రయాణ ఖర్చులు మంజూరు చేసింది. స్కందుడు ఐరోపా వెళ్ళలేదు. ఈ రెంటి దృష్ట్యా స్కందుడి గురించి ఐరోపా దేశస్తులకు తెలిసే అవకాశం (వాస్కో చెప్తే తప్ప) లేదు.

      Delete
  16. ఆ డాక్టర్‌ అరెస్టు
    లఖ్‌నవూ: గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రి విషాధ ఘటన నేపథ్యంలో వేటుకు గురైన ‘హీరో’ డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆసుపత్రిలోని మెదడువాపు వార్డు అధిపతి అయిన డా. కఫీల్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతుందని ముందుగానే తెలిసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని అతడిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. డా.కఫీల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో యూపీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది కఫీల్‌ను శనివారం అరెస్టు చేశారు.

    బీఆర్‌డీ ఆసుపత్రిలో ఐదు రోజుల్లో 63 మంది చిన్నారులు మృతిచెందిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదడువాపు వార్డులో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడంతో అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 10వ తేదీ నుంచి ఆ వార్డులో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. అయితే ఆ రోజున డా. కఫీల్‌ తన సొంతడబ్బుతో ఆక్సిజన్‌ సిలిండర్లు తీసుకొచ్చి అందించారని, పిల్లల ప్రాణాలను రక్షించేందుకు ఎంతో తాపత్రయపడ్డారని వార్తలు వచ్చాయి.

    ఈ ఘటన అనంతరం డా.కలీఫ్‌ను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. డబ్బులు చెల్లించాలని లేదంటే ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేస్తామని సదరు పంపిణీదారు ముందుగానే లేఖ రాసినా.. డా.కలీఫ్‌ తగిన చర్యలు తీసుకోలేదని అతడిపై కేసు నమోదైంది. దీంతో నేడు అతడిని అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘటనలో ఇప్పటికే బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ రాజీవ్‌ మిశ్రా, ఆయన భార్య పూర్ణిమాను పోలీసులు అరెస్టు చేశారు.

    ReplyDelete
  17. ‘మనువాదం, మనువాదులు’ అనే తిట్టు గురించి రామ్ కరణం అద్భుతమైనపోస్టు
    Ram Karnam


    ===== నా జీవితంలో మనువాదులు – 1 ======

    ఫేస్బుక్ లో యాక్టివ్ అయ్యాక నాకు పరిచయమైన కొత్త తిట్టు “మనువాది”.

    అభ్యుదయ వాదులు (అనుకునే వారు) నచ్చని వాడిని “మనువాది” అని తిట్టడం ద్వారా వాడి మీద మేధోపరమైన పైచేయి సాధించామని నమ్ముకుంటూ ఉంటారు. కాని నా అనుభవంలో “మనువాది” అని తిట్టించుకునే వాడికంటే తిట్టేవాడే లోకం తెలియని వెర్రిబాగులోడయి ఉంటాడు.
    .
    అసలు “మనువాదం” అంటే ఏంటి అని అడిగితే - క్రీస్తుపూర్వం మనువు అనే వాడికేదో జిలబట్టి.. బ్రహ్మ తలనుంచి కొందరు, మొల నుంచి కొందరు పుట్టినట్టు రాశాడన్నారు. సరిగ్గా అర్ధం కాలేదు గాని మనుషులని విభజించి ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ట్రీట్ చేసే వాడిని “మనువాది” అని తిడతారని అర్ధమయింది. కాని ఫేస్బుక్ లో ఆ తిట్టుని ఆ అర్ధంలో వాడడం లేదనిపించింది నాకు.

    ఏదయితేనేం, వెరైటీ తిట్ల పట్ల వ్యామోహం పెంచుకున్న నేను ఆ “మనువాది” అనే తిట్టుకి ఆకర్దితుడినయ్యి, ఎవరినైనా ‘నిజమైన’ అర్ధంలో "మనువాది" అని తిట్టాలన్న కోరిక పుట్టి వెనక్కి చూసుకుంటే చిన్నప్పటినుంచీ నా జీవితంతో ఆడుకున్న అనేకమంది మనువాదులు కళ్ళముందు మెదిలారు.

    కొందరిని మాత్రమే ఎండలో నిలబెట్టే పంతుళ్ళు, కొందరిని మాత్రమే ఆటలకీ, నాటికలకీ ఎన్నుకొనే లీడర్స్, గ్రూపు ఫోటో దిగేటప్పుడు నిర్దాక్షిణ్యంగా పొడుగోళ్ళని వెనక నిలబెట్టే వాళ్ళు, ఊర్లో డ్రామా వేసేటప్పుడు మేకప్ రూమ్ లోకి నన్ను రానీయకుండా వేరే వాళ్ళని రానిచ్చే ఆర్గనైజర్స్.. ఇలాంటి ఛోటా ఛోటా మనువాదులతో పాటు .. ఒక పోతపోసిన, కరుడుగట్టిన, మూర్తీభవించిన మనువాది గుర్తుకువచ్చాడు. అతనే మా పక్క ఊర్లో కొత్తగా సినిమా హాలు కట్టిన కృష్టమనాయుడు.

    కట్టే సినిమాహాలేదో మామూలుగా కట్టకుండా శాడిస్ట్ లాగా నాలుగు రకాల టిక్కట్లు పెట్టాడు. నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ. అప్పటి నుంచీ మా మండలం జనాల్లో స్పష్టమైన విభజన కనిపించేది. మా ఊరినుండి ఎద్దుల బండి కట్టుకుని పొయ్యేవాళ్ళం . అందరూ కలిసి పోయినా అక్కడ విడిపోయి ( నేల నుంచి బాల్కనీ దాకా ) సినిమా తర్వాత కులుసుకునే వాళ్ళం. ఒక్కోసారి మా నాయన కుర్చీకి డబ్బులిస్తే సగం డబ్బులకి కొనుక్కుతినో, అచ్చా బొమ్మా ఆడో నేలవాసుడైన నా ఫ్రెండ్ ఒకడితో కలిసి నేల టికెట్ కి పోయ్యేవాడిని. ఇంటర్వెల్ లో కుర్చీ సీట్లు ఖాళీగా ఉంటే పొయ్యి కూర్చునే వాళ్ళం. ఎవరూ అడిగేవారు కాదు. కాని నేల టిక్కెట్ కొని కుర్చీవాసుల పక్కన కూర్చున్న దొంగ ఫీలింగ్ నేనూ, ఎప్పుడూ నేలలో కూర్చుంటూ నా పుణ్యమా అని సగం సినిమా అయినా కుర్చీలో కూర్చుని చూసే నా ఫ్రెండ్ గర్వమూ. చాలా దయతో మేం కుర్చీకొచ్చిన సంగతి హాలోళ్ళకి చెప్పలేదన్న మంచితనాన్ని మిగతా కుర్చీవాసులూ ప్రదర్శించేవారు. ఏమిటీ తొక్కలో తేడాలు అనిపించేది.

