Wednesday, 10 August 2022

రెండు సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న జో బైడెనుకి కోవిడ్ ఎలా వచ్చింది?

 "*1మార్షలు ప్రణాళిక"కు మన

*2సర్షణ్ముఖ చెట్టియారు స్వాగతమిస్తే

హర్షిద్దామని కొందరు

వర్షానికి చాతకాల వలె కలరు జరూ!

 

దోచేసే వాళ్ళను

దో చేస్తుందని శివాశతో చూస్తుంటే

దోచేస్తోంది కదా కం

చే చేనుమసినట్టు లీ ప్రభుత జరూ!

*1 - రెండో ప్రపంచ యుధ్ధం ముగిశాక కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి 1947లో అమెరికా దేశీయాంగ కార్యదర్శి జార్జి మార్షల్ ఒక ప్రణాళికను తయారు చేశాడు.ఆర్ధిక సాయం పేరుతో అన్ని దేశాలను తన గుప్పిట పట్టి పెత్తనం చెలాయించడమే దీని లక్ష్యం.

*2 - సర్ షణ్ముఖ చెట్టియార్ పేరును వ్యంగ్యం కోసం సంధి కలిపి మనసర్షణ్ముఖ అని శ్రీశ్రీ అన్నాడు.1. ధనస్వామి,2. న్యాయవాది, 3. బ్రిటిష్ వారి ఆత్మీయమిత్రుడు, 4. వాణిజ్యవర్గాల అగ్రపూజ్యుడు, 5. రాజకీయ వేత్త, 6. అర్ధశాస్త్ర పండితుడు అనే ఆరు రంగాల ప్రతినిధులు ప్రజలకి అన్యాయం చేస్తున్నారనేది అక్కడ చెప్పదల్చిన విషయం.అయితే సర్ షణ్ముఖ చెట్టియార్ వ్యంగ్యం కోసం శ్రీశ్రీ అనే కవి సృష్టించిన కల్పిత పాత్ర కాదు, వాస్తవ వ్యక్తియే - అతనికి ఆరు ముఖాలూ ఉన్నాయి కూడాను.

మార్షల్ ప్రణాళికను తీర్చి దిద్దే పనిమీద మనవాళ్ళు 1941 నాడు అమెరికాకు పంపిన మన దేశపు ఆర్ధిక వేత్తల ప్రతినిధి వర్గానికి నాయకుడు.1945 నుంచి ఇండియన్ టారిఫ్ బోర్డులో సభ్యుడు.అమెరికా లోని బ్రెట్టన్వుడ్స్ ఆర్ధిక మహాసభకు 1946 నాడు భారతదేశం తరపున హాజరయ్యాడు.International Monitary Fund(IMF),World Bank(WB) అనే రెండు సంస్థల్ని ప్రపంచ స్థాయి సామ్రాజ్య వాదపు ఆర్ధిక దోపిడీని ఆచంద్ర తారార్కం కొనసాగించడానికి పనికొచ్చే సయామీస్ కవలల వలె సృష్టించటానికి జరిగిన భూతబలియజ్ఞంలో మన దేశాన్ని కూడా ఒక సమిధను చేసిన పుణ్యచరితుడు మన సర్ షణ్ముఖ చెట్టియార్.1947 ఆగస్టు 15 ఏర్పడిన తొలి కేంద్ర మంత్రివర్గంలో సర్షణ్ముఖం గాడు ఆర్ధికమంత్రి అయ్యాడు - మన కొంప ముంచాడు!న్యాయమంత్రి స్థానంలో ఉన్న డంబేద్కర్రు సర్షణ్ముఖం దింపిన రాడ్డుని ఇంకొంచెం లోతుకి తొక్కేశాడు.ఇప్పుడు పీకాలంటే మన కళ్ళ నుంచి రగతం కార్రుద్ది.

మన మీద జరిగిన కుట్రలో మనవాళ్ళే ముఖ్యమైన పాత్ర ధరించి ఆపద్బాంధవుల మాదిరి కబుర్లు చెప్పి అనాధ రక్షకుల వేషాలు కట్టి మనమీద ఒక దోపిడీ వ్యవస్థనీ ఒక దుర్మార్గపు రాజ్యాంగాన్నీ ఒక మోసకారి ప్రభుత్వాన్నీ రుద్దేసి మనచేత  దేశభక్తుల పేరున చప్పట్లు కొట్టించుకున్నారు - మనల్ని ఎదవల్ని చేశారు, చేస్తున్నారు, చేస్తారు.ఎంత ఎదవలం కాకపోతే 1947 ఆగస్టు నాటికి అక్షరాల కేవలం 2332 కోట్లు మాత్రమే ఉన్న అప్పుని - తీర్చలేక కాదు లెండి, తీర్చాలని అనుకోక ఏయేటి కాయేటికి అప్పుచేసి పప్పుకూడు తినిపిస్తూ 2020 మార్చి నాటికి US$11.6 billion డాలర్లకి పెంచితే శంకరాభరణంలో చిన్నపిల్లకి తప్పులతడక సంగీతం పాఠాలు చెప్తున్న పిచ్చి పంతులు "కార్లు,బస్సులు,రైళ్ళు,జెట్లు,రాకెట్లు,జాకెట్లు - అన్నీ వచ్చేశాయా!" అని సంబరపడినట్టు "అబ్బో!ఎంత డెవ్లప్ అయ్యామో?" అని బట్టలు చింపుకుంటూ అంత స్థాయిలో అప్పుల్ని పెంచిన దేశద్రోహుల్ని దేశభక్తుల కింద పొగుడుతాము చెప్పండి!

11.6 అనేది ఒక చిన్న అంకె మాత్రమే అనీ బిలియన్ అనేది ఒక ఏడక్షరాల ఇంగ్లీషు పదం మాత్రమే అనీ అనుకుంటే అస్సలు భయం వెయ్యదు.కానీ, 01 zero makes Ten,02 zeroes make Hundred,03 zeros make Thousand,04 zeros make Ten Thousand,05 zeros make Hundred Thousands,06 zeros make One Million,07 zeros make Ten Millions,08 zeros make Hundred Millions,09 zeros make One Billion,10 zeros make Ten Billions అనే లెక్క తెలిశాక కొంచెం దడ అనిపిస్తుంది,కదూ!మన అప్పు 11,600,000,000 USD ఉన్న 2020 మార్చి నాటి బడ్జెట్ వేస్తున్న నిర్మలా సీతారామన్ గారు కొత్త పెట్టుబడుల కోసం కోసం విడుదల చేసిన 30,42,230 కోట్ల రూపాయలను ఎక్కణ్ణించి తెచ్చారు?ఒక కుటుంబ యజమాని ఒక ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యాక తన ఆదాయం 1000 రూపాయలు మాత్రమే అయి ఉండి తీర్చాల్సిన అప్పులు 1,00,000 అయినప్పుడు కుటుంబ సభ్యులకి విషయం చెప్పకుండా దాచెయ్యడమూ ఆదాయం మొత్తాన్ని సొంతానికి వాడుకోవడమూ న్యాయమా!మరి,మన ప్రభుత్వాలు మన అప్పుల గురించి మనకి ఎందుకు చెప్పడం లేదు?

2020వ సంవత్సరానికి 30,42,230 కోట్ల రూపాయలను మాత్రమే పెట్టుబడి కింద ఖర్చు చేస్తూ ఆ కుసింత కరెన్సీని సైతం పెట్టుబడి కూడా తిరిగి రాని చోట ఖర్చు పెట్టి లోటు బడ్జెట్లతో అఘోరిస్తూ 11,600,000,000 USD దాటి పెరుగుతున్న అప్పుని ఎట్లా తీర్చాలనే భయమూ జాగ్రత్తా నెహ్రూ మొదలు మోదీ వరకు ఏ ఒక్క దేశాధినేతకీ లేకపోవడం ఎంత దౌర్భాగ్యం?

మనం, అంటే హిందువులం పిచ్చిపుల్లయలం అని అందరూ ముద్ర కొట్టేశారు.మనమూ ఒప్పేసుకున్నాం - పోనివ్వండి.కానీ అమెరికా కమ్యూనిష్టుల్ని అణిచి వెయ్యటానికి ఉద్దేశించింది అనే దృశ్యాన్ని మాత్రమే చూసి "అదిగో కుట్ర!ఇదిగో సాక్ష్యం!" అని "యజ్ఞం" కధని మనమీదకి వదిలిన కారా మేష్షారుకి గానీ భారత్దేశం తాకట్టులోకి వెళ్ళిపోయిందని బల్ల గుద్ది చెప్పిన తరిమెల నాగిరెడ్డి గారికి గానీ కమ్యూనిష్టు సిధ్ధాంతం కూడా వీళ్ళు కమ్యూనిష్టుల్ని అణిచెయ్యటానికి కుట్ర పన్నుతున్నారని అంటున్న అమెరికన్ సామ్రాజ్యవాదులు వాళ్ళ ప్రయోజనాల కోసం వండివార్చిన దోపిడీ సిధ్ధాంతం అని తెలియక పోవడం ఎంత విచిత్రం?వీళ్ళలో ఒక్కర్నీ నేను దుర్మార్గులని అనడం లేదు - మంచివాళ్ళే,మాననీయులే,ప్రాతఃస్మరణీయులే,మహానుభావులే,మానవాళి సౌభాగ్యం పట్ల అంకితభావం ఉన్నవాళ్ళే - మేధావులే,సత్యం పట్ల నిబధ్ధత ఉన్నవాళ్ళే - అప్రస్తుతవీరవరేణ్యులే!అయితే,అసలు కుట్రదారులు వీళ్ళు ఎంతవరకు తెలుసుకుంటే అసలు నిజం తెలుస్తుందో అందులో తమకు నష్టదాయకమైన సమాచారాన్ని దాచేసి తమకు లాభం తెచ్చిపెట్టే సమాచారాన్ని మాత్రమే వీళ్ళకి చూపించారుఅది పూర్తి నిజం అని నమ్మేసిన అమాయకత్వం వీళ్ళది.

"నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం" అని గత చరిత్ర మీద ఒట్టు వేసి చెప్పి ప్రపంచ మానవాళిని దోపిడీ నుంచి విముక్తం చేసి పరపీడన పరాయణత్వం అసలు కుదరనే కుదరని వర్గరహితసమాజం గురించి ఎన్నెన్నో ఆకర్షణీయమైన వర్ణనలని చేసి అది వచ్చాక ఇక దోపిడీ అనేది ఉండదని భవిష్యత్తు గురించి వాగ్దానాలు చేసి దాన్ని సాధించడానికి వర్తమానంలో చెయ్యాల్సిన ప్రయత్నం కింద శ్రామికవర్గనియంతృత్వం అనే ఒక శాస్త్రీయమైన ప్రణాళికని ఇచ్చిన అసలు వ్యక్తి ఒక పైశాచిక మతాన్ని పాటించే మతోన్మాది అని చాలామందికి లాగే వీళ్ళకీ తెలియదు.

దాస్ క్యాపిటల్,కమ్యూనిష్టు మ్యనిఫెస్టో గాక అంతకు ముందర మార్క్సు కధలూ కవితలూ నాటకాలూ కూడా వ్రాశాడు.కానీ అవన్నీ సృజనాత్మకతని బట్టి చూస్తే చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి.అందుకే అభిమానులు వాటిని గురించి చెప్పడం లేదు. 1837ల నాడు కార్ల్ మార్క్స్ ఒక కవితలో “Thus Heaven I’ve forfeited, I know it full well. My soul, once true to God, is chosen for Hell.” అని వ్రాశాడు.దీని అర్ధం  ఏంటి?forfeit అనే పదానికి నిఘంటువు “lose or give up (something) as a necessary consequence of something else,lose or be deprived of (property or a right or privilege) as a penalty for wrongdoing” అనే అర్ధాలను చెప్తుంది.అతని కవితకి సరైన తెలుగు అనువాదం  - "అలా నేను స్వర్గానికి చెల్లు చీటీ ఫిరాయించేశాను,కావాలనే స్వర్గాన్ని తన్ని తగలేశాను;అస్మదీయ ఆత్మ ఒకప్పుడు దైవాన్ని నమ్మింది,ఇప్పుడు నరకాన్ని నమ్ముతున్నది" అయితే ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు కార్ల్ మార్క్స్ నాస్తికుడు కాదు, హేతువాది కూడా కాదు.యూదు,క్రైస్తవ,మహమ్మదీయ అనే మూడు అబ్రహామిక మతాల గ్రంధాల్లో దుష్టశక్తి అని చిత్రీకరించిన లూసిఫర్ అసలైన దేవుడు అని నమ్ముతున్న ఇల్యూమినాటీ మతస్థుడు!

పాస్టర్ల మతమార్పిడిని వ్యతిరేకిస్తున్న హిందూత్వ దృక్కోణం నుంచి చూస్తేనూ వేదంతో పోల్చి తులనాత్మమైన అధ్యయనం చేస్తేనూ క్రైస్తవమతసాహిత్యం తప్పులతడక అనిపించ వచ్చును.తెలుగే సరిగ్గా రాని మన పాస్టర్లని చూసి అందరు పాస్టర్లూ ఇలానే ఉంటారనుకోవడం తప్పు - మనం తప్పుల తడక అంటున్న బైబిలు కధల్ని ఒప్పుల కుప్పలని సమర్ధించగలిగిన Jon Paul Sydnor లాంటివాళ్ళు కొందరు ఉన్నారు.ఒక విధాన - పోషణ కోసం ప్రతిష్ఠ కోసం ప్రచారం కోసం చప్పట్ల కోసం పదవుల కోసం పెదవుల కోసం రోతశీల్డు మందకి వూడిగం చేస్తున్న ఇల్యూమినాటీ స్కాలర్లు చెడగొట్టడం వల్లనే క్రైస్తవం యొక్క ప్రతిష్ఠ దిగజారింది.అలా చూస్తే "అస్మదీయ ఆత్మ ఒకప్పుడు దైవాన్ని నమ్మింది,ఇప్పుడు నరకాన్ని నమ్ముతున్నది" అని కార్ల్ మార్క్స్ అనటం క్రైస్తవం ఒక దుర్మార్గపు మతం కాబట్టి మతవిమర్శ కోసం ఉత్ప్రేక్షించాడని అనుకోవటం కుదరదు ఇక్కడ.

ప్రతి కవిలోనూ ప్రతి రచయితలోనూ ఒక అధ్యాత్మిక దృక్కోణం ఉంటుంది.అది ఆయా వ్యక్తులని విశ్వానికి తాము కేంద్రం వలె వూహించుకునేలా చేస్తుంది.మొహమాటం కొద్దీ కొందరు రచయితలు "అబ్బెబ్బే!నేను నాకు నచ్చిన భావాల్ని అందరి మీద రుద్దాలని అనుకోవటం లేదు." అనటం కేవలం నటన మాత్రమే - అసలు తను కళాసృజన చేస్తున్నదే ఇతరుల్ని ప్రభావితం చేసి మనస్సు మీద ఒత్తిడి పెట్టి వాళ్లని తనకు నచ్చేటట్టు మార్చడం కోసం అయినప్పుడు అనవసరపు శషభిషలు దేనికి?అయితే, ఇక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉంది - తన కళాసృజన వల్ల ప్రేక్షకులలో వచ్చిన మార్పు మార్చిన తనకి స్వోత్కర్షను పెంచేది మాత్రమే గాక మారిన ప్రేక్షకులకి సంతృప్తిని ఇచ్చేలా ఉండాలి.అలా ఉండాలంటే ఆ కవిలో ఆ రచయితలో ఆ మేధావిలో ఆ సంస్కర్తలో ఆ ప్రవక్తలో అహంకారం గాక వినయం ఉండాలి.కార్లు మార్క్సులో వినయం లేదు,అహంకారం మాత్రం పుష్కళ యూరియా ఎరువులు వేసి పెంచిన వరిపంటలా ఉంది.

కార్ల్ మార్క్స్ యొక్క అధ్యాత్మిక దృక్కోణం ఇలాగే ఎందుకు తగలడిందో తెలియాలంటే అతని కాల్పనికతలో ప్రతిఫలిస్తున్న కొన్ని దృశ్యాలకీ అతని వ్యక్తిగత జీవితపు వాస్తవికతకీ ఉన్న పోలికల్ని పట్టుకోవాలి."మార్క్సు చాలా బీదవాడు.సిధ్ధాంత రచన చేస్తున్నప్పుడు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాడు.బూట్లూ సాక్సులూ అమ్ముకుంటూ గడిపాడు.ఎంగెల్సు చూట్టానికి వచ్చినప్పుడు అప్పులన్నీ తీర్చి డబ్బులిచ్చి ఆదుకున్నాడు" అంటూ రాదుగా వాళ్ళు మనకి చూపించిన మార్క్సు జీవిత దృశ్యాలు అన్నీ అబధ్ధాలు.వర్గరహితసమాజం వచ్చాకనే వ్యభిచారం మానేస్తానని తెగేసి చెప్పిన శ్రీశ్రీలా కార్ల్ మార్క్స్ సైతం కులీన కుటుంబపు దర్పం ఉన్న పైలా పచ్చీసు గాడు!తనకి అయిదారేళ్ళ వయస్సులో బాప్తిజం తీసుకున్నాడు.కొంచెం పెద్దయ్యాక తండ్రి దేవుడి ఉనికి గురించీ నమ్మకం గురించీ బైబిలు సూక్తుల్ని చూపించి చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు.తర్వాత తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానం చదివి వెర్రెక్కిపోయి కమ్యూనిష్టు పార్టీలో చేరిపోయిన మా తరంలోని కొందరు కుర్రాళ్ళకి మల్లే బ్రూనో బ్రాయర్ లాంటి టీచర్లని హీరోల కింద చూసి మొదట అల్లరి కుర్రాడిలా మారిపోయాడు.తర్వాత అలా అలా తొండ ముదిరి వూసరవెల్లి అయినట్టు "see this sword, this blood dark sword, which stabs unerringly within my soul.See this sword.The prince of darkness sold it to me" అనే రకం కవితలు తన్నుకు వచ్చాయి.

పాలిపోయిన మొహాల్తో ఆత్మహత్యలు చేసుకుంటున్న కన్యకలను గురించి అతను చేసిన వర్ణనలకు ఆధారం అయిన అతని ఇద్దరు కూతుళ్ళూ ఎలా చచ్చిపోయారో తెలిసిన వెంటనే వాళ్ళెంత తెలివి తక్కువ వాళ్ళో కదా అని జాలేసింది నాకు!వాళ్ళని చేసుకున్న భర్తలు ఎంత దుర్మార్గులో అని కూడా అనిపించింది - కానీ ఏమి లాభం?కన్న కూతుళ్ళని బేఖారీ అల్లుళ్లకి ఇచ్చి పెళ్ళిచేసి తన బాధ్యతలేమికి బలై చచ్చిపోయిన కూతుళ్ళని కవితా వస్తువుల కింద వాడుకుంటూ రోజల్లా తప్ప తాగుతూ ముండల్తో పడుక్కుంటూ బతికిన ఒక నికృష్టపు ఆడపిల్ల తండ్రికి ప్రపంచ కార్మికుల కోసం ఇరవయ్యేళ్ళ పాటు అహోరాత్రులు  శ్రమించిన మహామానవతావాది స్థానం ఇచ్చారు - ఎంత పిచ్చితనం ఇది!

పెద్ద కూతురి భర్త భార్యని ఆత్మహత్యకు ప్రేరేపించాడు, విషం తీసుకొచ్చి పక్కన పెట్టాడు, సూయిసైడ్ నోటుని డిక్టేట్ చేసి రాయించాడు, విల్లు వ్రాయించి ఆస్తిని బదలాయించుకున్నాడు - Edward Eveling అనే ఒక వెధవ, హేతువాది, నాస్తికుడు, అభ్యుదయ కాముకుడు ఏం చెప్తే అది చేసి తన భర్తకి కేసు లేని చావుని తెచ్చుకున్న ఆడపిల్లని ఏమని పిలవాలి?కందకి లేని దురద కత్తిపీటకి దేనికి అన్నట్టు కన్నతండ్రి ఆలోచించ లేదు గానీ సమకాలికులు కొందరు వాణ్ణి కేసు పెట్టి చిప్పకూడు తినిపించాలని ఆలోచించారు.ఇక Paul Lafargue అనే చిన్న అల్లుడు మరీ విచిత్రుడు - ఆత్మన్యూనతలో అగ్రగణ్యుడు!జన్యుపరమైన క్యూబన్ వారసత్వం కలవడంతో తెల్లతోలు జాత్యహంకారుల దృష్టిలో అస్పృశ్య జాతి అయిన నీగ్రోతనం కనబడి అసహ్యాన్ని పుట్టించింది కార్ల్ మార్క్సుకీ ఎంగెల్సుకీ.కర్ణదుర్యోధన సములైన మిత్రద్వయం మార్క్సు గారి అల్లుడిలో నీగ్రోత్వం ఎంత అని శాస్త్రీయమైన విశ్లేషణ చేసి 1/8 అని ఒకరూ 1/12 అని ఒకరూ నిర్ధారించారు.ఇప్పుడు మార్క్సిస్టులు అందరూ ప్రపంచ మానవాళిని జాత్యహంకారుల దోపిడీ నుంచి బైటికి లాగటానికి పనిముట్లు ఇచ్చాడని పొగుడుతున్న కార్ల మార్క్స్ తన అల్లుణ్ణి "గొరిల్లా" పదంలా ధ్వనించే "నెగ్రిల్లా" అని పిలిచి పగలబడి నవ్వుకున్న జాత్యహంకారి అన్న నిజాన్ని ఎందుకు తెలుసుకోలేక పోయారు?

అసలు కుట్రదారులు వీళ్ళు ఎంతవరకు తెలుసుకుంటే అసలు నిజం తెలుస్తుందో అందులో తమకు నష్టదాయకమైన సమాచారాన్ని దాచేసి తమకు లాభం తెచ్చిపెట్టే సమాచారాన్ని మాత్రమే వీళ్ళకి చూపించారుఅది పూర్తి నిజం అని నమ్మేసిన అమాయకత్వం వీళ్ళది.కార్ల్ మార్క్స్ చరిత్ర గురించి అంత పెద్ద ఎత్తున టముకేసి చెప్పటం ఇల్యూమినాటీల "If you want to control/expoit a person,race,nation or a country - first control his or its past or hisory!" అనే లూసిఫరియన్ సామ్రాజ్యవాదపు మూలసూత్రాన్ని ప్రజల, మార్క్సిస్టుల, శత్రువుల మెదళ్ళలోకి ఎక్కించి ఇల్యూమినాటీల దోపిడీకి అందర్నీ అలవాటు పడేలా చెయ్యటానికే పనికొస్తుంది - కార్ల్ మార్క్సు చేసిన చారిత్రక విశ్లేషణలో శాస్త్రీయత లేదు..

రోతశీల్డు మంద కొత్త చోటుకి వెళ్ళినప్పుడు చేసిన, చేస్తున్న, చెయ్యబోతున్న మొదటి పని అక్కడి ప్రజల చరిత్రని భ్రష్టు పట్టించటం.మన దేశపు చరిత్రలోకి గౌతమ బుధ్ధుణ్ణీ బింబిసారుణ్ణీ అశోకుణ్ణీ కల్పించి ఇరికించారు.మన దేశపు చరిత్రలోని సుగత బుధ్ధుణ్ణీ బిందుసారుణ్ణీ అజాతశత్రుణ్ణీ కల్పితాలను చేర్చి వాస్తవ చరిత్రను కట్టుకధలకింద ఫిరాయించేశారు - మార్క్సు గాడు చేసిన "స్వర్గాన్ని ఫిరాయించి నరకానికి అమ్ముడు పోయిన" చెత్త పనిని మన చేత కూడా చేయించారు, చీ!

కార్ల్ మార్క్స్ విమర్శించడానికి తీసుకున్న క్లాసికల్ స్మిత్సోనియన్ ఎకనామిక్స్ అతి పెద్ద చెత్త.ఆ అతి పెద్ద చెత్తని ప్రపంచం మీద రుద్దింది కూడా మార్క్సు చేత ఒక చిన్న చెత్తని ఎత్తి పోయించిన క్రైస్తవం లోపల ఉన్న లూసిఫర్ మతస్థులే.వీళ్ళు అడుగు పెట్టిన ప్రతి చోట స్థానికుల్లో వీళ్ళకి అమ్ముడుపోయిన ప్రభుత్వాధినేతల్ని తమకు కట్టుబానిసల్ని తయారు చేసుకున్న తర్వాత వాళ్ళని తోలుబొమ్మల మాదిరి ప్రజల ముందు చూపించి తెర చాటు నుంచి  ఆ మరబొమ్మలకి ఆజ్ఞలు జారీ చేస్తూ కరువుల్నీ యుధ్ధాల్నీ రోగాల్నీ వ్యాప్తి చేయించి పెద్ద ఎత్తున మనుషుల్ని చంపేసిన ఒక్కొక్క సంఘటనని పరిశీలించి చూస్తే వీళ్ళు వ్రాసిన చరిత్ర లోని లక్షమందిని చంపినందుకే పశ్ఛాత్తాప పడి ప్రియదర్శి ఇక యుధ్దాలు చెయ్యడని గొప్పలు చెప్పుకున్న అశోకుడు అనే శాంతిదూత ఒక పిచ్చి పుల్లయ్య అనిపిస్తాడు, నిజం!



“Crop failure in autumn 1768 and summer 1769 and an accompanying smallpox epidemic were thought to be the manifest reasons for the famine” అని మనకు చెప్తున్న మొదటి బెంగాల్ కరువు Warren hastings అనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి wealth of the nations లాంటి ఆర్ధిక శాస్త్రపు మతగ్రంధాలను వండివార్చిన యాడమ్ము స్మిత్తు గారి మొదటి సూచన అయిన "తినటానికి మాత్రం పనికొచ్చే ఆహార పంటలని తగ్గించి చెట్లకి డబ్బుల్ని కాయించే వ్యాపార పంటలని పెంచాలి" అన్న వేదవాక్కుని అనుసరించి Opium, Indigo, jute పంటల్ని విపరీత స్థాయిలో వెయ్యటం వల్ల వచ్చింది.కరువుకి Crop failure కారణం అనే ఒక్క మాట తప్ప Crop failure అంటే ఏమిటి,అదెలా ఉంటుంది, అసలెలా వస్తుంది అనేది ఎవరూ చెప్పడం లేదు - ఎందుకని?


కేవలం 1858 - 1947 నడుమ వచ్చిన ఒక్కొక్క కరువుకీ 1 మిలియనుకి తగ్గని జనం చచ్చిన 12 కరువులకి కారణం ఏమిటి?అలనాటి  1769–1770 కరువు పది మిలియన్ల మందిని పొట్టన పెట్టుకున్నది.1791 - 1792 మధ్యన మద్రాసు ప్రెసిడెన్సీలో వీళ్ళు తెచ్చిన పుర్రెల కరువు ఎంత భయానకమైనదో తెలుసా - 1788 మొదలు 1794 వరకు 11 మిలియన్ల మంది చచ్చిపోయారు,తగలబెట్టేవాళ్ళూ పూడ్చిపెట్టేవాళ్ళూ కూడా లేని శవాల గుట్టలై పోయాయి వూళ్ళకి వూళ్ళు!1865-1867 మధ్యన వచ్చిన ఒరిస్సా కరువు ఒరిస్సాని మాత్రమే లెక్క్కై తీసుకుంటే 1 మిలియన్ మందినీ బీహారూ బళ్ళారీ గంజామూ లాంటి చుట్టుపక్కల ప్రాంతాల్ని కలిపితే 4 మిలియన్ల మందినీ పొట్టన పెట్టుకుంది.1876-1878 మధ్యన వచ్చిన దక్షిణ భారత దేశపు అతి పెద్ద కరువు 10 మిలియన్ల మందిని చంపేసింది.1896-1897 మధ్యన వచ్చిన భారత్దేశపు కరువులోకల్లా తలమానికమైన గొప్ప కరువు ఎంతమందిని బలి తీసుకున్నదో సరైన లెక్క తెలియడం లేదు - తమ నిర్వాకం వల్ల చచ్చినవాళ్ళ లెక్కలు తియ్యడం అనవసరం అనుకుని ఉంటారు, దొంగ లంజ కొడుకులు!తమ జాతి వాళ్ళు ఇతర్లకి చేస్తున్న దారుణాలకి కినిసిన కొంతమంది పాశ్చాత్య సత్యాన్వేషులు ఒక్క ఈస్టిండియా కంపెనీ పాలిత ప్రాంతాల్లోనే సుమారు 16 మిలియన్ల మంది చచ్చిపోయారని లెక్క కట్టారు - వాళ్ళ దయ, మన ప్రాప్తం.


