కేంఫ్ర ప్రభుత్వం పశువధ నియంత్రణ గురించి కొంచెం చొరవ చూపించగానే కంచె ఐలయ్య లాంటి వాళ్ళకి ప్రోటీన్ల కోసం మాంసాహారమే తినాలనే తలతిక్క వాదనలు చెయ్యడానికీ, మాంసం తింటున్నందువల్లనే పాకిస్తానీయులకి భారతీయుల కన్న ఐక్యు ఎక్కువగా ఉందనే నిరూపణ కాని పాక్షిక సత్యాలతో వదరుబోతుతనాన్ని ప్రదర్శించడానికీ, మీసాల సుహాసిని గారి ఆంధ్రచీకటి పత్రికలో "ఆవు ప్రారంభించిన అంతర్యుద్ధం" అని తింగరి వ్యాసాలు రాసి పాప్యులారిటీ తెచ్చుకోవడానికీ మంచి అవకాశం దొరికింది!కానీ, పదో తరగతి సైన్సు పాఠం గుర్తున్నా ప్రోటీన్లు మాంసాహారంలో కన్నా పప్పు ధాన్యాలలోనే ఎక్కువ ఉంటాయని తెలుస్తుంది.ప్రోటీన్ అనే ఇంగ్లీషు మాటకి పర్యాయంగా భారతీయ భాషల్లో వాడుతున్న మాంసకృత్తులు అన్న పదంలో మాంసం ఉంది కాబట్టి అటువైపుకి ఫిరాయించేశారు ఈ సామాజిక శాస్త్రవేత్తలుంగారు.ఏమిటో పాకిస్తానీయుల ఐక్యు వ;ల్ల వారికి వచ్చి పడుతున్న మేధోపరమైన వైభవాలు - దొంగచాటుగా కంచెలు దూకి వచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడమేనా!
పేరుపొందిన ఆహార శాస్త్రవేత్తలు అందరూ మాంసాహారం కన్న శాఖాహారమే మనిషి ఆరోగ్యానికి ప్రశస్తం అని చెబుతునారు - మాంసాహారాన్ని సమర్ధించేవారు రుచిని బట్టే ఎక్కువ మార్కులు వేస్తున్నారు తప్ప ఆరోగ్యం విషయంలో శాఖాహారాన్ని సమర్ధించేవారిని పొర్వపక్షం చెయ్యలేకపోతున్నారు.అసలు మనిషి దేహమే శాఖాహారానికి అనుగుణంగా ఉంటుంది - మాంసాహార జంతువులలో తప్పనిసరిగా కనిపిస్తున్న కోరపన్ను(Incisor) మనిషిలో లేదు, కుంచించుకుపోయి చిన్న సూది పరిమాణంలో మిగిలి ఉంది.అన్ని జంతువుల లోనూ దంతాల నిర్మాణాన్ని పరిశీలించి వాటి ఆహారపు అలవాట్లని తెలుసుకోవచ్చును.పక్షులలో కూడా మాంసాహరం మీద బతికేవాటికి ముక్కు బలంగా వంగి ఉంటుంది - అక్కడ కూడా మాంసాన్ని చీల్చడానికి పనికివచ్చే ఏర్పాటు అది!ఇంకొక విశేషం యేమిటంటే ఆవుల నుంచి గాడిదల వరకు గడ్డి జాతుల్ని పెరుక్కుని తినడానికి వీలుగా ముందరి నాలుగు(అటు రెండు ఇటు రెండు) దంతాలూ పారల మాదిరి పీకడానికి పట్టును ఇవ్వడానికి వీలుగా ఉంటే చేతుల్తో ఆ పని చెయ్యగలిగిన నరవానర జాతులలో ఆ వెడల్పు తగ్గి కొరకడానికి వీలుగా ఉన్నాయి.శాఖాహారులలో సెల్యులోజ్ అనే త్వరగా జీర్ణం కాని పదార్ధాన్ని జీర్ణం చెయ్యడం కోసం సూక్ష్మక్రిములతో నిండిన అపెండిక్స్ క్రియాశెలంగా ఉండి మానవుడు ఆహారాన్ని ఉడకబెట్టి తినడం నేర్చుకున్నాక అవశేషంగా మిగిలిపోయింది.ఈ వండుకుని తినడం నేర్చుకున్న తర్వాతనే మనిషి మాంసాన్ని తినడం మొదలుపెట్టాడు.మనిషి తప్ప ఇతర మాంసాహార జంతువులు అన్నీ పచ్చి మాంసాన్ని పీక్కుని తింటున్నాయి,మసాలాలు కలపనిదే మాంసాహారానికి కూడా రుచి రాదు,ఆ మసాలాలో ఉండే ఘాటు స్లోపాయిజన్ లాంటిది,ఇవ్వాళ అరి భీకరంగా మాంసాహారాన్ని హక్కుగా వాదిస్తున్నవాళ్ళకి రోజూ వడ్డిస్తే సంవత్సరం తర్వాత ఎంతమంది హాస్పటలుకీ వల్లకాటికీ పరిగెత్తకుండా ఉంటారో తెలియదు - ఇది నాకు తెలిసిన సైన్సు!
శాకాహారం కోసం ఏ ఒక మొక్కని గానీ చెట్టుని గానీ చంపాల్సిన పని లేదు,కానీ మాంసాహారం కోసం మాత్రం ఆ జీవిని దాని ఇష్టంతో సంబంధం లేకుండా దాని బతికే హక్కుని కాలరాస్తూ బలప్రయోగంతో హింసించి చంపాల్సిందే - మరి, బ్రాహ్మణులు దళితుల్ని అణిచివేశారనీ,హిందూదేవుళ్ళ చేతుల్లోని ఆయుధాలు హింసకి గుర్తనీ వాదించి ఆ హింసకి వ్యతిరేకంగా పోరాడుతున్న దళితహక్కుల పోరాటవీరుడికి అణిచివేత కన్న హత్య సాంకేతీకంగా మరింత తీవ్రమయిన నేరం అని తెలియదా?ఆ జంతువులు కూడా మనిషిలాగే ప్రకృతిలో ఒక భాగం!వాటి జాతిని ప్రవృద్ధం చేసుకోవడం కోసమే సంతానాన్ని కంటున్నాయి తప్ప అవి మనిషికి ఆహారం కావడం కోసం పుట్టలేదు, అవునా కాదా?నేనూ మాంసం తింటాను,రుచి కోసం తినడం ఆమోదయోగ్యమే - పరివ్రాజకులైన కంచి పరమాచార్యులు గానీ గరికిపాటి నరసింహారావు గారిలాంటి ప్రవచన కర్తలు గానీ పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించడం తప్పు, ఎవరి ఆహారపు అలవాట్లు వారివి అనే అంటున్నారు.ఇప్పుడు ప్రభుత్వం చేస్తునది కూడా కొత్త ఆర్డినెన్సులు జారీ చేసి కొత్త నిసేధాలు పెట్టడం కాదు - కొన్ని దశాబ్దాల క్రితమే పశువుల్ని విపరీత స్థాయిలో చqంపడం పట్ల ఇచ్చిన ఆదేశిక సూత్రాలనే కొంచెం దుము దులిపి అమలు చేస్తునారు.అవి శాసనాలుగా రూపొందినది కాంగ్రెసు వారి ప్రభుత్వ కాలంలోనే,అమలు చేస్తున్నది బీజేపీ కాబట్టి గొడవ చేస్తున్నారు, అంతే!
ఒక పౌరుడు తన సౌకర్యం గురించి ఆలోచించడం వరకు సమంజసమే, కానీ అది ఇతరులకి హాని చెయ్యనిది అయితే ప్రభుత్వాని ముకుపిండి అయినా జరిపించుకోవచ్చు - ఏవరూ కాదనరు!కానీ ఆరోగ్యానికి శాకాహారమే మాంసాహారం కన్న మెరుగు అని తెలిసినా శాకాహారాన్ని హిందువులకి ఫిరాయించేసి వాళు చెప్తున్నారు గాబట్టి మేము వ్యతిరేకిస్తాం అనడం సమర్ధనీయమేనా?ఆరోగ్యం దృష్టితో చూసినా మాంసాహారాన్ని తగ్గించమని చెప్పడం మంచిమాటే అయినప్పుడు వ్యతిరేకించడం కోసం వ్యతిరేకించడం దేనికి?చరిత్రలో ఈ దేశపు సరిహద్దులు ఎన్నో రకాలుగా మారినా సాంకేతికంగా చూస్తే 1947 ఆగష్టు 15న మనకి ఒక దేశంగా ప్రపంచం గుర్తించిన ఈ సరిహద్దు లోపల ప్రభుత్వం కేవలం మనుషుల్ని మాత్రమే రక్షించితే సరిపోతుందా?అనేక రకాల జంతుజాతులతో వృక్షజాతులతో నిండిన పర్యావరణాన్ని సమతౌల్యం చెదరకుండా కాపాడవలసిన బాధ్యత లేదా?ప్రజలకి తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు కూడా తెలియక పోవడం వల్ల నిర్లక్ష్యానికి గురై కొన్నీ దురాశకి గురై కొన్నీ నశించిపోయిన జంతుజాతులు ఒప్పటికే ప్రకృతికీ మానవుడికీ మధ్యన ఒక ప్రమాదకరమైన ఖాళీని పెంచుతున్నాయని ఎంతమందికి తెలుసు!
ఇప్పటికే దేశంలో మాంసాహారపు వినియోగం తారాస్థాయిలో ఉంది.దీనిని తగ్గించకపోతే చూస్తూ ఉండగానే పిచ్చుకల మాదిరి గానే ఆవులు,గేదెలు,మేకల లాంటి జంతువులు కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది.ఇవ్వాళ ఇంత భీకరంగా ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్న వాళ్ళ వెనక బీఫ్ ఎక్పోర్ట్ ఇండస్ట్రీ యొక్క లాబీయింగ్ పనిచేస్తూ ఇండి ఉండవచ్చు!దీనిని హిందూ-ముస్లిం కళ్ళద్దాల వెనకనుంచి చూసేవాళ్లకి తెలియని నిజం యేమిటంటే దేశంలోని అత్యంత లాభదాయకమైన కబేళాల యజమానుల్లో చాలామంది హిందువులే!ప్రభుత్వంలో ఉన్నవాళ్ళకి అది తెలియకుండా ఉంటుందా?
వాటికి పశువుల్ని విక్రయిస్తున్న వారు కూడా హిందువులే!వ్యవసాయం అనేది అత్యంత ప్రముఖమైన ఉత్పత్తి సాధనమే అయినప్పటికీ దాన్ని లాభసాటిగా చెయ్యాలన్న సంకల్పం గానీ నిజాయితీ గానీ పట్టుదల గానీ ఇప్పటివరకు పరిపాలించిన వారిలో లేకపోవడం వల్ల ఆయా జంతువులు కేవలం ఆహారం కోసం బలి అవుతున్నాయి. ఒకప్పుడు ఎన్ని కరువులు వచ్చినా మళ్ళీ రైతులు కూదదీసుకోవటం జరిగింది వ్యవసాయంలో ఈ పశుపక్ష్యాదుల ప్రమేయం వల్లనే! పశువులు తిరిగే నేలలో భూసారం తగగ్డమ ంటూ ఉండదు కాబట్టే ఒక్క అవుల్నే కాకుండా గేదెల్నీ మేకల్నీ గొర్రెల్నీ పంచి వ్యవసాయ భూముల్లో తిరగనివ్వడం వల్ల కృత్రిమ ఎరువులు వాడకపోయినా పంటలు పుష్కలంగా పండేవి - పండిన పంటలో మంచి క్వాలిటీ ఉండేది.ఏసృష్టిలోని ఏ జంతువూ మనిషికి ఆహారం కావడం కోసం పుట్టలేదని తెలుసుకుంటే ఈ మాంసాహార ప్రియుల వీరంగాలు తగ్గుతాయి.మాంసాహారులు తమ ఆరోగ్యం కోసమయినా దానిమీద ప్రీతిని తగ్గించుకోవడం మంచిది కదా!ఒకవేళ నా ఆరోగ్యం నా ఇష్టం అనదలుచుకుంటే వారికి నేను వేస్తున్న ప్రశ్న ఇది:
మాంసాహారులు ఆ జంతువులకి బతికే హక్కు ఉండదని అనుకుంటున్నారా!