Monday, 12 June 2017

ప్రపంచంలో ఉన్న పశుపక్ష్యాదులు మనిషికి ఆహారం కావడం కోసమే పుట్టాయా?

          కేంఫ్ర ప్రభుత్వం పశువధ నియంత్రణ గురించి కొంచెం చొరవ చూపించగానే కంచె ఐలయ్య లాంటి వాళ్ళకి ప్రోటీన్ల కోసం మాంసాహారమే తినాలనే తలతిక్క వాదనలు చెయ్యడానికీ, మాంసం తింటున్నందువల్లనే పాకిస్తానీయులకి భారతీయుల కన్న ఐక్యు ఎక్కువగా ఉందనే నిరూపణ కాని పాక్షిక సత్యాలతో వదరుబోతుతనాన్ని ప్రదర్శించడానికీ, మీసాల సుహాసిని గారి ఆంధ్రచీకటి పత్రికలో "ఆవు ప్రారంభించిన అంతర్యుద్ధం" అని తింగరి వ్యాసాలు రాసి పాప్యులారిటీ తెచ్చుకోవడానికీ మంచి అవకాశం దొరికింది!కానీ, పదో తరగతి సైన్సు పాఠం గుర్తున్నా ప్రోటీన్లు మాంసాహారంలో కన్నా పప్పు ధాన్యాలలోనే ఎక్కువ ఉంటాయని తెలుస్తుంది.ప్రోటీన్ అనే ఇంగ్లీషు మాటకి పర్యాయంగా భారతీయ భాషల్లో వాడుతున్న మాంసకృత్తులు అన్న పదంలో మాంసం ఉంది కాబట్టి అటువైపుకి ఫిరాయించేశారు ఈ సామాజిక శాస్త్రవేత్తలుంగారు.ఏమిటో పాకిస్తానీయుల ఐక్యు వ;ల్ల వారికి వచ్చి పడుతున్న మేధోపరమైన వైభవాలు - దొంగచాటుగా కంచెలు దూకి వచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడమేనా!

          పేరుపొందిన ఆహార శాస్త్రవేత్తలు అందరూ మాంసాహారం కన్న శాఖాహారమే మనిషి ఆరోగ్యానికి ప్రశస్తం అని చెబుతునారు - మాంసాహారాన్ని సమర్ధించేవారు రుచిని బట్టే ఎక్కువ మార్కులు వేస్తున్నారు తప్ప ఆరోగ్యం విషయంలో శాఖాహారాన్ని సమర్ధించేవారిని పొర్వపక్షం చెయ్యలేకపోతున్నారు.అసలు మనిషి దేహమే శాఖాహారానికి అనుగుణంగా ఉంటుంది - మాంసాహార జంతువులలో తప్పనిసరిగా కనిపిస్తున్న కోరపన్ను(Incisor) మనిషిలో లేదు, కుంచించుకుపోయి చిన్న సూది పరిమాణంలో మిగిలి ఉంది.అన్ని జంతువుల లోనూ దంతాల నిర్మాణాన్ని పరిశీలించి వాటి ఆహారపు అలవాట్లని తెలుసుకోవచ్చును.పక్షులలో కూడా మాంసాహరం మీద బతికేవాటికి ముక్కు బలంగా వంగి ఉంటుంది - అక్కడ కూడా మాంసాన్ని చీల్చడానికి పనికివచ్చే ఏర్పాటు అది!ఇంకొక విశేషం యేమిటంటే ఆవుల నుంచి గాడిదల వరకు గడ్డి జాతుల్ని పెరుక్కుని తినడానికి వీలుగా ముందరి నాలుగు(అటు రెండు ఇటు రెండు) దంతాలూ పారల మాదిరి పీకడానికి పట్టును ఇవ్వడానికి వీలుగా ఉంటే చేతుల్తో ఆ పని చెయ్యగలిగిన నరవానర జాతులలో ఆ వెల్పు తగ్గి కొరకడానికి వీలుగా ఉన్నాయి.శాఖాహారులలో సెల్యులోజ్ అనే త్వరగా జీర్ణం కాని పదార్ధాన్ని జీర్ణం చెయ్యడం కోసం సూక్ష్మక్రిములతో నిండిన అపెండిక్స్ క్రియాశెలంగా ఉండి మానవుడు ఆహారాన్ని ఉడకబెట్టి తినడం నేర్చుకున్నాక అవశేషంగా మిగిలిపోయింది.ఈ వండుకుని తినడం నేర్చుకున్న తర్వాతనే మనిషి మాంసాన్ని తినడం మొదలుపెట్టాడు.మనిషి తప్ప ఇతర మాంసాహార జంతువులు అన్నీ పచ్చి మాంసాన్ని పీక్కుని తింటున్నాయి,మసాలాలు కలపనిదే మాంసాహారానికి కూడా రుచి రాదు,ఆ మసాలాలో ఉండే ఘాటు స్లోపాయిజన్ లాంటిది,ఇవ్వాళ అరి భీకరంగా మాంసాహారాన్ని హక్కుగా వాదిస్తున్నవాళ్ళకి రోజూ వడ్డిస్తే సంవత్సరం తర్వాత ఎంతమంది హాస్పటలుకీ వల్లకాటికీ పరిగెత్తకుండా ఉంటారో తెలియదు - ఇది నాకు తెలిసిన సైన్సు!

          శాకాహారం కోసం ఏ ఒక మొక్కని గానీ చెట్టుని గానీ చంపాల్సిన పని లేదు,కానీ మాంసాహారం కోసం మాత్రం ఆ జీవిని దాని ఇష్టంతో సంబంధం లేకుండా దాని బతికే హక్కుని కాలరాస్తూ బలప్రయోగంతో హింసించి చంపాల్సిందే - మరి, బ్రాహ్మణులు దళితుల్ని అణిచివేశారనీ,హిందూదేవుళ్ళ చేతుల్లోని ఆయుధాలు హింసకి గుర్తనీ వాదించి ఆ హింసకి వ్యతిరేకంగా పోరాడుతున్న దళితహక్కుల పోరాటవీరుడికి అణిచివేత కన్న హత్య సాంకేతీకంగా మరింత తీవ్రమయిన నేరం అని తెలియదా?ఆ జంతువులు కూడా మనిషిలాగే ప్రకృతిలో ఒక భాగం!వాటి జాతిని ప్రవృద్ధం చేసుకోవడం కోసమే సంతానాన్ని కంటున్నాయి తప్ప అవి మనిషికి ఆహారం కావడం కోసం పుట్టలేదు, అవునా కాదా?నేనూ మాంసం తింటాను,రుచి కోసం తినడం ఆమోదయోగ్యమే - పరివ్రాజకులైన కంచి పరమాచార్యులు గానీ గరికిపాటి నరసింహారావు గారిలాంటి ప్రవచన కర్తలు గానీ పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించడం తప్పు, ఎవరి ఆహారపు అలవాట్లు వారివి అనే అంటున్నారు.ఇప్పుడు ప్రభుత్వం చేస్తునది కూడా కొత్త ఆర్డినెన్సులు జారీ చేసి కొత్త నిసేధాలు పెట్టడం కాదు - కొన్ని దశాబ్దాల క్రితమే పశువుల్ని విపరీత స్థాయిలో చqంపడం పట్ల ఇచ్చిన ఆదేశిక సూత్రాలనే కొంచెం దుము దులిపి అమలు చేస్తునారు.అవి శాసనాలుగా రూపొందినది కాంగ్రెసు వారి ప్రభుత్వ కాలంలోనే,అమలు చేస్తున్నది బీజేపీ కాబట్టి గొడవ చేస్తున్నారు, అంతే!

          ఒక పౌరుడు తన సౌకర్యం గురించి ఆలోచించడం వరకు సమంజసమే, కానీ అది ఇతరులకి హాని చెయ్యనిది అయితే ప్రభుత్వాని ముకుపిండి అయినా జరిపించుకోవచ్చు - ఏవరూ కాదనరు!కానీ ఆరోగ్యానికి శాకాహారమే మాంసాహారం కన్న మెరుగు అని తెలిసినా శాకాహారాన్ని హిందువులకి ఫిరాయించేసి వాళు చెప్తున్నారు గాబట్టి మేము వ్యతిరేకిస్తాం అనడం సమర్ధనీయమేనా?ఆరోగ్యం దృష్టితో చూసినా మాంసాహారాన్ని తగ్గించమని చెప్పడం మంచిమాటే అయినప్పుడు వ్యతిరేకించడం కోసం వ్యతిరేకించడం దేనికి?చరిత్రలో ఈ దేశపు సరిహద్దులు ఎన్నో రకాలుగా మారినా సాంకేతికంగా చూస్తే 1947 ఆగష్టు 15న మనకి ఒక దేశంగా ప్రపంచం గుర్తించిన ఈ సరిహద్దు లోపల ప్రభుత్వం కేవలం మనుషుల్ని మాత్రమే రక్షించితే సరిపోతుందా?అనేక రకాల జంతుజాతులతో వృక్షజాతులతో నిండిన పర్యావరణాన్ని సమతౌల్యం చెదరకుండా కాపాడవలసిన బాధ్యత లేదా?ప్రజలకి తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు కూడా తెలియక పోవడం వల్ల నిర్లక్ష్యానికి గురై కొన్నీ దురాశకి గురై కొన్నీ నశించిపోయిన జంతుజాతులు ఒప్పటికే ప్రకృతికీ మానవుడికీ మధ్యన ఒక ప్రమాదకరమైన ఖాళీని పెంచుతున్నాయని ఎంతమందికి తెలుసు!

