Thursday, 28 January 2016

చంద్రబాబుకి సిగ్గూ శరమూ పౌరుషం ఉంటే ముందు అమరావతి శంకుస్థాపన శిలాఫలకం మీద ఉన్న కేసీఆర్ పేరుని తొలగించాలి!

          "అమరావతికే దిక్కు లేదు.ఈ పెద్దమనిషి హైదరాబాదుకు నిధులు తీసుకొస్తాడంట!యాడికెల్లి తెస్తడు?","నా కళ్ళముందే మోదె రెండు మట్టికుందలు ఇచ్చిండు,అయ్యి తీసుకుని ఈయన పళ్ళికిస్తండు!" - ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి సరికొత్త ద్వేషభాష.పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదని పెద్దలు వూరికే అన్నారా?కొన్నాళ్ళ పాటు నాలిముచ్చులా కిక్కురుమనకుండా ఉండి ఉండి ఇక వూరుకుండలేక తన అసలు రూపం ఇట్లా చూపిస్తున్నాడు - సిగ్గు లేకపోతే సరి!

          ఉద్యమ సమయంలో ప్రపంచంలో మాది న్యాయపోరాటం అని చెప్పుకునేవాళ్ళంతా సిగ్గు పడేటట్టు వీధి గూండాలూ ఆకు రౌడీలూ కూడా మాట్లడని బజారు భాష మాట్లాడి అయినా ఏనాడూ ప్రజలు ఉద్యమానికి అనుకూలంగా స్పందించక వరసపెట్టి ధరావతులు పోగొడుతుంటే స్వాభిమానం గలవాడెవ్వడూ చెయ్యనంత దిక్కుమాలిన పద్ధతికి తెగబడి  బల్లకింద చేతులు పెట్టి తెచ్చుకున్నందుకే అల్లాబ్డం బెల్లాండం బద్దలు గొట్టిననతగా విరగబడుతున్నారు.అన్ని గొడవలు చేసి రాష్ట్రం సాధించుకున్నా ప్రపంచంలో అంత సుదీర్ఘ పోరాటం చేసి విజయతీరం చేరిన ఏ ఉద్యమ రధసారధికీ రానంత ఉసూరుమనిపించే బొటాబొటీ మెజారిటీ వస్తే దాన్ని పెంచుకోవటానికి చక్కనైన రాజమార్గము యెటూ దొరక్క సందుగొందులు వెతుకుతూ ఆ పార్టీ ఈ పార్తీ అని లేకుండా గుంపులు గుంపులుగా పక్కలేయ్యటం ఒకటే తక్కువ అన్నంత నీచపు రాజకీయం చెయ్యటమే గొప్ప రాజనీతి అని ఈ సంకర జాతి వంకర బుద్ధుల అధమాధముడూ మరియూ నోరు తెరిస్తే ఉఛ్చనీచాలు లేకుండా రొచ్చుభాష మాట్లాడే ఇంతటి బజారు మనిషిని కూడా వాక్చాతుర్యం గలవాడని కొనియాడుతూ అక్కున జేర్చుకోగలిగిన రెండు నాలుకల విషసర్పాలూ జబ్బలు చరుచుకుంటూన్నారు గానీ వీళ్ళ నిజమైన తెలివి తేటలు ఎవడికి తెలియవు? 

@అమృతమధనం
కాలాన్ని జయించిన దైవాంశ సంభూతుడు
31, మే 2015, ఆదివారం
బాబు అదృష్టజాతకుడు కాకుంటే మరేంటి. దేవుడిచ్చిన సంతానాన్ని వద్దని ఎలా అడ్డుకుంటాం, ఏ సంఖ్యలో ఏ మహాత్ముడు పుడతాడో అని ఎన్టీఆర్ నమ్మడమే కాకుండా డజను మంది పిల్లలకు తండ్రయ్యారు. కానీ ఆ డజను మంది పిల్లలుండి అల్లుడు వారసుడైన రాజు కథ చరిత్రలో ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే బాబు అదృష్టజాతకుడు కాబట్టి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపికి, ఎన్టీఆర్ అభిష్టానికి వ్యతిరేకంగా అల్లుడు రెండో తరం వారసుడు. ఆ అల్లుడు అచ్చం రాజరికంలో యువరాజును జాతి జనులకు పరిచయం చేసినట్టు తన యువరాజ పట్ట్భాషేకం మహానాడులో జరిపించారు. అంతేనా తన మామ ఉదంతాన్ని చూసిన అల్లుడు తన కుమారుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కుమారుడి వారసుడ్ని కూడా పనిలో పనిగా మహానాడులో దేశ ప్రజలకు పరిచయం చేశాడు. నాలుగవ తరం యువరాజు దైవాంశ సంభూతుడు అని నమ్మడమే కాకుండా అదే పేరు పెట్టారు. దైవాంశ సంభూతుడు మాత్రమే రాజవుతాడు. జాతకంలో కాదు ఏకంగా పేరులోనే దైవాంశ ఉందంటే బాబుగారి విజన్‌కు తిరుగలేదని ఒప్పుకుంటావా? సినిమాలో యువరాణి వెంట చెలికత్తెలు, యువరాజు వెంటన అంజిగాడు లాంటి కామెడీ బృందం ఉన్నట్టు అచ్చం తెలుగు యువరాజుల వెంట ఎమ్మెల్యేల సంతాన బృందం తిరుగుతుంటే నాకైతే సినిమాల్లోని రాజరికాన్ని కనులారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్టుంది.


