Wednesday, 6 June 2018

కుతుబ్ మీనార్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు?కూలీల లిస్టు సరేనయ్యా, కట్టిన కాంట్రాక్టరుకి యెంత కిట్టింది!

          గతితార్కికచారిత్రకభౌతికవాదం అని సిద్ధాంతం పేరులోనే చరిత్రని పెట్టుకుని చరిత్రని సరయిన పద్ధతిలో అర్ధం చేసుకుని సరయిన దిశవైపు ప్రజలని నడిపించటమే మా లక్ష్యం అని చెప్పుకుంటూనే భారతీయ మార్క్సిస్టు చరిత్రకారులు ఈ దేశచరిత్రకి ఎక్కించిన అబద్ధాల్ని చూస్తుంటే కోపం కన్న ఆసహ్యమే ఎక్కువ వస్తుంది నాకు!స్వతంత్రం రాకముందు చరిత్రని రాసిన ఇంగ్లీషువాళ్ళు ఈ దేశచరిత్రని అబద్ధాలు చెప్పి బ్రష్టు పట్టించడాన్ని సులువుగానే అర్ధం చేసుకోవచ్చు - ఇది వాళ్ళకి స్వదేశం కాదు గాబట్టి తెలియక కొంత అమాయకత్వంతొనూ తెలిసి కొంత నిర్లక్ష్యంతోనూ తప్పులు రాయడం సహజమే! వాళ్ళ స్వదేశపు చరిత్రని వాళ్ళు నిక్కచ్చిగానే రాసుకున్నారు.కానీ ఈ దేశస్థులైన రొమిల్లా ధాపర్ లాంటివాళ్ళు తమ స్వదేశపు చరిత్రని భ్రష్టు పట్టించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

          క్రిస్టియన్లు దేవుడి రాజ్యం పేరుతో తమని తాము దేవుని యొక్క బిడ్డడు పెంచిన గొర్రెల బుట్టలో వేసేసుకుని తమకు భిన్నమైనవాళ్లని పాపుల కింద తీర్మానించి వాళ్ళని ఉద్ధరించే బాధ్యతని భుజాల మీద వేసుకున్నట్టుగానూ ముస్లిములు ప్రవక్త రాజ్యం పేరుతో తమని తాము అల్లాహ్ పంపిన ఆఖరి ప్రవక్త యొక్క వారసుల ఖాతాలో వేసేసుకుని తమకు భిన్నమైనవాళ్ళని కాఫిర్ల కింద తీర్మానించి వాళ్ళని నిర్మూలించే కర్తవ్యాన్ని భుజాల మీద వేసుకున్నట్టుగానూ హిందువులని కమ్యునిష్టేతరుల కింద తీర్మానించేసి ఇంగ్లీషువాళ్ళని అనుకరిస్తూ వీళ్ళ చరిత్రని భ్రష్టు పట్టించడం వల్లనే మన సిద్ధాంతాన్ని వీళ్ళకి ఎక్కించగలం అనుకుని తెలిసే చేశారు తప్ప వీళ్ళలో ఎవరూ తాము ఏం చేస్తున్నామో తెలియక చేసిన అమాయకులు ఎవరూ లేరు.ప్రజలకి మేలు చెయ్యడం కోసం ప్రజల మీద న్యాయమైన అధికారం కోరుకున్నవాడు ఎవ్వడూ యే ప్రజలకి తాము మేలు చెయ్యాలనుకున్నాడో ఆ ప్రజలకే అబద్ధాలు చెప్పడు!మరి,కాంగ్రెసు ప్రోత్సాహంతో కమ్యునిష్టు చరిత్రకారులు తమ మాతృదేశపు చరిత్ర విషయంలోనే అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పారు?

          అసలు నాకు ఒకటే ఆశ్చర్యం - "ఈరోజు మనం చెబుతున్నవి రేపు అబద్ధాలు అని రుజువైతే ఏం చెయ్యాలి?మనం చెప్పినవి అబద్ధాలని తెలిసాక మనతో పాటు మనం గొప్పదని చెప్పుకుంటున్న సిద్ధాంతం పరువు కూడా పోతుందేమో!"  అనే అనుమానం గానేఎ భయం గానీ లేకుండా ఇన్ని దశాబ్దాల పాటు ఎట్లా బతకగలిగారు వీళ్ళు!వాళ్ళు ఎవరి చరిత్ర గురించి అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళ గురించి "ఈ వెర్రివెధవలు మనం ఇవ్వాళ చెప్తున్న అబద్ధాల్ని ఎప్పటికీ తెలుసుకోలేరు!వాళ్ళకి నిజం తెలిసేటప్పటికి మనం ఇక్కడ వర్గరహితసమాజం/తైనాతీప్రభుత్వం స్థాపించేస్తాం కద!" అన్న ధీమా ఉంటే తప్ప అన్ని అబద్ధాలు చెప్పగలరా?

          కుతుబ్ మినార్ అనే ఒక హిందూ ఆలయ సమూహాన్ని దాని నిర్మాణంతో ఏ సంబంధమూ లేని కుతుబుద్దీన్ అనే ముస్లిముకి అంటుగట్టడానికి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెసువాళ్ళూ విశ్వవిద్యాలయాల చరిత్ర విభాగాలలో పాతుకుపోయిన కమ్యూనిష్టులూ ఎన్ని తలతిక్క పనులు చేశారో తల్చుకుంటే వాళ్ళ మీద జాలి కూడా వేస్తున్నది నాకు!ఎందుకంటే, ఒంటిమీదకి  అరవై డెబ్భయ్యేళ్ళ వయస్సును తెచ్చుకుని యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ల హోదాలో వీళ్ళు చెప్పిన అబద్ధాల్ని కనిపెట్టటానికి మనం ప్రత్యేకించి ఏ పరిశోధనలూ చెయ్యాల్సిన పని లేదు - ఒక టీనేజరుకి ఉండే కామన్సెన్సు చాలు! 

          క్రీ.శ 1961లో విహారయాత్రకి వచ్చిన కాలేజి కుర్రాళ్ళు కొందరు ఒక అధికారికమైన దర్శకవ్యాఖ్యాత(Guide)ని మాట్లాడుకున్నారు - ఆయన ప్రభుత్వం వారు అచ్చోసి వదిలిన గైడే!పైన, ఆయనకి హిస్టరీలో ఎమ్మే డిగీ ఉంది కూడాను!అయితే ఆ కుర్రాళ్ళు అడిగిన బుల్లి బుల్లి ప్రశ్నలకి అతను చెప్పిన అతికీ అతకని జవాబులు వింటే బాపు గారి కార్టూనుల పుస్తకం చదివిన దానికన్న ఎక్కువ నవ్వుతారు.కాకపోతే ఒకటే తేదా,బాపు గారి పుస్తకం మీరు ఏకబిగిన చదవలేరు - మీకూ కామన్సెన్సు ఉందండోయ్, నేనెందుకిలా అంటున్నానో  మీకు తెలిసిపోయిందని నాకూ తెలిసిపోయిందోచ్! :-

Q. What was the purpose of building this ‘MINAR’ ?

A. Victory Tower.

Q. Whose victory over whom ?

A. Md. Ghori’s victory over Rai Pithaura (Prithvi Raj)

Q. Where ?

A. At Tarain near Panipat.

Q. Why is the Victory Tower at Delhi ?

A. Do not know.

          ఇంతటితో ఈ ఎమ్మే హిస్టరీ గైడు గారితో పాటూ ఇలాంటివాళ్ళని తయారు చేస్తున్న యూనివర్సిటీలకీ వాటిని అంత భీబత్సంగా నడుపుతున్న భారత ప్రభుత్వానికీ కూడా పరువు పోతుందని పసికట్టిన సందర్శకులలో ఉన్న ఒక విశ్వవిద్యాలయపు చరిత్రబోధకుడికి కంగారు పుట్టి ఆయన కల్పించుకుని జవాబు చెప్పాడు:
The Victory Tower was commenced by Ghori because Delhi became his capital.

