Monday, 2 January 2017

నేను మోదీ భక్తుణ్ణా?మోదీ రామ భక్తుడా! ఎవడో మోదీ ఫ్యాన్ అయితే నాకేంటి?ఎవడో నన్ను ఏదో అనుకుంటే నేను అదే అయిపోతానా!

     100% ద్వేషం,100% ప్రేమం - ఇలాంటివి వాస్తవప్రపంచంలో ఉంటాయా?దోర యవ్వనంలో ఉండి పేవించుకునే వ్కుర్రజంతలో ఉంతాయేమో?అలా అత్మలో ఉన్నది 100% ప్రేమ అని వాళ్ళు అనుకుంటారేమో!నేను మాత్రం ఏ వ్యక్తిలోనూ 100% దుర్మార్గం,100% సన్మార్గం ఉంటాయని నమ్మను!అందుకే,కాంగ్రెసు చరిత్రలో తిలక్,నెహ్రూ.గాంధీ,ఇందిర - ఎవర్ని తీసుకున్నా వాళ్లలో నేను విమర్శించే లక్షణాల్ని ఎక్కువగా హైలైట్ చేసినా నేను లోపాలు అని చెప్తున్నవి ఉన్నప్పటికీ వాళ్లు అందరినీ మెప్పించగలిగిన వాటిని మాత్రం విమర్శించలేదు.

     ఇట్లా ఒక మనిషిలో దేన్ని విమర్శించాలి,దేన్ని సమర్ధించాలి అనేది పసిగట్టడం చాలా కష్టం - దాన్ని గట్టిగా చేస్తున్న నాకు తెలుసు అది ఎంత కష్టమో!గతించిపోయిన వ్యక్తుల్ని ఎంత ధాటిగానైనా విమర్శించవచ్చు - వారి అభిమానులమంటూ కొందరు రెచ్చిపోవడమే తప్ప అసలువాళ్ళు మనం చెప్తున్నదాన్ని ఖండించరు!గొవలు వస్తున్నది ఇప్పుడు బతికి ఉన్నవాళ్ళ విషయంలోనే.కళ్లముందు కనబడుతున్న వ్యక్తిలో దేన్ని విమర్శించాలి,దేన్ని ప్రశంసించాలి అనే విషయంలో క్లారిటీ లేనప్పుడు అనుకోకుండానే ఎదటివాణ్ణి ఏదో ఒకవైపుకి 100% నెట్టెయ్యడం జరుగుతుంది!

     ఎందుకు పొగడాలో తెలియకపోయినా పొగడాలనుకున్నవాడు ఆ వ్యక్తి 100% మంచివాడు అనేస్తాడు.ఎందుకు తెగడాలో తెలియకపోయినా తెగడాలనుకున్నవాడు ఆ వ్యక్తి 100% దొంగవెధవ అనేస్తాడు.దీపావళి బాంబుల్లో కూడా అనేక రకాలు ఉంటాయనే కనీసపు వైవిధ్యాన్ని కూడా సహించలేనివాళ్ళు అందరూ తను చెప్పేది ఒప్పేసుకుంటే చాలు ఎవరికీ కష్టాలే ఉంవని దబాయిస్తారు!

     పాత సినిమాల్లో నాగభూషనం సావిత్రితో తను పేట్టమన్న చోట సంతకం పెట్టించుకుని ఆస్తి మొత్తం కొట్తేస్తుంటే నాగభూషనాన్ని తిట్టి సావిత్రి మీద జాలిపడతుంటే అది సైన్మరా పిచ్చిసన్నాసీ అని పక్కోళ్ళకి క్లాసులు పీకి మేధావుల్లా పోజులు కొడుతున్నవాళ్లే అచ్చుమచ్చు యమా సీరియస్సుగా అదే పద్ధతిలో నేను చెప్పింది చెప్పినట్టు ఎందుకనడక్కుండా చచ్చినట్టు వినండని రంకెలు వేస్తున్నారు,మక్యూనిష్టులు అని కొందరు ఉన్నారు, చూడండి!"దొసో కొపిత్యలో" అనే పవిత్రగ్రంధం చదవకపోతే పుట్టినవాళ్ళు పుట్టినట్టే ఉంటారు అని సుభాషితాలు చెప్తున్నారు. నేను ద్వేషం కొద్దీ వారిని వెక్కిరిస్తున్నానని ఎవరయినా పొరబడితే ఆ ఒక్క ముక్క చాలు వారంతట వారే దాన్ని మతం స్థాయికి దిగజార్చివేశారు అని నొక్కి చెప్పడానికి!గుంటూరు జిల్లాలో ఉన్న పానకాల నరసింహస్వామి ఆలయానికి దగ్గిర్లో శాసనాల భవంతి అని ఒక భవనం ఉంది.అందులోని ఒక శాసనం ఏమి చెప్తుందో తెలుసా?ఒక నవాబు గారు ఆ ప్రాంతంలోని పద్మసాలీల వృత్తి మీద పన్ను ఏకపక్షంగా పెంచేశాడు.దానికి జవాబుగా వూరివాళ్ళు తర్వాత కాలంలో మనం చదువుకున్న "చీరాల,పేరాల" తరహాలో వూరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.పన్ను పెంచితే ఆదాయం పెరుగుతుందనుకున్న నవాబుకి అసలు ఆదాయమే రాకపోయేసరికి అనుమానం వచ్చి ఆరా తీస్తే విషయం తెలిసింది.అప్పుడు పన్ను ఎత్తేస్తున్నాను మళ్ళీ వూళ్ళోకి రమ్మని వాళ్లని బతిమిలాడుకుంటూ ఒక శాసనం వేయించాడు. వీరి ప్రవక్త పుట్టకముందే ప్రపంచంలో ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి.అయినా డెబ్భయ్యేళ్ల నుంచి హిందూమతానికి సంబంధించిన సమస్తాన్ని 100% దేషించి,ద్వేషించి,ద్వేషించి ఆర్యులు వేరే ఎక్కణ్ణీంచో వచ్చి ఇక్కడ అప్పటికే ఉన్న మూలవాసీల్ని అణిచిపారేశారనే పచ్చి అబద్ధం దశాబ్దాల పాటు చెప్పి అది అబద్ధం అని తెలిశాక కూడా సిగ్గుపడనివాళ్ళు నిష్పక్షపాతంగా విమర్శిస్తున్నారని నమ్మడం ఎట్లా?

