Thursday, 20 August 2020

గంగ పుట్టిన గడ్డ ఇదిరా! గంగకే కడగ శక్తిలేని ఘనపాపరాశిని మోస్తున్న బుద్ధి లేని గడ్డ ఇదిరా!

 పల్లవి:గంగ పుట్టిన గడ్డ ఇదిరా!

గంగకే కడగ శక్తిలేని

ఘనపాపరాశిని మోస్తున్న 

బుద్ధి లేని గడ్డ ఇదిరా!


చరణం:పుణ్యమార్జించబోవు

గుడి గోపురాలును

గ్రుంకెడి తీర్ధాలును

పాపచింతకుల నెలవు లయిన

సిగ్గు లేని గడ్డ ఇదిరా!

||ప||

చరణం:రైతుల కడగండ్లను

దీర్చుట మాని రైతులకు

రిస్టు వాచిలేల మంచి బట్టలేల

యను తిండి దండగ వెధవలు

రాజత్వ మాశించెడి

రోగిష్టి గడ్డ ఇదిరా!

||ప||

చరణం:అడిగినంత ఇచ్చేటి

విశ్వమ్మును విష్ణుదేవుండును

తోడనే యుండగ మందబుద్ధులై

పరుల మెచ్చుకోళ్ళ కెగబడు

బానిసీడుల పోతుగడ్డ ఇదిరా!

||ప||

చరణం:తన్ను దోచెడి దొరలను

తన్ని కూర్చుండ బెట్టక

నెత్తిన మోసి యాతనలు పడు

మందబుద్ధుల రోతగడ్డ ఇదిరా!

||ప||

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

Chiru Dreams అను ఒక ట్రోలింగును పాండిత్యం అని నమ్మిస్తున్న గీండితుడి విషాదకరమైన అదృశ్యానికి కారణం ఏమిటి?

 కొరివిని ముద్దు పెట్టుకున్నట్టు నన్ను ఎక్కువ కెలికాడు.వాదనల్లో నేను చాణక్యుడి యుధ్ధనీతిని పాటిస్తాను.చాలామంది మిత్రులే ఇంతకుకుందు చెప్పినప్...