@అమృతమధనం
20, జనవరి 2016, బుధవారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ఎలా అయినా ఉండవచ్చు, ఎన్నికలు జరగకముందే ఒక కీలకమైన విషయంలో మాత్రం ఈ ఎన్నికలు స్పష్టత నిచ్చాయి. కెసిఆర్ రాజకీయ వారసుడు ఎవరు? అనే ప్రశ్న ఉదయించక ముందే కెసిఆర్ వారసుడు కెటిఆర్ అని తేల్చేశాయి.తాను పదేళ్లు పాలించడమే కాకుండా తన వారసునిగా కెటిఆర్‌ను తీర్చిదిద్దడానికి పూనుకుని కెటిఆర్‌కు తొలి అసైన్‌మెంట్‌గా గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలు అప్పగించారు. బలం లేకపోవడం వల్లనే గత ఎన్నికల్లో అసలు పోటీ చేయని గ్రేటర్‌లో కెటిఆర్ నాయకత్వంలో విజయం సాధిస్తే, వారసత్వానికి ప్రజల నుంచి కూడా ఆమోదం లభిస్తుందనే వ్యూహంతోనే గ్రేటర్ బాధ్యతలు కెటిఆర్‌కు అప్పగించి ఉండవచ్చు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపినే మూడవ తరం వారసుడిని సిద్ధం చేసుకుంటోంది. ప్రాంతీయ పార్టీలకు ఔనన్నా కాదన్నా కుటుంబ సభ్యులే వారసులవుతారు.ఎన్టీఆర్ తన వారుసుడిని తాను నిర్ణయించలేకపోయారు. చాలా కాలం క్రితం బాలకృష్ణ తన వారసుడు ఎన్టీఆర్  అని ప్రకటిస్తే, ఆ ప్రకటన ఉపసంహరించుకునే విధంగా చంద్రబాబు ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు.టిడిపికి ఎన్టీఆర్ కోరుకున్నట్టుగా కుమారుడు వారసుడు కాలేదు. బలవంతంగా అల్లుడు వారసుడయ్యారు. బాబు మాత్రం పగడ్బందీగా తన కుమారుడిని వారసుడిగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ తన  అల్లుడి రాజకీయాన్ని అర్ధం చేసుకోలేదు, కుమారులకు రాజకీయ పరిజ్ఞానం లేదు. దాంతో ఎన్టీఆర్ కోరుకున్న విధంగా టిడిపికి వారసుడు రాలేదు.కానీ కెసిఆర్ విషయం అలా కాదు. రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఈ కాలానికి తగిన నాయకుడి లక్షణాలున్న తెలివైన కుమారుడు ఉన్నారు. సహజంగా ఎవరైనా తన వారసత్వం తన కుమారుడికే దక్కాలని కోరుకుంటారు. కుమారులకు తెలివితేటలు లేకపోతేనే వారసత్వం దక్కకుండా పోతుంది. కెసిఆర్ సైతం అంతే. 

@హరికాలం
ఈనాటి బూటకపు ప్రజాస్వామ్యాన్నీ ఆనాటి నీతిగల రాజస్వామ్యాన్నీ ఒక్కచోట చేర్చి అసమానతలకు పరిష్కారంగా క్షీరసాగర మధనం జరిపించడానికి ప్రాంతీయవాదాన్ని మంధరగిరిని చేసి అధికార ప్రాప్తిని వాసుకిగా మలచి సుస్థిరత్వం అనే శ్రీకూర్మం పైకి కనబడకుండా చేస్తున సహాయంతో విద్వేషానల హాలాహలం చల్లబడిన తర్వాత పైకి తేల్చిన అమృతరసగుళీకలా ఇవి!


          బుడ్డా మురళి గారు వయస్సులోనూ చదువులోనూ అనుభవంలోనూ ఎన్నదగిన వాడే.నేను ఇదివరకు చాలాచోట్ల చెప్పినట్టు వ్యక్తిగత జీవితంలో నిష్కళంకమైన వ్యక్తియే కావచ్చు.ఈ హరిబాబు అనే బ్లాగరు నిజజీవితంలో అనైతిక శృంగార పిపాసి కావచ్చు!కానీ బ్లాగులలో ఎవరు ఎలా ఉంటారో తెలియని పరిస్థితిలో ఎవరయినా ఈ ఇద్దర్నీ ఎలా అంచనా వేస్తారు?తమ బ్లాగుల్లో రాస్తున్న పోష్టుల్ని బట్టీ ఇతర బ్లాగుల్లో వేసేఅ కామెంట్లని బట్టే కదా! బుడ్డా మురళి గారు పాత పోష్టులో చంద్రబాబు చేసిన పనిని రాజరికంతో పోల్చి ఎన్నో వ్యంగ్యాల్ని కురిపించి కొత్త పోష్టులో చంద్రశేఖర రావు అదే పని చేస్తే 360 డిగ్రీలు తిరిగేసి అది సహజమే అంటున్నారు - ఎంత రాజకీయం ముదిరినా బుద్ధికీవులు ఇంత అడ్డగోలుగా మాటలు మార్చవచ్చునా!నిన్నటి రోజున బహుశా రేపెప్పుడయినా మనవాడూ ఇదే పని చేస్తాడేమో ఎందుకొచ్చిన గోల పొరుగురాష్ట్రపు ముఖ్యమంత్రిని గురించి అవాకులూ చెవాకులూ వాగడం అని కూడా అనిపించనంతగా ఆయనలోని ద్వేషం కంటికి పొరలని కమ్మించింది కాబోలు?!ఒకే ఒక సమర్ధన!చంద్రబాబు మా ప్రాంతాన్ని భ్రష్టు పట్టించాడు కాబట్టి అతను ఏం చేసినా వెక్కిరిస్తామే తప్ప పొగడం, చంద్రశేఖర రావు మా ప్రాంతాన్ని ఉద్ధరిస్తాడని నముతున్నాం గాబట్టి అతన్ని కీర్తిస్తామే తప్ప లోపాలు ఉన్నా సహిస్తాం - అంతేనా?దీనికొక లేబుల్ పెట్టారు ప్రాంతీయాభిమానం అని,కానీ వాస్తవంగా ఇది పని చేస్తున్నదా!


Telangana Assange
Tuesday, 12 January 2016
ప్ర‌స్తుతం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లను చూస్తుంటే అప్ప‌ట్లో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అన్న మాట నిజ‌మేనేమో అన్న రీతిలో టీఆర్ఎస్ స‌హా అన్ని రాజ‌కీయ పార్టీల ప్ర‌చారం సాగుతోంది. హైద‌రాబాద్ అంతా మేమే(ఆంధ్రా సెటిల‌ర్లు) ఉన్నామ‌ని ల‌గ‌డ‌పాటి, ఇత‌ర ఆంధ్రా నేత‌లు అన్నారు.. ఆ స‌మ‌యంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎంత స‌ర్వే చేసినా 5 ల‌క్ష‌ల మందికి మించి లేర‌ని వాదించారు. మ‌రి హైద‌రాబాద్ లో కోటి మంది ఉంటే అందులో ఉన్న 5 ల‌క్ష‌ల మందిని ఊర‌డించ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్‌, ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారం చేయ‌డం ఏంటి? ఈ త‌ర‌హా ప్ర‌చారం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌నికి వ‌స్తుందేమో కానీ.. రానున్న రోజుల్లో యావ‌త్తు తెలంగాణ స‌మాజం ముందు మ‌ళ్లా మీరు ఏ మాట‌లు చెప్పి ప్ర‌చారానికి వెళ్తారో ఆలోచించుకోవాలి... సెటిల‌ర్ల‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి కూడా సిద్ధంగా ఉన్నామ‌నే రాజ‌కీయ నేత‌ల్లారా... ఏ త‌ప్పు చేశామ‌ని క్ష‌మాప‌ణ‌లు కోర‌దాం అనుకుంటున్నారు... తెలంగాణ స‌మాజాన్ని అను నిత్యం అవ‌మానించిన పెద్ద మ‌నుషులు క‌నీసం తాము త‌ప్పుగా మాట్లాడామ‌ని ఇప్ప‌టికీ అంగీక‌రించ‌డం లేదు.. అలాంటిది ఏ త‌ప్పూ చేయ‌ని మీరు మ‌నం అంతా గ‌తంలో త‌ప్పులు చేసిన‌ట్లుగా ఇప్పుడు మాట్లాడ‌టం అంటే అది తెలంగాణ స‌మాజాన్ని అవ‌మానించ‌డ‌మే

@హరికాలం
ఇప్పుడు కూడా మీకు అర్ధం కావడం లేదా మీరు గొప్పగా చెప్పుకుంటున్న ప్రాంతీయ వాదం ఎంత బూటకమో!మా ఉద్యోగాలు దోచుకున్నారు అని గిర్గ్లానీ రిపోర్టు చూడమన్నారు మీవారే ఒకరు.చూస్తే "అన్యాయం ఒక్క తెలంగాణా ప్రాంతం వారికే కాదు అన్ని ప్రాంతాల వారికీ జరిగింది" అన్నాడు గిర్గ్లానీ గారు.మీ వాదననీ మీరు సపోర్టుగా తెచ్చుకున్న గిర్గ్లానీ గారి మాటనీ కలిపి చూస్తే తెలంగాణా వారికి ఉద్యోగాల్లో జరిగిన అన్యాయానికి ఆంధ్ర ప్రానతం వారు కారణమైతే మరి ఆంధ్ర ప్రాంతం వారికి జరిగిన అన్యాయానికి తెలంగాణా ప్రాంతం వారు కారణం అయినట్టు కాదా,చెప్పండి!

