Tuesday 4 December 2018

ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర విశేషాలు - కృతికర్త

ఈ చెన్నపట్టణపు కాపురస్థుడైన శ్రీవత్స గోత్రోద్భవుడు యేనుగుల సామయ మంత్రి మూర్ధన్యునకు పుత్రుండగు యేనుగుల వీరాస్వామయ్య గారితోను బహుదినములు సహవాసము చేసి స్నేహితుడనై యుండిన నేను, ఆయన చేసిన కాశీయాత్ర చరిత్రలోని సంగతులను వ్రాసేటందుకు ముందుగా ఆ పురుషుని చర్యలను తెలిసిన మట్టుకు చెప్పక పోదునేని ఆయన విషయమై న్యాయము నడిపించిన వాడను కాకపోదు నన్న భయము చేత వాటిని పూర్తిగా వర్ణింపను శక్తి యోగ్యతలు లేని వాడనైనను పూనుకోవలసి వచ్చినందుకు వాటిలో కొన్నింటిని సంగ్రహముగావర్ణించిన వాడ నౌచున్నాను.

యేనుగుల వీరాస్వామయ్య గారికి తొమ్మిదవ యేట పితృవియోగము సంభవించెను. అప్పుడు ఆయనకు తల్లి వినాగా వేరే పోషకులు లేక యుండిరి. తండ్రి వుంచిన ఆస్తిన్ని మితముగానే యుండెను.పండ్రెండవ యేట యింగిలీషు బహు వేగముగా చదవ శక్తి గలిగి యుండినందున అప్పుడు ఆయన వాలంటీరుగా వుండిన Board of Trade అనే ఆఫీసులో నుండే యగ్జామినరులు యిద్దరున్ను ఆయనను రీడరుగా వుంచుకోవలెనని వివాదపడుచు వచ్చిరి.దానివల్ల ఆ వయస్సులో ఆయనకు కలిగియుండిన సామర్ధ్యము తెలియవచ్చుచున్నది. 

పదమూడవ యేట తిర్నపల్లి కలక్టరు కచ్చేరీలో యింటరుప్రిటేరుగా నున్ను ట్రాన్సులేటరుగా నున్ను రెండు సంవత్సరములు వుండి పదియేనవ యేట పట్టణమునకు వచ్చి చేరెను. అటు తర్వాతను కొన్ని సంవత్సరముల వరకున్నుయింగిలీషు హవువుసులో నున్న యేజన్సీలు జమీందారులు వీరితో వర్తక సరళిగా వ్యాసంగములు చేయుచు వచ్చి వొయర్ హౌసులో బొక్కీ పకీరుగా వుండి హేడు కౌంటాంటు అయి తర్వాత సుప్రీంకోర్టు నందు ఇంటరు ప్రిటేరు పనిలో ప్రవేశించినారు.అప్పుడు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఆఫీసువారు ఆయన యెడల తమకు గలిగియుండే విశ్వాసమునకు గురుతుగా ముక్కుపొడి వేశే బంగారుడబ్బీ యొకటి బోర్డు శక్రటేరి మూలముగా సుప్రీంకోర్టు శెలవు మీద ఆయనకు యిప్పించినారు.(ఇక్కడ శెలవు అంటే హాలిడే కాదండి,order/permission అని అర్ధం -అప్పటి తెలుగు అట్లాగే ఉంటుంది!తమ కంపెనీకి మంచి సేవ చేసిన ఒక ఉద్యోగికి చిన్న గిఫ్టు ఇవ్వడానికి అంత తతంగం చేశారంటే అప్పుడు జీరో కరప్షన్ ఉండేది అని అర్ధం కావడం లేదూ!)

ఆయన తనకు పరులు స్వల్పోపకారము చేసినా వారియెడల జరిగించిన మేలు చెప్ప నలవి గాదనుటకు ఆయన తిరుణామలకు వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఆయన వలెనే స్వామి దర్శనమునకు వచ్చిన ప్రజలకు సహాయముగా నుండే యొక  బంట్రోతు తనకు జాగ్రత్తగా స్వామి దర్శనము చేయించినందుకు వాని మంచి నడతలను యిచ్చట రివిన్యూ బోర్డువారికి శ్రుతపరచి వానికి వెండిబిళ్ళయున్ను ఒక వరహా యెక్కువ జీతమున్ను కలిగేలాగు చేసినది సాక్షి భూతముగా నున్నది.

ఆ స్థలమునకు  అష్టబంధనము  చేయించి గజదానము చేసినారు.యిది వారి శక్తికి యెచ్చయిన కార్యముగా అందరికిన్ని తెలియవలశినది.అక్కడి కలకటరు ఆయననున్ను  ఆయనతో కూడా వచ్చిన మరికొందరు ప్రభువులనున్ను చూచి మీరందరున్ను కూడి యిక్కడి దేవునికి రధము కట్టిస్తే బాగా వుండునని చెప్పగా అప్పట్లో ఆ ప్రభువులందరున్ను ఆలాగే చేయుచున్నామని ఆయన గుండా అనిపించి అక్కడినుంచి పట్టణమునకు వచ్చిన తర్వాత ఆ ప్రభువులు ఆ కార్యమును గూర్చి సదరహి అయ్యవారితో యెచ్చరించడమే మానుకొనిరి. అయ్యవారు తాను మంచిదని చెప్పినందున ఆ కార్యము తన శక్తికి మించినదైనా అపరిమితమైన ధనవ్యయము చేసి రధము కట్టించి తన మాటను కాపాడుకొన్నారు. యిందువల్ల ఆడిన మాట కాపాడుటకై శక్తికి మించిన కార్యములను సాధింపుచు వచ్చినారని స్పష్టముగా తెలియుచున్నది. 

వారు కాశీయాత్ర వెళ్ళినప్పుడు నేను  ఆ రధానకు యినప గొలుసులు జాగ్రత పెట్టి గవరన్‌మెంటు వారిగుండా వాటికి రంగులు పూయించిన సంగతి స్చల్ప సహాయమైనా దాన్ని అనేక ప్రకరణములలో నుదాహరించి గొప్పగాకొనియాడిరి.యీలాగు స్వల్పోపకారములను గొప్పగా కొనియాడుచూ వచ్చినందున యితరులకు విశేష కార్యముల యెడల ప్రవృత్తి కలుగుచూ వచ్చెను.

ఒక్క సంవత్సరమునకు అధికముగానే వారు  ప్రతి ద్వాదశికిన్ని భక్ష్యభోజ్య ఫలాజ్య దధి ప్రాజ్యములయిన బ్రాహ్మణారాధనలు చేసి తర్వాత తాను ద్వాదశీ పారణ చేయుచు వచ్చినారు. ఆ సంతర్పణలు  యీ పురమందు  మహోత్సవములుగా నుండినవి. అన్న ప్రదానమందు వారి చాతుర్యమున్ను జాగ్రత యున్ను వర్ణింప శక్యంబులు గావు. వొక్క స్థలమందు ఏక పాకములో ఏకాపోశనముగా వొక్క లోపమున్ను లేకుండా మూడు నాలుగు వేల బ్రాహ్మణులు భుజించునప్పుడు తానొక పరిచారకుని కంటే సులభుడుగా నటించెను. అందరికిన్ని అనేక విషయములలో కాలయాపన మౌచున్నది. ఆ పురుషుడు ఇట్టి సద్విషయమందు శ్రమను యెంచక స్వల్పకాలమును వ్యయపరచినది, పరలోకగతుడైనా ఉన్నట్టే కొనియాడబడేలాగు చేయుచున్నది.ఇట్టి సత్కార్యము చేసినవారికి అది కీర్తిహేతువు కావడము మాత్రమే గాక, యితరుకున్ను ఆలాటి కీర్తి యెడల సుబుద్ధి కలుగుటకు కారణ మవుచున్నది.

యీ పురమందు క్షయమాస విషయమయి  మహాసభ కూడినప్పుడు అయ్యవారు తన పక్షమును శృతి స్మృతి ప్రమాణములతో స్థాపన చేయగా సభవారు మిక్కిలి సంతోషపడి అందుకు చిహ్నముగా అయ్యవారికి రత్నహారమును బహుమతి చేసి వారి సద్గుణములను ఒక పత్రికలో వ్రాసి ఆయనకు పంపిరి.ఆయన వుద్యోగములో నుండిన కాలము వరకు ఆ కోర్టు జడ్జీలకు తృప్తిగా నడుచుకొన్నారనేటందుకు దృష్టానత్ముగా పెద్ద జడ్జీ యయిన సర్ రాల్ఫు సాల్మను దొరగారు ఆయనకు వ్రాసి ఇచ్చిన టెస్టిమోనియల్ అనే యోగ్యతాపత్రికలో విశేషముగా ఆయన కోర్టులోనున్ను, చేంబరులోనున్ను అలసట లేక బహు నెమ్మదితో పనులు గడుపుచు వచ్చెననిన్ని,  ఆయన తన గొప్ప వుద్యోగపు పనులను మిక్కిలీ నమ్మకముగా జరిపించెననిన్ని మరిన్ని  ప్రజల మేలును కోరి స్మృతిచంద్రిక మొదలైన కొన్ని పుస్తకములకు త్రాన్సులేషన్ చేసెననిన్ని  నేనెరిగినంతలో గవరన్‌మెంటు వారి విశేషకృపకు యీ పురుషుడు పాత్రుడయినట్టు హిందు పెద్ద మనుష్యులలో మరి ఎవరున్ను యెక్కువైన వారు లేరని ధృఢముగా నాకు తోచి యున్నదనిన్ని వ్రాయబడి యున్నది.

లోకములో గంగాస్నానమునకు వెళ్ళిన పురుషుడు తన తల్లిదండ్రులకు తెచ్చి యుఇవ్వడము వాడికి బడియున్నది. యీ మహాపురుషుడు గంగను పడవలు బండ్లు కావళ్ళు  వగయిరాల మీద తెచ్చి  యీ దేశములో నుండే నాలుగు వర్ణాల వారిలో నున్నుండే గొప్ప మనుష్యుల గుండా ఆ యా వర్ణములలోని ముఖ్యుల పేళ్ళు  తెలుసుకొని వారి కందరికి  గంగనున్ను  జగన్నాధ  పట ప్రసాదములనున్ను  యిప్పించెను. అందువల్ల అందరినిన్ని తన బంధుసమానులుగా చూచేవారని ప్రస్ఫుటముగా తెలియుచున్నది.

ఆయన యాత్రకు బోవునప్పుడు నేను సకృదావృత్తి  అక్కడి వినోదములను వ్రాయించి పంపించవలెనని అడుగుకొన్నందుకు  యాత్రలో ప్రతిదినచర్యలనున్ను ఆ యా ప్రస్తావనములలో జగదీశ్వరుడు తనకు తోపజేసిన తాత్పర్యములనున్ను మార్గమందు పరుల వల్ల తాను చెందిన సహాయములనున్ను తనవలె యాత్ర పోవువారు మార్గములో పూర్వముగానే జాగ్రత్త పెట్టుకొనవలసిన విషయములనున్ను  క్రమముగా అప్పుడప్పుడు వ్రాసి పంపుచు వచ్చిరి.ఆ పుస్తకమును చూచుటవల్ల యాత్రబోయి చూచి తెలియవలసిన సంగతులన్నీ తెలియుచున్నవి.ఆ పుస్తకము పనయూరి వెంకు మొదలారి గుండా అరవముతో తర్జుమా చేయించబడి అచ్చు వేయించబడియున్నది.నాగపూరి వీరాస్వామి మొదలారి  మహారాష్ట్రముతో భాషాంతరము చేయించినాడు.ఆ మహారాష్ట్ర పుస్తకమును నాగపూరి రిసైడెంటుగారు తాను యింగ్లీషుతో త్రాన్సులేషన్ చేసి ప్రసిద్ధి పరచ తలచి అయ్యవారిని సెలవు అడిగినందుకు వీరు నేనే భాషాంతరము చేయించి పంపుచున్నానని తెలియజేసి కొంత భాషాంతరము చేయించినారు.భగవంతుని కృప వల్ల కొదవయున్ను  యే పుణ్యాత్ముల గుండానయినా పూర్తి కావచ్చును.

నందన సంవత్సరపు క్షామము(సా.శ 1832 - 1833 మధ్య వచ్చింది.దీనికి గుంటూరు కరువు అని కూడా పేరు ఉంది.)లోనేను కొంత ధాన్యసంగ్రహము చేసి వుంచడము మేలని చెప్పినందుకూయ్యవారు మనము ధాన్యము సంగ్రహించి మనము మట్టుకు భుజించి అన్నాతురులై దుఃఖపడే పేదలను చూచుచు జీవించుట అప్రయోజనము గనుక తన ప్రయోజనమునకు గాను విస్తరించి జాగ్రత పెట్టుకొనరాదని చెప్పి ఆ దుర్బిక్షములో శక్తి వంచన లేకుండా తాను అన్నప్రదానము చేయుచు యితరులను స్వప్రయోజనమునకు అనుసరించేలాగు అనుసరించి వారినిన్ని పేదల పోషణ విషయమై ప్రవర్తింప జేయుచు ఆ లాగు ప్రవర్తించినవారిని తాను మిక్కిలి కొనియాడి సంతోషపెట్టుచు వచ్చిరి. అందువల్ల మరికొందరున్ను అన్నదానమందు ప్రవర్తింపుచు వచ్చిరి.

మరిన్ని గంజిదొడ్డి యనే అన్నసత్రములో గవర్నమెంటు వారు అపారద్రవ్యమును బీదల అన్నప్రదాన విషయమై ఖర్చుచేసినప్పుడు అయ్యవారు ఆ ధర్మవిచారణ ప్రభువులలో తాను నొక్కడుగా నుండి పేదలకు కాలములో విమర్శగా అన్నమును అందచేసే కొరకై పడిన శ్రమ చెప్పనలవి కాదు.అది యేలాగంటే 1000, 2000 తూముల బియ్యమును ప్రతి దినమున్ను పాకము చేయించి తన దృష్టిపధములో పేదలను శ్రమపడనీయకుండా రెండు జాములకు లోగానే అన్న మంతయు వినియోగ పరచుచ్గు వచ్చిరి. మరిన్ని తన బుద్ధిశక్తిని యావత్తున్ను రాత్రిన్ని పగలున్ను ఆ కార్యము విషయమై వాడుచు వచ్చిరి.

ఇదిగాక అయ్యవారు నాతో ఒక ప్రస్తావములో చెప్పియుండే యొక సంగతి మిక్కిలి ప్రయోజన కారిగా తోచినందున యీ అడుగున వ్రాయుచున్నాను."ఒక పురుషుడు  విస్తరించి ద్రవ్యము నార్జించి దాచిపెట్టి తాను సద్వ్యయము చేయకుండా చనిపోవుట నిష్ఫల"మని యున్ను "చనిపోవు వారు తమకు పిమ్మట జరగవలసిన కార్యములను వ్రాసే మరణశాసనములు అనేకముగా తన వుద్యోగమును పట్టి త్రాన్సులేషన్ చేయవలసి వచ్చినందున ఆ వ్రాసినవారి తాత్పర్యములనున్ను  వారు జీవించి యుండగా చేయుచు వచ్చిన కృత్యములనున్ను వారికి యీ లోకవిషయమై యుండిన తాత్పర్యములనున్ను వారు వ్రాసిన మరణశాసనములు వారి మరణాంతరము ఆ తాత్పర్యానకు సంబంధించకపోవుటనున్ను వారు స్వప్నావస్థలో గూడా చూడనివిగానున్ను  యెట్టి నుద్ధిమంతులకున్ను యీలాగు సంభవించునని వూహించ కూడనివిగానున్ను వుండే అనేక విషయములు సంభచించడమునున్ను తాను తెలుసుకొన్నందున తన మనసుకు లోకరీతి బాగా తెలిసి పరలోకదృష్టి ప్రబల మవుచు వచ్చిన"దని చెప్పినారు.

మరిన్ని తన కూతురి వివాహమందు "అన్నస్య క్షుధితః పాత్ర"మనే వచన ప్రకారము అన్నానకు ఆకలి గొన్నవా రందరున్ను పాత్రులని యోచించి అందుకు ఆక్షేపించిన వారినిన్ని సమ్మతి పెట్టి సమస్త జాతులకున్ను అన్నప్రదానము చేసినారు. దీనివల్ల ఆయన సర్వసమదృష్టి గల పురుషుడని స్పష్టముగా తెలియవచ్చున్నది.కొందరు యీ వివాహ విషయమై ద్రవ్యమును వ్యయపరచుట కంటె చిన్నదానికి ఆస్తిగా వుంచుట మేలని అయ్యవారితో చెప్పినందుకు ఆయన చిన్నదాని పోషణ కొరకు ద్రవ్యమును మనుష్యాధీనముగా నుంచుటకు ప్రతిగా యీశ్వరుని చేత నేను వుంచుచున్నానని చెప్పి అపారముగా అన్నదానము చేసినారు.

ఈ చెన్నపట్టణమందు హిందూ లిటరైరి సొసయిటి యనే విద్వత్సభను తాను కల్పన చేసి దాన్ని వృద్ధి పొందించను  యిచ్చటి గొప్ప మనుష్యులను స్వంతపనికి అనుసరించేలాగు అనుసరించి వారివారికి అనేక మార్గములను కనపరచుచు వారి కందరికిన్ని యీ సభమీద శ్రద్ధ వృద్ధి పొందేలాగు చేయుచు వచ్చిరి.

అయ్యవారు తన వుద్యోగమును వదలుకొని విరామదశను బొందవలెనని తన్ను చేయుచుండిన సుప్రీం కోరటు పెద్ద జడ్జీయైన సర్ రాబర్టు కమిన్ దొరగారికి వ్రాసుకొన్నప్పుడు ఆ కోరటు అడ్వొకేటు జనరల్ జార్జి నార్టను దొరగారు అయ్యవారియొక్క అతి చాతుర్య విశిష్టమయిన ద్విభాషిత్వ క్రమములను విస్తరించి చెప్పినంతలో జడ్జిగారు తానున్ను అయ్యవారి సుగుణములను బహుతరముగ తెలియపరచునప్పుడు యీ వుద్యోగమును యీ పురుషుడు గడిపినట్టు గడిపే శక్తివంతులను నేను ఇదివరలో చూడలేదనియున్ను యీ పురుషుడు యీ వుద్యోగమును వదలుట యీ కోరుటుకు బహునష్టమనిన్ని వ్యసనపూర్వకముగా సెలవిచ్చినారు.జడ్జిగారు యీలాగు చెప్పేపాటి యోగ్యతతో అయ్యవారు తన వుద్యోగమును జరుపుకొన్నారు.

అయ్యవారు తాను జీవించి యుండిన కాలము వరకున్ను కీర్తి ప్రతిష్ఠా హేతువులయిన సత్కార్యములను అనేకముగా  జరిగించి తుదను  నిర్యాణ కాలము సంభవించినపుడు తీర్ధయాత్రా ఋగ్యజుస్సామ వేదత్రయ పారాయణాది సత్కర్మ ప్రభాస పరిశుద్ధాంతఃకరణులై పరమేశ్వర కరుణా కటాక్ష లబ్ధతత్వాబోధ చేత మాతృ భ్రాతృ పుత్రికా భార్యా సుహృన్మిత్ర బంధువుల యెడల నుండిన స్నేహపాశములను మూషికా జాలఛ్చేదన న్యాయముగా ఛేదించి యీషణత్రయరహితులై దేహ లోక శాస్త్ర వాసన లనే వాసనాత్రయమునున్ను అవిద్యాస్మితా రాగద్వేషాభినివేశంబు లనియెడు పంచ క్లేశములనున్ను జయించి నిస్సంగులై వానప్రస్థాశ్రమ ప్రతినిధిగా కొన్ని దినములు ఆరామ వాసము చేసి మహావాక్యార్ధ విచారణ వల్ల సచ్చిదానందఘనమయిన బ్రహ్మకున్ను తనకున్ను భేదము లేదని తెలిసి సోహంభావన చేయుచు నుండి యిష్టులుగా నుండిన వారిని తనకు ఆపత్సన్యాసము సిద్ధింప చేయవలెనని బహుతరముగా ప్రార్ధించి తన స్నేహ సంబంధీకులయిన వారికి అనేక విధ వివేక హేతువులగు వాక్యములను బోధ చేసి సమ్మతి పరచి నిర్యాణ దినమందు బహిరంగమయిన ఆపత్సన్యాసమును స్వీకరించిన ముహూర్తములోనే  యోగాసనాసీనులయి ప్రణవానుసంధానము చేయుచు ప్రాణోత్క్రమణ క్షణ పర్యంతమున్ను పూర్ణమయిన తెలివి కలిగియుండి, ఆత్మ నిత్యుడు దేహము అస్థిరమనియున్ను తెలిసిన వారు గనుక, దేహము వదలుట వల్ల వ్యసనమును చెందక సంతోషముతో అనాయాసముగా శాలివాహన శకంబు 1760 అగు దుర్ముఖ సంవత్సర భాద్రపద బహుళ పక్షాష్టమీ సోమవారము నాడు ఉదయాన స్థూలదేహము వదిలి లింగదేహముతో పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోక నివాసమును పొందినారు.

-కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళ
-----------------------------------------------------------------------------------------
1  2

13 comments:

  1. తెలంగాణ జాగ్రఫీ నాకు తెలియదు.అదీ గాక "ఏ సీట్లో ఎవరు పోటీ చేశారు, ఏ వర్గానికి ఎన్ని సీట్లిచ్హారు.ఆయా పార్టీలు గెలుచుకున్న ఓట్ల శాతం ఎంత?ఆయా పార్టీలు గెలుచుకున్న సీట్లు ఎన్ని?" అనే లెక్కలకి నేను చిన్నప్పట్నించీ దూరంగానే ఉన్నాను.జనరల్ యాంబియెన్స్ మాత్రమే నేను పట్టించుకుంటాను.ఆ రకంగా చూస్తే నాగెశ్వర్ ఒక్కరే కాకుండా ఇంకొక విశ్లేషకులు హైలైట్ చేసిన పాయింటు ఏమిటంటే TRS అభ్యర్ధులు వీక్!ముందే అన్నీ రెడీ చేసుకుని ఎన్నికలు ప్రకటించి అభ్యర్ధుల్ని కూడా ముందే ప్రకటించిన పార్టీ వీక్ క్యాండిడేట్లని సెలెక్ట్ చేసుకోవటం చూసి అప్పుడే చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేశారు.కేసీయార్ తన ఛరిస్మాని చూపించి కుక్కని పెట్టినా గెలిపించుకోగలడు అని చెప్పుకోవటానికే వీక్ అని తెలిసిపోయే వాళ్ళని నిలబెట్టాడని ఒక టాక్.నాకయితే సమర్ధులు ఉంటే కొడుకుని డామినేట్ చేస్తారనే భయం వల్ల అలా చేసి ఉంటాదని అనిపిస్తుంది.