     ఇప్పటికీ వోల్గా అనే స్త్రీవాద రచయిత్రి వోడ్కా తాగి రాసినట్టు సీతని జుట్టుపట్టుకుని ఈడ్చుకుని నా కోరిక తీర్చమని బలాత్కారం చేస్తున్న రావణుణ్ణి స్త్రీవాదం ప్రకార్మ్ విమర్శించాల్సింది పోయి వాణ్ణి సమర్ధించదం కోసం రోమిల్లా ధాపర్ స్వయంగా అబద్ధం అని ఒప్పుకున్న ఆర్య-ద్రావిడ సిద్ధాంత పైత్యాన్ని కధ నిండా అపులిమేసి ఏడ్పులు,పెదబొబ్బలు,శాపనార్ధాలతో సరిపెట్టేసింది!మేము హిందువులతో కలిసి బతకలేం అని ద్విజాతి సిద్ధాంతం చెప్పినవాళ్ళని సమర్ధించేసి హిందువుల మీద దుర్మార్గాలు చేసి తమని అట్లా రెచ్చగొట్టడాన్ని కూడా హిందువుల మీదకే తోసేసి ఒక దేశంగా విడిపోయిన వాళ్ళు మతతత్వవాదులు కాదనీ,వాళ్లకి అలా కనిపించడం పూర్తిగా హిందువుల తప్పేననీ బల్లగుద్ది చెప్పారు, దేశాన్ని విడగొట్టటంలో అత్యంత ప్రధానపాత్ర వహించారు - అయినా చాలదన్నట్టు కేరళలో తమకి బలం ఉంది కదా అని ఒక మినీ పాకిస్తాన్ ఏర్పాటౄ చేసేశారు! మరి ఇన్ని విధాలుగా హిందువుల పట్ల 70 యేళ్ళపాటు పక్షపాతంతో వ్యవహరించినవాళ్ళు హిందువుల నుంచి నిష్పక్షపాతంగా వ్యవహరించడాన్ని ఎట్లా కోరుకుంటున్నారు?1947 ఆగస్టు 15కు ముందు ఏమి జరిగింది అనేది తవ్వకుండా రాజ్యాంగబద్ధంగా అన్ని విధాలా సమానహక్కుల్ని ఇచ్చిన తర్వాత కూడా కేవలం హిందువుల చేతిలో ముస్లిములు దెబ్బలు తినడం కాదు,తమకు స్థానబలం ఉన్నచోట ముస్లిములు రెచ్చిపోయినప్పుడు హిందువులూ దెబ్బలు తిన్నారు!హిందువుల వల్ల ముస్లిములు గాయపడీంప్పుడు హిందువుల్ని విమర్శించడానికి లేచినంత బలంగా ముస్లిముల్ని విమర్శించడానికి లేవలేదు,ఎందుకని?ఒకప్పుడు రాజకీయంగా ఏకం కావడానికి ఏమాత్రమూ ఇష్టపడని హిందువులు ఇప్పుడు ఇంత గట్టిగా ఏకం కావడానికి సూడో సెక్యులరిష్టుల దివాళాకోరుతనమే కారణం - అది తెలియాల్సిన వాళ్ళకి తెలియకపోవడం మ ఖర్మ!

     ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?మెజారిటీ అభీష్టానికి ఇలువ ఇవ్వటమే కదా!మరి,ఒక ప్రాంతంలో నూటికి తొంభై సతం ఉన్నవాళ్లని పట్టుకుని మీరు దుర్మార్గులు,మతతత్వవాదులు,జాత్యహంకారులు అని మారుపేర్లు తగిలించి వాళ్లకి న్యాయంగా దక్కాల్సినవాటిని సాధించుకున్నా దోపిడీ కింద లెక్కేసి హడలగొట్టటం ఎంతవరకు న్యాయం?ఒక ప్రాంతంలో సంఖ్యాపరంగా ఒక వర్గం ఉన్నచోట ఆ వర్గాన్ని ఇంత క్రూరంగా అవమానించగలగటం ఒక్క భారతదేశంలో హిందువుల పట్లనే ఎందుకు జరుగుతున్నది?

     ఇవి ఇవ్వాళ మోదీ అధికారంలోకి రావటాన్ని హిందువుల్లో మతతత్వవాదం పెరిగిపోవటంగా భావించి హదావిడి చేస్తున్నవాళ్ళు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు!మొదటినుంచీ కాంగ్రెసు పరిపాలన ఈ దేశప్రజల్ని అంతగా ముగ్ధుల్ని చెయ్యలేదనీ,ఏమాత్రం అవకాశం ఉన్నా కాంగ్రెసుని తిరస్కరించి వేరే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారని చరిత్రని నిజాయితీగా చదివితే తెలుస్తుంది.జమీందార్లనీ భూస్వాముల్నీ పోటీకి దించి కమ్యూనిష్టు పార్టీకి చెందిన బలమైన కార్యకర్తల్ని ఎత్తుకెళ్ళి ప్రలోభాలతో తమవైపుకి తిప్పుకోకుండా కాంగ్రెసు సంస్కారవంతమైన సబ్బులా ఉండిఉంటే దేశమంతటా కమ్యునిష్టులు గెలిచేవాళ్ళు - అఖండమైన మెజారిటీతో!అయిదేళ్ళకే అంతగా పరువు పోగొట్టుకున్న పార్టీ తర్వాత కాలంలో అంతగా పాతుకుపోవటానికి కారణం తమనుంచి అంత కిరాతకంగా అధికారాన్ని లాక్కున్న కాంగ్రెసుని కమ్యునిష్టులు పొగడ్డమే!ఒక బూర్జువా పార్టీకి సంబంధించిన నెహ్రూని అంతగా శాంతికాముకుడు,అభివృద్ధి కాముకుడు అని మోసెయ్యాల్సిన దురద వీళ్ళకి దేనికి?తర్వాత ఇందిరా గాంధీ నియంతలా ఎమర్జన్సీ పెడితే జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో అందరూ కల్సి ఎదురు తిరిగైతే వాళ్ళనీ గెలిపించారు భారత ప్రజలు!వాజపేయి "మీ పార్టీ పేరు అఖిల భారత భ్రష్టాచారి కాంగ్రెస్ అని మార్చుకోరాదా!" అని జోకేస్తే ఏడవలేక నవ్విన దిక్కుమాలిన కాంగ్రెసుకి ఒక బలమైన ప్రత్యామ్నాయం ఎప్పుడు కనపడినా ఆదరిస్తున్నప్పుడు మోదీ గెలుపుకి హిందూ మతతత్వవాదం పెరిగిపోవటమే కారణం అని తీర్మానించటం తెలివైన పనేనా?


     ఉద్యమనేతగా ఉన్నంతకాలం కేసీయార్ మహాసయుణ్ణి "పిట్టలదొర","కచరా" అని అన్న నేను అతను ఎప్పుదైతే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటినుంచి వ్యక్తిగత నింద చెయ్యలేదు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సాకేతికంగా తెలంగాన ప్రజలకి అతను ప్రతినిధి - ఆ స్థానాన్ని అవమానించకూడదు అనుకున్నాను గనకనే!మరి ఈ దేశప్రజలు వోటు ద్వారా అధికారం అప్పగించిన వ్యక్తిని డ్రాక్యులా అనడం ఎంతవరకు సబబు!

