పాకిస్తాన్ పుట్టుకే పరమ అసహ్యకరంగా జరిగింది.హిందువులూ ముస్లిములూ వేరు వేరు అనే ద్విజాతి సిద్ధాంతం అప్పటి అవసరం కోసం పుట్టించిన వికృత సిద్ధాంతమే తప్ప దానికి సరైన పునాది లేదు.పై స్థాయిలో పాకిస్తాన్ కోరుకున్నవాళ్ళు బేరసారాల కోసం తెరిచిన కొత్త దుకాణానికి తగిలించిన ఆపద్ధర్మపు లేబుల్ అది.దాన్ని బుజాన మోసిన వాళ్ళకి కూడా అది అబధ్ధమని తెలుసు.దేశాన్ని సమైక్యంగా ఉంచి స్వతంత్రం ఇస్తే ఢిల్లీలో తాము కాలుపెట్టలేమని తెలిసిన సింధ్ ప్రాంతపు వ్యాపార/పారిశ్రామిక వర్గాలు తమ ప్రాభవం కోసం ఆడిన పులిజూదం పాకిస్తాన్ యేర్పాటు.
తెలివితక్కువ వాళ్ళంతా గాంధీ పెత్తనం కింద ఆయన తెల్ల్లారగట్ట తన కోమటిబుర్రకి పొడిచిన బతికుండి బలుసాకు తినడానికి మాత్రం పనికొచ్చే పిచ్చిప్లానుల్ని అణ్వస్త్రాల కంటే బలమైన ఆయుధాలుగా వర్ణించి చెప్తుంటే వాటితోనే ఇంగ్లీషువాళ్ళు దడుచుకుని స్వతంత్రం ఇచ్చేస్తారనుకుని మొదటి నాల్రోజులూ దెబ్బలు తినడం, తర్వాత మూకుమ్మడి అరెస్టులతో జైళ్లలో దైరీలు రాసుకోవడం,మధ్యే మధ్యే ఆచమనం అన్నట్టు గుండ్రబల్ల ముచ్చట్ల కోసం లండన్ ప్రయాణాలతో శత్రువుని భయపెట్టడానికి బదులు వినోదాన్ని పంచుతూ అక్షరాలా వాళ్ళ మాటల్లోనే "గాంధీ అనేవాడు రాజకీయ రంగంలో ప్రభావశాలిగా ఉన్నంతవరకు మనం ఇక్కణ్ణుంచి వెళ్ళాల్సిన ఆవసరం లేదు" అని ధీమాగా ఉంటున్నా ఆఖరి నిముషాల వరకు గాంధేయవాదం యొక్క బలహీనతల్ని తెలుసుకోలేకపోయారు.
అసలు గాంధీకీ కాంగ్రెసులో ఉన్న మిగిలిన మితవాదులకీ మనసులో ఉన్నది ఇంగ్లీషువాళ్ళ దోపిడీ నుంచి ప్రజల్ని విముక్తం చెయ్యటం కాదు - అధికారాన్ని ఇంగ్లీషువాళ్ళ నుంచి స్వదేశీ రాజవంశీయులకీ జమిందార్లకీ శాంతియుతంగా బదలాయింపు చెయ్యటమే!అతివాదులు దీనికి భిన్నంగా మొదట్లో కొంతకాలం ఆలోచించినా వాళ్ళంతట వాళ్ళే సర్దుకుపోయారో మితవాదుల బలం పెరగడం వల్ల బలహీనపడిపోయారో తెలియదు గానీ వాళ్ళు కూడా దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చెయ్యడం తగ్గించేసి తమ వ్యక్తిగతమైన కీర్తిప్రతిష్ఠల కోసమే ఆలోచించటం మొదలుపెట్టారు.ప్రజల్ని ఇంగ్లీషువాళ్ళు చేస్తున్న అన్యాయాల మీద సొంతబుద్ధి ఉపయోగించి తిరగబడేటట్టు తయారుచేస్తే ఇంగ్లీషువాళ్ళతో పాటు స్వదేశీరాజులకి కూడా నష్టమే కాబట్టి వాళ్ళని ఉద్రేకంతో హింసకి మళ్ళనివ్వకుండా ఉంచటం కోసం గాంధీ అమోఘమైన తెలివితేటలతో అహింసాయుత పోరాటం అనే ఒక దుష్టసమాసం చుట్టూ ఒక గందరగోళపు సిద్ధాంతం అల్లితే దానివల్ల లాభం పొందేవాళ్ళంతా గాంధీని మహాత్ముణ్ణి చేసి జనం మీదకి వొదిలారు.