మా నీళ్ళు దోచుకున్నారు అని విడిపోయారు.ఎక్కువ నీటి కోసం ఇదివర్లో నాలుగ్ రాష్ట్రాల మధ్య అజరిగిన ఒప్పందాల్ని మార్చమంటున్నారు.అది నిజంగా సాధ్యపడుతుందనే అనుకుంటున్నారా మీరు?ఇదివరలో నాలుగు రాష్ట్రాలుగా భాగాలు పంచుకున్న నీటిని తెలంగాణా వాటా పెర్గడాని కనుకూలంగా అయిదు రాష్ట్రాల మధ్య పంచాలంటే ఆంధ్రా మా నీళ్ళూ దోచుకున్నారు అంటున్నందు వల్ల కిక్కురు మనకుండా వూరుకున్నా మిగతా మూడు రాష్ట్రాలూ తమ వాటా తగ్గించుకుంటాయా?వేరే రాష్ట్రంగా విడిపోయాక ఆంధ్రా మాత్రం వూరుకుంటూందా?అన్ని చోట్లా ప్రతిపక్షాలు ఉన్నాయి,ఏ  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వూరుకుంటుంది?అందుకే కదా సమైక్య రాష్ట్రానికి దఖలు పడిన నీటినే ఈ రెండు తెలుగు రాష్ట్రాలూ పంచుకోవాల్సిందే తప్ప పాత ఒప్పందాన్ని తిరగదోడటం కుదరదంటున్నారు.

ప్రాణహిత చెవెళ్ళ యేనా?ప్రాజెక్టుని సాక్షాత్తూ ముఖ్యమంత్రియే రంగం లోకి దిగి డిజైను మార్చి చివరి ముక్కని కత్తిరించారు,ఎందుకని?అరిచి గింజుకున్నా ఐంతకు మించి నీళ్ళు రావని కాదా!

మీరు ఇదే బ్లాగులో సాక్షాత్తూ తెలంగాణ ప్రబ్బుత్వమే తెలంగాణ కాంట్రాక్టర్ల క్వాలిటీ బాగోలేదని ఇంకా ఆంధ్రా కాంట్రాక్తర్లకే అన్నీ కట్టబెడుతున్నది,మనవాళ్లని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది,లేకపోతే తెలంగాణా కాంట్రాక్తర్లు సబ్ కాంట్రాక్టర్లుగా మిగిలిపోతారేమో అని అనుమానం వ్యక్తం చేశారు!ఎంత కాలమైంది మీకా అనుమానం వొచ్చి?పరిస్థితి ఏమన్నా మారిందా,తెలుసుకోండి!

Tuesday, 28 April 2015
మ‌న కాంట్రాక్ట‌ర్ల‌నూ ప్రోత్స‌హించండి...! స‌బ్ కాంట్రాక్టర్లుగా మ‌న‌వాళ్ల‌ను మార్చొద్దు..!!

ఆంధ్రా నేత‌ల‌తో సంబంధం ఉన్న కంపెనీల‌కు తెలంగాణ కాంట్రాక్టులు ఇవ్వొద్దు..
Wednesday, 10 June 2015

Tuesday, 12 January 2016

హైద‌రాబాద్ నిండా సెటిల‌ర్ల ఓట్లే ఉన్నాయా?

మరి అరవయ్యేళ్ళ పాటు అంగలార్చి వీళ్ళు సాధించింది ఏమిటి?వీళ్ళ సొల్లుకబుర్లలోని డొల్లతనం ఇప్పటికీ తెలియడం లేదు గానీ ఎప్పటికయినా వీళ్ళకి తెలుస్తుందా?


          తెలంగాణ అసాంజి అని నిష్పక్షపాతంగా వాస్తవాల్ని బయటపెట్టిన ప్రముఖుడి పేరుతో ఉన్న ఈయనకి చంద్రబాబు అంటే ఎంత ద్వేషమో చూడండి!ఆయన బ్లాగులో పైన ప్రముఖంగా ఒక ఒపీనియన్ పోల్ ఉంటుంది "చంద్రబాబుని అరెస్టు చేయాలా?" అనే అంశం మీద!ఓటుకు నోటు కేసుకు ఈయనగారి బుర్ర అతుక్కుపోయి చంద్రబాబుని అరెస్టు చేస్తే చూడాలనీ పరారీలో చంద్రబాబు అనై వారత్ వస్తే చూడాలనీ తపించిపోతున్న మూర్ఖ ద్వేషంలో ఈయన ఉన్నాడు గానీ టెలిఫోను ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టయితే చూడాలని తపించిపోతూ ఏ ఆంధ్రా బ్లాగరయినా ఉన్నాడా?

          ఒక ప్రాంతం వాళ్ళు మమ్మల్ని దోచుకున్నారు గాబట్టి మేము వెనకబడిపోయాము,వాళ్ళని మా ప్రాంతం నుంచి తన్ని తరిమేసి మా ప్రాంతం ప్రత్యేక రాష్త్రంగా విడిపోయి మా ప్రాంతం వాళ్ళు పరిపాలిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది,వాళ్ళలా కాకుండా మేము స్వచ్చమైన రాజకీయాల్ని సాధిస్తాం,వాళ్ళలా కాకుండా మేము న్యాయంగా ఉంటాము అని బల్ల గుద్ది వాదించిన వీరాధివీరులు ఇవ్వాళ అదే రకం కుటుంబ పాలన,అదే రకం కులగజ్జి రాజకీయం,అవే రకం వలసల బలుపుతో కప్పలతక్కెడ లాంటి చిక్కురొక్కురు దరిద్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నా కిక్కురుమనకుండా ఎందుకు పడి ఉంటున్నారు,నిలదీసి అడగాల్సిన వాళ్లని అదేమని అడక్కపోగా సమర్ధించుకుంటున్నారు?ఎవరో మమ్మల్ని ద్వేషించారు,అందువల్ల మాకు బాద కలిగింది అన్నవాళ్ళు ఇంకా ద్వేషాన్ని వదలకుండా ఇంత మొండిగా ఆంధ్ర ప్రాంతపు రాజకీయ నాయకుల మీద ఎందుకు విషం కక్కుతున్నారు?

          వీళ్ళ సొంపుకీ వీళ్ళ సోయకీ వీళ్ల నాయకుడి దొంగ నిరాహార దీక్షలకీ ఏమిటి ఆంధ్రోళ్ళ దోపిడీ ఎక్కడ జరిగింది చెప్పండి అని నిలదీస్తే జవాబు చెప్పలేని దేబెతనాన్ని కప్పి పుచ్చుకోవటానికి ఆర్టికిల్ మూడు ద్వారానే కావాలి అన్నా అక్కడ కూడా అత్తెసరు మేజార్టీ ఉన్న దిక్కుమాలిన కాంగ్రెసు చేసిన ఇంకొన్ని బేవార్సు పనులతో తెచ్చుకుని ప్రజల్లో వూపు లేక వలసలకి లాకులెత్తి రాష్ట్ర పునర్నిర్మాణానికి మళ్ళీ ఆంధ్రోళ్లనే బతిమిలాడుకుంటున్న ఫెయిలైపోయిన ఉద్యమాన్ని చూసుకుని వీళ్ళు గర్విస్తూ నన్ను తెలంగాణా ద్వేషిని అని స్టాంపు కొడితే కొట్టారు గానీ మేము తెలంగాణా వాళ్ళం ఇదీ మా సంస్కృతి అని గొప్పగా చెప్పుకుని గర్వపడేలా వీళ్ళ ఉద్యమం గానీ వీళ్ళ ప్రవర్తన గానీ ఉందా?ఈ మేతావులూ ఈ మేతావులు గాలికొడుతున్న కేతిగాడూ నిజమైన తెలంగాణ సంస్కృతికి ప్రతినిధులా?వీళ్ళలో ఉన్నదే నిజమైన తెలంగాణా సంస్క్రి అయితే నిజంగా తెలంగాణ తల్లి సిగ్గు పడాల్సిందే!

          ఇంతకీ వీళ్లని కాదు అనాల్సింది,వీళ్ళ అబద్ధాల్ని బట్టబయలు చెయ్యలేని ఆంధ్రా రాజకీయ నాకకుల్ని.ముఖ్యంగా సిగ్గూ సరం లేని చంద్రబాబుని!మొదటి నుంచీ ఈ ప్రబుద్ధుడు నందమూరి తారక రామారావు లాగ స్వాభిమానం ఆభిజాత్యం అనే రెండు రెక్కలు దాల్చి ఎగిరే వైనతేయుడిలా కాక వెన్నుపోటు రాజకీయాలతో పైకొచ్చినవాడు గనక తన బుద్ధి ప్రకారమే నడుచుకుంటున్నాడు.ఎంత క్షాత్రం లేనివాడు కాకపోతే ఉద్యమ కాలంలో ఆంధ్రావాళ్ళని అన్ని తిట్టినా,రాష్ట్రం విడిపోయాక కూడా రోజుకొకసారి తనమీద విషం కక్కుతూ కేసు పెట్టి "ఇక చంద్రబాబుని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు!" అని హుంకరించిన వాణ్ణి ఇంటికెళ్ళీ బొట్టూ కాటూక పెట్టి మరీ పిలుస్తాడు?

        చీ!ఛీ!ఇంత పౌరుషం లేనివాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అనవసరం.మన ప్రాంతం వాళ్ళ శ్రమతో ఉమ్మడి రాష్ట్రపు ఆదాయంలో 45% ఒక నగరం నుంచే వచ్చేలా చేసి దాన్ని విశ్వనగరంలా నిలబెట్టి విడిపోయే నాటికి వాళ్ళని నిలవలో ఉంచి మనం లోటుబడ్జెట్ తెచ్చుకుని మన కష్టమనతా వాళ్ళ యదాన గొట్టి కట్టుబట్టలతో తరిగొచ్చాక కనీసం మానుషమన్నా నిలబడకపోతే జాతికి బతుకు దేనికి?మర్యాద మంటగలిసిపోయాక అభివృధ్ధిని ఏం చేసుకుంటాం?రోటీ,కపడా ఔర్ మకాన్ తర్వాత ముఖ్యంగా ఉండాల్సిన ఇజ్జ్జత్ పోయింది - దీనమ్మా అతి మంచితనం,ఇంకెన్నాళ్ళు! 

          ఎందుకంత గజ గజ లాడి చస్తాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే?ఏం,తలగొట్టి మొలేస్తాడా!మాటి మాటికీ విభజన సమస్యల్ని పరిష్కరించుకుందాం రా అని ఇతను పిలవడం దేనికి?అన్ని సార్లు పిల్చాడు,ఒక్కసారైనా జవాబు చెప్పాడా,లేదు - కనీసపు స్పందన కూడా లేదు!తనకి అవసరం ఉంటే ఉరుక్కుంటూ రాడా!ప్రతి విషయం లోనూ వయస్సులో అంబుభవంలో సమర్ధతలో - అన్నింటా అధికుదై ఉండి కూడా తనకన్న అల్పుడి ముందు ఎందుకీ సాగోఅరటం,చీ చీ!మర్యాదకీ మంచితనానికీ కూడా హద్దూ పద్దూ ఉండాలి,కుదరదు - వెంఠనే అమరావతి శంకుస్థాపన శిలాఫలకం మీద ఉన్న ఈ అధముడి పేరుని తొలగించి పారెయ్యాలి.ఇప్పుడున్న శిలాఫలకం మీద మార్పులు చెయ్యటం కుదరకపోతే ఆ పెరు లేకుండా కొత్తది చేయించి తీరాల్సిందే!


మరీ ఇంత మానుషం లేనివాడు పౌరుషానికి మారుపేరయిన ఆంధ్రులకి ముఖ్యమంత్రిగా పనికిరాడు!

22 comments:

 1. ఎందుకంత గజ గజ లాడి చస్తాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే?
  Endukantae vote ki note case kabatti..
  idi telisi kuda meeru intha ayyasapadatam emi bagoledhu..

  ReplyDelete
  Replies
  1. I don't think that case is so strong:-)Even babu also found a way to counter with telephone taping,If first case is strong counter case also is strong.

   That too before that case also babu has pleaded kcr to cooperate with him.From the begening he is requesting kcr to come and sit with him without any response from kcr.I mentioned every thing with knowing full details.

   Delete
  2. చంద్రబాబు కెసిఆర్ గార్లను ప్రస్తుతానికి వదిలేద్దాం. ఊమెన్ చాందీ గారిని అరెస్ట్ చేయాలా వద్దా ఏమంటారు?

   Delete
 2. GHMC elections సందర్భంగా చంద్రబాబూ, హైదరాబాద్ లో మీకేం పని అని వీరి లేటెస్ట్ విసురు. మరి ఆంధ్ర రాజధాని శంకుస్ధాపన ఫలకం మీద ఈయన పేరుతో ఏం పని? పేరు తీసెయ్యాల్సిందే.

  తెలుగుదేశం ఓ పార్టీ. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికే ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాలు ఒక రాష్ట్రానికే పరిమితమవ్వాలనేమీ లేదుగా. అలాగే టీడీపీ కూడా తెలంగాణాలో తన ప్రయత్నం తను చేసుకుంటోంది. ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన పనేలేదు.

  ReplyDelete
  Replies
  1. నిన్నటిదాకా టీ ఆర్ ఎస్ కి ఓటు వేద్దామా వద్దా అన్న డైలమాలో ఉన్న మాలాంటి ఆంధ్రావాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. నేను తె రా స కి ఓటు వేయదలుచుకోలేదు. ఒకవైపు హైదరాబాద్ లో ఎవరైనా ఉండవచ్చు అంటూనే చంద్రబాబుకి ఏం పని అని అనడంలో అర్ధం ఏమిటి ? రాజకీయాల్లో ఏమైనా మాట్లాడతాం అంటూనే ఎదుటి పార్టీ మాట్లాడితే సహించలేకపోవడం, తెరాస ఆంధ్రా లో అడుగుపెట్టలేదు కాబట్టి చంద్రబాబుని ఇక్కడ ఉండవద్దని అనడం నాకు నచ్చలేదు.

   Delete
  2. As reported by Namasthe Telangana:

   చంద్రబాబుకు ఇక్కడేం పని?
   అసలు చంద్రబాబు ఇక్కడికి రావటమే అసంబద్ధం. ఆయనకు ఇక్కడేం పని? ఊడ్చుకోవడానికి ఆయనకు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఉంది. తిరుపతి, గుంటూరు, వైజాగ్ ఇలా అనేక పట్టణాలున్నయి. అవన్నీ డెవలప్ అయిపోయినయి.. ఇగ చేసేదేంలేదని ఇక్కడికి వస్తున్నడా? అవన్నీ వదిలేసి హైదరాబాద్ రోడ్లు ఊడుస్తుమంటే ఎవరు నమ్ముతరు? 17 సంవత్సరాల సుదీర్ఘ టీడీపీ పాలనలో ఆయన మామ, ఆయనే ఉన్నారు. హైదరాబాద్‌కు చేసిందేం లేదు. ఎవరూ నమ్మే పరిస్థితిల లేరు. ఫలితం కూడా అదే విధంగా ఉండబోతుంది.

   Delete
  3. మోడీ కి తెలంగాణాలో ఏం పని ఉందని రాలేదని బాధపడుతున్నారు ? కే టీ ఆర్ ప్రతి మీటింగ్ లోనూ మోడీ రావడం లేదు అని మొత్తుకుంటూనే ఉన్నారు. మోడీ లాగానే చంద్రబాబు జాతీయ నాయకుడు. ఆయన ఎక్కడికైనా వెళతారు. తెలంగాణాలో ఏం పని అని ఎలా అడుగుతారు ? ప్రపంచపటంలో ఆంధ్రప్రదేశ్ పేరు నిలపడానికి ఆయన శ్రమిస్తున్నారు.

   Delete
 3. @ jai,

  అబ్బా ఛా...టాపిక్ డైవర్ట్ చేస్తే హరిబాబు ఊరుకుంటారేమో కానీ నేను ఊరుకుంటానా ? మీ తెలంగాణా వాళ్ళతో ఇదే ఇబ్బంది, అన్నీ సగం సగం పనులే చేస్తారు.

  ReplyDelete
  Replies
  1. మీరు భలే వారండీ. తాజా వేడి వార్తగా ఊమెన్ చాందీ నిర్వాకం కళ్ళెదురుగా కనిపిస్తుంటే ఇంకా పాత చింతకాయలు ఏరుకోవడం ఎందుకు? వోటుకు నోటు వ్యవహారం జీహెచ్యెమ్సీ ఎన్నికల తరువాత పుంజుకుంటుందని భోగట్టా: అప్పుడు ఆ తమాషా మళ్ళీ ఎంజాయ్ చెయ్యవచ్చు. ప్రస్తుతానికి చాందీ ముచ్చట్లతో సరిపెట్టుకుందాం :)

   Delete
  2. మీరు ఓటుకు నోటు విషయం ఉమెన్ చాందీ విషయం తో పోల్చి ఎత్తారని నాకు అర్ధం అయింది. ఓటుకు నోటు విషయం ఎత్తి చంద్రబాబుని అరెష్టు చేయించకుండా ఎందుకు వదిలేసారని అడుగుతున్నా... సగం సగం పనులే ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నా...రాజకీయ అవినీతిని సహించను అని అంటూనే నేరస్థుడు దొరికినా ఎందుకు వదిలేసారు ? నేరస్థుడు దొరికినా వదిలేస్తే అర్ధం ఏమిటి ? విశాలహృదయమా ? తన తప్పులు ఎక్కడ బయటపెడతారో అన్న భయమా ?

   Delete
 4. @ హరిబాబు,
  శిలా ఫలకం మీద కేసీ ఆర్ గారి పేరు ఉందా ? ఉంటే ఏమని ఉంది? శంకుస్థాపనకు వచ్చినవాళ్ళ లిస్ట్ లో ఉందా ? తెలుపగలరు.
  ఇంకో ప్రశ్న :
  అమరావతికి విరాళం ఇద్దామనుకున్నాను కానీ మోడీ మట్టి నీళ్ళు తెచ్చాడు కాబట్టి ఇవ్వలేదు అని కే సీ ఆర్ గారు అన్నారు. మనం ఎవరికైనా విరాళం ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేస్తాం కానీ హరిబాబు ఇస్తున్నారా లేదా అని ఆగి చూసుకుని విరాళం ఇవ్వాలా ? నాకు తెలియక అడుగుతున్నాను చెప్పండి.

  ReplyDelete
  Replies
  1. neehaarika
   శిలా ఫలకం మీద కేసీ ఆర్ గారి పేరు ఉందా ?

   haribabu
   నేను కార్యక్రమానికి వెళ్ళలేదు.కాబ్టి ప్రత్యక్షంగా చూడలేదు.పత్రికల్లో ఫొటో వెయ్యలేదు.కానీ అతని పేరు ఉందని అంటునరు.మొత్తం 13 మంది రాష్త్రపతి దగ్గిర్నుంచి ఆహూతుల పేర్లు ఉన్నాయని వార్తగా చదివాను - అంతే...ఆహూతులలో ఇతనూ ఉన్నాడు గాబట్టి సహజంగానే ఎక్కి ఉంటుంది.

   neehaarika
   మనం ఎవరికైనా విరాళం ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేస్తాం కానీ...

   haribabu
   నేను కూడా ఇవ్వాలనిపిస్తే ఇవ్వడమే తప్ప వాళ్ళు ఏమిచ్చారు వీళ్ళు ఏమిచ్చారు మనం అంతకన్నా గొప్పగా ఇద్దామనుకుని ఇవ్వను.నేను చేసే మరో చిన్న టెక్నికల్ థింగ్ ఏంటంటే బిచ్చగాళ్లకి వెయ్యడానికి జేబులో చెయ్య్యి పేట్టి తీస్తే చేతికి ఏ నాణెం వస్తే అది వేసెయ్యడమే 5రు అయినా 10రు అయినా - ఇవ్వదల్చుకుంటే మనస్పూర్తిగా ఇచ్చెయ్యడమే తప్ప వెతికి వెతికి అతి చిన్న నాణెం వేసి హమ్మయ్య దానం చెయ్యదమూ చేశాం పొదుపు కూడా చేశాం అనుకోవడం నాకు నచ్చదు!

