Sunday 10 December 2017

వైదిక సాహిత్యం ప్రకారం జీవసృష్టి యొక్క కాలనిర్ణయం

మన చుట్టూ పరుచుకుని ఉన్న అనంతకోటి బ్రహ్మాండాలలో మనం ఉన్న బ్రహ్మాండం యొక్క వయస్సు సృష్టికారకుడైన బ్రహ్మ యొక్క ఆయుర్దాయంతో సమానం.

ఉత్త కబుర్లు దేనికి?లెక్కలు వేసి చూద్దాం!

బ్రహ్మ యొక్క జీవితకాలం 100 సంవత్సరాలు,అయితే అవి మానవులు జీవించే 360 అహోరాత్ర సంవత్సరాలు కాదు.

మొదట తెలుసుకోవలసినది మన విశ్వానికి పర్యాయమైన బ్రహ్మకు జననం,వృద్ధి,మరణం అనేవి ఉన్నాయి.వీటిని  ఆధునికులు చెప్తున్న Big Bang,Organic Evolution,Big Crunchలకు సమాంతర పదాలుగా భావించవచ్చు.మన మేధావుల లెక్క ప్రకారం మన విశ్వం మొదటి ప్రజననం కాదు,ఇంతకుముందు వేలకొలది బ్రహ్మలు గతించిపోయారు - అంటే అన్నిసార్లు Big Bang,Organic Evolution,Big Crunch అనేవి పునరావృతం అయ్యాయి.

వైదిక సాహిత్యపు కాలనిర్ణయం ప్రకారం మనం ఉన్న విశ్వం యొక్క బ్రహ్మ జీవిత కాలంలో 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలోని మొదటి రోజు నడుస్తున్నది.

బ్రహ్మ యొక్క సంవత్సరానికి కూడా 360 రోజులు ఉంటాయి.ఇప్పుడు ఈ ఒక్క రోజుని మానవ సంవత్సరాల లెక్కలో చూస్తే కొంత స్పష్టత రావచ్చు.బ్రహ్మ యొక్క ఒక రోజుకి కూడ రాత్రి,పగలు ఉంటాయి.పగటి సమయంలో జీవధాతువుల చలనం బ్రహ్మ సంకల్పవికల్పాల చేత శాసించబడుతూ ఉంటుంది.రాత్రి సమయంలో అప్పటివరకు సృజించబడి నడుస్తున్నది సమస్తం తాత్కాలికంగా బ్రహ్మములోనికి ముడుచుకుపోతుంది.

బ్రహ్మము యొక్క ఒక దినము కల్పము(4.32 బిలియన్ మానవ సంవత్సరాలు),వివరంగా చెప్పాలంటే పగలు యొక 14 మన్వంతరాలు రాత్రి యొక్క 14 మన్వంతరాలు కలిసిన పరిమాణం అని అర్ధం చేసుకోవాలి.మనం ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నట్టు వైదిక సాహిత్యం చెబుతున్నది.71 మహాయుగాలు కలిసిన మన్వంతరం యొక పరిమాణం 306.72 మిలియన్ మానవ సంవత్సరాలు.ప్రతి మహాయుగం 4,32,00 మానవ సంవత్సరాల కలియుగం,8,64,000 మానవ సంవత్సరాల ద్వాపరయుగం,1296 మిలియన్ మానవ సంవత్సరాల త్రేతాయుగం,1728 మిలియన్ మానవ సంవత్సరాల కృతయుగం కలిసినంత ఉంటుంది.

మనం ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నట్టు వైదిక సాహిత్యం చెబుతున్నది.ప్రతి మహాయుగంలోనూ సత్యయుగం అని కూడా వ్యవహరించే కృతయుగం 40% కాలాన్ని ఆక్రమిస్తుంది.ఈ కాలంలో భౌతిక దేహ సంస్పర్శ లేకుండా పరాపరప్రకృతులతో నిత్యానుసంధానం ఉంటుంది,త్రేతాయుగం 30% కాలాని ఆక్రమిస్తుంది.ఈ యుగంలో అసుర శక్తుల ఉనికి ప్రారంభమౌతుంది.అయినా,అమర శక్తులు బలంగానే ఉంటాయి.ద్వాపరయుగం 20% కాలాన్ని ఆక్రమిస్తుంది.ద్వాపరం అంటేనే రెండవదాని తర్వాత వచ్చేది అని అర్ధం.పేరుకు తగగ్ట్టు అమరాసుర శక్తులు సమాన స్థాయిలో బలంగా ఉంటాయి.కలియుగం 10% కాలాన్ని ఆక్రమిస్తుంది.కలి అంటేనే చీకటి అని అర్ధం.అసురశక్తులకి బలం పెరిగి అమరశక్తులు బలహీన స్థాయిలో ఉంటాయి.ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలోనే.

ఇప్పుడు కొంచెం లోతుకి వెళ్దాం లెక్కల్లో:
1 కలియుగం = 4,32,000 సౌర సంవత్సరాలు
1 ద్వాపరయుగం = 2X1 కలియుగం
1 త్రేతాయుగం   = 3X1 కలియుగం
1 కృతయుగం = 4X1 కలియుగం
మొత్తం నాలుగు యుగాలు కలిసి 10 కలియుగాల ప్రమాణం ఉంటుంది.అందువల్లనే తర్వాతి కాలంలోని కొందరు మేధావులు 3X4=12వ ఎక్కంతో చెప్పే పాఠాంతరాలను కూడా చెబుతున్నారు.
కాబటి,
1 మహాయుగం = 4,320,000 సౌర సంవత్సరాలు
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కలియుగం నుంచి కాలాన్ని వెనక్కి వెళితే సృష్టి మొదలైన కాలం లెక్క తెలుస్తుంది కదా!
1 మహాయుగం = 4,320,000 సంవత్సరాలు
1 మన్వంతరం = 71 మహాయుగాలు
1 బ్రమ్మదివం = 14 మన్వంతరాలు = 994 మహాయుగాలు
ఇక్కద ఇంకొక చిన్న స్థిరాంకం కలుస్తుంది,ప్రతి మన్వంతరానికి ముందూ వెనకా 4 యుగాల కాలపు సంధ్యాసమయం ఉంటుంది

కాబట్టి ఇప్పుడు,
1 బ్రహ్మదివం = 14వ్మన్వంతరాలు + (15X4 యుగాలు) = 994 మహాయుగాలు  + 60 యుగాలు = 994 మహాయుగాలు + 6 మహాయుగాలు = 1000 మహాయుగాలు
కాబట్టి 1 బ్రహ్మదివం = 4,320,000,000 సంవత్సరాలు
దీనికి 1 బ్రహ్మనిశ = 4,320,000,000 సంవత్సరాలు కలపాలి.
మొత్తంగా చూస్తే
బ్రహ్మ యొక్క 1 అహోరేవ దినం యొక్క కాలపరిమితి 8,460,000,000 సంవత్సరాలు,అంటే 8.64 బిలియన్ సంవత్సరాలు.
ఇక్కడ గుర్తు చేసుకోవలసిన విషయం ఈ ఒక్క అరోజుకి పట్టే కాలంలో 7వ మన్వంతరంలో ఉన్నాం మనం.మొదట ఈ రోజులో ఎంత కాలం గడిచిందో ఆ లెక్క చూద్దాం.దీన్ని దశలుగా విడగొడితే గానీ మాన్ మట్టిబుర్రలకి అర్ధం కాదు.
దశ 1:6 మన్వంతరాలు గడిచాయి కాబట్టి 71X6 = 426 మహాయుగాలు
దశ 2:మన్వంతరాల మధ్యన వచ్చే 4 యుగాల  కాలం 7X4 = 28 మహాయుగాలు
దశ 3:ప్రస్తుత మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాం,అంటే 1/10వ వంతు అవుతుంది.
(ఒక మహాయుగంలోని నాలుగు యుగాల్లో ఆఖరుదైన కలియుగం విలువ 1 అని తెలుసు కదా!)
కాబట్టి దీని విలువ 27.9 మహాయుగాలు అని వేసుకోవాలి.
అన్ని దశల్నీ కలిపి చూస్తే
చివరి రోజుకి సంబంధించిన లెక్క 426+2.8+27.9=456.7 మహాయుగాలుగా తేలింది..
దీన్ని సౌర సంవత్సరాలలోకి మారిస్తే
456.7X4,320,000 = 1,972,944,456
ఇది సుమారు 2 బిలియన్ సంవత్సరాలు అని ఆధునికులు చెప్తున్న భూమి మీద జీవరాశి పుట్టిన కాలానికి సరిపోతున్నది,కదా!
ఇక్కడొక చిన్న ఝలక్,ఇలాంటివి ఇంకా 543 మహాయుగాలు గడవాలి Big Crunch వరకు వెళ్ళడానికి!

ఇక విశ్వం వయస్సు లెక్కని తేల్చుదాం.

వైదిక సాహిత్యం ప్రకారం బ్రహ్మ వయస్సే విశ్వం వయస్సు అవుతుంది.అయితే దీనికి సమబంధించి ఆధునికులు ఇనత్వరకు ఏమీ తేల్చహలేకపోయారు గాబట్టి పోల్చడం అసాధ్యం.కిట్టనివాళు ఇది చదివినా నోరు మూసుకుని కూర్చోవాల్సిందే తప్ప వాదించడానికి ఏమీ లేదు.ఇదివరకు మనం బ్రహ్మదివం 1000 మహాయుగాలు బ్రహ్మనిశ 1000 మహాయుగాలు అని తెలుసుకున్నాం,గుర్తుందా?

దీనిని 350తో గుణిస్తే ఒక సంవత్సరపు కాలపరిమితి వస్తుంది.అదీగాక ఇప్పుడు మనం 51వ సంవత్సరపు మొదటి రోజులో ఉన్నాం అంటే ఖచ్చితంగా 50 సంవత్సరాలకి పట్టే కాలపరిమితిని కనుక్కుని ఇదివరకటి విలువకి కలిపితే సరిపోతుంది కదా!
360X50=18000 రోజులు
18000X2000X4320000 మానవ సంవత్సరాలు అంటే 155,520,000,000,000 మానవ సంవత్సరాలు
ఇప్పటి రోజులో గడిచినది 1,972,944,456 మానవ సంవత్సరాలు
ఈ రెంటినీ కలిపితే
విశ్వం వయస్సు 155,521,972,944,456 మానవ సంవత్సరాలు.అంత పెద్ద సంఖ్యని గుర్తుంచుకోవదం కష్టం కాబట్టి  155,522 బిలియన్ సంవత్సరాలు అని గుర్తుంచుకుంటే చాలు.


ఆధునిక విజ్ఞాన శాస్త్రపు ప్రస్తుత లెక్కల ప్రకారం విశ్వం యొక్క వయస్సు 15 నుంచి 20 బిలియన్ సంవత్సరాలు ఉండవచ్చు.అయితే,వైదిక సాహిత్యం ప్రకారం గడిచింది 50 బ్రహ్మవత్సరాలు మాత్రమే గాబట్టి వాళ్ళు లెక్కలు సరిచేసుకోవటానికి ఇంకా 50 బ్రహ్మవత్సరాల కాలం ఉంది.చూద్దాం,వాళ్ళ వోపిక!
----------------------------------------------
first refrence
WASHINGTON – Scientists have found fossil-like hints that some kind of life existed on Earth 4.1 billion years ago — when the planet was a mere volcanic toddler. That’s 300 million years earlier for life to pop up than previously thought.

Not only does that change the way scientists thought Earth was like soon after it formed 4.5 billion years ago, but gives them reason to theorize that life itself is more plentiful throughout the universe because it seemed to start up so quickly.

Researchers examined tiny grains of the mineral zircon from western Australia’s Jack Hills and chemically dated them to when Earth was barely 400 million years old. Inside one of the 160 some grains they found what they call a “chemo-fossil,” or a certain mix of carbon isotopes, according to a study published Monday in the journal Proceedings of the National Academy of Sciences.

Think of it as “the gooey remains of biotic life or anything more complicated,” said study co-author Mark Harrison, a UCLA geochemistry professor.

second reference
Fossils from China are said to prove that multi-cellular organisms evolved as early as 1.5bn years ago – but some experts dismiss findings

A claim by researchers that complex life on Earth may have evolved a billion years earlier than previously thought has immediately divided scientists in the field, with some hailing the evidence as rock-solid and others unconvinced.

The researchers, writing in the journal Nature Communications, said they had uncovered fossils showing that complex life on Earth began more than 1.5bn years ago.

After first emerging from the primordial soup, life remained primitive and single-celled for billions of years, but some of those cells eventually congregated like clones in a colony. Scientists took to calling the later part of this period the “boring billion” because evolution seemed to have stalled.

But at some point there was a leap – arguably second in importance only to the appearance of life itself – towards complex organisms with multiple cells.

This transition progressively gave rise to all the plants and animals that have ever existed.

Exactly when multi-celled “eukaryotes” – organisms in which differentiated cells each contain a membrane-bound nucleus with genetic material – showed up has inflamed scientific passions for many decades.

third reference
Hypotheses for origin
One hypothesis for the origin of multicellularity is that a group of function-specific cells aggregated into a slug-like mass called a grex, which moved as a multicellular unit. This is essentially what slime molds do. Another hypothesis is that a primitive cell underwent nucleus division, thereby becoming a coenocyte. A membrane would then form around each nucleus (and the cellular space and organelles occupied in the space), thereby resulting in a group of connected cells in one organism (this mechanism is observable in Drosophila). A third hypothesis is that as a unicellular organism divided, the daughter cells failed to separate, resulting in a conglomeration of identical cells in one organism, which could later develop specialized tissues. This is what plant and animal embryos do as well as colonial choanoflagellates.[26][27]
Because the first multicellular organisms were simple, soft organisms lacking bone, shell or other hard body parts, they are not well preserved in the fossil record.[28] One exception may be the demosponge, which may have left a chemical signature in ancient rocks. The earliest fossils of multicellular organisms include the contested Grypania spiralis and the fossils of the black shales of the Palaeoproterozoic Francevillian Group Fossil B Formation in Gabon (Gabonionta).[29] The Doushantuo Formation has yielded 600 million year old microfossils with evidence of multicellular traits.[30]
Until recently, phylogenetic reconstruction has been through anatomical (particularly embryological) similarities. This is inexact, as living multicellular organisms such as animals and plants are more than 500 million years removed from their single-cell ancestors. Such a passage of time allows both divergent and convergent evolution time to mimic similarities and accumulate differences between groups of modern and extinct ancestral species. Modern phylogenetics uses sophisticated techniques such as alloenzymes, satellite DNA and other molecular markers to describe traits that are shared between distantly related lineages.
The evolution of multicellularity could have occurred in a number of different ways,

9 comments:

  1. http://www.opindia.com/2017/12/science-channel-video-clip-saying-ram-setu-was-man-made-goes-viral-on-social-media/

    రామసేతును కట్టింది మనుష్యులే

    ReplyDelete
  2. the source of Hindu Dharma...
    http://indiafacts.org/sources-hindu-dharma-1/

    ReplyDelete
  3. సార్, నాకు ఒక ఆలోచన ఉంది, మీ అభిప్రాయం చెప్పండి.
    మన దేశాన్ని రాష్త్రాలుగా కాకుండా జిల్లాలుగా / ప్రాంతాలుగా విభజించి ఒక జిల్లాకు ఒక IAS అధికారిని నియమించాలి. ఎలక్షన్లు అనేవే ఉందకూడదు. ఈ జిల్లా అధికారులను నియమించదానికి / నియంత్రించడానికి సుప్రీం కోర్టు యెలాగూ ఉంటుంది. ఆ జిల్లాలు భాషా ప్రాతిపదికిన ఉంటే బాగుంటుంది. ఆ ప్రాంతంలో మైనారిటి భాషకు రెండవ అధికార భాషగా గుర్తించాలి. ప్రకృతి వనరులు, నీటి ప్రాజెక్టులు,దేశ రక్షణ సుప్రీం కోర్టు అధీనంలో ఉండాలి. ఏ ప్రాంతంలోని ప్రజలు ఎక్కడైనా నివసించవచ్చు / చదువుకోవచ్చు / ఉద్యోగాలు చెయొచ్చు.

    ReplyDelete
    Replies
    1. నాకు జిల్లాలని స్వయంపూర్ణం చెయ్యడం అనే ఆలోచన ఎప్పుడో వచ్చింది - ఇక్కడి అయిదు భాగాలు చదివి చూదండి.

      Delete
    2. గ్రామాల్లో సర్పంచి కి కూడా పూర్తి అధికారం లేదు. అన్ని పనులూ పంచాయితీ కార్యదర్శులే చూస్తారు. మోడీ కూడా ఏమీ చెయ్యలేరు. అధికారం అంతా అధికారుల చేతిలోనే ఉంటుంది. ఐ ఏ ఏస్ లూ, ఐ పీ ఎస్ లూ, న్యాయమూర్తులూ ఎవరూ ఏమీ చెయ్యలేరు. చేయవలసిందీ చేసేదీ ఓటర్లు మాత్రమే ! అందుకే ఓటర్లకి ఉచిత తాయిలాలు అందిస్తూ ఉంటారు. క్రింది స్థాయి మనుష్యులు మాత్రమే చేయగలిగిన పని, చేయగలిగి ఉండి కూడా చేయడం లేదంటే అలసత్వం ఏ మేరకు ఉన్నదో ఆలోచించండి. లోక్ సత్తా ఒక్కటే ఓటర్ల గురించి ఆలోచిస్తున్నది కానీ వారు చెప్పేది అర్ధం చేసుకునే స్థాయి ఓటర్ల కి ఇంకా రాలేదు. హిందూత్వ మైకం దిగితే గానీ ఓటర్ తనగురించి తాను తెలుసుకోడు.

      Delete
  4. Thank you sir for your reply and i will read those articles.

    ReplyDelete
  5. http://www.mediacrooks.com/2017/12/congress-treachery.html

    ReplyDelete
  6. Demanding separate nation for a religion. it's open sedition


    https://m.facebook.com/story.php?story_fbid=1967816949901697&id=100000202344597

    ReplyDelete
  7. Hamaara hamaara

    https://m.facebook.com/story.php?story_fbid=152351112071720&id=100018904964218

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...