     హైందవేతరుల నుంచి వస్తున్న దాడుల్ని తిప్పికొట్టటానికి భాజపా నికరంగా ఏమి చేస్తున్నదని కొందరు ఆ పార్టీని అతిగా వెనకేసుకొస్తున్నారు?గతంలో ఒకానొకప్పుడు రామాలయం కడతామని చెప్పి హడావిడి చెయ్యటం తప్ప బీజేపీ హిందువులకి ప్రత్యేకంగా చేసిన గట్టి మేలు ఏదయినా ఉందా?మేము అధికారంలోకి వస్తే రామాలయం కడతామని చెప్పిన పార్టీ రామాలయం గురించి జనం అడగకుండా ఉండటానికి ఎన్ని అవస్థలు పడాలో అన్ని అవస్థలూ పడుతున్నది!రిజర్వేషన్ల పేరుతో హైందవేతరుల్ని బుజ్జగించే హడావిడి పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు - ఆంధ్రలో చంద్రబాబు క్రిస్టియన్లకి కూదా వర్తింపజేస్తానంటున్నాడు!ఇతర మతాల ధార్మిక సంస్థలు ఆయా మతాల యాజమాన్యంలో ఉంటే హిందువుల ఆలయాల్ని మాత్రం ప్రభుత్వం అజమాయిషీ చేస్తున్నది - చర్చ్ ఉద్యోగులు ఏనాడైనా జీతాల కోసం రోడ్డెక్కారా,ఆలయ పూజారులు మాతరమే ఎందుకు రోడ్డెక్కారు!కలకత్తా నిర్మల్ హృదయ సంస్థ పెట్టి దబ్బులు ఉన్నా ఖర్చు చెయ్యకుండా,వైద్యం చేస్తే బతికే వీలున్నవాళ్ళని కూడా వైద్యం చెయ్యకుండా చంపిన మతాంతరీక్రణ పండితురాలికి సెయింట్ హుడ్ ఇస్తే ఈ దేశప్రధాని వెళ్ళి చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఏమిటి?ఇవన్నీ హిందువుల గౌరవాన్ని కాపాడాల్సిన పనులేనా?అప్పుడప్పుడు అక్బరుద్దీన్ చేత వందేమాతరం పాడించాలని చూట్టం లాంటివి మాత్రమే హిందువులకి చాలునా?వాస్తవానికి హిందువులకి భాజపా అధికారంలో ఉండటం వల్ల ఒనగూడుతున్న మేలు ఏదీ లేదు!అయినా ఎందుకు హిందువులు భాజపాని ఇంతగా వెనకేసుకొస్తున్నారు?


     జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాల్లో బీజేపీ హస్తం ఉందన్నది ఏ కొంచెం బుర్ర ఉన్నవాడీకైనా తెలుస్తుంది!జయలలిత మరణానికి ముందు,తర్వాత జరిగిన కొన్ని విషయాలు చాలా చెత్త్తగా ఉన్నాయి!ఆవిద మొదటిసారి మామూలు జ్వరమే అని చెప్పై హాస్పిటల్ వార్డులోకి వెళ్ళేటప్పుడు జడ్ క్యాటగిరీలో ఉన్న ఆవిదని అనుఖనం అంటిపెట్టుకుని ఉండాల్సిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికార్లు ఆమె పక్కన లేరు!ఒక గంట తర్వత వచ్చారు,ఆ తర్వాత మరెవ్వరికీ కనపడలేదు - దాని అర్ధం ఏమిటి?ఒక అనధికారిక కధనం ప్రకారం జయలలితకీ శశికళకీ జరిగిన తోపులాటలో అక్కడికక్కడే జయలలిత మరణించిందని తెలుస్తున్నది!మోదీ దగ్గిర్నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ వరకు అందరి ప్రవర్తనా చాలా వింతగా ఉంది.ఒక రాష్త్ర ముఖ్యమంత్రి కేవలం జ్వరంతో ఉంతే పలకరించటానికే హడిలిపోయి వార్డు దగ్గిరకి వెళ్లలేదు - ఆవిడేమన్నా అగ్నిప్రమాదంలో 90% కాలిపోయి చూడరాని స్థితిలో ఉందా!గొప్పవాళ్లమని రొమ్ములు చరుచుకునేవాళ్ళంతా సినిమాల్లో కమెడియన్లకన్నా దిగజారి ప్రవర్తించారు,ఎందుకు?అప్పటికే తెలియాల్సినది తెలిసిపోయింది గాబట్టి దాన్ని తమకి అనుకూలంగా మార్చుకోవటం ఎట్లా అనే రాజకీయం ముందు సభ్యత,సంస్కారం,మర్యాద,మానాత్వం,సత్య,ధర్మం,న్యాయం అన్నీ వొదిలేసి తమ నిజరూపం చూపించారు!అయితే,కాంగ్రెసు మాదిరే ప్రజలకి మేలు చేసి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోకుండా వాళ్ల చావునీ వీళ్ల చావునీ రాజకీయంగా ఉపయోగించుకుని ఎదగాలనుకోవటం నైతికంగా అధమ స్థాయి రాజకీయం, కదా!రాజకీయంగా ఇంత అధమ సంస్కృతిలో ఉన్నవారు వ్యాపారస్తుల నుంచి ఉన్నత విలువల్ని ఎట్లా ఆశించగలరు?

     ఒకప్పుడు 2 సీట్ల నుంచి 200 సీట్లకి ఎదిగింది ఈ స్థాయి రాజకీయంతో కాదు.అప్పట్లో భాజపా నాయకులూ నిజాయితీ పరులు,వారి రాజకీయ విధానాలూ ఆదర్శవంతమైనవి!అయోధ్యలో రామాలయం కట్టడం అనేది హైందవేతరులకి వింతగా,దుర్మార్గంగా,మతతత్వాన్ని రెచ్చగొట్టడంలా కనిపించినా వారికి ప్రజలనుంచి అంతటి ప్రోత్సాహం రావడం పూర్తిగా తాము నమ్మిన ఆదర్శానికి బలంగా కట్టుబడటం వల్లనే అన్నది నిజం!ఇవ్వాళ ఆ ఆదర్సమూ లేదు,ఆ నిబద్ధతా లేదు,ఆ నిజాయితీ లేదు - అధికారం కోసం అచ్చం కాంగ్రెసునే ఇమిటేట్ చేస్తూ తను కాంగ్రెసు కన్న భిన్నమైన పార్టీ అని ఎట్లా నమ్మించగలదు?పోటుగాళ్ళలా మొండిగా ఒక్క రోజులో మసీదు కూల్చేశారు గానీ అదె పద్ధతిలో ఒక్క రోజులో ఆలయం కట్టగలరా?కేవలం ఆలయం కట్టడం కోసం దేశప్రజలంతా ఎదురులేని మెజార్తీ ఇవ్వాలా!సామరస్యంగా ఆలయంకట్టడానికి ఇప్పుడు ఉన్న మెజారిటీ చాలు - అది నాకు స్పష్టంగా తెలుసు!అయినా ఎందుకు పూనుకోవటం లేదు?ముస్లిములతో సయోధ్య సాధించి అయోధ్యలో రామాలయం కట్టగైలిగితేనే మళ్ళీ భాజపాకి ఒకప్పటి ఆదరణ వస్తుంది.లేని పక్షంలో ఆవు రాజకీయాలూ చావు రాజకీయాలూ తప్ప ఆ పార్టీ నుంచి ఉన్నతస్థాయి రాజకీయాలని ఆశించలేము.

ఇవ్వాళ ఎదగటానికి కాంగ్రెసుని ఇమిటేట్ చేస్తే రేపు ఇవే తిట్లు తినటానికీ సిద్ధంగా ఉండాలి!

21 comments:

 1. https://www.youtube.com/watch?v=SDQrEzkyJ30&feature=youtu.be

  ReplyDelete
 2. నేను ఎప్పుడూ మోడీ చేసేవన్ని తప్పు అనను. మేక్ ఇన్ ఇండియా ని నెనెప్పుడూ విమర్శించలేదు. దీని గురించి ఇంకా మాట్లాడబోయే ముందు నాకొకటి ఆశ్చర్యమనిపించి అడుగుతున్నాను.మిమ్మల్ని మోడీ భక్తుడు అన్నది ఎవరు?? మీ పోష్టులన్ని చదివాక కూడా అలా ఎలా అనగలిగాడు?

