Tuesday 27 September 2016

ప్రతి మూడు రాంగ్ ఆన్సర్లకి ఒక మార్కును తీసేసినప్పుదు ప్రతి మూడు కరెక్ట్ ఆన్సర్లకి ఒక మార్కు కలపటం న్యాయం, కలుపుతారా?

     ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఆబ్జెక్టివ్ ప్రశ్నాపత్రాలకు మార్కులు వెయ్యటానికి కొన్ని కొత్త పద్ధతుల్ని ప్రవేశపెట్టారు.అందులో ఒకటి మైనస్ మార్కులు - ప్రతి మూడు తప్పుడు జవాబులకి ఒక మార్కు అదనంగా తగ్గుతుంది.పబ్లిక్ పరీక్ష ద్వారా ఉద్యోగార్ధి ప్రభుత్వంలోని కీలకపదవులని అనుభవించే సౌకర్యం ఉందటం వలన ఈ పరీక్షలకి పోటీ చాలా ఎక్కువైపోయి వారిని వడకట్టడానికి ఈ కండిషన్ పెట్టినట్టు తోస్తున్నది!ప్రభుత్వకార్యనిర్వహణలోకి వెళ్ళాల్సినవారు తప్పులు తక్కువ చేసేటట్టు చూడటం అని ఏమైనా సీరియస్ లాజిక్ చెప్తారేమో గానీ నాకైతే ఇది పరమ క్రూరమైన నిబంధనగా కనిపిస్తున్నది.

     ఒకో తప్పుకి ఒకో మార్కు పోయి కటాఫ్ మార్కును చేరుకోలేకపోవటం ఇప్పటికే ఉద్యోగార్ధులను నిరాశపరుస్తునది, న్యాయమే కాబట్టి సరిపెట్టుకుంటున్నారు.ఉదాహరణకి ఆ పేపరుకి సంబంధించి క్వాలిఫై అవడానికి 85 మార్కు అయినప్పుదు 15 తప్పులు చేసినా 16వ తప్పు చెయ్యకుండా ఉంతే అతను సెలక్ట్ అవుతాడు.16వ తప్పు చేసినవాడు మిగతా అన్ని సబ్జెక్టూలలోనూ అద్భుతంగా రాసినా ఆ ఒక్క మార్కుతో అతను వెనక్కి పోతున్నాడు.మరి ఇప్పటి పద్ధతిలో అయితే 16వ తప్పు చేయ్యకపోయినా 15 తప్పులు 20 అయినప్పుడు ఆ ఉద్యోగార్ధి పరిస్థితి ఏమిటి?

     ఒక ఉద్యోగార్ధి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిక్షలు ఎన్నిసార్లు రాస్తాడు?ఎన్నిసార్లు రాయాలి!పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం ఎంత శ్రమ పడుతున్నారు కుర్రాళ్ళు?వీళ్ళలో 15 తప్పులు 20 కావటం వలన లక్ష్యాన్ని అందుకోలేక నిరాశతో ఆత్మహత్యకి తెగబడినవాళ్ళని తిరిగి బతికించగలరా?

1 comment:

  1. మీరు చెప్పింది 100% నిజం. మన పరిక్షా విధానంలోనే తప్పుంది. పరీక్ష ఆప్షన్లులొనే రాయాలన్నప్పుడు, కనీసం 'నాకు తెలియదూ అనే ఎక్ష్ట్రా ఆప్షన్ పెట్టి, ప్రతి తప్పుకు ఒక మార్కు మైనస్ చేస్తే, నిజమైన టాలెంటు వున్నవాళ్ళకి న్యాయం జరుగుతుంది. లేకపోతే, నూటికి కనీసం 20 మంది సోమరి పోతులు పాసవుతారు.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...