అస్తమానం పురాణ కధల గురించి చదివి విసుగు పుట్టి మన ప్రాచీన ఋషులు వృద్ధి చేసిన శాస్త్ర సాంకేతిక విషయాలను గురించి తెలుసుకుంటుంటే శింశుమార చక్రం గురించిన సమాచారం చాలా కుతూహలాన్ని కలిగించింది.ఎందుకంటే, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సౌరమండల నిర్మితిలా కాక భూమి స్థిరమై ఉండి భూమికీ ధృవనక్షత్రానికీ మధ్యన ఉన్న వాయుగుండపు మధ్యనుండే స్తంభం లాంటి అక్షం చుట్టూ సూర్యుడూ చంద్రుడూ తిరుగుతున్నట్టు వర్ణిస్తుంది."ఇందులో కుతూహలం కలిగించేది ఏముంది?మోడర్న్ సైన్సుకు విరుద్ధమైన విషయాలను పట్టించుకోవటం దేనికి?" అని మీకు అనిపిస్తుంది కదూ!
శింశుమార చక్రం యొక్క నిర్మితికి సంబంధించిన వర్ణన మోడరన్ సైన్సు చెప్తున్న సూర్యమండల వర్ణనకి విరుద్ధమే గానీ కాలం అనేది ఎట్లా ఆవిష్కరించబడిందో కాలంలోని అనేకానేకమైన సంభావ్యతల వల్ల భూమిమీద ఎలాంటి మార్పులు జరుగుతాయో ఆయా మార్పులకీ కాలానికీ ఉన్న సంబంధం ఏమిటో సూర్యమండల సిద్ధాంతం కన్న శింశుమార చక్రమే మరింత సమగ్రమైన అవగాహన కలిగిస్తుంది.
అసలు కాలం అనే
పదాన్ని సృష్టించిందీ దాన్ని ఒక భగవత్స్వరూపం అనిపించే
స్థాయిలో విశ్లేషించిందీ మన ప్రాచీన కాలపు
మేధావులే.ఇవ్వాళ యూరోపియన్ సైంటిస్టులూ ఫిక్షన్ రైటర్లూ టైం
స్పేస్ కంటిన్యువం అనీ టైం డైలేషన్
అనీ టైం మెషీన్ అనీ
మాట్లాడే సమస్తమూ ఇక్కడివారు కనుక్కుని సంకలించిన అపారమైన సాహిత్యం నుంచి వాళ్ళకి అర్ధమైనంత
తీసుకుని మరికొంత సొంత తెలివిని కలుపుకుని
రోజువారీ వాడకానికీ టైం మెషీన్ కధలకీ
ఉపయోగించుకుంటున్నారు.సెకను,నిముషం,గంట,
రోజు,వారం,పక్షం,నెల,
సంవత్సరం వరకు నిక్కచ్చి లెక్కలే
వేశారు గానీ ఋతువుల దగ్గీర
కొచ్చేసరికి కొందరు నాలుగంటారు,కొందరు అయిదంటారు,కొందరే ఆరు అని ఒప్పుకుంటారు!మనవాళ్ళు కాలం ఉనికిని కనుక్కున్నదే
ఋతువుల గురించిన సమాచారం ఎక్కువ తెలిశాక - భూమిమీద కానప్డుతున్న చిన్న చిన్న మార్పుల్ని
కూడా పసికట్టి అవి ఎట్లా వస్తున్నాయి
అనే దిశలో చేసిన పరిశోధనల
వల్లనే కాలం గురించి ఇక
కొత్త విషయాలు ఎవరూ చెప్పలేననత సమగ్రమైన
విజ్ఞానం ఇక్కడ పుట్టింది!
వాళ్ళని మొద్దావతారాలని విమర్శించడం కూడా దుర్మార్గమే - భూమధ్యరేఖకి దూరం జరిగి భూమి ఎప్పుడూ చల్లబడో వెచ్చబడో ఉంటూ ఋతువులే వాళ్ళమీద శీతకన్నేశాయి - లేని ఋతువుల్ని వాళ్ళెలా చూస్తారు? మనవాళ్ళు సృష్టించిన మహాద్బుతమైన విషయాల్ని పెడచెవిన పెట్టిన మనకన్న వాళ్ళ సంస్కృతిని వాళ్ళు అనుసరించుకుంతూ అప్పుడప్పుడూ మనకి మన సంస్కృతి గురించి పాఠాలు చెప్తున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు!
ఇంతకీ శింశుమార చక్రం అంటే ఏంటో చెప్పలేదు కదూ!కాలనిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్న సృష్ట్యాదిన ప్రభవించి సృష్ట్యంతం వరకు వెలిగే స్వయంజ్వలితమైన సూర్య చంద్ర ద్వయమూ బుధ(Mercury), గురు(Jupiter), శుక్ర(Venus), శని(Saturn), వరుణ/కుజ(Mars) గ్రహపంచకమూ రాహుకేతు చాయాద్వయమూ మేషాదిమీన ద్వాదశ రాశులూ అశ్విన్యాదిరేవతి సప్తవింశతి తారకలూ కలిపితే(48) శింశుమార చక్రము. దీని అమరిక మొత్తానికి ధ్రువతార ప్రధాన కేంద్రం.ఉండుండి ఠపీమని నెత్తిమీద బాంబేసినట్టు అర్ధం కాని సుత్తేశానని పొరపాటు పడి ఉలిక్కిపడకండి - మీరు తలెత్తి చూస్తే కనబడుతున్న వృత్తాకారపు ఆకాశమే శుంశుమార చక్రం.పగటి పూట సూర్యకాంతి తీక్షణమై కనపడవు, రాత్రివేళ చంద్రకాంతి అన్నిటినీ చూపిస్తుంది గాబట్టి అవి నైట్ షిఫ్టు వాచ్మెన్ల మాదిరి పగలు ముసుగుతన్ని బజ్జుని రాత్రిళ్ళు లేచి తిరుగుతాయని అనుకోకండి, అవన్నీ పగటి పూట కూడా తిరుగుతూనే ఉంటాయి.అన్నీ ఒకే వేగంతో తిరిగితే అసలు కాలం గురించి ఒక్క అడుగు కూడా ముందుకు పడేది కాదు.ఒక్కో గ్రహమూ ఒక్కోలా తిరుగుతూ రాశులూ నక్షత్రాలూ సమూహాలై తిరుగుతూ ఉన్నప్పుడు వాటి అమరికలోని తేడాలు భూమిమీద దివారాత్రాలనీ ఋతువుల్నీ సృష్టిస్తున్నాయి.ఈ ఒక్కటీ కనుక్కోవడానికే చాలాకాలం పట్టింది.
శింశుమార చక్రం మీద కొన్ని రకాల అమరికలూ ఆ అమరికని బట్టి భూమిమీద కొన్ని లిమరికలూ పునరావృతం అవుతున్నాయి.ఆ పట్టు చిక్కాక ఇక రెచ్చిపోయారు.“ఈ సూర్యచంద్రాది గ్రహములును జ్యోతిర్గణములును అన్నియు వాతమయములగు పగ్గములతో కంటికి కానరాని ఆ వాయవ్య పాశముల బలమున ఆ ధ్రువుడు ఉన్నంత కాలమును అతనిని ప్రదక్షిణించుచు అంతరిక్షమున సంచరించుచుండును. నదీ ప్రవాహజలమందలి నౌకను ఆ జల మెట్లు వహించునో అట్లే ఈ వాయుశక్తి ఈ దేవ గృహముల (జ్యోతిర్గణముల)ను అంతరిక్షమున వహించుచుండును. ఇవియే కాదు. తారలన్నియు-మరీచులు - అవియు ధ్రువునితో నిబద్దములై తామతని చుట్టు తిరుగుచు ధ్రువుడును తిరుగుట కవకాశము నిచ్చుచున్నవి. ఇవన్నియు వాయుమయ చక్రముచే ప్రేరితములయి కొరవిని గిరగిర త్రిప్పుటచే ఏర్పడు చక్రమువలె తిరుగుచుండును.” అని మత్స్యపురాణంలోకి యెక్కించేశారు.
ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమే కాక వైదిక సాహిత్యంలోని కూర్మపురాణం వంటి పురాణాలూ సూర్యసిద్ధాంతిక వంటి శాస్త్రగ్రంధాలూ తన చుట్టూ తిరుగుతున్న చంద్రుడితో సహా భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వల్లనే భూమి మీద జరుగుతున్న సూర్యోదయ సూర్యాస్తమయమూ ఋతువులూ వంటి మార్పులు సంభవిస్తున్నాయని చెప్తున్నప్పటికీ మత్స్యపురాణం, బ్రహ్మాండ పురాణం వంటివి శింశుమార చక్రం అనే సౌరమండల స్వరూపాన్నీ పధ్నాలుగు లోకాల విరాట్పురుష నిర్మాణం ప్రకారం విశ్వాన్నీ చూపిస్తున్నాయి. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రంలోని సూర్యకేంద్రక, భూకేంద్రక సిద్ధాంతాల మాదిరి ఒకదానినొకటి ఖండించుకున్నట్టు కనిపిస్తాయి.కానీ ఈ రెండు ప్రాచీన భారతీయ సిద్ధాంతాలు సృష్టిని బింబ, ప్రతిబింబ రూపాలలో చూసే విధంగా పరస్పరాశ్రితమై ఉంటాయి.అంటే, కాలగణనానికి సంబంధించిన తిధి, వార, మాస,ఋతు, ఆయనాదులను ఏ నమూనాతో లెక్క కట్టినా ఒకే విలువ వస్తుంది!
ఇది ఎట్లా సాధ్యం?
ఆధునిక విజ్ఞనశాస్త్రంలోని భూకేంద్రక సూర్యకేంద్రక సిద్ధాంతాలలో ఒకదానికి ఇంకోటి వ్యతిరేకం అయి ఒకదాన్ని నిజం
అని ఒప్పుకుంటే రెండోదాన్ని నిజం కాదని తీసి
పారెయ్యాలి - అయినప్పటికీ రెండూ కొనసాగుతూనే ఉన్నాయనుకోండి.అట్లా కాక ప్రాచీన
కాలపు భారతీయ విజ్ఞానులు చూపిస్తున్న రెండు అమరికలూ తిధి,
వార, మాస, ఋతు, ఆయనాదులను
ఒకేలా లెక్కగడుతున్నాయి.ఈ మెలిక మీదనే
దృష్టి పెట్టి ఆలోచిస్తే మనవాళ్ళలో సూర్యకేంద్రక నిర్మితిని అనుసరిస్తున్న కూర్మపురాణం వంటి పురాణాలూ సూర్యసిద్ధాంతిక
వంటి శాస్త్రగ్రంధాలూ తన చుట్టూ తిరుగుతున్న
చంద్రుడితో సహా భూమి సూర్యుడి
చుట్టూ తిరగడం వల్లనే భూమి మీద జరుగుతున్న
సూర్యోదయ సూర్యాస్తమయమూ ఋతువులూ వంటి మార్పులు సంభవిస్తున్నాయని
చెప్తున్నప్పటికీ సూర్యుడు మేష రాశిలోకి
ప్రవేశిస్తే మేషమాసమూ చంద్రుడు పౌర్ణమి రోజున చిత్రా నక్షత్రం ఇంట్లో ఉంటే చైత్ర మాసమూ
అని చెప్తూ వుండటం గమనించాను.
జ్ఞానప్రదాత అనే పుస్తకంలో "సౌర చాంద్రమానాలు
ఏ విధంగా ఏర్పడుతున్నాయి?తిధులు తద్వారా చంద్రకళలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి?గ్రహణాలు
ఎలా ఏర్పడుతున్నాయి?వారాల పేర్లు ఎలా వచ్చాయి?" వంటి ప్రశ్నలకు వేద పురాణేతిహాసాలలో దాగి ఉన్న శాస్త్ర
సాంకేతిక విషయాలను చిన్నపిల్లలకు కూడా అర్ధమయ్యేటట్లు చెప్పిన రాయవరపు సత్యనారాయణ మూర్తి
గారు "వాస్తవ యదార్ధం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ తులా రాశిలో ప్రవేశించడం
అయితే, సాపేక్ష యదార్ధం సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ మేషరాశిలో ప్రవేశించడం అవుతుంది"
అని కర్రా విరగని పామూ చావని అతుకు వేశారు గానీ ఆయనే ఋగ్వేదం 1వ మండలం, 164వ అనువాకం,11వ
శ్లోకంలో "ద్వాదశారం నహి తజ్జరాయ వర్వర్తి చక్రం పరిధ్యామృతస్య ఆ పుత్రా అగ్నే
మిధునాసో అత్ర సప్త శతాని వింశతిశ్చ తత్స్థుః" అని ఉందని బల్ల గుద్ది చెప్తున్నారు.
"ద్వాదశారమగు కాలచక్రము గగనము నందు తిరుగుచున్నది.ఓ అగ్నీ!720 మిధునములు ఆ చక్రమును
అధిరోహంచి ఉన్నవి" అనే తప్ప అసలైన నిర్మితి ఒకలా ఉండి మనకు అర్ధం కావడం కోసం ఇంకోలా
చెప్తున్నట్టు ఎక్కడ వుంది?
అంతే కాదు, దాదాపు అన్ని భారతీయ ఖగోళ జ్యోతిష
సంబంధమైన గ్రంధాలు భూమినుంచి చూస్తే కనబడుతున్న చంద్రగ్రహం యొక్క సాపేక్షమైన కదలికలను
గురించి చంద్రగమనం అనే సాంకేతిక పదాన్నీ భూమినుంచి
చూస్తే కనబడుతున్న సూర్యగ్రహం యొక్క సాపేక్షమైన కదలికలను సూర్యగమనం అనే సాంకేతిక పదాన్నీ
యధేచ్చగా వాడేశాయి.చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని అంటున్నారు కాబట్టి చంద్రగమనం
ఆనెది సరిపోతుంది గానీ సూర్యుడి చుట్టూ భూమి తిరగడాన్ని తీసుకెళ్ళి సూర్యుడికి ఎలా
అంటగడతారు?మనకి అర్ధం కావడం కోసం తిరగేసి చెప్పడం ఇక్కడ కుదరదు.అవి ఐన్స్టీనూ న్యూటనూ
గుర్తింపు కోసం సమర్పించిన సిద్ధాంత పత్రాల వంటివే - సిద్ధాంత గ్రంధాల్ని ఆయా సిద్ధాంతకర్తలు
విశ్వంలోని ఒక దృగ్విషయం యొక్క యదార్ధతను స్థాపించడం కోసం వ్రాస్తారు.వాళ్ళు కూడా నాకిలా
అర్ధమయ్యిందని చెప్తే అది సిద్ధాంతం కానప్పుడు ప్రజలకి అర్ధం కావడం కోసం సిద్ధాంతకర్తలు
"వాస్తవ యదార్ధం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ తులా రాశిలో ప్రవేశించడం అయితే,
సాపేక్ష యదార్ధం సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ మేషరాశిలో ప్రవేశించడం అవుతుంది"
అని చెప్పారనడం సరైన మాట కాదు.
సూర్యచంద్ర ద్వయమూ బుధ(Mercury)-గురు(Jupiter)-శుక్ర(Venus)-శని(Saturn)-వరుణ/కుజ(Mars)
గ్రహతారపంచకమూ రాహుకేతు గ్రహఛాయద్వయమూ మేషాదిమీన ద్వాదశ రాశులూ అశ్విన్యాదిరేవతి సప్తవింశతి
తారకలూ కలిపి 48 ఉన్నప్పటికీ సూర్య చంద్ర గమనాలు రెండూ కాలానికి పునాదిని వేస్తున్నాయి.మనం
మామూలుగా అనేసుకుంటున్నట్టు చంద్రుడికి కూడా సూర్యుడే వెలుగును ఇస్తున్నాడు కాబట్టి
సూర్యుడే ప్రధానం అన్నది నిజం కాదు.రాత్రి అనేది చంద్రుడి వల్ల ఏర్పడి సూర్యుని తీష్ణమైన
కాంతినుండి కొంత విరామం కుదిరి భూమి చల్లబడి ఓషదులు వికసించడమే జీవం తొణికిసలాడటానికి
ముఖ్యమైన కారణం - చంద్రుడు రాత్రిని కలిగించకపోతే అంతరాయం లేని తీక్షణమైన సూర్యకాంతి
జీవుల్ని మాడ్చివేసి ఉండేది!
మనం తల పైకెత్తి చూస్తే కనబడుతున్న ఆకాశవృత్తాన్ని
360 భాగాలు చేశారు. ఒక డిగ్రీని
సూచిస్తూ పరిధి నుంచి కేంద్రానికి సాగుతున్న అంశాన్ని సంస్కృతంలో శంఖువు అంటారు.360
అనే సంఖ్యని 12 తో భాగిస్తే 30 వస్తుంది.చంద్రుడు భూమి చుట్టు ఒక పరిభ్రమణం చేస్తూ
తన చుట్టు ఒక స్వభ్రమణం చేస్తాడు.అయితే అది 30 అహోరాత్రాలకి సరిపోతే పౌర్ణమి నాటికి
ఎప్పుడూ ఒకే నక్షత్రాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయి మాసాల్ని గుర్తించటం కుదిరేది కాదు.అలా
కాక కొంచెం తేడా రావటమే పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తతో కూదిన నాటినుంచి రోజుకో నక్షత్రాన్ని
కూడుతూ 28వ రోజున మళ్ళీ చిత్తను కూడి 29వ రోజున స్వాతిని కూడి 30వ రోజుకి విశాఖను చేరడం
వల్ల చైత్ర మాసం తర్వాత విశాఖ మాసం వస్తున్నది.హమ్మయ్య! చంద్రగమనాన్ని చక్రంలో సరిపెట్టేశాం
అనుకునే లోపు సూర్యుడి కదలికని చంద్రుడి వల్ల ఏర్పడిన దివారాత్రాలతో కొలిస్తే సూర్యుడు
360 డిగ్రీల చక్రాన్ని 360 రోజులకి సరిపెట్టడం లేదు, ఆయనకీ బద్ధకం ఎక్కువై 365 రోజుల
పైన రోజులో నాలుగోవంతు కాలం తీసుకుంటున్నాడు.
ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కాలాన్ని విడగొడుతున్న
పద్ధతి ఇలా ఉంటుంది:12 చంద్రమాసాలు గడిచేసరికి 354 రోజులూ 12 సూర్యమాసాలు గడిచేసరికి
365 రోజులూ పూర్తవుతాయి - "ద్వాదశ ద్యూస్ అగోహ్యస్య అతిధ్యైరణన్ ఋభవః వసంతః సుక్షేత్రా
అకృణ్వన్ అనాయంత సింధూన్ ధన్వ ఆ అతిష్ఠన్ ఓషధీ నిమ్నం ఆప" అనే ఋగ్వేదమంత్రం సౌరమాన
చాంద్రమాన సంవత్సరములకు వ్యత్యాసం 12 రోజులు అని చెప్తున్నది.ఈ 11 రోజుల తేడాని కలిపి
కాలం ఒకేలా నడిచే లెక్క కోసం అధిక మాసాలనూ శూన్యమాసాలనూ ఏర్పాటు చేశారు. ఇందులో పావురోజుని కలిపి పూర్ణం చెయ్యడం
మిగిలిన అన్ని లెక్కల్నీ పూర్ణసంఖ్యలతో చెయ్యడానికి వెసులుబాటు ఇచ్చింది.ఇప్పుడు మనం
పాటిస్తున్న గ్రెగేరియన్ క్యాలెండరు మన సూర్యమానం నుంచి వచ్చిందే కాబట్టి అక్కడా నాలుగేళ్ళకోసారి
దూకడం ఉంటుంది.
గడ్డివామిలో సూదిని వెతికినట్టు మొత్తం
ప్రాచీన భారతీయ విజ్ఞానశాస్త్రపు సాహిత్యంలో ఎంత వెతికినప్పటికీ ఎక్కడా భూమి తనచుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ
తిరగడానికి సంబంధించి చర్చలు జరగలేదు, విశ్లేషణలు చెయ్యలేదు, నిరూపణలు చూపలేదు - పైన
భూమి కదలికలు లేని స్థిరత్వాన్ని చూపిస్తూ ఉండి సమస్తమైన గ్రహతారకలూ భూమికీ ధృవుడికీ
మధ్య వున్న అక్షం చుట్టూ తిరగడం వల్లనే భూమిమీద రాత్రులు, పగళ్ళు, రోజులు, వారాలు,
పక్షాలు, మాసాలు, ఋతువులు, ఆయనాలు, సంవత్సరాలు అనే కాలవిభజన ఏర్పడుతున్నదనీ సూర్య చంద్ర
గ్రహణాలు గోచర మవుతున్నాయనీ అంటుంటే అది తప్పని ఖండించాలని కూడా ఎవరూ అనుకోలేదు!
సుమారు సా.శ 16వ శతాబ్దం తర్వాత
Copernicus వర్ణించిన Sun-centred universe (solar system) అనేది ఉనికిలోకి వచ్చేవరకు
యూరోపియన్ శాస్త్రవేత్తలు కూడా భూమి స్థిరమై ఉండి సూర్య చంద్రాది తారకలు భూమి చుట్టూ
తిరుగుతున్నాయని నమ్మేవారు.పూ.సా 6వ శతాబ్దిలో Anaximander అనే శాస్త్రవేత్త భూమిని
ఒక స్తంభంలా వూహించి సూర్య చంద్రాది తారకలు దీని చుట్టూ వృత్తాకారపు కక్ష్యలో తిరుగుతున్న
విశ్వనిర్మితిని ప్రతిపాదించాడు.అదే సమయంలో Pythagoras అనే మరొక శాస్త్రవేత్త గ్ర్హణాలకు
సంబంధించిన పరిశీలనలు చేసి భూమి గోళం వలె ఉంటుందనీ విశ్వానికి కేంద్రం వలె స్థిరమై
ఉండక ఒక అగ్నిస్వరూపం చుట్టూ తిరుగుతున్నదనీ ప్రతిపాదించాడు.ఈ రెంటినీ కలిపి గ్రీకులు
కొంత సమగ్రమైన విశ్వనిర్మితిని ఏర్పరచుకున్నారు.పూ.సా 4వ శతాబ్దికి చెందిన గురుశిష్యులైన
ప్లాటో, అరిస్టాటిల్ ద్వయం దీనిని మరింత సమగ్రం చేశారు. దీనిని Aristotelian
system అని పిలుస్తారు.అప్పటికీ ఉన్న కొన్ని లోపాల్ని సవరించి సా.శ 2వ శతాబ్దికి చెందిన
Claudius Ptolemaeus వృద్ధి చేసిన తర్వాత నుంచి దీన్ని టాలెమీ మోడల్ అని పిలుస్తున్నారు.ఇంతకీ,టాలెమీ
Hellenistic కావడం ఒక విశేషం.1.Moon,2.Mercury,3.Venus,4.Sun,5.Mars,6.Jupiter,7.Saturn,8.Fixed
Stars,9.Primum Mobile ("First Moved") - ఇవి టాలెమీ లెక్క ప్రకారం భూమినుంచి
ఆయా గ్రహాల తారకల యొక్క దూరాల వరస.
వీటికీ భారతీయ శాస్త్రవేత్తలు ఇక్కడ చెప్తున్న
విశ్వనిర్మితికీ పోలికల్ని చెప్పలేం.టాలెమిక్ మోడల్ ప్రతి గ్రహానికీ deferent
cycle, epicycle అనే రెండు వలయాల చలనం ఉంటుంది. దీన్ని అర్ధం చేసుకోవటం శాస్త్రవేత్తలకే చాలా కష్టంగా ఉంటుంది.గ్రీకులూ
రోమన్లూ బాబిలోనియన్లూ మెసపొటేమియనూ - వాళ్ళూ వీళ్ళూ అని కాదు అప్పటి భారతేతర నాగరికతలు
అన్నీ కొద్ది తేడాలతో ఇదే నిర్మితిని నమ్మి పాటించారు.సా.శ 1543లో Nicolaus
Copernicus తన De revolutionibus orbium coelestium (On the Revolutions of the
Heavenly Spheres) గ్రంధంతో భూకేంద్రక సిద్ధాంతం వెనక్కు పోయి సూర్యకేంద్రక సిద్ధాంతం
ముందుకు వచ్చింది.
ఇది విప్లవాత్మకమైన ప్రతిపాదన కాబట్టి
ఆనాటి ఖగోళ శాస్త్రవేత్తలకి కూడా ఒక పట్టాన అర్ధం కాలేదు.నిజానికి 1514 నుంచీ అతను
సాటి శాస్త్రజులకు తన అభిప్రాయాల్ని చెప్పి ఆమోదం పొందినప్పటికీ సిద్ధాంత రూపంలో బహుళ
ప్రచారం తెచ్చుకోవడానికి 1543 వరకు సందేహించాడంటే అక్కడి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.అయితే,
భారతీయ శాస్త్రజుడు ఆర్యభటుడు సా.శ 499 నాటికే భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉండే భూకేంద్రక
సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.మనకు కనిపిస్తున్న నక్షత్రాల స్థానభ్రంశానికి భూమి తన
చుట్టు తాను తిరగడమే కారణం అని ఆర్యభటుడు చెప్పాడు.మొత్తం మీద చూస్తే ఆర్యభటుడి సిద్ధాంతం
భూకేంద్రక సూర్యకేంద్రక సిద్ధాంతాల సమ్మిశ్రణంలా ఉంటుంది.
అలా 17వ శతాబ్దం వరకు అక్కడా ఇక్కడా ఎక్కడా
భూమి తన చుట్టూ తను తిరుగుతున్నదనే దృగ్విషయానికి సాక్ష్యాలూ రుజువులూ చూపించాల్సిన
అవసరమే రాలేదు. ఇప్పటికి
శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేసి గానీ ప్రకృతిని పరిశీలించి గానీ చూపించిన సాంకేతికపరమైన
సాక్ష్యాలలో ప్రముఖమైనవి నాలుగు ఉన్నాయి.అవి 1).Stellar aberration 2).The Sagnac
effect 3).The Compton tube 4).The Doppler effect - ఒక్కొక్క సాక్ష్యాన్నీ వరసపెట్టి
చూపిస్తాను.వీటిని మీరు ఓర్పుతో చదివి,ఇక్కడ నేను చెప్పింది తక్కువనిపిస్తే మీరు వెతుక్కుని చదివి అర్ధం చేసుకోండి.కమ్యూనిష్టులకి
మాదిరి నా పాయింటును రుజువు చెయ్యటానికి పనికొచ్చేవి మాత్రమే చెప్పి మోసం చెయ్యాలని
అనుకోవటం లేదు.టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చిలా అక్కడ ఒకటి చెప్తే నేను ఇంకొకలా
అర్ధం చేసుకుని నాకు ఏమి అర్ధం అయ్యిందో అదే వాళ్ళు చెప్పారని అనుకునే మూర్ఖత్వం నాకు
లేదు.నేను చెప్పాను గాబట్టి మిమ్మల్ని నమ్మమని అనడం లేదు.
Stellar aberration:James Bradley అనే
చరిత్ర, ఆధ్యాత్మికత, గణితం,ఖగోళశాస్త్రం లాంటి అన్ని ప్రక్రియల మీదా రెట్ట వేసిన పిట్ట
సా.శ 1728ల నాడు టెలిస్కోపుని ఒక నక్షత్రానికి ఫోకస్ చేస్తూ బిగించిన తర్వాత కొద్ది
సేపటికి నక్షత్రం పక్కకి జరగటం గమనించాడు.దీనిని గమనించి టెలిస్కోపుని జరిపి నక్షత్రానికి
ఫోకస్ చేస్తూ బిగించిన తర్వాత మళ్ళీ కొద్ది సేపటికి నక్షత్రం పక్కకి జరగటం గమనించాడు.
ఇలా చాలాసార్లు జరిగేసరికి అనుమానం
వచ్చి దీన్నే ఒక ప్రయోగం కింద మార్చి లెక్కలు వేశాడు. ప్రతి రెండు స్థానాల మధ్యన గీసిన
సరళ రేఖల కొలతలని బట్టి లెక్కకటిన కోణం అప్పటికే లెక్కకట్టిన భూమియొక్క కోణీయ వేగానికి
సమానం అవుతుండటంతో ఇది భూభ్రమణాన్ని నిర్ధారిస్తున్నది.
The Sagnac effect:Georges Sagnac అనే
భౌతిక్క శాస్త్రవేత్త సా.శ 1910ల నాడు కేవలం aether ఉనికిని చూపించి ఐన్స్టీన్ రిలేటివిటీ
ధియరీ తప్పని రుజువు చెయ్యడం కోసం తప్ప ఇంకెందుకూ పనికిరాని interferometer పరికరాన్ని
తయారు చేశాడు.అయితే, పరికరం తయారయ్యాక అది అందుకు తప్ప చాలావాటికి పనికొస్తున్నది.ఇందులో
మొదట light source నుంచి ఒక కాంతికిరణాన్ని ఉత్పత్తి చేసి దాని ప్రయాణ దిశకి 45 డిగ్రీల
కోణం చేస్తున్న partially silvered mirror మీదకి పంపిస్తారు.దీనివల్ల ఆ కిరణం రెండుగా
చీలుతుంది.ఒకటి అద్దం నుంచి దాటుకుని సూటిగా వెళ్తుంది.అయితే ఆ కాంతిని మళ్ళీ ఒక సమచతురానికి
ఉన్న మూడు మూలల దగ్గిర అమర్చిన అద్దాలను ఉపయోగించి
తిరిగి partially silvered mirror మీదకి రెండో కిరణం ఎక్కడ పరావర్తనం అయ్యిందో అక్కడ
కలిసేటట్టు చేస్తారు.ఇలా వెనక్కి వచ్చిన కిరణం Detector మీద పడుతుంది.ఇది పరికరం యొక్క
వర్ణన.light source,Detectorల మధ్యన తరుగుతున్న లేక పెరుగుతున్న దూరాల,కోణాల నిష్పత్తిని
బట్టి interference pattern లెక్క కడతారు.సూర్యుణ్ణి గానీ చంద్రుణ్ణి గానీ నక్షత్రాలను
గానీ light source కింద తీసుకుని చూస్తే భూభ్రమణం నిర్ధారణ అవుతున్నది.
The Compton tube:Arthur Holly
Compton అనే భౌతిక్క శాస్త్రవేత్త 1913ల నాడు కేవలం భూభ్రమణాన్ని రుజువు చెయ్యడం కోసం
తప్ప ఇంకెందుకూ పనికిరాని ఈ పరికరాన్ని తయారు చేశాడు.ఒక గాజుతో చేసిన చిల్లిగారెని
భూమధ్యరేఖకి సమాంతరంగా తూర్పు పడమరలకి మధ్యన స్టాండు వేసి నిలబెట్టాడు,అందులో నీళ్ళు
పోసి చిన్న చిన్న కదలికల్ని పసిగట్టటానికి మట్టి రేణువుల్నీ రంగురంగుల పొడుల్నీ వేశాడు.ఒక
రోజు పాటు వాటిని కదల్చకుండా ఉంచి అవన్నీ కుదురుకునేలా చేశాడు.అప్పుడు గభీమని 180 డిగ్రీలు
తిప్పి రేణువుల కదలికల్ని సూక్ష్మదర్శిని సాయంతో పరిశీలించి చూశాడు.మొదట ట్యూబు కదలికను
అనుసరించి తిరిగిన రేణువులు 20 సెకండ్ల తర్వాత సర్దుకునేటప్పుడు అన్నీ ఒక వైపుకి ఎక్కువ
తిరుగుతున్నాయి.ట్యూబుని రెండోవైపుకి తిప్పితే నీళ్ళూ రేణువులూ ట్యూబు కదలికకి వ్యతిరేక
దిశలో కదుల్తున్నాయి.ట్యూబుని ఎటు తిప్పినప్పటికీ మొదటి 20 సెకండ్ల తర్వాత నీళ్ళూ రేణువులూ
తిరిగే దిశ భూభ్రమణం యొక్క దిశను సైతం నిర్ధారిస్తున్నది.
The Doppler effect:కాంతికి గానీ ధ్వనికి
గానీ source,receiverల మధ్య దూరాన్ని బట్టి intensity పెరగడం తరగడం అనేదానిని డాప్లర్
ఎఫెక్ట్ అంటారు.The Sagnac effect మాదిరి సూర్యుణ్ణి గానీ చంద్రుణ్ణి గానీ నక్షత్రాలను
గానీ light source కింద తీసుకుని చూస్తే భూభ్రమణం నిర్ధారణ అవుతున్నది.
ఇవన్నీ శాస్త్రజ్ఞులు వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళ
కొకళ్ళు చెప్పుకున్నవి కాబట్టి మనబోటి సామాన్యులకు పూర్తి అర్ధం తెలియడం కష్టమే!
కానీ The Foucault Pendulum అనేది
మాత్రం కళ్ళకి కట్టినట్టు ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యేలా చూపిస్తుంది.సా.శ 1851 ఫిబ్రవరి
3న Léon Foucault ఆనె 32 సంవత్సరాల భౌతిక్క శాస్త్రవేత్త సాటి శాస్త్రవేత్తలకి
"You are invited to see the Earth turn" అని చిన్న నోట్ పంపించి Paris
Observatoryకి రప్పించి తను చేసిన ఘనకార్యం చూపించాడు.అక్కడున్న Meridian Room పైకప్పుకి
ఒక బరువైన ఇనపగుండుని 67 మీటర్ల తాడుకి కట్టేశాడు.కింద నేల ఇసక పరిచి గుండుకి అది కదిలినప్పుడు
ఇసకలో గీత పడేటట్టు ఒక సన్నటి ములికిని అమర్చాడు.మామూలు జడత్వ సూత్రాల ప్రకారం లోలకం
ముందుకీ వెనక్కీ వూగుతున్న ఒక్క గీతకి బదులు లోలకం దిశను మార్చుకుంటున్నట్టు గీతలు
క్రమేణ కొంత కోణాన్ని చేస్తూ వస్తున్నాయి.ఈంతో సారువాడికి Royal Society of London
వారు Copley Medal ఇచ్చేశారు.మంచి ఉద్యోగం కూడా ఇచ్చేశారు.తంతే గారెల బుట్టలో పడినట్టు
గుండును వూపి జాక్పాట్ కొట్టేశాడు కత్తిలాంటి కుర్రాడు!
"మరి ఇన్ని సాక్ష్యాల్నీ రుజువుల్నీ
నువ్వు చూసి మాకు చూపించి మళ్ళీ "నాకెందుకో భూమి తనచుట్టు తాను తిరుగుతూ సూర్యుడి
చుట్టు తిరగడం అబద్ధం అనిపిస్తుంది!" అంటే ఏంటి అర్ధం?మాకు చెవుల్లో పువ్వులు
పెడుతున్నావా!వాటిని ఒప్పుకున్న ప్రపంచ స్థాయి మేధావులు ఎర్రిపప్పలూ నువ్వొక్కడివీ
వాళ్ళకన్న పుడింగివీ అని సొంతడబ్బా కొట్టుకోవాలన్న నీ దురదని తీర్చుకోవడానికి మేమే
దొరికామా?" అని అనుకుంటుంటే గనక నన్ను క్షమించి కొంచెం సహనం చూపించి ఇప్పుడు చెప్పబోయే
విషయాల్ని కొంచెం ఆలోచిస్తూ వినండి.వాళ్ళందరూ గొప్ప తెలివైనవాళ్ళే, నేను వాళ్ళంత పేరు
ప్రతిష్ఠలు లేనివాణ్ణే - ఒప్పుకుంటాను.కానీ వాళ్ళు చేసిన ప్రయోగాలలోనూ ఫలితాంశాన్ని
నిరూపించడంలోనూ సైన్సుకి కావలసిన "irrefutability in the evidences"కి బదులు
సైన్సులో ఉండకూదని ఒక inevitability of the conclusion ఉంది.కోపర్నికస్ సిద్ధాంతాన్ని
ఉనికిలోకి తెచ్చేటప్పుడు అందులోని తర్కాన్ని మాత్రమే చూసి ఒప్పుకున్నారు గానీ సాక్ష్యాల
కోసం వెతకలేదు, ప్రయోగాలు చేసి నిర్ధారించుకోలేదు.స్వయాన కోపర్నికస్ బహిరంగ పరచటానికి
సందేహించినది కూడా అందుకే!
ఇంత సుదీర్ఘమయిన కాలం
గడిచాక తేలినది యేమిటంటే Copernicus కూడా observational
"proof" యేదీ ఇవ్వలేదు.కేవలం arguments చేశాడు - అవి భూమి మీద
జరుగుతున్న కొన్ని దృగ్విషయాలకి భూకేంద్రక సిద్ధాంతం కన్న మరింత అర్ధవంతమైన
వివరణ ఇవ్వడంతో ఇతరులు కూడా సంతృప్తి పడిపోయారు.
అతనికి అప్పటి రాజకీయాలలో ఉన్న ప్రాధాన్యతను
బట్టి అతను సందేహించినప్పటికీ అతని భజనబృందం అమలులోకి తెచ్చి ఉంటారని అనుకోవడానికి
ఆస్కారం ఉంది.ఒకసారి అలా అన్నీ సరిచూసుకోకుండా అమలులోకి వచ్చినదాన్ని కొనసాగిస్తున్నప్పుడు
inevitability of the conclusion అనేది ఉంటుంది కదా!Stellar aberration, The
Sagnac effect, The Doppler effect ప్రకారం ఇక్కడ చూపించిన విశ్లషణలకి irrefutability in the evidences లేదని ఎందుకు అంటున్నానో ఎలుసా!అవన్నీ detector స్థిరంగా
ఉండి source కదులుతున్న దృగ్విషయాలు, మరి source స్థిరంగా ఉండి detector కదులుతున్న
భూభ్రమణానికి రుజువులు ఎలా అవుతాయి?అదీ గాక,భూమి స్థిరంగా ఉండి వాళ్ళు ప్రయోగాలకి తీసుకున్న
సూర్యచంద్రాది నక్షత్రాలు భూమి చుట్టూ తిరిగితే కూడా అవే ఫలితాలు వస్తాయి కదా!పోనీ
భూమీ తిరుగుతూ అవీ తిరుగుతూ ఉంటే కూడా అవే ఫలితాలు వస్తాయి కదా!ఇది తప్ప ఇంకేదీ దీనికి
కారణం కావటానికి వీల్లేదు అనే నిర్ధారణ వీటికి ఉందా?లేదు!
అయితే, ఇప్పటికీ అలాంటి నిర్ధారణ ఉన్నవి
రెండు మిగిలాయి కదూ - The Compton tube చూపిస్తున్న సాక్ష్యం గట్ట్టిదే, The
Foucault Pendulum దాని బాబు లాంటిది.మరి, వీటి సంగతి యేంటి?నిజానికి నాకు "నాకెందుకో
భూమి తనచుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టు తిరగడం అబద్ధం అనిపిస్తుంది!" అనిపించడానికి
కారణం ఈ రెండింటినీ ప్రభావితం చేస్తున్న గురుత్వాకర్షణ శక్తిని గురించి ఒక కొత్త విషయం
తెలియడమే!
వేదాస్ వరల్డ్ ఇంక్ చానల్ దగ్గిర చాగంటి వెంకట్ గారు సూర్యకాంతి వల్ల భూమియొక్క గురుత్వాకర్షణ శక్తిలో మార్పులు వస్తాయని బల్లగుద్ది చెప్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది - ఇంత చిన్న విషయాల గురించి కూడా మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో చూడండి!ఆయన ఒక వేదమంత్రం యొక్క అర్ధం చెప్పి సాక్ష్యానికి మన అనుభవంలోకి వచ్చిన ఒక ఉదాహరణనే చెప్పారు.సూర్యగ్రహణం అప్పుడు నిలబెడితే నిటారుగా నిలిచే రోకళ్ళు సూర్యగ్రహణ సమయం దాటగానే పడిపోవటం మనకి తెలియనిదా!సూర్యగ్రహణం అప్పుడు మన ఇళ్ళలో ఉన్న కోళ్ళు ఎంత విచిత్రమైన పనులు చేసేవో గుర్తు తెచ్చుకోండి!అవి తెలివితక్కువవి కావడం వల్ల హఠాత్తుగా చీకటి పడితే రాత్రయిందనుకుని తత్తరపడుతున్నాయని అనుకోవటం ఎంత పొరపాటు?చీకట్లోనూ నీడలోనూ ఉన్నవి కంగారు పడుతూ సూర్యకాంతిలోకి రావడం మీకూ గుర్తుండే వుండాలి.ఆ వింతకి భూమియొక్క గురుత్వాకర్షణ శక్తి తగ్గడమే కారణం అయితే Foucault Pendulum అలా తిరగడానికీ Compton tube లోని రేణువులు అలా కదలడానికీ కూడా భూమి తన చుట్టు తను తిరగడం కాక భాగవతపురాణం చెప్తున్నట్టు భూగ్రహానికీ ధృవతారకీ మధ్యన ఉన్న అక్షం చుట్టు భూమికి 149,600,000 కిలోమీటర్ల పైన దీర్ఘవృత్తాకార కక్ష్యలో 9.78 km/s వేగంతో తిరుగుతున్న సూర్యగ్రహం నుంచి ఏటవాలుగా ప్రయాణించి వచ్చిన కాంతి యొక్క స్పర్శ వల్ల భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మార్పులకు లోనవడమే కారణం ఎందుకు కాకూడదు?
ఈ రెండు ప్రయోగాల్నీ సూర్యగ్రహణ చంద్రగ్రహణ
సమయాల్లో చేసి అప్పుడు కూడా ఇప్పుడు వస్తున్న ఫలితం వస్తేనే భూమి తన చుట్టు తను తిరుగుతున్నదని నిర్ధారించడం
సరైనది. నాకు తెలిసి ఇవేవీ
జరిగినట్టు అనిపించడం లేదు.మనం చెయ్యాలి.ప్రయోగం చేసి చూద్దాం - నాకయితే ఇప్పటికే శింశుమార
చక్రమే సరైన విశ్వనిర్మితి అని నమ్మకం కుదిరిపోయింది!ఎందుకంటే, ఈ మొదటి సందేహం దీపావళి
బాంబు లాంటిది అయితే రెండో సందేహం ఆటంబాంబు లాంటిది!అదేమిటంటే, శింశుమార చక్రం కాక
మిగిలిన ఈ ఆధునిక విజ్ఞానులూ ప్రాచీన సిద్ధాంతకర్తలూ చూపించిన విశ్వనిర్మితులు అన్నీ
దివారాత్రాలు ఏర్పడటం, పౌర్ణమీ అమావాశ్యలు ఏర్పడి మాసాలు తెలియడం, ఋతువులు మారటం, గ్రహణాలను
విశ్లేషించడం వంటివాటిని చక్కగానే చేస్తున్నాయి గానీ ధృవనక్షత్రం భూమిమీద ఎక్కడ నుంచుని
తల పైకెత్తి చూసినా సంవత్సరం పొడుగునా ఒకే చోట కనిపించడం గురించి అసలు పట్టించుకోలేదని
అనిపిస్తుంది నాకు.
ప్రస్తుతం మనం పదవ తరగతి రోజుల నుంచి చదివి
విని నమ్ముతున్న సూర్య కేంద్రక వాదం ఎంత గందరగోళంగా ఉంటుందో మీకు తెలుసా!విడి విడి
బొమ్మల్లో భూమి చుట్టు చంద్రుడు తిరగటాన్నీ సూర్యుడి చుట్టు భూమి తిరగటాన్నీ చూసేసి
దివారాత్రాలు ఏర్పడటం, పౌర్ణమీ అమావాశ్యలు ఏర్పడి మాసాలు తెలియడం, ఋతువులు మారటం, గ్రహణాలను
విశ్లేషించడం వంటివాటిని చక్కగానే చేస్తున్నాయి గాబట్టి భూమిమీద ఎక్కడ నుంచుని తల పైకెత్తి
చూసినా సంవత్సరం పొడుగునా ఒకే చోట కనిపించడం గురించి పట్టించుకోని సిద్ధాంతాలు సమగ్రమైనవి
ఎలా అవుతాయి?సమగ్రత అనేదానికి కొలత ఉండకపోవచ్చు.కానీ,ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకీ
ప్రతి అంశానికీ ఇతరమైన వస్తువులతో గానీ అంశాలతో గానీ పితృసంబంధం,సహజాత/సహచర/సోదర సంబంధం,పుత్రసంబంధం
ఉంటాయని మీకు తెలుసా!విశ్వనిర్మితి వంటి సంక్లిష్టమైన ఒక దృగ్విషయం గురించి పరిశోధించేటప్పుడు
ఈ మూడు రకాల సంబంధాలను గురించి పరిశీలించాలి.
1.కాగితం మీద మాత్రమే చంద్రుడు భూమి చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది.కానీ యదార్ధమైన విశ్వంలో భూమి కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, సూర్యుడి చుట్టు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నది.అంటే విశ్వంలోని చుట్టు చంద్రుడి యొక్క కక్ష్య సర్పిలం.2.కాగితం మీద మాత్రమే భూమి సూర్యుడి చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది.కానీ యదార్ధమైన విశ్వంలో సూర్యుడు కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, బృహత్తార చుట్టు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నాడు.అంటే విశ్వంలోని భూమి యొక్క కక్ష్య సర్పిలం.3.కాగితం మీద మాత్రమే సూర్యుడు బృహత్తార చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది.కానీ యదార్ధమైన విశ్వంలో బృహత్తార కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, పాలపుంత కేంద్రం చుట్టు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నది.అంటే విశ్వంలోని చుట్టు సూర్యుడి యొక్క కక్ష్య సర్పిలం.4.కాగితం మీద మాత్రమే బృహత్తార పాలపుంత కేంద్రం చుట్టు వృత్తాకారంలో తిరగడం సాధ్యపడుతుంది.కానీ యదార్ధమైన విశ్వంలో పాలపుంత కేంద్రం కాగితం మీద గీసిన బొమ్మలోలా పెట్టిన చోట ఉండటం లేదు, విశ్వపు కేంద్రం చుట్టు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నది.అంటే విశ్వంలోని పాలపుంత కేంద్రం యొక్క కక్ష్య సర్పిలం.ఇప్పటికి విశ్వం యొక్క కేంద్రం చుట్టూ మనమున్న పాలపుంత ఏర్పరుస్తున్న వలయం ఒకటీ దీని చుట్టూ బృహత్తార భ్రమణం ఏర్పరుస్తున్న సర్పిలం ఒకటీ దీని చుట్టూ ఏర్పడిన సూర్యగమన సర్పిలం ఒకటీ దీని చుట్టూ ఏర్పడిన భూభ్రమణ సర్పిలం ఒకటీ మళ్ళీ దీని చుట్టూ ఏర్పడిన చంద్రగమన సర్పిలం ఒకటీ అనే moon->earth->sun->star->milkyway->universe అనే అయిదు అంతరువుల చలనాలు నమోదు అయ్యాయి.సూర్యుడి చుట్టూ భూమి కాక ఇంకా కొన్ని గ్రహాలు తిరుగుతున్నప్పుడు వాటి సర్పిలాల్ని కూడా కలపాలి.
అసలు పైన చెప్పిన అయిదు అంతరువుల సర్పిలాల
మధ్యన ఇరుక్కుని తన చుట్టూ తాను తిరుగుతూ కదులుతున్న భూమి మీద నుంచి చూస్తే ధృవనక్షత్రం
ఒక్కచోటనే కనిపించాలంటే అది ఎక్కడ వుండాలి?చెన్నై అనే చోటు నుంచి చూస్తేనూ భాగ్యనగరం
అనే చోటు నుంచి చూస్తేనూ అమరావతి అనే చోటు నుంచి చూస్తేనూ ధృవనక్షత్రం ఒకేచోట కనబడటం
లేదు, కానీ చెన్నై అనే చోటు నుంచి చూస్తే ఎప్పుడూ ఒకే చోట కనిపిస్తున్నది.ఈ చెన్నై
అనే బిందువు భూమి కేంద్రం నుంచి భూమి వ్యాసార్ధపు దూరంలో ఉండి భూమి తన చుట్టూ తాను
తిరుగుతున్నప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నప్పటికీ ధృవనక్షత్రం మాత్రం ఒకే చోట
కనబడటం ఎట్లా సాధ్యం?ఈ చెన్నై అనే బిందువు భూమి కేంద్రం నుంచి భూమి వ్యాసార్ధపు దూరంలో
ఉండి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు చెన్నై తన స్థానాన్ని మార్చుకుంటున్నప్పటికీ
ధృవనక్షత్రం మాత్రం ఒకే చోట కనబడాలంటే ధృవనక్షత్రం కూడా చెన్నై అనే చోటు నుంచి చూస్తే
ఎప్పుడూ ఒకే చోట కనిపించేలా భూమితో పాటు తిరగాలి కదా!
విశ్వాక్షం నుంచి చంద్రుడి వరకు నాలుగు
అంతరువుల బొంగరాలు రింగు రింగు మని తిరుగుతున్న మొత్తం దృశ్యంలో ధృవనక్షత్రం ఆయా గ్రహాలతోనూ
నక్షత్రాలతోనూ ఎంత దూరంలో ఎంత కోణంలో ఉంటే "భూమిమీద ఎక్కడ నుంచుని తల పైకెత్తి
చూసినా సంవత్సరం పొడుగునా ఒకే చోట కనిపించడం" సాధ్యపడుతుంది అనేది పట్టించుకోవాల్సిన
అనవసరం లేనంత చిన్న విషయమా!
ఆ రెండు ప్రయోగాల్నీ సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయాల్లో చేసి Foucault Pendulum అలా తిరగడానికీ Compton tube లోని రేణువులు అలా కదలడానికీ భూమి తన చుట్టు తను తిరగడం అనేది కారణం అని నిర్ధారించినప్పటికీ భాగవత పురాణంలోని శింశుమార చక్రం వర్ణనకు పెద్ద లోపం రాదు గానీ సూర్యకేంద్రక వాదంలోని ధృవనక్షత్రం భూమిమీద ఎక్కడ నుంచుని తల పైకెత్తి చూసినా సంవత్సరం పొడుగునా ఒకే చోట కనిపించడం గురించి పట్టించుకోకపోవడం అనే లోపం మాత్రం మిగిలే ఉంటుంది.
ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమే కాక వైదిక సాహిత్యంలోని కూర్మపురాణం వంటి పురాణాలూ సూర్యసిద్ధాంతిక వంటి శాస్త్రగ్రంధాలూ తన చుట్టూ తిరుగుతున్న చంద్రుడితో సహా భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వల్లనే భూమి మీద జరుగుతున్న సూర్యోదయమూ సూర్యాస్తమయమూ ఋతువులూ వంటి మార్పులు సంభవిస్తున్నాయని చెప్తున్నాయి కానీ మత్స్యపురాణం, బ్రహ్మాండ పురాణం వంటివి శింశుమార చక్రం ప్రకారం కాలాన్ని నిర్వచించి పధ్నాలుగు లోకాల విరాట్పురుష నిర్మాణం ప్రకారం విశ్వాన్ని చూపిస్తున్నాయి.కాల నిర్ణయానికి అవసరమైన ఏడు గ్రహాలకూ భూమి నుంచి దూరాలు ఇలా ఉన్నాయి:చంద్రగ్రహం(Moon) భూమినుంచి 384,400 Km దూరాన ఉంది.శుక్రగ్రహం(Venus) భూమినుంచి 41,400,000 Km దూరాన ఉంది.కుజగ్రహం(Mars) భూమినుంచి 78,340,000 Km దూరాన ఉంది.బుధగ్రహం(Mercury) భూమినుంచి 91,691,000 Km దూరాన ఉంది.సూర్యగ్రహం(Sun) భూమినుంచి 149,600,000 Km దూరాన ఉంది.గురుగ్రహం(Jupiter) భూమినుంచి 628,730,000 Km దూరాన ఉంది.శనిగ్రహం(Saturn) భూమినుంచి 1,275,000,000 Km దూరాన ఉంది.వీటన్నిటిని తనచుట్టు తిప్పుకుంటున్న ధృవనక్షత్రం భూమినుంచి 434 light-years దూరాన ఉంది.ఇది సూర్యగ్రహం కన్న 4000 రెట్లు కాంతివంతమైనది గనకనే అంత దూరంలో ఉండి కూడా కంటికి కనబడుతున్నది!ఈ ధృవనక్షత్రం యొక్క ఖగోళ శాస్త్ర సంబంధమైన సాంకేతిక విషయాలనే ధృవోపాఖ్యానం కధన రూపంలో చెప్తుంది.
శింశుమార స్వరూపం మూడు రకాల నిర్మితులను చూపిస్తుంది.మనం తల పైకెత్తి చూసినప్పుడు వేర్వేరు దూరాలలో ఉన్న నక్షత్ర సమూహాలూ గ్రహాలూ అన్నీ ఒక సమతలం మీద ఉన్నట్టు గోచరించేది చక్ర స్వరూపం.శ్రీమహావిష్ణువు యొక్క అయిదు ఆయుధాలలోని సుదర్శనం ఇదే!శింశుమారం యొక్క పూర్తి స్వరూపాన్ని ఒకేసారి అర్ధం చేసుకోవడం సాధ్యం కాదు.మొదట ఈ చక్ర రూపాన్ని సదా ధ్యానించి అనుసంధానం చేసుకున్నాక జ్ఞానాన్ని మరికొంచెం విస్తృతం చేసి చూస్తే ఆయా గ్రహతారకలు వేర్వేరు తలాలలో ఉన్నట్లు గోచరిస్తుంది.ఇప్పుడు వీటిని ధృవనక్షత్రం చుట్టు తిప్పుతున్న అదృశ్య వాయతంత్రులను చూడగలిగితే అది శంఖు రూపం అవుతుంది.ఇంగ్లీషులో దీన్ని chandelier అంటారు,సంస్కృతంలో దీపవృక్షం(दीपवृक्षः) అని అంటారు.ఇప్పుడు ఈ శంఖ రూపాన్ని సదా ధ్యానించి అనుసంధానం చేసుకున్నాక జ్ఞానాన్ని మరికొంచెం విస్తృతం చేసి చూస్తే ఆయా గ్రహతారకలు కేవలం ధృవనక్షత్రం నుంచియే గాక వాటితో అవి వాయుతంత్రులతో అనుసంధానించబడి స్థిరమైన దూరాలలో ఉండి ధృవనక్షత్రం చుట్టు తిరుగుతున్నట్టు గోచరిస్తుంది.ధృవనక్షత్రం తోక చివరి కొసను అంటిపెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తున్న మీనాకృతియే శింశుమారం యొక్క అసలైన స్వరూపం.
ఇప్పుడు చెప్పండి, భూమి తనచుట్టు తను తిరగడం
నిజమా?
P.S:ఈ వెతుకులాటలో నాకొక సొంత ప్రయోజనం సమకూరింది.శింశుమార చక్రం గురించి నాకు తెలిసిన సమాచారంతో నేనొక augmented reality app తయారు చేద్దామనుకుంటున్నాను. భూమికీ ధృవనక్షత్రానికీ మధ్య ఉన్న అక్షాన్ని చూపిస్తూ భూమినుంచి సూర్యుడూ చంద్రుడూ ఉన్న దూరాల్నీ వాటి కక్ష్యల్నీ మన కంటికి కనబడే సరైన నిష్పత్తిలోకి తెచ్చి చూపిస్తాను.
అంటే, యాప్ ఎప్పుడు తెరిస్తే అప్పుడు ఆకాశంలోని శింశుమార చక్రం మన కళ్ళముందు కనిపించి దానిమీద సూర్యుడూ చంద్రుడూ ఎక్కడ ఉన్నారో చూడవచ్చు.దీనివల్ల పాండితులకే కాదు పామరులకి కూడా వైదిక ఖగోళ శాస్త్రం చేసిన కాలవిభజన యొక్క గొప్పతనం తెలుస్తుంది.
మీరు ఇంకోవిషయం లాగాలి. భూమి భారద్దేశం(నీ భాషలో హిందుస్థాన్) చుట్టూ తిరుగుతుందని.
ReplyDeleteమీరు ఇంకోవిషయం తెలుసుకోవాలి. మీకు తల(నీ భాషలో మోకాలు)లో మెదడు లేదని.
DeleteChiru DreamsDecember 21, 2020 at 7:29:00 PM GMT+5:30
ReplyDeleteఈ రోజు వాత్సవం రేపటిరోజు కాదు అనే విషయం ఒక లెవల్ వరకు మాత్రమే వుంటుంది. ఆ లెవల్ దాటాక ఇక మిగిలేది వాత్సవమే. భూమి బల్లపరుపుగా వుంది అన్నది మొన్నటి వరకు నిజమనుకునే అవాస్తవం, ఫైనల్గా భూమి గుండ్రంగా వుంది అనేది తిరుగులేని వాత్సవం.
hari.S.babu
భూమి గుండ్రంగా ఉందనడానికి irrefutable evidence ఏదీ లేదండీ!"రాత్రి ఎలా ఏర్పడుతుంది?భూకంపాలు ఎలా వస్తాయి?" లాంటి సందేహాలకి కొంత హేతుబద్ధమైన జవాబులు చెప్పుకుని అన్ని లెక్కలూ సరిపోవడానికి తగిన మోడల్ కోసం వూహలు చేసి సబబైన మోడల్ ఒకటి తీసుకున్నారు, అంతే!గూగుల్ ఎర్త్ ఇప్పుడు తీసిన ఫొటోలను బట్టి మ్యాపులు తీస్తుంటే టోపాలజికల్ ప్రాబ్లంస్ వస్తున్నాయట!ఇప్పుడు నేల మీద గీసిన కొలతల్ని స్కేల్ చేసి మ్యాపుల్ని గియ్యడానికి వాడుతున్న నాలుగు పద్ధతుల్లో ఏ ఒక్కటీ గుండ్రంగా ఉన్న భూమి మీద తీసుకున్న curved measuremebtsని linear surface మీదకు పరుస్తున్నప్పుడు రావాల్సిన సహజమైన convulution/involution రావడం లేదట!
బహుశః భూమి యొక్క గుండ్రని తనం కూడా సాపేక్ష సత్యమే కాబోలు!
Hi
ReplyDeleteశింశుమారక చక్రం యేక్క వివరణ ఇవ్వండి
ReplyDeleteరాత్రి వేళ మనం తల పైకెత్తి చూస్తే కనపడుతున్న గ్రహతారకలతో కూడుకున్న వృత్తాకారపు గగనానికి పగటివేళ కనిపించే సూర్యుణ్ణి కూడా కలిపి చూస్తే అది శుంశుమార చక్రం.
Deleteఇంతకన్న ఎక్కువ చెప్పడం కష్టం.