    అంతే కాదు. చానా రోజుల తర్వాత కలిసిన పాత మిత్రులు కూడా సినిమా హాల్ ప్రాంగణంలో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ .. టిక్కట్లు ఇచ్చే బెల్లు కొట్టగానే ఎవరి స్థాయి లైన్ లో వాళ్ళు నిలబడే వాళ్ళు. ఇంటర్వెల్ లో కలిసి పాస్ పోసుకోవడం తప్ప వాళ్ళు కలిసి సినిమా చూసే అవకాశాన్ని కాలరాసిన రాకాసి మనువాది కృష్ణమనాయుడు.

    ఆ తరువాత పెద్దయ్యేకొద్దీ అర్ధమయింది కృష్ణమనాయుడు ఒక్కడే కాదు. సినిమా హాలు యజమానులంతా మనువాదులే అని. నెల్లూరు, వరంగల్, హైదరాబాద్ అంతా మనువాద మయం.

    చివరికి అమెరికా వచ్చాక ఇక మనువాదానికి స్వస్తి అనుకున్నాను. అమెరికాలో సినిమాహాళ్ళలో మాత్రం అంతా ఒకే టిక్కట్టు. అంతవరకు సరేగాని.. వేరే వేరే వికృత మనువాద పోకడలు తెలుసుకోవడం మొదలెట్టాను. అసలీ మనువాదమనేది ఆదీ, అంతం లేని విశ్వవ్యాప్త జాడ్యమని కూడా తెలుసుకున్నాను. ఈ గ్లోబల్ మనువాదం గురించి తరువాతి భాగంలో.

    ReplyDelete
    Replies
    1. కమ్యునిష్టుల దృష్టిలో "వర్గశత్రువు!" అనేది కూడా ఇలాంటిదే:-)

      Delete
    2. <<<>>> అనేవి కూడా అలాంటి తిట్లే

      Delete
    3. >>‘మనువాదం, మనువాదులు’ అనే తిట్టు గురించి రామ్ కరణం అద్భుతమైనపోస్టు<<
      >>క్రీస్తుపూర్వం మనువు అనే వాడికేదో జిలబట్టి.. బ్రహ్మ తలనుంచి కొందరు, మొల నుంచి కొందరు పుట్టినట్టు రాశాడన్నారు. <<


      మనువుని ఎనకేసుకు రావాలంటే అంతకంటే ఎక్కువ లోతుకి వెల్లకూడదు మరి.. మనువు రాసింది ఆ ఒక్క వాక్యమే అని రాసెయ్యాలి..కాదులోతుకు వెల్లల్సిందే అంటే వాడ్ని పాకిస్తాన్ కి తరిమెయ్యాలి.

      Delete
    4. A comment on above post by Mahesh Mahesula


      మనుస్మృతిని మీరొక (?????) పవిత్ర గ్రంధం అనుకుని దానికేసి తలలు బాదుకుంటే చేసేదేమీ లేదు. ఫ్రెడ్రిక్ నీషే బైబిల్ మూసేసి మను స్మృతి తెరవండి అన్నంత మాత్రాన దినికో ప్రత్యేకత ఇచ్చేసి, ఇదే ఫైనల్ అని మీరనుకుంటే చేసేదేమీ ఉండదు . డా.అంబేద్కర్ గారు మను స్మృతి ఇండియాలో బౌద్దిజం వ్యాప్తి జరుగుతున్నపుడు, దానిని అరికట్టడానికి, దానికి వ్యతిరేకంగా రాయబడినదని చెప్పారు. అంతే కానీ ఇదే హిందూ ఇజం అని చెప్పలేదు. మను స్మృతిని మనం డూస్ అండ్ డోంట్ డూస్ వంటి కోడ్ ఆఫ్ కండక్ట్ అని అనుకుంటే, ఆ కాలంలో ఈ కోడ్ అఫ్ కండక్ట్ని తూచా తప్పకుండా పాటించిన రాజ్యాల దాఖలాలు కూడా కావాలి. గ్రీకు వాడొచ్చినపుడో ఇంకొకపుడో మాత్రమే ఆసేతు హిమాచలమూ భారతదేశమేనన్న సంగతి గుర్తించని రాజ్యాలు, ఎవరో భృగువనే మహర్షి రాసిన మను స్మృతిని తమ కోడ్ ఆఫ్ కండక్ట్ గా మార్చుకుని ఉంటాయని అనుకోనేలేము. పురాణేతిహాసాలు వేదాన్ని ప్రతిపాదించినా, మను స్మృతి వేదాన్ని ప్రతిపాదించినట్టు మనకు కనిపించదు. దాన్ని అవైదికమనే అనుకోవాలి. వేదాల్ని నెత్తినెట్టుకున్న దయానందుడు మనుస్మృతిని హత్తుకోవడం పిచ్చి పీక్స్ అనుకోవచ్చు. ఒక లా బుక్ లాంటి దాన్ని, మొత్తం భారత సాహిత్యంలో ఒక అత్యంత చిన్న భాగమైన దాన్ని పట్టుకుని ఇదే హిందూమతము చూడగ రారండి అని పాడుకుంటామంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.

