Saturday, 5 December 2020

విశ్వతోభద్ర కార్యకర్తలకు మొదటి పాఠం

 

మనం పోరాడి గెలవాల్సిన నిజమైన శత్రువు ఎవరు?

మనలో చాలామందికి మనం వోట్లు వేసి అధికారం కట్టబెడుతున్న "వాళ్ళు" మన దగ్గిర్నుంచి వోట్లు రాబట్టుకోవటానికి మనకు "వాళ్ళు" చేసిన వాగ్దానాల్ని నెరవేర్చడంలో విఫలం అవుతున్నారని తెలుసు.అలా తెలిసిన చాలామందిలో కొద్దిమందికి "వాళ్ళు" చేస్తామని చెప్తున్నప్పుడే వాటిని నెరవేర్చడం అసాధ్యం అని కూడా తెలుస్తుంది.మళ్ళీ ఇది తెలిసిన చాలామందిలో కొద్దిమందికి "వాళ్ళుఅధికారంలోకి వచ్చాక కూడా ప్రజలకు చేసిన వాగ్దానాల్ని నెరవేర్చకపోవడం అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేమని తెలిసిన కొత్త అసమర్ధత వల్ల గాక అసలు వాగ్దానాలు చేసేటప్పటినుంచే "వాళ్ళు" చేసిన వాగ్దానాల్ని నెరవేర్చలేమని తెలిసిన పాత అసమర్ధత వల్లనే అని కూడా తెలిసే ఉంటుంది.కానీ, "వాళ్ళు" అధికారంలోకి వచ్చాక చెయ్యలేనివాట్ని అధికారంలోకి రాకముందు చేస్తామని చెప్పడం,అధికారంలోకి రాకముందు చేస్తామని చెప్పినవాట్ని అధికారంలోకి వచ్చాక చెయ్యకపోవడం వెనక ఉన్న అసలైన మోసాన్ని పసిగట్టలేని అమాయకులు "వాళ్ళు" కేవలం అధికారం కోసం అర్రులు చాస్తూ అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే సైకోలనీ "వీళ్ళు" ప్రతి అడ్డగాడిదా చెప్తున్న అబద్ధాలు మోసపోయే పిచ్చివాళ్ళనీ అనుకుంటూ ఉంటారు.

రోజూ వార్తా పత్రికల్ని పైనుంచి కిందకి ఇడ్లీ కాఫీలతో పాటు చప్పరిస్తూ అన్ని న్యూస్ చానళ్ళనీ మోర్నింగ్ టైం లంచితోనూ మిడ్డే లైట్ మీల్సుతోనూ నైట్ టైం హెవీ సప్పరుతోనూ నమిలి మింగేస్తూ తిన్నది అరక్క అజీర్తి దోషానికి పధ్యంలాంటి పేరున్న పొలిటికల్ ఎనలిస్టుల లెక్చర్లని గటగట తాగేస్తూ తమ చుట్టు జరుగుతున్న జగన్నాటకం  అంతా తెలిసిపోయిందని బ్రేవున త్రేన్చి సంతృప్తి పడిపోతున్న అల్పసంతోషులకి తెలియదు మనం వోట్లు వేసి అధికారంలోకి పంపిస్తున్న వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అయినప్పటికీ నిజమైన అధికారం వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్లనే అధికారంలోకి రాకముందు చేస్తామని చెప్పినవాట్ని అధికారంలోకి వచ్చాక చెయ్యలేకపోతున్నారని - నిజం!

ఆధ్యాత్మిక వేత్తలు దైవం గురించి ""Seek and ye shall find"" అని చెప్తారు.కమ్యూట్రలను కనిపెట్టినవాళ్ళు WYSIWIG(What You See Is What You Get!) అంటారు.కానీ,"వాళ్ళు" అధికారంలోకి రాకముందు చేస్తామని చెప్పినవాట్ని అధికారంలోకి వచ్చాక చెయ్యలేకపోవటానికి ఎవరు అడ్డు పడుతున్నారో తెలుసుకోవటం మాత్రం అంత సులువు కాదు.అంటే, అసలు మనుషులు మన కంటికి కనపడని వాళ్ళని కూడా అర్ధం కాదు. "వాళ్ళు" పట్టపగలు మర్డర్లూ మానభంగాలూ చేసి కూడా శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు,"వాళ్ళు" పన్నులు పెంచి మన నడ్డి విరగ్గొడుతున్నారు,"వాళ్ళు" నిరుద్యోగిత పెంచి మన పిల్లల్ని అడుక్కు తినేలా చేస్తున్నారు,"వాళ్ళు" మన భూముల్ని కబ్జా చేసి మన ఇళ్ళనుంచే మనల్ని వెళ్ళగొట్టేస్తున్నారు - అయినప్పటికీ "వాళ్ళు" ఎవరో మనకి తెలియడం లేదు,వాళ్ళని అదుపు చెయ్యడం మనకి సాధ్యం కావడం లేదు!

ఎందుకు సాధ్యం కావడం లేదు?

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...