    కేటీయార్ ప్రెస్ మీట్ లాంటివాటితో అభివృద్ధి గురించి చెప్పుకోవడం కష్టమయ్యేసరికి "తెదెపాకి వోటు వేస్తే తెలంగాణని అమరావతికి తాకట్టు పెట్టినట్టే!" అనే మాటతో పాత ఎత్తుగడ ఆంధ్రా దోపిడీ - బాబు మోసం అనే వాటినే ప్రజల ముందు ఆప్షన్లుగా పెట్టాడు.ఒకసారి కేసీయార్ దీన్ని తనే తురుపుముక్కలా చేశాక జనం ఏ పాయింటు చూసి వేసినా తన గెలుపుని దానికే అతికించుకుంటాడు.

    రాష్ట్రం ఏర్పాటు కోసం అంత భీబత్సం సృష్టించినవాడు విభజన బిల్లులోని వివాదాస్పదమైన అంశాల్ని పరిష్కరించుకోవటానికి ఎందుకు సుముఖత చూపించలేదు?చట్టసభలో ప్యాసయిన ఒక బిల్లు ఇంత సుదీర్ఘ కాలం పాటు అమలుకు నోచుకోలేదంటే ఆ బిల్లు మురిగిపోయినట్టు కాదా?

    ఈ పని కుదరకనో దానివల్ల వచ్చే ప్రయోజనాలు తక్కువనో యాధాలాపంగా చేసిందో కాదు, ఆంధ్రాకి ఫెళ్ళేవాటిని వెళ్ళకుండా ఆపటం కోసమే - నాకూ నష్టమే అయినప్పటికిన్నీ ఆంధ్రాకి మాత్రం లాభం జరగనివ్వకూడదు అనే దుర్మార్గపు ఆలోచనయే కారణం అని నేను బలంగా నమ్ముతున్నాను.

    మురిగిపోయిన బిల్లు ద్వారా నడుస్తున్న రాష్ట్రం కూడా మురిగిపోయిన కోడిగుడ్డు లాంటిదే - కేసీయార్ తను ప్రజల ముందు వుంచిన ఆంధ్రా దోపిడీ - బాబు మోసం అనే వాదనకి బాల్మ్ చేకూర్చితూ ఈ ఎన్నికల్లో గెలిస్తే విభజన బిల్లు లోని అంశాల్ని ఎప్పటికీ పరిష్కారం కానివ్వడు. ఈ మురిగిపోయిన గుడ్డు లాంటి తెలంగాణని ఇంక్యుబేటరులో పెట్టి చూపిస్తాడు!

    ఈ మధ్యనే కేటీయార్ ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకి నష్టం అన్న స్టేట్మెంటు ద్వారా బుర్ర వున్న ఏ మనిషికైనా ఒకటే అర్ధం అవుతుంది - బీజేపీ వాళ్ళు తెదెపాతో స్నేహంగా ఉన్న రోజుల్లో ప్రత్యేక హోదా మీకిస్తే అందరూ అడుగుతారు అని ఒక మాట న్నారు. అలా అడిగే రాక్షసత్వం ఉన్నది తెరాసకే - ఆంధ్రాకి ఇచ్చిన మరుక్షణం మాకూ ఇవ్వాలని అడగటానికీ ఇవ్వకపోతే కేంద్రం వివక్ష,బాబు కుట్ర అని అల్లరి చెయ్యటానికీ ముందే ప్లాన్ వేసుకుని కూర్చున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి మూలంగానే ఆంధ్రాకి ప్రత్యేక హోదా దక్కలేదు అనేది ముమ్మాటికీ నిజం!.

    విభజన బిల్లుని పరిష్కరించకపోవటానికీ ప్రత్యేకహోదాకి అడ్డం రావడానికీ వెనక ఉన్న ఒకే ఒక వికృతమయిన ఆలోచన ఆంధ్రాని మెసపొటేమియా,మయన్ నాగరికతల మాదిరి మట్టి కొట్టుకు పొయ్యేటట్టు చేసి," చూశారా, మాతో కలిసుండడం వల్లనే ఒక వెలుగు వెలిగారు,మానుంచి విడిపోగానే అణగారిపోయారు - మమ్మల్ని దోచుకుని బతికారని మేము చెప్పింది నిజమే కదా" అని వికటాట్టహాసాలు చెయ్యటానికి.మెసపొటేమియా నాగరికతని ధ్వంసం చేసింది వేరొక నాగరికతకీ వేరొక సంస్కృటికి చెందినవాళ్ళు.కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు.తన అహంభావం కోసం ఒకనాడు తను మంత్రిగా పరిపాలించిన ప్రజలనే నిలువునా నాశనం చెయ్యాలని చూస్తున్న కిరాతకుడు తెలంగాణ ప్రజల్ని మాత్రం కన్నబిడ్డల్లా చూస్తాడా?వొట్టిది!

    వీటికి ఆధారాలు లేవు,కానీ ఇవన్నీ నిజాలేనని ప్రతి ఒక్కరికీ తెలుసు.నా రాష్ట్రం మీద పగబట్టినవాడి అభ్యున్నతిని కోరే బానిసాధముణ్ణి కాను నేను.అందుకే కేసీయార్ ఓడిపోవాలని కోరుకుంటున్నాను.

    కేసీయార్ గెలిస్తే విభజన బిల్లుని పూర్తి రూపంలో అమలు చెయ్యడం అనేదాన్ని జరగనివ్వడు - ఇక తెలంగాణ అభిమానులకి ద్వేషంతోనూ ఈర్ష్యతోనూ కుతకుతలాడుతూ మురిగిపోయిన కోడిగుడ్డు మాత్రమే దక్కుతుంది, జై లతెంగాణ!

    ReplyDelete
  2. మంచి ఎనాలిసిస్!!!

    ReplyDelete
  3. రచ్చబండ బ్లాగులో చిరంజీవి వై నన్ను పదే పదే అవమానిస్తుంటే నా ఏడుపు నేనే ఏడ్చాను కానీ ఒక్కరు కూడా సపోర్టు రాలేదు,ఎందుకని?శ్యామలీయం బ్రాహ్మణుడూ నేను అబ్రాహ్మణుడను కనకనా?

    నేను వాడొఇన "పగిలిపోద్ది" అనే ఒక్కమాటకి వచ్చిన రెస్పాన్స్ నేను పదే పదే విజ్ఞప్తులు చేసినా ఆగకుండా చ్రంజీవి వై బజారు భాషనే మాట్లాడుతున్నప్పుడు రాలేదు.నేను యాగ్రిగేటర్ నిర్వాహకుల దగ్గిర్నుంచీ బ్లాగర్ల నందర్నీ న్యాయం కోసం అడిగి అడిగి అలిసిపోయి వెళ్ళిపోతుంటే జాలి కబుర్లు చెప్పారే తప్ప నాకోసం ఎవరూ మాట్లాడలేదు.కారణం ఏమిటి?

    ఒకే అవమానం ఇద్దరికి జరిగినప్పుడు ఒక వ్యక్తికి మాత్రమే సపోర్టు ఇవ్వడం రెండో వ్యక్తి పట్ల వివక్షని చూపించటమే అవుతుంది.

    నేను మళ్ళీ యాగ్రిగేటర్లలోకి వచ్చిందే నాకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోఅవ్టానికి!అందుకు నాకు పనికొచ్చే ఏ బ్లాగునీ ఏ చర్చనీ ఏ వ్యక్తినీ వదలను - చిరంజీవి వై మాట్లాడగలిగిన భాష నేను మాట్లాడలేకనే మాట్లాదలేదనుకుంటున్నారా - మంచికి రోజులు కావని నిరూపించారు!

    మరోసారి చెప్తున్నా నాకు నీతులు చెప్పటం మాని మీ నోళ్ళు కడుక్కోండి.బోడి ఏడుపు పజ్యాలు రాసుకోవటం తప్ప ఏం పీకుతున్నాడు శ్యామలీయం?హిందూమతం మీద ఈగ వాలనివ్వలుండా నిలబడినందుకు కాదా కేతన్,బ్లూ కేక్,చిరంజీవి వై లాంటివాళ్ళు నన్ను టార్గెట్ చేసుకున్నది!నేను పొట్లాడుతుంటే చూస్తూ ఎంజాయ్ చెయ్యడం తప్ప నాకు అవమానం జరుగుతున్నప్పుడు సహాయం చేసే బాధ్యత ఎవరికీ లేదా?

    కేవలం గోవులకీ బ్రాహ్మణులకీ అవమానం జరిగితేనే రియాక్ట్ అయ్యే మనస్తత్వంలో హిందువులు ఉంటే నేను హిందూమతాన్ని వదిలెయ్యడానికి కూడా సిద్ధం!వీరుల్ని కాపాడుకోలేనివాళ్ళని దేవుడు కూడా రక్షించలేడు - నిజం!!

    సత్యం శివం సుందరం!!!

    ReplyDelete
  4. I think you have to control your emotions sir. Day by day everyone is leaving you and you became alone. Please be wait things will become normal.

    ReplyDelete
    Replies
    1. "Day by day everyone is leaving you and you became alone"

      me:I know the thing of alienating me very clearly from the first sign - I am an observant! Basically I don't want their support in my fights.But , how long a lonely warrior can fght?How long these people stood like spectators?

      That is my point.I am in full control - I NEVER COMBAT IN A DISTURBED MIND!

      Delete
  5. ఆర్యా,

    ఏమిటో శ్రీనివాసుడు గారు అనవసరమైన విషయాల్ని పట్టించుకుని అత్యవసమైన విషయాన్ని పక్క దారి పట్టిస్తున్నట్టు పదే పదే హడావిడి చేస్తున్నారే - మీరు అసలు విషయం గురించిన చర్చ మొదలు పెట్టవచ్చును కదా!కధ లోని అసలు విషయం ఏమిటి?

    కధ లోని ప్రధాన విషయం చంద్రబాబు ప్రభుత్వం రేషనుకీ మరుగుదొడ్లకీ ముది పెట్టటమే కావచ్చు,దాన్ని రచయిత్రి వ్యతిరేకించడం న్యాయమైనదే కావచ్చు - కానీ రచయిత్రి కొన్ని విషయాల పైన వెలిబుచ్చిన అభిప్రాయాలు అసంబద్ధమైనవి అనిపించినప్పుడు ఎత్తి చూపడం కూడా నేరమేనా?

    "అసందర్భం వచనం బృహస్పతి రపి బ్రువన్ విద్వజ్జన మవమానం లభతే" అన్నట్టు విశ్వనాధ సత్యనారాయణ, గుడిపాటి వెంకట చలం, గురజాడ అప్పారావు, వీరేశలింగం లాంటివాళ్ళని కూడా వదలకుండావాళ్ళ రచనల్లో చెప్పిన విషయాల్ని చీల్చి చెండాడిన ఉదంతాలు తెలియవా మీకు?అలాంటప్పుడు ఒక విద్యాగంధం లేని రచయిత్రి రాసిన అశాస్త్రీయమైన విషయాల్ని కూడా ఎందుకు సమర్ధిస్తున్నారు మీరు?

    వాస్తవానికి ఆమెకి ఈ కధల్ని రాసిపెట్టి సహకరిస్తున్న విద్యావంతులకే ఆమెలోని అజ్ఞానాన్ని తొలగించే బాధ్యత వుండాలి!అది లేకపోగా వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యాలని నిజాయితీగా ప్రయత్నించేవాళ్ళ మీద ఎదురుదాడి చెయ్యటం ఏమిటి?

    "మీ లాంటి వాళ్ళు అందరూ కలిసి వీలయితే కంప్యూటర్ పెట్టుకుని మా ఏలుగుర్తులు తీసుకునే వాళ్లకు అవగాహన కల్పించాలని ,ఇంకా మాకు మేలు జరగల్ల అంటే మేము నెలనెలా స్టోరుకి పోతాం కదా ,ఆడ ఒక డాక్టర్ని పెట్టి ఎవరి ఏలుగుర్తులు రాలేదో వారిని పరీక్షించి ,ఏముందో చెప్పి పరిష్కారం చూపించాలని ,వాటితో పాటు ఏలి గీతలు పడనివాల్లను ఏరే గుర్తులతో వారినిసులువుగా గుర్తించే మిషన్లు సైన్స్ లో ఉంటే వాటి గురించి అధికారులకు తెలియజేయాలని కోరుకుంటున్నాను ." అనే ఆమెకి ఉన్నపాటి ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా?

    శ్రీనివాసుడు గారు ఒక్కటి మాత్రమే ఎత్తి చూపించారు.ఆ కధలో ఉన్న మరికొన్ని అసంబద్ధమైన విషయాలని నేను ఎత్తి చూపిస్తున్నాను,చూడండి!
    ---------------------------
    1.“ ఈ పల్లెల్లో ఏంటికి యాన్నో టవునుమార్గంలో వాళ్ళకి తావు ఉండదు ఆడ కట్టుకోవల్ల కావాలంటే,వాళ్ళు కూడాఈడికే వచ్చి కూసోని పోయేంత తావుఉంది మాకు”
    2.నాకుపెండ్లి అయిన కొత్తలో మాఊరిలో జలజారులు ఉండేవి. మా ఊర్లో ఎవురన్న బిడ్డను యియ్యలన్న, తెచ్చుకోవలన్న ముందుగా జలజారు ఉందా అని చూసి లేదంటే ఎట్లా మేము బిడ్డను యిచ్చేది అని అడిగే వాళ్ళు!
    2.“ఆసీస ఎట్లమ్మ వాటల్లో యేరిగేది. ఇంట్లోతిని ఇంటెనకల యారగతార? వొళ్ళు బాగాలేక నేను టౌనుకు బోయి ఆసుపత్రిలో జేరితే గతిలేక కక్కసు రూములోకి పోవల్లా అంటేనే నాకు వచ్చేది కూడా రాదు,అట్లాంటిది పల్లిలో కుసోమంటే ఎట్లబ్బ, వాల్ల పోరుకు కడతా ఉండామే గాని బిల్లు అవతానే గుంతలు పూడ్చేసి బేసిని పెరికేయమా”
    3.“అది సరేలే ఇబ్బుడైతె నీళ్ళు ఉండాయి ఇంగ వచ్చేది ఎండాకాలం ఊర్లో బోర్లు గాని నిలిసిపోతే నీళ్ళకు ఎంత దూరం పావల్ల . అబ్బుడెట్లమ్మ, అట్లాంటబ్బుడు పోయి బయట యారిగేసి రాయికో ఆకుకో తుడుసు కొని రాకుండా ఎవరుజెప్పిరి ఈబాధ”
    ---------------------------
    పల్లె సైన్సు, పల్లె పదం,పల్లె తొక్క,పల్లె తోలు అనేవాళ్ళు వీటిని కూడా సమర్ధిస్తున్నారా?ఈ మధ్యనే జాన్ అనే మతప్రచారకుణ్ణి చంపిన సెంటినలీస్ ధోరణిలో ఉన్నారు వాళ్ళు!సెంటినలీస్ ఎక్కడో ఒక ద్వీపంలో ఉన్నారు, అతను చేస్తున్నది మతప్రచారం - అంత దూరం వెళ్ళే ఓపిక లేకపోవడం వల్లా మన ప్రాణాల మీద ఉన్న ప్రేమ వల్లా వాళ్ళని వాళ్ళ మానానికి వ్వదిలేస్తున్నాం, కానీ మన మధ్యనే మార్పునీ ఆధునికతనీ వ్యతిరేకిస్తూ అనారోగ్యకరం అని తెలియక మేము చేతుల్ని రాళ్ళకీ ఆకులకీ రుద్దుకుంటూ ఉండిపోతామే తప్ప సెప్టిక్ లావెట్రీలని వాడం అని చెప్తున్నవాళ్లని ఎలా అర్ధం చేసుకోవాలి?వాళ్ళది పల్లె శాస్త్రీయత అని పొగుడుతూ మా ఇద్దరికీ ఆధునికతా వ్యాధిని అంటగడుతున్న రాణి శివ శంకర శర్మ ఏ పద్ధతిని వాడుతున్నాడు?మైండు దొబ్బిన కబుర్లూ వాడూను!వాళ్ళకి ఎవరన్నా అన్యాయం చేశారని తెలిస్తే అవతలివాళ్ళని తిట్టటానికి లెగిసే నోరు వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించడానికి ఎందుకు మూగబోతుంది?వాళ్ళ అజ్ఞానం వల్లనే కదా వాళ్ళు అన్యాయానికి గురయ్యేది!

    ఎవరికి చెవుల్లో పువ్వులు పెడదామనుకుంటున్నారు మీరు?మీలో లేని అభివృద్ధి కాముకత్వాన్ని మీకు దఖలు పర్చుకుని పోజులు కొట్టకండి.

    ఇట్లు
    చిచ్చర పిడుగు

    ReplyDelete
  6. ధర్మో రక్షతి రక్షితః

    ReplyDelete
  7. ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ చూశా - 50 నుంచి 66 మించవని అంటున్నారు తెరాసకి!అన్నింటి లోకి ఎక్కువ సీట్లు వరకు సరే మూడింట రెండొంతుల మాటేంటి?దానికి కనీసం 80 రావాలి గద. అప్పుడు కొనుక్కుని ఏడిపించకపోతే ఇప్పుడు కలిసొచ్ఛే వాళ్ళు.ఈ సర్వే నిజమైతే కేసీయార్ పరిస్థితి ఏంటి?

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. @K.S.ChowdaryDecember 8, 2018 at 7:09 PM
    మిత్రులు చిరంజీవిగారికి,
    తనది మాత్రమే జ్ఞానమని అజ్ఞానంతో తారా స్థాయిలో ముదిరిపోయినవాడికి,.. మిమ్మల్ని నన్ను బూతులు తిట్టడం జరుగుతూనే ఉంది." ఆ కామెంట్లు కొన్ని స్క్రీన్ షాట్ తీసి శ్యామలీయం మాష్టారు గారికి, కొండలరావుగారికి, నాకు పరిచయమున్న మరికొంతమంది ముఖ్యమైన బ్లాగర్లకు పంపడం జరిగింది...నిజానికి స్వామి దయానందుడు వారు వ్రాసిన సత్యార్ధప్రకాశము పూర్తిగా చదివితే అసలు పరమేశ్వరుడు ఎవరో పూర్తిగా అర్ధమవుతుంది...ఇంతకు మించి వాల్మీకి రామాయణమున నేమియు వ్రాయలేదు.
    ఆధారం: సత్యార్ధప్రకాశము-ఏకాదశ సముల్లాసము."



    hari.S.babu
    స్క్రీన్ షాట్లు పంపించ్ఘి ఎవర్ని బెదరగొడతావు నువ్వు?నేను యాగ్రీగేటర్ల నుంచి వెళ్ళబోయేముందు చిరంబ్జీవి నాకు వాడిన పదాలు నీ బ్లాగులోనివే కదా!

    వాటిని ఉటంకించి నేను నీమీద చర్య తీసుకోమని అడిగినప్పుడు భరద్వాజ గారు "అవి మా తప్పుడు పదాల లిస్టులో లేవు, సారీ మేమేం చెయ్యలేం" అన్నారా లేదా?అలా అన్నప్పిడు ఏవి నిషేధిత పదాలో చెప్పాల్సిన బాధ్యత కూడా వారికి ఉంటుంది కదా?ఇప్పుడు ఇస్తే అస్సలు కుదరదౌ.నన్ను బ్లేం చెయ్యటానికి నేను వాడిన మాటల్ని మాత్రమే ఇరికించి చిరంజీవి వాడిన మాటల్నొ వదిలేసినట్టు తప్పకుండా అనుమానం వస్తుంది.

    నాకు ఏ విధమైన శిక్ష వెయ్యాలన్నా అది మొదట నీకే వెయ్యాల్సి వస్తుంది!

    నేనేమీ తెలివితక్కువవాణ్ణి కాదు,అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నాను.నా రిక్వెస్టులో పెట్టిన కామెంట్లలోని భాష చీరంజీవి వై నీ బ్లాగులో తప్ప ఇంకెక్కడా వాడలేదు.కావాలంటే అన్ని బ్లాగులకీ పోయి చూసుకో.నామీద రచ్చ చేస్తే నువ్వే బుక్కయిపోతావు.

    మళ్ళీ చెబుతున్నా.నా ప్లానులో సగం ఇరుక్కుపోయావు.ముందుకెళ్తే పూర్తిగా మట్టానికి ముణీగేది నువే.నేను యాగ్రిగేటర్లలో ఉన్నా లేకున్నా రోజుకి రెండు వందల హిట్లు వస్తూనే ఉన్నాయి.నీ స్క్రీన్ షాట్లు పుచ్చుకుని వీళ్ళు చేసేది ఏమిటి?నన్ను యాగ్రిగటర్ల నుంచి తీసెయ్యడం కన్న ఎక్కువ అధికారం వీళ్ళకి ఉందా?గూగుల్ వాళ్ళకి రిపోట్ ఇవ్వాలంటే అలాంటి కంటెంటూ బ్యాఖ్యలూ నీ బ్లాగులోనే ఉన్నాయి గానీ నా బ్లాగులో లేవే!నీ స్క్రీన్ షాట్లు కూడా నీ బ్లాగు కంటెంటే కదా!

    చిరంజీవి మిగతా బ్లాగర్లకి మోడరేషన్ గురించి లెక్చర్లు దంచుతుంటే నువే మోడరేషన్ పెట్టేసుకున్నావు - సగం తగ్గావు కద, ఆ వూపులోనే ఇంకొచెం వెనక్కి తగ్గి సైలెంటయిపో.

    ReplyDelete
  10. @K.S.ChowdaryDecember 8, 2018
    తనది మాత్రమే జ్ఞానమని అజ్ఞానంతో తారా స్థాయిలో ముదిరిపోయినవాడికి... దయానందుడు ఒప్పుకున్నాడంటూ అబద్ధాలు ఎలా వ్రాస్తున్నాడో చూడండి....ఈయన గారి మట్టిబుర్రకి అర్ధమై చావలేదు. ఇంకా దక్షిణదేశపు రాజు రామనామము గలవాడా మందిరమును నిర్మింపజేసి దానికి రామేశ్వరమని పేరు పెట్టి యుండుట నిజము కావచ్చును. అని చెపితే ,,,స్వామి దయానందుని సత్యార్ధప్రకాశముగాని ఈయన చదవలేదు. నిజానికి స్వామి దయానందుడు వారు వ్రాసిన సత్యార్ధప్రకాశము పూర్తిగా చదివితే అసలు పరమేశ్వరుడు ఎవరో పూర్తిగా అర్ధమవుతుంది. ...స్వామి దయానందున్నే విగ్రహారాధనకు అనుకూలడనే మాయను చదూవరులకు కలిగించడం ఎంత దారుణం. ఈ హరిబాబు అజ్ఞానపు పాండిత్యం ఇదే.
    ప్రశ్న: రామేశ్వరమును రామచంద్రుడు స్థాపించియున్నాడు.మూర్తిపూజ వేదవిరుద్ధమగునెడల రామచంద్రుడు మూర్తి నెందుకు స్థాపించును? రామాయణమున వాల్మీకి యేల వ్రాయును?
    ఉత్తరము: రామచంద్రుని సమయమున నామందిరనామముకాని,లింగముగాని యేమియు లేకుండెను. దక్షిణదేశపు రాజు రామనామము గలవాడా మందిరమును నిర్మింపజేసి దానికి రామేశ్వరమని పేరు పెట్టి యుండుట నిజము కావచ్చును. రామచంద్రుడు సీతాదేవిని దీసికొని హనుమంతుడు మున్నగు వారితో లంకనుండి బయలుదేరి విమానము మీద గూర్చుండి యాకాశమార్గమున సయోధకు వెళ్లుచుండిరి. అప్పుడు సీతతో నిట్లనెను.
    "ఆత్ర పూర్వం మహాదేవ: ప్రసాదమకరోద్ విభు:,సేతుబంధ ఇతి ఖ్యాతం" -రామా.లంకాకాండం.
    "ఓ సీతా! నీ వియోగమున వ్యాకులుడనై నేను దిరుగుచుండెడివాడ. ఇక్కడనే చాతుర్మాస్యము చేసితిని. పరమేశ్వరుని యుపాసనా-ధ్యానము చేయుచుంటిని. సర్వత్ర విభువు-వ్యాపకుడై దేవతలకు మహాదేవుడైన పరమేశ్వరుని యనుగ్రహమున మాకు గావలసిన సామాగ్రి యంతయు లభించినది.మరియు చూడుము ఈ సేతువును బంధించి లంకకు వచ్చి రావణుని వధించి నిన్ను దెచ్చుచున్నాము.
    ఇంతకు మించి వాల్మీకి రామాయణమున నేమియు వ్రాయలేదు.
    ఆధారం: సత్యార్ధప్రకాశము-ఏకాదశ సముల్లాసము."



    hari.S.babu
    "దక్షిణదేశపు రాజు రామనామము గలవాడా మందిరమును నిర్మింపజేసి దానికి రామేశ్వరమని పేరు పెట్టి యుండుట నిజము కావచ్చును." అనేది దయానందుల వారి స్వకపోల కల్పనయే గానీ చారిత్రక యదార్ధము కాదు గదా!

    ఇతర చారిత్రక ఆధారములు లేనప్పుడు వాల్మీకి రామాయణమే పరమ ప్రమాణం కదా!రాముడు చేసిన "చాతుర్మాస్యము" అనే "ఉపాసనా-ధ్యానము" రూపు మార్చుకోకుండా ఇవ్వాళ్టికీ అనుసరించబడుతున్నది.కనీసం కలశ ప్రతిష్ఠ అయినా చెయ్యకుండా యే చాతుర్మాస్య వ్రతమూ మొదలుపెట్టరు.అది మూర్త్యారాధనకు సంబంధించినదే!

    స్వామి అద్యానద సరస్వతి ఎవరో ఆయన దేన్ని ఎందుకు వ్యతిరేకించాడో మీరు హుందువులకి పాఠాలు చెప్పనక్కర లేదు లేదు.హిందువులకి అబ్రహామిక్ మతాలమాదిరి ఇది పాటించకపోతే నువ్వు చచ్చిపోతావు,దేవుడు నిన్ను నరకంలోకి తోస్తాడు అని ఎవరూ భయపెట్ట లేదు.వేదమూ మనుస్మృతీ కూడా ఇలా చేస్తే మీకు క్షేమం కలుగుతుంది అని సలహా ఇవ్వటమే తప్ప పాటించి తీరాలనే ఒత్తిడి పెట్టలేదు.విగ్రహారాధన చెయ్యాలా వద్దా అన్న దాని గురించి కానీ బహుళదేవతారాధన శ్రేష్ఠమా కాదా అన్న దాని గురించి కానీ తప్పనిసరిగా ఇదే పాటించాలనే నియమమూ పెట్టలేదు,చెయ్యకపోతే నరకానికి పోతారని బెదిరించనూ లేదు.కాబట్టి బుర్ర తక్కువ ముస్లిములని భయపెట్టినట్టు మమ్మల్ని భయపెట్టడం మీకు సాధ్యపడేది కాదు.దయానందుడికి గానీ వివేకానందుడికీ గానీ మేము అనుచరులమో విధేయులమో కాదు.ఇది తెలుసుకుని తమరు మూసుకుంటే మంచిది.

    చిరంజీవి వై నన్ను బూతులు తిడుతుంటే చమ్మగా ఉండి మీ దురద కొద్దీ ఇరుక్కుపోయి నన్ను తిడితే లాభం లేదు.నిషేధించాల్సిన బూతుల బుంగ పాండిత్యం అంతా మీ బ్లాగు పోష్టుల దగ్గరే ఉంది.అది గమనించితే బాగుంటుంది.యాగ్రిగేటర్ల వారు చెప్పినది "కామెంటేటర్లని మేము కంట్రోల్ చెయ్యటం సాధ్యపడదు కాబట్టి ఇతరుల అభిప్రాయాలుగా కామెంట్లలోని భాషకి కూడా బ్లాగరే బాధ్యుడు!" అని కదా వారన్నది.నా బ్లాగును నేను శుభ్రంగా ఉంచుకున్నాను.చిరంజీవి వై నన్ను బూతులు తిడుతున్నప్పటి నుంచి ఇప్పటి నా కామెంట్ల వరకూ అన్నీ మీరు అనుమతి ఇచ్చి ప్రకటించినవే కదా,నన్ను బాధ్యుణ్ణి చేస్తే ఎలా?

    మరోసారి విషయాలని సమగ్రంగా తెలుకోకుండా ఇలా మీరు హడావిడి చేస్తూ నా గురించి "తనది మాత్రమే జ్ఞానమని అజ్ఞానంతో తారా స్థాయిలో ముదిరిపోయినవాడికి..." అని వాగితే సహించేది లేదు - ఖబడ్దార్!

    P.S:మీ సాక్ష్యం మేర్గజైను కంటెంట్ ఆధారంగానే మక్కా లోని కాబా గుడి దగ్గిర ముస్లిములు చేస్తున్నది కూడా వైదిక సంప్రదాయం ప్రకారం నడుస్తున్న పూర్వ ఇస్లామీయ కాలపు నాటి శివ మూర్త్యారాధనయే అని నిరూపిస్తూ ఒక పోష్టు రాస్తున్నాను.అది చదివాక మీరు హిందువుల విగ్రహారాధనని నిందించకుండా నోరు మూసుకోవడమో ముస్లిముల చేత మక్కాయాత్రని మానిపించే ప్రయత్నాలు మొదలుపెట్టడమో చెయ్యాల్సి రావచ్చు.

    ReplyDelete
  11. ఆ రాక్షసత్వం చూశారుగా!

    నాలెడ్జి లేదు,అయినా చర్చల్లో దూరాలి.ఒక్కదానికి సాక్ష్యాలు చూపించరు.గట్టిగా నిలదీస్తే ఇలా బూతులు వాగేసి తప్పుకు పోవటం.మన సంస్కారం కొద్దీ వెనక్కి తగ్గితే నేనే గెల్చేశానని డబ్బా కొట్టుకోవటంప్రజ దగ్గిర వాడు నాకు సైన్సు తెలీదూ అని దీర్ఘాలు తీసినా పల్లా కొందల రావు గారికి పంపిన మెయిల్లో అతను మంచివాడే కావచ్చు అన్నాను. అయినా వాడికి తెలియటం లేదు.ఇప్పుడు వాడి గురించి ఆ ఒక్క మాటా వాడకుండా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.

    మొత్తానికి రచ్చబండ దగ్గిర కూడా మోడరేషన్ పెట్టేలా చేశాను.మోడరేషన్ ఉన్న చోట వాడి ఆటలు సాగవు.

    ReplyDelete
  12. @Chiranjeevi YDecember 6, 2018 at 3:47 AM
    హరిబాబు గారిలో మార్పుకనిపిస్తోంది. ఇక వ్యక్తిగత ధూషణలు వంటివి తీసెయ్యడానికే నా ఓటుకూడా..
    @Chiranjeevi YDecember 8, 2018 at 2:13 AM
    పల్లెప్రపంచంలో... మారిపోయినట్టు.. పెద్దమనిషి ఫాజులు కొట్టావ్. ఇక్కడకొచ్చి నీ నోటిదూల తీర్చుకోవడం మొదలుపెట్టావ్. ఎలగోలా అందర్నీ రెచ్చగొట్టి.. నీ "ల.." భాష వాడి.. ఈ బ్లాగున్ మూపిచ్చడమే నీ లక్షం. నీ అస్సలు రూపమే ఇది.
    hari.S.babu
    --------------------------------------------
    Chiranjeevi YNovember 29, 2018 at 7:39 AM
    >>నువ్వు గ్జేవిర బ్యాచ్చిలో లేకపోతే నేను అన్నంత మాత్రాన నువ్వు గ్జేవిర బ్యాచ్చిలోకి వెళ్ళిపోయినట్టు కాదు.
    you:నీకు పాండిత్యం సున్నా అంటే మాత్రం పాండిత్యం లేకుండా పోతుందా?
    you:ఇలాంటి తలతిక్క యూటర్న్ డవిలాగులు మాట్లాడడం.. అలా దొరికి పోవడం..
    >>నీ వెనకాల్ 20 మంది అపండితులు ఉన్నది కూడా అబద్ధమని నాకు తెలుసు.
    you:ఇంకేం. అసెంబ్లీ దగ్గర ఓ చిలకేసుకోని కూర్చోని జ్యోతిష్యాలు చెప్పుకో ఫో..
    you:నువ్వు, నీ సైకో బాచ్చి.. ఎంత నాటకాలు వెసినాగానీ.. . ఎంత నీచమైన బూతులుకైనా లేస్తారు..
    you:ఇప్పటీకీ చెబుతున్నా.. జనాలందరూ విసర్జిన ఆ కంపుకొట్టే సంస్కృతాన్ని నీ ఇంట్లో బంగారుపెట్టెలో దాపెట్టుకోని వాసన చూడడం మానెయ్.. లేదూ... ఆవాసనే నీకు సమ్మగా ఉందంటావా.. అది నీ దగ్గరే పెట్టూకో.. మామీద రుద్దకు. సంఝే..
    @Chiranjeevi YNovember 29, 2018 at 8:09 AM
    థెర్మో డైనమిక్సు ప్రకారం.. ఏం లేనిదాన్ని దేవుడంటావా?? చిన్నప్పుడు సైన్సు చదివావా అస్సలు??
    "ల.. బ్లాగు.. ల..టాపిక్కు" జంపు..
    you:వేదాల్లో తప్పులుంటే చూపించు..సరిచేసుకుంటాం. కానీ... నువ్వు "వే" అనే సరికే నిన్ను "వెధవ, గ్జేవియరు బాచ్చి" అని తిడతాం.. ఇంకా పట్టించుకోకుండా ముందుకెలితే ఎలనూ నా "ల.." భాష ఉందిగా..
    --------------------------------------------
    >>నీ వెనకాల్ 20 మంది అపండితులు ఉన్నది కూడా అబద్ధమని నాకు తెలుసు.
    ఇంకేం. అసెంబ్లీ దగ్గర ఓ చిలకేసుకోని కూర్చోని జ్యోతిష్యాలు చెప్పుకో ఫో..
    >>అవి ఉన్నాయని నువ్వు చూపించాలి.అపుడు లెంపలేసుకుని మార్చుకుంటాం.
    నేను సంస్కృతం ఊడబొడిచానూ... నా వెనక వేదాల్లో ఉద్దండ గండ బేరుండ పిండాలు ఉన్నారూ.. అని చెప్పుకునే నీకు, ఆ సోమరిపోతులకి వేదాల్లో ఇంద్రుడు తిన్న ఆవు ఎముకలు ఎందుకు కనపిచ్చట్లా? కల్లకి మతం పొరలు కమ్మాయి కాబట్టి.
    Me:ఈ రెండు కామెంట్లలో తప్పుకుపోవడానికి ఏడ్చిన ఏడుపు ఇదనీ నీకు పాండిత్యం లేకపోవటమే కాదు,ఇలాంటి యేడుపు వల్ల నీకు పాండిత్యం లేదని అందరికీ తెలుస్తుందనే కామన్సెన్సు కూడా లేదని తెలుస్తున్నది గద.
    Haribabu SuraneniNovember 29, 2018 at 8:39 AM
    కొండల రావు గారూ!
    చిరంజీవి వై "అయ్యా యూటర్న్ హరిబాబూ.." కామెంటు వరకు చర్చ చాలా బాగా నడిచింది.నిక్కచ్చిగా చెప్పాలంటే "అద్భుతంగా నడిచింది!" అనే చెప్పాలి.
    ...
    ప్రజలో జరిగే చర్చ నన్నూ చిరంజీవి వైనీ సంతృప్తి పరిస్తే సరిపోదు.చర్చ నడుస్తున్నప్పుడూ పూర్తయ్యాకా విజిటర్స్ సంతృప్తి పడాలి.అప్పుడే మీకూ సంతృప్తి ఉంటుంది, అవునా?ఆ కోణం నుంచి చూస్తే చిరంజీవి "అయ్యా యూటర్న్ హరిబాబూ.." కామెంటు వరకు చాలా అద్భుతంగా నడిచింది.చిరంజీవి వై మీద కూడా నాకు ద్వేషం ఏమీ లేదు.తెలివైన వాడే, మంచివాడే అనిపిస్తుంది.
    ...
    భవదీయుడు
    హరి.S.బాబు
    ----
    దీని తర్వాత నువు ప్రజ దగ్గిర ఏసిన రెండు కామెంట్లలోని భాషనీ గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ రచ్చాబంద దగ్గిర నీ కామెంట్లలోని భాషనీ పక్కపక్కన పెట్టి చూసుకుంటే కొండల్రావు గారు ఎక్కడ ఆధారాలు చూపించమని నిలదీస్తారో అని భయపడి మారినట్టు నటించి మళ్ళీ నీ కొలీగు బ్లాగు దగ్గిర గలీజు కామెంట్లు వెయ్యటం మొదలుపెట్టింది నువ్వేనని నీకే తెలుస్తుంది.

    అబద్ధాలు చెప్తూ బతికే నీకే అంత రోషం ఉంటే నిజాలు మాట్లాడుతున్న నాకెంత రోషం ఉండాలి?మోడరేషన్ ఉంటే నోరు పెగల్దేం?మోడరేషన్ ఉంటే నన్ను అస్సలు తట్టుకోలేవు - అది తెలుసా నీకు?ఇప్పట్లా నోటికొచ్చింది వాగేసి పోవడం కుదరదు - నీ పాండిత్యం ఏమిటో చచ్చినట్టు చూపించాల్సి వస్తుంది.ఆధారాల కోసం నిలదీస్తే బిక్క చచ్చి పోతావ్!నువ్వు సైలెంట్ అయిపోయి తప్పుకుంటే బ్లాగు ఓనరైన కేయస్సీని పట్టుకుని పీడిస్తా!ఒకవేళ బూతులు వాడి డైవర్ట్ చెయ్యాలని చూస్తే ఇకముందు నువ్వు వాగిన ప్రతి బూతు మాటకి పది బూతులు వొదుల్తా?

    మనకి భయపడి యాగ్రిగేటర్ల నుంచి పారిపోయాడని సంకలు గుద్దుకునే చాన్సు మరోసారి ఇవ్వను.ఒకసారి వాడిన స్ట్రాటజీ మరోసారి వాడను.మీరు నాతో మంచిగా ఉంటేనే నేను మీతో మంచిగా ఉంటా - తోకలు ఝాడించారో, పగిలిపోద్ది!

    బస్తీ మే సవాల్!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...