      Delete
    5. అశ్వమేధ యాగం - కౌసల్యామాత

      అశ్వమేథ యాగం గురించి చాలా నీచమైన దారుణాతిదారుణమైన రాతలు వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చివరకు వీకీపీడీయాలో కూడా హైందవ ధర్మంపై దాడి జరుగుతోంది. అప్పుడే పుట్టిన పసిపిల్ల దగ్గరనుంచి కాటికి కాళ్లు జాపుకున్న ముసలమ్మవరకు,ఇంట్లో పెంచుకునే కుక్కలు మేకలు నుంచి గొడ్లచావడిలో గొడ్లను కూడా వదలకుండా వికృత వికార చేష్టలు చేసే హీన జాతి ఒకటి మనదేశంపైనా, మన హైందవ ధర్మం పైనా విషం చిమ్ముతున్నది. చెదపురుగుల్లా పుట్టిన అలాంటి వారు చేసే వాస్తవ వక్రీకరణలు ఎలా వ్యాప్తి చెందుతున్నాయంటే, ఇదే నిజమేమో అని సామాన్యులు నమ్మే స్థాయికి,భారతదేశ అస్థిత్వానికే మచ్చతెచ్చే వావివరుసలు లేని జాతిని ఖండించాల్సిన సమయం మళ్ళీ ఆసన్నమైంది. అందుకు మన ధర్మం అంటే ఏమిటో ముందుగా మనకు తెలియాలి కదా? అఖండమైన భారతీయ విజ్ఞాన క్షేతం నుంచి కొంతవరకన్నా మనం తెలుసుకుని తీరవలసిందే.
      "కారుణ్యాలయ భక్తవరద నిను కన్నదె కానుపు రామా' అంటాడు భక్త రామదాసు కౌసల్యా మాత ఘనత గురించి.నిజంగానే ధర్మానికి పోతపోసి రూపమిచ్చి రామునిలా కన్న తల్లి అదృష్టమే అదృష్టము కదా? వాల్మీకీ రామాయణంలో అసలు అశ్వమేథ యాగం గురించి పరిశీలిస్తే అశ్వబలి లాంటివి,మహారాణి గుర్రంతో వికృత చేష్టలు చేస్తుందని కానీ ఎక్కడా లేదు.

      సరిగ్గా తెలుగును తెలుగులా స్పష్టంగా పలకటం, మాట్లాడటం రాని మాతృభాషా ద్రోహులు కూడా అన్నీ తెలిసిన మేధావుల్లా రాళ్ళు విసిరి డబ్బు సంపాదన చేయాలని చూస్తున్నారు.

      "కౌసల్యా తం హయం తత్ర పరిచర్య సమంతత:
      కృపాణైర్విశశాసైనం త్రిభి: పరమయా ముదా

      పతత్త్రిణా తదా సార్థం సుస్థితేన చ చేతసా
      అవసద్రజనీమేకాం కౌసల్యా ధర్మ కామ్యయా "(వాల్మీకీ రామాయణము:బాలకాండము: 14వ సర్గ:31-32 శ్లోకాలు)

      భావము: కౌసల్య, సుమిత్ర, కైకేయి అను దశరథుని భార్యలు మువ్వురు ఆ యజ్ఞాశ్వమునకు పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యాపసవ్యములుగా ప్రదక్షిణమొనర్చి, సంతోషముతో దానిపై బంగారు సూదులతో మూడుగుర్తులుపెట్టిరి. పట్టమహిషియైన కౌసాల్యాదేవి ధర్మసిద్ధి కొరకు స్థిరమైన చిత్తముతో "అశ్వసమీపమున నివశించెను" (వాల్మీకి రామాయణంలోనుంచి యథాతథముగా తీసుకున్న భావము)

      మనం నూతన గృహప్రవేశ సమయంలో గోపూజ, గోసేవ చేస్తాము. అంతమాత్రముచేత గోవుతో సంబంధము అంటగట్టేస్తారా? వీరు ప్రచారం చేస్తున్నట్టుగా కౌసల్యా మాత గుర్రంతో కలిసి ఉండటం జరిగేదేనా...నీచమైన భావజాల వ్యాప్తి ద్వారా పవిత్రమైన యాగంపై ఇంతటి విష ప్రచారం తగదు.

      ఉత్తర రామాయణంలో రామలక్ష్మణుల సంభాషణలో స్వయంగా లక్ష్మణుడు ఇలా చెప్పాడు. "వృతాసురుని వజ్రాయుధముతో వధించిన ఇంద్రుడు, తదుపరి అశ్వమేథయాగము చేసి బ్రహ్మహత్యాపాతకమును పోగొట్టుకున్నాడు" అని.

      శ్రీరాముడు కూడాఅశ్వమేధయాగం గురించి చెబుతూ, "పరమశివుడు పార్వతీ మాతతో విహరిస్తున్న వనంలోకి ఇలమహారాజు తెలియక ప్రవేశించాడని, అందుకు ఫలితంగా ఒక నెల స్త్రీ(ఇళ)గాను, ఒక నెల పురుషుడు గానూ మారుతూ, తదుపరి బుధుని వరం వల్ల పురూరవుని సంతానంగా పొంది ఆ తర్వాత బుధుని ప్రేరణ చే అశ్వమేథ యాగము చేసి, శాశ్వత పురుషత్వమును పొందాడని వివరించాడు.అంతేకాదు! శ్రీరాముడు బంగారు సీతమ్మ విగ్రహాన్ని పక్కన పెట్టుకుని అశ్వమేథ యాగం చేయటము, యాగ సమాప్తి రోజున సీతమ్మను సభకు పిలిపించి ఇంకొకసారి ప్రజలెవ్వరూ మళ్ళీ మళ్ళీ నిందలు వేయకుండా తన పవిత్రతను నిరూపించుకోమని ఆదేశిస్తాడు. సీతాదేవి తన సౌశీల్యమును శపథపూర్వకంగా ప్రకటించగానే భూమాత ఆ సాధ్విని తన ఒడిలోకి చేర్చుకుని,రసాతలమునకు చేర్చటమూ జరుగుతుంది.

      ప్రస్తుతం మన సమాజ వికృత వికార చేష్టలను చూసి చూసి అలవాటు పడిన మనకు శ్రీరాముడు ఎంత గొప్ప ఆదర్శరాజో, సీతమ్మ ఎంత గొప్ప ఆదర్శరాజ్ఞి యో ఎలా అర్థం అవుతుంది?

      సీతాదేవి అంతర్ధానం అయినతరువాత దు:ఖంతో క్రుంగిపోతున్న రాముని బ్రహ్మదేవుడు ఓదార్చాడు.

      ఆ తరువాత ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్ర ప్రభువు తాను చేసే అన్ని యాగములలో జానకీదేవికి ప్రతినిధిగా బంగారుసీతను నిలుపుకుని, వరుసగా పదివేల అశ్వమేథ యాగాలు,వాటికి పదిరెట్లు అంటే లక్ష వాజపేయయజ్ఞములు,అనేకసువర్ణయాగములే కాక, అగ్నిష్టోమము, అతిరాత్రము, గోసవము అను యజ్ఞములనే కాక అనేక క్రతువులను ఆచరించి దేశమును సుభిక్షముగా చేసాడు -

      ఇలా అశ్వమేథ యాగము చేసిన మహనీయులు చాలా తక్కువమంది మన చరిత్రలో కనిపిస్తారు ఎందుకంటే చాలా కష్టమైన నియమాలు పాటించాలి కనుక. ఒక సంవత్సరం పాటు సాగే అశ్వమేథ యాగం సామాన్య రాజులు చేయలేని అనుసరించలేని చాలా నియమ నిష్టలతో కూడుకున్నది.

      Delete
    6. అశ్వమేథ యాగం గురించి బాగా తెలిసిన బ్రహ్మరాక్షసులు విధిలో దోషాలు వెదుకుతూ యజ్ఞాన్ని భంగ పరచేందుకు అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. యేపాటి చిన్న దోషము జరిగినా యజ్ఞ కర్త నశించిపోతాడు. యాగాశ్వాన్ని సురక్షితంగా కాపాడగల శూరులు.(400 మంది వీరులను అశ్వ రక్షణకు దశరథుడు పంపుతాడు) ఉండాలి.ఇది ఒక ఎత్తైతే- పది కామజములైన వ్యసనాలు, ఎనిమిదిక్రోధజములైన దుర్వ్యసనాలు, ప్రయత్నపూర్వకంగా వదిలేయాలి.
      {కామజములైన వ్యసనాలు:వేట,పాచికిల ఆట(జూదము),పగలునిద్రపోవటం,నిందించటం,స్త్రీలౌల్యము,గర్వపడటం,నృత్య,గీత,వాద్యముల యందు విపరీతమైన ఆసక్తి,వ్యర్థముగా తిరుగుతూ ఉండటం **** క్రోధజములైనవ్యసనములు: చాడీలుచెప్పటం,దుస్సాహసం,ద్రోహచింతన,అసహనము,ఇతరుల గుణములయందు దోషములను ఆరోపించటం,ధనముకొరకై నీచముగా మాట్లాడటం,తిట్టటం,కఠినంగా మాట్లాడటం.}
      నిజంగానే ఇవన్నీ పాటించటం, అదీ ఒకసంవత్సరం పాటు ఎంత కష్టం? ఇంకో పది నిముషాల తర్వాత మనమెలా ఉంటామో మనకే తెలియదు! వీటిలో ఎన్ని మనంప్రయత్నపూర్వకంగా ఎంతకాలం పాటించగలం?

      ఈ విధి విధానాలు అన్నీ కర్తల భార్యలు కూడా పాటించాల్సిందే! అంటే ఇవన్నీ కౌసల్యా, సుమిత్ర, కైకేయి మాతలు కూడా పాటించారు.

      ఇంతే కాక, యాగం చేస్తున్న సంవత్సర కాలమూ ప్రజలందరూ దేనికీ లోటు లేకుండాఉండాలి, వస్త్రాభరణాలు, రత్నాలు, మణిమాణిక్యాలు ఇలా ఒక్కటేమిటి ఏదంటే అది వారు కోరినదల్లా రాజు వారికి దాన ధర్మాలు చేయాలి. మృష్టాన్న భోజనాలకు అంతేలేదు, లేదనకుండా పెట్టాలి. అంతమందికీ వండి పెట్టగలిగే సామర్ధ్యం ఉండాలి. వచ్చిన వారెవ్వరూ అసంతృప్తికి లోనవ్వటానికి వీలులేదు. అబ్బో!! ఇలా ఒకటా రెండా??? ఎన్నో ధర్మాచరణ నియమాలు!!

      ఇవన్నీ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అనుకుంటే పప్పులో కాలువేసినట్లే. అన్నివర్ణాలవారికీనూ...

      "తత: సుమంత్రమాహూయ వసిష్టో వాక్యమబ్రవీత్
      నిమంత్రయస్వ నృపతీన్ పృథివ్యాం యే చ ధార్మికా: (బాలకాండ,13 సర్గ,18 పద్యము)

      బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ సహస్రశ:
      సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్" (బాలకాండ,13 సర్గ,19 పద్యం)

      భావము: పిమ్మట వశిష్టమహర్షి సుమంత్రుని పిలిపించి ఇట్లు పలికెను. ఈ భూమండలమునగల ధార్మికులైన రాజులను పెద్దసంఖ్యలో బ్రాహ్మణులనుం క్షత్రియులను,వైశ్యులను,శూద్రులను ఆహ్వానింపుము.అన్ని దేశములనుండి జనులను ఆహ్వానింపుము - అంటూ పిలువ వలసిన వారిని చెపుతాడు ఆ బ్రహ్మర్షి.

      ఇవేకాక, మనకు ఋక్ యజుర్ సామ (శాస్త్ర ప్రకారం వేదాలు మూడు.కానీ తర్వాత సౌలభ్యం కోసం ఇంకొక విభాగంగా చేసి అధర్వణవేదాన్ని చేర్చారు). వేదాలు యజ్ఞాలలో హింస చేయకూడనే తెలిపాయి. ప్రజాపతి పుత్రులు వారి పేర్లతో ప్రాచుర్యం పొందిన కపిల సంహిత, కథా సంహిత, తైత్తరీయ సంహిత, కణ్వ సంహితలలో దార్శనికులైన ఋషులు హింస చేయడానికి వీలులేదనే తెలిపారు.

      మన దౌర్భాగం కొద్దీ తైత్తరీయ సంహితలో ఋషి రాసినట్లుగా హింస చేసిన తరువాతే ఫలసిధ్ధి కలుగుతుందని ప్రక్షిప్తం (ఇరికించి చేర్చి) చేసి రాయబడింది అని నిరూపితమైంది.

      మేధ అంటే సంస్కృతంలో మూడు అర్థాలున్నాయి.1.ఆచార్యుల మేథోసంపత్తికి పదునుపెట్టటం,2.ప్రజలలో సమైక్యత పరస్పర ప్రేమ భావన పెంపొందించటం,3.హింసను ప్రేరేపించటం.

      వేదాలు విసర్జించమన్న హింసను కొందరు అదేపనిగా ప్రచారం చేసారు.మొదటి రెండింటిని వదిలి మూడవ అర్థమైన దానిని, వేదాలు ప్రామాణికంగా చెప్పబడిన అహింసకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే అర్థాని మాత్రమే కుహానా నాస్తిక మేధావులు తీసుకున్నారు. 300 రకాల రకరకాల జీవుల ప్రదర్శన (exhibition) . వాటిలో జలచరాలు, పాములు,పశువులు, ఆకాశంలో విహరించే విహంగాలు ఇలా రకరకాలు.

      ఇలాంటి అద్భుతమైన అంశాలు ఎన్నెన్నో వాల్మీకి రామాయణంలో కనిపిస్తాయి. కానీ, ఆ మహా సముద్రం నుంచి ఒక నీటి బిందువు మాత్రమే తీసినట్లు నేను వాల్మీకి రామాయణం నుంచి కొంత మాత్రమే ప్రస్తావించాను.

      అశ్వమేథ యాగాన్ని గురించి దుర్మార్గులు సృష్టించిన నియమాలు, బంగారు సీతమ్మను కాని, ఒక నెల స్త్రీగాను ఒక నెల పురుషుడుగాను మారి యాగం చేసిన ఇల మహారాజు ను గాని ప్రస్తావించరు. బంగారు సీత, లేదా ఇల మహారాజు ఒక సంవత్సర కాల నియమాన్ని ఎలా పాటించగలడు?

      పరమ పవిత్రమైన అశ్వమేథ యాగాన్ని గుర్రంతో రాణి భోగం అంటూ నీచంగా చిత్రీకరించే ప్రయత్నం చేయరాదు. మహాపాపం. కాళ్ళు చేతులు నోరు మెదడు ఇచ్చింది మంచికి ఉపయోగపడాలని,మంచి చేయలేకపోయినా కీడు చేయకుండా ఉండటానికి.

      -పద్మారామశర్మ శఖునవీటి.

      Delete
  18. ఏమిటీ బ్లూ వేల్ గొడవ?ఒక ఆట ఆడుతూ మధ్యలో స్క్రీన్ మీద "నువ్వు చెట్టుకు ఉరేసుకుని చచ్చిపో!" అని కనపడగానే ఆ పని చహెసి చచ్చిపోయేఅవాళ్ల మీద నాకు జాలి కలగదం లేదు - అలాంటివాళ్ళు బతికుండి మాత్రం ఏమి ఉపయోగం?ఏదో ఒక అరోజున ఏదో ఒక తీవ్రవాద సంస్థ మాటలు నమ్మి వాళ్లలో చేరి జనాన్ని చంపరని గ్యారెంటీ ఏమిటి?దానికన్న ఇలా చచ్చిపోవడమే నయమని జాలి వెయ్యకపోగా అసహ్యం వేస్తున్నది వాళ్ల మీద నాకు!

    ReplyDelete
    Replies
    1. ఇలా గొఱ్ఱెల్లాగ ఫాలో అవడం ఈవాళ కొత్తకాదు అది బ్లూవేల్ గేమ్ అయినా లేక ఏదైనా రెలీజియన్ మేటర్ అయినా. మనుషుల్ని గొఱ్ఱెల్లా భావించే లేక గొఱ్ఱెల్ని చేసే మతాలు, స్వాములూ, ముల్లాలు, ఫాదరీలూ, బ్లూవేల్ బాబాలు ఉన్నంత వరకూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

      Delete
  19. దాన్ని తయారు చేసినవాడు కూడా ఎందుకు తయారు చేశావని అడిగితే జనాభాని తగ్గించడానికని చెప్పాడని చదివాను.జవాబు అకక్ద ప్రచురించదంలో క్లారిటీ లేదు గానీ వీడు స్క్రీన్ మీద టెక్స్ట్ రూపంలో చెప్పగానే బుర్ర పెట్టి ఆలోచించకుండా అంత తెలివితక్కువగా చచ్చిపోయే వేస్ట్ క్యాండిడేట్లని తగ్గించాలని వాడి ఉద్దేశం కావచ్చు!

    ReplyDelete
  20. Sri Rama 5 కొత్త ఫోటోలుని జోడించారు — Satyamev A Jayate మరియు మరో 38 మందితో
    16 జూలై ·

    * మన గ్రంధాలలో కుల వివక్ష ఎంత వరకూ నిజం *

    మొదట కులవ్యవస్థ వర్ణవ్యవస్థ రూపంలో ఉందని మనకు అనేకులు చెబుతారు. కాని మనపురాణకాలంలో లేదని చెప్పలంటే దానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. అన్నింటికన్నా ముందు ఈ కులవ్యవస్థ ఆర్యులు తెచ్చారని చెబుతున్నారు. ఆర్యసిద్దాంతం (Aryan Invasion Theory) ప్రకారం రామాయణ మహాభారతాలు అస్సలు జరుగలేదు, పూర్తిగా కల్పితాలు. అంబేద్కర్ గారు కూడా ఆర్యసిద్దాంతాన్ని అంగీకరించలేదు. కులవ్యవస్థగురించి మాట్లాడాలనుకునేవారు ఆర్యసిద్దాంతాన్ని నమ్మితే దాని ప్రకారం ఆర్యులు తమతో పాటు తీసుకువచ్చిన ఈ వ్యవస్థను మనమీద రుద్దారు. ఆర్యసిద్దాంతాన్ని గురించి తరువాతి టపాలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నేను చెప్పలనుకున్నదాని ప్రకారం ఆర్యసిద్దాంతం అంతా అబద్దం అని రామాయణ మహాభారతాలు మన చరిత్ర అని నేను నమ్ముతున్నాను, దాని ప్రకారం నేను చెబుతాను (2002లో ద్వారకలో బయల్పడిన నిజాల ద్వారా అర్యసిద్దాంతం అబద్దం అని వేరే చెప్పనవసరంలేదనుకుంటున్నాను).

    మొదట రామాయణం గురించి మాట్లాడుకుందాం. “Why I am not a hindu” పుస్తక రచయిత కంచ ఐలయ్యగారు తన పుస్తకంలో రాముడు ఆర్యుడని పేర్కొన్నారు. ఆర్యసిద్దాంతం ప్రకరం ఆర్యులు అందరూ తెలుపు శరీర వర్ణంగా కలవారు. కాని రాముడు నీలిమేఘశ్యాముడని, తెల్లగాఉండడనీ పాపం ఆయన మరిచారు. రామాయణం ఆర్యద్రావిడుల యుద్దమని చెప్పేవారు అనేకులు ఉన్నారు. వారందరికీ ఒకేఒక్క ప్రశ్న- రావణాసురుడు తెల్లగా ఉంటాడు కాని రాముడు నల్లగా ఉంటాడు. రావణాసురుడు ద్రావిడుడు అయితే ఇది ఎలా సాధ్యం? అంతేగాక రావణుడు బ్రాహ్మణుడని మనకు రామాయణం చెబుతోంది. కాని మనకు మేధావులమని చెప్పుకునే వారందరూ ఈ విషయాన్ని చెప్పరు.

    రాముడి వ్యక్తిత్వం గురించి మనకు తెలిసే మరో చేదు విషయం రాముడు ఒక శూద్రుడిని చంపడం. ఇది ఉత్తరకాండలోనిది. ఉత్తరకాండ రామాయణంలో లేదనీ తరువాత ఎవరో ఉద్దేశపూర్వకంగా రామాయణంలో దీనిని కలిపారని మనకు అనేక మంది చరిత్రకారులు చెప్పారు. ఇది కాకపోయినా మరొక సంఘటనను గమనిస్తే ఉత్తరకాండ అబద్దమని తేలిపోతుంది. ఇది రాముడు సీతను వెదుకుతూ వెళుతున్న సమయం. అప్పుడు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తిన్నాడని మనకందిరికీ తెలుసు. శబరి అంటే శబర జాతికి చెందినది అని అర్థం. శబరజాతి వాళ్ళు శూద్రులకు బ్రాహ్మణులకు పుట్టిన మిశ్రమజాతి. ఒక మిశ్రమజాతి స్త్రీ ఇచ్చిన ఎంగిలి పండ్లను తిన్న రాముడు ఒక శూద్రుడిని చంపాడంటే ఎలా నమ్మాలో అర్థం కావట్లేదు. దీనికి ఉత్తరకాండ తరువాత చేర్చినది అని మరోసారి నేను చెప్పనవసరం లేదనుకుంటాను.

    ఇప్పుడు మహాభారతంలోకి వద్దాం. కులవ్యవస్థ గురించి మాట్లాడేవారు చెప్పే మరొక ఉదాహరణ ద్రోణాచార్యుడు. ఏకలవ్యునిపట్ల ద్రోణాచార్యుని ప్రవర్తన ఏ విధంగానూ సమంజసం సమర్థనీయం కాదు. కానీ ఒక్కసారి నేను అడగదలచుకున్న ప్రశ్న అప్పటి కాలం గురించి మనం చర్చించుకునేటప్పుడు ద్రోణాచార్యుని ప్రవర్తన ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు అనేది. ఒక్కసారి ద్రోణాచార్యుని జీవితం మనం పరిశీలిద్దాం. (మహాభారతం మీద వ్రాస్తున్నాప్పుడు ద్రోణాచార్యుని గురించి వ్రాయాలి అనుకున్నాను, కానీ ఇంతకంటే మంచి సమయం లేదని నేను ఇప్పుడు ద్రోణాచార్యుని గురించి వ్రాస్తున్నాను). ద్రోణుడు భరద్వాజ మహర్షికి కుండలో పుట్టాడు. ద్రోణుడి బాల్యమిత్రులలో ఒకడు ద్రుపదుడు. ద్రుపదుడు ఆటలాడుకునే సమయంలో ఒకసారి మిత్రునికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానని ప్రమాణం చేసాడు. చదువు ముగిసిన తరువాత ద్రోణుడు కృపని(కృపాచార్యుని సహోదరి) వివాహం చేసుకున్నాడు. వారికి కలిగిన ఏకైక సంతానం అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టుకతోనే తలమీద ఒక మణితో పుట్టాడు. దానివల్ల ఎటువంటి శత్రువునైనా, ఆయుధాన్నయినా అవలీలగా భయం లేకుండా ఎదుర్కొనగలడు. అశ్వత్థామ చిన్నతనంలో ద్రోణుడు చాలా పేదరికంలో ఉండేవాడు. అది ఎంతటి పేదరికం అంటే అశ్వత్థామకు పాలకీ గంజికీ తేడా తెలియనంత. ఇది చూసి తట్టుకోలేక తన బాల్యమిత్రుడైనటువంటి ద్రుపదుడిని ధనసహాయం అడగడానికి వెళ్ళాడు. ద్రోణుడు కూడా చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద కోరికలేమీ అడగలేదు, కేవలం ఒక ఇల్లు, ఒక పాడిఆవును మాత్రం సహాయంగా తన బాల్యమిత్రుడిని అర్థించాడు. హస్తినాపురాన్ని ఎదుర్కోగలరాజయినప్పటికీ తన పాతస్నేహితుని ఇంతచిన్న కోరికలను కూడా ద్రుపదుడు మన్నించకపోగా గేలి చేస్తాడు. ఆ అవమానం భరింపలేక ద్రోణుడు పరశురాముడు తనదగ్గర ఉన్నవన్నీ దానం చేస్తున్నాడని తెలిసి అతని దగ్గరకు వెళతాడు. కానీ ద్రోణుడు వెళ్ళేటప్పటికి ఎంతో ఆలస్యం అవడంవలన మరియు పరశురాముడు అప్పటికే తన వద్ద ఉన్న ధనం మొత్తం దానం చేయడం వలన తన అస్త్రాలను ద్రోణునికి దానం ఇస్తాడు.

    ReplyDelete
  21. మన సాక్శ్యం మహమ్మదు చౌదరి గారు ఉగ్రవాదం మీద ఒక అద్భుత వ్యాసం వ్రాసారు ఈవాళ (http://www.sakshyammagazine.com/2017/09/is-there-connection-between-terrorism.html) ... బాగుంది నాకేం అభ్యంతరం లేదు, నిజానికి మావోయిస్టుల్ని కూడా ఉగ్రవాదుల్లానే జమకట్టాలి అంటాను నేను.

    నిజానికి రహీమ్ సింగ్ లాంటి వాళ్ళని ఉగ్రవాది అనాలా లేక ఉన్మాది అనాలా అనే విషయం మీద నాకింకా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే వీడేనాడూ ఫలానా వాళ్ళని చంపండి అని విన్న దాఖలా లేదు (వాడు జైలుకెళ్ళే రోజుదాకా). రహీమ్ సింగ్ కి ఉన్నది మానసిక రగం అంతకన్నా పెద్ద రోగం ఖురేశీ కి కూడా ఉంది.

    కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే అదే మహమ్మదు చౌదరి గారు ఒక సంవత్సరం క్రితం జాకీర్ నాయక్ అనే ఉగ్రవాదిని ఎలా వెనకేసికొచ్చాడో చూడండి (వీడు మతం పేరుతో చంపడం తప్పుకాదు అన్నాడు, ఇంకా ఎన్నో అన్నాడు అవి అందరికీ తెలుసు కదా)...
    http://rachabanda.sakshyammagazine.com/2016/07/blog-post_22.html

    ఛీ..ఛీ... అసలు మనుషులేనా లేక మేకవన్నె రాక్షసులా వీళ్ళు??

    ReplyDelete
  22. ధనం ఏమీలేక బాధతో హస్తిన(తన భార్య వద్దకు)కు తిరిగివస్తున్న ద్రోణుడు అప్పుడు కురుపాండవులకు మంచి గురువుకోసం వెదుకుతున్న భీష్ముడి కంటపడతాడు. అప్పుడు భీష్ముని అభీష్టం మేరకు కురుపాండవులకు అస్త్రవిద్యనందించడానికి అంగీకరిస్తాడు. అప్పుడు మొదట పెట్టిన ముందు పరీక్షలలో(Preliminary tests) అర్జునుడు మంచి విలుకాడు అవుతాడని గ్రహించి అతనిని సాటిలేని మేటి విలుకాడిగా తయారుచేస్తానని అర్జునునికి ప్రమాణం చేస్తాడు. కేవలం అర్జునునికి ఇచ్చినమాటకోసమే భీష్ముడు ఏకలవ్యునికి విద్యను నిరాకరించాడు మరియు తన ప్రమేయం లేకుండా తన ప్రతిమను గురువుగా భావించి నేర్చుకున్నందుకు బొటనవ్రేలిని గురుదక్షిణగా అడిగాడు. ఇది కాకుండా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరోకటుంది. అర్జునునికిచ్చిన మాటను పక్కనపెడితే ఏకలవ్యుడు నిషధరాజకుమారుడు. నిషధులు జరాసంధునికి మిత్రరాజులు, జరాసంధుడు హస్తినకు శత్రువు అవడంవలన అప్పటి ప్రకారం హస్తినకు శత్రువులు (భానుమతీ స్వయంవరంలో కర్ణుడిచేతిలో ఓడినప్పటినుంచీ జరాసంధుడు హస్తినకు మిత్రుడు). నాకు తెలిసీ తనకు ఆశ్రయం ఇచ్చినవారి శత్రువులకు ఎవరూ యుధ్ధవిద్యలు నేర్పించరని నేను భావిస్తున్నాను.

