అజ్ఞానం - దరిద్రం కవల పిల్లలు. అవి ఒకదాన్నిఒకటి అంటిపెట్టుకుని ఉంటాయి. ఒకటి కొంటే ఒకటి ఉచితం అనేటంతగా పెనవేసుకుని ఉంటాయి. డబ్బు ఎలా సంపాదించాలనేది తెలియని అజ్ఞానం వల్ల దరిద్రం పట్టుకుంటుంది . దరిద్రం వల్ల మనస్సు సరిగ్గా పని చెయ్యక అజ్ఞానం పట్టుకుంటుంది. ప్రెషర్ కుక్కర్ అనే వస్తువు ఒకటి ఉoది. అది ఆడవాళ్ళు మాకది కావాలని అడిగితే తయారు చేసింది కాదు. అది ప్రజలు ఇవ్వాళ పడుతున్న బాధని తొలగించటానికి దాన్ని తయారు చేసిన వాడికి వచ్చిన ఆలోచన నుంచి తయారయింది. ఆ ఆలోచన మంచి చేసేది గనక దానికి కొత్తగా మార్కెట్టుని అదే పుట్టించుకొవల్సి వచ్చింది. మొదట ఆ ఆలోచన ఎవడికి వచ్చిందో వాడు కొంతకాలం మార్కెట్టుని యేలేస్తాడు. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఆ మార్కెట్ లోకి ప్రవేశిస్తారు. ఇలా ప్రవేశిoచాలంటే అంతకు ముందున్న వాళ్ళు ఇచ్చే సౌకర్యాల కన్నా తను ఎక్కువగా ఇస్తేనే మార్కెట్లో తను సరయిన స్థానాన్ని పొంద గల్గుతాడు.
ఉద్యోగాల కయితే డిగ్రీలు కావాలి. పరీక్షలు రాయాలి. నానా రకాల తంటాలూ పడాలి. కానీ వ్యాపారం చెయ్యాలన్నా పరిశ్రమ పెట్టాలన్నా ఇవేమీ అక్ఖర్లేదు. కానీ ఏది తను బాగా అమ్మగలడో తన గురించి తనకు బాగా తెలియాలి. కొత్త వస్తువును తయారు చేసి దానికి కొత్తగా మార్కెట్ ని పుట్టించుకొవడమా, అప్పటికే ఉన్న వస్తువుని మరింత బాగా మెరుగు పరచి అమ్మడమా - ఏది తనకు చేతనయితే అది చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి విడత లాభాలు వచ్చేవరకు అవసరమయ్యే సంస్థాగతమయిన పెట్టుబడి ని తనే సమకోర్చుకోవాలి. ఒకసారి లాభాలు రావడం మొదలయితే తరవాత వ్యాపారాన్ని విస్తరించడానికి మోలధనాన్ని కదిలించకుండా లాభాల నుంచే పెట్టుబడినీ పొందాలి. ఇవన్నీ చెయ్యగలిగిన వాడే వ్యాపార పారిశ్రామిక రంగాల్లో వృద్దిలొకి వస్తాడు. ఇది చెయ్యలేని మీ లాంటి నా లాంటి వాళ్ళు యేదో ఒక ఉద్యోగం చూసుకుని బతికెయ్యాలి. అయితే ఈ రెంటికి కొన్ని ముఖ్యమయిన తేడా లున్నాయి. ఉద్యోగం లో భద్రత ఉంటుంది, ్వ్యాపారంలోఉండదు. కానీ ఒక ఉన్నతోద్యోగి కూడా తన ముప్పయ్యేళ్ళ సర్వీసులో పొంద లేని ఆదాయం ఒక మధ్యస్థ అంతరువు లోని వ్యాపారి కేవలం అయిదు పది సంవత్సరాల లోనే పొంద గలడు. వ్యక్తులకు ఉద్యోగాలు భద్రతా నిచ్చినా ప్రాంతాల వారీగా చూస్తే వ్యాపార పారిశ్రామిక రంగాల వల్లే లాభం ఉంటుంది.
హైదరాబాదు రాష్ట్ర ఆదాయంలో అధికశాతం ఆక్రమించ గల్గడానికి కారణ మిదే. యాభయ్ అరవయ్ యేళ్ళపాటు ఇది మన రాష్ట్రం అని మన రాజధాని అని ఆత్మీయత ఫీల్ అయ్యి వ్యాపారాలలో ెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించి కేవలం ఒక్క నగరం నుంచే రాష్ట్ర ఆదాయం మొత్తంలో 47% ఉండేలాగ చేస్తే దానికి ఫలితం అక్కడి నుంచి వెళ్ళగొట్టబడటమా? హైదరాబాదు ఆదాయాన్ని ఖర్చుపెట్టటం గురించి ఉన్న సాంకేతికమయిన మెలికతో మొత్తం మాకే చెందుతుందంటున్నారు. ఇది న్యాయమేనా?పెట్టుబడులకు దగ్గ శాతాన్ని అడిగితే యెవరూ తప్పు పట్టరు, కానీ "రిప్ వాన్ వింకిల్" లాగా అరవయ్ యేళ్ళ పాటు పెట్టుబడులు పెట్టటంలో యే మాత్రమూ చొరవ చూపకుండా రాజ్యాంగం అనుమతించిన పధ్ధతుల్లో వ్యాపారం చేసిన వాళ్ళని దోపిడి దార్లుగా, అందుకు అవసరమయిన భూముల్ని కొనుగోలు చెయ్యటం భూ ఆక్రమణలు గా జమ చెయ్యటం యెంతవరకూ సబబు?
అవి కబ్జా లయితే అతను తెలంగాణా వాడయిన ఆంధ్రా వాడయినా నేరాన్ని యెవరూ సమర్ధించరు.అలా కాక కొనటమే జరిగితే మీరు సాంకేతికంగా తెలంగాణాలో ఇతరులు భూమిని కొనగూడదనే నిషేధాన్ని సాకుగా అతన్ని దోషిని చెయ్యాలనుకుంటే మరి అమ్మిన తెలంగాణా వ్యక్తి సంగతేమిటి?తెలంగాణాలో భూముల, ఆస్తుల కొనుగోలు అమ్మకాల్ని పర్యవేక్షించే ఒక ప్రాంతీయ కమిటీ ఉంది.ఆ కమిటీ అనుమతి లేకుండా కొన్నారా?ఆ కమిటీ అనుమతి లేకుండా కొంటే యే వివాదమూ అక్కర్లేకుండానే అనుమతి లేని అమ్మకం చెల్లదు కదా? వారు అనుమతి ఇచ్చిన దాన్ని తప్పు పడితే మీ తెలంగాణా ప్రాంత నాయకులే అవినీతికి తెగబడ్డట్టు కాదా?అవినీతిలో అందరికీ భాగం ఉన్నప్పుడు ఒక ప్రాంతం వారు పులు గడిగిన ముత్యాలై మరొక ప్రాంతం వారు దోపిడీ దారు లెలా అవుతారు?
దేశంలో యే ప్రాంతం వాడయినా యెక్కడయినా స్థిరనివాసం యేర్పరచుకోవచ్చు కదా(కష్మిర్ని మినహాయిస్తే), మరలాంటప్పుడు గుజరాతీ వార్నీ, ఇంకా వార్నీ వీర్నీ అని లెక్కలు చెప్పి ఆదరిస్తున్నామనే వాళ్ళు,ఆంధ్రా ప్రాంతం నుంచి వొచ్చిన వాళ్ళకి మాత్రం ఆంగ్లేయులకి వాడినట్టుగా వలస వాదులు అని అనడం యెందువల్ల జరుగుతున్నది?
కలిసుండడం వల్ల తెలంగాణా భాషకి అన్యాయం జరిగిందనీ కృష్ణా జిల్లా మాండలికాన్ని అధికార భాషగా చేస్తే భరించాల్సి వొచ్చిందనీ చెబుతున్నారు. అది నిజమేనా? నిజంగా కృష్ణా జిల్లా మాండలికం ఇలాగే ఉంటుందా? కృష్ణా జిల్లా మాండలికాన్నే గనక కుట్ర పూరితంగా పైకి తీసుకొస్తే ఒక్క తెలంగాణా వాదులేనా గుంటూరు జిల్లా వాళ్ళు, ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళూ రాయల సీమ వాళ్ళూ గొడవ చెయ్యరా? యే ఇద్దరు రెండు వేర్వేరు జిల్లాల నుంచి వొచ్చ్చిన వాళ్ళు యెవడి భాషలో వాడు మాట్టాడుకుంటూ పోతే వ్యవహారం నడుస్తుందా? అందువల్ల అప్పటి వాళ్ళు మాండలిక వ్యవహారిక తెలుగు ని కాకుండా అందరూ అర్ధం చేసుకొగలిగే విధంగా భాషని సామాన్యీకరించారు? ఇప్పుడు బ్లాగుల్లో మనందరం వాడుతున్నదీ అదే, యే ప్రాంతీయ పదాలూ లేని అందరికీ అర్ధమయ్యే సామాన్య తెలుగు. ఇది కూడా తప్పేనా?
ఆయా మాండలికాలకి ఆదరణని కల్పించడం అనేది ఆ భాషలో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు తమ రచనల్లో ఉపయోగించి మిగిలిన వారికీ పరిచయం చేస్తే మిగిలిన వారు అందులోని స్వారస్యాన్ని గ్రహించి మెచ్చుకుంటారు. తిక్కన గారు తన పదిహేను పర్వాల తెలుగు భారతంలో నెల్లూరు జిల్లా మాండలికపు సొంపుని వాడినట్టుగా శ్రీ శ్రీ గారు చెప్పగా విన్నాను. ఆ రకంగా నెల్లూరు జిల్లా మాండలికం తన పలుకుబడులతో సహా భారతేతిహాసంలో ఒక భాగం కాగలిగింది. దీన్ని యెవరయినా వ్యతిరేకించగలరా? మరో విధంగా యే ఒక్క భాష నయినా అధికారికంగా ప్రోత్సహిస్తే మిగిలిన వారు ఊరుకుంటారా?
ఇక్కడ పదాల వాడకం గురించి తెలంగణా వాదులతో నాకెదురయిన ఒక చిత్రమయిన సన్నివేశాన్ని వివరిస్తాను. వాళ్ళు మాటిమాటికీ ఆంధ్రోళ్ళు అని వాడుతుండడం గురించి నేను అభ్యంతరం చెప్పాను యువవాణి బ్లాగులో. దానికి వారి ప్రతిస్పందన యేమిటో తెలుసా? "ఆంధ్రోళ్ళు అంటే తప్పు మాటా, నాకు తెలియదే?" అని అమాయకంగా అడగటం, పైగా మీ తెలుగుకో నమస్కారం" అని నన్ను వెటకారం చెయ్యటం. వారు ఒకసారి నా మొదటి టపాని చూసి ఆ తర్వాత నా తెలుగు భాషని గురించి యేదయినా మాట్లాడితే బాగుంటుందని అడుగుతున్నాను. అసలు సమస్య అది కాదు. తెలంగాణా వాదులు బుల్లెబ్బాయి అంటే మాకు తప్పు అన్నారు, అది వాళ్ళ దగ్గిర వాడకూడదు అంటే మనం ఒప్పుకోవాలి. కానీ మనకి ఆంధ్రోళ్ళు అనే మాట గురించి పట్టింపు ఉన్నా వాళ్ళు పట్టించుకోరు. వారి ఉద్దేశ్యం - వాళ్ళకి ఇష్టం లేని మాటలు మనం వాడకూదదు, వాళ్ళు వాడే మాటలకి మనం అభ్యంతరం చెప్పకూడదు.ఇదీ వారు భాషాపరంగా కోరుకునే సమానత కాబోలు!
________________________________________________________
బాగుంది హరిగారూ మీ విశ్లేషణ,
ReplyDeleteకొంతకాలం ఓపిక పట్టండి. ఒక పది సంవత్సరాలలోనే తెలంగానా ప్రజలందరూ మనం అందరం కలిసే ఉందాం అంటూ మన సమైక్య రాగాన్ని ఆలపించే రోజు వస్తుంది. ఎందుకంటే విభజన మొదలు పెట్టింది రాజకీయ నాయకులే. . . ముగించింది రాజకీయ నాయకులే. . . తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్‌లు విడిగా మనలేవు. ముఖ్యంగా తెలంగానాకు ఉన్న అనేక ప్రతికూలతలు తప్పకుండా సమైక్య ఉద్యమాన్ని ఉదయింపచేస్తాయి.
పోటీ పరీక్షలకోసం అన్నిరకాల సబ్జక్టుల మెటీరియల్స్ రూపొందించి ఉచితంగా అందించడానికి ఏర్పాటు చేసిన వేదిక నా బ్లాగు నవచైతన్య కాంపిటీషన్స్ (www.menavachaitanyam.blogspot.com) ఒకసారి వీక్షించండి.
మీ
చైతన్య కుమార్ సత్యవాడ
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా
మీ బ్లాగును చూశాను. విద్యార్ధులకి పనికి వచ్చే చాలా మంచి సమాచారం ఉంది.మీ శ్రమకు తగ్గ మంచి ఫలితం లభించాలని ఆశిస్తున్నాను.
DeleteALL THE BEST.
"కానీ మనకి ఆంధ్రోళ్ళు అనే మాట గురించి పట్టింపు ఉన్నా వాళ్ళు పట్టించుకోరు"
ReplyDeleteప్రత్యాన్యాయ పదం మీరే చెప్పండి.
మేం మిమ్మల్ని తెలంగాణా వాళ్ళు అంటున్నాంగా, అలాగే మీరు మమ్మల్ని ఆంధ్రా వాళ్ళు అనొచ్చుగా.
Deleteఅభ్యంతరం "సంధి" (liason) గురించా, OK sir!
Delete@ JAI good reply (అభ్యంతరం "సంధి" (liason) గురించా, OK sir! )
Deleteజై గారూ, యేదో సటైరు బాణం వేసినట్టున్నారు/ చందు గారి కామెంటు చదివాకనే తెలిసింది. కానీ మీ బాణం గురి తప్పినట్టుంది:-) అందులో ఉన్న మెలికేంటో అర్ధం కాలేదు?!
Deleteఆంధ్రా + వాళ్ళు = ఆంధ్రోళ్లు? (ఈ సంధి పేరేంటో గుర్తు లేదు)
DeleteJust in a lighter vein. ఆంధ్రులు లేదా ఆంధ్రా వారు అనడమే బాగుంది.
ఇరగ దీసారు పొండి:-) మీరు ఆ కొటేషన్లూ బ్రాకెట్లూ వాడక పోయింటే నాకు వీజీగా బుర్రకెక్కి ఉండేది - సవర్ణ దీర్ఘ సంధి?! మీరు చేసిన హడావుడి అంతా చూసి మీరు రహస్యమయిన కోడ్ లాంగ్వేజి యేదో వాడారనుకున్నాను. ఈ మాట బావుంది కదా!
Delete"తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్‌లు విడిగా మనలేవు"
ReplyDeleteSKC volume I page 162:
"Thus, from the point of view of sheer size of economy, Telangana as a new state can sustain itself *both with and without Hyderabad*. The other combination of regions – coastal Andhra and Rayalaseema together can also sustain themselves as a state; in fact they can also sustain themselves *separately*"
విడిగా మనగలుగుతాయి, ఇంకా అద్భుతంగా మందుకెళ్ళగలుగుతాయి.అందులో సందేహ మేమీ లేదు.కానీ తెలంగాణా వెనుకబాటు తనాని కంతా ఆంధ్రోళ్ళు మాత్రమే కారణ మనే జాతి పరమయిన నింద పట్లనే నా అభ్యంతర మంతా. పులుముడు పాండిత్యంతో ప్రచారం చేసిన అర్ధసత్యాల పట్లనే నా తిరస్కారం.
Deleteమీరు కాదండీ, చైతన్య కుమార్ గారు అలా అన్నారు. వారి వ్యాఖ్యకు "జవాబు" బటన్ నోక్కపోయి పొరపాటున కొత్త వ్యాఖ్య రాసాను.
Deleteit's ok, we can adjust for such small things.
Deleteayya medhavi garu vyaparam cheyadam neramu ani ye telanagna vadi cheppadu meeku ... hyderabad nunchi meemalini evaru pommannaru .... kabja lu cheydam vyaparam ankuntunnaraa endhi ? ramoji film city lu , ramki lu , lanco estate lu , narne estate lu prpapanchalmu lo ye vishayam kotha gaa kanukkoni villu evvi samapdincaharu ... abbo medhavi garu inko vishayam kani pettindru konna vadu papi ayeethe aminvadu papi kada allekkana girijana la nundi andaram bhoomi konkundham pada 1/70 act endhuku oka vela evariaa arrest chesthe first girijanunni arrest cheyandri ani thappichu kundham ... telanagan meedha samskrithika adipathyam jaragaledaa ani meeru cheppadalu chukunnara .. great kanivandi
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteఅయ్యా మేధావి గారూ వ్యాపారం చెయ్యడం నేరము అని యే తెలంగాణా వాదీ చెప్పడు మీకు ... హైదరాబద్ నుంచి మిమ్మలిని ఎవరు పొమ్మన్నారు .... కబ్జా లు చెయ్యడం వ్యాపారం అనుకుంటున్నారా ఎంధి ? రామోజీ ఫిల్మ్ సిటీ లు , రాంకి లు , లాంకో ఎస్టేట్ లు , నార్నె ఎస్టేట్ లు ప్రపంచంలో యే విషయం కొథ గా కనుక్కొని వీళ్ళు అవ్వి సంపాదించారు ... అబ్బో మేధావి గరు ఇంకో విషయం కని పెట్టిండ్రు కొన్న వదు పాపి అయిథే అమ్మిన్వాదూ పాపి కదా అల్లెక్కన గిరిజన ల నుంది అందరం భూమి కొంకుంధాం పద 1/70 అచ్త్ ఎంధుకు ఒక వెల ఎవరీఅ అర్రెస్ట్ చెస్థె ఫస్ట్ గిరిజనున్ని అర్రెస్త్ చెయంద్రి అని థప్పిచు కుంధం ... తెలనగన్ మీధ సంస్క్రిథిక అదిపథ్యం జరగలెదా అని మీరు చెప్పడాలు చూసుకున్నర .. గ్రేత్ కానివ్వంది
Delete----
ఇలా లేఖిని లో నేను రీటైప్ చేసుకుంతే గానీ మీ భావం నా కర్ధం కాలేదు. కొంచెం నాకు శ్రమని తగ్గిస్తారా?
రాజధాని నగరంలో దస్తావేజుల ద్వారా భూమిని కలిగి ఉండి క్రయ విక్రయ విషయాల గురించి తెలిసి అమ్మిన నగర వాసినీ తన భూమి విలువెంతో తెలియని 1/70 రక్షణ గురించి తెలుసుకోలేని ఆటవీ జనాన్నీ ఒకే గాటన కట్టెయ్య లేం, అవునా కాదా?
క్రయ ఒప్పందాల ద్వారా డబ్బు తీసుకుని అమ్మిన వాళ్ళని కూడా వాళ్ళ ని అమాయకుల్ని చేసి తక్కువ రేటుకి ఫిరాయించేసుకున్నారు అని నాకు చెవులో పువ్వులు పెట్టొద్దు.
అవి కబ్జాలు అని మీరు ఖచ్చితంగా అంటే నీరజా మిశ్రా అనే ఒక స్త్రీ మాత్రం చెయ్యలేని అసమర్ధులుగా మీరు లెక్క కొస్తారు, అవునా కాదా?
ఇక సాంస్కృతిక అధిపత్యం గురించి నేను చెప్పిన మాటకి నేను విరుధ్ధంగా మాట్లాడదం లేదు కదా?
నేను దాని గురించి తర్వాతి టపాలో వెల్లడిస్తాను. నా తర్వాతి టపా గిర్గ్లానీ గారి రిపోర్టు మీద అధార పడి ఉంటుంది. దానికి మీ నుండి కొన్ని ప్రశ్నలకి జవాబులూ కొన్ని వివరాలూ మీరు నా కివ్వాలి.
ఆయన పూర్తిగా నాన్-గెజిటెడ్ ఉద్యోగుల నియామకాల గురించే రాశాదు, అవునా? నిక్కచ్చిగా ఫాలో అయి ఉంటే జోనల్ సిస్టం చాలా మంచి ఫలితాల నిచ్చేది అన్నాదు.తన కమిషన్ పరిశీలించినవి |Deviations| అని అన్నాడు. అలా యెందుకన్నాడో గూడా రిపోర్టులోనే ఉంది. కానీ మీరు |violations| అంటున్నారు.రెండు మాటలకీ తేడా యేదయినా ఉందా? యే మాట కరెక్ట్?అక్కడ ఆయన ఆ|Deviations|కి యేడు కారణాలు చెప్పాడు.అందులో మొదటి కారణాన్ని మీ కామెంటులో పేస్టు చెయ్యండి.దానితో పాటు తెలంగాణాలో ఉన్న జోన్లు యెన్ని? అందులో లోకల్, నాన్-లోకల్ అల్లోకాషన్స్ యే విధంగా ఉంది?|violations| యెంతమొత్తంలో జరిగాయి. ఇక్కడ కామెంటులో కాలంస్గా ఇవ్వదం కష్టం కానీ సరి చూసుకోవడానికి పనికి వస్తాయి. కామెంటు పెద్దదయ్యే ఇబ్బంది ఉంటే లింకు ఇచ్చినా ఫర్వాలేదు.
సంవత్సరాల వారీ వివరాలు మరీ పెద్దగా ఉంటే దశాబ్దాల వారీ లెక్క చాలు.
http://www.scribd.com/doc/33993039/ONE-MAN-COMMISSION-SIX-POINT-FORMULA-ANDHRA-PRADESH-Vol-1
నేను ఈ లింకు నుంచి తీసుకుంటున్నాను, అది సరయిన దేనా?
nayanaa medhavi garu neeko dhandam nee medhavi thavaniki ko dhandam ... telangana andhra kalisina appude Telangna peddalu pedmmanushula voppdandham pettukundhe meeru makante husharu ga vunnaru ane maa bhoomulu anyakrantham ayeetha ane ..... ee kabja korula antha tisukunna bhoomulu prabusthava balamu tho ikkada vunaa prabuthva bhoomulu thisukknarayaa .... ayeena neeko dhandam sir .....
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteఅయితే తెలంగాణా రాష్ట్రంలో ఇక హైదరాబాదు కబ్జా - ఫ్రీ అన్న మాట, అద్భుతం!ఒక వేళ అప్పటికీ కబ్జాలు ఆగక పోతే?మరోసారి మీలో మీరు కొట్టుకునీ తిట్టుకునీ మళ్ళీ మళ్ళీ విడిపోతూ ఉంటారా ?! కబ్జాలను ఆపడానికి భలే మంచి పరిష్కారం కనుక్కున్నారు లెండి.
Delete