Saturday 4 November 2017

చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనికిరాడు - ఇంతకన్న జగన్ చాలా నయం!

          ఇంకొక్క సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి,చంద్రబాబు చెప్పుకోవడానికి ఏముంది?ఎప్పుడో తవ్వి ఉంచిన కాలవల్లోకి పంపులు పెట్టి నీళ్ళు వదలటం కూడా తన ఘనకార్యమేనా?నిండుసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని కంద్రమంత్రివర్గంలోకి తన పార్టీ నుంచి  నలుగురు మంత్రుల్ని పంపించి కూడా సాధించుకునే చాతుర్యం లేనివాణ్ణి ఏ లెక్కన సమర్ధుడని అనాలి!చట్ట ప్రకారం ఆంధ్రాకి రావలసిన 10 రూపాయలూ ఇమ్మంటుంటే ఆ పదీ అడక్కుండా ఉంటే ఇరవై ఇస్తాననే వెర్రి బాగుల వాడు ఎక్కడయినా ఉన్నాడా?ఆ పదే ఇవ్వలేనివాడు ఈ ఇరవై ఎక్కణ్ణించి తెచ్చి ఇస్తాడనే దౌటు ఎవరికీ రాలేదు - అలా ఎవడన్నా ఇస్తానంటే నమ్మిన పిచ్చిమాలోకం చంద్రబాబూ ఆ చంద్రబాబు మాటలు నమ్మేసి నిమ్మళంగా చోద్యం చూస్తున్న ఆంధ్రా ఎర్రిపప్ప జనాలు కాక ఈ భూమ్మీద ఇంకెవరయినా ఉన్నారా?

          పోనీ పదికి బదులు ఇరవై అని పబ్లీకున చెప్పారు గదా అని లటక్కన పట్టేసుకుని దానికి చట్టబద్ధమయిన రూపం తెచ్చుకుని ఖరారు చేసుకోవాలా అఖ్ఖర్లేదా!ఇస్తామని అన్నదానికీ చట్టబద్ధమయిన రూపం కల్పించకుండా నానుస్తుంటే ఈ అనుభవజ్ఞుడు అన్ని సార్లు ఢిల్లీ యాత్రలు చేసి పీకుతున్న ఘనకార్యం యేమిటి?పార్లమేంటులో కాంగ్రెసోళ్లు ఏ ప్రశ్న వేసినా చాలు "రాష్ట్రానికి హాని చేస్తున్నారు!" అని బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టి మాట్లాడ్డమూ జగన్ ఏదైనా తప్పులు పడితే "జైలు కెళ్ళాల్సిన వాడు!" అనే వంకతో దాటెయ్యడమూ ప్రజలు గమనంచడం లేదని అనుకుంటున్నారు కాబోలు!ఈ అనుభవజ్ఞుడు ప్రపంచమంతా కలయదిరిగి అస్సురుబుస్సురుమని సాధించిన దాన్ని ఇతను అనుభవం లేదని వెక్కిరించే కేసెయార్ కూర్చున్న చోటునుంచి కదలకుండా సాధిస్తున్నాడు - ఎవరు గొప్ప!

          నోరు తెరిస్తే ప్రపంచ స్థాయి రాజధాని అని పేరు పెట్టి బొమ్మలు చూపించడమే తప్ప దాన్ని కట్టడానికి డబ్బులు ఎక్కణ్ణించి తెస్తాడు?చట్టమే పూర్తి రూపంలో అమలు జరగడం లేదు - లోటు బడ్జెట్ పూడ్చనే లేదు,హామీయో ప్యాకేజీయో రాలేదు,MOUలు సాధిస్తే చాలునా?పారిశ్రామిక వేత్తలు నికరమైన పెట్టుబడులు పెట్టడానికి పన్నుల్లో రాయితీలు ఆశిస్తారు - అది కాస్తా హోదా కం ప్యాకేజీ కం డాష్ డాష్ అనే గడ్డివామి చాటున దాక్కుంది!

          విభజన జరిగిన నాలుగేళ్ళ తర్వాత కూడా విభజనలో అన్యాయం జరిగిందనే యేడుపు ఎవడిక్కావాలి?నువ్వు దాన్ని సరిదిద్దుతావా లేదా అనేది చెప్పాలి - దానికి మాత్రం ఇనత్వరకు నికరమైన జవాబు లేదు.అమరావతి పేరుతో ఇప్పటీవార్కు చహెసిన హడావిడి చాలు - ఇన్నిసార్లు డిజఒన్లు మార్చి ఆఖరికి గడ్డివామి కుప్పల్ మాదిరి చవకబారు డిజైన్లు చూపిస్తున్నారు - దీనికోసం సినిమా డైరెక్తరుని పిలవడం ఎంత సిగుచేటు!ఈ తికమకలన్నీ ఎందుకు జరుగుతున్నాయి -  ఎలాంటి రాజధాని కావాలో నీకు క్లారిటీ లేకపోవడం వల్ల కాదా?

          రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతి,అధికారులు మంత్రుల మాటల్ని కూడా ఖాతరు చెయ్యకపోవడం,ముఖ్యమైన పనులు కూడా మందకొడిగ అసాగడం - ఇవన్నీ వేరేవాళ్ళు కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి నోటి నుంచే వస్తున్నాయి - తనో తమ వాళ్ళో ఉప్పందించగా వస్తున్న  పత్రికా కధనాల్లోనూ  బహిరంగ సభ్లలోనూ ఆయనే టముకు వేసుకుంటున్నాడు!

          ఇదేమీ బాగలేదు బాబుగారూ!నాలాంటి వాడిక్కూడా మీకన్నా జగనే నయం అనిపిస్తున్నది - 2019లొ ఫలితం మీరు ఆశించినట్టు రాకపోతే జనాల్ని తిట్టకండి,నవ్వుల పాలవుతారు!రైల్వే బడ్జెట్లలో కొత్త రైళ్ళు కూడా రావటం లేదు,నీతి అయోగ్ బడ్జెట్ కేటాయింపుల్లో మొండి చెయ్యి చూపిస్తున్నది,విభజన బిల్లు పూర్తి రూపంలోకి రాలేదు - నాలుగేళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగి ఏం పీకారు సార్!!ఈ ఆంధ్రాని తీసుకెళ్ళి తెలంగాణలో కలిపేసి కేసీయార్ పాలనలో మీ పాలనలో కన్న ధీమాగా బతుకుతామేమో అనిపిస్తుంటే అది మా తప్పు కాదు సార్ - మీ నిర్వాకమే!!!


ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ కలిస్తే సూపరే సూపర్:-)

33 comments:

  1. ఏపీ విషయం లో ఇది ఖచ్చితంగా బీజేపీ ఫెయిల్యూరే. మిత్ర పక్షం అయి వుండి కూడా దిశా నిర్దేశం చెయ్యలేక పోతోంది . కాశ్మీర్ లో కరుడు కట్టిన పీడీపీ ని గాడిన పెట్ట గలిగిన బీజేపీ ఏపీ విషయం లో శ్రద్ధ చూపలేక పోతోంది .


    మిత్ర పక్షమా శత్రు పక్షమా అని ఆలోచించకుండా బీజేపీ ఏపీ ని కేంద్ర పాలిత ప్రాంతం గా అన్నా చెయ్యాలి, లేదా రాష్ట్ర పతి పాలన విధించి ప్రజల బాగోగులు కేంద్రం చూసుకోవాలి ( వీటి కి రాష్ట్రాల తీర్మానం అవసరం లేదు )
    ఇది రాజ్యసభ లో విజయ సాయి రెడ్డి గారి ప్రశ్నకు సమాధానం క్రింద ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఇదే చెప్పారు . ఆంద్ర ప్రదేశ్ కు నిధులు ఎప్పుడు ఎలా ఎంత ఇస్తారు అన్న విజయ సాయి రెడ్డి గారి ప్రశ్నకు ఆర్ధిక శాఖ సహాయ మంత్రి... ఇచ్చిన డబ్బులకు రాష్ట్రం లెక్క చెప్పటల్లేదు మిగతావి ఎలా ఇస్తాం అని సమాధానం చెప్పారు.కానీ మీడియా ఈ కీలక విషయాన్ని కవర్ చెయ్యలేదు.

    ఈ విషయాన్ని డైరెక్ట్ గా అడగ లేక మోడీ చంద్ర బాబు తో జరిగే ప్రతి మీటింగ్ లో నీతి ఆయోగ్ ను కూడా కూర్చో పెడుతున్నారు . లెక్కలు చెప్పట్లేదని నీతి ఆయోగ్ బూతులు తిడుతోంది . ఆ బూతులు భరించ లేక అసలు ప్రధాని తో మీటింగ్ లే క్యాన్సిల్ చేసుకొంది రాష్ట్ర ప్రభుత్వం . పాపం తమ్ముళ్లేమో చంద్ర బాబు కు మోడీ అప్పాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పుకుంటున్నారు

