Sunday, 17 December 2017

ద్వాదశ జ్యోతిర్లింగాలు అక్కడే ఎందుకు కట్టారు?తర్వాతెప్పుడో Fibonacci కనుక్కున్న విశేషం వాటిల్లో ఇమడ్చటం ఎట్లా సాధ్యపడింది!

     హిందువులని అవమానించటానికి తగులుకున్న ప్రతివాడూ మొదట యెత్తుకునే పాట రాళ్ళని పూజిస్తూ మూఢనమ్మకాల పుట్టల్లా బతుకుతున్నారని!"విగ్రహంలో దేవుడు ఉంటాడా?ఉన్నది ఒకే దేవుడైతే ఇంతమంది దేవుళ్లకి పూజ చెయ్యటం తప్పు కాదా?" అని పాట పాడుతారు పదే పదే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసడా అన్నట్టు.ముఖ్యంగా ఒకరు జాత్యహంకారంతోనూ ఒకరు యుద్ధోన్మాదంతోనూ వ్యాపించి సంఖ్యని పెంచుకుని విర్రవీగుతున్న క్రైస్తవ మహమ్మదీయ మతాల వారికీ శాస్త్రీయతా ఆధునికతా తమవద్దనే పోగుపడినట్టు పోజులు కొట్టే నాస్తిక మార్క్సీయ మేధావులకీ హిందువుల ఆలయాల్ని చూస్తే ఎంత అపహాస్యమో,అసహ్యమో!

     500 యేళ్ళ క్రితం మార్క్సిజమూ లేదు,1500 యేళ్ళ క్రితం ఇస్లామూ లేదు,3000 యేళ్ళ క్రితం క్రైస్తవమూ లేదు - నిన్న గాక మొన్న పుట్టిన మతాల వాళ్ళు సర్వజ్ఞుల మాదిరి రెచ్చిపోతున్నారు,వీళ్ళూ వీళ్ళ మతాలూ వీళ్ళ సైన్సులూ  పుట్టకముందే ప్రపంచ మానవాళికి జ్ఞానబోధ చేసి ఆయా జాతుల్ని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చిన సనాతన ధర్మం నిజమైన జ్ఞానులకి ఉండే వినయాన్ని చూపిస్తున్నది.తమ కోడిమెదళ్ళకి అర్ధం కానివన్నీ మూఢనమ్మకాలేనని అనుకుంటున్నవాళ్ళకి తెలియదు తమలోని శాస్త్రీయతకి కారణమని దేన్ని చెబుతున్నారో ఆ మోడ్రన్ సైన్సు వాడుతున్న గణీతశాస్త్రం ఇక్కడ వృద్ధి చేసినదేనని!

     సైన్సు యొక్క అర్ధం,పరమార్ధం తెలిస్తే ఆ సైన్సుని కాలుష్యాన్ని పెంచడానికీ అణ్వస్త్రాల్ని తయారుచెయ్యడానికీ ఎందుకు ఉపయోగిస్తారు?కార్లనీ విమానాల్నీ కనుక్కుంది మోడ్రన్ సైన్సు అనేవాళ్ళు వాటివల్ల వస్తున్న కాలుష్యానికి నివారణ చెప్పగలరా?సనాతనధర్మం వీటికి భిన్నం - క్షయం లేని వృద్ధిని మాత్రమే కోరుకుంటుంది, నేర్చుకుంటుంది, సాధిస్తుంది!మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించి క్షయం లేని వృద్ధిని సాధించుకోవడం కోసమే భారతీయ విజ్ఞానులు గణితం, భౌగోళికం, రసాయనం, వైద్యం వంటి ఎన్నో రంగాలలో గురుశిష్యపరంపరతో సహస్రాబ్దాలుగా కృషి చెసి ఇంకేదీ కొత్తగా కనుక్కోవాల్సీన అవసరం లేనంత జ్ఞనరాశిని పేర్చారు.

     వాళ్ళు కనుక్కున్నవాటిని వాడుకోవటం తెలియక ముప్పయ్యఏళ్ళకే బట్టతల,నలభయ్యేళ్ళకే గుండెజబ్బు,యాభై యేళ్ళకే రక్తపోటు అనే రోగాలమారి బతుకులు బతుకుతున్నాం - ఇదే గొప్ప అనుకుంటున్నాం.సృష్టిలో ఏదీ అనుకోకుండా,యాధాలాపంగా జరగదు - ప్రతిదాని వెనక ఒక లెక్క ఉంటుంది,ఆ లెక్క తెలియకపోవడం వల్లనే అది ర్యాండం అనుకుంటున్నాం.మన దేహాన్ని ఓకసారి గమనించండి.చేతి వేళ్ళకి మూడు కణుపులు ఉంటాయి.ఈ వేళ్ళు అతుక్కున్న చేతి నుంచి భుజం వరకు మూడు భాగాలు,ఈ భుజం అతుక్కున్న దేహానికి తల,పొట్ట ,కాళ్ళు అనే మూడు భాగాలు -- అంతా లెక్క ప్రకారమే ఉంది,ఈ లెక్కలు మన ప్రాచీనులకి ఎలా తెలిశాయో గానీ తెలిసిన విషయాలని ఉపయోగించుకుని ప్రశానతంగా జీవించారు.తమతోనే నాశనం చెయ్యకుండా తర్వాత తరాల వారికి అందించారు.వాళ్ళకి ఏమీ తెలియదని అనుకున్నవాడు అయితే పిచ్చివాడన్నా అవ్వాలి, లేదంటే మనుషులు ప్రశాంతజీవనం గడుపుతుంటే చూసి భరించలేని దుర్మ్మార్గుడైనా అవ్వాలి.

     Fibonacci (c. 1175 – c. 1250) అనే అతను ప్రకృతిలో ఒక వింత అమరికని చూశాడు.దానిని గమనించి ఒక గణితసూత్రాన్ని తయారు చేశాడు.మామూలుగా ఈ తరహా సీరియస్ విషయాలంటే బోరు కొట్టేవాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది అతను కనుక్కున్న విషయం.అంకెల్ని వరసగా పేర్చుకుంటూ వెళ్ళాలి,కండిషన్ ఏమిటీ అంటే మొదటి అంకె నుంచి చివరి అంకె వరకు ఎక్కడనుంచి మొదలుపెట్టి పక్కపక్కనే ఉన్న మూడు అంకెల్మి తీసుకున్నా మొదటి రెండు స్థానాల్లో ఉన్న అంకెల్ని కూడితే మూడో అంకె రావాలి = 0,1,1,2.3.5,8,13,21 ఇలా.చిత్రమేమిటంటే మొక్కలు కొత్త ఆకుల్ని పుట్టించుకోవడంలోనూ నత్తలు తమ గుల్లల్ని పెంచుకోవడంలోనూ ప్రకృతి ఈ వరసనే పాటిస్తున్నది.
     అబ్రహామిక్ మతాలైన ఈ తల్లి,పిల్ల మతాలు రెండూ దేవుడు మనిషిని మిగిలిన అన్ని జీవరాసుల కన్న అధికుణ్ణి చేసి ఈ సృష్టి మొత్తాన్ని అతను తినడానిక్కీ తాగడానికీ దోచుకోవడానికీ హక్కుభుక్తం ఇచ్చేశాడని చెబుతున్నాయి.ఈ మతాల ధోరణి యేమిటంటే - బోధించేవాళూ పాటించేవాళ్ళూ కూడా మొదట ఈ సృష్టి మొత్తానికి తనని కేంద్రంగా పెట్టుకుని తనవైపునుంచే చూస్తూ తమ స్వోత్కర్షతో "సృష్టిలో కల్లా మానవుడు గొప్పవాడు. మానవులలో కల్లా నేను గొప్పవాణ్ణి. నేను గొప్పవాణ్ణి కాబట్టి నేను పాటించే మతం, నేను తినే తిండీ, నేను తాగే ద్రవం అన్నీ గొప్పవే.నేను తప్ప ఇతరులు అధములు, అనాగరికులు, అణిచివేయదగినవాళ్ళు!" అనుకుంటూ ఉంటారు.

     ప్రపంచ మానవాళి చరిత్రలో సమస్త ప్రజల్ని ఒక్కలా ఉద్వేగానికి గురి చేసిన అద్భుతమైన సన్నివేశాల్ని లెక్కిస్తే  గత రెండు వేల యేళ్ళలో జరిగినవి చాలా తక్కువ - వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు!ఆ తక్కువలో తక్కువ సన్నివేశాల్లో భారతీయ మేధావుల ప్రమేయం ఉన్నది - జీవశాస్త్రంలో D.N.A రహస్యాన్ని విప్పి చెప్పినది హర గోవింద ఖురానా, బృహత్తారల విషయంలో వాటి పరిమాణం గురించి చెప్పినది చంద్రశేఖరన్, వైద్యశాస్త్రంలో మొండిరోగాల్ని నయం చెయ్యడం కోసం ఎన్నో కొత్త మందుల్ని కనిపెట్టినది ఎల్లాప్రగడ సుబ్బారావు, గాడ్ పార్టికిల్ అనే దానికి బోసాన్ అని పేరు పెట్టించుకున్న వ్యక్తి భారతీయుడే!డబ్బు సంపాదించడంలో ఏమన్నా వెనకబడ్డారా అంటే అదీ లేదు.ఇవ్వాళ ఉన్న రూపంలో ఒకే దేశంగా లేనప్పటికీ ప్రాంతం అనేదాన్ని ప్రమాణం చేసుకుని చూస్తే వాళ్ళు లెక్కలు వేసి చెప్పిన దాని ప్రకారమే క్రీ.శ 1వ శతాబ్దం నుంచి క్రీ.శ 17వ శతాబ్దం వరకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలూ కలిసి సృష్టించగలిగిన సంపదలో మూడో వంతు నుంచి నాలుగో వంతు సంపదని సృష్టించగలిగిన దమ్ము వీళ్ళది!

     ఎందులో వెనకబడ్డామని హిందువులు ఏడవాలి?ఏమి తప్పు చేశారని భారతీయులు సిగ్గు పడాలి?ఎన్నాళ్ళు బ్రాహ్మణుల ఆధిక్యత, దళితుల అణచివేత, హిందూమతం యొక్క క్రూరత్వం, అసహాయుల ఆక్రందన అంటూ సొల్లు కబుర్లు చెప్తారు?నిజమే, ఒకనాడు అస్పృశ్యత ఉంది,మనుస్మృతిలో దాన్ని సమర్ధించే శ్లోకాలు ఉన్నాయి.నా బ్లాగులోనూ వాటిని సాక్ష్యాలు చూపించి చెప్పాను.కానీ ఉందని చెప్పి బ్రాహ్మల్ని తిట్టటంతో సరిపెట్టుకోకుండా దానినుంచి బయటపడటానికి దళితులకి ఎన్నేళ్లు పడుతుంది?రిజర్వషన్ల మీద అంత ఆశపెట్టుకుని పోరాడి సాధించిన అంబేద్కర్ 1950లోనే "నా కెప్టెన్లు నన్ను మోసం చేశారు. రిజర్వేషన్లని నేను వూహించిన పద్ధతిలో ఉపయోగించుకోవటం లేదు, స్వార్ధపరులైపోయారు" అని కన్నీళ్ళు పెట్టుకున్న సన్నివేశం జరిగిందా లేదా?

     ఆ కెప్టెన్లు ఎవరు?వారు అంబేద్కరుని మోసం చెయ్యటానికి కూడా బ్రాహ్మణులే కారణమా?మాటిమాటికీ అంబేద్కరు నామం జపిస్తూ కొన్ని వేలయేళ్ళనాటి బ్రాహ్మణుల దుర్మార్గాల్ని కూడా కనిపెట్టి వెలికి తియ్య్యగలిగినవాళ్ళు నిన్న గాక మొన్న అంబెద్కర్ ఎవరి గురించి ఆ మాటలు అన్నాడో కనిపెట్టలేరా?ఎవడి స్వార్ధం వాడు చూసుకోవటానికి అణిచివేయబడిన కులాల నుంచి వచ్చిన దళిత మేధావులే అతీతులు కానప్పుడు బ్రాహ్మణుల్ని తప్పుపట్టి ప్రయోజనం ఏమిటి?

     ఒకానొకప్పుడు కులదోపిడీ జరిగింది,నిజమే!అయితే, ఆ కులదోపిడీ నుంచి బయటపడటానికి డా.అంబేద్కర్ వజ్రాయుధం కన్న బలమయిన ఆయుధమే ఇచ్చాడు,దాని శక్తిని తెలుసుకుని ఉపయోగించుకోవాల్సినవాళ్ళు సరైన తీరున ఉపయోగించుకుంటే కేవలం పదేళ్లు చాలు కులదోపిడీ నుంచి ఆయా కులాలు బయటపడటానికి!మరి, డెబ్బయ్యేళ్ళ తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్లు లేనిదే బతకలేని స్థితిలో ఎందుకు ఉన్నారు?అంబేద్కర్ ప్రతిపాదించిన రిజర్వేషన్లలో మొదటి భాగం అర్హతలు విద్యకైనా ఉద్యోగానికైనా ప్రాతినిధ్యానికైనా  అవసరమైన అర్హతలకి పెట్టుకున్న కొలబద్దకి అతి దగ్గిరగా వచ్చినవాళ్ళకి కొంచెం ప్రోత్సాహం కల్పించడమే తప్ప అర్హత ఏమాత్రం లేనివాళ్లని వెనకబడినకులం పేరుతో ముందుకు తొయ్యమని కాదు, అవునా?

     అదీ గాక అంబేద్కర్ చెప్పిన రెండో భాగం ప్రత్యేకించి వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లని అందుకుంటున్నవారికి - "ఈ రిజర్వేషన్ సౌకర్యం మీకు వ్యక్తిగత దరిద్రాన్ని వదిలించుకోవడానికి గాక మీ కులానికి సరయిన ప్రాతినిధ్యం ఉండటం కోసం కాబట్టి ఈ సౌకర్యాన్ని మీరు ఉపయోగించుకుని పైకి రావటంతో సరిపెట్టుకోకుండా మీ కులంలోని ఇతరులని కూడా మీలాగే ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించండి!" అని  నొక్కి చెప్పాడు, అవునా?మరి, ఇన్నేళ్లుగా ఆనాడు అంబేద్కర్ స్వయంగా ఆరోపణ చేసినట్టు కుక్షింభరులై తమ సొంత కులాలనే పట్టించుకోనివాళ్ళకి బ్రాహ్మణుల్ని తమ కులాలకి అన్యాయం చేశారని విమర్శించే హక్కు ఉందా!మరి, ఇవ్వాళ ఏ విధమయిన అస్పృశ్యతనీ అనుభవించని కాపులు వీళ్ళతో పోటీపడి వీళ్ళ వాటాని తగ్గించడానికి వస్తుంటే వాళ్లతో పోట్లాడి వీళ్ళ హక్కుల్ని రక్షించుకోవడానికి నోళ్ళు పెగలడం లేదు, కారణం ఏమిటి?నోరూ వాయీ లేని బ్రాహ్మణులే దొరికారు వీళ్ళకి - సిగ్గు లేకపోతే సరి.

     పొద్దున్న మంచం మీదనుంచి దిగితే రాత్రికి మళ్ళీ మంచం ఎక్కేవరకు ఏ పని చెయ్యాలన్నా ముందు కడుపులో నాలుగు ముద్దలు పడాలి,వయసులో చిన్నవాడివయితే అమ్మానాన్నలు పెడితే తినాలి.పెద్దవాడివయ్యాక నువ్వు తినడంతో పాటు అమ్మానాన్నలకి కూడా పెట్టాలి,అంటే మీ నాన్న కన్న ఒక మెట్టు పైకి వెళ్ళాలి.ఇవ్వాళ తినాల్సినదాన్ని నిన్ననే తెచ్చుకుని దాచుకోవాలి,అది కూడా తేరగా రాదు, వెతుక్కోవాలి,ఆ వెతుకులాట ఫలితం ఇవ్వాలంటే జ్ఞానం కావాలి,జ్ఞానం కావాలంటే గురువును వెతుక్కోవాలి.నీకు యేది కావాలో దాన్ని సాధించిపెట్టే గురువుని వెతుక్కోవాలి గానీ డబ్బులు సంపాదించుకోవటం కోసం ఆత్మవిద్య నేర్పే గురువు దగ్గిరికీ ఆత్మవిద్యని సాధించుకోవటం కోసం వ్యాపారస్తుడి దగ్గిరికీ వెళ్తే ఏమవుతుంది?

     గురువు దగ్గిరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆయనకి నమస్కరిస్తునావు,ఎందుకు?జ్ఞానంలో నీకన్న ఆధికుడు గనక,నేర్చుకోవాల్సిన అవసరం నీది గనక - మరి,జ్ఞానంలో అంతరువులు ఉన్నప్పుడు సమాజంలో ఉండవా!ఉంటాయి,ఉండి తీరుతాయి,అంతరాల్ని చెరిపేసి అందర్నీ సమానం చెయ్యడం అసాధ్యం.ఒక టీచరు ముప్పయి నలభయి మంది పిల్లలకి ఒకే పాఠాలు ఒకేలా చెప్పినా పరీక్షల్లో మొదటి మార్కు ఒక్కడికే వస్తుంది.ఎవరి జ్ఞానానికి ఏ స్థాయి సరిపడుతుందో తెలుసుకుని వారు ఆ స్థాయిని చేరుకోగలిగితే చాలు, జన్మలు ధన్యమైనట్లే!

     ఒకే రకం సమస్యకి ఏ ఇద్దరూ ఒకేలా స్పందించరు, ముగ్గురు మనుషులు మూడు రకాలుగా స్పందిస్తారు - ఒకడు ముందే తెల్లమొహం వేసి "దీన్ని పరిష్కరించడం ఎవడికీ సాధ్యం కాదు!" అని చెప్పి కూర్చుంటాడు - వీడు తామసుడు, ఒకడు కొంత ప్రయత్నించి చూసి "నాకే సాధ్యం కాలేదు గాబట్టి ఇంకెవడికీ సాధ్యం కాదు!" అని చెప్పి కూర్చుంటాడు - వీడు రాజసుడు, ఒకడు సమస్య రావడం ఎలా వచ్చినా దాన్ని పరిష్కరించటానికి ఇప్పటి తన జ్ఞానపరిధి చాలకపోవటమే అసలు కీలకం అని తెలుసుకుని తన జ్ఞానాన్ని పెంచుకుని సమస్యని పరిష్కరిస్తాడు.అప్పుడు ఇతర్లకి పనికి వస్తుందని తన అనుభవాన్ని గ్రంధస్థం చేస్తాడు - ఎప్పుడు మొదలైందో తెలియని సనాతన ధార్మిక సాహిత్య సృష్టి ఇలాగే జరిగింది!

     సనాతన ధార్మికుల విజయరహస్యం గణితశాస్త్రంలో అఖండమైన ప్రజ్ఞని సాధించటమే!"ఇక్కడ లేనిది ఎక్కడా లేదు,అక్కడ ఉన్నది ఇక్కడా ఉన్నది!" అని చెప్పి ఒప్పించగలిగిన స్థాయిలో జ్ఞానం వృద్ధి పొందటానికి వీరి గణితశాస్త్ర ప్రతిభయే కారణం.
     ఇది ఇప్పుడు బయటపడిన శిధిలాలను బట్టి సైంటిస్టులూ ఆర్టిస్టులూ కలిసి రూపొందించిన అప్పటి లోధాల్ నగరపు వూహాత్మక నమూనా పటం.క్రీ.శ 21వ శతాబ్దంలో ఉన్న మనకి ఈపాటి నిర్మాణం పెద్ద వింత కాకపోవచ్చు,కానీ హరప్పా, మొహంజెదారో, లోధాల్, ధొలవిర లాంటి నగరాల నిర్మాణ కౌశలం వారి సంకాలికులలో మరేవరయినా సాధించారా అనే దృష్టితో వెతికితే ప్రపంచం మొత్తం తిరిగినా మరెక్కడా కనబడటం లేదు.వీటిని నిర్మించడానికి కావలసిన ముఖ్యమైన వనరు తగినంత భూమీ, సరిపడినంత సంపదా, అవసరమైనన్ని పనిముట్లూ కాదు - మేధస్సు!

     ఇప్పుడు మనం వైదికయుగం అని చెప్పుకుంటున్నది రమారమి వీటి నిర్మాణం జరిగిన కాలం - అది బహుశా క్రీ.ఫూ 3000 నుంచి 5000 మధ్యన ఉండవచ్చునని ప్రస్తుతపు లెక్క,ఇది ముందు ముందు మారవచ్చు.కానీ ఇంత స్థాయిలో విజ్ఞానం అంత హఠాత్తుగా అప్పుడే తన్నుకొచ్చిందని అనుకోలేము కదా!నాకు తెలిసిననతవరకు ఈ నగర నిర్మాణానికి అవసరమైన రేఖాగణిత పరిజ్ఞానం మొదట ధృవనక్షత్రం యొక్క స్థిరత్వాన్ని కనుక్కోవడంతో మొదలై జలపాతంలా ఉబికి వచ్చింది.ధృవనక్షత్రానికీ నగర నిర్మాణానికీ ఉన్న సంబంధం ఏమిటో ఇదివరకు ఒకసారి చెప్పాను,అయినా మళ్ళీ చెబుతాను.అప్పటికే పోగుపడిన విజ్ఞానం ఈ ప్రపంచంలో ప్రతిదీ సాపేక్షం అనే విషయాన్ని మనవారికి ఎప్పుడో నేర్పింది.కానీ పరిశీలించి చూస్తే ఇన్ని సాపేక్ష విలువల మధ్యన కొన్ని మాత్రం కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.ఉదాహరణకి కాంతివేగం స్థిరమైనది అనటం కూడా సాపేక్షమే,కానీ దాన్ని కూడా సాపేక్షం అనుకుంటే లెక్క తెగదు..అట్లాగే ధృవనక్షత్రం కూడా విశ్వం యొక్క అక్షానికి కొంచెం దూరంగా ఉండి చలిస్తూనే ఉన్నది,కానీ మిగిలిన వాటి కన్న కొంత నయం.కాబట్టి ఆ ధృవనక్షత్రాన్ని ప్రమాణం చేసుకుని దానితో పోల్చి దిక్కులని గుర్తించడం తెలియకపొతే ఒక్క సరళరేఖనీ వృత్తాన్నీ తప్ప ఇంకే ఆకారాన్నీ గియ్యడం కుదరదు.

     అలా ఇతరుల కన్న ముందు గణితశాస్త్రం,ఖగోళ శాస్త్రం అనే జోడుగుర్రాల రధం మీద పరుగులు పెడుతున్న సనాతన ధార్మిక విజ్ఞానులు సాధించిన విజయాలు ఇతరులు కలలో కూదా వూహించలేనివి.ఈనాటికీ కొన్ని శిధిలాలు గానూ కొన్ని సజీవంగానూ సాక్ష్యాలు కనబడుతున్నాయి గనక నమ్ముతున్నాం గానీ ఆ సాక్ష్యాలు లేకుండా ఆ నిర్మాణాలు చెసినట్టు కేవలం గ్రంధాలలో మాత్రమే చదివితే నమ్మడం కష్టం!
     భారతీయ విజ్ఞానవేత్తలే కాదు ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతికత ఉన్న ఏ దేశపు శాస్త్రవేత్తలైనా తిరిగి మరోసారి నిర్మించలేని అద్భుతమైన నిర్మాణం ఇది - ఎల్లోరా లోని కైలాసనాధ దేవాలయం!ఇప్పటికీ ఏదైనా భవనం కట్టాలంటే ముందు పునాది వేసి ఆ ప్లాను మీద పైకి కట్టుకుంటూ వచ్చి స్తంభాల్ని విడిగా చెక్కి పునాదుల మీద కట్టిన మండపం మీద నిలబెట్టి మళ్ళీ పైకప్పు వేరేచోట చెక్కి ఈ స్తంభాల మీద నిలబెట్టడమే అలవాటుగా జరుగుతున్నది.కానీ ఈ ఆలయం మొత్తాన్ని ఒకే రాతిని పైనించి కిందకి తొలుచుకుంటూ వెళ్ళారు!మళ్ళీ ఎవరూ ఇలాంటి కట్టడాన్ని నిర్మించడానికి ప్రయత్నించలేదంటేనే అది ఎంత కష్టమో అర్ధం చేసుకోవచ్చు.

     క్రీ.శ 756-క్రీ.శ 776 మధ్యన రాష్ట్రకూట వంశానికి చందిన 1వ కృష్ణ మహారాజు నిర్మించినట్టు తప్ప ఇతర వివరాలు ఏమీ తెలియడం లేదు.నిర్మాణం ఎలా జరిగిందనే ఆధారాలు లేకపోవడం వల్ల నిర్మాణం ఎలా జరిగిఉండవచ్చును అని వూహించడానికి ప్రయత్నిస్తున్న చరిత్రకారులకి మతులు పోతున్నాయి!
     ఇంత సూక్షమైన వివరాల్ని కూడా జీవం ఉట్టిపడేలా చెయ్యడానికి తొలిచిన రాతి పరిమాణమే 400,000 టన్నుల పైన ఉండొచ్చు.ఇప్పటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పది 10-Ton JCB machines వాడినా అంత స్థాయిలో రాతిముక్కల్ని తొలగించడం అసంభవం!అసలు ఆ తొలగించిన రాతిముక్కలకి సంబంధించిన సాక్ష్యాలు ఎక్కడా కనపడటం లేదు.ఎక్కడ పారబోశారో ఆనవాళ్ళు కనపడటం లేదు,రాళ్ళు కదా కుళ్ళిపోయాయో కరిగీపోయాయో అనుకోవడానికి వీల్లేదు.

     ఇవ్వాళ్టి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చేస్తే ఎంత కాలం పట్టవచ్చునని ఎంత నిక్కచ్చి అంచనా వేసినా తొలగించాల్సిన 30,000 టన్నుల రాతిముక్కలకీ ఒక్కో 10-Ton JCB machine 100 టనుల్ని తొలగించగలదనుకుంటే రోజుకి 1000 టన్నుల్ని పూర్తి చేస్తూ ఆపకుండా 200 రోజులు,ఆరు నెలలు పడుతుంది.మరి,అపుడు ఎంతకాలం పట్టిందో తెలియదు.ఏదో హడావిడి చేసి చుట్టేసి అంత కష్టమైనది ఇంతకన్న ఎవరు చెయ్యగలరులే అని జాలిపడి మెచ్చుకోవాల్సిన అవసరమూ లేదు - వంతెనలు, సరస్సులు, నేల మాళిగలు, మెట్లు అన్నింటినీ చిన్న చిన్న వివరాల్ని కూడా చూపిస్తూ చెక్కారు!

     ఇవ్వాళ ఏవరినన్నా కట్టమని అడిగితే ముందు నాకు ఒక వంద CAD లోడ్ చేసిన కంపుస్కూటర్లూ మరో యాభై 3డీ ప్లాటర్లూ ఇవ్వమంటాడు.మీగ్గానీ ఎవరినన్నా రెచ్చగొట్టి కట్టించుదామనే దురద ఉంటే మీరే మట్టానికి మునిగిపోతారండి - పరిశోధకులు ఇప్పటికే తేల్చి చెప్పేశారు Repeating such a feat even by using modern technology is almost impossible అని!ఒక L.K.G కుర్రాడి ముందు ఒక Ph.D Thesis పెట్టి చదివి అర్ధం చెప్పమంటే వాడేం చేస్తాడు?తెల్లమొహం వేస్తాడు,నాకు అర్ధం కావడం లేదంటాడు - అది వాడి తప్పు కాదు.కానీ అబ్రహామిక్ మతాల వాళ్ళకీ కమ్యునిష్టులకీ హిందూమతం గురించి మాట్లాడేటప్పుడు ఆ కుర్రాడికున్న నిజాయితీ కూడా ఉండదు - దాన్ని అర్ధం చేసుకోవటానికి తమ ప్రస్తుత జ్ఞానపరిధి చాలటం లేదని ఒప్పుకోవటానికీ ఒప్పుకుని హిందువులని అడిగి విషయం తెల్సుకోవటానికీ అహం అడ్డొచ్చి "మాకు అర్ధం కావటం లేదు కాబట్టి ఇదంతా చెత్త!" అనేస్తారు.

     గౌరీ లంకేశ్ సంస్మరణకి కర్నాటక వెళ్ళి వచ్చిన ఒక తెలుగు కమ్యునిష్టు వాళ్ళలో ఒకరు లింగాయతులతో "మీ బసవణ్ణని చంపిన హిందూమతంలో మీరు భాగం  ఎట్లా అవుతారు?" అని ప్రశ్నించడం, దానికి లింగాయతులు తీవ్రంగా ప్రతిస్పందించడం గురించి గొప్ప వ్యంగ్యపరిభాష వాడి చెప్పుకుంటుంటే వీళ్ళు నోటికి తింటున్నది అన్నమా గడ్డియా మరొకటా అనిపించి కమ్యునిష్టులంటే ఉన్న అసహ్యం రెట్టింపయ్యింది.

     హరప్పా,మొహంజదారో శిధిలాల్లో పశుపతి విగ్రహాలు దొరికిన దాన్ని బట్టి చూస్తే ఉత్తర దక్షిణ భారతాల్లోని ప్రజలందరికీ ఆదిదేవుడైన శివుణ్ణి పూజించే లింగాయతుల్ని హిందూమతం నుంచి వేరు చేసి హిందువుల మీదకి ఉసిగొల్పాలని చూస్తున్నారంటే వీళ్ళెంత క్రూరులో అర్ధం అవుతున్నది గద!నిన్నటి రోజున ఆర్య-ద్రవిద సిద్ధాంతాన్ని వండివార్చిన  రొమిల్లా ధాపర్ ఇవ్వాళ  కుర్రాళ్ళు ముఖం మీద వుమ్ముతుంటే నత్తి మాటలు మాట్లాడి తప్పుకునే దిక్కుమాలిన స్థితిలో నిలబడింది,ఒకప్పుడు శైవులూ వైష్ణవులూ కొట్టుకు చచ్చారు అని హిందూమతంలో తప్పులు పట్టి వీరంగాలు వేసిందీ వీళ్ళే!ఇప్పుడు లింగాయతుల్నీ హిందువుల్నీ విడదీసి కొట్టుకు చచ్చేలా చెయ్యాలని చూస్తున్నదీ వీళ్ళే!రేపటి రోజున లింగాయతుల పేరుతో కూడా ముఖం మీద వుమ్మేయించుకోవటానికి బయల్దేరినట్టున్నారు.ఘోరంగా దెబ్బతింటారు - కేదార్ నుంచి రామేశ్వరం వరకు లెక్కపెడితే వైష్ణవాలయాల కన్న శివాలయాలే ఎక్కువ,శివభక్తులకి కోపం వస్తే వాళ్ళు వీరభద్రులే అవుతారు,వాళ్ళు రెచ్చిపోతే దక్షాద్గ్వరమే,మళ్ళీ లేవకుండా కమ్యునిజం చచ్చిపోతుంది!

     విష్ణుమూర్తికి ఆలయం చెక్కాలంటే సాలగ్రామ శిలని తెచ్చి స్థపతుల వంటి ప్రత్యేక పాండిత్యం గల వ్యక్తులు మాత్రమే విగ్రహరూపకల్పన చేసేవాళ్ళు.వారు కూడా తంత్రశాస్త్రం, స్థలస్వభావం, ఆలయనిర్మాత జాతకలక్షణం వంటివి గణించుకుని తయారు చేస్తారు.శివాలయానికి అవేవీ అక్కర లేదు నల్లదో తెల్లదో ఒక రాయిని కొంచెం నునుపు దేల్చితే చాలు శివలింగం తయార్!ఆ బిరాడంబరత్వమే శివుణ్ణి హిందువులకి మరింత ప్రీతిపాత్రం చేసింది.శివుడికీ ఈ భూమికీ ఉన్న అనుబంధం ఏమిటో గానీ ప్రాచీన కాలపు శివాలయాల్లో చాలామటుకు స్వయంవ్యక్త క్షేత్రాలే.తెలుగువాళ్ళు తమిళనాడు నుంచి విడిపోవటం రాజకీయ కారణాల వల్ల జరిగింది కానీ ఆధ్యాత్మికంగా ఒకప్పటి మేధావులు "కన్యాకుమారి నుండి తిరువేంగడం వరకు విస్తరించి ఉన్న భూమి జగతః పితరులైన శివకేశవులకి అత్యంత ప్రీతిపాత్రమైనది!" అని తీర్మానించారు.తెలుగు తమిళ ఆధ్యాత్మిక వేత్తలు పరిశోధించి ఒక ఉద్యమ ప్రయత్నంతో అప్పటి రాజుల్ని ఒప్పించి కట్టించిన పంచభూత లింగ క్షేత్రాలలో మూడు ఇప్పటి తమిళనాడు రాష్ట్రంలోనూ రెండు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉన్నాయంటే వీరి మధ్య సంస్కృతిపరమైన ఏకత్వం ఎట్లా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు!
Srikalahati – Srikalahasti Temple (13.749802, 79.698410)
Kanchipuram – Ekambareswarar Temple (12.847604, 79.699798)
Chidambaram – Nataraja Temple (11.399596, 79.693559)
     వీటిని కట్టిన కాలాలు వేరు వేరు,దూరాలు సరే సరి - అయినా వీటి గోపురాల లాంగిట్యూడ్ ఒకటే!భూకంపాలు గానీ, వరదలు గానీ,మ రే భీబత్సమయినా ఈ ఆలయాల అమరికని మాత్రం మార్చడం లేదు - ఎట్లా సాధ్యం?ఇవి మూడు పంచభూత క్షేత్రాలు - శ్రీకాళహస్తి వాయులింగం, కాంచీపురం పృధ్వీలింగం, చిదంబరం ఆకాశలింగం.విడివిడిగా కనిపిస్తున్నప్పటికీ ఈ మూడూ విభిన్నమైనవి కావు,వీటి మధ్య సంబంధం ఉంది అని చెప్పడానికి దైవం తనంతట తానే ఒక్కో చోట ఒక్కో మూర్తిగా వ్యక్తం కావడమే తప్ప మనుషులు కూడబలుక్కుని కట్టినవి కాదు!మనుషులు ఆలోచించుకుని చెయ్యాల్సి వస్తే అన్నింటినీ ఒకేసారి కట్టేచాళ్ళు కదా!గాలీ, నిప్పూ, నీరూ, భూమీ, ఆకాశం అనేవాటిని ఆయా క్షేత్రాలలో విగ్రహరూపంలో ప్రతిష్ఠించి తమ ప్రార్ధనలతో ప్రసన్నం చేసుకుని మానవాళికి క్షేమాన్ని చేకూర్చడమే ఆలయనిర్మాతల ఉద్దేశం తప్ప కొబ్బరిచ్గిప్పల వ్యాపారం చేద్దామని కాదు.వ్యాపారమే వాళ్ల లక్ష్యమయితే అసలు ఆలయాల్ని కట్టాల్సిన పనేమిటి?మయసభనో ఇంద్రసభనో తలదన్నే వేశ్యావాటికలనో భోగమందిరాలనో కట్టి ఉండేవాళ్ళు!

     పంచభూత క్షేత్రాల ఏర్పాటులో ఈ భూతపంచకాన్ని విడివిడిగా ప్రసన్నం చేసుకోవడానికి ఏది తగిన స్థలం అని వెదకడంలోనూ విగ్రహ రూపకల్పనలోనూ మానవ ప్రమేయం కొంతవరకు ఉన్నది గానీ జ్యోతిర్లింగ క్షేత్రాలు మాత్రం పూర్తి స్వయంవ్యక్త మూర్తులు కొలువున్న మహిమాన్విత క్షేత్రాలే!అక్కడ విగ్రహస్థాపన అంటూ ఉండదు,స్వయంవ్యక్తమైన ఆ మూర్తి చుట్టూ ఆలయం నిర్మించడమే జరుగుతుంది.అలా ఇప్పటికి స్వయంవ్యక్తమైన జ్యోతిర్లింగాలలో ఒక పన్నెండింటిని విశిష్టమైనవిగా గుర్తించి అన్నింటినీ ఒకే జన్మలో ఎవరూ దర్శించలేరు గాబట్టి ఆ ద్వాదశ జ్యోర్తిర్లింగాలను దర్శించుకోగలిగితే సకల జ్యోతిర్లింగ దర్శన ఫలితం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.
     ఈ పన్నెండింటిని ఇలా చుక్కలు పెట్టుకుని చూస్తే అసలు రహస్యం తెలియదు,ఏదో చెల్లా చెదరై పడిన ముత్యాల మాదిరి కనిపిస్తాయేమో కొంచెం భావావేశం ఎక్కువ ఉన్నవాళ్ళకి.ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగ యాత్రని కూడా దూరాలని బట్టి వరస ఏర్పాటు చేసి ఉంటారు.కానీ అసలు రహస్యం తెలియాలంటే చూడాల్సిన వరస ఇది:
1.ఘృష్ణేశ్వర లింగం(khuldabad,Maharashtra)
2.త్రయంబకేశ్వర లింగం(nasik,Maharashtra)
3.ఓంకారేశ్వర లింగం(mandhala, Madhya Pradesh)
4.భీమశంకర లింగం(bhimasankar, Maharashtra)
5.మహాకాళేశ్వర లింగం(ujjain, Madhya Pradesh)
6.సోమనాధ లింగం(veraval, Gujarat)
7.మల్లికార్జున లింగం(srisailam, Andhra Pradesh)
8.విశ్వనాధ లింగం(vaaranaasi, Uttar Pradesh)
9.నాగేశ్వర లింగం(daarukaavanam, Gujarat)
10.రామనాధ లింగం(rameshvaram, Tamil Nadu)
11.వైద్యనాధ లింగం(deogarh, Jharkhand)
12.కేదారనాధ లింగం(kedarnath, Uttarakhand)
     ఘృష్ణేశ్వరం నుంచి మొదలుపెట్టి వరస తప్పకుండా కేదారనాధ్ వరకు గీతలతో కలిపి చూస్తే మీరు హిందువులైతే పులకించి పోతారు,హిందూద్వేషులైతే కంగారు పడతారు - అది ఖాయం!
     Fibonacci Spiral అచ్చు గుద్దినట్టు దిగిపోయింది గదూ!సృష్టిలో ప్రతిదీ కొలిచినట్టు జరుగుతున్నది,ఆ లెక్కని పటుకోలేకపోవడం వల్ల పాశ్చాత్యులు కొన్ని దృగ్విషయాలని random existence అంటున్నారు,మరి కొన్నిటిని probability constansts కింద తేల్చి పారేస్తున్నారు.కానీ భారతీయ విజ్ఞాన శాస్త్రం మొత్తం వెతికినా యెక్కడా ఈ రెండు పాయింట్లకీ ప్రాధాన్యత లేదు.సృష్టి రచన లోని గణితాన్ని మనవారు అనితరసాధ్యమయిన స్థాయిలో అర్ధం చేసుకోగలిగారు, తమకోసం ఉపయోగించుకోగలిగారు, ఇతరులకి నేర్పారు, అందరి నుంచి గౌరవాలు అందుకున్నారు!

     ఒకనాటి వైభవం ఏమైపోయింది?మళ్ళీ ఈ దేశం ప్రపంచ సంపదలో మూడో వంతు గానీ,నాలుగో వంతు గానీ సృష్టించుతూ తల యెత్తుకుని నిలబడగలుగుతుందా?సర్పిలాన్ని మొదటి నుంచి చివరి వరకు మరి కొంచెం శ్రద్ధ పెట్టి చూస్తే జవాబు కూడా ఇక్కడే కనిపిస్తుంది.విహంగదృష్టితో చూసి గీసిన ఈ సర్పిలంలో ప్రతి రెండు ఆలయాలకీ మధ్య దూరం Fibonacci ratio ప్రకారం పెరుగుతూ పోవాలి,కానీ 10వ రామనాధ క్షేత్రం,11వ వైద్యనాధ క్షేత్రం,12వ కేదారనాధ క్షేత్రం దగ్గిర లెక్క తప్పినట్టు లేదూ!ఇప్పుడు 11వ వైద్యనాధం గురించి మర్చిపోయి రామనాధ క్షేత్రం నుంచి సరాసరి కేదారనాధ క్షేత్రం వరకు గీతని పొడిగిస్తే ముందరి,ఇప్పటి ఆలయాల దూరం యొక్క నిష్పత్తి దాదాపు సరిపోతుంది!మరి,అప్పుడు కేదారనాధ క్షేత్రం 11వది అవుతుంది,పన్నెండవ క్షేత్రం ఎక్కడ ఉంది?

     కేదారనాధ క్షేత్రం నుంచి మక్కాలోని కాబాగుడి వరకు గీతని కొనసాగిస్తే జవాబు దొరుకుతుంది!బేను అబద్ధం చెప్పటం లేదు,ఇది అభూతకల్పన కాదు - లెక్కంటే లెక్కే.కాశీ ఆలయచరిత్రలో కూడా ఇలాగే జరిగింది.కాశీ మహాదేవుడి ఆలయాన్ని కూలగొట్టిన కొద్ది కాలానికే మొఘల్ సామ్రాజ్యం అంతరించిపోయింది,ఎన్నో రాజ్యాలు అంతరించిపోయినాయి గానీ ఔరంగజేబు వల్ల మొఘల్ వంశీయులు తమ వారసత్వం గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడిన దయనీయమైన దుస్థితి దాపరించింది - సాక్షాత్తూ ఔరంగజేబు తను చేసిన పాపాల్ని తలుచుకుని ఆఖరి రోజుల్లో అలమటించి మరణీంచాడు!రాజ్యం చిల్లరమల్లర నవాబుల పాలన బడింది.కాశీ ప్రాంతం 70 యేళ్ళ క్షామాన్ని చూసింది.

