Showing posts with label ముప్పాళ రంగనాయకమ్మ. Show all posts
Showing posts with label ముప్పాళ రంగనాయకమ్మ. Show all posts

Monday, 28 March 2016

లెఫ్టు బిహైండు పార్టీల మైండు లేని రాజకీయం - లెఫ్టోవరు వోట్ల కోసం!

          కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తాదంటారు,ఓడలు బళ్ళవుతాయంటారు,పువ్వులమ్మిన చోట రాళ్లమ్మాల్సి వస్తాదంటారు - ఈటన్నిటికన్నా దయనీయంగా పోలిక చెప్పడానికే కుదరనంత పరమ దరిద్రంగా ఉందండయ్యా భారద్దేశంలో వామపక్షాల దుర్గతి!తన రాజకీయ జీవితమంత వయస్సు లేని కన్హయ్యా కుమారుడికి నారాయణ గారు విమానాశ్రయానికి వెళ్ళి ఎదురేగి తోడ్కొని రావడం దగ్గిర్నించీ కారు డోరు తీసి పట్టుకుని హడావిడి చెయ్యడం వరకూ చేసిన మర్యాదలకి నిజంగా అతను ఉద్దరించిన ఘనకార్యం ఏమిటి?

          ఒకప్పుడు ఎట్టా వుండేవోళ్ళు?ఎట్టాంటోళ్ళు ఎట్టా అయిపోయారు!బెంగాలు కమ్యునిష్టులు "మిగతా భారద్దేశమంతా వందేళ్ళ తర్వాత ఆలోచించే విష్యాలు బెంగాలు ఇవ్వాళ ఆలోసిస్తాది" అంటే నోరెళ్ళబెట్టి చూసినోళ్లే దప్ప "ఠాట్!ఏంటి నీ గొప్ప?" అన్నోడు లేడు.ఎక్కద నలుగురు పోగయితే అక్కడల్లా ఈళ్ళ గొంతే ఇనపడేది.గత చరిత్ర గమనం గురించి ఏది ఎందుకు జరిగింది,ఏది ఎందుకు జరగలేదు,ఎట్టా జరిగితే బాగుండేది అని చిలవలు పలవలుగా కళ్ళక్కట్టినట్టు చెప్పి ఒప్పించి నమ్మించగలిగిన తెలివి అంతా యాడికి బొయ్యిందో పాపం!

          జరిగిన దాన్ని గురించి ఎందుకు జరిగిందో చెప్పడానికి ఏ చిలక జోస్యమూ అక్కర్లేదు,ఏ పాండిత్యమూ అక్కర్లేదు,ఫ్యూచరు గురించి చెప్పండ్రా అంటే మాత్రం గుడ్లు తేలేస్తారు - అబ్బే విప్లవం అంటే వీజీ కాదు అని డబ్బాయిస్తారు!సైన్సు ఫిక్షన్ రచయితల పాటి కూడా నిక్కచ్చిగా చెప్పలేరు గానీ వాళ్లు జరుగుతుందనుకున్నది జరక్కపోయినా జరగదనుకున్నది జరిగినా కవరప్ చేసుకోవడానికి పనికొచ్చే చారిత్రక తప్పిదాలకి కారణాలు మాత్రం భలేగా  వండి వారుస్తారులే!

          మీ లక్ష్యం ఏమిటయ్యా అంటే అందర్నీ వర్గరహితసమాజంలో నిలబెట్టడం అని చెప్పడం వరకూ ధీమాగానే చెప్తారు గానీ అదెట్టా ఉంటుందీ అని నిలదీస్తే మాత్రం నత్తినత్తిగా విసుక్కుంటారు, గట్టిగా అడిగితే అడ్దం తిరిగి నువ్వు విప్లవద్రోహివి అర్ధమయ్యే నటిస్తున్నావు అని మనకే పువ్వులు పెడతారు,అదేంటో!పోనీ అడిగేవోడు అర్ధమయ్యే ఎటకారం ఆడుతున్నాడని అనుకుందాం,తనకి తెలివితక్కువగా అనిపిస్తేఅనే గదా ఎటకారం ఆడేది ఎవడయినా - నీ తెలివైన సిద్ధాంతం గురించి ఇంకొంచెం తెలివిగా చెప్తే ఎట్టా ఉంటది!అసలు పూర్తిగా విడమరిచి చెప్తే ఎటకారం ఎందుఒస్తుందీ అంట!బుద్ధుడి లాంటి సన్నాసుల మాటల్నే నమ్మినవాళ్ళు వీళ్ళ మాటల్ని ఎందుకు నమ్మటం లేదు?ఇంతకుముందు ఎవరూ చెప్పని కొత్త సిద్ధాంతం అంటారు, కొత్తది గాబట్టే అర్ధం కాకనే గదా అడిగాం, పూర్తిగా తెలుసుకోకుండా పరిగెత్తుకుని పోయి అగ్గిలో దూకటానికి మనమేం వేముల రోహిత్ లాంటి ఎర్రిపప్పలమా?

         కాలేజీలో క్లాస్ పుస్తకాలు తప్ప ఇంకోటి చదవకుండా ర్యాంకులు తెచ్చుకుని ఘనమైన యూనివర్సిటీలో రీసెర్చి స్కాలరుగా చేరేవరకు పెద్ద ఉద్యోగం చెయ్యాలనే రంధి తప్ప ఇంకేమీ లేనివాడు వీళ్ళ పైత్యపు కబుర్లకి లొంగి ఎట్టా అయిపోయాడో చూదండి.కార్ల్ సగన్ లాగ సైంటిష్టు కావాలనుకున్న వాడు టెర్రరిస్టుల్ని సమర్ధించి గూండాగిరీకి కూడా దిగజారి కోర్టుకేసులో ఇరుక్కుని రాజీ చెసుకుందామనుకున్నప్పుడు కధ తిరిగిన ట్విస్టుకి తన చుట్టూ తను వూదుకున బుడగ బరెస్టయ్యి తను హీరోయిజం అనుకున్న వేస్టు బతుక్కి డెంటిస్టు కూడా కాలేనని తెలిసి బతుకంటే ఇంటరెస్టు పోయి ట్రూరెపెంటెన్సు పుట్టిన ట్వెంటీఫోరవర్సు కూడా గడవకముందే అన్రెస్టు ఎవరెస్టంత పెరిగి సెటైరు కోసం వీసీని ఉరితాళ్ళు అడిగిన మేతావి నిన్నటివరకూ తను జండాలా ఎగరేసిన గుడ్డనే ఉరితాడుగా వాడుకుని మోస్ట్ సింబాలిక్ చావు చచ్చాడు!రేపు ఈ కన్హయ్యా ఏ జఫ్ఫయ్యా అవుతాడో?

ఒకడేమిటో వాడి చావు చెబుతుందంటారు, వాడి బతుకులో ఉన్న కంఫ్యూజనే చావులోనూ ధగధ్ధగాయమానంగా ప్రకాశిస్తున్నది!రాసి కొట్టేసిన భాగం కొంత ఉందని తెలియని కాలంలో చదివిన ఆఖరి ఉత్తరం చదివి నేను చాలా ఫీలయ్యాను.కానీ,రాసి కొట్తేసిన భాగం చదివాక మళ్ళీ కంఫ్యూజన్ కూడా అదే స్థాయిలో మతి పోగొట్టేసింది.The letter purportedly written by Rohith Vemula, the Dalit scholar of University of Hyderabad, before he committed suicide, has been sent to the forensic lab for analysis as reports emerged about an entire paragraph that had been scratched off the note. On close examination, the portion of the note that Vemula, perhaps on second thoughts, decided to keep concealed, reads: "ASA, SFI, anything and everything exist for their own sake. Seldom the interest of a person and these organisations match. To get power or to become famous or to be important in between boundaries and to think we are up to changing the system, very often we overestimate our acts and find solace in traits. Of course I must give my credit to these both groups for making introducing me to wonderful literature and people. (sic)" According to media reports, this part of the letter is reflective of the sense of futility that the scholar felt in being associated with the student unions.చచ్చిపోయటప్పుడు విరక్తి కన్నా భావుకత్వం పొంగిపొర్లడ మేంటి?అంత ఘాటుగా యూనియన్లని ఉతికినవాడు ఎందుకు కొట్టేశాడు?కొట్టేసినవాడు పనిగట్టుకుని ఇది నేనే కొట్టేశాను అని పక్కన రాసి సంతకం చెయ్యడ మేంటి?ఈ రాసి కొట్టేయ్యడం, మళ్ళీ పక్కన నేనే కొట్టేశానని సంతకం చేసినవాడు అయితే పిచ్చివాడయినా అయి ఉండాలి,లేదంటే అతి మంచివాడయినా అయి ఉండాలి!మొదట మనసులో దాచుకోకుండా ఉన్న నిజాన్ని కక్కేశాడు,తర్వాత తీరిగ్గా ఆలోచించి కొట్టేశాడు.ఏమని ఆలోచించాడు?మరీ అంత దుర్మార్గంగా తిడితే తన ఫ్రెండ్సు రేపటి నుంచీ ఇలాంటి హీరోయిజం చూపించటానికి ఇబ్బంది పడతారని అనుకున్నాడు కాబోలు!అంటే,తను వేటికి విరక్తి పుట్టి చచ్చిపోతున్నాడో అవి తన ఫ్రెండ్సు ఆపకుండా చెయ్యాలని అనుకున్నాడు కాబోలు!అదీ గాక,తన శవాన్ని మొదట తన ఫ్రెండ్సే చూస్తారనీ,పోలీసులు ఈ పార్టు కొట్టేసింది తను కాదని తన ఫ్రెండ్సుని అనుమానిస్తారేమోనని జరగబోయేదాన్ని కూడా వూహించి తన చుట్టూ ఉన్నవాళ్లకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఒక రోజు క్రితం వరకు అంత ధైర్యంగా ఉన్నవాడు ఆ ఒక్క రోజులో అంత డీలా పడిపోవడం ఎవరివల్ల జరిగిందో వాళ్ళని తన  చావు వల్ల కూడా ఇబ్బంది పడనివ్వకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవటం - ఇంత గందరగోళపు చావు నేనెక్కడా చూళ్ళేదు?!

          ఆ చావే అంత గందరగోళంగా ఉంటే దీన్ని క్యాష్ చేసుకుని పాప్యులారిటీ పెంచుందామనుకున్న ఎరుపు కైపెక్కిన వాళ్ళ గందరగోళం మరింత గందరగోళంగా ఉంది.వాడు స్పష్తంగా "నేను ఆతమహత్య చేస్కుంటున్నాను.నా చావుకి ఎవరూ బాధ్యులు కారు." అని రాసిపెట్టి చచ్చిపోతే అది హత్య అనీ హంతకుల్ని శిక్షించాలనీ అల్లరి చహెశారు,చేస్తున్నారు,చేస్తారు.నిజంగా హంతకుల స్థానంలో ఎవర్నయిన అనిలబెట్టాలంటే  65464 మరియూ 6666 వాళ్లనే నిలబెట్టాలి!ఎందుకంటే,తన రాసి కొట్టేసిన భాగంలో ఎవరి గురించయినా నెగటివ్ ధోరణిలో రాశాదంటే అది వాళ్ల గురించే,మరి వాళ్ళని హంతకుల స్థానంలోకి ఎవరు తీసుకొచ్చి నిలబెదతారు?


          ఇప్పటివరకు రోహిత్ గురించి చర్చించిన వారిలో ఏ ఒక్కరికీ రోహిత్ స్టైపండ్ ఎందుకు ఆగిపోయింది అనే అనుమానం రాలేదు,ఎందుకని?మీడియా యూనివర్సిటీ అధికార్లని అడిగీతె “పేపరు వర్కు వల్ల జాప్యం” అనే ఒక ముక్క మాత్రమే బైటికి వచ్చింది.అధికార్లు విషయం వివరంగానే చెప్పే ఉంటారు,కానీ మొత్తం చెబితే రోహిత్ మీద సానుభూతీ తమ MRTP కొసెం సెన్సేషనూ పుట్టవని కాబోలు మీడియాలో ఎవరూ దానిగురించి ఎక్కువగా కవర్ చెయ్యలేదు.రోహిత్ అక్కడ రీసెర్చ్ వర్కుకి ఎన్రోల్ అయ్యాడు. రీసెర్చ్ వర్కు అంటే ఎన్రోల్ అవటం ఒక్కటేనా ముఖ్యం.వర్క్ చెయ్యాలిగా,చెసినట్టు రిపోర్ట్స్ ఇవ్వాలిగా.నెలవారీ ప్రోగ్రెస్ మదింపు చెయ్యాలని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏమిటో ఇక్కడ వివరంగా చదవవచ్చు.6వ సెక్షనులో అటెండెన్సుతో కలిపి రీసెర్చ్ వర్కుకి సంబంధించిన వివరాలు చూదొచ్చు,7వ సెక్షనులో స్కాలర్షిప్పులకి సంబంధించిన నెలవారీ మదింపు గురించిన నియమాలు చూడొచ్చు.స్కాలర్ షిప్ కూడా ఎన్రోల్ అయితే చాలు వర్క్ చేస్తున్నాడా లేదా అని చూడకుండా నెలనెలా ఇస్తూనే ఉంటారా తేరగా?వాళ్ళకి స్కాలర్షిప్ పేరుతో ఇచ్చేది ప్రజాధనం,కూర్చోబెట్టి మేపడానికి స్మృతి ఇరానీ గానీ జైట్లీ గానీ వాళ్ళ జేబులోనుంచి తీసి ఇవ్వరు కదా!అధికారంలో రాహుల్ గాంధీ ఉన్నా, హరగోపాల్ ఉన్నా,కంచె ఐలయ్య ఉన్నా తన జేబులోనుంచి ఇస్తాడా?ఆ రీసెర్చ్ వర్కుకి అటెండెన్సు ఉంటుంది,ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉంటాయి. కార్ల్ సేగన్ కొటేషన్లు చెప్తూ ప్రకృతిని గురించి చెప్పిన కబుర్లన్నీ గాలికొదిలేసి 24 గంటలూ ల్యాబులో ఉంటే ఉద్యమానికి టైము సరిపోవటం లేదని సైన్సు గూపు నుంచి ఆర్ట్స్ గ్రూపుకి మారాడు.ఇక్కడ కూడా ఈ ఉద్యమాల కోసం తిరుగుతూ అటెండెన్సు బొక్క పడి ఉండవచ్చు,ప్రోగ్రెస్ రిపోర్టులు సబ్మిట్ చెయ్యటం తనవైపునుంచే ఆలశ్యం అయి ఉండవచ్చు! ఇతను పేపర్లు స్బ్మిట్ చెయ్యడం అంటూ జరిగితే స్టైపండ్ ఆపటానికి వాళ్ళకీ దమ్ములు ఉండవు – కోర్టుకీడ్చి ముక్కుపిండి రెట్టింపు వసూలు చేసుకోవచ్చు,అవునా కాదా?బతుకులో బాధ్యత లేనివాడు చావుతో వీరాధివీరుడిగా కొనియాడబడుతున్నాడు?ఈ ముక్క నేను సారంగలో కామెంటుగా వేస్తే మొదట కొంతసేపు ఉంచారు,తర్వాత తీరిగ్గా ఒకరు రోహిత్ స్టైపండ్ ఎందుకు ఆగిపోయిందో అనుమానించండి అంటూ సులువుగా, హేళనగా ప్రశ్నిస్తున్న హరిబాబు గారు, రోహిత్ ఊపిరి ఎందుకు అర్ధాంతంగా ఆగిపోయిండి అనే మౌలిక ప్రశ్న కూడా ఈ దేశాన్ని అత్యున్నత స్థానం నుండి అణగారిన వెలివాడల వరకూ ప్రశ్నిస్తూనే ఉంది. అంటూ నాకు ఉబోస ఇచ్చాక వారి ఉబోసని ఉంచి నా కామెంటుని తీసేశారు,ఏమి నిష్పక్షపాతం ఈ ఎర్ర మేధావులది?అక్కడికి నేను జాలీదయా లేని కఠినుణ్ణీ,వీరు మాత్రమే కరుణామృతహృదయులైనట్టు,అంత జాలి ఉంటే నాచావు నన్ను చావనివ్వండి అన్న చచ్చినోడి వేదనని అరణ్యరోదన చెయ్యరు కదా, రంగరంగ,!

          ఇప్పుడు రాజద్రోహం కేసులో జైలుకెళ్ళొచ్చిన కన్హయ్యా కూడా ఇంకా రోహిత్ చావు కుట్ర కిందే లెక్కేస్తున్నాడు.పది రోజుల క్రితం సుశీల్ కుమార్ అనే సాటి విద్యార్ధిని తను అంతకుముందు వివేకానందుడితో సహా ఎవ్వర్ని బడితే వాళ్ళని గురించి తను వాడిన మాటల్తో పోలిస్తే చాలా చిన్న మాటని వాడితే అర్ధరాత్రి 3 గంతల టైములో నలభైమందిని పోగేసుకుని పోట్లాడగలిగిన వాడిమీద ఎగస్పార్టీ వాళ్ళు కుట్ర చెయ్యగలరా?కుట్ర అంటే పక్కన జేరి మాయమాటలు చెప్పి వీలు చూసుకుని చంపటం - ఆ ఆవకాశం ఉంటే గింటే ASAలో  ఉన్నవాళ్ళకే ఉంటుంది గానీ బయటివాళ్ళకి అతన్ని కుట్రపూరితంగా చంపటం సాధ్యమా!కుట్ర కేసు పెట్టాలన్నా ASA వాళ్లనే బుక్ చెయ్యాల్సి ఉంటుంది,ఏంటి వీళ్ళ బుర్ర తక్కువ వాగుడు!

          మనం బలానికి బూస్టూ వయాగ్రా వాడినట్టు వీళ్ళకి వూపు రావాలంటే ఎరుపు కనబడుతూ ఉండాలేమో!అందుకే ఇలా జనాన్ని విడదీసి ఒకడి మీదకి మరొకణ్ణి ఎగదోసి రక్తపుటేరులు పారిస్తున్నట్టున్నారు.ఇద్దరు సఖ్యంగా ఉన్నవాళ్లని విడదియ్యాలంటే ఏం చెయ్యాలి>ఇద్దర్లో దద్దమ్మ ఎవడో కనిపెట్టి,మెల్లగా వాణ్ణి బుట్టలో వేసుకుని,రెండోవాడి మీద అబద్ధాలు చెప్పి నమ్మించాలి!అది చాలు విన్నవాడు అవతలివాడు తనకి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా చేస్తున్నట్టు తనని తనే జస్టిఫై చేసుకుంటూ అవతలి వాడిమీద దాడి చెయ్యటానికి!వాళ్లలో ఎవడు గెలిచినా పర్లేదు వీళ్ళకి,వీళ్ళు సృష్టించిన రెండు వర్గాల్లో ఒక వర్గం పూర్తిగా నశించిపోతే ఇంక అక్కడ మిగిలింది వర్గరహితసమాజమేగా!

          వాళ్ళేమి కోరుకుంటున్నాఓ మనకి స్పష్టంగానే తెలుస్తున్నది,కానీ వాళ్ళకి తెలుస్తున్నదా!టెర్రరిస్టుల్ని అమరవీరులుగా చిత్రించటానికీ, ఇంటికో టెర్రరిష్టుని పుట్టించమని దేశంలోని తల్లిదండ్రులకి విజ్ఞప్తుల్ని చెయ్యనివ్వటానికీ, ఈ దేశాన్ని ముక్కలు చెయ్యండని విదేశీయుల్ని ఆహ్వానించడానికీ, ప్రపంచ దేశాలు గుర్తించిన భారత భూభాగంలో విదదీయరాని భాగమైన కాశ్మీరు గురించి నోటికొచ్చినట్టు వాగడానికీ అనుమతిస్తేనే నిజమైన భావస్వాతంత్ర్యం, అంతేనా?వాళ్ళు భావస్వాతంత్ర్యాన్నే కోరుకున్నారు గాబట్టి అందులో తప్పేమీ లేదని కొందరు గోడమీదిపిల్ల్లులు వాదించదలుచుకుంటే వాళ్ళకి కూడా కలిపి ఈ మేధావులకి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను.ఏ విధమయిన అనుమానమూ లేకుండా వాళ్ళు ఉగ్రవాదులని మీకు తెలుసు వాళ్ళు ఈ దేశాన్ని విచ్చిన్నం చెయ్యాలని దొంగతనంగా సరిహద్దులు దాటి వచ్చి ఈ దేశప్రజల్లో కొందర్ని హతమార్చడమూ మీకు తెలుసు..అయినా సరే,భావస్వాతంత్ర్యం పేరుతోనూ,మరొక రకం తిక్క విశ్లేషణ తోనూ ఇవ్వాళ ఒక ఉగ్రవాదిని నువ్వు అమరవీరుణ్ణి చేసి పొగిడితే రేపు పదిమంది పుట్టరా?నీ చేతల మూలంగానే ఇవ్వాళ్టి రోజున ఉగ్రవాదానికి నువ్వు సపోర్టు ఇస్తూ మళ్ళీ రేపటి రోజున ప్రభుత్వాన్ని ఉగ్రవాదాన్ని నిరోధించడంలో విఫలమైందని విమర్శిస్తావు - నువ్వు నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా,మరొకటా?

          ఒక పిచ్చి డాక్టరు రోహిత్ చట్టం కావాలంటాడు,ఒక శర్మ హిందూ ఫాసిజం అంటాడు,ఒక రాజు    ఈ కుర్రాళ్ళని చూస్తుంటే మళ్ళీ నా కుర్రతనం వస్తునదంటాడు,ఒక భాస్కరుడు భావజాల యుద్ధం అంటాడు - ఏమిటి వీళ్ళ పాండిత్యం!రోహిత్ చట్టంలో ఎలాంటి సెక్షన్లు ఉండాలో స్పష్టత ఉందా?ఇంటికో యాకూబ్ మెమన్ పుడితే వాళ్ళు వీళ్ళని వొదుల్తారా?రోమిల్లా డప్పారు ఇన్నేళ్ళు వినిపించిన ఆర్య-ద్రవిడ సిద్ధాంతం దగ్గిర్నుంచీ కమ్యునిష్టులు చెప్పిన అబద్ధాలన్నీ ఒకటొకటిగా బయటపడుతుంటే ఇవ్వాళ వీళ్ళు చెప్పే కొత్త అబద్ధాల్ని ఎవడు నమ్ముతాడు?

          "If you can't explain it simply, you don't understand it well enough." - Albert Einstein.వీళ్లలో ఉన్న గందరగోళానికీ,ఈ తలాతోకా అలేని చెత్త వాగుడికీ కారణం అదే!ఇన్నాళ్ళూ నెహ్రూ వారసత్వం పుణ్యాన యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా చేరి చెప్పిన అబద్ధాలన్నీ బయటపడుతుంటే ఎట్లా సమర్ధించుకోవాలో తెలియని గనదర్గోళంలో ఉన్నారు వీళ్ళంతా!నేనో మీరో పనిగట్టుకుని తప్పులు పట్టనక్కర లేదు,కొంచెం బుర్రంటూ ఉపయోగిస్తే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ మాటల్లో ఉన్న బేఖారీతనం!రాణి శీవశంకరశర్మ అనే ఒక దుర్బ్రాహ్మణుడు చూదండి ఎంత నీచంగా అవమానించాడో నన్ను!పనిగట్టుకుని సంభాసహణకి పిలిచి నేను అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండా నన్ను హిందూ ఫాసిస్టు అంటున్నాడు,ఇలాంటి అధమసంస్కారం గలవాళ్ళు ఎంత ఎక్కువ ద్వేషం వెళ్ళగక్కితే అంత ఎక్కువ మేరకు హైందవధార్మికక్షాత్రం పదునెక్కుతుంది."Anger is an acid that can do more harm to the vessel in which it is stored than to anything on which it is poured". - Mark Twain.వీళ్ళలో ఉన్న అసహనమే వీళ్ళకి అంతటా ఉన్నట్టు కనబడుతున్నది.కానీ,గత నూరేళ్ళుగా వీళ్ళు వండివార్చిన ద్వేషపు ప్రభావం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల్ని ఏమాత్రం కదిలించలేక పోయింది.ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్ధించి ఈ దేశాన్ని నిలువునా చీల్చినా,ఇన్ని దశాబ్దాలుగా మతకలహాల్ని రెచ్చగొట్టినా ఆ కొద్దిరోజులు గనదరగోళానికి గురయినా నిజం నిలకడ మీద తెలియటంతో జనం ఐకమత్యంగానే ఉన్నారు,ఉంటారు!


          శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గా,మస్తాన్ వలి దర్గా,షేక్ దావూద్ వలి దర్గా - నెల్లూరు జిల్లాలో ఈ మూడు అత్యంత ప్రముఖమైన దర్గాలు.వీటిని ముస్లిములతో పాటూ హిందువులు కూడా సందర్శిస్తారు - ఎంతో భక్తిగా!కడపలో పెద్ద దర్గా అని పిలుచుకునే అమీన్ పీర్ దర్గా ఉంది.ఈ దర్గాను స్థానికులు పెద్ద దర్గా అని పిలుస్తారు.ఇది మతాలకు అతీతంగా ఉంటూ హిందువులు,ముసిములు,క్రైస్తవులు నిత్యం సందర్శించడం వల్ల మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది.ఇవే కాదు,మొత్తం భారతదేశంలో  చాలా చోట్ల ఉన్నాయి,ఈ ప్రాంతాల్లో ఎక్కడా హిందువుల మధ్యా ముస్లిముల మధ్యా చిన్నపాటి గొడవలు కూడా లేవు.ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఇమాం బేగ్ బావి ఉంది.ఇది రామభక్తుడైన ఇమాం బేగ్ గారు యాత్రికుల సౌకర్యం కోసం కట్టించినది.అందువల్ల ఈ దేవాలయంతో ముస్లిములకు కూడా ఆధ్యాత్మికమైన అనుబంధం ఏర్పడింది.తిరపతి బాలాజీ అయితే బీబీ నాంచారు మూలంగా ముస్లిములకి కూడా ఇష్టమైన వాడే!మొన్నామధ్యన ఒక ముస్లిం కుర్రాడు వాళ్ళ నాన్న మొక్కుకుని బతికుండగా తీర్చలేకపోయాదని చెప్పి స్వామివారికి సువర్ణపుష్పాలు సమర్పించి వెళ్ళాడు.బహుశా ఇకముందు వీటిమీద కూడా సూడో సెక్యులరిష్టుల కన్ను పడితే వాటిని అట్లా ప్రశాంతంగా ఉండనివ్వరేమో?

          మీకా భయం అక్కర్లేదు!వెటి దగ్గిరకెళ్ళీ రాజకీయం చెయ్యదలుచుకుంటే హిందూ భక్తులూ,ముస్లిం భక్తులూ జాయింటుగా విరుచుకుపడి కీళ్ళు విరిగేలా తన్ని పంపిస్తారు.ఎందుకంటే ఇప్పుడు మీడియాకెమేరాల ముందు హడావిడి చేసేవాళ్ళూ,పత్రికల్లో విషపురాతలు రాసి పేరు తెచ్చుకుంటున్నవాళ్ళూ అసలు సమాజంలో కొస్తే ఎంతటి అనామకులంటే వీళ్ళ పక్కింటివాళ్ళకే వీళ్ళెవరో తెలియదు - నిజం!ఈ అయిదు ఖండాల భూమి మీద అంగుళం మేరలో కూడా దోపిడీ అనేది లేని ప్రపంచాన్ని సృష్టించే మహదాశయంతో ఉర్రూతలూగిపోతూ ఎప్పుడో స్థాపించబోయే వర్గరహితసమాజం గురించి చింకి లెక్చర్లు దంచుతూ యూనివర్సిటీ సెమినారు హాళ్ళలో వేముల రోహిత్ లాంటి పిచ్చపుల్లయ్యలతో చప్పట్లు కొట్టించుకునేవాళ్ళు తమ ఇంటిపక్కనే ఉన్న రేషన్ షాపులో జరుగుతున్న చిన్నపాటి దోపిడీని కూడా అరికట్టలేకపోతున్నారు, ఎందుకని?సిద్ధాంత బలం లేకనా,మంది చాలకనా,వాళ్ళ వీధివాళ్లకి వర్గరహితసమాజం అక్కర్లేకనా,వీళ్ళకి తగినంత వూపు రాకనా - ముహూర్తం బాలేకనా!రోమిల్లా ఆంటీ తన అబద్ధాల చరిత్ర అటకెక్కేసరికి "who cares now?" అంటూ తెల్లముఖం వేసి తోక ముడిచింది,ముగ్గు బుట్ట ముసిల్ది మురమ్నా మామ్మ మిగిలుంది తుక్కు రేగ్గొట్తించుకోవటానికి - ఆ తర్వాత నారాయణలూ సీతారాముళ్ళూ చేసుకోవాల్సింది చెక్కభజనె:-)

          కమ్యునిష్టులకి అసలు సంగతి తెలియడం లేదు,మోడీ వీళ్ళ వల్లే అధికారంలోకి రాగలిగాడు - నిజం!మీకు అనుమానంగా ఉంటే నేను ఎప్పుదో రాసిన చిత్రమైన గొప్పవాళ్ళు పోష్టులో మోదీ గురించి రాసిన విశ్లేషణ చదవండి.కమ్యునిష్టులకి నేనొక ఉబోస ఇస్తున్నా "ఇవ్వాళా రేపూ కూడా మోదీకి ంకా  బలం పెంచటానికి తప్ప మీ ప్రస్తుత రాజకీయ వ్యూహాలు మీకు మేలు చెయ్యవు" అని - వింటారా?వినరా!అది విన్నా వినకపోయినా మీకో ఝలక్ ఇది:

మీ పుర్రచెతిని అడ్డుపెట్టి హైందవసూర్యోదయాన్ని అడ్డుకోలేరు - ఎరుపు వెలిసిపోతే మిగిలేది కాషాయమే!

Thursday, 14 January 2016

ఈ మురమ్నా భక్తుడికి అర్ధవంతమైన చర్చలు కావాలట!నేను అడిగిన సూటి ప్రశ్నలని పబ్లిష్ చేసి జవాబు చెప్పడేంటి?నా కామెంట్లలో నన్ను తిట్టడానికి పనికొచ్చేవి మాత్రమే పబ్లిష్ చెయ్యడం ఏమి సంస్కారమో?!

      అనగనగా ఒక బ్లాగు పేరు "వేణువు",బ్లాగరు తన పేరు "వేణు"కి "వు" చేర్చి పెట్టుకున్నాడు.పేరు చాలా సుకుమారంగా ఉంది కానీ అక్కడ వినబడే రాగాలు మాత్రం కర్ణ కఠోరమైనవి.ఆయన నాస్తికుడు.ముప్పాళ రంగనాయకమ్మకి వీరాభిమాని.నాస్తికుడిగా ఉండటంలో తప్పు లేదు,తనకి నచ్చిన రచయితని విపరీతంగా ఆభిమానించటమూ తప్పు లేదు = తన అభిమానాన్ని ప్రకటించుకోవటానికి ఇతర్లని పనిగట్టుకుని నొప్పించనంతవరకూ తన ఆభిమాన రచయితకి వీరపూజలు చేసినా అది అతని స్వంత విషయం కాబట్టి ఎవరూ తప్పు పట్టాల్సిన పని లేదు!అయితే, ఎవరయినా వ్యక్తి చనిపోయినప్పుడు "మా చచ్చిన గేదె కొమ్ములు చారెడు" అన్న సామెత ప్రకారం చనిపోయింది గర్భశత్రువైనా అతని గురించి అవాకులూ చెవాకులూ పేలడు సంస్కారం ఉన్నవాడు,ఎంత చెడ్డా పోయిన వాణ్ణి ఏం తిడతాం అని వెతికి వెతికయినా రెండో మూడో మంచి మాటలే చెప్తాడు,లేదంటే నాకతని గురించి తెలీదు నన్నడక్కండని తప్పుకుంటాడు.కానీ ఈయన బాపు చనిపోయినప్పుడు ఒక పోష్టు వేశాడు.బాపు బొమ్మలు బాగుంటాయి,శ్రీ శ్రీ కవితలక్కూడా బొమ్మలు వేశాడు అని మెచ్చుకుంటూనే విషవృక్షానికి బొమ్మలు వెయ్యడానికి మురంనా చెక్కు పంపిస్తే "రామ రామ" అని రాసి తిప్పి పంపడం గురించి ఎత్తుకున్నాడు - అసలు జరిగింది ఏమిటి అని సాగదీస్తూ.భాషలో బూతులు లేవు గాబట్టి తను సంస్కారం గలవాడినే అని ఈయన అభిప్రాయం అన్నమాట!కొందర్ని గురించి "వాడు నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించే రకం" అంటాం గదా,మరి ఆ మనిషి నవ్వుతున్నాడు గాబట్టి అతని మాటలు వెక్కిరింత కాదు అని అంటాడా ఈయనగారు?

      వెనకాల రాయడంలో తప్పేమి వుంది?బాంకు వాళ్లే ఇప్పుడు ఫోను నంబర్లు అవీ రాయమంటున్నారుగా! ఒకసారి ఒక వ్యక్తికి పంపించిన చెక్కుని గానీ డీడీని గానీ మరొక వ్యక్తికి పంపించటం కుదురుతుందా?అతను స్వీకరించనప్పుడు అదెటూ చెల్లనిదే అవుతుంది గదా!జాలి పుట్టి తన జాలిని వ్యక్తీకరించటం కోసమే అలా రాశాను అన్నప్పుడు ఇంక గొడవముంది?రంగనాయకమ్మ గారికి నచ్చింది ఆమె ..రాసుకున్నారు బాపు గారికి నచ్చింది ఆయన రాసుకున్నారు .తను రిజెక్ట్ చేయడానికి తను రయాల్సింది రాసారు .... దానికి అబ్యంతరం ఈయనకి ... ఎందుకు!!ఒక డీడీ.దానిని బాపుగారు తిరస్కరించారు. ఆయన కారణాలు ఆయనవి.డీడీ పంపిన రంగనాయకమ్మగారు విషవృక్షం ఎందుకు వ్రాసారు? ఆవిడ కారణాలు ఆవిడవి.ఒక డీడీని ఒకవ్యక్తికి పంపాక అది అందుకున్న వ్యక్తి స్వంతమే అవుతుంది. దానిని ఆయన ఏమైనా చేసుకోవచ్చును. బ్యాంకువారు తిరస్కరించే ప్రమాదం లేని విధంగా వీలైతే ఏదన్న వ్రాయవచ్చును కూడా దాని మీద. దానిని కళ్లకద్దుకుని సొమ్ము చేసుకోవచ్చును. పటం‌ కట్టుకుని దాచుకోవచ్చును. లేదా దానిని చించి పోగులు చేసుకోవచ్చును. ఇతరులకు విమర్శించటానికి ఏమీ లేదు. చివరికి డీడీ ఇచ్చిన వారు కూడా ఇక్కడ ఇతరులే. అలాగే సదరువ్యక్తి దానిని తిప్పి పంపవచ్చును - ఐనా అది అది ఎవరిపేరున ఇవ్వబడిందో వారి ఆస్తి మాత్రమే. అది వద్దని తిరస్కరించే హక్కుంది కదా. తిరస్కరించి చెల్లకుండా చేయకూడదని అనలేరు. అలాగే ఆ డీడీ మీద ఏమీ వ్రాయకూడదని రూలేం లేదు - దాని స్వంతదారు ఇష్టం ఈ‌ విషయంలో. ఏమీ వివాదం లేదిక్కడ.‘రామదాసు గుణం వ్యక్తపరచుకున్నాడు’అంటే, బాపు గారు ‘రామదాసు’ అని తెలిసే ఆవిడ పంపిందన్నమాట. బాపుగారు చేసిన తప్పేమీ లేదు. టిట్ ఫర్ టాట్. అచ్చతెలుగులో చెప్పాలంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ. బాపు గారు చేసింది తప్పనే మీ వాదన నిజమైతే.. ఆయన ‘రామదాసు’ అని తెలిసి కూడా అడగడం ఆవిడ తప్పు. ఈయన్ది తప్పనే ముందు ఆవిడది తప్పని ఒప్పుకోవాలి.ఇంత స్పష్టంగా ఉన్నదాన్ని కూడా వివాదాస్పదం చేశాడు.ఆఖరికి అక్కడ విమర్శలన్నీ తను తిరిగి సమర్ధించుకోలేననత గట్టిగా ఉండటంతో తగ్గిపోయి "ఒక వివాదాస్పద విషయం మంచి చెడులను చర్చించుకోవటానికి ఆ వివాదంలోని వ్యక్తులు సజీవంగా ఉన్నారా లేదా అనేదానితో నిమిత్తం లేదనేది నా దృఢాభిప్రాయం. దీనిలో చనిపోయినవారిని హేళన చేయటంలాంటిదేమీ లేదు!" అంటూనూ "బాపు వెటకారాలను ప్రస్తావించి విమర్శించారు కాబట్టి రంగనాయకమ్మ- తాను వ్యంగ్యం లేకుండా ఆ ముఖచిత్ర వివరణ రాసివుండాల్సింది. నిజమే! దీన్ని నేను ఈ పోస్టులోనే రాసివుంటే పోస్టు ఇంకా బాగుండేది. అంటూనూ సరిపెట్టేశాడు!

      మురంనా ఈ మధ్యనే రాసిన ఇదండీ భారతం గురించి ప్రచారం చేసుకోవటానికి "మహాభారతం నాకెంతో ఇష్టం.. మరి ఇప్పుడు?పేరుతో ఒక పోష్టు వేశాడు.అందులో ఈయనగారి అభిమాన రచయిత్రి లాగే తలా తోకా లేని వాదనలు చేశాడు.అందులో ఆ మేధావి రచయిత్రి లాగి చూపించిన "వాళ్ళు యుద్ధం చేసింది , తమ రాజ్యం కోసమే. దానినే తను తీసుకుని, కౌరవుల రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికే ఎందుకు పట్టం కట్ట కూడదు?అనే పిచ్చ రీజనింగు చదివి నాకు నిజంగా మతిపోయింది:-)ధర్మరాజుని అందరూ రేపటి రోజున రాజు కావలసిన వాడని తీర్మానించి యువరాజుగా ఒప్పుకున్నాకనే ధృతరాష్ట్రుడు మావాడితో గొడవగా వుంది మంచివాడివి గదా గొడవ లేకుండా నువ్వు కొంచెం వేరేగా వెళ్ళీ సర్దుకుపొమని బతిమిలాడుకుంటే పెదతంద్రి గదా అని అతని మాటకి మర్యాద ఇచ్చి దూరంగా పోయాడు,పంపించటం కూడా దిక్కూ దివాణం లేని చోటికి పంపించినా ఖాందవదహనంతో మయుడు గొప్ప రాజధాని కట్టి ఇస్తే తన బతుకు తను బతుకుతుంటే రెండుసార్లు ద్యూతక్రీడకి పిల్చి ఓడించి దాన్ని కూడా లాక్కుని సాక్షాత్తూ శ్రీకృష్ణుణ్ణే రాయబారిగా పంపించి అయిదూళ్ళు ఇచ్చినా చాలంటే సూది మొనమోపినంత భూమి కూడా ఇవ్వననడం వల్ల జరిగిన యుధ్ధానికి బల్లే రీజనింగు లాగిందిగా?

      ఈ పాదరేణువు కూడా "ధర్మరాజు తమ అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశాడు. గెలిచినపుడు ధర్మాత్ముడైతే అర్థ రాజ్యమే తీసుకుని, మిగిలిన అర్థరాజ్యం ఇంకా బతికున్న ధృతరాష్ట్రుడికి ఇచ్చివుండాల్సింది. ఈ వాదనలో తర్కమే కాదు, న్యాయం కూడా ఉంది. మాయాద్యూతం, దుర్యోధనుడి దుష్టత్వాలతో సంబంధం లేకుండా జవాబు చెప్సాల్సిన ప్రశ్న ఇది. మీకు తోచిన వాదన మీరు చేయండి. అంతేగానీ- ‘బల్లే రీజనింగు లాగిందిగా?’ అంటూ అమర్యాదగా ప్రస్తావిస్తూ రాస్తే అది మీ వైఖరినే బయటపెడుతుంది!" అని నిలదీస్తున్నాడు,అర్దవంతమయిన చర్చలు చేస్తాననే మేధావి వివేకం అట్లా ఉంది,ఏం చేస్తాం?బుద్ధిగానే అడుగుతున్నాడు గదా అని వివరంగానే జవాబు చెప్పాను:

1).మీ తాజా వ్యాఖ్య: ధర్మరాజు తమ అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశాడు. గెలిచినపుడు ధర్మాత్ముడైతే అర్థ రాజ్యమే తీసుకుని, మిగిలిన అర్థరాజ్యం ఇంకా బతికున్న ధృతరాష్ట్రుడికి ఇచ్చివుండాల్సింది. 

Ans:

అసలు గుడ్డివాడికి రాజ్యార్హత లేదు.అక్కడి క్రైటేరియాలు:ఇతర్ల మీద ఆధారపడి బతికేవాడు,దీర్ఘరోగం వుండి యెప్పుదు చస్తాడో తెలియని వాడు ప్రభువుగా వుండటానికి ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ కూడా యెవరూ వొప్పుకోరు.పెద్దవాడు కుళ్ళి చస్తాడని జాలి పడి ఇప్పటి మన దేశపు రాష్త్రపతి లాగా హానరరీ పోష్తు మాత్రమే ఇచ్చాడు దయదల్చి.అది కధలో స్పష్టంగానే వుంది.ఇంకా గట్టిగా పరిశీలించి చూస్తే ఇప్పుడు రాష్ట్రపతికి ఉన్నపాటి చిన్న చిన్న అధికారాలు కూడా ధృతరాష్ట్రుడికి లేవు.పేరుకే ధృతరాష్ట్రుడు రాజు తప్ప పరిపాలాన్ మొత్తం పాండురాజు చహెతి మీదగానే జరిగింది పాండురాజు బతికి ఉన్నంతవరకూ.పాండురాజు చనిపోగానే పాంవుల్ని రాజధానికి రప్పించి ధర్మరాజుని యువరాజుగా ప్రకటించేశారు!

తనకి రాజ్యం అర్హతగా లేదు కాబట్టే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడ్ని మాటిమాటికీ నీ శక్తి కొద్దీ ప్రయత్నించు నేను అన్ని విధాలా సాయపడతాను,పబ్లీకున ఇట్టా మాట్టాదితే తిట్టిపోస్తారు గాబట్టి భీష్ముడూ ద్రోణుడూ వాళ్లతో నేను మాట్లాడేవి పట్టించుకోకుండా చాటుగా నువ్వు చేసేది చెయ్యి అని రెచ్చగొట్టటం కూడా కధలో స్పష్తంగానే ఉంది.మంచిగా అడిగినప్పుడు తనకి అయిదూళ్ళు కూడా ఇవ్వనన్నాక జరిగిన యుధంలో గెలిచినవాడు అహంకారంతో కన్నూ మిన్నూ గానకుండా యుద్ధం చేసి ఓడిపోయినవాడి మీద మంచితనం చూపించాలా?గెలిచింది హస్తినాపురాన్నే.అది ఒకనాడు హక్కుగా దఖలు పడినా మంచితనంతో వదులుకున్నదే.ఇంకెందుకు దాన్ని ధృతరాష్ట్రుడి కిచ్చి తను వేరేగా పోవటం,బుర్రతక్కువ మాటలు కాకపోతే!

రాజ్యార్హ్త లేనివాడికి తనకి హక్కుగా వున్న రాజ్యాన్ని ఇవ్వడమేమిటి?సాంకేతికంగా తనకి హక్కు లేని దాన్ని కబళించడానికే రెండు సార్లూ ద్యూతం నడిపాడు దుర్యోధనుడు!

2). మీకు తోచిన వాదన మీరు చేయండి. అంతేగానీ- ‘బల్లే రీజనింగు లాగిందిగా?’ అంటూ అమర్యాదగా ప్రస్తావిస్తూ రాస్తే అది మీ వైఖరినే బయటపెడుతుంది! 
Ans:

మీ అభిమాన రచయిత్రి కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పి వూరుకోలేదుగా?అబధ్ధాలు రెందు రకాలుగా చెప్పొచ్చు!రామాయణం విషయంలో లేనిది కల్పిస్తే తిరిగి తనకే తిట్లు రావదంతో ఇక్కడ మరొక ట్రిక్కు - వున్నదాంట్లో తను వెక్కిరించటానికి పనికొచ్చేవి మాత్రమే వున్నాయని చెప్పటం?

వ్యాసుడు ఒక విషయం గురించి పది మాలు చెప్తే తను విమర్శిస్తున్న వాట్ని పూర్వపక్షం చేసే విషయం అక్కద వున్నా దాన్ని కావాలనే వొదిలెయ్యటం కూడా నిక్షక్షపాతంగా చేసిన విమర్సే అవుతుందా?

మీకు నచ్చిన వాళ్ళు యెట్లాగయినా మాట్లాడవచ్చు గానీ మీకు నచ్చని వాళ్ళు మాత్రం జాగ్రత్తగా మాట్లాదాలి,బాగుంది మీ వరస?!

      ముందే "నేను అసలు భారతం వ్యాసుడు రాసినా సరె రంగనాయకమ్మ చెప్పేదే నమ్ముతాను" అనే ధోరణి ఉన్నవాడికి తప్ప ఇందులో నా వాదన న్యాయమే అనిపిస్తుంది.కానీ "ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత ఉందా లేదా అనేది వేరే చర్చ అవుతుంది" అంటున్నాడు!అదెట్లా కుదురుతుంది?దృతరాష్త్రుడికి రాజ్యార్హత వుందా లేదా అనేది వొదిలేసినా అది వేరే విషయమయినా తను ఈ పాయింటు పట్టడం కూడా అనవసరమే అవుతుంది,అది తెలుసా?అసలు ముఖ్యమయిన పాయింటే అది!ధర్మరాజు తన రాజ్యాన్నే తను గెల్చుకున్నాడు.దృతరాష్త్రుడు మంచితనం కొద్దీ వొదిలేసే ప్రసక్తి లేదు అక్కడ!నేను రాజుని కాలేకపోయాను,నువ్వు రాజు కావటానికి యేది చేసినా నా సపోర్టు వుంటుందని యెక్కేసిన దృతరాష్ట్రుదు అంత న్యాయంగా ఆలోచించగలడా? తనకి హక్కుగా వున్నదాన్ని కూడా పెదతండ్రి అనే గౌరవంతో వొదులుకున్నా అక్క కూడా ప్రశాంతంగా తన బతుకు తను బతకనివ్వకుండా ద్యూతం ఆడించి అడవులకి తరిమితే తిరిగి తన రాజ్యాన్ని తను ధీమాగా యుధ్ధం చేసి సాధించుకుంటే ఇంక దృతరాష్త్రుడు తనమీద దయదల్చి ఇవ్వటం తను దృతరాష్ట్రుడికి తన రాజ్యాన్ని తనకి ఇవ్వటం యేమిటి అర్ధం లేకుండా?

      తనకి ధర్మసూక్ష్మాలు కూడా తెలిసిన పాండిత్యం ఉందనుకుంటూ "తన రాజ్యం అర్థరాజ్యమే. యుద్ధం చేసింది దానికోసమే; పూర్తి రాజ్యం కోసం కాదు. ధర్మాచరణ ఉన్నవాడైతే గెలిచాక అర్థ రాజ్యమే తీసుకోవాలి. ఈ సూక్ష్మం మీకు బోధపడకపోతే వదిలెయ్యండి." అని నాకు కవుంటర్లు వేస్తున్నాడు."యెందుకు వొదిలెయ్యాలి.1).మీకు అసలు దృతరాష్త్రుడికే రాజ్యార్హత లేదు అనే సూక్ష్మం బోధపడటం లేదు.మీకు బోధపడనివన్నీ వొదిలేసి మీకు అర్ధమయ్యే వాటిని మాత్రమే పట్టించుకుంటారా?2). అక్కడ ధర్మరాజు యుధ్ధంలో ఓడించిన భీష్మ ద్రోణ కర్ణాదులు యే రాజ్యం తరపున యుధ్ధం చేశారు?హస్తినాపురం తరపునే కదా?ధర్మరాజు గెలిచింది హస్తినాపురాన్నే కదా? అయిదూళ్ళిస్తే యుధ్ధం చెయ్యను అంటే సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వను అని తెగేసి చెప్తే కదా యుధ్ధం జరిగింది!ఇంకా దృతరాష్ట్రుడు దయతల్చి ఇవ్వడం అంటే యేమిటో ధర్మరాజు దృతరాష్ట్రుడు ఇస్తేనే తీసుకోవడం అంటే యేమిటో వివరిస్తారా?" అని చాలా ఓపిగ్గా అడిగాను.దీనికి తాంబూలాచిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్టు "పాండవులూ - అర్థరాజ్యం- యుద్ధం- ఈ విషయంలో నేను చెప్పదల్చినవి ఇప్పటికే చెప్పేశాను. మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు." అనే జవాబు చెప్పి ఇంక నేను చెప్పగిలిగింది లేదు అని తేల్చి పారేశాడు.యుద్ధంలో గెలిచిన వాడు ఓడిపోయిన వాడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఓడిపోయిన శత్రువు ఒప్పుకుంటేనే కొత్త రాజ్యానికి రాజవటం, అట్లా కాకుండా ఓడిపోయింది నా సైన్యం నేను కాదు ఠట్ నా రాజ్యం నీకివ్వనంటే గెలిచినవాడు దడుచుకుని తన పాత రాజ్యానికి తను పోవటం ప్రపంచ చరిత్రలో ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా జరిగిందా?ఇంకా నయం, ఈయన గనక పాకిస్తానుతో భుట్టో హయాములో జరిగిన యుద్ధం అప్పుడు ప్రధానిగా ఉండుంటే మన సైన్యం గెల్చినాక కూడా భుట్టోని నిర్యుద్దసంధికి ఒప్పించకుండా ఆ మహానుభావుడి రాజ్యం ఆయనకి అప్పగించేసి సైన్యాన్ని చెవులు దులుపుకుంటూ వెనక్కి రమ్మనే వాడు కాబోలు,భగవంతుడి దయ వల్ల అప్పుడీ పెద్దమనిషి ప్రధానిగా లేడు:-)"అంటే దానర్ధం యేమిటి?యుధ్ధంలో గెలిచాక కూడా ఓడినవాడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఓడినవాడు దయదల్చి ఇచ్చినంత మటుకే తీసుకోవాలి అనా మీ తీర్పు?తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండి అన్నట్టుగా నేను చెప్పాల్సింది చెప్పేసాను అనే కాడికి మీ అభిప్రాయాలు చెప్పండి,వాదించండి అని ఆహ్వానాలు యెందుకో?!ఆ ముక్క ముందే చెపితే మాకీ చెతుల నెప్పులెందుకు?మీ అభిప్రాయాల్ని వాదనగా వినిపించండనే మాట యెందుకు?ఈ జవాబు మీరు పబ్లిష్ చెస్తారో చెయ్యరో తెలియదు- ఒకటి మాత్రం అర్ధం చేసుకోండి!పాయింటు గట్టిగా వుందా లేదా అనేది తేల్చకుండా ఒకసారి చెప్పేశాను,మళ్ళీ మళ్ళీ చెప్పను అనడం సరయిన వాదనా పధ్ధతి యేనా?" అని నేనూ గట్టిగానే నిలబడ్డాను..దీనికాయన ఇంకా తెలివితక్కువ రీజనింగు లాగాడు:"పాండవులు తమ హక్కు అయిన అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశారు కాబట్టి, యుద్ధంలో గెలిచాక అర్థరాజ్యం మాత్రమే తీసుకోవటం న్యాయం అంటే దానిలో సముచితం కానిదేమీ లేదు. కానీ ఈ పాయింటును మీరసలు పట్టించుకోవటం లేదు/ అంగీకరించటం లేదు. ధృతరాష్ట్రుడి రాజ్యార్హతతో సంబంధం లేని విషయాన్ని దానితో సంబంధం పెట్టి చూస్తున్నారు మీరు. అసలు ధృతరాష్ట్రుడు యుద్ధంలో పాల్లొనలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడని ఎలా చెపుతారు?" అంటూ!నిజంగా ఓక పల్లెటూరి వాడికి ఉండే పాటి కామన్ సెన్సు కూడా లేనివాడు గంభీరమైన ధర్మాధర్మవిచక్షణ జ్ఞానానికి సంబంధించిన రామాయణ మహాభారతాల గురించి ఎందుకు చర్చకి దిగాడో!హస్తినా పురం తరపున యుద్ధం చేసిన సైన్యాలూ ఆ సైన్యం లోని వీరులూ మొత్తం మట్టిగరిచి ఓడిపోతే ఆ రాజ్యపు రాజు వోడిపోయినట్టు కాదా!"హస్తినాపురం తరపున భీష్మ ద్రోణ కర్ణాదులు యుద్ధం చేశారా? వీళ్ళంతా కౌరవుల పక్షాన యుద్ధం చేశారని భారతం చెపుతోందిగానీ ఒక పట్టణం/ నగరం తరఫున యుద్ధం చేశారని కాదు. హస్తినాపురం ఓడిపోవటమేమిటో, అది ఓడిపోతే యుద్ధం చేయని ధృతరాష్ట్రుడు ఓడిపోవటమేమిటో కూడా అంతుబట్టటంలేదు.అనే రకం వాదన ఒక పల్లెటూరి బైతు ముందు చేసినా వాడు కూడా పగలబడి నవ్వుతాడు కదా,ఈ మనిషికి రామాయణ మహాభారతాల్లోని ధర్మాధర్మవిచక్షణకి సంబంధించిన గంభీరమైఅన చర్చలు చేసే అర్హత ఉందా:-)

      ఈయనే "నా హీరోలు..వాలీ,కర్ణుడూ!" అనే మరొక పోష్టు కూడా వేశాడు.చాలా పాతది.ఈ మధ్య అవ్రకూ నేనసలు దీన్ని పట్టించుకోలేదు.ఎందుకంటే పాత అనుభవం ఉందిగా!తప్పొప్పులతో పని లేకుండా మురంనా ఏది చెప్తే అదే వేదం అనుకునే ఈయనతో వాదనలు చెయ్యడం వల్ల ఉపయోగం లేదు,పైగా తన తెలివితేటల్ని నిరూపించుకోవటానికి పనికొచ్చే కామెంట్లని మాత్రమే పబ్లిష్ చేసి ఎదటివాళ్ల నుంచి తను జవాబు చెప్పలేని తెలివైన వాదనల్ని ఎటూ పబ్లిష్ చెయ్యడు,ఎందుకొచ్చిన గోల అని అటుకేసి వెళ్ళడం మానుకున్నాను,అయితే బాహుబలి సినిమా గురించిన టాపిక్కు సరదా అయినది గాబట్టి దాని దగ్గిర నేనూ పాజిటివ్ కామెంట్లే వేశాను,ఆయనా పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చాడు.తస్సాదియ్యా,గాచ్చారం గాండు మారితే తాడే పామై కరుసుద్ది గందా!ఈ మజ్జెనే మాలికలో కామెంట్లని జూస్తా వుంటే రాజ కిషోర్ అనే బ్లాగరు వేసిన కామెంటూ,దానికి ఈయన గారు "పోష్టు రాసిన ఇన్నేళ్ళకి మళ్ళీ ఓక అభిప్రాయం రావటం సంతోషంగా ఉంది" అంటుంటే కేవలం కుతూహలం కొద్దీ తొంగి చూశాను.రాజ కిషోర్ గారు "వాలీ, కర్ణుడూ ఇద్దరూ దుష్టులే, అధర్మపరులే. దుష్టులను ఏ విధంగా వధించినా తప్పులేదు. వాళ్ళని తొలగించాలి అంతే.......................అయినా మీ ఇంట్లో రాత్రిపూట ఒక దొంగాడు చొరబడితే అదను చూసి వెనక నుంచి వెళ్లి కొడతారా లేక గొప్పగా జబ్బలు చరుచుకుంటూ వాడికి ఎదురుగా వెళ్తారా? ఈ రెండూ కాకపొతే పదిమందినీ పిలిచి వాడిని పట్టించి బాగా దేహశుద్ధి చేయిస్తారు. అంతేకాదు, ఒక దొంగాడినో, తీవ్రవాదినో పట్టుకోడానికి పదిమంది పోలీసులూ వెళ్ళటం లేదూ? అదను చూసి వెనుక నుంచి దెబ్బకొట్టటంలేదూ? ఒక దొంగాడినే మీరు వెనక నుంచి వెళ్ళి తంతే, లేదా ఒక్కడిని చేసి పదిమంది చేతా తన్నిస్తే తప్పులేదు కాని, అదే పని రాముడు, కృష్ణుడు చేస్తే మీకు తప్పయిపోయిందా? భలే చెప్తున్నారండీ!!!! ఇవేవీ ఆలోచించకుండా ఇలా వ్రాయడం చాలా విచారకరం." అంటూ చెప్పినది వివరంగానే ఉంది,అయినా ఇంకా ఈయన "వాలినీ, కర్ణుడినీ దొంగలతో పోోల్చి వారికి జరిగిన ప్రతిక్రియలను మీరు సమర్థిస్తున్నారు. కానీ వాళ్ళు దొంగల్లాంటివాళ్ళని ముందు మీ వాదనతో రుజువు చేయండి!" అని జిడ్డులా తగులుకుంటే నేను "అంత జవాబూ చదివాక మళ్ళీ అదే చాలెంజి చేస్తే మళ్ళీ అదే జవాబు వొస్తుంది గదండీ!1.నేను ముప్పాళ అరంగనాయకమ్మ అభిమానిని అని ప్రకటించేసుకుని ఆవిడ మీద భక్తిరసంబు వెదజల్లుతూ ఇన్ని పోష్టులు వేశాక మీ ఎజెండా స్థిరపడిపోయినట్టే కదా!రామయణ మహాభారతాల ఎజెండా మీకు నచ్చలేదు గనక అవి తప్పని చెప్పడానికి వ్యాఖ్యానాలూ వాదనలూ సాక్ష్యాలూ కోకొల్లలుగా పుట్టించవచ్చు - అదే కదా సేంటూసేం ఎజెండా ఉన్నవారిలో మిమ్మల్ని గొప్పవాళ్ళని చేసేటందుకు పనికొచ్చే పాండిత్యం!2.మీరు ముప్పాళ అరంగనాయకమ్మ అభిమానిగా ఉన్నంతవరకూ మీకు రాముడు పరమ నీచాతి నీచుడు గానూ,రాముడికి సహాయం చేసిన సుగ్రీవుడూ,జాంబవంతుడూ,హనుమంతుడూ విభీషణుడూ జాతిద్రోహులుగా కనబడటమూ సహజమే.రాముడికి ఎగస్పార్టీ అయిన రావణుడూ,శూర్పణఖా,వాలీ లాంటివాళ్ళు ధర్మావతారులుగా కనబడటమూ అంతే సహజం.ముందుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదటివాడి వాదన ఎంత యుక్తియుక్తంగా ఉన్నా సరే ఒప్పుకోకూడదని భీష్మించుకున్న గట్టి ఎజెండాతో ఉన్న మీకు వాలినీ కర్ణుణ్ణీ దుర్మార్హులని రుజువు చెయ్యడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు:-)" అంటూ ఒక కామెంటు వేశాను.

     దీంతో కధ నేను వూహించని మలుపు తిరిగింది!నాకు చెప్పిన జవాబులో ఆయన "ఒక రచయిత తన ఇంటిపేరును వాడటం మానేశారని తెలిసి కూడా దాన్ని వాడటం, ఆ రచయిత పేరును అస్తవ్యస్తంగా రాయటం వల్ల ప్రయోజనం ఏమిటి? దానివల్ల అలా రాసినవారి vanity తృప్తిపడుతుందేమో కానీ, అది ఆరోగ్యకరమైన చర్చకు కనీస ప్రాతిపదిక ఏమైనా ఉంటే దాన్ని ధ్వంసం చేసేస్తుంది!" అని ప్రస్తావించాడు.అప్పుడే అనుకున్నా ఈ ప్రస్తావన వొచ్చింది అంటే ఇక చివరి వరకూ నిలబడాల్సిందే వెనక్కి తగ్గకూడదు,కానీ ఈయన కామెంట్లు అన్నీ పబ్లిష్ చెయ్యడు గదా!ఏదేమయినా ప్రస్తావన వచ్చింది గాబట్టి జవాబు చెప్పడం నా ధర్మం అని "ఒక మనిషి పేరుని అస్తవ్యస్తంగా రాయడం ఎందుకు చేశానో తెలుసా?ఆ మనిషికీ ఆ పేరుకీ ఏమి సంబంధం ఉందని ఆ రచయిత ఇంటిపేరుని వాడుకోవటం మానివేశారు?ఎందుకు ఆ పేరుని అస్తవ్యస్తం చెయ్యడం పట్ల మీరు వ్యతిరేకత తెలుపుతున్నారు?అంటే,వివేకానందుడు రాజుగారి పటాన్ని కాళ్ళతో తొక్కమంటే భటుడు ఎట్లా భయపడ్డాడో మీరూ అట్లాగే ఆ పేరులో ఆ మనిషిని చూస్తున్నారు,అవునా కాదా?మరి అస్తవ్యస్తం చహెయ్యడం నావైపు నుంచి మీ అభిమాన రచయిత్రికి జరిగీతే మీకు కలుగుతున్న బాధయే మీ అభిమాన రచయిత్రీ చేసిన వక్రీకరణల వల్ల రాముడితో అనుబంధం పెంచుకున్నవాళ్ళకె కలుగుతుంది కదా!డిస్టార్షన్ అనేది మీరు ఇతరులకి అభిమానపాత్రమయ్యే విషయాల పట్ల చెయ్యవచ్చును గానీ ఇతర్లు మీకు అభిమానపాత్రమయ్యే విషయాల పట్ల చెయ్యగూదదా?అని నిలదీస్తూ కామెంటు వేశాను. అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆయనకి పాయింటు అర్ధం కాలెదు!నేను ఈయన లాగా తప్పులు పట్టటం కోసం చదవలేదు గాబట్టి భారతంలో మనుషులంతా గొడవలు లేకుండా ప్రశాంతంగా బతకటానికి చెప్పిన ఒక నీతిని నేర్చుకున్నాను,అదేమిటంటే "ఇతరులు నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో ఇతరులకి నువ్వు అది చెయ్యకు" అనేది.ఈయనకి కనీసం హైస్కూలు కుర్రాడి స్థాయి తెలివి అయినా ఉండి ఉంటే నేను చెప్తున్న జవాబులో "ముప్పాళ రంగనాయకమ్మ పేరుని మార్చి రాసినందుకు మీకు బాధ కలిగితే మరి రాముణ్ణీ సీతనీ వాళ్ళ స్వభావాల్ని మార్చిపారేసి తీరుతెన్నుల్ని వంకర్లు తిప్పి విమర్శించటం దేనికి చేసినట్టు,అది తప్పు కాదా?" అని అడుగుతున్న ప్రశ్న తట్టి ఉండేది.అయినా చెప్పింది అర్ధం చేసుకోకుండా ఇంకా "ఆమె తన రచనల్లో ఏ వక్రీకరణ చేశారని భావిస్తున్నారో అది వక్రీకరణేనని మీరు ససాక్ష్యంగా మీ వాదనలతో నిరూపించటానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన, సంస్కారవంతమైన వాదనలు చేయండి. అది సరైన మార్గం.కానీ మీరు ఏం చేస్తున్నారు చాలాకాలంగా? ఆమె పేరును సంబోధించే విషయంలో హీనమైన సంస్కారం ప్రదర్శిస్తున్నారు. ‘స్వైరిణి’అట. ఆమె భావాలను నేను ఇష్టపడుతున్నాను కాబట్టి.. నా బ్లాగు పేరు ‘వేణువు’ కాబట్టి నేను ఆమె ‘పాద రేణువు’ను అట.నచ్చని భావాలతో సంఘర్షించటంలో ఆరోగ్యకరమైన చర్చల, వాదనల దారిని వదిలేసి, ఆ భావాలను వ్యక్తంచేసే వ్యక్తులను అవమానించటానికి ప్రయత్నించే దూషణల మార్గం తొక్కారు మీరు. అది మీ అభిరుచి కావొచ్చు. కానీ ఇలా ఒక రచయిత్రి పేరునూ, ఆమె భావాలను ఇష్టపడే బ్లాగర్ల పేర్లనూ అస్తవ్యస్తంగా మార్చి రాయటం, దాన్ని అస్తవ్యస్తంగా సమర్థించుకోజూడటం మీ నిస్సహాయమైన ఓటమిని మాత్రమే విస్పష్టంగా రుజువు చేస్తుంది!" అని సాగదీస్తున్నాడు,నేను అంత స్పష్టంగా జవాబు చెప్పినా అర్ధం చేసుకోలేనంతటి ఈ మేధావి యొక్క అజ్ఞానంలోని పై స్థాయిని నేనింతవరకూ ఎవరిలోనూ చూడలేదు,అమ్మ తోడు!

సరే,ఇంక చుట్టూ తిప్పి తిప్పి చెప్తే బుర్రకి ఎక్కడం లేదని తెలిసిపోయి మన తరపు నుంచి పూర్తి స్పష్టత ఉండే ఒకే ఒక ఆఖరి కామెంటు వేసి ఇంక అతని మూర్ఖత్వానికి అతన్ని వొదిలేద్దాం అనుకుని ఒక సుదీర్ఘమైన కామెంటు వేశాను.అయితే అక్కడి కామెంటు బాక్సులో కంటెంట్ లిమిట్ ఉండటం వల్ల రెండు భాగాలుగా విగొట్టి మొదటి కామెంటు చివర్లో "TO BE CONTINUED" తగిలించి రెండో కామెంటు మొదట్లో "CONTINUED FROM ABOVE" అనీ ఉంచి పోస్ట్ చేశాను,అది మొత్తంగా ఇది:

-----------------------------------------------------------
ఇంతకీ రామాయణం మహాభారతం కావ్యాలు అని మీరు అంటున్నారా? రామాయణం వాల్మీకి రాసిన కధ అనుకుంటే వాల్మీకి రాసినదే ప్రమాణంకావాలి సహజంగా.వాల్మీకి రాసిన రామాయణం లోని పాత్ర అయిన వాలి మంచివాడా చెడ్డవాడా అనేది వాల్మీకి చెప్పనివాటితో నిర్ణయించటం తెలివైనవాడు ఎవడూ చెయ్యడు వాల్మెకిని వ్యతిరేకించటం కోసమే వ్యతిరేకించాలన్న ఎజెండా ఉన్నవాడు తప్ప! కోటానుకోట్ల మంది ప్రభావితం అయినా సరే కావ్యమర్యాద ప్రకారం పాత్రల తీరుతెన్నుల మీద రచయితదే సర్వాధికారం.ఆయన రాసిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ రచయిత ఇట్లాగే రాముణ్ణి సమర్ధిస్తూ ఎందుకు రాశాడు,మరోట్లా నాకు నచ్చినట్టు వాలిని సమర్ధిస్తూ ఎందుకు రాయలేదు అని అనడం మా అమ్మకి నేను ఇట్లా పొట్టి బుదంకాయలా ఎందుకు పుట్టాను మరోట్లా నాగార్జునలా పొడుగ్గా ఎందుకు పుట్టలేదు అని అడిగినట్టు శుద్ధ వెర్రిబాగుల వాగుడులా ఉంటుంది:-)

ఒక కవి రాసిన పాత్రలని ఆ కవి రాసిన ప్రణాళికకి విరుద్ధంగా వ్యాఖ్యానించాలనుకోవడం దేన్ని సూచిస్తుంది?వాల్మీకికి రామాయణం రాయడం వెనక ఒక ఎజెండా ఉంది.అది తను ధర్మం అనుకున్నదాన్ని అందరిలో బలంగా ఎక్కించడం!మీ అభిమాన రచయిత్రికి వాల్మీకి ధర్మం అంటున్నది అధర్మంగా కనిపించే ఎజెండా ఉంది.అయితే దైరెక్టుగా వాల్మీకి ధర్మం అంటున్నదాన్ని అధర్మంగా నిరూపించితే ఎవ్వరూ కాదనరు - నాతో సహా!అలా చెయ్యాలంటే రాముడి ఏకపత్నీవ్రతం తప్పు సీత పాతివ్రత్యం తప్పు అని చెప్పి లైంగిక విశృంఖలత్వాన్ని సమర్ధించాలి.ఎందుకంటే రామాయణం లో భరతుడు తనని చూడ్డానికి వచ్చినప్పుడు "తమ్ముడూ బాగున్నావా" అనే మామూలు పలకరింపు స్థానంలో రాజ ధర్మాల గురించి చాంతాడు పొడుగు ఉపన్యాసం చెప్పి ఇవ్వాన్నీ చేస్తున్నావా అని అడ్గినట్టు వాల్మీకి తన అభిప్రాయాలు చెప్తున్న సన్నివేశాలు ఎన్ని  ఉన్నప్పటికీ మొత్తం కధలో రాముడు - రావణుడు, సీత - శూర్పణఖ వంటి ప్రధాన పాత్రల మధ్య నడిచిన సన్నివేశాల లోని కధ అంతా స్త్రీ-పురుష సంబంధాల్లో ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం కోసమే కదా!
TO BE CONTINUED

CONTINUED FROM ABOVE
ఆమెని "స్వైరిణి" అనడానికి కారణం కూడా చెప్తాను. స్వభావతః సంస్కారవంతుడినై ఉండి కూడా ఓక్ స్త్రీని నిరాధారంగా నిందిస్తున్నానంటే బలమైన కారణం లేకుండా ఉంటుందా,తప్పకుండా చెప్తాను అది నా బాధ్యత కూడా చెప్తాను మీరు నమ్మినా నమ్మకపోయినా! రాముడు పాటించిన ఏకపత్నీవ్రతాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి?సీత పాటించిన పాతివ్రత్యాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి? ఆమె కూడా వివాహితయే కదా,ఆమె దాంపత్యజీవితం ఎట్లా గడిపింది? ఒక పురుషుడితో వివాహబంధంలో ఉన్నప్పుడు మరొక పురుషుడి గురించి ఆలోచించకుండా మీ అభిమాన రచయిత్రి కూడా సీతలాగే ప్రవర్తించిందా మరొక విధంగా స్వైరవిహారం చేసిందా!మరి సీత రావణుడి గురించి ఫాంటసీలు వూహించుకుంది,రాముదు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడు,"ఆహా!సీత కన్నా ముందు తను కనబడితే నేను ఈవిణ్ణే చెసుకున్నేవాణ్ణి" అనుకున్నట్టు రాయడం, పైగా మనసులో అంత వాంచ ఉన్నా అణుచుకుని రాముడు జనం పొగడ్తల కోసం పైకి నటనగా మాత్రమే ఏకపత్నీవ్రతానికి కట్టుబడ్డట్టు రాయడం వెనక ఉన్న ఉద్దేశ్య మేమిటి?ముప్పాళ రంగనాయకమ్మ అను నాకన్నా సీత ఉన్నతంగా ఉండటానికి వీలు లేదు, నాలాగే తను కూడా మొగుడు కాని ఇంకో మగాడి గురించి ఫాంటసీలు వూహించుకునే ఉంటుంది అని చెప్తున్నట్టా!

తను కూడా దాంపత్యం విషయంలో సాంకేతికంగా సీత మాదిరిగానే ఉంటూ అదే లక్షణాన్ని కధారూపంలో పాత్రగా నిలబడిన సీతని వెక్కిరించటం అంటే తను పాటిస్తున్న దాంపత్యపు లక్షణాన్ని తప్పు అని చెప్తూ తనని తను విమర్శించుకోవటం - తనని తను తిట్టుకునేవాళ్లని ఏమంటారు?ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాలం కలిసి ఉండే వివాహాన్ని తప్పు అంటున్నప్పుడు ఆమె సాటి స్త్రీలకి బోధిస్తున్నది స్వైరవిహారాన్నే కదా!

వాల్మీకి రామాయణం లో సీత రాముడికే అంకితమవడాన్ని విమర్శించిందా? లేదు,అదంతా నటన మాత్రమే,చా టుగా రావణుడి గురించి ఫాంటసీలు అల్లేసుకుంది పొమ్మంటున్నది,అవునా?రాముడు సీతను మాత్రమే ఇష్టపడటాన్ని విమర్శించిందా?లేదు,అబ్బే రాముడు వాల్మీకి చెప్పీంట్టు పవిత్రంగా లేడు శూర్పణఖని చూసి  ఐసయిపోయాడు,కాకపోతే జనం తిడ్తారని నటించాడు అంటున్నది. అట్లా వాల్మీకి ఆదర్శవంతులుగా నిలబెట్టిన పాత్రల స్వభావాల్ని పూర్తిగా మార్చిపారేశాక ఇప్పుడు మనకి కాబట్టి అయ్యలారా అమ్మలారా మీరు రాముడిలాగా సెతలాగా ఆ ధర్మాన్ని పాటించకండి అని చెప్తున్నది,అంతేనా? నేను బుద్ధిగా మొగుడితో కాపురం చెస్తూ గడిపిన మీ అభిమాన రచయిత్రిని "స్వైరిణి" అన్నందుకు మీకు ఖోపం వచ్చేసి అదేంటి ఆ పాడు పని ఆవిద చెయ్యలేదుగా అని బోల్డు బాధ పడిపోయి ఆవిడ చెయ్యని పనిని అంటగట్టిన దుర్మార్గం గురించి నన్ను నిలదీస్తున్నారు గాబట్టి మీరు మరి సీతకీ రాముడికీ లేని దుర్గుణాల్ని ఆవిడ ఎందుకు అంటగట్టిందో చెప్పాల్సి ఉంటుంది - చెప్పగలరా?!

P.S:ఆవిడకి లేని చెడ్డ గుణాన్ని అంటగట్టటం నా కుసంస్కారం అయితే వాల్మీకి సృష్టించిన పాత్రలకి లేని లక్షణాల్ని అంటగట్టటం ఆవిడ కుసంస్కారం కాదా - ఆ పాయింటు బోధపడితే నేను ఆ పని ఎందుకు చేశానో అర్ధం అవుతుంది.నేను చేసింది ఒక మంచి పని కోసం తప్పు చెయ్యటమే అని అర్ధం అయితే కౌరవులు తప్పు చేశారని పాండవులూ తప్పు చేస్తే ఇద్దరూ అధర్మపరులే అవుతారు గదా అనే మీ లాజిక్ ఎందుకు తప్పో కూడా అర్ధం అవుతుంది.

ఒకచోట నమ్మినా నమ్మకపోయినా అన్నాను గదా నేను బూకరించంటం లేదు అని మీరు నమ్మితేనే ఈ జవాబు మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది.అట్లా నమ్మకపోయినా మీకు కూడా తప్పొప్పులతో సంబంధం లేకుండా మీ అభిమాన రచయిత్రి ఎజెండాయే ముఖ్యం అయితే ఈ జవాబు కూడా వ్యర్ధమే అవుతుంది - స్వస్తి!
-----------------------------------------------------------

"వ్యక్తిగతంగా హీనపరిచే దూషణలు చేయటమే తప్పు. వాటికి మళ్ళీ కారణాలు వివరిస్తూ సమర్థించుకోబోవటం ఏమిటి?!ఒక రచయిత్రి భావాలు మీకు నచ్చకపోతే ఆమెను సంస్కారహీనమైన మాటలతో దూషించేయటమేనా? ఆమె భావాలు ఇష్టపడేవారిని అవమానకరంగా సంబోధిస్తూ చెత్తగా రాసెయ్యటమేనా? సంస్కారవంతంగా, ఆరోగ్యకరంగా చర్చ చేసినంతవరకూ ఆ వాదన నాకు ఆమోదయోగ్యం అయినా కాకపోయినా ఆ వ్యాఖ్యలను ప్రచురిస్తాను." అని తన బ్లాగులో అంటున్న ఈ పెద్దమనిషి అక్కడ తను ప్రచురించకపోవడం వల్ల ఇక్కడ నేను ప్రచురించిన భాగంలో ఏమి ఆసభ్యత ఉందో తన బ్లాగులో ఇంకా దాన్ని డెలిట్ చెయ్యకుండా ఉంటే పబ్లిష్ చేసి గానీ లేదా ఇక్కడి కొచ్చి ఈ భాగాన్ని పరిశీలించి గానీ నిరూపించగలడా?

     అయినా వాలికి జవాబు చెప్పుకునే చాన్సు ఇవ్వలేదని ఏడ్చేవాడు నేను నిజాయితీగా చెప్పిన జవాబుని ఎందుకు పబ్లిష్ చెయ్యటం లేదు?నాకు మండదా?నిజంగానే కాలగూడని చోట చురచురా కాలిపోయి కోపం నషాళానికే అంటింది!అయితే ఒకటి,ఎంత కోపం వచ్చినా నాకు మైండు మాత్రం మొద్దుబారదు,ఇంకా చురుకెక్కుతుంది!కలుగులో దాక్కుని అల్లరి చేస్తున్న ఎలకని బయటికి రప్పించాలంటే ఎరని విసరాలి వరసలు వరసలుగా పేర్చాలి.ఒక్కొక్కటిగా ఎరల్ని తింటూ బయటి కొచ్చిన ఎలకని లటుక్కున పట్టేయ్యాలి - అదీ ఒడుపు తెలిసిన వేటగాడి పద్ధతి!కామెంటులో కొంచెం మసాలా దట్టించి వదిలేసరికి ఠక్కున పన్లిష్ చేశాడు:-)గొప్ప తెలివిగా "చూశారా,చూశారా ఈ హరిబాబు ఎంత బూతులు మాట్లాడుతున్నాడో!" అని గుండెలు బాదుకుంటున్న ఈ అర్ధవంతమైన చర్చల్ని ప్రోత్సహించే ఉదారుడు ఇప్పటికైనా సరే ఆ కామెంటు లోని రెండవ భాగాన్ని అక్క పబ్లిష్ చేసి గానీ ఇక్కడి కొచ్చి గానీ ఆ కామెంటులో నేను తనకి వేసిన సూటి ప్రశ్నలకి జవాబు చెప్పగలడా?చెప్పలేడు - పిరికి దద్దమ్మ!తనకి నేను ఎందుకు మురమ్నాని స్వైరిణి అన్నానో చాలా సంస్కారవంతంగా జవాబు చెప్పి ఆ జవాబులో సూటిగా తనకి రెండు ప్రశ్నలు వేసిన కామెంటుని పబ్లిష్ చెయ్యకుండా నన్ను బద్నాం చెయ్యటానికి పనికొచ్చే కామెంటుని మాత్రం పబ్లిష్ చేసి సాటి వాళ్ళ కందరికీ చూపించి గగ్గోలు పెడుతున్న ఈ ప్రబుద్ధుడు ఈ మధ్యలో నేను పోష్టు చేసినా పబ్లిష్ చెయ్యని మరో కామెంటు ఇది:
-----------------------------------------
veNuvu
వ్యక్తిగతంగా హీనపరిచే దూషణలు చేయటమే తప్పు. వాటికి మళ్ళీ కారణాలు వివరిస్తూ సమర్థించుకోబోవటం ఏమిటి?!

haribabu
నేను బుద్ధిగా మొగుడితో కాపురం చేస్తూ గడిపిన మీ అభిమాన రచయిత్రిని "స్వైరిణి" అన్నందుకు మీకు ఖోపం వచ్చేసి అదేంటి ఆ పాడు పని ఆవిద చెయ్యలేదుగా అని ఆవిడ చెయ్యని పనిని అంటగట్టిన దుర్మార్గం గురించి నన్ను నిలదీస్తున్నారు గాబట్టి మీరు మరి సీతకీ రాముడికీ లేని దుర్గుణాల్ని ఆవిడ ఎందుకు అంతగట్టిందో చెప్పాల్సి ఉంటుంది - చెప్పగలరా?!


I know You are not able to answer that question!That’s why You  suppressed that part,coward:-)
-----------------------------------------


రవి గాంచనిది కవి గాంచును, కవి గాంచనిది కూడా హరి గాంచును - బస్తీమేసవాల్?!

Wednesday, 2 September 2015

రాజు లేనప్పుడూ సారంగో సారంగా!దులపర బుల్లోడో రంగనాయకి దుమ్ము దులపర బుల్లోడా?!

     ఈ మధ్యనే చలసాని ప్రసాద్ అనే ఒక మంచి కమ్యునిష్టు పెద్దాయన పోయారండి!మంచాయనే,యెందుకంటే భ్రమల్లో కూరుకుపోకుండా వాస్తవాలు తెలుసుకుంటేనే విప్లవానికి మంచిది అనే ఉద్దేశంతో చాలాకాలం క్రితమే "ఇలా మిగిలేం" అని ఒక పుస్తకం రాశారు.అందులో పేరుగల కమ్యునిష్టు నాయకులు వ్యక్తిగత జీవితాల్లో విప్లవ చైతన్యానికి దూరంగా ఉండటం గురించి చెప్పారు.కొన్ని సినిమాల్లో "ఈ చిత్రంలోని పాత్రలూ సన్నివేశాలు కల్పితం,యెవరినీ ఉద్దేశించినవి కావు" అని ముందు సూచన ఇచ్చినట్టు పనిగట్టుకుని అసలు పేర్లతో సహా ప్రస్తావించారు!అసలు పుస్తకం చదవలేదు గానీ పరిచయం కోసం యెవరో వ్రాసిన వ్యాసంలో ఇచ్చిన ఉదాహరణలు చదివాను.నెహ్రూ ఇందిర ద్వారా మిత్రులుగానే ఉంటున్న కమ్యునిష్టుల్ని మోసం చేస్తూ కేరళ మంత్రివర్గాన్ని కూల్చేసినప్పుడు సాక్షాత్తూ చలసాని ప్రసాద్ గారే దానికి వ్యతిరేకంగా కార్టూను వేస్తే ఒక సీనియర్ నాయకుడు మరీ అంత ఘాటుగా విమర్శించవద్దన్నాడట!ఇతరుల బానిసత్వపు సంకెళ్లని తెంచి మొత్తం ప్రజలందర్నీ బూర్జువా సమాజం నుంచి వర్గరహితసమాజం వైపుకి నడిపించాల్సిన పార్టీలో ఉన్న వాడు ఒక బూర్జువా పార్టీ సభ్యుదైన నెహ్రూకి యెంత విధేయత(?)/బానిసత్వం(!) చూపించాడు?!

     జాతీయ స్థాయిలో కొడవలిని కామన్ సింబల్ మాదిరి అట్టే పెట్టుకుని ఒకరు కంకినీ ఒకరు సుత్తినీ పంచుకుని యెందుకు CPI మరియూ CPM అనే రెండు విప్లవ పార్టీలుగా విడిపోయారో తెలియదు గానీ ఆంధ్రాలో మాత్రం తెలంగాణా సాయుధపోరాటం జరిగిన తీరు సరిగ్గా లేదు(ట!) అని ఒకరు అభిప్రాయపడటం ఒక కారణం అని చూచాయగా తెలుసు నాకు,రూఢిగా తెలియదు గనక ఆట్టే మాట్టాడగూడదు గానీ అదే నిజమైతే కమ్యునిష్టు అనేవాడు యెవడూ అనగూడని మాట కదా అది,కాదంటారా!ఒరేయి గాడిదా ప్రజలు వాళ్ళమీద జరిగిన దోపిడీని భరించలేక తిరగబడితే దానికి వంకలు పెడతావేంట్రా అని యెవడయినా అన్నాడో లేదో గానీ నేను అక్కడ ఉంటే తప్పనిసరిగా అలాగె మాట్లాడి ఉందేవాణ్ణి!యెందుకంటే కమ్యునిష్టు తరహా విప్లవమైనా సరే అక్కడ కమ్యునిష్టు పార్టీ వెయ్యేళ్ళుగా పని చేస్తున్నా సరే విప్లవాన్ని ఫ్యాక్టరీలో సబ్బునో టూత్పేష్తునో తయారు చేసినట్టు తీసుకురాలేరు!ఫ్రెంచ్ విప్లవం బాస్టిల్లీ జైలు ముట్టడితో మొదలైంది!అక్కడ రేగినది దావానలంలాగ వ్యాపించిందే తప్ప సరైననాయకుడు లేక గిలటైస్ భీబత్సాలతో చెలరేగిపోయి అరాచకత్వానికి దారి తీసింది!నెపోలియన్ అనుకుంటాను ఆ అరాచకత్వాన్ని అణిచేసి సుస్థిరతని తీసుకొచ్చాడు.రష్యాలో లెనిన్ ఒక చిన్న నిప్పురవ్వ రగలగానే ఒక రకంగా హైజాక్ చేసినత వేగంగా దాన్ని కమ్యునిష్తు విప్లవంగా మార్చాడు!చైనాలోనూ ప్రపంచాన్ని కుదిపేసిన పదిరోజుల్లో మావో నాయకత్వం ఉందబట్టి సరిపోయింది,లేకుంటే అక్కడా ఫ్రెంచ్ విప్లవం నాటి అరాచకత్వం మిగిలేది!

     వస్తుతః నాకు కమ్యునిజం అంటే ద్వేషం లేదు.శ్రీశ్రీ మూలంగా మా తరంలో ఆ ప్రభావం సోకని వాడు లేడు?!కష్టజీవికి న్యాయం జర్గాలనే ఆదర్శం ఖచ్చితంగా ఉన్నతమైనదే!అయితే తొలిసారి ముప్పాళ రంగనాయకమ్మ రాసిన విషవృక్షం కొంచెం చదవగానే అసహ్యం వేసింది!ఆవిడే చెప్పుకున్నట్టు గుర్తు శ్రీశ్రీ దగ్గిర ఆ విషయం కదిలిస్తే రామాయణ భారతాల జోలికెళ్ళటం గురించి వ్యతిరేకించాడని.జంఝెం తెంపేసినా బ్రాహ్మణుడైన శ్రీశ్రీకి తెలియదా రామాయణం గురించి?అప్పటికి నేను నాస్తికత్వంలో ఉన్నా చిన్నప్పటినుంచీ రామాయన కధ వివరంగా తెలుసు గనక రామాయణాన్ని విమర్శించటం ఇంత అధమస్థాయిలోనా అనిపించింది నాకే!తను నిజంగా సైధ్ధాంతిక నిబద్ధ్ధతతో విమర్సించదల్చుకుని ఉంటే ఆ పధ్ధతి వేరుగా ఉందేది.రామాయణంలో ప్రాస్తావికంగా యెన్నో విషయాలు చెప్పినా సీతారాములు దాంపత్యంలో పాటించిన నిష్ఠ ప్రధానమైన అంశం,కదా!దాన్ని విమర్శిస్తూ యేకపత్నీవ్రతం తప్పు అని వాదించిందా అంటే అదీ చెయ్యలేదు,ఇదే మనిషి మావో దాంపత్యాన్ని గ్లాసుడు మంచినీళ్ళ ఉదాహరణతో వెక్కిరించింది!అంటే మద్దెలకి అటో దరువూ ఇటో దరువూ అన్నట్టు మావోగారి గ్లాసుడు మంచినీళ్ళ పధ్ధతీ నచ్చలేదు,సీతారాముల పధ్ధతీ నచ్చలేదు,మరి ఈవిడ యేదైనా సరికొత్త పధ్ధతిని ప్రతిపాదించిందా - అదీ లేదు?!వాస్తవజీవితంలో యెవరూ సీతారాముల వలె నిష్ఠగా ఉండటం కుదరదు అని ఉదాహరనలు చూపించి యెవరూ ఆచరించలేని లక్ష్యం కాబట్టి ఇది చెత్త అని చెప్పినా గంభీరమైన తాత్విక చింతనతో కూడిన విమర్శ అయి ఉండేది!వెకిలితనం అనిపించుకునే రీతిలో రాముడు శూర్పణఖని లొట్టలేసుకుంటూ చూశాడు,సీత రావణుణ్ణి కోరికగా చూసి కన్ను కొట్టింది అని రాయటం యేపాటి సైధ్ధాంతిక విమర్శయో ఇప్పటికీ ఆమెని సమర్ధిస్తున్న వీరాభిమానులు చెప్పాలి,చెప్పి తీరాలి!నేను సారంగలోని పోష్టు దగ్గిర వేసిన వ్యాఖ్యలో చెప్పినట్టు జానకివిముక్తి కధకి మరో వెర్షను రాస్తే యెలా ఉంటుంది?చెత్తగా ఉంటుందని నా అంతట నాకే తెలుసు,అయినా వాళ్లకెలా ఉంటుందో తెలియాలి గాబట్టి అడుగుతున్నాను,దీనికీ జవాబు చెప్పి తీరాలి!శ్రీశ్రీ వల్ల కమ్యునిజం అనే ఆదర్శం పట్లా ఆకర్షితులైనవాళ్లలో చాలామంది మురంనా వల్ల వికర్షితులయ్యారు - ఆరకంగా మురంనా వల్ల పార్టీకి మంచి కన్నా చెడే యెక్కువ జరిగింది!

     వర్గరహితసమాజం యేర్పడితే నా కష్టానికి తగిన ఫలితం నాకు వస్తుందంటే కాదనటానికి నాకేమయినా పిచ్చా?కానీ మనం విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళాలంటే యేమి చేస్తాం?బస్సెక్కుతాం,యేదో ఒక బస్సు యెక్కుతామా!ఆ బస్సు హైదరాబాదు వెళ్తుందో లేదో ఒకటికి పదిసార్లు సరిచూసుకుని మరీ యెక్కుతాం.మరి వీళ్ళు తీసుకెళ్ళాలనుకుంటున్న వర్గరహితసమాజం ఆనవాళ్ళు చెప్పమంటే నిలువుగుడ్లేసుకుని చూట్టం తప్ప ఒక్క శాస్త్రీయమైన ముక్క చెప్పలేకపోతున్నారు,వీళ్ళని యెట్లా నమ్మాలి?కమ్యునిజంలో శాస్త్రీయత ఉందని నిరూపించాలంటే నమ్మకంతో పనిలేని ఆధారాలతో కూడిన వాస్తవిక వర్ణన కావాలి,అది మార్కుగారి దొసో కెపిత్యలో బుక్కులో అయినా ఉందా!గట్టిగా నిలదీస్తే అసలు సిధ్ధాంతానికే శాస్త్రీయత లేనప్పుడు ఈ  విరగబాటు దేనికి?

     అయినా మురంనా మరియూ మురంనా వీరాభిమానులకీ కమ్యునిష్టు చైతన్యం అంటే కనీసపు సంస్కారం కూడా లేకుండా ఉండటం అనీ మానవ సహజమైన మర్యాదలు కూడా దిక్కుమాలిన హిందూ మతతత్వానికి ప్రతీకలే గాబట్టి విప్లవ వ్యతిరేకుల పట్ల యెంత అమర్యాదగా వ్యవహరించినా తప్పు లేదనీ కొన్ని అభిప్రాయాలు స్మశానంలో దిగ్గొట్టిన మేకుకన్నా గట్టిగా యెముకల మూలుగల్లోకంటా యెక్కిపోయినాయని నా నమ్మకం!అందుకే బాపు గారు చనిపోయినప్పుడు మురంనా పాదరేణువు యేనాడో జరిగిన పాత విషయాన్ని కూడా కెలికి రచ్చ రచ్చ చెయ్యగలిగాడు!వాళ్ళ అభిమాన రచయిత్రి విషవృక్షం రాసేనాటికే బాపుగారు యెంతటి రామభక్తుడో లోకానికంతా తెలుసు!అయినా రాముణ్ణి బద్నాం చేసే తన పుస్తకానికి ఆయనగారు బొమ్మలు వేస్తాడని యెలా అనుకుంది?అప్పటికి తెలియకపోతే అప్పుడైనా తెలిసింది గదా,తెలిశాక సిగ్గుపడే రకం గాదే బాపూ?ఆయన చెక్కు వెనకాల రామ రామ అని రాయడం గురించి కూడా చెత్తవాదనలు చేశారు.అసలు ఆఫర్ తిరస్కరించినప్పుడే ఆ చెక్కు చెల్లనిదే గదా!ఒకసారి సంతకం గూడా చేసి పంపిన చెక్కు మరొకరికి ఇవ్వడం కుదురుతుందా?చెక్కుని చెల్లగొట్టడానికి నువ్వు బ్యాంకులో వేసిన దబ్బు పదిలంగానే ఉంటుంది గదా,క్రాస్ చేసి ఇచ్చిన చెక్కుని మరొకరికి ఇవ్వగలవా?మరి చెల్లని దాని మీద యేమి రాస్తే యేమి గోరం జరుగుతుందట!?ఆ కొంటెబొమ్మల బాపు అట్లాంటి కొంటెపని చెయ్యకపోతేనే హాశ్చెర్యపడాలిస్మీ:-)

     ఇప్పుడీ చెత్తపని - సరిగ్గా ఇప్పుడే ఇదే మంచి సమయమూ మించినన్ దొరుకదూ అని యేగేసుకుంటూ వొచ్చి చలసాని ప్రసాద్ పోయినప్పుదు వరవరరావు  పాతసంగతుల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఈమెగారు అందులో వేలుపెట్టి కెలక్కపోతే యేమవుతుంది?!బాపుగారి విషయంలో అంటే కొందరికి పాయింటు ఉంటే ఉండొచ్చు,కానీ ఇక్కద తను వాగినవన్నీ అబధ్ధాలే గదా!అసలు జరిగింది వేరు, చరిత్రలో రికార్ద్ అయి ఉంది!తను పులుముడు ద్వారా చూపించినది వాస్తవ విరుధ్ధం అని చెప్పడానికి వాల్మీకిలాగా చచ్చి స్వర్గాన లేరు  ఈవిడ చెప్పిన కుట్రదారులు - అదే కొంపముంచింది ఈసారి!ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల అంటే దృశ్యం సరదాగా ఉంది గాబట్టి చూశాము గానీ అదంతా నిజమేనని నమ్మేవాళ్ళు యెంతమంది?ఇప్పుడు మురంనా పరిస్థితీ అదే!అందుకే ఇప్పుడు వాతలు పడుతుంటే వ్యక్తిగత ద్వేషం చూపిస్తున్నారని యెడుపుముఖాలకి దిగారు.నిజం నిప్పులాంటిది,దాంతో ఆడుకోవాలనుకంటే ఇలాగే కాల్తుంది!శ్రీశ్రీ వీరపూజని సమర్ధిస్తూ ఒక చిన్న నినాదం ఇవ్వగానే తప్పు చేశాడని వెక్కిరిస్తూ మీరు మురంనాకి చేస్తున్నదేంటి - భూతపూజయా?అయినా యెక్కడ జరగలేదు వీరపూజ!రష్యాలో మసోలియం లెనిన్ ఒక్కడికే యెందుకు కట్టారు?అందరికన్నా అతడు మరింత గొప్పవాడు అని కదా!చైనాలో మావో ఫొటోలు మాత్రమే కనబడుతున్నాయేమిటి - లాంగుమార్చిలో పాల్గొన్నవారిలో మిగులినవారు తాజమహలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల పాటి చెయ్యలేదా?ఆస్తికులు దేవుడి విగ్రహం ముందు చేతులు జోడించి నమస్కరించటం హేతువిరుధ్ధమయితే మీరు యెర్రజండా ముందు నిలబడి పిడికిళ్ళు బిగించి వందనం చెయ్యడం హేతువిరుధ్ధం కాదా?మీ తప్పులు తెలుసుకోకుండా వూరికే విరగబడకండి,మీ కాళ్లకింద భూమి మీకు తెలియకుండానే కదిలిపోయి అందాక దక్కిన అధికార పీఠం కూడా జారిపోతుంది.చరిత్ర యెవడికీ వలపక్షం చూపించదు - బహుపరాక్!

     చూడండి ఇప్పుడేమయిందో - మొత్తం కమ్యునిజం పరువు చిరిగి చాటంతయ్యింది:-)విప్లవ వ్యతిరేకులకి పండగయ్యింది!రంగనాయకమ్మ అభిమానుల కిప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది,ఇదివరకట్లాగ ఢమేల్ ఢమేల్ మంటూ చెలరేగిపోయి గయ్యాళితనంతో పేట్రేగిపోకుండా యేడుపు ముఖాలు వెయ్యడానికి అసలు కారణం అదే!అస్సలు జవాబు చెప్పడానికి దిక్కూదివాణం తెలీని ప్రశ్నొకటి వొచ్చిపడింది,"రంగనాయకమ్మ గారు యెన్ని ప్రజా సమస్యలలో ప్రత్యక్షం గా పాల్గొన్నా"రని?!కమ్యునిష్తు పార్టీ మీటింగులకి సంబంధించిన ఫొటోల్లో చూశాను గానీ ఈవిడకి కనీసం రెండిట్లో యే కమ్యునిష్టు పార్టీలోనన్నా సభ్యత్వం ఉందా అనేది నాకనుమానమే!యూనివర్సిటీల్లో అప్పుడప్పుడూ కుర్రాళ్ళకి విజిటింగు ప్రొఫెసర్లతో గూడా లెక్చర్లు చెప్పిస్తారు మరి,ఆ లెక్కన వాళ్ళు పిలిస్తే ఈమె వచ్చి కూర్చుందేమో!పార్టీలలోనూ సంస్థలలోనూ సభ్యత్వం ఉన్నప్పటికిన్నీ లేనప్పటికిన్నీ ఆమెకి సంబందించినంత వరకూ పెద్ద వ్యత్యాసము లేదు, శ్రీమతి రంగనాయకమ్మలుంగారు ప్రజొద్యమములలో ప్రత్యక్షముగా ఇంతవరకు పాల్గొనలేదు,ఇకముందు కూడా పాల్గొనరు - అయితే యేమిట్ట!వారు వెలమకులమున బుట్టిన రాణీత్వము గలవారు,అలగాజనముతో తిరుగుట వారికి సరిపడదు!అది కేవలము శ్రీశ్రీ,వరవరరావు,చెరబందరాజు వంటి పురుషాధముల పని!ఆ యధముల పరువు పోగొట్టి విప్లవము పరువు నిలబెట్టుటయే వారికి మార్క్సు మహేశ్వరుడు కలలో కనిపించి యప్పగించిన రాచకార్యము! స్వామిని వారి దినచర్య ఇట్లుండును - కనిపించిన ప్రతి పుస్తకమునూ చదివిన ప్రతి విషయమునూ తన బ్రాండు మార్కు వ్యంగ్యమునకు పనికి వచ్చు విషయేమేదేని కలదా యని శోధించుట,దొరికినచో వేణువు వంటి పాదరేణువులూ,ప్రవీణ్ కుమార్ వంటి బభ్రాజమానములూ,వీరబొబ్బిలి వంటి వీరభక్తులూ,మార్క్సిస్ట్ హెగెలియన్ వంటి మూర్ఖ శిఖామణులూ హర్షపులకాంకిత గాత్రులై బాష్పవారి పరిపూర్ణ లోచనులై కిందపడి దొర్లునంతటి వికటహాస్యము రంగరించి ప్రచురణకు పంపుట - అంతకు మించి వారు గడప దాటి బయటకు రారు - ఘోషా సంప్రదాయ మొకటి అఘోరించినది కద వెలమ కులమున?!మీ ఇంటికొచ్చి మిమ్మల్నెవరన్నా విసిగిస్తున్నారనుకోండి,మీరేం చేస్తారు,"వెళ్ళవయ్యా వెళ్ళు పన్లేక నువ్వొచ్చి నా బుర్ర  తింటున్నావు" అని ముఖం మీదనే తలుపేస్తారు మీరే స్వయంగా!కానీ ఈవిడగారు మాత్రం స్వయంగా అలాంటి చెత్తపన్లు చెయ్యరు,చరచరా ఆక్కణ్ణించి అంతఃపురంలోకి వెళ్ళిపోయి "గాంధీ! ఆ మూర్ఖ విజిటరుని బయటికి తరిమికొట్టి తలుపు వేయుము" అని ఆజ్ఞలు జారీ చేస్తారు - రాణీత్వం?!

     వరవరరావు లాగా పొట్టకూటికోసం ప్రభుత్వోద్యోగాలు చేసి అభాసుపాలు కాకుండా,కళ్ళముందు జరుగుతున్న అన్యాయాలకి స్పందించి కార్యాచరణకి దిగి తప్పులు చెయ్యకుండా కాపాడుకుంటూ విప్లవపధగామి అనే పేరుకి యేమాత్రం భంగం రానివ్వకుండా బతకటానికీ తనకొక స్వర్గమందిరాన్ని కట్టుకుని దిగిరాకుండా కూర్చోవడానికీ సరిపడినంత ఆర్జన పుస్తకాల/రచనల ద్వారానే రావాలంటే ఆ పుస్తకాలు/రచనలు యెట్లా ఉండాలో ఆమెకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు - అదే ఆమెలోని ప్రజ్ఞ!చెత్తగా మాట్లాడుతూ కూడా గొప్ప మేధావిలా పేరు తెచ్చుకునే అద్ర్ష్తం అందరికీ ఉంటుందా!కంచె అయిలయ్య అనే మరిఒకాయనకి గూడా ఈదే అదృష్టం పట్టి విరగబడి పోతున్న్నాడు - కులరహితసమాజం,దళితప్రభుత్వం నా లక్ష్యం అంటూనే నా కురుమగొల్ల కులం విశ్వవ్యాప్తం కావాలి అని అంటున్నాడు!యేం,ఆ కోరిక చాకలి,మంగలి,తట్టాయి,బుట్టాయి కులాలన్నిటికీ ఉండొచ్చు గదా?అందరికీ అదే ముచ్చట ఉన్నపుడు ఆ పోటీలో కురుమగిల్ల కులం ఒక్కటే గొప్పది యెట్లా అవుతుంది?అందులోనూ వూరితోనో జిల్లాతోనో ఆగలేదు యేకంగా విశ్వవ్యాప్తం కావాలంట!ఇట్టాంటోళ్ళంతా గొప్పోళ్ళయ్యారంటే కాలానిగ్గూడా గాచ్చారం గాండుమారిందని తెలీట్లా?!

     రంగనాయమ్మ అదృష్టమే అదృష్టం!యే చెత్త రాసినా సైధ్ధాంతిక విమర్శ కింద చెల్లిపోతున్నది!యేనాడూ విప్లవానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడని శ్రీశ్రీని బట్టుకుని "దాటవేతల కవి" అన్నా గౌరవప్రదమయిన తప్పులు పట్టు కార్యక్రమం గానే తేల్చేసారు!జరిగినదొకటయితే మరొకటి జరిగినట్టు పులుముడు పాండిత్యం చూపించి రాసినా ఈమెగారు పరిశోధించి కనుక్కున్న పరమసత్యంలాగ చరిత్రలోకి యెక్కేసింది!ఆమెది కచ్చిబోతు తనం అంటున్నారు సరే ఆమెని విమర్శిస్తే యెవరికి లాభం అనేకాడికి వెళ్ళినా అమాయకులుగానే కనిపిస్తున్నారే తప్ప పొరపాటు ఒప్పుకోకుండా తప్పుకుపోవాలని చూస్తున్నారని యెవరికీ అర్ధమే కావడం లేదు!క్షమాపణ అడగటమే వూహలోకి రానంత దుస్థితిలో ఉన్నారు విమర్శించేవాళ్ళు కూడా!వరవర రావు దగ్గిర్నుంచి హెచ్‌ఆర్‌కే‌హెచ్‌ఆర్‌కే వరకూ "యేమిటి నీ గొప్ప!నువ్వు చేసింది తప్పు!సారీ చెప్పు!" అని గట్టిగా గద్దించి మాట్లాడ్డానికే జంకుతున్నట్టున్నారు - యేమి వైభవం?ఇట్లాంటి వైభవాలన్నీ దేవుణ్ణి నమ్మని ఆవిడకే ఇచ్చిన దేవుడు నన్నెందుకు అవేమీ ఇవ్వకుండా పుట్టించాడు?


దేవుడా!ఇవ్వన్నీ రాంభక్తుడినైన నాకిస్తే నీ సొమ్మేం పోయిందయ్యా?

Friday, 21 August 2015

గతితార్కికభౌతికవాదం భారతీయ కమ్యునిష్టులకి తాము పుట్టిన దేశాన్ని బద్నాం చేస్తూ చరిత్ర గురించి అబధ్ధాలు చెప్పటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాలేదు కాబోలు!

    నాకు లెనిన్ మొట్టమొదటిసారిగా యే సన్నివేశంలో నచ్చాడో తెలుసా!నిజానికి రష్యా కమ్యునిష్టు దేశంగా మారడమనేది ముందుగా ప్లాను చేసుకున్న ప్రణాళిక ప్రకారం జరగలేదు.కమ్యునిష్టు పార్టీ అనేది ఉంది,కానీ అణచివేత ప్రమాదం ఉంది గనక రహస్యంగానే పని చేస్తూ ఉండేది.ప్రజల్లో జార్ ప్రభువుల అరాచకత్వం పట్ల వ్యతిరేకత ఉంది,కానీ వాళ్ళు తిరగబడే పరిస్థితులు లేవు.అయితే హఠాత్తుగా ఒక నిప్పురవ్వ అరగిలింది - ఫ్రెంచ్ విప్లవంలో క్కూడా ఇలాగే బాస్టిల్ల్లీ కోట ముట్టడి లాంటి ఒక చిన్న సంఘటన నుంచే అంత భీబత్సమైన విప్లవం మొదలైంది!అయితే ఆ చిన్న సంఘటన యొక్క ప్రాముఖ్యతని గుర్తుపట్టి ప్రవాసంలో ఉన్న లెనిన్ శరవేగంగా అక్కడికి చేరుకుని పార్టీ సభ్యుల్ని కూడా అంత వేగంగానూ కదిలించి మొత్తం రష్యా భూభాగాన్ని కమ్యునిష్టు పార్టీ అధ్వర్యంలోకి తీసుకొచ్చి ఆ చిన్న తిరుగుబాటుని గొప్ప విప్లవంగా మార్చివేశాడు - ఒకరకంగా లెనిన్ ఆ సంఘటనని హైజాక్ చేసేసి విప్లవాన్ని స్థాపించినట్టే లెఖ్ఖ!అయితే అప్పటికే తను అన్ని రకాల ప్రణాళికలూ వేసుకుని ఉన్నాడు విప్లవం విజయవంతం కాగానే యెప్పుడెప్పుడు యేమేమి చెయ్యాలి అని.అప్పుడు చేసిన ప్రతిపాదనలలో ముఖ్యమైనది "జాతుల స్వయం నిర్ణయాధికారం" అనేది ఒకటి!దీని ప్రకారం రష్యా కూడా ఒక భాగమైన యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని పిలిచే భూభాగం మీద ఉక్రేనియన్,ఉబ్జెక్,కజాక్,అజర్బైజాన్,లిధువేనియన్,లాట్వీన్ మొదలైన ప్రత్యేక సంస్కృతులతో పరిఢవిల్లే జనసమూహాలు ఉన్నాయి.వారందరికీ మీ ప్రాంతాన్ని మీరే పరిపాలించుకోమని స్వేచ్చ ఇచ్చేశాడు.కానీ లెనిన్ ఇచ్చినా తీసుకోకుండా వాళ్ళు లెనిన్ నాయకత్వంలోనే ఉంటామని చెప్పి కలిసే ఉండిపోయారు.ఇక్కడ విశేషం యేమిటంటే యే జాతికయినా తన సంస్కృతి మీద మమకారం ఉండాలనేది లెనిన్ ఒప్పుకున్నాడు.అతనిలోని ఆ ఔన్నత్యమే ఆయా జాతుల వారినందరినీ లెనిన్ నాయకత్వానికే విధేయులై ఉండేలాగ చేసింది!మరి భారతీయ కమ్యునిష్టులు తాము పుట్టిన దేశపు సంస్కృతినే అవమానిస్తున్నారు,యెందుకు?



     ఒక చోట అన్యాయం జరిగితే స్వదేశీయుడైనా స్వజాతీయుడైనా ధిక్కరించి తీరాలి,దానిని కాదంటే కాదన్నవాడు మనిషే కాడు!ప్రతి ప్రాంతంలోనూ అక్కడి శీతోష్ణస్థితుల కనుగుణంగా వస్త్రధారణా,ఆహారపు టలవాట్లూ,ఆర్జన సాధనాలూ,ఆచార వ్యవహారాలూ ఆ ప్రాంతానికి అంటుగట్టుకునిపోయిఉంటాయి.ఆ ప్రాంతంలో క్షేమంగా బతకాలంటే విధిగా వాటిని అనుసరించాలి.ఒకవేళ అవి అనవసరమైనవి అనిపిస్తే మొత్తం సమాజం ముందు సోదాహరణంగా చెప్పి ఒప్పించటం గొప్ప విషయం,దాన్ని తప్పని యెవరూ అనరు,అనలేరు!ఒక విషయం తమకి ప్రమాదమని తెలిసినా వదలకుండా పట్టుకుని ఉండేవాళ్ళూ,ఒక విషయం క్షేమకరమని తెలిసినా తీసుకోకుండా మొండికెత్తేవాళ్ళూ యెక్కడయినా ఉంటారా చెప్పండి!ఒకరికన్నా యెక్కువగా హీనపక్షం ఇద్దరు ఒకచోట కలిసి బతకాలంటే వాళ్ళు ఒకరికొకరు హాని చేసుకుని అందరూ నశించిపోకుండా ఉండటం కోసం తప్పనిసరిగా కొన్ని నియమాలు పెట్టుకోవాలి - అవి సత్యం,ధర్మం,న్యాయం అనేవాటిని నిర్వచిస్తాయి!నియమాలు తప్పయితే అందరి అనుమతితో వాటిని సంస్కరించాలి గానీ ఒక నియమం పెట్టుకున్నాక వాటిని తప్పితే యేమవుతుంది?నువ్వు నీ స్వప్రయోజనం కోసం చేస్తే నువ్వు బలహీనుడివైతే మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా నిన్ను దండిస్తారు!నీ వ్యతిక్రమణ వాళ్ళకి నష్టం గనుక వాళ్ళు నిన్ను దండించటం న్యాయమే కదా!నీకు హాని కలిగించే విధంగా యెదటివాడు అతిక్రమిస్తే నువ్వూ వూరుకోవు గదా!దీనికోసమే రాజ్యం అనేది రంగప్రవేశం చేసింది.యెక్కడయినా రాజ్యం దండన ద్వారానే ధర్మాన్ని స్థాపిస్తుంది!నియమాలలో తప్పు ఉండి వాట్ని మార్చగలిగినవాళ్ళు సంస్కర్తలు అవుతారు.నియమాల్ని స్వప్రయోజనం కోసం ధిక్కరించటం యెప్పుడూ ఇతర్ల శ్రమని దోచుకోవటానికే జరుగుతుంది!

     యే రెండు జాతుల్ని పోల్చినా కొన్ని సారూప్యతలూ కొన్ని వైవిధ్యాలూ ఉంటాయి!యే రెండు జాతుల్ని యే విషయం ప్రకారం పోల్చినా ఆ రెంటిలో ఒకటి మెరుగ్గా కనబడటం సహజం.ఒక జాతితో పోల్చిన మరొక జాతి మెరుగ్గా కనబడితే ఆ మెరుగైన దాన్ని ఇంకొక జాతితో పోల్చినప్పుడు మూడవది ఇంకా మెరుగ్గా కనబవచ్చు - మెరుగు తరుగులు సహజం!ఈ పోలికలకి ఉపయోగిత,అంతర్గతసౌష్ఠవం,బాహ్యసంస్కారం లాంటి ధనాత్మక అంశాలనే ఉపయోగిస్తారు గనక  యెన్నింటితో పోల్చినా ఒక సంస్కృతి అన్నింటిలొనూ మెరుగే అని తేలితే ఆ సర్వోత్తమమైన జాతికి చెందిన వారు ఇతర్ల ప్రశంసలకి ఆనంద పడటం దోషమా?అహంకరించి గొప్పలు చెప్పుకోవటం తప్పు గానీ కనీసం ఆనందించటం కూడా తప్పేనా!

     "భారత్,మా జాతికి మాతృభూమి మరియు సంస్కృతం యూరప్ భాషలకు తల్లి.తత్వవిచారణలో భారతదేశమే మాకు మాతృమూర్తి.తల్లి యెలాగంటే,ఆమె యొక్క గణితమే అరబ్బుల ద్వారా మ్నకు అబ్బింది.బుధ్ధుడి ద్వారా క్రైస్తవంలో ఆదర్శాలను ఏర్పరిచింది.గ్రామస్వరాజ్యం,స్వయంపాలన,ప్రజాస్వామ్యం నేర్పిన తల్లి భారతదేశమే.అందుకే తల్లి భారతి మనందరికీ అనేక విధాలుగా అమ్మ" అని విల్ డురంట్ అనే అమెరికన్ చరిత్రకారుడు ప్రశంసించాడు!"భారతదేశం, మానవజాతికి ఊయెల,మానవజాతి వాక్కుకి జన్మస్థానం,చరిత్రకి తల్లి,వీరత్వానికి బామ్మ,సంప్రదాయానికి జేజెమ్మ.మానవజాతి చరిత్రలో అత్యంత విలువైన,మరియు అత్యంత వివరణాత్మకమైన విషయాలన్నీ భారతదేశమందే పోగు చేయబడి ఉన్నాయి." అని మార్క్ ట్వెయిన్ అనే అమెరికన్ రచయిత ప్రశంసించాడు!"మానవుడు,తన ఉనికి గురించి కన్న కలలు మొదలుకొని అన్ని కలలను సాకారం చేసుకునేందుకు ఈ ప్రపంచంలో ఆశ్రయం కల్పించిన ప్రదేశం ఏదైనా ఉందంటే, అది కేవలం భారతదేశం మాత్రమే" అని రోమైన్ రోలాండ్ అనే ఫ్రెంచి పండితుడు ప్రశంసించాడు!మరి మన వెధవాయలు యేం చేస్తున్నారు?అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోనూ పెట్టటం లాంటి నికృష్టానికి తెగబడ్డారు!

     యే రెండు జాతుల మధ్యనయినా ఆదానప్రదానాలు సహాయం,వ్యాపారం,యుధ్ధం అనే మూడురకాలుగా ఉంటాయి.యే పధ్ధతిలో జరిగినా ఒకరికి లాభం ఒకరికి నష్టం తప్పకుండా ఉంటాయి!సహాయంలో కూడా మన దగ్గిర ఉన్నది యెదటివాడికి ఇవ్వడం అనేది నష్టమే,కానీ యెదటి వ్యక్తి పట్ల ఉన్న అభిమానం వల్ల మనము దాన్ని నష్టం అనుకోము.మన దేశాన్ని తిడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడికి మరొక దేశమేదో గొప్పగా నచ్చేసిందని అర్ధం చేసుకోవాలి - యేదో ఒకరోజున ముసుగు విప్పేసి బైటపడతాడు గూడాను!ఒకవేళ వాడికి నచ్చిన దేశం మన దేశం మీద దాడి చేస్తే యేం చేస్తాడు?ఆ దేశమే గెలవాలని కోరుకుంటాడు గదా!అది దేశద్రోహం కాదా?

     వాళ్ళ దగుల్బాజీతనానికి మెచ్చుతునకైన ఒక వుదాహరణ చెప్తాను.అయోధ్యలో  రామజన్మభూమి వివాదాన్ని విచారిస్తున్న న్యాయమూర్తులకి "అసలు హిందువులు క్లెయిం చేస్తున్నట్టు మసీదు కింద హిందూ కట్టడం యేదయినా ఉందని ఆధారాలు ఉన్నాయా" ఒక సాంకేతికపరమైన సందేహం వచ్చి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వార్ని సంప్రదిస్తే వారు అన్ని పరిశీలనలూ జరిపి సాక్ష్యాధారాలతో సహా మసీదు కింది పొరల్లో ఒక హిందూ ఆలయం ఉందని నిర్ధారిస్తే ముస్లిములు దాన్ని యేకపక్షమైన రిపోర్టు అంటూ 8మంది "ఎమినెంట్ ప్రొఫెసర్ల"ని సాక్ష్యానికి తీసుకొచ్చారు.ఈ "ఎమినెంట్ ప్రొఫెసర్ల"లో 6గురు హిందువులు?!చూడండి మమ్మల్ని హిందువులు కూడా సమర్ధిస్తున్నారు అని చెప్పుకోవటానికి అమాయకంగా తెచ్చారో యెత్తుగదతో తెచ్చారో గానీ వారు పేరుకే హిందువులు!హిందువులనే పేరుతో ముస్లిములు సాక్ష్యానికి తెచ్చిన మేతావులు యేనాడూ అయోధ్యలో అడుగు పెట్టకుండానే యే తవ్వకాలూ జరపకుండానే యే పరిశోధనలూ చెయ్యకుండానే ASI చేసిన పరిశోధన యేకపక్షం అని మీడియాలో గోల చేసిన వాళ్ళు కోర్టు విచారణలో తెల్లముఖాలు వేశారు,యెందుకో తెలుసా!అక్కడి లాయర్లు కోర్టులకి కావలసింది నమోదు చేసుకోవటానికి పనికొచ్చే గట్టి సాక్ష్యాలు గానీ వీళ్ళు మీడియా ముందు వాగటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని సొల్లుకబుర్లు కాదని తెలిసినవాళ్ళు గనక  వాళ్ళు చెప్పిన విషయాల గురించి అడిగిన ప్రశ్నలకే సరయిన సమాధానాలు చెప్పలేక సాక్ష్యాధారాలు చూపించలేక చివాట్లు తిని చెవులు దులుపుకుని పోయారు - సిగ్గు పడ్డారో లేదో తెలియదు!వీళ్ళుట "ఎమినెంట్ ప్రొఫెసర్లు"ట?!

     ఇదొక్కటే అయితే జన్మానికొకసారి పొరపాటు పడ్డారు పోనీలెమ్మని అనుకోవచ్చు,ప్రతి విషయంలోనూ ఇట్లాగే ప్రవర్తిస్తున్నప్పుడు వీళ్ళ నిర్వాకాల్ని తెలిసి కూడా బైటపెట్టకపోతే చరిత్ర క్షమిస్తుందా మనల్ని?బుధ్ధుడు మహాశాంతిమూర్తి,మహావీరుడయితే లోకోత్తరుడే అని ప్రచారం చేసి హిందూమతం ఈ  రెండు మతాల ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోయిందనీ దుర్మార్గంగా ఈ రెంటినీ దేశం నుంచి తరిమికొట్టి గానీ మళ్ళీ పూర్వపు వైభవానికి రాలేకపోయిందని యెన్ని కబుర్లు చెప్తున్నారు?బౌధ్ధమూ జైనమూ బ్రాహ్మణ మతానికి పూర్వం ఉన్న స్వచ్చమైన హిందూమతం అని ఒకసారీ అబ్బెబ్బే హిందూమతానికీ ఈ రెంటికీ పోలికే లేదు వీటిలో ఉన్నదంతా కొంగొత్త భావధార అని ఒకసారీ  అనేవాళ్ళు సత్యసంధులా?

     ఇవ్వాళ కనిపిస్తున్న జైనులు అహింసామూర్తులే,సందేహం లేదు!కానీ వారి 24 తీర్ధంకరులలో నలుగురు చక్రవర్తులు?!చక్రవర్తులు కావాలంటే యుధ్ధాలు చేయాలి,ఇతర రాజ్యాల్ని గెలవాలి!మరి,యే ఒక్క శత్రుసైనికుణ్ణీ చంపకుండానే యుధ్ధాలు గెలుస్తారా?కేవలం ఈ నలుగురు తీర్ధంకరులు మాత్రమే కదా చక్రవర్తులు అని మీరు అనుకుంటే తప్పులో కాలేసినట్టే,తీర్ధంకరులలో క్షత్రియులు కానివారు యెందరున్నారో చెప్పమనండి యే జైన మతస్థుదినైనా!క్షత్రియుడైన ప్రతివాడికీ యుధ్ధం చెయ్యటం విధి - యుధ్ధాలు గెలిస్తేనే కదా రాజయ్యేదీ ఆ తరవాత చక్రవర్తి అయ్యేదీ - మరి హింస లేని యుధ్ధం ఉంటుందా!జైనుల మొదటి తీర్ధంకరుడైన రిషభదేవుని పెద్ద కుమారుదు భరతుడు మొదటి చక్రవర్తి.ఇతని పేరుతోనే మన దేశం భరతఖండం అయిందని హిందూ జైన పురాణాలు రెండూ అంగీకరిస్తున్నాయి!

     మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు జైనమతస్థుడే!నిజానికి మగధను పాలించిన చాలా వంశాలకు సంబంధించిన రాజులంతా అవైదిక మతాలైన జైన/అజీవక సంప్రదాయాల్ని పాటించారు!ఈ చంద్రగుప్తుడి కాలంలోనే అలెగ్జాండరు మన దేశం మీదకి దండెత్తి వచ్చాడనీ పురుషోత్తముణ్ణి చీకటి మాటున నది దాటి వచ్చి గెలిచాడనీ గెలిచాక సెల్యూకస్ అనేవాణ్ణి తన ప్రతినిధిగా ఇక్కడ ఉంచాడనీ చెప్పే విషయాలు అన్నీ అబధ్ధాలే!ఈ మౌర్య చందర్గుప్తుడి కాలంలో సెల్యూకస్ వచ్చి ఇతని చేతిలో ఓడిపోయి తన కూతురు హెలీనాని ఇతని కిచ్చి పెళ్ళి చేసి వెనక్కి వెళ్ళిపోయాడు.

     మనకి అశోకుడి గురించి ఇప్పుడు వినపడుతున్న విషయాలు కూడా చాలామటుకు రూఢిగా నిర్ధారణ కానివే అయినా ప్రామాణికమైన చరిత్రగా పరిగణించి పాఠ్యపుస్తకాల్లోకి కూడా యెక్కించేశారు!అశోకుడు కళింగ యుధ్ధం తర్వాత అక్కడి భీబత్సానికి మనసు చెదిరి పశ్చాత్తాప పడి బౌధ్ధమతాన్ని అనుసరించాడనేటందుకు కూడా విరుధ్ధంగా కనబడేవి బౌధ్ధ మత సాహిత్యంలోనే ఉన్నాయి.అశోకుడి గురించి చెప్పటానికి బౌధ్ధులు రచించిన "అశోకవదన" అనే గ్రంధంలో ఒక భాగం అశోకుడు తను హింసిస్తున్న ఒక బౌధ్ధసన్యాసి యొక్క సహనశీలత్వాన్ని చూసి పరిశుధ్ధుడు అయ్యాడు అని వ్యాఖ్యానిస్తుంది.అప్పటివరకూ యెన్నో యుధ్ధాలు చేసిన వాడు,పైగా అతని క్రూరత్వం వల్ల చండాశోకుడు అని కూడా వర్ణించబడిన వాడు ఆ ఒక్క యుధ్ధంలో ఒక్కసారిగా పశ్చాత్తాప పడిపోయాడంటే నమ్మాలా?ఈ బుధ్ధ భిక్షువుని హింసిస్తూ వుండగా మారటం అనే కధ కూడ గట్టి సాక్ష్యాలు లేనిదే!పోనీ తన 13వ శిలాశాసనం ప్రకారం "దేవానాం ప్రియుడు ఇక యుధ్ధాలు చెయ్యడు" అని చెప్పుకుని పూర్తిగా అహింసాయుతంగా ఉన్నాడనేటందుకూ ఆధారాలు లేవు.అదే అశోకవదన గ్రంధంలో ఒకచోట అశోకుడి క్రూరత్వాన్ని గురించి చేప్పే మరొక కధ వుంది.ఒక జైనసాధువు గౌతమబుధ్దుడు తమ దేవుడి ముందు మోకరిల్లినట్టుగా ఒక బొమ్మ వేస్తే ఒక బౌధ్ధ శ్రమణుడు అశోకుడికి విన్నవించుకున్నాడట.దానికి అశోకుడు వేసిన శిక్ష - మొత్తం 18,000 మంది జైనుల్ని అజీవకుల్ని మరణశిక్ష విధించి చంపెయ్యటం!బౌధ్ధులు అమాయకులే అయి ఉండవచ్చు, యేదో తమ మనోభావాలకి భంగం కలిగిందని రాజుని వేడుకుంటే రాజు చేశాడని సరిపెట్టుకోవడానికీ కుదరదు!ఈ అశోకుడే చనిపోయేటప్పుడు కొంత సొమ్మ్ముని దానంగా వ్రాయించి అప్పటికి ఇవ్వకుండా మరణించాడు.అతని తర్వాత రాజ్యానికి వచ్చిన అశోకుడి మనుమడు సంప్రాతి మొదట దాన్ని చెల్లించి గానీ సింహాసనం యెక్కలెకపోయాడు - అదీ బౌధ్ధుల శ్రమణత్వం!

     వీళ్ళు హిందూమతాభిమాని అయిన పుష్యమిత్రుడు బౌధ్ధాన్ని క్రూరంగా అణిచివేశాడు అని ఆరోపిస్తున్న విషయం కూడా అశోకవదన గ్రంధం లోనిదే!పుష్యమిత్రుడి కన్నా ముందు వీళ్ళంతా ఉదారుదని పొగుడుతున్న అశోకుడు కూడా బౌధ్ధుల్ని సంతోషపెట్టటానికి జైనుల్ని హింసించాడు కదా!అక్కడ అశోకుడూ జైనసాధువు తల నరికి తెస్తే తలకి 1 బంగారు నాణెం ఇస్తానని ప్రకటించాడు,ఇక్కడ పుష్యమిత్రుడూ బౌధ్ధబిక్షువు తల నరికి తెస్తే తలకి 100 బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించాడు - యేమిటి తేడా?!!అయినా ఇలాంటి ఒకేఒక్క సంఘటనతో యే మతమూ తుడిచిపెట్టుకు పోదు.బౌధ్ధం,జైనం - ఈ రెండు మతాలూ అవి తొలిసారి ప్రాచుర్యం లోకి వచ్చిన కాలంలో సామాన్యులకి అసలు గుర్తింపు లేదు.యే మతం ప్రాచుర్యంలోకి రావాలన్నా రాజాశ్రయం పొంది రాజమతంగా గుర్తింపు పొందటం తప్పనిసరి!ఒకసారి రాజు ఒక మతాన్ని రాజమతంగా ఒప్పుకున్నాడంటే ఖజానాలో సింహభాగం వాళ్ళ పరమైనట్టే!రాజుకి వీళ్ళ ప్రవచనాల ద్వారా ప్రజల్లో తనపట్ల విధేయత ఉండే సౌకర్యం ఉంటుంది - ఇచ్చి పుచ్చుకోవడం!

     ఒక రాజ్యంలో ఒక రాజు ఇట్లా చేసినంత మాత్రాన ఉపఖండం అని పిలవదగినంత పెద్ద దేశంలో వీళ్ళొక్కళ్ళేనా ఉన్నది - మిగతా చోట్లకి పోవచ్చును గదా?అసలు యెప్పుడో ఒకసారి జరిగే ఇలాంటి చెదురు మదురు సంఘటనల వల్ల యే మతమూ ఒక్కసారిగా తుడిచిపెట్టుకు పోదు.జైనం అశోకుడు చేసిన ఆ ఒక్క సంఘటనతో తుదిచిపెట్టుకు పోయిందా,లేదే?బౌధ్ధం పుష్యమిత్రుడు చేసిన ఆ ఒక్క సంఘటనతోనే హఠాత్తుగా తుడిచిపెట్టుకుపోయిందా,లేదే!ఒక మతం రాజమతం హోదాను తెచ్చుకోవాలన్నా మరో మతం ఆ హోదాని ఆక్రమించాలన్నా దానికో పధ్ధతి ఉండేది - విద్వత్సభలు జరుగుతాయి.రాజే యేర్పాటు చేస్తాడు అప్పుడు రాజమతం కానివాళ్ళలో యెవరయినా అన్యమతస్థులు కోరుకుంటే!ఆ వాదనలో యెవరు గెలిస్తే రాజు ఆ మతాన్ని రాజమతంగా చేసి ప్రోత్సహించాలి అనే నిబంధన ఉండేది.రాజుకి ఒక మతం పైన మక్కువ ఉండి అందులో పాండిత్యం కూడా ఉంటే ముందు రాజునే మెప్పించాల్సి ఉంటుంది విద్వత్సభకి వెళ్ళేకన్నా ముందు!

     ఒకానొకప్పుడు మిధిలరాజు ఉశీనరుడు సర్వ బౌధ్ధమత సిధ్ధాంతాలనీ విమర్సిస్తూ ఉండేవాడు,అయితే ఆయనంతట ఆయన వాని విమర్సకి పోడు,ఎవరైనా అర్హతులు వెళ్ళి ఆయన్ని కదిలిస్తే మాత్రం ఆయన చేసే వాదనలకి సమాధానం చెప్పలేక నిరాశతో వెనుదిరిగి పోయేవారు.బౌద్ధమతము యొక్క ప్రధమ సిద్ధాంతము కార్యకారణ చక్రము. అజ్ఞానము క్రియగా పర్యవసించును. అది విజ్ఞానమగును. నామరూపములు వహించును. షడింద్రియములు, స్పర్శ, అనుభూతి, ఆశ, గ్రహణము, పరిణామము, జన్మము, దుఃఖము – నిట్లు మారుచుండును. దుఃఖమును చంపినచో అజ్ఞానము నశించునని వారి ప్రధమ సిద్ధాంతము. దీనిని బౌద్ధులయిన అర్హతులు చెప్తే విని ఉశీనరుడు చిరునవ్వు నవ్వుతాడు.కొంత చమత్కారంగా ఒక ఉదాహరణ చెప్తాడు. మొట్టమొదట జిహ్వ మీద రుచి అనేది ఉన్నది కనుక కూర చేసుకోవాలి అనే సంకల్పం పుడుతుంది. దానినుండి ఒక శాకము, దానిని ముక్కలుగా తరుగుట, కడుగుట, వేడి చేయుట, తిరుగమూత, లవణాది మిశ్రమమును కలుపుట, – యివన్నీ పుట్టాయి. జిహ్వయందలి రుచి నుంచి యివన్నీ పుట్టాయి. కాబట్టి లవణాది మిశ్రమమును తొలగించినచో రుచి నశించును. – ఈ వాదన విని చర్చకు వెళ్ళిన అర్హతుడు వెలతెల పోతాడు.అయితే ఇలా హాస్యంగా తేల్చేయడం సరైన వాదనా పధ్ధతి కాదని అంటూనే కాని ప్రతిస్పర్ధి యొక దుష్టసిద్దాంతమును ప్రతిపాదించి నపుడు, పాత వస్తువునే కొత్తవస్తువుగా దీపింపచేయబోయినపుడు పండితుడైన వాడేమి చేస్తాడు? అని అడుగుతారు.“అజ్ఞానము, కర్మ, దుఃఖము యివన్నీ వేదాల్లో వున్నాయి. ఉపనిషత్తులలో వున్నాయి. శాస్త్రాల్లో, పురాణాలలో వున్నాయి. అవి ఏవో కొత్త విషయాలుగా అర్హతులు తెచ్చి ఉశీనరుడి దగ్గర చెప్తే మరి అతనేం చేస్తాడు?” అని ప్రశ్నిస్తాడు.

     7వ శతాబ్దంలో తమిళ దేశానికి చెందిన కూన్ పాండియన్ అనే తమిళ ప్రభువు ఇదే పధ్ధతిలో హైందవం నుంచి జైనం లోకి మారాడు.అయితే అతని భార్యకి ఇది నచ్చక తిరు గ్యాన సంబంధార్ అనే పందితుణ్ణి ప్రేరేపించి వాదనకి తీసుకొచ్చింది.ఆయన వాదనలో గెలిచి మళ్ళీ రాజుని హైందవం లోకి తీసుకొచ్చాడు.బౌధ్ధం,జైనం రెండూ స్థూలంగా అహింసని ప్రముఖంగా చెప్పేవి అయినా సూక్ష్మమయిన భెదాలు ఉన్నాయి.వాటిని బట్టి చూస్తే అసలు అశోకుడు పూర్తిగా బౌధ్ధంలోకి మారాడా అనేది కూడా నిర్ధారణగా చెప్పలేము.బౌధ్ధులు అహింసని ప్రచారం చేసినా మాంసాహారాన్ని వర్జించలేదు,బుధ్ధుడు మహాసమాధికి ముందు తెసుకున్నది మాంసాహారమే!కానీ జైనులు పూర్తిగా శాకాహారులు.అశోకుడి శిలాశాసనాల్లో ఆహార విహారాదులకి సంబంధించిన సూచనలలో జైనుల మాదిరి శాకాహారాన్ని గురించి ప్రస్తుతిస్తూ ఉన్నాయి!బౌధ్ధ మతం పూర్తిగా రాజాశ్రయం మీదనే ఆధారపడటంతో ఆ రాజాశ్రయం పోగానే క్రమంగా అంతరించి పోయింది.జైనులు రాజాశ్రయానికి దూరంగా ఉండటం వల్ల అంత ప్రభావశీలంగా యెప్పుడూ లేకపోయినా పూర్తిగా నశించిపోకుండా ఉండగలిగారు.ఇవి నిజమైన చరిత్ర సాక్ష్యాధారాలతో చెప్తున్న సత్యాలు.కాబట్టి హిందువులు ఇకనుంచీ పైత్యకారి కమ్యునిష్టులు హిందూమతం బౌధ్ధాన్నీ జైనాన్నీ క్రూత్రంగా అణిచేసింది అని కూస్తే నిజమేనని నమ్మేసి సిగ్గుతో తల దించుకోవాల్సిన పని లేదు!

     నిజంగా మన సంస్కృతిలో దోషముంటే విమర్శించినా అర్ధం ఉంది,ఒకరోజు కాకపోతే మరొకరోజయినా విన్నవాడు ఆ విమర్శలోని నిజాయితీని గుర్తించే అవకాశం ఉంటుంది!ఒక దేశపు చరిత్రని అబధ్ధాలతో నిర్మించి అబాసుపాలు చెయ్యడమనేది స్వదేశీయుడు చెయ్యడం యెంత ఘోరం?బహుశా పాపపుణ్యాలు లేవని చేప్పే హేతువాదాన్ని నమ్మడం వల్ల గానీ లేకపోతే ఆ గిల్ట్ మనసులో తొలచడం మొదలెడితే ఒక్క రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు గదా! 

స్వజాతిద్రోహం చేసి తలుపులు తెరిచిన వాణ్ణి వీడు ప్రేమించే విజాతివాడు గెలిచాక దగ్గిరకే రానివ్వడు?!

Tuesday, 11 August 2015

పెట్టుబడిదారీ విధానం నిజంగానే తనలోని వైరుధ్యాలకి తనే బలయి అంతమైపోతుందా?

      "యెక్కడ నా సుత్తి?యెక్కడ నా కంకి?వీడెవడో హరిబాబు మన్ని చాలెంజి చేశాడంట!పదండి మన ప్రతాపం చూపిద్దాం,వీలయితే తన్ని గూడా కమ్యునిష్టుగా మార్చిపారేద్దాం" అన్నంత ధీమాగా బ్లాగుల్లో ఉన్న కమ్యునిష్టు లంతా వొచ్చి వాల్తారనుకున్నాను నా "హిందూ పురాణాల అశాస్త్రీయత సంగతి సరే గానీ మీరు పాటిస్తున్న మార్క్సిజం శాస్త్రీయమైనదేనా?ఎర్ర మేధావు లందరికీ ఇదే నా సవాల్!" పోష్టు చూడంగానే? అక్కడికీ రెచ్చగొడదామని "బస్తీ మే సవాల్" అని హడావిడి కూడా చేశాను!

           ఒక్కడు రాలేదు,యెందుకనో?ఆఖరికి సాంతికిరనంట బహుశా స్వైరిణి బక్తుడు గామాలు చివర్లో ఆసికానికి - అది గూడా బాగా కాలి చుర్రుమని సెగ తగిలయినా వస్తారని యేశాలెండి - లీ క్వాన్ యూ కొటేషను మాత్రమే చూసి తెగ బారెడు నెత్తురు కక్కుకుని వొచ్చినోడు వొచ్చినట్టే ఆ కంగారులో టాపిక్కు కమ్యునిజము గురించేనని గూడా అర్ధంగానంత పిచ్చిసన్నాసో యేమో కమ్యునిజం గురించి పోష్టులు రాసుకోండని నాకు సలహా ఇచ్చి పోయాడు,యెక్కడున్నాడో?

   తిరిగే కాలూ తిట్టే నోరూ వూరుకోవు గదా,చూడలేదేమో అనుకుంటే చూసినట్టు సిగినేళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి.సాంతికిరను వచ్చాడు గదా సాక్ష్యముండాది - అంచేత వీళ్ళంతా మనకి బయపడిపోయారని బోల్డు కాంఫిడెన్సు వచ్చేసింది! అసలు నాకు ఈ మధ్యనే నలభై దాటిన వాడెవడూ యెంత వాదించినా మారడనే గట్టి నమ్మకం యేర్పడిపోయింది?అయినా యెందుకీ వృధాప్రయత్నం అంటే నా టార్గెట్ వేరే ఉంది,ఇరవయికి దగ్గిరగా ఉన్నవాళ్ళు,యేది మంచి యేది చెడు అనే ఆప్షన్లు మనం ముందు ఉంచితే చాలు యేది సరయినదో తెలుసుని యెంచుకోగలిగిన వాళ్ళు! మనం మాట్లాడకపోతే అదొక్కటే దారని అటుకేసి వెళ్తారు.అదే మనం గట్టిగా నిలబడితే ఒక వాదన జరిగితే యెవరు సూటిగా మాట్లాడుతున్నారు,యెవరు వంకరగా మాట్లాడుతున్నారు,యెవరు చెప్పేది యుక్తియుక్తంగా ఉంది,యెవరు చెప్పేది మూర్ఖంగా ఉంది అని తెలుసుకోవడానికి పనికొస్తుంది!స్వైరిణికీ స్వైరిణి భక్తులకీ సీరియస్ కమ్యునిష్టులకీ ఇదే నా హెచ్చరిక - మిమ్మల్ని నేను వదలను!నా వ్యక్తిగత రాగద్వేషాలతో కాదు నేను మిమ్మల్ని వెంటాడేది - సత్యం కోసం!

   సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన నా గురుపరంపర,వ్యాసపరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను మీరు యెన్ని  శ్రీరామనవమి పండగలు చేసినా లాభం లేదు, హిందువైన వాడెవడూ రామాయణ విషవృక్షాన్ని మర్చిపోడు?మీరు యెన్ని కృష్ణాష్టమి పండగలు చేసినా ఇదండీ కమ్యునిజం రాసిన స్వైరిణి మీ పార్టీలో హవా చెలాయిస్తున్నంతకాలం మీకు హిందువుల వోట్లు పడవు! 

     మీకు హిందువుల వోట్లే కాదు ఇక కాంగ్రెసుకి ముస్లిముల వోట్లు కూడా పడవు?మీరు వర్గరహితసమాజం వస్తుందని రాసివ్వలేరు గానీ నేను మాత్రం నా మాటల్ని  స్టాంపు పేపరు మీద రాసివ్వడానికి సిధ్ధం!యెందుకంటే కాలం మారిపోయింది.జనం ఇప్పుడు ఇదివరకట్లా యెవడేం చెప్తే అది నమ్మే స్థితిలో లేరు.ఒక్కసారి గత పదేళ్ళుగా యెన్నికల్లో పోలయ్యే వోట్ల శాతాన్నీ వాటిలో కనిపించే స్పష్టతనీ చూడండి, మీకే తెలుస్తుంది! యెక్కడయితే మోదీని గోద్రా అల్లర్ల భూతంగా మీరంతా అల్లరి పెట్టారో ఆ అల్లరి జరుగుతుండగానే అన్నిచోట్లా ముస్లిములే మోదీని గెలిపించారు,అయినా ప్రజలు దొంగచేతికి తాళాలివ్వడం మంచిదనే అమాయకత్వంలో ఉన్నారనే పోలికతో ఇంకా వారికి కోపం తెప్పించడమే తప్ప వాస్తవాన్ని చూడలేకపోతున్నారు, యెందుకని?గతకాలపు చరిత్రలోని మూలమూలల్ని అద్భుతంగా వ్యాఖ్యానించగలిగిన వాళ్ళు వర్తమానంలోని రహస్యాన్ని యెందుకు చూడలేకపోతున్నారు?


ఆఖరికి భండారు శ్రీనివాస రావు గారి వార్తావ్యాఖ్య బ్లాగులో ఉగ్రవాదులకి మతం లేదు పోష్టులో "మేము అధికారములోకి రావచ్చు. రాకపోవచ్చు. కానీ, మా సిద్దాంతం మాత్రం చచ్చినట్టు అమలయ్యేలా చూస్తాం. అది కూడా మీచేతనే అమలు చేయిస్తాం. ఇప్పటి వరకూ అలానే చేశాం. ఇక మిదట కూదా అలానే చేస్తాం. మధ్యలో నీలాంటి కమెడియన్లు కమ్యూనిజం చచ్చిపోయింది అని చెబితే నవ్వుకొంటూ ఉంటాం. బిడ్డా చచ్చింది కమ్యూనిజం కాదు. నీ మత మౌఢ్యం, సో కాల్డు జీవన విధానములోని స్టుపిడిటి. అదే కంటిన్యూ అవుద్ది. ఫైనలుగా కమ్యూనిజమే మిగులుద్ది. రాసి పెట్టుకో.అనీ "ఎన్ని సార్లు చెప్పాలి నీకు? చరిత్ర మొత్తం అదే కన్నా! బౌద్దులను ఎలా చంపెను, శైవులు, వైష్ణవులు ఎలా కొట్టుకు చచ్చెను అనే ఉంటుంది చరిత్ర అంతా. " అనీ ఆజ్ఞాత నామధేయంతో రెచ్చిపోతుంటే నేను కొన్ని ప్రశ్నలు వేశాను.మాటి మాటికీ పిన్నిని పెళ్ళాడాలనుకున్నాను - పెళ్ళాడనివ్వలేదు,ఇదే ముస్లిం మతంలో అయితే యెంచక్కా పెళ్ళాడనిచ్చేవాళ్ళు - హిందూఒమతం ట్రాష్,నేను మొదట బుద్ధిగా విధవని పెళ్ళాడాలనుకున్నప్పుడు మెచ్చుకున్నారు,కానీ నాకు తిక్కరేగి నాకంటే పెద్దదాన్ని పేళ్ళాడాలనుకంటే మాత్రం మెచ్చుకోలేదు అని తిక్కతిక్కగా వాగే ఇన్సెస్ట్ ప్రేమికుడు మాట్లాడినట్టే ఒక్కదానికీ తిన్నగా జవాబు చెప్పకపోగా యెక్కడ బడితే అక్క కమ్యునిజం వెల్లి విరుస్తుంది పోయి చూసుకో అని డబాయిస్తున్నాడు.అంత ధీమాగా చెప్తున్నాడు గదా అని స్కాండినేవియాలో అమలవుతున్నది కమ్యునిజమా? అని గూగుల్ చేస్తే తను డప్పు కొట్టుకుంటున్నది పచ్చి బొంకు అని తేలింది!

తను పాటించేది అంత శాస్త్రీయమైన సిధ్ధాంతం అయితే ఇన్ని బొంకులు అవసరమా?తను చెప్తున్నది సకలజనశ్రేయోదాయకం అయితే నిజాలు చెప్పి ఒప్పించి సూటిగానే మాట్లాడవచ్చునే?కమ్యునిష్టు సిధ్ధాంతం ప్రకారం వచ్చే వర్గరహితసమాజంలో నాకు ఇప్పటికన్నా మంచి జరుగుతుందనే హామీ వాళ్ళు ఇవ్వగలిగితే నేను వొద్దంటానా?మీకు ఇంతకన్నా మంచి భవిష్యత్తుని గ్యారెంటీగా ఇస్తాం అని గట్టిగా నమ్మకం కలిగిస్తే యెవడు కాదంటాడు?యే శ్రామికులకి మేలు జరిపించటం కోసం కార్మిక చట్టాల్ని సాధించిపెట్టాం అని చెప్తున్నారో ఆ శ్రామికులు కూడా వీళ్ళు చెప్పే వర్గరహితసమాజం కోసం వీళ్ళ వెనకాల యెందుకు నడవటం లేదు?లేబర్ చట్టాలు గట్టిగా ఉండటమే కమ్యునిజం యొక్క అంతిమ లక్ష్యమా?కాదే!మరి వీళ్ళు యెవరికోసం పోరాడాము అని చెప్తున్నారో వాళ్ళనే ఇంకొక మెట్టు యెక్కించలేని దద్దమ్మలు ఇతర్లని దద్దమ్మలు అనడం కోడిబుర్రలు అనడం దేన్ని సూచిస్తుంది?శాస్త్రీయం అని ఒక విషయాన్ని అనాలీ అంటే నమ్మకం వల్ల గాకుండా వాస్తవంగా నిరూపణ అయ్యి ఇతర్లకి నమ్మకాన్ని కలిగించాలి,అవునా కాదా?ఇప్పటివరకూ కార్ల్ మార్క్సూ వీళ్ళూ వర్గరహితసమాజం గురించి చెప్తున్న దాంట్లో ఒక మెలిక ఉంది - ఈ భూ ప్రపంచం మీద ఒక్క మనిషి కమ్యునిజాన్ని వ్యతిరేకించినా ఈ భూమి మీద వర్గరహితసమాజం యేర్పడనట్టే!అందుకే గదా రష్యాలో యెందుకు పోయిందయ్యా అంటే చుట్టూ పెట్టుబడిదారీ సమాజం ఉంది గాబట్టి అని చెప్తున్నది!నేను వాళ్ళ నడిగింది ఒకే ఒక ప్రశ్న - వర్గరహితసమాజం గురించి శాస్త్రీయమైన ఒక్క ఉదాహరణ చెప్పమని,దానికే దాస్ క్యాపిటల్ అంతా నీకు చెప్పలేను,ఆంతా చెప్పానయ్యా బాబూ నీది కోడిమెదడు కాబట్టి అర్ధం గావట్లేదు, నువ్వు పిచ్చిపుల్లయ్యవి అని విసుక్కోవడమే తప్ప వర్గరహితసమాజం యెట్లా ఉంటుంది అనేది మాత్రం చెప్పడం లేదు,యెందుకని?బెజవాడ నుంచి హైదరాబాదు వెళ్ళాలంటేనే బోర్డు చూసుకుని ఆ బస్సు హైదరాబాదు వెళ్తుంది అని గ్యారెంటీ ఉన్నాకనే యెక్కుతున్నాం గదా మరి వాళ్ళని గ్యారెంటీ అడిగితే విసుగెందుకు?

ఇన్నేళ్ళుగా మార్క్సిజం సర్వోత్తమమైనది,సమాజాన్ని మార్చడానికి దానికన్నా మించింది లేదు.తుపాకీ గొట్టం ద్వారానే అధికారం వస్తుంది,శ్రామికవర్గ నియంతృత్వమే అన్ని సమస్యలకీ పరిష్కారం అని వూదరగొట్టిన వాళ్ళు ఇప్పుడు "మార్క్స్ మాకు ప్రేరణ కల్గించాడని, మేము అనుకున్నది సాధించడానికి దేశీయ, ప్రాంతీయ పరిస్థితులను భట్టి వెలుతూ ఉంటామని" అనటం విధి వైపరీత్యమా?గతజన్మ పాప ఫలితమా?మాయామేయ జగంబె నిత్యమని సంభావించే కాటికాపరి వేదాంతమా!ఖచ్చితంగా అమలయ్యే ఒక విప్లవ సిధ్ధాంతాన్ని ప్రవచించిన మహోన్నత వ్యక్తి స్థానం నుంచి కేవలం ప్రేరణ ఇచ్చిన వ్యక్తి స్థాయికి తగ్గించారు ఇవ్వాళ,రేపటి రోజున ఈ ప్రేరణ ఇచ్చిన వ్యక్తి స్థానం నుంచి పురాణ పురుషుడిగా మార్చరని గ్యారెంటీ యేమిటి?మరి వీళ్ళు కూడా మార్క్సు చెప్పిన దాంట్లో అన్నీ కొలిచినట్టు లేవు గాబట్టి ప్రేరణ మాత్రమే తీసుకుంటూ పరిస్థితులకి అనుగుణంగా పోతాం,అవసరమైతే మతం మానవాళికి మత్తుమందు అన్న నోటితోనే రామనవమి పండగలో "శ్రీ రాఘవం" కీర్తనలూ చదువుతాం,కృష్ణాష్టమి రోజున ఉట్లు కొడుతూ "హే కృష్ణా ముకుందా మురారీ" అనీ పాడుతాం అంటున్నారు గదా అదే పని యుగాలుగా చేస్తున్న మమ్మల్ని మతవాదులు అనటం యెంతవరకూ సబబు?!

కాబట్టి నేను రూటు మారుద్దామనుకుంటున్నాను,సయోధ్యకి ప్రయోత్నిస్తా!సయోధ్య అంటే ఖాజిసాయెబుగారు తురకల్లో కలిసిపోయినట్టు నేను కమ్యునిష్టునైపోవడం కాదండోయ్ - కొంచెం వాళ్ళు నిర్భయంగా రావడానికి వీలుగా ఉంటాను,అయినా వస్తారో రారో?నేను "మార్క్సిష్టు సిధ్ధాంతాన్ని హిందూ ధర్మం ప్రకారం విమర్శించి వెక్కిరించ వచ్చునా?పోస్టులో లాగా వెక్కిరించకుండా నిజాయితీగా మార్క్సిష్టు సిధ్ధాంతాన్ని పూర్వాపరాలు తరచి చూడడానికి ప్రయత్నిస్తాను ఈసారి - ఆఖరుసారిగా!

మార్క్సిజం అనేది అసలు ప్రపంచంలో అన్ని దేశాలలోని మేధావుల్నీ ఆకర్షించడానికి కారణమేమిటో తెలుసా?గతకాలపు చరిత్రని కొత్తరకంగా వ్యాఖ్యానించి చెప్పడం!ఆయన తన సిధ్ధాంతానికి "గతి తార్కిక చారిత్రక భౌతికవాదం" అని పేరు పెట్టి అప్పటివరకూ చరిత్రలో జరిగిన రాజకీయపరమైన తిరుగుబాట్ల వెనక దాగి ఉన్న కొత్త నేపధ్యాన్ని చూపించగలగటం!కొందరు సంస్కృతీ,సామాజిక విషయాల గురించి కూడా వ్యాఖ్యానించాడు కాబట్టి ఇదొక ఎన్సైక్లోపెడియా అని భ్రమపడతారు గానీ చాణక్యుడిలాగే ఇతని వాదనల్లోనూ పొలిటికల్ యెకానమీ దృక్కోణం మాత్రమే ప్రముఖంగా ఉంది.ఒక ప్రధాన వాదంలో ఉపాంగాలు ఉండటం ప్రతి సిధ్ధాంతంలోనూ సహజమే కదా - ఇందులో చర్చించిన సామాజిక విషయాల గురించిన ప్రస్తావన కూడా అంతే!స్థూలంగా సిధ్ధాంతం గురించిన విషయాల్ని గత పోష్తుల్లో చేశాను.మళ్ళీ రిపీట్  చెయ్యడం నాకు బోరు.కాబట్టి ఇప్పుడు నేను యెంచుకున్న విషయానికి పనికొచ్చే వాట్ని మాత్రం చెప్తాను.మొదటి ప్రతిపాదన ఉత్పత్తి శక్తుల మీద యెవరు అధికారం చెలాయిస్తారో రాజకీయంగా వారు అధికారంలో ఉంటారు అనేది.దీనికి రుజువుగా ఆదిమ కాలం నుంచి ప్రతి సమాజాన్నీ ఉదాహరణగా తీసుకుంటూ ఆ కాలంలో అక్కడ యేది ఉత్పత్తి శక్తి,దాన్ని యెవరు నియంత్రిస్తున్నారు,అప్పటి సామాజిక సంబంధాల మీద అది యెలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నది అని విశ్లేషించాడు.ఈ సాక్ష్యాదారాలను గతకాలపు చరిత్ర నుంచి సోదాహరణంగా చూపించాక అన్ని కాలాల్ల్లోనూ అసలు ఉత్పత్త్తికి కారణమైన శ్రామికులు ప్రయోజనం పొందటం లేదు గాబట్టి ఆ శ్రామికులు ప్రయోజనం పొందగలిగే లక్ష్యంగా శ్రామికవర్గ నియంతృత్వం ద్వారా యేర్పడే వర్గరహితసమాజం అనే ఒక బ్రహ్మపదార్ధం లాంటి కల్పనాత్మక సమాజపు స్థితిని సమస్త మానవాళికీ ఒక అంతిమ లఖ్యంగా ప్రవచించాడు!

ఉత్పత్తి శక్తులకీ ఆనాటి సామాజిక వాతవరణానికీ ఉన్న సంబంధాన్ని కనుక్కోగలగటమే ఇతని విశ్లేషణలోని ప్రత్యేకత.అంతవరకూ అతని విశ్లేషణలన్నీ తిరుగులేని నిజాలే!వేట జీవనోపాధిగా ఉన్న సమూహంలో యెవరు యెక్కువ చాకచక్యంగా జంతువుల్ని వేటాడగలరో వారికే ప్రాధాన్యత!అక్కడ వేకి పనికొచ్చే ఆయుధాలు ఉత్పత్తి శక్తులు,వాటిని అమితంగా ప్రేమించటం,తాము వేటాడిన జంతువుల అవశేషాల్ని తమ దేహం మీద అలంకరించుకోవటం - ఇవన్నీ సామాజిక జీవితంలో దాని ప్రతిబింబాలు!వ్యవసాయం చెయ్యడం నేర్చుకున్న తర్వాత అన్ని దశల్లోనూ భూమి ప్రముఖ ఉత్పత్తిశక్తి అయ్యింది - భూస్వామ్యం రాజరికం దీని ప్రతిబింబాలు!మార్క్సు ప్రధానంగా చెప్పిన శ్రామికవర్గం పారిశ్రామిక విప్లవం తర్వాతనే అవతరించింది!శ్రామికవర్గం ప్రబలశక్తిగా ఉన్న కాలంలో దాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పిన సిధ్ధాంతం తర్వాత వచ్చిన వూహించని మార్పు కంప్యూటరీకరణతో అర్ధం లేనిదిగా తయారైపోయింది!మార్క్సు తన జీవితకాలంలో సిధ్ధాంతాన్ని రాస్తున్నప్పుడూ,ప్రచారం చేస్తున్నప్పుడూ మేధోశ్రమని శ్రమగా గుర్తించలేదు,గుర్తిస్తే నట్లూ బోల్టులూ తిప్పుకునే మామూలు వర్కరుకి 1000 రూపాయలూ మేనేజరుకి 10000 రూపాయలూ ఇవ్వడం న్యాయమే కదా అనిపిస్తుందే తప్ప దాన్ని దోపిడీ అని అనటం ససేమిరా కుదరదు గాబట్టి,అది కుదరనప్పుడు శ్రామికవర్గనియంతృత్వం అనేది కూడా యెవరికీ యెక్కదు గాబట్టి మేధోశ్రమని ఒప్పుకోలేదు - తెలిసే ఒప్పుకోలేదు,మోసం చేశాడు!"పెట్టుబడిదారీ విధానం తనలోని వైరుధ్యాలకి తనే బలయి అంతమైపోతుంది?" అని డంబాలు పలుకుతూ చంకలెగరేస్తున్న అరివీర కమ్యునిష్టు లంతా కేవలం మేధోశ్రమని శ్రమగా ఒప్పుకుంటే చాలు యెంత పెద్ద రేంజిలో సక్సెసయిన కమ్యునిష్టు సమాజమయినా ఒక్క నిముషంలో కూలిపోతుంది?!

నిజంగా పెట్టుబడిదారీ విధానమే అంతమైపోవటం జరిగితే అక్కడ మిగిలేది శూన్యం,యెందుకంటే మార్క్సు పెట్టుబడిదారీ విధానం లో ఉన్న దోపిడీని అరికట్టే ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యవస్థని దేన్నీ ప్రతిపాదించలేదు గనక!తను మానవుడు వస్తుగత వాద అని చెప్పే స్మిథ్సోనియన్ భావజాలాన్ని ఒప్పుకుంటూనే ఆ స్మిథ్సోనియన్ సిధ్ధాంతాల నుంచే మానవుల్ని వాటికి భిన్నమైన ఆదర్శాలతో నిండిఉన్న తను కొత్తగా వర్ణించి చెప్పిన వర్గరహితసమాజంలోకి యెట్లా నడిపించాలి అనే కీలకమైన విషయాన్ని మాత్రం అసలు పట్టించుకోలేదు!దోపిడీకి కారణమైన ఆర్ధిక వ్యవస్థతోనే దోపిడీని నిర్మూలించటం యెట్లా అనే అనుమానం ఇప్పటి వరకూ యే కమ్యునిష్టు కైనా వచ్చిందా?ప్రతిదానికీ ఒక నిర్మితి అవసరం,అనుబంధాలూ ఆప్యాయతలూ సమాజంలో ప్రతిదీ ఆర్ధికానికి సంబంధంగానే ఉంటుంది అని బల్ల గుద్ది చెప్తున్న వాళ్ళు వర్గరహితసమాజం అనేదానికి కూడా ఆర్ధికపరమైన పునాది ఉండాలి అని ఇప్పటికీ అనుకొవడం లేదా?గతాన్నంతా ఉత్పత్తిక్తుల ఆధారంగా అధ్భుతంగా విశ్లేషించినప్పుడు తలూపడమే తప్ప మరి వర్గరహితసమాజాన్ని యే రకమైన ఉత్పత్తిశక్తి యెట్లా ప్రభావితం చేస్తుంది అని అడగటం మర్చిపోయారా?అంతా బొంకులదిబ్బ!


వ్యంగ్యాలు వాడనని అంత దారుణమైన మాట యెందుకు వాడానో తెలుసా?అసలీ ఉత్పత్తి శక్తులు సమాజాన్ని ప్రభావితం చెయ్యటంలో ఒక మిస్సింగ్ లింక్ ఉంది!వేట జీవనోపాధిగా ఉన్న తొలిదశనే తీసుకోండి.ఒక మనిషి మిగిలిన వాళ్ళకి అలివిగాని మృగాన్ని తను గొప్పగా పోరాడి చంపాడనుకోండి,ఆ జంతువు పులి అయితే దాని గోళ్ళని గుర్తుగా అట్టే పెట్టుకుంటాడు.ఇప్పుడు ఆటగాళ్ళ కిస్తున్న గోల్డ్ మెడల్ కూడా గుర్తింపు కోసమే గదా!వాటికి సమాజంలో యెలాంటి ప్రాముఖ్యతా లేదు,ఉండదు!కానీ మరొక వ్యక్తి దగ్గిర ఉన్న యే వస్తువైనా ఈ మనిషి కోరుకుని అది కావాలంటే ఈ పులిగోరుని ఇవ్వాల్సి వచ్చిందనుకోండి - అప్పుడు దానికి వెల అంటూ యేర్పడి అమ్మకపు సరుకుగా మారుతుంది,అవునా!అంటే ఉత్పత్తి శక్తులు వాటంతటవి సమాజాన్ని ప్రభావితం చేయ్యలేవు,వాటికి వెల నిర్ణయించబడినప్పుడే వాటి చుట్టూ ఒక మార్కెట్ యేర్పడినప్పుడే అవి సమాజంలో ప్రకంపనలు సృష్టించగలుగుతాయి - అది సత్యం?!ఆ నిజాన్ని మాత్రం వదిలేశాడు.అన్ని దశల్లోనూ తను ఉత్పత్తి శక్తులు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నప్పుడు అవి యెట్లా ప్రభావితం చేస్తాయి అనేది తెలియకనే వొదిలేశాడా?ఒక పులిగోరు ఖరీదుని యేర్పరచుకుని మార్కెట్టులో వస్తువుగా నిలబడినప్పటి నుంచీ ఇప్పటి వరకూ అక్కడ జరుగుతున్న దేమిటి?వెల కట్టబడిన వస్తువు,అమ్మకం దారు,కొనుగోలు దారు,మారక ద్రవ్యం,లాభం,నష్టం - వీటిల్లో మార్పు యేమైనా ఉందా?ఇన్ని మిలియన్ల సంవత్సరాల నుంచీ ఆ ఖచ్చితమైన సూత్రాల మీద ఆధార పడి నడుస్తున్న పెట్టుబడి దారీ విధానం మార్క్సు గారికి ముందర యెప్పుడయినా కుప్పకూలిపోయిందా?మెసపొటేమియన్,మాయన్,గోబియన్ ,గీబియన్ సమాజాల గురించి చెబితే చెప్పవచ్చు గాక,వాటి స్థానంలో అంతకన్నా శక్తివంతమైన మరో పెట్టుబడిదారీ సమాజం పుట్టింది గదా!వర్గరహితసమాజం కూడా ప్రత్యేకంగా యే ఆర్ధికసూత్రాల్నీ కాకుండా ఇవే ఆర్ధికసూత్రాల ప్రకారం నడుస్తూ ఉంటే పెట్టుబడిదారీ విధానం కూలిపోతుందనడమే పెద్ద అబధ్ధం,కాదా?! 

ఐన్స్టీన్ రెలేటివిటీ సిధ్ధాంతంలో అన్నీ రిలేటివ్ కానీ కాంతి వేగం మాత్రం కాన్స్టాంట్ అన్నట్టు అసలు వైరుధ్యాలన్నీ మార్క్సు చెప్పిన గతి తప్పిన భౌతిక్కవాదంలో ఉంటే స్థిరమైన విలువలన్నీ పెట్టుబడిదారీ విధానంలో ఉన్నాయి!


పెట్టుబడిదారీ ఆర్ధికవిధానం అప్రతిహతం!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...