Thursday 7 August 2014

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా! ఆ అన్నాన్ని తిట్టిన వాడు ముఖ్యమంత్రి యెట్లా అయ్యాడు?

                                      సీ||          ఆంధ్ర బిర్యానీని పేడ యనిం డొక
                                                       బాడుఖావు! పరుల భోజనాన్ని

                                                       కావరమున వెటకారించె టోడు మ
                                                       నిషె కాడుగా, పవరిచ్చి రెట్ల

                                                       ఘనమైన గా తెలంగాణోళ్ళు? మొదలెమొ
                                                       మా తిండిపై వూస్తడా, అటెన్క

                                                      మమ్ముల్ని కడుపుల బెట్కొని సూస్తడా!
                                                      గిట్ల జూస్తె పురుషుడూ గట్ల జూస్తె

                                    తే||            ఆడదీ ఐన బహురూపి లాగ వుంది
                                                      గా దిమాగు యెక్వోని నయా జమాన!!
                                                      వూరు పేరు లేనోళ్ళు గొప్పోళ్ళ నేందొ
                                                      పనికిమాలినో ళ్ళంటున్రు పొగరు బట్టి!!!
(28/07/2014)
______________________________________________________
     నాకు మొదటి నుంచీ తెలంగాణా వుద్యమాన్ని గురించి ఒక సందేహం పట్టి పీడిస్తూ ఇప్పటికీ జవాబు దొరక్కుండా యేడిపిస్తుంది - అంత చదువుకుని ఇంత చెత్తగా మాట్లాడుతున్నారు, యేమిటి వీళ్ళ సంస్కారం? పోనీ తెలంగాణా సంస్కృతే అంత అనుకుందామా అంటే - నాకు వస్తుతః తెలియదు గనక వారూ వీరూ చెప్పిందే ఆధారం, మరి గొల్లపూడి మారుతీ రావు గారి దగ్గిర్నుంచీ అందరూ చాలా గొప్పగా పొగుడుతున్నారు!యెంత వైరుధ్యం?యే ప్రజల కోసం పోరాడుతున్నాం అంటున్నారో ఆ ప్రజల సంస్కారానికి యే మాత్రం సంబంధం లేకుండా ప్రవర్తించే వాళ్ళు తామే తెలంగాణా ప్రజలకు నిజమయిన ప్రతినిధులుగా డప్పు కొట్టుకుంటున్నారు!

      న్యాయ పోరాటం పేరుతో వీళ్ళు చేసిన వుద్యమ విధానాన్ని చూస్తే ప్రపంచంలో న్యాయం కోసం పోరాడిన వాళ్లంతా సిగ్గుతో తల దించుకోవాలి!మా వుద్యోగాలు లక్షల్లో లాకున్నారు, మమ్మల్ని మా హైదరాబాదు నుంచే మెడబట్టి గెంటేసి కులుకుతున్నారు - కావాలంటే గిర్గ్లానీ రిపోర్టు చూడండని యెక్కడ బడీతే అక్కద రెచ్చి పోయారు, చదువుకున్న వాళ్ళు మరీ ఇంతగా అబధ్ధాలు చెప్పగలరని అనుకోలేదుగా - ఈ మధ్య వరకూ నేనూ నిజమే నని నమ్మేశా!తీరా చూస్తే ఆయన వీళ్ళ వాదనకి పూర్తి విరుధ్ధంగా వుల్లంఘనలు అన్ని జోన్ల లోనూ జరిగాయి, అందరూ నష్టపోయారు అని నిక్కచ్చిగా  చెప్పాడు.ఈ ప్రస్తావన మూడుసార్లు గ్రీన్ స్టార్ అనే తెలంగాణా మేధావి నుంచి వచ్చింది.మొదట మాలతీ మాధవం బ్లాగులో ఈ విభజన గురించి ఆమె నాకు ఈ లెక్కలూ డొక్కలూ యేమీ తెలియవు కానీ విడిపోవటం బాధగా వుంది అనే ధోరణిలో వుంటే అరిభీకరంగా చెల రేగిపోయాడు - గిర్గ్లానీ రిపోర్టు గురించి. ఒక లింకు గూడా ఇచ్చేశాడు - అది గిర్గ్లానీ గారు ఈనాడు కి ఇచ్చిన ఇంటర్వ్యూ.అక్కడా విలేఖరి యెవరు నష్ట పోయారు, యెవరు లాభ పడ్డారు? అని అడిగితే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్డారు, వెళ్ల లేని వాళ్ళు నష్ట పోయారు అని చెప్పాడు.ఆమె ఈ పాయింటు యెత్తి జవాబు చెప్పాక మళ్ళీ అటు నుంచి జవాబు లేదు?