  ReplyDelete
 3. జయలలిత ఉదంతానికి సంబంధించినంత వరకు నాకొక విషయం అర్ధం కావడంలేదు. మీ విశ్లేషణ ఏమిటో చెప్పగలరా? ఇందులోనూ మీరు చెన్నై వాసులు కూడాను. నా పాయింట్ :-
  జయలలిత చికిత్స కోసం గవర్నమెంట్ హస్పిటల్ లో ఎందుకు జేరలేదు?
  రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రభుత్వ హాస్పిటల్ ను avoid చేస్తే ఎలాగ? అందులోనూ మద్రాస్ లోని జనరల్ హాస్పిటల్ 18వ శతాబ్దం నుంచీ పనిచేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వ హాస్పిటల్, దానికి అనుబంధంగా ప్రఖ్యాత మద్రాస్ మెడికల్ కాలేజ్. ఇంతటి ప్రసిద్ధ గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళకుండా ముఖ్యమంత్రి ప్రైవేట్ రంగంలోని అపోలో హాస్పిటల్ లో జేరడమేమిటి?

  ReplyDelete
 4. 1. సర్జికల్ స్ట్రైక్స్ అస్సలు జరగనే లేదు

  ప్రూఫ్: నిజంగా జరిగుంటే, ఉగ్రవాదులు, పాకిస్థాన్ ఇప్పటికి బెదిరిపోయి కనీసం నష్టన్ని పూడ్చుకునే వరకైనా మనమీద దొంగదాడులు ఆపే వాళ్ళు, కాని అవి ఎన్నో రెట్లు పెరిగాయి. వీడియో ప్రూఫ్లు ఉన్నాయి వున్నాయి అని బుకాయించి, తీరా చూపించమంగానే ప్రభుత్వం తోక ముడిచింది.

  అదేంటి అని అడిగిన వాళ్ళందరినీ తమ దగ్గరున్న పిచ్చి పేషెంట్ల నందరికీ తలకి రోకళ్ళు చుట్టి ఆ రొకల్లతో జనాల్ని బెదిరించమని దెశం మీదకి వొదిలారు. వీళ్ళనే మొడీ భజనగాళ్ళంటారు. వీళ్ళందరికీ రాముడు దేవుడుగా ఉండే వాడు, ఇప్పుడు రాముడు పనికిరాడు గానీ వీళ్ళకి మోడీనే దేవుడు. హిదుత్వమంటే వేదాలు, పురాణాలు కాదు. అవన్నీ హంబక్. హిందుత్వమంటే మోడీనే.

  2. సర్జికల్ స్ట్రైక్స్ గురించి మరిపించడానికి నోట్ల రద్దు ఒక్క గంటలో తీసుకున్న నిర్ణయం.

  ప్రూఫ్: ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్నదైతే, నోట్ల పైన అప్పటి రిజర్వ్ బాంక్ గవర్నర్ సంతకం లేదు. ప్రతి రోజూ ఫైల్యూర్ స్థాయి చూసుకోవడం కొత్త రూల్ పెట్టడం, మరుసటి రోజుకు ఎధవలవ్వడం.. ఇదే జరిగింది. 19వ తారిక్ఖునుంచి 4500/- డ్రా చేసుకోవొచ్చు అన్న మోడీ, ఈ నెల రెండుకుగాని ఆ మాట నిలబెట్టుకోలేకపోవడం దీనికి మరో గుర్తు. ఇక తన చివరి ప్రసంగంలో నోట్ల రద్దు ఎఫ్ఫెక్ట్ గురించి చిన్న మాట కూడా లేకపోవడం, మోడీ దిగజారుడుతనానికి నిదర్శనం. అస్సలు మోడీ, నోట్ల రద్దు ముందు రిజర్వ్ గాంకును సంప్రదించారా అని అడిగితే, దానికి సరు బాంకు వాళ్ళ సమాధానం "అవి సీక్రెట్, భయటకు చెప్పకూడదు.(మీలాంటి ఎదవలకి మేమెంది భె చెప్పేది అని అద్ర్ధం.)". సేం టు సేం జయలలిత చావు విషయంలో కూడా. మోర్ఖులంతా కలిసి మేము ప్రజలకు జవబుదారీ కాదు అనుకుంటున్నారు.

  ఇక ఇక్కడకూడా రోకళ్ళబాచ్చి రంగంలోకి దిగి మోడీ మంచిగానే మొదలేశాడు.. మధ్యలో ఆర్ధిక మంత్రి, రిజర్వ్ బాంకు ఏలెట్టి చెడ దొబ్బారు అంటూ తయారు.

  3. మోడీ కి అధికార పిచ్చి ఉంది. దానికోసం మతపిచ్చగాళ్ళని ఎలా వాడుకోవాలో మోడీకి తెలిసినంతగా ఇక ఏ బాజపా లీడర్కీ తెలియదు

  ప్రూఫ్: వాడి తల నరికినోడికి కోటిస్తాం, వీడి నాలుక కోసి తెచ్చినోడికి కోటిన్నరిస్తాం అని హిందూ ఉగ్రవాద సంస్థలు కొన్ని పబ్లిక్గా ప్రకటనలు గుప్పిస్తుంటే ఒక ప్రధాని స్థాయి లో వున్న మోడీ మూసుకోని కూర్చుని ఉండదమే దీనికి ఋజువు. గుంపులు గుంపులుగా మందుకోట్టి రొడ్డుమీద పడి ఇతర మతాల వాళ్ళని, కులాల వాళ్ళని తన్నుకుంటూ చంపుకుంటూ పోతుంటే, ఏం పీకుతున్నాడు మోడీ? మీరంతా అది రాష్ట్ర ప్రభుత్వాల భాద్యతని అని చెప్పవచ్చు గాక. కేంద్రం తరుపున ఇలాంటి రాక్షసులకి హెచ్చరికలు చెయ్యల్సింది పోయి, "దళితులని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి" అని కీచు గొంతుతో మెల్లగా అరిచే ప్రధానిని ఉరి తీయాలి.

  ముందు ఎలా ఉన్నా అధికారంలోకి రాగానే వాళ్ళని ఏమనకూడదని హరిబాబు పాలసీ అయ్యుండొచ్చేమోగాని, నేను మాత్రం.. మోడీని ఎప్పటికీ రక్త పిశాచి గానే సంబోధిస్తాను. విషం గాజు గ్లాసులో తాగినా, బంగారు గ్లాసులో తాగినా అది చంపే తీరుతుంది..

  ReplyDelete
  Replies
  1. @Anonymous3 January 2017 at 04:16
   ముందు ఎలా ఉన్నా అధికారంలోకి రాగానే వాళ్ళని ఏమనకూడదని హరిబాబు పాలసీ అయ్యుండొచ్చేమోగాని, నేను మాత్రం.. మోడీని ఎప్పటికీ రక్త పిశాచి గానే సంబోధిస్తాను. విషం గాజు గ్లాసులో తాగినా, బంగారు గ్లాసులో తాగినా అది చంపే తీరుతుంది.

   hari.S.babu
   అంత హఠాత్తుగా ప్రవేశపెట్టినా కేవలం ఆరు గంటల్లో విశేరెడ్ది లాంటివాళ్ళు అన్ని కట్టల్ని కొంపల్లోకి చేర్చుకోగల్గడం చూసి కూడా ముందు చెప్పి చహెసుంటే బాగుందేది,మోదీ ముందు చెప్పలేదు గాబట్టి ప్లాన్ ప్రకారం చేసింది కాదు,గంటలోనే నిర్ణయం జరిగిపోయింది అంటున్న మీకు బుర్ర లేదని అర్ధం అవుతుంది!

   మీ అజ్ఞానానికి మీరు సిగ్గుపడకుండా నాకు "అధికారంలోకి రాగానే ఏమనకూదదనే పాలసీ" ఉన్నట్టు కనిపెట్టి దబాయిస్తున్నారు,ఏమిటీ తెలివి?ఈ వెర్రిబాగుల తనం బయటపడి అసలు ముఖం తెల్లబారకుండా ఆజ్ఞాత ముఖం మిమ్మల్ని కాపాడుతున్నది,లేకపోతేనా?

   నోట్ల రద్దు ప్రస్తావన అనెది బయటికి చెప్పకముందే 2000 నోట్ల విడుదల గురించి పాత పేపరులో చదివాను నేను,అది కూడా తేదీ గుర్తు లేదు,ప్రతిసారీ అన్నీ రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టు మొదలెడితే వేసిన పోష్టునే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ఉండాలి,మీకు బోరు కొట్టదేమో గానీ నాకు మాత్రం చచ్చేంత బోరు!మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ గురించి ఎత్తుకున్నారు - ఇదేక్కడి గోలరా దేముడా:-(

   Delete
  2. హరిబాబు గారు,

   మీ బ్లాగులో పదే పదే రాసే ఈ అజ్ణాత వ్యాఖ్యలు చదువుతూంటే చికాకు, జుగుప్సా, అసహ్యం వేస్తున్నాది. మా ఇంట్లో ఇండియన్ ఐర్ ఫోర్స్ లో వింగ్ కామాండర్ గా పనిచేసిన వాళ్ళున్నారు. 1971 లో యుద్దంలో పాల్గొన్నారు కూడాను. త్రివిధ దళాల గురించి ఏ మాత్రం అవగాహన లేని, ఊరుపేరు లేని ఉచ్చ గుంటలో చేపలు పట్టే స్థాయి గల ఒక వెధవ, అభిప్రాయం రాస్తే వాటిని మీరు ప్రచూరించి చర్చించాల్సిన అవసరం ఎమి ఉన్నాది? భావకాలుష్యం పెంచే ఈ వ్యాక్యలు మీ బ్లాగులో ప్రచూరించటం చూస్తే బాధ వేస్తున్నాది.

   Delete
  3. అణుపరిక్షలు చేసిన దేశాలు ఫలానా రోజు ఈ సమయం లో,
   ఈ ప్రదేశంలో మేము అణుపరీక్ష చేశాము అని ప్రకటించుకొంటాయి. దానికి ఇతర దేశాల వారు,ప్రతి పక్షం వారు సాక్షాలు అడగరు. ప్రపంచంలో అనేక దేశాల వారికి, వీళ్ళు నిజంగా చేశారా లేదా అనే విషయం, టెక్నాలజి సహాయం తో తెలుసుకొంటారు. అణుపరిక్షలు చేసిన దేశం ప్రకటించే తీవ్రత తెలుపుతూ ఇచ్చిన వివరాలతో వాళ్ళ దేశాల పరిశోధానా లయాలలో రికార్డ్ అయిన వివివరాలతో పోల్చి నిర్ధారించుకొంటారు. పరిక్షలు చేశారో లేదో ఆ దేశానికి వెళ్ళకుండానే తెలిసిపోతుంది. అంతేకాని మీరెక్కడ అణుపరీక్ష చేశారు,ఎంతమంది చేశారు? ఎలాఏశారు? పోటోలు,వీడీయోలు చూపించండి లేకపోతే మేమొచ్చి చూస్తాం అని అడగరు. సర్జికల్ స్ట్రైక్స్ అంతే.

   అవి జరిగిన తరువాత మిలటరీ అధికారి ఇచ్చిన మీడీయా స్టేట్మెంట్ ప్రపంచ వ్యాప్తంగా చూసారు. అందులో సమయం,ప్రదేశం మొదలైన విషయాలు చెపుతారు. మిలటరి వాళ్ల దగ్గర ఎన్నో మార్గాలలో చెక్ చేసుకోనే ఫెసిలిటి ఉంట్టుంది.
   ప్రపంచంలోని మిలటరి వాళ్లకి, వాళ్ళ ప్రోటోకాల్స్ ఉంట్టాయి. సర్జికల్ స్ట్రైక్స్ లో పాల్గొన్న పై అధికారుల రాంకింగ్ ను బట్టి ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ ను ఎంత సీరియస్ గా తీసుకొందో ఇతరదేశాలకు అర్థమైపోతుంది. కనుకనే ఇంగ్లీష్ న్యుస్ ఛానల్స్ లో మొదట ఆ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారుల స్థాయిని చెప్ప్తారు. ఇవేవి తెలియకుండా మోడి ప్రభుత్వం బ్లఫ్ చేసిందని వాదించే వెధవలను మనుషులా భావించి వాళ్ళ వ్యాఖ్యలను ప్రచూరించటం అది మీ మీస్థాయికి తగని పని.

   *మీ అజ్ఞానానికి మీరు సిగ్గుపడకుండా *

   వాడి అజ్ణానాన్ని గొప్ప విజ్ణానం అనుకొంట్టున్నాడు. అంత జ్ణానం పొంగిపొరలితే వాడిని ఒక బ్లాగు పెట్టుకొని రాసుకొమ్మనేది. వాడితో చర్చ ఎమిటి? ఎంతమంది చదువుతారో తెలుస్తుంది. మీబ్లాగులో రాసే వ్యాఖ్యలను విచక్షణతో మీరు పరిశీలించి ప్రచూరించకుండా ఉండాల్సింది.

   Delete
  4. సర్జికల్ స్ట్రైక్స్ మీద సాక్ష్యాలు అడిగేవారిని ఐ.క్యు. చూస్తూంటే ఎమనిపిస్తుందంటే ఒక ఉదాహరణ. కంపెనీ లాప్ టాప్ లో ఇన్ స్టాల్ చేసిన సాఫ్ట్వేర్, యాంటి వైరస్ లను లిస్ట్ ను చూడటానికి నీ డేస్క్ దగ్గర కొచ్చి చెక్ చేసి చూసి నిర్ధారిస్తాం అంటే ఎలా ఉంట్టుందో అలా ఉంది. నేడు మనం అందరికి తెలుసు, సిస్టం ఆన్ చేయటం లాప్ టాప్ లో ఉన్న సాఫ్ట్ వేర్ లిస్ట్ ప్రతి ఒక్కటి నెట్ వర్క్ డిపార్ట్ మెంట్ దగ్గర ఆటోమేటిక్ గా వెళిపోతుంది. అటువంటి దానిని మీదగ్గర కొచ్చి చేక్ చేస్తే కాని నమ్మను అని ఎవరైనా అంటే ఎలా ఉంట్టుంది? వాడికి సాఫ్ట్ వేర్ లో ABCD lu తెలుసని అనుకొంటారా? వాడి మాటలకు విలువ ఇస్తారా? అలా laptop దగ్గరకు వచ్చి స్వయంగా చెక్ చేసి నిర్ధరించుకొనే వాడు జాగ్రత్త పరుడని, మహా తెలివిగలవాడని అనుకొంటే ఇతరులు మాత్రం జోకర్ అని కామేడిగా తీసుకొంటారు.

