పవన్ చాలా బాగా మాట్లాడాడు.మొత్తం అన్ని వీడియోలూ విన్నా.విన్నానని యెందుకంటున్నానంటే చూసింది వీడియోనే అయినా రాసుకొచ్చింది చదవడమే కదా చూడ్డానికే ముంటుంది?మంచి ఆవేశం ఉంది. భాషలో చాలా పవర్ ఉంది. పవర్ స్టార్ కదా! ఇవ్వాళ జనం తెలుసుకోవలసిన విషయాల్లో చాలా వాటిని ప్రస్తావించాడు. అప్పటి అన్నగారిలాగా నసగటం గొణగటం యేమీ లేకుండా తను చెప్పదల్చుకున్న దాన్ని బల్ల గుద్ది చెప్పాడు.
ముఖ్యంగా తను హఠాత్తుగా వొచ్చి అందర్నీ వెనక్కి తోసేసి ముందుకెళ్ళిపోయి ముఖ్యమంత్రి అయిపోవాలనే దురాశతో మాత్రం లేడు. తలలో తింగరి అలోచన ల్లేవు,కాళ్ళు భూమి మీదనే ఉన్నాయి.అంతవరకూ అతన్ని తెలివయిన వాడిగానే లెక్కెయ్యొచ్చు.మనం కూడా అతన్నుంచి యెక్కువ ఆశించనక్కర్లెదు.
ఇవ్వాళ ఇటువైపున జగన్ అటువైపున కచరా చాలా ప్రమాదకరమయిన వ్యక్తులు. కచరా ని కంచె అయిలయ్య లాంటి మేధావులూ గద్దర్ లాంటి ప్రజా కళాకారులూ సమర్ధించటం లేదు. అతనిలో తెలంగాణా దొరతనపు అహంభావం ఉంది.అసలు తెలంగాణా వాడు కాదు, విజయనగరం వాడని తెదెపా వాళ్ళంటున్నారు.అది యెలా ఉన్నా అతని వ్యక్తిత్వంలో అహంభావం ఉంది.ఆ మూర్ఖత్వమే ద్వేషభాషకు కారణం. అతన్ని తెలంగాణాలో యెదుర్కోగలిగిన సత్తా ఉందనిపించింది. అతని ధోరణి కూడా కచరాతో ఢీ కొట్టడానికి నిశ్చయించుకున్నాడని తెలిసిపోయే విధంగానే ఉంది.
కాబట్టి ఇటు వైపున జగన్ని అటువైపున కచరాని తగ్గించి తెదెపా భాజపా లోక్సత్తా త్రయానికి కొంచెం వూపిరి పీల్చుకునే సహాయం మాత్రమే చెయ్యగలడు. అంతకు మించి భూనభోంతరాళాలు బద్దలు కొట్టగలడని నేను నమ్మటం లేదు. అది అతనికీ తెలుసు.
అతని మానిఫెస్టో యేమిటనేదాని గురించి నేను పట్టించుకోవటం లేదు.మానిఫెస్టోలూ అవీ అక్కర్లేదు కూడా. ఇప్పుడు మనం విద్యాధికులమే అయినప్పటికీ యే పార్టీ మానిఫెస్టో నయినా పూర్తిగా చదివి వోట్లు వేస్తున్నామా?రెండు వైపులా కొంచెం సొంత మెదడుతో ఆలోచించగలిగిన ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే.విలీనం మీది ఆశతో ఈ రాష్ట్రాన్ని విడగొట్టగూడని విధంగా - రెండు ప్రాంతాల్లో యెవరికీ ప్రయోజనం లేని భీబత్స కాండగా మార్చి - విడగొట్టిన కాంగ్రెసు నామ రూపాల్లెకుండా పోవాలి.
ఇప్పుడు కాంగ్రెసు పార్టీ లోని ప్రతీ వాడు తెదెపా లోకి జంప్ అవుతున్నాడు. యెదిరి పక్షం నుంచి వచ్చే వాళ్ళని వొద్దనకుండా చేర్చుకోవటం వ్యూహాత్మకంగా మంచిదే గానీ అప్పుడు తెరాసాకి నలబై సీట్లిచ్చి దెబ్బ తిన్నట్టుగా ఇప్పుడు వీళ్ళందరికీ సీట్లిస్తే బాబు మళ్ళీ మట్టానికి మునిగి పోతాడు.