వాళ్ళు కరువుల్ని రప్పించడం అనే నీచమైన పనిని సైతం అసలు పాపభీతియే లేని నిండుమనస్సుతో ఎంత ప్లాను ప్రకారం చేస్తారో తెలుసుకోవడానికి 1832 నాటి మన గుంటూరు కరువుని గురించి తెలుసుకోవాలి."డొక్కల కరువు" అని దీనికి ముద్దుపేరు పెట్టుకున్నారు మనోళ్ళు - నందన నామ సంవత్సరంలో వచ్చిందని గుర్తుంచుకోవటానికి నందన కరువు అని కూడా పేరెట్టేసుకున్నారు."దొబ్బేసిందిరా నాయ్న!" అనుకుంటూ పెట్టారో ఏమో "దొబ్బ కరువు" అనే పేరు కూడా పెట్టుకున్నారు."పెద్ద కరువు, ముష్టి కరువు, వలస కరువు" - ఏడ్చిన ఏడ్పులకి కూడా ముద్దుపేర్లు పెట్టుకుని పులకించిపోయిన పిచ్చోళ్ళు మన తాతలు.దీనికి  మట్టుకు చరిత్రకారులు చెప్పిన కారణం న్యాయమైనదే - "crop failure as well as excessive and uncertain levels of taxation on peasants by British East India Company" అట!అప్పటి గుంటూరు ప్రాంతపు జనసంఖ్యలో మూడొంతుల మంది అంటే 5,00,000 మందికి 1,50,000 మది తిండి దొరక్క చచ్చారు.74,000 ఎద్దులు చచ్చాయి.1,59,000 పాడి పశువులు చచ్చాయి.గొర్రెలూ మేకలూ కలిసి 3,00,000 లక్షలు చచ్చాయి.చచ్చిన వాళ్ళు చస్తే బతికిన వాళ్ళు ఇక అక్కడ ఉండి ఉధ్ధరించేది లేదని తెలిసి వేరే చోట్లకి వలస పోయారు.వలస పోయిన వాళ్లలో కొంతమంది 1834 నాడు మహా మానవతా వాదులం అని చప్పట్లు కొట్టించుకోవడానికి బానిసత్వాన్ని రద్దు చేసిన చట్టం ప్రకారం స్వేచ్చను పొందిన నల్ల బానిసలు వదిలేసిన వెట్టి పనుల్ని అందుకున్నారు.బ్రిటిష్ ప్రభుత్వానికి బానిసత్వాన్ని రద్దు చేసిన ఖ్యాతీ దక్కింది, వాళ్ళు బానిసల చేత చేయించుకుంటున్న పనులూ ఆగలేదు - ఎంత లాభసాటి కరువురా అది!


అవ్వన్నీ పాతవి,వాళ్ళే తెచ్చారని చెప్పటం హరిబాబు అనే హిందూమతపిచ్చగాడి పులుముడు పాండిత్యం అనుకునే వాళ్ళకి 1943 నాడు చర్చిలు తెచ్చిన బెంగాలు కరువు ఎన్నో నిజాల్ని చెప్తుంది - విన్నదీ చూసిందీ మాత్రమే గాక బయటికి కనిపించని చీకటి మనుషుల ఉనికిని కూడా నిజం అని ఒప్పుకోగలిగిన దమ్మున్న వాళ్ళు మాత్రమే అర్ధం చేసుకోగలిగిన దుర్మార్గమైన కారణం బెంగాల్ కరువు వెనక ఉంది.


అప్పటి వరకు మోహనదాసును జాతిపిత ఆని నమ్మిన సుభాష్ చంద్ర బోసు తన భ్రమల్ని వదిలించుకుని బెంగాల్ ప్రజల్ని నిజమైన స్వాతంత్య్ర పోరాటం వైపుకి నడిపించడంలో కృతకృత్యుడై తమకు రెండవ ప్రపంచ యుధ్ధపు ఖర్చుని పెంచినందుకు పగబట్టి scorching the earth(ముడ్డి కింద మంట పెట్టటం/పెనం మీద నుంచి పొయ్యి లోకి తొయ్యటం) పేరున Winston Churchill అనే పరమ నికృష్టుడు కసి కొద్దీ బెంగాలు మీద రుద్దాడు 1943 నాటి కరువుని!

బోసు కాంగ్రెసు నుంచి బయటికి రావటం ఒక్క రోజులో జరిగిన సన్నివేశం కాదు.తొలినాళ్లలో నెహ్రూ,బోసుల మధ్య మంచి స్నేహం నడుస్తూ ఉండేది.కాంగ్రెసు పార్టీ చేసిన అన్ని కార్యక్రమాలలోనూ జిగ్రీ దోస్తుల మాదిరి కలిసి పని చేశారు,కాంగ్రెసు పార్టీ తీసుకున్న అన్ని నిర్ణయాలలోనూ ఒకే గొంతును వినిపించారు.అయితే, కలిసి పని చేస్తున్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలలోనూ సహజమైన నాయకత్వం విషయంలో నువ్వా నేనా అన్న పోటీ వచ్చినప్పుడు గాంధీ అన్ని సార్లూ నెహ్రూని వెనకేసుకుని రావడం అందరికీ తెలిసేలానే జరిగింది.దాంతో బోసు INA స్థాపించి జపాను వాళ్ళతో కలిసి ఇంగ్లీషు వాళ్ళ మీదకి యుధ్ధానికి వచ్చాడు.ఎంత చిత్రమైన వ్యూహం బోసుది - అటువైపున జపాను సైన్యంలోనూ ఇటువైపున బ్రిటిషు సైన్యంలోనూ ఉండి ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవాల్సిన వాళ్ళు మనవాళ్ళే!

అంత దయనీయమైన స్థితి ఎందుకు దాపరించింది బోసుకి?ఇంగ్లీషువాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళ లాభం కోసం వాళ్ళ అహాల్ని చల్లార్చుకోవటం కోసం చేసుకుంటున్న మోసకారి యుధ్ధానికి మనవాళ్ళనుంచి నిధుల్ని సేకరించి మనవాళ్లని వాళ్ళతో కలిసి యుధ్ధం చేసి ఇంగ్లీషువాళ్ళ శత్రువుల్ని చంపమని పంపించిన పరమ నికృష్టపు వెధవని ఇప్పటికీ జాతిపిత పేరున గౌరవిస్తున్న బానిసజాతిలో పుట్టి వీళ్ళకి అవసరం లేని స్వాతంత్య్రాన్ని తెచ్చిపెడదామని అనుకున్నందుకు కాదూ!

1943, అంటే ద్వితీయ భారత స్వాతంత్య్ర సంగ్రామం ఉధృతమైన స్థాయిలో జరుగుతున్న కాలం.ఇంకొక్క అయిదేళ్ళలో ఆకుంఠిత దేశభక్త శ్రేష్ఠుల శ్రేణి ఆహితాగ్నుల వలె రగిలిపోయి చూపించిన పోరాటస్పూర్తికి దడుచుకుని ఇంగ్లీషోళ్ళు స్వాతంత్య్రం ఇచ్చిన 1947కి అయిదేళ్ళ ముందు లండనులో కూర్చున్న చర్చిలు ఇండియాలోని ఒక ప్రాంతం మీద ప్రచండమైన కరువుని రుద్దుతుంటే ఒక్కడంటే ఒక్క దేశభక్తుడు బెంగాలు వైపు చూడలేదు,అయ్యో అనలేదు,ఆపాలని ప్రయత్నించలేదు.కమ్యూనిష్టోళ్ళు కూడా కరువును రుద్దుతున్న దొంగ నాటకం నడుస్తున్నప్పుడు పోలేదు, ఆపలేదు - అయిపోయాక పాటలు రాశారు, పేరు తెచ్చుకున్నారు!

నిజానికి చర్చిల్ అష్టదిగ్బంధనం చేసి బెంగాలును పగబట్టి వేధించడం వల్లనే అంతమంది జనం చచ్చిపోయారు.ఇంగ్లీషువాళ్ళు మద్రాసు ప్రెసిడెన్సీ తర్వాత బెంగాలు ప్రెసిడెన్సీని ఎక్కువ దెవలప్ చేశారు.రాకపోకలకి ఇబ్బంది లేదు.మిగిలిన దేశంలో కరువు లేదు.అలాంటప్పుడు అంత పెద్ద కరువు ఎట్లా వచ్చింది?యుధ్ధ సమయపు జాగ్రత్తల పేరున వరి ధాన్యపు ఎడ్లబళ్ళని కూడా బెంగాలు వైపుకి వెళ్ళనివ్వలేదు.అక్కడ లండను చట్టసభలో ప్రతిపక్షాల వాళ్ళు తమ ఇతర వలసల నుంచి ధాన్యాన్ని తరలించమని చేస్తున్న గొడవల్ని కూడా రోతశీల్డు మందలోని ఒక గాండ్లసంగు కొడుకు " ఏంటీ, ఇండియాలో కరువొచ్చిందా?అవునా, అయితే గాంధీ ఇంకా చచ్చిపోలేదేం!" లాంటి లేకిమాటలతో కొట్టిపారేసి బెంగాలు ప్రజల మీద కరువుని రుద్దుతుంటే మహాత్ముడికీ తెలియదు, శాంతిదూతకీ తెలియదు, ఉక్కుమనిషికీ తెలియదు, విప్లవ సింహాలకీ తెలియదుహవ్వ, మరీ అంత అమాయకత్వమా!

ఆరవ శతాబ్దం నాడు మొదలై చెదురు మదురైన ముసల్మాన్ల దాడులు 13వ శతాబ్దం మొదలు మొదలై 17వ శతాబ్దం వరకు ముమ్మరమైన తర్వాత 17వ శతాబ్దం నాటికి ప్రపంచం మొత్తం కలిసి పుట్టించిన సంపదలో మూడోవంతును పుట్టిస్తున్న వాళ్ళకి పంటలు ఎలా పండించాలో తెలియకనా 17వ శతాబ్దం నుంచి ఇన్ని కరువులు వచ్చింది?

ఇన్ని కరువులు రప్పించి తమ తాతల్ని చంపేసిన ఇంగ్లీషువాళ్ళని పట్టుకుని "అయ్ బాబోయ్, ఇంగ్లీషోళ్ళు వచ్చి మనకి ఇంగ్లీషు నేర్పబట్టీ బతికి బట్టకట్టి ఇట్టా ఉన్నాం గానీ లేప్పోతే బ్యామ్మర్లు మన కులాన్ని తొక్కి నారతీసే వోళ్ళు!" అని పొగుడుతున్న అంబేద్కరిస్టులకి ఏ చెప్పుతో కొడితే వాళ్ళ కళ్ళకి పట్టిన బానిసత్వపు కొవ్వు కరిగి మంచి బుధ్ధి వస్తుంది?

మూడేళ్ళ నుంచి కరోనా పేరున ఎన్ని అబధ్ధాలు చెప్పి ఎంత హడావిడి చేస్తున్నారు? కరోనా వ్యాప్తి గురించి గానీ కరోనా వ్యాధి లక్షణాల గురించి గానీ కరోనా వ్యాధికి జరిగిన జరుగుతున్న వైద్యం గురించి గానీ పోస్ట్ వ్యాక్సినేషన్ సిండ్రోంస్ గురించి గానీ పోస్ట్ కరోనా పాజిటివ్ సిండ్రోంస్ గురించి గానీ ఎంతమంది హేతువాదులకి ఖచ్చితమైన సమాచారం తెలుసు?"అన్ని సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న జో బైడెనుకి కరోనా ఎలా వచ్చింది?" అనే ప్రశ్న హేతువాదులకి ఎందుకు రావడం లేదు?చికెన్ గన్యాకి గానీ ఫ్లూ వైరసుకి గానీ అక్కర్లేని సోషల్ డిస్టాన్సింగ్ మొదలు నాజీ కాన్సెంట్రేషన్ క్యాంపుల లాంటి ఐసొలేషన్ వార్డుల వరకు గల ప్రత్యేకతలు ఒక్క కరోనాకే ఎందుకు అవసరం అయ్యాయి అనే ప్రశ్నకి ఏ విశ్లేషకుడు ఎంత చక్కటి జవాబును చెప్పాడు?కుటుంబ సభ్యులు చచ్చిపోతే వాళ్ళు కరోనాతో చచ్చిపోయారు అన్న ఒకే ఒక కారణంతో దగ్గరకి కూడా వెళ్ళని స్థాయి భయోత్పాతాన్ని సృష్టించినది ఎవరు?బాబాలూ సన్యాసులూ పాస్తర్లూ చేసేవి మాత్రమే మోసాలా - మోడర్న్ సైన్సు పేరు చెప్పి గందరగోళాన్ని సృష్టించి ప్రాణభయం పుట్టించి ఒక రోజు కరోనా ట్రీట్మెంటుకి లక్షల సొమ్ము గుంజడం మోసం అనిపించదా ఈ అభ్యుదయ హేతువాద నాస్తిక శిఖామణులకి?ఎంతమంది అభ్యుదయ హేతువాద నాస్తిక శిఖామణులు ఎంతమంది కార్పొరేట్ డాక్టర్లని నిలదీశారు?

మూడేళ్ళ పాటు ఏ పనీ చెయ్యనివ్వక పోవడం వల్లనే కదా శ్రీలంక పన్నుల వల్ల వచ్చే ఆదాయం లేక కొత్త అప్పులు పుట్టక అవమానం పాలయ్యింది.ఆత్మ నిర్భర భారత్ పేరున విదుదల చేసిన ఇరవై వేల కోట్లూ నిలవలో ఉన్న నికర ఆదాయం నుంచి తియ్యనప్పుడు రేపు కొత్త అప్పులు ఇవ్వం అని IMF చెప్తే మన దేశం కూడా శ్రీలంక లాగే అఘోరించాల్సిందే కదా!నేను హిందూత్వవాదిని గనక అక్కడున్నది హిందూ ప్రభుత్వం కాబట్టి నిలదియ్యడానికి వెనుకాడితే అర్ధం చేసుకోవచ్చును.కానీ, ఒక మతచాందసవాద పార్టీ "2020వ సంవత్సరానికి 30,42,230 కోట్ల రూపాయలను మాత్రమే పెట్టుబడి కింద ఖర్చు చేస్తూ ఆ కుసింత కరెన్సీని సైతం పెట్టుబడి తిరిగి రాని చోట ఖర్చు పెట్టి లోటు బడ్జెట్లతో అఘోరిస్తూ 11,600,000,000 USD దాటి పెరుగుతున్న అప్పుని" దాచేస్తుంటే నిలదియ్యటానికి అభ్యుదయ హేతువాద నాస్తిక శిఖామణులకి గొంతు పెగలడం లేదు,ఎందుకని?

2022 నాడు,1947 నుంచి 75సంవత్సరాల తర్వాత, ఇప్పుడు అంటే నవ్వొస్తుంది గానీ మనకి స్వతంత్రం అనవసరం అనిపిస్తుంది నాకు.ఎందుకంటే, "మిగిలిన భారత దేశం ఒక శతాబ్దం తర్వాత ఆలోచించే దాన్ని బెంగాలు ఇవ్వాళ ఆలోచిస్తుంది!" అని గొప్పలు చెప్పుకున్న బెంగాలు నడిబొడ్డున చర్చిలు తెచ్చిన అక్షరాల 5.2 మిలియన్ల మంది బెంగాలీల్ని చంపిన బెంగాలు కరువుకి దిక్కుమాలిన హిండియాలోని వాపిరిగొట్టు మూక ప్యానిక్ అవ్వడమూ లోకల్ బెంగాలీ భద్రలోక్ దగుల్బాజీ ప్రభుత్వాధికార్లు అలగా జనాన్ని అదుపు చెయ్యడం చేతగాక చేతులెత్తెయ్యడమూ బేచారా హిండియన్ కోమట్లు ధాన్యాన్ని దాచేసి విదేశాలకి బ్లాకులో హమ్మడమూ కారణాలని టముకేసి చెప్పి అమర్త్య సేన్ అనే ఒక దగుల్బాజీ గాడు నోబెల్ ప్రైజు తెచ్చుకున్న 1998 నాడు 10.4  మిలియన్ల మంది బెంగాలు కుర్రాళ్ళు "మనోడికి నోబుల్ ప్రైజొచ్చిందిరోయ్!" అని పండగ చేసుకున్నారు.ఇలాంటి అజ్ఞానపు మందకి స్వతంత్రం అవసరమా - మీరు చెప్పండి!

బ్రిటిషు వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారమే వాళ్ళు 70,000 పడవల ధాన్యాన్ని confiscate చేసి బెంగాలు ప్రజలకి అందని చోట దాచేశారు!చర్చిలు రప్పించిన కరువుని ఇండియన్ల మీదకి తోసేసిన అమర్త్య సేన్ వామపక్ష మేధావులకి మాత్రం ఎట్లా గౌరవనీయుడు అయ్యాడు?దోపిడీని అణిచివేసి ప్రజలకి సమసమాజపు సౌఖ్యాల్ని అందివ్వటం కోసం నడుం కట్టిన విప్లవ వీరులు సైతం దోపిడీ దారులకు వూడిగం చేస్తుంటే ఇంక దోపిడీని నిరోధించటం ఎట్లా సాధ్యం?పైన చెప్పిన కొంతమంది అమాయకత్వం వల్ల చేశారని సరిపెట్టుకోవచ్చు.కానీ, నక్సలైట్లు దోపిడీ ప్రభుత్వాల్ని కూల్చటానికి వాడుతున్న తుపాకులూ మందు పాతర్లూ ఎవరి దగ్గిర కొంటున్నారు?ఇస్లామిక్ జెహాదీల నుంచి ఆయుధాలు కొని వీళ్ళు తెచ్చే సమసమాజం ఇస్లామిక్ జెహాదీలని ఎలా అణిచి వేస్తుంది?వీళ్ళు ఇస్లామిక్ జెహాదీలతో కలిసి పంచుకునే అధికారం హిందువులకి ఏం న్యాయం చేస్తుంది?

అమర్త్య సేన్ నోబుల్ ప్రైజు తెచ్చుకున్న పుస్తకం పేరు "Development as freedom" వూరేగింపులు తీసి మిఠాయిలు పంచిపెట్టి సంబరపడిన 10,400.000 మందిలో ఎంతమంది చదివి ఉంటారు?ఒక్కడు కూడా చదివి ఉండడు - ఎందుకంటే,అంత గొప్ప పుస్తకానికి కేవలం 2800 కాపీలు మాత్రమే చెల్లి పోయాయి,అదీ రోతశీల్డు వెధవలు వేసిన ఉచిత పంపిణీ పధకం వల్ల!

తనకి నోబుల్ ప్రైజు ఇచ్చిన రెండేళ్ళకి అమర్త్య సేన్ Emma Rothschild అనే ఆణిముత్యాన్ని పెళ్ళి చేసుకున్నాడు.ఇదేమీ అలా అనుకోని విధాన జరిగిన లేత యవ్వనపు తొట్టతొలి ప్రణయం కాదు.1985 నాడు Eva Colorni అనే రెండవ భార్య చచ్చిపోయిన(?) నాటినుంచి లైనేస్తూ అప్పటికి పడగొట్టాడు.1959ల నాడు వీడికి మొదటి భార్య అయిన నవనీతా దేవి వీడిలో ఉన్న తెల్లవాళ్ళ చెప్పులు నాకే బుధ్ధిని చూసి అసహ్యించుకుని 1976ల నాడు విడాకులు తీసుకునేశాక పీడా పోయిందని ఇక తెల్ల చర్మం వాళ్ళ కాళ్ళని నాకెయ్యటం మొదలు పెట్టాడు.దోపిడీని విముక్తం చెయ్యాల్సిన కమ్యూనిష్టు అమర్త్య సేన్ ఇల్లరికం వెళ్ళిన కుటుంబమే బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వెనక దాక్కుని ప్రపంచ స్థాయిలో దోపిడీని నడిపిస్తున్నది. ఆనాటి కారా మేష్టారూ కామ్రేడ్ సుందరయ్యా ఈనాటి తెలకపల్లి రవీ సీపీఐ నారాయణా కూడా అమర్త్య సేన్ నిజమైన చరిత్ర తెలియకనే అతన్ని గౌరవనీయుడైన మేధావి కింద పొగిడేశారా? ఏమో, వీళ్ళు సైతం అన్నీ తెలిసే ఇతరుల్ని మోసం చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు - మీరు చెప్పండి!

"PEACE OUT OF THE CHAOS!" అని ఒక దుర్మార్గపు నీతిని పాటిస్తూ ప్రజల్ని గందరగోళానికి గురిచేసే రహస్య ప్రణాళికలో ఆనాటి కారా మేష్టారూ కామ్రేడ్ సుందరయ్యా ఈనాటి తెలకపల్లి రవీ సీపీఐ నారాయణా కూడా ఒక భాగం కావడమే ప్రజలు దోపిడీకి అలవాటు పడిపోవటానికీ దేశద్రోహుల్ని గుర్తించలేక వాళ్ళని దేశభక్తులని పొగడటానికీ అతి ముఖ్యమైన కారణం - ఎంత విషాదం మనది?

P.S:”భారత్దేశంఅనే మాటని కమ్యూనిష్టు భావజాలం పట్ల అభిమానం ఉన్న గుంటూరుకు చెందిన ఒక పిచ్చివాళ్ళ డాక్టరు యా.రమణ చాలా ఎక్కువ సార్లు వాడేవాడు. ఎక్కువ సార్లు కూడా కాదేమో, అతను "అందరికీ దొరకను,కొందరికే చెబుతాను" అని తన బ్లాగుల్ని ప్రైవేట్ చేసేవరకు రెగ్యులర్ విజిటర్ని అయ్యి చాలా పోష్టుల్లో మంచి కామెంట్లు కూడా వేశాను గానీ తన పోష్టుల్లో "భారత దేశం" అనే చక్కటి పదాన్ని ఒక్క సారి కూడా వాడినట్టు గుర్తు లేదు నాకు.అప్పుడు ఇతర్ల దృష్టికోణం గురించి చెప్తూ వ్యంగ్యానికి వాడేవాడని అనుకున్నాను గానీ ఇప్పుడు అది మన దేశం పట్ల మన ధర్మం పట్ల మన సంస్కృతి పట్ల అతనిలో గూడు కట్టుకున్న స్వంత అసహ్యం అని అర్ధం అవుతున్నది నాకు.

Wednesday, 6 July 2022

ప్రశాంతమైన నిద్ర కోసం ఆనందవల్లిని ఆశ్రయించాలి!

 

కృష్ణ యజుర్వేదం యొక్క ఆవిర్భావం వెనుక ఒక కధ ప్రచారంలో ఉంది.యాజ్ఞవల్క్యుడికి గురువుతో సంవాదం ఏర్పడింది.వివాదం ముదిరి గురువైన వైశంపాయనుడు ఆగ్రహం పట్టలేక తన వద్ద నేర్చిన విద్యని తిరిగి ఇచ్చేసి పొమ్మన్నాడట. అప్పుడు యాజ్ఞవల్క్యుడు వాంతి చేసుకున్న నల్లని యజుర్వేదపు ముద్దని వైశంపాయనుడి ఇతర శిష్యులు తిత్తిరి పక్షుల వలె మారిపోయి తినేశారట.సర్వులకూ సత్యాసత్యాలను నిర్ధారించడానికి శాస్త్రీయమైన తర్కాన్ని ఇచ్చిన వైదిక సాహిత్యంలో ఇలాంటి తార్కికత లేని కధనాలను ఇరికించటం చిరాకు పుట్టిస్తుంది నాకు.అసత్యాలను మనం ఆమోదించాల్సిన అవసరం లేదు కానీ గత కాలపు వారు ఆమోదించిన కధనాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కద.

అలా యాజ్ఞవల్క్యుడి నుంచి ఉద్భవించిన జ్ఞానమైన కృష్ణ యజుర్వేదానికి ఇతర పండితులు చేర్చిన అనుబంధ సాహిత్యంలో  తైత్తిరీయం అనే ఉపనిషత్తు చాలా ముఖ్యమైనది.బహుశః పదలాలిత్యమూ రసమాధుర్యమూ ఎక్కువ కావడం వల్ల కాబోలు వీటిని శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అని సంబోధిస్తారు!

మొదటిది శిక్షావల్లి - విద్య,అధ్యయనం,జ్ఞానసముపార్జన,బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అవసరమైన గుణగణాల వంటి విషయాలను గురించి చెప్తుంది.
రెండవది ఆనందవల్లి,దీనినే బ్రహ్మానందవల్లి అని కూడా అంటారు - బ్రహ్మము,ఆనందము అనే విషయాలను గురించి  చెప్తుంది.
ఇందులోని మొదటి అనువాకం బ్రహ్మమును తెలుసుకున్న వారికే అధికమైన ఆనందం స్థిరమై నిలుస్తుందని ప్రతిపాదించి దానిని వ్యాఖ్యాన సహితం నిరూపణను తర్వాత వచ్చే అనువాకాలలో ఇస్తుంది.
ఇందులోని మొదటి అయిదు అనువాకాలలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను గురించిన జ్ఞానం ఉంటుంది.
ఇందులోని ఆరవ అనువాకం ఆనందమయ కోశాన్ని చేరడానికి జ్ఞానం అవసరమని విశ్లేషించి చెప్తుంది.
ఇందులోని ఏడు మొదలు తొమ్మిదవ అనువాకం వరకు సృష్టి యొక్క తత్వాన్ని గురించి చెప్తాయి.
మంత్రార్ధ విశేషం:
01.బ్రహ్మవిదాప్నోతి పరం,తదేషాభ్యుక్తా,సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ,యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్:బ్రహ్మమును తెలుసుకోగలిగిన వారు మాత్రమే అధికమైన ఆనందాన్ని పొందుతారు.ఇందును గురించి సృష్టికర్త ఇలా చెప్తున్నాడు.బ్రహ్మమునైన నేను జ్ఞానము వలన ధారణకు  మాత్రమే గోచరించు ఆనంతుడను.అంతరిక్షమున సైతం నేను పరోక్షవాసినై ఉన్నానని ఎవరు గ్రహిస్తారు?వారే జ్ఞానులు!
02.సో2శ్నుతే సర్వాన్ కామాన్ ధ్సహ బ్రహ్మణా వివశ్చితేతి,తస్మాద్వా ఏతస్మాతాద్మన ఆకాశ స్సంభూతః, ఆకాశాద్వాయుః,వాయోరగ్నిః, అగ్నే రాపః, అధ్యః పృధివీ, పృధివ్యా ఓషధయః, ఓషధీభ్యో2న్నం, అన్నాత్పురుషః, స వా ఏష పురుషో2న్నరసమయః:ఎవరు ఆ సూక్ష్మాన్ని గ్రహిస్తారో వారు బ్రహ్మమునైన నన్ను వశ్యుణ్ణి చేసుకుని నాకు వశులై తమ కోరికలను నెరవేర్చుకుంటారు.అలా ఆత్మ అంతరిక్షం నుండి ప్రభవిస్తుంది.ఆకాశం నుంచి వాయువు పుడుతుంది.వాయువు నుంచి అగ్ని పుడుతుంది.అగ్ని నుంచి జలం పుడుతుంది.దానినుంచి పృధ్వి పుడుతుంది.పృధ్వి నుంచి ఓషదులు పుడతాయి.ఓషధుల నుంచి అన్నం పుడుతుంది.అన్నం వల్లనే పురుషులకు దేహాలు ఏర్పడతాయి.
03.తస్యేద మేవ శిరః, అయం దక్షిణ పక్షః, అయ ముత్తర పక్షః, అయమాత్మా, ఇదం పుఛ్చం ప్రతిష్ఠా - తదప్యేష శ్లోకో భవతి:అందువల్ల పురుషతత్వం గల జీవులు అన్నరసమయమై ఉంటాయి.బ్రహ్మమునైన నేను పురుషతత్వం గల జీవులకు శిరస్సునై ఉన్నాను.ఆ పక్షికి నేను కుడి రెక్కను,ఆ పక్షికి నేను ఎడమ రెక్కను.ఆ పక్షికి నేను ఆత్మను.ఇదియే ఆ పక్షికి తోకలా స్థిరత్వాన్ని ఇస్తుంది.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
04.అన్నాద్వై ప్రజాః ప్రజాయంతే,యాః కాశ్చ పృధివీం శ్రితాః,అధో అన్నేనైవ జీవంతి,అధైనదపి యన్త్యన్తతః,అన్నంహి భూతానాం జ్యేష్ఠం,తస్మాత్ సర్వౌషధ ముచ్యతే:జీవులు,ప్రజలు - ఒకరని కాదు పృధ్విపైన గల సమస్తమూ అన్నం వల్లనే పుడుతుంది.అన్నం వల్ల పుట్టిన జీవులు మళ్ళీ అన్నం చేతనే పెరుగుతాయి.చివరికి మళ్ళీ అన్నమే అవుతాయి.జీవుల కన్న ముందరే అన్నం పుడుతుంది.అందువల్లనే అన్నిటికీ ఔషధం అవుతుంది.
05.సర్వం వై తే2న్నమాప్నువంతి,యే2న్నం బ్రహ్మోపాసతే,అన్నంహి భూతానాం జ్యేష్ఠం,తస్మాత్ సర్వౌషధ ముచ్యతే,అన్నాద్ భూతాని జాయంతే,జాతాన్యన్నేన వర్ధంతే,అద్య తేత్తిచ భూతాని,తస్మాదన్నం తదుచ్యత ఇతి:అన్నమే నేనని ఎవరు తెలుసుకుంటే వారికి అన్నం పుష్కలమై లభిస్తుంది.జీవుల కన్న ముందరే అన్నం పుడుతుంది.అందువల్లనే అన్నం అన్నిటికీ ఔషధం అవుతుంది.భూతాళి సమస్తం అన్నం నుంచే పుడుతున్నాయి.అలా పుట్టిన జాతులన్నీ అన్నం వల్లనే పెరుగుతున్నాయి.మొదట తను భూతాళి చేత స్వీకరించబడి తర్వాత భూతాళిని తను స్వీకరించేది గనకనే దాన్ని అన్నం అని పిలుస్తారు.
06.తస్మాద్వా ఏతస్మా దన్నరసమయాత్,అన్యోన్తర ఆత్మా ప్రాణమయః,తేనైష పూర్ణః,స వా ఏష పురుష విధ ఏవ,తస్య పురుష విధతాం,అన్వయం పురుష విధః:ఇది గాక,అన్నరసాలకు అంతరాన ప్రాణమయమైన ఆత్మ ఉంటుంది.ఈ ప్రాణం చేరిక వల్ల ఆ అన్నం పూర్ణత్వాన్ని పొందుతుంది.అలా జీవులకి పురుషతత్వం ఏర్పడింది.తొలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడినట్లే మలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడింది.
07.తస్య ప్రాణ ఏవ శిరః,వ్యానో దక్షిణ పక్షః,అపాన ఉత్తరః పక్షః,ఆకాశ ఆత్మా,పృధివీ పుఛ్చం ప్రతిష్ఠా - తదప్యేష శ్లోకో భవతి:అన్న స్వరూపమైన ఆ పక్షికి ప్రాణమే శిరస్సు.వ్యానము కుడి రెక్క.అపానము ఎడమ రెక్క.అంతరిక్షమే ఆత్మకు దేహం.అన్న స్వరూపమైన ఆ పక్షికి పృధ్వియే తోకలా స్థిరత్వాన్ని ఇస్తుంది.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
08.ప్రాణం దేవా అనుప్రాణంతి,మనుష్యాః పశవశ్చ యే,ప్రాణోహి భూతానా మాయుః,తస్మాత్ సర్వౌషధ ముచ్యతే,సర్వమేవ త ఆయుర్యంతి, యే ప్రాణం బ్రహ్మోపాసతే,ప్రాణోహి భూతానా మాయుః,తస్మాత్ సర్వౌషధ ముచ్యత ఇతి:ప్రాణవాయువు ద్వారానే దేవతలు దేహధారులై జీవిస్తారు.మానవులే కాదు పశువులు సైతం ఇలానే జీవిస్తాయి.ఈ ప్రాణమే జీవులను చైతన్యవంతం చేస్తుంది.అందువల్లనే ప్రాణం అన్నిటికీ ఔషధం అయ్యింది.ప్రాణమే నేనని ఎవరు తెలుసుకుంటే వారికి ఆయుష్షు పుష్కలమై లభిస్తుంది.ఈ ప్రాణమే జీవులను చైతన్యవంతం చేస్తుంది.అందువల్లనే ప్రాణం అన్నిటికీ ఔషధం అవుతుంది.
09.తస్యేష ఏవ శారీర ఆత్మా,యః పూర్వస్య,తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్,అన్యోన్తర ఆత్మా మనోమయః,తేనైష పూర్ణః,స వా ఏష పురుష విధ ఏవ,తస్య పురుష విధతాం,అన్వయం పురుష విధః:ఇదివరకు చెప్పినట్లు శరీరం అనే తొడుగును కప్పుకుని ఆత్మ ఉంటుంది.ఇది గాక,ప్రాణమునకు అంతరాన మనోమయమైన ఆత్మ ఉంటుంది.ఈ మనస్సు చేరిక వల్ల ఆ ప్రాణం పూర్ణత్వాన్ని పొందుతుంది.అలా జీవులకి పురుషతత్వం ఏర్పడింది.తొలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడినట్లే మలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడింది.
10.తస్య యజురేవ శిరః,ఋగ్దక్షిణః పక్షః,సామోత్తరః పక్షః,ఆదేశ ఆత్మా,అధర్వాంగిరసః పుఛ్చం ప్రతిష్ఠా,తదప్యేష శ్లోకో భవతి:మనః స్వరూపమైన ఆ పక్షికి యజుర్వేదం శిరస్సు,ఋగ్వేదం కుడి రెక్క,సామవేదం ఎడమ రెక్క.మనః స్వరూపమైన ఆ పక్షికి గురుపరంపరానుసారం కొనసాగుతున్న వేదజ్ఞానసారమే ఆత్మ.ఆ విహరించే పక్షికి అధర్వాంగ శృతియే తోకలా స్థిరత్వాన్ని ఇస్తుంది.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
11.యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ,ఆనందం బ్రహ్మణో విద్వాన్,న బిభేతి కదాచనేతి:మనస్సు చేత చేరుకోలేని నన్ను వాక్కు చేత చెప్పలేని ఆనంద స్వరూపమైన నన్ను ఎవరు కనుక్కోగలరు?వారే జ్ఞానులు!ఆనంద స్వరూపుడనైన నన్ను తెలుసుకున్న విద్వాంసులు దేనికీ ఎవ్వరికీ ఎప్పటికి భయపడరు,ఇది సత్యం!
12.తస్యైష ఏవ శారీర ఆత్మా,యః పూర్వస్య,తస్మాద్వా ఏతస్మాన్మనోమయాత్,అన్యోంతర ఆత్మా విజ్ఞానమయః,తేనైష పూర్ణః,స వా ఏష పురుష విధ ఏవ,తస్య పురుష విధతాం,అన్వయం పురుష విధః:ఇదివరకు చెప్పినట్లు శరీరం అనే తొడుగును కప్పుకుని ఆత్మ ఉంటుంది.ఇది గాక,మనస్సునకు అంతరాన విజ్ఞానమయమైన ఆత్మ ఉంటుంది.ఈ విజ్ఞానం చేరిక వల్ల ఆ మనస్సు పూర్ణత్వాన్ని పొందుతుంది.అలా జీవులకి పురుషతత్వం ఏర్పడింది.తొలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడినట్లే మలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడింది.
13.తస్య శ్రధ్ధైవ శిరః,ఋతం దక్షిణః పక్షః,సత్య ముత్తరః పక్షః,యోగ ఆత్మా,మహః పుఛ్చం ప్రతిష్ఠా - తదప్యేష శ్లోకో భవతి:జ్ఞాన స్వరూపమైన ఆ పక్షికి శ్రధ్ధయే శిరస్సు, నీతి కుడి రెక్క,సత్యం ఎడమ రెక్క.జ్ఞాన స్వరూపమైన ఆ పక్షికి వేదశాస్త్రానుసారం కొనసాగుతున్న యోగసాధనయే ఆత్మ.జ్ఞాన స్వరూపమైన ఆ పక్షికి మహత్వ పూర్ణమైన బుద్ధియే తోకలా స్థిరత్వాన్ని ఇస్తుంది.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
14.విజ్ఞానం యజ్ఞన్తనుతే,కర్మాణి తనుతే2పిచ,విజ్ఞానం దేవా స్సర్వే,బ్రహ్మ జ్యేష్ఠ ముపాసతే,విజ్ఞానం బ్రహ్మ చేద్వేద, తస్మాత్ ఛే2న్న ప్రమాధ్యతి:విజ్ఞానం యజ్ఞకర్మలను నిర్వర్తిస్తుంది.అదే కామ్యకర్మలను కూడా చేస్తుంది.దేవతలు అందరూ ఆదినుంచీ కొనసాగుతున్న నన్ను జ్ఞానస్వరూపుడిగానే ఉపాసిస్తున్నారు.ఎవరు నన్ను జ్ఞానంతో శోధించి తెలుసుకుని నన్ను జ్ఞానస్వరూపుడిగా చూస్తారో వారికి నైతిక ప్రమాద భయం ఎలా సంభవిస్తుంది?
15.శరీరే పాంపనో హిత్వా సర్వాన్ కామాన్ త్సమశ్నుత ఇతి,తస్యేష ఏవ శారీర ఆత్మా,యః పూర్వస్య,తస్మాద్వా ఏతస్మాద్విజ్ఞానమయాత్,అన్యోంతర ఆత్మా ఆనందమయః,తేనైష పూర్ణః,స వా ఏష పురుష విధ ఏవ,తస్య పురుష విధతాం,అన్వయం పురుష విధః:అలాంటి జ్ఞానులు తమకు ప్రమాదం తెచ్చిపెట్టే దుష్టభావననలను శరీరం నుంచి బహిష్కరించి తమకు హితమైన వాటితోనే శరీరాన్ని పోషించి తమ కోరికలను తీర్చుకుని ఆనందిస్తారు.ఇదివరకు చెప్పినట్లు శరీరం అనే తొడుగును కప్పుకుని ఆత్మ ఉంటుంది.ఇది గాక,విజ్ఞానమునకునకు అంతరాన ఆనందమయమైన ఆత్మ ఉంటుంది.ఈ ఆనందం చేరిక వల్ల ఆ విజ్ఞానం పూర్ణత్వాన్ని పొందుతుంది.అలా జీవులకి పురుషతత్వం ఏర్పడింది.తొలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడినట్లే మలినాటి పురుషతత్వం యొక్క దేహం ఏర్పడింది.
16.తస్య ప్రియమేవ శిరః,మోదో దక్షిణః పక్షః,ప్రమోద ఉత్తరః పక్షః, ఆనంద ఆత్మా,బ్రహ్మ పుఛ్చం ప్రతిష్ఠా - తదప్యేష శ్లోకో భవతి:ఆనంద స్వరూపమైన ఆ పక్షికి ఇష్టమే శిరస్సు,సంతోషమే కుడి రెక్క,ఉత్సాహమే ఎడమ రెక్క.ఆనంద స్వరూపమైన ఆ పక్షికి జ్ఞానచైతన్యం వల్ల కలుగుతున్న ఆనందమే ఆత్మ.ఆనంద స్వరూపమైన ఆ పక్షికి బ్రహ్మమునైన నేను తోకలా స్థిరత్వాన్ని ఇస్తున్నాను.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
17.అసన్నేవ స భవతి, అసద్ బ్రహ్మేతి వేదచేత్,అస్తి బ్రహ్మేది చేద్వేద, సంతమే నంతతో విదురితి,తస్యైష ఏవ శారీర ఆత్మా,యః పూర్వస్య:ఏ మనుష్యుడు బ్రహ్మమునైన నా ఉనికిని తిరస్కరిస్తాడో అతని ఉనికి కూడా లేనట్లే,ఇది నిష్ఠుర సత్యం.ఏ మనుష్యుడు బ్రహ్మమునైన నా ఉనికిని సత్యం అని ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు మాత్రమే అతని ఉనికి సత్యం అవుతుందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.ఇదివరకు చెప్పినట్లు శరీరం అనే తొడుగును కప్పుకుని ఆత్మ ఉంటుంది.
18.అధాతో అనుప్రశ్నాః ఉతా విద్వా నముం లోకం ప్రేత్య,కశ్చన గఛ్చతీ,ఆహో విద్వా నముం లోకం ప్రేత్య,కశ్చిత్సమశ్నుతా - ఉ,సో2కామయత,బహుస్యాం ప్రజాయేయేతి,స తపో2తప్యత:ఇప్పుడు అనేకమైన ప్రశ్నలు వస్తాయి - "ప్రాణోత్క్రమణ తర్వాత బ్రహ్మమును తెలుసుకోలేని వారు ఏమౌతారు?ప్రాణోత్క్రమణ తర్వాత బ్రహ్మమును తెలుసుకున్న వారు ఏమౌతారు?సృష్టికర్త ఏమి ఆశించాడు?సృష్టికర్త ఏమి శాసించాడు?నేను ఎక్కడికి వెళ్తాను?నేను మళ్ళీ ఎలా జన్మిస్తాను?" అనే సందేహాలతో తపిస్తారు.
19.స తపస్తప్త్వా,ఇదం సర్వ మసృజత,యదిదం కింశ్చ,తత్ సృష్ట్వా,తదేవాను ప్రావిశత్:బ్రహ్మమునైన నేను సైతం అలా తపించడం వల్లనే ఇది ఇలా సృజించబడిందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.అలా నేను సృజించాను,అలా నేను దీనిలోనికి ప్రవేశించాను.
20.తదను ప్రవిశ్య - సఛ్చత్యఛ్చా భవత్,నిరుక్తం శ్చానిరుక్తం శ్చ,నిలయనం శ్చానిలయనం శ్చ,విజ్ఞానం శ్చావిజ్ఞానం శ్చ,సత్యం శ్చానృతం శ్చ సత్యమభవత్,యదిదం కింశ్చ,తత్సత్య మిత్యాచక్షతే - తదప్యేష శ్లోకో భవతి:అలా ప్రవేశించిన తర్వాత - వ్యక్తుడనూ అవ్యక్తమునూ అయ్యాను,నిర్వచనీయమునూ అనిర్వచనీయమునూ అయ్యాను,ఆశ్రయం పొందినదీ ఆశ్రయం పొందనిదీ అయ్యాను,విజ్ఞానమునూ అజ్ఞానమునూ అయ్యాను.సత్యమునూ అసత్యమునూ కూడా నేనే అయ్యాను,ఏదైతే ఉన్నదో దానిని సత్యమే అనాలి.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
21.అసద్వా ఇదమగ్ర ఆసీత్,తతో వై సదజాయత,తదాత్మానం స్వయ మకురుత,తస్మాత్ తత్సుకృత ముఛ్చతి,యద్వై తత్సుకృతం రసో వై సః,రసం హ్యేవాయం లబ్ధ్వా2నందీ భవతి:ఆదిలో దీనికి ఉనికి లేదు.నేను సృజించిన తర్వాతనే ఇది ఉనికిలోకి వచ్చింది.బ్రహ్మమునైన నేను నానుండియే నన్ను సృజించుకున్నాను,అందువల్లనే నన్ను స్వయంభువు అంటారు.స్వయంకృతుడను గనకనే బ్రహ్మమునైన నేను ఆనంద స్వరూపుడ నయ్యాను.
22.కో హ్యవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్,ఏష హ్యేవానంద యాతి:సత్యధర్మన్యాయ ప్రతిష్ఠితమైన ఆనందాన్ని అనుభవించినప్పుడు మానవులు సైతం స్వయంకృత సృష్టికర్తలు అవుతారు.అంతరిక్షంలోని ఆకాశానికి ఆనందాన్ని ఇచ్చే లక్షణం లేనప్పుడు ఎవరు మాత్రం ప్రాణవాయువును అటువైపుకు కదిలిస్తారు?ఆనందాన్ని ఇచ్చేది బ్రహ్మమునైన నేను గనక నేను ఉన్నట్లే కద!
23.యదా హ్యేవైష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్ఠాం విందతే, అధ సో అభయం గతో భవతి:ఎప్పుడు అవ్యక్తమునూ అనిర్వచనీయమునూ శాశ్వతుడనూ అయిన నన్ను తమ ధారణ లోనికి ఆహ్వానించుకుంటారో వారికి దేని గురించి గానీ ఎవరి గురించి గానీ ఎప్పటికి గానీ భయం అనేది లేదు,ఇది నిశ్చయం.
24.యదా హ్యేవైష ఏతస్మిన్నుదర మంతరం కురుతే, అధ తస్య భయం భవతి,తత్వేవ భయం విదుషో2మన్వానస్య - తదప్యేష శ్లోకో భవతి:  ఎప్పుడు ఈ ఆనందకరమైన మార్గం నుంచి పక్కకి జరిగితే అప్పుడు వారికి భయం మొదలవుతుంది.తత్వాన్ని తెలుసుకోలేని అజ్ఞానులకు భయం తప్పదు,ఇది నిశ్చయమే!దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
25.భీషాస్మా ద్వాతః పవతే,భీషోదేతి సూర్యః,భీషాస్మా దగ్నిశ్చేంద్రశ్చ,మృత్యుర్ ధావతి పంచమ ఇతి:ఆ భయం వల్లనే గాలి వీస్తున్నది.ఆ భయం వల్లనే సూర్యుడు ఉదయిస్తున్నాడు.ఆ భయం వల్లనే ఇంద్రాగ్నులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు.ఐదవదైన మృత్యువు సైతం ఆ భయం వల్లనే జీవులను కబళిస్తున్నది.
26.సైషానందస్య మీమాంసా భవతి,యువా స్యాత్సాధు యువాధ్యాయకః - ఆశిష్ఠో దృటిష్ఠో బలిష్ఠః తస్యేయం పృధివీ సర్వా సర్వా విత్తస్య పూర్ణా స్యాత్,స ఏకో మానుష ఆనందః:కూలంకష పరిశీలన చేసి ఆనందం గురించి ఇలా సూత్రీకరించవచ్చు - విద్యావంతుడైన ఒక మంచి కుర్రాడు గనక దృఢ శరీరం గలవాడైతే  భూమి సమస్తమూ అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆనందాన్ని కలిగిస్తుంది.ఇది ఒక మానవపురుషతత్వం యొక్క ఆనందానికి కొలత. 
27.తే యే శతం మానుషా ఆనందాః స ఏకో మనుష్యగంధర్వాణా మానందాః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక మానవపురుషతత్వం ఆనందానికి పది రెట్లు మనుష్యగంధర్వతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
28.తే యే శతం మనుష్యగంధర్వాణా మానందాః స యేకో దేవగంధర్వాణా మానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక మనుష్యగంధర్వతత్వం యొక్క ఆనందానికి పది రెట్లు దేవగంధర్వతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
29.తే యే శతం దేవగంధర్వాణా మానందాః స యేకః పితృణా శ్చీరలోకలోకానా మానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక దేవగంధర్వతత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక పితృలోకవాసుల యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
30.తే యే శతం పితృణా శ్చిరలోకలోకానా మానందాః స యేక ఆజానజానాందేవానా మానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక పితృలోకవాసుల యొక్క ఆనందానికి పది రెట్లు ఒక స్వర్గలోకవాసుల యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
31.తే యే శతం ఆజానజానాందేవానా మానందాః స యేకః కర్మదేవానాం దేవానా మానందః,యే కర్మణా దేవాన పియంతి,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక స్వర్గలోకవాసుల యొక్క ఆనందానికి పది రెట్లు ఒక కర్మదేవతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.త్యాగధనులైన మానవులు స్వర్గం చేరితే వారిని కర్మదేవతలు అని పిలుస్తారు.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
32.తే యే శతం కర్మదేవానాం దేవానా మానందాః స యేకో దేవానా మానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక కర్మదేవతత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక దేవతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
33.తే యే శతం దేవానా మానందాః స యేక ఇంద్రస్యా2నందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక దేవతత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక ఇంద్రతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
34.తే యే శతం ఇంద్రస్యా2నందాః స యేకో బృహస్పతే రానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక ఇంద్రతత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక బృహస్పతితత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
35.తే యే శతం బృహస్పతే రానందాః స యేకః ప్రజాపతే రానందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక బృహస్పతితత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక ప్రజాపతితత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
36.తే యే శతం ప్రజాపతే రానందాః స యేకో బ్రహ్మణ ఆనందః,శ్రోత్రియస్య చాకామ హతస్య:ఒక ప్రజాపతితత్వం యొక్క ఆనందానికి పది రెట్లు ఒక బ్రహ్మతత్వం యొక్క ఆనందానికి కొలత అవుతుంది.వేదం చెప్పిన సత్యాన్ని నమ్మి పాటించేవారికి మాత్రమే ఆనంద నియమం వర్తిస్తుంది.
37.స యశ్చాయం పురుషే యశ్చాసా వాదిత్యే,స యేకః,స య ఏవం విత్, అస్మాల్లోకాత్ ప్రేత్య:ఎవడైతే పురుషతత్వంలో ప్రకాశిస్తున్నాడో అతడే సూర్యతత్వంలోనూ ప్రకాశిస్తున్నాడు.అక్కడ ఉన్నది ఒకటే.అది తెలుసుకోవటమే బ్రహ్మవిద్య.అది తెలిసిన జ్ఞాని లౌకిక బంధనాల నుంచి విముక్తుడు అయినట్లే!
38.ఏత మన్నమయ మాత్మాన ముపసంక్రామతి, ఏతం ప్రాణమయ మాత్మాన ముపసంక్రామతి,ఏతం మనోమయ మాత్మాన ముపసంక్రామతి, ఏతం విజ్ఞానమయ మాత్మాన ముపసంక్రామతి,ఏత మానందమయ మాత్మాన ముపసంక్రామతి - తదప్యేష శ్లోకో భవతి:పురుషతత్వం అన్నానికి సంబంధించి స్వయంతృప్తం అయినప్పుడు ప్రాణానికి సంబంధించి కూడా స్వయంతృప్తం అవుతుంది.పురుషతత్వం మనస్సుకి సంబంధించి స్వయంతృప్తం అయినప్పుడు జ్ఞానానికి సంబంధించి కూడా స్వయంతృప్తం అవుతుంది.అప్పుడు పురుషతత్వం ఆనందానికి సంబంధించి కూడా స్వయంతృప్తం అవుతుంది.దీని గురించి మరింత వివరించి చెప్తాను,అది కూడా వినాలి.
--------------------------------------------------------
39.యతో వాచో నివర్తంతే, అప్రాప్య మనసా సహ,ఆనందం బ్రహ్మణో విద్వాన్, న బిభేతి కుతశ్చనేతి:మనస్సు చేత చేరుకోలేని నన్ను వాక్కు చేత చెప్పలేని ఆనంద స్వరూపమైన నన్ను ఎవరు కనుక్కోగలరు?వారే జ్ఞానులు!ఆనంద స్వరూపుడనైన నన్ను తెలుసుకున్న విద్వాంసులు దేనికీ ఎవ్వరికీ ఎప్పటికి భయపడరు,ఇది సత్యం!
40.ఏతం హవావ న తపతి, కిమహం సాధు నాకరవం,కిమహం పాప మకరవ మితి స య ఏవం విద్వానేతే ఆత్మానం స్పృణుతే,ఉభే హ్యేవైష ఏతే ఆత్మానం స్పృణుతే,య ఏవం వేద, ఇత్యుపనిషత్:ఆ జ్ఞానం ఉన్న పురుషతత్వానికి మంచిపనులు ఎందుకు చెయ్యలేకపోయాననీ పాపకర్మలు ఎందుకు చేశాననీ బాధ పడాల్సిన అగత్యం రాదు.విద్వాంసులు దీనినే ఆత్మ అని గుర్తిస్తారు.నిజానికి జ్ఞాని ఈ రెంటినీ ఆత్మలో నిలుపుకుంటాడు.ఇది వేదం చెప్తున్న సత్యం.ఇదే ఉపనిషత్తు కూడా చెప్తున్నది.

P.S:ఆనందవల్లి యొక్క మాధుర్యం ఎంత గొప్పదంటే దీన్ని మొదటిసారి విన్న నాటి నుంచే అనిపించింది రాత్రి అన్ని పనులూ ముగిశాక చదువుకుంటే బావుంటుందని - ఇప్పుడు ప్రతి రోజూ ప్రశాంతమైన నిద్రని అనుభవిస్తున్నాను.

మీరూ అదే ప్రయోజనాన్ని పొందుతారని ఆశిస్తున్నాను.

హరిః ఓం!

Sunday, 19 June 2022

మూర్తిపూజ కన్న శ్రీవిద్య ఎందుకు విశిష్టమైనది?

హిందువులకి ఉన్న ఒకే ఒక విజ్ఞాన సర్వస్వం వేదం.వేదం మూర్తిపూజని సమర్ధించడం లేదు.మూర్తిపూజని పిచ్చికింద మార్చిన జియ్యర్ స్వామి వంటివారు వేదం మూర్తిపూజని సమర్ధించిందని అంటూ విగ్రహాలను తయారు చేస్తున్న తంత్రశాస్త్రమూ ఆలయనిర్మాణం గురించి చెప్తున్న వాస్తుశాస్త్రమూ పూజావిధానాలను నిర్దేశిస్తున్న ఆగమాలూ వేదశాస్త్రాలే కదా అని మనల్ని నిలదీస్తారు.

సామాన్య హిందువులకి తెలియనిది వైదిక సాహిత్యంలో సంహిత భాగం మాత్రమే సృష్టికర్త స్వయాన ఋషులకు గోచరం చేసిన సత్యాల సంకలనం.అలా చూస్తే ఋగ్వేద సంహిత,సామవేద సంహిత,యజుర్వేద సంహిత,అధర్వణవేద సంహిత మాత్రమే పరమ ప్రమాణం.ఇతరమైన అరణ్యక,బ్రాహ్మణ,ఉపనిషత్తుల లోని సంహితా పాఠంతో విభేదించని విషయం మాత్రమే ప్రమాణం అవుతుంది.వేదం వ్యతిరేకించలేదు అన్న ఒక చిన్న వెసులుబాటును మాత్రం తీసుకుని ప్రస్తుతం మనం చేస్తున్న మూర్తిపూజను తీర్చిదిద్దారు.కానీ, వేదం వ్యక్తిగత స్థాయిలో చెయ్యమని చెప్పిన శ్రీవిద్యనీ సామాజిక స్థాయిలో చెయ్యమని చెప్పిన యజ్ఞాన్నీ ఎందుకు పక్కకి తోసేశారు?

ప్రాచీన కాలపు వైదిక సాహిత్యం భక్తిని గురించి చెప్పలేదు,శ్రధ్ధను  మాత్రమే నొక్కి చెప్పింది.శ్రద్ధ అనేది సర్వ జీవులకీ సహజాతమై ఉంటుంది.జీవుడు తనకు తను ధారణలో నిలుపుకున్న ఒక లక్ష్యానికి అంకితం కావడాన్ని శ్రద్ధ అంటారు.విద్య పూర్తైన ఒక బ్రహ్మచారి తన తల్లిదండ్రులను పోషిస్తూ సుఖభోగాలను అనుభవిస్తూ జీవించడం సైతం అతని వరకు అత్యున్నతమైన లక్ష్యమే అవుతుంది.అలా లక్ష్యం ఏర్పడిన మరుక్షణం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రమించేది ఆ లక్ష్యం పట్ల అతనికి ఉన్న శ్రద్ధ కూడా ధారణలోకి ప్రవేశిస్తుంది.

మూర్తిపూజ లోని దోషం తెలియాలంటే శ్రీరాముడి ఉదాహరణని తీసుకోవాలి.శ్రీరాముడికి మనం కట్టిన, కడుతున్న, కట్టబోతున్న ఆలయాలలోని ప్రతిమకీ మనం ఉన్న మహాయుగానికి మూడు మహాయుగాల వెనకటి త్రేతాయుగపు శ్రీరాముడికీ ఏమి సంబంధం ఉంది?ఒకే శ్రీరాముడు ఒక్కో ఆలయంలో ఒక్కోలా ఎందుకు కనిపిస్తున్నాడు!ఒకడే అయిన శ్రీరాముడు అన్ని ఆలయాలలోనూ ఒకేలా ఎందుకు కనిపించడం లేదు? ఇవన్నీ శ్రీరాముడి జీవించి ఉన్నప్పుడు తీసుకున్న నకళ్ళు కాదు,ఆదికావ్యం నుంచి తీసుకున్న వర్ణనలకి శిల్పులు తమ పాండిత్యంతో ఏర్పరచిన వూహారూపాలు మాత్రమే కదా!

వేదశాస్త్రపాండిత్యం ఉన్నవారు కావచ్చ్గు, తంత్రవేత్తలు కావచ్చు,కవులు కావచ్చు - ఇతరులు వారి ధారణలో దర్శించి మనకు చూపిస్తున్న రూపం పట్ల మనం శ్రద్ధ చూపించడమే భక్తి.ఇది దోషం అని తెలుసు కాబట్టే ఇది హద్దులు దాటితే మూఢత్వం పెరిగి దోపిడీకి అవకాశం ఉంటుందని తెలుసు గనకనే తొలినాటి ఆలయాలను ఆధునిక శాస్త్రజులకు సైతం ఎలా నిర్మించారో తెలియనివ్వని స్థాయిలో అత్యున్నతమైన సాంకేతికతని ఉపయోగించి నిర్మించారు.

శ్రీవిద్యలో ఇలాంటి లోపాలు లేవు.యజుర్వేద సంహితలో శ్రీవిద్యని గురించి చెప్పినది సృష్టికర్తయే,మనం ధారణలోకి తీసుకోవడానికి మధ్యవర్తులు ఎవరూ లేరు.శ్రీయంత్రరచనకు ఉన్న నియమాలను బట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరు ఉపాసనకి కూర్చుంటే అప్పుడు అక్కడ ఒకే రూపం ఉంటుంది,ఉండాలి,ఉండి తీరాలి.

అయితే, మనం ఆశిస్తున్న ప్రయోజనాన్ని బట్టి అనేకమైన రూపాలలో శ్రీయంత్రం దర్శనం ఇస్తుంది.గణపతి యంత్రం,మహాలక్ష్మి యంత్రం అని చాలా ఉన్నాయి.ప్రస్తుతం నేను ఉపాసిస్తున్న శ్రీ విద్యారణ్య స్వామి పరిష్కరించిన ఖడ్గమాల స్తోత్రం శ్రీయంత్రం మీద ఎలా వ్యాపించింది అనేది అర్ధం అయితే మిగిలిన యంత్రాలను ఎలా నిర్మించారో అర్ధం అవుతుంది.

"త్రిధా చైవ నవధా చైవ చక్ర-సంకేతకం పునః" అన్న సూత్రీకరణ ప్రకారం శ్రీయంత్రంలోని అన్ని అంశాలకూ 3,9 అనే అంకెలతో సంబంధం ఉంటుంది.రెండు రేఖలు ఖండించుకుంటూ ఏర్పడిన 24 సంధినాడులూ మూడు రేఖలు ఖండించుకుంటూ ఏర్పడిన 18 మర్మనాడులూ కలిసి తొమ్మిది త్రికోణాలతో 43 త్రికోణాల అమరికను సాధించడం గొప్ప గణిత శాస్త్రజ్ఞుడికి సైతం కష్టమే! కష్టమే అయినప్పటికీ శాస్త్రాలను ఆధారం చేసుకుని లోపాలు లేని శ్రీయంత్రాన్ని నిర్మించదం సాధ్యమే.

శ్రీచక్రం యొక్క నిర్మాణం గురించి చెప్తున్న ప్రతి ఒక్కరూ కిందకి చూస్తున్న అయిదు త్రికోణాలనీ శక్తికోణాలు అనీ పైకి చూస్తున్న నాలుగు త్రికోణాలనీ శివకోణాలు అనీ చెప్తున్నారు గానీ శ్రీయంత్రానికి కిందా పైనా అంటూ లేదు.మధ్యలో ఉన్న బిందువు నుంచి అని వైపులకీ విస్తరిస్తున్న రూపంలో కిందా పైనా కుడీ ఎడమా ఎలా చెప్పాలి?అయితే, బిందువు నుంచి చూస్తే మొదటి త్రికోణం యొక్క కొస మనవైపుకు చూసేలా ఉపాసన కోసం అద్దం వలె నిలబెట్టినప్పుడు కనిపించే సాపేక్షతను బట్టి అలా చెప్తున్నారు,అంతే!

అయిదు శక్తి కోణాలలోనూ 1.ఆదిమూలం నుంచి విశ్వసృష్టి యొక్క ఆవిర్భావం(Emanation of the cosmos from its primal source),2.విశ్వం యొక్క శూన్యం నుంచి భూతపంచకం వ్యక్తం కావడం(Projection of creation into the primal void),3.సృష్టించబడిన విశ్వం యొక్క పోషణ మరియు రక్షణ(Preservation of the created universe),4.కల్పాంతాన సృష్టి సమస్తం శివైక్యం పొందడం(Withdrawal of the creative and preservative energies in cosmic dissolutions),5.నశించిన ఒక విశ్వం యొక్క తత్వాలు పునరపి కొనసాగడం (Retention of the withdrawn energy-universe for the next cycle of re-creation) వంటి సృష్టిలోని పంచక్రియలకూ ఆధారమైన జ్ఞానం నిక్షిప్తమై ఉంది.

శ్రీయంత్రంలో త్రికోణాలు ఎందుకు ప్రముఖం అయ్యాయనేది తెలియాలంటే సృష్టిలోని "అగ్ని-సూర్య-చంద్ర,సృష్టి-స్థితి-లయ,ఇఛ్చ-జ్ఞాన-క్రియ,సాత్విక-రాజస-తామస,జాగృత-స్వాప్నిక-సుషుప్తి,జ్ఞాత్ర-జ్ఞాన-జ్ఞేయ,ఆత్మ(IndoviDual Self)-అంతరాత్మ(Inner Concious)-పరమాత్మ(Supreme Concious)" వంటి అనేక తత్వాలలో కనిపిస్తున్న త్రిత్వత్వం శ్రీచక్రం మీద మనం చూస్తున్న యోగినులలోనూ చక్రేశ్వరులలోనూ ఇతర నామరూపశక్తులలోనూ ఉన్నాయనేది అర్ధం కావాలి.

01. బీజ మంత్ర నాంది:

మనం చేస్తున్న ఖడ్గమాల ఉపాసన మొదట బిందువు నుంచే మొదలవుతుంది."ఓం, ఐం, హ్రీం, శ్రీం, ఐం, క్లీం, సౌః" అనే బీజాక్షరాలను మంద్రస్థాయిలో ఉచ్చారణ చేస్తూ దృష్టిని బిందువు మీద కేంద్రీకరించి ఉంచాలి. ఓంకారం అనేది ఏదో ఒక ధ్వని కాదు - శబ్దబ్రహ్మం!ఓంకారం యొక్క ఉచ్చారణలో రెండు దశలు ఉంటాయి.పెదవులు తెరుచుకుని ఉచ్చరిస్తున్న మొదటి దశ గడిచిన  తర్వత పెదవుల్ని మూసి ఉచ్చరించేటప్పుడు రెండు అద్భుతాలు జరుగుతాయి.ఒకటి స్వరతంత్రుల నుంచి పుట్టిన శబ్దం శరీరం లోపల ప్రతిధ్వనిస్తుంది.ప్రకంపనల వల్ల నైట్రిక్ యాసిడ్ పుడుతుంది.ఒకేసారి టన్నులలోనో కిలోలలోనో పుట్టదు గానీ తరచుగా ప్రణవాన్ని ఉచ్చరిస్తూ ఉంటే తేడా తెలుస్తుంది.అతి తక్కువ స్థాయిలో పుట్టినప్పటికీ దాన్ని బ్యాలెన్స్ చెయ్యడానికి ఆల్కహాల్ పుట్టాలి కద - అలా పుట్టిన ఆల్కహాల్ ఎసిడిటీని న్యూట్రలైజ్ చేసినప్పుడు తయారైన నైట్రోజన్ బేస్డ్ ప్రాడక్టులు కార్బోహైడ్రేట్ మెటబాలిజానికి చాలా అవసరం.అన్నిటికన్న బయోలాజికల్ ఇంటర్నెట్ అనదగిన DNA ఏర్పడేదీ మార్పులకి గురయ్యేదీ ఎడినైన్,సైటోసీన్,గ్వానైన్,ధయమైన్ అనే నత్రజని ఆధారిత లవణాల వల్లనే.ఓంకారానికి మాత్రమే కాదు,అన్ని బీజాక్షరాలకూ ఇదే విషయం వర్తిస్తుంది.

02. అంగన్యాస తిధినిత్య స్తుతి:

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "నమఃత్రిపురసుందరి!" అంటూ శ్రీమాతను ఆహ్వానిస్తూ ప్రతి అర్చనకీ సామాన్యం అయిన "హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి" అనే అంగన్యాస దేవతా నామాలను మంద్రస్థాయిలో గానం చేస్తూ ఆ బిందువు చుట్టు ఆవరించుకుని ఉన్న త్రికోణం మీద ఒక చతురస్రం ఉన్నట్టు వూహించుకుని కుడివైపు పైనుంచి మొదలుపెట్టి సవ్యదిశలో ఒక్కొక్క నామానికీ ఒక్కొక్క మూలనీ కేటాయిస్తూ దృష్టిని బిందువు మీద కేంద్రీకరించి ఉంచాలి.తర్వాత బిందువుకు పైన దృష్టిని కేంద్రీకరించి "నేత్రదేవి" అనే అంగన్యాస దేవతా శక్తినీ బిందువుకు కింద దృష్టిని కేంద్రీకరించి "అస్త్రదేవి" అనే అంగన్యాస దేవతా శక్తినీ మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.

దీని తర్వాత "కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసిని; మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే; నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, విచిత్రే" అన్న 15 మంది తిధినిత్యా దేవతా శక్తుల్నీ మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.బిందువు చుట్టు ఆవరించుకుని ఉన్న త్రికోణం మీద కిందకి చూస్తున్న కొసనుంచి మొదలుపెట్టి అపసవ్యదిశలో ఒక్కొక్క భుజం పైన అయిదేసి దేవతలకు గల అయిదేసి స్థానాల మీద దృష్టిని కేంద్రీకరించాలి.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు "శ్రీవిద్యే!" అని మంద్రస్థాయిలో గానం చెయ్యాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

03. ఆచార్య పరంపర ప్రశస్తి:

అసలు శ్రీచక్రం యొక్క నవావరణల సాధనలోకి వెళ్ళబోయే ముందు "దక్షిణామూర్తిమయి, నారాయణమయి, బ్రహ్మమయి, సనకమయి, సనందనమయి, సనాతనమయి, సనత్కుమారమయి, సనత్సుజాతమయి; వశిష్టమయి, శక్తిమయి, పరాశరమయి, కృష్ణద్వైపాయనమయి, పైలమయి, వైశంపాయనమయి, జైమినిమయి, సుమంతుమయి, శ్రీశుకమయి; గౌడపాదమయి, గోవిందమయి, శ్రీవిద్యాశంకరమయి, పద్మపాదమయి, హస్తామలకమయి, త్రోటకమయి, సురేశ్వరమయి, శ్రీవిద్యారణ్యమయి; పరమేష్టిగురు శ్రీదక్షిణామూర్తిమయి, పరమగురు శ్రీ కృష్ణద్వైపాయనమయి, స్వగురు శ్రీ విద్యారణ్యమయి" అనే శ్రీవిద్యను ఉపాసించి తరించి మనకు పరిచయం చేసి తరింపజేసిన ఆచార్య పరంపరను స్మరించుకోవాలి.

04. నవవిధ ప్రాకార పరిక్రమ:

బిందువు నుంచి సాగి విస్తరించిన శ్రీయంత్రాన్ని ఉపాసిస్తూ పరిధి నుంచి బిందువు వైపుకి వెళ్తున్నప్పుడు 1.భూపుర వలయం,2.షోడశ పద్మ వలయం,3.అష్టదళ పద్మ వలయం,4.చతుర్దశార త్రికోణ వలయం,5.బహిర్దశార త్రికోణ వలయం,6.అంతర్దశార త్రికోణ వలయం,7,అష్టార త్రికోణ వలయం,8.ఏక త్రికోణ పీఠం,9.సహస్రదళపద్మ బిందురూపం అనే దశలను అధిగమిస్తూ వెళ్ళాలి.

05 ప్రధమం త్రైలోక్యమోహనం:.

పధ్నాలుగు లోకాల అండకటాహం పైకప్పున ఉన్న శ్రీయంత్రపు త్రిమితీయ రూపమైన మణిద్వీపాన్ని శ్రీమాత యొక్క రాజధాని నగరం అనుకుంటే మూడు వరసల భూపురాలు అగడ్తలతో కూడిన ప్రాకారాలు అవుతాయి.త్రిమితీయ స్థితిలో ఆరు ద్వారాలు ఉంటాయి గానీ మనం ఉపాసిస్తున్న ద్విమితీయ స్థితిలో నాలుగు ద్వారాలు మాత్రమే కనిపిస్తాయి.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "త్రైలోక్య మోహన చక్రస్వామిని, ప్రకట యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. సాధన వల్ల త్రిలోకాలలోని మోహనత్వం మనలో ప్రకటం కావడమూ తద్వార మనం త్రిలోకాలలోనూ మోహనమూర్తిలా ప్రకటం కావడమూ ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

మొదటి ప్రాకారం మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇఛ్చాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే" అనే 10 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.ఆ శక్తితత్వాలని శాసించే మాతృమూర్తులు అష్టసిద్ధులను ప్రసాదించి ఇతరులకు సంతోషం కలిగించే మోహనకరమైన వ్యక్తిత్వాన్ని మీకు ఇస్తారు.

రెండవ ప్రాకారం మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మాహాలక్ష్మీ" అనే 8 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.ఇక్కడి మాహాలక్ష్మీ నామానికి ముందు కనిపిస్తున్నవి మార్కండేయ పురాణంలోని సప్తశతి యొక్క ఉత్తర చరిత్ర ప్రస్తుతిస్తున్న మహాసరస్వతీ స్వరూపమైన సప్తసతులు.

మూడవ ప్రాకారం మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "సర్వసంక్షోభిణి, సర్వావిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే" అనే 10 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురే!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

06. ద్వితీయం సర్వాశాపరిపూరకం:

ప్రతి మానవుడికీ తప్పనిసరి అయిన మానసిక అవసరాలను తీర్చే శక్తిస్వరూపాలకు ప్రతిబింబమే శ్రీచక్రం.పరమేశ్వరుడు సృజించిన ప్రకృతిని మనకు అనుకూలం చేసుకుని సుఖభోగాలను అనుభవించడం కోసం సృష్టికర్తయే ప్రసాదించినది శ్రీవిద్య.భూపురాలకు లోపల ఉన్న పదహారు పద్మదళాల వలయమే సర్వాశా పరిపూరక చక్రం.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వాశాపరిపూరక చక్రస్వామిని,గుప్తయోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల నెరవేరని పక్షంలో అసంతృప్తిని కలిగించే కోరికలు ఫలించడమూ తద్వార మనం నిత్యతృప్తులమై ఉండడమూ ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

పదహారు పద్మదళాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "కామాకర్షిణి, బుధ్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి" అనే 16 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.భూత పంచకాన్నీ జ్ఞానేంద్రియ పంచకాన్నీ కర్మేంద్రియ పంచకాన్నీ బుద్ధినీ శాసించే మాతృమూర్తులు మనలోని పదహారు అగ్నిస్థానాలనూ ప్రదీప్తం చేస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురేశీ!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

07. తృతీయం సర్వసంక్షోభణం:

ప్రేయసీప్రియులు గానీ భార్యాభర్తలు గానీ పరస్పర పరిపూర్ణత్వం కోసం సహజీవనం చేస్తున్న జంటలలో సంక్షోభాల్ని సృష్టించడం ఇఛ్చాతత్వం కలిగిన మహిళలు సృష్టిస్తున్న సంక్షోభాల్ని క్రియాతత్వం కలిగిన పురుషులు జ్ఞానతత్వాన్ని పెంచుకుని పరిష్కరించగలిగితే ఇద్దరిలోనూ అనురాగం ఆర్ణవమై దాంపత్యం మదనమనోహరమై జ్వలిస్తుంది.పదహారు పద్మదళాలకు లోపల ఉన్న ఎనిమిది పద్మదళాల వలయమే సర్వ సంక్షోభణ చక్రం.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వసంక్షోభణ చక్రస్వామిని,గుప్తతర యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల స్త్రీపురుషుల మధ్య శతృత్వ భావనలు తగ్గడమూ తద్వార  దంపతుల మధ్య కళ్యాణ భావనలు పెరగడమూ ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

పదహారు పద్మదళాలకు లోపల ఉన్న ఎనిమిది పద్మదళాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ" అనే 8 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. ఇంద్రియజ్ఞానానికి పై స్థాయిలో పనిచేస్తూ లౌకిక విషయాల పట్ల మానసికపరమైన అనుకూలతనీ వ్యతిరేకతనీ భేదభావననీ ప్రభావితం చేస్తున్న మాతృమూర్తులు మనలోని ఎనిమిది పృధ్వీస్థానాలనూ ప్రదీప్తం చేస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురసుందరీ!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

08. చతుర్ధం సర్వసౌభాగ్యదాయకం:

మానవుడు తన కామనలను తీర్చుకోవడానికి అవసరమైన ఐశ్వర్యాలను ప్రసాదించే మాతృమూర్తులు ఈ ఆవరణలో ఉన్నారు.ఎనిమిది పద్మదళాలకు లోపల ఉన్న పధ్నాలుగు త్రికోణాల వలయమే సర్వసౌభాగ్యదాయక చక్రం.పధ్నాలుగు త్రికోణాలలో క ఢ వరకు గల పధ్నాలుగు హల్లులూ వ్రాసి ఉండడం కాకతాళీయం కాదు.మానవ దేహంలోని పధ్నాలుగు అతి ముఖ్యమైన నాడులను సూచిస్తాయి అవి.జీవుల దేహాలు పంచభూతాత్మకమైనవి అయితే ఆ భూత పంచకం జీవులు శాసించే పద్ధతిని బట్టి చైతన్యవంతం అవుతాయి.మానవులకు సహజమైన శ్వాసక్రియ 24 నిమిషాలకు 360 సార్లు జరగాలి.దీనిని నాడిక అనే పేరున ప్రమాణం చేశారు.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని,సంప్రదాయ యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల నాడీపరమైన చైతన్యం ఉత్తేజితమై ఐశ్వర్యవంతమైన భావప్రాప్తి సాధకులకు వశం కావడమే ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

ఎనిమిది పద్మదళాలకు లోపల ఉన్న పధ్నాలుగు త్రికోణాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్ధసాధిని, సర్వసంపత్తిపూరిణి, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరి" అనే 14 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. సర్వాంగాలనూ చైతన్యవంతం చెయ్యగలిగిన మాతృమూర్తులు మనలోని పధ్నాలుగు నాడీస్థానాలనూ ప్రదీప్తం చేస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురవాసినీ!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

09. పంచమం సర్వార్ధసాధకం:

వాయుచలనాన్ని నియంత్రించి అర్ధసాధనకు అవసరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే మాతృమూర్తులు ఈ ఆవరణలో ఉన్నారు.పధ్నాలుగు త్రికోణాలకు లోపల ఉన్న పది బహిర్దశార త్రికోణాల వలయమే సర్వసౌభాగ్యదాయక చక్రం.ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన,సమాన వాయువులు అయిదూ మామూలు శ్వాసక్రియను నియంత్రిస్తే నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ వాయువులు కనురెప్పల కదలిక వంటి వాటికి కారణం అవుతాయి.ప్రాణోత్క్రమణ సమయంలో ఆఖరున ధనంజయ వాయువు శరీరం నుంచి బయటికి వెళ్తుంది.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వార్ధసాధక చక్రస్వామిని,కుల యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల విశ్వం నుంచి మనస్సు వైపుకీ మనస్సు నుంచి విశ్వం వైపుకీ జరగాల్సిన ఆదాన ప్రదాన వ్యవస్థ చైతన్యవంతం కావడమే ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

పధ్నాలుగు త్రికోణాలకు లోపల ఉన్న పది బహిర్దశార త్రికోణాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని" అనే 10 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. సర్వాంగాలనూ చైతన్యవంతం చెయ్యగలిగిన మాతృమూర్తులు మనలోని పది వాయుస్థానాలనూ ప్రదీప్తం చేస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురాశ్రీ!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

10. షడ్జమం సర్వరక్షాకరం:

రేచకం(purgation),పచకం(digestion),శోషకం(absorption),దాహకం(burning),ప్లవకం(secretion),క్షారకం(acidification),ఉధ్ధారకం(excretion),క్షోభకం(frustration),జృంభకం(assimilation),మహకం(brightening) అనే పది అగ్నులను నియంత్రిస్తూ అర్ధసాధనకు అవసరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే మాతృమూర్తులు ఈ ఆవరణలో ఉన్నారు.పధ్నాలుగు త్రికోణాలకు లోపల ఉన్న పది బహిర్దశార త్రికోణాలకు లోపల ఉన్న పది అంతర్దశార త్రికోణాల వలయమే సర్వరక్షాకసర్వరక్షా చక్రం.ఇక్కడినుంచి సాధకులకు అంతర్ముఖత్వం ప్రారంభమవుతుంది.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వరక్షాకర చక్రస్వామిని,నిగర్భ యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల అగ్నిస్థానాలు సమతుల్యమై క్రమపధ్ధతిలో ప్రజ్వలించడమూ తలపెట్టిన కార్యాలలోని ఆరంభ విఘ్నాలు తొలగి మనస్సులోని వ్యాకులతలు తొలగి శివత్వం పెరగడమూ ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

పది బహిర్దశార త్రికోణాలకు లోపల ఉన్న పది అంతర్దశార త్రికోణాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే, సర్వపాపహారే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి,సర్వ ఈప్సితార్ధ ప్రదే" అనే 10 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. సర్వాంగాలనూ చైతన్యవంతం చెయ్యగలిగిన మాతృమూర్తులు మనలోని పది అగ్నిస్థానాలనూ ప్రదీప్తం చేస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురమాలినీ!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

11. సప్తమం సర్వరోగహరం:

ప్రకృతి మనస్సు మీద కలిగించే ద్వంద్వ(duality), శీత(water), వాత(fire), స్వాద(happiness), తప(sorrow), ఇఛ్చ(desire), త్రిగుణతత్వ(consciousness), రాజస(ego), తామస(intellect) ప్రవృత్తులను నియంత్రిస్తూ అర్ధసాధనకు అవసరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే మాతృమూర్తులు ఈ ఆవరణలో ఉన్నారు.పది అంతర్దశార త్రికోణాలకు లోపల ఉన్న అష్టదశార త్రికోణాల వలయమే సర్వరోగహర చక్రం.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వరోగహర చక్రస్వామిని,రహస్య యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల శారీరక మానసిక దోషాలు పోవడమూ అంతర్ముఖత్వం మరింత పెరిగి దైవసంస్పర్శన సుఖం అనుభూతిలోకి రావడమూ ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

అంతర్దశార త్రికోణాలకు లోపల ఉన్న అష్టదశార త్రికోణాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌళిని" అనే 8 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి. వీరు లలితాసహస్రనామ సంకలన కర్తలైన అష్టవిధ వాగ్దేవతలు గనక వాక్కును శాసించి రక్షించి శాపానుగ్రహ సమర్ధతను ఇచ్చే వాక్శుధ్ధి వంటి శక్తులను అనుగ్రహిస్తారు.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురాసిధ్ధే!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

12. అష్టమం సర్వసిధ్ధిప్రదం:

పశ్యంతి,మధ్యమ,వైఖరి అనే వాగ్భవ శక్తులకూ ఇఛ్చ జ్ఞాన క్రియా సక్తులకూ ఇది కూటమి.రాజస(ego),తామస(intellect) ప్రవృత్తులను నియంత్రిస్తూ సాత్వికతను ప్రసాదించే మాతృమూర్తులు ఈ ఆవరణలో ఉన్నారు.అష్టదశార త్రికోణాలకు లోపల ఉన్న ఏక త్రికోణ పరివృత వలయమే సర్వసిధ్ధిప్రద చక్రం.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వసిధ్ధిప్రద చక్రస్వామిని అతిరహస్య యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల అన్ని రకాల విజయాలనూ అనాయాసమైన పధ్ధతిలో సాధించడమూ తద్వార అన్ని రకాల విషయాలనూ సమదృష్టితో చూడగలగటమూ  ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

అష్టదశార త్రికోణాలకు లోపల ఉన్న త్రికోణం మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని" అనే 7 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరిని "త్రిపురాంబికే!" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

13. నవమం సర్వానందమయం:

మణిద్వీపవాసిని యైన త్రిపురసుందరి యొక్క నిజస్థానం ఇది.కేంద్రం వద్ద ఉన్న సహస్రదళపద్మం వంటి బిందువును ఆవరించి ఉన్న వలయమే సర్వానందమయ చక్రం.

చక్రం లోపలికి వెళ్ళేటప్పుడు "సర్వానందమయ చక్రస్వామిని, పరాపరరహస్య యోగిని"ని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.పునరపి సాధన వల్ల పరబ్రహ్మస్వరూపిణితో మమైక్యం కావడమూ తద్వార సృష్టిస్థితిలయాలకు అతీతం కావడమూ  ఈ ఆవరణ యొక్క ఉపాసనా ఫలితం.

అష్టదశార త్రికోణాలకు లోపల ఉన్న త్రికోణం మధ్యన ఉన్న బిందువు మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "మహామహాకామేశ్వరి, మహాశ్రీచక్రనగరసామ్రాజ్ఞి, మహారాజరాజేశ్వరి, ప్రతాపభారతి, పరబ్రహ్మస్వరూపిణి" అనే 5 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.

చక్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు "నమస్తే నమస్తే నమః" అని మంద్రస్థాయిలోని స్వరపూజతో చక్రేశ్వరిని ధారణలోనికి ఆహ్వానించాలి.మన ఇంటికి వచ్చిన అతిధుల్ని ద్వారం వద్ద వేచి ఉండి ఆహ్వానించడం మన ఇంటినుంచి వెళ్తున్న అతిధుల్ని ద్వారం వరకు వెళ్ళి సాగనంపటం అనే లోకమర్యాద యోగినుల పట్లనూ చక్రేశ్వరుల పట్లనూ ప్రదర్శించడం ఇక్కడ కనిపిస్తున్నది కదూ!

14. శాంతి మంత్ర స్వస్తి:

మనం చేస్తున్న ఖడ్గమాల ఉపాసన చివరకు బిందువు వద్ద ఆగుతుంది."ఓం, సౌః, క్లీం, ఐం, శ్రీం, హ్రీం,ఐం" అనే బీజాక్షరాలను మంద్రస్థాయిలో ఉచ్చారణ చేస్తూ దృష్టిని బిందువు మీద కేంద్రీకరించి ఉంచాలి. పైన విశ్లేషించి చెప్పినది శ్రీ విద్యారణ్య స్వామి వారు పరిష్కరించిన ఖడ్గమాల స్తోత్రం."శ్రీ విద్యారణ్య స్వామి చేత పరిష్కరించబడిన అపురూపమైన ఖడ్గమాల స్తోత్రపాఠం - సద్యః ప్రసాదిని శ్రీవిద్య!" పేరుతో ఒక యానిమేషన్ వీడియో చేసి నాకున్న యూట్యూబ్ చానల్ దగ్గిర పబ్లిష్ చేశాను. ఏ దేవతా నామం వినిపిస్తున్నప్పుడు ఏ మర్మస్తానం దగ్గిర ఆ దేవతని చూడాలో ఒక ఎర్రటి చుక్కని చూపిస్తున్నాను.వీడియో లింక్:https://www.youtube.com/watch?v=L_GvF93dlGY

ఉపాసన ఉదయం పూట చెయ్యదం మంచిది.

జై శ్రీ రాం!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...