   Delete

  5. The story of Kashmir through the eyes of a soldier | Major Gaurav Arya

   https://www.youtube.com/watch?v=aWWl2ddT71s

   Delete
  6. Sardar Patel on vision of India - HINDU RASHTRA
   https://www.youtube.com/watch?v=RGQHxbRnhO8

   Sardar Patel's GREATEST speech on Kashmir ,Pakistan and Partition

   https://www.youtube.com/watch?v=LNtUiyl4g-A

   Sardar Patel August 16th 1948 Speech
   https://www.youtube.com/watch?v=iFX1UP3xRPs

   Delete
  7. Dr Subramanian Swamy on Sardar Vallabhbhai

   https://www.youtube.com/watch?v=ow1Y3xhW6cc

   Dr B.R. Ambedkar speaks on M.K. Gandhi [BBC sound archives]
   https://www.youtube.com/watch?v=_FNSQcEx02A

   https://www.youtube.com/watch?v=XALsEguKumI

   Delete
 5. హరిబాబుగారూ,
  Harappa Script & Language: Data mining of Corpora, tantra yukti & knowledge discovery of a civilization Paperback – Import, 20 Sep 2016
  by S. Kalyanaraman (Author)

  ఓ మంచిపుస్తకం గురించి చదివాను, నా దగ్గర స్మార్ట్ పోనూ లేదు, 2,500 రూ. లు లేవు గనక కొనలేదు. మీకు ఆసక్తి వుంటే తప్పక కొని చదివి విషయాలను చెప్పగలరు.

  This is a treatise, a formal and systematic written discourse on knowledge discovery of a civilization in two domains of knowledge 1. Archaeo-metallurgical advances during Bronze Age Revolution; and 2. Invention of a writing system to document, in Meluhha (Harappa) language, technical details of these advances anchored on the imperative of supporting long-distance trade transactions by seafaring artisans and merchants. The objective of the treatise is to unravel the semantics of Dharma samjnA or Bharatiya hieroglyphs using a method of data mining. The method of data mining of Harappa Script Corpora of over 7000 inscriptions is based on the principles of tantra yukti. The doctrine of tantra yukti provides a scientific basis for reconstructing the lexis of an ancient Bharata language, Meluhha (Mleccha). The lexis (vocabulary) matches both the hieroglyphs/hypertexts and the metalwork catalogues signified by the Corpora. Since the Bronze Age Revolution increased interactions among people across space and time, many of the 25+ ancient languages of Bharata retain all spoken (parole) words and expressions in Meluhha lexis related to metalwork. This reinforces the linguistic identification of areal languages features within a linguistic union, Bharata sprachbund. Meluhha artisans are attested in cuneiform texts and as language on Shu-ilishu cylinder seal. Mleccha (cognate) language is attested in Manu (mleccha vAcas or mlecccha speech) and Mahabharata. The Great Epic also refers to mleccha rulers and people from many janapada-s of Ancient Bharata and many contact regions in Ancient Near East and Ancient Far East. The broad-spectrum coverage may be seen from the Table of Contents of this 799 page book. Tantra yukti doctrine is precisely defined for linguistic analyses and is applied to delineate the origin and formation of ancient languages of Bharata. Annex A Harappa Script inscriptions found in temple area of Mohenjo-daro (and Harappa) Annex B Dharma samjnA Corporate badges of Harappa Script Corpora, ceramic (stoneware) bangles, seals, fillets Annex C Form and function of inscribed tablets, miniature tablets Annex D Ligatures to ayo, aya 'fish' rebus: aya 'iron' ayas 'metal', meD 'body' rebus: meD 'iron' semantic modifiers as hypertexts and Harappa Script inscriptions on 240 copper tablets Annex E Clustering 'temple' hieroglyph, pictorial narratives of kneeling adorant, together with markhor and offering on a stool Annex F Multiple tablets with same inscription in Harappa signify work-in-process in circular platforms Annex G kulA 'hood of snake' as tail and Harappa Script hypertext Annex H Black ant hieroglyph Annex I Hieroglyphs of animal clusters. Mohenjo-daro m0304 (Reconstructed) Seal. A person is shown seated in 'penance' may signify Trisiras Annex J Crocodile, scorpion, disheveled hair in Harappa Script hieroglyphs signify work in bica 'haematite stone ore' Annex K Structure, form, function and significance of cashala on yupa and carburization Annex L List of Harappa Script 'text signs' Select inscriptions of Harappa Script Corpora A remarkable cultural continuum is traced from the octagonal yupa found in Binjor and authenticated in ancient Vedic texts. The Rudra bhAga of sivalingas are octagonal in shape and consistent with the adhyatmika enquiry of Skambha Sukta in Atharva Veda (X.7,8).

  ReplyDelete
 6. పార్ట్ 2

  The finds of 19 yupa inscriptions attest to the performance of Soma Samsthaa Yaga including 5 in East Borneo attributed to Mulavarman. The Binjor seal dated to ca. 2500 BCE is the stunning inscription comparable to the yupa inscriptions of historical periods. The Binjor seal documents metalwork, bahusuvarnaka (an expression used in the Epic, Ramayana, by Vamiki). Ancient Bharat accounted for 32.9% of world GDP at 0CE. This is a measure of contribution made by ancient artisans and merchants of Bharat.Lessons of History may be an inspiration for youth to regain status of Bharat governed by the dharma: work is worship  http://www.amazon.in/Harappa-Script-Language-knowledge-civilization/dp/0991104870?ie=UTF8&camp=3638&creative=24630&creativeASIN=0991104870&linkCode=as2&linkId=b3019208a685b336ceb5e16182d38e7b&redirect=true&ref_=as_li_qf_sp_asin_il_tl&tag=india028-21

  ReplyDelete
 7. విన్నకోట వారూ,
  "జయలలిత చికిత్స కోసం గవర్నమెంట్ హస్పిటల్ లో ఎందుకు జేరలేదు?" అని ప్రశ్నిస్తున్నారు. మనదేశంలో ప్రముఖులకు అనారోగ్యం కలిగితే వారు వీలైతే తప్పక విదేశాల్లో వైద్యంచేయించు కుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారు దేశంలోని వీలైనంత ఖరీదైన వైద్యాలయాలలో చికిత్సను పొందుతారు. అప్పుడు కూడా సాధ్యమైనంతవరకూ వారు వీలైనంత త్వరగా వైద్యానికి విదేశాలకు వెళతారు. అందులో విశేషం కూడా ఏమీ లేదు - వారంతా ప్రముఖులు కదా - వారి ఆరోగ్యం కోసం దేశం తహతహలాడుతుంది కదా. అందుచేతన్న మాట. సాధారణప్రజానీకానికి దేశవాళీ వైద్యమే గతి. డబ్బుంటే ఆ ప్రజల్లోనూ ఖరీదైనవైద్యాలయాలకే పోయే అలవాటు ఉండనే ఉంది. ప్రభుత్వవైద్యాలయాల వంటివి గతిలేని జనాలకే అన్నమాట. అందుకే అక్కడ వైద్యం మాట అటుంచి వైద్యులు కనబడటమే అరుదు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు శ్యామలరావు గారూ. సరిగ్గా చెప్పారు. అవునండీ నా పాయింట్ కూడా అదే. నాయకులు తమ పిల్లల్ని ప్రభుత్వ విద్యాసంస్ధలకు పంపించడం అయితే ఏనాడో మానేసారు. తమ వైద్యం సంగతి వచ్చేసరికీ అదే తీరు. అంటే ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే వాళ్ళకే భరోసా / ధైర్యం లేదన్నమాట. అదే ఏదైనా అరెస్ట్ భయమో / అనుమానమో ఉన్నప్పుడు మాత్రం ప్రభుత్వ హాస్పిటళ్ళు గుర్తుకొస్తాయి నాయకులకు.