Q. Objection, Sir! Ghori never had his capital at Delhi. His capital was at Ghazni. What logic is there in building the Victory Tower in Delhi ?

A. Silence.

Q. Even if the Minar was commenced by Ghori, its name ought to have been ‘GHORI MINAR’ and not ‘QUTB MINAR’. Why is it called ‘Qutb Minar’ ?

A. It was probably Qutubuddin Aibak, slave of Ghori, who laid the foundation of the minar for his master.

Q. If this is true, what made him choose Delhi as the site for the Victory Tower?

A. Delhi was the capital of Qutbuddin Aibak.

Q. It is said that the building of the Minar was commenced during the life time of Ghori. When Ghori was alive, the question of his slave’s capital being at Delhi does not arise. After the death of Ghori, Qutbuddin was crowned at Sultan at Lahore. He ruled from Lahore and not Delhi and ultimately died at Lahore. His capital was at Lahore! Why did he build the Victory Tower at Delhi ?

A. Silence.

Somebody from the audience asserted that the Minar was not a victory tower but a ‘Mazina’ (Muezzin’s Tower in mosque) attached to ‘Quwwat-ul-Islam Mosque’.

Q. The word ‘Quwwat-ul-Islam Mosque’ is unknown to contemporary history of India. This word was coined by Sir Saiyid Ahmad Khan in the first part of the nineteeth century. Do not be surprised to know that the name ‘QUTB MINAR’ too, is not known to Indian History. It is also a recent fabrication. If, for the sake of argument, we take it for granted that the minar is a muezzin’s tower, the mosque assumes primary importance and the tower secondary, but unfortunately the mosque, as you see it, is in complete ruins. How do you account for the mosque of primary importance to be in ruins and the muezzin’s tower, a building of no consequence, to be standing in full majesty ?

A. No Answer.


          అయ్యా, అదండీ మన చరిత్రకారుల కాకమ్మ కధల బండారం!తమ కళ్లముందు కనబడుతున్న భవనాలు తమకి చూపిస్తున్న సాక్ష్యాలని కూడా అర్ధం చేసుకోలేని వీళ్ళు రాముడి మూడో పెళ్ళాంతో లక్ష్మణుడు చేసిన రంకు గురించి మాత్రం గొప్ప గొప్ప విశ్లేషణలు చేస్తారు!వేంకటేశ్వర సుప్రభాతంలోనూ లలితాసహస్రనామాల్లోనూ ఉన్న బూతుని కనుక్కోగలిగినవాళ్ళకీ మహిషాసురమర్దినిని సెక్స్ వర్కర్ అనగలిగినవాళ్ళకీ కుతుబ్ మినార్ గురించిన నిజాలు చెప్పమంటే మాత్రం నోరు పెగలదు - చీ వీళ్ళ బతుకులు తగలెయ్య!

          కుతుబ్ మినార్ చూడటానికి పోయినసారి వెళ్ళినవాళ్ళు శ్రద్ధగా చూడక వదిలేస్తే మళ్ళీ వెళ్ళినప్పుడు శ్రద్ధగా చూడండి,కొత్తగా వెళ్ళబోయేవాళ్ళు అన్నిట్నీ పరిశీలనగా చూడండి - శిధిల స్తంభాల మీద జంతువుల బొమ్మలు కనిపిస్తాయి,అన్ని హిందూ ఆలయాలలఓనూ కనిపిస్తూ ఖురాను చిత్రించకూడదని నిషేధించిన జంతువుల బొమ్మలు అక్కడ ఎందుకు ఉన్నాయో ఆలోచించండి!

          ముస్లిం ప్రభువులు భవననిర్మాణంలో అరబిక్ శైలిని పరిచయం చేశారు,కొత్తదనాన్ని చూపించారు అని పొగిదే  బుడ్డిమంతులు అక్కద అరేబియాలో వీళ్ళు ఏ అపురూపమైన భవంతులు కట్టారో చెప్పరేమి?బాబరు గారు ఈ దిక్కుమాలిన హిండియాకి రాకమునుపు కట్టి వదలి వచ్చిన అపురూపమైన నిజనివాసం ఏది?జాడలు కనిపెట్టి పునర్నిర్మించి చూపించమనండి!ఎడారుల్లో గుడారాలు వేసుకుని ఒంటెల మీద దేశదిమ్మరుల్లా తిరిగినవాళ్ళు ఇక్కడికొచ్చేసరికి ఒక్కసారి ఇంతింత గొప్ప భవనాలు నిర్మించగలగడం సాధ్యమా?అక్కడినుంచి ఎంతమంది శిల్పుల్ని తమవెంట తెచ్చుకున్నారు?ఎప్పుడు ఇక్కడి శిల్పుల్ని అక్కడికి పంపించి మెళకువలు నేర్పించారు?

          కొత్త నిర్మాణం చెయ్యాలంటే తెలివీ ఓపికా కావాలి, వాళ్ళకి ఆ రెండింటిలో యేదీ లేదు.ప్లాను గియ్యడం,సామగ్రిని సిద్ధం చేసుకోవడం,రాళ్ళని తొలచడం,నునుపు కోసం నగిషీల కోసం బోల్డుమంది మనుషులూ బోల్డంత సమయమూ ఖర్చు చెయ్యడం ఆవసరమా హిందువుల పుణ్యాన అన్నీ తేరగా దొరుకుతుంటే?ఉన్నదాన్ని కూల్చేసి ఆ స్తంభాలతోనూ ఇటుకల్తోనూ పాత రూపం మాత్రం కనపడకుండా కట్టమంటే మన  శిల్పులు కట్టినవే తప్ప కుతుబ్ మినార్ సముదాయంలో ముస్లిముల పూర్తి సొంత నిర్మాణం ఒక్కటి కూడా లేదు!

          కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ కట్టాడనటం దేశంలోని అన్ని నగరాల్లోనూ మహత్మా గాంధీ రోడ్ అని  పేర్లు పెట్టీనవన్నీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కట్టాడనటం లాంటిదే!అసలు వీళ్ళంతా ఏవరికి నిర్మాణబాధ్యతని అంటగట్టారో వాడికే ఇది నేను కట్టానని చెప్పుకోవటానికి ముఖం చెల్లలేదు - ఆ యావ కూడా చూపిచ్చలేదు!అసలు జరిగింది యేంటయ్యా అంటే, అప్పటివరకు బతికిన బతుక్కి దీన్ని చూసి నోరెళ్ళబెట్తి పక్కోణ్ని యేంట్రా ఇది అని అడిగాడు. వాడు మిడిమిడి గ్నానంతో గ్రహవేధశాలకి హిందీలో ఉన్నదాన్ని అరబిక్కు లోకి తర్జుమా చేసి చెబితే అది "Qutub Minar" అయ్యింది.హిందీ నుంచి అరబిక్ లోకీ మళ్ళీ అరబిక్ నుంచి ఉర్దూ లోకీ మార్చగా మార్చగా ఆ పదం ఖర్మ అట్లా కాలింది!మరీ ఇసిత్రం, మొత్తం భవనాలని పునాదులతో నిర్మించిన ఖ్యాతిని ఎవడికి కట్టబెట్టారో ఆ ఘనుదే ఈ మినారు చుట్టూ ఉన్న 27 ఆలయాల్ని కూల్చేశానని చెప్పుకున్నాడు గానీ ఒక్క దాన్ని కూడా కట్టానని చెప్పుకోలేదు!అసలు మనిషి మాటల్ని కూడా పట్టించుకోకుండా ముస్లిములు కూల్చిపారేసిన ఒక హిందూ దేవాలయ సముదాయాన్ని ముస్లిం ప్రభువుల నూతన నిర్మాణం కింద ముస్లింలు కూడా ఒప్పుకోలేనంత బలంగా రుద్దేసిన మన చరిత్రకారుల్నీ వాళ్లు రాసిన అబద్ధాల్ని పిల్లలకి ఈ దేశపు నిజమైన చరిత్ర కింద చెప్పిన ప్రభుత్వాధికారుల్నీ వాళ్ళని అలా చెయ్యమని పురమాయించిన శాసనాధికారం గలిగిన రాజకీయనాయకుల్నీ ఎన్నిసార్లు ఉరి తీస్తే సరిపోతుంది?

          క్రీ.1852లో ఈ కుతుబ్ మినార్ అనేది  ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం కట్టినది కావడానికి వీల్లేదనీ హిందూ కట్టడమేననీ Syed Ahmed Khan అనే Muslim archeologist తేల్చి చెప్పాడు.చూసీ చూడగానే ఖురాను సూక్తులతో నిండిన ఈ కట్టడం ముస్లిముల నిర్మాణం అని భ్రమ గొల్పుతుంది గానీ పట్టి పట్టి చూస్తే హిందువులు భవనాల నిర్మాణంలో ఉపయోగించే అలంకారాలు ఎన్నో కనిపిస్తాయి.వీటిలో కొన్ని ఈ ముస్లిములు ఎక్కడినుంచి వచ్చారో అక్కడి నిర్మాణాలలో కనపడనివీ కొన్ని ఇస్లాం నిషేధించినవీ ఉన్నాయి.వాళ్ళు శిధిలం చేసినవీ శిధిలం చెయ్యలేక రూపం మార్చినవీ అయిన అన్ని భవనాల గోడల మీద గంటలు కనపడుతున్నాయి.పోనీ ఈ డిజైను నచ్చేసి స్థానిక పనివాళ్ళని పురమాయించారని అనుకోవడానికి వీల్లేదు - సాక్షాత్తూ వీళ్ళ కాపీ/పేస్ట్/జంబుల్/రీనేమ్ కళాప్రవీణుడైన ముహమ్మద ప్రవక్త గారే The bell is one of the musical instruments of Satan. అనేశాడు,ఇంక ఏ ముస్లిం గంటల డిజైను చెక్కించే ధైర్యం చేస్తాడు?

          ఇక హిందువులు ఆలయాలలోనే కాదు ఇళ్ళలో కూడా చిరుగంటల్ని అలంకరించుకుని వాటి శబ్దాల్ని వినడానికి ఇష్టపడతారు!పనిగట్టుకుని హిందువులని వెర్రివెధవల్ని చేస్తూ ముస్లిములకి భుజకీర్తులు తొడుగుతూ ఆనందించాలనే శాడిస్టు మనస్తత్వం ఉంటే తప్ప నిష్పాక్షిక దృష్టితో పరిశీలించిన ప్రతి ఒక్కడికీ హిందువుల నిర్మాణంలో ఇస్లామిక్ చిహ్నాల్ని ఇరికించిన బలవంతపు రుద్దుడు కార్యక్రమం ఫలితమే కుతుబ్ మినార్ అని తెలుస్తుంది.అరబిక్ భాషలో మంచి పట్టున్న సయ్యద్ మహాశయుదే అక్కడ కనిపిస్తున్న అరబిక్ అక్షరాల కూర్పు అర్ధం పర్ధం లేనిదని చెబుతున్నాడు-అంటే, లొడలొడబుడబుడగుడగుడ తెలుగు లాంటి అరబిక్ అది - ఇది ముస్లిముల కట్టదం అని చెప్పటానికి అరబిక్ అక్షరాల్ని పేర్చారు, అంతే!.

          మరీ ముఖ్యమైనది,ఒకచోట ముస్లిముల గుమ్మటాన్ని సగం చెక్కి వదిలేసినట్టున్న ఈ నిర్మాణాన్ని చూడండి!పైన కనపడుతున్న గుమ్మటం చూడగానే ఇది ముస్లిములు కట్టినదే అనిపిస్తుంది,కానీ స్తంభాలు మాత్రం హిందువుల ఆలయాలలో కనబడే స్తంభాల మాదిరి ఉన్నాయి!
          అసలు మొత్తం నిర్మాణాన్ని కూల్చి కట్టడానికి తగిన సహనం,సమయం అప్పటివారికి లేకపోవడం వల్లనే ఇప్పటివారికి ఇన్ని సాక్ష్యాలు దొరుకుతున్నాయి.ఇదే భవన సముదాయంలో వారు కట్టారని చెబుతున్న దేశంలోకల్లా తొలి మసీదుకీ రూపమార్పిడి అనే పునర్నిర్మాణం చెయ్యకుండా వదిలేసిన కట్టడానికీ ఉన్న పోలికల్ని చూడాలంటే వాటిని పక్కపక్కన పెట్టి చూస్తే చాలు!
          కుడివైపున ఉన్నదానిని కూడా గుమ్మటం పూర్తి చేసి స్తంభాల్ని చెక్కేసి ప్రతిమలని ముక్కులూ చేతులూ కాళ్ళూ పగలగొట్టి వికారం చేస్తే ఇది కూడా ఇస్లామిక్ కట్టడం అయ్యి ఉండేది కాదూ!ఈ శిధిలాలయపు కుడ్యం పైన గణపతి విగ్రహం తొలచబడి ఉంది - ఉస్లిముల ఆధ్యాత్మిక సాహిత్యంలోకి గణపతి ఎప్పుడు వెళ్ళాడు?అంతకన్న దారుణం, గొడల మీద రామాయణ విశేషాలు చెక్కి ఉన్నాయి - దైవం,ఋషులు,మానవమూర్తుల్ని శిల్పాల రూపంలో చెక్కడం ఇస్లాములో పరమ ఘోరమైన నీచకార్యం కదా!ఇక ఇప్పుడు తొలి మసీదు అనుకుంటున్న భవనం లోపలికి వెళ్ళి పైకి చూస్తే హిందూ ఆలయాల పైకప్పులో కనిపించే వృత్తాలూ త్రికోణాలూ పుష్పదళాలూ కనిపిస్తాయి!

          సయ్యద్ మహాశయుడు నొక్కి వక్కాణించినదాన్ని బట్టీ మన కళ్ళతో చూసి అర్ధం చేసుకున్నదాన్ని బట్టీ ఈ మినార్ చుట్టూ ఉన్న ఏ ఒక్క నిర్మానమూ కుతుబుద్దీన్ ఐబక్ కట్టినవి కాదనీ అంతకు పూర్వం ఉన్న హిందూ కట్టడాలనే తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో రూపమార్పిడి చేసిన వికృత మనస్తత్వమే తప్ప వీటిలో ముస్లిములు రూపుదిద్దిన అరబిక్ శైలి యొక్క సృజనాత్మకత యేమీ లేదని తెలుస్తున్నది కద!


          అసలు ఈ భవన సముదాయానికీ ముస్లిములకీ ఏ సంబంధమూ లేదని చెప్పడానికి ఆవరణ లోని ప్రతి శిధిలమూ సాక్ష్యం చెబుతున్నప్పటికీ ప్రముఖమైన రెండు సాక్ష్యాలు ఈ స్తంభమూ దీనికి దగ్గిరలోనే ఉన్న తుప్పు పట్టని ఇనుప స్తంభమూ - ఇవి రెండూ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్నకి ఇది ముస్లిముల నిర్మాణం అని వాదిస్తున్నవారిలో ఎవరూ సరయిన జవాబు చెప్పలేకపోతున్నారు.ఆ గంభీరమైన విశ్లేషణలోకి వెళ్ళబోయేముందు దీనిని ముస్లిములకి దఖలు పర్చడానికి చెప్పిన కొన్ని హాస్యరసగుళికల్ని తెలుసుకుని నవ్వుకుని తరించుదాం!
          ఒక మేధావి"అసలీ మినారు ఎందుక్కట్టారంటేనండీ!ముస్లిముల్ని నమాజుకి పిల్వడానికి మువజ్జిను గారు యెక్కడానికి కట్టారండీ!" అని తను యెక్కి చూసి పిలిచి తెలుసుకున్నట్టు వాగాడు.నిజంగా రోజుకి 5 సార్లు ఈ స్తంభం పైవరకు యెక్కి దిగాలంటే రోజుకో మువజ్జిను కరుసౌతాడు:-)పైకి ఎక్కడానికీ దిగడానికీ అక్షరాల 45 నిముషాలు పడుతుంది మరి!మరో మేధావి "అబ్బే!ఇది మా కుతుబుద్దీన్ గారు ఒక్కడే కట్టించాడని మేమూ అనలేము.కాపోతే ఆయన మొదటి అంతస్థు కడితే ఒక్కో తరంలో ఒక్కోటి కట్టుకుంటూ పూర్తి చేసి ఉండొచ్చు!" అని మధ్యేమార్గపు ప్రతిపాదన చేశాడు.ఇది మరీ భవననిర్మాణం గురించి ఓ అంటే ఢం తెలియని వాడు మాత్రమే కుయ్యగలిగిన పోరంబోకు మాట!ఎందుకంటే, మొదటి తరంలో కట్టడం మొదలుపెట్టినవాడికి మొత్తం కట్టాలనే ఉద్దేశం లేకపోతే మొత్తం నిర్మాణాన్ని భరించడానికి తగిన పునాది వెయ్యడు!అతను ఒక్క అంతష్థుకి మాత్రమే పునాది వేసి ఉంటే తర్వాత వాళ్ళు దానిమీద కడుతూ పోతే అది కుంగిపోతుందే తప్ప ఇన్ని శతాబ్దాల పాటు నిలబడదు!ఈ కుతుబ్ మీనారు ఏ వ్యక్తి యొక్క విజయచిహ్నం అని చెబుతున్నారో ఆవ్యక్తియే అంత మామూలు కట్టడమైన  మసీదును ఏర్పరచినట్టు ఫలకం చెక్కించుకుని ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన ఖ్యాతిని దక్కించుకోవడానికి ఒక్క ఆధారమూ ఎందుకు చూపించుకోలేదు?మరీ వింత వాదన యేమిటంటే, మిగిలినవి హిందువులు నిర్మించిన ఆలయాలు అయి ఉండవచ్చును గానీ ఈ స్తంభం మాత్రం కుతుబుద్దీన్ కట్టించాడని!అంటే ఏమిటి?ఎప్పుడో ఈ ఆలయ సముదాయాన్ని నిర్మించిన హిందువులు ముందెప్పుడో కుతుబుద్దీన్ ఐబక్ వచ్చి ఒక విజయస్తంభం కట్టుకునే ఖాళీని మాత్రం ఉంచి కట్టారా?ఏం తెలివి!ఏం తెలివి!

          అసలు దీనిని Qutb-Minar అని పిలవడమే క్రీ.శ 1800 తర్వాత నుంచే మొదలైంది,అంతకు ముందర జరిగిన యే చారిత్రక సాహిత్యంలోనూ ఈ పేరు కనబడటం లేదు. అరబిక్ భాషలో 'Qutub' అంటే ‘axis’/‘pivot’/‘pole’ అని అర్ధం!మొదట ఈ పేరుని సుల్తానుకు చెప్పినవాళ్ళు సరిగ్గానే చెప్పారు astronomical Tower అని, అప్పటి అధికారికమైన ఉత్తర ప్రత్యుత్తరాలలో కూడా అదే అర్ధంతో వాడారు.తర్వాత దీనికీ కుతుబుద్దీనుకీ సంబంధం కలపాల్సిన అవసరం కోసం ఆధునిక కాలంలోని అధికార వ్యామోహ పీడితులైన ప్రభుత్వాధినేతలూ హిందూవ్యతిరేక భావజాలపు చరిత్రకారులూ ఈ నామసారూప్యాన్ని తమ వాదనకు అనుకూలంగా వాడేసుకున్నారు - అదీ సంగతి, ఎవరూ పుట్టించకుండా చరిత్ర ఎట్లా పుడుతుందిస్మీ!

          కుతుబ్ మినార్ అసలు పేరు ధృవస్తంభం,ధృవుడికి ధృవత్వాన్ని ప్రసాదించిన విషువు కీర్తిని వ్యాపింపజేసేది కాబట్టి విష్ణుధ్వజం అని కూడా పిలుస్తారు.ఈ స్తంబమూ భవన సముదాయమూ ఉన్న ప్రాంతం పేరు మెహ్రౌలి - అది మిహిరవలి అనే సంస్కృత పదానికి ప్రాకృత రూపం.క్రీ.శ 5వ శతాబ్దికి చెందిన చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడైన వరాహ మిహిరాచార్యుడు ఖగోళ పరిశోధనల కోసం ఇక్కడ నివసించడం వల్ల ఈ ప్రాంతానికి  ఆ పేరు వచ్చింది!
          కుతుబుద్దీన్ తను 27  హిందూ ఆలయాల్ని కూలగొట్టానని మాత్రమే చెప్పుకున్నాడు గానీ దేన్నీ కట్టానని చెప్పుకోలేదు.ఆ 27 అనేది ఆర్యరుషులు కాలగణనం కోసం సిద్ధాంతీకరించిన 27 నక్సత్ర మండలాలకు సంకేతం.ఒక్కొక్క నక్షత్రరాశికి ఒక్కొక్క ఆలయాన్ని వాటి అధిదేవతామూర్తులతో సహా సపేక్షమైన స్థానలను నిర్దేశించుకుని నిర్మించి ఉంటారు.ఈ ధృవస్తంభం పైనుంచి చూస్తే 24 దళాల విప్పారిన పద్మంలా కనిపిస్తుంది.

          ఒక్కొక్క దళమూ ఒక్కొక్క గంటకు సూచన.స్తంభం ఏడు అంతస్థులూ వారానికి ఉన్న ఏడు రోజులకి సంకేతం.ఇప్పుడు ఆరవ ఆంతస్థు స్తంభం మీద లేదు - ఈ ఆవరణలోనే మరొక చోట నిలబడి ఉంది బోన్సాయ్ చెట్టులా!కుతుబుద్దీన్ ఐబక్ తను కట్టిన విజయస్తంభంలో ఆరవ అంతస్థుని తనే కూల్చుకున్నాడు కాబోలు!ఏడవ భాగంలో చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం ఉంది - ముస్లిములు కట్టిన కట్టడంలోకి హిందువుల బ్రహ్మదేవుడు ఎట్లా వచ్చాడు?

          ఎటువైపు నుంచి ఎటువైపుకి తిప్పి చూసినా ఈ స్తంభమూ ఆలయ సముదాయమూ ముందొకటీ తర్వాతొకటీ కట్టినవి కావనీ  మొదట కట్టేనాడు గీసుకున్న ప్లానులో అన్నీ ఉన్నాయని తెలుస్తున్నది.అసలు వీటితో ఏ సంబంధమూ లేదనిపించే తుప్పు పట్టని ఇనుప స్తంభం ఈ ధృవస్తంభం గురించి చాలా విషయాలు చెప్తూ తన గురించి మాత్రం చెప్పుకోలేదు - ఎందుకనో!బ్రాహ్మీ లిపిలో సంస్కృత భాషలో రచించబడిన అక్కడున్న శాసనఫలకం మీద గల వివరాల ప్రకారం విష్ణుపాదగిరి అనే పర్వతం మీద శయనభంగిమలో ఉన్న శ్రీమహావిష్ణువు యొక్క ప్రధాన ఆలయం గురించి చెబుతున్నది గానీ 27 మంటపాల్తో కూడిన గ్రహవేధశాల  గురించి చెప్పడం లేదు.ప్రస్తుతం శయన భంగిమలో విష్ణువు కౌలువు దీరిన ఆలయాలు అన్నీ దక్షిణాదిలోనే ఉన్నాయి.ఇది ఇది క్షేమంగా ఉండి ఉంటే ఉత్తర భారతపు శ్రీరంగం వలె ఖ్యాతిని గడించేది!

          స్తంభాలు నిలబెట్టడం భవనాలని నిర్మించదం ఇటుకలూ రాళ్ళూ సున్నమూ గిన్నమూ డబ్బూ దన్నూ శిల్పులూ పనివాళ్ళూ ఉంటే ఎవరయినా చెయ్యవచ్చు గనక మిగిలిన వాటిని ముస్లిములకి దఖలు పర్చేశారు గానీ ఈ తుప్పు పట్టని ఇనుప స్తంభాన్ని ఎట్లా అంటు కట్టగలరు?కాపీ/పేస్టు/జంబుల్/రీనేమ్ కళాప్రవీణుడైన ముహమ్మద్ ప్రవక్త గారు తల్లి గర్భంలో రెండేళ్ళు ముసుగుదన్ని పడుక్కోవటం లాంటి అసంగతాలని సుసంగతాలు చెయ్యడానికి పనికొచ్చిన ఇస్లామిక్ సైన్సులో ఇలాంటివి లేవేమిటి!కానీ ప్రాచీన భారతీయుల లోహవిజ్ఞానశాస్త్రంలో వజ్రసంఘాత అనే మిశ్రలోహాన్ని తయారు చేసే ఒక ప్రక్రియ గ్రురించిన ప్రస్తావన  ఉన్నది - ఆ ప్రక్రియని గురించి పరిశోధించి ఆ విధానం పాటించితే ఇప్పుడు కూడా తుప్పు పట్టని ఇనుప స్తంభాన్ని నిర్మించవచ్చును!

          బహుశా ఈ ఇనుప స్తంభాన్ని వర్షాకాలంలో అంత ఎత్తున ఉన్న ధృవస్తంభం మీద ఉండి పరిశోధనలు చేస్తున్నప్పుడు విద్యుదాఘాతానికి లోను కాకుండా నిర్మించి ఉండాలి - అంతకు మించి ఈ ఇనుప స్తంభం ఇక్కడ ఉండటానికి మరొక కారణం నాకు కనపడటం లేదు!అన్నట్టు కుతుబ్ మినార్ పేరు ధృవస్తంభం అయితే దీని పేరు గరుడస్తంభం - ఈ పేరు కూడా దీని ప్రయోజనమైన రక్షణ గురించి తెలియజేస్తున్నది.

          ఈ గరుడస్తంభం దగ్గిర ఉన్న శాసనం కట్టిన కాలం గురించి మనం చెపుకుంటున్నట్టు క్రీ.శ 312 అని గానీ క్రీ,పూ 312 అని గానీ చెప్పడం లేదు.దీనిని నిర్మిణిన ప్రబువు పేరుని చంద్ర అని మాత్రమే వ్యవహరిస్తున్నది.అయితే,అతని రాజ్యవిస్తృతిని గురించి ఇప్పటి భారతదేశం మొత్తాన్నీ జయించటంతో పాటు దక్షిణ తీరపు సముద్రాన్ని కూడా జయించాడని చెప్తున్నది.ఆధునిక చరిత్రకారులు వాస్తవవ్యక్తులని ఒప్పుకున్న ఇద్దరు చంద్రులకీ ఈ వర్ణన సరిపోవటం లేదు.ఎందుకంటే, Chandra Gupta Vikramaditya (State period 380-414 AD)  గానీ   Chandragupta Maurya (reign: 321–297 BCE) గానీ దేశపు కొసని తాకనే లేదు - ఒక రాజు తను జయించని ప్రాంతాన్ని జయించినట్టు ప్రకటించుకుని బహిరంగ ప్రకటన చేస్తే సమకాలికులు అభ్యంతరం వ్యక్తం చెయ్యకుండా ఉండలేరు కదా!

          శాసనంలో పేర్కొనబడిన చంద్ర నామధేయుడైన ప్రభువును గురించిన మరొక ముఖ్యమైన విషయాన్ని అసలు పట్టించుకోనే లేదు. ఆ భాగం ఇది:"He(Chandra) as if wearied, has abondoned this world, and restored in actual form to the other world - a place won by the merit of his deeds - (and thought) he ha departed,he remains on earth through the memory of the fame(keerti)."కాల్పనిక వ్యక్తి కాదు,వాస్తవ వ్యక్తియే అని గనక ఒప్పుకుంటే ఈ మొత్తం వివరాలు త్రేతాయుగం నాడు అయోధ్యను పరిపాలించిన శ్రీరామచంద్రునికి మాత్రమే సరిపోతాయి - బూమి మీద అన్ని ప్రాంతాలనీ ఇక్ష్వాకులు జయించారు,శ్రీరాముడు సమౌద్రం దాటి శ్రీలంకని జయించాడు,పిండోదకాలు స్వీకరించే మర్త్యులకు సహజమైన మృత్యువుని అనుభవించకుండా సశరీరుడై కైవల్యం చేరాడు - వాల్మీకి సరయూ నదీ ప్రవేశం ద్వారా వైకుంఠం చేరాడని చెబితే పద్మపురాణం దివ్యవిమానం ఎక్కి పరలోకాన్ని చేరుకున్నట్టు చెబుతున్నది!

extended kingdom of chandragupta maurya 
extended kindom of chandragupta vikrama

          మెహ్రౌలి పేరు వల్ల వరాహమిహిరుడు అక్కడ నివాసం ఏర్పరచుకుని పరిశోధనలు చేసినట్టు తెలుస్తున్నది గానీ అప్పటి చంద్రగుప్తుడు నిర్మించిన వివరాలు కనపడటం లేదు - శాసనంలోని వివరాలు అతనికి సరిపోవటమే లేదు. బైబిలులో సృష్టి జరిగిందని చెబుతున్న కాలానికి ముందరి వ్యక్తులని చారిత్రక వ్యక్తులుగా గుర్తించని అహంకారం ఆంగ్లేయులది అయితే మరి వాళ్ళు రాసిన చరిత్రనే పరమసత్యం అని నమ్మి ఇతర్లకి చెబుతున్న భారతీయ మేధావులది బానిసత్వం కాదూ!


          ఆర్కియాలజిస్టులూ హిస్టోరియన్లూ ఇక్కడ ఈ స్తంభం ఎందుకు కట్టారో తెలియక అడిగితే తడుముకోకుండా "వూరికే అలంకరణ కోసం అలా నిలబెట్టారు, అంతే!" అని తేల్చి చెప్పేశారు గానీ ఏ కాలంలో కట్టినప్పటికీ కారణం లేని కట్టడాల్ని కట్టడానికి అంత దబ్బు ఎవడూ తగలెయ్యడు గదా!మీదుమిక్కిలి ప్రాచీన కాలపు ప్రతి నిర్మాణంలోనూ ఒక ప్రణాళికాబద్ధమైన నిర్మితీ ప్రతి చిన్న శిల్పం వెనకనూ ఎంతో అంతరార్ధమూ ఉండటం గమనించవచ్చునే!అడిగిన వాడికి సరైన జవాబు చెప్పాలంటే మొదట చరిత్రకారుడు తనకు తనే సరైన ప్రశ్న వేసుకోవాలి,జవాబు సరైనదని తేల్చుకెవటానికి తన పార్టీకి సంబంధించిన ఎజెండాని జనం మీద రుద్దాలనే కక్కుర్తి కాక సత్యం పట్ల నిబద్ధత కావాలి - ఆ రెండూ లేనివాళ్లు చరిత్ర రచన చెయ్యడం వల్లనే దోపిడీ దారులు ధర్మప్రభువులుగా చలామణీ అవుతున్నారు!

          ఇక్కడున్న సంపదను కొల్లగొట్టటానికి వచ్చినవాళ్ళకి ఇక్కడి సంస్కృతి మీద గౌరవం లేకపోవటం సహజమే,తమ మతాన్ని అంగీకరించనివాళ్ళకి కాఫిర్లని పేరుపెట్తి వాళ్లతోర్ యుద్ధం చేసి చంపెయ్యమనీ ఒక ప్రాంతం ముస్లిముల అధీనం లోకి వచ్చాక అంతకు ముందు సాతాను మాయలో పడినవాళ్లు కట్టిన కట్టడాల్ని నిర్మూఇంచమనీ ఆ మతగ్రంధంలోనే ఉంది గాబట్టి కుతుబుద్దీన్ చేసిన దానిని కూడా మతనిష్ఠ కింద సమర్ధించవచ్చు, కానీ ఒక ముస్లిం మేధావియే అన్ని సాక్ష్యాధారాలను చూపించి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం కట్టడం కావడానికి వీల్లేదని తేల్చి చెప్పిన తర్వాత కూడా ఒక హిందూ ఆలయ సముదాయాన్ని కూల్చినవాళకి దానిని విజయస్తంభం పేరున దఖలు పర్చటానికి నడుం బిగించి ఇన్ని అబద్ధాలతో చరిత్రని నిర్మించినవాళ్లని ఎలా సమర్ధించాలి?ఇవ్వాళ కుతుబుద్దీన్ తను కట్టానని ప్రకటించుకున్న Quwwat-ul-Islam యొక్క entrance Minaret తూర్పు వైపుకు బదులు ఉత్తరం వైపుకు ఎందుకు ఉన్నది?మెడమీద తలకాయ ఉన్న ముస్లిం ఎవడూ ప్లాను గీసి మసీదు కట్టాలనుకుంటే అలా కట్టడు - అది అంతకు ముందు ఉన్న హిందూ నిర్మాణానికి గుమ్మటం అతికించీ స్తంభాల్ని బోడి చేసీ గోడల మీద బొమ్మల్ని పీకి అరబిక్ అక్షరాలు ఇరికించీ పిచ్చిజనం ముఖాన పడేసిన మసీదు అది!విదేశీయుల మీద పోరాడి స్వతంత్రం తెచ్చిన దేశభక్తాగ్రేసరులు ఈ దేశపు చరిత్రకి విదేశీయుల కన్న ఎక్కువ ద్రోహం ఎందుకు చేశారు?

          240 అడుగుల ఎత్తు ఉండి ఎక్కటానికీ దిగటానికీ 45 నిమిషాలు పట్టే స్తంభాన్ని ఆ పని రోజుకు 5 సార్లు చెయ్యాల్సిన మువజ్జిను టవరు అని చెప్పినవాడు చరిత్రకారుడా?అంత పెద్ద స్తంభాన్ని నిర్మించటానికి పునాదులు తవ్వడం గురించిన పరిజ్ఞానం కూదా లేకుండా ఒక్కొక్కడూ ఒక్కో తరంలో ఒక్కో అంతస్థు కట్టాడని తీర్మానించినవాడు ఆర్కియాలజిస్టా?"ఏది నిజం?ఏది అబద్ధం?" అని అడుగుతున్నవాళ్ళని "హిందూమతత్వవాదులు" అని ముద్ర వేస్తున్న సెక్యులరిష్టు మేధావులు నోటికి తింటున్నది అన్నమా?గడ్డియా?అశుద్ధమా?ఇవన్నీ అబద్ధాలని ప్రకటించి కుతుబ్ మినారుకి ధృవస్తంభం పేరుని ఖాయం చేసి నిజమైన చరిత్రని పాఠ్యపుస్తకాల్లోకి యెక్కించటానికి ఎంత సమయం కావాలి మీకు - సంవత్సరమా?దశాబ్దమా?శతాబ్దమా?సహస్రాబ్దమా?

          ఇనుప స్తంభం తుప్పు పట్టకపోవటానికి కారణమైన వజ్రసంఘాత గురించి చదవగానే నాకు ఎంత సంతోషం అనిపించిందో - ఆ ప్రక్రియని ఉపయోగించి ఇప్పుడు ప్రజలకి ఎంత మేలు చెయ్యవచ్చు!ఉక్కు కన్న ఇనుము చాలా చవక, కానీ ఎక్కువ కాలం మన్నదు.టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో మనకన్న ముందున్న చైనాలోనే ఎంతో ఘనంగా కట్టిన ఒక ఇనపవంతెన 80 యేళ్ళు గడవకముందే పనికిరాకుండా పోయింది!కానీ హిందువుల కట్టడాల్ని ముస్లిములకి దఖలు పర్చటానికి ఇంత కక్కుర్తిని చూపించేవాళ్ళకి అంత మంచి ఆలోచనలు వస్తాయా - మన పిచ్చి గానీ! 

          Every Hindu must Demand to know the real History of this country and It's culture!Every Hindus must reclaim all temples and monuments that were plundered, demolished, distorted and destroyed by foreign invaders.Indian Government must remove all forms of glorification of emperors, rulers, and invaders who were involved in rape, barbaric murder, brutality, perversion and merciless killings.All textbooks and official records must be re-edited and published to include the Hindu indigenous history, culture, tradition, claims and evidence over these ancient monuments.Government notices, plaques, guidebooks and maps must be amended to include Hindu evidence over these monuments, including those at tourist spots across India as well.

          హిందువులు మొదటిసారి శ్రీరాముడు నిర్మించిన విష్ణుపాదగిరి క్షేత్రాన్ని ధ్వంసం చేసి Quwwat-ul-Islam మసీదును కట్టిన విదేశీయుడైన కుతుబుద్దీన్ మోసానికి గురయ్యారు, రెండవసారి దేశపు సంపదని దోచుకుని హిందూ ఆలయాల్ని కూల్చినవాళ్లని విజేతలుగా కీర్తించిన స్వదేశీయులైన కాంగ్రెసువాళ్ళ మోసానికి గురయ్యారు, మూడవసారి రామాలయం కడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ వూసే యెత్తని భాజపా వాళ్ళ చేతుల్లో కూడా మోసపోతున్నారు - ఇన్నిసార్లు మోసపోయేవాళ్ళని రక్షించడానికి ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని చెప్పిన గీతాచార్యుడికి కూడా మనస్కరించదనేది జాతుల ఉత్ధాన పతనాల్ని పరిశీలించిన వారికి తెలిసే కనీసపు నిష్ఠుర సత్యం!ఏది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమో అదే సుందరమైనదీ అవుతుంది!సత్యం శివం సుందరం!!!

15 comments:

 1. nice article and content
  https://goo.gl/Ag4XhH
  plz watch our channel

  ReplyDelete
 2. నిజమే మీరు చెప్పినది.గుడి అనే గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో గుళ్ళ కి మెట్లు దిగి ఎలా వెళ్తామో అలాగే ఉంటుంది. వెళ్లొచ్చి చూసి చెబుతున్నాను. గుడి ప్రాంగణంలో సమాధి ఏంటో అర్ధం కాదు. సరిగ్గా చూస్తే, తలవిరిగిన నంది కూడా ఉంటుంది. ఉన్న చరిత్రని చెప్పుకోవడానికి సిగ్గు పడతాము మనము. అదేంటో అర్ధం కాదు

  ReplyDelete
 3. మంచి విశ్లేషణ చేసారు హరిబాబు గారు... హిందువుల బ్రతుకులు ఎందుకిలా తెల్లారిపోతున్నాయో అర్ధం కావడం లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా అందరిచేతిలో మోసపోతూనే ఉన్నారు. చివరికి ఇప్పుడు కూడా ఏదో ఉద్దరిస్తాడనుకుని అధికారం అప్పగిస్తే కబుర్లు తప్ప హిందువులకేమీ ఒరిగింది లేదు. ఇది నిష్టుర సత్యం అయినా నమ్మక తప్పదు.

  ReplyDelete
 4. good content
  https://youtu.be/2uZRoa1eziA
  plz watch our channel

  ReplyDelete
 5. నాకొక విషయం చెప్పండి. మీరు ఇంతకు ముందు ఒక వ్యాసం లోనో లేక కామెంట్ లోనో దాదాపు ఇలాంటి ఆధారాలే ఉన్న తాజ్ మహల్ ని తేజోమహాలయ కాదని వాదించినట్టు గుర్తు. దానిమీద కూడా చాలా హిందూ చిహ్నాలున్నాయని తేజోమహాలయ అనుకూలురు వాదిస్తారు.

  ReplyDelete
  Replies
  1. ప్రాచీన కాలపు ప్రతి హిందూ ఆలయం యొక్క ప్రసక్తీ అష్టాదశ పురాణాలలో ఎక్కడో అక్కడ ఉంటుంది.ఆగిరిపల్లి వ్యాఘ్రలక్ష్మీనృసిమ్హస్వామి ఆలయం గురించి కూడా ఉందని స్థలపురాణం చెబుతుంది.ఆలయం నిజంగానే ప్రాచీన కాలం నుండి ఉండటం వల్ల గానీ ఆలయం కట్టిన తర్వాత పురాణాలలోకి ఎక్కించటం వల్ల గానీ - ఏది ఎలా జరిగినా మారుమూలన ఉన్నాయని అనుకునే ఆలయాలకి కూడా ప్రస్తావనలు ఉంటున్నాయి.అలాంటిది తేజోమహాలయ అనేదానికి దానిని తాజమహల్ హిందూ ఆలయం అనే వాదన పైకి రావడానికి ముందు దీని గురించిన అలికిడి లేదు.

   మీరు ఒకటి తెలుసుకోవాలి.నేను మక్కా లోని కాబా శివాలయం అనడానికి ఇస్తాంబుల్ లైబ్రరీలో ఉన్న కితాబ్-ఇల్-కుల్ -బుల్-కుల్-హల్-చల్ లాంటి నిక్కచ్చి ఆధారాలు ఉన్నాయి.లోపలి గోడ మీద ఉన్న బంగారు పళ్ళెం మీద క్రీ.శ 1వ శతాబ్ది కాలంలొ ఉజ్జయినిని పరిపాలించిన రాజు దాన్ని కట్టాడనే సాక్ష్యం ఉంది గనకనే నమ్ముతున్నానునేను వీలున్నంతవరకు హేతువునే నమ్ముతాను.

   సనాతనధర్మాన్ని అర్దం చేసుకోవడం చాలా కష్టం.ఉదాహరణకి శంబూకుడి కధ రాముడు తల నరికి చంపడం వరకే మనకి తెలుసు.దానిని బ్రాహ్మణులకి దుర్మార్గాన్ని అంటగట్టటానికీ రాముడికి బ్రాహ్మలు ఏది చెప్తే అది చెయ్యటం తప్ప స్వతంత్రబుద్ధి లేదనీ తప్పులు పట్టటానికీ ఉపయోగించుకుంటున్నారు.కానీ ఆ కధకి అది ముగింపు కాదు.మరణానంతరం తేజోరూపం ధరించిన శంబూకుడు ధర్మసూక్ష్మం తెలియక అధర్మం చేశాను,నిజమే.కానీ చేసిన తపస్సు నిష్ఠగానే చేశాను.దాని ఫలితం ఏమిటి అని అడిగితే అతన్ని అర్చామూర్తిని చేసి ఆలయాన్ని నిర్మించాడు శ్రీరాముడు. ఏనుగుల వీరాస్వామయ్య గారు తన కాశీయాత్ర విశేషాల్లో తను ఆ గుడిని గురించిన వివరాల్ని చెప్పారు!

   తాజమహల్ - తేజోమహాలయ అనే ప్రస్తావన ఎప్పుడు మొదలైంది?ఇంగ్లీషువాళ్ళ కాలంలో గానీ మొఘలుల కాలంలో గానీ అసలు ఇస్లాం అనేది పుట్టని కాలంలో గానీ భారతీయ సాహిత్యంలోనే దాని గురించిన ప్రస్తావనలు ఎక్కడ ఉన్నాయి?కుతుబ్ మీనారు లోని మసీదు ఇండియాలో తొలి మసీదు అని వాళ్లే చెబుతున్నారు.అంతకుముందు ఎవరు ఉన్నారు ఇక్కడ?మహాజనపదాల కాలంలో పురాణాలు లేవా?బుద్ధుడి కాలంలో పురాణాలు లేవా?

   "ఏ వాస్తుని బట్టీ ఏ నిర్మాణాన్ని బట్టీ తాజమహల్ తేజోమహాలయ అనే శివాలయం కూల్చి కట్టినది అంటున్నారో అదే గుమ్మటాల అమరికా,అదే మీనార్ల అమరికా బాబరు సమాధికీ హుమాయూన్ సమాధికీ ఉన్నాయి కదా,మరి అవి యే శివాలయాల్ని కూల్చి కట్టారని అనుకోవాలి?" - ఇదే నేను తాజమహల్ తేజోమహాలయం అని వాదంచేవారిని అడుగుతున్న ప్రశ్న.నేను హిందువుని అని చెప్పుకునే ప్రతివాడూ సాటి హిందువుల్లో ఎవరు ఏది చెప్పినా నమ్మాల్సిన పని లేదు కదా!


   అవి సమాధులు అని తక్కువ చేసి అవమానించకూడదు.చనిపోయిన వారిపట్ల గౌరవం ఉండబట్టే కదా మనమూ తర్పణాలు వదిలి పిండప్రదానాలు చెస్తున్నది!ప్రధానమంత్రులూ విదేశీ ప్రముఖులూ రాజ్ ఘాట్ ఎందుకు వెళ్తున్నారు?ఆ సమాధి మీద పూలు ఉంచకపోతే ముద్ద దిగదా?నేను ఇక్కడే కాదు,యూట్యూబు దగ్గిర Quora Digest దగ్గిరా కూడా చర్చల్లో పాల్గొంటున్నాను.హిందూమతం గురించి ఎక్కడ తప్పుడు మాట వచ్చినా వదలడం లేదు,అంతమాత్రాన అన్నిట్నీ ఒప్పుకోవాలని లేదు.