          ఈ క్లూ పట్టుకుని అసలీ గిర్గ్లానీ గారు యేం చెప్పాడు అనే అనుమానం వొచ్చి వెతికితే ఈ లింకు దొరికింది.తీరిగ్గా అదంతా చదివి ఈ వడ్లగింజలో బియ్యపు గింజ కింత రాధ్ధాంతమా? అనే పోస్టు వేశాను.ఆయన ఈ జోనల్ సిస్టం గురించి చాలా చెప్పాడు.మొత్తం మీద దాని సారాంశం యేమిటంటే - అది కానీ అంతకు ముందు ఈ వుద్యోగాల విషయాలకి స్మబంధించిన రిపోర్టుల స్వభావ మంతా ఒకటే!మామూలుగా యే శాఖలో నయినా శాఖాదిపతులుగా గెజిటెడ్ స్థాయి గలిగిన అధికార్లు వుంటారు.వీళ్లు కింది స్థాయిలో నాన్-గెజిటెడ్ వాళ్లని తీసుకోవటానికి సంబంధించిన తకరారు లో వీటి ప్రమేయం వస్తుంది.పాత రిపోర్టులతో సహా తన రిపోర్టు కూడా యెందుకని నిరుపయోగం అవుతుందో కూడా చెప్పాడు.ఈ రిపోర్టు లన్నీ సలహాల కోసమే తప్ప అధికారికం గా పాటించి తీరాలన్న నిబంధన యే రిపోర్టు విషయంలోనూ లేదు.అన్ని రకాల నిబంధనల కన్నా పైన ఆ అధికారి విచక్షణ మాత్రమే నిర్ణయానికి కీలకం అని ఆయనే చెప్పాడు.ఈ రిపోర్టు ల్లోని అంశాల్ని ప్రభుత్వ పరమయిన విధి విధానాల్లోకి అంటే రూల్ బుక్ లోకి యెక్కించనంత వరకూ యేమీ ఫలితం వుండదన్నాడు. యెందుకంటే,  శాఖాపరంగా ఒక వుద్యోగి మీద దర్యాప్తు జరపాలంటే తను తన రూల్ బుక్ ని ఫాలో అయ్యాడా లేదా అనే చూస్తారు తప్ప గిర్గ్లానీ రిపోర్టును ఫాలో అయాడా లేడా అని చూడరు.ఇంకా ఇంట్రో లోనే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి మామూలు వాళ్ళకి కాదు - వీటి గురించి ప్రభుత్వాన్ని యెలర్ట్ చెయ్యాల్సిన ప్రభుత్వ సలహాదార్లకే గందరగోళం వుందన్నాడు. అంత గందరగోళం వున్నప్పుడు జరిగిన వాట్ని కూడా కావాలని తమకు అన్యాయం చేసినట్టుగా గయ్యాళి తనంతో రెచ్చి పోయారు!మరి అన్ని ప్రాంతాల్లోనూ వుల్లంఘనలు జరిగాయి, అన్ని ప్రాంతాల వాళ్ళూ నష్ట పోయారు అని ఆయన తెగేసి చెప్పినప్పుడు ఆంధ్రా రాయలసీమ వాళ్ళకీ అన్యాయం జరిగినట్టే కదా?ఆ అన్యాయానికి తెలంగాణా వాళ్ళు కారణ మయినట్టే కదా?

        మరో చోట ఇదే పెద్దమనిషి గిర్గ్లానీ గారి ఈనాడు వ్యాఖ్యని కొంచెం మెలితిప్పి వాదిస్తూ కనబడ్దాడు.చర్చలో వారే ఈ రిపోర్టు గురించి యెత్తేసరికి అన్ని జోన్లలోనూ జరిగాయని అంటున్నారు కదా అనే జవాబు వేశాను.దానికి వారు "అన్ని జోన్లలో జరిగాయి, నిజమే. కాని వారు ఇంకో విషయం కూడా చెప్పారు, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు అని. అంటే హైదరాబాదు అని నేను అనుకుంటున్నాను. అసలు ఏ ఏ జోన్ లలో ఎంతెంత అక్రమాలు జరిగాయో ప్రభుత్వమే ఒక శ్వేత పత్రం ఎందుకు విడుదల చెయ్యదు?" - అని మరో ప్రశ్న వేసారు. వారు అంటున్నది "అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు" - అని. కానీ ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిర్గ్లానీ గారు చెప్పింది ఇది,"ఒక్క తెలంగాణా వారే నష్టపోలేదు.అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది.మేలు జరిగిందెవరి కంటే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి తరలి వెళ్లగలిగిన వారు లబ్ధి పొందారు." ఆయన చెప్పింది వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్దారు అని.ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కృష్ణా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?స్పష్టంగా చెప్పిన దాన్నే ఒప్పుకోనప్పుడు శ్వేతపత్రాలు సాక్ష్యానికి పనికొస్తాయా?వారు యే గిర్గ్లానీ కమిటీ రిపోర్టును గురించి మాకు అన్యాయం జరిగిందని చెప్తుందని వూదరగొట్టారో ఆ రిపోర్టు తయారు చేసిన పెద్ద మనిషే అంత స్పష్టంగా మీ మాట తప్పు అంటుంటే ఇంకా శ్వేతపత్రం అంటారేమిటి? - అని నిగ్గదీశాను.మళ్ళీ జవాబు చెప్పలేదు,మౌనమే సమాధానం.మళ్ళీ అక్కదే మరొక పాయింటు మీద నాకౌ ప్రశ్న వేస్తే - మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పేముందు మీరు నాకో ప్రశ్నకి జవాబు బాకీ వున్నారు ముందు అది తీర్చండన్నాను.అదీ భేతాళుడి ఆఖరి ప్రశ్నే అయింది - అంతతో నాకు మల్ళీ ఆ ప్రశ్న యెవ్వర్నీ వెయ్యకూడదన్నంత విరక్తి పుట్టింది!



        అసలు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం యేమిటంటే |violations| అంటున్న |deviations| అన్ని జోన్ల లోనూ సమానంగానే జరిగాయి, ప్రత్యేకంగా ఒక జోను నష్టపోయింది అని చెప్పలేం అని అంత ఖచ్చితంగా చెప్తే మాకు అన్యాయం జరిగిందని గిర్గ్లానీ కమిషన్ రిపోర్తులో ఉంది, వెళ్ళి చూసుకోండని వీరంగాలు వేశారు. మిగతా అన్ని జోన్లలోనూ అంతా బాగనే ఉండి ఒక్క తెలంగాణాలోనే జరిగితే కదా వారికి ప్రత్యేకంగా అన్యాయం జరిగినట్టు?ఇంత కాలం నేను అసలు గిర్గ్లానీ కమిటీలో యేం ఉందో చూడాలని అనుకోకపోవటానికి కారణం మేధావులూ విద్యావంతులూ సంస్కారం గలిగిన వాళ్ళు మరీ దుర్మార్గంగా అబధ్ధాలు చెప్తారా అనే భరోసా తోనే!తీరా చూస్తే పరిస్థితి ఇది.

        అసలు ఒక విషయం నిజమా అబధ్ధమా అని యెలా కనిపెట్టాలి?ఒక విషయం గురించి యెదటి వ్యక్తి వెయ్యి వాక్యాలు చెప్తే మొదటి వాక్యానికీ వెయ్యవ వాక్యానికి అర్ధంలో తేడా వొస్తే అబధ్ధం అని తేలుసుకుంటాం, కదా? ఒక వేళ ఈ వెయ్యి వాక్యాల్లో యే విరుధ్ధతలూ లేకపోయినా వెయ్యిన్నొకటో వాక్యం కొత్తగా తెలిసి దానికి గట్టి సాక్షాలు ఉంటే ఈ వెయ్యి వాక్యాలూ నిజమనిపించేటట్టు అంతా యేకసూత్రంగా ఉన్నా అవన్నీ అబధ్ధాలు అయి పోతాయి,అవునా? ఇప్పుడు అసలు విషయంలో వైరుధ్యాలు ఉన్నా యెదటి వాళ్ళకి తెలిసే వీలు లేదనుకుని వాటిల్లో కొన్నిట్ని దాచేసి అంతా తమ వాదానికి అనుకూలంగా ఉన్నవాట్ని మాత్రమే చెప్తే అబధ్ధం కూడా నిజమయి పోతుంది గదా!తెలంగాణా వాదులు వాదనల్లో ఇదే పద్ధతిని అనుసరించారు.వారంతట వారు చెప్తే తమకు అనుకూలంగా లేని సగాన్ని దాచేసి  అనుకూలంగా వున్న సగాన్ని మాత్రమే చెప్పటం,ఇతర్లకి ఆ మిగతా సగం కూడా తెలిసి నిలదీస్తే చల్లగా జారుకోవటం!!


      కలిసుండడం వల్ల తెలంగాణా భాషకి అన్యాయం జరిగిందనీ కృష్ణా జిల్లా మాండలికాన్ని అధికార భాషగా చేస్తే భరించాల్సి వొచ్చిందనీ చెబుతున్నారు. అది నిజమేనా? నిజంగా కృష్ణా జిల్లా మాండలికం ఇలాగే ఉంటుందా? కృష్ణా జిల్లా మాండలికాన్నే గనక కుట్ర పూరితంగా పైకి తీసుకొస్తే ఒక్క తెలంగాణా వాదులేనా రాయల సీమ వాళ్ళూ గొడవ చెయ్యరా? యే ఇద్దరు రెండు వేర్వేరు జిల్లాల నుంచి వొచ్చ్చిన వాళ్ళు యెవడి భాషలో వాడు మాట్టాడుకుంటూ పోతే వ్యవహారం నడుస్తుందా? అందువల్ల అప్పటి వాళ్ళు మాండలిక వ్యవహారిక తెలుగు ని కాకుండా అందరూ అర్ధం చేసుకొగలిగే విధంగా భాషని సామాన్యీకరించారు? ఇప్పుడు బ్లాగుల్లో మనందరం వాడుతున్నదీ అదే, యే ప్రాంతీయ పదాలూ లేని అందరికీ అర్ధమయ్యే సామాన్య తెలుగు. ఇది కూడా తప్పేనా?ఆయా మాండలికాలకి ఆదరణని కల్పించడం అనేది ఆ భాషలో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు తమ రచనల్లో ఉపయోగించి మిగిలిన వారికీ పరిచయం చేస్తే మిగిలిన వారు అందులోని స్వారస్యాన్ని గ్రహించి మెచ్చుకుంటారు. తిక్కన గారు తన పదిహేను పర్వాల తెలుగు భారతంలో నెల్లూరు జిల్లా మాండలికపు సొంపుని వాడినట్టుగా శ్రీ శ్రీ గారు చెప్పగా విన్నాను. ఆ రకంగా నెల్లూరు జిల్లా మాండలికం తన పలుకుబడులతో సహా భారతేతిహాసంలో ఒక భాగం కాగలిగింది. దీన్ని యెవరయినా వ్యతిరేకించగలరా? మరో విధంగా యే ఒక్క భాష నయినా అధికారికంగా ప్రోత్సహిస్తే మిగిలిన వారు ఊరుకుంటారా?


      మరి ఇంతటి భాషాభిమానమూ అందెశ్రీ గారు నూతన తెలంగాణా రాష్ట్ర గీతం ఆ పాత తెలుగు లోనే రాసినప్పుడు యేమయ్యిందో?యేది చేసినా వాళ్లంతట వాళ్ళకి తోచి  చెయ్యాలే తప్ప మనం చెప్పితే తప్పన్నమాట!నేను ఒక తెలంగాణా వారి బ్లాగు పోష్టులో ఒక టపాను చూశాను. అక్కడ నేను ఒక ప్రశ్న అడిగాను. "ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు" - అనే ప్రస్తావన చూసి అయ్యా, ఈ అర జిల్లాకు అర్ధ మేమిటో సెలవిస్తారా?భౌగోళికంగా కానీ, సామాజికంగా కానీ,సాంస్కృతికంగా కానీ, వ్యావకారికంగా కానీ అయితే మూడు జిల్లాలు లేకపోతే రెండు జిల్లాలు ఉంటాయి.కానీ మీరు రెండున్నర జిల్లాలు అంటున్నారు.దాని అర్ధం కొంచెం విపులంగా వివరిస్తే బాగుంటుంది. మొదలు పెట్టటమే రెండున్నర జిల్లాలు అని మీరు యెంత వెటకారంగా మాట్లాడినా మేము ఆ వ్యంగాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తే మిమ్మల్ని మీ భాషని ఆదరంగా చూసుకున్నట్టు అవుతుందా?ఇంతకీ ఆ “రెండున్నర జిల్లాల” పేర్లు చెప్తారా మీ నోటితో? అని అడిగాను


     దానికి అక్కడ వారిలో ఒకరు ఇచ్చిన జవాబులోని మొదటి భాగం ఇది: (ఇది 1969ల కాలోజి రాసిన పెద్ద కవితలో చిన్న భాగము) ఇగ రెండున్నర జిల్లాలు అంటే క్లియర్ గానే చెప్పిన. 1. కృష్ణా, 2. గుంటూరు 3. ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము.మళ్ళీ అడిగాను,యేమని? ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము – అనేది యేంటి? ప్రత్యేకంగా ఆ జిల్లాలు రెండూ విడివిడిగానే ఉన్నాయి.అందుకనే అడుగుతున్నా, అయితే మూడు జిల్ల్లాలు లేదా రెండు జిల్లాలు అని మామూలు వాళ్ళు అంటారు.కానీ పైత్యకారి తనం ఉన్న వాళ్ళు మాత్రమే రెండున్నర జిల్లాలు అనే వెటకారం ఆడుతారు, అవునా కాదా?నేను దాని గురించి బాబూ అడుగుతున్నది!ఆ పైత్యకారి వెటకారాన్ని కూడా మీరు మమ్మల్ని పొగిడినట్టుగా భావించి మిమ్మల్ని నెత్తినపెట్టుకోవాలన్న మాట. దీనికి వారింకా జవాబు చెప్పలేదు,యేమి చెప్తారో మన కనవసరం.ఒకటి మాత్రం నిజం,అలా మనల్ని వెక్కిరించిన కాళోజీకి మనం కూడా నీరాజనాలు పట్టాం ప్రజాకవి బిరుదు నిచ్చి పొగిడాం, యెందుకు?ఫలితం యేమిటి?


      ఇంతకీ అన్నాన్ని తిట్టిన వాడికి పరిహారం మన పెద్దవాళ్ళు అనుభవంతో తరచి చూసి యేం చెప్పారో తెలుసా?అన్నాన్ని తిట్టిన వాడికి అన్నం దొరక్కుండా పోతుంది, వున్నా తీనలేని దౌర్భాగ్యం దాపరిస్తుంది!మనిషిని తిట్టినా తప్పు లేదు, మనిషిలో తప్పూ వొప్పూ వుండొచ్చు.డబ్బుని తిట్టినా తప్పు లేదు అది పాపపు సొమ్మూ కావచ్చు, కానీ పాపపు తిండి వుంటుందా?!సత్యధర్మన్యాయ ప్రతిష్ఠిత మయిన నా గురు పరంపర - వ్యాస పరాశరాది శిర్డి సాయినాధ పర్యంతం వున్న నా గురు పరంపర -  పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా,ఆ తిట్టిన వాడికీ, పక్కనే వుండి కూడా అది తప్పని అతనికి బుధ్ధి చెప్పని వాళ్లకీ, అతనికి అప్రతిహతమయిన అధికారమిచ్చి అచ్చోసిన ఆంబోతులా వొదిలిన వాళ్లందరికీ ఆ పాపంలో భాగం వుంటుంది.ఆ పాపం తన ఫలితాన్ని తప్పకుండా చూపిస్తుంది.

29 comments:

  1. good nd true conclusion by the author

    ReplyDelete
  2. Anubhasthaadu....thappakunda anubhavisthaadu.
    anthe kaadu aa kutumbam mothaaniki anna sapam thguluthundi.
    I meean " annasapam" . Nagu pamu visham kante , maharushula sapam kante..kaalakoota visham kante ..ee dushta kutumbaanni bali theesukokapodu.

    ReplyDelete
    Replies
    1. yes, I felt pain the moment I heard about his comment.I never view/hear/know directly, but It took this long time to express in a powerful and righteous way!

      Delete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. అమెరికా నుండి అంలాపురం వరకు ప్రతిదీ తెలిసిన, అరవీర భయంకర కామెంట్ల వీరుడు స్వయం ప్రకటిత మేతావి, దొర గోరి కుడి చేయి, జై గోరు ఈ టపాకు ఏ విధం గా స్పందిస్తారో చూడాలని ఆయన పంఖా గా నా కోరిక :)

    ReplyDelete
  5. హరిబాబు గారూ నాకు ఎందుకో మీ టపా హెడ్డింగ్ & లోపల ప్రస్తావించిన అంశాలకు సంబంధం లేదనిపించింది. ఇకపోతే ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారికి ఆ బిరుదు ఇచ్చింది ఆంధ్రులా, కాదనుకుంటా. అలాగే అయన మిమ్మల్ని ఎప్పుడు వెక్కిరించారో చెబితే తెలుసుకోవాలని ఉంది.

    ReplyDelete
    Replies
    1. టపా తలకట్టును స్సొచించే పద్యం అక్కద వుంది!నేను మొదటిసారి ఆయన "అరజిల్లా" కు సంబంధించిన వెటకారం యెక్కడ చూశానో లింకు కూడా ఇచ్చాను. అక్కడ నా ప్రశ్నలోని వుద్దేశం నావైపు నుంచి అస్పష్టత లేకుండా విశ్లేషణాత్మకంగానె అడిగాను.ప్రజాకవి బిరుదు యెవరిచ్చారనే మౌలిక మయిన సాంకేతికమయిన విషయంతో నాకు సంబ్నధం లేదు.జయంతులకీ వర్ధంతులకీ పత్రికల్లో వచ్చే సంస్మరణల్లోనూ కవుల గురించిన ప్రతిభా విశేషాల్ని పొగిదే సందర్భాల్లోనూ మావాళ్ళు కూడా పొగిడారు అన్నదే నా పాయింటు.

      ఇక మీ విషయాని కొస్తే తెలుగును బలవంతంగా నేర్పదం వల్ల కొన్ని ప్రాంతాల వారు వుపాధిని కోల్పోయి అడుక్కు తింటున్నారు - అన్నారు కదా, అది నిజమేనా?అలా జరిగే ఆస్కారం వుందా?కొత్తగా తెలుగు నేర్చుకోవదం వల్ల వేరే భాషలో ప్రవేశం వుందతం వల్ల అదివరకు వున్న వుపాధి అవకాశాల్ని వొదిలేసుకుంటారా యెవరయినా?

      టపా దేనికి సంబంధినది?ఒక వ్యక్తి మా తిండిని తిట్టదం గురించి,కదా?అతను, మరియూ అతని అనుచరగణం కేవలం దాని గురించి మాతరమె తిట్టి మిగిలిన యే ఒక్క విషయం గురించీ తిట్టకుండా వుంటే నేను కూడా మిగిలిన విషయాల గురించి ప్రస్తావించకుండా ఆ ఒక్క విషయం గురించే మాట్లాడి వుండేవాడిని, అవునాకాదా?

      Delete
    2. "రెండున్నర జిల్లాల" భాషను కాళోజీ వెక్కిరించారనే ఆధారం నాకు ఎక్కడా కనిపించలేదు. సింగిశెట్టి గారు కాళోజీ ప్రతినిధి కాదు కదా.

      కరుణశ్రీ, శ్రీశ్రీ లాంటి వారు తెలంగాణాను తక్కువ చేసి మాట్లాడారు. అయినా వారి కవిత్వాన్ని కొంత మంది మెచ్చుకుంటారు. I believe it is perfectly OK to praise someone's output/personally even if he opposed/ridiculed us on a different context.

      మిగిలిన భాషలను పూర్తిగా విస్మరించి, తెలుగును *మాత్రమె* ఫోకస్ చయడం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గుతాయని, కొందరు తమకు సహజ సిద్ధంగా ఉన్న natural advantages కోల్పోయారని నా అభిప్రాయం. దీని మీద చర్చకు నేను సిద్దం కానీ మీ టపాకు సంబంధం లేని విషయం అవుతుందేమో? అయితే నేను "బలవంతంగా నేర్పదం", "వుపాధి కోల్పోయి", "అడుక్కు తింటున్నారు" లాంటి మాటలు వాడలేదని మనవి.

      కెసిఆర్ ఆంద్ర బిర్యానీ గురించి అన్న వ్యాఖలు గుర్తిన్నంత వరకు కింద పొందు పరిచాను. నోటి దురుసు, అధిక ప్రసంగం లాంటి (ఆయనకు మామూలు) విషయాలు వదిలేస్తే దాంట్లో తిట్లు కానీ బూతు కానీ లేదు.

      आंध्रा वालोंका बिरयानी कभी खाए? गोबर की सरका रहता!

      Delete
    3. आंध्रा वालोंका बिरयानी कभी खाए? गोबर की सरका रहता!
      >>
      సరిగ్గా వండకపోతే పరమాన్నం కూడా పేద లాగానె వుంటుంది - అన్నా సమర్ధించుకోవచ్చు.కానీ సూటిగా ఆంధ్రావాళ్ళు తినే బిర్యానీ యెపుదయినా తిన్నారా? అని అడిగి మరీ వ్యాఖ్యానించటం సరిగ్గా ఆదేరకం సంస్కృతిలో వున్న తమరికి మాత్రమే నోటిదూలగా కనిపిస్తుంది.పని గట్టుకుని అక్కర్లేని ప్రస్తావన తెచ్చి ఒకరు తినే తిండిని పేదలాగా వుంటుంది అన్నా అది తిట్టు కాదని సమర్ధించుకోవటం మీరు మాత్రమే చెయ్యగల ఘనకార్యం!అక్కద మూడు భౌగోళికంగా వేరు వేరు జిల్లాలు వుంటే పైత్యకారి తప్ప అరజిల్లా అని యెవడూ అనడు - అని సోదాహరణంగా చెప్పాను.

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. @jai
      గుజరాత్ రాష్ట్రంలో అధికారికంగా గుజరాతీని మాత్రమే ఫోకస్ చేస్తారు, చెయ్యకపోతే చెయ్యమని జనం అదగాలి.పక్కన తమిళ నాడులో తమిళాన్ని యెంత గట్టిగా ఫోకస్ చేస్తున్నారో చూశారుగా?!మహారాష్ట్రాలో మరాఠీని మతరమే ఫోకస్ చేస్తారు, చెయ్యాలి!?.అదనంగా నువ్వు లక్షా తొంభై భాషలు నేర్చుకుంటే యెవడు వొద్దంటాడు?ఒక తెలంగాణా మేధావి ఆంధ్రా కొలీగ్ ఒకరు మీదంతా వుర్దూ సంత కదా అని వెక్కిరిస్తే(వుర్దూ పట్ల కూడా చిన్నచూపు నాకు లేదు, ఆ కొలీగ్ అయిన పెద్దమనిషిని నేనూ అసహ్యించుకున్నాను)- మీరు మాట్లాడె తెలుగులో యెన్ని వుర్దూ పదాలున్నాయో తెలుసా మీకు అని మా వైపు మాట్లాదే భాషలో వున్న వుర్దూ పదాల్ని లెక్కసి చూపించారు.నిజమే, మేము కనీసం యే మాత్రం వ్యతిరేకించకుండా ఆ వుర్దూ పదాలకి అలవాటు పడ్డాం,అలాగే పైన పద్యంలో నేను మీ ప్రాంతపు తెలుగునే వాడినా వెక్కిరించటానికి వాదలేదు - ఆ ఫోర్సు నచ్చడం వల్లనే వాదాను!కానీ నేను పైనా మరొక చోటా చెప్పినట్టుగా అందరూ ఓక్చోట కలిసినప్పుడు యెవరి మాందలికంలో వాళ్ళు మాట్లాడితే గందరగొఏలంగా వుంటుంది కదా అని ఒక కామన్ తెలుగు కోసం ప్రయత్నిస్తే అందులో రెండు మూడు మాతలు మావి రాగానే రెండున్నర జిల్లాలోళ్ళు ఆ భాషని మనమీద రుద్దేస్తున్నారని అదిరి పడింది మీరు! మీ అధిక్షేపాల్ని కూడా సరస సంభాషణలుగా తీసుకుంటేనే మీము మీ దృష్టిలో వుదారులుగా వుంటాం, అంతెనా?

      Delete
    6. మొత్తం సెంటెన్స్ తర్జుమా: మన సంస్కృతి బాలేదని ఆయన అంటాడు. మన షేర్వానీ బిర్యానీల గురించి ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆంధ్రోల్ల బిర్యానీ ఎప్పుడన్నా తిన్నారా? పెండ లక్క ఉంటది.

      ఇందులో హుందాతనం కానీ మంచిమాటలు కానీ లేవు. అయితే వినసొంపుగా లేని ప్రతి మాటా తిట్టే కానక్కరలేదు.

      Delete
    7. వినసొంపుగా లేని ప్రతి మాటా తిట్టే కానక్కరలేదు.
      >>
      అవునా?మీరు చెప్పారు గాబట్టి చచ్చినట్టు వొప్పుకోవాల్సిందే - .. య్యమ్మా అన్నా కూడా అంతే కదూ?

      Delete
    8. కెసిఆర్ ఎన్ని సార్లు తిన్నాడో లెండిఆయన చెప్పిన పదార్ధం. అందుకే ఏది తిన్నా అదే గుర్తు వస్తుంది కాబోలు ఆయనకి ! అది లేకుండా, తలుచుకోకుండా ముద్ద గొంతు దిగదు కావొచ్చు ఏ పొద్దు .

      పంది బురదలో దొర్లుతుంటే, దాని ముందు కాళ్ళు , వెనక కాళ్ళు కూడా ఆడనే తిరుగుతుంటాయి కదా అని సామెత, అందుకే గొట్టిముక్కల కి కూడా ఆ వాసన మధురంగా ఉంది . మనమేం చేస్తాం వాళ్లకి కర్మకి !

      Delete
    9. "మీరు చెప్పారు గాబట్టి చచ్చినట్టు వొప్పుకోవాల్సిందే"

      అసలే తెలంగాణాలో పుట్టిన వాడిని, పైగా కామన్ సెన్సు కూడా లేని వాణ్ని. నా లాంటి అధముడికి అభిప్రాయాలు ఉండడమే తప్పు. మీరు ఆంధ్రులు, ఉత్తములు, పైగా కవి పుంగవులు. మీరు చెప్పిందే రైటు లెండి.

      Delete
    10. @jai
      సరే, సమర్ధించదానికి వీల్లేని దాన్ని సమర్ధించదానికి చాలా ఇబ్బంది పడ్డారు. వొదిలెయండి.కవిత్వం పలికే నా మనస్సులో ద్వేషం లేదు.యెంత కోపం వచ్చినా పొల్లు మాట రానివ్వకూడ దనేది నా పట్టుదల!నను నిగ్రహంగానే వున్నాను.

      Delete
    11. "పైగా కామన్ సెన్సు కూడా లేని వాణ్ని. నా లాంటి అధముడికి అభిప్రాయాలు ఉండడమే తప్పు"
      -------------
      నిజాలు ఒప్పుకొన్నందుకు జీవితం లో ఒక్కసారి అయినా, అభినందనలు :-)

      Delete
    12. తిట్టలేదనడం సమర్తించడం ఒకటే కాదన్న ఈ అల్పుడి అభిప్రాయం మీరు పరిగణలో తీసుకోరు లెండి.

      Delete
  6. చరిత్రలో దురహంకారంతో మిడిసిపడిన ప్రతివాడూ
    చివరకు సర్వం కోల్పోయి మట్టి కరిచిన వాడే ...
    మట్టిలో కలిసి పోయిన వాడే ...

    ReplyDelete
    Replies
    1. అవును, పదవి లోకి వచ్చి ఇంత కాలమయింది, కనీసం తను వాగుదానం చేసిన తెలంగాణా పునర్నిర్మాణానికి పనికొచ్చే ఒక్క మంచి పని చెయ్యలేదు, ఇళ్ళు కూల్చదం, జరిగే పనుల్ని ఆపడం, కోర్టులతో చివాట్లు తినదం తప్ప! తను నడిపేదే చందూలాల్ దర్బారు అని కూడా తెలియకుండా యెదటివాళ్లని వెక్కిరిస్తున్నాడు?!

      Delete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. హరి గారు,

    నేను కొన్ని నెలల పాటు నెట్ కు దూరంగా ఉంటాను అని తెలిసి మంచి టైమింగ్ లో ఈ పోస్ట్ వేసారేమో అని అనిపించింది :-)

    నేను వాదనకు ఎప్పుడూ వెనకడుగు వెయ్యలేదు, నేను తప్పైతే దాన్ని ఒప్పుకున్నా సందర్బాలు ఎన్నో. మీరు చెప్పిన ఆ సమయంలో నేను జవాబు రాయలేక పోవటానికి నా కారణాలు వేరే. మీరు ఇక్కడ నా పేరు రాయకుండా ఉండి ఉంటె మీ గౌరవం పెరిగి ఉండేది.

    CHALLENGE ACCEPTED. ప్రజలో మీ ప్రశ్న వెయ్యండి, అక్కడ నా సమాధానాలు వినొచ్చు. నేను ఒక నాలుగైదు రోజులు మాత్రమె నెట్ లో ఉంటాను.

    ReplyDelete
    Replies
    1. ప్రజ లో అప్పుడు చర్చ జరుగుతుండగానే అడిగాను కదండీ "మీరు నాకో ప్రశ్న బాకీ వున్నారు" అని.అది వరకు యెక్కడ ఈ ప్రశ్న వొచ్చినా మౌనమే మీ సమాధానం అయ్యింది.అలా అన్నిసార్లు జరగితే అలాగే అనుకుంటారు యెవరయినా.అందరం ఈ వాదన లన్నీ యెవరిని వుద్దేశించామో వారి పేరుతోనే ప్రశ్న వేస్తున్నాం కదా?

      ప్రజలో ప్రశ్న యెలావెయ్యాలో అంతా కంఫ్యూజన్ గా వుంది.ప్రశ్న సారాంసం మొత్తం ఇక్కదే వుంది, ఇక్కడే జవాబు ఇసతె బాగుంటుందేమో, ఆలోచించండి!

      Delete
  9. @green Star
    ఈ క్లూ పట్టుకుని అసలీ గిర్గ్లానీ గారు యేం చెప్పాడు

    నుంచీ మీరు జవాబు చెప్పాల్సిన ప్రశ్న వుంది.

    ReplyDelete
  10. @green Star:
    మీరు అంటున్నది "అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు" - అని. కానీ ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిర్గ్లానీ గారు చెప్పింది ఇది,"ఒక్క తెలంగాణా వారే నష్టపోలేదు.అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది.మేలు జరిగిందెవరి కంటే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి తరలి వెళ్లగలిగిన వారు లబ్ధి పొందారు." ఆయన చెప్పింది వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్దారు అని.ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కృష్ణా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?స్పష్టంగా చెప్పిన దాన్నే ఒప్పుకోనప్పుడు శ్వేతపత్రాలు సాక్ష్యానికి పనికొస్తాయా?మీరు యే గిర్గ్లానీ కమిటీ రిపోర్టును గురించి మాకు అన్యాయం జరిగిందని చెప్తుందని వూదరగొట్టారో ఆ రిపోర్టు తయారు చేసిన పెద్ద మనిషే అంత స్పష్టంగా మీ మాట తప్పు అంటుంటే ఇంకా శ్వేతపత్రం అంటారేమిటి?

    ReplyDelete
  11. ప్రజలో నేను ఎలా మిస్ అయ్యానో గుర్తు లేదు. మిగిలిన చోట్లో మాత్రం గుర్తుంది.

    ఇక్కడ మీరు అప్రోవ్ చేస్తే కాని కామెంట్స్ పబ్లిష్ అవ్వవు. ఇక కోతి మూక లాంటి వారు వచ్చి ఇష్టం వచ్చినట్లు రాస్తే మీరు వారిని అదుపు చేస్తారో లేదో తెలియదు. మీరు వారిని అదుపు చెయ్యకపోతే? మాటలు పడాల్సిన అవసరం నాకేముంది? అందుకే నా వాదనను ఇక్కడ రాయటానికి నాకు మనస్కరించటం లేదు.

    మీరు నా పేరు ప్రస్తావించి రాసారు, అనేకులు చదివి ఉంటారు. ఇప్పుడు ఈ టపా పాతది అయిపొయింది, వారందరూ వచ్చి ఇక్కడ నా కామెంట్లు చదవరు. ఇప్పుడు ఈ చర్చ మళ్ళి ప్రజలో మొదలు పెడితే వాళ్ళందరూ నా వాదనను చదివే అవకాశం ఉంది. అలా నేను వాదన నుండి వెనక్కి పోలేదని నిరుపించుకున్న వాడిని అవుతాను.

    ఇక మీ ఇష్టం.

    ReplyDelete
    Replies
    1. ok, we will meet there, thanks. I will start tomorrow that is 17th

      Delete
    2. ఒక పొరపాటు జరిగింది!నేను తేదీ కూడా ఇచ్చి మిమ్మల్ని యెదురు చూసేఅలాగ చేసాను.ఆదివారం అయిపోయింది.జవాబు ఇవ్వాలంతే యేసో ఒక ఇంటెర్నెట్ సెంతర్ ని వెదికి పట్టుకోవాలి. దగ్గిరలో యేదీ లేదు.కాబట్టి ఇప్పటి వరకొ ఆగాల్సి వచ్చింది.మొదటి నుంచీ ప్రజలో వేరే ప్రశ్న వెయ్యదం అనేది ఇబ్బందిగా అనిపించుతున్నది.మీ అబ్యంతరం ఇతర్ల కామెంట్లే అయితే నేను పబ్లిష్ చెయ్యను.కాబట్టి ఇక్కడే జవాబు ఇవాలసిందిగా కోరుతున్నాను.

      నా ముఖ్యమయిన ప్రస్న గిర్గ్లానీ రిపోర్టు గురించి కదా, నేను స్పష్తత కోసం నా ప్రశ్ననై కొంచెం క్లెయర్ గా వేస్తున్నాను.

      ప్రశ్న 1:గిర్గ్లానీ గారు అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే మీరు మాకు అన్యాయం జరిగిందన్నాడు అని యెలా అంటున్నారు?మిగతా వారి పరిస్థితి అంతా బాగుండి మీకు మాత్రమే అన్యాయం జరిగితే కదా సాంకేతికంగా మీ వాదన కరెక్ట్ అయ్యేది?

      ప్రశ్న 2:పరిచయంలో గిర్గ్లానీ గారు ప్రత్యేకంగా అందరిలోనూ, ముఖ్యంగా దీని గురించి మాట్లాడవలసిన స్థానాల్లో వున్న లాయర్లకి కూడా విషయం పూర్తిగా అర్ధం కాని గందరగోళం నెలకొని వుంది అని స్పష్తం చేసారు, అవునా కాదా? ఒక విషయంలో మహామహులకే గందరగోళం నెలకొని వుండటం వల్ల జరిగిన పొరపాట్లని కావాలని చేసినట్టుగానూ ఆంధ్రా ప్రాంతం వాళ్ళకి దోపిడీ అంటగట్టి నిందించటం న్యాయమా?

      ప్రశ్న 3:గిర్గ్లానీ గారు అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి వెళ్ళగలిగిన వాళ్ళు బాగుపడ్డారు అని, మీరు హైదరాబాదుకు అనుకుంటాను వెళ్ళినవాళ్ళు బాగుపడ్డారు అని అంటున్న దానిలో వెళ్ళగలిగినవాళ్ళు వెళ్ళి బాగుపడటం వెళ్ళలేని వాళ్లకి అన్యాయం చెయ్యడం అవుతుందా?

      ప్రశ్నల్ని స్పషతకోసం విడివిడిగా పెట్టినా ఇవన్నీ ఒకే ప్రధాన అంశం గురించి కబాట్టి మీరు విడివిడిగా జవాబు ఇవ్వనక్కర లేదు. మీ వెసులుబాటుని బట్టి మీకు వీలయిన విధంగా ఇక్కడే ఇవ్వండి.పబ్లిష్ చెయ్యతానికి మీరు చెప్తున్న లోపాలు వుందవు.నేను హామీ ఇస్తున్నాను!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...