Sunday 6 August 2023

శాకాహారులు కూడా హింస చేస్తున్నారా - హవ్వ,ఇదెక్కడి ఘోరం!

నేను పచ్చి శాకాహారిని కాదు.అప్పుడప్పుడూ మాంసం తింటాను.అయితే,కొందరిలా "మాంసాహారం - శాకాహారం" అనే రెంటిలో ఎటో ఒక వైపు జరిగి నేను తినేది మాత్రమే బెస్టు,రెండో క్యాటగిరీ వాళ్ళు వెధవలు అనే రకం వాదనలు చెయ్యను.కానీ, అనుకోని విధాన శాకాహారాన్ని సమర్ధించాల్సిన అవసరం పడింది.మిత్రులు Nàgaràju Munnuru గారు రెండు రోజుల క్రితం ఒక ప్రశ్న వేశారు.చర్చ అని నిర్వచనం ఇవ్వలేను గానీ చర్చ లాంటి గొడవ మొదలైంది.ఆసక్తి కొద్దీ నేనూ చర్చని చూశాను.అటువైపువారూ ఇటువైపువారూ కూడా తమ తమ ఆహారపు అలవాట్లను సమర్ధించుకుంటూ చాలా చక్కని జవాబులు చెప్పారు.

అయితే, మాంసాహారాన్ని సమర్ధిస్తున్న కొందరి కామెంట్లు నిర్లక్ష్యం,దురుసుతనం,అసహ్యం వంటి అవలక్షణాలను ప్రతిబింబించేలా ఉండటంతో వాటికి ప్రతివాదన చేశాను.అక్కడ నేను చేసిన రెండు కామెంట్లూ శాకాహారాన్ని సమర్ధిస్తున్నాయి.నిజానికి నేను పచ్చి శాకాహారిని కాదు.అప్పుడప్పుడూ మాంసం తింటాను.అలాంటప్పుడు ఇలా శాకాహారాన్ని ఏకపక్షం సమర్ధించెయ్యడం కరక్టు కాదు కదా!మొదట అక్కడి వాదనని పరిచయం చేసి చివర్న రెంటికీ సమన్వయం చెప్తాను, చూడండి.

 "మాంసాహారం తినేవారు జీవహింస చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి జీవిలోనూ ప్రాణం ఉంటుంది. అవునా!? ప్రతి మొక్కకు ప్రాణం ఉంటుందని ప్రఖ్యాత భారత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారు నిరూపించారు కదా? మరి శాకాహారం తినేవాళ్ళు జీవహింస చేయడం లేదా? మనం పీల్చే గాలిలో కూడా సూక్ష్మ జీవులు ఉంటాయి. అవి శ్వాస ద్వారా ముక్కు లోపలికి వెళ్లి చనిపోతాయి. అంటే నువ్వు బతకడానికి పీల్చే గాలి ద్వారా కూడా జీవహింస చేస్తున్నట్లే కదా? మరి ఏది హింస, ఏది అహింస?"

-Nàgaràju Munnuru

Raghavendra Rao MV->

ఇక్కడ జీవ హింస అంటే - మీరు ఆహారంగా తీసుకోబోయే జంతువు, లేదా పక్షి తనను వధిస్తున్న సంగతి గ్రహించి ప్రాణం కోసం నిస్సహాయంగా కొట్టుకుంటుంది. అందునా ఝట్కా పద్దతిలో కాకుండా ఇతర పద్ధతుల్లో వధించినప్పుడు చిత్రహింస అనుభవించి మరీ మరణిస్తుంది. అనుభవం మొక్కలకు ఉండదు కదా! పైగా పక్వానికి వచ్చిన కాయలు, పళ్ళు మాత్రమే కోస్తాము కాబట్టి అది మనం పెరిగిన గోళ్లు తీసుకోవటంతో సమానం.

Nàgaràju Munnuru->

Raghavendra Rao MV: మీరు చక్కెర లేదా చక్కెరతో చేసిన తీపి పదార్థాలను తింటారా? అయితే చక్కెర ఎలా ఉత్పత్తి అవుతుంది తెలుసా? రైతులు చెరకు అనే పంటను సాగుచేసి అవి ఏపుగా పెరిగాక వాటిని కత్తితో నరుకుతారు. తర్వాత చెరకు మిల్లుకు తీసుకువెళ్ళి క్రషింగ్ చేసి చెరకు రసాన్ని తీసి దాని నుండి చక్కెర తయారు చేస్తారు. చక్కెర లేదా చక్కెరతో చేసిన తీపి పదార్థాలు తయారు అవడానికి మూలం చెరకు మొక్కను నరకడం ద్వారానే జరుగుతుంది. ఇందులో హింస లేదా?

Raghavendra Rao MV->

Nàgaràju Munnuru: మొక్కలకి ప్రాణం ఉన్న మాట నిజమే. అయితే పశు పక్ష్యాదులు, చివరికి కోడి గుడ్డు అనేది కూడా జీవం కలిగిన ప్రాణులు. వాటి పట్ల మనం చేసేది ఖచ్చితంగా జీవ హింస. చెరుకు నుండి పంచదార తెచ్చినా లేదా కలప నుండి కాగితం తెచ్చినా అది హింస కిందకి రాదు. నేను పైన చెప్పినట్లు మన శరీరమునుండి తీసిన గోళ్ళని రోట్లో వేసి రుబ్బినా హింస అవుతుందా? ఇదీ అంతే. పక్వానికి వచ్చిన కాయలు, పండ్లు లేదా చెరుకుగడలు వంటివి కోసి ఎలా ఉపయోగించినా అది హింస అవదు. ఇంకా కొన్ని పళ్ళు తిని, గింజలు భూమిలో వేయటం ద్వారా వాటి ప్రత్యుత్పత్తి కి సహకరించినట్లే అవుతుంది.

Aswanth Achanta->

ఆంగ్లంలో "సెంటియంట్ బీయింగ్స్" అని ఒక తింగరి సిద్ధాంతం ఉంది, దాని ప్రకారం మొక్కలు, చెట్లు, కాయగూరలు అనేవి సెంటియంట్ బీయింగ్స్ క్రిందకు రావు. కనుక వాటిని చంపొచ్చు, అదే అక్కడ వేగనిజంకు (వెజిటేరియనిజం కాదండోయ్!) ఆధారం. అందుకే మాలోకాలు ఆవు/గేదె పాలను కూడా మాంసాహారం అంటారు.

my dialog with the author

Haribabu Suraneni:

హింస అంటే ఏంటో తెలియక,తెలుసుకోవాల్ని అనుకోక కేవలం మాంసాహారం హింసతో కూడినది అనే శాకాహారులని వెక్కిరించడానికి వేసిన పోష్టు ఇది.సత్యం పట్ల నిబధ్ధత లేనప్పుడు "మా ఇష్టం,మేం హింసిస్తాం - మీకెందు?" అనేస్తే సరిపోతుంది.ఇట్లా తింగరి వాదనలు చెయ్యదం అనవసరం.

జై శ్రీ రామ్!

ప్రత్యుత్తరమివ్వు

1రో

Nàgaràju Munnuru->

Haribabu Suraneni: మీరు అనుకున్నట్టు ఇది శాకాహారులను వెక్కిరించడానికి వేసిన పోస్టు కాదు. ఏది హింస, ఏది అహింస అనే అంశం మీద మీ అభిప్రాయం తెలుపండి. నాతో పాటు ఇతరులు కూడా తెలుసుకుంటారు.

ప్రత్యుత్తరమివ్వు

1రో

Haribabu Suraneni->

Nàgaràju Munnuru: చెట్లకి పళ్ళూ కాయలూ ఎందుకు కాస్తున్నాయి?జాతి వ్యాప్తి కోసం!అది ఎలా జరుగుతుంది?చెట్లు ఒక చోట పాతుకుని పెరుగుతాయి,కదా!ప్రతి పండులోనూ కొన్ని విత్తనాలు ఉంటాయి.ప్రతి విత్తనానికీ గట్టి పెంకు ఉంటుంది. సుత్తి ఏర్పాటు అంతా ఎందుకు?ఏకంగా విత్తనాలు వచ్చేసి విత్తనాలు రాలి భూమి మీద పడి అక్కడే మొలకెత్త వచ్చు కదా!

అలా జరిగితే కొత్త మొక్కలు భూసారాన్ని ఎక్కడ నుంచి పీల్చుకుంటాయి?ప్రస్తుతం చెట్టు నుంచి ఇవి రాలి పడ్డాయో చెట్టు పీల్చుకుంటున్న భూసారాన్నే పీల్చుకుని ఎదగాలంటే ఒక చెట్టుకు సరిపడిన భూసారం పది,వంద,వెయ్యి,కోటి చెట్లకి సరిపోతుందా?అలా స్థాణువులైన వృక్ష జాతి మొత్తం నశించిపోని ఏర్పాటే పళ్ళూ కాయలూ.వాటిని పక్షులు గానీ జంతువులు గానీ తిన్నప్పుడు విత్తనాల మీద ఉన్న పెంకు జీర్ణం అవక విసర్జన ద్వారా వేరే చోట్లకి విత్తనాలు వెళ్తాయి. చెట్టు తన జాతి వృధ్ధి కోసం చేసుకున్న ఏర్పాటును మనిషి ఉపయోగించుకోవడం హింస ఎలా అవుతుంది?

ఒక జామచెట్టును పెంచి పోషించే మనిషి చెట్టుకు కాసిన కొన్ని కాయల్ని తినడం హింస ఎలా అవుతుంది?వరి కంకులతో సహా చెరకుగడల వంటి ఇతర వృక్ష సంబంధమైన ఆహారం కూడా ఇలానే వస్తుంది.మనం తినే చెరకు గడలు ఒక రైతు పండించిన పంట.వ్యవసాయం కూడా హింస అంటే ఇక మనుషులు తిండి తినటం మానేసి చచ్చిపోవాలి.ఇక ఆవులు గానీ గేదెలు గానీ అవి పాలు ఎప్పుడు ఇస్తాయి?మనకి లానే వాటికీ దూడలకి పోషణ కోసం పాలు వస్తాయి.కానీ,మానవ శిశువులా అవి తల్లికి ఉన్న నాలుగు చన్నుల నుంచీ వచ్చిన అన్ని పాలు తాగితే ఏమవుతుందో వాటిని దగ్గరుండి చూసేవాళ్ళకి తెలుస్తుంది.అక్కడ కూడా మనుషులు తీసుకుంటున్నది దూడలకి చాలినంత పట్టాక అదనంగా వచ్చే పాలనే,అవునా కాదా?

చెట్లకి గానీ జంతువులకి గానీ వాటికి సరిపోయాక అదనంగా ఉన్న వాటిని తీసుకుని తినడానికీ వాటిని చంపి తినడానికీ పోలిక ఎలా పెట్టగలిగారు అసలు,ముందది చెప్పండి!

ప్రత్యుత్తరమివ్వు

{దీనికి స్వయాన రచయితయే ఒక లైక్ ఇచ్చారు.ఇది నచ్చింది నాకు.పోష్టులో సదుద్ద్దేశమే ఉంది.కామెంట్లని చూసి చిరాకు పుట్టి నేను కొంచెం దురుసైన కామెంటు వేశాను గానీ రచయిత మాత్రం సమ్యమనం పాటించి మరోసారి నిలదీసి అడిగటమూ జవాబును అర్ధం చేసుకుని మెచ్చుకోవడమూ చాలా బాగుంది.ఇక నాగజ్యోతి రమణ సుసర్ల గారికి జవాబు చెప్తున్న Aswanth Achanta అనే వ్యక్తి యొక్క వెధవాయిత్వం కూడా చూడండి}

నాగజ్యోతి రమణ సుసర్ల ->

మొక్క లో కొమ్మలను త్రుంచితే పక్కనుండి కొత్త కొమ్మ వస్తుంది. మరి జీవి మెడకోస్తే కొత్తమెడ వచ్చి జీవి బ్రతుకుతుందా ?

ప్రత్యుత్తరమివ్వు

2రో

Aswanth Achanta ->

నాగజ్యోతి రమణ సుసర్ల: అది రక్తబీజాక్షుడి మాదిరి, అందుకే పాదపి (ఒక్కటే పాదం), అలాంటి వరం జంతువులకు లేదు. వరంలేదని ఆకలి ఆగదు కదా! అలానే శాఖాహారం అందరికీ ఒంటబట్టదు, అంటే శరీరానికి సరిపడదు. నాలాంటివారికి శాఖాహారం శక్తినివ్వదు.అలాంటప్పుడు కనపడిన ప్రతిదీ ఆహారమే అవుతుంది, జీవ ఆవరణం దెబ్బతింటుంది. కనుక కొన్ని నియమాలు - ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు అని.

బలిచ్చిన మాంసం మాత్రమే తినాలి, కానీ కొందరు తింగరోళ్ళ కారణంగా బలి సంప్రదాయం అవసానదశకు చేరింది. తింగరోళ్లు సన్నాసులు కాదు, వ్యాపార దిగ్గజాలు. మాంసం కోసమే జంతువులను పెంచే కర్కశులు.మీ కోపం వారిపై చూపాలి, మా మీద కాదు.బలి సాంప్రదాయాన్ని తీసుకొస్తే మాంసాహారభోజనం మితంగా మారుతుంది, ధర్మం నిలబడుతుంది.

ప్రత్యుత్తరమివ్వు

2రో

నాగజ్యోతి రమణ సుసర్ల - >

Aswanth Achanta గారూ నేనూ మాంసాహారులను తప్పుపట్టడం లేదు. మా ఆహారపుటలవాట్లు మావి అనుకునేవారిని తప్పుపట్టాల్సిన పనేలేదు. అనవసరంగారెండిటినీ పోల్చుకునిఎద్దేవా చేసేవారి కోసం నేను వ్రాశాను. అయితే తరహా కి తరహా ఆహారము స్వీకరించే వారు లేకపోతే ప్రకృతి సమతౌల్యత దెబ్బతింటుందనేది ఎవ్వరమూ కాదనలేని సత్యం .

ప్రత్యుత్తరమివ్వు

1రో

Haribabu Suraneni->

Aswanth Achanta: "అలానే శాఖాహారం అందరికీ ఒంటబట్టదు, అంటే శరీరానికి సరిపడదు. నాలాంటివారికి శాఖాహారం శక్తినివ్వదు." అంటున్న Aswanth Achanta గారికి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను.

ఒక సంవత్సరం పాటు శాకాహారం అనేది ఆవగింజంత సైతం పళ్ళెంలోకి రానివ్వకుండా కేవలం మాంసాహారం మాత్రమే తిని ఆరోగ్యంగా ఉండగలరా?డాబుసరి స్టేట్మెంట్లు కాదు,నాకు సాక్ష్యం కావాలి.మీమీద మీరు ప్రయోగం చేసుకుని దాని ఫలితాన్ని ఒక రీసెర్చి పేపరులా ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ప్రచురించి చూపించగలరా!

ఎందుకంటే, ఇక్కడ మీరు కాకపోవచ్చు గానీ "BJPవాళ్ళు ఇది చెపితే అది తినాలి... అంతే హింస గింస నై" అనే రకం కామెంట్లలో శాకాహారం అనేదాన్ని ఒక రాజకీయ పార్టీకి కలుపుతున్న కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి.

యూరోపియన్ ఇంటలెక్చువల్స్ చాలామంది శాకాహారాన్ని సమర్ధిస్తూ సంస్థలను పెట్టుకుని పని చేస్తున్నారు.అదీ అసలు BJP అనే రాజకీయ పార్టీ ఇండియాలో ఉనికిలోకి రాక ముందు నుంచీ.

మీ మాటల్లో కూడా "నాలాంటివారికి శాఖాహారం శక్తినివ్వదు" ఆనె చెత్త తర్కం ఉంది.మాంసాహారి యైన పులి మరో పులిని తినదు కదండీ,అది జింక లాంటి శాకాహార జంతువులనే తింటుంది.జింక ఏమి తింటుంది - గడ్డిని! శాకాహారికి శక్తి దేనినుంచి వస్తుందండీ?నేను పచ్చి శాకహారిని కాదు.అప్పుడప్పుడూ మాంసం తింటాను.కానీ, శాకాహారం కొందరికి శక్తిని ఇవ్వకపోవడం లాంటి విచిత్రమైన మాటని ఇపుదే వింటున్నాను.మాంసాహార జంతువులలోకి చేరే ఆహారం శాకాహార జంతువుల నుంచి వస్తే శాకాహారులకి మొక్కల నుంచి వస్తుంది.వృక్ష కణాలకి ఒక స్థిరమైన ఆకారం కోసం సెల్యులోజ్ ఉండటం తప్పిస్తే జీవన క్రియలకు కావాల్సిన శక్తిని ఇచ్చే ప్రోటీన్స్,ఫ్యాటీ యాసిడ్స్,ఆల్కహాల్స్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అన్నింటికీ ఒకటే - అవి మొదట తయారయ్యేది మొక్కలలోనే.

వేదం దేనికీ మూర్ఖపు నిషేధాలు పెట్టదు. పని చేస్తే ఫలితం వస్తుందో చెప్పి నిర్ణయం తీసుకునే స్వేఛ్చని మీకే వదిలేస్తుంది.మాంసం తినడంలో జీవహింస ఉంటుంది, కానీ వేదం మాంసాహారాన్ని తినవద్దని నొక్కి చెప్పింది ఆరోగ్యానికి హానికరం అని మాత్రమే.మాంసం తినేది కూడా రుచి కోసమే,బలం కోసం,శక్తి కోసం ఎవరూ మాంసం తినడం లేదు.అయితే,పచ్చి మాంసం పీక్కు తినడం లేదు కదా మాంసాహారులు.రుచి కోసం కలుపుతున్న మసాలాలలో ఎసిడిటీ ఉంటుంది - అది తెలుసా మీకు?యాసిడ్ చర్మం మీద పడితే ఏమవుతుందో జీర్ణకోశపు గోడలకి తగిలినా అదే జరుగుతుంది.

మాంసాహార్లు శాకాహారుల్ని "పప్పు గాళ్ళు,దధ్ధోజనం గాళ్ళు" అని వెక్కిరించడం దుర్మార్గం కాదు గానీ శాకాహారులు తమ ఆహారపు అలవాట్లని సమర్ధించుకోవడం మాత్రమే దుర్మార్గమా!ఇప్పుడే కాదు,ఎప్పుడూ మాంసాహారాన్ని ఎక్కడా ఎవరూ నిషేధించలేదు.ప్రాచీన కాలపు పాకశాస్త్రం అన్నిటినీ చెప్పినప్పుడు ఇంక దీన్ని కూడా BJPకి ముడిపెడుతున్న చెత్త వాదనలు ఎందుకు వస్తున్నాయి?

ప్రత్యుత్తరమివ్వు

22గం

Aswanth Achanta->

Haribabu Suraneni: మీలా ఎదురయ్యే ప్రతి వెధవకీ ఋజువులు చూపించాల్సిన అవసరం నాకు లేదు, ఉన్నా మీ దురుసుతనానికి నేను కూడా దురుసుగానే సమాధానం ఇస్తాను, ఇక్కడ ఇచ్చినట్లు.

అతి చెయ్యక గమ్మున కూర్చో, కుదిరితే!

ప్రత్యుత్తరమివ్వు

21గం

Haribabu Suraneni->

Aswanth Achanta: అనుకున్నాను,నీలాంటి స్కవుండ్రల్ ఇలానే జవాబిస్తాడని.ఇక్కడ అతి చేసింది నువ్వు.నేను నీ అతికి సరిపడేట్టు కొంచెం కర్రు కాల్చి వాత పెట్టాను,అంతే!

ప్రత్యుత్తరమివ్వు

అతన్ని ప్రశ్న అడగటమే తప్ప నేను మొదటి కామెంటులో ఏమి దురుసుతనం చూపించాను?సరైన జవాబు చెప్పలేని తన వెధవాయిత్వాన్ని కవర్ చేసుకోవటానికి  నన్ను వెధవ అంటున్నాడు.నేనే కాదు,ఇక్కడ పాల్గొన్న శాకాహారుల్లో ఎవరూ దురుసుతనం చూపించలేదు.దురుసుతనం,వెకిలితనం అన్నీ మాంసాహారులు గానీ మాంసాహార సమర్ధకుల వైపునుంచే వచ్చాయి. ఇక్కదే కాదు,ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు మూలమైన సుధామూర్తి గారి చెంచాల వ్యాఖ్యని గురించి చెడ వాగుతున్న వాళ్ళలోనూ ఉన్నది దురుసుతనమూ వెకిలితనమే.

"మా ఆహారపుటలవాట్లు మావి అనుకునేవారిని తప్పుపట్టాల్సిన పనేలేదు. అనవసరంగా రెండిటినీ పోల్చుకుని ఎద్దేవా చేసేవారి కోసం నేను వ్రాశాను. అయితే తరహాకి తరహా ఆహారము స్వీకరించే వారు లేకపోతే ప్రకృతి సమతౌల్యత దెబ్బతింటుందనేది ఎవ్వరమూ కాదనలేని సత్యం" అంటున్న నాగజ్యోతి రమణ సుసర్ల గారికున్న వ్వేకం ఉన్నవాడు ఎవడూ సుధామూర్తి గారి చెంచాల వ్యాఖ్యని గురించి అంత పెద్ద చర్చని లేవనెత్తడు.

ఇక్కడ కొందరు ధర్మవ్యాధుడి కధని ఉదహరించారు.కానీ, పాకశాస్త్రంలోకి వంటల రూపంలో  ప్రవేశించాకనే మాంసాహార భోజనం విస్తృతం అయ్యింది.దాన్ని అమ్మడానికి ఒక వ్యవస్థ ఏర్పడి ధర్మవ్యాధుడి లాంటివాళ్ళు అందులోకి ప్రవేశించారు.మాంసాహార భోజనం ఒక వ్యవస్థలా ఎప్పుడు ఎలా ఏర్పడిందో తెలిస్తే రెంటినీ ఎందుకు సమన్వయం చెయ్యాలో తెలుస్తుంది. తరహాకి తరహా ఆహారము స్వీకరించే వారు లేకపోతే ప్రకృతి సమతౌల్యత దెబ్బతింటుందనేది తెలిశాకనే రాజులు మృగయా వినోదం పేరున సమతౌల్యతను దెబ్బతీస్తున్న మృగాలను వధించినప్పుడు వాటిని నాశనం చెయ్యడానికి ప్రజలకు ఆహారం కింద ఏర్పాటు చేశారు. జంతువుల శవాల్ని అలానే వదిలేస్తే సూక్ష్మజీవులు కుళ్ళబెట్టి రోగాలను వ్యాప్తి చెయ్యడం తప్ప ఇంకేమీ లాభం లేదు.అదే చంపిన వాట్ని తినేస్తే ప్రమాదం ఉండదు.

minimalist life style అనే లక్ష్యంతో తను బతుకుతూ ఇతర్లని బతికిస్తూ పాప్యులర్ అయిన robin greenfield అనే శాకాహారి మధ్యనే "నేను ఎలకల్ని తింటున్నాను!" అన్నాడు.అయితే, అంతకు ముందు అతను ఎప్పుడూ "నేను శాకాహార్మ్ మాత్రమే తింటాను!" అని శపధం పట్టలేదు.కానీ,అతని ఉద్యమం మొత్తం ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టని అతి నిరాడంబరమైన జీవన విధానం గడపాలి అనే లక్ష్యానికి పెరటి తోటల్నీ self sustainable houseనీ ప్రతిపాదిస్తూ శాకాహారాన్ని గురించి మాత్రమే చెప్పేవాడు.అయితే, వీడియోలో కూడా అతను,"అది మంచిది - నేను తింటున్నాను,మీరు కూడా తినండి!" అని చెప్పలేదు.తను పెంచుతున్న పెరటి తోటలకి ముప్పయిన వాటిని మాత్రమే తింటున్నాని చెప్పాడు.అది ఇక్కడ తరహాకి తరహా ఆహారము స్వీకరించే వారు లేకపోతే ప్రకృతి సమతౌల్యత దెబ్బతింటుందనేది ఎవ్వరమూ కాదనలేని సత్యం" అంటున్న నాగజ్యోతి రమణ సుసర్ల గారి మాటనే అనుసరిస్తున్నది కదా!

అవైదిక మతశాఖలలో జైనులు ఒక్కరే అధికారికమైన ధర్మశాస్త్ర లేఖనాల ప్రకారం శాకాహారులు.అయితే, వాళ్ళలో కూడా జిహ్వ చాపల్యం ఆపుకోలేని వారు కూడా ఉన్నారు.కానీ, "You can surely come across persons with Jain surname or born in a Jain family and having non-veg food, but if they eat non-veg food, they cannot really be called Jains. I would say, they no longer qualify to be called Jain" అని Gyan Mukta అనే గ్రంధం యొక్క రచయిత అయిన Ravindra Jain గారు కుండబద్దలు కొట్టి చెప్తున్నారు.

యజ్ఞ యాగాదులలోని జంతుబలిని చూసి అసహ్యించుకుని హిందువులకి అహింసని నేర్పటానికి కొత్త మతాన్ని పుట్టించిన గౌతమ బుధ్ధుడు తీసుకున్న ఆఖరి ఆహారం పందిమాంసం.ఇక,క్రైస్తవులకి వాళ దేవుడే "నాకు గొర్రెమాంసం ఇష్టం." అని చెప్పి క్రైస్తవుల చేత తినిపిస్తున్నాడు.ఇక ముస్లిములు మక్కాలో చేసేదీ వాళ్ళ పండగల రోజున ఎక్కడ బడితే అక్కడ వీధుల్ని రక్తప్రవహాల వలె మార్చేస్తున్నదీ వాళ్ళు కూడా మాంసాహారాన్ని వాళ్ళ దేవుడికి అంటుగట్టుకోవటం వల్లనే.

విచిత్రం ఏమిటంటే,శాకాహారాన్ని బ్రాహ్మణులకీ హిందూమతానికీ అంటుగట్టేసి శాకాహారం గురించి పొగిడితే హిందూమతాన్ని పొగిడినట్టు ఉలిక్కి పడటం,సుధా మూర్తి గారు తన సొంత స్పూన్లని తీసుకెళ్ళటం మాంసాహారుల్ని అవమానిస్తున్నట్టు గొడవ చెయ్యటం అమాయకమైన ప్రతిస్పందన కాదు.అసలైన విచిత్రం ఏమిటంటే,సుధామూర్తి గారి చెంచాల వ్యాఖ్యని గురించి చెడ వాగుతున్న వాళ్ళలో చాలామంది హిందూమతద్వేషులు కావడం కూడా యాదృఛ్చికం కాదు.

ఇక్కడ Aswanth Achanta అనే వెధవ "బలిచ్చిన మాంసం మాత్రమే తినాలి, కానీ కొందరు తింగరోళ్ళ కారణంగా బలి సంప్రదాయం అవసానదశకు చేరింది. తింగరోళ్లు సన్నాసులు కాదు, వ్యాపార దిగ్గజాలు. మాంసం కోసమే జంతువులను పెంచే కర్కశులు.మీ కోపం వారిపై చూపాలి, మా మీద కాదు.బలి సాంప్రదాయాన్ని తీసుకొస్తే మాంసాహారభోజనం మితంగా మారుతుంది, ధర్మం నిలబడుతుంది." అనే చెత్త లాజిక్ వాడుతూ మతక్రతువుల్లో జంతుబలిని పునరురుధ్ధరిస్తే మాంసాహారం పట్ల వ్యామోహం తగ్గుతుందని వాదించటం దేనికి సంకేతం?

శాకాహారులు వాళ్ళ పాటికి వాళ్ళు తమ ఆహారపు అలవాట్లని గురించి చెప్పుకోవటాన్ని కూడా "ఆహార సామ్రాజ్యవాదం" అని గొడవ చెయ్యటం అనేది చిన్న విషయం కాదుకొన్ని లక్షాల మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్న అంతర్జాతీయ హిందూమతద్వేషుల వ్యూహాత్మకమైన దాడి.హిందువుల ఇప్పటి ప్రతిస్పందన కొంత అమాయకంగానే ఉంది. ఇప్పుడు దీని వెనక ఉన్న మతకోణాన్ని తెలుసుకున్న హిందువులు మరోసారి తరహా చర్చ మొదలైనప్పుడు మాత్రం ఎదురుదాడి చెయ్యాలి.ఒకసారి ఎదురుదాడి చేశాక మళ్ళీ వాళ్ళు శాకాహారం మీద పడి ఏడవరు.

జై శ్రీ రామ్!

2 comments:

  1. సోదరులు హరిబాబు గారికి,
    నేను మీ బ్లాగ్ చదువుతాను.ఎన్నో చక్కటి విషయాలను తెలియజేస్తుంటారు.
    ఈ పోస్ట్ చదివిన తరువాత, నా అభిప్రాయాలను కొన్నింటిని వ్రాయాలనిపించి నాబ్లాగ్ వద్ద వ్రాసాను. ఆ విషయాన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
    నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను.తప్పుగా అనుకోవద్దు. మిత్రుల అభిప్రాయాలు కొన్నిసార్లు ఒకేలా ఉండవచ్చు. కొన్నిసార్లు వేరేగా ఉండవచ్చు. నా అభిప్రాయాలు అందరికీ నచ్చాలని కూడా లేదు.ఎవరి అభిప్రాయాలు వారివి.
    ******
    ప్రాచీనకాలంలో రాజులు, సైనికులు యుద్ధాలలో శత్రువులను చంపవలసి వచ్చేది. సౌమ్యులుగా ఉండేవారు చంపలేరు. వారికి కొంత క్రూరత్వం అలవాటుపడటానికి వేట, జంతువులను చంపి తినటం అలవాటుచేసి ఉంటారని అనిపిస్తుంది.
    వేట వల్ల పాండురాజు వంటి కొందరు కష్టాల పాలయ్యారు.

    సృష్టిలో పర్యావరణ సమతౌల్యం కొరకు మొక్కలను జంతువులు తినటం, చిన్న జంతువులను పెద్ద జంతువులు తినటం ఉంది. ఎందుకంటే, మొక్కలు అన్నీ బ్రతికి పెరిగి పెద్దవయితే దగ్గరదగ్గరగా ఉండి బలంగా పెరగవు. భూసారం సరిపోదు. జంతువులు అన్నీ బ్రతికి, పెరిగితే వాటికి ఆహారం సరిపోదు. అందుకే జంతువులు ఒకదానిని మరొకటి తింటాయి.

    సమతౌల్యం కొరకు మనుషులు జంతువులను తినే అవసరం లేదు.అయితే రుచి కొరకు తింటారు. మనుషులు పశుపక్ష్యాదులను పెంచి మరీ తింటున్నారు.

    ఈ రోజుల్లో చాలామంది పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు.ఇందువల్ల, కొన్ని జీవజాతులు అంతరించే పరిస్థితి వచ్చిందంటున్నారు. పర్యావరణంలో సమతౌల్యత ఉండాలంటే మానవుల జనాభా తగ్గాలి...

    జగదీశ్చంద్ర బోస్ అనే శాస్త్రవేత్త మొక్కలకూ ప్రాణం ఉందని, కొంత స్పందిస్తాయని కనిపెట్టారు. ఈ విషయాన్ని చదివినప్పుడు, ఆకుకూరలను తినాలన్నా ఏదోగా అనిపించేది. వాటిని కత్తిరించినప్పుడు చనిపోయేంతవరకూ బాధపడతాయేమోనని, వేర్ల వద్ద కట్ చేసేదాన్ని. పుదీనా వంటి వాటికి కణుపుల వద్ద కూడా వేర్లుంటాయి. బచ్చలి వంటివి కాడలు తెంపితే చాలు.

    అయితే, కొమ్మలు తెంపినా చెట్లు బాధ పడతాయనుకుంటే ఇక మనం బ్రతకలేం.అలా అనుకుంటే నడిచేటప్పుడు కాళ్ళక్రింద ఎన్ని చీమలు చనిపోతాయో? అతి ఆలోచనలకు పోకుండా కొంతవరకే పాటించటం మంచిది.

    హింస చేయకూడదనుకుని కొందరు.. క్రిందరాలిపడిన ఆకులను, పండ్లను తిని జీవిస్తారట. వారు గొప్పవారని, మామూలుగా జీవించేవారు తక్కువవారని చెప్పలేం. ఎన్నో నియమాలతతో ఎంతో తపస్సు చేసినా కూడా, కొందరు కొన్నిసార్లు కామక్రోధాలకు లొంగి పొరపాట్లు చేయటం జరుగుతుంది. మనస్సును నిగ్రహించుకోవటం అత్యంత కష్టం. దైవసహాయం తప్పనిసరి.

    హింస అంటే చంపటం, తినటం ఒక్కటే కాదు. మనుషులను, పశుపక్ష్యాదులను.. మాటలతో, చేతలతో బాధించటం కూడా హింసే. జంతువులను ఒకదగ్గరనుంచి ఇంకొకదగ్గరికి పంపేటప్పుడు సరిగ్గా నీరు, మేత ఇవ్వకుండా చిన్న వాన్ లో కుక్కి పంపటం, జంతువులపైన విపరీతంగా బరువులను వేసి మోయించటం.. ఇవన్నీ హింసే.

    మొక్కలకు, మనుషులకు.. నెప్పి విషయంలో బాధపడే స్థాయిలో తేడాలుంటాయని అంటారు. పశువులకు కూడా ఎప్పుడైనా దెబ్బలు తగిలితే, మనుషులలానే బాధపడటం, పెద్దగా గాయాలు తగిలితే గిలగిలా కొట్టుకోవటం మనకు కనిపిస్తుంది.మొక్కలలో అలా కనిపించదు.
    అయితే.. జుత్తు, గోర్లను కత్తిరిస్తే బాధ ఉండదు. మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసినా ఎక్కువ బాధ ఉండదు. అలా మొక్కలకు ఎక్కువ బాధ ఉండదేమో? అని కొందరి అభిప్రాయం. ఇవన్నీ సరిగ్గా అర్ధంకాని విషయాలు.

    మొక్కలు, పశుపక్ష్యాదులు మూగజీవులు. వాటి భావాలు మనకు సరిగ్గా అర్ధం తెలియవు.

    భూమి ఒక పరీక్షా లోకం.ఇక్కడ కష్టాలు, సుఖాలు రెండూ ఉండే విధంగా సృష్టి ఉంది. ఇది ఒక ఆటస్థలం, నాటకరంగం కావచ్చు. లౌకిక జీవితంలో ఒక గొప్ప స్థాయికి రావాలంటే ఎంతో కష్టపడాలి. మరి ఏ కష్టాలు లేని అత్యంత ప్రశాంతమైన, అత్యంత గొప్పదైన పరమపదాన్ని పొందాలంటే కొంతైనా కష్టాలు ఉంటాయి కదా. ఇక్కడ మంచిగా జీవించి దైవకృపకుపాత్రులైనవారు పైలోకాలకు చేరుకుంటారు.. పరమపదాన్ని పొందుతారు. మనకు అర్ధం కాని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ దైవానికే తెలుస్తాయి.

    కామెంట్ వద్ద పోస్ట్ వ్రాసాను.

    ReplyDelete
  2. ఇంతకుముందు కామెంట్ వ్రాసినది నేను..aanamdam blog anrd.
    మీరు నా కామెంట్ పోస్ట్ చేయకపోయినా ఫరవాలేదండి. అయితే మీ పోస్టులో విషయాల గురించి నా బ్లాగ్ లో వ్రాసాను కాబట్టి, మీరు తప్పుగా అనుకుంటారేమోననే ఉద్దేశ్యంతో , విషయం మీకు తెలియపరచాలని వ్యాఖ్యను వ్రాసానండి.
    నాకు బ్లాగ్ టెక్నాలజి గురించి అంతగా తెలియదండి.కొద్దిగా తెలుసుకుని బ్లాగ్ వ్రాస్తున్నాను.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...