ఈయనగారి ప్రధమశిస్యుడికి కమ్యూనిజం అంటే వెర్రిప్రేమ,హిందూమతం అంటే పిచ్చికోపం.గురువుగారేమో భావి భారతంలో చాతుర్వర్ణం ధగధ్ధగాయమానంగా ప్రకాశించాలని కలలు కంటుంటే శిష్యులుంగారు దాని ఉనికినే అసహ్యించుకుని కూకటివేళ్ళతో సహా పెకలించాలని ప్రయత్నిస్తూ ఉందేవాడు.దీనికి తోడు ఇంగ్లీషువాళ్ళమీద పోరాడటానికి ఏకోన్ముఖమైన లక్ష్యం,శాస్త్రీయమైన విధానం అంటూ ఏదీ లేకపోవటంతో ఎవడు కాస్త గట్టిగా ఇంగ్లీషువాళ్ళని తిడుతూ మాట్లాడగలిగితే వాడికి దేశభక్తుడి ముద్ర వేసి పార్టీలోకి లాక్కుని నాయకుల సంఖ్యని పెంచేశారు.పార్టీలో సొంత ప్రాభవం కాస్తంత తగ్గగానే వేరే దుకాణం తెరవడం, కొంతకాలం రెండు దుకాణాల్లోనూ హడావిడి చెయ్యటం. మళ్ళీ పార్టీలో ప్రాభవం పెరగ్గానే రెండో దుకాణం మూసెయ్యటం - ప్రజల్ని కదిలించే కార్యక్రమాలు లేనప్పుడు ఆ కాలంలో జరిగిన వ్యవహారాలు ఇవే!ఇక ప్రజల్ని కదిలించే కార్యక్రమాల సంగతి చూస్తే - చరఖా తిప్పటం,ఉప్పు చెయ్యటం,బట్టలు తగలెయ్యటం,జెండాలు ఎగరెయ్యటం,దెబ్బలు తినటం, జైలు కెళ్ళటం,కల్లుపాకల దగ్గిర పాటలు పాడటం,వేదికలెక్కి భారతీయులంతా కలిసి ఉమ్మేస్తే ఇంగ్లీషువాళ్ళు కొట్టుకుపోతారని కబుర్లు చెప్పటం!
తర్వాత కాలంలో ముదిరి ఇప్పటికీ సమస్యలు సృష్టిస్తున్న చాలా సిద్ధాంతాలు ఈ గందరగోళం వల్ల తమ వ్యక్తిగతమైన రాగద్వేషాల్ని సమాజమంతటికీ టోకున రుద్దెయ్యడానికి వందివార్చినవే - సామ్యవాదం,జాతీయవాదం,బ్రాహ్మణాధిపత్యం,దళితవాదం,ఇంకా ఇంకా ఎన్నెన్నో!ఆయా వ్యక్తుల ఓపికని బట్టి కొన్ని మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతే కొన్ని ఇప్పటికీ ప్రముఖంగా ఉండి భారతీయ సమాజాన్ని గ్రూపులుగా విడగొట్టి అంతర్గత విభేదాలకు కారణమవుతూ ఉన్నాయి.
హిందువుల్లో అధిక సంఖ్యాకులు మధ్యతరగతి కుటుంబీకులు గనక కాంగ్రెసునీ గాంధీని నమ్మి ఇట్లా గందరగోళంలో ఉంటే కొందరు డబ్బున్నవాళ్ళు,తెలివైనవాళ్ళు భారతదేశపు ముస్లిములని విదేశీయుల మతాంతరీకరణ దుష్టవ్యూహాలకు ప్రభావితులై హిందూమతం నుంచి వేరుపడి మొఘల్ సామ్రాజ్యపు దుర్మార్గాలకు అవశేష ప్రతిరూపంగా ముద్రవేసి వారితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా హిందువుల సౌభాగ్యం కోసమే కృషి చేసే ఉద్దేశంతో హిందూమహాసభ అనే ప్రత్యేక దుకాణం తెరిచారు.అప్పట్లో డబ్బున్నవాళ్ళు రాజులూ జమీందార్లూ,తెలివైనవాళ్ళు బ్రాహ్మణులూ కోమట్లూ గనక అది బ్రాహ్మణమతస్థుల/హిందూ మతతత్వ వాదుల గుంపు అనే లేబుల్ తగిలించెయ్యడానికి పనికొచ్చింది.అటువైపున అప్పటివరకు విశాలహృదయంతో మొత్తం భారతీయసమాజపుసంక్షేమం గురించి ఎంతో ఉన్నతంగా మాట్లాడుతున్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ హిందీ ఉర్దూ తగాదాలో తన మాట చెల్లలేదన్న చిన్న కారణానికే తన కులీనకుటుంబసహజమైన అహంతో కడుపు రగిలిపోయి హిందువుల్నీ ముస్లిముల్నీ ఇక ఎంతమాత్రం కలిసి ఉండనివ్వకూడదని తీర్మానించుకుని తనకున్న అన్ని వెసులుబాట్లనీ ఉపయోగించుకుని ద్విజాతి సిద్ధాంతం అనే మాటని ప్రచారంలోకి తీసుకొచ్చి ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ద్వారా చదువుకున్న పొలిటికల్లీ మోటివేటెడ్ ముస్లిముల బృందాన్ని తయారుచేసి దేశంమీదకి వొదిలాడు.హిందువులకి భిన్నంగా వాళ్లకి తమకి కావలసింది ఏమిటో అది యెట్లా సాధించుకోవాలో పూర్తి స్పష్టత ఉన్న ఐకమత్యం ఉంది.
భారతీయ ముస్లిములలో మొదటినుంచీ రెండురకాల ధోరణులు ఉండి వారిలో ఒకింత గందరగోళం ఉండేది.దీనికి కారణం మతాంతరీకరణ అన్నది మూడు విధాలుగా జరగటమే!అహ్మద్ ఖురేషీ అబధ్ధాలు చెప్పడం,మోసం చెయ్యడం,బెల్లించడం - బెదిరించదం అనేవి తన జీవితకాలంలో తను పాటించి తన మతాన్ని వ్యాపింపజేసి తన అనుయాయులకీ అదే ప్రవచించాడు.బలవంతంగా లొంగినవాళ్ళకి తమ పాత మతం పట్ల మమకారం ఉంటుంది, వాళ్ళలో ఎవరూమూర్ఖంగా హిందూమతాన్ని ద్వేషించి అరాచకంగా ఉండరు.సూఫీల ద్వారా హిందూమతంలోని కింది కులాల నుంచి మారినవాళ్ళలో పొమ్మనకుండా పొగబెట్టినట్టు తాము మతం మారాల్సిన పరిస్థితిని కల్పించినందుకు కొంత అక్కసు ఉంటుంది.కానీ ఈ రెండు రకాల వాళ్ళూ సామాన్యులే గనక బతుకుతెరువు కోసం అల్లాడిపోయేవాళ్ళు కాబట్టి వాళ్ళంతట వాళ్ళు హిందువులతో గొడవలు పెట్టుకునే వాళ్ళు కాదు.మొఘల్ సామ్రాజ్యం సుస్థిరం కావడంతో అప్పటి ప్రభుత్వంలో ప్రాపకం కోసం పూర్తి తెలివితో వుండి మతం మారిన వాళ్ళు మాత్రం మహా ప్రమాదకారులు.హిందువుల్లో తాము ప్రాచీన కాలపు రాజవంశానికి చెందినవారం అని చెప్పుకునేవాళ్ళలో ఎంతటి అహంభావం,ఎంతటి క్రౌర్యం,ఎంతటి పెత్తందారీతనం ఉంటాయో వీళ్ళలోనూ అవన్నీ అంత ఎక్కువగానూ ఉంటాయి.సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలాంటి కులీన కుటుంబపు ముసల్మాన్.ఇప్పటికి మీకు అర్ధం అయి ఉండాలి రెండురకాల ముస్లిములు ఎవరో - రాజకీయ ముస్లిములు,సామాజిక ముస్లిములు!
సామాజిక ముస్లిములు మొదట్లో చాలా ఎకువగానే ఇంగ్లీషువాళ్ళ మీద జరుగుతున్న పోరాటంలో పాల్గొన్నారు,అరమరికలు లేకుండా హిందువులతో ఎన్నో ఉద్యమాలలో కలిసి పనిచేశారు.తొలిదశలో ఇంగ్లీషువాళ్ళ మీద హిందువుల కన్నా ముస్లిములే వీరోచితంగా పోరాడినారన్నది వాస్తవం!వినడానికి నమ్మలేని నిజంలా అనిపించినా సామాజిక ముస్లిములు రాజకీయ ముస్లిముల ప్రభావంలోకి వెళ్ళడం హిందూమతతత్వవాదుల మూలంగా కాకుండా హిందూ ముస్లిం ఐక్యత కోసం పరితపిస్తున్నానని చెప్పుకున్న గాంధీ వల్లనే జరిగింది!గాంధీ ప్రతిపాదించిన అనేక రకాల తమాషా పనుల్లో ఒకటయిన విదేశీవస్త్రబహిష్కరణ ముస్లింల పొట్ట కొట్టింది.రవీంద్రనాధ్ ఠాగూర్ తన ఘరె బైరె నవలలో చరిత్ర ఈ విషాదకరమైన మలుపు ఎట్లా తీసుకుందో కళ్ళకు కట్టినట్టు వివరించి చూపించాడు.అది ఇలా జరిగింది:దొరసానులు తమ అవసరాల కోసం ముస్లిములకి టైలర్లుగా తరిఫీదు ఇచ్చి పనిచేయించుకునేవాళ్ళు. ఈ ముస్లిం టైలర్లు ఆ విద్యతో స్వదేశీ రాణుల్ని కూడా మెప్పిస్తూ ఉండేవాళ్ళు.ఆ రకంగా వాళ్లకి సంపాదన బాగుండేది.అసలే విదేశీవస్త్రబహిష్కరణ మూలంగా ఉపాధిని కోల్పోయి కడుపు మండినవాళ్ళ మీదకి అడపాదడపా ఉత్సవాల చందాదార్లు పోయిపడి వాళ్ళింకా బాగానే ఉన్నారనుకుని మొండిగా వేధిస్తూ ఉండటంతో వాళ్ళు కాంగ్రెసుకి దూరమై రాజకీయ ముస్లిముల వెనక చేరాల్సి వచ్చింది.
రాజకీయ ముస్లిముల కందరికీ భారతదేశపు చరిత్రలో మొగలాయీల కాలం అంటే ఎక్కువ ప్రీతి ఉండటమూ,ఆనాడు ప్రభువులమై మేము హిందువుల్ని పరిపాలించాం అని గొప్పగా చెప్పుకోవటమూ,మళ్ళీ అలాంటి అధికారాన్ని అనుభవించాలని ఉవ్విళ్ళూరటమూ అన్నీ వారి లోపాయికారీ మాటల ద్వారానూ,రచనల ద్వారానూ,ప్రసంగాల ద్వారానూ తెలుస్తూనే ఉండేది.అయినా వాటిని తిప్పికొటకుండా వారికి కొమ్ములు మొలిపించారు.ఆఖరికి టర్కీ ప్రజలు తమని క్రూరంగా అణిచిపారేస్తున్న నిరంకుశుడైన ఖలీఫాని పదవీచ్యుతుణ్ణి చేసుకుని ఆనందిస్తుంటే ఇక్కడి ముస్లిములు యా అల్లా అంటూ అక్కడికి వెళ్ళి ఏమి సాధించారు?వాళ్ళు మా గొడవ మా ఇష్టం పోవోయ్ పీరుసాయిబూ అంటే చెవులు దులుపుకుని వచ్చారు!దానికి గాంధీ ఎందుకు వంత పాడాడు - బుజ్జగించి దగ్గిరకి తీసుకోవటానికి కాదా!ఆఖరికి విడిపోవటం ద్వారా ఏర్పడబోయే పొరుగు దేశానికి రాజ్యాంగబద్ధమైన అధినేత కాబోతున్న జిన్నా బహిరంగంగా కాలకేయుడు మాహిష్మతీ రాజ్యపు ప్రజల్ని రక్షణగా పెట్టుకున్నంత ధీమాగా ఇక్కడ మీమీద దాడి జరిగితే పాకిస్తానులో హిందువుల్ని నరుకుతాను అని చెప్పినా అప్పటి మన నాయకులకి ముస్లిం మతస్థులకు అతనొక్కడే ఏకైక ప్రతినిధిగా కనిపించి గౌరవించారంటే అప్పటి హిందువుల పరిస్థితి ఎట్లా ఉందో వూహించుకోవచ్చు!ఇప్పటికీ కొందరు రాజకీయ విశ్లేషకులకి అతను గౌరవనీయుడుగా కనిపిస్తున్నాడు.
అప్పటి భారతదేశపు రాజకీయ ముఖచిత్రం ఇంత సంక్లిష్టంగా ఉండటం వల్లనే మన దేశానికి స్వతంత్రం ఆ రకంగానే వచ్చింది.అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల అది అలా తప్ప మరొకలా జరిగడానికి ఆస్కారమే లేదు.దూరదృష్టి లేని ఆనాటి రాజకీయ నాయకులు ప్రజలు అత్యంత కీలకమైన ఎన్నికలో తమ అభిప్రాయాన్ని అంత విస్పష్టంగా చెప్పినా ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుందా తమ వ్యక్తిగత ప్రాభవాల కోసం ప్రజల్ని పావులుగా చేసి సజీవ చదరంగం ఆడుకున్నారు - అందుకే ప్రపంచంలో ఏ కాలంలోనూ ఏ దేశంలోనూ జరగనంతటి భయంకరమైన ప్రజల మార్పిడి ఇక్కడ జరిగింది!
జిన్నా అంత ధీమాగా నేను భారత్ అంతర్గత విషయాల్లో కలగజేసుకుంటాను అని చెప్పినా మనం పొరుగున ఏర్పాటు చేసుకుంటున్నది సానుకూలంగా వ్యవహరించే మిత్రదేశాన్ని కాదు పక్కలోబల్లెం లాంటి క్రూరమైన శత్రుదేశాన్ని అని గ్రహించకుండా ఎంతో ఉత్సాహంగా పాకిస్తాన్ యేర్పాటుని స్వాగతించిన ఆనాటి మేధావులు అందరూ ఇన్ని దశాబ్దాల రక్తసిక్తమైన దేశచరిత్రకి సమిష్ఠిగా బాధ్యులే!అనాటినుంచీ ఈనాటివరకూ అమాయకులైన సామాజిక ముస్లిముల్ని గోమాయువులైన రాజకీయ ముస్లిముల అధిపత్యపు పడగనీడ నుంచి విడదీసి ప్రధానజీవనస్రవంతిలోకి తీసుకురావాలనే ఇంగితజ్ఞానం లేనివారే అడ్డూ అదుపొ లేకుండా ఈ దేశాన్ని పరిపాలించారు.ఉద్యమకాలం నాటి బ్రతిమిలాట ధోరణినే రాజ్యాంగబద్ధమైన గణతంత్రపాలనలోనూ కొనసాగించారు.దీనివలన ఎక్కువగా నష్టపోయంది కూడా సామాజిక ముస్లిములే - వారిప్పటికీ మటన్ కొట్లకీ సైకిల్ రిపేరు షాపులకే పరిమితమై ఉన్నారు!వారిలో ఎవరయినా చదువుకున్నవారు ఉంటే వివేకవంతులు సాటి హిందువులతో కలిసిమెలిసి జీవిస్తూ ప్రశాంతంగా బతుకుతున్నారు,అది లేనివారు రాజకీయ ముస్లిముల ప్రభావానికి గురై ఉగ్రవాదులుగా మారి దేశాన్ని మరోసారి పరాధీనం చెయ్యాలని చూస్తున్నారు.మార్చినవారు తమ కడుపులో చల్ల కదలకుండా సుఇఖంగానే బతుకుతున్నారు - మారినవారు మాత్రం అన్యాయంగా హతమారిపోతున్నారు!
దేశాధినేతలు స్థూలంగా దిశానిర్దేశాలు మాత్రం చేస్తే దానికి తగ్గట్టు తమ మేధస్సుని ఉపయోగించి దేశభక్తి కలిగిన విదెశాంగ శాఖలోని అధికారులు ఇన్ని దశాబ్దాలుగా మన దేశాన్ని ప్రపంచవేదిక మీద సమున్నతంగానే నిలబెట్టారు.ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో తండ్రి మార్గానికి కొంత భిన్నంగా వెళ్ళి ధృఢత్వానికి మళ్ళించటం వల్ల ప్రపంచ రాజకీయ వేదిక మీద భారత్ ఎన్నో సంచలన విజయాల్ని సాధించింది.అయినా మౌలికంగా మెతకదనం ఉంటూనే ఉండేది.సమస్యలూ అట్లాగే ఉన్నాయి.పొరుగుదేశపు ధోరణిలో శాశ్వతమైన మార్పు లేదు.కానీ వాజపేయి కాలంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన గతకాలపు మార్గానికి పూర్తి భిన్నమైన వీదెశాంగ విధానం పొరుగుదేశానికి తప్పనిసరిగా తన ధోరణిని మార్చుకోవాల్సిన అవసరాన్ని కలిగించింది - మార్పు కనపడింది కూడా!కానీ ఆ ప్రభుత్వం ఎక్కువకాలం సాగకపోవటం,మళ్ళీ పాతపార్టీ అధికారంలోకి రావటం మళ్ళీ పాత విధానానికి మళ్ళటం జరిగింది - మళ్ళీ కధ మొదటి కొచ్చింది!