   Delete
  2. https://www.google.co.in/imgres?imgurl=http://i0.wp.com/apnewscorner.com/wp-content/uploads/2015/10/Amaravati-Foundation-Stone-Laying-Ceremony-Pics-9.jpg%253Fresize%253D620%25252C377&imgrefurl=http://apnewscorner.com/amaravati-foundation-stone-laying-ceremony-pics/&h=377&w=620&tbnid=Yk7t4uruLEdIBM:&docid=Xm-KRroTu6LUmM&ei=NkWrVuOsEMObuQSuoIeICg&tbm=isch&ved=0ahUKEwjjn92G7s7KAhXDTY4KHS7QAaEQMwgjKAcwBw

   http://www.thehindu.com/news/national/andhra-pradesh/live-amaravati-new-capital-of-andhra-pradesh-foundation-ceremony/article7792142.ece

   Delete
  3. మీరిలాంటి సాంకేతీక సమాచార సేకరణలో చాలా ఎక్స్పర్ట్!
   ఇంటిపేరు పేష్టుముక్కల అని మారిస్తే బాగా సూటయ్యేటట్టుంది:-)

   Delete
  4. మీ అభిమానానికి థాంక్స్. అదేమిటోనండి నాకు ముందటి నుండి పరిశోధించి వాస్తవాలు తెలుసుకోవాలని తాపత్రయం కాస్త ఎక్కువే :)

   Delete
  5. హ హ గొట్టిముక్కల సమాచారం. అవునవును దొంగమాటలు అబద్ధాలు పెచారానికి ఏదన్నా అవార్డు ఉంటె దానికి ఈ పెద్దమనిషి కన్నా అర్హుడు ఈయన తరవాతే ఎవరైనా.

   ఇంతకీ అమరావతిలో మోడీ కన్నా ముందు మాట్లాడింది కెసిఆర్. మోడీ మాట్లాడేవరకూ కూడా అయన ఏమి తెచ్చాడో / ఏమి ఇస్తున్నాడో ఎవరికీ తెలియదు. కెసిఆర్ కు మాత్రం ఇదుగో ఈ గొట్టిముక్కల లాంటి వాళ్ళ సహకారం ఉండబట్టేమో మరి ముందే తెలిసిపోయి ఏమీ ఇవ్వకుండా ఉత్తమాటలు చెప్పి చేతులు ఊపుకుంటూ పోయాడు. దొంగమాటలు దొంగకతలు యాథా దొర తదా ఈ చెంచా.

   Delete
  6. అమరావతిలో మోడీ కన్నా ముందు మాట్లాడింది కెసిఆర్.

   yes,True.

   Delete
 5. It appears to me that nc, kcr are hand and glove with sg to get the spoils from the division of ap!

  ReplyDelete
 6. ఫలకం మీద KCR పేరున్నది అన్నమాట వాస్తవమే. ఫలకం మీద క్రిందిభాగంలో Distinguished Guests అని వ్రాసిన లిస్ట్ లో ఉంది KCR పేరు.

  ReplyDelete
 7. telugu valla paruvu potondi

  ReplyDelete
 8. I think there is nothing wrong in listing KCR's name in foundation stone for new capital.

  We should always remember people who thinks about our development. Nobody can deny KCR's fight and role in helping AP to get a new capital.

  In other words, foundation stone will remain forever in history for future generations of both AP and TG people as a testimony to role of KCR in AP division and how Andhra responded after division.

  It is in a way a fitting reply to KCR that even he will feel ashamed for the means that he used to achieve the end goal.

  Navyandhra Bhagya Vidhatha KCR

  ReplyDelete
  Replies
  1. can we forgive this also!

   నాకు అధికారం మీకు రాష్ట్రం వచ్చేవరకు వాళ్ళను తిడుతూనే ఉందాం. అధికారం రాష్ట్రం రెండూ వచ్చాయి. వాళ్ళు ఇప్పుడు మనవాళ్ళే లేకపోతే పెట్టుబడులెవరు పెడతార్రాభై.. సమజైందా ..ఉత్తరాదివాల్లను నమ్మకండి. మన పక్క రాష్ట్రం వాళ్ళే బెటరు. ఉమ్మేసినా తుడుచుకొని పోతారు మొన్న అమరావతి శంకు స్థాపన రోజు చూల్లేదా నాకు బానర్లు, నన్ను చూడంగానే విజిల్లు. కాకపోతే వాళ్ళను చూస్తే కాస్త జాలేస్తుంది ఎందుకంటే వాళ్ళిప్పుడు గుండు కింద నుండి బండ కింద పడ్డరు.

   You are proving his words "మన పక్క రాష్ట్రం వాళ్ళే బెటరు. ఉమ్మేసినా తుడుచుకొని పోతారు ",why this softness?

   Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు