Showing posts with label తెలంగాణ. Show all posts
Showing posts with label తెలంగాణ. Show all posts

Friday, 4 March 2016

అధికార పార్టీ కండువా రంగు మారడం తప్ప ఇదివరకటి తెలంగాణకీ ఇప్పటి తెలంగాణకీ తేడా ఏంటి?అంతా అప్పట్లాగే ఉంటే,మరి ప్రత్యేక రాష్ట్రం కోసం అంతగా ఎందుకు ఏడ్చారు!

     గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బ తినడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కళ్ళు పత్తికాయల్లా చేసుకున్న వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది, ఇన్నాళ్లకి వాళ్ళ కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది - కొంచెం మామూలు స్థితికి వచ్చినాయి!అయితే,కొంచెం కళ్ళు నులుముకుని చూస్తే ఇవ్వాళ తెరాసలో మంత్రులుగానూ ఇంకా వీళ్ళకి తెలంగాణ పునర్నిర్మాణం అనే బృహత్కార్యాన్ని భుజాల మీద వేసుకుని తెలంగాణ భూఖండాన్ని ఉద్ధరించే మహాత్ములుగానూ అక్కడ కొలువుదీరి కనబడుతున్నవాళ్ళంతా ఒకప్పుడు టీడెపీ వాళ్ళే:-)

     అసలు ముఖ్యమంత్రి గారే నందమూరి తారకరామారవుకి భక్తుడు!చంద్రబాబుకి రహస్యమిత్రుడు కూడాను - ఇప్పటికీ!ఒక్క చంద్రబాబు తప్పిస్తే తెలంగాణ నుంచి దుష్ట దుర్మార్గ తెలంగాణ విధ్వంసక ప్రజాశత్రువు చంద్రబాబు ద్వారా ఎన్నికైన తెదెపా వాళ్ళంతా, వాళ్ళొక్కళ్ళేనా అన్ని పార్టీల్లోనూ ఉండి ఇప్పటివరకు ఉద్యమపార్టీని వ్యతిరేకించిన వాళ్ళంతా ఇప్పుడు తెరాస లోనే ఉన్నారు.మరి!యాభయ్యేళ్ళ నాటి పాతకధని మర్చిపోయి ఈ కొత్త కధలో పన్నెండేళ్ళుగా వీళ్ళు ఎవరినైతే బాబు పచ్చ పార్టీలో ఉండి తెలంగాణకి అన్యాయం చేశారని శాపనార్ధాలు పెట్టారో వాళ్ళంతా కండువా మార్చగానే మంచివాళ్ళు అయిపోతారా?కండువా రంగు మార్చటం కోసమా వీళ్ళు ఇంత గోల చేసింది?

     పోనీ ప్రాంతీయాభిమానం లెక్కల ప్రకారం సంస్కృతి గురించి గొప్పగా చెబుదాం అనుకుంటే బతుకమ్మని కులాలవారీగా చీల్చి భ్రష్టు పట్టించారు!బతుకమ్మ పరువు తియ్యటం పూర్తయ్యాక ఇప్పుడు సమ్మక్క మీద పడ్డారు.కొత్తగా నెత్తి కెత్తుకుంటున్న సమ్మక్క,సారక్కల గోలేంటో అర్ధం కాదు.వీళ్ళు కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి మా ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టిన మహారాణి అంటారు.తెలంగాణ భాషలో కాకుండా సంస్కృత పదాలతో నిండిపోయిన గ్రాంధికపు రాష్ట్రగీతంలో రుద్రమదేవిని పొగిడితే వీళ్ళు ఆంధ్రోళ్ళని తిట్టిన దానికన్నా పదింతలు తిట్టిన సమ్మక్క,సారక్కల భక్తులకి అది నచ్చటం లేదు.అందుకని, కొత్త కధల్లో ప్రతాపరుద్రుడికి  పశ్చాత్తాపం అనే ముసుగు తగిలిస్తున్నారు.వాళ్ళు ఎక్కడెక్కడివాళ్ళూ పోగయి మా సంప్రదాయాల్లో వేళ్ళు పెడుతున్నారు,మ మా కధల్ని గూడా మార్చేస్తున్నారు అని కోప్పడుతున్నారు.కొంచెం వైభవంగా బతికిన ఈ మధ్యకాలపు ధర్మప్రభువు గదాని నిజాముని పొగుడుదామంటే అక్కడ బలంగా ఉన్న నక్సలైట్లు ఒంటికాలిమీద లేస్తారు.నక్సలైట్లని తన్ని తగిలేద్దామంటే గిరిజనులు వాళ్ళు మా అన్నలంటారు - ఇదెక్కడి గోల!

    పోనీ పరిపాలన సమర్ధవంతంగా ఉంది అనుకుని సంతోషపడదామంటే సాక్షాత్తూ రాజధాని నడిబొడ్డునే ఉగ్రవవ్ద సంస్థలకి శాఖలు లేస్తుంటే వాటిని మూయించే దమ్ము లేదు.ముఖ్యమంత్రి గారు ఆర్భాటంగా మొదలెట్టిన గతకాలపు సాహసోపేత నిర్ణయాలన్నీ కొన్ని కోర్టు మొట్టికాయలతో కొన్ని జనాల చివాట్లతో అటకెక్కేసినాయి - అవి మళ్ళీ కిందకి దిగొచ్చే సూచనలు కూడా లేవు.కోర్టుల్ని ఆంధ్రా కోర్టులు గాబట్టి వాటిని కొట్టేసినాయి అని చెప్పుకుని కొంచెం పరువు నిలబెట్టుకున్నారు.కానీ పోలీస్ కమిషనరేట్ అని పోలీసుశాఖకి గాలి కొట్టబొతే ఎయిర్పోర్తు అధారిటీస్ గాలి తీసేసింది.అంతకిముందు జరిగిన వాటికి ఆంధ్రోళ్ళ మీద నెట్టేశారు,మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంకృత నిర్ణయాలని కూడా ఆంధ్రోళ్ళ మీద నెట్టెయ్యరు కదా:-(

     ఈ రెండేళ్ళలో చెప్పుకోదగిన గొప్పపని ఆయుత చండీయాగం తప్ప ఇనకేమీ కనబడ్డం లేదు.దాని మూలంగా కూడా అప్పటి వరకు పచ్చమీడియా పేరుతో ఏదో చేద్ద్దామని అంతు చూదబోయి ఏమీ చేయలేనని తెలిసి రాధాకృష్నతో కత్తు కలిపెయ్యడం ఒక్కటే గట్టి లాభం!మిగిలినవన్నీ మబ్బుల్లో నీళ్ళే.అయినా ఎందుకు వీళ్ళింత హ్యాపీగా ఫీలవుతున్నారు?ఆంధ్రప్రదేశ్ విభజనకి ముందు కూడా ఇలాగే తెలంగాణా ఇవ్వకుండా ఆంధ్రా వారు అడ్డుపడుతున్నారనీ కావూరి లగడపాటి లాంటివాళ్ళని దోషులుగా చిత్రీకరించి ఆంధ్రా వారినందరినీ తిట్టేవాళ్ళు. సాధారణంగా డబ్బున్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు తక్కువ అసూయ చెందేవాళ్ళు ఎక్కువ కనుక సోనియా కూడా తెలంగాణా వారి మాటలనే నమ్మి అంత పెద్ద బడా పారిశ్రామిక వేత్తలను కూడా కాదని పార్లమెంట్ లో 23 నిమిషాలు తలుపులు మూసి మూజువాణి ఓటుతో విభజన చేసారు. .విభజన కావాలా వద్దా అన్నది ప్రజల అభీష్టం ప్రకారం జరగాలి, కానీ వీళ్ళు అట్లాంటి రాజమార్గం ద్వారా కాకుండా వక్రమార్గం దవరా తెచ్చుకున్నారు,అది వాళ్ళకి కూడా స్పష్టంగా తెలుసు.ఈ రకమైన జరిగిన విభజన మొత్తం ఒక పక్కా ప్రణాళికతో నడిపించారు కొందరు వ్యూహకర్తలు - మొదటి వాదన,విడిపోతే రెండు ప్రభుత్వాలు,మరిన్ని పదవులు,మరిన్ని కాంట్రాక్టులు,మరిన్ని తాయిలాలు వస్తాయి అనేది.దానివల్ల ఎక్కువ నష్టం తనకే అని తెలిసిన చంద్రబాబు వ్యతిరేకించాడు - బాబుకి మాత్రం ప్రజలమీద ఏమంత ప్రేమ ఉంది గనక!కానీ చూడండి ఈయన్ని ఆయన అమరావతికీ ఆయన్ని ఈయన చండీయాగానికీ ఎంత ఆత్మీయంగా పిల్చుకున్నారో - తోడుదొంగలు!

     ఇక్కడ కూర్చుని "అండి" కన్నా "రి" ప్రశస్తం అని వాగేవాళ్ళకి మేళ్ళు చెయ్యటంకోసమో ,"చెప్పాలె" అనే గొప్ప ప్రయోగానికి బదులుగా ఇన్నాళ్లూ "చెప్పాలి" అనే తప్పుడు ప్రయోగం ఒప్పుగా చెలామణీ అయిందని అఘోరించే కుపండితులకి గందపెండేరాలు తొడగటం కోసమో కాదు విబజన జరిగింది.పైస్థాయిలో వాళ్లు ఆదాయాల్ని పంచుకోవడానికి సులువుగా ఉంటుందని!వీళ్ళకి దక్కేదల్లా మ్యాపులో విడిగా కొత్త రాష్ట్రంగా కనబడ్డమే.చంద్రబాబు మాటిమాటికీ తెలుగువాళ్ళని కలుపుతానని వాగుతున్నప్పుడల్లా వీళ్లకి ఇప్పటికీ తుమ్మితే వూడిపోయే ముక్కులా ఉన్న తెలంగాణ గురించి అంటున్నట్టు ఉలిక్కిపడేవాళ్ళు.ఇప్పుడా భయం పోయింది,అదీ వీళ్ళ ధీమా!వీళ్ళ దృష్టిలో ఎన్నికల్లో తెరాసా గెలుస్తూ ఉంటే చాలు తెలంగాణా బాగున్నట్టే.

గులాబి రంగు జిందాబాద్!పసుపు రంగు ముర్దాబాద్?

Tuesday, 9 February 2016

రాష్ట్రం వచ్చెననీ జీహెచ్చెంసీ పీఠం దక్కెననీ సంబరపడగానే సరిపొలేదోయ్!చెప్పినవన్నీ చేసి చూపించి అప్పుడు కాలరెగరెయ్యవోయ్!

          గొప్పగా పరిపాలించి ప్రజల్ని మెప్పించటం ఎన్నికల్లో గెలవటం ఒకటి కాదు.ఎన్నికల్లో గెలవటానికి సంబంధించి సెఫాలజీ అని ఒక సైన్సే ఉంది.దాని ప్రకారం ప్రతి ఎన్నికకీ ఒక స్వింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది.అది 4% ఏ అభ్యర్ధి వైపుకి మొగ్గినా వూహించని ఫలితం వస్తుంది.అన్ని పార్టీలూ మైనారిటీలని బుజ్జగించడం దగ్గిర్నుంచీ తెరాసా బృందమంతా సెటిలర్లని బుజ్జగించడం కోసం పడరాని పాట్లు పడేది ఆ ఉయ్యాల తమవైపుకి వూగి తమని అందలం ఎక్కించే వూపు రావడం కోసమే!అన్ని ఎన్నికల్లోనూ ఇప్పటిలాగా సెటిలర్ల మాదిరి స్వింగ్ స్పష్టంగా ఉండదు,ఒక్కోసారి అప్పటివరకూ స్వింగ్ ఫ్యాక్టర్ అనుకున్నది కాక మరొకటి స్వింగ్ ఫ్యాక్టర్ స్థానంలోకి రావచ్చు,ఎన్నికలకి ఒక్కరోజు ముందు ఈ స్వింగ్ ఫ్యాక్టర్ ఎదురుతన్నినా చాలు అద్భుతమైన తెలివితేటలు చూపించి ఆరునెల్లు ముందునుంచీ ప్లానులేసి చేసిన ప్రయత్నాలన్నీ మట్టిపాలే,రిజల్టు ఢాం తుస్సు మనాల్సిందే:-)


          అందుకే నేను కేటీఆర్ సైలంటుగా పనిచేసి గెలుపు ఖాయం అనిపించుకుంటే కేసీఆర్ వైలెంటుగా పోయి స్వింగుని రివర్స్ చేస్తున్నాడేమోనని కంగారు పడ్డాను.కానీ జనం తెలివి జనం చూపించారు.వాళ్లముందు ఉన్నది ఒకే ఒక ఆప్షన్,తెరాసాని సమర్ధించడం - కేసీఆర్ దాన్నే బలంగా నొక్కి చెప్పాడు!ఒకవేళ పంతానికి పోయి వేరే పార్టీని గెలిపించినా మనోడు గెల్చినవాళ్ళని ఆ పార్టీలో ఉండనివ్వడు గదా:-)గెల్చినోడికల్లా గులాబీ కండువా కప్పేస్తుంటే జనం మళ్ళీ వేరే పార్టీకి వోటెయ్యడం దేనికి:-(కాబట్టి కేసీఆర్ గారికి ఖర్చూ రిస్కూ తగ్గించారు సెటిలర్లు!ఇక ఈ సెటిలర్లు ఆ ముద్ర చెరిపేసుకుని తెలంగాణలో మనస్పూర్తిగా లీనమైపోయి బతకడం బెస్టు!పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి ఎంతకాలం హైదరాబాదులో ఉంటాడు వీళ్లని కాపలా కాయడం కోసం - అందుకే చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా నీరసంగా ఉంది. ఓటుకు నోటు కేసుకి ముందు తేలంగాన అంతా పరవళ్ళు తిరిగినప్పటి ధీమా లేకపోవడం తెలుస్తూనే ఉంది.అయితే రెరాసాతో సహా గుర్తుంచుకోవలసిన విషయం ఈ స్వింగు మహా ప్రమాదకారి.కాబట్టి తెలంగాన సెంటిమెంటు ఎప్పటికీ స్వింఫులా ఉండకపోవచ్చు.తేలంగాణా తెలుగుదేశం కూడా మరీ నీరసించి పోవాల్సిన పని లేదు.కలం గడిచే కొద్దీ ప్రభుత్వ పనితీరు లోని లోపాలు అధికార్ అపక్షానికి ప్రతికూఅల స్వింగుని తయారు చహెస్తాయి - దాని పట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి.కాకపోతే ప్రతీదానికీ బాబు మీదా చినబాబు మీదా ఆధారపదకుండా సొంతంగా నిలబడాలి.నాయకులు ఫ్యాక్తరీలో పుట్టుకురారు గానీ అవస్రమేఅ న్నిట్నీ నేర్పిస్తుంది.తెలంగాణ భాజపా కూడా తెలుగుదేశంతో అంటకాగడం మానేసి సొంత బలాన్ని పెంచుకోవాలి.మిత్రపక్షంగా ఉన్నందువల్ల కేసీఆర్ 667678 పత్ల ఖచ్చితంగా ఉదారంగా ఉంటాడు.ISIS బ్రాంచీలనే తెరిచిన దుస్థితిని ఎదుర్కోవాలంటే భాజపా బలం పెంచుకోక తప్పదు!ప్రస్తుతానికి ఆంధ్రాలో మిత్రపక్షంగా కొనసాగుతున్నందువల్ల ఇక్కడ ఒకరినొకరు విమర్శించుకుంటే ఇద్దరూ లోకవ అయ్యే ప్రమాదం ఉంది గనక మరీ తిట్టుకుని తన్నుకుని విడిపోయే ప్రేయసీప్రియుల మాదిరి ఓవరాక్షన్ చెయ్యకుండా హుందాగా విడిపోయి ఎవరి బలాన్ని వారు పెంచుకుంటే ఇద్దరికీ మంచిది!


          ఇప్పటి వరకూ రాజదానిలో పాగా వెయ్యలేని బెంగ తీరింది గనక తెలంగాణ ముఖ్యమంత్రి ప్రశాంతంగా పని చేసుకోవచ్చు.ఎన్నికల సమయలో తాము వస్తే తెలంగాణకి చేస్తామని చెప్పిన అప్పటి భవిష్యత్ ప్రణాళికల నుంచీ అధికారంలోకి వచ్చాక కూడా తప్పనిసరిగా చేస్తాం అంటూ చాలా ఆశల్ని జనంలో మొలకెత్తించారు.అయిదేళ్ల పాలనాకాలంలో మూడేళ్ళు గడిచిపోయినాయి.ఏ రాజకీయ పార్టీ నాయకుడూ చెప్పని విధంగా నాలుగేళ్ళు తిరిగేసరికి మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తాం,అలా చెయ్యలేకపోతే మిమ్మల్ని వోట్లు అడగం అన్నారు.ఆ మాటని జనం చెక్ చేసుకోవటానికి ఇంకొక్క సంవత్సరమే ఉంది.మామూలు రొడ్డకొట్టుడు వాగ్దానాలని జనం తేలిగ్గానే మర్చిపోయి ఉండేవాళ్ళేమో గానీ ఇది మీరు ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నది గాబట్టి ప్రజలు కూడా గట్టిగానే గుర్తుంచుకుంటారు,ఒకవేళ ప్రజలు మర్చిపోయినా ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తాయి.కొన్ని పనులు మొదలుపెట్టి చాలామటుకు పూర్తి చేశారని వింటున్నాం గానీ మరి కొన్ని అనేకరకాల అడ్దంకుల వల్ల మొదలవుతాయో లేదో తెలియని పరిస్థితి ఉంది - ఈ ఒక్క సంవత్సరంలో ఎన్నింటిని పూర్తి చెయ్యగలరు?

          తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్భాటంగా మొదలుపెట్టి అర్ధాంతరంగా ఆపేసిన చాలా కార్యక్రమాల్లో వాహనాల రీరిజిస్ట్రేషన్ మరియూ కల్తీకల్లు-గుడుంబా లాంటివి అసలు ప్రతిపాదన లోనే ఒక రకమైన తెలివితక్కువతనం ఉండటం వల్ల అభాసుపాలు అయినాయి,కొంచెం లౌక్యం చూపించి ఇతరేతర సాంకేతిక కారణాలు ఏవైనా చెప్పకుండా వాస్తు ప్రస్తావన తీసుకు రావడంతో సెక్రటేరియట్ మార్పు లాంటివి అవహేళనకి గురయ్యాయి,హుస్సేన్ సాగర్ ప్రక్షాళన లాంటివి కోర్టులు అడ్డుపడడం వల్ల ఆగిపోయినాయి.అదొక్కటే కాకుండా చాలా నిర్ణయాలు కోర్టుల వల్లనే ఆగిపోవడంతో ఆంధ్రా హైకోర్టు అనే పల్లవి ఎత్తుకున్నారు.ఇప్పటికే ఈ ఆంధ్ర-తెలంగాణ గొడవల్ని ఉద్యోగవర్గాలకి పాకించి చాలా తప్పు చేశారు.ఈ పాలిటిక్స్ వల్ల తెలంగాణ ఉద్యోగుల పంతీరు ఏమీ మెరుగుపలేదు సరికదా వారూ కొత్తగా నేర్చిన  రాజకీయపు తెలివితో తెలంగాణ ప్రబుత్వానికి కూడా సమస్యగా మారినట్టు కనిపిస్తున్నది.ఇంక ఈ ఆంధ్ర-తెలంగాణ గొడవల్ని న్యాయవ్యవస్థకి కూడా పాకిస్తే తెలంగాణేతరులు న్యాయం కోసం కోర్టులకి వెళ్ళడానికి కూడా భయపడాల్సిన అరిస్థితి దాపురిస్తుంది.ఒకవేళ తెలంగాణ న్యాయ్మూర్తులు అయినప్పటికీ లొసుగులతో ఉన్న చట్టాన్ని "రాష్త్రం మనదే తోసెయ్" అనే లెక్కన ప్రభుత్వానికి అనుకూలంగా ఫిరాయించితే అది ఆ న్యాయమూర్తి వృత్తి జీవితానికి కళంకం కాదా!ఒక రాజకీయ వేత్త తనమీద లక్ష కోట్ల కుంభకోణం తన మీద ఆరోపించబడినా తన పార్టీ మీద పట్టు ఉన్నంతకాలం అతడికి ఏ హానీ జరగదు.ఆ నాయకుడు ఎన్నికల్లో గెలిచి ప్రజాభిమానం ద్వారా తన కళంకాన్ని పోగొట్టుకునే అవ్కాశం ఉంటుంది.న్యాయవ్యవస్థలోని ప్రతి ఒక్కరూ ఇండియన్ బార్ కన్సిల్ అనేదానికి జవాబుదారీగా ఉండాలి.ఒక న్యాయమూర్తి పైన స్వచ్చమైన ప్రాంతీయాభిమానంతోనే అయినా ఒక తప్పులతడక చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా వొదిలెయ్యటానికి సంబంధించి మచ్చ పడితే ఆ న్యాయమూర్తి తన మరకని కడుక్కోగలిగిన అవకాశం ఉందా?లేదు, కనుక తెలంగాణ ముఖ్యమంత్రి మరియూ మంత్రివర్గం కాస్త నిదానించి న్యాయవ్యవస్థని కూడా మితిమీరిన ప్రాంతీయాభిమానంతో భ్రష్టు పట్టించకుండా ఉంటే బాగుంటుంది!చట్టాలు చేసే సమయంలోనే లోపాలు లేకుండా జాగ్రతపడితే కోర్టులు ఎందుకు కొట్టేస్తాయి?ఒకసారి న్యాయవ్యవస్థ మీద ప్రజలకి విశ్వాసం పోతే మళ్ళీ పునరుద్ధరించటం చాలా కష్టం - అది రాజకీయ వ్యవస్థ లాంటి మొండి బంద వ్యవహారం కాదు!అసలు ప్రజలకి న్యాయవ్యవస్థ మీదే విశ్వాసం పోయిన తర్వాత ప్రభుత్వం ఉండి కూడా లేనట్టే!ఎవడు ఏ రకమైన దొంగల దోపిడీ నుంచి అరాచకత్వం వరకు ఏమి చేసినా చెడిపోయిన న్యాయవ్య్వస్థని అడ్డు చేసుకుంటే చాలు ప్రభుత్వం వాడి కాలిగోరుని కూడా పెకలించలేదు - గోటితో పోయేదానికి గొడ్దలి వాని వివేకం తెలంగాణ ప్రభుత్వాని కుండాలి.

          ఈ లోపాలు సవరించుకోకుండా సమర్ధవంతమైన పరిపాలనను ప్రజలకు అందించడం అసంభవం.కాబట్టి ప్రభుత్వపక్షం ఎక్కువకాలం గాలిలో తేలిపోకుండా తొందరగా నేలమీదకి రావాలి.సెటిలర్లు బుట్టలో పడిపోయి వోటు వెయడం వరకు బాగానే ఉంది,కానీ ఉద్యమ కాలంలో మీరేమి చెప్పారో గుర్తుందా?మన ఉద్యోగాలు ఆంధ్రోళ్ళు లాక్కున్నారు,వాళ్ళని వెళ్లగొట్టేస్తే చాలు ఆఉద్యోగాలన్నీ మీకు వస్తాయి అన్నారు - అనలేదంటే చెయ్యగలిగింది లేదు.మరి ఇప్పుడు వీళ్లందర్నీ ఆంధ్రాకి వెళ్లగొట్టకుండా తెలంగాణ ప్రజలకి ఉద్యోగాలు చూపించాలి.ఉపాధి కల్పనా రంగాన్ని వీళ్ళందరికీ అవకాశాల్ని కల్పించేటంతగా విస్తరించాలి,లేని పక్షంలో గంప లాభం చిల్లి తీసినట్టు తెలంగాణ జనం మీకు పెద్ద బొక్క చూపిస్తారు.

తెలంగాణ ప్రాధమికంగా ఓక భౌగోళిక నామం,అంతిమంగా ఒక సాంస్కృతిక రాజకీయ వారసత్వం

Thursday, 28 January 2016

చంద్రబాబుకి సిగ్గూ శరమూ పౌరుషం ఉంటే ముందు అమరావతి శంకుస్థాపన శిలాఫలకం మీద ఉన్న కేసీఆర్ పేరుని తొలగించాలి!

          "అమరావతికే దిక్కు లేదు.ఈ పెద్దమనిషి హైదరాబాదుకు నిధులు తీసుకొస్తాడంట!యాడికెల్లి తెస్తడు?","నా కళ్ళముందే మోదె రెండు మట్టికుందలు ఇచ్చిండు,అయ్యి తీసుకుని ఈయన పళ్ళికిస్తండు!" - ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి సరికొత్త ద్వేషభాష.పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదని పెద్దలు వూరికే అన్నారా?కొన్నాళ్ళ పాటు నాలిముచ్చులా కిక్కురుమనకుండా ఉండి ఉండి ఇక వూరుకుండలేక తన అసలు రూపం ఇట్లా చూపిస్తున్నాడు - సిగ్గు లేకపోతే సరి!

          ఉద్యమ సమయంలో ప్రపంచంలో మాది న్యాయపోరాటం అని చెప్పుకునేవాళ్ళంతా సిగ్గు పడేటట్టు వీధి గూండాలూ ఆకు రౌడీలూ కూడా మాట్లడని బజారు భాష మాట్లాడి అయినా ఏనాడూ ప్రజలు ఉద్యమానికి అనుకూలంగా స్పందించక వరసపెట్టి ధరావతులు పోగొడుతుంటే స్వాభిమానం గలవాడెవ్వడూ చెయ్యనంత దిక్కుమాలిన పద్ధతికి తెగబడి  బల్లకింద చేతులు పెట్టి తెచ్చుకున్నందుకే అల్లాబ్డం బెల్లాండం బద్దలు గొట్టిననతగా విరగబడుతున్నారు.అన్ని గొడవలు చేసి రాష్ట్రం సాధించుకున్నా ప్రపంచంలో అంత సుదీర్ఘ పోరాటం చేసి విజయతీరం చేరిన ఏ ఉద్యమ రధసారధికీ రానంత ఉసూరుమనిపించే బొటాబొటీ మెజారిటీ వస్తే దాన్ని పెంచుకోవటానికి చక్కనైన రాజమార్గము యెటూ దొరక్క సందుగొందులు వెతుకుతూ ఆ పార్టీ ఈ పార్తీ అని లేకుండా గుంపులు గుంపులుగా పక్కలేయ్యటం ఒకటే తక్కువ అన్నంత నీచపు రాజకీయం చెయ్యటమే గొప్ప రాజనీతి అని ఈ సంకర జాతి వంకర బుద్ధుల అధమాధముడూ మరియూ నోరు తెరిస్తే ఉఛ్చనీచాలు లేకుండా రొచ్చుభాష మాట్లాడే ఇంతటి బజారు మనిషిని కూడా వాక్చాతుర్యం గలవాడని కొనియాడుతూ అక్కున జేర్చుకోగలిగిన రెండు నాలుకల విషసర్పాలూ జబ్బలు చరుచుకుంటూన్నారు గానీ వీళ్ళ నిజమైన తెలివి తేటలు ఎవడికి తెలియవు? 

@అమృతమధనం
కాలాన్ని జయించిన దైవాంశ సంభూతుడు
31, మే 2015, ఆదివారం
బాబు అదృష్టజాతకుడు కాకుంటే మరేంటి. దేవుడిచ్చిన సంతానాన్ని వద్దని ఎలా అడ్డుకుంటాం, ఏ సంఖ్యలో ఏ మహాత్ముడు పుడతాడో అని ఎన్టీఆర్ నమ్మడమే కాకుండా డజను మంది పిల్లలకు తండ్రయ్యారు. కానీ ఆ డజను మంది పిల్లలుండి అల్లుడు వారసుడైన రాజు కథ చరిత్రలో ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే బాబు అదృష్టజాతకుడు కాబట్టి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపికి, ఎన్టీఆర్ అభిష్టానికి వ్యతిరేకంగా అల్లుడు రెండో తరం వారసుడు. ఆ అల్లుడు అచ్చం రాజరికంలో యువరాజును జాతి జనులకు పరిచయం చేసినట్టు తన యువరాజ పట్ట్భాషేకం మహానాడులో జరిపించారు. అంతేనా తన మామ ఉదంతాన్ని చూసిన అల్లుడు తన కుమారుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కుమారుడి వారసుడ్ని కూడా పనిలో పనిగా మహానాడులో దేశ ప్రజలకు పరిచయం చేశాడు. నాలుగవ తరం యువరాజు దైవాంశ సంభూతుడు అని నమ్మడమే కాకుండా అదే పేరు పెట్టారు. దైవాంశ సంభూతుడు మాత్రమే రాజవుతాడు. జాతకంలో కాదు ఏకంగా పేరులోనే దైవాంశ ఉందంటే బాబుగారి విజన్‌కు తిరుగలేదని ఒప్పుకుంటావా? సినిమాలో యువరాణి వెంట చెలికత్తెలు, యువరాజు వెంటన అంజిగాడు లాంటి కామెడీ బృందం ఉన్నట్టు అచ్చం తెలుగు యువరాజుల వెంట ఎమ్మెల్యేల సంతాన బృందం తిరుగుతుంటే నాకైతే సినిమాల్లోని రాజరికాన్ని కనులారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్టుంది.


@అమృతమధనం
20, జనవరి 2016, బుధవారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ఎలా అయినా ఉండవచ్చు, ఎన్నికలు జరగకముందే ఒక కీలకమైన విషయంలో మాత్రం ఈ ఎన్నికలు స్పష్టత నిచ్చాయి. కెసిఆర్ రాజకీయ వారసుడు ఎవరు? అనే ప్రశ్న ఉదయించక ముందే కెసిఆర్ వారసుడు కెటిఆర్ అని తేల్చేశాయి.తాను పదేళ్లు పాలించడమే కాకుండా తన వారసునిగా కెటిఆర్‌ను తీర్చిదిద్దడానికి పూనుకుని కెటిఆర్‌కు తొలి అసైన్‌మెంట్‌గా గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలు అప్పగించారు. బలం లేకపోవడం వల్లనే గత ఎన్నికల్లో అసలు పోటీ చేయని గ్రేటర్‌లో కెటిఆర్ నాయకత్వంలో విజయం సాధిస్తే, వారసత్వానికి ప్రజల నుంచి కూడా ఆమోదం లభిస్తుందనే వ్యూహంతోనే గ్రేటర్ బాధ్యతలు కెటిఆర్‌కు అప్పగించి ఉండవచ్చు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపినే మూడవ తరం వారసుడిని సిద్ధం చేసుకుంటోంది. ప్రాంతీయ పార్టీలకు ఔనన్నా కాదన్నా కుటుంబ సభ్యులే వారసులవుతారు.ఎన్టీఆర్ తన వారుసుడిని తాను నిర్ణయించలేకపోయారు. చాలా కాలం క్రితం బాలకృష్ణ తన వారసుడు ఎన్టీఆర్  అని ప్రకటిస్తే, ఆ ప్రకటన ఉపసంహరించుకునే విధంగా చంద్రబాబు ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు.టిడిపికి ఎన్టీఆర్ కోరుకున్నట్టుగా కుమారుడు వారసుడు కాలేదు. బలవంతంగా అల్లుడు వారసుడయ్యారు. బాబు మాత్రం పగడ్బందీగా తన కుమారుడిని వారసుడిగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ తన  అల్లుడి రాజకీయాన్ని అర్ధం చేసుకోలేదు, కుమారులకు రాజకీయ పరిజ్ఞానం లేదు. దాంతో ఎన్టీఆర్ కోరుకున్న విధంగా టిడిపికి వారసుడు రాలేదు.కానీ కెసిఆర్ విషయం అలా కాదు. రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఈ కాలానికి తగిన నాయకుడి లక్షణాలున్న తెలివైన కుమారుడు ఉన్నారు. సహజంగా ఎవరైనా తన వారసత్వం తన కుమారుడికే దక్కాలని కోరుకుంటారు. కుమారులకు తెలివితేటలు లేకపోతేనే వారసత్వం దక్కకుండా పోతుంది. కెసిఆర్ సైతం అంతే. 

@హరికాలం
ఈనాటి బూటకపు ప్రజాస్వామ్యాన్నీ ఆనాటి నీతిగల రాజస్వామ్యాన్నీ ఒక్కచోట చేర్చి అసమానతలకు పరిష్కారంగా క్షీరసాగర మధనం జరిపించడానికి ప్రాంతీయవాదాన్ని మంధరగిరిని చేసి అధికార ప్రాప్తిని వాసుకిగా మలచి సుస్థిరత్వం అనే శ్రీకూర్మం పైకి కనబడకుండా చేస్తున సహాయంతో విద్వేషానల హాలాహలం చల్లబడిన తర్వాత పైకి తేల్చిన అమృతరసగుళీకలా ఇవి!


          బుడ్డా మురళి గారు వయస్సులోనూ చదువులోనూ అనుభవంలోనూ ఎన్నదగిన వాడే.నేను ఇదివరకు చాలాచోట్ల చెప్పినట్టు వ్యక్తిగత జీవితంలో నిష్కళంకమైన వ్యక్తియే కావచ్చు.ఈ హరిబాబు అనే బ్లాగరు నిజజీవితంలో అనైతిక శృంగార పిపాసి కావచ్చు!కానీ బ్లాగులలో ఎవరు ఎలా ఉంటారో తెలియని పరిస్థితిలో ఎవరయినా ఈ ఇద్దర్నీ ఎలా అంచనా వేస్తారు?తమ బ్లాగుల్లో రాస్తున్న పోష్టుల్ని బట్టీ ఇతర బ్లాగుల్లో వేసేఅ కామెంట్లని బట్టే కదా! బుడ్డా మురళి గారు పాత పోష్టులో చంద్రబాబు చేసిన పనిని రాజరికంతో పోల్చి ఎన్నో వ్యంగ్యాల్ని కురిపించి కొత్త పోష్టులో చంద్రశేఖర రావు అదే పని చేస్తే 360 డిగ్రీలు తిరిగేసి అది సహజమే అంటున్నారు - ఎంత రాజకీయం ముదిరినా బుద్ధికీవులు ఇంత అడ్డగోలుగా మాటలు మార్చవచ్చునా!నిన్నటి రోజున బహుశా రేపెప్పుడయినా మనవాడూ ఇదే పని చేస్తాడేమో ఎందుకొచ్చిన గోల పొరుగురాష్ట్రపు ముఖ్యమంత్రిని గురించి అవాకులూ చెవాకులూ వాగడం అని కూడా అనిపించనంతగా ఆయనలోని ద్వేషం కంటికి పొరలని కమ్మించింది కాబోలు?!ఒకే ఒక సమర్ధన!చంద్రబాబు మా ప్రాంతాన్ని భ్రష్టు పట్టించాడు కాబట్టి అతను ఏం చేసినా వెక్కిరిస్తామే తప్ప పొగడం, చంద్రశేఖర రావు మా ప్రాంతాన్ని ఉద్ధరిస్తాడని నముతున్నాం గాబట్టి అతన్ని కీర్తిస్తామే తప్ప లోపాలు ఉన్నా సహిస్తాం - అంతేనా?దీనికొక లేబుల్ పెట్టారు ప్రాంతీయాభిమానం అని,కానీ వాస్తవంగా ఇది పని చేస్తున్నదా!


Telangana Assange
Tuesday, 12 January 2016
ప్ర‌స్తుతం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లను చూస్తుంటే అప్ప‌ట్లో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అన్న మాట నిజ‌మేనేమో అన్న రీతిలో టీఆర్ఎస్ స‌హా అన్ని రాజ‌కీయ పార్టీల ప్ర‌చారం సాగుతోంది. హైద‌రాబాద్ అంతా మేమే(ఆంధ్రా సెటిల‌ర్లు) ఉన్నామ‌ని ల‌గ‌డ‌పాటి, ఇత‌ర ఆంధ్రా నేత‌లు అన్నారు.. ఆ స‌మ‌యంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎంత స‌ర్వే చేసినా 5 ల‌క్ష‌ల మందికి మించి లేర‌ని వాదించారు. మ‌రి హైద‌రాబాద్ లో కోటి మంది ఉంటే అందులో ఉన్న 5 ల‌క్ష‌ల మందిని ఊర‌డించ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్‌, ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారం చేయ‌డం ఏంటి? ఈ త‌ర‌హా ప్ర‌చారం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌నికి వ‌స్తుందేమో కానీ.. రానున్న రోజుల్లో యావ‌త్తు తెలంగాణ స‌మాజం ముందు మ‌ళ్లా మీరు ఏ మాట‌లు చెప్పి ప్ర‌చారానికి వెళ్తారో ఆలోచించుకోవాలి... సెటిల‌ర్ల‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి కూడా సిద్ధంగా ఉన్నామ‌నే రాజ‌కీయ నేత‌ల్లారా... ఏ త‌ప్పు చేశామ‌ని క్ష‌మాప‌ణ‌లు కోర‌దాం అనుకుంటున్నారు... తెలంగాణ స‌మాజాన్ని అను నిత్యం అవ‌మానించిన పెద్ద మ‌నుషులు క‌నీసం తాము త‌ప్పుగా మాట్లాడామ‌ని ఇప్ప‌టికీ అంగీక‌రించ‌డం లేదు.. అలాంటిది ఏ త‌ప్పూ చేయ‌ని మీరు మ‌నం అంతా గ‌తంలో త‌ప్పులు చేసిన‌ట్లుగా ఇప్పుడు మాట్లాడ‌టం అంటే అది తెలంగాణ స‌మాజాన్ని అవ‌మానించ‌డ‌మే

@హరికాలం
ఇప్పుడు కూడా మీకు అర్ధం కావడం లేదా మీరు గొప్పగా చెప్పుకుంటున్న ప్రాంతీయ వాదం ఎంత బూటకమో!మా ఉద్యోగాలు దోచుకున్నారు అని గిర్గ్లానీ రిపోర్టు చూడమన్నారు మీవారే ఒకరు.చూస్తే "అన్యాయం ఒక్క తెలంగాణా ప్రాంతం వారికే కాదు అన్ని ప్రాంతాల వారికీ జరిగింది" అన్నాడు గిర్గ్లానీ గారు.మీ వాదననీ మీరు సపోర్టుగా తెచ్చుకున్న గిర్గ్లానీ గారి మాటనీ కలిపి చూస్తే తెలంగాణా వారికి ఉద్యోగాల్లో జరిగిన అన్యాయానికి ఆంధ్ర ప్రానతం వారు కారణమైతే మరి ఆంధ్ర ప్రాంతం వారికి జరిగిన అన్యాయానికి తెలంగాణా ప్రాంతం వారు కారణం అయినట్టు కాదా,చెప్పండి!

మా నీళ్ళు దోచుకున్నారు అని విడిపోయారు.ఎక్కువ నీటి కోసం ఇదివర్లో నాలుగ్ రాష్ట్రాల మధ్య అజరిగిన ఒప్పందాల్ని మార్చమంటున్నారు.అది నిజంగా సాధ్యపడుతుందనే అనుకుంటున్నారా మీరు?ఇదివరలో నాలుగు రాష్ట్రాలుగా భాగాలు పంచుకున్న నీటిని తెలంగాణా వాటా పెర్గడాని కనుకూలంగా అయిదు రాష్ట్రాల మధ్య పంచాలంటే ఆంధ్రా మా నీళ్ళూ దోచుకున్నారు అంటున్నందు వల్ల కిక్కురు మనకుండా వూరుకున్నా మిగతా మూడు రాష్ట్రాలూ తమ వాటా తగ్గించుకుంటాయా?వేరే రాష్ట్రంగా విడిపోయాక ఆంధ్రా మాత్రం వూరుకుంటూందా?అన్ని చోట్లా ప్రతిపక్షాలు ఉన్నాయి,ఏ  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వూరుకుంటుంది?అందుకే కదా సమైక్య రాష్ట్రానికి దఖలు పడిన నీటినే ఈ రెండు తెలుగు రాష్ట్రాలూ పంచుకోవాల్సిందే తప్ప పాత ఒప్పందాన్ని తిరగదోడటం కుదరదంటున్నారు.

ప్రాణహిత చెవెళ్ళ యేనా?ప్రాజెక్టుని సాక్షాత్తూ ముఖ్యమంత్రియే రంగం లోకి దిగి డిజైను మార్చి చివరి ముక్కని కత్తిరించారు,ఎందుకని?అరిచి గింజుకున్నా ఐంతకు మించి నీళ్ళు రావని కాదా!

మీరు ఇదే బ్లాగులో సాక్షాత్తూ తెలంగాణ ప్రబ్బుత్వమే తెలంగాణ కాంట్రాక్టర్ల క్వాలిటీ బాగోలేదని ఇంకా ఆంధ్రా కాంట్రాక్తర్లకే అన్నీ కట్టబెడుతున్నది,మనవాళ్లని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది,లేకపోతే తెలంగాణా కాంట్రాక్తర్లు సబ్ కాంట్రాక్టర్లుగా మిగిలిపోతారేమో అని అనుమానం వ్యక్తం చేశారు!ఎంత కాలమైంది మీకా అనుమానం వొచ్చి?పరిస్థితి ఏమన్నా మారిందా,తెలుసుకోండి!

Tuesday, 28 April 2015
మ‌న కాంట్రాక్ట‌ర్ల‌నూ ప్రోత్స‌హించండి...! స‌బ్ కాంట్రాక్టర్లుగా మ‌న‌వాళ్ల‌ను మార్చొద్దు..!!

ఆంధ్రా నేత‌ల‌తో సంబంధం ఉన్న కంపెనీల‌కు తెలంగాణ కాంట్రాక్టులు ఇవ్వొద్దు..
Wednesday, 10 June 2015

Tuesday, 12 January 2016

హైద‌రాబాద్ నిండా సెటిల‌ర్ల ఓట్లే ఉన్నాయా?

మరి అరవయ్యేళ్ళ పాటు అంగలార్చి వీళ్ళు సాధించింది ఏమిటి?వీళ్ళ సొల్లుకబుర్లలోని డొల్లతనం ఇప్పటికీ తెలియడం లేదు గానీ ఎప్పటికయినా వీళ్ళకి తెలుస్తుందా?


          తెలంగాణ అసాంజి అని నిష్పక్షపాతంగా వాస్తవాల్ని బయటపెట్టిన ప్రముఖుడి పేరుతో ఉన్న ఈయనకి చంద్రబాబు అంటే ఎంత ద్వేషమో చూడండి!ఆయన బ్లాగులో పైన ప్రముఖంగా ఒక ఒపీనియన్ పోల్ ఉంటుంది "చంద్రబాబుని అరెస్టు చేయాలా?" అనే అంశం మీద!ఓటుకు నోటు కేసుకు ఈయనగారి బుర్ర అతుక్కుపోయి చంద్రబాబుని అరెస్టు చేస్తే చూడాలనీ పరారీలో చంద్రబాబు అనై వారత్ వస్తే చూడాలనీ తపించిపోతున్న మూర్ఖ ద్వేషంలో ఈయన ఉన్నాడు గానీ టెలిఫోను ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టయితే చూడాలని తపించిపోతూ ఏ ఆంధ్రా బ్లాగరయినా ఉన్నాడా?

          ఒక ప్రాంతం వాళ్ళు మమ్మల్ని దోచుకున్నారు గాబట్టి మేము వెనకబడిపోయాము,వాళ్ళని మా ప్రాంతం నుంచి తన్ని తరిమేసి మా ప్రాంతం ప్రత్యేక రాష్త్రంగా విడిపోయి మా ప్రాంతం వాళ్ళు పరిపాలిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది,వాళ్ళలా కాకుండా మేము స్వచ్చమైన రాజకీయాల్ని సాధిస్తాం,వాళ్ళలా కాకుండా మేము న్యాయంగా ఉంటాము అని బల్ల గుద్ది వాదించిన వీరాధివీరులు ఇవ్వాళ అదే రకం కుటుంబ పాలన,అదే రకం కులగజ్జి రాజకీయం,అవే రకం వలసల బలుపుతో కప్పలతక్కెడ లాంటి చిక్కురొక్కురు దరిద్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నా కిక్కురుమనకుండా ఎందుకు పడి ఉంటున్నారు,నిలదీసి అడగాల్సిన వాళ్లని అదేమని అడక్కపోగా సమర్ధించుకుంటున్నారు?ఎవరో మమ్మల్ని ద్వేషించారు,అందువల్ల మాకు బాద కలిగింది అన్నవాళ్ళు ఇంకా ద్వేషాన్ని వదలకుండా ఇంత మొండిగా ఆంధ్ర ప్రాంతపు రాజకీయ నాయకుల మీద ఎందుకు విషం కక్కుతున్నారు?

          వీళ్ళ సొంపుకీ వీళ్ళ సోయకీ వీళ్ల నాయకుడి దొంగ నిరాహార దీక్షలకీ ఏమిటి ఆంధ్రోళ్ళ దోపిడీ ఎక్కడ జరిగింది చెప్పండి అని నిలదీస్తే జవాబు చెప్పలేని దేబెతనాన్ని కప్పి పుచ్చుకోవటానికి ఆర్టికిల్ మూడు ద్వారానే కావాలి అన్నా అక్కడ కూడా అత్తెసరు మేజార్టీ ఉన్న దిక్కుమాలిన కాంగ్రెసు చేసిన ఇంకొన్ని బేవార్సు పనులతో తెచ్చుకుని ప్రజల్లో వూపు లేక వలసలకి లాకులెత్తి రాష్ట్ర పునర్నిర్మాణానికి మళ్ళీ ఆంధ్రోళ్లనే బతిమిలాడుకుంటున్న ఫెయిలైపోయిన ఉద్యమాన్ని చూసుకుని వీళ్ళు గర్విస్తూ నన్ను తెలంగాణా ద్వేషిని అని స్టాంపు కొడితే కొట్టారు గానీ మేము తెలంగాణా వాళ్ళం ఇదీ మా సంస్కృతి అని గొప్పగా చెప్పుకుని గర్వపడేలా వీళ్ళ ఉద్యమం గానీ వీళ్ళ ప్రవర్తన గానీ ఉందా?ఈ మేతావులూ ఈ మేతావులు గాలికొడుతున్న కేతిగాడూ నిజమైన తెలంగాణ సంస్కృతికి ప్రతినిధులా?వీళ్ళలో ఉన్నదే నిజమైన తెలంగాణా సంస్క్రి అయితే నిజంగా తెలంగాణ తల్లి సిగ్గు పడాల్సిందే!

          ఇంతకీ వీళ్లని కాదు అనాల్సింది,వీళ్ళ అబద్ధాల్ని బట్టబయలు చెయ్యలేని ఆంధ్రా రాజకీయ నాకకుల్ని.ముఖ్యంగా సిగ్గూ సరం లేని చంద్రబాబుని!మొదటి నుంచీ ఈ ప్రబుద్ధుడు నందమూరి తారక రామారావు లాగ స్వాభిమానం ఆభిజాత్యం అనే రెండు రెక్కలు దాల్చి ఎగిరే వైనతేయుడిలా కాక వెన్నుపోటు రాజకీయాలతో పైకొచ్చినవాడు గనక తన బుద్ధి ప్రకారమే నడుచుకుంటున్నాడు.ఎంత క్షాత్రం లేనివాడు కాకపోతే ఉద్యమ కాలంలో ఆంధ్రావాళ్ళని అన్ని తిట్టినా,రాష్ట్రం విడిపోయాక కూడా రోజుకొకసారి తనమీద విషం కక్కుతూ కేసు పెట్టి "ఇక చంద్రబాబుని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు!" అని హుంకరించిన వాణ్ణి ఇంటికెళ్ళీ బొట్టూ కాటూక పెట్టి మరీ పిలుస్తాడు?

        చీ!ఛీ!ఇంత పౌరుషం లేనివాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అనవసరం.మన ప్రాంతం వాళ్ళ శ్రమతో ఉమ్మడి రాష్ట్రపు ఆదాయంలో 45% ఒక నగరం నుంచే వచ్చేలా చేసి దాన్ని విశ్వనగరంలా నిలబెట్టి విడిపోయే నాటికి వాళ్ళని నిలవలో ఉంచి మనం లోటుబడ్జెట్ తెచ్చుకుని మన కష్టమనతా వాళ్ళ యదాన గొట్టి కట్టుబట్టలతో తరిగొచ్చాక కనీసం మానుషమన్నా నిలబడకపోతే జాతికి బతుకు దేనికి?మర్యాద మంటగలిసిపోయాక అభివృధ్ధిని ఏం చేసుకుంటాం?రోటీ,కపడా ఔర్ మకాన్ తర్వాత ముఖ్యంగా ఉండాల్సిన ఇజ్జ్జత్ పోయింది - దీనమ్మా అతి మంచితనం,ఇంకెన్నాళ్ళు! 

          ఎందుకంత గజ గజ లాడి చస్తాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే?ఏం,తలగొట్టి మొలేస్తాడా!మాటి మాటికీ విభజన సమస్యల్ని పరిష్కరించుకుందాం రా అని ఇతను పిలవడం దేనికి?అన్ని సార్లు పిల్చాడు,ఒక్కసారైనా జవాబు చెప్పాడా,లేదు - కనీసపు స్పందన కూడా లేదు!తనకి అవసరం ఉంటే ఉరుక్కుంటూ రాడా!ప్రతి విషయం లోనూ వయస్సులో అంబుభవంలో సమర్ధతలో - అన్నింటా అధికుదై ఉండి కూడా తనకన్న అల్పుడి ముందు ఎందుకీ సాగోఅరటం,చీ చీ!మర్యాదకీ మంచితనానికీ కూడా హద్దూ పద్దూ ఉండాలి,కుదరదు - వెంఠనే అమరావతి శంకుస్థాపన శిలాఫలకం మీద ఉన్న ఈ అధముడి పేరుని తొలగించి పారెయ్యాలి.ఇప్పుడున్న శిలాఫలకం మీద మార్పులు చెయ్యటం కుదరకపోతే ఆ పెరు లేకుండా కొత్తది చేయించి తీరాల్సిందే!


మరీ ఇంత మానుషం లేనివాడు పౌరుషానికి మారుపేరయిన ఆంధ్రులకి ముఖ్యమంత్రిగా పనికిరాడు!

Tuesday, 25 August 2015

గుడుంబాను నిరోధించటానికి చీపు లిక్కరును ప్రోత్సహిస్తున్నారట!చీపు లిక్కరుని నిరోధించటానికి దేన్ని ప్రోత్సహిస్తారు?

తాటిచెట్టు యెందుకెక్కావురా అంటే దూడగడ్డి కోసం అన్నాట్ట!యేమో వాడి తెలివి వాడిది కావచ్చు - యెక్కడ మంచి గడ్డి ఉందో పరకాయించి చూడ్డానికి యెక్కాడేమో!మన గవర్నమెంటు వారు ఇంకా తెలివైనవారు కదా ప్రజల సంక్షేమం కోసం యెన్నో మంత్రిత్వ శాఖల్ని యేర్పాటు చేశారు.కుటుంబనియంత్రణ శాఖ ద్వారా పిల్లల్ని పుట్టకుండా చేస్తారు.శిశు సంక్షేమ శాఖ ద్వారా పుట్టిన పిల్లల్ని చావకుండా బతికి ఉంచుతారు.ఆర్ధికశాఖతో పన్నులు వేసి గోళ్ళూడగొట్టి వసూలు చేస్తారు.పోలీసు శాఖతో లాఠీలకి పని చెప్పి అల్లరిపిడుగుల్ని వీపు సాపు చేసి దారికి తీసుకొస్తారు.ఇవ్వన్నీ సరిగ్గా పని చేసినా చెయ్యకపోయినా కంగారు పడరు గానీ ఒక శాఖ సరిగ్గా పని చెయ్యకపోతే మాత్రం గంగవెర్రు లెత్తిపోతారు - ఆరోగ్యశాఖ అనుకునేరు,కాదు కాదు త్రాగుడు శాఖ?!

త్రాగుడు శాఖ గనక సరిగ్గా పని చెయ్యకపోతే ప్రభుత్వం తాగినోడికి మల్లే తూలిపోతుంది!యెందుకంటే ఉద్యోగస్తుల,మంత్రుల,శాసనసభ్యుల జీతాలన్నీ అందులొంచే యేర్పాటు చేశారు మరి?కొన్ని కోట్లమంది తాగి తాగి చస్తూ బతుకుతూ ఉంటే గానీ ఆ ఘనకార్యం నెరవేరదు,జనం చచ్చి ప్రభుత్వాన్ని బతికించాలి!అసలు రాజ్యం లక్షణమే అంత,రాజ్యానికి రెండు ముఖాలు ఉంటాయి - కరెన్సీ,లాఠీ!మొదటిది రాజ్యం సరిహద్దుల్లో యెక్కడయినా చెల్లుతుంది.సంపాదన,ఆస్తి,మిగులు,అప్పు,వడ్డీ,బ్యాంకింగు ఇవన్నీ జనానికి తిండినీ కాల్క్షేపాన్నీ ఇస్తాయి.ఒకడు మరీ పేట్రేగిపోయి అల్లరి చేస్తే అప్పుడు లాఠీ లేస్తుంది.అరెస్టులు,కేసులు బుక్ చెయ్యడాలు,లాయర్లు,కోర్టులు,తీర్పులు అదో గందరగోళం - అటుకేసి సుఖపడాలనుకున్నవారు యెవరూ ఒకంతట పోరు.మాటిమాటికీ లాఠీ ఉపయోగించాలంటే కష్టం కదా!లాఠీ వరకూ వెళ్ళకుండానే ప్రజల్ని బుధ్ధిగా ఉంచటానికి పనికొచ్చే రెండు చేతులు కూడా ఉన్నాయి రాజ్యానికి - మతం,మత్తు!

మొదటిది చాలా శక్తివంతమైనది,పైగా నిరపాయకరమైనదీ గౌరవనీయమైన పధ్ధతి!ప్రతి మతమూ తను నిర్వచించిన ప్రత్యేక లక్షణాల్తో కూడుకున్న సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నమ్మమంటుంది,దేవుడికి నచ్చేవి అని చెప్పి కొన్ని సూత్రాలని పాటించమంటుంది.మంచిపనులు చేస్తే బతికున్నప్పుడు కష్టాలు పడ్డా చచ్చాక స్వర్గంలో సుఖపడవచ్చు నంటుంది,దేవుడికి నచ్చని పనులు చేస్తే చచ్చాక నరకంలో కష్టాలు పడాల్సి వస్తుందని బెదిరిస్తుంది.ఆ మార్మికత ప్రభావం వల్ల దేవుడికి నచ్చే పనులు చేస్తూ బతికుండగా కష్టాలు పడినా చచ్చాక సుఖపడొచ్చుననే ఆశతో కష్టాన్నే ఇష్తంగా చేసుకుని విధేయతని పాటిస్తారు కొందరు - వారు భక్తులు!ఆ విధేయతని మెల్లగా రాజు/ప్రభుత్వం వైపుకి మళ్ళించడం చాలా తేలిక!అందుకే రాజ్యం కనిపించీ కనిపించకుండా చాపకింద నీరులా పనిచేస్తూ ప్రజలకి యెక్కువ విధేయతని అలవాటు చేసే మతాన్ని కొంచెం ఎక్కువగా ప్రోత్సహిస్తుంది!విస్కీ సీసాకీ విబూదిపండుకీ ముడిపెడుతున్నానని అనుకోకండి - రెండూ కిక్కునిచ్చేవి గాబట్టి కొంచెం సోదరస్తుతి!

అలా విధేయతకి అలవాటు పడిన ప్రజలు అంటే రాజ్యానికి చాలా ఇష్టం,కానీ అందర్నీ అట్లా మార్చలేరు,కొందరు హేతువాదులు ఉంటారు,కొందరు ఠాట్ నాకు ఇక్కడే సుఖాలు కావాలి అనే తిరుబాటుదార్లు ఉంటారు - వారికోసం యేర్పాటు చేసిన సదుపాయమే మధుపానం!మధుపానం ఇప్పటిదా?దీని చరిత్ర క్షీరసాగరమధనంతో మొదలవుతుంది!అసలు కన్నా కొసరు ముద్దని అమృతమేమో అని దేవతలూ దానవులూ భ్రమపడిన సుర అమృతం కన్నా ముందే పుట్టింది గదా!అసలుది ఉందో లేదో తెలియని కల్పన అయితే కొసరుది యెక్కడ బడితే అక్కడ కనిపించే వాస్తం.గట్టిగా అంటే సనాతనులు పోట్లాటకి వస్తారు,వచ్చినా రానీండి గానీ యజ్ఞ యాగాదులలో ప్రవహించే సోమం ఇదేనని హేతువాదులు పరిశోధనలు చేసి తేల్చిచెప్పారు!ఆదిశేషుని అపరావతారం బలరామ దేవులు మధూపానాసక్తుడనేది జగద్విదితమే!

అన్ని మతాల్లోనూ మామూలు రోజుల్లో అవాంచనీయమని చెప్పి శ్రోత్రియులకి నిషేధించినా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు కూడా మద్యాన్ని పవిత్రీకరించి స్వీకరించడం జరుగుతూనే ఉంది?!యెందుకయ్యా ఇంత ఆకర్షణ అంటే కల్లు,మద్యం,గుడుంబా,భంగు,కొకైన్,టెనిన్,కెఫేన్,మార్ఫిన్ - అవన్నీ వైద్యశాస్త్ర పరంగా తగుమాత్రం పుచ్చుకుంటే దేహబాధల్నీ మనోరుగ్మతల్నీ ఉపశమింపజేసే మంచి లక్షణం ఉంది.మనిషి శారీరకంగా గానీ మానసికంగా గానీ ఒక మోతాదుని మించి కష్తపడితే శరీరంలో లాక్టిక్ యాసిడ్ యెక్కువగా  ఉత్పత్తి అయ్యి నెప్పుల్ని కలిగిస్తుంది.కొంచెం శ్రమ వల్ల పుట్టే నెప్పులకి నిద్ర సరిపోతుంది.అదికశ్రమకి గురయితే కేవలం నిద్ర చాలదు,అటువంటి సమయంలో తగుమాత్రంగా పుచ్చుకుంటే అందులో ఉండే ఆల్కహాల్ లాక్టిక్ యాసిడ్ వల్ల కలిగే నెప్పుల్ని తగ్గిస్తుంది!కానీ ఆ సమయంలో మనస్సులో కలిగే భ్రమలకి అతిగా దాసుడైతే అవసరం ఉన్నా లేకపోయినా తీసుకోవాలనిపిస్తే వ్యసనం అయి కూర్చుంటుంది - నెత్తిమీదకి కొత్త కష్టాల్ని తెస్తుంది?!

తాగుతున్న వాళ్ళు అందరూ చావరు!డబ్బున్న మారాజులకి యే కొంచెం శృతి మించి ఆరోగ్యం ప్రమాదంలో పడినా వెంఠనే ఫ్యామిలీ డాక్టరుని మెయింటెయిన్ చెయ్యడం అనే స్టాటస్ సింబల్ యెలాగూ ఉంటుంది గనక తగిన వైద్యం చేయించుకుని ఆయనగారు చెప్పిన సలహాలు పాటించి గుండ్రాయిలా బతికే వీలుంటుంది!యెటొచ్చీ పొద్దస్తమానం పని చేస్తే తప్ప పొట్టగడవని వాళ్ళకి ఈ విధమయిన అదనపు వెసులుబాట్లు ఉండవు గనక చస్తారు.తమ చుట్టూ ఉన్న దరిద్రాన్ని భరించలేక భ్రమల్లో కలిగే ఆనందం హాయిగా ఉంటుంది గనక పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు అన్నట్టు తయారవుతారు,పాపం!ఆ గది మాత్రం తెరవవద్దని అందాల రాకుమారి యెంత చెప్పినా యేముందో చూడాలని దాన్ని పనిగట్టుకు తెరిచి రాకుమారికి దూరమై అలమటించే జానపద కధల్లోని కధానాయకుడిలా తాగిన మొదటిసారి దొరికి మత్తు దిగగానే మాయమైపోయిన ఆనందం కోసం మళ్ళీ మళ్ళీ వెతుక్కునే వాళ్ళు తాగకుండానే ఆనందంగా బతకొచ్చుననే అసలు రహస్యం తెలుసుకుంటే కల్తీదైనా ఫరవాలేదు యెక్కువ ఖరీదయినా ఫరవాలేదు అని అంగలార్చుకు చావరు!

ప్రభుత్వం వారు సంపూర్ణ మద్య నిషేధం పెట్టి నిక్కచ్చిగా అమలు చేయ్యవచ్చు గదా అంటే బూతు సినిమాలని నిషేధిస్తామనగానే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చి ఆవేశపడిపోయిన రామగోపాలవర్మ లాంటివారు పడనివ్వరు గదా!యేదో వ్యంగ్యానికి అన్నాను గానీ మాంసాహారాన్ని నిషేధించి శాకాహారాన్ని ప్రోత్సహించాలనే డిమాండు గతంలో వచ్చినప్పుడు పరమాచార్యులే వ్యతిరేకించారు ఆహారపు టలవాట్లలో బోధన ద్వారా ఇష్టాపూర్తిగా మార్చడమే తప్ప బలవంతంగా నిషేధాలు విధిస్తే ఫలితం వికటిస్తుందని!గట్టిగా నిషేధించాలని ప్రయత్నాలు జరిగినా నిజంగానే ఫలితం వికటించింది!స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం పంతులు గారి హయాములో మద్యనిషేధాన్ని నిక్కచ్చిగా అమలు జరిపినందుకే ఆయన ప్రభుత్వం కూలిపోయింది?ప్రస్తుతానికి దేశంలో నికచ్చిగా గాంధీగారి జన్మస్థానమైనందున గుజరాతులో గట్టిగా అమలు చెయ్యాలనే ఉద్దేశంలో మర్యాదస్తులూ మొహమాటస్థులూ ఉన్నారు గానీ పేరుకి మాత్రమే నిషేధం నడుస్తున్నది - మిగతా చోట్ల కన్నా పైనించి కిందివరకూ అధికారులు యెవరి వాటాలు వారు పంపకాలు వేసుకుని తీసుకునే పధ్ధతిలో సమాంతర ఆర్ధికవ్యవస్థ అనిపించేటంతగా వ్యవస్థీకృతమైన నల్లబజారు విక్రయాలు నిజంగా అక్కడ మద్యనిషేధం అంత బలవంతంగా అమలు చెయ్యడం అవసరమా అనిపించేటట్టు ఉన్నాయి!

ప్రస్తుతం భారతదేశపు రాజ్యాంగం అమలయ్యే భూభాగంలో నిక్కచ్చిగా అమలవుతున్నది లక్షద్వీప్ లోని "Bangaram" దీవిలోనే - కానీ అక్కడ జనావాసాలు లేవు!అచట ఒక రిసార్టు కలదు,రిసార్టు నందు ఒక బార్ కలదు - అచట మాత్రమే సేవించవచ్చు.మిజోరమ్ము వారు 17 సంవత్సరాల సుదీర్ఘనిషేధం తర్వాత 1014లో జులై 10న యెత్తిపారేసి రమ్ముని తిరిగి రమ్మని మత్తునిమ్మని ఆహ్వానించినారు!పాపం క్రైస్తవ మతానుయాయులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రార్ధనలు చేసి సరిపెట్టుకున్నారు - అసలు మధ్యనిషేధాన్ని యెత్తివేసే బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కూడా విశ్వాసియే!ప్రార్ధించిన వాళ్లలో ఆయన కూడా ఉన్నాడు పాపం?!"ప్రభువు గనక మద్యనిషేధాన్ని యెత్తివేస్తున్న ఈ బిల్లుని నిజంగా వ్యతిరేకించాలని సంకల్పించి ఉంటే బిల్లుని సభలో ప్రవేశపెట్టకుండా నన్ను నిరోధించమని ప్రభువుని యెంతగానో ప్రార్ధించాను" అని వాక్రుచ్చాడు,అంటే కరుణామయుడు కూడా మద్యనిషేధాన్ని సమర్ధించలేదు,మానవమాత్రులం మనం ఏమి చెయ్యగలం!?

గుడుంబా అమ్మకాల్ని నిరోధించడానికి చీప్ లిక్కరుని ప్రోత్సహించటం,చీప్ లిక్కరు అమ్మకాల్ని నిరోధించడానికి మరోదాన్ని ప్రోత్సహించటం కన్నా ప్రతిదానికీ శాస్త్రీయమైఅన పధ్ధతిలో మార్కెట్ సదుపాయాల్నీ వినియోగానికి ఆరోగ్యపరమైన నిబంధనల్ని రూపొందించి అన్నిటినుంచీ తగినంత ఆదాయం తెచ్చుకోవడం మంచిది!ప్రభుత్వపరంగా కొన్ని రక్షణల్నీ కొన్ని సదుపాయాల్నీ యేర్పాటు చెయ్యటం తప్ప మరేదీ పని చెయ్యదు.అధికారంలో ఉన్నవారి పట్ల ప్రజల విధయతకి మతం,మత్తు రెండూ చాలా అవసరం!తగుమాత్రంగా ప్రయోగించి లాభం పిండుకోవాలే తప్ప బాతుని చంపే విధంగా పోకూడదు.వారికి తెలుసునని నాకు తెలుసుననుకోండి,తెలియని వారికోసం కొంచేం అసందర్భ ప్రలాపం,బోరు కొట్టిందా!


మధువు తాగినవానికి తూలుడు యెక్కువ!మధువు తాగనివానికి యేడుపు యెక్కువ!

Friday, 17 July 2015

తెలంగాణలో చెత్త విప్లవం వర్ధిల్లడం సంగతి యేమో గానీ అది యేలిన్నాటి శనిలాగ ఆంధ్రాకీ పాకింది గదా?!

         అరిభీకరంగా ఆంధ్రోళ్ళ దోపిడీ గురించి పుంఖాలు పుంఖాలుగా జీవితకాలపు ఘోటక బ్రహ్మచర్యాలతో బళ్ళ కొద్దీ పరిశోధనా దస్త్రాలు లిఖించి సొంత ఖర్చులతో తెలంగాణ అంతటా పంచిపెట్టి దశాబ్దాల పాటూ పోరాడి సాధించుకున్న తెలంగాణ వీరాధివీరులూ తెలంగాణ ఇచ్చేస్తే పంచమహాపాతకాలూ చుట్టుకుంటాయని తమ ఆఖరి రక్తపుబొట్టు వరకూ దాన్ని అడ్డుకుతీరతామని ఉత్తరకుమార ప్రజ్ఞలు పలికి అడ్డంగా నిలబడి సగంలో పక్కకి తప్పుకుని దారిచ్చిన అసమర్ధపు ఆంధ్రావాళ్ళూ తీరా విడిపోయాక యేదో మొదట్లో కొన్ని సమస్యలు వచ్చినా కొంతకాలం గడిస్తే రెండు రాష్ట్రాల పరిస్థితీ బాగుండొచ్చు లెమ్మనుకున్నారు గానీ జరుగుతున్నవి చూస్తుంటే ఈ రెండు రాష్ట్రాల లోని సామాన్యులూ పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డారా అనిపిస్తుంది!

          అప్పటిదాకా "అట్లెట్ల వస్తది తెలంగాణ" అని మిగత వాళ్ళు సందేహపడితే "ఇట్లిట్లె వస్తది తెలంగాణ" అని అందర్నీ ఒప్పించి తన వ్యూహ నిర్మాన చాతుర్యంతో అసదృస దుర్భాషా విష పరాక్రమంతో ముఫ్ఫయి సీట్ల బేవార్సు లంచమూ పార్టీ విలీనం ప్రతిపాదనా సకల జనుల కకావికకల సమ్మెలూ రోడ్డు మీద వంటల వినూత్న నిరసనలూ ట్యాంకుబండు మహనీయుల మీద చేతివాటపు కార్యక్రమాలూ వంటి వాటితో యేది నిక్కచ్చిగా పని చేసిందో తెలియదు గానీ మొత్తానికి సాధించుకొచ్చిన మేధావి అధికారంలోకి వచ్చాక మాత్రం వాహనాల రీరిజిస్ట్రేషను,1956 స్థానికత లాంటి అనుమానాస్పదమైన వింతపనులతో అవహేళన పాలయ్యాడు - ఆ తెలివంతా యేమయిందో మరి?సహజంగా ప్రభుత్వంలో  ఉన్నవాళ్ళు ఇట్లాంటి తెలివితక్కువ పన్లు చేస్తే ప్రతిపక్షంలో ఉందేవాళ్ళు యేమి చేస్తారు?వీళ్ళు ఇలాంటి పన్లులు చేసి బద్నామవుతున్నారు గాబట్టి వచ్చేసారి ప్రజలు మమ్మల్నే గెలిపిస్తారు అని చంకలెగరెయ్యకుండా యెవరయినా ఉంటారా!మొగుడు కొట్టినందుకు కాదు గానీ తోడికోడలు నవ్వినందుకు యేడుస్తున్నానన్నట్టు తన తెలివితక్కువ పన్లని తగ్గించుకుని తెలివిగా పరిపాలిస్తే సరిపోయేదానికి తెలంగాణ విఫలప్రయోగం అని నిరూపించటానికి కుట్రపన్నుతున్నాడు అని హశ్శరభ తశ్శరభ అని అంగలార్చి దాన్ని నిరూపించటానికి తనే కుట్రపన్ని ఇరికించినట్టు చిన్నపిల్లవాడికి కూడా తెలిసిపోయే అధమస్తపు ప్లానేసి ఓటుకు నోటు లాంటి స్టింగ్ ఆపరేషన్ ఆర్భాటంగా చేసి బాబుని బ్రమ్మదేముడు కూడా రక్షించలేడు అని వీరంగాలు వెయ్యటం తప్ప తెలంగాణ విశ్వామిత్రులుంగారు ఈ యేడాదిలో బంగారు తెలంగాణ కోసం నికరమైన పని యేదీ అసలు మొదలు పెట్టనే లేదు.

          ఇద్దరికీ తగినంత మేజారిటీ ఇచ్చి మీమీ రాష్ట్రాల్ల్లో మీ ఇష్టమొచ్చినట్టు ఆడుకోండిరా కబ్బాడీ అని జనం ఈలేసి మరీ గ్రీన్ సిగ్నళ్ళిస్తే ఆంధ్రా బాబుకి ప్రతిపక్షనాయకుడు వీకయ్యి అదృష్టం పట్టింది,నేను మాత్రం ప్రతిపక్షాన్ని యెందుకు సహించాలె అని పోటీపడి ఆకర్షతంత్రం వాడటం మొదలు పెట్టాడు!తెలివైనోణ్ణి అనుకుంటాడు గనక ముందే నాకు నాలుగేళ్ళు టైము ఇవ్వండని అడిగి జనం ఇచ్చామని యెక్కడా చెప్పకపోయినా ఇచ్చేశారనుకుంటూ అప్పుడు చెయ్యలేకపోతే అసలు వోట్లే అడగం అన్నాడు!నాలుగేళ్ళ తర్వాత రాజెవడో రెడ్డెవడో - యెవడు చూడొచ్చాడు?!అన్నిసార్లు అబధ్ధాలు ఆడవాళ్ళ కంటే అందంగా చెప్పిన మగవాణ్ణి నిజంగా నమ్మాలా?!ఇటు బాబుని చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుల్ని ఉపయోగించుకుని రెండు చోట్లా జెండా యెగరెయ్యాలనే కక్కుర్తితో వెధవ్వేషాలు వేస్తూ తన మీదకి కేసొస్తే తప్ప విభజన చట్టం నిక్కచ్చిగా అమలు చెయ్యమని గట్టిగా అడగాలనిపించలేదు.తీరా రోషమొచ్చి అల్లరి చేసినా కేంద్రాన్ని అడిగి లేదనిపించుకున్నా కిక్కురుమనకుండా పడి వున్నాడు అజగరం లాగ,యెందుకీ పౌరుషహీనపు చేష్టలు!ఇప్పుడయినా మా సొంత పోలీసు స్టేషన్లూ ,హైదరాబాదులో పదేళ్ల హక్కు అని అక్కరకి రాని గొడవలు తప్ప ఆంధ్రాకి పనికొచ్చేవి చెయ్యడు, యేంటో మరి?యెంతోకాలం ముందునుంచే షెడ్యూలు 10లో ఉన్న కంపెనీలన్నీ మావే నని తెలంగాణ ముఖ్యమంత్రి అంత  గట్టిగా అంటుంటే కనీసం గట్టిగా వ్యతిరేకించను గూడా వ్యతిరేకించట్లేదు.ఈయన గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రియా తెలంగాణ ఇల్లిటపు టల్లుడా?ఒక కన్ను సగం గుడ్డిదయి అఘోరిస్తూ ఒకటిన్నర కన్నుతో ఉన్నా ఇంకా రెండు కళ్ళ గురించి  కలలు గంటున్నాడు పిచ్చిమారాజు!షెడ్యూలు 10లో ఉన్న కంపెనీ లన్నిట్నీ తెలంగాణ లాగేసుకంటే అసలే లోటులో ఉన్న రాష్ట్రంలో వీటన్నిట్నీ కొత్తగా యేర్పాటు చెయ్యాలంటే అయ్యే పనేనా?ఇతన్ని ముఖ్యమంత్రిగా యెన్నుకుని ఆంధ్రావాళ్ళు తప్పు చేసేశారు!దేని గురించి యెక్కడ పోట్లాడాలో తెలియని లోకజ్ఞాన శూన్యుదు ప్రతిపక్ష నాయకుదైతే జనం పరిస్థితి ఇలాగే అఘోరిస్తుంది కాబోలు?యెంత అనుభవం ఉండి యేంలాభం బాబుకి క్షాత్రం లేదు,స్వాభిమానం లేదు!కేంద్రం నుంచి రావలసిన వాటికి తను పోట్లాడడు,పార్టీ వాళ్లనీ పోట్లాడ నివ్వడు!పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకీ అంతే,తను మాట్లాడడు,మిగతా వాళ్ళనీ నోరు మూయించుతాడు,యెందుకు?

          ఈ యేడాదిలో నిక్కచ్చిగా బాగుపడిందెవరయ్యా అంటే ఒక రాస్ట్రంలో 49% మరో రాష్త్రంలో 47% అప్పనంగా కొట్టేసిన అధికార్లు!ఇన్నాళ్ళూ అడగందే అమ్మయినా పెట్తదన్నచందంగా నెలల తరబడి స్ట్రెయికులు చేసినా ఇస్తారన్నగ్యారెంటీ లేనిది కాస్తా ఇద్దరు ముఖ్యమంత్రులూ అడగ్గానే ఒప్పేసుకున్నారు?బల్ల కింద చేతులూ ఆగవు,మినిస్టర్లకి తాము కుదిర్చే కాంట్రాక్టుల్లో వాటాలూ తగ్గవు,అదనంగా ఫిట్మేంటు కూడా - వారెవ్వా మీ సోకు మాడ విభజన పుణ్యమా అని తంతే గారెల బుట్టలో పడింది మీరయ్యా?! తెలంగాణలో యే మేకపిల్ల కాలికి దెబ్బతగిలి ముఖ్యమంత్రి గారు అయ్యో అని జాలి పడినా ఆంధ్రాలో మేకపిల్లకీ జబ్బు చేస్తుంది!తెలంగాణ ముఖ్యమంత్రి చూడండి యెంత దయామయుడో,మరి ఆంధ్రా ముఖ్యమంత్రి కేమయింది అని శోకాలు తీసే మేకతల్లులు తయారు?అక్కడ పరిహారం లక్ష  ఇస్తే ఇక్కడ లక్షన్నర ఇవ్వాలి!ఆంధ్రాలో ఒక కోడి పది గుడ్లు పెడితే తెలంగాణాకోడి ఇరవై గుడ్లు పెట్టాలి,లేకపోతే తెలంగాణ మాగాణం ఆబోరు దక్కదు,సంఝే!ఒకరు ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఒకరు ట్యాంకుబండు చుట్టూ 60 అంతస్థుల ఆకాశహర్మ్యాలు అనాలి,అనకపోతే అభిమానులు మెచ్చరు?వీళ్ళ సొల్లుకబుర్లు నిజం చేసి చూపించి పోటుగాళ్ళమని నిరూపించుకోవటానికి కావలసిన ధనం మాత్రం వాళ్ల జేబుధనం కాదు,ప్రజలు మరింత రెక్కలు ముక్కలు చేసుకుని వీళ్ళ యెదాన పొయ్యాలి?!

          అధ్భుత రాజధాని కోసం ప్లానేసిన తను డిజైను పన్లు జపాను వాళ్లకిచ్చి ఇటుకలు మోసే పని మాత్రం ఆంధ్రా పిచ్చిజనానైకి చెప్తున్నాడు!హరితహారం పేరుతో పంచాయితీకి యాభైవేల మొక్కలు ఇచ్చి పెంచే బాధ్యత మీదే ఒక్క మొక్క చచ్చినా వూరుకోనని సుగ్రీవాజ్ఞలు జారీ చేస్తున్నాడుతప్పితే దానికోసం నిధుల కేటాయించినట్టు యెక్కడా లేదేంటి?పంచాయితీలకి ఇప్పుడు యెన్ని నిధులు ఉన్నాయి?వాటిల్లో ముక్కా ముతకా పధకాలకి పోనూ మొక్కలు పెంచటానికి సరిపోయేటంత నిలవ నిధులు యెన్ని వున్నాయి?మొక్కలు నాటంగానే పెరగడానికి తెలంగాణ యేమన్నా డిస్నీల్యాండు లాంటి మాయాభూమి కాదుగదా!పాదులు తవ్వాలి,నీళ్ళు పొయ్యాలి,బలాలు చెయ్యాలి - యేదీ వూరికే రాదు గదా?ఒక్కో మనిషీ ఒక్కో మొక్కని కావిలించుకుని పడుక్కుని అన్ని పన్లూ అక్కదే కానిస్తే అదే యెరువూ అదే పోషణా అదే నీరూ అయ్యి పెరగాలి తప్ప మరోదారి యేదయినా ఉందా చెప్పండి!అప్పుడు గూడా వెయ్యిమంది జనాభాయే ఉన్న వూళ్ళో మిగతా ముఫ్ఫయి వేల మొక్కల సంగతేంటి?

          నిన్నటి రోజున పైస్థాయిలోని అధికార్లకి పుట్ట్టిన తెగులు ఇప్పుడు తెలంగాణ పారిశుధ్య కార్మికులకి పుట్టింది!వాళ్ళకి పుట్టిన నాలుగు రోజులకి ఆంధ్రా పారిశుధ్య కార్మికులకి పుట్టింది!వాళ్లడిగిన ప్రశ్న కూడా ఆటంబాంబు లాంటిదే "పెద్ద ఉద్యోగస్తులకి లక్షల్లో జీతాలు ఇస్తారు గానీ ఇంత కీలకమైన పని చేసే మాకు ఇంత తక్కువ జీతమా" అంటున్నారు,అడిగిందే చాలు మెహర్బానీ కోసం అంగలారుస్తున్న ఈ రెండు ప్రభుత్వాధినేతల తీరు చూసి ఒక్కసారిగా తెలివిమీరిపోయారు - వాళ్ళకి మాత్రం బుర్ర లేదా!తమదెంత కీలకమైన పనో చెప్పటానికి పని మానేసి కూర్చున్నారు.వాళ్ళు రోజూ సావాసం చేసేదే గాబట్టి వాళ్ళు భరించగలరు గానీ ఈ చెత్త తెలంగాణనీ ఈ చెత్తాంధ్రనీ మిగతా జనమంతా యెంతకాలం భరించగలరు?!

ఈ చెత్తపనుల్లో పోటీ కోసమా విడిపోయింది,హతవిధీ?!

Thursday, 2 July 2015

అయ్యయ్యో బ్రహ్మయ్యా!అన్యాయం చేశావేమయ్యా?ఇచ్చిన పుణ్యం యేమైందయ్యా!తెలంగాణలోనూ ఖాళీబొచ్చెయేనా?

     దానవీరశూరకర్ణ సినిమాలో అప్పటిదాకా దేవుళ్ళ పాత్రల్లో ప్రశాంత వదనంతో కరుణ ఒలికించే సంభాషణలతో దైవత్వాన్ని చూపించిన నందమూరి తారక రామారావు దుర్యోధనుడనే దుష్టుడి పాత్రలో చాంతాడు పొడుగు దుష్టసమాసాల్ని కరకరా వేడి వేడి సమోసాల్లా నమిలి వూసేసినా నాకు మాత్రం ధూళిపాళ శకుని వేషంలో కొట్టిన డవిలాగులే మజ్ఝారే అనిపిస్తాయి!రామారావు గెటప్పుల్లోనే కాదు మూడు వేషాల్ల్లోనూ ఆపాదమస్తకం చాలా గొప్పగా వేరయిటీ చూపించాడు.దుర్యోధనుడిగా "సోదరా దుశ్శాసనా.." దగ్గిర్నుంచి "వందిమాగధులారా కర్ణమహారాజును కర్ణపేయముగా కీర్తింపుడు" అనే వరకూ పెంకులెగిరిపోయే గొంతుతో క్షణం కుదురుగా నిలవకుండా నిలువెల్లా ఆవేశంతో వూగిపోతే పక్కనే కర్ణుడిగా మహావినయంగా లోగొంతుకతో "మహాదాతా!నా రక్తాన్ని రంగరించి మీ యశోరక్షణకు నా సమస్తం ధారపోస్తాను!" అని సుకుమారంగా చెప్తుంటే కళ్ళు మూసుకుని వింటున్నా మాట్లాడుతున్నది దుర్యోధనుడనీ కర్ణుడనీ తేడా తెలిసేటంత గొప్పగా చేసిన స్వరవిన్యాసం నిజంగా అధ్భుతమే!అటు రారాజు లోని అహంభావాన్నీ ఇటు అప్పటివరకూ ఉన్న స్థితి నుంచి లేవనెత్తి ఒక్కసారిగా రాజుని చేసిన వ్యక్తిపైన ఆ గౌరవాన్ని అందుకున్న వ్యక్తికి ఉండే కృతజ్ఞతనీ ఒకే నటుడు ఒకే సన్నివేశంలో చూపించడం ప్రపంచ చలనచిత్ర చరిత్రలో యే భాషలోనూ యెవ్వరూ చెయ్యని సాహసకృత్యమే!

          కానీ సినిమా అంతా ఒక్క నటుడే కనిపిస్తే బోరు కొట్టి చచ్చేవాళ్ళం కదా!కానీ ఆ విజృంభనకి తట్టుకుని అతనికి దీటుగా నిలబడితేనే కదా మరొక నటుడు కూడా మెప్పించగలిగేది?అలాంటి అధ్భుతాన్ని ధూళిపాళ సునాయాసంగా చేసేశాడు.ముఖ్యంగా మయసభలో అవమానానికి ప్రతీకారంగా అందరూ యుధ్ధం చేసి ఓడించి పగ తీర్చుకోవాల్సిందే నని గట్టిగా అరుస్తున్నప్పుడు,"దానివలన మనకొరుగు ప్రయోజనమేమి?వచ్చిన మచ్చ మాసిపోవునా?పరాభవావమానము సమసిపోవునా?మీ వూహ సరికాదు!వాడు పేరుకు ధర్మజుడే కాని పనువేపరి, జూదరి, వ్యసనపరుడు!వానినా మిషతోనే హస్తినకు రావించి వారి సమస్తమూ హరించి నీవూ నీ శతసోదరులూ వారి దీనత్వమును చూసి పగులబడి నవ్వవలె!అనాయాస మరణమూ దానివలన ప్రాప్తించు అమరలోక నివాసమూ ఆ పాండవహతకుల కంత సులభంగా లభించరాదు,తాము చేసిన తప్పులకు తామే వగచి వగచి కృశించి కృశించి నశించవలె!!" అనే పార్టు అతను చెప్పిన తీరు నాకు మహాధ్భుతంగా అనిపిస్తుంది.శకుని పాత్రలో ధూళిపాళ ద్వారా కొందవీటి వెంకట కవి గారు యెన్నో రాజకీయ సత్యాలు చెప్పారు!"వజ్రాన్ని వజ్రంథోనే ఖోయవలె,ముల్లును ముల్లుథోనే థీయవలె" అని నొక్కి వక్కాణించుతున్న సన్నివేశాన్ని జాగ్రత్తగా పట్టి చూస్తే ఇవ్వాళ్టి రాజకీయ నాయకులంతా ఆ మహానుభావుడి నుంచి ఉప్పుదేశం పొందినవారుగా కనిపించటం లేదూ!

             కాకపోతే ఆ శకుని మామకి తను విసిరిన పాచికలు తను చెప్పినట్టు వినే అదృష్టం ఉంది,ఇప్పటివాళ్ళకి ఆ అదృస్టం లేదు,అంతే!అప్పుదు రారజు ఉన్న పరిస్త్యితి కూడా బయటపడి యుధ్ధం చెయ్యగలిగిన పరిస్థితి కాదు!యెందుకయ్యా యుధ్ధం చేస్తున్నావు అంటే జవాబు చెప్పలేడు?మాసభలో జరిగిన అవమానం బయటికి చెప్పుకోలేదు,అంతకు ముందు ంచీ యెన్నివిధాల అంతం చెయ్యాలని కుత్రలు చేసినా అవన్నీ రహస్యంగానే చేశాడు,దేసంలోకల్లా గొడ్డుమోతు భూమికి రాజుగా పంపిస్తే అక్కడ కూడా సిరిసంపదలతో తులతూగుతుంతే చూడలేక ఇప్పుడు బయతపడి యే కారణం చెప్పగలడు?సరిగా ఇలాంటి పరిస్థితిలో నిలబడిన వాళ్ళు ఇన్ని వేల సంవత్స్రాల తర్వాత కూడా సరిగ్గా అలాంటి మాయాద్యూతాలకే తెగబడుతున్నారంటే ఆ కధ కల్పితమే అయినా ఆ కధకుది క్రాంతదర్సిత్వం యెంత గొప్పది?వ్యాసుదు యే పాత్రలో యే లోపాలు పెట్టాడో ఆ లోపాలకి అంతిమంగా యెలాంతి ఫలితాన్ని అనుభవించారని ఆ కధలో చూపించాడో చరిత్రలో యెన్నొసార్లు అలాంతి లోపాలు ఉన్నవాళ్ళు అలాంతి ఫలితాన్నే పొందారు అనేది గమనిస్తే మనం మహాభార్తం తప్పనిసరిగా చదివితీరాలనిపిస్తుంది - కొందరు బౌధ్ధిక చత్వారం గలవాళ్ళకి తప్ప!శ్రధ్ధగా చదివి అర్ధం చేసుకుంటే అటువంతి ధోరణులు క్నబడుతున్నప్పుడు గుర్తుపట్టి మళ్ళీ అలంటి వినాసనం జరగకుండా జాగ్రత్తపడవచ్చును కదా!

     యెప్పటి కెయ్యది ప్రస్తుతమో దానితో సరిపెట్టుకునే ప్రాప్తకాలజ్ఞత సార్వకాలిక సత్యాల్ని అవగతం చేసుకోనివ్వదు.ఇవ్వాళ కాంగ్రెసు పార్టీ దుస్థితిని చూస్తే జాలి కన్నా అసహ్యం కన్నా భయంకరమైన దుస్థితి యేది ఉన్నా ఆ స్థితి కన్నా హీనంగా ఉంది, యెందుకని?ఒకనాటి మహానుభావులు అందులో చేరి వారి సత్ప్రవర్నతో పార్టీకి కూడా గౌరవాన్ని తెచ్చిపెడీతే ఆ సార్వకాలీక్ యససూ నిచ్చే ప్రజాసేవాపధం నుంచి తప్ప్పుకుని మాయాద్యూతాలను నమ్ముకున్న దుర్మార్గులకి ఆవాసం కావదం వల్ల ఈ దుస్థితి దారించింది!సమస్య ఇదీ అని తెలిసినా పరిష్కారం లేని తప్పులు  అలవాటుగా చేస్తూ చేస్తూ వచ్చి నిన్నటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో నూరవ తప్పును కూడా యేదో ఘనకార్యం చేస్తున్నంత ధీమాగా చేసిపారేసి కాలపురుషుడు విసిరిన సుదర్శనం దెబ్బకి కూలిన శిశుపాలుడి గతి పట్టింది నేదు కాంగ్రెసుకి?!

         సోనియా యేమో నేను మాటిచ్చాను ఇచ్చి తీరాలంటుంది!ఇక్కడి వాళ్ళకేమో ఇవ్వాలని లేదు - వచ్చిన వాడు హైదరాబాదులో ఉన్న తమ వ్యాపారాల్ని(?) తిన్నగా చేసుకోనివ్వడేమోననే స్వార్ధంతో కూడిన భయం లాంటి బెంగ?గట్ట్టిగా తాము అడ్డుపదుతున్నట్టు కనిపించకుండా లేఖలు ఇచ్చి నాకభ్యంతరం లేదని అన్నా ప్రతిపక్షంలో ఉన్నవాడు తాము ఇస్తే అడ్డుకోలేడని తెలిసినా కాలం గడిపేటందుకు అతని మీదకి తోసేసి ఆఖరి వరకూ నాటకాలు ఆడారు?ఇవ్వడం తప్పనిసరి అని తెలిశాక మళ్ళీ వాళ్ళే రెండుగా చీలి ఒక సగం ఇవ్వమనీ ఒక సగం వద్దనీ అయోమయం సృష్టించారు!నిజాయితీగా ఇవ్వదల్చుకుంటే అవన్నీ నిజంగా అవసరమా?ఇవ్వాళ అక్షరాస్యత పెరిగిందనీ,పత్రికల్లో పడిన వార్తలు మారుమూల పల్లెలకీ తెలిసీపోయి చాయ్ బంకుల దగ్గిర కబుర్ల ద్వారా నిన్నటి రోజుల్లోలా కాకుండా ఇవ్వాళ్టి వోటర్లు చైతన్యవంతులయ్యారనేది కూడా తెలుసుకోకుండా యెంత తెలివితక్కువగా చేశారు రాష్త్ర విభజనని, మెంటల్ మంద?23 జిల్లాల ప్రజల భవిష్యత్తుని అనంతకాలం వరకూ వెంటాడే సమస్యలతో ఇస్తూ కూడా మరీ ముఖ్యంగా ప్రతిదానికీ పోట్లాడుకు చావడానికి మాత్రమే పనికొచ్చే విధంగా విభజన బిల్లుని తయారు చేసి కూడా లాభం ఆశించారంటే వీళ్ళకన్నా వెనకతి కాలంలో కూర్చున్న కొమ్మని నరుక్కున్న దేవయ్య కూడా తెలివైనవాడే గదా?! 

        కనీసం ఆ లాభాన్ని పక్కవాడితో పంచుకుందామనే పాటి ఔదార్యం కూడా లేదు - లాభమంతా మనకే రావాలి,అందుకే పుచ్చుకున్నవాడు కూడా గర్భశత్రువై పోయాడు!అడిగీన వాడు ఇస్తానని మాటిచ్చాక గూడా తొమ్మిదేళ్ళు యేడిపిస్తుంటే మనసులో తిట్టుకోడా?కాలం తనకి వాటంగా కలిసి వచ్చినప్పుదు తను చావుదెబ్బ కొట్టడా?యేళ్ళు పెరిగినా బుధ్ధి పెరగని గాడిదలకి రాజకీయమెందుకు?అస్త్రసన్యాసం చేసి పరువుగా రాజకీయ రంగం నుంచి నిష్క్రమిస్తే ఇప్పటికయినా ఒక తెలివైన మంచిపని చేసినట్టు ఉంటుంది - కానీ అది కూడా చెయ్యరు!ఘటశ్శ్రాధ్ధం తంతు కూడా తమకు తామే జరిపించుకునే వరకూ కాంగ్రెసు పతనాన్ని యెవ్వరూ ఆపలేరు కాబోలు?!

       శకుని మామ "ఔరా,అల్లుని పరాభమునకు మామ శకుని చెల్లించిన పరిహార మిదా - ఘురే! ఘురే! యని భారతెతిహాసమున నా చరిత్ర సువర్ణాక్ష్రములతో లిఖించబడవలె" నని ఆశించాడు - ఫలితం సాధించాడు గాబట్టి తన చరిత్రని సువర్ణాక్షరాలతో రాసినా తప్పు లేదు!కానీ ను ఆడిన మాయాద్యూతం వికటించి తననే ఒకవైపు ఇప్పటికే "0" తో నిలబడి మరొక వైపు రేపటికి "0"తో నిలబెడుతున్న చరిత్రని మాత్రం రక్తాక్షరాలతోనే లిఖించవలె!

కాంగ్రెసు తాను చేసిన తప్పులకు తానే వగచి వగచి కృశించి కృశించి నశించవలె!

Thursday, 25 June 2015

పాపం, తెలంగాణ లారీల యజమానులకి రెండు రాష్ట్రాల మధ్యన సింగిల్ స్టేట్ ట్యాక్స్ కావాలంట?అసలు సింగిల్ స్టేట్ కోసం ఉద్యమిస్తే గానీ అది కుదరదేమో!

          భ్రమల్ని ప్రేమిస్తూ భ్రమలే జీవితంగా గడుపుతూ భ్రమల్లో పొందే ఆనందం కోసం వాస్తవ జీవితం లోని సుఖాల్ని కూడా త్యాగం చెయ్యగలిగిన అతి మేధావులకి తప్ప విశాల తెలంగాణ ప్రజానీకానికి యేనాడూ విభజన ఉద్యమానికి అండదండలు ఇవ్వాలనిపించ లేదు!తార్కికంగా ఆలోచించే తెలంగాణలోని నిజమైన మేధావులకి విడిపోతే ఇంతకన్నా బాగుంటుందన్న నమ్మకం యేనాడూ లేదు?వీళ్లందరినీ ఆంధ్రోళ్ళు మనల్ని దోచుకోవదం వల్లనే మనం వెంకక పడ్డాం,విడిపోయి ఆ దోపిడీని వదలగొట్టేస్తే చాలు అంబరాన్ని చుంబిస్తాం అని వూదరగొట్టి కనీసం యెదటివాళ్ళకి వచ్చిన అనుమానాలకి సరయిన జవాబులు కూడా ఇవ్వలేక అలాంటివాళ్ళంతా తెలంగాణ ద్రోహులని ముద్దర్లు కొట్టేసి,లక్ష అబధ్ధాలతో కోటి రౌడీ పన్లతో తెచ్చుకున్న దానిని మంచితనంతో ఒప్పుకుంటున్నామే గానీ సాంకేతికంగా ఈ విభజన చట్టబధ్ధమైనదని అసలు ఒప్పుకోవాలా?

          అసలు ఆ విభజన చట్తాన్ని కూర్చిందే నేనని ఒకానొక దశలో డప్పు కొట్టుకున్న వ్యక్తియే ఆ చట్టం సరిగ్గా లేదని అంటుంటే ఆ విభజన చట్టమే పనికిమాలినదని అర్ధం కాదా?తన ప్రమేయంతోనే తన ఆమోదం కోసం కేంద్రమంత్రులు కూడా తన చుట్టూ తిరిగి తనకు చూపించాకనే బిల్లు సభలో కొచ్చిందని తనూ చెప్పాడు,ఆ కేంద్రమంత్రులూ లోపాయకారీగానూ పత్రికల వాళ్ళు గుచ్చి గుచ్చి అడిగితే పత్రికాముఖంగానూ ఒప్పుకున్నది నిజం కాదా?తెలిసి తెలిసీ ఇంత అధ్వాన్నంగా తనెందుకు తయారు చేశాడో,వాళ్ళు చేస్తే చూసినప్పుడో తనెందుకు ఒప్పుకున్నాడో ఇప్పటికయినా తిన్నగా చెప్తాడా?మన పిచ్చి గానీ ఆ మనిషి యేది తిన్నగా చెప్పాడు గనక!ఆయనకీ ఆయన అభిమానులకీ తిన్నగా మాట్లాటం వస్తే మనకె బాధలన్నీ యెందుకు?!తెలంగాణ తరపున దాఖలయిన ఓటుకు నోటు మరియూ ఆంధ్ర త్రపున దాఖలయిన ట్యాపింగ్ వ్యవహారం లాంటివి పట్టించుకోకుండా విశాల తెలంగాణ ప్రజానీకం యొక్క సమస్యలు సుదూరంలోనన్నా పరిష్కరించబదతాయనే గ్యారెంటీ యెంతమంది తెలంగాణ్యుల కుంది?

          ఈ రెండు కేసులూ ఒకళ్ళు మరొకళ్ళ మీద బురద జల్లుకోవడానికి తప్ప యెందుకూ పనికిరానివేనని తెలియడం వల్లనే రేవంత్ పరిస్థితి యేంటి?అదృష్టం బాగుండి అతనికి బెయిలొస్తందా?జైలుకి వెళ్ళి చిప్పకూడు తింటాడా?బాబు కూడా అరెస్టవుతాడా? - ఇలాంటి కుక్కజట్టీలకి దూరంగా ఉన్నాను!అరిభీకరంగా చెలరేగిపోయి బాబు అవినీతి గురించి వాదిస్తూ పుంఖాలు పుంఖాలుగా వాదించిన తర్వాత కూడా "Horse trading is everywhere,nobody is an exception" అనేవాళ్ళు ఒంటిమీద స్పృహ వుండి కళ్లముందు జరిగేది చూస్తూ అంతా తెలిసే అలా మాట్లాడుతున్నారా?నేనైతే మొదటినుంచీ ఒకే మాట అడుగుతున్నా,ఒకడు అవినీతిపరుడయితే కావచ్చుగాక,అతన్ని అవినీతిపరునే అర్హత మరో అవినీతిపరుడికి ఉంటుందా అని, దానికి సూటిగా జవాబు చెప్పగలరా?రేవంత్ అడ్డంగా దొరికిపోయి జైలు పాలయినా,చంద్రబాబు కూడా ఆ ఫోను సంభాషణ మూలంగా పదవిని పోగొట్టుకున్నా యేమాత్రం బాధపను,ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సరయిన రాజకీయ చైతన్యం అంటూ ఉంటే మరొక నాయకుడు వస్తాడు!అలా కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖర్మ,అంతే?

          కానీ తెలంగాణ మేధావుల మేధావిత్వం ఇంత అధమ స్థాయిలో అఘోరించటానికి కారణం యేమిటి?"పరారీలో బాబు అనే వార్త చూడాలని ఉంది" అనేటంతగా బాబు అవినీతిని ద్వేషిస్తున్నవాళ్ళు కేసీఆర్ అవినీతిని చూడరేందుకు?బాబు పట్ల గల ద్వేషానికి కారణం యేమిటి.,కేసీఆర్ పట్ల గల బానిసత్వానికి కారణం యేమిటి?తెలంగాణకి కేసీఆర్ అవినీతి వల్ల అన్యాయం జరిగినా ఫర్వాలేదు అని సహిస్తున్నప్పుడు చంద్రబాబూ అవినీతిని కూడా సహించవచ్చును గదా?ఆకర్ష తంత్రం మొదలు పెటిన మొదట్లోనే కాంగ్రెసువాళ్ళు బాహాటంగానే "మీ మీద పాతకేసులు తిరగదోడతాం,మిమ్మల్ని జైలుకి పంపిస్తాం మా పార్టీలో చేరకపోతే అంటున్నారు - మరీ ఇంత ఘోరమా?" అని అన్నప్పుడు అక్క యేం జరుగుతుందో తెలియదా?అది అవినీతి కాదా?యే అవినీతిపరుల్ని భూస్థాపితం చేస్తానన్నాడో అదే అవినీతిపరుల్ని పక్కన పెట్టుకుంటే బంగారు తెలంగాణ యెట్లా వస్తుంది?మీకు కావలసింది బంగారు తెలంగాణయే అయితే కేసీఆర్ అవినీతిని యెందుకు వ్యతిరేకించడం లేదు!అదే అవినీతిని ఇప్పుదు కూడా పదింతలు ధైర్యంగా చేస్తుంటే సహిస్తున్నప్పుడు రాష్ట్రం విడిపోవలసిన అవసరం యేమిటి?పరిశ్రమల్లో వ్యాపారాల్లో అదే దొపిడి దొంగలైన ఆంధ్రోళ్ళ హవా సాక్షాత్తూ ముఖ్యమంత్రి అండదండలతోనే సాగుతున్నప్పుడు ఈ విభజనని వ్యతిరేకిస్తే తప్పేమిటి?ఇదివరకటి వారి పరిపాలనలో ఉన్న చెడు అదే విధంగా కొనసాగుతున్నప్పుడు ఈ తెలంగాణ ఆస్తిత్వం యొక్క ప్రత్యేకత మేమిటి?

          ఉద్యమంలోనూ నిజాల్ని చెప్పి అందర్నీ ఒప్పించకుండా రౌడీతనంతోనే చెలరేగిపోయారు,అధికారంలోకి వచ్చాక కూడా ప్రజల్ని మెప్పించే చక్కని పరిపాలనతో బలాన్ని పెంచుకోవాలనే రాజమార్గం వదిలి అదే రౌడీతనానికి ఆకర్ష తంత్రం అనే సంకేతికమైన ముద్దుపేరు తొడిగి దొడ్డిదారిన వెళ్తూ చెలరేగిపోతున్నారు,రాజధానిలో సగం హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పదేళ్ళపాటు హక్కు ఉన్నదని చట్టంలో లేదా?చట్టంలో మీకు ఇష్టం లేనివాట్ని మీరు వ్యతిరేకిస్తే మొత్తం విభజన చట్టాన్నే మేము వ్యతిరేకిస్తాం,తప్పా!అప్పుడు కేంద్రంలో ఉన్న ఒక లత్తుకోరు పార్టీతో లాలూచీ ఒప్పందం ద్వారా 23 జిల్లాల మీద రుద్దిన ఈ విభజనని రద్దు చేసి పారెయ్యాలి!అసలు నిజాలతో చారిత్రక వాస్తవాలతో ఇంతకు ముందు విడిపోయిన అన్ని రాష్ట్రాల మాదిరిగానే శాసనసభలో విభజన తీర్మానం పెట్టి వోతింగు ద్వారానే విడిపోవాలని మేము అంటాం - ఒప్పుకుంటారా?మా వాదన కనీసం నినను కూడా వినకుండా జరిగిన విభజన ప్రజాస్వామికం యెలా ఔతుంది?ప్రజాస్వామికంగా జరగని విభజన పట్ల మేమెందుకు గౌరవం ప్రకటించాలి?యే ప్రాంతీయాభిమానాన్ని రెచ్చగొడుతూ ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చారో వారినే ఆ ప్రాంతీయాభిమానం అబినీతికి దూరంగా ఉంచలేకపోతుంటే దానివలన ప్రయోజనం యెవరికి యెందుకు యెంత వుంటుంది?కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికీ,కేసీఆర్ కుటుంబానికి నాలుగు మంత్రిపదవులు తెచ్చుకోవడానికీ,కేసీఆర్ ఇది నా అడ్డా అని జబ్బలు చరుచుకోవడానికీ 23 జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఈ విభజనని బలవంతంగా ఒప్పుకోవాలా?యే లక్ష్యం కోసం యెవరెవరు అన్నేళ్ళు మిన్నూ మన్నూ యేకం చేసి ఇవ్వళ రాష్ట్రాన్ని సాధించుకుని అధికారంలోకి వచ్చాక వాళ్ళనే అవినీతికి దూరంగా ఉంచలేనప్పుదు,విశాల తెలంగాణ ప్రజానీకం తరపున నిలబడి ఆ అవినీతిని వ్యతిరకించాల్సిన వాళ్ళు కూడా అవినీతిపరులకే కొమ్ము కాస్తూ బాజాభజంత్రీలతో ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ ప్రాంతీయాభిమానంలోని పవిత్రత యెంత?

          ఇప్పటికిప్పుడు ఈ ఓటుకు నోటు దగ్గిర్నుంచి ఫోన్ల ట్యాపింగు వరకూ సమస్తాన్నీ ప్రజల ముందు పెట్టి మళ్ళీ యెన్నికలకి నిలబడగలడా?ఇదివరకు గెలుచుకున్నన్ని సీట్లు కూడా రావని నేను ధీమాగా చెప్పగలను!యెందుకంటే ప్రజల్లో ఈ యేడాది పాలన మీద అధ్భుతమైన ప్రశంస లేవీ పలేదు.ఇప్పుదు మొదలు పెట్టిన చెరువులు తవ్వడం,నగరాన్ని శుభ్రం చెయ్యడం,వ్యవసాయాన్ని బాగుచెయ్యడం,తమ ఉద్యమం ధాటికి జడిసి పారిపోయిన పరిశ్రమల్ని మళ్ళీ వెనక్కి రప్పించుకోవడం - ఇలాంటివాటికి తనే చెప్పుకున్నట్టు నాలుగేళ్ళు పడుతుంది.అది గనక జరుగుతుంటే ప్రజలు కూడా యెదురు చూడగలరు!కానీ ఇప్పుడు జరుగుతున్నవి మాత్రం విశాల తెలంగాణ ప్రజానీకానికి యేమాత్రం పట్టనివి,అవునా?దాని గురించి చెప్పుకునే అవకాశం యెటూ లేదు - అవినీతి అంతటా ఉన్నదని వాళ్లే ఒప్పుకుంటున్నప్పుడు పొరుగు రాష్త్రం ముఖ్యమంత్రి అయిన  బాబు అవినీతి తెలంగాణ ప్రజలు పట్టించుకుంటారా?తన అవినీతి వ్యవహారాలు బయటికి వస్తే?వస్తాయి - యెన్నికలంటూ వస్తే అప్పుయినా యెదటివాళ్ళు వాట్ని హైలైట్ చేస్తారు!ఉద్యమకాలంలో ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులకి గురిచేసినా అది ఉద్యమకాలం కాబట్టి సరిపెట్టుకున్నారు,అధికారంలో ఉండి ప్రజలకి ఇబ్బంది కలగకుండా పరిపాలించాల్సిన కాలంలో మళ్ళీ తమని ఇబ్బందులకి గురి చేస్తే విశాల తెలంగాణ ప్రజానీకం మద్దతు ఇస్తుందా - అదీ తమ అవినీతిని దాచుకోవడానికి ప్రాంతం గొప్పని వాడుకుంటున్న వాళ్ళకి?

          ఇవ్వాళ లారీల యజమానులకి తెలియదా రాష్త్రం విదిపోయాక కూడా ఒకే పన్ను సాధ్యపడదని,తెలుసు కానీ భ్రమల్లో బతికేవాలాళ్లలాగ కాకుండా విభజన వల్ల నిజమైన ఇబ్బందుల్ని యెదుర్కొంటున్న వాళ్ళు కాబట్టి దానికి పరిష్కారం కోరుతున్నారు!రాకపోకలు తప్పనిసరి అయినప్పుదు అది సుఖంగా ఉండాలని కోరుకోవటం వాళ్ళ హక్కు,కాదా?ఇక్కడ చూస్తే అనాగరికమైన పరిపాలనతో గందరగోళం వుంది,ఇక్కడి నుంచి బైటికి పోయి  నాలుగు బ్బులు సంపాదించుకుందామంటే పన్నులు తడిసి మోపెడు అవుతున్నాయి?సత్య మార్గాన పోయి న్యాయమైన వాదనల్తో చట్తప్రకారం శాసనసభలో బిల్లు పెట్టి ధర్మంగా తమకు యేమి కావాలో అడిగి యెవరికి కావలసినవి వాళ్ళు పంచుకునేలాగ విడిపోతే ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా!

          ఇదివరకు సమైక్య రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకి అప్పటి ప్రభుత్వాల మీద విరుచుకు పడ్డవాళ్ళు ఇప్పుదు కనీసం ఓదార్చతాని కయినా వెళ్ళటం లేదు,యెందుకని?అప్పట్లో చంద్రబాబు వెళ్ళకపోయినా మిగతా మంత్రులు కొందరయినా వెళ్ళారు,ఇప్పుడదీ లేదు గదా!ధనిక రాష్ట్రంగా ఉన్నామని చెప్పుకోవదమే తప్ప అందులో ప్రజలకి నిక్కచ్చిగా ఉపయోగిస్తున్నది యెంత?వ్యక్తి->కుటుంబం->వీధి->గ్రామం->జిల్లా-రాష్ట్రం-దేశం->ప్రపచం అనే వృత్తాలలో మీరు చెప్తున్న "మాప్రాంతం" అనేది యెక్కడ నుంచి మొదలై యెక్కడి వరకూ సాగి యే అంతరువులో స్థిరంగా వుంటుంది?ప్రాంతం పట్ల మమకారమే అన్ని సమస్యలకీ పరిష్కారమా?ఇప్పుడు తెలంగాణ రాష్త్రం మొత్త్తం ఒకే ప్రాంతమా?యే జిల్లాకీ సొంత ఆస్తిత్వం లేదా?తమ అవినీతిని సహించడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని బూచిగా చూపిస్తున్నారని మీకు తెలియదా,తెలిసీ సహిస్తున్నారా?కేసీఆర్ మరియూ అతని అభిమానులూ ఇదే రకంగా కొనసాగితే భవిష్యత్తులో మళ్ళీ ఈ రెండు రాష్ట్రాల్నీ విలీనం చెయ్యాలన్న సమైక్యవాదం పుడితే తెలంగాన నడిబొడ్డునే పుడుతుంది!ఇంకా గట్టిగా మాట్లాడితే తొలి జండా కేసీఆర్ ఇంటిముందే యెగరొచ్చు?!

ద్వేషంతో సాధించింది ఆ ద్వేషంతోనే పోతుంది!

Sunday, 14 June 2015

ఆంధ్ర పారిశ్రామికవేత్తల సాయం లేంది పూట గడవని స్థితిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి నిజంగా ఆంద్ర ముఖ్యమంత్రిని అరెస్టు చెయ్యగలడా?

          ఆంధ్రావోడిగా నా సొంతమాటల్లో చెప్తే పులిమేస్తున్నాడు గురుడు అని తాటాకులు కదతారు.కాబట్టి ఒక తెలంగాణా బ్లాగరు పోష్టుల నుంచే యెత్తి చూపిస్తే ఇవ్వాళ తెలంగాణా వాళ్ళు ఆంధ్రావాళ్ళ మీద యెంతగా ఆధారపడి బతుకుతున్నారో తెలుస్తుంది! "ఆంధ్రా నేత‌ల‌తో సంబంధం ఉన్న కంపెనీల‌కు తెలంగాణ కాంట్రాక్టులు ఇవ్వొద్దు" అని 2015 జూన్ 10న అంత దీనంగా ఆక్రందిస్తున్నది యెవరు?ఇతర్ల కుళ్ళును చూపించి హీరో అయిన అస్సాంజి పేరు పెట్టుకుని తన కుళ్ళుని బయట పెట్టుకుంటున్న తెలంగాంఆ అసాంజి బ్లాగరు!యేమిటట ఈయనగారి ఆరోపణలతో కూడిన ఆవేదన?ఆంధ్రా నేత‌ల‌తో సంబంధం ఉన్న కంపెనీల‌కు తెలంగాణ కాంట్రాక్టులు ఇవ్వొద్దు.. వారంతా ఇక్క‌డ కాంట్రాక్టులు చేసుకొని డ‌బ్బులు కూడ‌బెట్టుకుని అదే సొమ్ముతో ఇక్క‌డి పాల‌న‌ను అస్త‌వ్య‌స్తం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.. వీలైతే తెలంగాణ‌లో పారిశ్రామిక వేత్త‌ల‌ను త‌యారు చేయండి..సలహా బాగానె ఉంది,కానీ పారిశ్రామిక వేత్తల్ని యెట్లా తయారు చెయ్యాలో తెలుసా ఈయనకి - దేశంలో బిజినెస్ స్కూల్సు చాలా ఉన్నా అందులో డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళలో యెంతమంది బిజినెస్సుల్లో ఆరితేరిపోయారో డాటా యేమయినా ఉన్నదా ఈయన దగ్గిర!ఇదంతా తెలంగాణా ఆవిర్భవించెయ్యగానే ఆధాటున జరిగిపోతుందని ఈయన కలగన్నాడని అనుకోకుండానే జరిగిపోతుందా - పిల్లి శాపాలకి ఉట్లు తెగుతాయా?ఆదర్శాలు బాగానే చెప్పాడు,కానీ పాపం అదే నోటితో ఉన్న వాస్తవం యెట్లా ఉందో కూడా ఆయనే చెప్పాడు విని తరించండి:మ‌న కాంట్రాక్ట‌ర్ల‌కు అర్హ‌త‌లు, అనుభ‌వం లేద‌ని కొన్ని ప్రాజెక్టుల్లో వారిని అన‌ర్హులుగా ప‌క్క‌న పెడుతున్నారు.. యెంత పచ్చినిజం చెప్పేశాడు?కానీ అట్లా పక్కన పెడుతున్నది యెవరు - ఆంధ్రా దోపిడీ దారుల్ని పొలిమేరలు దాటిస్తానని కూస్తే పులకించిపోయి ఈ కేతిగాళ్ళంతా చప్పట్లు కొట్టి వోట్లు గుద్ద్ది అధికారంలోకి పంపించిన ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం వారు,కాదా!

          ఇంత సీరియస్సుగా తెలంగాణ పట్ల భవ్యావేశంతో రాస్తున్న వాణ్ణి "కేతిగాడు" అంటావా అని యెవరైనా నన్ను నిలదీసే ముందు తెలంగాణ సినిమా పరిశ్ర్మ వృధ్ధిలోకి రావటానికి మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఒక షో తెలంగాణ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించే నిబంధ‌న తెస్తే బాగంటుందన్న పోష్టు చూడండి,నాకైతే నవ్వాగలేదు తెలుసా?ఇంతకీ తెలంగాణలో తెలంగాణ వారికి ప్రాముఖ్యత రావడం లేదన్న బాధ యెప్పటి నించి సెలవేసి రగుల్తుందో తెలుసా?2015 ఏప్రిల్ 28న మ‌న కాంట్రాక్ట‌ర్ల‌నూ ప్రోత్స‌హించండి...! స‌బ్ కాంట్రాక్టర్లుగా మ‌న‌వాళ్ల‌ను మార్చొద్దు అనేటప్పటికి తెలంగాణ ఆవిర్భవించి యెంత కాలమయింది?ఇంతగా ఆంధ్రా పారిశ్రామికవేత్తల బానిసాధముడై తరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రికి నిజంగా ఆంధ్రపరదేశ్ ముఖ్యమంత్రిని అరెస్టు చెయ్యగలిగే ధైర్యముందా?ఒకవేళ ధైర్యం చేస్తే అతన్ని నిలవరించలేకపోయిన ఆంధ్ర పారిశ్రామిక వేత్తలు చూస్తూ వూరుకున్నందుకు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలోని తమ స్వస్థలాలకి ధైర్యంగా రాగలరా!

          సంపద పెంచటమంటే బతుకమ్మ చుట్టూ గంతులేసినంత తేలికనుకున్నారు కాబోలు!ఇక్కడ ఐప్పుడు అంతగా పెరిగిన ఆంధ్రావాళ్ళు ఒక్కరోజులో యెదిగారా?ఇది మన రాజధాని అని నమ్మి అక్కడ గొప్పగా బతకాలనే ఆశతో స్వస్థలాల్లోని ఆస్తుల్ని తెగనమ్మి యే ఒప్పందాల్ని ఉల్లంఘించారని వీళ్ళివాళ జరిగిందేమిటో తెలియకుండా పుచ్చొంకాయ కబుర్లు చెప్తున్నారో ఆ ఒప్పందాల్ని అడ్డు పెట్టుకుని 10 రూపాయల భూమిని 30 రూపాయలు చెప్తే అవసరం తమది గనుకా అంత పెట్టినా అంతకంతా లాభం తియ్యగలం అనే నమ్మకంతో కొని అక్కడ తొలి అడుగు వేసిన సందర్భంలో సాటి తెలంగాణ వాడి కమ్మితే 10 ఇస్తాడు,రూల్సు అడ్డంగా వున్నాయి గనక ఆంధ్రావాడయితే 30 ఇస్తాడు అనే తెలివి చూపించిన వాళ్ళు అమాయకులా?ఒక తెలంగాణా వ్యాపారవేత్తయే తన గతకాలపు జీవితానుభవాల్ని చెప్తూ "ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు యెంతకయినా తెగించి భూముల్ని యెక్కువరేటుకి  కొనటం, దాంతో భూముల రేట్లు అమాంతం పెరుగిపోవటంతో తెలంగాణలో చాలామంది అప్పట్లో వ్యాపారాల్లో పరిశ్రమల్లో అడుగుపెట్టలేకపోయారు" అన్నాడు,నిజమో అబధ్ధమో అప్పటి పరిస్థితుల పట్ల అవగాహన వున్న యెవడయినా చాలా తేలికగా తెలుసుకోగలడు.యే రక్షణల్ని బూచిగా చూపించి వాట్ని ఉల్లంఘించి మీరు మాకన్యాయం చేశారని మమ్మల్ని బెదరగొడుతున్నారో ఆ రక్షణలే మీ వ్యాపారవేత్తలకి ముందరి కాళ్ళ బంధాలై ఇవ్వాళ దాని ఫలితం చూస్తున్నారు - చరిత్రని చరిత్రలా చదవండి!

          నిజాము జనాన్ని పీడించి నిలవేసిన సంపద వుండటం వల్ల అప్పుదు కూడా తెలంగాణ ధనిక రాష్ట్రం అని డప్పు కొట్టుకున్నా చంద్రబాబు ఐటిని ప్రవెశపెట్టి ప్రపంచానికి తలుపులు తెరవడం వల్ల తప్ప టూరిష్టులు చూసి సంతోషించటానికి మాత్రమే పనికొచ్చే నిజాము కట్టిన భవనాల వల్లనా హైదరాబాదు పెరిగింది?వూరికే హైదరాబాదుని ఒక్కదాన్నే పెంచాడు అనే వాళ్ళు ఇవ్వాళ ఈ ముఖ్యమంత్రి చేస్తున్నదేమిటో చూస్తున్నారా?టాంకుబండు పక్కన 60 అంతస్థుల మేలు కడతాను,ఇంకా పెంచుతాను అంటున్నాడే తప్ప తెలంగాణ లోని మిగిలిన నగరాల్ని గుఇంచి ఆలోచించటం లేదేమిటి?

          మాటిమాటికీ ఆంధ్రాలో దారుణాలూ మోసాలూ జరిగిపోతున్నాయని విపరీతమైన ఆందోళన పడుతూ "ఇవీ ఆంధ్రా మేధావులు విశ్లేషించుకోవలసిన విషయాలు" అని నీతులు చెప్తున్న వాళ్ళకి నేను ఒకే ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను:ఆంధ్ర దోపిడీ నుంచి విముక్తం చేస్తానని బీరాలు పలికి ఇంకా ఆంధ్రోళ్ళనే అంటకాగుతున్న మీ ఉఖ్యమంత్రిని ఆ ఆంధ్రోళ్ళని తరిమికొట్టమని నిగ్గదియ్యగలరా?నిగ్గదీస్తే యేం జరుగుతుందో తెలుసా!ఒక పెద్ద ఖాళీ యేర్పడుతుంది,ఆ ఖాళీ లోకి ఇవ్వాళ కొత్తగా మీవాళ్ళు పరిశ్రమలూ వ్యాపారాలూ పెట్టి రాష్ట్ర ఖజానాకి తగినంత రెవెన్యూ రప్పించాలంటే కనీసం 25 యేళ్ళు పడుతుంది,మీరు మీ దుస్థితి గురించి విశ్లేషించుకోండి!

          ఇట్టాంటి పిచ్చ యవ్వారాలు చేసి మాకు అతిగా కాలేటట్టు చేస్తే మేము ఒత్తిడి చేసి ఆంధ్రా పారిశ్రామిక వేత్తల్ని ఖాళీ చెయించినా జరిగేది అదే - కాబట్ట్టి అతిగా బాబుకి యేదో అయిపోతుందని ఆశపడితే లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలిం సిటీని దున్నిస్తే చూద్దామనుకున్నట్టే ఉంటుంది - కళ్ళు తెరిచి చూడండి!అయినా కేసీఆర్ మీ అంత పిచ్చొడేం కాదు లెండి.

          మీరు విశ్లేషించుకుని విచార పడవలసింది మరొకటి ఉంది - అధికారంలో ఉన్నాడు గాబట్టి చాటుమాటుగా కాకుండా ఇంటికే పిలిపించుకుని డబ్బుకి లొంగేవాళ్ళకి డబ్బులిచ్చి డబ్బుకి లొంగనివాళ్లని బ్లాక్ మెయిల్ చేసి తెగబడుతుంటే అది మీకు హీరోయిజం లాగ కనిపించిందా?ఒక ముఖ్యమంత్రి ఇలాంటివాడయితే అని బాబుకి యే విశేషణాలు తొడుగుతున్నారో అవి అసలేమాత్రం తనకి వర్తించనంత పులుగడిగిన మిత్యమా కేసీఆర్!పగబట్టి వేధిస్తూ ఉనికిని కాపాడుకోవటం కోసం మనమూ యేదయినా చేద్దామనే స్థితికి తీసుకెళ్ళేలాగ మెంటల్  కార్నరింగ్ చేసి ఆశపెట్టి పోలీసులకి పట్టించి ప్రగల్భాలు పలికే నీచస్థాయి రాజకీయం ఇక్క కాక ఇంకెక్కడన్నా జరిగిందా!ఇక్కడే యెందుకు జరిగింది?ఫలానా వాడు మా పార్టీ నుంచి ఫిరాయించాడు అని స్పీకరుకి రిపోర్టు ఇచ్చినా ముడ్డి కదల్చకుండా కూర్చుంటే అవతలివాణ్ణి రెచ్చగొట్టినట్టు కాదా?రహస్యంగా కాదే ఆన్నీ బాహాటంగానే జరిగినాయి కదా,అయినా అతనూ మీరూ సమర్ధించుకుంటున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది - మీరు ఉన్నతమైనదని చెప్పుకున్న ప్రాంతీయాభిమానాన్ని అతనూ మీరూ కలిసి భ్రష్టు పట్టిస్తూ తెలంగాణాని మాఫియా అడ్డాగా మీ చెతుల్తో మీరే మారుస్తున్నా తెలుసుకోలేకపోతున్నారేమిటా అని మీమీద జాలిగా కూడా వుంది,పోనివ్వండి మీ ఉన్నతాశయాలు భ్రష్టు పట్టిపోతున్నాయని మీకుండాల్సిన బాధ నాకెందుకు?

          ఒకటి మాత్రం నిజం - వారం క్రితం వరకూ నేను కూడా యెంతయినా సాటి తెలుగువాళ్ళు కదా,ఉద్యమకాలంలో వేడిలో యేదో తొందరపడి ఒకటీ రెండూ అన్నారులే అని సరిపెట్టుకుని మానసికంగా "ఆంధ్రాకీ తెలంగాణాకీ తగాదా వస్తే ఆంధ్రా వైపునే నిలబడినా తెలంగాణాకి యే మహారాష్ట్రతోనో తగాదా వస్తే తెలంగానాకే సపోర్టుగా ఉందాం" అనుకున్నాను గానీ ఇవ్వాళ హైదరాబాదులో జరిగినదానికీ జరుగుతున్న దానికీ నిలువెల్లా మీరంటే అసహ్యంతో రగిలిపోతున్నాను!ఆతిధేయ రాష్త్రంగా వుండి వాళ్ళిక్కడ ఉన్నంతకాలం మర్యాదగా వ్యవహరించి పదిమందితో మంచి అనిపించుకోవలసిన స్థానంలో ఉండి అతిధిని దొంగగా నిరూపించి అవమానించాలనుకోవటం యే రకమైన సంస్కారం?ఇదేనా తెలంగాణా సామాజికుల అతిధి మర్యాద!నువ్వు అధికారంలో ఉని ధీమాగా ఇంటికే పిలిపించుకుని బేరసారాలు చెయ్యటం డబ్బుకి లొంగాపోతే కేసుల్లో ఇరికిస్తానని బెదిరించటం నిస్సిగ్గుగా చేస్తూ,మాఫియా గూండాలు  వేరే ముఠాని పట్టించటానికి ఇక్కడ మాల్ ఉంది కలెక్ట్ చేసుకో రమ్మని పిలిచి పోలీసులకి ఉప్పందించిన తరహా నీచపు యెత్తుగడలు వెయ్యటం గొప్పగా చెప్పుకుంటున్నారే,కొంచెమయినా విచక్షణ లేదా?ఒక వ్యక్తి నన్ను ఆర్ధికంగా దెబ్బతియ్యాలంకుంటున్నాడు కేసీఆర్ అని పార్టీలో చెప్పుకుని సపోర్టు తీసుకుని గూడా కుదురుగా ఉండలేక దూకేశాదంటే అతని మీద యెంత ఒత్తిడి పెట్టి ఉండాలి?

          మరీ ముఖ్యంగా తెలంగాణా ఉద్యమలో ప్రముఖంగా కనిపించి నిజాయితీ గల ఉద్యమ కార్లుల మాటల ద్వారా పాటల ద్వారా ప్రతికక్షుల్ని కూడా మెప్పించగలిగిన ప్రాంతీయాభిమానాన్ని "ఇది నా అడ్డా ఇక్కడ నీ రుబాబు చెల్లదు" అని అమీరుపేట గూండా దిల్షుక్నగరు గూండాతో మాట్లాడే స్థాయికి దిగజారుస్తున్నాడు!దీన్ని నిజంగా అమీరుపేట గూండాలు ఆదర్శంగా తీసుకుని రేపోమాపో "అమీరుపేట రాష్ట్ర సమితి" యేర్పాటు చేస్తే యెట్లా ఉంటుంది?ఇక్కడ మాత్రం జోకు కాదు సూటిగానే అడుగుతున్నాను!మీ ముఖ్యమంత్రే ఇంకా లోపల ఆంధ్రోళ్ళ చెప్పులు నాకుతూ బైట వీధి గూండాల భాష మాట్లాడుతున్నాడు,మీకు నిజంగా దమ్ముంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ తెలంగాణ గౌరవం పేంచేలా కట్టడి చెయ్యండి.ఆంధ్రావాళ్ళు తెలివిగానే ఉన్నారు,వాళ్ళ గురించి కాదు రాష్ట్రం సాధించుకున్నాక ఇప్పటి మీ నిజమైన స్థితి యేంటో ఆలోచించుకోండి!ఇంకా మాకు మండాల్సినంతగా మండలేదు,మండితే మాత్రం సినిమా వాళ్లతో సహా పనికొచ్చేవాణ్ణి ఒక్కణ్ణి కూడా వదలం,హైదరాబాదులో ఉండకుండా ఖాళీ చెయించడానికి మీకు లాగ పన్నేండేళ్ళు తీసుకోం మాకు 12 నెలలు చాలు - ఖబడ్దార్!

ఆంధ్రా మిత్రులకి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా - ఈసారి ఇట్లాంటిది జరిగితే మనం తగలెయ్యాల్సింది కేసీఆర్ దిష్టిబొమ్మల్ని కాదు,మనవాళ్లని సినిమా వాళ్లతో సహా ఆంధ్రాకి వచ్చెయ్యమని పిల్చి రానన్నవాళ్ళ దిష్టిబొమ్మల్ని తగలెయ్యాలి!

ఆంధ్రావాళ్ళు బెజవాడలో అరిస్తే గోల్కొండ ఖిలా దడదడ లాడాలి?!

Friday, 22 May 2015

తెరాసా కేంద్రంలో భాజపాతో కలిస్తే తెలంగాణకు లాభమేమిటి?

          తెలంగాణా సాధన వల్ల విపరీతంగా లాభపడింది రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి మరియూ అతి కీలకమైన మూడు శాఖల్ని దక్కించుకోవడం ద్వారా కేసీఆర్ కుటుంబమే కదా అంటే  అప్పుడే పుట్టిన బుజ్జి పాపాయి కూడా "ఉంగా ఉంగా" భాషలోనే అవునని పిడికిళ్ళు బిగించి మరీ చెప్తాడు కాబట్టి రేపు తెరాసా "మీరు పిలిస్తే చాలు వచ్చి దూకుతాం" అని అంటున్న వుత్తుత్తి కబుర్లకి భాజపా బొక్కబోర్లా పడిపోయి పిల్చినా అప్పుడు కూడా లాభం కేసీఆర్ కుటుంబానికే తప్ప ఇంకెవ్వరికైనా ఉంటుందా?అదీగాక అక్కడ వినపడుతున్న పేరు పొరపాటున కూడా బయటివాళ్ళ పేరు రావడం లేదు కాబట్టి కేసీఆర్ కీ తెలంగాణా కీ అభేదాన్ని పాటించే బానిసాధములు మాత్రం పులకించి పోతారు!ప్రజలందర్నీ తమలాగే మార్చెయ్యగలిగితే అప్పుడు మాత్రమే తెలంగాణా  మొత్తం సంతోషిస్తుంది.

          ఇంతకీ మోదీ గారు పాత వ్యవస్థని రద్దు చేసి నీతి ఆయోగ్ పేరుతో ముఖ్యమంత్రుల్నే భాగస్వాముల్ని చేసి "మీ ప్లానింగ్ మీరే చేసుకోండి,మీ నిధుల్ని మీరే తీసుకెళ్ళండి" అని కొత్తదనాన్ని చూపిస్తున్నప్పటికీ తెరాసా వారు భాజపా పిలవకపోయినా పిలిచినట్టు వూహించుకుని కలవరిస్తూ కేంద్ర మంత్రివర్గంలో చెరడానికి అట్లా వూగుతున్నారంటే దానర్ధం యేమిటి?సలహా ఇచ్చినప్పుడు కాలినా రాధాకృష్ణ చెప్పినట్టు కేంద్రాన్ని కాకా పట్టనిదే బతుకుబండి సాగదని రూఢిగా తెలిసిపోయిందా అప్పుడే!

          యాభయ్యేళ్ళుగా మమ్మల్ని దోచుకున్నారు అనే వాదనతో ఆంధ్రోళ్లని తిడుతూ అసెంబ్లీలో విభజన బిల్లుకి సానుకూలతని పోగొట్టుకుని ఆర్టికిల్ మూడుని  నమ్ముకుని ఆదాయం పెరగడంలో వాటా ఉందని ఒప్పుకుంటూనే ఇన్నాళ్ళూ మమ్మల్ని దోచుకున్నారు గాబట్టీ మా ప్రాంతంలోకి వస్తుంది గాబట్టి ఆదాయమంతా మాకే మీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వం అని అంత మంకుపట్టు పట్టడం వల్ల అంతిమంగా విడిపోయాక చూస్తే మాత్రం విడిపోయిన మొదటి సంవత్సరానికి నిలవలో ఉండటం ఒక్కటే వూరటగా అనిపించినా కడలిని మించిన కష్టాలు రాష్ట్రం మొత్తాన్ని కరువుకోరల్లోకి నెట్టెయ్యడానికి చూస్తున్న పరిస్థితి దాపరించింది.

    విడిపోయిన కొద్ది కాలంలోనే చాలా పరిశ్రమలు హైదరాబాదు నగరం నుంచి అంటే తెలంగాణ నుంచి తరలిపోయాయని రూఢిగా తెలుస్తున్నది.ముఖ్యమంత్రుల కొడుకులు కూతుళ్ళ జాతరలు మాత్రం పెరిగినాయి.అమేరికాలోనే కాదు డిల్లీ మొదలు ప్రపంచంలో యెక్కడ చెప్పుకోదగిన స్థాయిలో తెలుగువాళ్ళు ఉన్నా అక్కడికల్లా ఈ జోడు మద్దెల మేళాల మోత తప్పదేమో!ఒకళ్లనొకళ్ళు తెలుగులోనే గదా తిట్టుకుంటున్నాం అనుకుంటే కుదరదు.సౌగతా రాయ్ అనే బెంగాలు పార్లమెంటు సభ్యుడు అప్పుడెప్పుడో తెరాసాకి ఇద్దరే ఇద్దరు సభ్యులు ఉండి అందులో ఒకరు కేసీఆర్ తన సీట్లోనే ఉండగా విజయశాంతి జై తెలంగాణా నినాదాలు చెయ్యడం నుంచి మొదలు పెట్టి పూస గుచ్చినట్టు చెప్పి అందరూ మనల్ని యెంత చక్కగా గమనిస్తున్నారో కళ్ళకి కట్టినట్టు చూపించాడు!ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తమ రాష్ట్రంలో అడుగుపెట్ట్టనివ్వం అని ఒక తెరాసా మంత్రి అన్నదానికి ఉచితబోడిసలహా కూడా ఇచ్చినట్టు ఉన్నాడు కదా!ఇంగ్లీషు మీడియా అనువదించి ప్రచురిస్తే ప్రపంచమంతా చదువుతారని తెలుసుకోండి - యెకనామిక్ టైంసులో గనక అలాంటి వార్తలు పడితే దాన్ని యెక్కువగా చదివే వ్యాపారస్తులకి అలాంటి ధెరణులు ప్రమాద సూచనగా కనబడి జరిగే హాని అంతా ఇంతా కాదు!

          అటు నవ్యాంధ్ర చూస్తే లోటుతో విడిపోయినా ముఖ్యమంత్రి కంద్రప్రభుత్వంలో భాగస్వామిగా వుండి కేంద్రం నుంచి లభిస్తున్న సహకారం భరోసా ఇవ్వగా ప్రపంచదేశాలన్నీ తిరిగి యం.వో.యు లు కుదుర్చుకుని పెట్టుబడుల పరంగా ధీమాగా వుండి భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కలిగిస్తున్నాడు!ఇటు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రం దాటి రెండుసార్లు వెళ్ళి వచ్చినా పుల్లయ్య్య వేమవరం వెళ్ళోచ్చిన చందమే తప్ప నికరలాభం యేదీ రాలేదు?విభజన బిల్లులో ఉన్నవీ లేనివీ మాట్లాడుకుని ఉన్నవాట్ని న్యాయంగా పరిష్కరించుకోవడంలోనూ లేనివాట్ని కొత్తగా ప్రతిపాదనలు చేసుకుని పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోకపోతే నష్టం తెలంగాణకే యెక్కువ అని తెలంగాణా మేధావులు యెప్పటికి గుర్తిస్తారో!వాతావరణం వేడెక్కి మారుమూల గ్రామాల్లో చెరువులు యెండిపోవటానికి కూడా ఆంధ్రోళ్ళ నిర్లక్ష్యమే కారణం అంటుంటే అది నిజమో అబధ్ధమో తేల్చుకుందామని ప్రయత్నించకుండా విద్యాధికులు కూడా నమ్మేస్తున్నారు,ఇవ్వాళ పూడికలు తీస్తున్న సరస్సులు నిండటానికి నీరు యెక్కణ్ణించి తెస్తారు?ఆ పూడికలు తియ్యటం పూర్తయ్యి అవి నిండేవరకూ రైతులు తమ పొలాల్ని బీడుభూములుగా వుంచాల్సిందేనా?అదొక్కటే తెలంగాణ వ్యవసాయానికి పరిష్కారమైనట్టు సమైక్యంగ ఉన్నప్పటి రైతుల ఆత్మహత్యలకు అప్పటి సమైక్య ప్రభువులే కారణమన్న వారు ఇవ్వాళ్టి రోజున జరుగుతున్న ఆత్మహత్యలకి కనీసం స్పందించను గూడా స్పందించటం లేదనేది చూస్తున్నారా?రాగద్వేషాలు లేని నిండుమనస్సుతో నిక్కచ్చిగా అంచనా వేస్తే నవ్యాంధ్రప్రదేశ్ లోటుతో విడిపోయినా రాజకీయపరమైన నాయకత్వం గట్టి నమ్మ్మకాన్ని కలిగిస్తుండగా తెలంగాణా మిగులుతో విడిపోయినా రాజకీయ నాయకత్వం యెట్టి నికరమైన ఆశనీ కలిగించని విధంగా ఉంది!

          కేంద్రమంత్రివర్గంలో చేరడం అనేది పైకి చూడటానికి గొప్పగా కనబడినా లోనారసి చూస్తే అక్కడ ప్రధాన పార్టీ అయిన భాజపాకి పల్లకీ మొయ్యటం కన్నా గొప్పగా వుండదు.తన రాజకీయ జీవితం మొదలైన తొలిరోజుల్లో అనామకంగా ఉన్న మోదీని ప్రతి పత్రికా సమావేశంలోనూ ఒకసారయినా ప్రశంసించకుండా తన పత్రికాసమావేశాన్ని పూర్తి చెయ్యలేకుండా ఉన్నాడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,తప్పనిసరిగా నన్ను పొగడమని మోదీ చెప్పాడా,లేదే?మోదీ ఇప్పుడున్న స్థానమూ తన అవసరమూ అట్లా ఉంది మరి!నేను రెండు ముష్టి చిప్పలు అన్నందుకు అప్పుడు మిత్రులొకరు అట్లా ఉండదేమో అన్నారు,కానీ ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు నిలబడి ఉన్న వాస్తవ పరిస్థితి యేమిటో చూస్తున్నారు గదా!నిన్నటి నా అంచనాలన్నీ చాలామటుకు ఇవ్వాళ నిజమవుతున్నాయి,కానీ అవి నిజం కాకుండా ఉంటేనే బాగుండేది కదా అని బాధపడాల్సిన పరిస్థితిలో ఉన్నాను నేను!

          పరస్పర లాభాన్ని ఆశ్రయించే ఈనాటి వాతావరణంలో తెరాసాకి కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించడానికి తెరాసా వైపు నుంచి యేమీ చెయ్యనక్కర లేదా?చెయ్యాలి,తెలంగాణలో వ్యాపించడానికి భాజపాకి సహకరించాలి!తెలంగాణలో తొలి బోణీ భాగ్యనగరమే కావాలని భాజపా ప్రణాళికల్ని బట్టి వూహించవచ్చు.ఇక్కడయితే హిందూ ముస్లిం వాతావరణాన్ని బలంగా పైకి లేపే వీలు ఉండటం వల్ల తను కూడా సొంతంగా కృషి చేసి పునాదిని పటిష్ఠం చేసుకోవచ్వ్హు,నగరం వెలుపలి ప్రాంతాల్లో యెక్కడన్నా అయితే పై స్థాయిలోని నాయకులే కాదు తెరాసా కింది స్థాయిలోని శ్రేణులు కూడా భాజపాని బుజాల మీద మోస్తే గానీ పని జరగకపోవచ్చు!మొదటి సాక్ష్యంగా నిన్నటిదాకా నిజాముని పొగిడినంత గట్టిగా స్వామి రామానంద తీర్ధని పొగడాలి!పాతబస్తీ మిత్రుల సాయం ఆశ వొదులుకోవాలి,అంత క్రూరకార్యం చెయ్యగలరా?యేదో ఒక నికరమయిన హామీ లేకుండా వస్తామనంగానే అక్కున జేర్చుకోవడానికి భాజపా వాళ్ళు వెర్రి వెంగళప్పలు కారుగా!

పూర్ణకుంభాన్ని పగలగొట్టుకుని రెండు ముష్టిచిప్పల్ని సాధించుకున్న వెంగళప్పలు తెలుగువాళ్ళే!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...