Monday, 3 March 2014

యే గాడిద వెనక యెక్కినా యేముంది

సీ||   యే గాడిద వెనక యెక్కినా యేముంది
         తన్నులు తప్పవు! కడుపు చించు

         కొని పడు యాష్టయే గాని సుఖ సుఖాన

         ఉండనివ్వరు. అందరందరు తమ

         వైభవాల కొరకు, వ్యవహారములు చక్క

         బెట్టుకొనుటకే భ్రమలను చూపి

         అధికార పీఠముల కెగబాకెడి తుఛ్ఛు

         లే తప్ప కానరారేమి సాధు

తే||   సజ్జనుల రక్ష జేసెడి సాహసులు?అ

         దేమి ఆదికాలమున చేసినట్టు
         అందరికి దేవిభాగమును పంచెడి సక
         లజన హృదయాధి నాధు డొక్కడును లేడు?!
(03/03/2014)
-----------------------------------------------------------------------------------------------------------------
శ్లో|| సంగచ్చద్వం సంవదద్వం
       సంవో మనాసి జానతాం
       దేవీభాగం యధా పూర్వే
       సంజా నానా ఉపాసతే!

ఋగ్వేదం లోని ఈ మంత్రం యొక్క సారాంశ మిది -



"కలిసి నడుద్దాం.కలిసి మాట్లాడుకుందాం.కలిసి మెలిసి ఒకరి మనస్సు లొకరం తెలుసుకుందాం.మన పూర్వులు దేవీభాగాన్న్ని యెలా పంచుకునేవారో అలాంటి జ్ఞానాన్ని ఉపాసింధుదాం!"

దేవీభాగం అంటే - పసిపిల్లలకూ, దంతాలు లేని వృద్ధులకూ మెత్తని మాంసం మొదట ఇవ్వాలి.తర్వాత దౌహృదులకి - రెందు హృదయాలు ఉండే గర్భవతులకి రెట్టింపు మాంసం ఇవ్వాలి.అలా వారందరికీ పంచగా మిగిలిన మాంసాన్ని యువతీ యువకులకీ, జవసత్వాలు గలిగి సంపద పెంచే ఇతరులకీ పెట్టాలి.


ఈ మంత్రం వల్ల - ఆనాటి సాంఘిక వ్యవస్థ తీరు తెన్నులు తెలుస్తున్నాయి."ఓపిన కొద్దీ పని.అవసరం కొద్దీ అనుభవం" అనే ఆదర్శవంతమయిన సామ్యవాదానికి ఆనాటి మానవుడు యెంత దగ్గిరగా వెళ్ళాడో అర్ధం చేసుకోవచ్చు.

2 comments:

  1. ప్రయాణానికి వాహనాలుగా
    గాడిదలు మాత్రమే అర్హంగా నిర్ణయించబడినప్పుడు ...

    గాడిదల వెనుక గొర్రెలం...
    నిఖార్సైన తెలుగు గొర్రెలం...

    గాడిద, గొర్రె వెనకేనక రాదేమోనని డౌట్ పడినా
    మనకెందుకుండాలి డౌట్ మనం గొర్రెలం కాదని...

    ReplyDelete
    Replies
    1. nmrao bandi గారికి,
      కృతజ్ఞతలు,మీ కవితాత్మక వ్యాఖ్యానం బాగుంది.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...