     ఇక తట్టుకోలేక  అప్పట్లో ఇటువంటి విషయాల్లో ఆరితేరిన ఒక పండితుణ్ణి సంప్రదించారు.ఆయన మహాదేవుడి ఆలయం మళ్ళీ నిర్మించనిదే పరిస్థితి మెరుగుపడదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.ఆయన ప్రతిభ తెలియడం వల్ల ముస్లిములు కూడా విషయం అర్ధం చేసుకుని నవాబు గారిని కలిసి ఆలయపునర్నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు.అడుగుతున్నది ముస్లిములు గనక కాదనలేదు గానీ ఆలయనిర్మాణం పూర్తయి ప్రార్ధనలు మొదలైన వెంటనే  వర్షాలు పడకపోతే కట్టిన ఆలయాన్ని మళ్ళీ కూల్చేస్తాననే షరతు పెట్టి ఒప్పుకున్నాడు.అప్పటి చరిత్ర ప్రకారం కట్టిన వెంటనే నవాబు గారు కూల్చిన దాఖలాలు లేవు గనక అనుకున్న సమయానికి వర్షాలు పడి మహాదేవుడి మహత్వం రుజువైందనే అనుకోవాలి,అవునా?

     ఇప్పుడు జరుగుతున్న కధ కూడా అలాగే ఉంది.మక్కేశ్వరుడికి  నిత్యాభిషేకాలు ఆగిపోవడం వల్లనే 1400 యేళ్ళ నుంచి ప్రపంచం అశాంతికి గురవుతున్నది.తిరిగి మక్కాలోని కాబాగుడిలో వేదఘోష ఎప్పటినుంచి వినిపిస్తుందో అప్పటినుంచి ప్రపంచ ప్రజలు గుండెల మీద చెయ్యేసుకుని నిద్ర పోగలుగుతారు.


ఓం నమో భగవతే మక్కేశ్వరాయ నమః

54 comments:


 1. అద్భుతః !

  ఆఖరి పేరా యెక్కడో పేలేటట్టుంది.

  ఫిబొనేసి కి జ్యోతిర్ లింగాల ఆవరణా వృత్తాలకి లింకు మీరు కనుగొన్నదేనా ( ఒరిజినల్ ?)


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఇదివరకు కాశీ ఆలయం గురించీ అక్కడ ఉన్న ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాల గురించీ రాసిన పోష్టులో చెప్పానుగా- మొదట Melvelle మహాశయుడు క్లూ ఇచ్చాడు,మనవారు మరికాస్త ముందుకు తీసుకెళ్తున్నారు సొంత రీసెర్చితో!

   Delete
 2. Did you test the distances against the Fibonacci formula please? I tried a couple of them, results below:

  The integers run in the following sequence: 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55, 89, 144....

  After the first few numbers, the ascendance ratio n/(n-1) settles down to around 1.61 i.e. every number is around 1.61 times the previous number.

  Even if you ignore Vaidyanath, we get the following (as the crow files) in Google Earth:

  Daarukavanam-Rameshwaram ~ 1,800 km
  Rameshwaram-Kedarnath ~ 2,300 km
  Ratio= 2,300/1,800 = 1.28 i.e. not as per Fibonacci integer sequence

  ReplyDelete
  Replies
  1. I never calculated actual distances.it is approximation,and calculating actual distance means not the linear distance between the two places - You have to go by the drawn line for the actual mathematical equation.I think that part is complicated.Have you understood my point?I think you took the straight lines between the points, am I right?

   Delete
  2. I had ana idea!WE need to overlap the first figure in this post above the last picture and need to do some adjustments in the upper layer to fit both layers in correctly at the edges.Then only we can compare the authenticity of internal spacial distribution.

   For simplification of the point The distance between vaidyanaadh and kedranath is definitely smaller and it should be higher - Is it not an aberration?That was the catch point!

   Delete
  3. I took the Google Earth distance, not sure whether it is linear or not.

   I am not sure what is the difference between linear distance & drawn line. Though the earth is warped slightly, we can probably ignore the difference in most cases (as far as I know).

   Delete
  4. @Jai Gottimukkala18 December 2017 at 00:49
   I am not sure what is the difference between linear distance & drawn line

   hari.S.babu
   how they wee equal?Lot of difference!Curved line occupies larger space creating larger rectangle,whereas straight line creates smaller rectangle.

   Anyway, I am not pinning down on precision.My point is:Only the length of the curved line between kedarnaadh and vaidyanaadh is lesser than the length of the curved line between vaidyanaadh and raamanaadh.Not the distances between points but length of the curved line is important factor here.

   Delete
  5. OK, I understand what you meant now.

   I don't think we can calculate the curved line unless the polygon formula is known. Maybe CAD triangulation will give an answer.

   Ignoring Vaidyanaadh: your logic looks right. This is subject to religious corroboration (for which my knowledge is not enough). There also seems to be a dispute on the location of this linga with some sources showing it in Maharashtra (Parli).

   Delete
  6. @Jai Gottimukkala18 December 2017 at 01:51
   Maybe CAD triangulation will give an answer.

   hari.S.babu
   may be!

   Delete
 3. మక్కేశ్వరుడికి నిత్యాభిషేకాలు ఆగిపోవడం వల్లనే 1400 యేళ్ళ నుంచి ప్రపంచం అశాంతికి గురవుతున్నది.తిరిగి మక్కాలోని కాబాగుడిలో వేదఘోష ఎప్పటినుంచి వినిపిస్తుందో అప్పటినుంచి ప్రపంచ ప్రజలు గుండెల మీద చెయ్యేసుకుని నిద్ర పోగలుగుతారు.

  Sir, When will it comes into reality

  ReplyDelete
 4. samayaM vastuMdi......vechichooddaam
  harahara mahaadeva

  ReplyDelete
 5. సార్, మీకు టైం మెషీన్ వల్ల యే కాలనికి అయినా వెళ్ళే అవకాశం వస్తే ఏ ప్రాంతానికి వెళ్తారు / ఏ కాలనికి వెళ్తారు.

  ReplyDelete
  Replies
  1. హరప్పా.మొహంజదారో,లోధాల్,ధోలవిర నగరాలని కడుతున్న కాలంలోకి గానీ పూర్తయ్యాక అందరూ స్థిరపడిన తర్వాత కాలానికి గానీ వెళ్తాను.

   Delete
  2. Sir,

   సార్, టైం మెషీన్ గురించి పురాణాలలో కాని, వీరబ్రహ్మేంద్రస్వామి కాని, మరెక్కడైనా ప్రస్తావించారా.

   Delete
  3. నాకైతే మన దేశపు సాహిత్యంలో టైం మెషీన్ కానీ అలాంటి లక్షణాలు గల మరొక రకమైన యంత్రం కానీ ఎక్కడా తగల్లేదండీ!యూరోపియన్లలోనే ఈ కల్పన ఎక్కువ కనపడుతున్నది.కల్పన అనుకోవదానికి కూడా వీల్లేదు,కొన్ని సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు!కానీ,వళ్ళు చూపిస్తున్న సాక్ష్యాలని కూడ అవళ్ళలోనే కొంతమంది ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు.

   ఒక చిన్న యంత్రం ద్వారా మన చుట్టూ ఉన్న ఇంత విస్తారమైన విశ్వాన్ని మానిప్యులేట్ చెయ్యగలగడం దాదాపు అసాధ్యమే!కాలంలో ప్రయాణం అనేది సాధ్యం కావాలంటే కాలం ఆనెది ఒక ఎంటిటీ అవ్వాలి,కదా!కానీ కాలానికి అలాంటి అస్తిత్వం లేదు.ప్రాచీన భారతీయ విజ్ఞానులకి సంబంధించినంతవరకు కాలం గురించి చెప్పే నిన్న,నేడు,రేపు అనేవి మనం సృష్టి చలనాన్ని అర్ధం చేసుకోవడానికి నిర్వచించుకున్న గణితశాస్త్రంలో సాధారణంగా కనిపించే 2x = 3y+1 తరహా స్థిరాంకాల వంటివి!కొంచెం అర్ధమయ్యేలా చెప్పాలంటే నిన్న,నేదు,రేపు అనేవాటిని నిర్వచించగలమే కానీ చూడలేము,వినలేము,స్పర్శించలేము,అనుబవించలేము.అయితే, మన ప్రాచీనులు చేసినది ఆధ్యాత్మికమైన ప్రయాణం,అధి భౌతికమైన యౌగిక శక్తుల సహాయంతో తప్ప యంత్రాల సహాయంతో కాలయానం చేసిన దాఖలాలు మన సాహిత్యంలో ఎక్కడా లేవు.

   కాలంలో యంత్రాల సాయంతో ప్రయాణించదం అసాధ్యం అని రూఢిగా తెలియడం వల్లనే ఇలాంటివాటికి మన ప్రాచీనులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల సాహిత్యంలో కూడా అలాంటి సన్నివేశాలు లేవని అనుకోవాలి!

   Delete
  4. Thank you sir,

   నేను మిమ్మల్ని ఈ విషయం గురించి అడగడానికి కారణం, స్వాతి వీక్లి లో సూర్యదేవరరామమ్మోహన రావు గారి సీరియల్ బేస్ చేసుకుని అడిగాను. (recently completed serial)

   Delete
  5. ఆ సీరియల్ కొన్ని భాగాలు నేనూ చదివాను.అతను కాలయంత్రం గురించి వర్ణించినవి హాలీవుడ్ సినిమాల నుంచీ ఇంగ్లీషు నవలల నుంచీ కాపీ కొట్టినవి అనిపించింది.

   Delete
 6. సార్, పురాణాలలో కాని, వీరబ్రం హేంద్రస్వామి కాలఙ్ఞానంలో కాని, వేరే ఎక్కడైనా కాని ఈ టైం మెషీన్ ప్రస్తావన ఉందా.

  ReplyDelete
 7. https://youtu.be/GRx3Fe3wzyY

  ReplyDelete
 8. ఎల్లోరా కైలాసనాధ ఆలయానికి ఇంకా చాలా విశిష్తతలు ఉన్నాయి.అన్ని నిర్మాణాల లోనూ ఇదే అత్యంత సంక్లిష్టమైనది,ఇదే మొదట కట్టినది కూదా.మొదట ఇంత కష్టమైన నిర్మాణం చెయ్యగలిగినవాళ్ళు తర్వాత వాటిల్లోకూడా ఈ కౌశలం ఉపయోగించాలనీ వీలయితే ఇంకా మెరుగు పర్చుకోవాలనీ చూస్తారు కదా! కానీ కళాత్మకత విషయంలో మిగతావి దీనికన్న తక్కువ స్థాయిలో ఉంటాయి.ఎందుకలా జరిగి ఉండవచ్చు - మీరు వూహించి చూడండి!

  ReplyDelete
  Replies
  1. ఆ కైలాశ్ తెంపుల్ ఒక అద్బుతం. అన్నీ రాల్లు పేర్చి కడితే .. దాన్ని మాత్రం కొన్ని వేల టన్నుల రాతిని తొలిచి కట్టారు. దాన్ని కూల్చడానికి ట్రై చేసిన వాల్లు కూడా దాన్ని కూల్చడం కుదరదు అని వెనక్కి వెల్లిపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఆ గుడి గురించి. ఆ గుడి కట్టింది మనుషులు కాదనీ, ఏలియన్స్ అనీ ఒక థియరీ ! ఆ టెక్నాలజీ మనకు లేదని చెబుతారు. (ఇప్పుడు కూడా లేదు).

   Delete
  2. Not verified the authenticity of this claim ... just putting what I read !
   ---------------------------

   For the task he sent over 1000 laborers especially to destroy Kailasa Temple; they worked day and night for over 3 years, but could barely manage to disfigure a few statues here and there.

   https://www.speakingtree.in/blog/even-aurangzeb-couldnt-destroy-this-indian-temple

   Delete
  3. This comment has been removed by the author.

   Delete
  4. There are historical records like baabar naamaa,akbar naamaa and others that will tell about mughal period.In fact It is neccessory to keep records for each and every king Even though The kingdom is to small that contaimns on;y 10 or 15 villages.Who could memorize the amount of taxes and expenditures on a daily basis?

   Even Sri krishnadaeva raaya has "raaya vaachakam" written by vishvanaadha naayaka.This person was well known to us from our telugu non-detail textbooks.

   Anyway mughals were strict in keeping and protecting their records.From th evidence of records only Hindu scholors doubting about constuction of taj mahal by shajahan.

   We can find the truth from mughal records,but who is there to do the task?

   Delete
 9. ఇప్పటి వరకూ సుబ్రమణ్య స్వామి బ్రహ్మచారి అనుకున్నా!భార్య పేరు Roxna swamy అట!ఆవిడ ఈ మధ్యనే Evolving with SUBRAMANIAN SWAMY a roller coaster ride అని పుస్తకమే రాసిందంట!అన్ని కష్టమైన కేసులు గెల్చినవాడికి అసలు లా డిగ్రీయే లేదంట!!

  ReplyDelete
  Replies
  1. స్వామి గారికి ఇద్దరు కూతుళ్లు. వీరిలో సుహాసిని హైదర్ గారు హిందూ పేపర్ జర్నలిస్టు, విదేశాంగ & రక్షణా విషయాలపై నైపుణ్యులు.

   చదువు విషయానికి వస్తే స్వామి గారికి హార్వార్డ్ నుండి ఆర్ధిక శాస్త్రంలో పీహెచ్దీ ఉంది. అక్కడే ఎన్నో ఏళ్ళు ప్రొఫెసర్ ఉద్యొగం చేశారు కూడా.

   Delete
  2. ఆమే పార్సి. పార్సిల సంగతి తెలిసిందే కదా! వాళ్ల జనసంఖ్య ఉండేది లక్ష లోపే. అందరు ఒకరి కొకరు తెలిసే ఉంటారు. నాని పాల్కివాల స్వామి భార్యకు ఎక్కడో బంధువు అయ్యేటట్లు ఉన్నాడు. నాని పాల్కివాలా, స్వామి కంచి పరమాచార్య అనునయులు. ఒకసారి సుమారు 1980 దశాబ్దంలో అనుకొంటా పరమాచార్య తో సుబ్రమణ్య స్వామి మాట్లాడుతున్నప్పుడు, మనదేశం చైనా,ఇజ్రాయిల్ తో సత్సంభందాలు ఏర్పరచుకొంటే దేశ భద్రతకు మంచిదని చెప్పారట. అప్పటినుంచి స్వామి అదే పనిలో ఉన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఈ దేశాలతో మిత్రత్వానికి ప్రయత్నించి సఫల మయ్యాడు. పివి ప్రధానిగా ఉన్నప్పుడు, స్వామికి కేంద్ర మంత్రి హోదా ఉండినది. ఇజ్రాయిల్ తో సత్సంభందాలను ఏర్పరచుకొనే విధంగా, మనదేశ పాలసిలో మార్పులు తేవటంలో సఫలీకృతుడైనాడు. అప్పటినుంచి జరిగిన ఆ పాలసి మార్పుల ఫలితమే మొన్న మోడి ఇజ్రాయిల్ కి పోతే ఘనస్వాగతానికి ఒక కారణం.

   A few moments with Paramacharya N.A. Palkhivala
   http://www.kamakoti.org/souv/5-36.html

   Delete
 10. సొంతంగా సంస్కృతం అక్షరమ్ముక్క రాదు,అయినా సంస్కృతంలో ఉన్న హిందూ పురాణాల మీద బురద చల్లాలి!

  దానికి వాళ్లవీ వీళ్లవీ ఇంగ్లీషు అనువాదాలు యెత్తి చూపించి "ఇదిగో,రాముడికి బోల్డుమంది భార్యలు ఉన్నారు చూడండి!కావాలంటే ఇక్కడ చదువుకోంది" అని కాండలూ సర్గలూ శ్లోకాలూ వాటి నంబర్లు కూడా ఇస్తూ రెచ్చిపోవటం కొత్త ఫ్యాషన్ అయ్యింది క్రైస్తవ - ముస్లిం మత ప్రచారకులకి.బహుశా అది ఎక్కువమంది హిందువులలో ప్రస్తుతం ఉన్న అజ్ఞానం వల్ల వచ్చిన ధైర్యం కాబోలు!

  కానీ అందరూ అట్లా లేరని తెలియదు కాబోలు వీళ్ళకి,ఇక్కడ ఈ ప్రబుద్ధుదు అంత ధీమాగా చెప్పిన విషయం ఏమిటి?దాని అర్ధం ఏమిటి?ముఖ్యంగా సందర్భం ఏమిటి?

  ఎవరో చేస్తున్న వీడియోల వల్ల క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని అంటూ తను వేస్తున్న ప్రశ్నలకి జవాబులు ఆశిస్తున్నవాడు ఆ వీడియో దగ్గిర కామెంట్లని ఎందుకు నిషేధించాడో తెలియదు,జవాబు చెప్పాలనుకున్నవాళ్ళు ఎక్కడ చెప్పాలి?

  ఈ పండితుడు "సర్గ ఎనిమిది పన్నెండులో ఏముందో చూద్దాం" అంటూ ఒక శ్లోకపు భావాన్ని ఉదాహరించాడు.అది "రాముని బార్యలందరునూ సంతోషింపగలరు.బరతునకు క్సీనదశ కలుగుటచే నీ కోడల్లు సంతోష విహీను లయ్యెదరు" అని ఒత్తులు ఒదిలేసి అక్కర్లేని చోట దీర్ఘాలు తీస్తూ ఈ రెండు వాక్యాలు చదవటానికి 4:14 నుంచి 4:36 వరకు అన్ని అవస్థలు పడి ప్రాంప్టింగు కూడా తీసుకుని తేల్చినది ఏమిటి?

  కొండని తవ్వి ఎలకని పట్టటం అనేదానికి ఇంతకన్న గొప్ప ఉదాహారణ దొరకదు.ఇక్కడి పాండిత్యమే ఇలా అఘోరించింది గనక చరిత్ర మొత్తం తవ్వడానికీ గొడవ ఎక్కడ మొదలయ్యిందో తెలుసుకోవడానికీ నాకు ధైర్యం చాలటం లేదు!

  ఇక్కడి సుత్తిని బట్టే నాకు అర్ధమయిన విషయం ఏమిటంటే,ఈయన ప్రస్సంగాల్లో ఎక్కడో "మీ రాముడు ఏకపత్నీవరతుడు అంటారు కదా,క్నాదు క్నాదు నాకు తెలుసు - ఆయనకి చాలామంది పెళ్ళాలు ఉన్నారు!" అని వాగి ఉంటాడు.దానికి హిందువులు తమ మనోభావాలు దెబ్బతిని ఈయన్ని నిలదీస్తే ఈయనకి అది క్రైస్తవుల మనోభావాల్ని దెబ్బతియ్యటంలా అర్ధమయ్యింది.దాంతో ఎత్తెత్తి వేసిన కాలితో ఏడడుగులు దుంకి పోయి ఎంగిలాకులో పడ్డట్టు అంబేద్కరు గార్ని కూడా రగడలోకి ఈడ్చుకొచ్చాడు!

  రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నదని కైకకు చెప్పినది మంధార్!వినగానే సంబరపడిపోయి మంధరకి కానుక కూడ ఇస్తుంది.ఆ మనస్తత్వంలో ఉన్న కైకని తన వైపుకి తిప్పుకోవటానికి చెప్తున్న మోసకారి కబుర్లలఓ ఈ మాట వస్తుంది.
  हृष्टाः खलु भविष्यन्ति रामस्य परमाः स्त्रियः |
  अप्रहृष्टा भविष्यन्ति स्नुषास्ते भरतक्षये || २-८-१२

  12. raamasya = Rama's; paramaastriyaH = great wives; bhavantikhalu = will become; hR^ishTaaH = delighted; te = your; snushhaaH = daughters-in-law; bhavishhyanti = will become; aprahR^isTaaH = unhappy; bharata kshhaye = of Bharata's weak position.

  "Rama's wives will get delighted. Your daughters-in-law will be unhappy because of Bharata's waning position."

  సంస్కృతంలోనే కాదు ప్రతి భాషలోనూ క్రియాపదాలకి భూత,భవిష్య,వర్తమాన కాలాలు ఉంటాయని కూడా తెలియదా ఈ గొట్టాంగాళ్ళకి! ల్మీకి మంధర చెబుతున్నట్టుగానే అయినా भविष्यन्ति అనే మాట వాడాడు.అది రాముడికి సంబంధించీ భరతుడికి సంబంధించీ రెండు చోట్లా వాడాడు!అక్కడ మంధర రాముడికి పట్టాభిషేకం జరిగితే వాతావరణం ఎలా ఉంటుందో వూహ్గించి చెబుతున్నది.కానీ అవేవీ జరగలేదు కదా!

  దాని మంత్రాంగం ఫలించి తెల్లారేసరికి రాముడు ఆ ఒక్క సీతనే వెంటబెట్టుకుని వనవాసం వెళ్ళాడు,తిరిగి వచ్చాక గూడా సీత లేనప్పుడూ ఇంకెవర్నీ చేసుకోలేదు,యాగాలు చెయ్యాల్సి వచ్చినా బొమ్మనే పక్కన కూర్చోబెట్టుకున్నాడు.రాముడిలో ఏకపత్నీవ్రతం పట్ల అంత నిష్ఠ కనబడుతుంటే అందులో కూడా తప్పులు పట్టటం,నిలదీస్తే తప్పును ఒప్పుకుని వెనక్కి తగగ్కుండా మొండికి తిరిగి దొంగసాక్ష్యాలు తేవడం దేనికి చేస్తున్నట్టు?ఆంధ్రాలో చర్ల వీజయకుమార్ క్రిస్టియన్ స్టేట్ గురించి పదే పదే మాట్లాడ్Fఉతున్నాడు!ఒక చర్చి ఫాదర్ ఆల్రెడీ తిరపతి వెళ్ళినందుకే జగన్ తండ్రి కుక్కచావు చచ్చాడని అంటున్నాడు,ఏమిటి ఈ దూకుడుకి కారణం?

  కమలాహాసనుకీ ప్రకాష్ రాజుకీ నెప్పి కలిగుతే కలగవచ్చు గాక ఇప్పటికి హిందూ టెర్రరిజం అనేది లేదు గానీ ముందుముందు అవసరం రావచ్చు - ఇంత మొండితనం తలకి యెక్కినవాళ్ళు మంచిమాటలకి వినదు,దారికి రారు!

  ReplyDelete
  Replies
  1. Who is he? What is his name?

   Delete
  2. I also didn't know his name!One of the cheap buggers.THis is the link!Some persons alraedy answered,But I too am giving my slap!

   Delete
 11. https://www.facebook.com/revtprabhukiran/posts/336502940157202


  https://www.facebook.com/revtprabhukiran/posts/335658753574954

  https://www.facebook.com/revtprabhukiran/posts/335658753574954

  ReplyDelete
 12. అందుకే క్రైస్తవులు నాకు ఓట్లు వేస్తే ఎంత, వెయ్యకుంటే ఎంత? అనుకోకుండా ఆర్చ్ బిషప్ ప్రకటనను మోడీ ఖండించాడు. ఎన్నికల వ్యూహాలు రచించడం లో మోడీ సిద్ధ హస్తుడు. రేపటి ఎన్నిక కోసం ఏదో రచించే ఉంటాడు. కానీ మనపట్ల దేవుడున్నాడు. మానవ ప్రయత్నాలను తారుమారు చేయగల సమర్థుడు మన దేవుడు.కేంద్రంలో మోడీ పతనం రేపటి గుజరాత్ ఎన్నికల ఫలితాల ద్వారానే ఆరంభం కావాలి. ఈ దేశ భవిష్యత్తును, మైనారిటీలు ముఖ్యంగా క్రైస్తవుల భవితవ్యాన్ని నిర్ణయించేది రేపటి ఎన్నికలే. ఈ పోస్టును ఈ రోజు పెట్టడం లో నా ఉద్దేశ్యం మనమంతా రేపటి ఎన్నికల కోసం ప్రార్థించేందుకు మీ అందర్నీ సమాయత్తం చేయడమే. క్రైస్థవుని ప్రార్ధన కొండల్ని కూడా పెకిలిస్తుందన్నది మోడీకి తెలిసొచ్చేలా మనం ప్రార్ధన చేయాలి. ఈ పోస్టును అందరికీ షేర్ చెయ్యండి. తెలుగు నలు మూలలకి దీన్ని చేరవేయండి.మన రెండు రాష్ట్రాల్లోని విశ్వాసులంతా నేడు, రేపు పోలింగ్ జరుగుతున్నపుడు కొంత సమయం పాటు గుజరాత్ ఎన్నికల్లో ఫలితం మన పక్షంగా రావాలని మనమంతా ప్రార్ధన చెయ్యడం దేవుని రాజ్యవ్యాప్తి కోసం మనం చెయ్యగల కనీస కార్యక్రమం.

  https://www.facebook.com/revtprabhukiran/posts/335162660291230

  ReplyDelete
 13. రోజూ వందల్లో కొత్తగా ఆదివాసీలు, దళితులు క్రైస్తవులవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కాంధమాల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ఇటీవల పంపిన నివేదికలో పేర్కొన్నాడు. కాంధమాల్ జిల్లా కేంద్రం ఫుల్బాణీ లో ఉంటుంది. మారణకాండ తర్వాత క్రైస్తవుల సంఖ్య కాంధమాల్ ప్రాంతంలో 70 శాతంపెరిగిందన్నది ఆయన నివేదిక సారాంశం. కాంధమాల్ మారణకాండ తర్వాత 2008లో ఒరిస్సా ప్రభుత్వం క్రైస్తవం వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మత స్వేచ్ఛ (అణిచివేత) చట్టాన్ని తెచ్చి కొత్తగా క్రైస్తవులయ్యేవారిపై అనేక ఆంక్షలు విధించింది కూడా. కొత్తగా క్రైస్తవులు కాగోరే వారు జిల్లా కలెక్టర్ కు ఒక స్వచ్ఛంద ప్రకటన పత్రమివ్వాలని, తాము ఏ ప్రలోభానికీ లొంగకుండా ఇష్టపూర్వకంగా క్రైస్తవులమవుతున్నామని రుజువులతో సహా అందులో పేర్కొనవలసి ఉంటుంది. అయితే ఈ దశాబ్ద కాలంలో ఒక్కటికూడా అలాంటి వాంగ్మూలం నమోదు కాలేదని, విచిత్రంగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నవారి సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతోందని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నాడు. పోతే క్రైస్తవులయ్యేందుకు తమను బలవంతపెడుతున్నారంటూ ఇప్పటిదాకా ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని, పైగా 'ఘర్ వాపసీ' పేరుతో కొన్ని మతతత్వ శక్తులు తమను హిందువులు కమ్మంటూ భయపెడుతున్నారని మాత్రం చాలా ఫిర్యాదులు వస్తున్నాయని నివేదికలో కలెక్టర్ పేర్కొన్నాడు

  కాంధమల్ లో ఏం చేయగలిగారని, ఒంగోలు లో చేస్తారు? ఓట్ల రాజకీయం చేసే వాళ్లకి, దేవుని రాజ్యవిస్తరణ చేసుకునే మనకి పోలికేమిటి? మనమే వాళ్ళ పోస్టులు షేర్ చేసి, వాళ్ళ కార్యక్రమాల గురించి చర్చించి వారికి అనవసరమైన ప్రచారమిస్తున్నాం. Ignoring them and their activities is the best strategy we can adopt..

  https://www.facebook.com/revtprabhukiran/posts/329658064175023

  ReplyDelete
  Replies
  1. Yehova naa mora' / 'Yahova na mora' - 'Dance Worship' - Bharatanatyam - 'Indian Song Indian Music Indian Dance' from 'Andhra Christian Hymns'


   https://www.youtube.com/watch?v=DWh_v1UDU0w

   Delete
  2. WOW!Christians are so adaptive to cultural ethos unlike muslims!

   Delete
  3. కరుణాకర్ సుగ్గున బయటపెట్టిన బైబిల్ బండారం
   https://www.youtube.com/watch?v=awdRwpQHHfA&t=25s&app=desktop

   Delete
  4. https://www.facebook.com/noconversion/

   మతమార్పిళ్ళ భరతం పట్టే ఫేస్ బుక్

   Delete
  5. ఫైన క్రిస్టియన్ పాస్టర్ కి ఆన్సర్... https://www.facebook.com/karunakar.sugguna

   Delete
 14. జేబు దొంగకి అంత పెద్ద శిక్షా?
  మధు కోడాకి ఇంత చిన్న శిక్షా!
  చేస్తే శుద్ధ క్షవరమే చెయ్యాలి కాబోలు!

  ReplyDelete
 15. ఎన్నికల్లో గెల్చినా నైతికంగా ఓడిన మోదీ!
  ఎన్నికల్లో ఓడినా నైతికంగా గెల్చిన రాహుల్?

  ReplyDelete
  Replies
  1. ఎన్నికల్లో ఓడినా నైతికంగా గెల్చిన రాహుల్? How?

   Delete
  2. just like ఎన్నికల్లో గెల్చినా నైతికంగా ఓడిన మోదీ!

   Delete
 16. కందము లంటు జనాలను
  చిందర జేసెడి జిలేబి జిమ్మడ!ఏలా
  బొందలు?ముసలిది మొగుడి ప
  సందును జూడక తిరుగుడు సంతలు ఏలో!

  ReplyDelete
 17. నమస్కారమండి! ఎన్ని విషయాలు తెలియచేశారో! ప్రతి హిందువు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. చివరి పేరా మాత్రం కొరడా దెబ్బలా ఉంది. ఈ మధ్యనే నేను ఈ బ్లాగ్ల జోలికి వస్తున్నాను, మీ బ్లాగు చూడటం నా అదృష్టమండి. __/\__

  ReplyDelete
  Replies
  1. మంచిదండి!కొరడా దెబ్బలు అప్పుడప్పుడు తగుల్తూ ఉండాలండి!

   Delete
 18. ఎన్నికల్లో గెల్చినా నైతికంగా ఓడిన మోదీ!ఎన్నికల్లో ఓడినా నైతికంగా గెల్చిన రాహుల్?
  --------------------------------------------------------------------------
  మొదట గుజరాత్ ఎన్నికల గురించి ప్రత్యేకం ఒక పోష్టు వెయ్యాలనుకున్నాను.కానీ అనవసరం అనిపించి కామెంటుతో సరిపెడుతున్నాను.
  పత్రికల్లో ప్రముఖ విశ్లేషకులు కూడా అంత పట్టించుకోని పాయింట్లు కొన్ని ఉన్నాయి.
  1)."నీచ్" పదం కాంగ్రెసు వైపు నుంచి రాగానే లటక్కన పట్టేసుకుని రెచ్చిపోయిన తర్వాతతో పోలిస్తే అంతకు ముందరి మోదీ ప్రచార సరళి చాలా చాలా పేలవంగా జరిగింది - ఎందుకని!
  (గతంలోనే మొదలై అలవాటుగా జరుగుతున్నది గానీ అసలు ముఖ్యమంత్రి,ప్రధానమంత్రి స్థానాల్లో ఉన్నవాళ్ళు ఎన్నికల ప్రచార్మ్ చెయ్యకూడదు.అలా వచ్చినందువల్లనే పరువు దజ్క్కించుకోవడానికి ఈ దిగజారుడు ప్రచారం చెయ్యాల్సి వచ్చింది.ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అంత దిగజారి సాధించిన తన గెలుపును తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే భాజపా మీద జాలివేసింది నాకు!పంచాయితీ ఎన్నికలకీ మున్సిపాలిటీ ఎన్నికలకీ కూడా మోదీ ప్రచారం చేస్తే తప్ప గెలిచే దిక్కులేదా?)
  2).ఎన్నికల ఫలితాలు కూడా మొదటివర్సలో కాంగ్రెసు వైపుకే మొగ్గు చూపటమూ పల్లెటూళ్ళలో పూర్తి భాజపా వ్యతిరేకత కనబడటమూ ప్రజల రాజకీయ పరిజ్ఞానం పెరిగిందని తెలియజేస్తున్నాయి.ఇప్పుడే కాదు గత కొని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెసు కొంచెం హుందా అయిన రాజకీయం నడపగలిగితే చాలు ఇప్పటికీ మేము మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తాం అనే సూచనలు ఇస్తున్నారు.
  4).రేపటి రోజున తమకు అవసరమైనవారిని నేడు నిర్దోషులుగా ప్రకటించి విడిపించి కరచాలనాలు చేస్తున్నది నిన్నటి రోజున కేసులు పెట్టిన భాజపా వారే కదా - ఇది ఏ రకమైన నైతికతయో అని జనం అనుకోరని భాజపా శ్రేణులకి ఎంత నమ్మకం!
  5).భాజపా మీద పోరాడుతున్న ఒంటరి వ్యక్తుల గెలుపు చాలా ముఖ్యమైన మలుపు.నీచ్ పదాన్ని ఉపయోగించుకుని చేసిన విజృంభణ కూడా వీళ్ళ గెలుపుని ఆపలేకపోవడాని భాజపా శ్రేణులు తప్పకుండా పట్టించుకోవాలి.
  (పైకి చెప్పకపోయినా,కాంగ్రెసు మీద కోపంతో వేస్తున్నా రామాలయం కడతామని చెప్పి అధికారంలోకి వచ్చి దాని వూసే ఎత్తకపోవడాన్ని కూడా ప్రజలు పట్టించుకుంటున్నారు.వాళ్ళలో భాజపాను నియంత్రించే నిజాయితీ ఉన్నదని ప్రజలు నమ్మడం భాజపా జీర్ణించుకోలేని పచ్చి నిజం)
  6).మోదీతో పోలిస్తే రాహుల్ గాంధీయే ఎన్నికల ప్రచారంలో హుందాగా ప్రవర్తించాడు.మోదీ యొక్క కాంగ్రెస్ ముకత్ భారత్ అనేది కల్లయేనని జనం నమ్మడానికి ఈ ఎన్నికల ప్రచారంలో రాహుల్ తెచ్చుకున్న మార్కులు చాలు!
  7).అతను హిందూ దేవాలయాలని దర్శించడం బీజేపీకి విమర్శించడానికి పనికొచ్చే పాయింటుగా కనబడి ఎన్ని విమర్శలు చేసినా అతన్ని అలా చూడటం హిందువులకి నచ్చి ఉండవచ్చును.హిందూత్వం అంతటినీ బీజేపీ పేటెంటు తీసుకున్నదా ఏమిటి?
  8).ఈ ఎనికల్లో కాంగ్రెసు సర్వసక్తులూ క్రోడీకరించిందనేది వాస్తవం.అంత కష్టపడినా ఓడిపోయి కూడా హుషారు పెరిగిందంటే కారణం ఏమిటి?గెలుపు కోసం మోదీ పాటించిన అనైతికమైన పద్ధతులే కదా!

  P.S:నిన్నటి రోజున జయలైత చావుని ఉపయోగించుకోవాలని ఆత్రపడి మూతిపగలగొట్టుకున్నట్టు జరగదని గ్యారెంటీ ఉందా ఇవ్వాళ్టి నేరస్థుల విడుదలతో వస్తాయని కలలు గంటున్న ప్రాభవాల విషయంలో?నైతికత అనే అంశం తెర మీదకి తీసుకురావడానికి తనకే ముఖం చెల్లని భాజపా 2019లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది?హిందూత్వని కెలకాలంటే రామాలయం గురించి ప్రజలే నిలదీస్తారు!ఇప్పటివరకు 2019లో గెలుపు గురించి ధీమాగా ఉన్న భాజపా అభిమానులకి కూడా గుజరాత్ ఎన్నికల తర్వాత సందేహాలు మొదలైనాయి,కనీసం గెలిచి తీరుతుంది అనుకోవడానికి ధైర్యం చాలని పరిస్థితి ఏర్పడింది.

  ReplyDelete
 19. Done Blaming Modi for 2G Drama? Now, Read the Facts

  http://theindianvoice.com/blaming-modi-2g-drama/

  ReplyDelete
 20. Pls watch below political comedy scenes

  https://www.youtube.com/watch?v=SZ7Lb2cxaOI

  https://www.youtube.com/watch?v=bIgoKzZ5vN4

  ReplyDelete
 21. Thread on how cows are becoming victim of

  https://twitter.com/ShankhNaad/status/944839309252706305

  ReplyDelete
 22. ప్రస్తుత దేశకాల పరిస్థితులలో అతిముఖ్యమైన ఈ జాతీయ అవసరానికి నా వంతు దోహదం చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ బ్లాగ్ ను ప్రారంభిస్తున్నాను. హిందూ సమాజాన్ని,హిందూ దేశాన్ని చీకాకు పెడుతున్న సమస్యలను, సవాళ్ళను ,సామాన్య హిందువులను తికమక పెడుతున్న ఇస్స్యూలను ఒకటితరువాత ఒకటి కూలంకషంగా , సప్రమాణంగా ఇందులో చర్చించదలిచాను.

  హిందూ సమాజం మీద తీవ్రాక్షేపణ అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది మనుస్మృతి . ఈ మధ్య దీని మీద హిందూ వ్యతిరేక మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేస్తున్నది. మనువాదం అనేది భయంకరమైన తిట్టుపదమైంది. మనుధర్మ శాస్త్రం పేరు చేబుతేనే హిందువుల్లో చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అన్ని వైపులనుంచి దాని మీద వస్తున్న అక్షేపణలకు , అభ్యంతరాలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. కాబట్టి మొదట దాని మీదే దృష్టి పెడదాం.

  మనుధర్మాన్ని ద్వేషించే, అసహ్యించుకునే వారితో వాదులాడటం నా ఉద్దేశం కాదు. ఇప్పటికే తిరుగులేని నిశ్చిత అభిప్రాయాన్నిఏర్పరుచుకున్న వారితో ఇక్కడ వాదించి , గెలవాలని నేను కోరుకోవటం లేదు. హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి , వాటి మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టి తీరాలన్న పట్టుదల, తపన ఉండి , విరోధుల నోళ్ళు ఎలా మూయించాలా అని తహతహలాడుతున్న వారితో మాత్రమే నేను ఇక్కడ సంభాషించ దలిచాను.

  వారికి ఒక మనవి. నేను చెప్పదలుచుకున్నది ఎంత చెప్పినా మీకున్న సందేహాలు మిగిలే పోవచ్చు. మీ దృష్టిలో అతి ముఖ్యమనుకున్న ప్రశ్నలు అసలు ప్రస్తావనకే రాకపోవచ్చు. కాబట్టి ముందుగా మనుధర్మ శాస్త్రం గురించి మీకున్న అనుమానాలు ఏమిటో నాకు తెలపండి. ప్రతివాదులతో మనుస్మృతి విషయం చర్చించినప్పుడు మీకు కలిగిన అనుభవాలను , ఎదురైన ఇబ్బందులను పంచుకొండి. మీకు సమాధానం కావలసిన ప్రశ్నలు , ఎలా బదులివ్వాలన్నది మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఏమిటో చెప్పండి. నాకు తెలిసినంతలో వాటికి సాక్ష్యాధారాలతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

  మీ స్పందన కోసం రెండు మూడు రోజులు ఆగి , తరవాత మనుధర్మశాస్త్రం పై నా వ్యాసాలు మొదలు పెడతాను. మళ్ళీ వాటి మీదా ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు తెలపవచ్చు . ఈ చర్చ పూర్తి అయ్యేసరికి ఈ సబ్జెక్టు మీద అందరికీ చక్కని క్లారిటీ వస్తే మంచిదే.

  మనుధర్మాన్ని కూలంకషంగా చర్చించిన తరవాత వివాదాస్పదమైన ఇంకో విషయాన్ని ఎత్తుకుందాం.

  https://mvrsastri.blogspot.in/2018/01/blog-post_6.html

  ReplyDelete
 23. https://www.quora.com/Why-did-Nathuram-Godse-assassinate-Gandhi

  ReplyDelete
  Replies
  1. All that Period was filled with craziness and people and our leaders made helpless puppets of politics of the Britishers!-

   Delete
 24. https://www.quora.com/When-will-the-Dravidian-supremacists-stop-denigrating-Hinduism-and-India-Why-are-they-spewing-venom-against-Brahmins.

  The same applies to brahmins of Andhra

  ReplyDelete
 25. Harvard Is A Hedge Fund Masquerading As A University

  which perpetuates this facade by reinvesting large portions of its hedge fund proceeds to unleash propaganda that it is a ‘world-renowned’ institution of higher learning and scholarliness dedicated to advancing humankind. This branding attracts financing from well-meaning folks, compelled to ‘join the club’ so their children get preferential treatment when applying to Harvard and access to Harvard’s insider network. This dynamic is rarely discussed in the mainstream media.” Nearly one-third of the students admitted to Harvard are beneficiaries of a well-documented legacy and preferential admission system that is not merit-based but on “who you know” or who donated money.

  arvard’s financial statements reveal that the university is fundamentally a tax-exempt Wall Street hedge fund with cash and investments of nearly $35 Billion. In 2016 alone, Harvard’s capital marketing campaign raised $7 Billion, with its hedge fund in 2017 yielding $2 billion in gross profits. The operating budget further reveals that professors and administrators effectively serve as business development staff to attract wealthy donors to fund Chairs and professorships that finance their lucrative hedge fund. In 2017, as the Boston Globe reported, Harvard’s seven top hedge fund managers earned a total of nearly $58 million in compensation.

  https://shiva4senate.com/dr-shiva-ayyadurai-stops-harvard-tamil-professorship-scam/

  ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ లేదు,అయితె భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు