Friday 21 February 2014

కర్మయోగ భావబీజ దళద్వయం

సీ||     ఊపిరి పీల్చడ మొకటే మనిషి బతి
        కుండటాన్కి గురుతు కాదు - చేస్తు

        వుండాలి యేదోక ఒపయుక్త కర్మ - ఉ
        న్నావు గనక చేసినావు, చేస్తు

        వున్నావు గనక నీవున్నావు అనేట్టు
        వుండాలి! "ఇప్పటి వరకు యేమి

        చేశాము?ఇకముందు చేయబోయేది యే
        మిటి? ఎలా చెయ్యాలి? ఎప్పటి కది

తే||    పూర్తి చేద్దాము? ఎవరి తోడ్పాటు తీసు
       కుంటె త్వరగా అది అవుతుంది?" - మాట
       మాట లోనూ మనసు లోని మధన లోను
       ఇదియె కదలాలి - ఫో, పని చెయ్యి, చెయ్యి!
(10/01/2003)
మూలం: ఇది ఒక ఆఫీసులో నేను చూసిన ఒక మంచి కొటేషన్ చుట్టూ అల్లిన పద్యం.

To be is to do - PLATO
(ఉండటం అంటే చెయ్యటం)

To do is to be - SOCRATESE
(చెయ్యటం అంటే ఉండటం)

Go be do be do - SINATRA
(వెళ్ళు చెయ్యి, చేస్తు ఉండు)

ముగ్గురు వేదాంతులూ చెప్పిన ఒకే విషయం పని చెయ్యటం గురించి అనేది అర్ధమయ్యి, పని చెయ్యటానికీ బతకటానికీ ఉన్న సంబంధం అర్ధమయ్యీ ఇలాగ నా సొంత మాటల్లో....

సీ||     తిండి తినుట, తిని పండుకొనుట, బోరు 
          కొడితె సైన్మలు షికార్ల కేగు

          ట - ఇవి కావు పనులంటే; బతుకు గడిచేందు
          కవసరమయిన పైకమును దెచ్చు

          పనులె పనులు ధరపైన మనుషులకు.
          తగు లాభ ఇచ్చెడి పనులు తప్ప

          ని సరిగ చేయాలి - హుషారైన 
          పనిని లాభకరంగ మల్చగలిగి


తే||    తే బహు శభాషు! ఒక్కడివే మరెవరి
       తోడు లేక ఏ పని చేయబోకు - నలుగు
       రి కుపయోగ పడ్తు నలుగురి నుపయుక్త
       పరుచుకుంటు బతకడమే మనిషికి విధి!
(10/09/2004)
మూలం: దీనికీ ఒక మంచి కొటేషనే - రాజ్ కపూర్ చెప్పిన మంచి మాట:
What is it after all taht men wants? Money, position, success - all are secodery. The basic thing is tomarrow, the future. The knowledge and promise that tomaarow will be better tan today. Nothing else matters to him!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...