          ఇప్పటికే దేశంలో మాంసాహారపు వినియోగం తారాస్థాయిలో ఉంది.దీనిని తగ్గించకపోతే చూస్తూ ఉండగానే పిచ్చుకల మాదిరి గానే ఆవులు,గేదెలు,మేకల లాంటి జంతువులు కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది.ఇవ్వాళ ఇంత భీకరంగా ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్న వాళ్ళ వెనక బీఫ్ ఎక్పోర్ట్ ఇండస్ట్రీ యొక్క లాబీయింగ్ పనిచేస్తూ ఇండి ఉండవచ్చు!దీనిని హిందూ-ముస్లిం కళ్ళద్దాల వెనకనుంచి చూసేవాళ్లకి తెలియని నిజం యేమిటంటే దేశంలోని అత్యంత లాభదాయకమైన కబేళాల యజమానుల్లో చాలామంది హిందువులే!ప్రభుత్వంలో ఉన్నవాళ్ళకి అది తెలియకుండా ఉంటుందా?
          వాటికి పశువుల్ని విక్రయిస్తున్న వారు కూడా హిందువులే!వ్యవసాయం అనేది అత్యంత ప్రముఖమైన ఉత్పత్తి సాధనమే అయినప్పటికీ దాన్ని లాభసాటిగా చెయ్యాలన్న సంకల్పం గానీ నిజాయితీ గానీ పట్టుదల గానీ ఇప్పటివరకు పరిపాలించిన వారిలో లేకపోవడం వల్ల ఆయా జంతువులు కేవలం ఆహారం కోసం బలి అవుతున్నాయి. ఒకప్పుడు ఎన్ని కరువులు వచ్చినా మళ్ళీ రైతులు కూదదీసుకోవటం జరిగింది వ్యవసాయంలో ఈ పశుపక్ష్యాదుల ప్రమేయం వల్లనే! పశువులు తిరిగే నేలలో భూసారం తగగ్డమ ంటూ ఉండదు కాబట్టే ఒక్క అవుల్నే కాకుండా గేదెల్నీ మేకల్నీ గొర్రెల్నీ పంచి వ్యవసాయ భూముల్లో తిరగనివ్వడం వల్ల కృత్రిమ ఎరువులు వాడకపోయినా పంటలు పుష్కలంగా పండేవి - పండిన పంటలో మంచి క్వాలిటీ ఉండేది.ఏసృష్టిలోని ఏ జంతువూ మనిషికి ఆహారం కావడం కోసం పుట్టలేదని తెలుసుకుంటే ఈ మాంసాహార ప్రియుల వీరంగాలు తగ్గుతాయి.మాంసాహారులు తమ ఆరోగ్యం కోసమయినా దానిమీద ప్రీతిని తగ్గించుకోవడం మంచిది కదా!ఒకవేళ నా ఆరోగ్యం నా ఇష్టం అనదలుచుకుంటే వారికి నేను వేస్తున్న ప్రశ్న ఇది:

మాంసాహారులు ఆ జంతువులకి బతికే హక్కు ఉండదని అనుకుంటున్నారా!

Wednesday, 7 June 2017

ఎందుకీ దగుల్బాజీతనమే ఆధునికతగా భావించి మురుస్తున్నారు?




Actually, I feel ashamed!

Ashamed to bits!

And somewhere, proud too!

Proud of the society and ashamed of Priyanka Chopra!

Why should I not be?

Our society is so great, it knows that it does not deserve someone like Priyanka! Or rather, it BELIEVES that it deserves nothing so special!

And when it comes to Priyanka, I am ashamed of her! How can such a talented and honourable personality as hers be born in such an orthodox society!

Remember folks, Priyanka's legs are not the first ones our PM has seen!



1) An abundance of patriarchy.

2) Sexism is our chief national pastime.

3) Access to 21st century technology doesn't allay 16th century attitudes.

4) For some people, a woman is only a sum of her body parts.

5) A successful woman is dangerous to the peace of mind of misogynists.
6) Some link their sense of self worth to opportunities to slut shame women on Facebook.
7) Exposed legs are known to emit radioactive rays. National security is being compromised!
What is this? Is this the 19th century?
In a world where we stand against someone attacking a woman's modesty and display our dissatisfaction on issues like Triple Talaq, how can we bring her down for wearing something perfectly normal except for some of those who think a woman should cover her legs in case the man in front of her, who knows, gets distracted?
She is out there doing something very worthwhile for her life! Who are we to comment on her ?If its our problem, its solely our problem! Every woman has the absolute right to wear any damn thing she wants to, we surely are not living in the dark ages! Grow up, society!
More power to you, PC!
---------------------------------------------------------------------------------------------------
          మరి ఇదేమిటి?ఒక జర్మనీ అమ్మాయి దేవయాని అనే పేరుతో చాలకాలం క్రితమే అమెరికా అమ్మాయి సినిమాలో ఆనంద తాందవమాడే శివుడు అని ఎంత సంప్రదాయబద్ధంగా నాట్యం చేసిందో చూడండి!ఒక అమెరికా నగర పోలీస్ కమిషనర్ తన స్టాఫ్ మొత్తానికి ప్రజల్ని కలుసుకున్నప్పుడు భారతీయులు చేసేటట్టు రెండు చేతులూ జోడించి నమస్కరించమని సూచించి అమలు జరిపిస్తున్నాడు!నాకు రొమ్ములున్నాయి గాబట్టి చూపిస్తాను,నా ఇష్టం అని ఒకతీ,నాకు కాళ్ళున్నాయి గాబట్టి చూపిస్తానని ఒకతీ విటుల్ని వెతుక్కోవటానికి లంజలు చేసే పన్లు చేస్తుంటే వాళ్ళకి గాలి కొట్టే మంద కూడా తయారయ్యారు - చీ చీ!వీళ్ళకన్నా పెద్దాపురం పాపలూ చిలకలూరి పేట చిలకలూ చాలా నయం - బీదరికం వల్ల చేస్తున్నారు,చేస్తున్న పనికి సిగ్గుపడుతున్నారు!


          అందంగా ఉన్న ఆడవాళ్ళు తమ అందాన్ని దాచుకోవాలని ఎవరూ అనడం లేదు,కానీ సన్నివేశానికి తగ్గట్టుగా ఉండాలి కదా!తొడలున్నాయి గాబట్టి చూపిస్తాను అంటే ఆ తొడలకి కొంచెం పైన ఉన్నదాన్ని కూడా చూపించవచ్చును కదా!హక్కుల తో పాటు హద్దులు కూడా తెలియాలి కదా!సినిమాలోని సన్నివేశానికి అవసరమైనప్పుడు వేస్తే వృత్తిధర్మం అనుకోవచ్చు - కానీ ఎక్కడికెళ్ళినా అలాగే వెళ్తాను, నా ఇష్టం అంటే ఎట్లా?పదిమందిలోకి వచ్చినప్పుడు ఆ పదిమంది ఇబ్బంది పడకుండా చూసుకోవడం అనేది సభాధర్మం కదా!ఎలాగైనా బతకడమే ముఖ్యమా, గౌరవమర్యాదలు అఖ్ఖర్లేదా? డబ్బే ముఖ్యమైతే పడుపువృత్తి ఇంతకన్నా ఎక్కువ డబ్బునే తెస్తుంది - తొడలు చూపించినందుకే కోట్లలో వస్తుంటే ఆ వృత్తికి దిగితే ఇంకా ఎక్కువే వస్తుంది ఖచ్చితంగా,అటుకేసి పోవచ్చునే?వాళ్ళ తొడలు చూసి చొల్లు కార్చుకునేవాళ్ళు మాత్రమే వీళ్ళకి అభిమానులు - ఆ కక్కుర్తిమంద సపోర్టు చూసుకుని వీళ్ళకి అహంకారం!

          మోడీని ఇండియాలో కలవడానికి వచ్చిన షెరిల్ సాండ్బర్గ్ కాలు మీద కాలు వేసుకుని మాట్లాడితే మనకి చూడ్డానికి ఇబ్బందిగా అనిపించినా వాళ్ళ దేశంలో స్కర్టు అనేది వర్కింగ్ విమెన్ వేసుకునే అఫిషియల్ డ్రెస్ కాబట్టి తను ప్రత్యేకంగా చేసినది కాదు గాబట్టి సర్దుకుపోవచ్చు!కానీ,తనకేం మాయరోగం?పైగా విమర్శించిన కొద్దీ తల్లిని కూడా కలుపుకుని ఫొటోలు దిగి పోష్టు చేసి రెచ్చిపోవడమా, తనేం యాంజలినా జోలీయో మెరిల్ స్ట్రీపో అనుకుంటుందా?సో కాల్డ్ ప్రియాంకా చోప్రాలూ దీపికా పడుకొనేలూ నటనలో కొలిస్తే వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోరు, ఒళ్ళు చూపించడంలో ఉన్న శ్రద్ధ నటనలో చూపిస్తే బాగుంటుంది. అక్కడున్నది ప్రధానమంత్రి కావచ్చు మరో గొట్టాం గాడు కావచ్చు, ఎందుకు కలుస్తున్నావు?నీ తొడలు చూపించి బేరం కుదుర్చుకోవటానికి కాదు కదా - ఆ మాట చెప్పినవాళ్ళు పురుషాహంకారులా, మతతత్వ వాదులా, ఆడదాని విజయాన్ని చూసి ఓర్వలేనివాళ్ళా?కిరన్ బేడీ విజయాన్ని మెచ్చుకోవడం లేదా?సుధా మూర్తి విజయాన్ని చూసి మెచ్చుకోవడం లేదా>దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గొప్పదనాన్ని కీర్తించడం లేదా?సిగులేని పనిచేసి గొప్పపని చేసినట్టు వీరత్వమా?ఈ ప్రియాంకా చోప్రాకి పెళ్ళీ,సంసారం అఖ్ఖర్లేదా,బతుకంతా ఒళ్ళు చూపించుకుంటూ ఇట్టాగే మహాజనానికి మరదలుపిల్లలా బతికేస్తుందా?అందమైన ఆదవాళ్ళు సినిమాల్లో వొళ్ళు చూపించడానికి తప్ప మరెందుకూ పనికిరారు అని కొందరు కామాతురులైన మగవాళ్ళు అనుకుంటే ఆ మగవాళ్లని సంతృప్తిపరచడానికి దిగజారుడు వేషాలు వేస్తూ నేను స్త్రీస్వేచ్చకి ప్రతినిధిని, నేను చేస్తున్నది పురుషాహంకారాన్ని ధిక్కరించడం అనే గంభీరమైన పేర్లని వాడుకోవటం దేనికి?

