Showing posts with label విద్యా వ్యవస్థ. Show all posts
Showing posts with label విద్యా వ్యవస్థ. Show all posts

Friday, 5 February 2016

చచ్చిపోయినవాడు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను మొర్రో అని రాసిపెట్టినా ఇంకా అది హత్య అనీ హంతకుల్ని శిక్షించాలనీ అంటున్నారు - వీళ్ళకేం పిచ్చా వెర్రా:-)

     "ఒక్కడు కొట్టుకుంటే మూర్చ,ఇద్దరు కొట్టుకుంటే కుస్తీ,ముగ్గురు కొట్టుకుంటే మస్తీ,పదిమంది కొట్టుకుంటే దొమ్మీ - మరి ఒక్కడు వందమందిని కొట్టితే ఏమవుద్దిరా" అన్న చెత్తమాటని పంచ్ దయలాగుగా వెండితెరమీద ఎవడైనా హెరో వేషగాడు వేస్తే నువ్వు వాడి ఫ్యానయితే ఎగిరెగిరి గంతులేస్తావు ఈల వేస్తావు, అలా కాక ఆ వేషగాడు నీ అభిమాన హీరో కాకపోతే కిందపడి గిలగిలా కొట్టుకుంటావు గోల చేస్తావు.కానీ ఇదేంటి, యూనివర్శిటీ లెవెల్లోకి వచ్చేసరికి టీనేజి లవ్వులు పోయి ఒంట్లో కొవ్వు పెరిగేసరికి పోటుగాళ్ళ మాదిరి భావి భారత సమాజం మనకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నదనే కొత్త పిచ్చి తగులుకుని అందులో ఎవడికి నచ్చిన గ్రూపులో వాడు చేరి బయటకెళ్ళాక ఎటూ ఇవన్నీ వేస్ట్ అని తెలుస్తుంది గానీ ఇప్పటి మత్తులో మాత్రం కిందామీదా తెలియకుండా తన్నుకునే కుర్రసన్నాసుల గొడవని దేశం మొత్తానికి అంటిస్తున్నారు పనిలేక పిల్లితల గొరిగే కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ?
      చూట్టానికి బావున్నాడు,చచ్చిపోయాడనగానే ఎవరికయినా బాధ కలిగించేట్టు ఉన్నాడు.అంటే చూట్టానికి బాగోకపోతే నీకు జాలి పుట్టదా యేంటి అని మీరడగొచ్చు.కానీ జనాలు ఫీలవడంలో ఆ తేడా అప్పుడప్పుడూ ఉంటుంది.జనంలో చూపులకి బావుండటమే అందం అనుకునే ధోరణి ఎక్కువ గనక బావుండని వాడు పోతే "ఇంత అనాకారిగా ఉన్నాడు,వీడు పోయినంతలో అందగాళ్ళకి కొదవేం రాలేదులే!" అనీ బావున్నవాడు చచ్చిపోతే "ఎంత బావున్నాడో,అక్కడొకడూ ఇక్కడొకడూ అన్నట్టున్న అందగాళ్ళలో ఒకడు తగ్గాడు గదా!" అనీ అనిపించటం సహజం.

      మొదట ఈ ఆత్మహత్య వ్యవహారంలో ఇతని కులం ప్రస్తావన ఎందుకొచ్చిందో చూద్దాం.ఆత్మహత్య తనెందుకు చేసుకుంటున్నాడో స్పష్టంగా తేల్చి చెప్పకపోయినా తన ఉత్తరం ద్వారా తనని ఎవరూ భయపెట్టలేదనీ ఆత్మహత్యకు ప్రేరేపించలేదనీ స్పష్టంగా తేల్చి చెప్పాడు.ఇప్పుడు వీళ్ళు దానికి బాధ్యులైన వారిని హంతకులుగా నమోదు చేసి శిక్షించమంటున్నారు.అలా చెయ్యాలంటే నిర్భయ చట్టంలో స్త్రీ మీద జరిగిన అత్యాచారం అనే క్యాటగిరీని తీసుకున్నట్టు ఒక దళితుణ్ణి భౌతికంగా ఏమీ చెయ్యకపోయినా మానసికంగా వేదనకి గురి చేసి అతని చావుకి కారణమయ్యారు అనే కోణంలో తప్ప ఇతరుల్ని నిందితులుగా నమోదు చెయ్యటం కుదరదు - అది ఖాయం!ఆ ఉత్తరంలో ఎవరి పేరునయినా ప్రస్తావించి ఉంటే అప్పుడు వాళ్ళని అరెస్టు చెయ్యొచ్చు.తల్లి పరంగా కులాన్ని అన్వయించి సర్టిఫికెట్ తీసుకున్నా ఇప్పుడు ప్రభుత్వాధికారులు అది సరయినది కాదనీ అలా ఇచ్చిన అధికార్లని విచారించి చర్యలు తీసుకోవాలనీ ప్రయత్నిస్తున్నట్టు వింటున్నాం.మామూలు పరిస్థితుల్లో అయితే కులనిర్ధారణకు తండ్రినే చట్టాలు ప్రామాణికంగా తీసుకుంటాయి - ఇప్పటికిప్పుడు మారిస్తే తప్ప!

      2016 జనవరి 30వ తేదీకి వేముల రోహిత్ చక్రవర్తి 27వ సంవత్సరం లోకి అడుగుపెట్టి ఉండేవాడు!కానీ గత జులై నెల నుంచీ అతనికి రావలసిన నెలవారీ స్టెయిఫండ్ 28,000 రాకపోవదం వల్ల జనవరి 17కు ఒక రోజు ముందు స్నేహితులతో నా పుట్టిన రోజుకి మీకు చిన్న ట్రీట్ కూడా ఇవ్వలేను అని చెప్పిన కొద్ది గంటల్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు.పోలీసులకి దొరికిన ఆఖరి ఉత్తరం ఒక మహాకవి రాసిన విషాదకావ్యంలా ఉంది!కొంత కవిత్వం కొంత పశ్చాత్తాపం కలిసి ఉంది - ఆఖర్లో స్టెయిఫండ్ వచ్చాక ఇంటికి పంపించాల్సిన డబ్బుల గురించీ స్నేహితుడు రాంజీకి తీర్చాల్సిన అప్పు గురించీ చెప్పే భాగం తప్ప!తండ్రి యేమో మా అబ్బాయి చాలా తెలివైన వాడు, ర్యాంక్ హొల్దర్! దళితుడని చెప్పుకుని రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగం తెచ్చుకోవాల్సిన ఖర్మ పట్ట లేదు అంటూ కులం మార్చినందుకు కొంత వ్యతిరేకంగా ఉన్నట్టు కనబడుతుంది.మావాడు చాలా ధైర్యస్థుడు,ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదు,విచారణ జరిపించాలి అంటున్నాడు.బహుశా ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా భ్రమింప జేస్తున్నారనే అనుమానం అతని మాటల్లో కనిపిస్తున్నది.ఏమో, ఎజెండాల కోసం  గెలుపు కోసం, అహాలు చల్లార్చుకోవటం కోసం, సంచలనం కోసం, ఫోకస్ కోసం పరమ క్రూరమైన రాజకీయాలు నడుసున్న ఈ కాలంలో ఏదయినా జరగొచ్చు!తండ్రి ఒక హాస్పిటల్ ఆవరణలో గార్దు.తల్లి టైలర్ అని చదివినట్టు గుర్తు - కాబట్టి పెద్దగా ఆదాయం ఉన్న కుటుంబం కాదు గనక నా వరకు నేను దళిత ముద్ర వేసుకుని స్టెయుఫండ్ తీసుకోవటం గురించి తప్పు పట్టలేను.జగన్ లాంటి వాళ్ళు నొక్కేస్తున్న కోట్లతోనూ 2జీ,3జీ,4జీ స్కాములతోనూ పోలిస్తే అది పెద్ద నేరమా!కానీ ఇతను తన బాల్యం గురించి "My birth is my fatal accident. I can never recover from my childhood loneliness. The unappreciated child from my past." అని మరీ నిర్వేదంగా అంటున్నాడంటే తలిదండ్రులు విడిపోవటం ద్వారా కలిగే మామూలు ఒంటరితనం కన్నా మరింత భయంకరమైన ఒంటరితనాన్ని దేన్నయినా అనుభవించాడా!

      మంచి మార్కులతో ప్యాసయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యామసులో సైన్సు స్టూడెంటుగా అడుగుపెట్టి తర్వాత ఆర్ట్స్ గ్రూపుకి మారిన రోహిత్ మొట్టమొదటి స్టూడెంట్ ఎన్నికల్లో ఏబీవీపెకి వోటు వేశాడట!అంటే, అప్పటివరకు చదువు తప్ప మరో సంగతి పట్టించుకోనివాడు అతి తక్కువ కాలంలో మొదట SFIలో ఉత్సాహంగా పాల్గొని తర్వాత ASAలోకి మారి అక్కడ కూడా మరింత నాయకత్వ లక్షణాలతో ఒక వెలుగు వెలిగి చివరాఖరికి ఎంత హఠాత్తుగా ఈ రాజకీయ ఉద్యమాల ప్రభావానికి గురయ్యాడో అంతటి అనూహ్యమైన నాటకీయ శైలిలో I feel a growing gap between my soul and my body. And I have become a monster. అనే అవగాహనకి వచ్చి బీజప్రాయంగా తను రాక్షసంగా మారడం పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ అస్తమించడం అనే సంక్లిష్టతని అర్ధం చేసుకోవాలంటే మొత్తం అతని ప్రవర్తనని ఆది నుంచీ అంతం వరకూ పరిశీలించాలి!

      తొలిసారి అమాయకంగా ఏబీవీపీకి వోటు వేసిన నాటి నుంచీ ఆఖరి రోజు వరకూ నడిచిన ఆరు సంవత్సరాల జీవితంలో ఎంతో నాటకీయత ఉంది.అన్ని దశల్లోనూ అతనిలో విశిష్టంగా కనిపించేది భావ వ్యక్తీకరణలో అతని కున్న అద్భుతమైన ప్రతిభ - తెలుగుని ఎంతగానో ఇష్తపడిన ఇతనికి భాష మీద ఉన్న పట్టు!తెలుగునే కాదు ఇంగ్లీషుని ఉపయోగించినా భావ వ్యక్తీకరణ సామర్ధ్యమే అతన్ని అతి తక్కువ కాలంలో అగ్రగణ్యుణ్ణి చేసింది.ఆ రకంగా చూస్తే ఇదే యూనివర్సిటీలో ఇంతకుముందు జరిగిన అన్ని ఆత్మహత్యల కన్నా అన్ని విద్యాసంస్థలలో కలుపుకుని ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఆత్మహత్యల కన్నా ఇతని ఆత్మహత్య నిజంగా ప్రత్యేకమైనదే!దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి గనక, ఇప్పటికైనా క్రియాశీలంగా ఈ రకమైన ఆత్మహత్యల పరంపరని ఆపడానికి ప్రయత్నం జరిగి తీరాలనే గట్టి పట్టుదలతో ఉన్నాను గనక ఈ పోష్టు చాలా పెద్దగా ఉండవచ్చు.ఆసక్తిని కలిగించడానికి నేను మామూలుగా వేసే చెణుకులు కూడా ఉంకపోవచ్చు,అయినా కొంచెం ఓపిక చేసుకుని చదువుతారని ఆశిస్తున్నాను.అంత ఓపిక లేనివారు ఇక్కడితో చదవడం ఆపెయ్యవచ్చు - నాకు ఎంతమాత్రం అభ్యంతరం లేదు అనగా నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్:-)

      ఇంతకు ముందు ఇతను చదివిన కొడిగెనహళ్ళి లోని ఆంధ్రప్రదేశ్ జూనియర్ రెసిడెన్షియల్ కాలెజిలో ఇప్పుడు  ప్రిన్సిపాల్  అయిన బి.కొండయ్య గారు 2004లో రోహిత్ అక్కద విద్యార్ధిగా ఉన్నప్పుడు లెక్చరర్ ఉద్యోగంలో ఉండేవారు.ఆయన రోహిత్ గురించి "అతను చాలా చురుకైన విద్యార్ధి.ఈ కాలేజిలో ప్రవేశం అంత సులభం కాదు,ఎందుకంటే మేము కేవలం పల్లెటూళ్లలో ఉన్న తెలివైన పిల్లల్ని మాత్రమే ఎంచుకుని ఎంట్రన్సు టెస్టు పెట్టి తీసుకుంటాం.అప్పట్లో రాజకీయాల గొడవ లేకుండా అందరితోనూ స్నేహంగా ఉండేవాడు." అని చెప్తున్నారు.ఇంక అతను ప్లస్ టూ లో 521/600 మార్కులు సాధించి 86% దగ్గిర నిలబడటం గురించి కూడా గుర్తు తెచ్చుకున్నారు.రోహిత్ అక్కడ BiPC చదివాడు.అతని కెమిస్ట్రీ లెక్చరర్ జె.వి.కృష్ణయ్య గారు మెయిన్ సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే గాకుండా ఇంగ్లీషులో మంచి మార్కులూ తెలుగులో ఇంకా ఎక్కువ మార్కులూ తెచ్చుకున్నట్టు చెప్తున్నారు.సహజంగా అందరూ చేసేది ఏంటంటే ర్యాంకులు వాటిల్లోనే వస్తాయి గాబట్టి మెయిన్ సబ్జెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ర్యాంకులు కలవడంలో ప్రాధాన్యత లేకపోవటంతో లాంగ్వేజి సబ్జెక్టుల్ని పెద్దగా పట్టించుకోరు - ఇతనిలాంటి నాలాంటి కొద్దిమంది తప్ప:-)

      హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా రోహిత్ సహ విద్యార్ధిగా ఉండి ఆఖరి ఉత్తరంలో కూడా ప్రస్తావించబడిన అప్పటి సహ విద్యార్ధి రాంజీ చింతగడ "ఆ రోజుల్లో రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది కాదు.సైన్సు సహాయంతో ప్రపంచాన్ని మార్చడం గురించి ఎక్కువగా ఆలోచించేవాడు,ఒకరకంగా అప్పట్లో అతనొక టెక్నోక్రాట్" అని గుర్తు చేసుకున్నాడు.తనకి రావలసిన డబ్బు గురించిన ప్రస్తావనలో రాంజీ "40,000 రూపాయలు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడో నాకే అర్ధం కావట్లేదు.ఇచ్చేటప్పుడు నేను లెఖ్ఖ పెట్టుకోలేదు - అడిగినప్పుడల్లా 5000 గానీ 8000 గానీ ఇవ్వడమే తప్ప!" అంటున్నాడు.రవితేజ దొనేపూడి అనే హైదరాబాద్ యూనివర్సిటీ SFI శాఖకి మాజీ అద్యక్షుడు 2009లో జరిగిన వాళ్ళ మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ తొలి ఎన్నికల్లో అప్పటికి ABVPకీ SFIకీ మధ్య తేడా ఏమిటో తెలియకపోవటం వల్లనే రోహిత్ ABVPకి వోటు వేశాడని చెప్తున్నాడు.ఇతను కూడా రోహిత్ మాదిరిగానే సైన్సులో మాస్టర్స్ డిగ్రీ కోసం తనతో పాటు అదే సంవత్సరంలో జాయినయ్యాడు.రవితేజ "సైన్సు డిపార్టుమెంటులో ABVP ప్రభావం ఎక్కువగా ఉండటంతో స్నేహితులు చెప్పారు గాబట్టి వేసేశాడు" అంటున్నాడు. ఈ తొలినాటి రోజుల్లో అతను రాజకీయాల కన్నా సైన్సు గురించే ఎక్కువగా ఆలోచించేవాడట.రవితేజ "యూనివర్సిటీ క్యాంపసులో డస్ట్ బిన్స్ తగినన్ని లేకపోవటం గురించీ పరిశుభ్రత గురించీ ఎక్కువగా మాట్లాదేవాడు.ఒకసారి నన్ను కలిసినప్పుదు తెలుగులో ఒక సైన్సు మ్యాగజైన్ పెట్టి సైన్సు గురించి ప్రచారం చెయ్యాలనే ఐడియా ఉన్నట్టు చెప్పాడు." అని చెప్పటాన్ని బట్టి మొదట్లో అతనికి రాజకీయాల కన్నా సైంటిఫిక్ విషయాల పట్లనే ఆసక్తి ఎక్కువని తెలుస్తుంది.జులై 22,2010 నాటి తన ముఖపుస్తకం మీద "Me joined in hyd central uni. the environment here is fantastic………nice people around………feeling quiet (quite) happy………seeking for some good friends here." అని రాశాడు!

          ఇతనితో పాటు సస్పెండయిన అయిదుగురిలో ఒకతను సుంకన్న వేల్పుల.అతను "నాకు ఈ పుస్తకం ఆ పుస్తకం అని తేడా లేదు ఏది దొరికినా చదువుతాను" అని రోహిత్ అన్నట్టు గుర్తు చేసుకున్నాడు.అలా అతను చదివిన వాటిల్లో ముఖ్యమైనవి బి.ఆర్.అంబేద్కర్ రచనలు,కార్ల్ మార్క్స్ రచనలు!

      2011 నాటికి 22 సంవత్సరాల రోహిత్ కొత్తగా పరిచయమైన భావజాలం అతన్ని ఆకర్షించడమే కాక్ నిష్క్రియాత్మకంగా ఉండనివ్వకపోవటంతో స్టూదెంట్ పాలిటిక్సులోకి ప్రవేశించాడు.అందుకోసం తన Ph.D సబ్జెక్టుని కూడా మార్చుకున్నాడు.జీవశాస్త్ర పరిశోధకుడిగా పేరు తెచ్చుకోవాలనుకున్న రోహిత్ మారిన రాజకీయ దృక్పధం వల్ల రోజంతా ప్రయోగశాలాలో గడపటానికి ఇష్టపడక సోషల్ డిపార్టుమెంటుకి మారాడు.2012లో రోహిత్ SFIలో చేరాడు,కాలేజి రోజుల నాటి పాత మిత్రుడు రాంజీ అప్పటికే అందులో ఉన్నాడు.SFI సభ్యుడైన శేఖర్ "ఆ సంవత్సరమే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడు.జీవితంలో కేవలం చదువుకోవటం కన్నా చెయ్యాల్సిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి అంటుండేవాడు.2012లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా అతన్ని ప్రభావితం చేసినాయి" అంటున్నాడు.డిసెంబర్ 16న న్యూడిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ గురించి "A nation where 545 elected members (with 33% women candidates) failed to take a stand on the side of a girl child…… A nation where politicians behave as elected brokers, where no one does any work without a commission…. A nation where students feel shy, timid and embraced (embarrassed) of raising their voice against an odd thing….. A nation where educated intellectuals run for money like machines…… In a nation like our’s, death could be the only thing which can rescue us …." అని ప్రతిస్పందించాడు!

      రోహిత్ స్నేహితుల్లో ఒకడైన విజయ్ "ఒకసారి తనకి చిన్నప్పటినుంచీ కమ్యునిష్టులంటే అభిమానమని చెప్పాడు.వాళ్ళ వూళ్ళో అతని ఇంటికి దగ్గిర్లోనే CPI ఆఫీసు ఉండేదట.తరచుగా వాళ్ళ ప్రసంగాలు వినటం వల్లనే అతను కమ్యునిజాన్ని ఇష్టపడి SFIలో చేరానని అన్నాడు" అని చెప్తున్నాడు.కాబట్టి రోహిత్ అత్మహత్యని హత్యగా మలిచి హంతకుల్ని శిక్షించాలి అని ఉద్యమం చేసేవాళ్ళు అతని హంతకుల లిస్టుని అతని చిన్నప్పుడు అక్కడ ప్రసంగాలు దంచిన CPI నాయకుల నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది!

      ASA సభ్యుడైన జమీర్ "రోహిత్ SFIలో చేరినప్పుడు పెద్ద ప్రత్యేకంగా కనపడలేదు,కానీ ఇంగ్లీషులో,ముఖ్యంగా మాటల పొందికలో మంచి ప్రతిభ చూపించేవాడు - అతను డిజైన్ చేసిన పోస్టర్లలో మాటలు తక్కువగా ఉన్నా ఎఫెక్టు చాలా గొప్పగా ఉండేది.దానితో అతి తక్కువ కాలంలో SFIలో పాప్యులర్ అయిపోయాడు" అంటున్నాడు.2013లో యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యం.వెంకటేష్ అనే విద్యార్ధి ఆత్మహత్య చాలామందిని కదిలించింది."దానికి వ్యతిరేకంగా SFI,ASAలు సంయుక్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో రోహిత్ కూడా పాల్గొన్నాడు.ఆ తరవాత రెండు ఎన్నికల్లో SFI తరపున ప్రచారం చేసినా 2014 నాటికి ASA వైపుకి జరిగాం నేనూ రొహిత్.అయితే SFI పట్ల మాకున్న అభిప్రాయాల్లో చాలా తేడా ఉంది.నాకేమో వాళ్లది కేవలం మానిప్యులేషన్ మాత్రమే అనిపించేది.రోహిత్ మాత్రం SFI వాళ్లతో చాలా సుదీర్ఘంగా కులాన్ని పట్టించుకోకుండా వర్గాన్ని మాత్రమే పట్టుకు వేలాడటం గురించి వాదించేవాడు" అని రాంజీ అంటున్నాడు.

      నిజమే, పిచ్చి కుదిరితే గానీ పెళ్ళీ కుదరదు పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదన్నట్టు మురమ్నా ఏమో "బుద్ధుడూ చాలడు, అంబేద్కరుడూ పనికిరాడు, మార్క్సు మాత్రమే సమర్ధుడు" అంటుంది,ఐలయ్య ఏమో "కమ్యునిష్టులు గొప్పకి పోకుండా అంబేద్కర్ ప్రవచనాల్ని ఒప్పుకుని ఎన్నికల్ని సీరియస్సుగా తీసుకుని సిగ్గు పడకుండా కులసమీకరణల్ని వాడుకుని ఎట్లాగోట్లా ముందు జాతీయ స్థాయిలో అధికారం తెచ్చుకుని అప్పుడు పైనుంచి కమ్యునిజాన్ని రుద్దవచ్చు కదా" అని ఉభయచర కమ్యునిష్టులకి ఉబోస లిస్తున్నాడు.వర్గాన్ని వదిలేస్తే ఆ సిద్ధాంతం పిడకలేరుకోవటానికి కూడా పనికిరాదాయె మరి!సాయుధ పోరాటం కాన్సెప్టు వదిలేస్తే పిల్లులు కూడా భౌ భౌ మని మొరుగుతాయి వాళ్ళని చూస్తే,ఇంకెష్లా:-)వాళ్ళు వర్గాన్ని వదిలేసి కులాన్ని కావిలించుకోరు వీళ్ళు కులాన్ని వదిలేసి వర్గాన్ని కావిలించుకోరు.ఇద్దరిలో ఎవరో ఒకరు తమ మూర్ఖత్వాన్ని తగ్గించుకుని ఇద్దరూ కలిసి ప్రయత్నించనంత కాలం కులదోపిడీ,వర్గదోపిడీ రెంటిలో ఏదీ పోదు - మీకు నమ్మకం లేకపోతే నేను స్టాంపు పేపరు మీద రాసిమ్మన్నా రాసిస్తా!

      రోహిత్ ASAలో చేరడం వాళ్లకి ఒక సహజ నాయకత్వం వికసించిన మేధావిని సమకూర్చి పెట్టింది!"ASAకి అతను తెచ్చిన గొప్ప ఆయుధం ఇంగ్లీషు.అతను చేరక ముందు తెలుగుకి మాత్రమే పరిమితమైన ASA రోహిత్ అలవాటు చేసిన ఇంగ్లీషుతో మంచి వూపు తెచ్చుకుంది" అని ఉమామహేశ్వర్ అంటున్నాడు.ఇతనికే రోహిత్ అతని రూములో ఆత్మహత్య చేసుకుని ఆఖరి ఉత్తరంలో క్షమాపణ చెప్పింది."కమ్యునిష్తు సిద్ధాంతంలో దొరకని సాంత్వన అతనికి అంబేద్కర్ బొధనల్లో లభించింది.కమ్యునిష్టులు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా కనీసం క్యాంపస్ వరకూ అయినా కులాన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా మొత్తానికి తిరస్కరించడంతో దళితులు ఎందుకు అణిచివేయబడ్డారు,కులనిర్మూలన ఎందుకు అవసరం అనే విషయాలకి సంబంధించి పూర్తిగా అంబేద్కర్ మార్గమే సరైనదని అతనికి అనిపించింది" అని అంటున్నాడు సుంకన్న.ఈ రకమైన అవగాహనతో అప్పటి నుంచి అతనొక సహజ కవచ కుందల శోభితుడిన వీరయోధుడిలా మారిపోయాడు.ఇతనితో పాటు సస్పెండ్ అయినవారిలో ఒకడైన విజయ్ "పోట్లాట అంటూ వస్తే ఏమాత్రం వెనక్కి తగ్గేవాడు కాదు,అది ఒకరకంగా బలహీనతగా కూడా తయారై ఉండవచ్చు.చిన్న చిన్న విషయాలకి కూదా ఆవేశం తెచ్చుకునే వాడు" అని అంటున్నాడు.రోహిత్ తన ముఖపుస్తకం మీద తన గురించి తను "A small time sociology student, with uncontrollable reactive reflexes :)" అని వర్ణించుకున్నాడు!

      కాబట్టి అతని హంతకుల లిస్టులో ప్రముఖ ముద్దాయిలుగా అంబేద్కర్ గారినీ కారల్ మార్క్సు గారినీ కూడా చేర్చాలి.ఇంకా గతంలో అతనితో పోట్లాడి అతనిలో పోట్లాడటాన్ని ఒక బలహీనతగా మార్చిన ప్రతి ఒక్కడినీ హంతకుల లిస్టులో చేర్చాలి.పైగా అతను నిర్భయ ఉదంతం జరిగిన సందర్భంలో వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం వారు వీరని తేడా లేకుండా ఒక్కణ్ణి కూడా మినహాయించకుండా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న ఈ దేశంలోని రాజకీయ నాయకు లందర్నీ హంతకుల లిస్టు లోకి ఎక్కించి వురి తియ్యాలి!

          "అంబేద్కర్ గురించయినా పూలే గురించయినా చర్చకి దిగితే తనే గెలుస్తానని గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు రోహిత్.ఎవరయినా అతనితో చర్చ మొదలుపెదితే ఆపడం కష్టం - ఒక్కోసారి కోపం కూడా వచ్చేది" అంటున్నాడు విజయ్.శేషయ్య "మేమూ ఇంగ్లీషు మాట్లాదతాం.కానీ రోహిత్ ఇంగ్లీషు లెవెల్ చాలా పెద్దది!ఆఖరి ఉత్తరాన్ని చూడండి ఎంత గొప్పగా రాశాడో, అతని రచనలతో ASAని కొత్త ఎత్తులకి ఎక్కించాడు" అని అంటున్నాడు.అతని రచనా వ్యాసంగం విస్తరించిన మరొక రంగస్థలం ముఖపుస్తకం.అక్కడ తనకి ఎక్కువగా నచ్చిన కొటేషన్లలో "Never be a spectator of unfairness or stupidity. Seek out argument and disputation for their own sake; the grave will supply plenty of time for silence…." అనే కొటేషన్ అతనికి నచ్చిందని చెప్పాడట!

          చిన్నతనం నుంచీ జీవశాస్త్ర పరిశోధకుడు అవ్వాలనే కలలతో పెరిగి యూనివర్సిటెకి వచ్చేవరకూ క్లాసు పుస్తకాలు తప్ప ఇతరాలు ముట్టుకోకుండా ర్యాంకులు తెచ్చుకుని యూనివర్సిటెకి అడుగుపెట్టి అక్కడ పరిచయమైన కొత్త భావజాలం ప్రభావానికి గురయి సంటిస్టు కావడం కన్నా ఇతరమైన ఘనకార్యాలు చేయడం గొప్ప అనుకుని కొంచెం అరిందాతనం వచ్చేసరికి దానితోనే ఉబ్బితబ్బిబ్బైపోయి తానొక్కడే ఈ పద్మవ్యూహాన్ని చేదించి విజయవంతంగా బయటకు రాగలనని భ్రమపడి మితిమీరిన ఆవేశంతో ముందుకు దూకి ఆఖరి నిమిషంలో అది పద్మవ్యూహం కాదనీ నైరాశ్యపు చలిగుబుళ్ళు ఈచుకున్న ఒక నైరూప్య చిత్రమనే కఠినసత్యం బోధపడి అస్మదీయుడి వలె కనిపిస్తూ చాటుదెబ్బలు కొట్టగలిగిన పొంచి ఉన్న రాహువు వంటి అసలైన ఆజ్ఞాతశత్రువు బలమెంతో తెలిసి నిశ్చేష్టుడై ఒక అప్రస్తుతవీరవరేణ్యుడు చేసిన ఆయుధవిసర్జన - రోహిత్ ఆత్మహత్య!

            SFIలో ఉన్నప్పుడూ ASAలో ఉన్నప్పుడూ బహిరంగ ముద్దులు,బీఫ్ ఫెస్టివల్స్,మెమన్ ఉరితీతకు వ్యతిరేకంగా చేసిన ప్రదర్సనలు లాంటి ఎన్నో సంచలనాత్మకమైన కార్యక్రమాలలో ఏమాత్రం సంకోచం లేకుండా పాల్గొన్నాడు.ASAలోకి వచ్చాక హిందూత్వ భావజాలాన్ని సంస్కరణ శీలమైన వివేకానందుడి బోధనలతో సహా ఉతికి ఆరేస్తూ ముఖపుస్తకంలో తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు,ఆఖరికి చిన్నప్పుడు ప్రసంగాలు విని ఇష్టపడ్డానని చెప్పుకున్న కమ్యునిష్టుల్ని కూడా వదలకుండా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ ఆగ్రహం వెళ్ళగక్కాడు - అయినా ఆనాడెవరూ అతని మీద దాడి చేసి ఉరికి ప్రేరేపించ లేదు.పైగా ఐతనే ABVP వాళ్ళ బ్యానర్లు చింపి పోగులు పెట్టి "కాషాయ రంగు కనపడింది,కోపమొచ్చింది - చింపాను" అని వాళ్లతోనే వాగ్యుద్ధానికి దిగి నదురూ బెదురూ లేకుండా మాట్లాడాడు.ఇవ్వాళ యూనివర్సిటీలో బలంగా ఉన్న ఇంకో విద్యార్ధి సంస్థ   ABVPకి చెందిన నాయకుడితో అతని రూముకే వెళ్ళి బలవంతంగా క్షమాపణ పత్రం రాయించుకోగలిగాడు.శిక్షపడినప్పుడు వైస్ చాన్సలర్ దగ్గిర కెళ్ళి బతిమలాడుకోలేదు.పైన, వైస్ చాన్సలర్ గార్కి రాసిన ఉత్తరంలో కూడా దళిత విద్యార్ధులకు ఉరితాళ్ళు,విషం,కారుణ్యమరణం కానుకలుగా ఐవ్వండి అని వ్యంగ్యాలు విసిరాడే తప్ప రాజీ కోసం ఆలోచించి వెనకడుగు వెయ్యలేదు.మరి అప్పటి వరకు అంత ధైర్యంగా ఉన్నవాడు అంత హఠాత్తుగా పశ్చాత్తాపంతో రగిలిపోతూ ప్రపంచం నుంచి ఎందుకు నిష్క్రమించాడు?

          ఆ దురదృష్టకరమైన రోజున ఆత్మహత్య చేసుకుని ఈరోజు అందరి సానుభూతినీ పొందుతున్నాడు గానీ 2016 జనవరి 18న హైకోర్టుకు హాజరయ్యేందుకు సమన్లు అందుకుని ఉన్నాడు.ఆ కేసు పూర్తిగా తనకి ప్రతికూలమైనదే,నిర్దోషిగా బయటపడే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే అతనితో పాటు 5గురు విద్యార్ధుల్ని యూనివర్సిటీ ప్రోక్టొరల్ కమిటీ సస్పెండ్ చేసింది కూడా అతను మరొక విద్యార్ధి సంస్థ అయిన ABVPలో సభ్యుడైన సుశీల్ కుమార్ రూముకే వెళ్ళి భౌతికదాడి చేశారని నిర్ధారించుకోవటం వల్లనే!దాని మూలం తెలియాలంటే యాకూబ్ మెమన్ ఉరి కరెక్టా కాదా అని తేల్చుకోవాలి.అప్పటి వరకు ఒక సామాజిక సిద్ధాంతానికి కట్టుబడి అంబేద్కర్ మార్గంలో పోరాడుతున్న వీరకిశోరంలా కనబడిన రోహిత్ అప్పటి నుండి ఒక టెర్రరిస్టును సమర్ధించటానికి "ఒక వీరుడు మరణిస్తే వేలాదిమంది ప్రభవింతురు" అని భగత్ సింగు లాంటివాళ్ళకి వాడాల్సిన గొప్ప వాక్యాన్ని అధమాధమ స్థాయికి దిగజార్చిన తన వైఖరిని నైతికంగా సమర్ధించుకోలేక తప్పు మీద తప్పు చేస్తూ నడిచి  ఆఖరి క్షణాల్లో ఒకనాడు రాంజీకి SFI గురించి బోధపడిన "ఇదంతా మానిప్యులేషన్ మాత్రమే" అన్న సత్యమే తనకూ ASA గురించి బోధపడినందువల్ల కాళ్లకింది భూమి కదిలిపోయి ఆ భూకంపం ధాటికి తట్టుకోలేక తనను తనే అంతం చేసుకున్నాడు గనక అక్కడి నుంచి మొదలుపెడితే అతని వివేకభ్రష్టత్వం పూర్తిగా గోచరిస్తుంది.

          బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహించటం లాంటి చెత్తపనులకు ఎక్కువసేపు ల్యాబరేటరీలో గడపాల్సిన సైన్సు గ్రూపును వదిలి ఆర్ట్స్ గ్రూపుకి మారడమే అతని మొదటి తప్పు!అయినా యాకూబ్ మెమన్ ఉరితీతకు తెలిపిన నిరసనకు ముందరి కార్యక్రమాలకి సమర్ధించుకోవడానికి ఎంతో కొంత సబబైన కారణాలు ఉంటే ఉండవచ్చు గానీ యాకూబ్ మెమన్ ఉరికి ప్రతీకారంగా ప్రతి ఇంటి నుంచీ ఒక యాకూబ్ మెమన్ లాంటి ఉగ్రవాదిని పుట్టించమని విజ్ఞప్తి చెయ్యడం మాత్రం సమర్ధనీయం కాదు.1993లో జరిగిన పేలుళ్ళకి 2015లో శిక్ష పడింది - అంత సుదీర్ఘకాలం పాటు ఈ దేశపు సర్వోన్నత న్యాయస్థానం అన్ని రకాల సాక్ష్యాధారాల్నీ పరిశీలించి అంబేద్కర్ రచించిన రాజ్యాగం ప్రకారమే విధించిన శిక్షని వ్యతిరేకించినవాళ్ళు అంబేద్కర్ వాదులు ఎట్లా అవుతారు?అతడేదో అమాయక బీద ముస్లిం అయినట్టూ దేశంలో ఉన్న బ్రాహ్మణులంతా కత్తులు తీసుకుని అతని కుత్తుకని కోసినట్టూ అల్లల్లాడిపోతూ తాటిచెట్టెందుకు ఎక్కావంటే దూడగడ్డి కొసమన్నట్టు ఇప్పటి వరకూ ఉరి తియ్యబడిన వాళ్ళలో ఎక్కువమంది దళితులు గనక గతంలోని ఉరిశిక్షల్ని వ్యతిరేకించినట్టుగానే ఇప్పుడూ మేము వ్యతిరేకించాము అంటున్నారు గానీ మెమన్ ఉరిశిక్షకి సంబంధించిన నిజాలు ఇవి:నిజానికి ఈ పేలుళ్ళు జరిపించింది ముస్లిముల మనోభావాల్ని పట్టించుకోకుండా అయోధ్యలో బాబ్రీ మసీదుని కూలగొట్టడానికి ప్రతీకారంగా చేశామని చెప్పుకుంటారు గానీ వీళ్ళు బాంబులు పేల్చటానికి పనిముట్లుగా వాడుకున్నది చదువూ సంధ్యా లేని బీద ముస్లిముల్నే అని వీళ్ళకి నిజంగానే తెలియదా!అప్రూవరుగా మారి తనంతట తను లొంగిపోయాడంటారు గానీ అతని అరెస్టు మాత్రం అనుకోకుండా అతను దొరికిపోవటంతో జరిగింది.పేలుళ్ళ ద్వారా తాము ఆశించినంత ఫలితం రాలేదు.పాకిస్తాన్ గడ్డ మీద ఎక్కువ కాలం ఉంటే పాకిస్తానుకీ అంతర్జాతీయ సమాజం నుంచి చివాట్లు వస్తాయి,అప్పటికే వస్తున్నాయి!దాంతో మారుపేరుతో నేపాల్ వెళ్ళాడు.అక్కడికి ఒక మిత్రుణ్ణి రప్పించుకుని తను అమాయకుణ్ణి అని చెప్తే ఇండియాలో నమ్ముతారా అని వాకబు చేస్తే అతను తనపేరు కూడా నిందితుల లిస్టులో ఉందని ఉన్న విషయం చెప్పాడు.దానితో నిరాశపడి చేసేది లేక బొంబాయి మీదుగా కరాచీకి వెళ్ళిపోదామనుకున్నాడు.ఎయిర్ పోర్టులో చెకింగు దగ్గిర తన బ్రీఫ్ కేసులో ఉన్న తాళాల గుత్తి తుపాకీ ఆకారంలో కనబడటంతో ఎయిర్ పోర్టు అధికార్లు బ్రీఫ్ కేస్ తెరిచి చూస్తే ఇండియన్ పాస్పోర్టు కనబడింది.అసలు మనిషి ఫలానా అని తెలియగానే వాళ్ళు సిబీఇకి అప్పగీంచారు.అసలు నిజం ఇదయితే ఇండియాలో ఉన్న యాకూబ్ అభిమానులు "అతను లొంగిపోదామని వస్తే భారత పోలీసులు అబద్దాలు చెప్పి పట్టుకున్నారు.తనంతట తను లొంగీపోయి కేసు విచారణలో సహకరించిన సజ్జనుణ్ణి ఉరితియ్యడం అన్యాయం, ఇతన్ని ఉరి తీస్తే టైగర్ ఎట్లా దొరుకుతాడు" అని తలాతోకా లేని మాటలు మాట్లాడుతున్నారు.తనంతట తను లొంగిపోదామనుకుంటే నేపాల్ నుంచి డిల్లీకి వస్తాడు గానీ కరాచీ ఎందుకు వెళ్ళాలనుకుంటాడో ఈ కోడిమెదడు మేతావులు చెప్పగలరా?అప్పటికి కొన్నేళ్ళుగా దావూద్ ఇబ్రహీం వంటివారితో సంబంధాలు ఉండి స్వయంగా అండర్ వరల్డ్ డాన్ అయిన టైగర్ మెమన్ తమ్ముడై ఉండి, బాంబులు పేల్చటానికి అయిన ఖర్చునంతా తనే పెట్టుకుని ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో నిర్దేశించుకుని మనుషుల్ని కూడా మాట్లాడుకుని ఆర్గనైజ్ చేసి, ఇంకో రెండు గంటల్లో తన మూలంగా అంతమంది చస్తారని తెలిసి కూడా పశ్చాత్తాపం లేకుండా తన ప్రాణం రక్షించుకోవడానికి పాకిస్తాన్ పారిపోయిన వాడిని పెద్దమనిషిగా కలరు పులమడానికి అన్ని కట్టుకధలు అల్లుతున్నవాళ్ళు నిజంగా పెద్దమనుషులేనా!పట్టుబడినాక కూడా తన ఒక్కడి ప్రాణమే విలువైనదన్నట్టు తనకోసమే లాయర్లని పెట్టుకున్నాడు గానీ తనిచ్చిన పదివేల కోసం తను పెట్టమన్నచోట బాంబులు పెట్టి అమాయకంగా దొరికిపోయి ఉరిశిక్షకి గురయిన కడుబీద ముస్లిముల ప్రాణాల్ని గురించి ఏమాత్రం పట్టించుకోని స్వార్ధపరుణ్ణి మంచివాడని అనటం నిజంగా అమాయకత్వమేనా?ఆ బీద ముస్లిముల గురించి పట్టించుకుని నిజానిజాలు తెలుసుకుని కింది కోర్టులు వీళ్ళ తరపున గట్టిగా వాదించినవాళ్ళు ఎవరూ లేకపోవటం వల్ల తొందరపాటుతో వేసిన ఉరిని రద్దు చేసిన సుప్రీంకోర్టు కేవలం ఇతనికి ఉరి వేసినందుకే దుర్మార్గమైపోయింది వీళ్ళ దృష్టిలో - ఏమిటీ వికటత్వం?

          2015 జులై 30న అంటే యాకూబ్ మెమన్ ఉరిని గురించి రోహిత్ తన ముఖపుస్తకంలో Black Day for Indian Democracy Shame on Judiciary and government for hanging yakub memom అని పోష్టు చేశాడు - ఏమిటి దీనర్ధం?రోహిత్ ఫేస్ బుక్ పోష్టుల్ని దశల వారీగా చూస్తుంటే నాకు "ఆకాశంబు నందుండి, శంభుని శిరంబందుండి, శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి, పవనాంధో లోకమున్ జేరె గంగా కూలంకష - పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్!" అన్న భర్తృహరి సుభాషితం గుర్తొచ్చి ఎంతో జాలిగా అన్పించింది!బయాలజీ సైంటిస్టు కావాలని యూనివర్సిటీలో చేరి బుద్ధిగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని తన కలల్ని నెరవేర్చుకోవడానికి అన్ని అవకాశాలూ ఉండి కూడా తన్ను మాలిన ధర్మం చందాన తల్లి పట్ల తన బాధ్యతని గాలికొదిలి మొన్నటి రోజున సాటివాళ్లలో హీరో అనిపించుకుని నిన్నటి రోజున తొండ ముదిరి వూసరవెల్లి అయినట్టు రౌడీగా కూడా మారి ఇవ్వాళ్టి రోజున జీరోగా మిగిలాడు - ఈ ముగింపుని ముందే తెలుసుకుని ఉంటే ఈ చెత్త రాజకీయాల్లోకి వచ్చి ఉండేవాడు కాదు గదా?!

          ఆగస్టు 3న వీళ్ళు MIM యాకూబ్ మెమన్ మృతికి సంతాపసూచకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చేసిన పనుల్ని అవహేళన చేస్తూ ABVPకి చెందిన సుశీల్ కుమార్ తన ముఖపుస్తకం మీద వీళ్ళని "గూన్స్" అని పిలుస్తూ ఒక పోష్టు వేశాడు.అప్పటికే వివేకానందుణ్ణి గురించి కూడా Vivekananda is an apologist of Caste system, misogynistic and a fake intellectual. He is an overrated, half-witted person who has no scientific references to his rants, there was no actual n original ideas or knowledge production from this guy. I am surprised and disappointed at the kind of institutionalised celebration of his birthday in HCU అనేటంత ముదురు కామెంట్లు వేసినవాడు ఈ చిన్నమాటకే విపరీతంగా కోపం తెచ్చుకున్నాడు.అదేమిటో ఈ రోహిత్ ఒక్కడే కాదు,కంచె ఐలయ్య లాంటివాళ్ళు కూడా ఇదే వరస, మా భావజాలంలో ప్రజాస్వామ్యం పగలబడిపోతున్నది, మేము హిందువుల్లాగ పెత్తందార్లం కాము అంటూనే తమకు నచ్చినవాటిని మిగతావాళ్ళు కూడా చచ్చినట్టు మెచ్చుకు తీరాల్సిందేనని పట్టుబట్టటం, తమకు నచ్చనివి అసలు తమ కంటికే కనబడకూడదని వీరంగాలు వేస్తూ ఇతర్ల మీద పెత్తనాలు చెయ్యటం - ఇదేమి ప్రజాస్వామ్య స్పూర్తియో వీళ్ళ పిండాలు పిల్లులకి బెట్ట?!

          ఆగస్ట్ 3న సుశీల్ కుమార్ తన ఫేస్ బుక్ పోష్టు అప్డేట్ చేస్తే అదే రోజు రాత్రి రోహిత్ ఒక పెద్ద బృందాన్ని వెంటబెట్టుకుని సుశీల్ కుమార్ రూముకి వెళ్ళి గొడవ చేసి బలవంతంగా అతనితో క్షమాపణ పత్రం రాయించుకున్నాడు.అయితే ఆగష్టు 4,2016న సుశీల్ కుమార్ అతని సోదరుడు విష్ణు సాయంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయినయి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకున్నాడు.అక్కడ అది మెడికో లీగల్ కేసుగా నమోదు చెయ్యటంతో క్రిందటి రోజు రాత్రి రోహిత్ బృందం అతని పైన భౌతికంగా దాడి చేశారని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది!అయితే సుశీల్ పేషెంటుగా ఉండగానే సుశీల్ బంధువు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా యూనివర్సిటీ ప్రోక్టొరల్ కమిటీ విచారణ జరిపి ఇరువర్గాలనూ మందలించి వొదిలెయ్యాలని తీర్మానించింది.హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాక తన వైపు నుంచి వాదన వినకుండా తన పరోక్షంలో విచారణ జరపడం అన్యాయం అని తనకు న్యాయం జరిపించమని సుశీల్ బండారు దత్తాత్రేయ గారిని కలిశాడు.ఆయన యూనివర్సిటీ విషయాల్లో జోక్యం చేసుకోవటం దేనికని భావించి కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి ఒక లేఖ రాసి సుశీల్ అభ్యర్ధనను కూదా జత చేసి పంపించారు. కేంద్రం నుంచి యూనివర్సిటీకి తగిన చర్య తీఎసుకోవటం కోసం సూచన పంపించారు.ఈలోపు సుశీల్ తల్లి తన కొడుకు మీద జరిగిన దాడి గురించి కేసు వెయ్యటం జరిగింది.దానితో విషయం తీవ్రతని బట్టి రెండవ సారి సుశీల్ కూడా హాజరయిన ప్రోక్టొరల్ కమిటీ 5గురు విద్యార్ధుల్ని సస్పెండ్ చేసింది.ఈ మొదటి సస్పెన్షన్ చాలా తీవ్రమైనది.

          అపెండిసైటిస్ అనగానే చాలా సిల్లీగా తీసిపారేస్తున్నారు కేజ్రీవాల్ దగ్గిర్నుంచి ప్రతి ఓక్కరూ.దీని చరిత్ర ఇది:మనిషి ఆహారాన్ని వండుకు తినటం నేర్చుకోక ముందు మాంసాన్ని అన్ని మాంసాహార జంతువుల లాగే పీక్కు తినేవాడు,కందమూలా లయితే కోతుల మాదిరిగా కొరుక్కు తినేవాడు.ఈ కఠినమైన ఆహారాన్ని జీర్ణం చేసుకునేటందుకు కొన్ని రకల బాక్టీరియా జీర్ణవ్యవస్థలో కుదురుకుని ఉండి సహాయపడుతూ ఉండేది.అయితే తర్వాతి కాలంలో మారిన ఆహారపు అలవాట్ల వల్ల ఆ భాగం ఆవసరం తగ్గిపోయి కుంచించుకుపోయి అవశేషంగా ఉండిపోయింది.మనిషి శరీరంలో ఇలాంటి అవశేషాంగాలు చాలా ఉన్నాయి.ఆ శరీర భాగం ఎటూ ఉంది గనక ఆ బాక్టీరియా కూడా అపెండిక్స్ లోనే ఉండి  రక్తం ద్వారా ఆ భాగం లోకి చేరిన ఆహారం మీద బతికేస్తున్నది.వెనకటి కాలంలో అవి ఉపయోగకారులే అయినా ఇప్పుడు గనక అవి రీరం లోని ఇతర భాగాల లోకి వ్యాపిస్తే హానికరమైనవి అవుతాయి.సాధారణంగా డాక్టర్లు ఇతర రోగాల కోసం పొట్టను కోసినా కుట్లు వేసేటప్పుడు ఈ అపెండిక్సుని కత్తిరించి తీసేస్తారు - భవిష్యత్తులో సమస్య రాకుండా!పొట్ట మీద బలంగా దెబ్బ తగలనిదే లోపలెక్కడో ఉన్న అపెండిక్స్ చిట్లే అవకాశం లేదు.అపెండిక్స్ పగిలి బాక్టీరియా వ్యాపించినప్పుడు వెంటనే అపరేషన్ చెయ్యకపోతే మనిషి ప్రాణానికి ప్రమాదమే - 24 గంటల కడుపు నెప్పి అంటారు దీన్ని!మెడికల్ ర్రిపోర్టులో భుజం మీద దెబ్బ తగిలినట్టుగా కూడా ఉంది - అంత దుర్మార్గం చేసిన వాడు సూయిసైడ్ చేసుకునేసరికి ట్రాజిక్ హీరో లెక్కన పేరు తెచ్చుకుంటున్నాడు!

          మొదటి సారి సస్పెండ్ చెయ్యటం కాంగ్రెస్ పార్టీ నియమించిన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయాల ప్రకారం జరిగింది.రెండు నెలల క్రితం భాజపా ప్రభుత్వం నియమించిన కొత్త వైస్ చాన్సలర్ సెప్టెంబర్ 7న జరిగిన ఈ కథినమైన శిక్షని తగ్గించి కేవలం ఆర్నెల్ల పాటు హాస్టల్ నుంచి మాత్రమే బహిష్కరిస్తూ చదువులు కొనసాగించుకోవటానికి వీలుగా క్లాసులకి హాజరు కావటానికీ లైబ్రరీకి వెళ్ళడానికీ అనుమతులు ఇచ్చి గుంపుగా తిరగటాన్ని మాత్రమే నిషేధించారు.సెప్టెంబర్ 7న కథినమైన శిక్షని వేసిన పాత వైస్ చాన్సలర్ మీద కాకండా శిక్షల్ని సవరించిన కొత్త వైస్ చాన్సలర్ మీద ఉద్యమం చేయ్యడం లోని మతలబు ఏంటి?

          ఈ మతలబు వల్ల తొలిసారి రోహిత్ గందరగోళానికి గురయ్యాడు.స్కాలర్ షిప్ ఆగిపోవడంతో ఇంటికి డబ్బు పంపటానికి అప్పులు చేస్తున్నప్పుడు ఆర్ధికం మెదడులో ప్రమాద ఘంటికల్ని మోగించి ఉంటుంది.ఇంకో వైపున సుశీల్ తల్లి వేసిన కేసు కూడా బలమైనదే!మామూలుగా అయితే రోహిత్ లాంటి ఉద్యమవీరులకి తమ మీద ఇలాంటి కేసులు పడితే ఉత్సాహం పుడుతుంది.వీర భగత్సింగు లెవేల్లో కోర్టు హాలులో ఉపన్యాసాలు దంచగలిగే సువర్ణావకాశం తలుపు తడుతున్న సమయంలో రోహిత్ లాంటి భాషాపరశేషభోగి దాన్ని వొదులుకుని ఆత్మహత్య చేసుకోడు!రోసస్పెన్షన్లు పూర్తిగా ఎత్తేసినా ఉద్యమం ఉధృతం చేస్తున్న వాళ్ళు ఆ ప్రసక్తినే తీసుకు రావటం లేదు గానీ సుశీల్ నమ్మకంగా చెప్తున్నాడు రోహిత్ రాజీ ఫార్ములాతో వచ్చాడని!ఆందోళన విరమించుకోవడం ద్వారా ఆ కొంచెం సస్పెన్షన్ కూడా ఎత్తేయించుకుని సుశీల్ కేసు వాపస్ చేసుకునేలా ఒప్పందం జరిగి ఉండవచ్చు.అయితే తను చేసిన రాజీ ప్రయత్నాల గురించీ సుశీల్ సానుకూలంగా స్పందించటాన్నీ మిగిలిన వాళ్లకి చెప్పినప్పుడు వాళ్ళు బయటపెట్టిన ఒక విషయం రోహిత్ ఆశల్ని నీరుగార్చేసింది.వీళ్ళకి పై స్థాయిలో ఉన్న పెద్దలు ఈ ఆందోళనని ఇంకా పెంచి కేంద్రం లోని భాజపా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టమని సూచించారట!ASA లోకి వచ్చేటప్పుడు రాంజీకి SFI గురించి బోధపడిన నిష్ఠురసత్యమే ఇప్పుడు ASA గురించి మనవాడికి బోధపడింది.కళ్ళు తెరుచుకున్నాయి కానీ బతకటానికి పనికొచ్చే దారులన్నీ మూసుకుపోయి ఒకే ఒక్క దారి మిగిలింది - వీరమరణం లాంటి గౌరవప్రదమైన ఓటమి!

          రోహిత్ తన ఆఖరి ఉత్తరంలో రాసి కొట్టేసిన భాగాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా సేకరించి టైమ్స్ ఆఫ్ ఇండియా జనవరి 22న ప్రచురించింది."ASA,SFI వాటి ఉనికిని చాటుకోవడం కోసమే పనిచేస్తున్నాయి.ఆయా సంస్థల సిద్ధాంతాలు అందులో పనిచేసే వ్యక్తుల ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి.అధికారం చలాయించడం కోసం,ప్రచారంలో ఉండడం కోసం,తమ ప్రాముఖ్యత చాటుకోవడం కోసం మాత్రమే పనిచేస్తున్నాయి.పైగా సమాజంలో మార్పుకోసమే పనిచేస్తున్నామంటూ తమను తాము మభ్యపెట్టుకుంటూ ఉంటున్నాయి" అని రోహిత్ రాసి కొట్టేసి తనే దాన్ని కొట్టేసినట్టు పక్కన నోట్ పెట్టి సంతకం చేశాడు!ఈ రాసి కొట్టేసి తనే కొట్టేశానని చెప్పడం వెనక ఉన్న చిదంబర రహస్యమేమిటో మరి?

          రోహిత్ సుశీల్ మధ్య జరిగిన రాజీ వ్యవహారం నిజమే అయితే ఈ కొట్టేసిన భాగంలో రోహిత్ వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం రోహిత్ ప్రతిపాదించిన రాజీకి ఒప్పుకోని ASA సహచరుల్ని కూడా హంతకుల లిస్టులోకి ఎక్కించాలి.కొత్తగా తెలిసిన రోహిత్ కుటుంబ వివరాల ప్రకారం తండ్రి మణికుమార్ ఇంటర్ చదివి ఒక హాస్పటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వడ్డెర కులస్థుడు.తల్లి రాధిక మాల కులంలో పుట్టినా దత్తత ద్వారా అంజనీదేవికి పెంపుడు కూతురుగా పెరిగింది.ఒక పాత సినిమాలో "సంతానమే లేక" అని ఒక హాస్యగీతం ఉంది - మీరెవరయినా విన్నారా?అప్పట్లో పిల్లలు పుట్టకపోతే పూజలూ పునస్కారాలూ తీర్ధయాత్రలూ చెయ్యమని చెప్పేవాళ్ళు!వాటిలోనే ఒక వింతయిన పరిష్కారం ఎవర్నయినా దత్తత తీసుకోమనటం.ఈ పరిష్కారాలు కొన్నిచోట్ల పని చేసేవి కూదా!దత్తత తీసుకుంటున్నప్పుడు నిస్సంతుగా ఉన్నవాళ్లకి కొంతకాలమయ్యాక పిల్లలు పుట్టేవాళ్ళు.అసలు పిల్లలు పుట్టనప్పుడు గారాబంగా పెరిగిన మొదటి సంతానం పరిస్థితి తర్వాత తమకంటూ సొంతంగా పిల్లలు పుట్టాక దయనీయంగా తయారయ్యేది.దానినే కవిగారు "సంతు గలిగిందంటేను చిన్ని పాపాయి గతి శ్రీమతే రామానుజాయ నమః" అని కామిడీగా చెప్పారు.పాట యొక్క శైలి హాస్యసోరకంగా ఉందటం వల్ల మనకి నవ్వొచ్చినా అనుభవించినవాళ్లకి నరకమే కదా - అలాంటి బాధల్నే రాధిక అనుభవించి ఉంటుంది!రాధిక పెంపుడు తల్లి వడ్డెర కావడంతో వడ్డెర కులస్థుడికే ఇచ్చి పెళ్ళీ చేశారు.తీరా రాధిక కులం తెలిశాక అబద్ధం చెప్పి మాలదాన్ని నాకంటగట్టారు అని ఆ ప్రబుద్ధుడు విడాకు లిచ్చేశాడు.పైకి వాచ్యంగా చెప్పకపోయినా తన కులం గురించీ తన గురించీ గొప్పగా చెప్పుకుని కొడుకు కులాన్ని మార్చడం గురించి తిరస్కారంగా మాట్లాడినందువల్ల విడాకులకి కారణం అదే అయ్యుండాలి - నిజమేమిటో ఎవరూ చెప్పడం లేదు,మన కనవసరం గూడా!రాధిక పెంపుడు తల్లి అంజనీ దేవిని చూశాను, తెలుగు రాకనో చాలామందికి లాగ స్టయిలు కోసమో అంతా ఇంగ్లీషులోనే మాట్లాడటం కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు.

          2012లో రమెష్ బాయ్ డి.నాయికా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సాధారణ అరిస్థితిలో బిడ్డలు తండ్రి కులాన్ని స్వీకరిస్తారనే విషయాన్ని ఒప్పుకుంటూనే తల్లి పుట్టుక కారణంగా "జీవితమంతా  అవమానాలకు,తలవంపులకు,తిరస్కారాలకు(Deprivation,Indignities,Humiliation,Handicaps) లాంటివాటికి గురయిన పక్షంలో పిల్లల్ని దళితులుగా గుర్తించవచ్చు" అని స్పష్టంగా ఉండటం వల్ల రోహిత్ దళితుడేనని నా అభిప్రాయం.నా దృష్టిలో ఈ విషయానికి అసలు ప్రాధాన్యత లేదు.అతనికి వస్తున్న స్కా;లర్ షిప్ మెరిట్ స్కాలర్ షిప్ అంటున్నారు.అది క్యాన్సిల్ అయ్యే ప్రమాదం లేదు.ఇప్పుడు రోహిత్ దళితుడని ఒప్పుకోవటం వల్ల వీళ్ళు ఉఢృతం చెయ్యాలనుకుంటున్న ఉద్యమానికీ ఏ విధంగానూ లాభం ఉండదు.ఎవరిమీదయినా ఆట్రాసిటీ కేసు పెట్టటం కోసం మాత్రం పనికొస్తుంది - కానీ ఎవరిని హంతకులుగా నిర్ధారించాలి?కర్ణుడి చావుకి మల్లే చిన్నప్పుడు ఇంటి పక్కన ఉన్న పార్టీ ఆఫీసు నుంచి ప్రసంగాలు దంచిన CPI నాయకుల నుంచి రోహిత్ రాజీ ప్రతిపాదనని ఒప్పుకోకుండా అతనికి విరక్తిని కలిగించిన ASA సహచరుల వరకూ అందరి బాధ్యతా ఎంతో కొంత ఉంది కదా!

          రోహిత్ బృందం దాడిచేసిన సుశీల్ కుమార్ కూడా వెనకబడిన కులానికి చెందినవాడే.రోహిత్ ఆత్మహత్యను దళితుల మీద అగ్రవర్ణ హిందువుల దాడిగా చూస్తే మరి సుశీల్ కుమార్ మీద జరిగిన దాడిని ఎలా చూడాలి?ఈ గందరగొళం వల్ల సరళతరం చేసిన కాస్తపాటి సస్పెన్షన్ ఎత్తేశాక కూడా చదువును కొనసాగించకుండా ఇప్పుడు ఆందోళన చేస్తున్న విద్యార్దులు మూర్ఖంగా ఇంకా ముందుకెళితే ప్రతి ఒక్కరి నుంచీ ఈ ప్రశ్న రావడం ఖాయం!హైదరాబాద్ యూనివర్సిటీలో ఈ విద్యార్ధులు పొందుతున్న ఏ సౌకర్యమూ వైస్ చాన్సలర్ గానీ యూజీసీ చైర్మన్ గానీ విద్యాశాఖ మంత్రులు గానీ వారి జేబుల్లో నుంచి ఖర్చుపెడితే రావటం లేదు.రోహిత్ హక్కుగా పొందుతున్న 30000 ఎక్కడ నుంచి వస్తున్నాయి?భారతదేశపు పౌరులుగా ఉన్న ఈ దేశప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా - ఈ దేశప్రజల ఉమ్మడిసొమ్మును అనుభవిస్తూ ఈ దేశప్రజల మీద బాంబులు పేల్చి చంపినవాణ్ణి ఉరితీస్తే "Black Day for Indian Democracy Shame on Judiciary and government" అని వ్యాఖ్యానించినా ఏమీ చెయ్యకూడదా?వివేకానందుణ్ణి "fake intellectual" అన్న పండితులు సుశీల్ వాడిన "గూన్స్" అన్న చిన్నమాటను పట్టుకుని బృందంగా వెళ్ళి ఉద్ధరించిన ఘనకార్యం ఏమిటి?"గూన్స్" అన్న మాటకి వీళ్ళు తగిన వాళ్ళే అని నిరూపించుకోవటం కాదా!

         మార్క్సిష్టు భావజాలం గల హరగోపాల్ ఇదివరలో 21 మంది విద్యార్ధుల్ని ఇప్పటికన్నా కఠినమైన శిక్షలు వేసినప్పుడు ఆందోళన చెయ్యలేదు - ఎందుకని?కొందరిని ఇఇక్కడ సస్పెండయినా ఇంకో చోట జాయినయ్యే వీలు లేకుండా ఇతర యూనివర్సిటీలో అడ్మిట్ కాకుండా నిషేధించటం లాంటి క్రూరమైన శిక్షలు కూడా వేశారు గదా!నిజానికి ఇవ్వాళ కులపిచ్చి చదువు రానివాళ్లలో కన్నా చదువుకున్నవాళ్ళలోనే ఎక్కువ ఉంది.స్టూడెంట్లకే కాదు ప్రొఫెసర్లకీ ఉంది కులపిచ్చి - ఒప్పుకుందాం!అయితే ఒక కులపిచ్చి ఉన్న ప్రొఫెసర్ మీద చర్య తీసుకోవాల్సిన మంత్రిగారు కులసమీకరణల ప్రకారమే ఎన్నికవుతున్నప్పుడు నిష్పక్షపాతంగా అతనెలా  వ్యవహరించగలుగుతాడు?ఇవ్వాళ ప్రతి రాజకీయ పార్టీ ఫలానా నియోజక వర్గంలో ఏ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆ కులంవాణ్ణి అభ్యర్ధిగా నిలబెడుతున్నది,వాళ్ళు ఢంకా మీద దెబ్బ గొట్టినట్టు గెలుస్తున్నారు, గెలుపోటముల విశ్లేషణలు చెసే మీడియా మేధావులు కూడా ఫలానా నొయోజకవర్గంలో ఫలానా కులస్థులు ఎక్కువ ఉండటం గమనించి కూడా వేరే కులంవాణ్ణి నిలబెట్టటం వల్లనే ఫలానా పార్టీ ఆ స్థానంలో వోడిపోయినట్టు బల్లగుద్ది చెప్తున్నారు.ఈ రకంగా తమ కులం వల్లనే గెల్చినవాళ్ళు కులరహితులుగా ఉండగలరా?రాజకీయ పార్టీలు ఏ ప్రాంతంలోనైనా ఏ అబ్యర్ధినైనా అర్హతల్ని బట్టి గాక అక్కడ ఒక కులం ప్రభావశాలి అని తీర్మానించి ఆ కులం నుంచి నిర్ణయిస్తే ఆ కులంవాళ్ళు సిగ్గుపడిన రోజున ఆ ప్రాంతం కులపిచ్చికి దూరమయినట్టు - అప్పటివరకు ఎన్ని ఉపన్యాసాలు దంచినా కులపిచ్చి పోదు!

          దళితులు అధికారం లోకి వచ్చి కులరహిత సమాజం స్థాపించితే గానీ అసమానతలు తొలగవు అని చెప్తున్న కంచె ఐలయ్య దళిత అనుకూల ప్రభుత్వం రావాలంటే దళితులు తమ కులాల వాళ్ళకే వోటు వెయ్యాలని సూచిస్తూ ఎడంచెయ్యి తీసి పుర్రచెయ్యి పెట్టమన్న తలతిక్క పరిష్కారాలు చెప్తున్నా మేధావి అని గౌరవిస్తున్నారు.ఒక కంచె ఐలయ్య వందమంది యాకూబ్ మెమన్ లాంటి ఉగ్రవాదుల కన్నా ప్రమాదకారి!కుల రహిత సమాజం ఏర్పడాలి అంటాదు,తన కురుమ గొల్ల కులం విశ్వవ్యాప్తం కావాలి అంటాడు - రెంటికీ అస్సలు పొసగదు కదా!కుల రహిత సమాజం కావాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాలి - అప్పుడు కురుమ గొల్ల కులం ఉనికిలోనే ఉండదు!లేదంటే ప్రతి కురుమ గొల్ల పురుషుడూ పదిమంది కురుమ గొల్ల స్త్రీలని పెళ్ళాడి ప్రతి స్త్రీ నుంచి పదిమంది సంతానాన్ని కనాలి.వీళ్ళందర్నీ పెరిగి పెద్దయ్యే లోపు చావకుండా పోషించటానికి దారులు కొట్టటం దగ్గిర్నుంచి హవాలా కుంభకోణాల వరకూ ఏ దిక్కుమాలిన పనయినా సరే చేసి విపరీతంగా డబ్బు సంపాదించాలి!అప్పుడు కురుమ గొల్ల కులం విశ్వవ్యాప్తమవుతుంది దళితులకి రాజ్యాధికారం దానంతటదే వచ్చేస్తుంది.వినేవాడు ఉంటే పంది పురాణం చెప్తుందన్నట్టు చెలరేగిపోతున్నాడు - వినేవాళ్ళు ఎలా వింటున్నారో పిడకలేరుకోవటానికి కూడా పనికిరాని ఈ పోచికోలు కబుర్లు?

          ఈ కమినిష్టు దళితిష్టు మేధావులు ఎంత ఛండాలంగా ప్రవర్తించగలరో సాతులూరి చలపతి రావుకి పడిన ఉరిశిక్షని తప్పించటానికి ఆడిన నాటకాన్ని బట్టి తెలుసుకోవచ్చు.1993లో చిలకలూరి పేటలో కొందరు దళితులు ఒక ఆర్టీసీ బస్సుని తగలబెడితే అందులో ఉన్న 23 మంది ప్రయాణీకులు చనిపోయారు.నిందితుల్లో సాతులూరి చలపతి రావు, గంటెల విజయవర్ధన రావు అనే ఇద్దరికి ఉరిశిక్ష పడింది.ఇంక చూసుకోండి!దళిత ప్రజా సంఘాల నుంచి మానవ హక్కుల సంఘాల లోని మేధావు లంతా రంగం లోకి దిగి జరగరాని ఘోరం జరిగిపోయినట్టు ఆందోళన పడిపోయి రాష్త్రపతి నుంచి క్షమాబిక్ష రాబట్టుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.వీళ్ళకి చచ్చిపోయిన 23 మంది కోన్ కిస్కా గొట్టాం గాళ్లలా కనిపించి ఉంటారు, నిందితులు అంత ఘోరం చేసినా వాళ్ళు దళితులు గాబట్టి ఉరి తీయటం అమానుషం అని వీళ్ళ వాదన.కొన్ని గంటల్లో ఉరిశిక్ష అమలు జరుగుతుందనగా ప్రఖ్యాత రచయిత్రి మహాశ్వేతాదేవిని కూడా కలుపుకుని ఆఖరుసారిగా మళ్ళీ అప్పటి రాష్త్రపతి శంకర్ దయాళ్ శర్మ గారిని కలిస్తే ఆయన "నేను బాగా ఆలోచించాకనే రెండుసార్లు తిరస్కరించాను,వెళ్ళి రండి" అని చెప్పి పంపించేశాడు.అది రాత్రి 9 గంతలకు జరిగింది.ఇక నిరాశతో కార్లు ఎక్కబోతూ ఉండగా ఒక మహిళా న్యాయవాది "సుప్రీం కోర్టు జడ్జి ఇంటికి వెళ్ళి రాష్ట్రపతి మన పిటిషన్ గురించి సానుభూతితో పరిశీలిస్తామని చెప్పారని అబద్ధం చెబుదాం.విషయం పరిశీలనలో ఉంది కాబట్టి ఉరిని ఒక వారం వాయిదా వెయ్యమని అడుగుదాం"   అనేసరికి రాత్రి పది గంటల కల్లా ఒక సుప్రీం కోర్టు జడ్జి ఇంటికి వెళ్ళి అంత పచ్చి అబద్ధమూ తడుముకోకుండా చెప్పేశారు.ఆయన నేను ఒక్కణ్ణీ నిర్ణయం తీసుకోలేను.కనీసం ఇద్దరయినా ఉండాలి అంటే అప్పటికప్పుడు ఈ బృందం మరో జడ్జి ఇంటికి వెళ్ళి ఆయనకీ అబద్ధం చెప్పి తీసుకొచ్చారు.ఇద్దరు న్యాయమూర్తులూ కలిసి చర్చించుకుని ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉరి తియ్యవద్దని ఆదేశాలు జారీ చేశారు.అప్పుడు వీళ్ళు కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఆదేశాలు చూపిస్తే ఆయన ఆంధ్రప్రదేశ్ హోం సెక్రెటరీకి చెప్పాడు.ఆయన గోదావరి జిల్లా కలెక్టరుకి చెప్పాడు.ఆయన చెప్పగా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఉరిని ఆపేశారు.ఇంకా వీళ్ళ నాటకాలు అయిపోలేదు -ఇప్పుడు జరిగింది ఉరిని వాయిదా వేయించడమే కదా!మళ్ళీ ఉరి తీసే సమయానికి దేవెగౌడ ప్రభుత్వం కూలిపోయింది.రాష్ట్రపతి దానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉండటంతో మళ్ళీ ఈ బృందం సుప్రీం కోర్టు జడ్జిలను కలిసి ప్రస్తుతం రాష్త్రపతి బిజీగా ఉండటం వల్ల నిర్ణయం తీసుకోలేకపోతున్నారని మరో అబద్ధమాడి ఇంకో మూడు నెలలు వ్యవధి అడిగి సాధించుకున్నారు.ఆ గడువు ముగిసే సమయానికి శంకర్ దయాళ్ సర్మ పదవీకాలం ముగిసి కే.ఆర్.నారాయణన్ రాష్ట్రపతి అయ్యారు.ఆయనకి "మీరు దళితులై ఉండి దళితుడికి క్షమాబిక్ష పెట్ట్టకపోతే ఎలా?"అని పొడి వేసి యావజ్జీవ శిక్షగా మార్పించారు.వీళ్ళు అంత కాలం పాటు దేశాధినేతలతో ప్రధాన న్యాయమూర్తులతో అబద్ద్ఘాలు చెప్పి ప్రాణాలు రక్షించినవాడు కనీసం సమసమాజ స్థాపన కోసం పాటుపడుతున్న నక్సలైట్ యోధుడు అయినా బాగుండేది - ఎవరినో ఒకరిని చంపాలనే వెర్రి ఆవేశం తప్ప వాళ్ళని చంపడానికి సరైన కారణం కూడా లేకుండా 23 మంది ప్రాణాల్ని అగ్నికీలలకి ఆహుతి చేసిన దుర్మార్గుడి కోసం చేశారు అన్ని నీచమైన పనుల్ని!ఒకే ఒక ప్రశ్న,"బ్రాహ్మణులు పుట్టుకని బట్టి కొన్ని కులాల్ని అణిచివేయ్యటానికి కులవ్యవస్థని ఉపయోగించుకోవటం అన్యాయం" అంటున్న ప్రబుద్ధులు మరి ఒక నేరస్థుణ్ణీ పుట్టుకని బట్టి అన్ని నీచమైన పనులు చేసి ఎందుకు రక్షించారు?

          వీళ్ళకి సిగ్గూ శరమూ ఉండవా అని అడక్కండి, ఆ అవకాశం రాదు.ఎందుకంటే,వీళ్ళు తెలివైన వాళ్ళకి దూరంగా ఉంటారు - కొంచెం కొత్తగా కనబడితే చాలు ఎంత చెత్తనైనా నెత్తికెత్తుకునే దేభ్యం మొహాలే వీళ్ళకి దొరుకుతారు - రోహిత్ లాంటివాళ్ళు!ఎదటివాళ్ళు తెలివైన వాళ్ళు అని తెలిస్తే వాళ్లకి దూరంగా ఉందటం వీళ్ళు తీసుకునే జాగ్రత్త.కాబట్టి దొరికిపోయి సిగ్గుపడాల్సిన అవసరం వీళ్ళ కెప్పుడూ రాదు.వీళ్ళు ఎప్పుడూ పాడే పాట "ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ వల్లనే ఎంత ప్రయత్నించినా మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు.దీన్ని ఇట్లా అమిర్చి పెట్టింది బ్రాహ్మణులే.బ్రాహ్మణాధిపత్యాన్ని కూలదోసి దళిత రాజ్యం స్థాపిస్తే గానీ మీ సమస్యలు తీరవు" అని. ఎక్కడ లేదు నిచ్చెన మెట్ల అమరిక?మన చుట్టూ ఉన్న Eco System యెట్లా ఉంది!ప్లాంక్టాన్ దగ్గిర్నుంచి మహావృక్షాల వరకూ క్లోరోఫిల్ ఉన్న స్వయంపోషకాలు,వీటిని తిని బతికే శాఖాహారులు,వీటిని తిని బతికే మాంసాహారులు -ఇదొక పిరమిడ్.కింద ఉన్న స్వయంపోషకాలు 1000 ఉంటే వాటిపైన 100 శాకాహారులు వుంటాయి,మళ్ళీ ఈ శాకాహారుల మీద ఆధారపడిన 10 మాంసాహారులు ఉంటాయి.మాంసాహారులు లేకపోతే శాకాహారులు కింద వరస నంతా నాకేసి స్వయంపోషకాలు పూర్తిగా మాయమైపోయి వీటిని తిని బతికే శాకాహారులు  కూడా మాయమై పోతాయి  అంతా శూన్యం!అందుకే ఒకటి పెరిగితే మరొకటి దీన్ని తగ్గిస్తూ ప్రకృతి ఎప్పుడూ సమతౌల్యాన్ని పాటిస్తుంది.సమ సమాజం అంటే మనుషుల్ని అతిగా పెరిగిన కొమ్మల్ని కత్తిరించి క్రోటను మొక్కల్లా ఒకే లెవెల్లోకి తీసుకొచ్చి నిలబెట్టడం కాదు ప్రకృతి చేస్తున్నట్టే అన్ని అర్గాల మధ్యనా సమతౌల్యాన్ని సాధించటం - తమ వర్గరహితసమాజం కాన్సెప్టుని ఒప్పుకోనివాళ్లని వర్గశత్రువులుగా ప్రకటించేసి సాయుధపోరాటంతో వాళ్లని చంపేసి మిగిలిన వాళ్ళకి ఇదే వర్గరహితసమాజం అని మోళీ చెయ్యాలని చూసేవాళ్లకి ఇదెప్పటికీ అర్ధం కాదు!

          అసలు కులవ్యవస్థ బ్రాహ్మణులు అందరికన్నా పైన ఉండి నిర్మించినది కాదు.వాళ్ళు కూడా అందులోని ఒక భాగమే!కులవ్యవస్థ అనేది రాజ్యం ఏర్పడి వ్యవసాయం,వ్యాపారం బాగా వృద్ధి అయ్యాక అవి లాభసాటిగా మారిన తర్వాత ఆయా వృత్తులకి సంబంధించిన ఆదాయం మీద మోనాపలీ కోసం కొన్ని తరాల పాటు ఒకే వీధిలో నివసించటం వాళ్లలో వాళ్లే పెళ్ళిళ్ళు చేసుకోవటం లాంటి పద్ధతుల ద్వారా నడిచిన వ్యవహారం.సొంతంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే వృత్తుల్ని ఆధారం చేసుకుని మిగిలిన కులాలు సర్దుకున్నాక బ్రాహ్మణులకి ప్రత్యేకంగా ఆదాయం తెచ్చిపెట్టే వృత్తి ఏదీ లేకపోవటంతో జీవిక కోసం మిగిలిన కులాల మీద ఆధారపడాల్సి వచ్చింది.నాలుగు వర్ణాల్లోనూ బ్రాహ్మణ వర్ణమే బ్రాహ్మణ కులంగా ఏర్పడి మిగిలిన ఏ వర్ణమూ కులంగా మారకపోవటమే దీనికి సాక్ష్యం!మొదట్లో దానశాసనాల ద్వారా భూమికి హక్కుదారులై వ్యవసాయం చేసినా తర్వాతి కాలంలో మిగిలిన కులాలకి వ్యవసాయాన్ని ఇచ్చేసి యాచనకీ కర్మకాండకీ సెటిలై పోయిన తెలివి తక్కువ వాళ్ళు బ్రాహ్మణులు!వీళ్ళు ఏ స్వార్ధమూ లేకుండా వైదిక వాజ్మయాన్ని దాచకపోతే ఇవ్వాళ గొప్పగా చెప్పుకోవడానికి మనకి గుండుసున్నా మిగిలి ఉండేది - దానికి కూడా తిట్లు తింటున్నారు వీళ్ళు!బుద్ధుడి కాలం గురించి నిక్కచ్చిగా వర్ణించిన హిస్టారికల్ బుద్ధ రచయిత కులవ్యవస్థ పూర్తి ఆకారం తీసుకున్న అప్పటి కాలంలో కూడా కులాలు స్థిరంగా లేవనీ ఒక కులం నుంచి ఇంకో కులానికి మారడం కూడా ఉన్నదనీ చెప్పాడు - నమ్మాలి!

          కులాలు అంతరించిపోతాయి అని ఎవ్వరూ భ్రమల్లో మునిగి తేలకండి.ఎందుకంటే ప్రతి కులానికీ ఒక చరిత్ర,గొప్పదనం,సాహిత్యం ఉన్నాయి!"ఆఖరి చర్మకారుని మీద దాక్యుమెంటరీ" అని కొన్ని నెలల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఒక కధ చదివాను.అందులో విదేశాల్లో మంచి పొజిషనులో ఉన్న ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి తమలో తరతరాల నుంచీ వస్తున్న సంగీతకళకి సంబంధించిన వారసత్వాన్ని చాలా అత్మీయంగా కొనసాగిస్తుండటం గురించి రాశారు.అలా తమ కులంలోని ఒక విశిష్టతని గురించి గర్విస్తున్న వాళ్ళు కాల్పనిక వ్యక్తులు కాదు - వాస్తవ వ్యక్తులే!నేనయితే కులాలు మాయమై పోవాలని కోరుకోవడం లేదు.నదీనాం సాగరో గతిః అన్నట్టు కులానికి సంబంధించిన సామాజిక న్యూనతా భావం లేకపోతే అన్ని కులాలూ గొప్పవే.కులాలు మాయమై పోవడం కాదు ప్రతి కులమూ జవజీవాలతో తొణికిస లాడుతూ ఉండాల్సిందే!

          అంతకుముందు కాంగ్రెసు ఒక పదేళ్ళు పరిపాలించి దేశపు ఆర్ధికశక్తిని ఛిన్నాభిన్నం చేసేటంత స్థాయిలో కుంభకోణాలు చేసి అవినీతితో గబ్బు పట్టిపోయి అప్పటికే జనం ఛీకొడుతున్నారనీ మళ్ళీ అధికారం  హుళక్కేయేనని తెలిసిపోయినా, అంతకు పదేళ్ళ క్రితమే  తెలంగాణ ఇస్తానని వాగుదానం చేసినా దాన్ని ఇన్నేళ్ళూ మతిమరుపు చెరువులో కలిపేసి, ఇప్పుడు వస్తే ఇస్తానంటున్న భాజపాకి ఆ చాన్సు దక్కనివ్వకూడదనీ తనకి వాళ్ళు ఇవ్వటానికి పెట్టిన కండిషన్ అయిన ఆర్టీకిల్ మూడు ప్రకారం బిల్లును నెగ్గించుకోవడానికి తగిన మెజార్టీ కూడా లేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నానని తెలిసితెలిసీ ఎన్నికలకి ముందే తెలంగాణ ఇచ్చిపారెయ్యాలని తీర్మానించేసుకుని, అదృష్టం కలిసొస్తే ఆ ఒక్క మంచిపనితోనే  పదేళ్ళ పాతతప్పులన్నీ దేశం మొత్తం జనం మర్చిపోయి తనకి మళ్ళీ అధికారం కట్టబెట్టవచ్చుననే దురాశతో పరమ దౌర్భాగ్యమయిన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడితే - ఆ విబఃజన వల్ల ఫలితం అనుభవించే వాళ్ళే గాకుండా వీళ్ళు అంత సొంపుగా చేసిన విభజన తంతుని చూసిన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకీ అంతకుముందుకన్నా మూడింతలు కాలిపోయి కాంగ్రెసుని కొనవూపిరితో మాత్రం మిగిల్చి అటువైపున ఉన్న మోదీకి గుజరాత్ రాస్ట్రాన్ని అవినీతికి అతీతంగా పరిపాలించిన మంచిపేరూ ఆయన సమకూర్చుకున్న ప్రచారవ్యూహమూ కలిసొచ్చి అఖండమైన మెజార్టీ వచ్చినప్పటి నుంచీ ఈ దేశపు వామపక్ష మేధావుల్లోనూ కాంగ్రెసు పార్టీలోనూ ఇంకా వీరిద్దరి మిత్రపక్షాల లోనూ అసహనం తెగ పెరిగిపోయింది.

          దీనికి తోడు అన్ని విశ్వ విస్యాలయాల్ల్లోనూ ఉన్న వామపక్ష బావజాలం ప్రభావంతో ఉన్న ఎమినెంట్ ప్రొఫెసర్ల బండారం బయటపడి మెడలు పట్టి గెంటించుకునే దిక్కుమాలిన స్థితి దాపరించింది.రోమిల్లా ధపార్ అత్యుత్సాహంతో ఒక జీవిత కాలం పాటు ప్రచారం చేసిన "స్థానికులైన ద్రవిడుల మీద నూతనులైన ఆర్యుల దాడి" సిద్ధాంతం డుల్లిపోయింది.అయోధ్య కేసులో సాక్ష్యానికి వెళ్ళిన వాళ్ళని అలహాబాద్ హైకోర్టు అడిగిన మామూలు ప్రశ్నలకే సరైన జవాబులు చెప్పలేక నీళ్ళు నమిలారు.మెల్లమెల్లగా వారిని అర్హత లేకుండా అధిష్టించిన ఆచార్యపెఠాల నుంచి లాగిపారెయ్యటం మొదలయ్యింది.అదేమని గట్టిగా వ్యతిరేకించడానికి గొంతు పెగలటం లేదు, కొత్త తప్పులు నయటపడతాయేమోనని భయం కాబోలు - కిక్కురుమనకుండా తప్పుకోవలసి వస్తున్నది పాపం!ఇన్ని దశాబ్దాల పాటు దేశం మొత్తం మీద అక్కడొక వోటు ఇక్కడొక వోటు అన్నట్టున్న వామపక్షాలు ఇంతకాలం బతికి బట్టగట్టడానికి ఎలాంటి పీఠాధిపతులే కారణం గనుక భవిష్యత్తుని తల్చుకుని మరింత బెంగ పట్టుకుంది!

          మోదీ ఒక్కడే కాదు అమాయకంగా తమకి మంచి భవిష్యత్తుని కోరుకుని భాజపాకి అనుకూలంగా వోటు వేసిన ప్రతివాడూ వీళ్ళ దృష్టిలో కరుడు గట్టిన మతతత్వవాది ఐపోయాడు.అప్పటి వరకూ స్సవిత్రి గురించి సొల్లుకబుర్లు చెప్పే సరదామనుషులు కూడా ఎర్రబడిపోయారు.దేశంలో ఎక్కడ ఏం జరిగినా అది మోదీయే పురమాయించి చేయిస్తున్నట్టు ఆవేశంతో వూగిపోతున్నారు.ఎప్పటిదో అయిన గోద్రా అల్లర్లని ఇప్పటికీ కధలు కధలుగా సంవత్సరం గడిచింది రెండు సంవత్సరాలు గడిచాయి అని లెక్కలు చెప్పి బుర్రలు తింటున్నవాళ్ళు మాల్డా గురించి నోరైనా మెదపరేం!సైద్ధాంతికంగా విభేదించినా ఈ దేశప్రజలకి ప్రతింధి కాబ్ట్టి కనీస మర్యాదల్ని పాటించాలి.ఒకప్పుడు పి.వి.నరసింహా రావు గారికి దౌత్యపతంగా ఒక సున్నితమైన సమస్య వచ్చింది.దానికి ఆయన వాజపేయి గారిని ఎన్నుకున్నాడు.నా పార్టీలో ఇంతమంది ఉండగా ప్రతిపక్షం వాణ్ణి ఎన్నుకోవటం దేనికని ఆయనా అనుకోలేదు,ఈ పని నేను చేస్తే అధికార పక్షం మంచిపేరు కొట్టేస్తుంది గాబట్టి నేనెందుకు వెళ్ళాలని ఆయనా అనుకోలేదు - ఇద్దరూ హుందా అయిన వాళ్ళు గనక!కానీ ఈ మధ్యనే ఒక కాంగ్రెసు పెద్దమనిషి మోదీ అధికారంలో ఉన్నంత వరకు భారత పాకిస్థాన్ సంబంధాలు మెరుగు పడవు అని వాగేశాడు - ఇంతకుముందు అద్భుతంగా విరగబడిపోతున్నట్టు, అయినా ఏం మెరుగుపడాలి?ఇన్ని దశాబ్దాలుగా చర్చలతో ఏమి సాధించారని మెరుగుపడటానికి!ఇలా ఉంది వీళ్ళ మనస్తత్వం - కనీసపు ఆలోచన కూడా పోయిన వెర్రితనం!

          నిర్భయ చట్టం లాగ రోహిత్ చట్టం రావాలని కోరుకుంటున్నవాళ్ళు అందులో ఉండాల్సిన అంశాల గురించి చెప్తే బాగుండేది!రోహిత్ మాదిరే అర్ధరాత్రి ఎవడి రూముకైనా వెళ్ళి అపెండిక్సు బద్దలయ్యేట్టు చితకబాదినా MIM చేతిలో తన్నులు తిని పాముకు పాలు పోశాం అని వగచే కాంగ్రెసువారి మాదిరి కుయ్యోమొర్రో అని వూర్కోవాలే తప్ప సుశీల్ కుమార్ చేసీంట్టు కోర్టులో కేసు వేసి ఆత్మహత్యలకి ప్రేరేపించకూడదనే విధంగా ఉంటాయేమో అందులోని సెక్షన్లు!

          ఏ కాలంలో అయినా మనిషికి ఏమి కావాలి?తన కడుపు తను నింపుకునే ఆర్జన!ఒకనాడు భారతదేశంలో ఏర్పడిన కులవ్యవస్థ ఇతర దేశాలలోని బానిసల వ్యవస్థ కంటే భిన్నంగా ఏ కులాని కా కులానికి వారి వృత్తి మీద అధిపత్యాన్ని కట్టబెట్ట్టి ఆదాయం పట్ల భరోసా నిచ్చింది కులవృత్తికి సాటిరాదని వారికి వారే గర్వంగా చెప్పుకున్నారే, ఇంకా ఇంగ్లీషు వాళ్ళు చెప్పిన తప్పుల తదక చరిత్రని నమ్ముతూ అప్పుడెప్పుడో మమ్మంల్ని విద్యకి దూరం చేశారు బ్రాహ్మణులు అందుకే ఇవ్వాళ మేము వెనకబడిపోయాము అంటారు గదా - ఒక మగ్గం పనివాడు తన పని తను చహెసుకోవటానికి మధుచ్చంద సూక్తంతో ఏమి పని?వ్యవసాయం చెయ్యటానికి వేదం చహ్ద్వాల్సిన పని లేదు కదా!వృత్తి విద్యలో నైపుణ్యం కావాలంటే తండ్రి దగ్గిరో మరొకరి దగ్గిరో సహాయకుడిగా చేరి నేర్చుకోవాలి - వీళ్ళ కవసరం లేఎని చహ్దువులు నేర్పలేదని ఏడుస్తారేనంటి?ఇంగ్లీషు వాళ్ళు వచ్చేవరకూ ముస్లిం పరిపాలకులు కూడా ఆర్ధిక మూలాన్ని ఏమాత్రం మార్చలేదు,ఔరంగజేబు కూడా గోవధ నిషేధాన్ని పాటించాడంటే ఎవరయినా నమ్మగలరా?ఇంగ్లీషు వాళ్ళు తమ కొత్తరకం ఆర్ధిక విధానాలతో కొన్నివేల ఏళ్లుగా ఉన్న వ్యవస్థని బద్దలు గొట్టారు.దాని తర్వాతనే భారతీయ సమాజం సంక్షోభానికి గురవడం మొదలైంది.ఇవ్వాళ అమ్న కళ్ళముందున్న సమస్యకి నిన్నటివాళ్లని తిట్టి ఉపయోగ మేమిటి?

          ఇవ్వాళ్టి కులాల కుమ్ములాటలకీ నిరుద్యోగానికీ సంబంధం ఉంది.ఈ నిరుద్యోగానికీ ఇప్పుడు మనం అనుసరిస్తున్న విద్యావిధానానికీ సంబంధం ఉంది.విద్యా ఉపాధి రంగాలలో మూడు ముఖ్యమైన మార్పుల్ని చేస్తే పరిస్థితి కొంత మెరుగు పడవచ్చు.మొదటిది ప్రాదమిక విద్య మాతృభాషలోనే జరగాలి.రోహిత్ వీర విక్రమోపేతమైన విజృంభణకి అతనికి తెలుగు భాష మీద ఉన్న గట్టి పట్టు కారణం అని మీకూ తెలుసు!ఇంగ్లీషు వ్యామోహాన్ని వదులుకుని ప్రపంచంలో ఉన్న ప్రముఖమైన భాష లన్నిట్నీ నేర్పి మన కుర్రాళ్ళని ఎక్కడైనా బతకగలిగే విధంగా తీర్చిదిద్దాలి.రెంవది ప్రతి డిగ్రీకి ఒక ఉపాధిని తప్పనిసరిగా లింకప్ చెయ్యాలి.ప్యూర్ సైన్స్,క్లీన్ ఆర్ట్స్ అనే చెత్త కోర్సులు అనవసరం.వీలుంటే వీటిని మిగతా వాటికి బ్యాక్ ఎండ్ సబ్జక్టులుగా మారిస్తే మంచిది.మూవది ఉపాధి రంగాన్ని ఒకే పెద్ద పిరమిద్ మాదిరిగా కేంద్రీకరించి ఉంచకుండా పది చిన్న చిన్న పిరమిడ్లుగా విగొట్టి వికేంద్రీకరించాలి.వీటివల్ల విద్యలోనూ ఉపాధిలోనూ పోటీ తగ్గి మనుషుల మధ్య పరస్పర సహకారం పెరుగురుంది.

          కులరహిత సమాజం కోరుకునే దళితబ్రాహ్మణశ్రేష్ఠులు అది సాధించాలంటే కులాంతర వివాహాలు చేసుకోవడాన్ని సమర్ధించాలి.కానీ రిజర్వేషన్ల కోటాలో వాటా కావాలంటే కులం శుద్ధంగా ఉండాలి గాబట్టి పైకెదిగిన కులాల వారికన్నా దానివల్ల జరిగబోయే కులసంకరాన్ని మార్పుని వ్యతిరేకించిన ఒకప్పటి బ్రాహ్మణుల కన్నా ఇవ్వాళ అణగారిన కులనేతలే గట్టిగా వ్యతిరేకిస్తారు!రిజర్వేషన్లు ఎత్తెయ్యనిదే కులాల కుమ్ములాటలు పోవు - అది సత్యం!కులాల కుమ్ములాటలు పోనిదే హిందువులు ప్రశాంతంగా ఉండలేరు - అది పరమసత్యం!!హిందువులు ఐక్యంగా ఉండనంతకాలం దేశానికి భద్రత ఉండదు - అది నిష్ఠుర సత్యం!!!

          ఋగ్వేదంలో ఒకచోట దేవీభాగం అనే అద్భుతమైన విషయం గురించిన ప్రస్తావన ఉంది. ఆ భావన లోని గొప్పదనాన్ని గుణదోషాల మధ్య తారతమ్యాలు తెలిసిన ఒక మంచి కమ్యునిష్టు మేధావి "వర్గరహితసమాజం అనే భావనకి మన పూర్వులు చాలా కాలం క్రితమే ఎంతో దగ్గిరగా వెళ్ళినట్లు తెలుస్తున్నది" అని ప్రశంసించారు.

శ్లో|| సంగచ్చద్వం సంవదద్వం
       సంవో మనాసి జానతాం
       దేవీభాగం యధా పూర్వే
       సంజా నానా ఉపాసతే!

          ఋగ్వేదం లోని ఈ మంత్రం యొక్క సారాంశ మిది - "కలిసి నడుద్దాం.కలిసి మాట్లాడుకుందాం.కలిసి మెలిసి ఒకరి మనస్సు లొకరం తెలుసుకుందాం.మన పూర్వులు దేవీభాగాన్ని యెలా పంచుకునేవారో అలాంటి జ్ఞానాన్ని ఉపాసింధుదాం!"దేవీభాగం అంటే - పసిపిల్లలకూ, దంతాలు లేని వృద్ధులకూ మెత్తని మాంసం మొదట ఇవ్వాలి.తర్వాత దౌహృదులకి - రెండు హృదయాలు ఉండే గర్భవతులకి రెట్టింపు మాంసం ఇవ్వాలి.అలా వారందరికీ పంచగా మిగిలిన మాంసాన్ని యువతీ యువకులకీ, జవసత్వాలు గలిగి సంపద పెంచే ఇతరులకీ పెట్టాలి.ఇటువంటి మంచి విషయాలు తెలుసుకుంటే విద్యార్ధుల కైనా ఉద్యోగార్ధుల కైనా ఆత్మహత్య చేసుకోవాలని అనిపించదు, జీవితం మీద ఆశ పుదుతుంది!


సర్వే జనాః సుఖినో భవంతు!

Tuesday, 19 January 2016

అప్పుడు మన దేశంలోనే బ్రిటిషర్లు తమ క్లబ్బుల్లోకి కుక్కలతో కలిపి రానివ్వలేదు, ఇప్పుడు అమెరికా వాడు కుక్కల్ని తరిమినట్టు వెనక్కి తరిమాడు - అయినా సిగ్గు పడడం లేదు మనం!

      గత ఏదాది దిశెంబర్ 29,30వ తేదీలలో అయిర్ ఇండియా విమానంలో అమెరికా వెళ్ళిన 15 మంది తెలుగు విద్యార్ధులు అమెరికా లోని నార్త్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ అనే రెండు యూనివర్శిటెలు బ్లాక్ లిస్టులో ఉన్నాయని చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిందిగా సూచించారు అమెరికన్ అధికారులు."ఎందుకు?" అని విద్యార్ధులు ప్రశ్నిస్తే తుపాకీలు గురిపెట్టి బెదిరించారు.ఉగ్రవాదులకు వేసినట్టు చేతులకు బేడీలు వేసి గంటల కొద్ద్దీ విచారణ పేరుతో భయానక వాతావరణం సృష్టిస్తే పాపం భయంతో బిక్కచచ్చిపోయి ఎన్నో ఆశలతో అమెరికా గడ్డ మీద అడుగుపెట్టిన వారంతా నిరాశగా తిరిగి వచ్చేశారు.అమెరికా చదువు కోసం తాహతుకు మించి పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా!

      పైకి బ్లాక్ లిస్ట్ అయ్యాయని సాకులు,లోపల మరేవో తీరులు."ఇండియన్ డాగ్స్ వస్తున్నా"యంటూ అవహేళనలు మరింత దారుణం!అసలు బ్లాక్ లిస్ట్ అయిన యూనివర్శిటీల నుంచి ఇక్కడికి "I20"లు ఎలా వచ్చాయి?మన దేశపు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అమెరికా ప్రభుత్వం వారు చెప్పింది చెప్పినట్టు చిలక పలుకులు వల్లించటం తప్ప స్వంతంగా విషయం కనుక్కోవడానికి గానీ విద్యార్ధులకు అండగా నిలబడి ధైర్యం చెప్పడానికి గానీ ఏమీ చెయలేదు.విద్యార్ధులు తప్పులు చెయ్యడం వల్లనే వెనక్కి పంపించామంటున్న అమెరికా ప్రభుత్వం భారత ప్రబ్భుత్వానికి అవి ఎలాంటి తప్పులో తెలియజేసిందా?I20, అమెరికా ప్రభుత్వం ఆమోదించిన వీసా,అన్ని పత్రాలూ ఇక్కడ చెక్ చేసి పంపించాక కూడా ఆఖరి నిమిషంలో చేసిన భీబత్సం వెనక ఉన్న గందరగోళం కధేమిటి?అమెరికా ప్రభుత్వం యొక్క బ్లాక్ లిస్టులో ఉన్న యూనివర్శిటీల నుంచి I20లు భారత్ లోని విద్యార్ధులకు ఎలా వచ్చాయనే దానికి తమ వైపున ఉన్న లొసుగులు కూడా కారణం కదా, ఏకపక్షంగా విద్యార్ధులనే నేరస్థులుగా నిలబెట్టి ఉగ్రవాదుల్ని విచారించినట్టు సంకెళ్ళు వేసి అనాదరణ చూపించడం దేనికి చేశారు - అడిగేదెవ్వరు?

      మన దేశ ప్రజల్లో ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంది.తెలివితేటల్లో మనవాళ్ళు అఖండమైన వాళ్ళు,ఎక్కడ నిలబెట్టినా శిఖరాగ్రం చేరుకోగలరు - కానీ నిలబడకూడని చోట నిలబడతారు.తామెక్కడ నిలబడితే తమ శక్తియుక్తులు సహజ పద్ధతిలో వికసిస్తాయో తెలుసుకోరు!ఒకడెవడో ఫలానా దేశంలో ఫలానా ఉద్యోగం చేసి లక్షలు కూడబెడుతున్నాడు అని తెలియగానే గుడ్డెద్దు చేలో పడినట్టు పొలోమని వాణ్ణి అనుకరించి వాడిలాగే మనమూ జాక్పాట్ కొట్టేద్దాం అనే దురాశతో ఎండమావుల వంటి అవకాశాల కోసం విలువైన కాలాన్ని వ్యర్ధం చేసుకుని అదీ దక్కక తమ అసలైన ప్రతిభని సానబట్టుకోలేక రెంటికీ చెడుతున్నారు!

      ఇవ్వాళ్టి అమేరికా ఒకప్పటి అమెరికా లాగ లేదు,ఇంకెంతో కాలం అది భూతలస్వర్గం హోదాని నిలబెట్టుకోలేదు.ఇప్పటికే ఉద్యోగ కల్పన విషయంలో ఎక్కడెక్కడి వాళ్ళూ అక్కడికే పరుగులు పెట్టడం వల్ల విపరీతంగా ఉబ్బిపోయి పగలడానికి సిద్ధంగా ఉన్న బెలూన్ మీద ఇంకా ఆశపడి ప్రయోజనం లేదు!వాళ్ళ ఆలోచనా ధోరణులు కూడా కర్కశంగా మారడం సూచనాప్రాయంగా తెలుస్తున్నది.అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ నోటికేది తోస్తే అది మాట్లాడుతున్నాడు, బ్రిటిష్ ప్రధాని కామెరూన్ లండనులో ఉండాలంటే ఇంగ్లీషు నేర్చుకోవాల్సిందే అంటున్నాడు!పైకి క్లీన్ షేవ్డ్ మొహాలతో త్రీ పీస్ సూట్లతో  చెక్కు చెదరని నవ్వుల్తో పెదవి చివరి మర్యాదల్తో టైలర్ మేడ్ జంటిమన్లుగా కనబడుతున్నా వాళ్ళంత జాత్యహంకారులు ఈ భూప్రపంచం మీద ఇంకెవ్వరూ లేరు.వాళ్లకి పాప్యులారిటీ కూడా పెరుగుతున్నది, అంటే ఈ ట్రెండు తగ్గే సూచనలు నాకైతే కనబడ్డం లేదు!

      భారతీయులు చిన్నప్పుడు మనం చదువుకున్న మూడు చేపల కధలో మొదటి చేపలా వ్యవహరించే కాలం దాటిపోయింది,కనీసం రెండవ చేపలా అయినా వ్యవహరిస్తారా!ఒక రూపాయి ఖర్చుతో పది రూపాయలు సంపాదించాలంటే కండల్ని కరిగించి శ్రమించాలి, ఒక రూపాయి ఖర్చుతో వంద రూపాయలు సంపాదించాలంటే తెలివిగా వ్యాపారం చెయ్యాలి,ఒక రూపాయితో కోటి రూపాయలు సంపాదించాలంటే అదృష్టాన్ని నమ్ముకోవాలి,ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా అష్టైశ్వర్యాలు దక్కాలంటే ముదనష్టంగానే రావాలి - భారతీయులు దేన్ని కోరుకుంటున్నట్టు?మెకాలే తమ ప్రభుత్వపు అవసరం కోసం ప్రవేశపెట్టిన క్లర్కుల్నీ ఉద్యోగుల్నీ మాత్రమే తయారు చెసే విద్యా విధానం గురించి గానీ ఇంగ్లీషు భాష గొప్పదనం గురించి గానీ చింకి లెక్చర్లు దంచే మేధావులు వీలయినంత త్వరగా తమ భ్రమల్ని వదిలించుకుంటే దేశానికీ యువతకీ భవిష్యత్తుకీ చాలా మంచిది!మితిమీరిన ఆంగ్లభాషావ్యామోహంతో ఉన్న ఈ మేధావులు మాతృభాషలో విద్యాబోధన యొక్క సానుకూలతల్ని గుర్తించలేకపోతున్నారు.ఇంగ్లీషు పట్ల వ్యామోహాన్ని వదిలేసి మొదట మాతృభాషని క్షుణ్ణంగా నేర్చుకుంటే దానితో అనుసంధానం చేసుకుని ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్రాన్సు వెళ్ళవచ్చు,జర్మన్ నేర్చుకుంటే జర్మనీ వెళ్ళవచ్చు,జపనీస్ నేర్చుకుంటే జపాన్ వెళ్ళవచ్చు - పపంచం నలుమూలలకీ విస్తరించగలిగే అవకాశం వస్తుంది!సంస్కృతుల పరంగా చూసినా భారతీయ సంస్కృతి పట్ల గౌరవం అమెరికాలో కన్నా పై దేశాలలోనే ఎక్కువ.మనకి గౌరవం దక్కే చోటుకి పోకుండా మనని అవమానించే చోటుకి ఎందుకు వెళ్ళటం?

      మన దేశంలోని కుల వ్యవస్థలో ఒక తమాషా ఉంది.తాము కింది కులాల వాళ్ళ కన్న అధికులం, తెలివైన వాళ్ళం,సంస్కృతి కంతా పట్టుగొమ్మలం అనుకునే ఉన్నత కులాల వారే మొదటి రోజు నుంచీ చివరి రోజు వరకూ ఇంగ్లీషు వాళ్ళకి వూడిగం చేశారు!ఇంగ్లీషు వాళ్ళు తమలో తాము క్లబ్బులు పెట్టుకుని "DOGS AND INDIANS ARE NOT ALLOWED" అని బోర్డులు పెట్టుకున్నా చీమ కుట్టినట్టు కూడా ప్రతిస్పందించ లేదు ఈ విజ్ఞాన తేజోరాశులైన బ్రాహ్మణ శ్రేష్టులూ పౌరుషం మూర్తీభవించిన రాజాధిరాజులూ!ఈ బోడి సత్యాగ్రహాలకి స్వతంత్రం రాదనుకుని ఆఖరు నిముషం వరకూ పోరాటాన్ని వ్యతిరేకిస్తూ ఇంగ్లీషువాళ్లకి మిత్రులుగా గడిపి ఇంక స్వతంత్రం వచ్చేస్తుందనుకున్న వెంఠనే ముందుకు దూకి అధికార మార్పిడిలో తామే పైన ఉండేలా చూసుకున్నారు - కులము గల్గువాడు,గోత్రంబు గల్గువాడు,విద్య చేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిసకొడుకులు అని వేమన్న వూరికే అన్నాడా!ఇప్పటి దళిత మేధావులు కూడా నిన్నటి రోజున ఆ అగరవర్ణాల వారు ఏమి చేశారో అదే పద్ధతిని పాటిస్తూ వారినే ఇమిటేట్ చేసి వారి స్థానంలోకి వెళ్ళడానికే చూస్తున్నారు తప్ప తమకంటూ సొంతదారిని వెతుక్కుని ముందుకు వెళ్ళగలిగే కీలకం గ్రహించటం లేదు.ఇప్పటికీ ఉద్యోగాల మార్కెట్టులో సింహభాగం ఇంగ్లీషుకు ప్రాధాన్యత ఉన్న మంచి స్కూళ్ళలో కాలెజిలలో చదువుకుని వచ్చే డబ్బున్న అగరవర్ణాల పిల్లలదే హవా!వారితో పోటీ పడాలంటే వారికంటే మరింత వేగంగా కదిలితేనే గానీ వారికన్నా ముందుకు పోవటం సాధ్యపడదు కింది కులాల నుంచి కొత్తగా పోటీలో ప్రవేశిస్తున్న వాళ్ళకి!అదే,మాతృభాషలో చదువుకోవడం వల్ల ఈ అధికశ్రమ అవసరం ఉండదు,ఒత్తిడి ఉండదు,వెనుకబాటు తనమూ ఉండదు!

      మొత్తం ప్రాధమిక విద్య అంతా మాతృభాషలోనే జరగాలి.తర్వాత ఇప్పటిలా మూడు నాలుగు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు,సెకండ్ లాంగ్వేజిగా హిందీ,ఇంగ్లీష్,జపనీస్,ఫ్రెంచ్ లాంటివాటి కన్నిటికీ ఒకే రకం ప్రాధాన్యత ఇచ్చి విద్యార్ధుల్ని ఏదో ఒక్కటి మాత్రమే తీసుకుని అందులోనే ప్రావీణ్యత సంపాదించమంటే సరిపోతుంది.అప్పుడు ఆ ఒక్క భాషనీ మాతృభాషతో అనుసంధానించి నేర్చుకుంటే ఆ భాషతో ఎక్కడ నెగ్గగలిగీతే అక్కడికి వెళ్ళే విధంగా విద్యార్ధుల్ని తీర్చిదిద్దితే తప్ప ఒక్క ఇంగ్లీషునే నేర్చుకోవడం ఇంగ్లీషు పనికొచ్చే చోటనే అందరూ గుమిగూడటం అనే దరిద్రం పోయి మనవాళ్ళు ప్రపంచం నలుమూలల్లో ఎక్కడయినా నెగ్గుజురాగలిగే విధంగా తయారవుతారు.ఇది సాంకేతికంగా కూడా విద్యార్ధుల మనస్సు మీద పోటీకి సంబంధించిన ఒత్తిడిని తగ్గిస్తుంది,మౌలికంగా దేశపు సంస్కృతి పట్ల గర్వాన్ని పెంచుతుంది.ప్రభుత్వాలకి కూడా ఉపాధి కల్పన ఇప్పటిలా రొడ్డకొట్టుడుగా చేసి భంగపడకుండా కొత్తదారుల్ని వెతికే ఉత్సాహాన్ని ఇస్తుంది.మనం ప్రపంచానికి తిట్టించుకుని వెనక్కి వచ్చే అసమర్ధుల్ని గాక ఎక్కడి కెళ్ళినా అక్కడివాళ్ళు కళ్ళకద్దుకుని స్వీకరిస్తూ మన దేశపు సంస్కృతికి దర్పణాలుగా నిలిచే దమ్మున్న కుర్రాళ్లని సమర్పించాలి!"I am a westerner with a deep respect for your vedantic philosophy.It pains me to see the erosion of sanatana dharma in Bharat.You must keep these values alive because it is the only hope for our entire planet!When all righteousness dies in the world,We will have to live in calamities. I can see the effects of adharmic living in the west,loss of meaning,depression,addiction,materialism and suicide!Use your innate indian intelligence to see where western values will ruin india just as they are corrupting the whole world.Even the things you crave that are shown in the westernmedia are not real.We are not glamorous,educated,sexy,people like the media shows.Come to the west and you will see lonliness,despair and terrible poverty as well!Hollywood is a propaganda machine  for the west and does not show the truth.The truth is a society that is ruled by greed and lust and is consuming all its treasures to become an ugly place of sterile parking lots and megastores.We go to india to find relief from the depression and ugliness here. In india people are still alive while in the west we are slowly becoming vegetables in front of our electronic devices.hold on to your values and have faith that india's value is its values!"  - ఇది Rose Kerekes అనే ఒక విదశీ వనిత భారతీయులకి ఇస్తున్న సలహా, ఎంత చక్కగా చెప్పింది!

      కానీ మన దేశంలోని వాతవరణం చూస్తే ఇప్పట్లో ఆ దిశగా అడుగు పడుతుందనే ఆశ నాకేమాత్రం కలగడం లేదు."జాతుల్సెప్పుట,మృషల్ సంధించుట,అన్యాయ విఖ్యాతింబొందుట,కొండెకాడవుట - అన్నియు పరద్రవ్యంబు నాశించి" అని ఒక కవిగారు ఇవ్వాళ మనవాళ్ళు చేస్తున్న వెధవ పనులన్నిట్నీ కూలంకషంగా వర్గీకరించి మరీ చెప్పాడు!నీ జాతి వేరు వాడి జాతి వేరు వాడు నిన్ను దోచుకు తినాలని చూస్తున్నాడు నువ్వు వాడితో కలవకు అని ఎవరు చెప్పినా 90 శాతం మందిని ఒక్కటిగా కలవనివ్వకుండా కలిసి ఆలోచించనివ్వకుండా కన్ఫ్యూజ్ చెయ్యటానికీ,వాళ్ళనా కన్ఫ్యూజన్ లోనే ఉంచి వాళ్ళమీద అధికారాన్ని 10 శాతం మాత్రమే ఉన్న తమ దగ్గిరే ఉంచుకోవటానికీ, ఆ అధికారాన్ని ఉపయోగించుకుని మందిసొమ్మును దిగమింగటానికీ మాత్రమే చేస్తారు.తనకి 100 కోట్లు విలువ చేసే కాంట్రాక్టును దఖలు పరిస్తేనే అక్కడి అధికారికి ఒక కోటిని మృషగా సంధిస్తారు.తమకు లేని గొప్పదనాన్ని ఉన్నట్టు భ్రమింపజేసే ప్రబుద్ధులు ఆ పని వూరికే చెయ్యరు - చాటుగా ఆ పేరుని సొంత సంపాదనకి ఉపయోగించుకుంటారు.వాడు మంచివాడు కాదని పక్కవాడి గురించి పైవాళ్ళకి కొండేలు చెప్పేవాళ్ళు అవతలి వాడికి పైవాళ్ళు ఇచ్చేదాన్ని తమకి ఫిరాయించుకోవడానికే ఆ పని చేస్తారు.ఇవన్నీ చెప్పి "ఈ శ్రీ తానెన్ని యుగంబు లుండగలడో శ్రీ కాళహస్తీశ్వరా!" అని నిట్టూర్చాడు.అలా నిట్టూర్చడంలో స్వామీ నాకు మాత్రం ఆ పాడుబుద్ధులు కలగనియ్యకు అని వేడుకోవడం ఉంది!ఎందుకంటే పైన చెప్పిన వెధవపనులు నిన్నటిరోజున చేసినవాళ్ళు ఇవ్వాళ్టిరోజున చేస్తున్నవాళ్ళు రేపటిరోజున చేసేటివాళ్ళు  ఎవరో ఎక్కడుంటారో ఎలా బతికారో ఎప్పుడు చచ్చారో ఎవరికీ తెలియదు.కానీ కొందరు ప్రాతస్మరణీయుల్ని దేశకాలప్రాంతభాషాదుల్ని పట్టించుకోకుండా గుర్తుంచుకుంటున్నామే, వాళ్ళు మాత్రం అట్లాంటి వెధవ పనులు చెయ్యకుండా మరో విధంగా బతకడం వల్లనే మనకి గుర్తుకొస్తున్నారు - అయితే ఇవ్వాళ వాళ్ళే నిజమైన మైనార్టీ అయిపోయారని తెలిస్తే చాలా నిర్వేదంగా ఉంటుంది?!

      పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు,పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదు అన్నట్టు సొంతంగా పూనుకుని ఏదైనా చేస్తే అది కాస్తా ఎదురుతంతే అభాసుపాలవుతామని జనం గట్టిగా అడిగితే గానీ చెయ్యని జడత్వం ప్రభుత్వంలో ఉంది,తమకేం కావాలో తెలియని అజ్ఞానం వల్ల అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడుతూ సొంతంగా ఆలోచించి సరైన పరిష్కారం కోసం డిమాండు చెయ్యని బద్ధకం ప్రజల్లో ఉంది.టపటపా స్కూళ్ళూ కాలేజిలూ సాంక్షన్ చేయించేసుకుని బొట్లేరింగ్లీషు టకటకా చదివేసి ఉన్న పది ఉద్యోగాలకి వంద మంది పోటీ పడితే ఎంత గింజుకున్నా పదిమందికే ఉద్యోగాలు వస్తాయి.ఆ పదిమందీ కాలరెగరేస్తూ పోటుగాళ్ల మాదిరి పోజులు కొడుతున్నారు.మిగిలిన 90 మందిలో మా కులానికి రిజర్వేషన్ శాతం పెంచితే గానీ తమకు మరిన్ని ఉద్యోగాలు రావని కొన్ని కులాల వాళ్ళూ వాళ్ళకి పెంచితే మా వాటా తగ్గుతుందని కొన్ని కులాల వాళ్ళూ కొట్టుకు చావడమే తప్ప కలిసి కూర్చుని తెలివిగా ఆలోచించి సమస్యకి మూలం చూసి సరైన పరిష్కారం కోసం ప్రయత్నించాలనే సద్బుద్ధి లేదు.

ఒకసారి రాగింగులో సీనియర్లు ఆరవ వేదం అంటే ఏమిటి అని అడిగారు - నేను నిర్వేదం అని చెప్పాను!

Sunday, 27 December 2015

నిజంగా ఇగ్లీషు ప్రపంచ భాషలందు మేలుబంతియా?ఇంగ్లీషు రాకపోతే ప్రపంచంలో ఇంకెక్కడా బతకలేమా!

     మా తాతగారు అరివీర భయంకర కమ్యునిష్టు!ఎంత గొప్ప కమ్యునిష్టంటే ఆయనెదురుగా కమ్యునిజాన్నీ మార్క్సునీ ఎంగెల్సునీ ఎంత తిట్టినా కిమ్మనే వాడు కాదు,కానీ నెహ్రూని గానీ ఇందిరా గాంధీని గానీ ఏ కొంచెం మాట తూలినా సరే ముసలి సింహంలా విరుచుకు పడేవాడు,బతికుండగా చాలాసార్లు అడిగాను "తాతయ్యా!నీమీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసి పెరుగన్నం లేంది ముద్ద దిగని నిన్ను కొండపల్లి గట్ల మీదకి పంపించిన మనిషిని నువ్వు మంచిది అంటున్నావు, మరి అంత మంచిదానికి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాలన్నంత కోపం తెప్పించిన నువ్వు మంచివాడి వెట్లా అవుతావు?" అని - సూటిగా జవాబు చెప్పలేదు!ఎంత శాస్త్రీయంగా అలోచించే వాళ్ళకయినా కొంత వెర్రి సహజమేనని సరిపెట్టుకోవాలి,లేకపోతే నాకు మనశ్శాంతి కరువవుతుంది మరి:-)

     ఇవ్వాళ మాతృభాషలో విద్యాబోధనకి మోకాలొడ్డుతూ ఇంగ్లీషుని సమర్ధించేవారి వాదనలు కూడా అలాగే ఉన్నాయి.ఇంగ్లీషు ప్రపంచంలో కల్లా అత్యంత ప్రజాదరణ గల భాష అట!ఇవ్వాళ మనం చూస్తున్న అభివృధ్ధి అంతా సైన్సూ,సోషలూ,మ్యాథ్సూ,చెమిస్ట్రీ,ఫిజిక్సూ అన్నీ వాళ్ళు కనుక్కున్నవే గాబట్టి వాళ్ళ భాషలోనే చదవాలట!పోనీ సాంకేతిక పదజాలాన్ని మన భాషలోకి మార్చుకుందాం అంటే పుట్టించిన ప్రతి మాటకి పది వెక్కిరింపులు!"పెంటామిరస్" అనే మాటకి "పంచభాగయుత" అని అందామంటే మాకు పంచెలు గుర్తుకొస్తున్నాయి అంటారు అక్కడ ఉన్న పెంట బాగనే ఉందేమో మరి?ఇంకా వీరు చెప్పే అతి ముఖ్యమైన కారణం - ఇంగ్లీషు నేర్చుకోకపోతే గ్లోబల్ కనెక్టివిటీకి దూరమైపోతామట?!
     పైన ఉన్న మ్యాపుని చూశారుగా,అందులో దార్క్ బ్లూ కలరులో ఉన్నవి ప్రజల్లో ఎక్కువమంది మాట్లాడుతూ మాతృభాషగానూ రాజభాషగానూ ఇంగ్లీషు చలామణీ అవుతున్న దేశాలు,లైట్ బ్లూ కలరులో ఉన్నవి అనధికారికంగా ఇంగ్లీషు ప్రధానభాషగా ఉన్న దేశాలు - దాదాపు ఇవన్నీ ఒకప్పటి మహా ఘనత వచించిన రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యపు వలస దేశాలు!వారు వలసల పేరుతో ఆక్రమించుకుని బలవంతంగా రుద్దిన చోట్లలో తప్ప మరెక్కడా ఇంగ్లీషు కనబడటం లేదు,గమనించారా?
     పైన ఉన్న మ్యాపుని చూశారుగా,పింకు రంగులో తళత్తలాయమానంగా మెరుస్తున్నవి వారి విజృంభణలోకి వెళ్ళి వారి పాలనలో తమ మూలాల్ని కూడా మర్చిపోయేటంతగా కొన్ని తరాల పాటూ గడిపిన దేశాలు - వారి వలసలు.అదండీ ఇంగ్లీషు యొక్క విశ్వవ్యాప్తమైన వైభవం!మనవాళ్లకి దేశం దాటితే అమెరికా తప్ప ఇంకొక దేశం కనబడ్డం లేదు,కాకుంటే వారి ముత్తాత అయిన బ్రిటిషు వారి మూలాలు ఉన్న లండన్ నగరంలో తప్ప ఇంకెక్కడా చెల్లకుండా పోతామేమోనని ఏదో మొహమాటంతో కూడిన భయం ఒకటి ఉన్నట్టుంది మన దేశంలోని ఆంగ్లభాషాభిమానులకి - అలవాటయిపోయిన బానిసత్వం ఒక పట్టాన వదలదు పాపం!

     ఇంగ్లీషు వాళ్ళు వలసలు ఏర్పాటు చెయ్యటం మొదట 1580లో సర్ వాల్టర్ ర్యాలీఘ్ అనే పెద్దమనిషికి దక్షిణ అమేరికాలో కాలనీ ఏర్పాటు చెయ్యడాబికి పర్మిషన్ ఇవ్వడంతో మొదలైంది.సరే, పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు,తొలి వలసని ఏర్పాటు చేశాడు,వర్జీనియా అని పేరు పెట్టాడు - పెళ్ళికాని రాణి పేరు మీద!మొదటి రెండు సార్లు లోకల్స్ గట్టిగా నిలబడటంతో ఫెయిలయ్యి ఆఖరికి 1857లో మొదటి డిపెండెంట్ కాలనీ జాన్ వైట్ గవర్నరు గిరీతో మొదలైంది.అయితే, 1591లో కొత్త సప్లైల కోసం బ్రిటన్ వెళ్ళి తిరిగొచ్చేసరికి కాలనీ మొత్తం గల్లంతై "Croatan" అనే పేరు ఉన్న ఒక చెక్కముక్క(Sign Board) మాత్రం మిగిలింది - ఖాజీ సాయెబు గారు పోయి తురకల్లో గల్సాడన్నట్టు కూలీలుగా ఉన్న సెటిలర్లు పోయి హ్యాపీగా నేటివ్ తెగల్లో కల్సిపోయారు:-)

     చచ్చీ చెడీ శాయంగల విన్నపములై అన్నట్టు మళ్ళీ మళ్ళీ సెటిలర్లని పంపగా పంపగా 1619 నాటికి వర్జీనియా పూర్తి స్థాయిలో ఇండిపెందెంట్ కాలనీగా ఏర్పడింది.అట్లా తొలిదశలో 13 కాలనీలు ఏర్పడ్డాయి.ఇవ్వాళ్టికీ ఆ పేర్లు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రముఖంగా వినబడుతున్నవే - 1).మసాచుసెట్స్ 2).న్యూ హాంప్ షైర్ 3).రోడ్ ఐలాండ్ 4).న్యూ యార్క్ 5).కన్నెక్టికట్ 6).న్యూ జెర్సీ 7).పెన్సిల్వేనియా 8).డిలావర్ 9).మేరీలాండ్ 10).వర్జీనియా 11).నార్త్ కరోలినా 12).సౌత్ కరోలినా 13).జార్జియా.

     అలా మొదలైన వీళ్ళ విజృంభణ కెనడా,ఇండియా,ఆస్ట్రేలియా,ఈజిప్టు,పశ్చిమ,దక్షిణ,తూర్పు ఆఫ్రికా దేశాలతోపాటు ఇరాక్ వంటి అనేక ఖండాల్లో అనేక దేశాల్లో వాలుగాలిలో తెరచాప నావలా సాగిపోయి దారి కడ్డు వస్తే మహా పర్వతాల్ని కూడా పెకలించుకుని లాక్కుపోగలిగిన గోదావరి వరదలాగ చెలరేగింది.ఈ వలసల స్థాపనకి సుమారు 200 సంవత్సరాలు పడితే ఎక్కడికక్కడ చీకొట్టించుకుని మళ్ళీ సముద్రంలో కాకిరెట్ట లాంటి తొలినాటి స్థితికి చేరుకోవటానికి ఎంత గట్టిగా లెక్కేసినా 50 ఏళ్ళు దాటి ఉండదు - దీనివల్ల ఏమి సాధించారో వాళ్ళకే తెలియాలి!నిన్నటికి నిన్న టోనీ బ్లెయిర్ ఇరాక్ మీద దాడికి అబధ్ధాలని పేర్చీ మరీ వ్యూహాలు పన్నడం చూస్తే గతంలో తాము చేసింది తప్పని అనుకోనట్లు కనిపిస్తుంది - సిగ్గులేని జాతి!అయితే, ఒకనాటి బ్రిటిషు జాతిలోని మహోన్నతుల్ని తలుచుకుంటే ఈ పాడుపని అంత మొండిగా చేసి ఉండకపోతే,ఆ మాననీయుల ఆదర్శాల ప్రకారం నడుచుకుని ఉంటే ప్రపంచం మొత్తం సగౌరవంగా తల వంచి నమస్కరించాల్సిన స్థితి వీరికి దక్కి ఉండేది -  వివేక భ్రష్ట సంపాతం ఒకసారి మొదలైతే మధ్యలో ఆగనివ్వదు కాబోలు!

     ఇంగ్లీష్ వాళ్ళ వైపు నుంచి వస్తున్న ఆగని దాడికి కొంతా తెగల్లోనూ ఇంగ్లీషు వాళ్ళ మూలంగా అమరుతున్న కొత్త సౌకర్యాల పట్ల పెరపెర వల్ల కొంతా పట్టు సడిలి 1620ల నాటికి మొత్తం 13 కాలనీల్లోనూ మొదట న్యాయమైన జీతభత్యాలిచ్చే అవసరం లేని అర్ధ బానిసల వ్యవస్థ వూపందుకుని తెల్లజాతి అమెరికన్ వ్యాపారస్థులు యూరోపియన్ పొగాకు మార్కెట్లని కొల్లగొట్టి ధనవంతులయ్యారు.అలా మొదలై మొత్తానికి 1700 నాటికి బానిసల వ్యవస్థ పూర్తిగా స్థిరపడిపోయింది.అంటే, ఇంక కనీసపు మానవసహజమైన హక్కులు కూడా లేని సామూహిక దోపిడీ చట్టబధ్ధం అయిపోయింది.అమెరికా స్వాతంత్ర్య పోరాటం అని వారు చెప్పుకునేది అమెరికాలోని తెల్లజాతివారు తమ మూలస్థానమైన బ్రిటిష్ రాణి అధికారం నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకోవడమే తప్ప మరొకటి కాదు.ఈ 21వ శతాబ్దంలో కూడా అక్కడి భూమికి నిజమైన హక్కుదారులైన ఒకనాటి స్థానికులకి స్వావలంబనకి అవకాశం లేదు- కనీసపు హక్కులు కూడా లేవు!

     వలస నుంచి 1940లో విడిపోయిన ఉత్తర అమెరికా ఖండంలోని కెనడా కూడా తెల్లజాతివారు తమకోసం తాము ప్రకటించుకున్న అర్ధ స్వాతంత్ర్యమే తప్ప అక్కడా నేటివ్ కమ్యూనిటీ పరిస్థితి దయనీయంగానే ఉంది.1947లో విముక్తమైన భారత్ కూడా సాంస్కృతికంగా తన పరాధీనతని పోగొట్టుకుని తనదైన స్వయంప్రభతో ప్రకాశించే అవకాశం ఉన్నప్పటికీ అధిక సంఖ్యాకుల్లో బలంగా పాతుకుపోయిన సాంస్కృతికపరమైన బానిసత్వం వల్ల ఆ దిశలో ముందుకు అడుగు వెయ్యటం లేదు.బ్రిటిషర్లకి సముద్రవాణిజ్యం కోసం సూయజ్ కెనాల్ యొక్క అవసరం ఉండటం వల్ల ఈజిప్టు మీద తన పెత్తనాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఎక్కువ కాలమే నిలబెట్టుకున్నా 1956లో సూయజ్ కెనాల్ మీద అధిపత్యాన్ని వొదులుకుని ఈజిప్టు నుంచి కూడా వెనక్కి వెళ్ళక తప్పలేదు.ఒకరిని చూసి మరొకరు ఆవేశం తెచ్చుకున్నట్టు ఆఫ్రికా దేశాలూ,ఇరాక్ వంటివన్నీ 1950 దరిదాపుల్లోనే వలస పాలన నుంచి విముక్తం అయ్యాయి.ఇప్పటికీ చిన్నా చితకా దేశాలు కొన్ని వారి వలసలు గానే ఉన్నాయంటే వారి భల్లూకపు పట్టు ఎంత గట్టిదో అర్ధం చేసుకోవచ్చు!

     ఇంగ్లీషువాళ్ళు భారతదేశంలో అంతగా విస్తరించటానికి కారణం అప్పటి రాజుల్లో ఉన్న అనైక్యతా సమాజంలో ఉన్న చీలికలూ అనే చారిత్రక నిష్పక్షపాతం వాళ్ళూ మనలోనే తప్పులు ఉన్నాయి గాబట్టి ఇంగ్లీషువాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా అహింసాయుతంగా పోరాడితే చాలునన్న మోహనదాసు భక్తులూ ఇతరదేశాల్లో వాళ్ళు చేసింది ఏమిటో తెలుసుకోవాలి.ఏడుతరాలు నవలలో కుంటా కింటే అనే ఒక వ్యక్తి స్వేచ్చ కోసం మాటిమాటికీ తప్పించుకు పారిపోతున్నాడని గొడ్డలితో అతని కాలిని నరికే సన్నివేశం చదువుతుంటేనే "అబ్బ?" అని ఒళ్ళు జలదరించినంత పనయ్యింది నాకు!ఆస్ట్రేలియాలో వీళ్ళు అడుగుపెట్టకముందు స్థానికులైన అబోరిజిన్స్ మీద వీళ్ళు చేసిన దుర్మార్గం మనిషైన వాడు ఎవడూ వూహించనిది!అబోరిజిన్సని పిలిచే స్థానిక సంప్రదాయ జీవనం గడిపే తెగల్లోని ఆడవాళ్ళని రేప్ చేసి తమ ద్వారా వాళ్లకి పుట్టిన పిల్లల్ని తల్లుల నుంచి దూరం చేసి తమ ఇళ్ళల్లో పనివాళ్ళుగా పెట్టుకుని ఎబోరిజిన్స్ చిన్నపైల్లల మీద అత్యాచారాలు చేస్తారనీ అనాగరికులనీ నూరిపోస్తూ పెంచారు.అంటే, ఒక జాతికి సంబంధించిన కొన్ని తరాల్ని ఆ జాతి మీదకే ఉసి గొలపడం అన్నమాట - అదంతా స్టోలెన్ జెనరేషన్స్ పేరుతో ప్రపంచంలోని పాపులందర్నీ పరిశుధ్ధ పరచటం కోసం తాను శిలువను మోసిన కరుణామయుని కీర్తించే చర్చి కూడా ఏ మాత్రమూ కరుణలేని విధంగా ప్రవర్తించిన చారిత్రక వాస్తవం!ఇలాంటివాళ్ళతో మోహనదాసూ అతని భక్తులూ పళ్ళికిలిస్తూ వాళ్ళ తిండి తిని వాళ్లతో ఫొటోలు దిగి గుండ్రబల్ల ముచ్చట్లు ఎలా చేశారో నాకిప్పటికీ అర్ధం కాదు!ఇంగ్లీషు వాడైన షెరిడన్ మహాశయుడు తన తిట్లు తగిలేది తన జాతికే అనేది కూడా పట్టించుకోకుండా భారతదేశంలో జరుగుతున్న దాని గురించి తెలిసి తీవ్రమైన కోపం తెచ్చుకుని "భగవంతుడి పేరున నా అణువణువులోనూ నిండిన అసహ్యంతో ఈ ప్రభుత్వాన్ని శపిస్తున్నాను" అనేశాడు,  అంతటి ధిక్కారం మనకేది?

     అయితే, రాగద్వేషాల కతీతంగా అంచనా వేస్తే బ్రిటిషు వలస పాలన నుంచి బయటపడిన తర్వాత ఇరాక్,ఈజిప్ట్,జమైకా,కెన్యా,నైజీరియా వంటి దేశాల పరిస్థితి స్వయంపాలన వల్ల అప్పటికన్నా మెరుగుపడలేదు సరిగదా మరింత అనాగరికత వైపుకి పయనించాయి.భారత్ పరిస్థితి కూడా ఆనాటివారు ఆశించినంత గొప్పగా ఈనాటికీ లేదు, ఎందుకు?ఈ వాదనతో మరోసారి ప్రపంచాన్ని కబళించడానికో ఏమో కొందరు యూరోపియన్ మేధావులు ఈ సూత్రీక్రణలతో కొత్తగా విశ్లేషణలు కూడా మొదలుపెట్టారు. అంటే, ఆయా దేశాల్లో గతంలో తాము చేసిన ఘనకార్యాలు తప్పు కాదని అనుకుంటున్న వాళ్ళు - ఇరాక్ మీద యుధ్ధానికి అబధ్ధాలను కూడా చెప్పిన టోనీ బ్లెయిర్ ఒక్కడే కాకుండా - చాలామందే ఉన్నారన్నమాట!నిజంగానే ఇంగ్లీషువాళ్ళు చెప్పినట్టు ఈ దేశాలు స్వయంపాలనకి అర్హత లేకపోయినా తమలో లేని గొప్పని ఉందనుకుని ఆవేశపడి స్వతంత్రం ప్రకటించుకుని తప్పు చేశాయా?కానే కాదు,అసలు కారణం వేరే ఉంది!వీటి గత చరిత్రలో ఒక మెలిక ఉంది, ఇంగ్లెషు వాళ్ళు వలసలు స్థాపించక ముందు నుంచీ ఆయా దేశాల్లో అనేక జాతులు కలిసి మెలిసి బతికాయి,అనేక రకాల ప్రభుత్వాలు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచీ అక్కడి ప్రజల్ని ప్రభావితుల్ని చేశాయి.ప్రతి కొత్త సంస్కృతీ తొలిదశలో పాత సంస్కృతితో సంఘర్షించినా పోనుపోనూ వాటిమధ్య సయోధ్య యేర్పడి ఎంత పరస్పర విరుధ్ధమైన సంస్కృతులైనా ఏమాత్రం విడదీయటానికి వీల్లేనంతగా కలిసిపోయి ఒకే సంస్కృతిగా రూపు దిద్దుకున్నాయి.కానీ ఇంగ్లీషు వాళ్ళ ప్రభావం అలాంటిది కాదు,ఇది వారి సంస్కృతిలో కలవకపోగా ఆయా సంస్కృతులని నాశనం చెయ్యడానికి ప్రయత్నించింది!వీరి మీద తిరగబడే సమయంలో తమ సొంత ఆస్తిత్వం కోసం ఇంగ్లీషువాళ్ళు రావడానికి ముందరి కాలంలోని మూలాల్ని వెదుక్కునే ప్రయత్నంలో కలిసిపోయిన కాలంలో కనిపించని వైరుధ్యాలు ఇప్పుడు ప్రముఖమై కనబడుతున్నాయి.మన దేశంలో ప్రస్తుతం మనం చూస్తున్న గందరగోళం - స్వాతంత్రపోరాట కాలంలో సమైక్యంగా పోరాడిన భిన్న వర్గాలు దేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తర్వాత ఒకరితో ఒకరు కలహించుకోవడానికి మూలకారణం ఇదే!

     ఇంగ్లీషు భాష పట్ల మనకున్న వ్యామోహాన్ని వొదులుకుని మాతృభాషల్లో విద్యాబోధనకి ప్రాధాన్యత ఇవ్వనంతవరకూ మనల్ని పట్టిన పరాధీనతా పోదు,సాంస్కృతిక బానిసత్వమూ  వదలదు,మన దేశం ప్రపంచంలో తలయెత్తుకుని నిలబడటమూ జరగదు.ఒక జాతి సంస్కృతి యొక్క గొప్పదనానికీ ఆ జాతి మాట్లాడే భాషలోని సాహిత్యానికీ దగ్గరి సంబంధం ఉంటుంది.ఒక తరం నుంచి ఒక తరానికి సంస్కృతి ప్రవహించేది మాతృభాష ద్వారానే - అందుకే ఇంగ్లీషువాళ్ళు తమ తెలివి నంతా ఉపయోగించి మొదట దాని మీదనే దాడి చేశారు - వలసల్ని స్థిరపర్చుకోవడానికి వాళ్ళు ఫాలో అయిన మోడస్ ఆపరేండి లోని మొదటి మెట్టు మాట్లాడే భాషని మార్చటం, ఇంగ్లీషు భాషని స్థానికుల చేత బలవంతంగా మాట్లాడించటం. భారతదేశంలోనూ సరిగ్గా ఇదే జరిగింది,కాకపోతే ఇక్కడ క్రూరంగా వెళ్తే మొదటికే మోసం వస్తుందని తెలుసు గనక కొంచెం సుకుమారమైన పధ్ధతిలో వెళ్ళారు,అంతే!మందు కొట్టేవాళ్ళకి కిక్కు యెక్కడం రెండు రకాలుగా ఉంటుందని తెఉసు.ఆబగా కక్కుర్ర్తిగా లాగిస్తే ఎంత ఫాస్టుగా టాపు లేపేటంత రేంజిలో ఎక్కుతుందో అంత ఫాస్టుగా దిగిపోతుంది - దాన్ని తట్టుకోలేనప్పుడే వాంతులూఒ హ్యాంగోవర్లూ వస్తాయి!ఆరారగా కబుర్లు చెప్పుకుంటూ పుచ్చుకుంటే కిక్కు ఎక్కడం ఎక్కుతున్నప్పుడు తెలియకపోయినా ఎక్కాక మాత్రం ఒక పట్టాన దిగదు!ఇంగ్లీషువాళ్లని తరిమికొట్టేసి వందేళ్ళు పూర్తి కావొస్తున్నా ఇంకా "all the historical information which has been collected from all the books written in the Sanskrit language is less valuable than what may be found in the most paltry abridgements used at preparatory schools in England." అంటూ మన సంస్కృతి పట్ల ఇంత దుర్మార్గమైన వెక్కిరింతతో ఉన్న అజ్ఞాన సింధువు లార్డు మెకాలే గారు ప్రవేశపెట్టిన సాంస్కృతిక పరాధీనతని పెంచే విద్యావిధానాన్ని మార్చుకోకుండా జాతి స్వాభిమానాన్ని పెంచే మాతృభాషలో చదువుకోకుండా మనకు మనమే అడ్డు పడుతున్నామంటే ఇంగ్లీషువాళ్ళు మనకి ఎక్కించిన పరాధీనత కిక్కు ఎంత బలంగా ఎక్కిందో చూడండి!
Thomas Babington Macaulay
     తొలిదశలో ఎక్కడో ఒక ప్రాంతంలో పుట్టిన జర్మను భాషలోని మాండలిక రూపం అతి తక్కువ కాలంలోనే ఇంతింతై వటుడింతయై పెరిగి ఉప్పెనవలె ప్రపంచ మంతటా వ్యాపించింది - అది నేటి ఇంగ్లీషు భాష!ఆ వ్యాపించటం ఎలా జరిగింది?ఇప్పటికీ తమ దేశంలో జాతీయభాషగా మాత్రమే పరిమితమైన జర్మను భాష కన్నా దాన్ని ప్రపంచవ్యాప్తం చేసినది - దూరతీరాలకు వ్యాపించి,వ్యాపించిన ప్రతి చోటా బలవంతంగా రుద్దగలిగిన స్థాయిలో చెలరేగిపోయిన రాజకీయాధికారం!అదే మాదిరి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ఒక మాండలికమైన హిందీ అప్పటి ప్రభువులు తమ కార్యకలాపాల్లో వాడటం వల్ల క్రమేణా పెరిగి నేటికి దేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషగా అవతరించింది.ఇవ్వాళ్టికీ తమిళులు ఒక్కరే ఈ స్వదేశపు భాషని జాతీయభాషగా గుర్తించడానికి నిరాకరించి ఇంకా పరదేశపు భాష ఇంగ్లీషునే ఎక్కువగా ఆదరించడానికి కారణ మేమిటి?తమిళనాడు లోని సామాన్య ప్రజలు వ్యతిరేకిస్తున్నారా?వారు హిందీ సినిమాలు అస్సలు చూడరా!కాదు,అక్కడ కూడా ద్రవిడ నామధేయాన్ని పార్టీ పేరులో ఉంచుకున్న వారి రాజకీయమే కారణం!

     ఒక జాతి ఏ విధంగా నైనా శక్తివంతమైతే,తన సొంత గడ్డ ఆ శక్తికి ఇరుకైపోతే,తప్పనిసరిగా వ్యాపించే దశలో ఉంటే ఆ జాతికి సంబంధించిన అన్ని రూపాల్లోనూ అది ప్రతిఫలిస్తుంది -- భాష,కళ,ఆర్ధికం,హార్ధికం!వ్యాపించే సమర్ధత ఉన్నది గనక వ్యాపించియే తీరుతాడు - "రెక్కలుండటమే వస్తే ముడుచుక్కూచుంటాడా ఎవడైనా(గులాబి అత్తరు)!" అయితే కొత్త చోటుకి వెళ్ళినవారు మన ప్రాచీనుల వలె మర్యాదస్తులు అయితే ఉభయతారకమైన పంపకాలు జరుగుతాయి!కానీ ఆంగ్లేయులు మాత్రం వారు వ్యాపించిన ప్రతిచోటా ఆధిక్యాన్నే ప్రదర్శించి ఇతరుల సంస్కృతుల్ని ధ్వంసం చేసి ఆ స్థానంలో తమ వాటిని ప్రవేశపెట్టారు!వారి ధ్వంసరచన ఎంత క్రూరమైనదంటే వారి వలసలు స్వతంత్రమైనాక కొన్ని దేశాల వారికి తమదైన సంస్కృతికి మళ్ళటానికి పాత గుర్తులు పూర్తిగా మాసిపోయేటంత!

     మరాఠా అస్తిత్వానికి ముచ్చటపడి శివసేనను అభిమానిస్తున్న మహారాష్త్ర ప్రజల్ని గానీ తమ ప్రాంతపు ఆస్తిత్వం కోసం పట్టుబట్టి సాధించుకున్న తెలంగాణ ప్రజల్ని గానీ కర్ణాటక తదితర రాష్ట్రాలలో చెలరేగుతున్న ప్రత్యేక ఉద్యమాల్ని గానీ దేశభక్తి లేనివాళ్ళు మూర్ఖంగా చేస్తున్న వేర్పాటువాదపు విధ్వంసకర ప్రయత్నాలుగా ముద్ర వెయ్యకుండా వాటిలోని అస్తిత్వవాదపు మూలాల్ని చూస్తే భవిష్యత్తు కార్యాచారణకి అవసరమైన దారి కనబడుతుంది.పుట్టీ పుట్టగానే మనిషికి మొదట వచ్చేది అస్తిత్వమే, దేశభక్తి అనేది వ్యక్తి పెరిగి పెద్దయి సమాజం లోకి వెళ్ళాక వస్తుంది.ప్రతి వ్యక్తికీ ఒక మాతృభాష ఉంటుంది.తల్లిదండ్రులు,బంధుమిత్రులు వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ తనతో మాట్లాడుతూ తనకి పరిచయం చేసే భాష శిశుప్రాయం నుంచే అలవాటైపోతుంది.కానీ బళ్ళో వెయ్యంగానే నువ్వు వృధ్ధిలోకి రావాలంటే మన భాషలో కాదు,ఇవన్నీ మళ్ళీ కొత్తగా ఇంగ్లీషులో నేర్చుకోవాలి అంటే ఆ పిల్లవాడు ఖచ్చితంగా గందరగోళానికి గురవుతాడు.అప్పటికి తన మాతృభాష మీదనే పూర్తి అధికారం రాని స్థితిలో భావానికీ రూపానికీ ఇంకా లంకె కుదరకుండా ఉన్నప్పుడు ఈ అస్పష్టమైన పాండిత్యాన్ని అమాంతం కొత్త భాషలోకి తర్జుమా చేసుకోవడం అయిదారేళ్ళ కుర్రవాడికి/కుర్రదానికి సాధ్యపడుతుందా అనేది ఆంగ్ల భాషాభిమానులు ఆలోచించడం లేదు!సహజంగా ఇవ్వాళ మనం స్కూళ్ళకి పంపిస్తున్న వయసులో పిల్లలందరూ కొత్తవి నేర్చుకోవడం పట్ల ఆసక్తిగానే ఉంటారు,అయినా కొందరు మొద్దావతారాలుగా ఎందుకు తయారవుతున్నారు?అప్పటివరకూ మాతృభాషలో కేరింతలు కొట్టిన పిల్లలు ఈ గందరగోళానికి అలవాటు పడకపోవటమే ఎంతో హుషారుగా మొదలుపెట్టిన చదువుల్ని అర్ధాంతరంగా ఆపెయ్యటానికి అసలు కారణం!మాతృభాషలో విద్యాబోధన నిక్కచ్చిగా జరగడానికి మొదటి ఆఖరి అడ్డంకి పాఠ్యపుస్తకాల్ని ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చెయ్యగలిగిన ద్విభాషాకోవిదులైన పండితులు లేకపోవటమే తప్ప ఈ దేశపు పిల్లలు చదువుకోవడానికి ఉత్సాహంగానే ఉన్నారు.

     ఇవ్వాళ ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడుతున్న భాష ఇంగ్లీషు కానేకాదు,ఒక లెక్క ప్రకారం అది నాలుగో స్థానంలో ఉంది!Ethnologue: Languages of the World, 15th ed. (2005) & Wikipedia.org వారి లెక్కల ప్రకారం చైనీస్ మాండరిన్ భాషను మాతృభాషగా గలవారు 873 మిలియన్లు ఉండగా 2వ భాషగా నేర్చుకుని మాట్లాదగలుగుతున్నవాళ్ళు 178 మిలియన్లు ఉన్నారు - మొత్తం మీద 1.051 బిలియన్ల మంది మాట్లాడుతూ ప్రధమ స్థానంలో ఉంది!హిందీ భాషను మాతృభాషగా గలవారు 370 మిలియన్లు ఉండగా 2వ భాషగా నేర్చుకుని మాట్లాదగలుగుతున్నవాళ్ళు 120 మిలియన్లు ఉన్నారు - మొత్తం మీద 490 మిలియన్ల మంది మాట్లాడుతూ ద్వితీయ స్థానంలో ఉంది!స్పానిష్ భాషను మాతృభాషగా గలవారు 350 మిలియన్లు ఉండగా 2వ భాషగా నేర్చుకుని మాట్లాదగలుగుతున్నవాళ్ళు 70 మిలియన్లు ఉన్నారు - మొత్తం మీద 420 మిలియన్ల మంది మాట్లాడుతూ తృతీయ స్థానంలో ఉంది!ఇంగ్లీషు భాషను మాతృభాషగా గలవారు 340 మిలియన్లు ఉండగా మొత్తం మీద 510 మిలియన్ల మంది మాట్లాడుతూ చతుర్ధ స్థానంలో ఉంది!స్థానం మాతృభాషని బట్టి ఇచ్చారనేది గుర్తుంచుకుంటే 510 మిలియన్లు ఉన్నా నాలుగో స్థానంలోకి ఎందుకు వెళ్ళిందో తెలుస్తుంది.మళ్ళీ 2013లో తీసిన లెక్కల ప్రకారం ప్రపంచంలో మాతృభాషగా ఉండి ఎక్కువ మంది మాట్లాడుతున్న 10 భాషలు ఇవి:1). మాండరిన్(1197 మిలియన్లు) 2).స్పానిష్(406 మిలియన్లు) 3).ఇంగ్లీష్(335 మిలియన్లు) 4).హిందీ-ఉర్దు(260 మిలియన్లు) 5).అరబిక్(223 మిలియన్లు) 6).పోర్చుగీస్(202 మిలియన్లు) 7).బెంగాలి(193 మిలియన్లు) 8).రష్యన్(162 మిలియన్లు) 9).జపనీస్(122 మిలియన్లు) 10).జవనీస్(84 మిలియన్లు) - దీన్ని బట్టి మీకేం అర్ధ మవుతుంది? ప్రపంచంలో ఇంగ్లీషు భాష ఒక్కటే కాదు,మనం నేర్చుకుని మాట్లాడగలిగితే ఉపాధి/వ్యాపారం/జీవితం కోసం ఎక్కడికయినా వెళ్ళోచ్చు అని కదా!

     అంకెలు పూర్తిగా ఖచ్చితం కాకపోవచ్చు,ఎందుకంటే చైనీస్ భాషల్లో మాండరిన్ అనేది ఒక మాండలికం కావచ్చు,మళ్ళీ మాండరిన్ లోనే ప్రాంతాన్ని బట్టి శాఖలూ ఉండవచ్చు - మనకి తెలుగులో ఉన్న జిల్లాల వారీ మాండలికం లాగ!కానీ స్థూలంగా నిష్పత్తులలో మాత్రం చాలా కొద్ది తేడాయే ఉంటున్నది.లెక్కల కోసం ఎంచుకున్న పధ్ధతి పూర్తి శాస్త్రీయంగానే ఉన్నది కాబట్టి ఈ గణాంకాలు అందరూ ఒప్పుకుంటున్నవే.ప్రస్తుతం దేశాల వారీగా చూస్తే ఇంగ్లీషు 101 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,అరబిక్ 59 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,ఫ్రెంచ్ 51 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,స్పానిష్ 31 దేశాల్లో ప్రాచుర్యంలో ఉంది,రష్యన్ పోర్చుగీస్ 11 దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి.ప్రస్తుతం సమాచార సేకరణకి సంబంధించి అంతర్జాలం మీద ఆధారపడుతున్నాము గాబట్టి వాటి వివరాలు చూసినా ఇంగ్లీషు ఒక్కటె ఇంటర్నెట్ మొత్తాన్ని ఆక్రమించెయ్యలేదని తెలుస్తుంది.ఇంటర్నెట్ వినియోగంలో నిష్పత్తి ఇలా ఉంది: 1).ఇంగ్లీషు(27.3%) 2).చైనీస్(22.6%) 3).స్పానిష్(7.8%) 4).జపనీస్(5.3%) 5).పోర్చుగీస్(4.3%) 6).జర్మన్(4.0%) 7).అరబిక్(3.3%) 8).ఫ్రెంచ్(5.2%) 9).రష్యన్(2.5%) 10).కొరియన్(2.1%) - అందరూ ఆంగ్ల భాషా వ్యామోహంలో లేరు!

     జ్ఞానం ఏ రూపంలో ఉన్నా అది భాష ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.ఆ జ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం అయితే ఉపాధికీ ఆర్జనకీ తోడ్పడుతుంది,కళాసృజనకి సంబంధించినదైతే ఆనందం పరమావధి అవుతుంది.అన్ని భాషల లోనూ ఉండే సారూప్యాలు - అక్షరం,పదం,వాక్యం,నిర్మాణం/వ్యాకరణం!భాషా శాస్త్రజ్ఞు లందరూ ముక్తకంఠంతో ఒప్పుకుంటున్న మొదటి విషయం అనేక భాషలు నేర్వాలనుకున్నవారు మొదట ఒక భాషలో మంచి పట్టును సాధించాలి.ఆ తర్వాత తులనాత్మకంగా, అంటే మొదటి భాషలోని ఈ పదానికి రెందవ భాషలో ఏ పదం సరిపోతుంది,మొదటి భాషలో మనం చక్కగా  వ్యక్తీకరించగలుగుతున్న ఒక భావాన్ని మరొక భాషలో యెలా చెప్పగలం అనే విధంగా నేర్చుకోవడం తప్ప ప్రతి భాషనీ విడివిడిగా నేర్చుకోవడం అనేది శుధ్ధ తెలివితక్కువ పని.పుస్తకంలో ఎంత విషయం అచ్చయి ఉన్నా గురువు విశ్లేషించి చెప్పకుండా ఏదీ బోధపడదు - ముఖే ముఖే సరస్వతి!

     ఇవ్వాళ దేశంలో విద్యాబోధన జరగాల్సిన దానికి రివర్సు గేరులో జరుగుతున్నది.ఇంత గట్టిగా ఇంగ్లీషును చిన్నతనం నుంచీ రుద్దినా ఉత్తీర్ణత శాతం చూస్తే ఫలితం ఏమంత గొప్పగా లేదు,ప్రావీణ్యతని లెక్కించినా గిరీశం మార్కు బొట్లేరింగ్లీషు తప్ప అయిదు నిమిషాలు తప్పుల్లేని ఇంగ్లీషు మాట్లాడగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు - ఈ ఆంగ్లభాషాప్రచారకుల్లొనే తప్పుల్లేని ఇంగ్లీషు మాట్లాడగలిగిన వాళ్ళు ఎక్కువమంది ఉండకపోవచ్చు, మరి ఎందుకొచ్చిన వ్యామోహం?మొదట మన మాతృభాషని మనం క్షుణ్ణంగా నేర్చుకుని పిదప పరభాషలో ప్రావీణ్యత సంపాదించి ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఒద్దికగా వాళ్లలో కలిసిపోయి బతుకుతూ మన భాషని వాళ్లకి కూడా నేర్పుతూ ఉంటే ఒకనాటికి మన భాష కూడా ఎక్కువ మంది మాట్లాడే ఎన్నదగిన భాషల్లో ఒకటవుతుంది.ఇంగ్లీషువాళ్ళలా కాకుండా అట్లా మర్యాదాపురుషోత్తముల వలె వ్యాపించితే ఎవరు కాదంటారు!

పరభాషా వ్యామోహమనే చెట్టుకి పరాధీనత తల్లివేరు - వేరుని మాడ్చకుండా చెట్టుని కూల్చలేం!


ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...