   వైద్యంకోసం ముఖ్యమంత్రే వచ్చారంటే హాస్పిటల్ మొత్తం అప్రమత్తమవుతుంది కదా. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో లేని పరికరాలా (కాకపోతే వాటి మెయింటెనెన్స్ గాలికొదిలేస్తారు గానీ). ఇక స్వదేశీ, విదేశీ నిపుణులంటారా, ముఖ్యమంత్రి ఏ హాస్పిటల్లో ఉంటే అక్కడికే వస్తారు దానిదేముంది. అత్యవసరమైతే ఫారినూ తీసుకెళ్ళవచ్చు తప్పేమీ లేదు. కానీ ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్లోనే వైద్యం చేయించుకున్నారంటే (ఫలితం ఏమైనప్పటికీ; ఒకవేళ అక్కడ నుంచి ఫారిన్ తరలించినప్పటికీ) ప్రజల్లో ఒక అనుకూల భావన - ఆ నాయకుడి పట్లా, ఆ ప్రభుత్వ హాస్పిటల్ పట్లానూ - కలుగుతుందని నా అభిప్రాయం.

   చివరికి ఇదంతా మన బ్లాగుశోషే లెండి. మేరా భారత్ మహాన్.

   Delete
 8. హరి బాబు గారు.
  ఈ నూతన సంవత్సరం మీకు మీ కుటుంబానికి అన్ని
  విధాలా అనుకూలంగా, ఆరోగ్యకరంగా, శుభప్రదంగా,
  ఆనందదాయకంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
  __/\__ …"

  ReplyDelete
 9. ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? నోట్ల రద్దు వల్ల బ్యాంకింగ్‌లోకి రాని 50 వేల కోట్ల రూపాయలు, నల్లధనం వెల్లడి స్కీమ్‌ కింద వచ్చిన 50 వేల కోట్ల రూపాయలు వెరసి లక్ష కోట్ల రూపాయలు సర్కారుకు ప్రస్తుతానికి లాభం. ఇవి కాకుండా గరీబ్‌ కల్యాణ్‌ యోజనా స్కీమ్‌ కిందా, ఆదాయం పన్ను శాఖ దాడుల కారణంగా మరో 50 వేల కోట్లు లభించే అవకాశం ఉందని భావిద్దాం. అంతాకలిపి, నోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి అదనంగా అందుబాటులోకి వచ్చే మొత్తం 1.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. 100 కోట్ల మంది ప్రజలను 50 రోజుల పాటు హింసించి సాధించిన మొత్తం. మరి దీనికి చెల్లించిన మూల్యం... దాదాపు అంతర్జాతీయ సంస్థలన్నీ ఈ ఏడాది జిడిపి కనీసం రెండు శాతం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నాయి. అంటే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఒక స్పీడ్‌పై ఉన్న ఆర్థిక రంగం కోలుకోవాలంటే మరికొన్ని నెలలు పడుతుంది. కొన్ని త్రైమాసికాలుగా దేశ ఆర్థిక రంగంలో కొత్త పెట్టుబడులు లేవు. ప్రైవేట్‌, పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మందగించాయి. కేవలం వినియోగంలోని జోరు ఆర్థిక రంగానికి ఊతం ఇస్తూ వచ్చింది. పెద్ద నోట్ల రద్దు ఈ వినియోగాన్ని చావుదెబ్బతీసింది. ఉత్పత్తుల రంగం ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయం, సర్వీసుల రంగం దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ స్థాయిలో నష్టానికి సిద్ధపడి ప్రభుత్వం కాంక్షిస్తున్న పరమ ప్రయోజనం ఏమిటి? ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? నోట్ల రద్దు వెనక అసలు లక్ష్యం నల్లధనం వెలికితీత మాత్రం కాదు.

  అవినీతిపై నిజంగానే ప్రభుత్వానికి కక్ష ఉంటే, నల్లధనం మూలాలపై దెబ్బతీయాలన్న కోరిక ఉంటే నూరు కోట్ల మందిని హింసించాల్సిన అవసరం లేదు. కేవలం ఒక లక్ష మందిని టార్గెట్‌ చేస్తే చాలు. దేశంలో మొత్తం 34 డెట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌ ఉన్నాయి. వీటిలో 5 లక్షల కోట్ల రూపాయల విలువైన రుణాల రికవరీకి సంబంధించిన 70 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నోట్ల రద్దు ద్వారా ప్రభుత్వానికి సమకూరుతుందని అంచనా వేస్తున్న మొత్తం కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ప్రజలను బెదరగొట్టి వారి కష్టార్జితాన్ని బలవంతంగా బ్యాంకులకు తరలించేకంటే, బ్యాంకులకు న్యాయంగా రావాల్సిన సొమ్మును ఇప్పించేందుకు ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు?
  500 కోట్ల రూపాయలుపైగా బ్యాంకులకు ఎగవేసిన డిఫాల్టర్ల పేర్లను బహిరంగంగా ప్రకటించాలని అత్యున్నత న్యాయస్థానం చెబుతున్నా, ఆర్‌బిఐ మాత్రం వెనకాడుతోంది. బ్యాంకులను కొల్లగొట్టి, పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ఇన్వెస్టర్లను లూటీ చేసి కంపెనీలను మూతపెట్టి విలాసవంతమైన జీవితాలను గడుపుతున్న దగాకోరు ప్రమోటర్ల ఆస్తులు జప్తు చేసి, వారిని బోనెక్కించే చట్టాలను ప్రభుత్వం చేయగలదా? అయినా, నల్లధనమే టార్గెట్‌ కానప్పుడు ఈ ప్రశ్నలేవీ ముఖ్యం కాదు. నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం 2017 ఇష్టం. పోతూ పోతూ 2016 మాత్రం చాలా ముఖ్యమైన పాఠాలనే చెప్పింది.

  to be continued

  ReplyDelete
 10. ప్రపంచీకరణ పల్లకీని మోస్తున్నవారే కాడి కిందపడవేస్తున్న అరుదైన దృశ్యాన్ని కూడా ఆవిష్కరించింది. ఐరోపా సమాఖ్య నుంచి బయటకొచ్చేందుకు బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయం (బ్రెగ్జిట్‌); అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ విజయం... ఈ రెండు పరిణామాల్లోనూ ‘‘ఎవడి బాగు వాడు చూసుకోవాలి’’ అనే అంశమే కామన్‌గా ఉంది. మొన్నటి వరకు ఈ దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)ను ముందు పెట్టుకొని ప్రపంచీకరణను ప్రచారం చేశాయి. వర్ధమాన దేశాలను రక్షితవాద విధానాలంటూ ఈసడించాయి. ముగ్గులోకి లాగేవరకు బెదరగొట్టాయి. ఇప్పుడు తమ సుఖమే తమకు ముఖ్యమని చెబుతున్నాయి. బ్రెగ్జిట్‌ నిర్ణయం, విజయహాసంతో ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలు ప్రపంచీకరణ నుంచి వెనుతిరిగే వైఖరినే స్పష్టం చేస్తున్నాయి. తమ దేశ ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెబుతున్నాయి. ఇదే సమయంలో ముడి చమురు ధరలు పెంచేందుకు ఒపెక్‌ దేశాల మళ్లీ జట్టుకట్టాయి. పోటీ వాణిజ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి ఉత్పత్తిని తగ్గించి, సప్లయ్‌ని తొక్కిపెట్టి రేట్లను పెంచుకోవాలని నిర్ణయించాయి.

  ఈ మూడు కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంవత్సరంలోనే భారత పెద్ద నోట్ల రద్దు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకున్న అనుభవాన్ని బట్టి ఇది స్వీయవిధ్వంసానికి దారితీసిన నిర్ణయం. పరప్రయోజనాలకు పెద్దపీటవేసే ప్రపంచీకరణ స్ఫూర్తి నిండిన నిర్ణయం. బ్రిటన్‌, అమెరికా బాటలో భారత్‌ కూడా తనను తాను రక్షించుకోవాలనుకుంటే ఉపశమన చర్యలు మాత్రమే కాకుండా ఉపసంహరణ చర్యలూ తీసుకోవాలి.

  ReplyDelete
 11. పదహారవ శతాబ్దంలో, ప్రస్తుతం ఇండియాగా పిలవబడుతున్న దేశం ఈ రూపంలో లేనప్పుడు, సెక్యులరిజమ్ అన్న భావనే ప్రపంచంలో లేనప్పుడు అసలు ప్రజాస్వామ్యం అన్నదే లేని కాలంలో మొట్టమొదటి ముగల్ చక్రవర్తి జహీరుద్దీన్ ముహమ్మద్ బాబర్ (1483-1530) సెక్యులరిజం సూత్రాలను నిర్వచించాడు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కోటలో బాబర్ తన వీలునామా రాయించాడు.


  https://www.facebook.com/wahed.one/posts/10154960043469884

  ReplyDelete
 12. రచయిత్రి ఓల్గా తో సంభాషణ

  http://pustakam.net/?p=19050

  మత అసహనం మనుషుల మధ్య సంబంధాల్ని పెళుసుబారేట్టు చేస్తుందన్న విషయాన్ని వస్తువుగా చేసుకొని మీరు ‘సారీ జాఫర్’ కథ రాశారు. అయితే యివాళ మత అసహనాన్ని మత రాజకీయాలకి ఉపయోగించుకొనే శక్తులు ముందుకు వచ్చి సాంస్కృతిక జాతీయ వాదం పేరుతో cultural revivalism వైపు నడిపించే పరిస్థితి యేర్పడింది . ఇది స్త్రీలు పోరాడి సాధించుకొన్న హక్కుల్ని బలహీన పరుస్తుందనీ , స్త్రీ విముక్తికి ఆటంకంగా పరిణమిస్తుందనీ మీరు భావిస్తున్నారా?

  మన సమాజంలో ఇన్ని అభ్యుదయకర శక్తులూ ఉద్యమాలూ ఉండి కూడా మతవాదుల చేతుల్లోకి ప్రభుత్వం వెళ్ళటం అనేది అందరి ఓటమి అని ఒప్పుకోవాల్సిందే. మతతత్త్వాన్ని రాజకీయాలకు వాడుకోవటం వల్ల అధికారం పొందవచ్చని గ్రహించిన శక్తులు ఇష్టం వచ్చిన పద్ధతులన్నీ ఉపయోగించి 90వ దశాబ్దం నుంచీ ప్రజలను రెచ్చగొడుతున్నారు. మైనారిటీ ప్రజలను హింసిస్తున్నారు – భయపెడుతున్నారు. అసలు మతం గురించి పట్టించుకోకపోవటం వామపక్ష శక్తులు చేసిన పొరపాటా? మతం వ్యక్తిగత విశ్వాసమనీ దానిని ప్రజాజీవితంలోకి , బహిరంగ ఆచరణలోకి తీసుకురాకూదదనీ ఒక పద్ధతిలో ప్రచారం చేయలేకపోయాం. ప్రజలకు ఆధ్యాత్మిక అవసరాలుంటాయి – అనే విషయం మనం గమనంలోకి తీసుకోలేదు. వారి ఆధ్యాత్మిక అవసరాలకు లౌకిక మార్గాలను చూపించలేదు. ప్రపంచంలో అభద్రత పెరిగినప్పుడల్లా ప్రజలు ఆధారం కోసం ఏదో ఒక బలం కోసం మతవిశ్వాసాల వైపు పరుగెడుతుంటారు. ప్రజల ఆ బలహీనతను మతతత్త్వ శక్తులు సొమ్ముచేసుకుంటుంటే మనం చూస్తూ ఊరుకున్నామా? దేవుడు లేడు – అని చెప్పేసి చేతులు దులుపుకున్నామా? ఇలా చాలా రకాలైన ప్రశ్నలకు ఈ రంగంలో మనం సమాధానం వెతకాలి. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితి తీవ్రమైంది. అఖండ భారత్ పేరుతో హిందూ సంస్కృతి పేరుతో మన బహుళత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలనే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.

  సంస్కృతి అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకు వచ్చేది స్త్రీలే. సంస్కృతిని పరిరక్షించే భారమంతా స్త్రీల భుజాల మీదే ఉన్నట్లు కట్టడులను , కంట్రోళ్ళను విధిస్తారు. ఇప్పుడు హిందూత్వ సంస్కృతి రక్షణ భారం కూడా చివరకు స్త్రీల నెత్తినే పడుతుంది. వారి మీద మతపరమైన కులపరమైన లింగపరమైన హింస పెరుగుతుంది. అనేక ఆంక్షలు వాళ్ళను వెనక్కి నెడతాయి. దీన్ని వ్యతిరేకిస్తూ పోరాడాల్సిన అవసరం స్త్రీలకే ఎక్కువగా ఉంది. దీన్ని గురించి ఫెమినిస్టులుగా మేము తీవ్రంగానే ఆలోచిస్తున్నాం. తక్షణ కార్యాచరణ నుండి తాత్త్విక పునాదుల వరకూ పలు కోణాలలో ఈ మతతత్త్వాన్ని నిలువరించాలని ప్రయత్నిస్తున్నాం. అగ్రరాజ్య ప్రయోజనాల కోసం వాళ్ళు పెంచి పోషిస్తున్న మత ఉగ్రవాద ధోరణులను సామాన్యులకు అర్థం చేయించి వారిని మతోన్మాదం నుంచి ఆధ్యాత్మికత వైపు మళ్ళించగలిగే వ్యూహాల గురించి లౌకిక ప్రజాస్వామ్య వాదులందరూ ఆలోచించాలి. సమభావననీ ఉన్నతమైన విలువలనూ పెంచే ప్రత్యామ్నాయ ఆధ్యాత్మికత గుర్తించి దానిని ప్రజలకు పరిచయం చేసి , దానిని వారి జీవిత విధానంలో భాగంగా మార్చే మార్గాల గురించి ఆలోచించాలి.

  ఆధ్యాత్మికత అనగానే ఉలిక్కిపడకూడదు. ఆధ్యాత్మికత వేరు – మతం వేరు – దేవుడు వేరు. ప్రతి మనిషికీ ఉన్నతమైన విలువలతో సౌందర్య భరిత వాతావరణంలో ఉత్సవ సౌరభంతో సంబరాల మధ్య బతకాలనే ఆకాంక్ష ఉంటుంది. ఆ ఆకాంక్షలను మతోన్మాదం వాడుకుంటోంది. ప్రజల్ని పిచ్చివాళ్ళను చేస్తుంది. లౌకిక శక్తులు దానిని అసలు పట్టించుకోకుండా ఊరుకుంటే మన మాటలను అర్థం చేసుకునేవారు కరువైపోతారు. కాబట్టి మామూలు మనుషుల కోసం కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన ఆచరించాల్సిన అవసరం ఉంది. దీన్ని స్త్రీవాదులుగా మేం గుర్తించాం.

  ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు