Sunday, 13 May 2018

అంతట నీవే కనిపించావే,అన్నిట నీవే అనిపించావే - హల్లో మై హిందూయిజం!

*హిందూమతంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు?విగ్రహాలు లేకుండా దేవుణ్ణి పూజించలేమా?

          ఇతరులకి హిందూమతంలో అత్యంత సంక్లిష్టమైన రెండు విషయాలు బహుళదేవతారాధన మరియూ విగ్రహారాధన అనేవి నిజానికి చాలా శాస్త్రీయమైనవి!అయితే వీటిని అశాస్త్రీయం అని రుజువు చేసి మా మతం ఇంతకన్న శాస్త్రీయమైనది గాబట్టి "రండి!రండి!మా మతంలోకి రండి!!మీకెంతో మేలు జరుగునండి!!!" అని చెప్పడం కోసం కొందరు "వేదంలో 'న తస్య ప్రతిమా అస్తి' అని ఉన్నప్పటికీ హిందువులు విగ్రహారాధన చెయ్యడం వేదవిరుద్ధం కాదా, బ్రాహ్మణులు సామాన్యులకి అబద్ధాలు చెప్పి పాపకర్మలు చేయించుతున్నారు" అని  వాదించడం చాలాకాలం నుంచీ జరుగుతున్నది.వాళ్ళు ఈ వాదన ఎందుకు చేస్తున్నారు?అసలు హిందూమాతంలో ఉన్న విగ్రహారాధన గురించిన రంధి వాళ్ళకి దేనికి?మన మతంలో తప్పులు వెతుకుతున్న వాళ్ళకి తమ మతంలో తప్పులు కనపడవా?వాళ్ళ మతంలో తప్పులు ఉన్నాయని వాళ్ళకీ తెలుసు - జస్ట్ కామన్సెన్సుతో వెదికినా దొరికిపోయేటంత భయంకరమైన తప్పులు ఉన్నాయి,మరి మన హిందూమతంలో మనకి తెలియని తప్పుల్ని కూడా కనుక్కోగలిగిన మేధావులకి అవి ఎందుకు కనపడవు?కనపడతాయి!కానీ వాళ్ళ  ధైర్యం యేమిటంటే, మనకి వాళ్ళ మతం గురించే కాదు, మన మతం గురించి కూడా తెలియదు కదా - అంత కష్టపడి ఒక హైందవేతరుడు సంస్కృతం నేర్చుకుని వేదంలో ఏముందో తెలుసున్నవాడు అబద్ధం చెబుతాడా అని మన అమాయకత్వం కొద్దీ నమ్మేస్తామని వాళ్ళ వ్యూహాత్మకమైన ఎత్తుగడ!


          ఈ ప్రశ్నని ఇతరుల బుర్రలో నాటడానికి ముందు వాళ్ళు చాలా హోంవర్క్ చేస్తారు.మీకు కష్టం వస్తే మీకన్న ఎక్కువ ఏడుస్తారు,మీ పుళ్ళు కడుగుతారు,మీ పిల్లల ముడ్డి కడుగుతారు,మీరు ఎన్ని వెధవపనులు చేసినా వొద్దని వ్యతిరేకించరు,మీ పాపాల్ని కూడా వాళ్ళే భరించి మీకోసం దుఃఖించి మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష పడనివ్వరు - ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో నా మేలు కోరేవాడు ఇతను/ఈమె తప్ప ఇంకెవరూ లేరు అనే నమ్మకం తెచ్చుకున్నాకనే ఈ వ్యూహంలో మొదటి అడుగు వేస్తారు కాబట్టి ఆ సందేహం చాలా బలమైనది అనిపిస్తుంది, తమని అమాయకుల్ని చేసి అబద్ధాలు చెప్పి పాపాలు చేయించి తమ కష్టాలకి కారణమైన బ్రాహ్మల మీద ఒళ్ళు మండుతుంది - ఇంకేముంది, జాటర్ ఢమాల్!హైందవం నుంచి క్రైస్తవం లోకి ఒక గొర్రెపిల్ల జంప్! అసలుకి ఆ శ్లోకం మొత్తం అర్ధం తెలిస్తే మనకి బోల్డు ఖోపం వొచ్చేస్తుంది - అది నమ్మేసి వెళ్ళిపోయినవాళ్ళకి ప్రైవేటు చెప్పేసి వెనక్కి లాక్కొచ్చెయ్యాలని కూడా అనిపిస్తుంది. కాని ఏం లాభం?నా చేగోడీలు కొట్టేసిన గ్యానపెసూనాంబ నేను మా రాధకి చెప్పి తన్నిస్తానని బెదిరించినా "పోరా పొట్టి బుడంకాయ్!" అనేస్తుంది గానీ నా చేగోడీలు మళ్ళీ నాకు ఇస్తుందేవిషీ!


          అష్లా దారి తప్పేసిన అంకుల్సులా కాకుండా ఇక్కడే ఉండిపోయిన చిన్న అంకుల్సుకి పెద్ద అంకుల్సు ప్రైవేటు చెప్తే వీళ్ళు కూడా దారి తప్పరు కదా, పాపం!ఎవరూ చెప్పకపోతే యేం, నేను చెప్పుతాను కదా. నేను మాతరం చిన్నవాడినా చితకవాడినా - నా అంతవాణ్ణి నేను!

శుక్ల యజుర్వేదము - అధ్యాయము 32:3 మరియు 32:4:

న తస్య ప్రతిమా అస్తి 

యస్య నామ మహద్యశః | 

హిరణ్యగర్భ ఇత్యేషః | 

మా మా హిఁసీదిత్యేషా | 

యస్మాన్న జాత ఇత్యేష || 

ఏషోహ దేవః ప్రదిశో ను సర్వాః 

పూర్వోహ జాతః స ఉ గర్భే అన్తః | 

స ఏవ జాతః స జనిష్యమాణః 

ప్రత్యఙ్జనాస్తిష్థతి సర్వతోముఖః ||

"O God your mightines , supremeness is the top, you are unmeasurable, only you knows your true form, you created the things like sun, the God who is not born from anything is worshipable, let him not hurt us. The Supreme God is filled everywhere, he was in the mind and in the creations of all times , he is in everything in a secret form. He exists in all times, his strength is filled everywhere."


          ఎంత ఘోరం?ఏమిటీ అన్యాయం!అది రాయే, అయితే?దాని చుట్టూ ఉన్న సమస్తమూ దేవుడే అయి ఆ ఒక్కటీ దేవుడు కాకుండా పోతుందా - అదెట్లా కుదురుతుందీ!శ్రీ భాగవతంలో సృష్టి ఎలా జరిగిందీ అని చెప్పేచోట "ఒక మనిషి కుండని తయారు చెయ్యాలంటే 1).కుండని చేసేవాడు,2).కుండని చెయ్యటానికి అవసరమైన జ్ఞానం,3).కుండని చెయ్యడానికి పనికివచ్చే మట్టీ వేర్వేరుగా ఉంటాయి - కానీ ఈ సృష్టికి మాత్రం ఆ మూడు అంశాలూ భగవంతుడే!" అని బల్లగుద్ది చెప్పారు.


          అబ్రహామిక్ మతాలు దేవుడు ఈ సృష్టికి అవతల ఉన్న స్వర్గంలో ఉంటాడనీ ఈ భూమినీ భూమిపైన కనిపించే సమస్త వృక్ష జంతు సముదాయాన్నీ మనిషి ఉపయోగం కోసం సృష్టించి ఇచ్చాడనీ చెబుతాయి.అందుకే బల్లులూ, కప్పలూ, మండ్రడ్రగబ్బలూ, ఎండ్రకాయలూ. పీతలూ, నత్తలూ, కుక్కలూ, నక్కలూ  అన్నీ వారికి తినటానికి పనికొచ్చేవిగానే కనబడతాయి తప్ప సరిసాటి జీవాలుగా కనబడవు - బైబిల్లో ఖురానులో కూడా మనిషే గొప్పవాడు అని చెప్పి వాటిని పాటించేవాళ్ళకి అహంకారం నేర్పుతున్నాయి.మరి భాగవతంలో  మనిషి కూడా మిగిలిన జంతువుల వంటివాడే, కేవలం అతని జ్ఞానమే అతన్ని అధికుణ్ణి చేసింది అని చెప్పారు.హిందువులకి కోడినీ నెమలినీ చూడగానే సుబ్రమణ్య స్వామి గురుకొస్తాడు.పామును చూడగానే నాగరాజూ వాసుకీ ఆదిశేషుడూ గుర్తుకొస్తారు.ఇదంతా వాటిని కమలహాసనూ శృతిహాసనూ తిన్నట్టు తినకుండా వాటిని రక్షించి ఈ లోకంలో వాటి జాతిని కూడా మిగిల్చి ఉంచడానికి హిందూ ఋషులు చేసిన ఏర్పాటు.


          అసలు హిందువులకి ఉన్నది ఒకే ఒక దైవం - ఈ సృష్టి మొత్తం దివ్యమైనదే!విశ్వం విష్ణుః అని  దైవానికి పురుషతత్వం ఇచ్చిన విష్ణుసహస్రనామావళి మొదలయ్యేదీ శ్రీమాత ఆని దైవానికి స్త్రీతత్వం ఇచ్చిన లలితాసహస్రనామావళి మొదలయ్యేదీ లింగభేదాల కతీతమైన పరమేశ్వరుణ్ణి ప్రపిత ఆని పిలిచేదీ అందుకే!ఉన్నది ఓకే దైవం అని హిందువులకి వేదం చెప్తున్నది. హిందువులు పూజించేది ఒక దైవాన్నే - అందులో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు.


          "హమ్మయ్య! హిందువులు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు అని నిరూపించేశాను - ఒక పనైపోయింది బాబూ!" అని కాస్త గుక్క తిప్పుకునే లోపు "మరి దేవుడు ఒక్కడే అయితే ఇన్ని రూపాలు ఎందుకు? ఇన్ని విగ్రహాలు ఎందుకు?ఇన్ని ఆలయాలు ఎందుకు?ఇన్ని మూఢనమ్మకాల్ని వ్యాపింపజేయటం దేనికి?ఇంత వ్యాపారం దేనికి?ఇవి కూడా వేదంలో ఉన్నాయా!" అని తగులుకుంటారు కదూ వీళ్ళు! అవును, వాళ్ళు అలాగే అంటారు. కాస్త తెలుగు మీరినవాళ్లయితే రూటు మార్చి "మేము వైదికఋషుల్ని తిట్టలేదు, మీరు మాకు లేని దురుద్దేశాల్ని అంటగడుతున్నారు. సంస్కృతం రాక పొరపాటు పడ్డాం ,అంతే! పూర్వఋషుల మంచి బోధనలకి తర్వాత కాలంలో చెడు అర్ధాలు చెప్పి మూఢనమ్మకాల్ని వ్యాపింపజేశారని మాత్రమే అంటున్నాం.స్వార్ధపరులు మధ్యలో పెట్టిన చెడుని తొలగించుకుని మీ మతాన్ని సంస్కరించుకోమని సలహా ఇవ్వడంలో తప్పేమిటి" అని బూకరిస్తారు కూడా!


          అయితే నతస్యప్రతిమా అన్న ఒక్క ముక్కని మనకి చూపించి నిలదీస్తున్నవాళ్ళకి అ పక్కనే పాంచరాత్రం, వైఖానసం కనపడలేదా?అవేమిటీ అని కొందరు హిందువులు కూడా అడుగుతారు, నాకు తెలుసు!ఆలయాల్ని ఎలా నిర్మించాలి. అర్చామూర్తుల్ని ఎలా చెక్కాలి, ఏయే మూర్తులకి ఏయే కైంకర్యాలు చెయ్యాలి అనే విషయాల క్రోడీకరణయే ఆగమ శాస్త్రం. అనేకమంది వ్యక్తుల మేధస్సు నుంచి పుట్టిన  కొన్ని లక్షల సంవత్సరాల వయసున్న హిందూజ్ఞానరాశిని కేవలం ఒక వ్యక్తి యొక్క జ్ఞానరాశిని మాత్రమే గీటురాయిగా తీసుకుని కొలుస్తున్నారు గానీ అక్కడ వేదం ఏమి చెబుతున్నది?ఈ విశ్వం అంతా తానే అయినవాణ్ణి మానవులు పూర్తిగా అర్ధం చేసుకోలేరు అని అంటున్నదే కానీ ప్రతిమల ద్వారా అర్చించరాదనీ వాళ్ళ గ్రంధాలలోలా చూడకూడదు అనీ నిషేధం పెట్టలేదు కదా!


          "మేము మాకు కనపడుతున్నదాన్ని మాత్రమే ఒప్పుకుంటాము, మాకు కనపడనిదాన్ని గురించి ఉన్నట్టు చెప్తే పట్టించుకోము,మీకు కనబడి మాకు కనబడనిదాన్ని కూడా ఒప్పుకోము, మాకు అర్ధం అయ్యేటట్టు చెప్పడం కూడా మీ బాధ్యతే!" అని వాళ్ళ లిమిటేషన్సుని వాళ్ళ అడ్వాంటేజి కింద చెప్పుకుంటూ అడిగితే ప్రతి వస్తువునీ ఒకేసారి పితాసోదరసంతాన(Father,Siblings and Progeny) సంబంధాలతో కలిపి చూసి వాటి చుట్టూ ఉన్న వ్యక్తావ్యక్తాలు రెండింటినీ అర్ధం చేసుకోగలిగినవాళ్ళు ఆ కండిషన్లని పాటిస్తూ చెప్పాలంటే ఎన్ని మెట్లు కిందలి దిగాలి?అందరూ అలా దిగగలరా!పైమెట్లకి యెక్కలేని వాళ్ళని చూసి జాలిపడినవాళ్లకి తప్ప అందరికీ అంత తీరిక ఎక్కడిది?


          ప్రపంచంలోని అన్ని రకాల చింతనల్నీ పరిశీలించి చూస్తే దైవం - సృష్టి అనే వాటి మధ్యన రెండు రకాల దృష్టికోణాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది.వాటిలో ఒకటి ఈ ప్రపంచాన్ని నకారాత్మక దృష్టితో చూడటం:అబ్రహామిక్ మతాలు సృష్టిలో దేవుణ్ణి చూడవు,సృష్టికి అవతల దేవుడు నిర్మించిన స్వర్గాన్ని చేరుకోవడమే వాటి లక్ష్యం.బౌద్ధం కూడా ఈ లోకం నుంచి తప్పించుకుని పోవడాన్ని గురించే చెబుతుంది.దానికి కార్యకారణశృంఖలని తెగగొట్టుకున్న నిర్వాణం ఆని పేరు.హిందూమతంలో "బ్రహ్మ సత్యం!జగత్ మిధ్య!" అనే సూత్రానికి చెప్పే వ్యాఖ్యానం దాదాపు ఈ మతాల వారు చెప్పే విధంగానే ఉంటుంది.దీని ముఖ్యలక్షణం ప్రపంచాన్ని నెగటివ్ అనుకోవడం.


          ఇక రెండవది "ఏకమేవాద్వితీయం!" అని ఈ ప్రపంచాన్ని సకారాత్మక దృష్టితో చూడడం:ఈ సృష్టి మొత్తం భగవంతుని సంకల్పానుసారం జరిగింది కాబట్టి భగవంతుణ్ణి చేరుకోవడానికి దీనినే ఉపయోగించుకుని తరించడం.ఇది హిందూమతంలో తప్ప ఇంకే మతంలోనూ కనపడని పద్ధతి.ఈ సూత్రానికి పండితులు చెప్పే వ్యాఖ్యానం తెలుసుకుంటే దీని స్వభావం ఇలా ఉంటుంది:మామూలు లోకవ్యవహారంలో అహంకారం నకారాత్మమైన గుణమే కానీ భాగవతం అవ్యక్తం నుంచి వ్యక్తం ఏర్పడేటప్పుడు పుట్టిన ఆహంకారాన్ని గురించి చెప్పేచోట "మహదహంకారం","మహత్తత్వం!"అని అంటుంది - శ్రద్ధ ఉంటే వెతికి చూడండి!


          సకల వేదాంతసారమైన అష్టాదశాధ్యాయి గీతలో జ్ఞానషట్కం మొదటి పద్దతిని శ్రేష్ఠం అంటుంది,భక్తి షట్కం రెండవ పద్ధతిని శ్రేష్ఠం అంటుంది,యోగ షట్కం రెండింటినీ కలిపిన పద్ధతిని శ్రేష్ఠం అని చెబుతుంది.సాధకుడు మొదట తన స్వభావం ఏమిటో తెలుసుకుని తన స్వభావానికి తగిన మార్గం ఎంచుకుంటే సరిపోతుంది.అంటే, అబ్రహామిక్ మతాల ప్రభావంలో ఉన్నవారు తాము పాటంచే మార్గం మాత్రమే ఉత్తమమైనదనీ తక్కినవి పాపం అనీ చెబుతుంటే హిందూ ఋషులు సాధకులకి రెంటినీ ఉత్తమమైనవిగా చెప్పి ఎంచుకోవడానికి స్వేచ్చను ఇస్తున్నారనీ భగవంతుణ్ణీ చేరుకోవాలని అనుకోవడమే అపురూపం కాబట్టి అది ఎలా సాధ్యపడినా పాపం కాదనీ అర్ధం చేసుకుంటే చాలు విగ్రహారాధన పట్ల ఇతరులు వ్యక్తం చేస్తున్నవి అర్ధం లేని ఆరోపణలు అని తెలుసుకోవటానికి. అయితే, వాళ్ళు ఒప్పుకోలేనిది యేమిటంటే వాళ్ళు కూడా ఒక స్థాయిలో విగ్రహారాధన చేస్తూనే అది హిందువుల విగ్రహారాధన కన్న ప్రత్యేకంగా ఉండటంతో తాము చేస్తున్నది విగ్రహారాధన కాదనీ హిందువులు చేస్తున్నది మాత్రమే విగ్రహారాధన అనీ కొట్టి పారేస్తున్నారు.కాబట్టి దీనిని కొంచెం లోతుకి వెళ్ళి పరిశీలించడం అవసరమే!


          ప్రాచీనభారతీయఋషులు అవ్యక్తం అనీ ఆధునికవిజ్ఞానవేత్తలు సింగ్యులారిటీ అనీ అంటున్న దాని గురుంచి పాశ్చాత్యులే కాదు భారతీయ మేధావులూ మౌనమే ఆశ్రయించారు.ఇక వ్యక్తం గురించి తెలుసుకోవడానికి వేదం, తోరా. జెండ్ అవెస్త, బైబిల్, ఖురాన్ వంటి ఆధ్యాత్మిక సాహిత్యంలోనూ ఆధునిక ప్రాచీన విజ్ఞానశాస్త్రంలోనూ జరుగుతున్నది ఒకటే - రూపం, భావం, నామం అనే మూడింటికీ మధ్యన ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం, నిరూపించడం, అధ్యయనం చెయ్యడం, ఉపయోగించుకోవడమే! భాగవతంలో చెప్పిన కుండనే తీసుకుందాం. కుండ అనేది మొదట్లో లేదు.ఒక మనిషిలో కుండకు సంబంధించిన జ్ఞానం పుట్టింది, ఆ జ్ఞానంతో ఒక వస్తువు తయారు చేశాడు,దానికి కుండ అని పేరు పెట్టాడు - ఇది ఒక పద్ధతి. అప్పటికే ఉన్న ఒక చెట్టును చూశాడు.ఆకుల్ని మళ్ళీ మళ్ళీ చూసి ఇతర చెట్ల ఆకులతో పోల్చి గుర్తు పట్టాడు. పోలికల్నీ తేడాల్నీ సరిచూసుకుని దీనికి రావిచెట్టు అని పేరు పెట్టాడు - ఇది ఒక పద్ధతి.రూపం అనేది లేనిదాన్ని మనం తెలుసుకోలేము,పైగా రూపం లేనిదాన్ని గురించి తెలుసుకోఅవటం అనవసరం కూడా!ఇలా వ్యక్తమాన ప్రపంచానికి సంబంధించిన సమస్తమైన జ్ఞానంలోనూ రూపం, నామం, భావం అనేవి కలిసే ఉంటాయని తెలిస్తే యెహోవా అనే పేరునీ అల్లా అనే పేరునీ ఉచ్చరిస్తూ అతడు ఉన్నాడు అని చెబుతూనే అతనికి రూపం లేదనటమూ ఉన్నప్పటికీ ఆ రూపాన్ని మానవులు దేవుడు సృష్టించిన ఈ విశ్వంలో చూడకూడదనటమే అశాస్త్రీయమైనది.


          ఈ మూడింటికీ మధ్యన ఉన్న సంబంధాల్ని గురించి విశ్లేషించి చెప్పే ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా material representation, spiritual manifestation మధ్యాన్ ఉన్న తేదాల్ని గురించి పరిశీలించి  హిందూ ఋషులు చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నది! దీని ప్రకారం హైందవేతరులు పాటిస్తున్నది Ascending symbolism:ఉదాహరణకి ప్రజల్లో దేశభక్తి అనే ఒక abstarct conceptని తేలిక పద్ధతిలో అలవాటు చెయ్యాలంటే ఆ దేశానికి జాతీయపతాకం అనే ఒక concrete symbol కావాలి.అయితే పతాకం డిజైనుని మార్చవచ్చు.ఇక్కడ భావానికి రూపం అవసరమే కానీ గట్టి సంబంధం ఉండదు.క్రైస్తవుల శిలువ, మహమ్మదీయుల నల్లరాయి వస్తువులే, వాటికి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం కూడా విగ్రహారాధనయే - కానీ లూజు కనక్షను కాబట్టి వొప్పుకోరు, అంతే!ఇక హిందువులు పాటిస్తున్నది Descending Symbolism:ఇందులో భావానికీ రూపానికీ ఖచ్చితమైన సంబంధం ఉంటుంది - మీ ముఖానికీ మీ ఫొటోకీ ఉన్న సంబంధం ఏమిటో అంత గట్టి సంబంధమే ఇక్కడా ఉంటుంది.


          విషయం ఏమిటంటే, సృష్టిని గురించి తెలిపే జ్ఞానంలో సమన్వయం సాధించాల్సిన రూపం, నామం, భావం అనేవాటికి సంబంధంచి హిందువుల జ్ఞానమే సమగ్రమైనది.  హైందవేతరులు ఆ మూడింటిలో ఒకదాన్ని నిరాకరిస్తున్నారు కాబట్టి అదియే అశాస్త్రీయం, అసమగ్రం, అహేతుకం, అసంబద్ధం, అక్రమం, అన్యాయం, అయోమయం, జ్ఞానము పట్ల అలసత్వం, దైవము పట్ల అపరాధం!


*హిందువులని ఎలా గుర్తు పట్టాలి?హిందూమతం యొక్క స్వభావం ఏమిటి?

1).నమస్కారం:ఒక హిందువు ఇంకొక వ్యక్తిని పలకరించే సందర్భంలో రెండు చేతుల్నీ జోడించి నమస్కరించడం సంప్రదాయం.ప్రాచీన కాలం నుంచి దీనిని హిందువులే ఎక్కువ పాటించడం వల్ల ఇది ఈ మతం వారికి సంబంధించినదిగా భావించి ఇతర మతస్థులు కొందరు దీనికి విముఖతని ప్రదర్శిస్తున్నారు. ఆధునికత కోసం కొందరు హిందువులు కూడా పాటించడం లేదు.కానీ ఇందులో ఒక విశేషం ఉంది.ఇంద్రియపంచకంలో స్పర్శకి స్థానం మన అరచేతులు.ప్రతి ఇంద్రియమూ తనకి నిర్దేశించిన పనిని చేస్తున్నప్పుడు అక్కడ పుట్టిన నాడీప్రచోదనలు మెదడును చేరినప్పుడు మనకి స్పర్శకి సంబంధించిన సమాచారం తెలుస్తుంది.ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూడగానే రెండు చేతులూ జోడించి ఆ వ్యక్తి కళ్లలోకి సూటిగా చూస్తూ చిరునవ్వుతో నమస్కరించడం అంటే ఆ వ్యక్తిని చూస్తున్నందుకు మనమ అనుభవిస్తున్న్ ఆనందాన్ని అతనికి వ్యక్తం చెయ్యడం అని అర్ధం చేసుకోవాలి.


          సమస్థాయి వారికి నమస్కార ప్రతి నమస్కారాలు చాలు.పెద్దలకి పాద నమస్కారం చెయ్యాలి, అత్యంత గౌరవనీయులకి సాష్టాంగప్రమాణం చెయ్యాలి.స్త్రీలు ఎవరికైనా సరే సాష్టాంగప్రమాణం చెయ్యాల్సిన పనిలేదు, మోకాటి తండా వేసి తలని నేలకి తగిలించితే చాలును. హందూమతంలో సుకుమారులైన స్త్రీలకి విధించినదాన్ని రెటమతంలో పురుషులు అనుసరిస్తున్నారు - భశుం!


2).దర్శనం:సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్న సత్యం ప్రకారం సనాతనధార్మికశ్రేష్ఠులు వ్యక్తికి తమ బోధనల్ని నిజమో అబద్ధమో తేల్చుకోవటానికి అతని అనుభూతినే ప్రమాణం చేశారు.ఇహలోకంలో తను పొందాల్సిన సుఖాలతో పాటు భగవంతుణ్ణి సైతం తన కన్నులతో చూడటం ద్వారా ఆనందానుభూతిని పొందగలిగే మార్గాలను చూపించారు.ప్రతి హందువుకీ ఎవరో ఒకరు గురువు ఉంటారు, ఉండాలి.అవకాశం కుదిరినప్పుడు గురుసందర్శనం తప్పక చెయ్యాలి.ఇక ఆలయసందర్శనం మరింత ముఖ్యమైనది.హిందువుల అర్చామూర్తులు పెద్ద పెద్ద  అందమైన కళ్లతో ఉండటానికి దర్శనం యొక్క ప్రాధాన్యతయే కారణం.



          శిల్పులు అర్చామూరులను చెక్కేటప్పుడు కూడా కళ్ళను ఆఖర్న మరింత శ్రద్ధ తీసుకుని చెక్కి పూర్తి చేస్తారు.మనం ఇతర్లతో మాట్లాడేటప్పుడు అనుకోకుండానే వాళ్ళ కళ్ళల్లోకి చూస్తాం కదా,అదే పద్ధతిలో అర్చామూర్తిని చూసేటప్పుడు అర్చామూర్తి మనవైపు చూస్తున్నట్టు అనిపించడం వల్ల దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడనే నమ్మకం కలిగి కష్టాలని ఎదుర్కునే ధైర్యం పెరుగుతుంది!


3).ఇంద్రియనిగ్రహం:హిందూమతానికి ఒక ప్రవక్త, ఒక పుస్తకం, ఒక నిబంధన, ఒక వేషం లేకపోవడానికి ముఖ్యమైన కారణం వ్యక్తిని విడి అస్తిత్వంలో కాకుండా వ్యష్ఠిలో నిలబెట్టి చూడటం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి గౌరవం పొందాలంటే అతనికి అవసరమైనప్పుడు సహాయం చెయ్యాలి. ఈ సహాయం చేసేటప్పుదు సొంత లాభం కొంత తగ్గించుకోవాలి. నష్టాన్ని మౌనంగా భరించాలే తప్ప ఫలానావాడికి సాయం చేసి నేను నష్టపోయాను బొరోమని దుఃఖించకూడదు.


          ఈ త్యాగబుద్ధి దానంతటది రాదు గనక సనాతనులు ఇంద్రియనిగ్రహాన్ని ప్రతిపాదించారు.హిందువులకి పూర్వఋషులు బోధించిన నిత్యపూజాదికాలు, ప్రత్యేక తిధులలో జరిగే విశేష పూజలు, సంతాన సాఫల్యత, గ్రహదోష నివారణ వంటి కామితార్ధ క్రతువులు, రకరకాల యజ్ఞవిధులు అన్నింటిలోనూ ఇంద్రియనిగ్రహం, ప్రశాంతచిత్తం సాధించటానికి ఉద్దేశించిన పద్ధతులు ఇమిడి ఉండటం మనం గమనించవచ్చును.


4).స్వేచ్చాప్రియత్బం:"అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీయని వేల్పు,మోహనమున దానెక్కిన బారని గుఱ్ఱము, గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!" - ఈ కవి గానీ హిందువు కాకపోయి ఉంటే "మ్రొక్కిన వరమీయని వేల్పు"ని కూడా "గ్రక్కున విడువంగవలయు" అనే ధైర్యం చెయ్యగలడా?తను దీనత్వంలో ఉన్నప్పుడు సహాయం చేసినవాడికి దైవానికి నమస్కరించినంత భక్తితో నమస్కరించడం నుంచి తన ఇంటిలోని చిన్నపిల్లల్ని చిన్ని కృష్ణుడితో పోల్చుకుని మురిసిపోవడం వరకు హిందువులు దేవుణ్ణి చూసి, విని, స్పర్శించి పొందే ఆనందాన్ని దేవుణ్ణి చూడాలని అనుకోవడానికే భయపడే ఇతర మతస్థులు ఎట్లా తెలుసుకోగలరు?చచ్చాక వెళ్తారో లేదో తెలియని స్వర్గం మీద పేరాశతో ఇక్కడ అనుభవించాల్సిన ఆనందాన్ని దూరం చేసుకుంటున్న వ్యర్ధజీవులు ధన్యాత్ములైన హిందువుల్ని చూసి జాలి పడుతున్నారే!


          అయితే, ఒక లిటిగేషను మాత్రం ఉంది.పూర్వఋషులు పెట్టిన సంప్రదాయాల్ని ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా చెయ్యడం మాత్రం ఎంతో ప్రమాదం!ప్రాచీన కాలపు సనాతన ధర్మం నుంచి స్పూర్తి పొందిన యూదుమతం, జొరాష్ట్రియన్ మతం ప్రాభవాన్ని కోల్పోయి క్రైస్తవ, ఇస్లామిక్ మతాలు ఉనికిలోకి రావడానికి అవి పుట్టే కాలంలో అక్కడ ఆయా పాత మతాలని అనుసరిస్తున్నవారు వాటిని అర్ధం చేసుకుని ఇతరులకి బోధించి కాలానుగుణమైన మార్పులు చేసుకోవడానికి బదులు ఒక చట్రానికి బిగించివేసి సంస్కరణని వ్యతిరేకించి రవీంద్రుడు వర్ణించిన శిధిలాలయం స్థితికి చేరుకున్నారు.


*మతము లేమియు లేని కాలాన హైందవమే ధరణి యంతట వెలిగినదా?

          గ్రీకు సాహిత్యంలో కన్యరాశి గురించిన ఒక కధ ఉంటుంది.Aratos ముఖతః మనకు తెలుస్తున్న కధ ఇలా ఉంటుంది.తొలినాటి స్వర్ణయుగంలో ఆమె మానవకాంతయే.న్యాయానికి గుర్తుగా ఉండి ప్రజలను సన్మార్గంలో నడిపిస్తూ ఉండేది.ఈ కాలంలో ప్రజలు కుట్రలు చెయ్యకుండా కలహాలు లేకుండా సుఖశాంతులతో బ్రతికేవాళ్ళు.దీని తర్వాతిదైన రజతయుగంలో ఈమె మానవసమూహాల నుంచి దూరమై పర్వతగుహలలో నివసిస్తూ అప్పుడప్పుడూ వచ్చి వారి పాపకర్మల నుంచి విముక్తుల్ని చేసి మళ్ళీ పర్వతగుహలలోకి వెళుతూ ఉండేది.మనిషి కత్తిని కనుక్కుని తొలిసారి ఆవుని చంపగానే తామ్రయుగం మొదలై ఈమె ఇక భూమి నుంచి వినువీధికి చేరి తారగా మారిపోయింది!ఇందులో రెండు విశేషాలు ఉన్నాయి.మొదటిది గోవధని నిరసించదం,రెండవది మానవ సమాజంలో ధర్మం పతనమై పోవడాన్ని వైదిక సాహిత్యంలోని యుగవిభజనని పోలిన కొన్ని దశలని ఉదహరిస్తూ చెప్పడం.కొందరు అన్ని చోట్లా మనుష్యుల ఆలోచనలు ఒక్కలాగే ఉండటం వల్ల ఎవరికి వారు కల్పించుకుని ఉండవచ్చును కదా,ఇక్కడినుంచే వెళ్ళాయనడానికి గట్టి ఆధారం లేదు కదా అంటున్నారు గానీ ఒకటీ రెండూ గాక నాలుగింట మూడు వంతులు కలవడం విడివిడి ఆలోచనల గజిబిజి ఎదుగుదల పద్ధతిలో ఎట్లా సాధ్యం?అసలు విలువిద్య ఏమాత్రం తెలియని వాడు కూడా పదిసార్లు ప్రయత్నించితే ఒకసారి లక్ష్యాన్ని కొట్టడంలో ఆశ్చర్యం లేదు.కానీ ఒక వ్యక్తి పదింటిలో కనీసం ఆరుసార్లు లక్ష్యాన్ని కొడితే అతనికి విలువిద్య వచ్చి ఉండాలి అనేది ఖాయం, అవునా?


          అబ్రహామిక్ మతాల ప్రభావంలో ఉన్నవారు నమ్మలేరు గానీ వాస్తవాలని వెలికితీసే నిష్పక్షపాత బుద్ధితో పరిశోధనలు చేసిన ప్రసిద్ధ చరిత్రకారులు ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ అతి ప్రాచీన కాలంలోనే హిందూమతం ఉనికిలో ఉందనడానికి సాక్ష్యాలను చూపిస్తున్నారు.Archaeologists found thirty thousand year old Poompuhar,Tamil Nadu had trade relations with Greece. Jwalapuram in Karnool district of Andhra Pradesh is dated 74,000 years ago. Early Roman settlements have been excavated near Madurai,Tamil Nadu. Lord Vishnu’s Idol  was unearthed in Russia.It is dated before Christ was thought of. The Construction of Chichen Itza resembles Madurai Meenakshi temple. Roman Emperors with Sri Vaishnava Marks are found in Egypt. Australia provides evidence of ancient people with Vaishnava Marks. Cookes Island,New Zealand, Nazca Lines of Peru are accurately described in the Kishkinta Kanda of Ramayana. Greek Historians Strabo,Megasthanes describe Krishna and Shiva concepts having been appropriated and modified by Greeks. Rig Veda is dated at 5000 years ago and is considered as the First Literary Work Of The World.Bjoomipooja was parcticed in rome .“…Historians and poets of Imperial Rome give us a description of the solemn ceremony observed on the occasion of marking out the limits of a new settlement…. a bull and a cow were yoked together, the cow being placed on the inner side, a furrow was made with a plough round the proposed site. This was done on a lucky day to satisfy religious scruples….” This procedure of choosing an auspicious day with reference to astrology and breaking the ground for a new city with a plough drawn by kine is Vedic practice.ఇక్కడి నుంచే అక్కడికి సంస్కృతి ప్రవహించినదనడానికి బలమైన సాక్ష్యం వాటి పతనానికి దారి తీసిన చారిత్రక దశలని గమనించితే దొరుకుతుంది.


          Rodney Stark అనే సామాజిక శాస్త్రవేత్త క్రైస్తవ మతం యొక్క ఎదుగుదలను గురించి కొన్ని  విప్లవాత్మకమైన సూత్రీకరణలని చేశాడు.క్రైస్తవులూ క్రైస్తవేతరులూ కూడా ఒప్పుకు తీరాల్సిన పరమ సత్యాలను కొన్నింటిని చెప్పాడు.తొలినాటి Jesus Movement యొక్క ప్రధాన కర్తవ్యం అప్పటి రోమన్ సామ్రాజ్యం మీద రాజకీయమైన తిరుగుబాటు చేసి యూదులకి రాజ్యాధికారాన్ని సాధించి పెట్టడం మాత్రమే.ఇప్పుడంటే అది బీదసాదలకి వారిమీద దేవుని కరుణని పంపించి ఉద్ధరించే మతం అయింది గానీ తొలినాళ్ళలో Hellenized Jews అనే మధ్యతరగతి కుటుంబీకులూ ఉన్నతతరగతి కులీన కుటుంబాల వారూ రోమన్ అధిపత్యం మీద అప్పటి నగర జీవితంలోని సంక్లిష్టతని ఉపయోగించుకుని నడిపిన రహస్య విప్లవం!


          రోమన్ నాగరికతలో ప్రారంభం నుంచీ ఆధ్యాత్మికత బలమైనదిగా ఉండేది.Julius Caesar రాజకీయపరమైన సర్వాధికారి కావటానికి ముందు అతని హోదా Pontifex Maximums,అంటే ప్రధాన పూజారి.రోమన్ ప్రభువులలో చాలామంది నుదుటి మీద భారతదేశంలోని శ్రీవైష్ణవుల తిరునామం ధరించేవారు.సీజర్,అగస్టస్ వంటివారు భారతదేశంలోని "రాజు దైవాంశసంభూతుడు" అనే సూత్రాన్ని పాటిస్తూ తమకు తామే దైవత్వాన్ని ఆపాదించుకున్నారు.బహుశా, క్రైస్తవంలో జీసస్ తప్ప ఇంకే మానవుడూ దైవంతో సమానం అని భావించరాదనే నిషేధం ఉండటానికి ఈ రోమన్ ప్రభువుల యొక్క సంప్రదాయం పట్ల వారికి గల వ్యతిరేకతయే కారణం కావచ్చు!ఒక చిత్రమైన విషయం ఏమిటంటే ఇవ్వాళ గొర్రెల కాపరి అని క్రైస్తవులు నమ్ముతున్న జీసస్ క్రీస్తు కూడా రాజరిజపు వారసత్వం ఉన్న కులీన కుటుంబానికి చెందినవాడే.


          హిందూ సమాజం లాగే అప్పటి రోమన్ సామాజిక వాతావరణం కూడా బహుళదేవతారాధన, తాంత్రికపూజలు వంటివాటితో కూడి ఉండేది. మతస్వేచ్చ చాలా ఎక్కువ, పున్నానికీ అమాసకీ ఇదుగో నాది కొత్త మతం అంటే అదుగో నాది కొత్త మతం అన్నట్టు కొత్త కొత్త మతాలు పుట్టుకొస్తూ ఉండేవి.అన్నింటినీ ఆదరించే లక్షణం ఉండేది, కానీ మరీ అసభ్యకరమైన గ్రీకుల త్రాగుడు దేవుణ్ణి కొట్టుకొచ్చేసి పునర్జన్మ ఎత్తించేసిన The cult of Bacchus అనేదాన్నీ నరబలులు చేస్తున్న Celtic Druids తెగనీ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు.Judea దండయాత్ర తర్వాత తిరగబడుతున్న యూదులకి కూడా అణిచివేత సెగ తగిలింది.ఈ నేపధ్యంలో జీసస్ ఉద్యమం మొదలైంది.


          ఒక విశ్లేషకుడు "Early persecutions of Christians were probably carried out at the whim of provincial governors and there was also occasional mob violence. Christians’ refusal to sacrifice to Roman gods could be seen as a cause of bad luck for a community, who might petition for official action" అని చెప్పడం వల్ల అప్పట్లో క్రైస్తవాన్ని పాటించడం అంటే చావుని కొని తెచ్చుకోవడం అన్న పరిస్థితి ఉందనేది తెలుస్తుంది."రోం నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి!" అనే కధ క్రీ.శ 64 నాటిది.అతడు నిజంగా అలా చేశాడో లేదో తెలియదు గానీ ఇప్పటి రాజకీయ నాయకుల్లాగే అది క్రైస్తవుల దుష్ప్రచారం అని చెప్పి చాలామంది క్రైస్తవుల్ని వూచకోత కోయించాడు.అది క్రైస్తవం మీద జరిగిన మొదటి అతి పెద్ద దాడి.


          క్రీ.శ. 250లో రెండవసారి Decius కాలంలో మరొకసారి పెద్ద ఎత్తున క్రైస్తవుల వూచకోత జరిగింది.రాజ్యక్షేమం కోసం కొన్ని బలులని చెయ్యాల్సిందని ప్రతి ఒక్కరినీ ఆజ్ఞాపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.మిగిలిన వారికి అభ్యంతరాలు లేకపోవటంతో చేశారు గానీ వీటి పట్ల వ్యతిరేకత మీద ఏర్పడిన మతం కావటంతో అప్పటి క్రైస్తవులు వ్యతిరేకించారు.రాజు పనిగట్టుకుని క్రైస్తవుల మీద పగతో ఆజ్ఞలు ఇవ్వలేదు గానీ వీళ్ళు మాత్రమే వ్యతిరేకించినందువల్ల తిరుగుబాటుగా భావించారు.అయితే, క్రీ.శ. 261 నాటికి ఈ శాసనం రద్దు చేసేశారు.భారతదేశంలోని బౌద్ధమతం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే పుట్టింది.అయితే బుద్ధుడు మంచి పాండిత్యం గలవాడు కావటంతో శాంతమార్గంలోనే వ్యతిరేకులని కూడా అనుచరులను చేసుకోగలిగాడు.అప్పటి క్రైస్తవులలో పాండిత్యం లేకపోవటం, బౌద్ధం విజృంభించినప్పుడు వెనక్కి తగ్గి కొంతకాలం గడిచాక తమ పాండిత్యంతో బౌద్ధులని గెలిచిన హిందువుల వలె గాక అప్పటి రోమన్లు క్రూరమైన అణిచివేతని పాటించడం వల్ల రోమన్ సామ్రాజ్యం అంతమైపోయి క్రైస్తవం వృద్ధిలోకి వచ్చిందని మనం అర్ధం చేసుకోవాలి.


          Rodney Stark విశ్లేషణ ప్రకారం తొలినాటి క్రైస్తవులు సాయుధ పోరాటం వైపుకి పోకుండా అణచివేతని సహనంతో భరించి వినయశీలతని కలిగి ఉండటమే ఆ మతం యొక్క పురోగతికి మొదటి కారణం.ప్లేగు వ్యాధి ప్రబలి ఇతరులు నగరాలని ఖాళీ చేసి వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళు అక్కడే ఉండి రోగులకి సేవ చేస్తూ వారి అభిమానం సంపాదించేవాళ్ళు క్రైస్తవం birth control, abortion, infanticide వంటివాటిని నిషేధించడంతో  లైంగిక నిష్పత్తి కూడా క్రైస్తవం ఎదగడానికి దోహదం చేసింది.క్రైస్తవుల ముఖ్యమైన సూక్తుల్లో "redemption through sacrifice" అనేది అమాయకులకి ఓదార్పుని ఇచ్చింది.ఒకరికొకరు ఓదార్పును ఇచ్చుకుంటూ కష్టాలని ఎదుర్కోవడం బయటనుంచి చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించి కొంతమందీ మహిళలకి కూడా ప్రార్ధనావిధులని అప్పగించడంతో మహిళలూ పెద్ద ఎత్తున ఆ మతంలోకి చేరిపోయారు.


          ఇప్పటివరకు క్రైస్తవం యొక్క ప్రాభవాన్ని పెంచిన దుర్మార్గాన్ని Constantine మీదకి నెట్టేసిన వారికి ఈ విశ్లేషణలు కొంత ఇబ్బందిగానే అనిపిస్తాయి.క్రీ.శ. 312లో Battle of Milvian Bridge జరుగుతున్నప్పుడు తనకి క్రైస్తవమతం గెలుపుని ఇచ్చినట్టు చెప్పుకుని క్రీ.శ. 313లో క్రైస్తవుల మీద నిషేధాన్ని ఎత్తేస్తూ Edict of Milan పేరుతో liberty to follow that mode of religion which to each of them appeared best అని ప్రకటించాడు. అయితే, తన గెలుపుకి క్రైస్తవమే కారణం అని క్రైస్తవులకి ఉత్తరాలు రాయడం,చర్చిలకి ధనసహాయం చెయ్యడం నిజమే, కానీ ఇతర మతాల్ని కూడా ఆదరించాడు,ముఖ్యమైన విషయం,తన Pontifex Maximus అనే హోదాని చివరి వరకు కొనసాగించాడు!ఏది ఏమైతేనేం, Constantine పుణ్యాన అలా వ్యతిరేకత తగ్గడం వల్ల క్రైస్తవులు తమ మతంలో చేసుకున్న మార్పుల్ని అతనికి అంటగట్టి ఉంటారు.Constantine తర్వాత క్రమేణ వ్యతిరేకత తగ్గి బలం పెంచుకున్న  క్రైస్తవాన్ని క్రీ.శ. 380లో అప్పటి Theodosius I క్రైస్తవం రోమన్ సామ్రాజ్యం యొక్క రాజమతం అని ప్రకటించడంతో క్రైస్తవం యొక్క మహర్దశ మొదలైంది.


          ఈ Theodosius చెక్కించిన Edict of Thessalonica మీదనే  మొదటిసారి Father, Son and Holy Spirit అనే  క్రైస్తవం యొక్క Holy Trinity ప్రస్తావన కనబడుతుంది.ఇప్పటివరకు అణచివేతకి గురయిన క్రైస్తవం ఇప్పటినుంచి ఇతర మతాల్ని అణిచివెయ్యడం మొదలుపెట్టింది.ఇప్పటి క్రైస్తవానికి దఖలుపడిన Catholic Church  అనే పేరు అప్పుడు ఖాయమైనదే. రోమన్ సామ్రాజ్యాన్ని కూల్చివేసిన చాలామందికి ఆధ్యాత్మికత పట్ల నిష్ఠ తక్కువై అధికారమే పరమావధి కావడంతో చాలా తేలిగ్గా క్రైస్తవంలోకి మారిపోయారు.


క్రైస్తవం పుట్టుకకు ముందరి గ్రీకోరోమన్ ఆధ్యాత్మిక ప్రపంచం ఇలా ఉండేది:

-------------------------------------------------------------------------------------------------

The Pantheon: the gods and goddesses of mythology.

The old gods -- Chronos, Uranus, and others overthrown by the Olympian deities

The Titans - defeated allies of the old gods -- friends of humanity -- Prometheus, the fire-bringer was a titan.

The demi-gods -- the "almost gods" -- like Ganymede, chosen as servants by the Olympians

The heroes -- humans who achieved divine status -- Hercules was the most famous example. Note that the gap between god and human was not so great as to be uncrossable.

Local deities -- each region, city, town, and village had its own tutelary gods, and their were gods who protected field boundaries, storehouses, and every other imaginable thing of value.

Nature spirits -- each tree, stream, hill, and other natural feature had its in-dwelling spirit. Dryads in trees, hydrads in springs and streams, oreads in hills and mountains.

lares and penates -- the early Romans were ancestor worshippers, and each family and family home had its "household gods."

Genii -- in addition, each individual had his or her own "genius," a tutelary deity transformed by the early Christians into the "guardian angel."

Magic and superstition -- people needed to believe that they had protecting spirits, because they were very superstitious and that they were always in danger of "bad luck" on Fridays, the 13th of the month, after having broken a mirror, when their stars were not in a good alignment, and so forth. They also believed in witches, vampires, the evil eye, and other malevolent forces.

There were alternate systems of belief for those dissatisfied with the chaotic traditional religious forms:

Greek philosophical systems (Skepticism, Epicurianism, Stoicism) that offered moral bases but no hope.

------------------------------------------------------------------------------------------------

తమాషా ఏమిటంటే, adapt కావటం కోసం దేనినైనా adopt చేసుకోగలిగిన క్రైస్తవమతప్రచారకులు వీటిని కూడా క్రైస్తవంలోకి దించేశారు!


          గ్రేటరు గుడ్డు కెసం చేసే స్మాలరు సిన్ను పేరుతో మతప్రచారం కోసం ఏమాత్రం సిగ్గుపడకుండా ఎన్ని ఘాతుకాల్నైనా చెయ్యగలరు క్రైస్తవులు!తిరువళ్ళువార్ రోజూ సముద్రతీరానికి వెళ్తూ ఉండేవాడనీ, అక్కడున్న శ్రీలంకకి చెందిన ఒక వ్యాపారి బైబిలు ఇస్తే చదివి ముగ్ధుడైపోయి దానినే తిరుక్కురళ్ పేరుతో తమిళంలోకి అనువదించాడనీ అనటం ఇంకెవరన్నా చెయ్యగలరా?George Uglow Pope, the man who spread all these lies accepted his evil plan on his deathbed, "we're Christian missionaries, and we go there to convert peple, and if you want to convert people - you must read their own language, and I packed them"  in 1936 AD.But how could we make current generation tamil Christians to think about this deception?It is too late, now they won't even listen to you - because we were the sinners that spreading lies against Christianity!సెయింట్ ధామస్ - ఇండియా నివాసం గురించి భారతదేశం బయట ఉన్న క్రైస్తవులు ఎవరూ ఒప్పుకోరు,అసలు వారికి ఈ కధలు తెలియనే తెలియదు - అది భారతీయ క్రైస్తవుల కోసం మాత్రమే సృష్టించబడిన అబద్ధం!కానీ గొర్రెల కాపరి "నీకు నిన్న పెట్టింది చిట్టు,ఇప్పుడు పెట్టింది తవుడు!" అని చెప్తే "అబ్బో!ఎంత గొప్ప వెరైటీ?" అని  సంతోషం ప్రకటించే వెర్రిగొర్రెల వంటి భారతీయ క్రైస్తవులు మాత్రం నమ్మారు, నమ్ముతున్నారు, నమ్ముతూనే ఉంటారు.


          రెండు వందల ఏళ్ళ క్రితం ఎక్కడ భయంకరమైన అణచివేతని ఎదుర్కొన్నదో అక్కడ రాజమతం హోదాని సంపాదించుకోవడం విజయం అయితే ఎవరి కోసం జీసస్ క్రీస్తు ఉద్యమించాడో ఆ యూదులకి ఈ మతంలో స్థానం లేకపోవడం విషాదం. ప్రపంచంలోని ఇతరుల కోసం దుఃఖించే క్రైస్తవ సంఘాలు క్రీస్తు యొక్క స్వజనం కోసం ఎందుకు దుఃఖించరో?బహుశా, హిట్లరు లాంటి ఇంకో పదిమందిని ప్రోత్సహించి ఒక్క యూదు కూడా భూమి మీద లేకుండా చేశాక, అప్పుడు యూదుల సమాధుల ముందు మోకరిల్లి దుఃఖిస్తారు కాబోలు! అది కూడా తమ పాపాలకి క్షమాపణ కోసమేనేమో?


          రోము నగరంలో జీసస్ క్రీస్తు పుట్టిన 570 సంవత్సరాల తర్వాత మక్కాలో మరొక ఉద్దండపిండం పుట్టాడు. భక్తులు/అనుచరులు/బానిసలు మహమ్మదు అని పిలుచుకునే ఆఖరి ప్రవక్త అసలు పేరు అహ్మద్ ఖురేషీ.ఈ మహమ్మద్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు:1).క్రీ.శ. 570- మక్కాలో జననం (అప్పటికే తండ్రి చనిపోయాడు), 2).క్రీ.శ. 576 - తల్లి కూడా మరణించడంతో అనాధగా మారాడు, 3).క్రీ.శ. 595 - ఖదీజా అనే తనకంటే వయసెక్కువున్న ధనవంతురాలైన విదవరాలితో వివాహం, 4).క్రీ.శ. 610 - దేవదూత ద్వారా అల్లా తనకు వాక్యోపదేశం చేసాడని మొట్టమొదటి ప్రకటన, 5).క్రీ.శ. 619 - చిన్నాన్న మృతి, 6).క్రీ.శ. 622 - మక్కా నుండి మదీనాలో స్థిరపడటానికి ప్రయాణం (హిజ్రా), 7).క్రీ.శ. 623 - మక్కా ప్రయాణీకుల గుడారాలపై (caravans) దాడి చేయాలని తన అనుచరులకు ఆజ్ఞ, 8).క్రీ.శ. 624 - బద్ర్ యుద్ధంలో విజయం, 9).క్రీ.శ. 624 - ఖానుఖా యూదులను మదీనా నుండి నిర్మూలించుట, 10).క్రీ.శ. 624 - అబూ అఫక్‌ను హతమార్చమని అనుచరులకు ఆజ్ఞ, 11).క్రీ.శ. 624 - అస్మా బిన్త్ మర్వాన్‌ను హతమార్చమని ఆజ్ఞ, 12).క్రీ.శ. 624 - కబాల్ అష్రఫ్‌ను హతమార్చమని ఆజ్ఞ, 13).క్రీ.శ. 625 - ఉహద్ యుద్ధంలో ఓటమి, 14).క్రీ.శ. 625 - నాదిర్ యూదులను తరిమివేయుట, 15).క్రీ.శ. 627 - ట్రెంచి యుద్ధంలో విజయం (దీనినే ఖందక యుద్ధం అంటారు), 16).క్రీ.శ. 627 - ఖురైజా యూదుల ఊచకోత, 17).క్రీ.శ. 628 - మక్కావారితో హుదైబియా సంధి, 18).క్రీ.శ. 628 - ఖైబర్ యూదులను నాశనంచేసి మిగిలినవారిని తన నియంత్రణలోకి తెచ్చుకొనుట, 19).క్రీ.శ. 629 - మూతా యొద్ద క్రైస్తవ ప్రాంతాలపై దండయాత్రలో ఓటమి, 20).క్రీ.శ. 630 - ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆశ్చర్యకరంగా మక్కా కైవసం, 21).క్రీ.శ. 631 - క్రైస్తవ ప్రదేశమైన తబూక్‌పై దాడి. ప్రతిఘటన లేకుండానే కైవసం, 22).క్రీ.శ. 632 - జబ్బుపడి మరణం.


           క్రైస్తవులు తొలినాళ్ళలో అణచివేతకి గురయి కొన్ని శతాబ్దాల పాటు గుంటకి గుక్కెడు నీళ్ళు తాగుతూ దేశాలు పట్టి తిరుగుతూ రహస్య జీవితం గడిపి మెల్లమెల్లగా ప్రజల నుంచి సానుభూతిని పొందుతూ ప్రజలకి సేవలు చేస్తూ ఎదిగాకనే చేజిక్కిన అధికారం పోకుండా ఉండేటందుకు ఇతర మతాలను తుడిచిపెట్టటం మొదలుపెట్టారు గానీ ముస్లిములు మొదటినుంచీ ఎదిరించినవాళ్ళని కత్తికో కండగా నరుకుతూ రక్తపిశాచుల మాదిరి అనాగరికతకి తుదిమెట్టున నిలిచి ఎంతటి ధైర్యస్థుడికైనా భయం గొలిపేటంత క్రూరమైన యుద్ధాలతో ఇతర మతాల్ని అణిచివేస్తూనే వ్యాపించారు.


          అణిచివేతకి గురవడం అంటే ఏమిటో వారికి తెలియదు - దానికి కారణం సంఖ్య తక్కువగా ఉన్నపుడు టకియానీ సంఖ్య తగినంతకి చేరుకున్నప్పుడు జెహాదునీ పాటించే విధానం వారిది.తొలినాళ్ళలో ప్రవక్తని చాలా హింసించారు,అణిచివెయ్యాలని చూశారు,చంపెయ్యాలని కూడా చూశారు.అందుకే విధిలేక యుద్ధాలు చెయ్యాల్సి వచ్చింది అని కొందరు ముస్లిం చరిత్రకారులు సమర్ధించుకుంటున్నారు గానీ అది అబద్ధం! .ప్రపంచంలోని ప్రవక్త యొక్క జీవితచరిత్రలలో మొట్టమొదటిదైన Ibn IshaQ రచించినది. అది ఏ విధమైన సందేహాలకి ఆస్కారం ఇవ్వకుండా కొన్ని వాస్తవాలని నిర్మొహమాటంగా చెబుతుంది.

=======================

          A year after his arrival in Medina, and thirteen years after his ‘call’, the apostle of Allah prepared himself for war in obedience to the command of Allah that he should attack the idolaters. He was then fiftythree years old.




          Religious hostility and a measure of personal resentment against the Quraysh idolaters were deeply implanted in the mind of the apostle. He had sworn vengeance against them and, now that his followers were settled in Medina, he felt the time had come to make good his threats.




          Not far from Medina was the main caravan route which the Quraysh used in their trade with the north. Frankincense, silk, precious metals and leather passed regularly back and forth between Mecca, Syria, Abyssinia, and the Yemen. The prizes were too rich not to add an irresistible weight to basically religious and political impulses. And attack on the caravans of the Quraysh meant an attack on what was simultaneously their weakest and most valued link.




          This was the first occasion on which the white banner of Muhammad was seen. Muhammad sent out from Medina sixty or eighty of the Emigrants, led by Ubayda; none of the Helpers accompanied them. They rode as far as the water in the Hijaz and there found a great trading caravan of Quraysh from Mecca. There was no battle, but Sad shot an arrow which was the first arrow shot in Islam. Then the parties separated. Two men fled from the Unbelievers to join the Muslims; these were alMiqdad and Utba.




          At the same time, the apostle sent his uncle, Hamza, with thirty riders to the seacoast at alIs; there they met a party of three hundred men from Mecca, led by Abu Jahl, but a man named Majdi who was on good terms with both sides mediated between them and they separated without coming to blows. Hamza also bore a white banner which had been tied on by Muhammad, and some say that this was the first time the banner was seen; but his expedition and that of Ubayda occurred at the same time and this has caused the confusion.




          The apostle himself next went forth in search of the Quraysh and reached Buwat, in the direction of Radwa. But he returned to Medina without encountering his enemies and remained in Medina for some weeks before he again went forth. He passed through the valley of the Banu Dinar, then through Fayfaul-Khabar, then halted under a tree in the valley of Ibn Azhar. Food had been prepared for him nearby; there he prayed, and there his mosque is. He and his companions ate, and the very spot on which his cookingvessel stood is still known. He continued his journey until he reached alUshayra in the valley of Yanbu and remained there for a month, forming alliances with neighbouring tribes along the seacoast, before returning to Medina. He encountered no enemies, the caravan from Mecca  commanded by Abu Sufyan  having passed before he reached alUshayra.




          When he returned from the expedition to alUshayra, the apostle remained at Medina for only ten nights before he had to sally out against one Kurz, who had plundered the herds of Medina. He marched as far as the valley of Safawan in the region of Badr, but was unable to overtake Kurz, and returned to Medina, where he remained for a further two months. This was the first expedition to Badr.




          Shortly after this expedition to Badr the apostle sent Abdullah b. Jahsh and eight Emigrants on a journey. He gave a letter to Abdullah, but ordered him not to read it till the end of a two days' march; he also told him to avoid giving offence to any of his companions.




          After Abdullah had marched two days' journey, he opened the letter, and found it contained the following instructions: 'Go on to Nakhla, between Mecca and AlTaif, and keep watch over the Quraysh there and bring back news of their business.' Abdullah said, 'I read and obey!' Then he told his companions about the letter, and added, 'He has also prohibited me from forcing any one of you to do anything against his will. If, therefore, any of you wishes to earn martyrdom, let him come with me; but if not, let him go back.' All his companions went with him, and none remained behind, but at Bahran two of the travellers lost the camel which they had been riding in turns and they fell behind to look for it. Abdullah marched on with the rest of his companions to Nakhla, where they came upon a Quraysh caravan laden with raisins, tanned hides, and various other goods., and accompanied by four men.




          When the caravan saw Abdullah and his companions they were afraid because they had alighted so near to them, but when Ukkasha – whose head was shaved like that of a pilgrim – approached them, they recovered their confidence and said, “These are pilgrims, and we need have no fear of them.’




          This took place on the last day of the sacred month Rajab [October]. Abdullah and his companions conferred among themselves: ‘If we allow these people to continue and reach sacred territory tonight, they will be safe from us; but if we attack them now, we profane the sacred month.’ And they vacillated and hesitated to attack, but at last mustered up their courage and agreed to slay as many of the Quraysh as they could, and take possession of what they had with them. So Waqid shot an arrow and killed one of the Quraysh, two others were made prisoner, and the fourth fled.




          Then Abdullah, with his companions, the caravan, and the prisoners, returned to Medina, saying, One fifth part of our plunder belongs to the apostle of Allah.’ This was before Allah had made it encument on Believers to give up a fifth part of any booty to Him. One fifth of the caravan was set aside for the apostle of Allah, and Abdullah distributed the rest anong his companions.




          When they arrived at Medina, however, the apostle said, 'I did not command you to fight in the holy month, and he walked away from the caravan and the prisoners, and refused to take anything from them. The captors were crestfallen and decided they were doomed, and their Muslim brethren too, reproved them for their deed. In Mecca, the Quraysh were saying: “Muhammad and his companions have violated the sacred month; they have shed blood in it, and taken booty, and captured prisoners.’ The Jews interpreted the event as a bad omen for the apostle.




          When speculation on the subject became widespread Allah revealed these words to His apostle: 'They will ask thee about the sacred month and the fighting. Say "To fight in the sacred month is a matter of grave import, but to obstruct the worship of Allah and not to believe in Him, to prevent men from entering the holy mosque or to drive them out of it, these are of even graver import." '




          So the apostle of Allah took possession of the caravan and the prisoners. The Quraysh sent men to negotiate for the ransom of the prisoners, but the apostle replied that he could not release them until the two Emigrants who had fallen behind Abdullah to look for their camel returned, because he feared the Quraysh might have met and harmed them. 'If you have killed them, we shall kill our prisoners,' he said. But the two wanderers returned and the apostle released the prisoners, one of them making profession of Islam and remaining in Medina with Muhammad.




          When Allah made plunder permissible He allowed four parts to those who had won it, and one part to Himself and to His apostle, exactly as Abdullah had done with the captured caravan.




          This was the occasion when the first booty was taken by the Muslims, when the first prisoners were taken by the Muslims and when the first man was slain by the Muslims. It was eighteen months since the Emigrants had arrived in Medina.

=======================


          నేను ఈ భాగాన్ని చాలాసార్లు చదివాను, చదివినప్పుడల్లా చాలా ఆశ్చర్యం వేస్తుంది - మా మతం అన్ని మతాల కంటె గొప్పది, మా ప్రవక్త అందరు ప్రవక్త కన గొప్పవాడు అని మురుసుకు చచ్చే ముస్లిములు ఇది చదవలేదా?"Religious hostility and a measure of personal resentment against the Quraysh idolaters were deeply implanted in the mind of the apostle" అనే ఈ వాక్యం ఇస్లామేతరుడు చేసిన విశ్లేషణ కాదు - రచయిత పదహారణాల ముస్లిం!అసలు Ibn HishaQ మతవ్యాప్తి కోసం అని చెప్పి వదిలివెయ్యకుండా పాతపగలని తీర్చుకోవడానికి కూడా యుద్ధాలు చేశాడని అంత గొప్పగా ఎలా చెప్పుకోగలిగాడో నాకు అర్ధం కావడం లేదు - ప్రపంచానికి శాంతిని ప్రసాదించడానికి అల్లా దేవుడు స్వయంగా ఎన్నుకుని ఈ భూమి మీదకి పంపించి అతనికి మాత్రమే కనబడుతూ వినబడుతూ ప్రత్యేకతను కట్టబెట్టిన ప్రవక్తలో పాతపగలను తీర్చుకునే దరిద్రపు మనస్తత్వం ఉండటం అంటే ఏమిటి?అసలు తను ప్రవక్తనని ప్రకటించుకున్న తొలినాళ్ళలో ఇతన్ని ఎవరు ద్వేషించారు?ఎందుకు హింసించారు?


          ఇప్పుడు తెలుస్తున్న ఖురాను సాహిత్యం ప్రకారమే, "అడుగో,అబూ మత్తాలిబ్ మనవడు - ఏమిటో, స్వర్గం - నతకం అంటూ కొత్త కధలు చెప్తున్నాడు!" అని నవ్వుకుంటూ పోయేవాళ్ళు తప్ప కనీసం చీదరించుకోను కూడా లేదు.At first the Pagan Arabs were tolerant and even curious about this new "prophet", they had a genuine interest in the monotheistic beliefs of the Jews and Christians and were willing to make room for another religious belief system in their society. It was not until Muhammad began insulting the traditional Pagan deities and insisting that the Pagan Arabs and their ancestors will burn in hell for eternity for worshiping false gods that they began to regard Muhammad and his followers with disdain. (Ibn Ishaq pg. 167)ఏమిటండీ ఇది?మొగుణ్ణి కొట్టి మొగసాలకి యెక్కినట్టు అప్పుడు తన చుట్టూ ఉన్న జుదాయిజం, క్రైస్తవం, మిత్రాయిజం, సబాయిజం లాంటి సమస్తమైన వాటినుంచీ తలకొకటి కాపీ కొట్టి వెరైటీ కోసం పేర్లుమార్చి చెబుతూ తనని పట్టించుకోని వాళ్ళని పాపులనీ నరకానికి పోతారనీ తిట్టినది తనయితే తమ మతాన్ని తిడుతుంటే సహించలేక తన్నినందుకు అవతలివాళ్ళు దుర్మార్గులా!


          సంఖ్య తక్కువున్నప్పుడు మనతో మంచితనం మూర్తీభవించినట్టు కనిపిస్తున్న మర్యాదస్తులైన ముస్లిములతో మనమూ మచిగా ఉంటే సంఖ్య ఎక్కువై జెహాదు మొదలైనప్పుడు మనల్ని కాపాడతారని అనుకుంటే అంతకన్న తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు - స్వజనం తనని నరకయాతన పెడుతున్నప్పుడు ఆదరించి అక్కున జేర్చుకుని తను వూపిరి పీల్చుకుని బలం పుంజుకోవటానికి సహాయపడిన మూడు మదీనా యూదు తెగల్ని ప్రవక్తయే తన దారికి రానందుకు కినిసి సర్వనాశనం చేసేశాడు!Banu Qaynuqa తెగని క్రీ.శ. 624లో Banu Nadir తెగని క్రీ.శ. 625లో అక్కడినుంచి వెళ్ళగొట్టి ఇక ఒంటరై మిగిలిన Banu Qurayza తెగని క్రీ.శ. 627లో మట్టగించి పారేసి పాముకి పాలుపొయ్యడం లాంటి ముస్లిములకి సాయం చెయ్యడం ఎట్లా ఉంటుందో లోకానికి తెలియజేశాడు - తెలియాల్సినవాళ్ళకి మాత్రం తెలియడం లేదు, ఏం చెస్తాం?


          "మహమ్మద్ తననుతాను పొగుడుకొని ఆనందించే స్వార్థపరుడు (narcissist), పిల్లలతో లైంగిక కలాపాలు చేసేవాడు (pedophile), సామూహిక నరహంతకుడు (mass murderer), తీవ్రవాది, స్త్రీద్వేషి (misogynist), కామాంధుడు (lecher), పిచ్చివాడు, బలాత్కారుడు, దోపిడీదారుడు, కుట్రదారుడు" అని ముస్లిం మతభ్రష్టుడైన అలీ సినా (Ali Sina) ప్రకటించాడు. ఇది తప్పు అని ఎవరైనా తమ పవిత్ర ఖురాన్ మరియు ఇస్లామిక్ గ్రంథాలనుండి నిరూపించినట్లైతే 50,000 డాలర్ల బహుమానం ఇస్తానని మరియు తన ఆరోపణలను ఉపసంహరిచుకొంటానని బహిరంగ సవాలు విసిరారు. ఈ సవాలు ఇప్పటికీ నిలిచి ఉంది.

          నిజం చీర కట్టేలోపు అబద్ధం వూరంతా చుట్టి వస్తుందన్నట్టు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత కప్పెయ్యాలని చూసినా ప్రాచీన వైదిక సాహిత్యపు ప్రతిధ్వనులు ఆయా మతాల వారి విశిష్ట గ్రంధాల  నుంచి వినబడుతూనే ఉంటాయి!గురికి బెత్తెడు ఎడం అన్నట్టు చెబితే సుకుమారులకి ఎక్కదు గనక వారి మతగ్రంధాలలోని ప్రముఖమైనవాటిని గురించి మాత్రమే ఇక్కడ చెబుతాను.బైబిలు ఆధారిత సాహిత్యంలో చాలా చోట్ల కనిపించే Greater Flood అనే సంఘటనకి వారు నిర్ధారించిన కాలం ద్వారక మునిగిపోయి కలి ప్రారంభం కావడానికి హిందూపూర్వరుషులు చెప్పిన February 18, 3102 B.C.తో సరిపోతున్నది.ఆరవ శతాబ్దం నుండి పధ్నాల్గవ శతాబ్దం మధ్యన రచించబడిన Persian, Islamic, European రచనలలో దీనికి సాక్ష్యాలు దొరుకుతాయి.




          బైబిలు పాత నిబంధన Biblical Floodకి ముందు జీవించిన కొందరి ఆయుర్దాయాలని ఇచ్చింది, అవి ఇలా ఉన్నాయి:Adam, 930; Seth, 912; Enos, 905; Kenan, 910; Mahaleel, 895; Jared, 962; Enoch, 365; Methuselah, 969; Lamech, 777; and Noah, 950. - సరాసరి చూస్తే అందరి సగటు వయస్సు 912 సంవత్సరాలు!అదే గ్రంధంలో Biblical Floodకి తర్వాత జీవించిన కొందరి ఆయుర్దాయాలని ఇచ్చింది, అవి ఇలా ఉన్నాయి:Shem, 600; Arphachshad, 438; Salah, 433; Eber, 464; Plelg, 239; Reu, 239; Serug, 230; Nahor, 148; Terah, 205; Abraham, 175; Isaac, 180; Job, 210; Jacob, 147; Levi, 137; Kohath, 133; Amaram, 137; Moses, 120; and Joshua, 110. - వీటిలో క్రమేణ తరుగుదల కనిపిస్తూ ప్రాచీనహిందూఋషులు కలియుగానికి నిర్దేశించిన మానవుల జీవితకాలం 100కి చేరడం ఆశ్చర్యంగా లేదూ!Berosus అనే Babylonian చరిత్రకారుశు Greater Floodకి ముందరి Babylonian రాజుల పరిపాలనాకాలం 432000 సమవ్త్సరాలు అని చెప్పాడు,ఇది హిందూఋషులు చెప్పిన 4,3,2,1 నిష్పత్తులలో కలి,ద్వాపర,త్రేతా, సత్య యుగాలు కలిసిన ఒక మహాయుగం యొక్క పరిమాణం అవుతుంది.

          ఇస్లాము పుట్టక ముందరి అరేబియా సంస్కృతికి సుమేరియన్ నాగరికత తల్లివేరు లాంటిది.ఆ సుమేరియన్ నాగరికత  ప్రాచీన వైదిక సంస్కృతిని పోలి ఉంటుంది.అందువల్ల అర్ధాలు తెలియకుండా విన్నది విన్నట్టు కాపీ కొట్టిన చిలక పలుకుల ఆఖరి ప్రవక్త స్థాపించ్గిన ఇస్లాము ధర్మంలో కూడా హిందూధర్మం పోలికలు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి.మచ్చుకు కొన్ని మెచ్చ్గుతునకలు:మక్కాలోని కాబాగుడి ఒక శివాలయం.వాళ్ళు పవిత్రం అని చెప్పుకునే 786 అనేది సంస్కృతంలోని ఓంకారాన్ని విడదీసి తిరగేసిన ఆకారం.అక్కడ ఇప్పుడు ఉన్న "గంగ" ఆనె పేరును ఖూనీ చేసి "zamzam" అనే పేరు పెట్టి పిలుచుకుంటున్న బావిని తవ్వింది అహ్మద్ ఖురేషీ తాత.అల్లా దేవుడి కూతుళ్ళు అని చెప్పబడే Al-Uzza,Al-Lat, Menat పేర్లు గల దేవతలు హిందూమతంలోని త్రిమాతలను పోలినవారు.హిందువులు ఆలయం లోపలికి వెళ్ళాక దైవదర్శనానికి ముందు గర్భాలయం చుట్టూ సవ్యదిశలో చేసే ఏడు ప్రదక్షిణాలనే కాపీ కొట్టినట్టు తెలియకుండా ఉండటానికి అపసవ్య దిశలో చెయ్యమని ప్రవక్త చెప్తే భక్తులు/అనుచరులు/బానిసలు ఎందుకు అని అడక్కుండా చేసేస్తున్నారు.అసలు మక్కా లోని కాబా తెరిచే సమయం ఏమిటో తెలుసా - శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదోషకాలం!

          అసలైన విశేషం ఒకటి చెబుతాను కళ్ళు విప్పార్చుకుని చెవులు రిక్కించుకుని వినండి! హిందువులకి ప్రతి అర్చామూర్తికీ శతనామావళి,అష్టోత్తర సతనామావళి,త్రిశతి,సహస్ర నామావళి అని పేర్లు పెట్టుకుని కీర్తించే లక్షణం ఉంది.ముస్లిములు దాన్ని కూడా కాపీ కొట్టేశారు.Al-Asma-ul-Husna ( اَلاسْمَاءُ الْحُسناى )  గురించి ఏ ముల్లాని అడిగినా చెప్తాడు.పేర్లూ వాటికి ఇచ్చిన ఆర్ధాలూ అచ్చు హిందూ దేవతల పేర్లకి మల్లే ముచ్చట గొలుపుతాయి.హిందూ అదేఅవ్తాల్ నామావళిలో మాదిరే మోద్ట ఆ పేర్లని గురించి పొగడ్తలు ఉంటాయి. అన్నీ అయిపోయాక ఫలశ్రుతి కూడా ఉంటుంది సుమండీ!

          అమెరికా ఉత్తర ఖండంలోని Native Sioux Indians తాము పాటించే మతాన్ని ఆకాశం నుంచి ఒక దివ్యాంగన దిగివచ్చి ఇచ్చిందని చెబుతారు.ఆమె కాలంలో నాలుగు యుగాలు ఉంటాయనీ ఒక sacred buffalo కూడా ఉంటుందనీ మొదటి యుగంలో నాలుగు కాళ్ళు ఉండి తర్వాత యుగాల్లో యుగాని కొక కాలు పోతుందనీ చెప్పిందట.ఇప్పుడు చివరి యుగంలో ఉన్నామనీ ఇప్పుడు ఆ sacred buffalo ఒంటికాలితోనే ఉందనీ Native Sioux Indians నమ్ముతున్నారు.



          ప్రపంచంలో జుదాయిజం, జొరాష్ట్రియనిజం, మిత్రాయిజం, సబాయిజం వంటివి ఎన్నో ఉన్నాయి కదా - ఈ రెండింటి ప్రత్యేకమైన లక్షణం ఏమిటి?Both the Christians and Muslims were quite intolerant. They believed that their God was the only God and that their Savior was the only savior.  More than that, they also believed that Their God through their Prophet had commanded them to spread the faith by converting others. As a consequence, both Christians and Muslims were not willing to let others follow their own faiths.ఈ రెండు మతాలూ పుట్టినది హిందూమతం యొక్క శాఖల వంటి ఇతర మతాల మీదనే కాబట్టి వాటికి మూలమైన హిందూమతాన్ని ఏమీ చెయ్యలేకపోతున్నామనే కసి వాటిలో ఉంది. అతి ముఖ్యమైన ద్వేష కారణం ప్రపంచం మొత్తాన్ని వారి మతంతో నింపాలనే వారి ప్రవక్తల ఆజ్ఞని నెరవేర్చడానికి  ప్రధానమైన అడ్డంకి హిందూమతమే అన్నది వారికి తెలుసు!ఈ ఆఖరి శత్రువుని గెలవడం కోసం ఇవ్వాళ ప్రపంచస్థాయిలో ఎంత డబ్బుని పెట్టుబడి పెడుతున్నారో, ఎంతమంది మనుషుల్ని వినియోగిస్తున్నారో తెలుసుకుంటే హిందువులే కాదు నిష్పక్షపాత బుద్ధి కలిగిన నాస్తికులు సైతం నిర్ఘాంతపోతారు!

          హిందువులు ఈ రెండు మతాల  పట్ల నిరంతరం హెచ్చరికతో ఉండాలి.హిందూమతాన్ని ఈ రెండు మతాల వారి దాడినుంచి కాపాడుకోవటం కేవలం బ్రాహ్మణులకే వదలకుండా అన్ని కులాల వారూ బాధ్యత తీసుకోవాలి.రోములోనూ మక్కాలోనూ జరిగినది ఇండియాలో జరగనివ్వకూడదు.వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్టితమైన నా గురుపరంపర నాకు ఇచ్చిన వివేకంతో నేను హిందువులకి చెబుతున్నది ఒకటే - చరిత్రను చదివినందుకు ఒకసారి జరిగిన పొరపాటల్ను మళ్ళీ జరగనివ్వకూడదనే పటుదలని పెంచుకోవడం అనేది పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనది అవుతుందో అదే సుందరమైనదీ అవుతుంది!



సత్యం శివం సుందరం!!!


Friday, 27 April 2018

పరిపాలనకీ టీ అమ్మడానికీ సంబంధం ఏమిటి?దిగుమతై వచ్చిన టీ మనదే అయినప్పుడు సోనియా పరాయిది ఎట్లా అవుతుంది?

          సోనియా ప్రధాని కాకుండా అడ్డుకోవటానికి భాజపా వాళ్ళే కాక కాంగ్రెసులోని కొందరు కూడా ఆమె పరాయిది అంటున్నారు గాబట్టి తమాషాగా ఈ ప్రశ్న వేశాను గానీ ఈ పోష్టులో శ్రీమతి సోనియా గాంధీని విమర్శించడం గానీ సమర్ధించడం గానీ చెయ్యదల్చుకోలేదు! ఒకనాటి గజపతులని అభిమానించే ఈనాటివాళ్ళకి శ్రీకృష్ణదేవరాయలు స్ఫోటకం మచ్చలవాడు అయిన ఈ తెలివి మీరిన కాలంలో ఎవరు పరాయి,ఎవరు స్వరాయి?పరాయితనం ఎక్కడ లేదు?మనదైన ధోవతిని ఎంతమంది కడుతున్నారు?మనదైన భాషని పలకడానికే సిగ్గు పడుతున్నారు - గోగినేని బాబు "నాకు తెలుగు రాదు" అని చెప్పుకోవడం విన్నాను!మన పిల్లలకి మన భాషలో చదువు చెప్పడానికి అడ్డుపడుతున్నది ఎవరు?స్వతంత్రం వచ్చిన దగ్గిర్నుంచీ  కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు గల సమస్త జాతుల వారికీ పరాయితనాన్ని ఇంత ప్రణాళికాబద్ధమైన నిష్ఠతో అలవాటు చేసిన కాంగ్రెసు పార్టీ కూడా తమ పార్టీ అధ్యక్షురాలిని ప్రధానిని చెయ్యడానికి ఎందుకు వెనకాడిందో నాకిప్పటికీ అర్ధం కావటం లేదు!

          సోనియా గురించి కాంగ్రెసువాళ్ళు ఆలోచించుకుంటారు గానీ ఇప్పుడు ప్రధానిత్వం వెలగబెడుతున్న మోదీ చరిత్రని తవ్వి చూస్తుంటే నాకొక చిత్రమైన విషయం పదే పదే గుర్తుకొస్తున్నది - అది గానీ నిజమే అయితే ఇవ్వాళ మోదీ నిలబడిన దిక్కుమాలిన పరిస్థితికి కారణమూ దాని వెంటనే పరిష్కారమూ తెలుస్తాయి.మోదీ గుజరాతుని ఏలిన కాలం మొత్తం సంక్షోభాల మయం.గోధ్రా అల్లర్లని అతను ఎదుర్కొన్న తీరు అమోఘం - బహుశా అదే హిందువులని అతని  వైపుకి ఆకర్షించిన ఒకే ఒక్క కారణం కాబోలు!అయితే, నేను నిర్ధారించుకోవలసిన విషయం అది కాదు  - అతన్ని ప్రధాని పదవికి ఖరారు చేసిన తొలిదశలో గానీ అంతకు ముందు గానీ తర్వాత గానీ మోదీ అమెరికా వెళ్ళి ఒక బిజినెస్ స్కూలులో అడ్వర్టైజింగ్ పాఠాలు నేర్చుకున్నాడనేది నిజమా?అదే నిజం అయితే వస్తువులని అమ్మడానికి సంబంధించిన సూత్రాల్ని ఆకళింపు చేసుకుని తనకి తను "ప్రధాని" అని లేబుల్ తగిలించుకుని అడ్వర్తైజింగ్ చేసుకుని ప్రధాని పదవికి అమ్ముడు పోయాడా?"నరేంద్ర మోదీ - ప్రధాని పదవి" అనే రెండింటిలో అతను దేన్ని అమ్మాడు?దేన్ని కొన్నాడు?

          అమ్మకం - కొనుగోలు అనే పదాలు వచ్చిన ప్రతిచోట వస్తువు, ధర, అమ్మకందారు, కొనుగోలుదారు, లాభం, నష్టం అనేవి కూడా పరస్పరాశ్రితమై ఉంటాయి.మోదీలో ఈ రెండు అస్తిత్వాలు వేరుగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు ఎవరికీ రాలేదు, ఇప్పుడు ఈ రెంటికీ విడి అస్తిత్వాలని కనిపెట్టలేము - "తన్నోడి నన్నోడెనా?నన్నోడి తన్నోడెనా" అన్నంత జటిలమైన ఈ ప్రశ్నకి ఈ ప్రశ్న పుట్టడానికి కారణమైన మోదీ కూడా జవాబు చెప్పలేడు.అయినప్పటికీ కొన్ని ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి.ప్రశ్నలే అశాంతికి మూలం అని తెలియని అజ్ఞానులం గనక మన మనస్సులలో ఇలాంటి జవాబు లేని ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి - సంచిత ప్రారబ్ధం అనుభవించక తప్పదు!మనం ఇవ్వాళ జ్ఞానులు ఆనుకునేవారికి మొదట్లోనే ఈ సత్యం బోధపడి సన్యసించి ప్రశ్నల నుంచి విముక్తులయ్యారు - మోదీ ఏకధాటి రెండో విడత పరిపాలన కూడా ముగిశాక మనమూ ఆ స్థితికి చేరుకోవటం ఖాయం! ఆ అదృష్టం ఇంకా పట్టలేదు గనక నా ఆజ్ఞానం నన్ను వీడిపోనందువల్ల ప్రస్తుతం నన్ను తొలుస్తున్న ప్రశ్నలు ఇవి - ప్రధాని పదవి యొక్క ధర యెంత?నరేంద్ర మోదీ యొక్క ధర ఎంత?నరేంద్ర మోదీ ప్రధాని అవడం వల్ల ఎవరు లాభపడ్డారు?

          ఇవ్వాళ దేశంలో బీజేపీకి పడుతున్న వోట్లు ఆ పార్టీ యొక్క హిందూత్వ అనుకూల విధానాల వల్ల కాదనీ తను బరితెగించి రాజకీయ పార్టీలు తమకి సమకూరుతున్న లోపాయకారీ విరాళం/లంచం/పెట్టుబడి వివరాలని  బైటకి చెప్పాల్సిన పనిలేదనే చట్టం చేసేసుకుని ఆ వెసులుబాటును ఉపయోగించుకుని మోదీ ప్రధానిగా ఉండటం వల్ల లాభపడుతున్నవాళ్ళ నుంచి కురుస్తున్న డబ్బుని వెదజల్లడంలోని విచ్చలవిడితనం వల్లనే అని అందరికీ తెలిసిన విషయమే కదా - అందువల్లనే నేను కూడా  నైతికత, జనహితం, దూరదృష్టి వంటివాటితో భాజపా రాజకీయాన్ని అంచనా వెయ్యడం లేదు.అలాగని ఇందులో నేను కురిపిస్తున్నది వ్యంగ్యమూ కాదు.వాస్తవం యేమిటంటే భౌతిక ప్రపంచంలో మనిషి యొక్క జీవితాన్ని వ్యాపారసూత్రాలే ప్రభావితం చేస్తాయి.ఉద్యోగులు నెలల చొప్పున తమ శ్రమని యజమానికి అమ్ముకుంటారు.  రైతులు సంవత్సరాల చొప్పున తమ శ్రమని ఇతర్లకి అమ్ముకుంటారు. ఒక గృహస్థు జీవితకాలం పాటు భార్యాబిడ్డల్ని పోషించి వాళ్ళనుంచి గౌరవాల్ని కొనుక్కుంటాడు.ఇక్కడ కొంచెం తేడా కొడుతుంది, కదూ!శక్తినిత్యత్వసూత్రం ప్రకారం శక్తి రూపాలు మార్చుకున్నట్టు ఇలాంటి చోట్ల భౌతికమైన డబ్బు ఆధ్యాత్మికమైన గౌరవం కింద మారుతుంది, అంతే! ఆధ్యాత్మిక విపణిలో కూడా వస్తువు, ధర, ఆమ్మకందారు, కొనుగోలుదారు, లాభం, నష్టం అనే అస్తిత్వాలు ఉంటాయి.గురువుని ఎందుకు గౌరవించాలి?ఆ గురువు నేర్పిన జ్ఞానం మనకు లాభసాటి అవుతున్నది గనకనే గౌరవిస్తున్నాము - ఆ గ్యారెంటీ లేనప్పుడు ఇతర్లు అతన్ని ఎంత గొప్పవాడని చెప్పినా గౌరవించం -  చాగంటి కోటేశ్వరరావు అంటే హిందువులకి ఉన్న గౌరవం గోగినేని బాబుకి ఉండకపోవటానికి కారణం అదే!

          ఎక్కువ సోది చెబితే విషయం పక్కదారి పడుతుంది గానీ "0" నుంచి "9" వార్కు ఉన్న్న అంకెలకీ దేవుడు అనె భవన లాగనే భౌతికపరమైన అస్తిత్వం లేదు.మరి అంకెల్ని ఎందుకు ఉన్నాయని అంటున్నాడు గోగినేన్ బాబు?అంకెలతో తనకి అవసరం ఉంది గనక ఒప్పుకుంటున్నాడు,దేవుడితో అవసరం తనకి లేదు గనక లేదని అంటున్నాడు!అవసరం,అనవసరం,లాభం,నష్టం,అమ్మడం,కొనడం మాత్రమే ముఖ్యం అనుకునేవాళ్ళకి  నైతికత, ఔన్నత్యం, సహాయం, ఔదార్యం వంటివి ఎక్కవు.ఇతరులకి తను గొప్పది అనుకునే మానవవాదం చింతనని ఎక్కించడం మాత్రమే అతని అవసరం,అందుకే తన దాడికి జ్యోతిష్కులని మాత్రమే టార్గెట్ చేస్తాడు గానీ ఇతరులు ఎన్ని చాలెంజిలు చేసినా రాజకీయ నాయకుల్నీ అక్రమవ్యాపారుల్నీ టార్గెట్ చెయ్యడు - నిలదీసి అడిగితే అది నాపని కాదంటాడు.మానవుల కోసం మానవవాదం గురించి మాట్లాడే హేతువాదుల్ని కూడా అవసరమే నడిపిస్తున్నప్పుడు లాభదృష్టియే విజయాల్ని అందిస్తున్నప్పుడు మోదీ-షా ద్ద్వయం పాటిస్తే నేరం,ఘోరం అనడం అన్యాయం.

          ఇట్లా మనకు తెలియకుండానే ఇచ్చిపుచ్చుకునే సంస్కృతిని వొదిలేసిన ఇంత కాలానికి మన చుట్టూ ఉన్న సమస్తాన్నీ అమ్మడం,కొనడం అనే రెండింటికి కుదించేశాక మోదీ ప్రధాని పదవిని కొనుక్కున్నా ప్రధాని పదవి కోసం ఆత్మని అమ్ముకున్నా అతన్ని తప్పుపట్టి ప్రయోజనం ఏమిటి?ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నది కూడా వ్యాపారియే - అందుకే ఆంధ్రాకి ప్రత్యేకహోదా గురించి అడిగిన తమ పార్టీవాళ్ళతో ఆంధ్రాలో పరిస్థితి మనకి లాభసాటి అయ్యాకే ఇద్దాం అనగలిగాడు!ఇవ్వాళ మనం జాతిపిత హోదాని కట్టబెట్టినవాడు కూడా కోమటియే కదా - అతను కూడా భగత్సింగు లాంటి హింసావాదుల మాదిరి పోరాడి ఉరి తీయించుకుని చచ్చిపోయి నష్టపోవడం బదులు బతిమాలుకోవడం ద్వారా  ఒకటి రెండేళ్ళలో స్వతంత్రం తెచ్చుకుని లాభపడటం మంచిది అని చెబితేనే కదా జనం అతని వెంట నడిచారు!మరి,అన్నిటినీ లాభదృష్టితో చూసినవాళ్ళు మోదీని మాత్రం లాభదృష్టికి బదులు ఆదర్శాలతో ఎందుకు తూచాలి?

          ప్రతి ఒక్కడికీ తన గురించి తనకి తెలుసు,కొందరు తమ బలహీనతల్ని దాచేసుకుని తమ సామర్ధ్యాల్ని మాత్రమే బైటికి చూపిస్తారు - వాళ్ళు సమర్ధులు, విజయులు, వైభవోద్ధతులు!కొందరు సమర్ధతలి దాచేసుకుని బలహీనతల్ని బైటపెట్టుకుని అపజయాల పాలుతారు - సాగినంతకాలం నా అంత గొప్ప పార్టీ లేదని లేదని విర్రవీగి ఇప్పుడు వరాస్ తప్పులు చేస్తూ అఘోరిస్తున్న కాంగ్రెసు లాగ!నిన్నటి వరకు మోదీ అంటే ప్రతికక్షులకి కూడా సమర్ధుడి కిందే లెఖ్ఖ,మరి ఇవ్వాళ కర్ణాటకలో మొదట అనుకున్న 50 మోదీ ప్రచారసభల్ని కుదించి అతని బదులు ఒక సన్నాసిని దించారు - లక్సు సబ్బు అమ్మేవాళ్ళు రీగల్ పేరుతో ఒక రకం సబ్బు ఫెయిలైతే దానికే డీలక్స్ అని పేరు అమార్చి అమ్ముకున్నట్టు పాలిట్క్సులో క్వాలిటీని పెంచుకోకుండా ప్యాకేజీ డీజీను మార్చి చూడాల్నుకుంటున్నారు కాబోలు!అంటే,నిన్నటి వరకు లాభసాటి అయిన మోదీ ఇవ్వాళ నష్టకారి అయ్యాడన్నమాట - వ్యాపారంలో అంత నిక్కచ్చితనం పాటించే మోదీ-షా ద్వయం లెక్క ఎక్కడ తప్పింది?బహుశా మోదీ ఆర్ధిక పరిజ్ఞానం లీటరు పాలల్లో పావు లీటరు నీళ్ళు కలిపితే పదిమందికి అమ్మే టీని పదిహేనుమందికి అమ్మితే చాలు లాభం ఇబ్బడిముబ్బడి అనే స్థాయి నుంచి ఎదగకపోవడం వల్లనా!అరువు బేరాలతో అమాయకపు కస్టమర్లని బుట్టలో వేస్తూ తెలివి ఎక్కువై తన దగ్గిర సరులు కొననివాళ్లని బూతులు తిట్టే పాతకాలపు పల్లెటూరి కోమటి మనస్తత్వం అమిత షాను వదలకపోవటం వల్లనా - ఏమో!

          అది కూడా కాదేమో, ముందిస్తావా తర్వాతిస్తావా ఆన్నది నాకనవసరం నాకిచ్చేది ఇస్తేనే నీ పక్కలోకి వస్తాను అని కండిషన్లు పెట్టేది వ్యాపారం కాదు వ్యభిచారం, అవునా?ఆంధ్రాకి సాయం చెయ్యకపోవడానికి అక్కడ వోట్లూ సీట్లూ రాకపోవడమే కారణం అయితే వాళ్ళు ఆంధ్ర ప్రజలతో చేస్తున్నది వ్యభిచారమే కదా - 2014 ఎన్నికలకి ముందు ఈ దేసం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్నీ పరిష్కరించగలడని ఆశలు రేకెత్తించిన ఒక సమర్ధుడైన పురుషపుంగవుడు ఇవ్వాళ నాకు వోట్లు వేసేవాళ్ళకి మాత్రమే నేను సేవ చేస్తాననే ఉంపుడుకత్తె స్థాయికి దిగజారిపోయాడు.అయితే, ఇతని టీకొట్టు తరహా సంప్రదాయిక వ్యాపారసూత్రాలే అర్ధం కానివాళ్లకి ఈ వినూత్న తరహా వ్యభిచారసూత్రాలు అసలు ఎక్కడం లేదు - అందుకే మోదీకీ ప్రజలకీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది.మోదీ-షా ద్వయం ధోరణి చూస్తుంటే ప్రజలకి కూడా వ్యభిచారసూత్రాల్ని ఎక్కించి ముందుకు తీసుకు వెళ్ళటమే తప్ప టీకొట్టు-గల్లాపెట్టె సూత్రాల్ని సైతం వదుకుకుని నైతికత, ప్రజాహితం వంటివాటిని అలవాటు చేసుకునే వెనకటి పద్ధతికి మళ్లడానికి ఇష్టపడటం లేదని తెలుస్తున్నది. కాబట్టి, ప్రజలు కూడా ఇక వ్యభిచారం నేర్చుకోవాల్సిందే!.

          మోదీ అధికారంలో ఉండటం వల్ల ఎవరు లాభపడుతున్నారో తెలుసుకోవాలంటే మీరు షెర్లాక్ హోమ్స్ అంతటి ప్రజ్ఞావంతులు కానక్కర లేదు -పెట్రోలు వాహనం ఒకటి ఉంటే చాలు.అన్ని దేశాల్లో పెట్రోలు రేట్లు తగ్గుతూ ఉంటే మోదీ దేశంలో మాత్రం ఎందుకు పెరుగుతూ ఉన్నాయో అని ఆలోచిస్తే చాలు తెలియాల్సినది తెలిసిపోతుంది.వాళ్ళు చేసిన పొలిటికల్ పార్టీలు తమకి విరాళాలు ఎక్కణ్ణించి వస్తున్నాయో చెప్పనక్కర్లేదనే ఒక్క చతం చాలు వాళ్ళు ఎంత దుర్మార్గులో చెప్పటానికి.ప్రజలకి ఎవరు అధికారంలో ఉంటే తమకి లాభం అన్న విషయంలో స్పష్టత లేనంతవరకు మోదీ-షా ద్వయం వంటివారియొక్క వ్యాపార/వ్యభిచార రాజకీయ పద్ధతులు వాళ్లకి అధికారాన్ని కట్టబెడుతూనే ఉంటాయి.


తత్ ఓం సత్!

Friday, 13 April 2018

పది వైపుల నుంచి కమ్ముకొచ్చిన శత్రువులని ఒక్కడై నిలిచి పోరాడి గెల్చిన సుదాస ది గ్రేట్!


మన చరిత్రకారులు " - The Great!" తోకలు తగిలించి పొగిడినవాళ్ళందరూ హైందవేతరులే - అశోకా ది గ్రేట్,అక్బర్ ది గ్రేట్,కనిష్క ది గ్రేట్!మార్క్సు కళ్లదాలతో చూసే కమ్యునిష్టులకి సిగ్గు లేదు సరే,ఈ దేశం కోసం త్యాగాలు చేసి స్వతంత్రం తీసుకొచ్చి దేశభక్తికి పేటెంటు పుచ్చుకున్న కాంగ్రెసు వాళ్ళకి ఏం మాయరోగం వచ్చింది?స్వతంత్రం తీసుకొచ్చారు, అధికారం తమకే దక్కింది.అలాంటప్పుడు చరిత్రని భ్రష్టు పట్టించడం లాంటి దేశభక్తి లేని పనులు చెయ్యడం దేనికి?
మీకు నేనొక సంగతి చెప్తే మీరు నమ్మలేకపోవచ్చు - ఇంగ్లీషువాళ్ళకి తొత్తులై స్వతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించారని తమిళ జస్టిస్ పార్టీ పెద్దల్ని విమర్శిస్తున్నాము గానీ గాంధీ దగ్గిర్నుంచి బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించిన మదన్ మోహన్ మాలవ్య వరకూ అందరూ ఇంగ్లీషువాళ్ళని అభిమానించి ఆదరించి గౌరవించి పొగిడేటప్పుడు భాష్పవారిపరిపూర్ణలోచనహర్షపులకాంకితగాత్రులైనవారే!చెప్పడం ఎంత గంభీరమైన పదజాలంతో చెప్పినప్పటికీ గాంధీ తను చెప్పిందీ చేసిందీ ప్రజలతో చేయించిందీ ఇంగ్లీషువాళ్ళు భారతీయుల్ని ఎంత క్రూరంగా హింసించినా సరే ఓర్చుకోవాలే తప్ప ఒక్క భారతీయుడు కూడ ఒక్క ఇంగ్లీషువాణ్ణి కనీసం కొట్టను గూడా కొట్టకూడదు అనే రకం విచిత్రమైన పోరాటమే!
గాంధీ స్వతంత్రం తీసుకు రావటానికి వాడిన చిట్కావైద్యపు కార్యక్రమాలు, - విదేశీ వస్త్రాలు(విదేశీయుల వస్త్రాలు కాదు, మనవాళ్ళు కష్టపడి ఆర్జించిన సొమ్మునుంచి కొనుక్కుని తొడుకుంటున్న స్వదేశీయుల వస్త్రాలు) తగలబెట్టటం,చరఖా తిప్పటం, మన ఉప్పు మనమే తయారుచేసుకోవటం, ఇంగ్లీషువాళ్ళు ఈ చెంపన కొడితే ఆ చెంపని చూపించటం, రెండు చెంపలూ అయ్యాక వీపు చూపించటం.మొదలుపెట్టటం వీరావేశంతో మొదలుపెట్టేవాడు - "అయ్యబాబోయ్! ఎంత అద్భుతమైన పోరాటవిధానం!!ఈ దెబ్బకి ఇంగ్లీషువాళ్ళు అదెశం వొదిలి పారిపోవటం ఖాయం!!!" అనిపించేది అతన్ని వెర్రివెధవ కింద జమకట్టిన వాళ్ళకి కూడా.కానీ ఏ ఒకటీ నెలకి మించి జరగలేదు,కొన్ని మొదటి వారంలోనో కొన్ని మూడో వారంలోనో ఆగిపోయినాయి - కొన్ని ఇంగ్లీషువాళ్ళు నాయకుల్ని అరెస్టు చెయ్యడం ద్వారా ఆగినాయి, కొన్ని పాల్గొనేవాళ్ళకి ఉద్రేకం ఎక్కువై ఇంగ్లీషువాళ్ళకి నెప్పి పుడుతుందనిపిస్తే గాంధీ ఆపటం వల్ల ఆగినాయి!చౌరీచౌరా సన్నివేశం నాడు చూశారుగా అయ్యగారి ఆంగ్లభక్తి -  నెహ్రూ లాంటి వాళ్ళు ప్లీజ్ ప్లీజని ఎంత కాళ్ళావేళ్ళ పడినా వినలేదు, వినలేదు, చావనైనా చస్తాను గానీ ఇంగ్లీషువాళ్ళకి హాని జరిగితే మాత్రం సహించేది లేదని బల్లగుద్ది చెప్పాడు!
అయ్యా!ఇంగ్లీషువాళ్ళ మీద అంత బానిసత్వపు మమకారం ఉండి తమలోకి తాము చూసుకున్నప్పుదల్లా ఘోరమైన  ఆత్మన్యూనత రగిలిపొయ్యేవాళ్లకి హిందువుల్లో "ది గ్రేట్!"  అనదగినవాడు ఎలా కనపడతాడు - క్రీ.శ 1947 నుంచి భారత ప్రభుత్వం అచ్చొత్తించి పిల్లలకి చెప్పిన చరిత్రలో ఏ హిందూ నాయకుడికి ది గ్రేట్ తగిలించి తగిలించారో వెదికి చూపించండి!అట్లాని వాళ్ళు హిందువులు కాదా?అబ్బే!పదహారణాల నిఖార్సైన హిందువులు!ఎప్పుడు?ఎన్నికలు ప్రకటించి అవి అయిపోయేవరకు!సొంత ప్రతిభ మీద నమ్మకం లేదు గాబట్టి నామినేషన్ వేసే ముందునుంచీ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు అయ్యలు తిరగని గుడిఉండదు,చెయ్యని పూజ ఉండదు,పట్టని సన్నాసి పాదం ఉండదు.దేనికీ అవస్థ అంటే,తను ఏనాడూ హిందువులా ప్రవర్తించకపోయినా తెలివితక్కువ హిందువులు చచ్చినట్టు తనకే వేస్తారన్న విశ్వాసం,ఇతరులకి మంచివాడిగా కనపడి వాళ్ళ ఓట్లు రాబట్టుకుంటే గానీ గెలవనేమోనన్న యేడుపు - ఈ రకమైన నాటకాన్ని ఇప్పటివరకు కాంగ్రెసు ఒకలా నడిపించింది, ఇప్పుడు భాజపా మరొకలా నడిపిస్తున్నది.ఈ రెండు పార్టీలకీ బలి అవుతున్నది మాత్రం ఒకే గ్రూపు - అమాయకులైన హిందువులు!
ఇంగ్లీషువాళ్ళని ఏ కుర్రవేధవన్నా ఉడుకునెత్తురు కొద్దీ ఒక నాలుగు తిట్లు తిడితే చాలు ఉలిక్కిపడి ఆ తిట్టినవాణ్ణి చావుతిట్లు తిట్టి వాళ్ళు లెంపలేసుకుని తిట్టినవాడితో లెంపలేయించిన ఈ వేడికోళ్ళ పద్ధతికి పోరాటం అని పేరు దేనికి పెట్టారో!గాంధీ అనేవాడు రాజకీయ రంగంలో అడుగు పెట్టిన అతి కొద్ది కాలంలోనే ఈ దేశప్రజల మనస్తత్వంలోకి క్షాత్రలేమి  అనే అంటురోగం గాంధీ నుంచి సంక్రమించి ప్రజల్ని దేశభక్తిరహితుల్ని చేసేసింది - అందుకే మెకాలె పుటిన రోజులు జరుపుకున్నంత వైభవంగా మన ప్రాతస్మరణీయుల్లో ఏ ఒక్కడి జయంతినీ జరుపుకోలేకపోతున్నాం.కనీసం రామాయణ భారతలని గుర్తుంచుకున్నారు గాబట్టి గానీ లేకపోతే ఇవ్వాళ్టి కంచె ఐలయ్య కలలు గంటున్న హిందూమతానంతరభారతదేశం ఎప్పుడో అవతరించి ఉండేది!
రామాయణం.మహాభారతం అనే రెండు మహాకావ్యాలలోనూ యుద్ధమే ప్రధానం. అందుకు మనం సిగ్గుపడాల్సిన పని లేదు.ఇక్కడే కాదు, ప్రపంచ సాహిత్యంలోని అపురూపమైన ఇలియడ్ లాంటివి కూడా యుద్ధం చుట్టూనే తిరుగుతాయి.నెత్తురూ కన్నీళ్ళూ ఇంకని కళారూపం ఇంతవరకు పుట్టలేదు, పుట్టినా ఎక్కువకాలం బతకలేదు.ఎప్పుడో పుట్టి ఇప్పటికీ నిలిచినవీ ఇప్పుడు పుట్టి రేపటికీ నిలుస్తాయని అనుకుంటున్నవీ - అన్ని కళారూపాలూ యుద్ధం చుట్టూరానే తిరుగుతున్నాయి.ఏముంటుంది యుద్ధంలో?అన్యాయం ఉంటుంది, హింస ఉంటుంది, విషాదం ఉంటుంది!రామరావణ యుద్ధం స్త్రీ సౌందర్యం కోసం జరిగింది, కురుపాండవ యుధం రాజ్యశ్రీ వైభవం కోసం జరిగింది.
శూర్పణఖ వేరే ఆడదాని మొగుడితో పొందు కోసం అంగలార్చినందువల్లనూ రావణుడు వేరేవాడి పెళ్ళాంతో పొందు కోసం అంగలార్చినందువల్లనూ ఒక యుద్ధం జరిగింది,హస్తినాపురానికి యువరాజైన ధర్మరాజుని ధృతరాష్ట్రుడు ఖాండవప్రస్థానికి పంపించినందువల్లనూ ధర్మరాజు చేస్తున్న  రాజసూయానికి వెళ్ళిన దుర్యోధనుడికి ధర్మరాజు వైభవం చూసి కన్నుకుట్టి మాయాద్యూతంతో వారి సంపదని హరించి పాండవ కులస్త్రీని అవమానించినందువల్లనూ ఒక యుద్ధం జరిగింది.
మరి, దోపిడీని అంతం చేసి వర్గరహితసమాజం స్థాపించాలని కలలు గంటున్న ముప్పాళ రంగనాయకమ్మ గారికి రావణ దుర్యోధనులకి బదులు రాముడూ పాండవులే దుర్మార్గులుగానూ రావణ దుర్యోదనులు కీర్తనీయులుగానూ కనబడటం విచిత్రమే!రావణుడు బలవంతంగా ఎత్తుకొచ్చాడనీ మొగుడు దూరమయ్యాడనీ ఏడుస్తూ కూచోకపోతే చక్కహా అలాంకరించుకుని నవ్వుతూ ఉండొచ్చు కదా అని మండోదరితో సీతకి బోడిసలహాలు ఇప్పించి అశోకం పేరుతో గుక్కపట్టి యేడ్చిన వోల్గా అనే మరో రచయిత్రిని ఇదే ప్రశ్న అడిగితే వాల్మీకి ఒక దృక్కోణంలో చూసి రాసిన కధని నేను మరొక దృక్కోణంలో చూసి రాశాను అనేసింది - తొక్కలో దృక్కోణం! మంచితనాన్ని వంచన కిందనూ వంచనాపరుల్ని మంచివాళ్ళ కిందనూ మార్చటమా దృక్కోణం అంటే? ఈ రెండు శంఖిణీ జాతి స్వైరిణులకీ నేనూ వాల్మీకి అంతటిదాన్ని అని డప్పు కొట్టుకోవాలన్న దురద తప్ప ఇంకేం లేదు. వీళ్ళకి తోడు గుడిసేటి చలం ఒకడు దొరికాడు - బూతునే నీతి పేరున గయ్యాళితనం చూపించి వదరటం తప్ప వీళ్ళు చేసింది విప్లవమూ కాదు, వీళ్ళు గౌరవనీయులూ కారు.
ద్వారక బయటపడి కృష్ణుడు చారిత్రకవ్యక్తియే అని సాక్ష్యం దొరికినా అసలు కధ ఇలాగే జరిగిందని చెప్పలేము కాబట్టి ఇప్పుడు మనం చదువుతున్న భారతాన్ని కధలాగే చూడాలి.కానీ ద్వారక ఒకటే కాదు,కధలోని వ్యక్తుల వంశావళి మిగిలిన అన్ని పురాణాలతోనూ సరిపోలుతున్నాయి, కొన్నింటిని ఆధునికులు కూడా ధృవీకరించటం వల్ల అది చరిత్రయే అనుకోవాలి.స్వతత్రభారతప్రప్రధమప్రధాని ముత్తాత ఢిల్లీ పాదుషాల కొలువులో ఉద్యోగస్తుడు గనక స్కూలు పిల్లకి చెప్పే చరిత్ర మొత్తం ఢిల్లీ నగరం చుట్టూ తిప్పారు.బైబిల్లో సృష్టి జరిగిందని చెబుతున్న క్రీ.పూ 4000 సంవత్సరాల క్రితం దిక్కుమాలిన హిండియన్సుకీ ఏమీ ఉండడానికి అవకాశం లేదని ఇంగ్లీషువాళ్ళు వైదిక యుగాన్ని ఆ తర్వాత కాలానికి లాక్కొచ్చి కూలేశారు. వాళ్ళూ వీళ్ళూ కూడా తెలిసే అబద్ధాలు చెప్పారు!ఇప్పుడు బయటపడిన ద్వారక హిందూద్వేషుల మెదళ్ళలో పెద్ద బాంబునే పేల్చింది.ద్వారక కాలం ఇంకా నిర్ధారించలేదు - 7000 యేళ్ళ నాటిదా 12000 యేళ్ళ నాటిదా అని సందేహాలు ఉన్నాయి.ఎలా తేలినా ఇప్పుడు వేదాలు గ్రంధస్థం చెయ్యబడిన వైదిక కాలం ఖచ్చితంగా ఆ తేదీకి వెనకనే ఉండాలి.ఎందుకంటే ద్వారకావాసి యైన శ్రీకృష్ణుడు  అప్పటికి పూర్తి స్పష్టత వచ్చిన వైదిక ధర్మాన్ని పాటించాడు మరి!
రామాయణ భారతాలు కల్పిత కధలు కావచ్చు గానీ వైదిక సాహిత్యం మాత్రం కాల్పనికం కాదు.నిజానికి వైదిక సాహిత్యం సనాతన ధార్మికులు గురుశిష్యపరంపరతో ఆర్జించిన జ్ఞానరాశి - అందులో అబద్ధాలు ఉండటానికి వీల్లేదు.ఎప్పుడో బవిష్యత్తులో వచ్చే హిందూద్వేషుల్ని ఏడిపించటానికో రాబోయే తరాలని మోసం చెయ్యటానికో అబద్ధాలు రాయాల్సిన అవసరం వారికి లేదు.ఆనాటికి వారి పూర్వులు ఆధించిన జ్ఞానరాశిని గ్రంధస్థం చెయ్యదం అనేది గౌరవభావంతోనే జరుగుతుంది.వైదిక ఋషులైన దీర్ఘతమస,మధుచ్చంద, అంగిరసాది ఋషులు వాస్తవ వ్యక్తులే!భౌతికమైన ఆధారాలు లేనంత మాత్రాన కల్పితవ్యక్తులు అనాలంటే అలేగ్జాండరు ది గ్రేట్ కూడా కల్పితవ్యక్తియే అవుతాడు - చేతులు పైకిపెట్టి సమాధి చెయ్యమన్నాడు అన్న కబుర్లతో సహా వేటికీ భౌతికపరమైన ఆనవాళ్ళు లేవు!జీసస్ క్రీస్తు,మహమ్మదు ప్రవక్త వంటి ప్రపంచ వ్యాప్త మతశాఖల మూలపురుషులకే చారిత్రకపరమైన సాక్ష్యాలు కనపడటం లేదు - నిజం!
హిందూదేశంలోని ఒక బుల్లి రాజునే గెలవలేక వెనక్కి తిరిగిన అలెగ్జాండరు గ్రేట్ అయితే ఎవడికి వాడికి కళ్ళు చెదిరే స్థాయిలో బలమూ బలగమూ తెలివీ పొగరూ ఉండి విడివిడిగా చూసినా ఒక్కొక్కడూ అబ్బా అనిపించే పదిమంది బలమైన శత్రువులు అన్ని వైపుల నుంచీ నొక్కుతున్నా పదే పదే జరుగుతున్న అంతిమ విజయం తేలని వ్యూహాత్మక దాడుల చీకాకుల్ని తట్టుకుంటూ పాతికేళ్ళ పాటు నిలబడి అందర్నీ ఓడించి విజయామృతదరహాసం చేసినవాడు గ్రేట్ కాకుండా ఏలా ఉంటాడు?ఎవడి పేరు చెబితే హిందూద్వేషులకి దిమ్మ దిరిగి మైండు బ్లాకవ్వుద్దో ఆడే సుదాస పాంచాలుడు!
Now I am telling you about that Dasarjaneya war, the Battle of Ten Kings, incidentally it is the first war recorded in history, which is described in the Vedas.Give me a big hand and listen with fullest attention!
దివోదాసు భరతుని తర్వాత 49వ రాజు. దివోదాసు మనుమడే సుదాసుడు.తండ్రి పిజవనుడు కాబట్టి సుదాసుణ్ణి పైజవనుడు అని కూడా అంటారు.ఈ సుదాసుడే మన కధానాయకుడు - మన దేశపు కమ్యూనిష్టు చరిత్రకారుల విశ్లేషణలకి భిన్నమైనదీ సనాతన ధార్మికులు పాటించిన కులసమీకరణల పరమైన సామాజిక వాస్తవమూ అయిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా?ఈతని మూలాన్ని బట్టి వెనక్కి వెళ్ళి చూస్తే ఇతను బ్రాహ్మణేతరుడనీ మీదుమిక్కిలి శూద్రజాతి వాడనీ తెలుస్తుంది. అయినా ఇద్దరు బ్రహ్మర్షులు ఇతనికి మంత్రులై పురోహితులై మార్గదర్శకులై యుద్ధకాలంలో సహాయం చేసి విజయం పొందాక పొగిడి సూక్తాలను వెలయించారు!అసలు కధలోకి వెళ్ళబోయేముందు హిందూద్వేషులకి  అత్యంత ఇష్టురాలైన రోమిల్లా ధాపర్ ఈ దాశరాజ్ఞ యుద్ధం గురించి ఏమని విశ్లేషించిందో చూచెదము గాక, "If you read the hymns the plea to the gods Indra, Agni, whomsoever it is, is help us go and attack this 'dasa' village or this 'dasapua',help us get the cattle of the 'dasa'.It is always cattle that they are wanting.There is no question of help us go into battle and take over a whole territory.It is limited to small areas of attack.They are mobile pastoralists and the cattle raids and predatory raids are surrogate for warfare. There are in fact no great battles or campaigns.Even the famous battle of ten kings is over the change that is taking place that is being brought into function over the river waters of the Ravi. It is not as if there is huge encampment on a plain and the two armies have got together and are fighting each other. None of that.It is something i.e. very much localized and controlled" - అయ్యా!గ్రీకులూ మయన్లూ మరియూ ఇతర యూరోపియన్లూ బుల్లి బుల్లి నగరాల చుట్టూ తిరిగినా వీళ్ళకి రాజులు, మహారాజులు, చక్రవర్తుల్లా కనిపిస్తారు.ఈ దాశరాజ్ఞేయ యుద్ధం పూర్తయిన అతి కొద్ది కాలానికే హరప్పన్ నాగరికత అని మనం ఇవ్వాళ చెప్పుకుంటున్న మహానగరాలను నిర్మంచగలిగిన మహాబలవంతులైన రాజులు కూడా వీళ్ళకి పశువుల కాపర్లుగా కనిపిస్తారు,ఎక్కడ పుట్టి ఎక్కద పెరిగి ఎవరికి వూడిగం చేస్తున్నారు వీళ్ళు? ఛీ!వీళ్ళని గురించి తల్చుకోవటానికే కంపరంగా ఉంది నాకు.
హిందూద్వేషులైనవాళ్ళు అలా అవమానిస్తే హిందూపండితులు కూడా పట్టించుకోకపోవడం వల్ల తెలియలేదు గానీ నేనిప్పుడు ఈ యుద్ధానికి ముందరి తర్వాతి కాలాల ప్రపంచ సంస్కృతులను పోల్చి చూడటం వల్ల ఈ యుద్ధం ప్రపంచంలోని ఇతర చోట్లకి కూదా వైదిక సంస్కృతి వ్యాపించడానికి దోహదపడిందనేది నాకు తెలిసింది.సుదాస ది గ్రేట్ చేతిలో వోడిపోయిన శత్రురాజులు కొత్త ప్రాంతాలను వెతుకుతూ వెళ్లారు.అలా వెళ్ళినవాళ్ళలో కొందరు -

పృధువులు(Prthus or Parthavas) ఇప్పటి Parthians,
పర్శువులు(Parsus or Parsvas) ఇప్పటి Persians,
ఫక్తవులు(Pakthas) ఇప్పటి Paktoons,
భలనులు(Bhalanas) ఇప్పటి Baluchis,
శిమ్యులు(Simyus) ఇప్పటి Albanians,
అళినులు(Alinas) ఇప్పటి Greeks అయ్యారు.
Alina అనేది కొంచెం మార్పు చేందితే Hellennes వస్తుంది.ఈ పదం వైజ్ఞానిక సాంకేతిక శాస్త్రాల్లో గ్రీకూల పారిబాషిక పదాల్లో తరచు కనపడుతుంది.ఇంత గొప్ప స్థాయిలో ప్రపంచగతిని మార్చగలిగిన యుద్ధాన్ని కొందరు పశువుల కాపర్లు పిల్లకాలవల మీద చేసిన చిన్న సైజు దొమ్మీ కింద తేల్చేసిన మనిషి గొప్ప పరిశోధనా చాతుర్యంతో ఎన్నో ఉద్గ్రంధాల్ని రాసిన విదుషీమణి - ఈ పిచ్చిరాతలు రాస్తున్న కాలంలో కనీసపు స్థాయిలోనైనా అబద్ధాలు చెప్తున్నందుకు సిగ్గు గానీ తను అబద్ధాలు చెప్పినట్టు బయటపడితే ఎట్లా అనే భయం గానీ కలగలేదా వీళ్ళకి?
సరే, ఈ గొట్టాంగాళ్లని గురించి యాష్టపడి టైం వేస్ట్ చెయ్యకుండా అసలు కధలోకి వెళ్ళబోయేముందు సుదాసుని వంశ మూలపురుషుడైన చక్రవర్తి భరతుడి  గురించి ముందు కొద్దిగా తెలుసుకుందాం.హిందూ,బౌద్ధ,జిన సాహిత్యాలు అన్నీ ఈ భరతుడి పేరు మీదనే భరతఖండం అనే పేరు వచ్చిందని చెబుతున్నాయి - ఆధునిక చరిత్రకారులు కూడా విధిలేక ఒప్పుకున్నారు.ఈయనొక్కడే 130 అశ్వమేధాలూ 50 రాజసూయాలూ చేశాడు - మొత్తం పౌరాణిక సాహిత్యమంతా వెతికినా మరో రాజుకు ఈ ఖ్యాతి లేదు!రాజుల కోసం నిర్దేశించబడిన మహాయజ్ఞాలు నాలుగు - सौत्रामणि, वाजपेय, राजासूय, अश्वमेध. వీటిలో అశ్వమేధం రాజ్యాన్ని వ్యాప్తి చెయ్యడానికీ రాజసూయాన్ని తన ఆధిక్యతని నిరూపించుకోవడానికీ చేసేవాళ్ళు.భారతదేశం ఎప్పుడూ ఒక్కటి కాదనీ అనేకమంది చిల్లర మల్లర రాజుల పరిపాలన్లో ఐకమత్యం లేకుండా ఉండేదనీ అందువల్లనే విదేశీయులకి తేలిగ్గా లొంగిపోయారనీ చెప్తున్నది పచ్చి అబద్ధం!ఇవన్నీ సోదర వంశాలు - తమ ప్రాంతం పేరుతో పిలిపించుకుంటూ ఉన్నప్పటికీ సంస్కృతి రీత్యా అందరూ ఒక్కటే.
అత్యంత ప్రాచీనమైన ఋగ్వేదంలోనే साम्राज्य (kingdom), भोज्य (state, large kingdom), वैराज्य (extended sovereignty), पारमेष्ठिकराज्य (supreme empire) అనే విభిన్నమైన సాంకేతిక నామాలతో వర్ణించబడిన రాజ్యవ్యవస్థలు ఉండేవి.అయినప్పటికీ విష్ణుపురాణం ఈ మొత్తం అన్నింటిని కలిపి భరతజాతి అనే వ్యవహరించింది.
उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् |
वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ||
(VP 2.3.1)
అటువంటి భరతజాతిలో సుదాసుని తాత దివోదాసు శంబరుదనే అనార్యరాజుకి సమబంధించిన 100 నగరాలను ధ్వంసం చేసిన ఘనుడు!అతని కాలం నుంచీ అణిగి మణిగి ఉన్న ఇతర ఆర్యరాజులు సుదాసుని కాలంలో తిరగబడ్దారు.వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు నిగ్రహించి నిలబడి పోరాడి తన బలమూ కాలమూ ప్రకృతీ కలిసి వచ్చినట్టు అంతిమవిజయం సాధించాడు.సుదాసుడికి అటువైపున ఉన్నవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు.

Alinas(అళిన):  కొందరు వీరిది ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్ లోని నురిస్థాన్(Nuristan) ప్రావిన్స్ ప్రాంతం అని చెబుతున్నారు – చైనా యాత్రికుడు Hiouen Thsang ఈ ప్రాంతం గురించి వర్ణించాడు.
Anu(అను): కొందరు వీరిని పరుష్ని(ravi) తీరవాసులని పేర్కొన్నారు
Bhrigus(భృగు): భృగు మహర్షి వంశస్థులు ఈ కాలానికి రాజ్యపాలన చేపట్టి ఉండవచ్చు.తర్వాత కాలంలో మళ్ళీ అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చి ఉందవచ్చు.అధర్వణ వేదంలో వీరి పాండిత్యం కనబడుతుంది..
Bhalanas(భల్లాణ(?)):  కొందరు వీరిని బోలన్ కనుమ ప్రాంతం వారని వ్యవహరించారు.
Druhyus(ద్రుహ్యు): కొందరు వీరిని గాంధారికి సంబంధం ఉన్న గాంధార(kandahar) ప్రాంతం వారని చెబుతున్నారు.క్రైస్తవమే కాదు అబ్రహామిక్ మతాలలో ఏ ఒక్కటీ పుట్టని కాలపు యూరోపీయ సంస్కృతీ నిర్మాతలైన Druids  వీరే కావచ్చునని చాలామంది చరిత్రకారులు భావిస్తున్నారు.
Matsya(మత్స్య): వీరిని గురించి తెలిసిన సాంకేతిక వివరాలు చాలా తక్కువ, ఒక కవి కవితాత్మకంగా చెప్పిన "ఆకలి గొన్న చేపల వలె సుదాసుని మీదకి యుద్ధానికి వచ్చి నీటిని విడిచిన చేపల వలె అంతమయ్యారు" అనే వర్ణన ప్రముఖమైనదిగా కనిపిస్తుంది అనేక చోట్ల.
Parsu(పర్శు): ప్రాచీన కాలపు పర్షియన్ నాగరికత నిర్మాతలు వీరేనని చాలామంది భావిస్తున్నారు.
Purus(పురు): సుదాసుని మీదకి అందరినీ కూడగట్టగలిగిన ఈ బలమైన వంశమే యుద్ధం తర్వాత పురు,కురు అనే రెండుగా చీలింది వీరి వారసులైన కురు పాండవుల మధ్యనే కురుక్షేత్ర సమరం జరిగింది.
Panis(పణి): ఆర్యఋషులు వీరిని పూర్తి దానవజాతిగా వ్యవహరించారు.తర్వాత కాలంలో వీరే Scythians అయ్యారు.