   నాకు మాత్రం ఈ తాజమహల్ - తేజోమహాలయ అనేది గందరగోళంగానే ఉంది.నా అనుమానాల్ని కొట్టిపారెయ్యగలిగిన గట్టి ఆధారాలు దొరికితే ఒప్పుకోవడానికి నాకు అభ్యంతరం లేదు.కానీ ప్రస్తుతానికి చూపిస్తున్న ఆధారాలలో మాత్రం గట్టిదనం లేదు.

   ఓక్ మహాశయుడికి వాటికన్ కూడా శివాలయం లాగే కనిపిస్తున్నది!ఇతరుల కన్న మనం ముందు నేర్చుకోవడం వల్ల కొన్ని విషయాల్లో ప్రజ్ఞని చూపించడం నిజమే గానీ అసలు ఇతరులకి ఏమీ తెలియదు అనడం మాత్రం తెలివైన మాట కాదు.

   P.S:దారా షికో గురిబంచి ఒక పోష్టు వెయ్యడానికి మొఘలుల గురించి పరిశోధన చేస్తున్నాను.దాని ప్రకారం మొఘలుల గురించి కొన్ని కొత్త విశేషాలు తెలిశాయి.మొఘలులు తప్ప మిగిలిన సుల్తానులు అప్పుడున్న ఖలీఫా తరపున ఇస్లామిక్ రాజ్యం నడిపారు.వీళ్ళు మాత్రం బాబరు కాలం నుంచి స్వతంత్రంగానే పరిపాలించారు.ఒక్క ఔరంగజేబు తప్ప బాబరు దగ్గిర్నుంచి షాజహాను వరకు ఇస్లాముకి విధేయులై పరిపాలించినట్టు కనబడదు.బాబరు పెద్ద విలాసపురుషుడు.తినడం,తాగడం అంతా ఇస్లాములో చెప్పేవాటికి విరుద్ధం - మతనిష్ఠ చాలా తక్కువ!ఇక అక్బర్ దీన్-ఇ-లాహి కనిపెట్టింది ఇస్లాము అసలు నచ్చకనే!షాజహాన్ చివరి శ్వాస వరకు ఇస్లామిక్ చాందసుడని పేరుపడిన ఔరంగజేబు కన్న హిందూమతం పట్ల విపరీత స్థాయిలో అభిమానం పెంచుకున్న దారా షికోనే ఎక్కువ అభిమానించాడు.ఔరంగజేబు ఢిల్లీలోనే ఉంటే దారాకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తాడని దక్షిణాదికి తరిమేశాడు.వస్తుతః ఇస్లాము పట్ల మూర్ఖమయిన అభిమానం లేకుండా హిందువులతో సామరస్యాన్ని కోరుకున్నవాళ్ళని కూడా అనుమానించడం దేనికి?

   Delete

  2. హరి బాబు గారు,

   ఈ పుస్తకాన్ని చదివి చూడండి. మీకు కొన్ని ఆధారాలు లభించ వచ్చు కుతుబ్ మీనారు గురించి.

   The Travels of Ibn Battuta

   Year 1325-1354 A.D.

   https://archive.org/stream/in.ernet.dli.2015.62617/2015.62617.Ibn-Battuta-Travels-In-Asia-And-Africa-1325-1354#page/n9/mode/2up


   జిలేబి

   Delete
 6. హరిబాబు గారు, మీరొక చోట టిటిడి ప్రచూరణలో వేదాల గురించి ఉంది. అది చదవండి అని ఒక వ్యాఖ్యలో రాశారు. ఆ పుస్తకం పేరు, ఎవరు రాశారో చెపుతారా? ఈ మధ్య నేను బ్లాగుల వైపుకు రావటం తగ్గిపోయింది అందువలన గుర్తుకు రావటంలేదు.

  ReplyDelete
  Replies
  1. అసలు పుస్తకం నేనూ చూడలేదు.ఋగ్వేదసంహిత పూర్తి పాఠం టీటీడీ ప్రచురణలలో ఉంది అని మరొకరు చెబితే చదివాను.ఈసారి తిరపతి వెళ్ళినప్పుడు చూడాలి.వెళ్తే మీరైనా వెతకవచ్చు.

   Delete
  2. మీరంటున్నది దీన్ని గురించా? టి. టి.డి. వారి ప్రచురణలలో “చతుర్వేద సంహిత” అనే పుస్తకం కనిపించింది. ఈ క్రింది లింక్ లో చూడవచ్చు..

   http://ebooks.tirumala.org/Product/?ID=882

   Delete
 7. మీరు నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి. నాకు మీవాల్ పై న ఆ ఆప్షన్ కనపడటంలేదు. అందువలన పెట్టలేకపోతున్నాను.

  ReplyDelete
  Replies
  1. I tried it, but unable to do it! I think I need to change settings through admin panel. I am ignorant about these facebook settings and wordpress settings of my big.

   Delete
  2. Now it is working fine. I am receiving your posts in FB

   Delete
 8. Danny :

  భారత మెజార్టీ సామాజికవర్గంలోని భిన్న అంతస్తులు మతవిమర్శపై తమదైన శైలిలో స్పందిస్తాయి. మొదటిది; ఏ అంతస్తులో వున్నవారైనా సరే మత ఔన్నత్యాన్ని చాటినపుడు అంతస్తులన్నీ గొప్పగా ఆస్వాదిస్తాయి. రెండోది; పై అంతస్తులో వున్నవాళ్ళు ఎవరయినా మతాన్ని విమర్శించినపుడు వాళ్ళు నిరాకరించరు పైగా ఆదరిస్తారు. తమ సమూహం ప్రజాస్వామికమైనదని చెప్పుకోవడానికి అదొక అవకాశంగా భావిస్తారు. మూడోది, దిగువ అంతస్తుల్లో వున్నవాళ్ళు మతాన్ని విమర్శించినపుడు పై అంతస్తుల్లో వున్నవాళ్ళు అసౌకర్యంగా భావిస్తారు. నాలుగోది; ఇతర మతస్తులు తమ మతాన్ని విమర్శించినపుడు అన్ని అంతస్తులవాళ్ళూ అసహనాన్ని ప్రర్శిస్తారు.

  ReplyDelete
  Replies
  1. hari.S.babu
   This is not a peculiar phenomena limited to the land india and the religion hinduism.I think the statememt comes from yazdani,a muslim blogger, am I right?

   he is twisting the fact which is applicable even for christians and to some extent for liberal muslims into which he is narrowing it to only hindus or indians.

   ఒక క్రైస్తవ మతాభిమాని "మీరు ఎవరినయితే డబ్బులు పంపించి ఇండియాలో మతం మారుస్తున్నారని తిడుతున్నారో,అక్కడ వాళ్ళు క్రైస్తవం మీద వస్తున్న పరమ దుర్మార్గమైన విమర్శల్ని కూడా సహిస్తున్నారు - ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రోత్సహిస్తున్నారు!" అని చెప్పుకున్నాడు.దీని అర్ధం ఏమిటి?హిందువు, క్రైస్తవుడు, మహమ్మదీయుడు,భారతీయుడు,అమెరికన్,పాకిస్తానీ - ఇలా ఏ గ్రూపుని తీసుకున్నా ఒకే సమూహంలో ఒకే విషయానికి సంబంధించి అందరూ ఒకే స్థాయిలో ప్రతిస్పందించటం లేదు కదా!


   మరి ఈ డానీ గారు ఇలాంటి అంతస్థుల్ని హిందువులకీ మరియూ భారతీయులకీ మాత్రమే ఉన్నట్టు ఎందుకు విశ్లేషిస్తున్నాడు?

   Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు