Showing posts with label కాంగ్రెసు చరిత్ర. Show all posts
Showing posts with label కాంగ్రెసు చరిత్ర. Show all posts

Monday, 22 February 2016

నా జీవనపయనం లోకి మలయమారుతంలా వచ్చి ప్రళయాన్ని సృష్టించిన - ఆమె ఎవరు?

          ఆమెది క్లియోపాట్రా యొక్క ముక్కు, ఆమెవి పాలిన్ బోనపార్టే యొక్క కళ్ళు - ఆమెవి సౌందర్యరసాధిదేవత వీనస్ యొక్క వక్షోజాలు!శారీరకంగా చూసినా మానసికంగా చూసినా ఆమెలో స్త్రీత్వం కన్నా పురుషత్వమే ఎక్కువ. నేను ఆమెని మగతనం గల ఆడది అని పిలుస్తాను.

          నేను ఆమెని మొదటిసారి 1945 శీతాకాలంలో ఆమె పూర్వీకుల భవంతిలో కలిశాను.అప్పటికి ఆమె అప్పుడప్పుడే పాకడం నేర్చుకుంటున్న తొలిచూలు బిడ్డకి తల్లి - ఆ బిడ్డ పెద్ద ఏడుపుగొట్టు!చూసీ చూడగానే ముఖం మీద తెలియరాని సంతోషలేమి నీడలు పరుచుకుని ఉన్నప్పటికీ ఆమె చాల గుంభనైన అమ్మాయి అనిపించింది.ఆమె రెండో కొడుకు 1946 డిసెంబరులో పుట్టాడు - అతడొక అవాంచిత శిశువు?ఆ పిల్లాడికి ఒక దోషానికి పరిహారంగా సుంతీ చేయించాల్సి వచ్చింది.1947 కల్లా ఆమె సంతోషలేమి పాత్ర పూర్తిగా నిండిపోయి ఆ అదృష్టం ముఖం మీదకి కూడా ఎగదన్నుకొచ్చి ప్రకాశించసాగింది.

          ఆమె తండ్రి 1946 వేసవిలో ఒక చిన్న ఆస్టిన్ కారు ఇచ్చాడు.ఆమె నన్ను డ్రైవింగ్ నేర్పమని అడిగింది.మొదట్లో ఆమెని డ్రైవింగ్ పాఠాల కోసం పోలో గ్రౌండ్ వరకు తీసుకెళ్ళేవాణ్ణి.ఆమె నేర్చుకోవడంలో చాలా చురుకైనది.కానీ గర్భం ముదిరి ప్రసవపు రోజులు దగ్గిర పడటంతో డ్రైవ్వింగ్ ఆపేశాను.ఈ దశలో రోడ్డు మీదకి వెళ్ళడం కష్టం కాబట్టి ఆ రిస్కు నేను తీసుకోదల్చలేదని చెప్పేశాను.1946 డిసెంబర్ మధ్యలో రెండో కొడుకు పుట్టాడు.1947 ఫిబ్రవరి మధ్యకల్లా మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకోవటానికి సిద్ధమైపోయింది.ఈసారి రోడ్లమీదనే కన్నాట్ సర్కస్ వరకు వెళ్ళాం.ఆమెకి నేను ఒకటే చెప్పాను "నీ గురించి నువ్వు నీ కంతా తెలిసినట్టు వూహించుకో,కాన్సెంట్రేషన్ ముఖ్యం,నీకు ఆపోజిట్ దైరెక్షన్లో వస్తున్న కారు డ్రైవరుకి ఏమీ తెలియదని అనుకో,ధైర్యంగా నడుపు కారుని,కన్నాట్ సర్కస్ చుట్టూ ఒక రవుండ్ వేసిరా".సరిగ్గా అదే చేసి విజయవంతంగా తిరిగొచ్చింది.అంతటితో డ్రైవింగ్ లెస్సన్లు పూర్తయిపోయాయి.

          1947 జూన్ నెలకి ముందనుకుంటాను సినిమాకి తీసుకెళ్ళమని అడిగింది.అప్పటినుంచి నేను ఫ్ర్రీగా ఉన్నప్పుదల్లా సినిమాలకి వెళ్తుండేవాళ్ళం - కాకపోతే నేను ఫ్రీగా ఉండేది తక్కువ.

          రిడ్జి మీదుగా కీకారణ్యం లాంతి ట్రాఫిక్ మధయనుంచి నేను డ్రవ్ చేస్తుంటే చూస్తూ ఉందేది.ఆమెకి చిన్నగా ఉందే కార్లంతే చిరాకు,అందుకని నా పెద ప్లిమత్ కారులోనే వెళ్ళేవాళ్ళం.అడవులు,శిధిలగృహాలు ఎక్కడ ఉంటే అకక్డికి వెళ్ళడం ఆమె కిష్టం.కుతుబ్ మీనార్ దాటిన తర్వాత దూరంగ ఉండే చోట్లకి వెళ్ళడమంటే ఎక్కువ మక్కువ..ఒకరోజు,అలాంటి బేఫర్వా డ్రైవ్ మధ్యలో "నువ్వు నన్ను ప్రేమించటం లేదు" అనేసింది గబుక్కున బ్లేం చేస్తున్నట్టు.నే నన్నాను "నాకు తెలీదు, నేను దాని గురించి ఆలోచించ లేదు".1947 శీతాకాలం వచ్చేసరికి నావైపు నుంచి నేను చొరవ చెయ్యకపోయినా ఆమే నా గురించిన ప్రేమలో తలబంటిగా మునిగిపోయిందని నా కర్ధమైంది.నన్ను చూడగానే ముఖం వెలిగిపోతుండేది.ఆమె తన సొంత విషయాలు కూడా నాతో మాట్లాడుతూ ఉండేది.పెళ్ళయిన కొద్దికాలానికే తన భర్త తనని మోసం చెయ్యడం స్పష్టంగా తెలిసిందని చెప్పింది.తన కుటుంబం లోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించినా అంత గట్టిగా నిలబడి అతన్ని పెళ్ళి చేసుకుంటే అతను చేసిన ద్రోహంతో నిజంగా ఆమె చాలా షాకయ్యింది.మొదట్లో తన చీరలు,బ్లౌజులు,హ్యాండ్ బ్యాగులు మాయమైపోతుండేవి. నౌకర్ల పనేమో అనుకుందట, ఒక పార్టీలో అవి ఇద్దరాడవాళ్ళ వొంటిమీద చూసేవరకు.ఈ ఇద్దరూ తన భర్తతో చాలా స్నేహంగా తిరిగేవాళ్ళు.తన బుక్ షెల్ఫ్ నుంచి పుస్తకాలు కొట్టేసి తన భర్త ఏ ఆడవాళ్ళ కిచ్చాడో వాళ్ళు కూడా తనకు తెలుసునని చెప్పింది.

          వీటన్నింటితో ఆమె నామీద ఆమెకున్న అభిప్రాయం ఏమిటో, నానుంచి ఆమె ఏమి కోరుకుంటున్నదో చెప్పేసినట్తయింది.నెను నాకున్న రెండు ఇబ్బందుల్నీ ఆమెకి చెప్పాను:(1)పెళ్ళయిన ఆడవాళ్లతో వెధవ్వేషాలేసి గొడవల్లో ఇరుక్కోలేను(2)ఆమె తండ్రి పట్ల నాకున్న విశ్వాసం అడ్డం వస్తున్నది.నెం 1 అబ్జెక్షనుకి వెంఠనే జవాబు చెప్పేసింది.కొంతకాలం ముందునుంచే ఆమె భర్తకి దూరంగా ఉన్నానని చెప్పింది.ఇంకా ఇలా అనింది "అతను నన్ను ముట్టుకునే వూహని కూడా భరించలేకుండా ఉన్నాను".ఇంకో రహస్యం కూడా చెప్పింది "అదృష్టవశాత్తు అతను నపుంసకుడైపోయాడు,ఆదపిచ్చి మాత్రం మిగిలింది".నెం 2 అబ్జెక్షను గురించి కోపం కూడా తెచ్చుకుని "దీంతో మానాన్న కేమిటి సంబంధం?నేను మైనర్నా!" అని అడిగింది.

          అప్పట్నుంచీ తను నాదగ్గిరే ఎక్కువగా గడిపేది - తనకి సంబంధించిన విషయంలో నేను తన తండ్రి గురించి ఆలోచించటాన్ని వెక్కిరిస్తూ ఉండేది.అయినా నేను మృదువుగా తిరస్కరిస్తూ వచ్చాను, మానసికంగా నేను సిద్ధపడకపోవటం వల్లనో లేక నాలో అంత వూపు రాకపోవడం వల్లనో నాకే తెలియదు.

          1947 నవంబర్ 18న నన్ను తన రూముకి తీసుకెళ్ళి పెదాల మీద ముద్దుపెట్టి "నేను నీతో పడుక్కోవాలనుకుంటున్నాను.రేపు సాయంకాలం నన్ను అడవుల్లోకి తీసుకెళ్ళు" అని చెప్పింది.నేను నాకు ఆడవాళ్ళ విషయంలో అంత అనుభవం లేదని చెప్పాను."ఇంకా మంచిది" అనేసింది.అలా ఆ 19న,అంటే తన పుట్టిన రోజున,కారుని నగరానికి దూరంగా కారడవి వైపుకి పోనిచ్చి ఒక ఏకాంత ప్రదేశాన్ని చూసుకుని సెటిలయ్యాం.తిరిగి వచ్చేటప్పుదు నాకు ఇబ్బందిగా అనిపించిన తన రొమ్మ్ముల్లో ఉన్న పాల(పిల్లాడికి పాలివ్వటం ఎప్పుడో మానేసింది) గురించి చెప్పాను.తర్వాత తను దాని గురించి ఏదో చెయ్యటంతో ఆ సమస్య తీరింది.నాకు సెక్స్ గురించి ఏమీ తెలియదని కనిపెట్టేసింది, రెండు పుస్తకాలు ఇచ్చింది, వాటిల్లో ఒకటి డా.అబ్రహం స్టోన్ సెక్స్ గురించి రాసింది.రెండూ చదివినాక కొంచెం బాగుంది.

          ఆమె మరీ మదనపీడితస్వైరిణి కాదు,తరచుగా శృంగారం కూడా కోరుకోదు.కానీ శృంగార సమయంలో మాత్రం ఫ్రెంచ్ స్త్రీ కేరళనాయర్ స్త్రీ కలగలిసిపోతే ఎంత కళాత్మకంగా ఉంటుందో అంత కళాత్మకంగా ఉంటుంది.ఆమె పదే పదే ఒకే రకంగా తీగలు సాగుతున్నట్టు పెట్టుకునే ముద్దుల్ని ఇష్టపడుతుంది.శృంగారంలో తనకి కావలసినదాన్ని మాత్రమే తీసుకుంటూ ఇతరులకి కావలసినది ఇవ్వకుండా తప్పించుకోవటంలో మంచి నేర్పుని సాధించి ఉంది.అమె అసదృశ నారి.అది తన స్త్రీత్వాన్ని నిరూపించుకుని ఆత్మరక్షణ చేసుకోవటానికి ఒక ఆయుధం మాత్రమే.ఆమె పడక మీద ఉన్నంతసేపూ రసోద్రేకంతో చెలరేగుతూ అరుదైన నేర్పుతో మెలికలు తిరిగే నాగిని లాంటి భామిని.మేము ప్రేమికులుగా ఉన్న పన్నెండేళ్ళలో ఆమెతో అనుభవం నాకెప్పుడూ తనివి తీరనిదే.

          పోనుపోనూ అప్పుడప్పుడు నాతో ఉండే లావాటి చుట్టాలామె అంటే ద్వేషం పెంచుకునింది.ఎప్పుడు ఆ లావాటి చుట్టాలామె వచ్చేతప్పుడు నన్ను స్నేహంగా కావిలించుకున్నా,చెంప మీద ముద్దుపెట్టినా ఆ లావాటి చుట్టాలామె మీద ఈర్ష్యాసూయలతో దహించుకు పోతుండేది.అప్పుడప్పుడు ఆ చుట్టాలమ్మ్మాయి తననీ నా "ఆమె"నీ సినిమాకి తీసుకెళ్ళమని అడిగేది.అప్పుడు నా "ఆమె" తెలివిగా నేను ఆ లావాటి చుట్టాలమ్మాయి పక్కన కూర్చోకుండా ఉండాలని తను మధ్యలో కూర్చునేది.

          ఒకసారి ఆ చుట్టాలమ్మాయి రేపు వస్తుందనగా "ఆమె" నన్ను చీకటి పడ్డాక వనవిహారానికి తీసుకెళ్ళమనింది.కారులో "ఏమిటీ హడావిడి?నాకు చాలా పనుంది" అనడిగాను.ఆమె "ఆ రుబ్బురోలు ఇక్కడున్నంతకాలం నేను నీకు దూరంగా ఉంటాను.తను నిన్ను ముట్టుకున్నాక నువ్వు నన్ను ముట్టుకోవటం నాకు కంపరంగా ఉంది" అనింది.అప్పుడు నేను లావాటి అమ్మాయి మీద నాకు ఎలాంటి మోహమూ లేదని ఆమెకి చెప్పాను.తర్వాత తర్వాత 'ఆమె' లావాటి చుట్టాలమ్మాయి చేష్టలకి అలవాటు పడింది.

          అప్పుడప్పుడు ఆమె ఎలాగోలా తన భర్త ఉన్నప్పుడు నేను తన రూముకెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడేలాగ చెయ్యాలని చూసేది.నేను నా కలాంటి దాగుడుమూతల మీద ఆసక్తి లేదని చెప్పాను.దాంతో ఆమె తన భర్తనే అప్పుడప్పుడు నా స్టడీ రూముకి తీసుకొస్తూ ఉండేది.

          ఆమె తన పిల్లల్ని వాళ్ళ తండ్రికి దూరంగా ఉంచటానికి ఎన్ని రకాల పద్ధతులు వీలయితే అన్నీ ప్రయత్నించేది.ఆమె నాతో వాళ్ళ మీద తండ్రి ప్రభావాన్ని ఏమాత్రం ఉంచగూడదనుకున్నట్టు చెప్పింది,ఎందుకంటే అది పిల్లల్ని పాడు చేస్తుందని ఆమె నమ్ముతున్నది.ఆమె నిర్ధారణగా చెప్పింది "నేను నా పిల్లలు అబద్ధాలకోర్లుగా పెరగాలని అనుకోవట్లేదు" అని.ఆమె భర్త మరో గదిలోకి మారడానికి ఇది కూడా ఒక కారణం.

          ఒకసారి తన భర్త నాకు చెప్పిన ఒక విషయం గురించి ఆమె దగ్గిర ప్రస్తావించినప్పుడు ఆమె "తను చెప్పినదాంట్లో ఒక్క మాట కూడా నమ్మొద్దు.నేను ఎంతో నష్టపోవాల్సొచ్చింది అది తెల్సుకోవడానికి" అనింది.

          అతనితో విడాకులు తీసుకోవటం గురించి తన తలిదండ్రుల కిద్దరికీ స్నేహితుడూ తనకి కూడా తన శ్రేయొభిలాషి అనిపించిన ఏ.సి.యన్.నంబియార్ అభిప్రాయం కోసం ఆయనకి ఒక ఉత్తరం రాసింది.ఆయన కొన్ని పరిస్థితుల్లో వూహాస్వర్గపు ఆదర్శాల నుంచి బయటపడి వాస్తవంతో రాజీ పడటం మంచిదని జవాబు చెప్పాడు.ఈ విషయంలో నేనూ ఆమెని ప్రోత్సహించలేదు,ఆమె తండ్రికి ఇబ్బంది గనక.

          ఒకరోజు, తనొక హిందువుని పెళ్ళి చేసుకున్నాననే వూహనే భరించలేకపోతున్నానని చెప్పింది.దానికి నేను "యుగాల తరబడి హిందూమతం సృజించిన పురుషశ్రేష్ఠుల కందరికీ ఇది గొప్ప కాంప్లిమెంటు" అన్నాను.

          నేను ఎప్పుడూ ఆమేని నా బెడ్రూముకి రప్పించుకోవాలని ప్రయత్నించలేదు,ఆహ్వానించలేదు.ఒకే ఒకసారి వచ్చింది.అప్పుడు అర్ధరాత్రి దాటింది.మంచి నిద్దర్లో ఉన్నాను,అర్ధరాత్రి వరకూ పని చేసున్నాను;పక్కన కూర్చుని ముందుకు వంగి మెత్తని ముద్దుతో నిద్ర లేపింది."ఏమిటి సంగతి?" అనడిగాను,ఆమె:"రావాల్సొచ్చింది!" అనింది. మనసులో ఆమె పడుతున్న ఆందోళన ఏమిటో నాకు తెలీదు.నేను చెప్పాను:"సరే,నిశ్శబ్దంగా పడుకుందాం - అనవసరంగా ఏమీ చెయ్యకు".ఆమె అలాగే ఉదయం 4 వరకు ప్రశాంతంగా గడిపింది,తర్వాత లేచి మేద మీదకి వెళ్ళిపోయింది.వెళ్ళే ముందర "నీకు ఇదివరకెప్పుడూ చెప్పలేదు గానీ ఒకసారి నేను  ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.ఇకముందు మాత్రం అలాంటి ఆలోచనలు రావు.నువ్వు నాకు పోయిన సంతోషాన్ని తిరిగిచ్చావు" అనింది.

          ఒకసారి,మా ప్రేమజీవితపు తొలినాళ్ళలో,ఆమె "నిన్నుకూడేవరకు నాకు నిజమైన శృంగారం అంటే ఏమిటో తెలియదు" అనింది.పడక మీద రసోద్రేకపు తారాస్థాయిలో,ఆమె నన్ను గట్టిగా తనకేసి అదుముకుంటూ "ఓహ్, భూపట్, ఐ లవ్ యూ!" అనేది.ముద్దుపేర్లతో పిలవడం పిలిపించుకోవడం ఆమెకి ఇష్టం.ఆమె నాకు బందిపోటు భూపట్ పేరుని తగిలిస్తే నేను ఆమేకి అతని ప్రియురాలు పుత్లి అపేరు తగిలించాను.మేము ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళం ఆ పేర్లతోనే పిలుచుకునేవాళ్ళం.ఆమె ప్రేమాతిరేకపు పరవశంలోని పలవరింతల గురించి ఒకసారి రెండు కవితలు చహ్దివాను,బైరన్ రాసిన డాన్ జువాన్ నుంచి:

          ?Man's love is a man's life, a thing apart, It is a woman's whole existence. In her first passion woman loves her lover; In all others all she loves is love".

          ఆమె దానికి,"సరే,ఎన్నిసార్లు చెప్పాలనిపిస్తే అన్నిసార్లు,పక్క మీద కాదు,నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి" అనీంది. నేను నా శక్తివంచన లేకుండా ఆమె ముచ్చట తీర్చాను.నిజానికి,అందులో పెద్ద్ద కష్టమేమీ లేదు,నేనప్పటికే ఆమెతో ప్రేమలో పీకలోతు కూరుకుపోయాను.

          ఒక సాయంకాలం,ఆమె మరీ వికలంగా కనబడింది.ఆమె నన్ను చూడగానే ఏడ్చెయ్యటం మొదలెట్టింది.నేను ఏం జరిగిందని అడిగాను.ఆమె తన డ్రెస్సింగ్ రూము నుంచి బయటికొచ్చి రోజూలాగే పాలు తాగబోయినప్పుడు,అందులో పొడి చేసిన గాజుముక్కలు కనిపించాయి.ఆ గాజుపొడి నురగ మీద తేలుతూ కనిపించింది.వెంటనే నోట్లోనే ఉన్న పాలని వూసేస్సింది.ఆమె తన భర్త దొంగలా తన బెడ్రూము వైపుకి తొంగి చూస్తూ పిల్లిలా జారుకోవడం గురించి చెప్ప్పింది.ఆఖరికి దుఃఖం తగ్గించుకుని, ఆమె తన చెతులతో నన్ను చుట్టుకుని గట్టిగా కావిలించుకుని "ఓహ్,మ్యాకీ,ఐ లవ్ యూ;నాకిప్పుడు నువ్వున్నావు - అదే సంతోషం" అనింది.

          మా మొట్టమొదటి విదేశయాత్రలో ఆమె మోంటె బ్లాంక్ కనుచూపు మేరలో ఉండగానే చాలా ఎగ్జైట్ అయింది.ఆమె మెత్తగా నాతో ,"క్వీన్ బీ అంటే నాకు చాలా ఇష్టం,గాలిలో తేలిపోతూ రొమాన్స్ చెయ్యాలనుంది" అనింది.నేను ఆమె నడిగాను,"నువ్వెప్పుడైనా డేగలా వినువీధి కెగిరి అక్కణ్ణించి ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్టు కలగన్నావా>ఒకరోజు అలాంటి ఒక కలనుంచి మేల్కొన్నాక చూస్తే నేలమీద పడి ఉన్నాను,మంచం మీద నుంచి పడి ఎముకలు విరగ్గొట్టుకోకుండా".ఆమెకి తెలుసు నేను తన గాలి తీసేస్తున్నానని.లండన్ చెరాక,మొట్టమొదటి ఫ్రీ లంచ్ టైం దొరగ్గానే ఆమె కోరుకున్న ఒక చిన్న రెస్టారెంటుకి వెళ్ళాం. నేను తననే ఆర్దర్ చెయ్యమన్నాను.చేశాక,నేను కూడా అదే తీసుకుంటానాని చెప్పాను,అదనంగా ఒక ఆరు ఆయిస్టర్స్ చేర్చి.ఆమె తను కూడా అవి తీసుకునింది.ఆమె ఆర్డర్ చేసిన మెయిన్ డిష్ వీల్ చేప.ఆమె "ఇక్కడి కొచ్చిన దగ్గర్నుంచి,వీల్ తినడానికి నాలిక పీక్కుంటున్నాను" అనింది.నేను ఆమెని వాత్స్యాయన కామసూత్రాలు చదివావా అనడిగాను.ఆమె :లేదు,ఏం>: అని అడిగింది.నేను ఆమెకి వాత్స్యాయ్నుడు పెళ్ళికి ఆరునెల్లల ముందునుంచ్గి కొత్తజంతకి వీల్ వడ్డించమన్నాదని చెప్పాను.ఆమె రామాయణ మహాభారతాలు కూడా చదవలేదు.ఆమెకి రామాయణంలో తెలిసిందల్లా వాళ్ళ అమ్మమం చిన్నప్పుడు చెప్పిందే.ఎన్ని విధాల చూసినా,ఆమె ఈ దేశపు సంస్కృతికి సంబంధించిన మనిషి కాదు.

          ఆమెకి కృత్రిమగర్భనిరోధకసాధనాలు వాడటం ఇష్టముండదు.ఒకసారి యాభైల మొదట్లో నావల్ల ఆమె గర్భవతయ్యింది.ఆమె అబార్షన్ చేయించుకోవడానికి నిశ్చయించుకుంది.ఆమె తనకి తెలిసిన బ్రిటిష్ హై కమిషన్ డాక్టర్ దగ్గిరకి వెళ్ళింది:కాని అతను ఒప్పుకోలేదు.దాంతో ఆమె తబ పుట్టింటికి వెళ్ళి అక్కడ ఒక నమ్మకస్తురాలైన లేడీ డాక్తరును ఏర్పాటు చేసుకుంది.ఈ ప్రయాణంలో ఆమె రెండో కొడుకును కూడా తీసుకెళ్ళింది.ఒక పదిహేను రోజుల తర్వాత తల్లీకొడుకులు ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచీ ఉన్న మాట్లాడ్డానికి సంబంధించిన సమస్య ఒకటి పోయిందన్న శుభవార్తతో తిరిగొచ్చారు.ఇదివర్లో ఆ పిల్లాదు "R" పలకలేకపోయేవాడు,తల్లి విపరీతంగా ఆందోళన పడుతూ ఉండేది;తల్లి స్పీచ్ కరెక్షన్ ఎక్స్పర్ట్ కోసం చలా హడావిడి పడింది.తిరిగొచ్చిన రోజు కలవగానే,మందులూ పాడూ అక్కర్లేకుండానే పనైపోయిందని చెప్పింది.

          ఆమె తండ్రికి మా ఇద్దరి అనుబంధం గురించి తెలుసా?తెలుసనే చెప్పాలి.ఎప్పుడు ఆమెతో కలిసి డిన్నరుకు వెళ్ళాలన్నా,ఆమె ఎక్కడ ఉంటుందో తనకి తెలుసు.బయలుదేరటానికి సరిగ్గా పదిహేనునిమిషాలకి ముందు,ఆమె తయారై నా రూము కొచ్చి కూర్చుంటుంది.సరిగ్గా టైముకి ఆయన నా గదిముందు నుంచి వెళ్తూ ఆమెని పిలిచేవాడు.

          1958 శీతాకాలంలో అనుకోకుండా ఒక దృశ్యాన్ని చూడాల్సొచ్చింది.లంచ్ చేసిన్ వెంటనే,ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి వెళ్ళాను.ఆమె అప్పటికే తలుపు మూసేసుకుని ఉంది,నేను తలుపు తట్టాను;ఒక అయిదు నిమిషాల తర్వాత తలుపు సగం తెరిచి సందులోంచి తొంగిచూసింది.కర్టెన్లు కిందకి దించి ఉన్నాయి,పొడుగాటి అందమైన యువకుడు,గడ్డం ఉన్న - ఒక బ్రహ్మచారి - రూములో ఉన్నట్టు కనిపించింది.నేను "నేను నీకో విషయం చెప్పాలి;సరే,తర్వాత చెప్తాన్లే" అంటూ తిరిగొచ్చేశాను.దాంతో మా ఇద్దరి బంధం తెగిపోయింది.ఆమె అది కేవలం "యోగా" అనీ "ఆధ్యాత్మికం" మాత్రమే ననీ నమ్మించడానికి చాలాసార్లు ప్రయత్నించింది.నేను తన సమర్ధనలన్నీ అనవసరం అన్నట్టు ఉండిపోయాను.నెమ్మదిగా ఆమె నామీద కోపం పెంచుకోవడం మొదలుపెట్టింది.నిజం చెప్పాలంటే,చివరాఖరికి బద్ధశత్రువుగా మారింది - నాకెప్పుడూ విలియం కాంగ్రేవ్ కవిత  గుర్తుకొస్తూ ఉండేది.

"Heaven has no rage like love to hatred turned; 
nor hell a fury like a woman scorned."

          ఆ సన్నివేశం జరిగిన పదిహేను రోజుల కల్లా అమే నాకు ఇష్టంగా రాసిన ప్రేమలేఖల్ని వెతికి ఆమెకి తిరిగిచ్చేశాను.ఒక సంవత్సరం తర్వాత పాత అకాగితాల్లో కొన్ని దొరికినాయి.వాతిని కూడా తిరిగిచ్చేశాను ఆమెకి.

          ఆమె భర్త చనిపోయేముందు రెండేళ్ళలో ఆమె భర్తా ఆమే కొంత దగ్గిరయ్యారని కొందరిలో ఒక అపోహ ఉన్నది.ఎవరేమి అనుకున్నా,వాళ్ళ మధ్యన రగిలింది హృదయాలు తిరిగి కలవననతటి కలహాగ్ని.అతను జబ్బు పడినప్పుడు దయగా ఉండటం సేవలు చెయ్యటం నిజమే.ఈ కాలంలో జరిగిన కొన్ని సన్నివేశాలు - అతన్ని సమాధి చేసినప్పుడు,భర్త అస్థికల్ని తీసుకోవటం అన్నీ ఒక ప్రచారవ్యూహంలోని భాగాలు.అవన్నీ ప్రజల్ని నమ్మించడం కోసమే,ఎందుకంటే అప్పటికే తను పూర్తి స్థాయి రాజకీయ జంతువుగా మారిపోయింది.

నేను ఎవరు?
23rd June, 1977

Friday, 18 December 2015

కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (శ్రీమతి ఇందిరా గాంధీ)

        "నేను ఇందిర కోడల్ని!ఎవరికీ భయపడను?" - ఒక కేసులో ముద్దాయిగా పేర్కొనబడి,కోర్టు వారు ఫలానా తేదీన హాజరు కమ్మని శ్రీముఖం పంపితే 2015లో అంతకు ముందు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని అప్పగించిన రెండు విడతల దశాబ్ద కాలపు అధికారంలో అవినీతిని ఇంటిపేరుగా చేసుకున్నంత ధీమాగా కుంభకోణాల పరంపరని ప్రోత్సహించి, ఆఖరి దశలో తత్వం బోధపడి కూడా ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాన్ని ఆ రాష్ట్రానికి చెందిన సొంత పార్టీ వాళ్ళు ఎంత మొత్తుకుంటున్నా వినకుండా చీల్చగూడని విధంగా చీల్చి లాభం పొందాలన్న పరమ బేఖారీ వ్యూహాలతో, దిక్కుమాలిన ఎత్తుగడలతో ఎన్నికలకి సిధ్ధమై కాగితాలు చూసి ప్రసంగాలు దంచే తనూ తను మాట్లాడుతున్నవి ఎన్నికల ప్రసంగాలు అని తెలియక "మా అమ్మ ఏడ్చింది" అంటూ "వుడ్వర్డ్స్ పట్టమని చెప్పు" అన్న జోకు మాదిరి ప్రసంగించే తన పుత్రుడూ చాలు పార్టీని ఉధ్ధరించడానికి అనుకుని, తీరా ఎన్నికల్లో అనుకున్నది ఒకటీ అయినది ఒకటీ అయి బండి బోల్తా కొట్టి అధికారం పోగొట్టుకుని అసహనం పెంచుకున్న శ్రీమతి సోనియా గాంధీ ఈవిధంగా ప్రతిస్పందించింది - భయపడనని చెప్తూ భయాన్ని దాచుకోవడానికా అనేది నా అనుమానం!నిజమే, ఈ కోడలి స్థానంలో ఉన్నమరుగుజ్జు ప్రస్తావించిన మహాకీర్తికాయురాలు శ్రీమతి ఇందిరా గాంధి తను భయపడకపోవటమే కాదు, ఇతర్లని భయపెట్టి ప్రతికక్షులతో "కాళిక" అనిపించుకుంది.స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని రాజకీయంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని అభాసుపాలై ఉందవచ్చు గానీ,పదవిని స్వప్రయోజనాలకి వాడుకోవటానికి వీలయినంతవరకు దూరంగానే ఉన్నాడు,చాలాసార్లు తనని వ్యతిరేకించిన ఎదటివారి అభిప్రాయాలకి విలువనిచ్చి తన వరకూ తను ప్రజాస్వామ్యాన్ని గౌరవించాడు.కానీ అతని శిష్యరికంలో ఎదిగిన అతని కూతురు శ్రీమతి ఇందిరా గాంధి మాత్రం పూర్తి విరుధ్ధమైన దారిలో నడిచి శుభకీర్తినీ అపకీర్తినీ సరిసమానంగా సంపాదించుకుంది!
        తెలిసో తెలియకో శ్రీమతి సోనియా గాంధీ రెండు పరస్పర విరుధ్ధమయిన చారిత్రక సన్నివేశాల్ని తను గుర్తు చేసుకుని మనకి గుర్తు చేసి అనాటి ఫలితాన్ని మళ్ళీ సాధించాలని ఆశిస్తున్నది. కానీ అప్పుడు శ్రీమతి ఇందిరా గాంధీ అనూహ్యమయిన ఫలితాన్ని అందుకున్న పరిస్థితికీ ఇప్పుడు శ్రీమతి సోనియా గాంధీ నిలబడి ఉన్న పరిస్థితికీ తేడాలు కూడా ఉన్నాయి.పోలికలు కలిసొచ్చి కాలం అనుకూల ఫలితాన్ని ఇస్తుందని కాంగ్రెసు ఆశిస్తున్నది,కానీ తేడాలు కలిసొచ్చి పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంభట్టు అన్నరీతిన ఎదురు తంతే?!ఈవిడ పోల్చుకుని మురిసిపోతున్న సన్నివేశం యేమిటంటే, శ్రీమతి ఇందిరా గాంధీ తను 1971 నాటి ఒకానొక ఎన్నికల్లో తప్పుడు పధ్ధతుల్లో గెలిచానని ఒక కోర్టు నిర్ధారించుకుని ఆ ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వటంతో, అల్లాటప్పా గోంగూర కట్ట పొలిటీషియన్ మాదిరిగా సిగ్గుపడి పదవి నుంచి దిగిపోకుండా, అప్పటి దాకా అమాయకంగా నడిచిన భారత రాజకీయ చరిత్రని బట్టి చూస్తే ఏ భారత రాజకీయ నాయకుడైనా ఇలాంటి పని చేస్తాడా అని సందేహమొస్తే చేస్తాడని ఎవరూ వూహించని ఒక మహాసాహసోపేతమైన నిర్ణయం తీసుకుని, 1975లో భారతదేశపు రాజకీయ చరిత్రలో చీకటియుగం అని పిలవదగిన అత్యయిక పరిస్థితిని దేశం మొత్తం మీద రుద్దేసి, 21 నెలల పాటు జంకూ గొంకూ లేకుండా తను దొరికిపోతాననుకున్న చీకటి తప్పులకి సంబంధించిన సాక్ష్యాల్ని చెరిపేసి, తర్వాతి ఎన్నికల్లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో అప్పటి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడి ఓడించి ఎమర్జన్సీ రోజుల్లో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్న కాలంలోనే - శత్రువర్గం చేసిన చిన్న పొరపాటును అమోఘమైన చాణక్యనీతి ప్రదర్శించి తన కనుకూలంగా మలుచుకుని జైలుపాలవ్వాల్సిన భవిష్యత్తుని లాఘవంగా వెనక్కి తిప్పి దెబ్బతిన్న ఆడపులిలా తిరగబడి ఇక ఎన్నటికీ రాదనుకున్న అధికార పీఠాన్ని తిరిగి అధిష్ఠించింది!
        ఈ రెండు సన్నివేశాల్లో ఉన్న మొదటి తేడా శ్రీమతి ఇందిరా గాంధీ కున్న రాజకీయ పరిణీతీ వ్యూహాత్మక చాతుర్యమూ ఈవిడకి లేకపోవటం!రెండవది ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ కున్న ఎమర్జనీ నాటి తప్పిదాలకి తాను కారణం కాదని తప్పించుకోగలిగిన "బెనిఫిట్ ఆఫ్ డౌట్" ఈనాడు ఈవిడకి లేదు - విదేశీ హస్తం అన్నమాటతో అన్ని విమర్శల్నీ కొట్టిపారేస్తే జనం పిచ్చోళ్ళ మాదిరి నమ్మేశారు!ఇప్పటి కేసు స్వయంగా తనూ తన కొడుకూ ఒకటో నెంబరూ రెండో నంబరుగా ఉదహరించబడిన అవినీతి కేసు - గొడవ ఎక్కువ చేస్తే జనానికి కేసు బలంగా ఉందేమో రుజువైతే జైలుకెళ్ళాల్సి వస్తుందని గోల చేస్తున్నారేమో నని అనుమానం వచ్చే ప్రమాదం ఉంది!అప్పుడు కూడా అనుభవ రాహిత్యం వల్ల అధికారంలో ఉన్నవాళ్ళు వ్యక్తిగత ప్రతిష్ఠల కోసం ఒకరినొకరు విమర్శించుకుని అప్పటికే జనంలో పలచన అయ్యారు,చరణ్ సింగ్ ఏమో మురార్జీ కన్నా నేనే పుడింగిని అని అనుకుని అన్యాపదేశంగా చురకలు వేస్తూ ఉండేవాడు,మధు లిమాయే రాజ్ నారాయణ్ ద్వయం ఎప్పుదూ భారతీయ జన సంఘ్ నాయకులతో పోట్లాడుతూ ఉండేవాళ్ళు,ఈ గొదవల్లో ఒకానొక దురదృష్టకరమైన సమయంలో ఇంత జరుగుతుందని అనుకోకుండా చరణ్ సింగ్ ఇందిరాగాంధీ మీద కేసు వెయ్యటం అన్యాయం అని చిన్న ఫీలర్ వదిలాడు - ప్రతి రాజకీయ నాయకుడికీ ఉండే తను మిగిలిన వాళ్ళ కన్నా ప్రత్యేకం,నేనైతే అలా చేసేవాణ్ణి కాదు అని చాటుకోవాలనే దురద కొద్దీ!మామూలు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళకయితే దాన్ని అంత గొప్పగా ఉపయోగించుకోవటం అస్సలు సాధ్యపడి ఉండేది కాదు,కానీ అక్కడ ఉన్నదెవరు?పూర్వకాలం రాజులకి చిన్నప్పణ్ణించీ నువ్వు పెద్దయ్యాక రాజువి కావాలి,అందుకోసం ఇవన్నీ నేర్చుకోవాలి అని శిక్షణ ఇచ్చి తయారు చేసినట్టు పెరిగిన రాజవంశపు తయారీ!
        ఇందిరా గాంధీని దేశప్రజలందరూ నమ్మి ఓట్లేసి గెలిపించారు గాబట్టి ఎమర్జన్సీలో అసలేమీ జరగలేదని అనుకోగలమా?లేదు,జరిగినాయనడానికి గట్టి సాక్ష్యాలే ఉన్నాయి,ఆవిడ శత్రువులు బలహీనులై వాటి సాయంతో ఆమె ఆతని కట్టించలేకపోయారు, అంతే!కేవలం రెందేళ్లలో తన మీద ఎమర్జన్సీ నేరాలకి సంబంధించి నిజనిర్ధారణ కమిటీ విచారణ జరుపుతుండగానే,తనని వారం రోజులు జైలులో ఉంచినా, మరెన్నో విధాలుగా ఈమెని డ్యామేజి చెయ్యాలని వాళ్ళూ తమ శక్తి కొద్దీ ప్రయత్నించినా ఎన్నికల నాటి పరిస్థితి "ఒక సివంగికి ఎదురుగా కోతుల గుంపు" అనే విధమైన వాతావరణాన్ని సృష్టించుకోగలిగిన శ్రీమతి ఇందిరా గాంధీ ఆధునిక కాలపు నాగమాంబ - మాయురే
        ఎమర్జన్సీ విధించటానికి కారణమైన అలహాబాద్ హైకోర్టు తీర్పులో ప్రస్తావించబడిన 1971 నాటి ఎన్నికలలో ప్రతిస్పర్ధి రాజ్ నారాయణ్ కోర్టు తీర్పుతో అధ్భుతమైన విజయాన్ని సాధించినట్టు,సాంకేతికంగా చూస్తే ఇందిరాగాంధి రెండు సార్లు ఓడిపోయినట్టు!అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా "firing prime minister for traffic ticket" అని వర్ణించినంత దిక్కుమాలిన పరిస్థితి తనది,కానీ వెంటనే సుప్రీం కోర్టులో ఆ తీర్పుని చాలెంజ్ చేసింది.సుప్రీం కోర్తు కూడా పార్లమెంటు సభ్యురాలిగా తను పొందుతున్న సకల సౌకర్యాల్నీ రద్దు చెయ్యాలనీ,వోటింగులో పాల్గొనరాదనీ కఠినంగా తీర్మానించి ప్రధానమంత్రిగా కొనసాగడానికి మాత్రం ధారాళంగా అనుమతి ఇచ్చింది,యెందుకో మరి?హై కోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచే నిరసనలు జరుగుతూనే ఉన్నాయిగా, ఆ నిరసన కార్యక్రమలో ఈ తీర్పు వచ్చిన మరుసటి రోజు జయపకాశ్ నారాయణ్ ఏ ప్రభుత్వాధికారి యైనా పోలీసు అధికారి అయినా పరిపాలించడానికి అర్హత లేని ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని అమలుపరచాల్సిన అవసరం లేదనేశాడు,సరిగ్గా లాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న శ్రీమతి ఇందిరా గాంధీ కేవలం 24 గంటల్లో అప్పటికి ఆనవాళ్ళు కూడా లేని పాకిస్తానుతో యుధ్ధప్రమాదాన్నీ ఎప్పటి నుంచో ఉన్న ఏలిన్నాటి శనిలాంటి కరువు భెబత్సాన్నీ కారణాలుగా చూపించి రబ్బరు స్టాంపు కన్నా విధేయుడైన ఫక్రుద్దీన్ ఆలీ అహమద్ చేతుల మీదుగా అత్యయిక పరిస్థితిని ప్రకటించి ప్రతి ఆరునెల్లకూ ఒకసారి వుత్తుత్తినే పొడిగింపు తతంగం చేస్తూ తనకి బోరుకొట్టి 1977లో ఎన్నికలు ప్రకటించే వరకూ కొనసాగిన ఈ రాజ్యాంగ రమణీ మానహరణ దుశ్శాసన పర్వంలో జరిగిన దారుణాలు  సమాచార వ్యవష్తని కూడా నిర్వీర్యం చెయ్యటంతో ప్రజలు తెలుసుకోలేకపోయారు - అదె ఈ అనైతిక రమణికి వరమైంది!ఎమర్జన్సీలో జరిగినది కేవలం ప్రజాస్వామ్యానికి పాతర వెయ్యటం మాత్రమే కాదు,అదొక వల్లకాటి అధ్వాన్న శకం!తల్లి అధికారంలో ఉండడం వల్ల తాను అనుభవిస్తున్న వైభవాల కొవ్వు అంగుళం మందాన పేరుకుపోయి తల్లి తర్వాత ఈ దేశానికి తనే అధినేతనని అనుకుంటున్న ఈవిడ సుపుత్రుడు జనాభా పెరుగుదలని అరికట్టటానికి చేసిన వికృత ప్రయోగం ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యనిది - తప్పనిసరి వంధ్యత్వం?!
        ఒకసారి సంజయ్ గాంధీ హిందీ చిత్రసీమకి చెందిన ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ని కాంగెసు ప్రచార గీతాలు పాదమంటే అతను తిరస్కరించాడు.దాని ఫలితం 1974 మే 4 నుంచీ ఎమర్జన్సీ ఎత్తివేసేవరకు ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న ఆల్ ఇండియా రేడియో,దూర దర్శన్ కార్యక్రమాలలో కిషోర్ కుమార్ గొంతు వినిపించకుండా పోయింది అప్పటి  ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ శాఖకి మంత్రిత్వం వెలగబెడుతున్న విద్యా చరణ్ శుక్లా అనధికారిక నిషేధం విధించదంతో!చూస్తున్న వెర్రిజనాలకి ఇదేమీ తెలియదుగా,వెర్రిమొగమేసుకుని చూపించినది చూట్టం తప్ప:-)అసలీ తల్లీ కొడుకుల మధ్యన ఉన్న అనుబంధం చాలా చిత్రమైనది.మామూలుగా మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రుల్ని విధిగా గౌరవించమనే సంప్రదాయపు సూక్తుల్ని నూరిపోయ్యటం,తలిదండ్రుల పట్ల కొంచెం విసుగుతో మాట తూలితేనే మనల్ని పంచమహాపాతకాలు చేసిన వాళ్ళలాగ తూర్పారబట్టి రౌరవాది నరకాల గురించి భయపెట్టి హడావిడి చేసే వాతావరణంలో పెరిగిన వాళ్ళకి ప్రధానమంత్రి పదవిలో ఉన్న తల్లిని నిట్టాడిలా ఎదిగిన కొడుకు పదిమందీ చూస్తుండగా కొట్టాడని వింటే నమ్మలేం?!కానీ నమ్మి తీరాలి,ఎందుకంటే ఆ విషయం చెప్పినది పులిట్జర్ బహుమతి గ్రహీత Lewis M Simons.అతని కధనం ప్రకారం ఒకసారి పొరపాటున చెయ్యి విదిల్చినట్టు అనుకోకుండా జరిగినది కాదట, కావాలని పోట్లాడుతున్నట్టుగానే కొట్టాడట - ఆరు సార్లు!ఒక ప్రైవేటు పార్టీలో ఆ సంఘటన జరిగితే ఆ పార్టీకి అటెందయిన ఇద్ద్దరు నమ్మదగిన వ్యక్తుల నుంచి వచ్చిన వివరం అది.వాళ్ళిద్దరూ తను ప్లాంట్ చేసిన వాళ్ళు కాదని కూడా చెప్తున్నాడు.అదీ గాక ఒక వ్యక్తి తమ ఇంట్లో పిచ్చాపాటీ కబుర్ల మధ్యన ఆ తల్లీ-కొడుకుల ప్రస్తావన వచ్చినప్పుడు తను స్వయంగా చూసిన ఈ సంఘటన గురించి చెప్పాడనీ,రెండవ వ్యక్తి తను అడిగితే కన్ఫర్మ్ చేశాడనీ చెప్తున్నాడు, నమ్మాల్సిందే!
        ఈ తల్లీ కొడుకుల చిత్రమైన వ్యవహార శైలిని అర్ధం చేసుకోవటానికీ పుత్రరత్నం తల్లి మీద ఎందుకు పెత్తనం చేస్తూ ఉండేవాడో తెలుసుకోవటానికీ తక్కిన వాళ్ళందరి మీదా పెత్తనం చేసే మహారాణి అతని పెత్తనాన్ని ఎలా సహించిందనే ప్రశ్నకి జవాబు వెతుక్కోవటానికీ సంజయ్ గాంధీ దుర్మరణం తర్వాత జరిగిన కొన్ని యాదృచ్చికంగా కనిపించే ఒకదాని కొకటి సంబంధం లేని వింత విషయాలు ఉపయోగపడతాయి!ప్రమాద వార్త విన్న వెంఠనే శ్రీమతి ఇందిరా గాంధీ అతని చేతి కున్న వాచీని గురించి వాకబు చెయ్యటం ఇప్పటికీ మిస్టరీయే - దుఃఖంతో సంచలించి పోవాల్సిన తల్లి స్థానంలో ఉన్న స్త్రీ ముఖంలో దుఃఖానికి బదులు ఆరా!అదే సమయంలో వీరి కుటుంబానికి ఏ మాత్రమూ సంబంధం లేని ముహమ్మద్ యూనస్ రక్తసంబంధీకుడు చనిపోయినట్టు తట్టుకోలేని దుఃఖంతో విల విల లాడటం చూస్తే ఎవరికయినా ఏమనిపిస్తుంది?పైగా సంజయ్ గాంధీ పుట్టింది దంపతు లిద్దరూ ఒకరి నొకరు ద్వేషించుకుని విడాకులు తీసుకోవటం ఒకటే తక్కువగా వేరువేరు జీవితాలు గడుపుతున్న కాలంలో?!ఈ ముహమ్మద్ యూనస్ రాసిన పుస్తకం Persons, Passions & Politics చదివితే అతనికి సంజయ్ గాంధీ అంటే ఉన్న అపారమైన ఆత్మీయత వెనుక ఉన్న నిగూఢత అర్ధమవుతుంది!
        శ్రీమతి ఇందిరా గాంధీ ఒకానొక చోట విలేఖరులు అడిగిన ప్రశ్నలలో తండ్రినీ తననీ పోల్చుకుంటూ "I am not new kid to plitics,my father is my teacher - he is saint but not me" అన్నది,నాకు నిజంగా మొదట షాకూ పిదప స్మైలూ వచ్చాయి.ఎందుకంటే అంతటి స్వేచ్చావిహారి బైరాగిలా కనిపిస్తే ఈమె ఇంకెంత ఘనాపాటీ అయి ఉండాలి!అయితే, రాజకీయ రంగంలో మాత్రం,మరీ ముఖ్యంగా విదేశాంగ నీతి విషయంలో తండ్రి కన్నా భిన్నంగా ఉండటం నాకు నచ్చింది.చైనా విషయంలో తండ్రి తత్తరపాటునీ దాని ఫలితాన్నీ చాలా దగ్గిర నుంచి చూసి ఉండటం వల్ల గాబోలు దేశరక్షణకి సంబంధించిన విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవటంలోనూ, ప్రపంచ వేదికల మీద ప్రసంగించేటప్పుడు మన దేశపు గొంతును బలంగా వినిపించటంలోనూ అద్వితీయమైన ప్రతిభని చూపించింది!అటు ప్రపంచ దేశాల ముందు అమాయకంగా మాట్లాడుతూ ఇటు రహస్యంగా అణ్వస్త్ర సముపార్జనని జరిపించటమూ, యుధ్ధ సమయాల్లో ఆమె చూపించిన తెగువా నిజంగా కొనియాదదగ్గవే!తండ్రి పొరపాట్లని చూసి ఉండటం కాఠిన్యాన్ని పెంచిందనుకోవటానికి వీలు లేకుండా తన రాజకీయ జీవితపు లేత యవ్వనప్రాయం లోనే ఇప్పటికీ ఆ తండ్రీ కూతుళ్ళలో ఎవరిని విమర్శించినా కారల్ మార్క్సుని విమర్శించిన దానికన్నా లబలబ లాడిపోయి మీదబడి తంతారేమోననే స్థాయిలో రెచ్చిపోయి తిట్లకి లంకించుకునే కమ్యునిష్టుల యేలుబడి లోని కేరళ ప్రభుత్వాన్ని మహిషాసుర మర్దినిలా తొక్కేసిన సంఘటన సాక్ష్యంగా ఉంది కదా, తన సహజ స్వభావమే స్త్రీ రూపంలో ఉన్న పురుషత్వం కావచ్చు - ఆడ చాణక్యుడు?!కానీ తండ్రి సమయంలో భయపడుతూ భయపడుతూ చాటుగా మాటుగా జరిగిన అవినీతి తన హయాములో రెక్కలు విప్పుకుని ఎగురుతుంటే చూస్తూ వూరుకోవటం, అధికారాన్ని ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించటానికి కాకుండా తనకు అంగరంగ వైభవాల్ని సనకూర్చుకోవటానికి ఉపయోగించుకోవటం లాంటివాట్ని ఎలా క్షమించగలం?
        ఎప్పుడైతే ఒక కోర్టు తన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చిందో స్వాభిమానం ఆభిజాత్యం అనే పెద్ద మాటలు వాడకుండా సిగ్గూశరం ఉన్నవాడు ఎవడయినా అక్కడ ఉండి ఉంటే కోర్టు తీర్పుకి కట్టుబడి పదవి నుంచి దిగిపోయి ఉండేవాడు,కనీసం తను అప్పీలు చేసుకున్న సుప్రీం కోర్తు కూడా దయదల్చి ప్రధానమంత్రిగా ఉండనిచ్చి పార్లమెంటు సభ్యత్వానికి సంబంధించిన సమస్త సౌకర్యాల్నీ వూడబెరికి, బిల్లుల మీద వోటు చెయ్యడానికి వీలు లేదని తీర్పు ఇచ్చినప్పుడయినా వెనక్కి తగ్గలేదు,ఎమర్జన్సీ కాలంలో పుత్రరత్నం అమాయక ప్రజల మీద చేసిన ఘాతుకాలు తెలిసినప్పుడు పశ్చాత్తాపం ప్రదర్శించ లేదు - ఇంత విపరీతమైన స్థాయిలో అధికారం పట్ల వ్యామోహం ధర్మాధర్మవిచక్షణజ్ఞానం గల సత్పురుషుడిలో ఉండటానికి ఆస్కారం ఉంటుందా?నీతి లేదు,రీతి లేదు,చట్టం లేదు,న్యాయం లేదు - తను అధికారంలో ఉండాలి, అంతే!

        అధికారం ఉన్నచోట బెల్లం చుట్టూ ఈగల్లాగ జనం గుమిగూడటం సహజమే గాదా,ఈ మాత్రం దానికే ఇదైపోవాలా,ఎమర్జన్సీ కాలంలో హరిత విప్లవమూ, 20 సూత్రాల కార్యక్రమమూ, ఇంకా కొన్ని మంచిపనులూ జరిగాయిగా, ఆమె పూనుకుని చేసిన మంచిపనులతో పోలిస్తే ఆవిడే సమర్ధించుకున్నట్టు అంతటా ఉన్న అవినీతిని పెద్దగా పట్టించుకోవటం అనవసరం పోనిద్దురూ అనుకుంటారు కొందరు!కానీ అట్లా ఆమె చుట్టూ చేరి ఆమెకి విధేయులుగా ఉంటూ "ఇందిరయే ఇండియా, ఇండియాయే ఇందిర" అని భజనలు చేసేవారు ఏ లాభమూ లేకుండా చేరుతారని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు.ఒకసారి ఆమె తను వెళ్తున్న విమానంలో వూరికే కలయదిరుగుతూ కార్గో విండో నుంచి లోపలికి చూస్తే రకరకాల సామాన్లతో మొత్తం నిండిపోయి ఉంది.అవి ఎవరివి అని ఆరా తీస్తే "మీ అంతరంగిక రక్షణ సిబ్బందివి!" అని జవాబు వచ్చింది.ప్రధానమంత్రి రక్షణ సిబ్బందిగా ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని ఆయా దేశాల్లో వారు చేసిన షాపింగు అది - అలా తక్కువ రేటుకి దక్కించుకున్న వాటిని అమ్మితే ఎంత తక్కువ లాభం కిట్టించుకున్నా లాభమేగా!ఒక దేశప్రధాని అంతరంగిక భద్రతా సిబ్బందిగా ఉన్న వాళ్ళకి పొరలుపొరలుగా ఉండే రాయితీల్ని లెక్కేస్తే వారిలో ఎవరూ తమ పర్సులో నుంచి ఒక్క రూపాయి కూడా బైటికి తీసి ఉండకపోవచ్చు, డౌటా?అసలు ఎమర్జెన్సీ అంత హఠాత్తుగా విధించినది తను చట్టానికి పట్టుబడకుండా ఉండటం కోసం ఆధారాల్ని చెరిపేసుకోవటానికే అయి ఉండవచ్చు!ఆవిడ హయాంలో మన దేశసంపద అంతకుముందు ఉన్న 70 రూపాయల కన్నా కొంచెం పెరిగి 100 రూపాయలు అయ్యిందనుకుంటే తనూ తన వందిమాగధులూ 40 రూపాయలు నొక్కేసి మిగతా దేశజనాభా కంతటికీ 60 రూపాయలు పంచితే దాన్ని యే రకంగా సమర్ధించాలి?!

        15 ఏళ్ళపాటు పాటు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇతర్ల దృష్టిని తన మీద ఉండేలా చూసుకుని ఈ దేశపు రాజకీయ వ్యవస్థ నంతా తన గుప్పిట్లో పెట్టుకుని తను సాధించిన ఘనకార్యం ఏమిటి?బతికి ఉన్నంత కాలం తనవల్ల లాభం పొందిన వాళ్ళే చచ్చిన మరుక్షణం నుంచి అన్ని రాజకీయ నిర్ణయాలకీ తననే బలిచేసి, తమకు పేరు తెచ్చుకోవడం కోసం తన మీద బురద జల్లుతూ పుస్తకాలు రాయడం లాంటి సిగ్గులేని పనులు చేశారు!భారతదేశపు రాజకీయ చరిత్రలో దుర్మరణానికి గురయిన తొలి ప్రధానిగా వినుతి కెక్కడం వెనుక ఉన్నది ఆమెని చంపిన శత్రువుల దుర్మార్గమా తన స్వయంకృతాపరాధమా ఏది సరైన కారణం అని నిగ్గదీసి అడిగితే ఎంత గట్టి సమర్ధకుడైనా నీళ్ళు నమలాల్సిన పరిస్థితి - నిరంతర విజయాలని కోరుకుని ఎవరికీ సాధ్యం కాని అలాంటిదాని కోసంఎండమావుల వెంట పరిగెత్తి ఎప్పటికప్పుడు పాతనీతులన్నీ పరగడుపే నన్నట్టు నీతిగల వాడెవ్వడూ చెయ్యగూడని తప్పులు చేస్తూ ఒక తప్పు బయటపడుతుంటే ఆ తప్పుని కప్పి పుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తూ ఆత్మని సుఖాలకి బలిపెట్టి పగ వాడికి కూడా కోరుకోగూడని బతుకు బతికింది!దేహాన్ని ప్రేమించేవాళ్ళకి ఆమె అందం అచ్చెరువు గొలుపుతుంది,భోగాన్ని ప్రేమించేటట్లయితే ఆమె కట్టిన చీరలు ప్రతి ఆడదానికీ నచ్చుతాయి,విజయాన్ని ప్రేమించేవాళ్లకి ఆమె సాధించిన విజయాలు అధ్భుత మనిపిస్తాయి - కానీ ఆత్మని విలాసాలకి బానిసని చెయ్యకుండా నైతికతకి విలువ నిచ్చేవాళ్ళకి పంజాబీలు శ్రీమతి ఇందిరా గాంధీని ఎందుకు అసహ్యించుకుంటున్నారో తెలిస్తే ఆమె చరిత్ర వెగటు పుట్టిస్తుంది - మళ్ళీ ఇటువంటి రాజకీయ వేత్త ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండు ననిపిస్తుంది!

        సహజంగా సిక్కులు శాంతిప్రియులు,సాధుజీవనులు!ప్రతి జాతిలోనూ ఇవి మామూలుగా ఉండే మంచి లక్షణాలే,కానీ వారిలో ఇంకే జాతిలోనూ కనిపించని మరో రెండు విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి - హాస్యప్రియత్వం,పోరాటతత్వం!మీరూ నేనూ మరెవరయినా సరె మనల్ని ఎవరయినా అవహేళనగా ఒక చిన్న మాట అంటేనే రోషం పొడుచుకొస్తుంది, అక్కడికక్కడ అవతలి వాణ్ణి చంపెయ్యాలన్నంత పగతో రగిలిపోతాం.కానీ సర్దార్జీ జోకుల పేరుతో ఎన్ని వందల జోకులు వేసినా వారు కోపం తెచ్చుకోలేదు,పైగా ఎంతో స్పోర్టివ్ మెంటాలిటీని చూపించారు.ఒకాయన అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్న సందర్భంలో ఒక సర్దార్జీ జోకును వారిలో ఒక సర్దార్జీ కూడా ఉన్నందువల్ల మొహమాట పడి బీహారీ బాబుల పేరుతోనో మరో పేరుతోనో చెప్తుంటే ఆ సర్దార్జీ "ప్రపంచంలో ఉన్న సర్దార్జీలంతా చచ్చారనుకున్నావా ఏం?అది మా జోకు,మరొకళ్ళ కెట్లా కలుపుతావు!" అని గద్దించాడట.అంతటి హాస్యప్రియులు ఖలిస్థాన్ ఉద్యమ కాలంలో కనబడిన ప్రతి సిక్కునీ ఇతను కూడా ఖలిస్థాన్ ఉగ్రవాదియేమో అనే విధంగా చూస్తుంటే వారెంత క్షోభించి ఉంటారో!కాకతాళీయంగా జరిగిందో లేక సిక్కులు మనస్థాపానికి గురవడం వల్ల జరిగిందో తెలియదు గానీ అప్పటినుంచీ దేశంలో సిక్కులు కనబడటం అదివరకటికన్నా తగ్గిపోయిందనిపిస్తున్నది నాకు!ఖలిస్థాన్ ఉగ్రవాదం పూర్తిగా శ్రీమతి ఇందిరా గాంధీ బ్రెయిన్ చైల్డ్ అనటానికి ప్రముఖ పాత్రికేయుడు కుల్ దీప్ నయ్యర్ ప్రస్తావించిన ఒక సన్నివేశం తిరుగులేని సాక్ష్యం!తమ ఇద్దరి అంతర్గత సంభాషణలో తను అప్పుడే ఈ వ్యూహం మంచిది కాదు,ఫలితం వికటించి భవిష్యత్తు దారుణంగా ఉండవచ్చు,సిక్కులని ఇలా హింసపేటవద్దు అని తను చెప్పినట్టూ దానిని ఆమె బేఖాతరు చేసి తన వ్యూహానికే కట్టుబడినట్టూ తన వ్యాసాల్లో ఒక చోట ప్రస్తావించారు.భారతదేశం లోనేకాదు,ప్రపంచంలోని జర్నలిష్టు లందరిలోనూ ఎన్నదగిన వ్యక్తి అబధ్ధం చెప్పడు.కేవలం జల్లో ఉన్న అభిమానంతో అధికారం చేపట్టిన అకాలీదళ్ ప్రాప్యులారిటీని తగ్గించి తన పార్టీ మాత్రమే పంజాబును పరిపాలించగలదు అని ప్రకటించుకోవటనికి పంజాబీల్ని ప్రపంచం ముందు ఉగ్రవాదులుగా నిలబెట్టిన దుష్ట రాజకీయాన్ని ఒక వివేకం గల వ్యక్తి చెప్పినా వినకుండా ఏళ్ళ తరబడి సాగించిన వ్యక్తిని మహమ్మారి అని గాక ఇంకేమి అనగలం?!

       ఆఖరికి గత చరిత్రలోని అలాంటి వ్యూహాలన్నీ బెడిసికొట్టినట్టుగానే,కుల్ దీప్ నయ్యర్ గారు హెచ్చరించినట్ట్టుగానే ఏకు మేకయి తను సృష్టించిన భూతం తన పరిధిని దాటి పెరుగుతున్నప్పుడు కోర్టు తీర్పును గౌరవించటానికి బదులు ఎమర్జన్సీ పెట్టిన పధ్ధతిలోనే ఆ భూతాన్ని చంపటానికి సైన్యాన్ని పంపించింది - అదీ తిన్నగా సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం పైకి!ఏమి రాజకీయం అది?అడుసు తొక్కనేల, కాలు కడుగ నేల!ఒక వ్యక్తి తను చేసిన పాపం కట్టికుడిపి తన తప్పులకి పరిహారంగా ప్రాణం పోగొట్టుకుంటే కాంగ్రెసు పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఒక త్యాగశీలిని హతమార్చిన సిక్కుల దుర్మార్గంగా పులిమేసి ఒక్క ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే 2,000 మంది సిక్కుల్ని దిక్కులేని వాళ్ళుగా చేశారు!ప్రజలు వాళ్ళంతట వాళ్ళు ఈవిడ మీద అభిమానంతో చేసిన దారుణాలు కావవి, చోటా మోటా కాంగ్రెసు నాయకుల దగ్గిర్నుంచి మంత్రులు, పార్లమెంటేరియన్లు దగ్గరుండి పర్యవేక్షిస్తూ చేసిన దుర్మార్గాలు.తరవాతెప్పుడో పెదవి చివరి క్షమాప్నలు రెండు ముక్కలు గాల్లోకి వదిలారేమో గానీ ఏ మాత్రమూ సిగ్గు పడకుండా ఇప్పటికీ ఆ దారుణాలు చేసిన తమ పార్టీ వారిని ఈషణ్మాత్రపు మందలింపులు కూడా చెయ్యకుండా కోర్టు శిక్షల నుంచి తప్పించటానికి పదరాని పాట్లు పడుతున్నారు.అయినా ఈ దేశంలో కాంగ్రెసుకి జనం వోట్లు వేస్తున్నారు - ఆశ్చర్యం?!

        నాస్తికులూ కమ్యునిష్టులూ ఎప్పటికీ అర్ధం చేసుకోలేరు గానీ ఏ మతం వారైనా తాము ఇంట్లో పూజించే చిన్న ప్రతిమ లాంటిది పొరపాటున తమ చేతినుంచే జారి కిందపడితే ఆ రోజంతా ఎంత ఆందోళన పడతారు?తమ వల్ల జరగరాని అపరాధం ఏదో జరిగిపోయిందని కంగారు పదతారు గదా!అలాంటిది ప్రతి రోజూ స్వర్ణ దేవాలయ సందర్శన చేస్తున్నప్పుడు ఆ గోడల మీద తుపాకీ గుళ్ళకి పెచ్చులూడిన భాగాల్ని చూస్తుంటే మనసు దుఃఖంతోనూ కోపంతోనూ దహించుకుపోదా?తన తప్పుడు వ్యూహానికి మన జాతిని కించపరిచిందని తెలిసిన వాళ్ళెవరయినా ప్రతీకారం తీర్చుకోకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటారా - అందులోనూ సిక్కులు?!సిక్కులు ఎంతటి శాంతిప్రియులో అంతటి వీరయోధులు, వారి పోరాటతత్వం ఇతరు లెవరికీ సాధ్యం కానిది!ఒకసారి ఉద్దాం సింగ్ సాహసాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఈ పేరును తల్చుకుంటుండగానే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి!డయ్యర్ నేరాల్ని విచారిస్తున్న కోర్టులో మొదటి నుంచీ చివరి వరకూ తను కూడా ఉన్నాడు.లాయరుగా ఆ కేసు పట్ల ఉన్న ఆసక్తిని చూపించి పిటిషను వేసి వెళ్ళీ కూర్చున్నాడు.తీర్పు ఎటూ డయ్యరుకి అనుకూలంగానే వస్తుందని తెలుసు.ఆఖరి నిముషంలో చేసిన పనినే అక్కడ ఏ క్షణంలోనైనా చెయ్యగలడు, కానీ చెయ్యలేదు!మనస్సులో జ్వాలలు రగుల్తున్నా మొహంలో భావాలు కనబడనివ్వకుండా ఉండటం మామూలువాడికి సాధ్యం కాదు.పక్కనున్న వాళ్లకి ఏ మాత్రం అనుమానం రాకుండా సొల్లు కబుర్లు చెప్తూ కూర్చోవటం కూడా అలాంటిలాంటివాళ్ళు చెయ్యలేరు.కానీ ఆ ఉద్దందపిండం మాత్రం తను కోరుకున్న క్షణం తన కళ్ళ ముందు నిలబడేవరకూ చాలా ప్రశాంతంగా ఉండి ఆఖరి క్షణంలోనే తను చెయ్యాలనుకున్నది చేశాడు - గెలిచానని విర్రవీగుతూ అట్టహాసంగా కోర్టుమెట్లు దిగుతున్నప్పుడే య్యర్ని  చంపాడు, సరిగ్గా బియాంత్ సింగ్ ద్వయం చేసింది కూడా అదే కదా!

        శ్రీమతి ఇందిరా గాందీ నివాసగృహాన్ని ఆమె చనిపోయిన చోటుతో సహా స్మారకస్థలంగా మార్చిన తర్వాత 2014లో రెందవసారి సందర్శిస్తున్న ఒక సందర్శకురాలికి చాలా చిత్రమైన అనుభవం కలిగింది.ఆమె పేరు దీప్తా రాయ్ చక్రవర్తి ప్రముఖ న్యాయవాది,గణితశాస్త్రజ్ఞురాలు,అతీంద్రియ అనుభవాల మీద పరిశోధనలు చేస్తున్న వ్యక్తి - రచయిత్రి కూడా!ఆమె అనుభవాన్ని ఆమె మాటల్లోనే వింటే ఏమి కనబడి అతీంద్రీయ శక్తులతోనూ అలాంటి అనుభవాలతోనూ పరిచయం ఉన్న అంతటి మనిషి కూడా భయపడిందో తెలిస్తే మనకీ ఒళ్ళు జలదరిస్తుంది:

        "నేను మొదటిసారి పన్నెండేళ్ళ వయసప్పుడు  వెళ్ళాను.బుల్లెట్లకి చిద్రమైన కాషాయ వర్ణపు చీరనీ అక్కడి గాలిలో ఉన్న దిగులునీ ఇప్పటికీ మర్చిపోలేను.ఇదే ఇల్లు ఇదే కుటుంబంలోని మరొక హత్యకు గురైన ప్రధానమంత్రికి కూడా స్మారకస్థలమే.శ్రీమతి ందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ 1991లో ఒక ఆత్మాహుతి దాడిలో తునాతునకలై పేలిపోయి గుర్తుపట్టటానికి వీల్లేనంత దయనీయమైన చావుకి గురయితే దొరికిన మట్టుకు శకలాల్ని ఏరి ఒక గాజు పెట్టెలో ఉంచారు.గాజుపెట్టె అడుగున పక్కపక్కన నిలబెట్టిన రెండు శిధిలమైన బూట్లు ఒక చచ్చిన సైనికుడు ఇంకా నడకలోనే ఉన్నట్టు కనబడుతున్నాయి..

        రెందవసారి నేను వెళ్ళీంది కొంచెం పెద్ద్దయ్యాక కాలేజి రోజుల్లో.ఢిల్లీలో ఉన్న జీసస్ అండ్ మేరీ కాలెజిలో మ్యాధమేటిక్స్ చదివేటప్పుడు వారాంతాల్ల్లో కొన్ని ముఖ్యమైన స్థలాల్లో తిరుగుతూ అలాంటి ప్రత్యేకమైన చోటుల్లో  ఉండే అతీంద్రీయ వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉండేదాన్ని.అది నడివేసవి కావటంతో బైట ఉన్న 40 డిగ్రీల వేడితో పోలిస్తే చల్లగా అనిపించింది.గోడల నిండా పేపర్ క్లిప్పింగులు పరుచుకుని ఉన్నాయి.శ్రీమతి ఇందిరా గాంధీ ఆఖరి క్షణాల్లో ధరించిన ఆ పాత చీర  నాకు గుర్తున్నట్టే గాజు తెరల వెనక నుంచి కనబడుతూనే ఉంది.


   ఈసారి కొంచెం దగ్గిర కెళ్ళి చూశాను.ఆ వతావరణంలో నేను ఇదివరకు వచ్చినప్పుదు ఫీలైన అదో రకమైన దిగులు అలాగే ఉన్నా ఎందుకో ఇప్పుడా చోటులో కొత్తగా నూతనోత్సాహం కనబడుతుండటం నాకు కుతూహలాన్ని కలిగించింది.ఆ కాటన్ చీర మీద పరుచుకున్నబుల్లెట్ కన్నాలూ నెత్తుటి మరకలూ కాలం దాని ప్రభావం అది చూపించటం వల్ల ఒక శాశ్వతమైన ముద్రని వేసినా,ఇప్పుడా చీర కొత్త రకం శక్తి తరంగాల్ని సకారణంగానే వెదజల్లుతున్నట్టు కనిపిస్తున్నది.ఆ చీరను ఒకప్పుడు ధరించిన శ్రీమతి ఇందిరా గాంధీ ఇప్పుడు ఆ చీరలోకి ఆమెయొక్క ఆశయాలూ వ్యామోహాలతో అమాంతంగా వచ్చేసి నట్టుంది.ప్రస్తుతం తనున్న స్థితిలో తన ఆశలు నెరవేరే అవకాశం లేదని తెలిసిన నిరాశ కూడా ఉంది.అపరిమితమైన అధికారాన్ని కోరుకుని,దాన్ని కన్నబిడ్దల కన్నా ఎక్కువగా ప్రేమించి,దానిమీదనే బతికిన ఒక స్రీని హఠాత్తుగా దానినుంచి లాగేస్తే ఆ స్త్రీ ఎలా ఉంటుందో ఈ చీర కూడా అలాగే ఉంది.


        అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బియాంత్ సింగ్ ద్వయం తమ వ్యూహం అమలు చెయ్యటానికి సరిగ్గా ముందురోజున ,అంటే అక్టోబర్ 30,1984న ఒరిస్సా లోని భువనేశ్వర్ దగ్గిర ప్రసంగిస్తూ "నా తుది శ్వాస వరకూ ఈ దేశానికి సేవ చేస్తూనే ఉంటాను,ఒకవేళ నేను చనిపోతే నా ప్రతి రక్తపు బొట్టూ ఈ దేశాన్ని శక్తివంతం చేసి సమైక్యంగా నిలబెడుతుంది" అన్నది.

        అదే ఆమె ఆఖరి ప్రసంగం!శ్రీమతి ఇందిరా గాంధీ మనసులో కూడా తనకిక చావు తప్పదని తెలిసిన సంచలనం మొదలైందా!దుర్మార్గుల నోతినుంచి తన చావును తనతోనే చెప్పించే హరిమాయ లీలావినోదమా అది?ఇద్దరు రాజ వంశీయుల దేహాల నుంచి గగుర్పాటును కలిగించే విధంగా జారిన రక్తాన్ని ఇముడ్చుకున్న ఈ భవనం కనబడుతున్న వాటికన్నా నిగూఢమైన వాటిని వేటినో గొప్పగానే దాస్తున్నది.


        అక్కడికి కొన్ని మీటర్ల దూరంలోనే శ్రీమతి ఇందిరా గాంధీ చివరిసారి నడిచినంత మేర స్ఫటికంతో కప్పి ఉంచారు.ఒక నదీప్రవాహపు దిశని సూచిస్తున్నట్టు అక్కడొక సైన్ బోర్డ్ ఉంది.అలలు కదుల్తున్నట్టు కనబడే స్పెషల్ ఎఫెక్టు గూడా ఉంది.సరిగ్గా శ్రీమతి ఇందిరా గాంధీ కూలిన చోటుని మార్క చేశారు.చెట్ల మధ్యనుంచి ప్రతిఫలించే సూర్యకాంతిలో స్నానమాడుతూ ఆ ప్రదేశమంతా చాలా అందంగా ఉంది.ఇక్కడి వరకూ మనం నడిచి వచ్చిన స్థలాల వల్లా మనం చూసిన వస్తువుల వల్లా మనలో కలిగిన భావావేశాలన్నిటికీ ఇది పతాక సన్నివేశం!1854లో ప్రముఖ శాస్త్రవేత్తా వేదాంతీ అయిన Baron Von Reichenbach స్ఫటికంలో ఒక రకమైన జీవశక్తి ఉంటుందని చెప్పాడు.స్ఫటికానికి జ్ఞాపకాల్ని నిక్షిప్తం చేసుకునే శక్తి ఉందట.ఇక్కడి లౌడ్ స్పీకర్ల నుండి మళ్ళీ మళ్ళీ వినబడుతున్న శ్రీమతి ఇందిరా గాంధీ ఆఖరి ప్రసంగం ఆమె ప్రభని తిరిగి పైకెత్తటానికి జపిస్తున్న ఉచ్చాటన మంత్రం లాగుంది.


        ఇంటి లోపల ఉన్న చీకటికీ దిగులుకీ భిన్నంగా ఈ ఆరుబయట మెరుస్తున్న నీరెండ వింతగా ఉంది.ఈ కనిపిస్తున్న దృశ్యమంతా ఒక అధికార దాహంతో తపించిపోతున్న శక్తిలో ఉండే అసంతృప్తి చేత ఆవరించబడి ఉన్నట్టుంది.నేనంతా తన లోకి ప్రవేశించిన జీవించి ఉన్నవారి నుంచి  ఆశల్నీ వాంచల్నీ పీల్చుకుని బలపడే ఒక తిమింగలం కడుపులో ఉన్నట్టు ఇబ్బందిగా ఆనిపించి ఆ దారికి చివర్న కనపడుతున్న బైటికి వెళ్ళే గేటు వైపుకి గబగబా నదవటం మొదలుపెట్టాను.
బైట రోడ్డు మీద హారన్లు మోగించుకంటూ తిరుగుతున్న కార్ల చప్పుళ్ళు వినిపిస్తూ మళ్ళీ మానవప్రపంచంతో సంబంధం కలిగినట్టయి రిలీఫ్ అన్పించింది.ఇంతలో నా వెనక ఇంకో విజిటరు కాబోలు పరిగెత్తుకొస్తున్నట్టు అడుగుల చప్పుడు వినబడింది - వగరుస్తున్న చప్పుడు కూడా!నాకు ఆశ్చర్యమనిపించింది,ఈ పరిసరాల్లో ఎవరికైనా అంత వేగంగా పరిగెత్తాల్సిన అవసరం ఏముంది?అంతలోనే అంతా నిశ్శబ్దం, బహుశా ఆ మనిషి నా ఆలోచనల్ని చదివి ఆగి నిశ్చలంగా ఉండిపోయినట్టు, అపుడు, మళ్ళీ ఒక నిట్టూర్పు!కుతూహలం ఎక్కువై వెనక్కి తిరిగి చూశాను నేను అప్పుడే తిరిగి వచ్చిన మలుపు వైపుకి. యెన్ని నిమిషాలు గడిచినా ఎవరి అలికిడీ లేదు.మళ్ళీ స్ఫటిక శిలాప్రవాహం వరకూ వెళ్ళాను.ఇప్పుడు నేనున్న చోటు నుంచి చూస్తే ఎవరైనా రెండో వైపు ఉన్నవాట్ని కూడా స్పష్టంగా చూడొచ్చు.ఒక ఖాకీ డ్రస్సులో నిశ్చలంగా నిలబడ్డ గార్డు ఉన్నాడు,ఇద్దరు కాలేజి కుర్రాళ్ళు గాజు ప్లాక్ లొపలికి తొంగి చూస్తూ కనిపించారు.వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు.

        సరిగ్గా అప్పుడే రెండు మానవాకారాలు యేదో మాట్లాడుకుంటూ ఆ ఇంటివైపుకి వెళ్తుండటం చూశాను.ఈ చెట్లూ చేమల మధ్యనుంచి హఠాత్తుగా నడకదారిలో ప్రత్యక్షమయ్యారు.వాళ్ళిద్దరూ ఇప్పుడు నేనున్న వైపుకి వస్తున్న కాలేజి కుర్రాళ్ళ జంటని దాటుకుని వెళ్లారు,కానీ ఒకరినొకరు పట్టించుకున్నట్టు కనిపించ లేదు.ఒకానొక క్షణంలో భుజాలూ భుజాలూ తగుల్తాయేమో అన్నంత దగ్గిరగా వెళ్ళినా ఏ జంటా రెండో జంట వైపు తల తిప్పలేదు,మర్యాదకయినా చూపులు కలపలేదు.ముఖాలు ఎటూ నాకు కనపదవు గనక వాళ్ళని వెనక నుంచే పరిశీలనగా చూశాను.తల్లి పొట్టి జుట్టుతో దృఢమైన ఆకృతితో ఉంది.కొడుకు కొంచెం భారీగానే కనబడుతూ ఉండి కుర్తా - పైజమాలో ఉన్నాడు.నిజంగా వీళ్ళు ఆ తల్లీ కొడుకు లేనా?ఇంకా అధికారం నిలబెట్టుకోవటం ఎట్లా అని వ్యూహాలు పన్నుతూనే ఉన్నారా?ఇప్పటికీ కోతరెలు ఏర్పాటు చహెసుకోవటం కోసం,సపోర్తర్లని పెంచుకోవటం కోసం లాబీయింగులు చేస్తూ రాజ్యాధిపత్యం తమ వంశం నుంచి జారిపోకుండా ఉండేటందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారా?మళ్ళీ తమ ప్రాభవం చిగురించ బోతున్నదని తెలిసి హదావిడిగా రహస్య సమావేశానికి వెళ్తున్నారేమో!
"

        పోనీ శ్రీమతి ఇందిరా గాంధీ అనే ఒక వ్యక్తి చేసిన దారుణాలకి మొత్తం పార్టీని నిదించడం దేనికి అనుకున్నా,పొనీ మిగిలిన వారు చెసిన దారుణాలకి శ్రీమతి ఇందిరా గాంధీ అనే ఒక్క వ్యక్తిని బాధ్యురాల్ని చెయ్యడం దేనికి అనుకున్నా ఆ రెంటికీ విడివిడి ఆస్తిత్వం లేదు గదా!ఒక రాజకీయ పార్టీలో గానీ ఒక సమాజంలో గానీ అగ్రభాగాన కనబడే ఆ ఒక్క వ్యక్తీ కింది నుంచి పైకి విస్తరించుకుని ఉన్న ఒక సంస్కృతికి దర్పణం అయినప్పుడు దశాబ్దాల తరబడి జరిగిన తప్పులకి ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది.ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల సమయానికే కాంగ్రెసు ప్రజాభిమానాన్ని పూర్తిగా కోల్పోయింది.అప్పుడు అంతులేని ప్రజాభిమానాన్ని పెంపొందించుకుని ప్రచండశక్తిలా కాంగ్రెసుని ఢీకొన్నది ఎవరో తెలుసా!ఇపుడు కాంగ్రెసుకి ఎడమభుజాల్లా మారిన వామపక్షాలు అని పిలువబడే రెండు రాజకీయ పక్షాలూ కలిసి ఉన్న భారత కమ్యునిష్టు పార్టీ!అప్పటి వాతావరణాన్ని గురించి పెద్దలు చెప్పినదాని ప్రకారం కమ్యునిష్టులు వస్తున్నారని తెలిస్తే పల్లెటూళ్ళల్లో వారిని పోలేరమ్మ గంగానమ్మ లాంటి గ్రామదేవతలకి కట్టినట్టు ప్రభలు కట్టి వూరేగిస్తూ తోడ్కొని వెళ్ళేవాళ్ళు సామాన్య ప్రజలు!అయినా కమ్యునిష్టులు ఎందుకు వోడిపోయారు?ఆనాటి చరిత్ర తెలియని కుర్రాళ్ళు ఇవ్వాళ ఎన్నికల్లో కులప్రసక్తి,ధనబలం,వ్యసన ప్రేరేపణం లాంటివాటి గురించి విసుక్కుంటూన్నారు గానీ ఆనాటి తొలి ఎన్నికల నుంచే కాంగ్రెసు వాటిని తారాస్థాయిలో ప్రయోగించింది - ప్రజాభిమానం లేకపోయినా అధికారం మనకే కావాలి అనే పట్టుదలతో!వింతేమొటంటే ఎన్నికలు సజావుగా జరిగితే ప్రపంచంలోనే మూడో కమ్యునిష్టు దేశంగా భరతదేశాన్ని నిలబెట్టేటందుకు తమకు దక్కాల్సిన పూర్తి అర్హత ఉన్న స్థానం నుంచి అంత కిరాతకమగా నెట్టివేసిన కాంగ్రెసు పట్ల కమ్యునిష్టు పార్టీ ఏ మాత్రమూ కోపాన్ని చూపించకపోవటం!కామన్ సెన్సుతో కూడిన మామూలు పొలిటికల్ స్ట్రాటజీ పరంగా చూసినా కాంగ్రెసు యొక్క దుర్నీతిని ప్రజల ముందు ఎండగట్టి ఉండాల్సింది పోయి న్యాయంగా తనకి దక్కాల్సిన అధికారాన్ని తమనుంచి గుంజుకున్నవారిని అపరిమితమైన పొగడ్తలతో ముంచెత్తడం బుర్రలో గుజ్జు ఉన్నవాడెవడయినా చేస్తాడా:-)

        ఏ ఒక్క చారిత్రక తప్పిదం నుంచీ ఏ ఒక్క గుణపాఠమూ నేర్చుకోకుండా మళ్ళీ మళ్ళీ చారిత్రక తప్పిదాలు చేస్తూ అనంతకాలం వరకూ వర్గరహితసమాజం కోసం పోరాడుతూనే ఉండగలిగిన గతితార్కిక చారిత్రక భౌతికవాదపు సిధ్ధాంతుల గురించి మనకెందుకు గానీ అసలు కాంగ్రెసు పార్టీ వాళ్ళు తమ పార్టీకి నేతృత్వం వహించడానికీ వారిని అగ్రభాగంలో ఉంచుకుని వారి ప్రభావక శక్తిని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చి భారతదేశాన్ని పరిపాలించడానికీ ఆ ఒక్క కుటుంబాన్నే ఎందుకు అప్రకటిత వంశపారంపర్య సంప్రదాయంతో ముందుకు తీసుకొస్తున్నారు?ఈ దేశాన్ని పరిపాలించడానికి ఇంకెవ్వరికీ లేని శక్తియుక్తులు కేవలం ఆ కుటుంబానికే ఉన్నట్టు ఆ కుటుంబంలోని వారు కాకుండా ఇంకెవ్వరు పరిపాలించినా ఈ దేశానికి ప్రమాదం అనే భావనని ప్రజల్లో ఎందుకు పెంచి పోషిస్తున్నారు?వేరే పార్టీ ప్రభుత్వంలో ఉన్నంత కాలం భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి నేలకొనదనే మూఢనమ్మకాల్ని గూడా ప్రచారం చెయ్యడం అటుంచి తమ పార్టీలోనే ఇంకెవ్వరూ సమర్ధులు లేనట్టు మాటిమాటికీ ఆ కుటుంబం నుంచి వస్తే చాలు ఎంతటి దేభ్యమ్మొహాన్నైనా సరే మోసి తరిస్తూ అన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాల్నీ గాలికొదిలేసి రాజభక్తి లాంటి విధేయతని ప్రదర్శించడానికి కారణం ఏమిటి?శ్రీమతి ఇందిరా గాంధీ అంటే తొలి యవ్వన కాలం నుంచీ రాజకీయ నాయకులతో అతి దగ్గిరగా తిరిగింది గాబట్టి ఇంకా తన తండ్రికి సహాయకూరాలిగా కూడా పని చేసింది కాబట్టి అప్పటికి రాజకీయ రంగంలో చాలాకాలం ఉంచి ఉన్నదని సరిపెట్టుకోవచ్చు,కానీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే సమయానికి కనీసం కాంగ్రెసు పార్టీ కార్యకర్తగానే లేడు - రాజకీయాలకి దూరంగా విదేశాల్లో తన బతుకు తను బతుకుతున్నవాణ్ణి తీసుకొచ్చ్జి ప్రధానమంత్రిని చేశారు.అంత హడావిడి చేసి తీసుకొచ్చినందుకు దక్కిన ఫలితం ఏమిటి?షాబానో కేసులో ముస్లిముల మనోభావాలకి వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెసుకి అప్పటివరకూ ఉన్న బలమైన వోటుబ్యాంకుని దూరం చేసేశాడు.అంతగా కాంగ్రెసు పార్టీ ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకు వస్తున్నప్పుడు ఆ కుటుంబం యొక్క చరిత్రని గురించి కూడా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇంతవరకూ మేధావులమనుకునేవారికి ఎందుకు కలగలేదు?
        ఈ వంశవృక్షంలో రెండు అతి ముఖ్యమైన వైరుధ్యాలు ఉన్నాయి.ఒక రకంగా చెప్పాలంటే వాస్తవం ఏమిటనేది ఎప్పటికీ తెలియని మిస్టరీలు.సాధారణంగా హిందువులలో అందులోనూ వీరు కాశ్మీరీ బ్రాహ్మణులు అని చెప్తున్నారు గాబట్టి బ్రాహ్మణులలో ఇంటిపేర్లు హఠాత్తుగా పుట్టుకు రావు.ప్రతి  బ్రాహ్మణుడికీ గోత్రం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది భరద్వాజ,కశ్యప,కౌండిన్య లాంటి ఒక వైదిక ఋషికి సంబంధించిన ధార!ఇంటిపేర్లు వారికి అంత ముఖ్యం కాదు గాబట్టి అవసరార్ధం కొత్త ఇంటిపేర్లుగా చీలితే చీలవచ్చు - కానీ దానికి అవకాశాలు చాలా చాలా తక్కువ?!ప్రాచీన కాలం నుంచీ ఉన్న ఇంటిపేరు అయితే ప్రతి ఇంటిపేరుతోనూ ఒకటి కన్నా ఎక్కువ కుటుంబాలు కనబడతాయి.కానీ కాశ్మీరు భూఖండం మొత్తాన్ని కంచుకాగడా వేసి వెతికి అయినా సరే ఈ ఇంటిపేరుతో మరో కుటుంబం ఎక్కడయినా ఉందేమో ఎవరయినా కనిపేట్టి చూపించగలరా?శ్రీమతి ఇందిరా గాంధీ ఆడపిల్ల గాబట్టి వేరేవాళ్ళని పెళ్ళి చేసుకోవడం  వల్ల ఇంటిపేరు మారింది గానీ ఆమె తండ్రి శ్రీమాన్ జవహర్ లాల్ నెహ్రూకి తాతగారైన శ్రీమాన్ గంగాధర నెహ్రూ నుంచి కిందకి దిగుతూ వస్తున్న ఈ కొద్దిమందే తప్ప ఇంకెవరూ ఈ ఇంటిపేరుకి సంబంధించిన వారు కనబడటం లేదు,ఎందుకని?గంగాధర నెహ్రూ తలిదండ్రుల గురించి గానీ అన్నలూ తమ్ముళ్ళూ అక్కలూ చెల్లెళ్ల గురించిన వివరాలు ఏమీ తెలియడం లేదు, ఎందుకని?కరువు లొచ్చినా వరద లొచ్చినా ఇంకేమి జరిగినా ఆ ఇంటిపెరుతో ఉన్న మిగతా అందరూ నశించిపోయి ఈ ఒక్క కుటుబమే బతికి బట్టకట్టడం అయితే మిస్టరీ అయినా కావాలి లేకుంటే ఫాంటసీ అయినా కావాలి గానీ హిస్టరీ మాత్రం ఇలాంటి కట్టుకధల్ని ఒప్పుకోదు కదా!
        భారతదేశంలోని వంశచరిత్రలకి సంబంధించి అసలు పరిశోధనలు జరగడం లేదని కాదు,కానీ ఈ కుటుంబ చరిత్రని గురించి మాత్రం అధికారికంగా ఎటువంటి పరిశోధనలూ జరగవు.స్వతంత్రించి కొందరు ఔత్సాహికులు తమంత తాము పరిశోధనలు చేసి తేల్చిన విషయాలు మాత్రం నమ్మలేనివి గా ఉన్నాయి.1857 తిరుగుబాటుకి ముందు ఢిల్లీలో ఘియాసుద్దీన్ ఘాజి అనే ఒక కొత్వాలు ఉండేవాడు.అయితే తిరుగుబాటును అణిచివేసే సమయంలో శత్రుశేషం మిగలకూడదని ఇంగ్లీషువాళ్ళు సిటీలో ఉన్న మొఘల్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న వాళ్ళందర్నీ వెతికి పట్టుకుని మరీ చంపుతూ ఉండటంతో చాలామంది మొఘల్ సర్దారులు ప్రాణాలరచేత బట్టుకుని పారిపోయారు.అయితే మొఘలులకి అనుకూలంగా ఉన్నారని నిర్ధారణగా తెలిసిన వాళ్ళు తప్ప మిగిలిన హిందువులు ఇంగ్లీషువాళ్ళ దృష్టిలో లేరు గనక ఫ్రెంచ్ విప్లవం నాడు ఆడవేషాలేసుకుని సరిహద్దులు దాటి లండను కొచ్చి పడిన ఫ్రెంచ్ జమీందారుల మాదిరి హిందువులుగా పేర్లు మార్చుకుని ప్రాణాలు కాపాడుకున్న బతకనేర్చిన వాళ్లలో ఈ ఘియాసుద్దీన్ ఘాజి ఒకడు, అప్పటికి బుర్రకి తగిలిన గంగాధర్ అనేదాన్ని ఒంటిపెరుగానూ ఎర్రకోట పక్కన ఉన్న ఒక కాలవని ఇంటిపెరుగానూ మార్చుకుని బతికిపోయాడు!Through out the world, we do not find any descendant other than that of Gangadhar, having the surname Nehru. The 13th volume of the “Encyclopedia of Indian War of Independence” (ISBN:81-261-3745-9) by M.K. Singh states it elaborately.

        ఇవన్నీ చాలాకాలం నుంచీ చాలామంది కాంగ్రెసువాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ అడుగుతూనే ఉన్నారు.కానీ ఇదంతా కాంగ్రెసు మూలస్తంభాలని అవమానించటానికి హిందూ మతతత్వవాదులు చేస్తున్న విషప్రచారం అని కొట్టిపారేసి మేము జవాబు చెప్పం పొండి అని భీష్మించుకోవటమే తప్ప వీటిని ధైర్యంగా అబధ్ధాలని ఖండించనూ ఖండించడం లేదు,కనీసం అసలు నిజమేమిటో సాక్ష్యాధారాలతో నిరూపించి వీళ్ళ నోళ్ళు మూయించనూ మూయించడం లేదు.ఎన్నిసార్లు తప్పించుకోవాలని చూసినా ఈ ప్రశ్నలు కాంగ్రెసువాళ్ళని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటాయి.ఒకనాటికి జవాబు చెప్పక తప్పనిసరి అయినప్పుడు అప్పటికి ఉన్న కొన్ని ఆధారాలు కూడా గాలిలో కలిసిపోయి బిక్కమొగం వెయ్యాల్సిన దిక్కుమాలిన పరిస్థితి రావచ్చు.ఎప్పటికైనా జవాబులు చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించి ఇప్పటికయినా కాంగ్రెసువాళ్ళు జవాబుల కోసం పరిశోధన మొదలుపెడితే బాగుంటుంది.పోయిన అధికారం తిరిగి దక్కించుకోవడానికి ఆమె పధ్ధతుల్ని వాడితే అధికారం దకించుకున్నాక మళ్ళీ ఎన్నిక చెల్లదని కోర్టులు తీర్పులిస్తే ఎమర్జన్సీ పెట్టటం, తనకి నచ్చని అకాలీదళ్ ప్రభుత్వాన్ని బలవంతంగా లాగిపారేసి ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టటం లాంటివి చెయ్యదని గ్యారెంటీ ఉందా?అదీగాక తల్లీ కొడుకు లిద్దరూ మ్మెమ్మెమ్మే బెబ్బెబ్బేలని తెలిసి కూడా ఆ కుటుంబం నుంచే నాయకత్వాన్ని మన మీద రుద్దాలనుకుంటున్న ఇప్పుడు అసలు కుటుంబం యొక్క మూలాల్ని గురించి మనం కూడా నిగ్గదీస్తే తప్పేమిటి?

        రాచపీనుగ తోడు లేకుండా వెళ్ళదన్నట్టు తన పాపాలకి తను ఆహుతై చస్తూ చావులో కూడా కొన్ని వేల మంది అమాయకుల్ని బలి తీసుకున్న మనిషిని పొగుడుతున్న వాళ్ళు, ఆ మనిషి వల్ల సిక్కు జాతికి జరిగిన అన్యాయం పట్ల మనస్పూర్తిగా సానుభూతిని కూడా ప్రకటించలేని వాళ్ళు, మళ్ళీ మళ్ళీ అవే పధ్ధతుల్లో అవే నికృష్టమైన పనులు పునరావృతమయినా పరవాలేదనుకుంటున్నవాళ్ళు దేశంలో ఎంతమంది వున్నారు అని లెక్క తెలియాలంటే ఇప్పటికీ కాంగ్రెసుకి పడుతున్న వోట్లని లెక్కిస్తే చాలు!


అబధ్ధాలతో చరిత్రని నిర్మించాలనుకునేవాళ్ళు అధికారంలో ఉండకూడదు - ప్రమాదం!
________________________________________________________

1    2    3    4    5    6                                     (తేదీల వివరాలు:వికీ పీడియా,చిత్రాలపీటిక:గూగుల్)

Tuesday, 25 November 2014

కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (జవహర్ లాల్ నెహ్రూ)

ఈ దేశంలోని ప్రతి రేణువు లోనూ రామపాద స్పర్శ వుండాలని కోరుకుని ఇక్కడ సీత కూర్చుంది,ఇక్కడ రాముడు మారీచుణ్ణ్ణి చంపిన బాణాన్ని కడుక్కున్నాడు అని తమ తమ ప్రాంతాల్ని రాముడితో అనుసంధానించుకునే ప్రజలకి ఒక స్రీలోలుడు యెలా ప్రతినిధి అయ్యాడు?ఇక్కడి ప్రజల సంస్కృతీ సాంప్రదాయాల్ని గౌరవించని వాడు ఇక్కడి ప్రజలకు తిరుగులేని నాయకుదు యెట్లా అయ్యాడు!తన మంత్రివర్గ సభ్యుడూ యుధ్ధాన్ని పర్యవేక్షిస్తున్న రక్షణ మంత్రీ అయిన సాటి దేశభక్తుడు నేనిక్కడ శత్రువుని తరిమి కొడుతున్నాను సమస్య పరిష్కారమైపోతుంది ఒక్కరోజు ఆగమన్నా ఆగకుండా పనిగట్టుకుని కాశ్మీరును వివాదంగా మార్చి అంతర్జాతీయ ప్రమేయానికి దఖలు పర్చేసి అనంత కాలం వరకూ పరిష్కరించలేని పీటముడిగా తయారు చెయ్యటం వెనుక తన ప్రియురాలైన - ఆ శీలవతి కూతురు కూడా అంగీకరించిన - ఒక విదేశీ వనిత ప్రమేయం వున్నదని తెలిశాక కూడా అతన్ని దేశభక్తుడని కీర్తించడం ఈ దేశాన్ని ప్రేమించే వాడెవడయినా చెయ్యదగ్గ పనేనా?




స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధానికి మొదటి గవర్నరు జనరల్ గా నిన్నటిదాకా తామంతా ఈ దేశం నుంచి యెవర్ని తరిమి కొట్టాలని అంత పోరాటం చేశారో ఆ ఇంగ్లీషువాడు తప్ప భారతీయుడెవడూ పనికి రాలేదా? తన ప్రియురాలితో మరికొన్ని రోజులు కులకాలన్న ఆరాటం తప్ప మిగిలిన ఇంగ్లీషు వాళ్ళంతా యెప్పుడో తట్టాబుట్టా సర్దుకుపోయినా ఆ ఒక్క ఇంగ్లీషువాణ్ణి ఇంకా ఇక్కడే వుంచడానికి కారణ మేమిటి? కొత్తగా స్వతంత్రం తెచ్చుకుని దేశం సక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ఈ దేశభక్తుడు తీరిగ్గా ఇంగ్లీషు రాజుకు "Your Highness" అని సంబోధిస్తూ తను వుంచుకున్నదాని మొగుడు అయిన మౌంటు బాటము గారికి సర్ బిరుదు తక్కువయిందనీ అది ఇవ్వవలసిందనీ వుత్తరాలు రాస్తూ గడిపాడని యెవరికయినా తెలుసా? ఇంగ్లీషు రాజే అసలు వూడగొట్టిన నాగటి దుంప!పైన ఒక సామంతుడు చక్రవర్తిని సంబోధించినట్టుఈ విదేశీ భావజాలపు బానిస చేసిన సంబోధన? ఆ వుత్తర మేదో ఆ దేశ ప్రధాని చేతిలో పడివుంటే అప్పుడే భారత ప్రధాని పిచ్చిపుల్లయ్యతనాన్ని ప్రపంచానికి పెద్ద జోకులాగా చెప్పి పరువు తీసి వుండేవాడు!!




ఈ దేశపు స్వాభిమానానికి ప్రతీక అయిన వందే మాతర గీతం జాతీయ గీతం కాకుండా చెయ్యాలని సభలోనే వున్న ఆదర్శవంతులయిన ముస్లిము సభ్యులు కూడా ఆమోదిస్తున్నా బజారు వెధవల్ని సంతోష పెట్టాలని - ప్రధానిగా వున్నందుకు కనీసం తటస్థంగా నన్నా వుండకుండా - తనే మిగిలిన వాళ్ళకి రాని వంకల్ని కూడా పెట్టి వ్యతిరేకించిన వాణ్ణి కూడా దేశభక్తుడు అని అంటున్నారే, ఇక దేశద్రోహులు యెవరండీ?! మహోన్నతమయిన బావ పరంపరతో సమున్నతంగా నిలబడి యెక్కడయినా ప్రధమ స్థానంలో నిలబడాల్సిన మంత్రగీతాన్ని దాని కాలిగోటికి కూడా సరిపోలని ఒక మామూలు రణగొణ పాట కిందకి దించి రెండో స్థానానికి దిగజార్చుతుంటే చేష్టలుడిగి నిల్చున్నారు అప్పటి దేశభక్తులంతా ఈ గాడిదని ప్రధానిని చేసి! ఇవ్వాళ రహమాన్ అనే సచ్చా ముసల్మాన్ "మా తుజే సలాం" అని గొంతు నిండుగా గానం చేస్తే యే గాడిద అడ్డం పడ్డాడు? బిస్మిల్లా ఖాన్ నాదస్వరంలో పలికించిన "వాతాపి గణపతిం భజేహం" లోని సంస్కృత పదాల కన్నా ఘోరమైనవా వందే మాతరం లోని సంస్కృత పదాలు!వందే మాతరం పాడొద్దని చెప్పిన ప్రవక్త "వాతాపి గణపతిం భజేహం" గురించి చెప్పడం మర్చిపోయాడా? "మూర్ద్నివా సర్వలోకస్య శీర్యతే వనయేవవా" అనేది నమ్మే నాలాంటి క్షాత్రం గలవాడు యెవడయినా ఆనాడు వుండి వుంటే, "చీ! ఆ రెండో స్థానం మాత్రం దేనికి?యెవడికి గౌరవం వుంటే వాడే పాడుకుంటాడు!" అని ఆ రెండో స్థానానికి కూడా యెట్టి పరిస్థితి లోనూ ఒప్పుకుని వుండేవాడు కాదు?!




1889 నవంబర్ 14న కాశ్మీరు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మోతీలాల్ నెహ్రూ అనే ఒక సంపన్న బారిస్టరుకు ప్రధమ కుమారుడుగా జవహర్ లాల్ నెహ్రూ జన్మించాడు. తల్లి స్వరూపరాణి కూదా లాహోరు లో స్థిరపడిన  సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందినదే. బాల్యంలో చెప్పుకోదగిన సంఘటన లేమీ జరగక పోయినా పంతుళ్ళే ఇంటికొచ్చి చదువు చెప్పే వైభవోపేతమయిన జీవితంతో పెరిగి పెద్దవాడయ్యాడు! తండ్రి మోతీలాల్ రాజకీయ వ్యాసంగంలో చురుగ్గా వుంటూ భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి రెండుసార్లు అధ్యక్షుడిగా పని చేశాడు! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన 1912లో లండన్ నుంచి బారిస్టరు గిరీ పూర్తి చేసుకుని రాగానే పేరుకి అలహాబాదు హైకోర్టులో బారిస్టరుగా నమోదు చేసుకున్నాడు గానీ దానికన్నా రాజకీయాలే సుఖంగా అనిపించడంతో పాట్నా కాంగ్రెసు మహాసభకు హాజరై అక్కడి నుంచీ తొలి తరం వారసత్వ రాజకీయపు వైభవం యొక్క ప్రదర్శన మొదలు పెట్టాడు!




ఇతనికి అప్పటి కాంగ్రెసు "కొద్దిగా ఇంగ్లీషులో ప్రవేశమున్న వున్నత కులీనుల సమూహం యొక్క హడావిడి వ్యవహారాలు"గా కనబడినప్పటికీ, కాంగ్రెసు యొక్క ప్రభావశీలత్వం పైన సందేహాలు వున్నప్పటికీ పార్టీ కార్యకలాపాల్లో - అంటే, మోహన దాసు గాంధీ నడుపుతున్న పౌరహక్కుల ప్రచార కార్యక్రమాలకి చందాలు పోగెయ్యటం లాంటివాటిల్లో మనస్పూర్తిగానే పాల్గొన్నాడు? తను కూడా ప్రచార సభల్లో పాల్గొన్నాడు.1914లో ప్రధమ ప్రపంచ యుధ్ధ ఫలితం భారత దేశంలోని మేధావుల్లో మిశ్రమ స్పందన కలిగించింది. కొందరు ఇంగ్లీషు వాళ్ళకి నడ్డివిరిగి కూలబడటాన్ని చూడటం ఆనందాన్ని కలిగిస్తే మరి కొందరు ఇంగ్లీషువాళ్ళతో తమకున్న అనుబంధం వల్ల విచారించారు! నెహ్రూ మాత్రం ఫ్రాన్సు పైన సానుభూతి చూపించాడు ఆ దేశపు సంస్కృతిని ఆరాధించే వాడు గనక!పుట్టిన దేశపు సంస్కృతిని తప్ప అన్ని దేశాల సంస్కృతుల్నీ ఆరాధించిన ప్రమాదవశాత్తూ హిందువైన ఇతడికి హిందూ ధర్మం మాత్రం దేశంలో వుండదగనిదిగా కనిపించింది? ఆఖరికి మూకుమ్మడి దొమ్మీలని పశుబలంతో గెలవడం తప్ప ఇంకేమీ లేని చెంగిజ్ ఖాన్ తైమూరు లంగ్ లాంటివాళ్ళలో కూడా ఇతనికి అధ్బుతమయిన నాయకత్వ లక్షణాలు కనిపించాయి? ఇంకా పార్టీ స్థాయిలో మాత్రం "స్వాతంత్ర్యాన్ని గూర్చి వూహించటమే పిచ్చితనం" అని భావించే గోపాల కృష్ణ గోఖలే లాంటి మితవాదుల ప్రభావం బలంగానే వున్నప్పటికీ ఈ యుధ్ధానంతర రాజకీయాల్లో రాడికిల్స్ అనే గ్రూపులో చేరిపోయి విజృంభించటం మొదలు పెట్టాడు .




తను కూడా మితవాదే అవటం వల్ల తండ్రి బాబూ వేరే "ప్రాక్తికల్ ఆల్టర్నేటివ్" లేదురా అని ప్రైవేటు చెప్పినా వుద్యమం మరీ అంత నెమ్మదిగా కదలడాన్న్ని భరించలేక "హోం రూల్" కోరుకునే అతివాదుల్లో కలిసిపోయాడు ఖాజీ సాయిబు గారు తురకల్లో కలిసిపోయినట్టు:-) 1915లో గోఖలే గారు కీర్తిశేషుడవటంతో తిలక్, అనీబిసెంటు లాంటి వాళ్ళంతా యెంత గట్టిగా హోం రూలు కోసం ప్రతిపాదించినా అంతటి భయంకరమయిన ప్రతిపాదనని తక్కిన మితవాదులు నిర్ద్వందంగా తిరస్కరించెయ్యటంతో అది వీగిపోయింది. అతివాదులు కూడా మొండికెత్తి అనీబిసెంటు ఒకటీ తిలక్ గారు ఒకటీ హోం రూల్ లీగుల్ని పెట్టి సమాంతరంగా పోరాడటం మొదలు పెట్టారు.నెహ్రూ రెంటిలోనూ సభ్యుడయినా అనీబిసెంటు తోనే యెక్కువగా తిరిగాడు. ఇదే సమయంలో జరిగిన మరొక ముఖ్యమయిన విశేషం నెహ్రూకి బాగా లాభించింది!అదే 1916   దెసెంబరులో లక్నో ఒప్పందం పేరుతో భారత జాతీయ కాంగ్రెసుకూ ముస్లిం లీగుకూ మధ్యన జరిగిన "హిందూ ముస్లిం ఐక్యతా ఒప్పందం". దీని సూత్రధారి రెంటిలోనూ సభ్యుడై హోం రూల్ వుద్యమంలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్న మహమ్మదాలీ జిన్నా! ఈ లక్నో ఒప్పందానికి కర్తా కర్మా క్రియా అన్నీ జిన్నానే, అందుకే సరోజినీ నాయుడు "the Ambassador of Hindu-Muslim Unity" అని ఇతన్ని ప్రశంసించింది.




ఇందులో బెంగాలు విభజన అనంతరం పలుకుబడి తగ్గిన ముస్లిము లీగుకి మళ్ళీ గౌరవనీయత పెంచడం అనే వ్యూహం దాగి వుంది! అసలు ముస్లిము లీగు మొదట కాంగ్రెసు పేరుతో హడావిడి చేసే హిందూ గుంపు నుంచి రక్షణ కోసం రాణికి విధేయంగా వుండే వుద్దేశంతో పుట్టిందని మొదటి భాగంలో తెలుసుకున్నాం కదా! కానీ ఇంగ్లీషు వాళ్ళు ఖలీఫా పట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది ఇంగ్లీషువాళ్ళకి దూరంగా జరగాలనుకోవడం కూడా కలిసొచ్చింది? ఈ మొత్తం ప్రక్రియకీ నెహ్రూకీ వున్న సంబంధం యేమిటంటే ఈ ప్రతిపాదన ఆనంద భవన్ లో "All-India Congress Committee" నుంచి ఒక సూచనగా మొదలవటం!




ఈ మలుపు తర్వాత నెహ్రూ మాట్లాడిన ప్రతి పలుకూ వేసిన ప్రతి అడుగూ హిందూ ముస్లిం సమైక్యతా పరిరక్షకుడిగా జిన్నా స్థానాన్ని ఆక్రమించడానికే!అందుకోసం ఇతడు హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడేటంతగా దిగజారి పోయాడు. ఈ దేశం నుంచి విడిపోయి తన కొక దేశాన్ని సాధించుకున్న జిన్నా యేనాడయినా ఈ దేశపు సంస్కృతినీ హిందూత్వాన్నీ అవమానించాడా? నాకు తెలిసినంత వరకూ మీ హిందువుల వల్ల మా ముస్లిములకి ప్రమాదం అని సైధ్ధాంతికంగా వాదించటం తప్ప పరుషమయిన భాష వాడలేదు. ఒకవేళ వాడినా అతడు హిందువు కాదు గాబట్ట్టి తెలియక అన్నాడని క్షమించ వచ్చు!. ఒక హిందువు "భారత దేశంలో మతం పేరుతో ప్రచలితమవుతున్న దంతా, సంస్థాగతమయిన నిర్మాణం కలిగినవన్నీ నన్ను ఆగ్రహావేశాలకు గురి చేస్తున్నాయి, చాలాసార్లు నేను దీన్ని వ్యతిరేకించాను, నేను దీన్ని పూర్తిగా వూడ్చి పారెయ్యాలనుకుంటున్నాను. ఈ మతాన్నీ సంస్కృతినీ పూర్తిగా నాశనం చెయ్యాలనుకుంటున్నాను. ఇది గుడ్డి నమ్మకాలకీ, పరపీడన పరాయణత్వానికీ చిహ్నంగా నిలబడి వుంది" అని ప్రకటించగలిగాడంటే - ఆలోచించండి?! తేనెటీగ పువ్వుల మీద వాలి మకరందాన్ని తయారు చేసి ఆనందాన్ని కలిగిస్తుంది. పోతుటీగ శ్లేష్మం చేత  ఆకర్షించబడి దానిలో ముంచిన పాదాలతో మన మీద వాలుతూ అసహ్యాన్ని కలిగిస్తుంది. మాక్స్ ముల్లర్ లాంటి విదేశీయులకి గొప్పగా కనిపించిన హిందూ ధర్మంలో ఇతనికి ఇవే కనబడినాయన్న మాట? ఈ దేశాన్ని గురించి తెల్సుకోవడానికి విదేశీయులు  "ఇండాలజీ" అనే ఒక శాస్త్రాన్ని యేర్పాటు చేసుకుంటే ఈ దేశంలో పుట్టిన ఈ మనిషికీ ఇతని మార్గంలో నడిచే ఇతరులకీ ఈ సనాతన ధర్మం సిగ్గుపడదగినదిగా కనిపించిందన్న మాట! విజ్ఞత గలవాడు తను పాటించే ధర్మంలో తప్పు లుంటే అందరితోనూ చర్చించి సంస్కరించి మరింత గౌరవప్రదంగా నిలబెట్టాలని చూస్తాడే తప్ప ఇతనిలా ద్వేషిస్తాడా?ఈ మొత్తం నాటక మంతా జిన్నా కన్నా తనే ముస్లిం పరిరక్షకుడిగా యెదగటానికి చేసిన దిగజారుదు రాజకీయమే తప్ప అతని మాటల్లో గంభీరమయిన తాత్విక చింతనతో కూడిన విమర్శనాత్మక దృక్పధం నాకయితే యెక్కడా కనబడ లేదు?




చౌరీ చౌరా సంఘటన తో మోహన దాసు హఠాత్తుగా అన్ని కార్యక్రమాల్నీ ఆపెయ్యడాన్ని మిగతా వాళ్ళందరికన్నా యెక్కువగా వ్యతిరేకించినప్పటికీ తండ్రి మోతీలాలుతో సహా అందరూ బయటి కెళ్ళి స్వరాజ్ పార్టీని స్థాపించినా వాళ్ళతో వెళ్ళకుండా గాంధీని వదలకుండా అంటిపెట్టుకుని కూర్చున్నాడు? వ్యక్తిత్వంలో గానీ నాయకత్వ పటిమలో గానీ పార్తీకి మేలు చేసే యెత్తుగడలు వెయ్యటంలో గానీ ఇతని కన్నా అఖండులయిన వాళ్ళంతా అనేకానేక కారణాల వల్ల కాంగ్రెసుకి దూరమవడం వల్ల కలిగిన శూన్యం కారణంగా మోహన దాసు ఆశీస్సులతో యే చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమన్నట్టు ఇతడు మర్రి చెట్టులా యెదిగిపోవటానికి తోడ్పడింది.




ఈ దేశ విచ్చిత్తికి కారకుడయిన వాడిగా జిన్నాను అపార్ధం చేసుకుంటారు గానీ ముస్లిములకు రక్షకుడిగా యెదగటం కోసం నెహ్రూ చేసిన ద్విముఖవిషప్రచారం - "హిందూ నాయకు లందర్నీ వీలయినంత మతమౌఢ్యం గలవాళ్ళుగా చిత్రించటం, హైందవేతరులు దుర్మార్గు లయినా సరే అపార్ధాలకి గురయిన వాళ్ళుగా చిత్రించటం"  వల్లనే ముస్లిములలో అంతగా భయాందోళనలు రగిలాయనేది యెంతో నిశితంగా పరిశీలించి చూస్తే తప్ప అర్ధం కాని విషయం! అప్పటికే ద్విజాతి సిధ్ధాంతం ప్రచారంలో వున్నా జిన్నా మొదట్లో దేశ విభజన వైపుకి అంత తొందరగా అడుగులు వెయ్యకుండా నిగ్రహంగానే వున్నాడనేదీ, దేశాన్ని విడిపోకుండానే వుంచి హిందూ ముస్లిం ఐక్యత కోసమే కృషి చేశాడనేదీ తెలిస్తే గానీ యెవరు నిజమైన ద్రోహులో తెలియదు!


1928 నాటికి గాంధీని ఒప్పించి "dominion status" ప్రకటన చేయించగలిగాడు నెహ్రూ. రెండు సంవత్సరాల లోగా భారత్ కు "dominion status" ఇవ్వకపోతే ఇక కాంగ్రెసు "complete independence" పిలుపు నిస్తుందనేది నెహ్రూ ప్రమేయంతో మోహన దాసు చేసిన ఆ బెదిరింపు సారాంశం! రెండు సంవత్సరాలు కూడా యెక్కువే ననిపించి మళ్ళీ తనే పూనుకుని గాంధీని ఒప్పించటంతో ఆ పరిమితి సంవత్సరానికి కుదించబడింది? ఇదివరకటి అన్ని దిమాండ్ల లాగే దీన్ని కూడా పట్టించుకోలేదు బ్రిటిషు వాళ్ళు. దానితో తానే అధ్యక్షత వహించి 29 డిసెంబర్ 1929లో "పూర్ణ స్వరాజ్" పిలుపు నిచ్చాడు. ఈ లాహోరు కాంగ్రెసు మహా సభ తర్వాత గురువు క్రమంగా వెనక్కి తగ్గి శిష్యుడికి దారి ఇవ్వడంతో 1935లో యేర్పడిన అర్ధంతర ప్రభుత్వాల నాటికి నెహ్రూ దుర్నిరీక్షమయిన మహానేతగా యెదిగాడు.


1930ల్లోనే రెండుసార్లు కలాత్తా మేయరుగా యెన్నికై పాలనా సంబంధమయిన విషయాల్లో అధ్బుతంగా రాణించిన సుభాష్ చంద్ర బోసు ఇతనికన్నా యెన్నో విధాల సమర్ధుడు. అయినా సరే అంతర్గత ప్రజాస్వామ్య సాంప్రదాయం ప్రకారం అఖండమయిన మెజార్టీతో పార్టీ అధ్యక్షుడిగా బోసు యెన్నికవడాన్ని జీర్ణించుకోలేక గురు శిష్యులిద్దరూ ఆ ఓటమిని అక్రమ పధ్ధతుల్లో గెలుపుగా మార్చుకున్న సన్నివేశం లోనే కాంగ్రెసు అప్పటికీ ఇప్పటికీ నైతికతకి యెంత గొప్పగా కట్టుబడుతుందో తెలిసిపోతుంది. ఆ ఇద్దరూ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అత్యున్నత ఆదర్శాలకి కట్టుబడిన వాళ్ళయితే బోసు రాజీనామా చేసి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి వుండేది కాదు. వాళ్ళే పార్టీ పదవులకి రాజీనామా చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళే వాళ్ళు!




1937లో "provincial states" నాటికే నెహ్రూ కాంగ్రెసు పార్టీలోనూ దేశపు సామాజిక రంగస్థలం మీదా ఒక ప్రజాసామ్య ప్రభువుగా అవతరించేశాడు?! అప్పటికే ప్రజలకి "కాంగ్రెసు అంటే ప్రభుత్వం" అని అర్ధమై పోయింది. పరిస్థితి యెలా వుందంటే, "కాంగ్రెసు యేం చెప్తే అదే శాసనం. నెహ్రూ యేం చెప్తే అదే కాంగ్రెసు చెప్తుంది.". అప్పటి నెహ్రూ వైభవాన్ని చూసి రష్యా వాడు కృశ్చేవ్ "Democratic Dictator" అనే బిరుదు కూడా ఇచ్చేశాడు!ఈ "provincial states"లో మత ప్రాతిపదికన హిందువులకీ ముస్లిములకీ ప్రత్యేక నియోజక వర్గాలు యేర్పాటు చెయ్యడానికి ఒప్పుకున్న మోహన దాసు దళితుల దగ్గిర కొచ్చేసరికి మాత్రం అరిభీకరంగా వ్యతిరేకించేశాడు! అప్పటి నుంచీ ఇప్పటి వరకూ గొప్పగా అనిపిస్తున్న ఈ కుహనా సెక్యులరిజంలో వున్న అసలైన మడత పేచీ ముస్లిములని ప్రధాన జీవన స్రవంతిలో కలవనివ్వకుండా చెయ్యటమే! హిందూ ముస్లిములని విడి విడిగానే వుంచి అవసరమయినప్పుడు కలుపుతూ మిగతా అప్పుడు విడిగా వుంచుతూ ఆడిన దొమ్మరాటలు వాస్తవంలో వ్యతిరేక ఫలితాన్నే ఇచ్చింది? నిజానికి ముస్లిముల్ని ప్రొత్సహించటానికి రాజమార్గం కాంగ్రెసులోనే చేర్చుకుని వారి వారి వుద్యమ స్పూర్తిని బట్టి పార్టీలో వున్నత స్థానానికి యెదిగేలాగా సహకరించటం చెయ్యాలి, కానీ ఆ తెలివయిన అభిప్రాయంతో ముస్లిము లీగుకి పోటీ పెడదాం, యెన్నికల్లో వోడిద్దాం అని చెప్పిన వాళ్ళు హిందూ మతతత్వ వాదులుగా ముద్ర వేయించుకున్నారు, అటు వేపు వున్న గాలి వెధవల్ని సంతృప్తి పరిచే వాళ్ళు ఆదర్శ నేత లయ్యారు. ఆ ప్రతిపాదనలు చేసిన వారికే వీళ్ళ కున్నవాళ్ళ కన్నా యెక్కువ మంది ముస్లిము స్నేహితులు వున్నారు! ఈ రకంగా హిందువులు ముస్లిములు విడివిడిగా వుండటం బాగా లాబించింది ఇంగ్ల్లీషు వాళ్లకే - "విభజించు - జయించు" అనే చాణక్యనీతిని మన మీదకే వొదలటానికి తోడ్పడింది!




1929-31 మధ్యలో ఇవ్వాళ మనం ఆదేశిక సూత్రాలుగా రాజ్యాంగంలో చదువుతున్న వున్నతాదర్శాల్ని - మత స్వేచ్చ,వాక్ స్వాతంత్ర్యం,భావ స్వాతంత్ర్యం,కుల మత వర్ణ ప్రాంతాల కతీతంగా చట్ట పరమయిన సర్వ సమానత్వం, మద్యపాన నిషేధం, అస్పృశ్యతా నిరోధం, భారత్ ను సోషలిష్టు మరియు సెక్యులరు దేశంగా నిలబెట్టటం వంటి కలగాపులగం కబుర్లన్నమాట - వండి వార్చేశాడు. తీరా తినడానికి కూర్చునేసరికి కొందరికి మింగుడు పడలేదు పాపం! అటు ముగ్గురూ ఇటు ముగ్గురూ చేరి ఆరుగురు ప్రముఖ నాయకులూ దాంతో కాలిబంతాట ఆడేసుకున్నారు! కుడి-రెక్క వాటంతో సర్దార్ వల్లభాయ్ పటేల్, డా.రాజేంద్ర ప్రసాద్, చక్రవర్తుల రాజగోపాలాచారి ఆడితే యెదమ-రెక్క వాటం గాళ్ళు సుభాష్ చంద్ర బోసు, మౌలానా ఆజాద్ సాయంతో నెహ్రూ ఆడాడు. సర్వశక్తులూ ఒడ్డి 1936లో డా.రాజేంద్ర ప్రసాద్ ని దించేసి తను అధ్యక్షుడై సామ్యవాద భావజాలానికి  మరింత వూపును తీసుకొచ్చాడు. ఇతని కన్నా అన్ని విధాలా సమర్ధుడయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో బోసు బయటికి వెళ్ళిపోవటం అప్పటి పరిస్థితుల్లో అడ్డు లేకుండా నడిచింది. స్వాతంత్ర్యానంతరం గాంధీ దుర్మరణాన్ని తన చేతగానితనంగా భావించుకుని కుంగి పటేల్ దూరమవడంతో తర్వాతి రాజకీయాల్లో అడ్డు లేకుండా జరిగిపోయింది. అదృష్టం తన్నాల్సిన చోట తంతే ప్రజాస్వామికంగా కూడా నియంతృత్వం వెలగబెట్టవచ్చుననే దానికి ఇతడే ఒక గొప్ప వుదాహరణ!




అప్పటిదాకా పైకి చెప్పకపోయినా గాంధీ వారసుడుగా అందరూ వూహిస్తున్న నెహ్రూని 1941 జనవరి 15న రాజాజీ కాదు, నెహ్రూయే నా వారసుడు అని గాంధీ ప్రకటించటంతో అధికారికంగా యువరాజ పట్టాభిషేకం జరిగిపోయింది!1942 ఆగస్టు 8న గాంధీ మొదటి సారి తీవ్రమయిన భాషతో క్విట్ ఇందియా తీర్మానాన్ని ప్రవేశ పెట్టాడు. భాష యెప్పుడయితే అంత తీవ్రంగా వుందో వెంఠనే ఇంగ్లీషువాళ్ళు మొత్తం నాయకు లందర్నీ ఖైదు చేసేశారు.ఇలా కాంగ్రెసు నాయకులంతా జైళ్ళలో వుండటం జిన్నా నాయకత్వం లోని ముస్లిం లీగుకి విపరీతమయిన ప్రోత్సాహాన్ని ఇచ్చింది! 1943 ఏప్రిలు కల్లా అప్పటిదాకా వాస్తవదూరంగా వున్న ప్రత్యేక దేశం చాలా దగ్గిర కొచ్చేసిందన్నంత బలాన్ని పెంచుకోవడం కేవలం కాంగ్రెసు నాయకుల అరెస్టు వల్లనే సాధ్యపడింది? కానీ కాలం గడిచే కొద్దీ సామాన్యులైన ముస్లిములకి గూడా జైళ్లలో వున్న కాంగ్రెసు నాయకుల పైన సానుభూతి పెరగడం, 1943-1944ల మధ్యన విరుచుకు పడ్ద బెంగాలు కరువు ముస్లిము లీగు ప్రభుత్వం ఖాతాలో పడటంతో ముస్లిము లీగు యెంత వేగంగా ప్రాభవం పెంచుకుందో అంత వేగంగానూ అపఖ్యాతికి గురయింది. జిన్నా అయితే పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకుని కాశ్మీరులో సెటిలయిపోయాడు! మరింత నాటకీయంగా 1944 మే లో అనారోగ్య కారణాలతో జైలు నుంచి విడుదలయి వచ్చిన మోహన దాసు ఈ శవానికి మళ్ళీ ప్రాణం పోశాడు?




ఈ మేధావి పనిగట్టుకుని అక్కడ కూసిందేమిటంటే యుధ్ధానంతరం ముస్లిములు అధికంగా వున్న ప్రాంతాల్లో ప్లెబిసైటు పెడదాం వాళ్ళు దేశం నుంచి విడిపోదామని అనుకుంటున్నారా లేదా అని తేలుచుకోవడానికి అని - మాటల్లో చెప్పకపోయినా అది పాకిస్తానుకు ఒప్పుకోవటమే, అదీ జిన్నా పరువు పోగొట్టుకుని దాని గురించి ఆశలుడిగి కూర్చున్న సమయంలో! జిన్నా వెంటనే చురుగ్గా కదిలి నాకలా కుదరదు పాకిస్తాను యేర్పాటుకు నికరమయిన హామీ కావాలనటంతో కధ అడ్డం తిరిగింది. బూదిని వూది నిప్పు రగిలించటం కోసమే జరిగినట్టు గాంధీ జిన్నాను కలిసిన ఈ సంఘటన దారా షికో పతనం తర్వాత ఈ దేశ చరిత్ర తిరగకూడని మలుపు తిరిగిన మరో దుర్ఘటన!? దాంతో జిన్నా రెట్టించిన బలంతో కదిలి అతి వేగంగా తన పూర్వపు ప్రాభవాన్ని సమకూర్చుకుని అసాధ్యమనుకున్న తన పాకిస్తాను కలని సుసాధ్యం చేసుకున్నాడు!


ఆ విధంగా ఈ దేశపు రాజకీయ రంగస్థలం మీద విధి ప్రదర్సించిన మహా నాటకం లోని పాత్రధారు లంతా యెవరి పాత్రల్లో వాళ్ళు స్థిరంగా కుదురుకోగా  1947 జూన్ 3న బ్రిటిష్ ప్రభుత్వం తొలిసారి విదుదల చేసిన ప్రణాళిక తో మొదలై 1947 ఆగష్టు 15తో శత్రు దేశపు  ప్రభుత్వం మధ్యవర్తిత్వం లోనే రెండుగా చీలుతూ స్వతంత్ర దేశంగా అవతరించింది మన భారత దేశం!మనకు చేసిన ద్రోహాలకి కత్తికో కండగా నరకాల్సిన శత్రువుని ఆత్మబంధువును సాగనంపినట్టు క్షేమంగా రేవులు దాటించి ఆత్మబంధువులుగా కలిసి మెలిసి బతకాల్సిన వాళ్ళు కుత్తుక లుత్తరించుకునే విధంగా ఆవిర్భవించినది శుభవేళ యెలా అవుతుందో నాకిప్పటికీ అర్ధం కాదు? పాలు పొంగించి గృహప్రవెశాలు చేసే సాంప్రదాయం గల భారత జాతి నవశకానికి వేసిన తొలి అడుగులో తగలబడుతున్న గృహాలని చూసింది, శవాల గుట్టల మధ్య నుంచి నడిచింది! మాతృభారతిని పంచామృతాలతో అభిషకించాల్సిన శుభవేళ జ్ఞాతి కలహాల నుంచి యెగసిపడిన రక్తనదీప్రవాహాలతో అభిషేకించాము - అది యేమి స్వాతంత్ర్యం?! శాంతికాముకుల మంటూ డప్పాలు కొట్టుకోవటమే తప్ప ఆ కలహాల్ని తగ్గించటానికి కళ్లముందు కొచ్చిన బంగారం లాంటి అవకాశాల్ని కాలదన్ని అప్పటి నాయకులు మూర్ఖంగా ప్రవర్తించడం  వల్లనే అలా జరిగిందని యెంతమందికి తెలుసు?




మొన్నటి రోజున ఆ మనిషి వేరే దారి లేకనే అలా చెయ్యలేదనీ వాస్తవికంగా ఆలోచించే వాళ్ళు ఇది తప్పు భవిష్యత్తులో ప్రమాదాన్ని తీసుకొస్తుందని హెచ్చరించినా వినకుండా మొండిగా దూసుకెళ్ళడం వల్లనే నిన్నటి రోజున ఆనాడు వాస్తవికంగా ఆలోచించిన వాళ్ళు చెప్పిన భీబత్సాలు జరిగినాయనీ తెలిసిన తర్వాత కూడా ఇప్పటి రోజున కొందరు ఇతన్ని గొప్ప దార్శనికుడని పొగుడుతున్నారంటే వీళ్ళని యెలా అర్ధం చేసుకోవాలి? ప్రపంచంలోని యే దేశచరిత్రలోనూ తన దేశానికి ఇన్ని సమస్యల్ని సృష్టించిన దేశాధినేత మరొకడు లేడు? జనంతో చీత్కరించుకుని గెంటించుకున్నవాళ్ళకి గూడా మహా వుంటే ఒకటో రెండో, మన వాడా - యెక్కడ వేలు పెడితే అక్కడల్లా ఒక కుంపటి రగిలించాడు! అదీ యెప్పటికి ఆరతాయో తెలియని రావణ కాష్టాలు!? అన్ని తప్పులు చేసినా ఇతడికి ఇంకా చప్పట్లు పడుతున్నాయంటే అది అతని అదృష్టం! అన్ని తప్పులు చేసినా ఇతడికి ఇంకా చప్పట్లు కొడుతున్నారంటే అది ఈ దేశపు మేధావుల దేబెతనం!


రాజ్యాంగ రచన 1935లో మొదటిసారి మంత్రివర్గాల్ని యేర్పరచినప్పటి నుంచీ జరుగుతూనే వుంది. మొదట్లో బ్రిటిష్ ఇండియాకు బయట వున్న రాజ్యాలకి రాష్ట్రాల హోదా ఇచ్చేసే ఫెదరల్ రాజ్యాంగానికి అనుకూలంగా వుందేవాళ్ళు నెహ్రూ తప్ప మిగిలిన నాయకులందరూ. కానీ 1946కి వచ్చేసరికి అది కాస్తా నెహ్రూ మాట వేదవాక్కుగా చెల్లుబడి అయ్యే కాలం గనక  ఆ రాజ్యాల నన్నిట్నీ విలీనం చేసి రిపబ్లికన్ తరహాకు రాజ్యాంగం 180 దిగ్రీలు తిరిగి నిజాముని బలవంతంగా లొంగదీసుకోవడంతో సగం పూర్తయ్యింది. కానీ బలవంతంగా లొంగదీసుకోవటం వల్ల వాళ్ళని పూర్తిగా శాంతపర్చటానికి కొన్ని హక్కులూ భరణాలూ పేరుతో ఖజానా మీద అదనపు ఖర్చు కూడా వచ్చి పడటంతో 1971లో ఇతని కూతురు ప్రధానిగా 26వ సవరణతో ఆ రాజభరణాలను రద్దు చేశాకనే ఆ పని పూర్తయింది. అంటే తెలంగాణా ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన సైనిక చర్యకి ప్రధాన కారకుడు నెహ్రూయే అన్నమాట! అప్పుడు యెదురు తిరిగిన మిగతా వాళ్ళు కూడా 1935లో తమకి రాజ్యాంగం వాగ్దానం చేసిన న్యాయబధ్ధమయిన హక్కు కోసమే పోరాడారన్న మాట!


1935లో యేర్పడిన "provincial autonomy"తో యెర్పడిన ప్రభుత్వాల్లో నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెసు అత్యధిక స్థానాల్ని గెలుచుకుని ప్రజల ఆమోదంతో తిరుగులేని అధిపత్యాన్ని చూపించగా జిన్నా అధ్యక్షతన ముస్లిం లీగు చాలా దారుణంగా దెబ్బ తినేసింది.ఈ దశలో నెహ్రూ మౌలానా అజాద్ లాంటి వుదార వాదిని భారత ముస్లిములకి ప్రతినిధిగా ముందుకు తీసుకొద్దామని చూసినా మోహన దాసు ఇంకా జిన్నాయే భారత ముస్లిములకి ప్రతినిధి అనే భ్రమ నుంచి బయటికి రాకుండా జిన్నాకే ప్రాధాన్యత ఇస్తూ వుండటంతో అదీ కుదర లేదు?!


జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఈ దేశపు భవితవ్యాన్ని శాసించటం మొదలు పెట్టిన 1947 ఆగష్టు 15 తదాది మోహన దాసు హత్యకి గురయిన 1948 జనవరి 30 వరకు ఈ దేశంలో యేదో ఒక మూల విధ్వంస కాండ జరగని రోజంటూ లేదు. యాస్మిన్ ఖాన్ అభిప్రాయం ప్రకారం  మహా మేధావి అయిన పటేల్ చాతుర్యం కన్నా దార్సనికుడుగా పేరు గాంచిన నెహ్రూ సమర్ధత కన్నా గాంధీ చావు - రెండు వారాల పాటు నాటకీయంగా ప్రదర్శించిన విషాద భరితమయిన వాతావరణమే - ఆ భీబత్సాన్ని ఆపగలిగింది? బతికుంటే అప్పటికే మాట చెల్లుబడి తగ్గిపోవడంతో కొంతకాలం తర్వాత అనామకంగా హతమారి పోయేవాడు కాస్తా చచ్చి గోడమీదబొమ్మై ఇంతకాలం గుర్తున్నాడు?!




ఇతని పేరుమీద చెలామణిలో కొచ్చిన మిశ్రమ ఆర్ధిక విధానం కొన్ని శతాబ్దాలకు ముందే చాణక్యుదు చెప్పాడు - గనులు, నదులు,లాభసాటిగా వుండకపోయినా ప్రజలకి వుపయోగపడేవి అన్నీ ప్రభువే సొంతంగా పర్యవేక్షించాలి అని!ఇతను ఆర్ధిక సలహాదారుగా యెంచుకున్న మహలనోబిస్ బొమ్మా బొరుసా లెక్కలు తేల్చే ప్రాబబిలిటీ మేథమేటిక్సు పండితుడే తప్ప ఆర్ధిక శాస్త్రంలో యేమాత్రమూ పరిజ్ఞానం లేనివాడు!ఫెల్డ్మాన్ మరియూ మహలనోబిస్ అనే ఇద్దరిలో ఫెల్డ్మాన్ ఏలెక్ట్రికల్ ఇంజనీరు, మహలనోబిస్ గాలివాటం లెక్కల పంతులు!అంటే లెక్క ప్రకారం నడవాల్సిన ఆర్ధిక వ్యవహారాలతో పాచికలు విసిరే తరహాలో జూద మాడాడు!జూదంలో యేం జరుగుతుంది?పాచికలు అనుకూలంగా పడినంత కాలం అధ్బుతంగా గడుస్తుంది,అవి కాస్తా మొరాయించటం మొదలయినాక ఆటగాడు ఒక్కొక్క మెట్టుగా దిగుతూ సర్వ నాశన మయ్యే వరకూ వొచ్చే ఆటలో నైనా గెలుస్తానేమో ననే ఆశతో ఆడుతూనే వుంటాడు. అట్లాగే మన దేశపు విదేశీ మారక ద్రవ్యం తాకట్టు పెట్టాల్సి వచ్చే వరకూ మనకి ఈ మనిషి మనమీద రుద్దిన దరిద్రగొట్టు ఆర్ధికం మీద వ్యామోహం వదల్లేదు!




విదేశాంగ విధానాన్ని చాణక్యుడి షాడ్గుణ్యాన్నించి తీసుకుంటున్నానని చెప్పి మళ్ళీ అందులో తన పైత్యం కొంత కలిపి పంచశీల అని పేరు పెట్టి ప్రపంచం మీద వొదిల్తే భాయి భాయి అన్న చైనా మొదటి శీల వూడగొట్టేసింది 1962లో!మిత్రుడికి శత్రువు మనకూ శత్రువు అనే చాణక్యుడి సూత్రాన్న్ని పట్టించుకోకుండా చైనాకు నచ్చని దలైలామాకి ఆశ్రయ మిచ్చాడు! అప్పటి దాకా నిమ్మళంగా వున్నవాడు హడావిడిగా చైనా సరిహద్దుల్లో పటాలాల్ని దించడం మొదలెట్టాడు. దాంతో మండి వాళ్ళు కాల్పులు జరపటంతో మొదలయిన ఇండో - చైనా యుధ్ధం భారత సైన్యాన్ని శత్రువు కూడా జాలిపడేటంత పరమ దయనీయమయిన స్థితిలోకి నెట్టేసింది?! ఈ విధంగా అన్నివైపుల నుంచీ సమస్యలూ విమర్శలూ పెరిగిపోవటంతో రాజీనామాకి కూడా సిధ్ధపడి మళ్ళీ తమాయించుకుని, కనీసం సమర్ధించుకోవడానికి కూడా వీలివ్వనంత స్పష్టంగా కంటికి కనబడుతున్న తాను చేసిన తప్పులకు తానే వగచి వగచి కృశించి కృశించి నశించాడు 1964 మే 27న!




అంతటితో యెక్కడ అందమయిన ఆడది కనబడినా అమాంతం అక్కడ వాలిపోయి కావిలించుకుని పులకించిన పరమ పాషండాల ప్రదర్శన సమాప్తమై పోయింది!కానీ అంగారం లోనూ శృంగారం లోనూ ఇతని కన్నా రెండాకులు యెక్కువే చదివిన ఇతని కూతురు భారత దేశపు రాజకీయ రంగస్థలం మీద మహమ్మారిలా విరుచుకుపడి ఒక చీకటి కాలాన్ని సృష్టించింది?
________________________________________________________
1    2    3    4    5    6                                     (తేదీల వివరాలు:వికీ పీడియా,చిత్రాలపీటిక:గూగుల్)

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...