ఇప్పటి చరిత్రకారులు ఒప్పుకోని ఒక వింత యేమిటంటే సుదాసునికి విజయాన్ని ప్రాప్తించిన ఇంద్రుని గురించి ఆయా జాతుల ప్రాచీన సాహిత్యంలో పూజింపదగనివాడుగా వ్యవహరించే ప్రస్తావనలు ఉన్నాయి.అయితే రాజకీయపరమైన కారణాలతో ప్రాంతం దాటి దూరం జరిగినప్పటికీ చాలాకాలం వరకు వారు తమ మూలస్థానం పట్ల మమకారం ప్రదర్శించారు.అబ్రహామిక్ మతాలు ఈ మౌలిక సంస్కృతిని విభేదించి అ సంబంధాన్ని తెంచివేసి ఆయా నాగరికతలలో కల్లోలాన్ని సృష్టించాయి!ఆయా జాతుల, ప్రాంతాల, రాజ్యాల ప్రాచీన చరిత్రను ఆధునికులు కావాలని విస్మరించడం వెనక నిన్నటి కాలంలో తమచేత పరిపాలించబడిన వారే మొన్నటి కాలంలో తమకు నాగరికతను నేర్పినవారని  గుర్తించడానికి నిరాకరించే అహంభావం ఉన్నది - వారిని కీర్తించే మనవారిలో వారిపట్ల బానిసత్వం ఉన్నది!
ఇంగ్లీషువాళ్ళూ వాళ్ల అంతేవాసులైన మార్క్సిస్టు చరిత్రకారులూ బుద్ధుడికి ముందు రాజ్యాలు గానీ రాజులు గానీ ఉందడానికి వీల్లేదని తీర్మానించేశారు - కానీ బౌద్ధమతసాహిత్యమే षोडशमहाजनपद(Sixteen Graet Repablics) గురించీ బుద్ధుడికి సమకాలికుడైన ఉదయన వత్సరాజును గురించీ చెబుతున్నది, ఇవన్నీ గాల్లోంచి పుట్టుకు వచ్చాయా!
బౌద్ధ సాహిత్యం ప్రకారమే ఉత్తర భారతంలో మగధ,కోసల,వత్స రాజ్యాలు ప్రముఖమైనవి.రాజగృహం మగధకి రాజధాని.శ్రావస్తి కోసలకి రాజధాని.కౌశాంబి వత్సరాజ్యానికి రాజధాని.విదర్భ కొంచెం దక్షిణానికి ఉంటుంది.ఉజ్జయిని దీనికి రాజధాని.కురు,పాంచాల రాజ్యాలు గంగాతీరంలో ఉండేవి.యమునా తీరంలో ఉన్న ఇప్పటి ఆగ్రాని అప్పుడు ఆగ్రోదకం అనేవాళ్ళు.దీనికి కొంచెం దాపుల మధుర రాజధానిగా శూరసేన రాజ్యం ఉంది.వత్స రాజ్యం నుంచి సాగితే గంగా యమునల సంగమ క్షేత్రమైన ప్రయాగ దగ్గిర కాశీ రాజ్యం ఉంది.ఇక్కడి నుంచి తూర్పుకి వెళితే ఇప్పటి బీహారులోని దర్భంగాకి దగ్గిర మిధిల ఉంది.ఇంకా తూర్పుకి వెళితే గంగా సాగర సంగమం దగ్గిర అంగ రాజ్యం ఉన్నది.ఇంకొంచెం ముందుకి వెళితే వంగ, పుళింద, గౌడ దేశాలు ఉంటాయి.వీటి కొసన ఉన్న ఇప్పటి అస్సామును కామరూప పేరుతో పిలిచేవాళ్ళు.ఓఢ్ర,ఉత్కల జనపదాలు కలిసినది ఇప్పటి ఒరిస్సా అవుతుంది.ఇప్పటి గుజరాత్ అప్పటి ఘూర్జర,సౌరాష్ట్రలు కలిసినది.ఇప్పటి రాజస్థాన్ అప్పటి త్రిగర్త,సౌభ్య(సాల్వ) రాజ్యాలు కలిసినది.ఇప్పటి కర్నాటకలో ఎక్కువ భాగం అప్పటి కుంతల దేశం.ఆంధ్ర ప్రాంతానికి త్రిలింగదేశం అనే పేరు కూడా అప్పటినుంచే ఉన్నది.పాండ్య,చేర,చోళ ప్రాంతాల్ని ద్రవిడ రాజ్యాలు అని పిలిచేవాళ్ళు - ఇవన్నీ ఎక్కడున్నాయి?ఇవే కాదు, హిందువులకి సంబంధించిన ఏ ఒక్క గొప్ప విషయమూ బయటికి రానివ్వకూడదనే గట్టి పట్టుదలతో చరిత్రని భ్రష్టు పట్టించిన వీళ్ళు ఎవరు?C.E 1947 నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసువాళ్ళు!ఎడ్వినా ప్రియుడి అండతో యూనివర్సిటీల్లో పీఠం వేసుకున్న కమ్యునిష్టులు!
పైన పేర్కొన్నవి ఏవీ ఆటవిక తెగలు కావు.సువ్యవస్థితమైన రాజ్యాంగ యంత్రం ఉండి సకల సంపదలతో తులతూగే ఆనాటికి ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రాలు - అది కూడాబౌద్ధ సాహిత్యమే చెబుతున్నది, అయినా మనకి తెలియదు, మన ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేర్చి చెబితే గదా తెలిసేది!దాశరాజ్ఞయుద్ధం గురించి కూడా అంతే - ఆటవిక తెగలు ఆవులమంద కోసం బురదలో పడి దొర్లారని తేల్చిపారేశాక ఇంక పరిశోధన ఎలా జరుగుతుంది?నేను వెతికి పట్టుకున్న మేరకు విషయాన్ని గందరగోళం లేకుండా చెబుతాను.ఎవరికి ఎంత అర్ధమైతే అంతే ప్రాప్తం!
యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఇప్పుడు మనం క్రీ.శ 2018లో ఉన్నాము.చాలామంది చరిత్రకారులు దాశరాజ్ఞ యుద్దం జరిగిన కాలాన్ని ఇప్పటినుంచి 8000 సంవత్సరాల వెనక జరిగిందని చెబుతున్నారు.ఇవ్వాళ పూనుకుని పరిశోధనలు చేసినా ఖచ్చితమైన అంచనాకు రావడం కష్టమే,ఎందుకంటే వైదిక సాహిత్యంలో తప్ప మరెక్కడా ఈ యుద్ధం గురించిన ప్రస్తావనలు లేదు.భక్తియార్ ఖిల్జీ అనే అడ్డ గాడిద తగలబెట్టిన నలందా విశ్వవిద్యాలయపు సేకరణలో ఉండి ఉండాలి - కొన్ని వందల వేల లక్షల తరాల పాటు గురుశిష్యపరంపరలో సముపార్జించిన జ్ఞానరాశి అది.అందులో ఒక సహస్రాంశపు జ్ఞానరాశిని సైతం తిరిగి సృష్టించడం సాధ్యమా!గాలికెగిరిన పేలపిండిలా పోయింది ఎటూ తిరిగి రాదు.కానీ ఉన్నదాన్ని కూడా నిలబెట్టుకోలేని దౌర్భాగ్యం దేనికి?నిలబెట్టుకోవడం వరకు వెళ్ళనక్కరలేదు, తెలుసుకోవడానికే ఇష్టపడటం లేదు. మన దేశపు గొప్పవాళ్ళని గౌరవించడానికి కూడా ఆంగ్లేయుల పట్ల పాతుకుపోయిన సాంస్కృతిక భావదాస్యం నుంచి పుట్టిన inferiority complexకి ఈ పిలక బ్యాచ్చి కన్న మేము చాలా తెలివైనవాళ్లం అనే superiority complex కలిసిన రోగిష్టి మనస్తత్వం ఒప్పుకోనివ్వడం లేదు.
దాశరాజ్ఞ యుద్ధానికి వామదేవ శాస్త్రి(David Frauley) తన The Myth of the Aryan Invasion అనే గ్రంధంలో 3700 BCE అని చేసిన నిర్ధారణ యుక్తియుక్తమే - ఇటువైపునుంచి చూస్తున్న చారిత్రక సంభావ్యతలకీ అటువైపునుంచి పౌరాణిక రాజవంశావళి వర్ణనలకీ మధ్యన సమన్వయం కుదురుతున్నది.అయితే, P.L.Bhargava అనే మరొక ప్రముఖ చరిత్రకారుడు 3100 BCE సంవత్సరాన్ని కూడా తనదైన శైలిలో ఆధారాలు చూపిస్తూ నిర్ధారించడం జరిగింది.వైవస్వత మనువు కాలం నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క తరానికీ 16 సంవత్సరాల చొప్పున సుదాసునికి ముందర నలభైమంది పారిపాలించారు అనే లెక్క ప్రకారం ఈ విశ్లేషణ సాగింది.
ఏది ఏమైనప్పటికీ యుద్ధం ముగిశాక శత్రుభీతి లేని ప్రశాంతత ఉత్పత్తినీ వైభవాన్నీ పెంచడం వల్ల హరప్పా,మొహెంజెదారో,డోలవిర లాంటి మహానగరాల నిర్మాణం జరగడానికి కొంత ముందు కాలంలో జరిగి ఉందవచ్చును.ద్వారక,హరప్పాల వంటి నగరాల కాలం గురించి ఇప్పటికీ సందేహాల కతీతమైన నిర్ధారణ జరగలేదు కాబట్టి అవి వెనక్కి జరిగితే దీనినీ వెనక్కి జరపాల్సి వస్తుంది.సరస్వతి ప్రస్తావన కూడా ఉండటం వల్ల సరస్వతి ఇంకిపోక ముందరి కాలంలో ఈ యుద్ధం జరిగినట్టు భావించాలి.
యుద్ధం ఎక్కడ జరిగింది?
ఋగ్వేదం ఏడవ మండలం ఈ యుద్ధం గురించి చాలా సమాచారాన్ని ఇస్తుంది.సుదాసునికి ఒకరి తర్వాత ఒకరుగా పౌరోహిత్యం వహించి దాశరాజ్ఞ యుద్ధంలో కీలకపాత్రని పొషించిన వశిష్ఠ విశ్వామిత్రులు స్వయంగా చెప్పుకున్న సూక్తాలకు తోడు ఇతర వైదిక ఋషులు చెప్పిన సూక్తాలు చాలాచోట్ల కనిపిస్తున్నాయి.అన్నింటిలోనూ ప్రధాన విషయాలలో వైరుధ్యం లేదు గానీ కొన్ని చిన్న చిన్న  విషయాలకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క  విధంగా చెప్పడం వల్ల పాఠాంతరాలు కనబడుతూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.అన్నింటినీ ఒకచోటికి చేర్చి పండితులు ఏకసూత్రతని సాధించాల్సిన అవసరం ఉంది.
విశ్వామిత్రుడు అంతిమవిజయాన్ని ప్రసాదించిన సందర్భంలో ఇంద్ర వరుణులకు కృతజ్ఞతలు చెబుతున్న సూక్తంలో పరుష్ణి జలయుద్ధాన్ని ఎక్కవ ప్రస్తావించాడు గనక దానినే అసలైన యుద్ధరంగం అని పేర్కొనడం సముచితంగా ఉంటుంది.మిగిలిన విషయాలలో సంధిగ్ధత ఉన్నది గానీ భౌగోళిక వర్ణనలు కచ్చితంగానే ఉన్నాయి. ఈ రాజులు అందరూ గంగా-సిందు మైదాన ప్రాంతం వారే,ఈ యుద్ధం రామ రావణ యుద్ధంలా పదిరోజుల్లోనూ కురు పాండవ యుద్ధంలా పద్ధెనిమిది రోజుల్లోనూ ముగిసిపోలేదు.కొన్ని సంవత్సరాల పాటు చిన్న చిన్న యుద్దాలతో కలిపి  యమునా తీరంలో జరిగిన ఒక యుద్ధం, పరుష్ణీ(రావి) తీరంలో జరిగిన యుద్ధం ప్రముఖమైనవి.పరుష్ణీ జలయుద్ధం సుదాసునికి అంతిమవిజయాన్ని ఖరారు చేసింది.
యుద్ధం ఎందుకు జరిగింది?
వశిష్ఠుడు,విశ్వామిత్రుడు - ఇద్దరూ సుదాసుడికి పౌరోహిత్యం చేశారు,అంతిమ విజయం తర్వాత ఇద్దరూ సుదాసుబి మీద ప్రసంసలు కురిపించారు.అయితే,ఇద్దరూ కలిసి ఒకే సమయంలో సుదాసుడికి పౌరోహిత్యం చెయ్యలేదు.అనేకమైన అపారమైన పౌరాణిక సాహిత్యంలో వీరిద్దరీకీ మధ్యన జరిగిన కలహాల కధలు ఎంతో విస్తారమై ఉన్నాయి.తను రాజైనప్పటికీ వశిష్ఠుడికి బ్రహ్మర్షిత్వం వల్ల రాజులకి మించి జరుగుతున్న గౌరవ మర్యాదలని చూసి ఈర్ష్యపడి తను కూడా బ్రహ్మర్షియై వశిష్ఠుడి కన్న అధిక స్థాయిలో గౌరవ మర్యాదలను పొందాలనుకున్నాడనీ ఒకానొక  సందర్భంలో ఒక రాక్షసుడిని ప్రోత్సహించి వశిష్ఠుడి నూరుగురు కుమారుల్నీ హత్య చేయించాడనీ చాలా కధలు ప్రచారంలోకి వచ్చాయి.వాటి ప్రభావం వల్ల కాబోలు మొదట విశ్వామిత్రుడు సుదాసుడికి పురోహితుడుగా ఉండి అతన్ని తొలగించి వశిష్ఠుణ్ణి తీసుకోవడంతో విశ్వామిత్రుడు పగబట్టి మిగిలిన రాజుల్ని రెచ్చగొట్టి దాశరాజ్ఞ యుద్ధానికి బీజం వేశాడని చాలామంది చరిత్రకారులు విశ్లేషణలు చేస్తున్నారు.కానీ నాకు మాత్రం అలా అనుకోవడానికి ఆధారాలు కనబడటం లేదు. మన పౌరాణిక సాహిత్యం నుంచి తొలగించాల్సిన వాటిలో ఈ వశిష్ఠ విశ్వామిత్రుల వైరం కూడా ఒకటి.
మిగిలిన పురాణకదల్ని పట్టించుకోకుండా ఈ దాశరాజ్ఞ యుద్ధం గురించిన ఋగ్వేద సూక్తాలను మాత్రం పట్టించుకుంటే నాకు కనబడిన విషయాలు ఇలా ఉన్నాయి.గెలుపు తర్వాత విశ్వామిత్రుడు చెప్పిన సూక్తంలో పూర్వ పురోహితుడు సాధించలేని దానిని తను సాధించినందుకు గర్వం వ్యక్తం చేశాడు.అందువల్ల యుద్ధం మొదలయ్యేటప్పటికి గానీ తొలిదశలో గానీ వశిష్ఠుడు సుదాసుని పక్కన ఉండి తర్వాత వశిష్ఠుడు దూరమై విశ్వామిత్రుడు సుదాసుడికి పురోహితుడయ్యాడనేది నా అభిప్రాయం.అదే సూక్తంలో విశ్వామిత్రుడే వశిష్ఠుడు కూడ సుదాసుణ్ణి ప్రశంసించినట్టు ప్రస్తావించడం వల్ల వీళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతమైన శత్రుత్వం లేదనే భావించాలి.వ్యతిరేకత గనక ఉంటే ఏదో ఒక నిందావాచకం అక్కడ ఉండి ఉండేది.ఎందుకంటే, వైదిక సాహిత్యంలోని ఏ ఋషీ కూడా వ్యక్తిగతమైన రాగద్వేషాలని దాచుకోవాలని ప్రయత్నించలేదు, కపట నాటకాలను ప్రదర్శించలేదు.సుదాసుడికి పౌరోహిత్యం వహించని కాలంలో విశ్వామిత్రుడు గానీ వశిష్ఠుడు గానీ అటువైపున ఉన్న రాజులకి పౌరోహిత్యం వహించిన దాఖలాలు కూడా కనపడటం లేదు.
RV 7.18.6 దగ్గిర చెప్పినట్టు అప్పటికే చాలా సంవత్సరాల నుంచి సుదాసుడి ఆధిక్యతని సహించలేని యదు,తుర్వశ గణాలు మొదట మత్స్యులను కలుపుకుని తిరుగుబాటు మొదలుపెడితే తర్వాత పురు,పణి వంటి బలమయిన వాళ్ళు కలిశాక ఒక సమూహం ఏర్పడినట్టు చెప్పుకోవచ్చు.సుదాసుని వైపు ఉన్నవారిని శ్వేతవస్త్రధారులుగానూ (daksinataskaparda)కుడివైపున జుట్టును ముడివేసినట్టు గానూ వర్ణించారు.అటువైపువారిని అయజ్వులని వర్ణించారు.దీనిని బట్టి వైదిక సంస్కృతిని తిరస్కరించిన వారు వైదిక సంస్కృతికి కట్టుబడిన సుదాసుని మీద చేసిన సాంస్కృతిక యుద్ధమని కూడా చెప్పుకోవచ్చును.కాకపోతే ఈ సంస్కృతీ భేదం తొలిదశలోనే ఉన్నది గాబట్టి ఇది యుద్ధానికి బలమైన కారణం కాకపోవచ్చు.సుదాసుడికి ఉన్న కృతధ్వజుడు అనే విశేషణం తన సైన్యానికి ముందు ధ్వజాన్ని నిలబెట్టుకోగలిగిన వైభవానికి సంకేతం.బుస్సీ సాయంతో బొబ్బిలి కోటని ముట్టడించిన విజయనగరం రాజుకి నవలక్షకళింగాధీశ్వరుడు అనే బిరుదు ఉంది.ఇవన్నీ వూరికే వాడిన మాటలు కావు.వాళ్ళ సామర్ధ్యాన్ని బట్టి లెక్క ప్రకారం ఇచ్చిన గుర్తింపులు - వీటిని పట్టించుకోకుండా వాళ్ళని ఆటవిక తెగలని అనడం అలా అన్నవాళ్ళ అజ్ఞానాన్ని సూచిస్తుంది.సుదాసుడి వైభవానికి కన్నుకుట్టి అతని మీద చక్రవ్యూహం అమలు జరిపారనేది నిశ్చయం! ఒక్కొక్కరు పోరాడి గెలవలేని బలవంతుడైన శత్రువుని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి గెలిచి ఆనందించాలనే సైనికపరమైన వ్యూహాత్మక తప్పిదమే వారిని యుద్ధానికి దింపి ఉంటుంది.
"రాజనే ప్రతివాడికీ కంటి యెదుట జయింప శక్యం గాని వాడు కనబడుతూ ఉంటే కంటికి నిదర వస్తుందా" - కవియైన శ్రీనాదుడికే డండిమభట్టును తల్చుకుంటే నిదర పట్టలేదు గదా అతన్ని గెలిచే ఒక గొప్ప యెత్తుగడ తట్టేవరకు! వ్యూహం పన్నిన తొలిదశలో అద్భుతమైనది అనిపించినప్పటికీ పదిమంది అల్లిన ఎత్తుగడ బెడిసికొట్టి చివరాఖరికి ఒక చిట్టెలుక పది సింహాల్ని గెలిచినంతటి అద్భుతం జరిగింది. అగ్నికి వాయువు తోడైనట్టు సుదాసుడికి విశ్వామిత్రుడు కలవడంతో.
యుద్ధం ఎట్లా జరిగింది?
విశ్వామిత్రుడు చెప్పిన సూక్తం ప్రకారం శత్రువుల దురాశయే వారిని అపజయం వైపుకు నడిపించింది!సుదాసుడికి ఏవైతే ప్రతికూలతలు అయ్యి తాము తేలికగా అతన్ని గెలవగలమని భావించారో సుదాసుడు వాటినే తనకు అనుకూలతల కింద మలుచుకుని విజయం సాధించాడు.
Sudas’ battle with the ten tribes
Hymn 7.18
Translated by Kant Singh
1. Cherished by ancestors, Indra,the world has loved you since the ancient times till the present.To you, we sing for milch cows, fast horses, wealth, o lord,will all our devotion.
2. O’ king of kings, you are known for showering your generous donations upon the wise sages, since ages.(Indra is garlanded)We adorn you lord, with our praise,to cause us to have cattle, horses, good fortune, our hero.
3. Here, wholeheartedly, with pleasing voices,we worship your divine form.We had prayed to you o’ heavenly king,that you consider our respectful prayer for protection.
4. We had sacrificed a cow for you, we had cherished you by sprinkling milk upon you,the Vasisthas had garlanded you and prayed to you.We had called upon you, o’ chief of the world,and you Indra, had understood our prayer
5. Thanks to the devotion displayed by Sudas,Indra had made the speeding waters, easy to cross.That made Simyu, the most disparaging one, to decry the river,shouting at it with a new curse.
6. Puru and Turvasu were as eager to attack,as fish out of water (are eager to get back into water).The hurt and unhappy circle, from Bhrgu to Druhyu,friend had called friend, to cross over from both sides.
7. On came the Pakthas, the Bhalanas,calling Alinas, Visanins and Sivas.To the Arya’s aid, came the singer Trtsu mercenaries,to support him with pleasure,
8. and the difficult to cross, free flowing,unconcerned, uncontrollable Parusni (river).Great spreading, regal, dropping down the mountains,full of cattle, regarded highly by sages and poets.
9. They failed to control her,the fast flowing swallowed them in her currents.Sudas had prayed to Indra,to kill the unfriendly people talking derisively.
10. Sang to the lord, the guardian, to avert losses,to make possible for his friend the heaping (of riches).Speedily moving, sent down by force, the burning arrows,he (Indra) effectively warded off with ease.
11. 21 kings of various tribes, were killed,nay butchered or laid low.The wonderful waters were granted freedom of the blockadeand let loose by Indra.
12. Under water went old Kavasa, and Druhyu,cursing the Vajra holder (as they went down).We praise the friend of friends,you sent down that Anu, who was unhappy with you.
13. Soon as the speeding stream had caused havoc all over,Indra led bravely, overtaking and scattering.Seeking a portion of all the wealth,even (cousin) Puru had joined hands with the scoffers.
14. He too went to long sleep,like Anu and Druhyu. Six thousandsix hundred and sixty six of world’s most famous and celebrated heroes, were massacred.
15. Indra had consumed Trtsu’s water,even though they were low on resources.Nevertheless, with a roar, he drove out the unfriendly,capturing the worldly possessions of the irreverent.
16. Half the warriors succumbed to the bravery of Indra,the rest perished in the floods.Passionately, Indra roared angrily,sent them down the course of destruction.
17. Holding concentration, he eliminated them,like how a wildcat concentrates when hunting down a Ram.(What happens to the booty and land won in the war? Vasistha asks Indra. Let’s hear about his generosity.)Having selected just one quick brown horse for himself,Indra has handed all the spoils, over to Sudas.
18. Indeed numerous hostile enemy soldiers you subdued,on oath, tore through them, cut them down and gave them death.The hymns of the sacrificers you listened to,you moved forward leading with your swift bolt, o’ Indra.
19. Celebrate Indra, the dam that others had built, he broke,and the enemy on both banks was washed away.(News of Sudas’ victory has spread far and wide; some foreign countries have sent emissaries to the function.)Aja, Sigru and Yakshu have joined the celebrations,to pay tribute, they have brought in as presents,a selection of their topmost, speedy horses.
20. No one is as respected as you Indra,no king like you was seen before and will never be.Devak, the Son of Manyamana, you had killed,certainly hurt Sambar, the coward.
21. For these deeds of seizure and subduing,Parasar, Satayatu and Vasistha praise you, to enjoy your enduring friendship,o’ bright as Sun, o’ fulfiller of desires.
(So Sudas is now master of everything won in the war, except that one horse. How generous will he be in turn? Vasistha goes up to him and asks.)
22. Sudas, the grandson of Devavata, has given us 100 cows and a mare driven chariot.Fire is the proof, Paijavan’s donation will always draw high praise.
23. All over, Paijavan’s donation and bestowment are hereby decreed a deed indeed above all.He occupies the top position amongst kings.He is a man amongst men. His praise flows all over.
(The above praise is not for the mere 100 cows, but for what Sudas has done with the kingdoms of all the others that he has now become master of.)
24. These waters and the land between these waters,portion by portion, he has divided and distributed amongst all those who supported him.Hail Indra, he purged countless in the war,he killed them and spread terror amongst the enemy.
(Not to leave out the Marutas.)
25. The Maruta men supported Divodasa’s descendant Sudas against his enemies.Those filled with contempt for Sudas,who were said to be almost impossible to defeat, they were either slaughtered or submerged indeed.
ఇందులో సుదాసుడి పక్షం తమ ప్రాంతపు నైసర్గిక స్వరూపం తెలిసినవాళ్ళు కావడం చేత రావి నది మీద ఒక వంతెన నిర్మించుకుని నది దాటినట్టు గానూ తర్వాత దానినీ నది గట్లని తెగగొట్టి శత్రువులని జలదిగ్బంధనం చేసి హతమార్చినట్టుగానూ తెలుస్తున్నది!
యుద్ధంలో విజయాన్ని సాధించేది సైనికబలం కాదు, వ్యూహనిర్మాణచతురతయే ముఖ్యం! సూక్తం తమకు ప్రాప్తించిన విజయానికి ఇంద్రుడు కారణమని చెప్పి స్తుతించడం వల్ల కొందరికి సుదాసుడు వాతావరణం. ప్రకృతి అనుకూలించి అదృష్టం వల్ల గెలిచాడు అనే అనుమానం రావచ్చు,కానీ అక్కడ సూక్తంలో కనబడుతున్న దానిని బట్టి తాము పన్నిన వ్యూహం విఫలం కాకుండా ప్రకృతి శక్తులు కూడా అనుకూలించడం వల్లనే వారు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారని అర్ధం అవుతున్నది.ఇటువంటి వ్యూహమే బ్రిటిషువాళ్ళకీ ఫ్రెంచివాళ్ళకీ మధ్యన జరిగిన ట్రఫాల్గర్ యుద్ధంలో కూడా కనబడుతుంది.క్రీ.శ 1805లో Admiral Lord Nelson 27 నౌకలతో Admiral Villeneuve నాయకత్వం వహించిన ఫ్రాంకో స్పానిష్ సంయుక్త దళాల 33 నౌకలతో తలపడ్డాడు.తన నౌకలలో ఒక్కదాన్ని కూడా పొగొట్టుకోకుండా శత్రువుల 232 నౌకల్ని మఠధ్వంసం చేసేశాడు - చదరంగపు బల్ల మీద సెంటర్ దగ్గిర ఉన్న శకటు పుట్టుగడిలో ఉన్న మంత్రి కన్న బలమైనదవుతుందనే స్థానబలిమిని ఉపయోగించుకున్నాడు!
అక్కడ బ్రిటిష్ సేనానీ ఇక్కడ సుదాసుడూ కూడా “శత్రువుల యొక్క  అందరూ కలిసి చేసే ఒక్కుమ్మడి దాడి యొక్క భీబత్సం గురించి మాత్రమే ఆలోచించి భయపడకుండా కేంద్రం దగిర ఉన్నవాడు దాడి చేసే కోణాన్ని కొంచెం మారిస్తే చాలు అతి తక్కువ సమయంలో ఎక్కువమందిని చంపగలడు” అనే విషయాన్ని పట్టించుకోని శత్రువుల తెలివితక్కువతనాన్ని ఉపయోగించుకుని గెలిచారు!
యుద్ధం తర్వాత ఏమైంది?
"The vedic war is a question of values, not race. It is a conflict between spiritual values and materialistic values, which occurs in all societies. Sometimes arya becomes unarya by a change in values, as indicated in the battle of sudas....Even names of famous kings, such as Dvodasa and Sudasa have ending of dasa meaning servent. Sudas ruled the land of Sapta Sindhu, centered around the mighty Sarasvati river, which flowed from Himalayas to Rann of Kutch. After the battle of the Ten Kings, many indians migrated westwards into Iran and beyond." అని వామదేవ శాస్త్రి(David Frawley) చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం.
దాశరాజ్ఞయుద్ధంలో మన ప్రాచీనుల జీవన విధానంలోని ఒక కోణమైన సైనిక వ్యూహాలు మాత్రమే కనబడుతున్నాయి,కానీ భరతుడు తన తర్వాత అసమర్ధులైన రక్తం పంచుకుని పుట్టిన కొడుకులని వదిలి ఎక్కడో తపస్సు చేసుకుంటున్న ఒక ఋషిని ప్రార్ధించి రాజ్యాన్ని అప్పగించాడు - అతనికి ఒక ఋషి మీద అంత నమ్మకం ఎట్లా కలిగింది?ఆంత ధీమాగా ఆ ఋషి మాత్రం ఎట్లా ఒప్పుకున్నాడు?వాళ్ళిద్దరి  ధైర్యానికి కారణం అప్పటికే రాజ్యవ్యవస్థ పూర్తి అమరికతో ఏర్పడి ఉండటమే - రాజు ఒక్కడే సర్వజ్ఞుడూ సర్వసమర్ధుడూ సర్వాంతర్యామీ కాదు!సభలు, సమితులు అనే రెండింటిని గురించి వైదిక ఋషులు చెప్పారు.అప్పటి రాజసభలు ఇప్పటి చట్టసభల పనినే చేస్తూ ఉందేవి.అప్పటి సమితులు ఇప్పటి కమిటీల వలెనే తాత్కాలిక సమస్యలని పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసేవారు.రాజనేవాడికి కొన్ని లక్షణాలని నిర్దేశించారు.ఆ  రాజలక్షణాలు ఉన్న వ్యక్తి ఈ వ్యవస్థలని ఉపయోగించుకుని పరిపాలన సాగిస్తే చాలు, ప్రజలు భయభ్రాంతులు లేకుండా సుఖశాంతులను పొందగలుగుతారు!
నేను పైన ఒకచోట మొదట వశిష్ఠుడు సుదాసునికి పౌరోహిత్యపుమంత్రిత్వం అందిస్తూ ఉండేవాడనీ విశ్వామిత్రుడు సుదాసునికి దగ్గరైన తర్వాత మంత్రిత్వం నుంచి తప్పుకున్నాడనీ చెప్పాను కదా, అది ఎట్లా జరిగిందో తెలుసా?మొదట వశిష్ఠుడు కూడా అనార్య సంస్కృతులను ద్వేషిస్తూ ఉండేవాడు - దాశరాజ్ఞయుద్ధం మొదలు అయ్యే సమయంలో. కొందరు చారిత్రకుల పరిశోధనాత్మకవిశ్లేషణ ప్రకారం విశ్వామిత్రుడు ఇప్పటి యూరోప్(హరివర్షం!) ప్రాంతం నుంచి వలస వచ్చిన కాందిశీకుడు.అతను వశిష్టుడి సహాయం కోరితే ఆశ్రయం ఇచ్చాడు.క్రమేణ వశిష్ఠుడు అనార్యుల పట్ల ద్వేషాన్ని తగ్గించుకుని వారి సంస్కృతులని అధయ్యనం చెయ్యడం మొదలుపెట్టాడు.(Rigveda7.86 [2-7]) ప్రకారం అనార్య దేవతామూర్తులను ఆర్యధర్మానికి దగ్గర చేశాడు.అతను ఈ ప్రయత్నాలలో ఉండటం వల్ల మంత్రిత్వానికి దూరమైనప్పుడు విశ్వామిత్రుడు ఆ బాధ్యతలను స్వీకరించాడు.అంటే, ఇటువైపు విశ్వామిత్రుడు military exponentగా వాళ్ళని ఓడించి నాశనం చేస్తుంటే అటువైపు వశిష్ఠుడు cultural ambassadorగా వాళ్ళ సంస్కృతిని అధ్యయనం చేస్తూ తర్వాత కాలపు భారతీయ సమాజం పాటించిన జీవధారకు అవసరమైన రెండు పరస్పర విరుద్ధమైన భావధారలను వృద్ధి చేసి సుదాసుని విజయం తర్వాత వీటిని సమన్వయించి కొత్త సంస్కృతిని సృష్టించారు.
ఈ కొత్త సంస్కృతిని పాటించిన ఏ రాజూ కొత్త ప్రాంతాలని ఆక్రమించడంలో కేవలం విస్తరించడానికే ప్రయత్నించారు తప్ప స్థానిక సంస్కృతులను నాశనం చెయ్యలేదు.క్రీ.శ 1వ శతాబ్దిలో అరేబియా ఖండం వరకు జైత్రయాత్ర చేసి మక్కా గుడిని నిర్మించిన విక్రమార్క మహారాజు గానీ నేటి కంబోడియా ధాయిలాండ్ వంటి ప్రాంతాలకు తరలివెళ్ళి రాజ్యస్థాపన చేసినవారు గానీ సనాతనధర్మాన్ని పరిచయం చెయ్యడమే తప్ప స్థానిక సంస్కృతులను నాశనం చెయ్యకపోవడానికి వశిష్ఠ విశ్వామిత్రుల సమిష్ఠి కృషి ఫలితమైన సంస్కారమే కారణం!
పూర్వకవులు రామాయణ,భారతాల స్థాయిలో ఇతిహాసం అనిపించుకోదగిన దీనిని ఎందుకు వదిలేశారో తెలియదు గానీ పట్టించుకుని కధాకావ్యం వలె మలిచినట్లైతే ఇదే మొదటి ఇతిహాసం అయి ఉండేది! రామరావణయుద్ధం రాముడికి సీతని సాధించి పెట్టింది,కురుపాండవయుద్ధం పాండవులకి తమ రాజ్యాన్ని సాధించి పెట్టింది - కానీ దాశరాజ్ఞయుద్ధం విస్తారమైన గంగా-సింధు మైదాన ప్రాంతం మీద భరత వంశానికి చెందిన సుదాసుడికి ఏకచ్చత్రాధిపత్యం సాధించి పెట్టటమే కాక సుదాసుడికి భయపడి దూరతీరాలకి వెళ్ళినవాళ్ళ వల్ల నేల నాలుగు చెరగుల ఇక్కడి సంస్కృతి వ్యాపించడానికి దారులు వేసింది!
ఉపసంహారం:
బంధుత్వాలని కూదా చూడకుండా సుదాసుడి మీదకి వచ్చినవాళ్ళు ఖచ్చితంగా భౌతిక సుఖాల కోసం నైతికతకి సెలవిచ్చిన ధర్మద్రోహులే!ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రతివాడూ సుదాసుడి విజయాన్ని తమ విజయంగానే భావిస్తాడు - అది సహజం!అంతే కాదు, నిన్నా నేడూ రేపూ "అన్ని కష్టాలూ నాకే రావాలా?ఒక్కడినీ ఇని కష్టాలని ఎలా గట్టెక్కను!" అని అలమటించే ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడూ సుదాసుడే అవుతున్నాడు.
ఇవ్వాళ మొత్తం ఆంధ్రదేశమే సుదాసుడు నిలబడిన దశరాజ్ఞ వ్యూహంలో ఇరుక్కుపోయి ఉంది.విభజన బిల్లుని ఎట్లా రూపొందించాలో కూడా తేలియని అజ్ఞానం.అహంకారం,అనౌచిత్యం రూపు దాల్చిన మదోధ్ధురులు అడ్డంగా ఒక గీత గీసేసి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అనంతకాలం వరకూ తిట్టుకుంటూ గడపటానికి కావలసినన్ని బొక్కల్ని పెట్టి వదిలేశారు!మాతృరాష్ట్రం అనేపాటి కనీసపు సంస్కారం లేకుండా అవశేషం అని అవమానించారు!
ఆంధ్రప్రాంతపు వోట్లు అక్కరలేదనుకున్నదో లేక తమ ప్రాంతానికి అన్యాయం జరిగే దరిద్రగొట్టు విభజనలో తమ పార్టీ ప్రమేయం కూడా ఉన్నదని తెలిసిన ఆంధ్రావాళ్ళు అడిగినా వెయ్యరనుకున్నదో అసలు విభజన తర్వాత ఆంధ్ర ప్రాంతం బతికి బట్టకట్టదని అప్పటికే నిర్ధారణ ఆయిపోయందో ముందే బతకనివ్వకూడదని వ్యూహప్రకారమే విడగొట్టారో గానీ చిన్నమ్మ నన్ను గుర్తుంచుకోమని తెలంగాణనే అడిగింది!బిల్లులో ఉన్న లోపాలని అమలుచెయ్యలేని చెడ్డపేరు మనకి దేనికి అని చెప్పిన కురువృద్దుణ్ణి అవహేళన చేసి అది అక్రమవిభజన అని తెలిసీ సహకరించారు!
ఎవరూ అడక్కపోయినా తల్లిని చంపి పిల్లని పుట్టించారని సెంటిమెంటు వొలకబోసిన పెద్దమనిషి అసలు సాయం చెయ్యాల్సిన సన్నివేశంలో కుండెడు నీళ్ళూ చెంబెడు మట్టీ ఇచ్చి పోయాడు! మాకూ ఆంధ్రాకి సాయం చెయ్యాలనే ఉంది గానీ ఆంధ్రాకి సాయం చేస్తే దేశంలో కల్లోలం వస్తుందని భయపడుతున్నాం అని కూసినవాళ్ళు వాళ్ళ భయానికి కారణాలు చెప్పలేదు!చట్టప్రకారం ఇవ్వాల్సిన 10 రూపాయలు అడక్కపోతే దొడ్డిదారిని 20 రూపాయలు ఇస్తామనే పోరంబోకు మాటకి అర్ధం ఏమిటో అడిగినవాడు ఒక్కడూ లేడు!
అడగాల్సిన ఒకే ఒక్కడూ ఈ నాలుగేళ్ళూ వాళ్ళ చంకనే ఎక్కికూచుని వాళ్ళ భుజం మీదనే తల పెట్టుకుని లాలి పాటలు పాడించుకుంటూ నిద్రపోయి ఇప్పుడు నిద్రలేచి ఒళ్ళు విరుచుకుని ఆవులించి మళ్ళీ అసమన్యాయం ఏడుపుపాట అందుకున్నాడు!ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి కుర్చీ తప్ప ప్రజల కష్టాలు కనపడటం లేదు - అధికార పక్షం తప్పుల్ని ఎండగట్టాల్సిన అవకాశం వచ్చినప్పుడు చేజేతులా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ నవ్వులపాలు అవుతున్నాడు!
అందర్నీ ప్రశ్నిస్తానని బయల్దేరిన శ్రంగార పవనుడికి ప్రజలు తనని అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు చెప్పటానికే ముఖం చెల్లటం లేదు! నిన్నటివరకు తన మంత్రివర్గంలో కూదా భాగమైన ఒక మిత్రపక్షం హఠాత్తుగా మీ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తున్నదని తనమీద అవిశ్వాసం పెడుతుంటే కనీసం ఎక్కడ పొరపాటు జరిగిందో పరీశీలించుకుని దాన్ని పరిష్కరించుకుందామనే స్పందన కూడా చూపించకుండా "ఈ ఆంధ్రాగొట్టాంగాళ్ళు ఎంత గోల చేస్తే నాకేంటి?వీళ్ళవోట్లతోనే నేను అధికారంలోకి నిన్న వచ్చానా, రేపు వస్తానా!" అన్నంత నిర్లక్ష్యపు అహంభావాన్ని చూపిస్తున్నాడు!
జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు అన్నీ తమ రాజకీయ దురాశలతో ఆంధ్రప్రజల్ని సుదాస పైజవనుడి స్థానంలో నిలబెట్టారు - ఏ ప్రతికూలతలని చూసి శత్రువులు ఉత్సాహం పొందారో వాటినే అనుకూలతలుగ మార్చుకుని గెలిచిన నాటి సుదాస పాంచాలుడి లాగే ఆంధ్రులు కూడ స్వయంకృషినీ దైవశక్తినీ నమ్ముకుని ఆంధ్రా ది గ్రేట్ అనిపించాలి!
గతంలోని వీరవరుల్ని స్మరించుకుని పులకించని జాతినుంచి ఆగతాన్ని సుందరతరం చేసే వీరవరులు ప్రభవించరనేది చరిత్ర మళ్ళీ మళ్ళీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్న కఠిన సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...