    మరొక్కసారి ద్రోణుని మనం పరిశీలిద్దాం. బ్రాహ్మణులు ఎవ్వరూ శత్రుత్వానికి తమ మనస్సులలో చోటు ఇవ్వరాదని మన వేదాలు చెబుతున్నాయి. కానీ ద్రోణుడు ఇక్కడ తప్పాడు. ద్రోణుడు అర్జునుని సంపూర్ణ విలుకానిగా, అస్త్రవిద్యలలో సాటిలేని మేటిగా చేస్తానని ప్రమాణం చేసాడు (దాని అర్థం తనకు తెలిసిన సకలఅస్త్రాలను నేర్పుతాను అని), కానీ నారాయణాస్త్రాన్ని తన కుమారుడైన అశ్వత్థామకు నేర్పించాడు కానీ అర్జునునికి నేర్పించలేదు. అదే విధంగా బ్రహ్మశిరాస్త్రాన్ని(http://sacred-texts.com/hin/m10/m10015.htm) అశ్వత్థామకు అర్జునునికీ నేర్పించినప్పటికీ అర్జునునికి మాత్రమే ఉపసంహరించుకోవడం నేర్పాడు. (ఉపసంహరణ వలన ఒక అస్త్రాన్ని అనేక పర్యాయాలు ప్రయోగించవచ్చు.) ఈ విధంగా చూస్తే ద్రోణుడు తన మాట నిలబెట్టుకోలేదని చెప్పవచ్చు. అటు కన్నప్రేమకు న్యాయం చేయలేదు, ఇటు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు, మరో పక్క బ్రాహ్మణునిగా విఫలం అయిన ఒక వ్యక్తిని చూపించా అప్పటి కాలంలో కులవ్యవస్థ ఉందని మనం చెబుతోంది? తన ప్రతినకోసం కర్ణునికి కూడా ద్రోణుడు ఈ అస్త్రాలను నేర్పించలేదు. కానీ దానిగురించి ఎవరూ మాట్లాడలేదు (అంబేద్కర్ తో సహా). పుట్టుకతో క్షత్రియుడయినంతమాత్రాన జీవితాంతం సూతుడిగానే గడిపిన కర్ణుని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. కర్ణుడు రాజుగా ఉన్నప్పుడు ఎవ్వరూ (మిగతా రాజులు) అభ్యంతరపెట్టలేదు. ఏకలవ్యుడు యువరాజుగా, రాజుగా ఉన్నప్పుడు ఎవ్వరూ అభ్యంతరపెట్టలేదు, కానీ అదేంటో ఒక్క బ్రాహ్మణుడు తన ప్రతినకోసం, తనకు ఆశ్రయం ఇచ్చినవారి మేలుకోసం, తనకు కష్టకాలంలో అన్నం పెట్టి ఆదుకున్న రాజ్యం కోసం శత్రురాజ్యపురాజకుమారుడికి విద్య నిరాకరించడం కులవ్యవస్థయొక్క వేళ్ళూనుకుపోయినతత్వాన్ని ఎలా చూపిస్తుంది? అబ్బే, ఎవ్వరూ దీని గురించి మాట్లాడరు. ద్రోణుడు సాధారణ సైనికుల మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన ఒక మతిలేని వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఒక కులం గురించి ఎలా మనకు పూర్తి అవగాహన కల్పిస్తుంది? అదే ద్రోణుడు ధుర్యోధనుడు పాండవపక్షపాతి అని పదే పదే తిట్టేసరికి సొంత యోధులకు సైతం అర్ధంకాని పద్మవ్యూహాన్ని రచించాడు. కాని తన కుమారుడు చనిపోయాడని తెలిసేసరికి ఆయుధాలు అన్నీ వదిలేసి తపస్సుకు సిద్దమయ్యాడు తీవ్రంగా పోరాడుతున్న యుద్దభూమిలో అదీ తను పోరాడుతున్న సైన్యాలకు న్యాయకత్వం వహించాలని మరచిపోయి. ఇంతటి మానసికస్థైర్యం లేని వ్యక్తి చేసిన పనులను చూపించా మనం మన పురాణకాలంలో కులవ్యవస్థ ఉందని మన పూర్వీకులను తిట్టుకుంటున్నది? ఈనాడు కులవ్యవస్థ గురించి మాట్లాడేవారు నాకు కనీసం ఒక్క విషయానికయినా సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాను. మహాభారతం తవ్వే కొద్దీ ఊరే జలం వంటిది. కనీసం ఒక్క వ్యక్తి గురించయినా పూర్తిగా తెలుసుకోకుండా మనవాళ్ళు ఇలా అభాండాలు వేయడం తగదు. నాకు తెలిసీ ద్రోణుడు ఒక విఫలమయిన వ్యక్తి. తండ్రిగా, గురువుగా, బ్రాహ్మణుడిగా, మనిషిగా, సైన్యాధ్యక్షుడిగా, మిత్రునిగా (తన మిత్రుడు తప్పు చేసినప్పుడు క్షమించగలిగే ఉదారహృదయం ఉండాలి) విఫలమయిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని చూసా మనం మన పూర్వీకులను అంచనా వేస్తున్నది? ఒక కాలంలో ఒక కులంకానీ ఒక దేశం కానీ ఎలా ప్రవర్తిస్తున్నదో తెలుసుకోవాలంటే ఆ సమాజంలో అధికసంఖ్యాకులు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి మనం అంచనా వేయాలి. కేవలం ఒక్క వ్యక్తి మీద ఆధారపడి మనం నిర్ణయం తీసుకోకూడదు.

    ReplyDelete
  23. అప్పటికాలంలో ఉన్న మరో ప్రముఖ బ్రాహ్మణుడు కృపాచార్యుడు, అటువంటిది ఏమీ చేయలేదే. కానీ అతని గురించి ఎందుకు మాట్లాడరు? వ్యాసుడు బ్రాహ్మణుడు కాదు, ఇంకా చెప్పలంటే మిశ్రమజాతి సంతానం కానీ అతను మహాభారతాన్ని రచించాడు. ఆ మహాభారతాన్ని తరతరాలుగా బ్రహ్మణులు ఇప్పటివరకు చెప్పుకుంటూవచ్చారు. వ్యాసునికి పుట్టిన కుమారులను రాజకుమారులుగా (క్షత్రియులుగా) అంగీకరించారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి పూర్వాశ్రమంలో ఒక దొంగ, కానీ రామాయణాన్ని అందరూ చదువుతారు కదా. ముఖ్యంగా బ్రాహ్మణులు తరతరాలుగా తమ వారసులకు నేర్పించలేదా? హస్తినకు శత్రువులగురించి నేను మాట్లాడినదాని వల్ల ఎవరైనా ద్రోణుడు ద్రుష్టద్యుమ్నునికి నేర్పించినదానిగురించి చెప్పవచ్చు. ద్రోణుడు ద్రుష్టద్యుమ్నునికి నేర్పించేనాటికి ద్రుష్టద్యుమ్నుడు అర్జునుని బావమరిది. ఒక్కసారి అప్పటికాలంలో రకరకాల వ్యక్తులు వర్ణవ్యవస్థకు ఎలా స్పందించారో చూద్దాం. కర్ణున్ని రాజుగా అందరూ అంగీకరించారు. కృష్ణుడు యాదవుడని రాజుగా అంగీకరించని జరాసంధుడు కర్ణున్ని మాత్రం అంగీకరించి, తన మిత్రునిగా అంగీకరించాడు. నిషధుడని ద్రోణుడు విద్య నిరాకరించిన ఏకలవ్యున్ని జరాసంధుడు మిత్రునిగా అంగీకరించాడు. అప్పటి ప్రముఖ రాజులయిన భాగదత్తుడు, జయద్రదుడు, కృతవర్మ ఎవ్వరికీ కర్ణుడు రాజుగా ఉండటానికి అభ్యంతరం చెప్పలేదు. శల్యుడు యుద్దంలో కర్ణున్ని నీరసపరచడానికి అన్ని రకాలుగా మాట్లాడాడుకాని కులం గురించి మాత్రం మాట్లాడలేదు. కులం మీద ఇతర బ్రాహ్మణులయిన అశ్వత్థామ, కృపాచార్యుడు ఏమీ మాట్లాడలేదు. అప్పటికాలం నాటి రాజకీయ సాంఘీక పరిస్థితులు ఏమీ అవగాహన చేసుకోకుండానే డవిలాగులు వదలడం మనవారికే చెల్లింది.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...