          అసలు తల్లిని అనాలి, తనంటే తప్పదు గాబట్టి అలాంటి డ్రస్సులు వేస్తున్నది,ముసలితనం దగ్గిరకే వొచ్చిందో,మీదకే వచ్చిపడిందో తెలియని ఆ తల్లి కూడా కాళ్ళు బారజాపుకుని కూతురితో కలిసి పళ్ళికిలిస్తున్నది - ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ఆన్నట్టు!సినిమా నటి అనగానే ఇట్లా బరితెగించాల్సిందేనా?ఇతరులు చెప్పి చేయించినా తమంతట తామే చేసినా వీళ్ళు బట్టలు విప్పేది మగవాళ్ళ లైంగికపరమయిన కోరికల్ని రెచ్చగొటానికే కదా - అందులో స్వాభిమానం ఎక్కడ ఉంది?నిండుగా బట్టలు కప్పుకుంటే నిన్నెవరూ చూడరని విప్పి చూపించి అయినా మగవాళ్లని ఆకర్షించాలని చేసే పనుల్లో ఆభిజాత్యం ఉండదు - చవకబారు తనం తప్ప!ఆడవాళ్ళు తమ అందాన్ని పణంగా పెట్టి శరీరాన్ని ప్రదర్శించకుండా గౌరవప్రదంగా బతకటానికి ఎన్నో దారులు ఉన్నాయి -సినిమాల్లో నటిస్తూ కూడా తమ గౌరవాన్ని కాపాడుకుంటూ బతకొచ్చు!కావాలని అన్నీ వదిలేసి మళ్ళీ పోటుగత్తెల్లా మాట్లాడితే కుదరదు - ఖబడ్దార్!

Tuesday, 6 June 2017

రెండు తెలుగు రాష్ట్రాల్లో భాజపా దూకుడు పెంచింది - అంత దూకుడు అవసరమా?

          దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి కొంత భాగం మద్రాసు రాష్ట్రంలో ఉండి కొంత భాగం నిజాం నుంచి విడిపోయిన సంధికాలంలో ఒక్కటిగా కలిసి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడి వెంటనే జరిగిన ఎన్నికల్లో కొత్త ప్రబుత్వాల్ని ఏర్పాటు చేశాయి.అదే ఎన్నికల్లో అప్పటికి పదేళ్ళుగా అవినీతి గబ్బుతో మకిలపట్టి ఇంక చెప్పుకోవడానికి ఏమీ లేక తెలంగాణ ఐచ్చిన మంచిపేరుతో అధికారంలోకి వచ్చెయ్యగలనని కలలు గన్న భారత జాతీయ కాంగ్రెస్ నామమాత్రావశిష్ఠంగా నిలిచి బిక్కమొగమెయ్యటం దిక్కుమాలిన విభజనతో కుంగిపోయిన ఆంధ్రులకి అపరిమితమైన సంతోషాన్ని కలిగించింది!మూడోసారి అధికారం ఆశించిన కాంగ్రెస్ స్థానంలో మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రెండవసారి తిరుగులేని బిజయంతో అధికారంలోకి వచ్చింది.

          కేంద్రంలో భాజపా,ఆంధ్రలో తెదెపా,తెలంగాణలో తెరాసా ఒకేసారి అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడిచాయి.భాజపా అంత మెజారిటీ సాధించినా వారికి అనుకూలంగా ఉత్తర భారతీయులు స్పందించినంతగా దక్షిణ భారతీయులు స్పందించలేదు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ ఆ చేదునిజం వారికి మింగుడు పడటం లేదు.అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోఎగించుకుంటున్నారు.ప్రతి అవకాశమూ వ్యతిరేక ఫలితాన్నే ఇచ్చింది.అయినా పట్టు వదలని విజ్రమార్కుడిలా పరిశ్రమిస్తూనే ఉన్నారు.ఈ ప్రయత్నాల్లో భాగంగానే అమిత్ షా తెలంగాణలో ఒకటీ ఆంధ్రలో ఒకటీ అన్నట్టు రెండు బహిరంగ సభల్ని అత్యంత సంరంభ భరితంగా నిర్వహించటం జరిగింది!మరో రెండేళ్ళకు గానీ ఈ మూడు చట్టసభల టెర్మ్ అయిపోదు గదా, సహజంగా రాజకీయ పార్టీలు చివరి సంవత్సరంలో గానీ ప్రచార సభల ఆర్భాటం మొదలు పెట్టవు - మరి, భాజపా ఇప్పుడే ఇంత దూకుడు చూపించటం దేనికి?

          ఎందుకంటే, మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది గానీ ఓట్లను బట్టీ సీట్లని బట్టీ లెక్కవేస్తే ఉత్తర భారతం ఆదరించినంతగా దక్షిణ భారతం ఆదరించలేదని తెలుస్తున్నది. దేశంలో సగభాగం నుంచి అంత గట్టి వ్యతిరేకత ఉన్నప్పుడు ఇప్పుడు దక్కిన అధికారం ఎప్పటికీ నిలబడుతుందనే గ్యారెంటీ ఉండదు. అదీ గాక, ఉత్తర భారత దేశంలో కూడా పార్లమెంటు ఎన్నికల్లో పడిన వోట్లు హఠాత్తుగా కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల పడినయ్యో లేక స్థిరమయిన వోటుబ్యాంక్ తయారయ్యిందో లేదో తెలియని పరిస్థితి! ఏ పొలిటికల్ పార్టీకైనా స్థిరమయిన వోటుబ్యాంక్ ఏర్పడితేనే ప్రశాంతంగా ఉండగలుగుతుంది,లేని పక్షంలో ప్రతి యెన్నికకీ ఆందోళన తప్పదు.అయితే, ఈ మధ్యన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సీట్ల పరంగానూ ఓట్ల పరంగానూ మంచి హుషారు నిచ్చాయి.అవే కాదు స్థానిక సంస్థల ఫలితాలు కూడా ప్రజలు తాత్కాలిక నినాదాలకూ క్షణికమైన ప్రతికూలతలకూ జావకారిపోకుండా చిరకాలం పాటు అధికారంలో ఉండేలా భాజపాని ఆశీర్వదించుతున్నారనిని అర్ధమైపోయింది!ఉత్తరాదిలో ఈ విధమైన ధీమా రావడం వల్ల ఇక దక్షిణాది మీద పూర్తి కాలం పని చెయ్యడానికి వీలు కుదిరింది.ముఖ్యంగా 2014లో బీజేపీకి అంత మెజార్టీ రావడం హఠాత్తుగా ఎగసిపడిన ఒక తరంగం కాదనీ గత డెబ్భయ్యేళ్ళుగా ఈ దేశంలో జరుగుతున్న సమస్తమయిన అన్యాయాలకీ హిందువులని దోషులుగా నిలబెట్టడం వల్ల వారిలో నిద్రాణమై ఉన్న క్రోధమే భాజపాను బ్యతిరేకించే పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రయత్నించినా ప్రజలు మళ్ళీ మళ్ళీ భాజపాకే వోటు వెయ్యడానికి కారణమనేది అందరూ తెలుసుకోవాలి!