తెదెపాకి బలం క్యాడరే. నిన్నటి దాకా తిట్టిన వాళ్ళకి ఇవ్వాళ జండాలు మొయ్యాలంటే వాళ్ళు మనస్పూర్తిగా చెయ్యరు.ఆ పొరపాటు చెయ్యకుండా, అవసరమయిన చోట పవన్ సాయం తీసుకుంటూ మంచి వ్యూహంతో వెళ్తే రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రాగలడు.మిత్రపక్షాలుగా భాజపా లోక్ సత్తా యెటూ ఉండనే ఉన్నాయి.
ప్రస్తుతానికి పవన్ తనగురించి యేవేవో వూహించేసుకుని అతిగా పోకుండా ఈ మూడు పార్టీలకీ సహాయం చెయ్యడం ద్వారానే అతని ప్రవేశానికి సార్ధకత యేర్పడుతుంది.మరో విధంగా ప్రవర్తిస్తే శృంగభంగం తప్ప వొరిగేదేం ఉండదు.
ఒక సామాన్య పౌరుడు ఈ రోజు తన మనసులో ఏమనుకుంటున్నాడో, అదే విషయాన్ని పవన్ వేదిక ఎక్కి చెప్పాడు.
ReplyDeleteఅతని మాటల్లో ఆవేశం ఉంది, భయం లేదు. కొన్ని నిజాలు ఉన్నాయి.
అయితే ఇంకా కొంచెం ఆలోచన కూడ ఉంటే బాగుంటుంది.
ఐలయ్య గద్దర్ లాంటి వారు తెరాసను సమర్దిచడం లేదు నిజమే. మరి తెదేపా, లోక్సత్తా & పవన్ సేన పార్టీలకు ఏ మేధావులు/ప్రజాకళాకారులు మద్దతు తెలుపుతున్నారు? ఒక్కరూ లేరే? కనీసం కెసిఆర్ వెనుక కొద్దోగొప్పో మంది opinion leaders ఉన్నారు (విద్యాసాగర్ రావు, పేర్వారం రాములు, రమణాచారి, పొత్తూరి వెంకటేశ్వరరావు, అల్లం నారాయణ etc.).
ReplyDeleteAre you not using different parameters to judge different groups?
తెరాసా భావజాలం, వారి రాజకీయ పరిభాషలో భూస్వామ్య వర్గపు అహంకారం ఉంది, కనబడటం లేదా?అక్కడ ఉన్న ఒపీనియన్ లీడర్స్ చాలా ఆదర్శ వ్యక్తిత్వాలు ఉన్నవారే అయి ఉండవచ్చు.కానీ నిజాముని సమర్ధించటం,నిజాము రాజ్యాన్ని స్థాపించాలని కలలు గనటం,వెలమ కులాన్ని అమాయకమయినదని అనటం లాంటి వికృత వాదాలు చేస్తున్నారు. వాటిని మీరు వ్యక్తిగతంగా గానీ సైధ్ధాంతికంగా గానీ సమర్ధిస్తున్నారా?యెప్పటికయినా సమర్ధించగలరా?
Deleteయెంత మంది ఆంధ్రా వాళ్ళు తెలంగాణాలో ఉద్యోగాల్లో పాతుకుపోయారనే దానికి ఈ రోజున ఖచ్చితంగా యెంతమందిని పంపించాల్సి ఉంది అనే లెక్కలు తీస్తున్నప్పుడే కేవలం వేలల్లోనే ఉన్నారని తెలుస్తున్నది.అవునా కాదా?తెలంగాణాలో కేవలం ఆంధ్రా వాళ్ళు మాత్రమే కాదు, అన్ని ప్రాంతాల వారూ ఉన్నారు. అక్కున జేర్చుకున్నాం అంటూనే ఆంధ్రా వాళ్ళని సెటిలర్లు అని యెందుకు వ్యవహరిస్తున్నారు?మీరు కూడా వాడారు ఆ మాటని గుర్తుందా?అందరికీ వాడారా కేవలం మాకే వాడారా?
ఆంధ్రా అధిపత్య వర్గాలూ, ఆంధ్రా దోపిడీ దార్లూ అనే మాటలు యెక్కడి నుంచి వస్తున్నాయో అక్కడే ఉన్న మీకు తెలియదా?నిజంగా తెలంగాణాలో యే రకమయిన దోపిడి వర్గాలు లేకుండా కేవలం ఆంధ్రా దోపిడి వర్గాలే తెలంగాణాని దోచుకున్నాయా?మీరు చెప్తున్న తెరాసా ఒపీనియన్ లెడర్స్ వీటిని యెందుకు ప్రచారం లోకి తీసుకు వస్తున్నారు?
ప్రాంతానికి సంబంధంచిన స్వాభిమానం మీకు మాత్రమేనా యెదటి వాళ్ళకి అక్కర్లేదా?యెవడయినా మిమ్మల్ని దోచుకుంటే పేరుతో విమర్శించాలి, అతణ్ణి కోర్టుకు ఈడ్వటం లేదా నక్సలైట్లు చేసే ప్రజా పంచాయితీల ద్వారా కూడా శిక్షించుకోవచ్చు. కానీ వాళ్ల ముందు జాతి పదాన్ని చేరిస్తే మొత్తం ఆ జాతినే అవమానించినట్టు కాదా?యే రాజకీయ పరిభాష ప్రకారం కొందరు చేశే వాటికి మొత్తం ప్రాంతాన్ని దోషిగా నిలబెట్టటం న్యాయమవుతుందో మీరు చెప్పండి..మీ తెలంగాణాలో అసలు దోపిడీదార్లు లేకపోతే, మీరూ మీ ప్రాంతపు నేతలూ పులు గడిగిన ముత్యాలయితే అప్పుడు విమర్శించినా అందం చందం, కానీ మీ కంట్లో దూలం ఉంచుకుని యేదటివాడిలో నలుసుని వెక్కిరిస్తున్న వాళ్ళనే నేను వ్యతిరేకిస్తున్నాను.మరి మీరు దేన్ని సమర్ధిస్తున్నారో దేన్ని విమర్శిస్తున్నారో స్పష్టం చెయ్యండి.
మీరు నా ప్రశ్నను అర్ధం చేసుకున్నట్టు లేరు. అందరికీ ఒకే ప్రమాణం వర్తింపచేయాలన్నదే నా వ్యాఖ్య ఉద్దేశ్యం.
Deleteమీరు అడిగిన మిగిలిన ప్రశ్నలు ఈ టపాకు సంబంధం లేనివని నాకు అనిపిస్తుంది.
వ్యక్తిగతం అయిన ఒక్క ప్రశ్నకు మాత్రం జవాబు ఇయ్యతలిచాను. సెటిలర్ అనే పదం తరాలుగా వాడుకలో ఉంది. The term refers to an individual who has "settled down" after giving up the idea of returning to his "original native place". ఈ పదాన్ని తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రులు తమకు తాము వాడుతూ వచ్చారు. ఉ. మా ఆమ్మ సెటిలర్. వారెవిరికీ ఎప్పుడూ లేని అభ్యంతరం ఇటీవల వచ్చిన నాన్-సెటిలరు (no intention of settling down) ఆంధ్రులకు రావడం దురదృష్టం.
నాకు ఈ సెటిలర్లు అనే మాట పట్ల క్లారిటీ లేకనే అడిగాను.మీ అమ్మ గారు సెటిలర్ అయి ఉండి మీకు మీరే వాడుకుంటే నాకు అభ్యంతరం యేముంటుంది. అది పెద్ద విషయం కాదు లెండి.మిగిలిన విషయాలు కూడా నా పోస్టుకు సంబంధించిన విషయాలే.మీరు కేసీ ఆర్ వెనక ఉన్న కందరు సిధ్ధాంత కర్తల పేర్లు చెప్పి మిమ్మల్ని యే సిధ్ధాంత కర్తలూ సమర్ధించటం లేదేమి అని మీరడిగిన ప్రశ్నకి సంబంధించినదే.కే సీ ఆర్ మాట్లాడే ద్వేషభాష వెనుక ఆ సిధ్ధాంత కర్తల ప్రమేయం లేదంటారా?అంతటి సిధ్ధాంత కర్తల్ని వెనక ఉంచుకుని గంభీరమయిన వాదనల్నిగాక ద్వేషభాషని వెదజల్లుతుంటే ఆ పాటి మేధావులు లేకపోవడాన్ని మీరు మా లోపంగా యెత్తి చూపించినందుకు నేను మీకు వేసిన ప్రశ్న అది.
Deleteఇక్కడ వ్యక్తిగతమయిన విషయాల్ని కాదుగా మనం మాట్లాడుతున్నది?
అమ్మ కాదు ఆమ్మ (పెదనాన్న భార్య).
Deleteఒక్కో మేధావికి ఒక్కో విషయంపై ఆసక్తి ఉంటుంది. వారు సాధారణంగా తమ విషానికి సంబంధం లేని వాటి జోలికి పోరు. అంతమాత్రాన వారు కెసిఆర్ నోటి దూలను సమర్తించారని అనుకోలేము.
This comment has been removed by the author.
Deleteసమర్ధించరు, కాని విమర్శించను కూడా విమర్శించరన్న మాట?అది తప్పని తెలుసు, కానీ నోరు తెరిచి వారిది తప్పు అని వ్యతిరేకించరు.హిట్లర్ ని చివరి వరకూ సమర్ధించి ఆఖరికి "వాళ్ళు కమ్యునిష్టుల కోసం వచ్చారు, నేను కమ్యునిష్టుని కాదు గాబట్టి మాట్లాడలేదు" అని చెప్పుకున్నతని టైపు మేధావి అన్న మాట!ఆ నోటి దూలకి మీరు గురి కావడం లేదు గాబట్టి వ్యతిరేకించరు.మరి ఇక్కడ మీ తరపున మేధావులు యెవరున్నారూ అని మాత్రం కొసర్లు వేస్తున్నారేం?
Deleteమీ ముందు ఒకడు మరొకడ్ని నోటి దూల చూపించి అవమానిస్తుంటే దాన్ని వ్యతిరేకించటం మీకు సంబంధం లేని విషయమయినప్పుడు ఆ నోటి దూలను మేము వ్యతిరేకిస్తుంటే మీలాంటి సయం ప్రకటిత మేధావులు మాకు లేరనే విషయమూ మీకు సంబంధించనిదే గదా, మరి ఇక్కడెందుకు కలగజేసుకున్నారు?
ఆ నోటిదూలకి గురి కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారా లేదా, కాస్త జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఆ పైన చెప్పానే ఆ పెద్దమనిషికి పట్టిన గతే మీకూ పడుతుంది. అతనికి లాగే మీ పక్క వాళ్ళు కూడా తమకు సంబంధించని విషయం అనుకుని కలగజేసుకోరు.
The reference to "first they came for the Jews" is an overkill in my humble opinion. The original statement was set in a situation of systematic state pogroms.
Deleteఇకపోతే కెసిఆర్ నోటి దూలను ఆంద్ర ప్రాంత మేధావులు ఖండించిన దాఖలాలు కూడా లేవు. కేవలం తెలంగాణా వ్యతిరేకులు (అందునా రాజకీయ నాయకులు) మాత్రమె స్పందించారు. అలాగే రాజోలిబండ తూముల విషయంలో తెలంగాణా ప్రాంత మేధావులలో సాగునీటి మీద ఆసక్తి ఉన్నవారే స్పందించారు. 14ఎఫ్ విషయంలో ఉద్యోగాసంఘాల నాయకులు మాత్రమె తమ ఆదుర్దా తెలిపారు.
ఒక వ్యక్తి (మేధావి అయినా కాకపోయినా) రెండు సమయాలలో స్పందిస్తాడు. 1. తనకు ఆసక్తి ఉన్న సంఘటనలు 2. భయంకర విపత్తులు జరిగినప్పుడు.
మీరు అడిగిన ప్రశ్న (కెసిఆర్/ఇతరుల నోటిదూలను మీరెందుకు ఖండించలేదు?) పూర్తిగా సమంజసం. అయితే దీనిని మీరు తెలంగాణా ఉద్యమలో ప్రత్యక్ష్మంగా ముందున్న వారిని అడగాల్సింది. ఉద్యమం అంచులలో ఉన్నవారిని లేదా ఉద్యమంలో ఒకే కోణానికి పరిమితం అయినవారిని ఉద్యమం తాలూకా అన్ని విషయాలకు జవాబ్దారీ చేయలేము.
The litmus test is consistency of approach. ఒకే తరహా ఘటనలు జరిగినప్పుడు నేను వేరేవేరుగా స్పందిస్తే (లేదా ఒకదాన్నివిమర్శించి మరోదాన్ని ఉపేక్షిస్తే) తప్పక నిలదీయాలి.
నోటిదూల (లేదా చేతివాటం) కెసిఆర్ ఒక్కడికే పరిమితం కాదు. రెండు వైపులా ఇలాంటివి జరిగాయి. అయితే కొందరికి కొన్నే కనిపిస్తాయి/కనిపించినట్టు నటిస్తారు. అసెంబ్లీ ఆవరణలో ఎమెల్యే గారికి తగిలిన దెబ్బలు కొందరిని, అసెంబ్లీ లోపల ప్రతిపక్ష ఎమెల్యే గారిని మంత్రిగారు తగిలించిన చెంపవాటు మరికొందరిని కదిలిస్తాయి. దీనిని ఒక సామాజిక లక్షణంగా (social symptom) భావించవచ్చు.
ఉద్యమం అంచున ఉండటం అంటే యేమిటి? ఉద్యమం యేమన్నా పళ్ళెమా?రుబ్బు రోలు పొత్రమా?కల్గూర గంపా? అంచున ఉన్నారే కానీ బయట మాత్రం లేరుగా?మీరు పాల్గొంటున్న ఉద్యమంలో అదీ న్యాయం కోసం పోరాడుతున్న ఉద్యమంలో ఉండి ఆ న్యాయ పోరాటంలో ఉన్న పెడ దోరణుల్ని వ్యతిరేకించనప్పుడు ఆపలేనప్పుడు మీకు మీరే పెట్టుకున్న మధావి అనే పదానికి ప్రయోజనమేమిటి?మీరు సంబంధం పెట్టుకున్న ఉద్యమంలో కొందరు చేస్తున్న నోటి దూల పనుల్ని వ్యతిరేకించ లేదేమని నేనడుగుతున్న్నప్పుడు నేను ఉద్యమం అంచున ఉన్నానని అంటున్నారు. మా మీద నోటి దూలని చూపించిన వాణ్ణి విమర్శిస్తున్నప్పుడు మాలాంటి మేధావులు మిమ్మల్ని సపోర్ట్ చెయ్యడం లేదే అని లాజిక్కులు లాగడానికి అంచునుంచి మధ్యకి కానీ ముందుకి కానీ యెందుకు జరిగారు?
Deleteమీరు సంబంధం పెట్టుకున్న ఉద్యమం లోని పెడ ధోరణులతోనే మీకు సంబంధం లేనప్పుడు దాన్ని వ్యతిరేకించే ప్రతి వాదులతో మీకు సంబంధం యెలా వస్తుంది?మీరు సంబంధం పెట్టుకున్న ఉద్యమం లోని పెడదోరణులనే ఆపలేని మీలాంటి మేధావులు సమర్ధించకపోవడం లోపమా?మీ మేధావిత్వం వల్ల జరుగుతున్న ఘనకార్యమేమిటి?
నా వచ్చీరాని తెలుగులో సరిగ్గా చెప్పలేక పోయానేమో. With your permission, I will explain in English with a suitable example.
DeleteNGO leaders want "equitable access" to employment. Their support to Telangana is based on the assumption that they can achieve this in a separate state.
They have no interest in irrigation, power, mines etc. This is why they remained silent when RDS water or Bayyaram ore is diverted. On the other hand, they will protest even after Telangana formation if jobs are not divided "equitably".
This is also true of Andhra intellectuals. You will note hardly anyone on either side of the regional divide outside the cinema industry raised their voice in the Adurs case.
Disclaimers:
1. I am *not* an intellectual
2. The above is *not* a defense
3. I am only expressing my understanding of human behavior in relation to your question
వచ్చీ రాని తెలుగా చచ్చి బతీకే తెలుగా కాదు గానీ మొదలు కెలికిన విషయ మేమిటి, మధ్యలో ప్రస్తావనకి వచ్చిన విషయ మేమిటి, మీరిప్పుడు ఇంగ్లీషులో వొదులుతున్న్న ఝాడింపు యేమిటి?యంజీవో లీడర్స్ నుంచి అదుర్స్ కేసు వరకూ మీరు వేసిన సుత్తిలో నా ప్రశ్నకు జవాబుగా పనికొచ్చే విషయం యేదయినా ఉందా?
DeleteAs far as I can see:
DeleteYour question: Why did intellectuals supporting Telangana not condemn certain things?
My answer: They respond to matters relating to their primary interest (irrigation or whatever), not other matters
Sorry for the సుత్తి :)
Are you not using different parameters to judge different groups?
ReplyDeleteplease clarify me where I am talking about different groups. I am talking about one and only teraasaa! where the question arises for applying different paramaeters for different groups?