    ----- Cma Ravi Sankar Vipparla

    ReplyDelete
  2. Pls read article on IAS officers (page2) and Govt hospital (Page4)

    http://zaminryot.com/index.html

    ReplyDelete
  3. ఈమధ్య ప్రతి ఊరికి హెలికాప్టర్ వేసుకొని తిరగటం ఒక వ్యసనమయింది.ఆంధ్రజ్యోతి వాడు వీడికి బాక. చిన్న విమర్శ చేస్తే తట్టుకోలేరు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా కృష్ణారావును తొలగించిన విధానం బాగాలేదు.అడిగి ఉంటే రాజీనామా చేసేవాడు అని, ఆయనకు మద్దతుగా మాట్లాడితే, ఆంధ్రభూమి MVR శాస్త్రి ఉద్యోగాన్ని ఊడ పీకించాడు. IYR కృష్ణారావు రాజధాని పై పుస్తకం రాస్తాను అంటే పదవి లో ఉన్నప్పుడు అక్రమ లు జరిగాయని అనిపోస్తే అప్పుడే అడ్డుకోలేక పోయారా అని ఆయనను విమర్శించారు కృష్ణారావుకి నిజాయితి లేనట్లు, ఆయన మాటలను తీసివేయాలని చూసారు. పనిచేసే టప్పుడు ఏ ఉన్నతాధికారి, ప్రభుత్వ నిర్ణయాలకి అడిగాడుగునా అడ్డుపడాలనుకొడు. పై స్థాయిలో అడ్డుపడితే ఆ పని అమలు చాలా ఆలస్యమౌతుందని, మంచి పాయింట్లు, సలహాలను చెపుతారు. అందునా ఒకటా రెండా,ఈసారి ఆయన పాలన నూరు శాతం అంతా అక్రమలే.అడ్డుకొంటే ఏ పని జరగదు.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. కం:కందము రాయగల కా
    మందులు తామే జగాన పండితు లనుచ్గున్
    అందరి ముందర రొమ్ములు
    బాదుకొంచును ఇతరుల మోదుచు నుండ్రి!

    ReplyDelete
  6. సార్ ! మీ కందం బహు పసందుగుంది .
    తమరనుమతిస్తే చిన్న మార్పు -

    కందము రాయంగల కా
    మందులు తామే జగాన మరి పండితులం
    చందరి ముందర రొమ్ములు
    బాదుకొనుచు నితర జనుల బాదుచు నుండ్రీ .

    ReplyDelete
    Replies
    1. నిజమే!మొదటి పద్యంలో రెండవ గణం "గగ" అవ్వాలి,
      నాలుగో లైనులో చివర గురువు రావాలి
      తప్పులు సరి చేస్తే నేనేమీ అనుకోనండీ!

      P.S:రెండో లైనులో అంత దోషం ఏముంది?పండితు లనుచున్ అనడమే రిదమిక్ కదా!
      యతి కూడా
      మొదటి గణం యొక్క "మం"కీ నాలుగవ గణం యొక్క "పం"కే ఎకువ దగ్గరని అది మటుకు తెల్లిసే వేశాను - ప,బ,మ ఆనేవాటికి యతిమైత్రి ఉంటుందేమో!

      Delete
    2. కందము రాయంగల కా
      మందులు తామే జగాన పండితు లనుచున్
      అందరి ముందర రొమ్ములు
      బాదుకొనుచు నితర జనుల బాదుచు నుండ్రీ.

      now It had a hybrid vigour!

      Delete


    3. ఇదిగో ! హరిబాబు మరియొ
      క దమ్ము గల కంద వీర కవిరాట్ వచ్చెన్ !
      పదములనిక బేర్చు సదన
      మిదే, జిలేబులు చకచక మించారునిటన్ :)


      చీర్స్
      జిలేబి

      Delete
  7. సార్ ! నేనూ పొర పడ్డాను , ఇంకోచోట - అంటే
    నాల్గోపాదంలో ప్రాసస్థానం కూడా సరిచేయవలసి ఉంది .

    ReplyDelete
    Replies
    1. యతిని మొదటి అక్షరంతోనూ ప్రాసని రెండో అక్షరంతోనూ చూస్తారు కదా,"ద" సరిపోయిందే - పాదాల్లో మొదటి అక్షార్మ్ మొదటి పాదంలో ఉన్నది గురువా లఘువ ఆని తప్ప అదే హల్లు ఉండాలని లేదుగా!

      Delete


    2. కందము రాయంగల కా
      మందులు తామే జగమున పండితు లనుచు
      న్నందరి ముందర రోసె క
      బంధము వలెగద సుజనుల బాది జిలేబీ :)


      జిలేబి

      Delete
  8. సార్ ,
    అక్షరం సున్నతో కూడి ఉన్నప్పుడు ప్రాసస్థానంలో
    నాల్గు పాదాల్లోనూ సున్నతో కూడి ఉండాలంటారు
    పెద్దలు .
    ఇకపోతే ,
    పు-ఫు-బు-భు-ము లకైతే యతి చెల్లుతుందంటారు కాని
    ప ఫ బ భ లతో మ కు యతి విషయం నాకైతే సందేహమే .తమరు రాయగలరు , కందాన్ని నడిపించండి , అందరూ తడబడినవాళ్ళే మొదట్లో . మీకైతే మాంచి
    లయఙ్ఞానముంది .

    ReplyDelete
    Replies
    1. కందము రాయంగల కా
      మందులు తామే జగాన పండితు లనుచున్
      అందరి ముందర కొచ్చి క
      బంధుల వలె నితరుల తెగ బాదుచునుండ్రీ!

      with lots of thanks to jilebi for the clue!

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
  9. ఏమైంది. కురుక్షేత్రం నుంచి ఈ బ్లాగు కాస్తా రాయలవారి ఆస్థానం లా మారుతోంది. ఇంతకీ కవిరాజుకు మహారాజకవి బహుమానం ఇచ్చేదేమన్నా ఉందా?

    ReplyDelete
    Replies
    1. :-)
      కురుక్షేత్రం సీను అయిపోయిందిగా!
      ఇక అంతా విజయోల్లాసం,మానసోల్లాసం,రసికజనమనోభిరామమే!

      Delete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. OMG!
      కందం
      శీర్షక వృత్తమొకటె ఆ
      కర్షక మనుకొని ఇదేమి ఖర్జురకంలా
      వార్షుక సమమై సుకవిజ
      నార్షప్రియమైన దీని నానగ లేదే!

      Delete


    2. జేజేలు హరి ! పదములను
      రాజేసిరి కంద పద్య రాపిడి తోడన్
      భాజాభజయింత్రులతో
      తాజా హాట్ హాట్ జిలేబి తరమై జేర్చెన్ !

      జిలేబి

      Delete
  12. మధువులు పెదవులకును, మరి
    మధురా ధరము లవి గోరు మాకే, మాకే -
    విధురుల కేలా మాతో?
    మధుర కవితల కుసుమాలు మావి జిలేబీ!

    ReplyDelete
  13. సురలెరుగని హరిలీల నరులెరుగ వశమా!

    ReplyDelete
  14. Must Watch

    https://www.youtube.com/watch?v=O9y9HK1xGXc

    ReplyDelete
  15. Kudos to Mr Murali Krishnan for his brilliant expose of the shameful Circulation scam of anti -Hindu "The Hindu ".


    https://t.co/IQ1t3krdt8

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారు పై విషయాన్ని MVR Sastry నాలుగు రోజుల క్రితం ట్వియిట్ చేశారు. క్రెడిట్ గోస్ టు హిం

      https://twitter.com/mvrsastry/status/926419484222435329

      Delete
    2. తనతో విభేధించిన
      వారిని కూడా దేవుడు
      కంటికి రెప్పలా చూసుకొని
      రక్షణ కల్పిస్తాడు కదా!
      మరి ఆయన భక్తులేమిటి
      ఇలా కాల్చి చంపుతున్నారు?
      వీళ్ళ చేష్టలకు సిగ్గుపడి
      దేవుడు నాస్తిక మతం పుచ్చుకొన్నా
      ఆశ్చర్యపడక్కర లేదు.
      -బొల్లోజు బాబా

      Delete
    3. @anon
      తనతో విభేధించిన
      వారిని కూడా దేవుడు
      కంటికి రెప్పలా చూసుకొని
      రక్షణ కల్పిస్తాడు కదా!

      hari.S.babu
      ఎవరు చెప్పారు మీకిది?
      హిందూ పురానాల ప్రకారం:
      దుర్యోధనుణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నాడా?
      పోనీ పాండవుల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
      రావణుణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నాడా?
      పోనీ రాముణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నాడా?
      క్రైస్తవ కధల ప్రకారం:
      ఫారోలని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
      పోనీ జీసస్ క్రీస్తుని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
      ఇస్లామిక్ సాహిత్యం ప్రకారం:
      కాఫిర్లని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
      పోనీ ప్రవక్తని కంటికి రెప్పలా చూసుకున్నాడా?

      Delete


  16. https://m.facebook.com/story.php?story_fbid=1904302743166777&id=100007612081303

    ReplyDelete
  17. కాల్చి చంపే అధికారం అడవిలో అన్నలకు మాత్రమే ఉంది. వారు చంపినపుడు ఎర్రకళ్ళు, విప్లవ నోళ్ళు, సుత్తి పాళీలకు తప్పులు కనిపించవు.

    ReplyDelete
  18. Jagan comes from this famous clan. Tyagi famously criticized Nehru's statement in the Indian Parliament in the prelude to the Sino-Indian War: Nehru commented that "Not a blade of grass grows in Aksai Chin", attempting to explain that Aksai Chin was a barren, inhospitable land and the nation had lost little by its occupation by China. Tyagi retorted, pointing to his bald head: "Nothing grows here ..should it be cut off or given away to somebody else?".

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...