కానీ ఇప్పుడు రెండేళ్ళ క్రితం తన వ్యక్తిగత ప్రతిభతో అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసుకున్న మోదీ అధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం ఈసారి మళ్ళీ వెనక్కి తిరగడానికి వీల్లేని విధంగా విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చివెయ్యడానికి నిశ్చయించుకోవడంతో భారతదేశం పాకిస్తానుకు గట్టి జవాబు చెప్పాలని చాలాకాలం నుంచి కోరుకుంటున్నవారికి ఆనందం కలుగుతున్నది.నిజమే,ఈసారి విదేశాంగ విధానం మళ్ళీ పాతపార్టీ అధికారంలోకి వచ్చినా చచ్చినా వెనక్కి వెళ్ళలేనంతగా మారిపోయింది.ఒకప్పుడు పాకిస్తానుకు శాంతికోసం ప్రతిపాదనలు పంపటం,వాళ్ళు వాటిని బుట్టదాఖాలా చేస్తుంటే ఓపిగ్గా మళ్ళీ మహజర్లు పంపటం,అంతర్జాతీయ వేదికల మీద సన్నాయినొక్కులు నొక్కటం భారత్ వంతుగా ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితిలోకి పాకిస్తాన్ వెళ్ళింది.మన ప్రధాని పాకిస్తాను నుంచి చైనా వరకూ ఎవరికయినా సరే ఇప్పుడు హెచ్చరికలే తప్ప విజ్ఞప్తులు చెయ్యటం లేదు - శభాష్!
నిన్నటి రోజున జరిగిన యూరీ ఘోరం దేశంలో శాంతికాముకుల్ని కూడా యుద్ధభాష మాట్లాడిస్తున్నది!ఆఖరికి పాతపార్టీ అధినేత్రి కూడా జాతి అంతరాత్మ మీద జరిగిన దాడి అనేసింది.ఇక కొత్తపార్టీ వాళ్ళు వూరుకుంటారా?పంటికి పన్ను కాదు,దవడనే తీసెయ్యాలి అంటున్నారు.సైనికపాటవం దృష్ట్యా పాకిస్తాన్ భారతదేశం కాలిగోటికి కూడా సరిపోలదు.కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరి కాదు.స్వతంత్రభారతప్రప్రధమప్రధాని ఆత్మీయుడని భావించి ఐక్యరాజ్యసమితి ముచ్చటపడి ఇచ్చిన వీటోపవర్ని కూడా దఖలుపరిస్తే దాన్ని తీసుకున్న మరుక్షణం నుంచీ భారత్ ఎదుగుదలనీ అడ్డుకోవడానికే తన శక్తియుక్తుల్ని ఉపయోగిస్తున్న మిత్రద్రోహి కమ్యునిష్టు చైనా వెన్నుదన్నుగా ఉంది.ఇస్లామిక్ రాజ్యం కోసం చేసే రక్తదాహపు జెహాదు ఒకరిది,వర్గరహితసమాజం కోసం చేసే రక్తదాహపు సాయుధపోరాటం ఒకరిది - నీచత్వంలో ఒకరిని మించినవారు ఒకరు!వాళ్ళతో కయ్యానికి దిగితే వాళ్లకి దీటుగా మనం కూడా కొన్ని క్రూరమైన పనులు చెయ్యాలి.ఒకవేళ సర్వశక్తులూ కంద్రీకరించుకుని పోరాడి యుద్ధంలో గెలిచినా అటువైపు వాళ్ళు ఎలాగూ ఓడిపోతున్నాం అని తెలిసినప్పుడు మనకి వీలయినంత ఎక్కువ నష్టాన్నే కలిగిస్తారు.గెల్చినా ఓడినా తక్కువ నష్టంతో యుద్ధాన్ని ముగించడమే అసలైన రాజనీతి.
సాహితీసమరాంగణసార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల మనస్తత్వంలో ఒక వైకల్యం ఉంది.తల్లికి సంబంధించిన న్యూనత వల్ల అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందేది.దానిమూలంగానూ కావచ్చు,దానితో సంబంధం లేకుండానూ కావచ్చు హఠాత్తుగా మూర్ఖమైన కోపం వస్తూ ఉండేది.ఆ కోపంలో తీసుకున్న ప్రమాదకరమయిన నిర్ణయమే అప్పాజీకి కన్నులు పెరికించే శిక్ష!నిజానికి రాజు సర్వాధికారి గనక సాక్ష్యాలు బలంగా ఉన్నా తిమ్మరుసుకి అంత క్రూరమైన శిక్ష వెయ్యనక్కర లేదు.ఈ విపరీతపు మనస్తత్వానికి సాక్ష్యం కటకం మీద దండయాత్ర విషయంలో స్పష్టంగా కనబడుతుంది.అతను మారువేషంలో తిరుగుతున్నప్పుడు ఒక చాకలి బట్టలు వుతుకుతూ "నెల్లూరు నాది,చిత్తూరు నాది - కాదని వాదుకు వస్తే కటకం కూడా నాదే అంటాను" అని పాడటం విన్నాడు.దాంతో అప్పటికే కటకాన్ని గెలవాలని చాలాకాలం నుంచి పోరుతున్నా పడనివ్వడం లేదని తిమ్మరుసు మీద అలిగి రాజభవనం నుంచి అదృశ్యమయ్యాడు.రాజుగార్ని సభకి తీసుకువళ్ళడానికి వచ్చిన తిమరుసు వెంటనే రాజుకి నలతగా ఉందని సభకి కబురు పంపించి చారుల్ని పంపిస్తే ఎక్కడో దూరంగా ఉన్న ఒక కోవెల్లో పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడట.తన మూర్ఖపుకోపంతో అనాలోచితంగా చేసిన ప్రమాదకరమైన పని అది - శత్రురాజ్యపు గూఢచారులు ఇతన్ని కనిపెట్టి ఉంటే!ముందు జాగ్రత్తగా కొంతమంది సైనికుల్ని పంపించి కాపలా ఏర్పాటు చేసి తనూ ఆనవాళ్ళు తెలియకుండా అక్కడికి చేరుకుని అడిగితే తన అలుగుడుకి కారణం చెప్పాడు.అప్పుడు తిమ్మరుసు ఈ రాజనీతినే చెప్పాడు,"నాయనా,ప్రాణాలు బలిపెట్టే సైనికులు ఉన్నారు గదా అని మూర్ఖంగా ఒకడికి పదిమందిని బలిపెట్టుకోగూడదు.ఆ అపనిలోనే అన్నిట్నీ ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తున్నాను.అయినా ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి.నేనూ యుద్ధానికి సిద్ధమే" అని.
తిమ్మరుసు పాటించినది చాణక్యనీతియే!యుద్ధం ఎందుకు,ఎక్కడ,ఎప్పుడు,ఎలా చెయ్యాలి అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు.ఎందుకు చెయ్యాలి అన్నదానికి సమాధానం - లాభం!యుద్ధం మొదలైన దగ్గరి నుంచి గెలుపు సాధించేవరకు ఖర్చులు ఉంటాయి,వాటి సంగతి యేమిటి?గెలుపు అనేది మానసికావసరం కాకూడదు, గెలుపు వల్ల వచ్చే సంతోషంతో సరిపెట్టుకోకూడదు - ప్రయోజనం భౌతికంగా కనపడాలి!ఈసారి గెలిస్తే మన యుద్ధపు ఖర్చులు కూడా ముక్కుపిండి వసూలు చెయ్యాలి.భారత్ మీద యుద్ధం చేస్తే మన ఖర్చుల్తో పాటు వాళ్ళ ఖర్చులు కూడా మనమీదే పడతాయి అనే భయం వాళ్ళకి ఉండాలి.తొలిదెబ్బ మనం వేసి యుద్ధం మొదలుపెడితే ఇలాంటి అవకాశాలు మనకు రావు.
కాబట్టి తిమ్మరుసులా చాణక్యనీతిని ఉపయోగించి నికృష్టపు చైనాని పాకిస్తాన్ పక్కనుంచి వేరుచెయ్యాలి.అమెరికా తరపున నిలబడి ఇరాక్ మీదకి మన సైన్యాల్ని పంపించడం వల్ల మిగిలిన ఇస్లామిక్ దేశాలు కూడా మనతో అంటీముట్టనట్టే ఉంటున్నాయి.దౌత్యరంగంలో ఆ లోపాన్ని సవరించుకోవాలి.ద్విజాతి సిద్ధాంతంతో పవిత్రభూమి పేరుతో ముస్లిముల కోసం ప్రత్యేక దేశంగా అవిర్భవిస్తే ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాలూ తమని అక్కున జేర్చుకుని సహాయం చేస్తాయని కలలు గన్న అప్పటి భారతీయ ముస్లిం మేధావుల అంచనాలను తల్లకిందులు చేస్తూ అప్పటినుంచీ ఇప్పటివరకూ పాకిస్తాన్ సాటి ముస్లిం దేశాలకి కూడా అంటరాని దేశంగా ఉంది - పొయెటిక్ జస్టిస్ అంటే అదే!ఇప్పుడు మనం తెలివితక్కువ ఎత్తులు వేస్తే కధ అడ్డం తిరుగుతుంది - వారంతా పాకిస్తాన్ వైపుకి వెళ్ళినట్లయితే చాలా కష్టం.మన నాయకులు ఎంతగా సెక్యులరిజం అనే పదాన్ని వాడుతూ హడావిడి చేసినా ఇతరులు మాత్రం మనదేశాన్ని హిందూదేశంగానే చూస్తున్నారనేది వాస్తవం.సాక్షాత్తూ అప్పటి కాంగ్రెసు నాయకుడు ఒకరు "ఎటూ మతప్రాతిపదికన ముస్లిములు పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్నారు గనక మన దేశాన్ని హిందూరాజ్యం అని ప్రకటించుదాం" అని సూచించాడు - ఎడ్వినా ప్రియుడు అందుకు ఒపుకోలేదు!కనీసం కాశ్మీరు విషయంలో లేని సమస్యని సృష్టించి వివాదాస్పదం చెయ్యకుండా వుంటే ఎంత బాగుండేది?
చాణక్యుడు యుద్ధం ఎలా చెయ్యాలి అనేదానికి రెండు పరస్పర విరుద్ధమైన మార్గాలు సూచించి పరిస్థితిని బట్టి చేస్తే రెండూ సత్ఫలితాలనే ఇస్తాయని చెప్పాడు.ఒకటి తిమ్మరుసు కటకం మీద దాడి చేసినట్టు దౌత్యపరంగా శత్రువును ఏకాకిని చేసి శత్రురాజ్యం మీదకి దూకుడుగా వెళ్ళటం.అది భారతదేశానికి ఇప్పుడు పనికిరాదు.రెండవది శత్రువును చిన్న చిన్న సమస్యలతో చీకాకు పెట్టి రెచ్చగొట్టి తొలిదాడి చెయ్యక తప్పనీ పరిస్థితిని కల్పించి మనకు అనుకూలంగా ఉండేచోటికి రప్పించుకుని ఎదురుదాడితో లొంగదియ్యటం - ప్రస్తుతానికి మనకి ఇదే తగినది.విదేశాంగ వ్యవహారాలకి సంబంధించి ప్రస్తుత ప్రధాని వాడుతున్న భాష ఇప్పటివరకు సమతూకంగానే ఉంది - ఆయన కొంతకాలం అలా ఉండటమే శ్రేయస్కరం!
వెనకటి తరం నాయకులు చేసిన తప్పులు ఇవ్వాళ స్పష్టంగా కనబడుతున్నందువల్ల వారిని విమర్శించడం ఎవరయినా చెయ్యగలరు.కానీ మనం తీసుకునే నిర్ణయాలు వ్యతిరేక ఫలితాల్ని ఇస్తే ముందరి తరాల్ని ప్రభావితం చేస్తాయి - వారు మనని విమర్శించకుండా జాగ్రత్తపడాలి.డెబ్బయ్యేళ్ళ క్రితం ఒక అహంభావి,స్త్రీలోలుడు,డాంబికుడు తనగురించి తను ఎక్కువగా వూహించుకుని తీసుకున్న పొరపాటు నిర్ణయాల వల్ల మన గ్రహపాటు ఇలా తగలడింది!ఆ చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ మనం కూడా కొత్తరకం తప్పులు చేస్తే మనకి స్వతంత్రం అనవసరం - మళ్ళీ యూనియన్ జాక్ చల్లని నీడలో "గాడ్ సేవ్ ద కింగ్" అని పాడుకుంటూ కమ్మగా బతికెయ్యటం మంచిది!
అప్పటివాళ్ళు గాంధీకి అవతరపురుషుడి హోదా ఇచ్చేసి అతని తింగరి పనుల్ని కూడా మేధావిత్వం కింద పులిమేసి భజంత్రీల మాదిరి ప్రవర్తించడం వల్లనే ఈ దేశానికి ఇన్ని కష్టాలు వచ్చాయి.ఆయనగారి కోడిమెదడుతో ఆయన మొగలాయిలని చెప్పి ఎన్నుకున్న ప్రబుద్ధులు మోతీలాల్ కొడుకూ రత్తి మొగుడూ తమ పదవీలాలసతో అంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుంటే పటేల్ లాంటి పోటుగాళ్ళు తొక్కలో గాంధీకి తను ఇచ్చిన పిచ్చిమాటకి కట్టుబడి చూస్తూ ఉండిపోయారు.కాశ్మీరు సమస్య లేకుండా ఉండి ఉంటే పాకిస్తాను ఎట్లా అఘోరించినా మనం బేఫికర్ జబర్దస్తుగా ఉండేవాళ్ళం.మన మహామహా నాయకులనుకోనే వాళ్లనే బోల్తాకొట్టించి, వాళ్ళకు కనీసం ఆలోచించుకొనే అవకాశంకూడా కూడా లేకుండా చేసి, వారి బుర్రలు మొద్దుబార్చే వ్యూహాలతో కాంగ్రెసునూ గాంధీనీ ఒప్పించి ఆదరబాదరగా దేశాన్ని చీల్చి ఒక నెత్తుటిముద్దను చేతిలోపెట్టాడు మౌంట్ బాటన్. కాశ్మీర్ ముమ్మాటికీ మాదే, దాన్ని మేము ఎల్లకాలమూ కాపాడుకొంటాము అని నిక్కచ్చిగా చెప్పాల్సింది పోయి చేష్టలుడిగిన నాటి ప్రధాని “నెహ్రూ పండితుడు” మౌంట్ బాటన్ చెప్పినట్లల్లా తలాడించి. ఇప్పుడు జరిగింది విలీనమే కాదు – ఆ తరువాతెప్పుడో ప్రజలు తీర్పు చెప్పేదాకా అది ఎటూ తేలేది కాదు – రాజు అడిగాడు కాబట్టి ఇప్పుడు సైన్యాన్ని పంపుతున్నాము – మామూలు పరిస్థితి పునరాద్ధరించగానే సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తాం – కాశ్మీర్ ను పరాయి రాజ్యాంగానే చూస్తాం – అంటూ, అర్థంలేని వ్యాఖ్యలు చేశాడు. – నెహ్రూ స్వయంగా తన వేలితోనే కాశ్మీర్ కంటిని పొడిచాడు. ఎవరయినా సలహా ఇచ్చినా వినేవాడు కాదు,ఎంతసేపూ హిందూరాజు హరిసింగుని ద్వేషించి తన కిష్టమైన సాయిబు షేక్ అబ్దుల్లా కోసం తపించిపోయాడు.కాశ్మీరు సమస్యను నాకన్నా గొప్పగా ఎవరూ పరిష్కరించలేరు అనేవాడు - అసలు లేని సమస్యని సృష్టించిందే తనూ తన మిండగాడూ!
అసలు మన దేశం గురించి మనవాళ్ళతో ఆలోచించి నిర్ణయం తీసుకోకుండా మనం ఎవణ్ణి ఇక్కణ్ణుంచి పొమ్మని తరుముతున్నామో వాడు చెప్పినట్టు వినడం దేనికి?బహుశా మొగుడి మాట వినకపోతే పెళ్ళాం పక్కలోకి రానివ్వదని భయపడ్డాడేమో!కాశ్మీర్ సమస్యకు ఎవరినైనా నిందించవలసి వస్తే అగ్రతాంబూలం నెహ్రూకే ఇవ్వాల్సి ఉంటుంది.కానీ మిగిలిన వారి పాత్ర కూడా ఏమంత తక్కువ కాదు.నాటి కాశ్మీర్ రాజు “హరిసింగ్” పితలాటకంతో, "మౌంట్ బాటన్” కుత్సిత బుద్ధితో, “నెహ్రూ” ఆశ్రిత పక్షపాతంతో, మతిలేని నిర్ణయాలతో, సోవియట్ ఒత్తిళ్లకు లొంగిన “శాస్త్రి” సంతకాలతో, “ఇందిరా” చేసుకొన్న సిమ్లా రహస్య ఒప్పందాలతో, “వాజ్ పేయి” మెతకవైఖరితో పరిష్కారం అనేది కనీసం కలలోకూడా ఊహించని జటిలమైన అంశంగా “కాశ్మీర్ సమస్యను” మార్చివేశారు.అసలు కాశ్మీర్ పై ఈనాటికీ మన విధానమేమిటో మనకే తెలియని అస్తవ్యస్త పరిస్థితి నెలకొని ఉంది. ఎంతసేపూ మనం సరైన రీతిలోనే చేస్తున్నట్లు ప్రపంచాన్ని ఎలా నమ్మించాలన్న సందిగ్ధంలోనే ఎన్నో తడబాట్లు, తొట్రుపాట్లు, దిద్దుబాట్లు, భంగపాట్లతోటే 7దశాబ్దాలు గడిచిపోయాయి.
=> కాశ్మీర్ విషయంలో ముందునుండీ న్యాయం మన పక్షానే ఉంది.
=> పాకిస్థాన్ ముందునుండీ అన్యాయంగానే వ్యవహరింసూ ఉంది.
=> కాశ్మీర్ మనది మాత్రమే అని చెప్పడానికి మనది తిరుగులేని కేసు.
=> పాకిస్థాన్ దగ్గర అసలు కేసే లేదు.
ఇకనైనా మిత్రుడే తొలిశీల వూడగొట్టేసిన పనికిరాని పంచశీలని తుంగలో తొక్కి తిరుగులేని చాణక్యుడి షాడ్గుణ్యాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుని దేశప్రజలు గుండెలమీద చెయ్యి వేసుకుని నిద్రపోయేలా సరిహద్దుల్ని క్షేమంగా ఉంచాలి.ప్రస్తుతం కాశ్మీరును పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కూడా భారత ప్రభుత్వానికి సానుకూలంగానే స్పందిస్తున్నారు గనక స్థిమితంగా వ్యవహరించి దౌత్యపరంగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రపంచవేదిక మీద ఏకాకిని చెయ్యాలి.ప్రాచీన కాలపు రాజనీతిజ్ఞులు రాజ్యపరిపాలనకు 1. రాజ్యం, 2. మంత్రి, 3. స్నేహితుడు(మిత్రరాజ్యాలు), 4. ధనాగారం, 5. రాష్ట్రం(ప్రజలు), 6. దుర్గము, 7. సైన్యము అనే విభాగాలని చెబితే చాణక్యుడు రాజ్యం రాష్ట్రం అనేవాటిని కలిపేసి ఆరు అంశాలకి కుదించాడు.ధనాగారాన్ని ఎప్పుడూ నిండుగా ఉంచుకోమన్నాడు.ఇప్పటి కాలానికి ఫారిన్ ఎక్స్చేంజి రిజర్వ్స్ వస్తాయి.షాడ్గుణ్యం అనేది దీనికి భిన్నమైనది.అది సరిహద్దు రాజ్యాలతో వ్యవహరించాల్సిన విధానాలకి సమబంధించిన నిర్దేశకాలతో నిండి ఉంటుంది.సరిహద్దు రాజ్యం పూర్తిగా బలహీనమయితే అటువైపున ఉన్న బలమైన రాజ్యం దానిని ఆక్రమించి మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనేది చాణక్యుడి హెచ్చరిక.ఈ విషయంలో మనం ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లనే చైనా ముత్యాలసరం అనే చక్రవ్యూహంతో మనని అష్టదిగ్బంధనం చేసిపారేసింది.మన వెనకటి తరంవారు ముళ్ళకంప మీద విలువైన బట్టను వేశారు,మనం దాన్ని చిరిగిపోకుండా బయటికి లాక్కోవాలి.మన తర్వాతి తరంవారికి కొత్త సమస్యల్ని సృష్టించకూడదు.

ఒక హిందూరాజ్యం ఒక ముస్లిం రాజ్యాన్ని కబళిస్తున్నది అనిపించుకోకూడదు!