          అయితే దక్షిణాదిన అన్ని రాష్ట్రాలు ఉండగా మంచి ఆరంభం కోసం రెండు తెలుగు రాష్ట్రాలనే ఎంచుకోవడానికి కారణమేమిటి?నిన్న గాక మొన్న విడిపోయి బలమైన నేతలు తమకు అనుకూలమైన ప్రాంతీయత పునాది మీద ఏర్పడిన సొంత పార్టీలతో నిలదొక్కుకుని ఉన్న చోట ఆరంభం అదిరిపోతుందని వారెలా  అనుకున్నారు?వీటన్నిటికీ జవాబులు తెలియాలంటే రాజకీయంగా బలపడే విషయంలో కాంగ్రెసుకీ భాజపాకీ ఉన్న లక్ష్యాలలోని తేడా తెలియాలి.స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉండటం వల్ల సహజంగానే ఏర్పడిన గుడ్విల్ ఫ్యాక్టర్ని అనుకూలంగా వుపయోగించుకుంటూనే కాంగ్రెస్ ఆదినుంచీ అధికారాన్ని లోపాయికారీగా ఇతర పార్టీలని బుజ్జయించి పదవుల్లో,లాభాల్లో,కాంట్రాక్టుల్లో వాటాలు పంచడం ద్వారా అధికారానికి అంటిపెట్టుకుని ఉండగలిగేది- ఇప్పటికీ ఆ పార్టీ అదే ధోరణిలో ఉంది, ఇకముందు కూడా అలాగే తట్టాయి బుట్టాయి గాళ్ళతో కలిస్తేనే తప్ప సొంతంగా అధికారంలోకి రాలేదు - గమనించండి!భాజపా ఇందుకు పూర్తి విరుద్ధంగా ఇతరుల నుంచి వీసమెత్తు సాయం కూడా తీసుకోవాల్సిన పని లేకుండా పరిపాలించడానికి అవసరమయిన పూర్తి స్థాయి బలాన్ని కోరుకుంటున్నది - 2 సీట్లతో ఉన్న కాలం నుచీ భాజపా ఈ పద్ధతిని అనుసరిస్తూనే ఇక్కడిబరకూ వచ్చిందనేది కూడా గమనించాలి!ఇప్పుడు భాజపాలో పైస్థాయిలో నాయకులుగా కనపడుతున్నవారందరూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నుంచి వచ్చినవారే,అక్కడ ఉన్న వాతావరణాన్నే ఇక్కడ కూడా సృష్టిసంచుకుంటున్నారు - ఆ మనస్తత్వం ఇతరులతో నిర్నిబంధంగా సర్దుకుపోనివ్వదు! 

          దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలలో భాజపా ఇప్పటికే చాలా ప్రయోగాలు చేసింది - కొన్ని చోట్ల మొదట ఆత్యంత ఉత్సాహాన్ని ఇచ్చి అంతలోనే ఉసూరుమనిపించింది.కొన్నిచోట్ల పూర్తి వ్యతిరేకత వచ్చి మళ్ళీ వేలు పట్టడానికి వీల్లేని పరిస్థితి ఉంది.ఏ ప్రయోగాలూ చెయ్యకుండా,ఏ విధమయిన అంచనాలకూ దొరకకుండా వూరిస్తూ వేధిస్తూ గందరగోళంలో నిలబెడుతున్నవి ఈ రెండు రాష్ట్రాలే!ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అనుకూల మీడియాతో డప్పు కొట్టుకుంటున్నా నిజానిజాలను నిశితంగా పరిశీలిస్తే సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమబుతున్నారని తెలుస్తున్నది.కొన్ని సమస్యలు ఈ మధ్యనే జరిగిన అర్ధాంతరపు విభజన ఇంకా పూర్తి కాకపోవడం వల్ల అయితే కొన్ని సమస్యలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యక్తీగత ధోరణుల వల్ల వస్తున్నాయి.ఇవన్నీ సొంతంగా ఎదగడానికి పనికొచ్చే ఆయుధాలే గనక అన్ని లెక్కలూ వేసుకుని మంచి ముహూర్తం చూసుకుని ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో అని కాకుండా రెండు రాష్ట్రాల్లోనే ఒకేసారి అనే వ్యూహం వేసింది భాజపా.మొదట తెలంగాణలో అధికారంలో ఉన్నది మిత్రపక్షం కాకపోవడంతో సభ బ్రహ్మాండంగానే జరిగినా ముఖ్యమంత్రి లక్షకోట్ల సాయానికి లెక్కలడుగుతూ చేసిన ఎదురుదాడికి కంగారు పడటంతో ఫలితం కొంచెం నిరాశనే మిగిల్చింది!ఆంధ్రలో ఆ పొరపాటు చెయ్యకుండా తమ గురించి మాత్రమే చెప్పుకుంటూ జాగర్త పడటంతో సభ జరిగిన తీరూ బాగుంది, పార్టీ శ్రేణులకీ హుషారు పెంచింది!

          చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు సుస్థిరమయిన మెజార్టీనే ఇచ్చారు.ప్రతిపక్షనాయకుడి అనుభవరాహిత్యం ఆ పార్టీకి ప్రతిపక్షం నుంచి వచ్చే వ్యతిరేకతని లెక్క చెయ్యనంత ధీమాని పెంచింది.వారానికోసారి అమరావతి బొమ్మల్ని చూపిస్తూ ముఖ్యమంత్రి ఎంతకాలం గడుపుదామనుకుంటున్నాడు?ప్రజలు ప్రపంచంలోనే త్యద్భుతమైన రాజధానిని చూసుకుని మురుసుకోవాలంటే మొత్తం ప్లాను పూర్తయ్యేసరికి ఎన్నేళ్ళు పడుతుబ్దో తెలియదు. ఈలొపు అది నిజంగా ఉపయోగపడేది ఇంజనీర్లకీ కాంట్రాక్తర్లకే కదా!వెర్షన్లు వెర్షన్లుగా ప్లానులు గీస్తూ మారుస్తూ విదేశీ కంపెనీలు బాగుపడుతున్నాయి.ఎంతసేపూ పోలవారం,అమరావతి అంటూ రాగాలు తియ్యడమే తప్ప ఇతర విషయాల మీద దృష్టి పెడుతున్నట్టు లేదు!పరిపాలన చూస్తే సమస్తం అవినీతి మయం అని స్పష్టంగా తెలిసిపోతున్నది - ఎప్పుడు సమావేశాలు జరిగినా అధికారుల్నీ,మంత్రుల్నీ సరిగ్గా పనిచెయ్యడం లేదని విసుక్కునే వార్తలే పత్రీకల్లో కనిపిస్తున్నాయి.ఆ వార్తల ద్వారా ముఖ్యమంత్రిగా పర్ఫెక్షన్ కోసం తపనపడుతున్న గుడ్విల్ వస్తుందనుకుంటున్నాడేమో గానీ, అధికారులూ.మంత్రులూ అనుకున్నంత సమర్ధవతంగా పనిచెయ్యకపోవడానికి వాళ్ళు అవినీతిలో మునిగితేలడం తప్ప మరొకటి కారణం కాదు. అవినీతి కారణం కాకపోతే దాని బాబు లాంటి అలసత్వమే తప్ప మరే కారణం వల్లనూ ప్రభుత్వనిర్వహణ అధినేతకు అంత స్థాయిలో అసంతృప్తి కలించేటనంత మందకొడిగా జరగటం అనేది వూహకు అందని విషయం. మూడవసారి విసుక్కుంటున్నాడంటే మొదటి రెండు సార్ల తిట్లనీ వాళ్ళు పటించుకోవటం లేదనే కదా అర్ధం!ప్రజాస్వామ్యంలో ఎంత మంచి పార్టీకయినా అప్రతిహతమయిన అధికారం దక్కకూడదు,కానీ "రేపో మాపో జైలుకెళ్ళేవాడు!" అనె మాటతో కొట్టిపారెయ్యటం తెదెపా శ్రేణులకి వూతపదంగా మారిపోయింది!ప్రతిపక్షం బలహీనంగా ఉందటం వల్ల పనిచెయ్యకపోయినా అవినీతిలో మునిగిపోయినా ముంచుకుపోయేది యేమీ లేదులే అన్న ధీమా వల్లనే వాళ్ళు ముఖ్యమంత్రి తిట్లని లెక్క చెయ్యటం లేదు.సాంకేతికంగా చూస్తే చంద్రబాబు ఇదివరకు చేసిన తప్పుల్నే కొత్తగా చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది - అభివృద్ధిని మొత్తం రాజధానికోనే పోగేసి చూపించటం,నేను నిద్ర పోను మిమ్మల్ని నిద్ర పోనివ్వనని ఉద్యోగుల మీద విసుక్కోవటం గుర్తున్నాయా?తెలంగాణ ఉద్యమంలో అభివృద్ధి ఫలాలు మాకు అందలేదు అనే వాదనకి ముఖ్యమైన కారణం అవినీతి అయితే,వాళ్ళు హైదరాబాదుని వదలకుండా గట్టిగా పట్టుకోవటానికి అక్కడ తను పోగేసిన్ అభివృద్ధియే కారణం - మళ్ళీ అదే తప్పులు చేస్తే మళ్ళీ రాష్ట్రం విడిపోవటం ఖాయం!

          ఒక రాజకీయ పార్టీగా భాజపాకి ఈ పరిస్థితిని ఉపయోగించుకుని రాజకీయంగ ఎదిగే హక్కు నూటికి నూరు శాతం ఉంది.మిత్రపక్షంగా ఎన్నికల సర్దుబాటులో భాగంగా వచ్చిన సీట్లను గెలుచుకోవడానికయినా అంధ్రలో భాజపా దూకుడు పెంచితే మంచి ఫలితమే ఉంటుంది.అయితే,బాబు గ్రాఫ్ పడిపోయిందని సొల్లు కబుర్లు చెప్పే కాంగ్రెసు నుంచి వచ్చిన పాత కాంగ్రెస్ వాళ్ళ మాటల్ని నమ్మీ కార్డులు చూపించిన కొద్దిమంది కార్యకర్తల వీరావేశాన్ని చూసి అతిగా ఆవేశపడితే మొత్తానికి సున్నమవుతుంది. రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేలా ఈ ప్రాంతం మీద పగబట్తి చేసినట్టు కనిపించే విభజన దుర్నాటకంలో 50% భాజపా పార్టీకీ ఉందనేది ఆంధ్రప్రజలకు స్పష్తంగా తెలుసు!వీరొకందుకు అడిగారు వారొకందుకు ఇచ్చారు అన్నట్టు దేశపు రాజకీయ ముఖచిత్రం మీద బలంగా ఉన్న ఉత్తరాది లాబీ ఈ రెండు జాతీయ పార్టీలలోని నాయకుల్నీ ప్రభావితం చెయ్యటం వల్లనే ఆంధ్రప్రదేశ్ విభజన ఈ విధంగా జరిందనేది వాస్తవం!అదీగాక తెదెపా నుంచి తెగదెంపులు చేసుకుని సొంతంగా అధికారంలోకి రాగలిగిన పరిస్థితి  ఇప్పటికిపుడు లేదు కదా!లాభం లేకుండా వేరుపడటం తెలివితక్కువ - కాబట్టి మొన్నటి సభ ద్వారా  పార్టీలో వచ్చిన హుషారుని తమకు బలమయిన నియోజకవర్గాలను ఎంచుకుని క్షేత్రస్థాయిలో నెమ్మదిగా ఎదగడమే బీజేపీకి ఉభయతారకమయిన పద్ధతి. అధికారంలోకి రావాలంటే మటుకు ముఖ్యమంత్రిగా జనం ముందు నిలబెడితే నమ్మించగలిగిన సమర్ధుడు చాలా అవసరం - అటువంటి వ్యక్తి ఆంధ్రలో కనబడే వరకు భాజపా తెదెపాతో ఆచి తూచి వ్యవహరించక తప్పదు!

          ఆంధ్రప్రదేశ్ రాజకీయరంగం ఉన్నంత స్పష్టంగా తెలంగాణ రాజకీయరంగం లేదు - యద్భావం తద్భవతి అన్నట్టు యెవరే విధంగా చూస్తే ఆ విధంగా కనబడి ప్రతి పార్టీకీ జంకూ తెంపూ రెంటినీ కలిగిస్తున్నది!తాను నిర్వహించిన సర్వేలో కాంగ్రెసుకి ర్తెండే సీట్లు వస్తాయనీ భాజపోకి అసలు ఒక సీటు కూడా రాదనీ తెరాసాకు 111 సీట్లు వస్తాయనీ ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారు.పైకి  సొంత సర్వేలు అన్నీ బూటకాలు అని కొటి పారేసినా కాంగెసు వాళ్ళు దిగాలు పడిపోయినా భాజపా సభ తర్వాత జరిగిన రాహుల్ సభ జరిగిన తెరు కాంగెసువాళ్లని గుడి కన్నా మెల్ల నయం అని సంబరపడిపోయేలా చేసింది.అయితే,ఉతర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత భాజపా కూడా సర్వే చెయించిందనీ,వారి సర్వేలో కూడా కేసీయార్ హవా తెలంగాణలో బలంగానే ఉందనీ తెలిశాకనే భాజపా ఈ సభకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తున్నది!లక్షకోట్ల సాయానికి కేసీయార్ వేసిన మెలికని పెద్దగా పట్టించుకోకుండా దూకుడు పెంచి ముందుకువెళ్ళడం వల్ల భాజపాకి ఈ ఎన్నికలలో మంచి ఫలితమే రావచ్చు - అన్నీ కలిసొస్తే అధికారం కూడా ప్రాప్తించవచ్చును. ఎందుకంటే 2014లో తర్వాత కాలంలో వాళ్ళనీ వీళ్ళనీ లాక్కుంటే తప్ప నిలబడలేని బొటాబొటీ మెజార్టీకి కారణమైన నిజాయితీ పరులు యెవ్వరూ ఇవ్వాళ అతని పక్కన లేరు.ఎవ్వరి సహాయమూ లేకుండా అతనొక్కడే అందరిపెట్టు అనిపించే మాయాజాలం యెన్నికల్లో పనిచేస్తుందనుకోవటం భ్రమ - అవతార పురుషుల వేషాలు వేసి అకళంకమైన రాజకీయ చరిత్ర కల్గిన నందమూరి తారక రామారావుకే ఒంటెత్తు పోకడ ధోరణి తట్టుకోలేనంత తీవ్రమైన అపజయాన్ని మిగిల్చింది - ఇతడెంత!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అవినీతి బయటికి కనబడుతూ పదుగురికీ తెలుస్తుంటే తెలంగాణలో పైనించి కిందకు ఎవరి వాటాలు వారు దక్కించుకుంటూ రహస్యంగా నడిచిపోతున్నది.లోపాయకారీగా తెలియవచ్చిన విషయం ఇవ్వాళ తెలంగాణలోని రాజకీయ నాయకుల రోజుకూలీ 2 లేక 3 లక్షలట!వ్యతిరేకతే లేకపోవటమే సుస్థిరతకు గానీ ప్రశాంతతకు గానీ గల ఒకే ఒక్క  కారణం కాదు - ఇటువంటి సానుకూలత కూడా వాస్తవాన్ని చూడనివ్వని మైకాన్ని కలిగిస్తుంది, బహుపరాక్!

          రాష్ట్రం ఏర్పడిన మొదటి సంబురాల నాడు కనిపించిన ఉద్వేగం,ఉత్సాహం మూడవ యేడాది సంబురాలలో కనిపించలేదు - కారణం ఏమిటి?రాజకీయ చాతుర్యంతో అధికారం నిలబెట్టుకోవటం ఆర్జనకు పనికి వస్తుంది కానీ ప్రజాభిమానాన్ని పెంచుకుకోవటానికి పనికిరాదు!నోటికొచ్చింది మాట్లాడి సంచలనాలతో ఫోకస్ తెచ్చుకుంటూ గయ్యాళి సమర్ధనలతో లోపాల్ని కప్పి పుచ్చుకోవటం అభిమానుల్ని అలరిస్తుందే తప్ప విశాల ప్రజానీకపు ఆమోదాన్ని తీసుకురాదు!ప్రజలలో అసంతృప్తి ఉంది గనకనే పరిస్థితి అనుమానాస్పదంగా తయారైంది కాబట్టి భాజపా దూకుడును పెంచటమే శ్రేయస్కరం!మిత్రపక్షం అనే మొహమాటం లేదు కాబట్టీ,అతడు కూడా భోజనాల గురించి కూడా నీచమయిన విమర్శలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు గాబట్టీ భాజపా ప్రశాంతంగా ఉందటం వల్లనే నష్టం యెక్కువగా ఉంటుంది!పాతబస్తీలో కొలువున్న కాసిం రజ్వీ వారసుల్ని అదుపు చెయ్యాల్సిన అవసరం చాలా వుంది!అదేంటో,ఉద్యమ సమయంలో నక్సలిజం గురించి యెత్తితే "మా పోరగాళ్ళంతా భుజాల మీద తుపాకులు పెట్టుకుని పుడుతున్నట్టు మమ్మల్ని అగుమానిస్తున్నారు!" అని ఆవేశపడిపోయాడు!మరి, అధికారంలోకి వచ్చాక యెంత హడావిడి చెయ్యాల్సి వచ్చింది?ఒక ఆడమనిషి విదేశాల్లో చదుకోవడానికి వెళ్ళి,ర్యాంకు రాకనో యేమో ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్ళి చేసుకుని వచ్చి,ఆ పెళ్ళీ పెటాకులై సోమరి బుర్ర దెయ్యాల పర్ర అన్నటు 50 మంది టెర్రరిస్టుల్ని తయారు చేసింది - ఆఖరి నిమిషాల్లో తను పట్టుబడింది గానీ ఈ ఉగ్రనారి వల్ల తయారైన మిగతా వాళ్ళ సంగతేంటి?చవగ్గా చిన్నపిల్లల్ని పెళ్ళాడాలనుకునే అరబు షేకులకి పెళ్ళాల మార్కెట్టుగా హైదరాబాదు ఎప్పుడో మారిపోయిందన్నది అబద్ధమా!ఆ లత్తుకోరు దళారీ వ్యాపారం చేసేవాళ్ళలో చాలామంది పాతబస్తీ మోతుబరి కుటుంబం పడగనీడలో కేళీవిలాసంగా బతుకుతున్నవాళ్ళు కాదా!పాతబస్తీలోని కూసిన్ని వోట్ల కోసం తెలంగాణ రాష్ట్రమే గాక దేశానికి కూడా ప్రమాదం తెచ్చిపెడుతున్న వాళ్ళతో స్నేహమా!యజ్ఞయాగాలు చేస్తూ స్వాముల్ని పక్కన కూర్చోబెట్టుకుంటేనూ, బ్యాపనోళ్ళకి గుడిమాన్యాలు ఇస్తేనూ హిందువులు యెర్రిపప్పల్లా నాకే వోట్లు వేస్తారు అతను అనుకుంటే అది భాజపా యొక్క చేతగాని తంబానికి గుర్తు!ఇటీవల ఉత్తరాది యెన్నికల్లో తలాఖ్ విషయాల ప్రస్తావన రావడం వల్ల ముస్లిం ఆడవాళ్ళు భాజపాకి వోటు వేసిన విషయం గుర్తుంచుకుంటే భాజపాకి తెలంగాణలో ఉన్న అనుకూలత యేమిటో తెలుస్తుంది!కేసీయార్ ఇప్పుడు తన రాజకీయ చతురత అబుకున్నవే వచ్చే ఎన్నికల నాటికి అతనికి గుదిబండగా మారే అవకాశం ఉంది!2014లో ఆ మెజార్టీని తెచ్చిపెట్టిన ఉద్యమవీరులు ఇవ్వాళ శత్రుస్థానంలో ఉన్నారు!నిజాయితీగా తెలంగాణ వస్తే అవినీతి లేని ప్రభుత్వం ఏర్పడి తమకి మంచి జరుగుతుందని ఆశించి పనిచేసినవాళ్లని వ్యూహప్రకారమే దరిదాపులకి కూడా రానివకుండా గెంటివేసి ఉద్యమకాలంలో తమకి అన్యాయం జరిగిందని ఆరోపించిన కాలం నాటి ప్రభుత్వాలలో మంత్రులుగా ఉన్నవాళ్ళకే ఇప్పుడు పచ్చకండువా కప్పి మంత్రుల్ని చేశాడు!మన వుద్యోగాలు లాక్కున్నారని చెప్పినవాడు ఉద్యోగాల నోటిఫికేషన్లని వాయిదా వేస్తున్నాడు!ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నవాడు ఆంధ్ర విద్యుత్ బకాయిల్ని చెల్లించలేదు!ఈసారి మేము బహుజాగ్రత్తగా కూర్చాము అని చెప్పుకున్న ఆదేశాల్ని కూడా కోర్టులు చివాట్లు పెడుతూ కొట్టిపారేస్తునాయి - ఇన్ని ప్రతికూలతల్ని ముడ్డి కింద పెట్టుకుని మిషన్ దగారధం,మిషన్ చేతివాటం,మిషన్ రెండు చాపల ఇళ్ళు లాంటి పధకాల గురించి చెప్పుకుంటే ఎన్ని వోట్లు పడతాయి?తెలివిగా ఆడితే తెలంగాణలో భాజపాకి ఎంత ఆడుకుంటే అంత లాభం!ఆట మానేసి కూర్చుంటే ఆటస్థలం మరొకరి వైపుకు పారిపోయే అపాయం ఉన్నప్పుడు ఆడితే నష్టమేమిటి?ఆడేది గట్టిగానే ఆడాలి.

          చాలాకాలం క్రితం నేను ఇవ్వాళ బ్యూటన్ లాంటివాళ్ళు కనుక్కున్న విషయాలు మనవాళ్ళు యెప్పుడో కనుక్కున్నారు,అయినా మనవాళ్ళకి గుర్తింపు లేదు అని చెప్తూ ఒక పోష్టు వేస్రే కొందరు తాయిగండ వెధవలకి అది నేను వాళ్ళనో వాళ్ల ఆత్మబంధువుల్నో తిట్టినంత రోషం పొడుచుకొచ్చింది!వాళ్ళ కామెంట్ల నిండా అక్కసుతో కూడుకున్న బూతులే,ఎన్నిసార్లు నేను న్యూటన్ మహాశయుణి గానీ మరొకరిని గానీ అవమానించినట్టు నా పోష్టు మొత్తంలో యెక్కడ వుంది అని నిలదీసినా సరే సూటిగా అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పకుండా ఏమిటేమిటో వాగేశారు.ఆ వాగుడులో "ద్రౌపదిని దుశ్శాసనుడు రేప్ చేస్తుంటే పాండవులు గుడ్లప్పగించుకుని చూశారు" అనే మాటని చూసి అది ఆ ఒక్కడి సొంత పైత్యం కొద్దీ వాగే చెత్తనుకుని పటించుకోలేదు!అయితే,ఈ మధ్యనే అది ఆ ఒక్కడి సొంత తెలివి కాదనీ గతితార్కికభౌతికశాస్త్రవేత్తలు గానీ దళితవాదవీరకిశోరాలు గానీ పనిగట్టుకుని చేసిన సుదీర్ఘమయిన వ్యాఖ్యానంలో నుంచి కొట్టుకొచ్చి అతను అక్కడ వూశాడనీ తెలిసినప్పుడు గానీ నాకు దేశంలో హిందూ సంస్కృతి మీద జరుగుతున్న నీచమయిన దాడి యెంత విస్తృతంగా ఉందో తెలిసిరాలేదు!సకల దేవతలకూ మాతృస్వరూపిణి అయిన ఆదిశక్తిని సెక్స్ వర్కర్ అనడం దగ్గిర్నుంచీ పంచ మహా పతివ్రతల్లో ఒకరై అగ్నిసంభవ అని ప్రత్యేకంగా కీర్తించబడుతున్న ద్రౌపదిని రేప్ సీనులో ఇరికించడం వరకు ఎంత నీచానికి పాల్పడి అయినా సరే హిందువులని అవమానించాలి,మానసికంగా హింసించాలి,వాళ్ళని మాత్రమే కాదు వాళ్ళు గౌరవించే ప్రతి అంశాన్నీ అవమానించాలి,వాళ్ళు సిగ్గుపడి తల దించుకుంటే చూసి సంతోషించాలి అనే ధోరణి అంత బలంగా  ఉన్నవాళ్ళు మనం యెంత వొపిక చేసుకుని ఎన్ని ఆధారాలు చూపించి వాదించినా వొప్పుకుని దాడిని ఆపుతారని గ్యారేంటీ యేముంది?ఇవన్నీ అధికారం ఇలాగే వస్తుందని చెబుతున్న రాజకీయ సిద్ధాంతం ప్రకారం చేస్తున్న వ్యవహారాలు అయినప్పుడు వీళ్ళ దాడి నుంచి రక్షించుకోవటానికి హిందువులకి ఉన్న మార్గం యేమిటి - బీజేపీకి వోటు వెయ్యటం తప్ప!

          ఇవ్వాళ దేశం మొత్తం మీద అంత నిబద్ధంగా భాజపాకి పడుతున్న వోట్లన్నీ ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతున్న హిందువులవే అయితే అలాంటివాళ్ళు తెలంగాణలో లేరని భాజపా అనుకుంటున్నదా!అయితే, గోరక్షణ దళాలు చేస్తున్న రౌడీ పనులు మాత్రం భాజపాకి వ్యతిరేక ఫలితాని ఇచ్చే ప్రమాదం ఉంది.ఇప్పటికే దేశమంతటా ఉద్యమాలు మొదలయినాయి.అసలు కబేళాలకి వెళుతున్న ఆవుల్ని ఎవరు అమ్ముతున్నారు?అసలు వ్యవసాయ దారుడు కానివాడు ఒక్కడయినా కనీసం సరదాకయినా ఆవుల్ని పెంచుతున్నాడా ఇవ్వాళ?వ్యవసాయంలో కూడా పావు ఎకరం దుక్కికి కూడా చవగ్గా ట్రాక్తర్లని వాడుతుంటే ఎద్దుల్ని పెంచడం లాభమా?ఉపయోగపడే జంతువుని రైతు మాత్రం ఎందుకు అమ్ముతాడు?పెంచలేని దుస్థితిలో అమ్ముకునే రైతుల్ని ఈ బలవంతపు గోరక్షణ ఏ విధంగా ఉద్ధరిస్తుంది?ఇది గాక ఈ గోరక్షణ సెంటిమెంటు బలంగా ఎక్కిపోయిన ఒకాయన ఆవులు కార్బన్ డయాక్సయిడును పీల్చుకుని ఆక్సిజన్ వదలటం గురించి సైన్సు పాఠాలు చెప్తున్నాడు - ఒక అయిదేళ్ళ క్రితం మనం ఇలాంటి సనివేశాన్ని చూడగలమా?ఆయనే ఆడ నేమలి మగ నెమలి యొక్క కన్నీటినో చెమటనో తాగి గుడ్లు పెడుతుందని బల్ల గుద్ది చెప్తున్నాడు,ఏమిటి ఇది?ఇప్పుడు అధికారంలో ఉన్నది అమన ఆర్టీ గాబట్టి మనం ఏమి మాట్లాడినా చెల్లిపోతుందనే అహంభావం వల్ల ఇలాంటివి జరుగుతాయి - ఈ రకం జనాల్ని అదుపు చెయ్యకపోతే ఓకప్పుడు భారత్ అంటే పాముల్నీ కోతుల్నీ ఆడించుకుంటూ చెట్లకీ పుట్లకీ దణ్ణాలు పెడుతూ అజ్ఞానంలో గడిపే  వాళ్ళ దేశం అని అవహేళనలు చెయ్యటం కరెక్టేననే విషయాని ప్రపంచం నలుమూలలకీ తెలిసిపోయి దేశం పరువు పోతుంది.ఇలాంటివాటిని కట్టడి చేసి వస్తుగతమైన వృద్ధి మీద మరింత దృష్టి పెట్టకపోతే వ్యతిరేకతలు మరింత పెరిగి భాజపా ప్రజల్ని ప్రాచీన కాలానికి నడిపించే మూర్ఖుల కూటమిగా మారిపోతుంది - తస్మాత్ జాగ్రత్త!

          ఆంధ్రలో లాగే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి అర్హతలు ఉన్న వ్యక్తిని జనం ముందు నిలబెట్టకుండా అధికారం దక్కదు - క్లారిటీ ఇవ్వకుండా జనం ష్యూరిటీ ఇవ్వరు.అక్కడా ఇక్కడా అనే కాదు బిన్ లాడెన్ నుంచి డోనాల్డ్ ట్రంప్ వరకూ చూస్తే తను ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఇచ్చిన క్లారిటీయే లీడర్షిప్ క్వాలిటీలలోకల్లా బెస్ట్ క్వాలిటీ అని తెలుస్తున్నది!ట్రంప్ వరకూ ఎందుకు మోదీ గెలుపుకి కారణం కూడా అదే కదా - ఇంకెందుకు ఆలశ్యం?


యతో ధర్మం తతో జయం!

Friday, 2 June 2017

చెప్పేది ఏమిటో, చెప్పెయ్యి సూటిగా - సుత్తి లేకుండా!

ఎందుకు పుట్టామో తెలియదు!
ఎందుకు తింటున్నామో తెలియదు!
ఎందుకు పెరుగుతున్నామో తెలియదు!

ఎందుకు మాట్లాడుతున్నామో తెలియదు!
ఎందుకు నడుస్తున్నామో తెలియదు!
ఎందుకు పోట్లాడుతున్నామో తెలియదు!

ఎందుకు చదువుతున్నామో తెలియదు!
ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నామో తెలియదు!
ఎందుకు విసుక్కుంటున్నామో తెలియదు!

ఎందుకు సంపాదిస్తున్నామో తెలియదు!
ఎందుకు కొంటున్నామో తెలియదు!
ఎందుకు అమ్ముతున్నామో తెలియదు!

ఎందుకు దాస్తున్నామో తెలియదు!
ఎందుకు ఖర్చు చేస్తున్నామో తెలియదు!
ఎందుకు మిగుల్చుతున్నామో తెలియదు!

ఎందుకు స్నేహం చేస్తున్నామో తెలియదు!
ఎందుకు వైరం చూపిస్తున్నామో తెలియదు!
ఎందుకు శాంతంగా ఉండలేకపోతున్నామో తెలియదు!

ఎందుకు ప్రేమిస్తున్నామో తెలియదు!
ఎందుకు పెళ్ళి చేసుకుంటున్నామో తెలియదు!
ఎందుకు విడిపోతున్నామో తెలియదు!

ఎందుకు మనం రచనలు చేస్తున్నామో తెలియదు!
ఎందుకు చదివి మెచ్చుకుంటున్నామో తెలియదు!
ఎందుకు ఇతర్ల కెర్తికి కుళ్ళుతున్నామో తెలియదు!

ఎందుకు పోలింగ్ బూతుల్లో ఓటేస్తున్నామో తెలియదు!
ఎందుకు మంత్రులుగా చట్టసభల్లోకి వెళ్తున్నామో తెలియదు!
ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతున్నామో తెలియదు!

ఎందుకు బతికున్నామో తెలియదు!
ఎందుకు చచ్చిపోతున్నామో తెలియదు!
మరి, తెలిసింది ఏమిటి?

Wednesday, 26 April 2017

గానగంధర్వుణ్ణి తను కూర్చిన పాటల్ని పాడినందుకు కోర్టుకీడ్చిన ఇసైజ్ఞాని తను కూర్చడానికి రాగకర్తల నుంచి అనుమతి తీసుకున్నాడా?

          ముఖే ముఖే సరస్వతీ అన్నట్టు ఒక మనిషి నుంచి ఒక మనిషికి వ్యాపించే భావాల మీద, రాగాల మీద ఏ ఒక్క మనిషికీ కాపీరైటు లేదు. మనకి తెలిసిన ప్రతి విషయమూ ఇంకొకరి నుంచి తెలిసిందే అవుతుంది - మన తలిదండ్రులు నేర్పితేనే మనకి మాటలు వచ్చాయి! అయినా కొందరు నాకు తెలిసిందీ, నేను పాడందీ, నేను కూర్చిందీ నా సొంతమే అంటున్నారు!సార్వజనీనమైన కళమీద సొంతహక్కుల కోసం సాటి కళాకారుల మీద కేసులు కూడా వేస్తున్నారు, ఏమి చిత్రం?

          ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ సంగెతం ఉంది,ప్రతి సంగీతంలోనూ రాగాలు ఉన్నాయి,ప్రతి రాగానికీ స్వరాలు ఉన్నాయి - చిత్రంగా అన్ని  రకాల సంగీత రీతుల్లోనూ ఉన్న స్వరాలు ఏడు మాత్రమే!ఆ స్వరాల వెనక గణితం ఉంది - ఫ్రీక్వెన్సీ,డిలే అనే రెండింటి మిళాయింపుని ఒక స్థిరాంకంగా తీసుకుని దాన్ని మెట్లు మెట్లుగా పెంచితే మిగిలిన స్వరాలు ఏర్పడతాయి.షడ్జమం అనేది ఇక్కడ బేసిక్,రిషభం దానికంటే ఒక యూనిట్ పెంపు(కానీ పెంపులో ఒక నిష్పత్తి ఉంటుంది, అది లాగరథమిక్ స్కేల్) - ఇట్లా లెక్క ప్రకారం స్వరాలను ఏర్పరచారు. వారెవరో ఈనాటివారికి తెలియనే తెలియదే!వారు పేటెంటు హక్కుల కోసం ఆ పని చేశారా?ఆ స్వరాలని గాత్రంలో పలికించినా వాద్యం మీద పలికించినా లెక్క ఒకటే కాబట్టి నాదరమ్యతలో తేడా వుండదు!"నీ లీల పాడెద దేవా...!" పాటలో యస్.జానకి ఆలాపనా సన్నాయి ఆలాపనా ఒకే స్థాయిలో పలకడమే దానికి నిదర్శనం."షడ్జమం మయూరో వదతి" శ్లోకం ప్రకారం అవి ఆయా జంతువుల గొంతునుడి వచ్చే ఏకసూత్ర ధ్వనులు.అలాంటి విశ్వజనీనమైన సంగీతం మీద తనకి మాత్రమే పేటెంట్ హక్కులు ఉన్నాయనటం స్వరజ్ఞాని యొక్క అజ్ఞానం మాత్రమే!

          విశ్వనాధ సత్యనారాయణ గారి పురాణ వైర ఫ్రంధమాలలో "వేదవతి" కధ ప్రత్యేకమైనది!అందులో వేదవతి అనే ఆ నవలానాయకి దేహం సంగీతానికి విపరీతంగా ప్రతిస్పందిస్తుంది - ఎంతగా అంటే స్వరబద్ధమైన సంగీతం వింటూ ఉంటే క్షణ క్షణానికీ జీవశక్తులు ఉత్తేజితమై కొద్ది మిమిషాల్లోనే పూర్ణచందుడిలా తళుకులీనుతుంది,కర్ణకఠోరమైన సంగీతం వింటూ ఉంటే క్రుంగి కృశిస్తుంది!ఆ నవలలో భగవంతుడి మీద పగతో రగిలిపొయే జయధ్రధుడి వారసత్వంలో వచ్చే ప్రతినాయకుడి పేరు నిమేషధారి,వాడో మాంత్రికుడు.వాడు ఆయుష్షుని నిమిషాల లెక్కన పెంచుకోగలిగినవాడు.దాన్ని సాధించడానికి వేదవతిని కిడ్నాప్ చేసి వేదనాదం వినిపించి ఆమేనుంచి ఆయుష్షును నిమిషాలుగా గహిస్తాడు!అలా ఆయుష్షును పెంచుకున్నాక ఆమెకి పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తాడు - తప్పించుకోవడానికి శక్తి కూడా లేనంత నీరసించి పోతుంది వేదవతి.కల్పన బాగుంది కదూ - ఇప్పటి హాలీవుడ్ సినిమాల వాళ్ళకి కూడా రాని యెన్నో చిత్రవిచిత్రమైన కల్పనలు ప్రతి పురాణ వైర కధలోనూ ఉంటాయి - ఆయన్ని వెనక్కి నడిచేవాడు అని వెక్కిరించారు!అసలు విషయం యేమిటంటే ఈమెని వెతకడానికి బయలుదేరినవాళ్ళలో ఒక జానపదుడు ఉంటాడు,ఆ పాత్రకి విశ్వనాధ పెట్టిన పేరు టికటిక!నిమేషధారి తన స్థావరంలో లేని సమయంలో ఈ జానపదుడు  ఆ దగ్గిరలో తిరుగుతూ పాడిన జానపద గీతాలలో వైదిక సంగీతం వినబడి కృశించిన వేదవతి తేరుకుని నిండు తేజస్సును సమకూర్చున్నట్టు విశ్వనాధ వారు కల్పన చేశారు.ఆ వెంటనే తప్పించుకుంటుందో,లేక టికటిక ఆమెను కనిపెట్టటం జరిగి కధ కొంచెం నడిచాక తప్పించుకుంటుందో నాకు గుర్తు లేదు.అయితే ఇక్కడ విశ్వనాధ చెప్పదల్చుకున్న విషయమే ముఖ్యం - సంగీతం ఎవడబ్బ సొమ్మూ కాదు!

          ఇళయరాజా గురించి సినిమా పరిశ్రమలో తరచుగా కొన్ని మాటలు వినబడతాయి - ముక్తసరిగా మాట్లాడతాని,మాటిమాటికీ ట్యూన్లు మార్చడానికి విసుక్కుంటాడని,ఇలాంటివి చాలావరకు వినయాన్ని కాకుండా పాండితీగర్వాన్ని సూచించే లక్షణాలు!ఆ సహజమైన అహంభావంతోనే బాలసుబ్రమణ్యం మీద కేసు వేసి ఉండవచ్చును.కొందరు కాపీరైటు ఉల్లంఘనలకి ఇతరేతర వ్యక్తుల నుంచి గట్టి స్పందన కోసం చేశాడంటున్నారు గానీ నాకు మాత్రం ఈ పనిలో పాండితీగర్వానికి సంబంధించిన దుర్మార్గమే కనబడుతున్నది.యెందుకంటే,గానగంధర్వుణ్ణి తను కూర్చిన పాటల్ని పాడినందుకు కోర్టుకీడ్చిన ఇసైజ్ఞాని ఆ పాటల్నితను కూర్చడానికి ముందు రాగకర్తల నుంచి అనుమతి తీసుకున్నాడా?

Wednesday, 19 April 2017

కాంగ్రెసు ముక్త భారత్ అంటే కాంగ్రెసును బయటెక్కడా కనిపించకుండా తనలోకి లాక్కొవడమా?

          మొదటిసారి ఈ "కాంగ్రెస్ ముక్త్ భారత్!" అన్న నినాదం మోదీగారి నోటినుంచి వచ్చినప్పుడు నేను ఎగిరి గంతేశాను!అసలు మోదీ అమ్నస్సులో ఈ నినాదం ఎప్పుడు పుట్టిందో!స్కూలు రోజుల నాడు పుట్టిన ఈ లక్ష్యంతోనే ఆవేశపడి ఇన్ని దశాబ్దాల తర్వాత ప్రధాని అయ్యాడా?లేక అనుకోకుండా ప్రధాని ఈ మధ్య కొత్తగా పుట్టిన వెర్రా ఇది!ఎందుకంటే,ఒకానొకప్పుడు ఈ రకమైన భావజాలం ఉన్నవాళ్లని గాంధీని చంపిన దేశద్రోహులుగా ముద్రవేసి వారి మాతకి విలువ లేకుండా చేసిన కలాంలోనూ,లోక్సభలో కేవలం 2 సీట్లు మాత్రమే ఉండి బిక్కుబిక్కుమంటున్న కాలంలోనూ,అద్వానీ గారు రదహయాత్రతో అప్రతిహతంగా రామబహ్క్తులను భాజపా అవిపుకు వోటుబ్యాంకుగా మారుస్తున్న కాలంలోనూ,వాజపేయి గారు కాంగ్రెసుకి అఖిల భారత్ భ్రష్టాచారీ కాంగ్రెసు అని పేరు మార్చుకోమని చురకలు వేసినప్పుడు గానీ ఎవరికీ తట్టని కొత్త వూహ కదా ఇది!

          హఠాత్తుగా అద్వానీ కేసు ముందుకు రావడంలో పైకి కనబడుతున్నది నిజమని మీరు నమ్ముతున్నారా?నాకైతే రివర్స్ గేరులో హిందువుల్ని రెచ్చగొట్టడానికి భాజపా ఆడుతున్న నాటకం అనిపిస్తున్నది!ముస్లిములని వోటుబ్యాంకుగా ఉపయోగించుకోవాలనుకున్న కాంగ్రెస్ పారీ,హిందూ వ్యతిరేక భావజాలపు కమ్యునిష్టు పార్టీ ఏమాత్రం బలంగా లేవు.ముస్లిం మతపెద్దలు మొదటినుంచీ సయోధ్య వైపుకే మొగు చూపుతున్నారు.రాజకీయంగా తాము కగజేసుకోకుండా ఇరుపక్షాల మతపెద్దల్నీ ఒక్కచోట కూర్చోబెడితే చాలు!అయితే.ముస్లిములు పరిహారం అడుగుతారు - 1000 కోట్లు కావచ్చు,లేక 3000 కోట్లు కావచ్చు!అది ఇవ్వకుండా రప్పించుకోవాలనే ఎఉగడలతోనే హిందూ మతతత్వ శక్తులు పావులు కదుపుతున్నాయి

          ప్రతి ఒక్క చతుర్యుగం తర్వాత జలప్రళయం జరిగే లెక్కని చూసుకున్నా యుగాల వెనకటి రాముడి ఆనవాళ్ళక్ ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో సాక్ష్యాలు పట్టుకోవటం దాదాపు అసాధ్యం.మసీఎదును సాక్ష్యాలు పట్టుకోవటం దాదాపు దుర్మార్గమే.అది ఒప్పుకుని ముస్లిములతో స్నేహపూర్వకమైన చర్చల ద్వారా గుడి కట్టడం మర్యాదస్తులైన ప్రతి ఉక్కరూ కోరుకుంతూన్నారు.కానీ భజపాను శాసించే శక్తులు మర్యాదకి కాకుండా సమర్ధతకి పెద్దపీట వేస్తున్నాయి - అదే గుడి కట్టడానికి అసలైన ప్రతిబంధకం. 

          కానీ అక్కడ అసలు సయోధ్య ద్వారా కాకుండా హిందువుల్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టి తమకి నిరంకుశామైన అధికారం సాధించుకోవాలని భాజపా వ్యూహం.అది ఫలిస్రే దేశం మళ్ళీ రాజుల కాలంలోకి వెళ్ళీపోవడం ఖాయం - నిజంగా అది జరుగుతుందా?ప్రపంచ స్థాయిలోనే భాజపా అతి పెద్ద రాజకెయ పార్టీఅ ని అంకెల ద్వారానే సష్టంగా తేలిపోయింది.ఇది హఠాత్తుగా జరిగినదీ కాదు,దానంతటదిగా జరిగిపోయిందీ కాదు.ఎప్పటినుంచో కమలమే సకలం కావాలి,కాంగ్రెసు ముక్త భారతాన్ని సాధించాలి అనే వ్యూహం పనిచెయ్యడం ద్వారానే జరిగింది.కానె ఆ వ్యూహం ఇదివరకు కాంతెసు ఆ స్థాయికి రావడానికి ఉపయోగంచిన పద్ధతియే కదా!వ్యాపించటానికి కాంగ్రెసు పద్ధతినే పాటిస్తే కాంగ్రెసుని అనుకరించినట్టే కదా!భాజపా కూడా అచ్చం కాంగ్రెసులాగే మారిపోయినట్టే కదా!సీసా మీద లేబుల్ మార్చినంత మాత్రాన జిన్ను రమ్ము అవుతుందా?

          తమిళనాట జయలలిత మరణం తర్వాత జరిగిన,జరుగుతున్న,జరగబోతున్న సంఘటనల వెనక భాజపా ప్రమేయం అందరికీ తెలిసిన విషయమే - అది కాంగ్రెసు నీచమైన శవరాజకీయమే!నిన్న జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆదిత్యనాధ్ తప్ప మిగిలిన వాళ్ళు ముఖ్యమంత్రులు కావటం కాంగ్రెసు మార్కు రాజకీయం ద్వారా కాదని యే భాజపా అభిమాని అయినా గుండెల మీద చెయ్యేసుకుఇ చెప్పగలడా!కాంగ్రెస్ ముక్తభారత్ అంటే బయటెక్కడా కాంగ్ర్సెసుని కనబడకుండా చేసి అద్దంలో చూసుకుంటే తనలోనే కాంగ్రెస్ కనబడేటట్టు తయారుకావడం అనుకుంటున్నాడా మోదీ!


అద్వానీ కేసుకీ రాముడ్ గుడికీ లంకె పెట్టి హిందువుల్ని రెచ్చగొట్టడం అమానుషం!

Tuesday, 4 April 2017

శ్రీరాఘవం దశరధాత్మజం అప్రమేయం!

దేవుడు దేవుడిలా ఎక్కడో ఉండి
ఇక్కడి మనుషుల్ని శాసించకుండా
మనిషై పుట్టి పెరిగి మనం పడుతున్న 
కష్టాలనే తను కూడా అనుభవించి
ధర్మం తప్పకుండానే కష్టాల్ని అధిగమించి
సఖుడై, గురువై, మార్గదర్శకుడైన
మొదటి అవతారపురుషుడు రాముడు!

చైత్ర శుద్ధ నవమి నాడు
కౌసల్యా దశరధులకు తనయుడై జన్మించి
శ్రీమహాలక్ష్మి అంశయైన సీతకు ప్రాణనాధుడై
ఆదిశేషుని వంటి లక్ష్మణుడికి అన్నయై
వానర శ్రేష్ఠుడైన సుగీవుడికి మిత్రుడై
పరమశివుని అంశయైన ఆంజనేయుడికి ప్రభువై
శరణు కోరిన విభీషణుడికి రక్షకుడై
ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని కలగజేసిన
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముడు

అయోధ్యలో దశరధనందనుడై జన్మించి,
మిధిలలో జనకరాజపుత్రి సీతని పరిణయమాడి,
తండ్రిమాట కోసం అయోధ్యానగరం విడిచి
దండకారణ్యంలో పధ్నాలుగేళ్ళు గడిపి,
రావణుడు చెరబట్టిన సీతను సాధించడానికి
కిష్కింధ చేరి సుగ్రీవుడితో స్నేహం చేసి,
ఆంజనేయుడు ఆనవాళ్ళు కనిపెట్టి చెప్పగానే
రామసేతువు నిర్మించి లంకను చేరి,
దుష్టుడైన దశకంఠ రావణుణ్ణి సంహరించి
సాధు సజ్జనులకు ఆనందం కలిగించిన శ్రీరాముడు
మీకు సమస్త సుఖాలనూ ఇవ్వాలని ఆశిస్తూ -
శ్రీరామనవమి శుభాకాంక్షలు!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...