Wednesday, 23 December 2020

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యొక్క నిజమైన చరిత్ర - ఒక ఆంధ్రుడి కన్నీటి కధ!

1952 ఏప్రిల్ 10 మొదలు 1954 ఏప్రిల్ 13 వరకు చక్రవర్తి రాజగోపాలాచారి గారు మద్రాసు రాష్ట్రానికి రెండవ విడత ముఖ్యమంత్రి అయ్యారు.రాజాజీ గారి మొదటి విడత ముఖ్యమంత్రిత్వం కొందరు తమిళ రాజకీయ నాయకుల్లోనూ కొందరు తమిళ విద్యాధికుల్లోనూ హిందీ పట్ల వ్యతిరేకతను పెంచి ద్రవిడ జాత్యహంకారాన్ని పెంచితే రాజాజీ గారి రెండవ విడత ముఖ్యమంత్రిత్వం కొందరు తెలుగు రాజకీయ నాయకుల్లోనూ కొందరు తెలుగు విద్యాధికుల్లోనూ తమిళం పట్ల వ్యతిరేకతను పెంచి తెలుగు భాషాభిమానాన్ని పెంచింది.కోస్తా తీర ప్రాంతం వారూ రాయలసీమ వారూ భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం ప్రకారం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించుకోవటం కోసం ఆందోళన మొదలు పెట్టారు.

ఉద్యమకారులు అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ రాజాజీ ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన రాలేదు.ఒకవైపున తమిళులు తెలుగువాళ్ళు మెజార్టీ అయిన వూళ్ళ పేర్లని కూడా తమిళంలో బోర్డులు పెట్టి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలుగు భాషనీ జాతినీ నేతల్నీ అవమానిస్తూ సామాన్య ప్రజలు సైతం ఆంధ్ర రాష్ట్ర వాంచతో రగిలిపోతున్న కాలంలో ఆంధ్రకి చెందిన నలుగురు దొంగలు మాత్రం రాజాజీ నాడారు లాంటివాళ్ళతో తిరుగుతూ ఉద్యమాన్ని నీరుగార్చటానికి కుట్రలు చేశారు.

చివరి ప్రయత్నం కింద పొట్టి శ్రీరాములు గారు మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి గారి స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.1952 డిసెంబర్ 16 తెల్లవారు ఝామున పొట్టి శ్రీరాములు  గారి మరణంతో  ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికి చీరాల,విజయనగరం,విశాఖపట్నం,విజయవాడ,రాజమండ్రి,ఏలూరు,భీమవరం,గుంటూరు,తెనాలి,ఒంగోలు,నెల్లూరు వంటి అనేక ప్రముఖ నగరాలలో పెద్ద ఎత్తున విధ్వంసకరమైన సంఘటనలు జరిగాయి.నాలుగు రోజుల పాటు ఆంధ్ర ప్రాంతం అట్టుడికి పోయి మద్రాసు నగరం కూడా స్తంభించి పోయింది.ఆఖరికి 1952 డిసెంబర్ 19 తేదీన దేశ ప్రధాని నెహ్రూ మద్రాసు నుంచి విడదీసి ఒక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రజలతో మమేకమై ప్రజల కోసమే అధికారం కోరుకునే పూసపాటి రాజావారూ ప్రకాశం పంతులుగారూ పాలితులు ఎవరనేది చూడకుండా అందరికీ న్యాయం చేసి అందరి అభిమానం పొందగలిగారు.కాబట్టి తమిళుల నుంచి విడిపోతే తప్ప తెలుగువాళ్ళు బాగుపడరు అనేది అబద్ధం - అని నా వూహ.ఎవరి వూహలు ఎట్లా వుంటేనేమి వాదం మొగ్గ తొడిగింది, వికసించింది, నలుదిశలా ప్రబలింది, ప్రకాశం వంటివారు కూడా ప్రవాహం వెంట నడిచారు, అవతరించిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రకాశం పంతులు గారు కాంగ్రెసు పార్టీ తరపున 1953 అక్టోబర్ 01 మొదలు 1954 నవంబర్ 15 వరకు ముఖ్యమంత్రి అయ్యారు.

కర్నూలు రాజధానిగా తొలి ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే ప్రకాశం తనదైన శైలిలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ఆదర్శప్రాయం. రాష్ట్ర అవతరణ మొదటి వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టులకు రూపకల్పన, వాటి నిర్మాణానికి ప్రణాళిక, విజయవాడ కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం ప్రకటన - ఇలా ఎన్నోముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

అయితే కమ్యూనిస్టులు టంగుటూరు ప్రకాశం పాలనను వ్యతిరేకించి మద్దతును ఉపసంహరించుకుంటూ పధ్నాలుగు నెలలకే అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ప్రకాశం గారి ప్రభుత్వం కూలిపోయాక రాష్ట్రంలో కొన్ని నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగిన తర్వాత 1955 ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. సర్వేపల్లి నుంచి పోటీ చేసి గెలిచిన (10)బెజవాడ గోపాల రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.

నిజానికి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల పదవీకాలం 1960 వరకే కొనసాగాలి.కానీ, 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల పదవీ కాలం 1962 వరకు ఉండడంతో ఆంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేల పదవీకాలం రెండేళ్లు పొడిగించారు.1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయేనాటికి నిజాం సంస్థానంలో ఉన్న తెలుగు ప్రజలు 1948 సెప్టెంబర్ 17 నాటికే తన పరిపాలనలో ఉన్న ప్రాంతాన్ని అయితే పాకిస్తానులో కలపాలనీ లేదంటే స్వతంత్రదేశంగా ఉండాలనీ అనుకుంటున్న నిజాము పరిపాలన నుంచి విడివడి స్వతంత్ర భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పరచుకుని ఉన్నారు.

సెప్టెంబర్ 1948 జరిగిన సైనిక చర్య విజయవంతమైన తర్వాత 1950 జనవరి  26 నిజాముకు ఇచ్చిన రాజ్ ప్రముఖ్ హోదా 1956 అక్టోబర్  31 వరకు కొనసాగింది.హైద్రాబాద్ సంస్థానం స్వాధీనం కాగానే మొదట 1950 జనవరి 26 M.K.Vellodiని ముఖ్యమంత్రిగా నియమించారు.అయితే, 1952 ఎన్నికల్లో కాంగ్రెసు నెగ్గి బూర్గుల రామకృష్ణా రావు గారు ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి అయ్యారు.ఇదే 1952లో ఇతర ప్రాంతాల వారికే కీలకమైన ఉద్యోగాలు దక్కడం మీద వ్యతిరేకత పెరిగి ముల్కి ఉద్యమం ఉధృతమైంది.అయితే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన Reorganisation of the Indian States కమిటీ 1956లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనూ కలపాలని సూచించింది.

2014 నాటి తెలంగాణ ఉద్యమ వీరులు ఆనాటి తెలంగాణ యొక్క రెండు విలీనాలకీ భారత దేశపు ప్రభుత్వానికీ ఆంధ్ర ప్రాంతపు నాయకులకీ దురుద్దేశాలు అంటగడుతున్నారు గానీ జరిగిన చరిత్రని జరిగినట్టు చూస్తూ రెండు సన్నివేశాల్లోని తెలంగాణ నాయకులు ఆనాడు ఎలా ప్రవర్తించారు అని చూస్తే చాలు ఈనాటి తెలంగాణ నాయకులు చేస్తున్న ఆరోపణలు అబద్ధం అని తెలుస్తుంది.ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి చెప్పాలంటే, ఈనాటి తెలంగాణ ఉద్యమ వీరులు ఆనాటి తెలంగాణ యొక్క రెండు విలీనాలకీ భారత ప్రభుత్వానికీ ఆంధ్ర ప్రాంతపు నాయకులకీ దురుద్దేశాలు అంటగట్టడం తమ వెనకటి తరం తెలంగాణ ప్రాంతపు నాయకుల్ని అవమానించడమే అవుతుంది.

ఇక్కడ మనం పట్టించుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది.వ్రాసిన తేదీ, సమయం తెలియడం లేదు గానీ బూర్గుల రామకృష్ణా రావు గారు అప్పటి భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షుడైన U N Dhebar గారికి "I may however, add one thing that in case Telangana is kept a separate unit there is no harm in having common aspects of the administration common" అని తెలంగాణను అంటే అప్పటి హైదరాబాదు రాష్ట్రాన్ని ఆంధ్రతో కలపకపోయినప్పటికీ కలిపితే ఒనగూరుతాయని అంటున్న ప్రయోజనాలను సాధించవచ్చనే తన సొంత అభిప్రాయాన్ని చెప్తూ ఒక ఉత్తరం వ్రాశారు.ఇందులో మళ్ళీ ఇరు వర్గాల వాదనలనూ ఎందుకు ఉటంకించారో అర్ధం కావడం లేదు నాకు.ఆయనకి కలయిక పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు తన వాదనకి సమర్ధనలను మాత్రం చెప్తే సరిపోతుంది.మరి, కలయికకు అనుకూలమైన వాదనలను కూడా ఇక్కడ ప్రస్తావించడం దేనికి?

మొదలు పెట్టటమే తెలంగాణలో చాలామంది హైదరాబాదును యధాతధం కొనసాగించాలని బలంగా కోరుకుంటున్నారు అంటూ మొదలుపెట్టి "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలిపేశారు కాబట్టి ఒప్పుకోవలసి వస్తుందని అనేశారు. "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలపడానికి లేని విముఖత "హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో" కలపడానికి ఎందుకు వచ్చింది? "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలిపేశాక "హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో" మాత్రం కలపొద్దు అనడం న్యాయమేనా!

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సూత్రమైన Cultural Integration అనేదాన్ని కూడా emotional approach మాత్రమే అని తీసి పారేస్తున్న బూర్గుల రామకృష్ణారావు గారు విలీనాన్ని వ్యతిరేకిస్తే సరిపోయేదానికి I shall now briefly summarise the pros and cons of the situation అని ఉత్తరం వ్రాయడం అనవసరం అనిపిస్తున్నది నాకు.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సూత్రమైన Cultural Integration అనేదాన్ని కూడా emotional approach మాత్రమే అని తీసి పారేస్తున్న బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ వారికున్న ఆంధ్రలో విలీనం పట్ల వ్యతిరేకత దగ్గిర కొచ్చేసరికి There is no agitation of a strong character in Andhra on this subject while there is a strong agitation in Telangana not to merge with Andhra అనటం చాలా దుర్మార్గం అనిపించింది నాకు.ఆంధ్ర ప్రాంతపు నాయకులు ప్రతిపాదించిన తెలుగువాళ్ళు ఒక్కటిగా ఉండటం అనేది మాత్రమే ఆయనకివూహల్లో బాగుండి వాస్తవంలో సాధ్యం కానిదిగానూ తెలంగాణ ప్రాంతపు నాయకులు ప్రతిపాదించిన ఉర్దూ సానుకూలతతో కూడిన మాతృభాష పట్ల వ్యతిరేకత ఏమోబౌతిక పునాది ఉన్న శాస్త్రీయమైనదిగానూ కనపడటంలో కేవలం 175 ఏళ్ళ కింద మొదలైన తమ పరాయీకరణను ప్రేమించుకునే మితిమీరిన స్వానురాగం తప్ప ఎటువంటి ఆదర్శమూ లేదని అనిపిస్తున్నది నాకు. ఇతరుల ఆదర్శాల్ని అసంబద్ధం, అశాస్త్రీయం అనేసి తమ పరాయీకరణను మాత్రం ఆదర్శం, ఔన్నత్యం అని చెప్పుకోవడం ఎంత విచిత్రం!

1955 డిశెంబర్ 03 హైదరాబాద్ శాసనసభలో ఆంధ్రతో కలయిక గురించి వోటింగు పెట్టినప్పుడు మొత్తం 174 మంది శాసనసభ్యులలో 147 మంది వోటింగులో పాల్గొన్నారు.వీరిలో 103 మంది కలయికకు అనుకూలం, 16 మంది తటస్థం, 29 మంది వ్యతిరేకం అయ్యారు.మొత్తం తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు 94 మంది - వీరిలో 36 మంది కమ్యూనిష్టులు, 40 మంది కాంగెసు వాళ్ళు, 11 మంది సొషలిష్టులు.వీళ్ళందరిలో ఆంధ్రలో తెలంగాణ విలీనానికి 59 మంది అనుకూలం 25 మంది ప్రతికూలం.ఇందులో ఆంధ్ర ప్రాంతపు నాయకుల ప్రమేయం గానీ ప్రభావం గానీ ఏమీ లేదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేరుతో ప్రజల్ని ఉత్తేజపరిచి నిజామును బలహీనం చేసిన కమ్యూనిష్టులకే తెలంగాణ ప్రజల్లో  పలుకుబడి ఎక్కువ గనక హైదరాబాద్ శాసనసభలో వారి మాటయే నెగ్గింది!

ఆనాటి తెలంగాణ నాయకులూ ఈనాటి తెలంగాణ ఉద్యమ వీరులూ ఇంతవరకు నేను చూపించిన చరిత్రలో ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంతానికి చేసిన ద్రోహం  ఏమిటో చెప్పగలరా?దీనికి బదులు తెలంగాణ ప్రాంతపు నాయకులు ఆంధ్ర ప్రాంతానికి ద్రోహం చేస్తున్న నిజమైన చరిత్ర ఇక్కడినుంచే మొదలవుతున్నది.ఆంధ్ర ప్రాంతపు నాయకులు అదగలేదు తెలంగాణని కలిపి మమ్మల్ని ఉద్ధరించమని.ముల్కీ ఉద్యమం వల్ల ఏర్పడిన పీటముడికి పరిష్కారం కోసమే తెలంగాణను భాషప్రయుక్త రాష్ట్రాల చట్టం కింద విడగొట్టాలని నిర్ణయించింది.వాళ్ళ పరిపాలనలో వచ్చిన సమస్యకి కేంద్రం పరిష్కారం కింద ఆంధ్రతో కలపాలని నిర్ణయిస్తే ఆంధ్ర వైపునుంచి మమ్మల్ని కలుపుకోమని ఉద్యమాలు లేవు కాబట్టి కలపొద్దని బ్లాక్ మెయిలింగు చేసి వాళ్ళు దేశం నడిబొడ్డున కాశ్మీరుకు ఇచ్చిన స్వయంప్రపత్తిని సాధించుకున్నారు.ఆనాటి ఆంధ్రా నాయకులకి తెలంగాణ నాయకులతో పెద్దమనుషుల ఒప్పందం చేసుకోవాల్సిన అవసరమే లేదు.అయినప్పటికీ తెలంగాణ నాయకులు అమాయకత్వం వల్ల తమను అనుమానిస్తున్నారని అక్కరలేని ఆందోళన పడిపోయి కుదుర్చుకున్న పెద్దమనుషుల ఒప్పందం ఎంత దుర్మార్గమైనదో తెలుసుకోవటానికి తెలంగాణ ప్రాంతంలో మద్యనిషేధాన్ని విజయవంతం చెయ్యడాన్ని కూడా ఒప్పందంలోకి చేర్చడాన్ని చూస్తే చాలదా!

2014లో ఆంధ్రా దోపిడీని తిట్టి ఏదో పరాయివాళ్ళైన ఇంగ్లీషువాళ్ళ మీద న్యాయపోరాటం చేసినంత బిల్డప్ ఇచ్చి స్వరాష్ట్రం తెచ్చుకున్నాక కూడా స్వయాన నవ తెలంగాణ భగీరధుడు అని పొగిడించుకుంటున్న ముఖ్యమంత్రి దొంగసారా మానిపించటానికి కల్తీకల్లును అలవాటు చెయ్యాలనుకున్నంత పచ్చి తాగుబోతుల్ని సంస్కరించడం కూడా ఆంధ్రావాళ్ళ నెత్తిమీదే పెట్టారు.పోనీ అంత ఝమాయించి అడిగి అన్ని సౌకర్యాలు అప్పనం పప్పనం కొట్టేసినవాళ్ళు వాటిని ఉపయోగించుకుని బాగుపడి చావొచ్చు కదా!

ఎదటివాళ్ళ మెతకదనం మీద పెత్తనం చెయ్యాలనుకున్న గయ్యాళితనం ఒకసారితో పోతుందా 56లో కలిసినవాళ్ళు 1969 నాటికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం - I అని గొడవ మొదలుపెట్టారు.మర్రి చెన్నారెడ్డి గారు 1956లో పెద్దమనుషుల ఒప్పందంలో తనూ భాగస్వామి అయ్యారు.తన డిమాండ్లు చెప్పారు.వికారాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై 1957–62 మధ్యన Public Accounts Committeeలో పనిచేశారు.రెండుసార్లు Estimates Committeeకి చైర్మనుగా పనిచేశారు.Andhra Pradesh Regional (Telangana) Development Committeeకి చైర్మనుగా పని చేశారు.1962లో తండూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యాక మొదట Planning, Panchayat Raj శాఖలతోనూ పిదప Finance, Commercial Taxes, Industries శాఖలతోనూ మంత్రి పదవిని అలంకరించారు.మళ్ళీ 1967 నాడు కూడా శాసనసభకు ఎన్నికై Finance, Education, Commercial Taxes శాఖలతో మంత్రిత్వం అనుభవించారు.అప్పుడు రాష్ట్ర మంత్రిత్వం నుంచి తప్పుకుని కేంద్రంలో 1967–68 మధ్యన Steel, Mines, Metals శాఖలతో మంత్రిత్వం సంపాదించాడు. అన్నీ చేసి తీరా ఏప్రిల్ 1968 రాజీనామా చేసి వెంటనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు!

మహా ఘనత వహించిన మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో 60 ఏళ్ళు పోరాటం చేసి ఆంధ్ర దోపిడీ నుంచి విముక్తం అయ్యామని రొమ్ములు విరుచుకు తిరుగుతున్న ఈనాటి ఉద్యమనేతలు చెప్పగలరా?

ఆంధ్రదేశం ఏర్పడిన కొత్తలో తెలంగాణా ప్రాంతంలో విద్యా సౌకర్యాలు ఇప్పుడున్నంత బాగా లేవు. ఉపాధ్యాయుల్ని తరిఫీదు చేసే సంస్థలు కూడా చాలా తక్కువ. ఒకవైపున పాఠశాలల సంఖ్య అభివృద్ధి అవుతోంటే ఉపాధ్యాయుల కొరత ఏర్పడినది.1956లో తెలంగాణా ఆసుపత్రులలో పడకల సంఖ్య 5000. 1966లో 10,000. పడకలు పెరిగిన కొద్దీ నర్సుల, మంత్రసానుల అవసరం కూడా కలుగుతుంది. తెలంగాణా అభివృద్ధికీ ఆరోగ్యానికీ అవసరమైన ఉపాధ్యాయుల్నీ, నర్సుల్నీ, మంత్రసానుల్నీ తీసేస్తే, మిగిలేవి 1100 మంది బంట్రోతు, డ్రైవర్లు ఉద్యోగాలలో వున్నవారు, ఒక లక్షా ఏడువేల ఉద్యోగాలలో 1100, పోనీ 4500 ఎన్నో వంతు? వీటి కోసం రాష్ట్ర విచ్ఛిన్న కార్యక్రమం తలపెట్టినారంటే విన్నవారు నవ్వరా?ఆచార్య దేవో భవ, వైద్యో నారాయణో హరి అంటూ అప్పుడు విద్యకోసం ఆరోగ్యం కోసం అవసర మయి ఆంధ్రా నుంచి టీచర్లనీ నర్సుల్నీ కోరి పని చేయించుకున్నారు.ఇవ్వాళ వాళ్ళు రిటయిర్మెంటుకు దగ్గరయ్యాక వారికి పెన్షన్ ఇవ్వటానికి కూడా బాధ పడిపోయి తన్ని తగిలేస్తున్నారు!

2014 నాటి విభజన ఏర్పాట్ల కోసం కేంద్రం నుంచి ఉద్యోగుల విభజనకి వచ్చిన కమిటీ పరిశీలనకు ఉంచబడిన మొత్తం ఉద్యోగాలు 50, 000 రమారమి అంటున్నారు.మొదట 10,000 అని కనబడింది, వారికే సిగ్గేసి ఇంకా ఘట్టిగా ఫిల్టర్ చేశారేమో ఆఖరికి 50,000 దగ్గిర ఆగింది.వారి తీర్పు నచ్చలేదని గొడవలు రేగటంతో ప్రస్తుతానికి మమ్మల్ని ఇలా వొదిలెయ్యండి, పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు యేర్పడ్డాక మీరూ మీరూ చూసుకోండని వారు దణ్ణం పెట్టేశారు.మరి ఆంధ్రా వాళ్ళు దోచుకున్న లక్షల ఉద్యోగాలు యేమయిపోయినాయో, రేపటి రోజున వారే ప్రభుత్వంలో ఉండి లెక్కలు తీసినప్పుడు గానీ లెక్క నిక్కచ్చిగా తేలదు.అయినా బతక లేని బడి పంతుళ్ళూ సిరెంజిలు కడుక్కునే నర్సులూ యాభయ్యేళ్ళ పాటు మొత్తం పది జిల్లాల తెలంగాణా మేధావుల్నీ వెనుకబాటు తనానికి గురి చేశారంటే ఆశ్చర్యంగా లేదూ!

చెన్నారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి జరిగిన ఘోరమైన అన్యాయాన్ని సరిదిద్దాలంటూ సమయంలో ప్రభుత్వంలోనే ఉండి అదీ అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తూ అన్యాయంలో భాగస్వామియైన చెన్నారెడ్డియే ఉద్యమించడం ఏమిటో, ఆనాటి డొంకతిరుగుడు బెదిరింపు తతంగాన్ని పట్టుకుని ఇవ్వాళ కొందరు తెలంగాణ ప్రజలూ మేధావులూ మాది 1968 నాటి నుంచి రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష అని బట్టలు చింపుకోవడం ఏమిటో - అస్సలు కామన్ సెన్సు కూడా ఉండదా!

అయిదేళ్ళ ఆర్భాటం తర్వాత 1973 నాటికి అనవసరపు విభజన ఇష్టం లేని శ్రీమతి ఇందిరా గాంధీ కలగజేసుకుని ఆరు సూత్రాల ఫార్ములా ప్రకటించి రాజీ చేశాక జరిగిన లోపాయకారీ ఒప్పందం ప్రకారం మర్రి చెన్నారెడ్డి గారు మొదట ఉత్తర ప్రదేశ్ గవర్నర్ పదవినీ వెంగళ రావు గారి తర్వాత 1978 నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిత్వాన్నీ దక్కించుకున్నారు.

1973 డిసెంబర్ 10 మొదలు 1978 మార్చి 06 వరకు ముఖ్యమంత్రిత్వం నిర్వహించిన (16)జలగం వెంగళ రావు గారు తెలంగాణ ప్రాంతానికి కాకతీయ యూనివర్సిటీ, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి నాగార్జున యూనివర్సిటీ, రాయలసీమ ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సాధించి తీసుకొచ్చి 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేసి 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నీ 1972 నాటి జై ఆంధ్ర ఉద్యమాన్నీ కొంత చల్లబరిచారు.

రెండు ఉద్యమాల వెనక ఉన్నది పేరులో రెడ్డి తోక ఉన్నవాళ్ళు తప్ప ఇంకెవరూ ప్రభుత్వంలో ఉండకూడదన్న రాజకీయ వ్యాపార దురంధరులైన రాయలసీమ ఫ్యాక్షనిష్టు రెడ్లు.నరసింహా రావు గారు వ్రాసిన Insider అనే పేర్లు మార్చిన ఆత్మకధలోని Mahendranath అనే పాత్ర నీలం సంజీవరెడ్డి గారిదీ అతని శత్రువైన Chaudhury అనే పాత్ర కాసు బ్రహ్మానంద రెడ్డి గారిదీ అని జరిగిన చరిత్రనీ కధలోని సంఘటనల్నీ పోల్చి చూసిన ప్రతి ఒక్కరికీ తెలిసిపోతూనే ఉంటుంది.నవలలో నరసింహా రావు గారు ప్రత్యేకించి ప్రస్తావించనప్పటికీ ఆయన్ని పదవినించి తప్పించడానికి ఉపయోగపడిన ఆనాటి జై ఆంధ్ర ఉద్యమానికి ఇద్దరు రెడ్ల ఆధిపత్య రాజకీయాలు కారణం.

తెలంగాణకి ఆంధ్రావాళ్ళు అన్యాయం చేసేస్తున్నారని అంత భీకరమైన ఉద్యమం చేసిన మర్రి చెన్నారెడ్డి గారు ఉద్ధరించిన ఘనకార్యం ఏంటి?ఏమీ లేదు!రెండేళ్ళలో సొంత పార్టీ వాళ్ళే అవినీతిపరుడనే ముద్ర వేసి గెంటిపారేస్తే అందులో ఆంధ్రావాళ్ళ ప్రమేయం ఏముంది!

1956లో పెద్దమనుషుల ఒప్పందంతో ఆంధ్రావాళ్ళనుంచి భారీ తాయిలాలు అందుకుని కూడా 1969 నాటికే బెదిరింపు రాజకీయం చేసిన తెలంగాణ ప్రాంతపు నాయకులు 2014 వచ్చేసరికి మరింత గయ్యాళితనం పెంచుకుని తెలంగాణ ఉద్యమం - II అని గొడవ మొదలుపెట్టారుఅప్పటివరకు  ఆంధ్రావాళ్ళు చేసిన అభివృద్ధిని మాత్రం ఉంచుకుని ఆంధ్రావాళ్ళని దొంగలని తిట్టి వెళ్ళగొట్టారు!చాలామందికి తెలియదు గానీ వాళ్ళ కోపం "ఆంధ్రావాళ్ళు" అనే బహువచనంలో ఉన్న ఆంధ్ర ప్రాంతపు ప్రజల మీద కాదు, చంద్రబాబు మీదనే!అది వాళ్ళే ఒప్పుకున్నారు గానీ ఇవ్వాళ్టికీ తెలంగాణలో ఉన్న చంద్రబాబుని పొగిడిన ప్రతి ఒక్కడినీ పచ్చ బానిస పేరు పెట్టి తిడుతూ తెలంగాణ ద్రోహి కింద లెక్కగట్టి రెచ్చిపోయేవాళ్ళు చంద్రబాబు తెలంగాణ ప్రాంతానికి చేసిన అన్యాయం ఏమిటో చెప్పగలరా?

1995 సెప్టెంబర్ 01 మొదలు 2004 మే 13 వరకు (28)నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.ప్రకాశం పంతులు గారి తర్వాత ఆర్ధిక శాస్త్రం యొక్క శక్తిని తెలుసుకున్నది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే!ప్రకాశం పంతులు గారిలా స్వయాన ఆర్ధికశాస్త్రం చదవలేదు గానీ విషయ పరిజ్ఞానం ఉన్న అధికారులను ఉపయోగించుకుని సరైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చి రామారావు తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కుదేలయిన ఆర్ధిక రంగం కొంత తెరిపిన పడింది.

1996 ఫిబ్రవరిలో మొదలు పెట్టిన "జన్మభూమి" మంచి కార్యక్రమమే.ఇందులో స్థానిక పరిపాలనకు సంబంధించిన అంశాలలో ప్రజలని ఇన్వాల్వ్ చెయ్యడం చక్కటి ఆలోచన.1997 సంవత్సరంలో మొదలు పెట్టిన "పచ్చదనం-పరిశుభ్రత" కూడా మంచి కార్యక్రమమే.ముఖ్యమైన అన్ని ఉత్పత్తి రంగాలకీ "self help groups(SHG)" ఏర్పాటు చేసి ప్రోత్సహించడం కూడా బాగుంది.రైతు బజారు, డ్వాక్రా అనేవి కూడా మంచి ఐడియాలే.1995-1996 నాడు మూసివేతకి దగ్గరైన సింగరేణి కాలరీస్ సంస్థని లాభాల బాట పట్టించి దాని పరువు నిలబెట్టాడు!స్వర్ణాంధ్ర ప్రదేశ్ అన్నాడు!మొట్ట మొదటి సారి తన స్వంత ప్రజ్ఞని మాత్రమే చూపించి కేంద్రం పూచీకత్తు లేని Rs 2,200 Cr ఋణాన్ని World Bank నుంచి తెచ్చాడు!1992-1994 నాటికి నష్టాల్లోనూ లోటులోనూ ప్రావీణ్యాత్లోనూ అధమ స్థాయికి చేరి కునారిల్లుతున్న Andhra Pradesh State Electricity Board (APSEB) సంస్థని కేవలం అయిదేళ్ళు గడిచేసరికి cost and quality విషయాల్లో world class స్థాయికి చేర్చాడు!1998 నవంబర్ నాడు అటల్ బిహారీ వాజపేయి చేతుల మీద HITEC Cityకి అంకురార్పణ చేసి పెంచి పెద్ద చేసి ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి సాటిలేని landmark కింద నిలబెట్టాడు!1999లో హైదరాబాదు నగరానికి Pharma City/Genome Valley అనే మరొక అద్భుతాన్ని అందించాడు!2001లో "ఈసేవ-మీసేవ" అన్నాడు!2003లో అప్పటి వరకు విడి విడి రవాణా వ్యవస్థలైన రైళ్ళనీ బస్సుల్నీ కలుపుతూ హైదరాబాదు నగరానికి multi-modal transport system (MMTS) విధానం ఏర్పాటు చేశాడు.

1999లో ఇరవయ్యేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలబెట్టే ఉద్దేశంతో విజన్ 2020 ప్రతిపాదించిన చందబాబు వీళ్ళకి పనికిరాలేదు గానీ ఆరోగ్యశ్రీ తప్ప  ఇంకొక్కటి సక్సెస్ చెయ్యలేని రాజశేఖర రెడ్డి దేవుడిలా కనిపించాడా!

ఎవరి పరిపాలనలో ఎన్నిసార్లు ఆమెరికా అధ్యక్షుడూ బిటన్ ప్రధానమంత్రీ వాళ్ళ దేశాలు దాటి ఇంకో దేశంలో అడుగుపెట్టి ఆయా దేశాల రాష్ట్రాల ప్రభుత్వాధినేతల్ని పొగిడారో లెక్కలు తియ్యండి.సా. 2000 నాడు Bill Clinton, Tony Blair చంద్రబాబును కలవడానికి హైదరాబాదు వచ్చారు - ప్రపంచ స్థాయి సర్క్యులేషన్ ఉన్న Time పత్రిక "In just five years, he has turned an impoverished, rural backwater place into India's new information-technology hub" అని మెచ్చుకుని South Asian of the Year అని ప్రశంసించింది.

అదివరకు దేశంలో టూరిజం అంటే పాత కాలంలో గుడి గోపురాలు తిరగటానికి చేసే తీర్ధయాత్రల లాంటి యవ్వారం అనుకునేవాళ్ళు తప్ప అందులో సంపాదన ఏముంటుందీ అనుకునే స్థితి నుంచి దేశంలోకి వచ్చే విదేశీ యాత్రికుల్లో 24 శాతం మంది ఆంధ్రాకి వచ్చేలా చేశాడు.అలాంటివి నేను గానీ ఈల గానీ వేస్తే అన్నట్టు సొల్లు కబుర్లు చెప్పే జగనూ కేసీయారూ మోదీ చెయ్యలేరు, చెయ్యరు, చెయ్యాలని అనుకోరు కూడా!ఈలలు వేస్తే రావడానికి ఫారిన్ టూరిస్టులూ అమెరికన్ ప్రెసిడెంటూ బ్రిటన్ ప్రధానీ పిచ్చోళ్ళా - విమాన ప్రయాణం దగ్గిర్నుంచి బస్సు ప్రయాణం వరకు గల అన్ని సౌకర్యాల్నీ మెరుగు పర్చాకనే అది సాధ్యపడింది! 20002 నాటికి ఆంధ్రా వైపుకి వచ్చేవీ ఆంధ్రా నుంచి వెళ్ళేవీ అయిన విమాన సర్వీసుల్లో 100% ఆక్యుపెన్సీ నమోదైంది.హోటళ్ళూ తదితర సౌకర్యాలతో కలుపుకున్న ఇండైరెక్ట్ మరియు డైరెక్ట్ ఎంప్లాయిమెంటు యొక్క రేంజి 37.7 లక్షలు.అప్పుడు వచ్చిన best tourism performing state అవార్డు ఇప్పుడు తెలంగాణ అధీనంలోనే ఉండి ఉండాలి!

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ టూరిజం అనేది మెయిన్ స్ట్రీం పరిశ్రమ కాదు.టూరిజం అనేదాంట్లో ఇంత హడావిడి పెరగటానికి ముందే అన్ని మెయిన్ స్ట్రీం వ్యాపార పారిశ్రామిక రంగాల్లో పెరుగుదల కనిపించాకనే వేరేవాళ్ళు ఇటువైపుకు రావటం మొదలై టూరిజం పెరుగుతుంది అనేది తెలిస్తే చాలు చంద్రబాబు తెలంగాణకి ద్రోహం చేశాడు అనేది అబద్ధం అని తెలుస్తుంది.బహుశః మాటలు తక్కువ చెప్పి పనులు ఎక్కువ చేసి ఇప్పుడున్న వాళ్ళకే కాక పుట్టబోయేవాళ్ళకి కూడా ఉపాదులు దొరికేలా పరిపాలించటమే చంద్రబాబు చేసిన ద్రోహం కాబోలు!

2001 ఏప్రిల్ 27 కేసీయార్ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత అతను తన వ్యక్తిగత శత్రువైన చంద్రబాబుని తెలంగాణ శత్రువు కింద ఫిరాయించాకనే కదా వీళ్ళకీ చంద్రబాబు తెలంగాణకి ద్రోహం చేసినట్టు తెలిసింది - మరి చంద్రబాబు తెలంగాణకి ద్రోహం చేశాడని చెప్తున్న కాలంలో కేసీయార్ ఎక్కడ వున్నాడు?కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి రాజకీయ ప్రయాణం కాంగ్రెసులోనే మొదలైంది.మెదక్కు శాఖలో చేరారు.ఎప్పుడు చేరారో కూడా తెలియడం లేదు. కాంగ్రెసులో ఉండి 1983 వరకు ఏమి గోగునార కట్టలు పీకినారో తెలియడం లేదు గానీ 1983లో రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి అనంతుల మదన్ మోహన్ మీద పోటీ చేసి ఓడిపోయారు.అయితే, తర్వాత కొంచెం కష్టపడి పార్టీలో ముందుకెళ్ళి 1987 మొదలు 1988 వరకు రామారావు మంత్రివర్గంలో Drought & Relief శాఖతో మంత్రి అయ్యారు.1990లో Medak, Nizamabad, Adilabad జిల్లాలకు తెలుగుదేశం పార్టీకి కన్వీనర్ అయ్యారు.1996లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో Transport minister అయ్యారు.2000 మొదలు 2001 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకి deputy speaker అయ్యారు.2001 April 27 Deputy Speaker స్థానానికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి Telangana Rashtra Samithi (TRS) అనే సంస్థని స్థాపించారు.

మహా ఘనత వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో 60 ఏళ్ళు పోరాటం చేసి ఆంధ్ర దోపిడీ నుంచి విముక్తం అయ్యామని రొమ్ములు విరుచుకు తిరుగుతున్న ఈనాటి ఉద్యమనేతలు చెప్పగలరా?

అసలు ఆంధ్రా నాయకులు తెలంగాణ వాళ్ళని దోచుకోవడం ఎలా కుదురుతుంది?దేశం మొత్తం మీద ఎలా ఎన్నికలు జరుగుతాయో తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ అలాగే జరుగుతాయి కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యుల్ని తెలంగాణ వోటర్లే ఎన్నుకుంటారు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యుల్ని ఆంధ్రా వోటర్లే ఎన్నుకుంటారు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!బుద్ధీ జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా నమ్ముతాడా పాస్ పోర్టులు అమ్ముకుని బాగుపడ్డ ఒక నోటిదూల తాగుబోతు వెధవ చెప్పిన గాలికబుర్లు?

1968 నాటి చెన్నారెడ్డి గారూ 2001 నాటి కేసీయార్ గారూ ఒకేలాంటి కబుర్లు చెప్పారు, రెండుసార్లూ తెలంగాణ ప్రజలూ మేధావులూ ఒకే రకం పిచ్చితనాన్ని ప్రదర్శించారు,పైన ఆంధ్ర ప్రాంతపు నాయకుల్ని దొంగలనీ దోపిడీదార్లనీ తిడుతున్నారు.వాళ్ళ ఆజ్ఞానంతో ఇన్నేళ్ళూ వాళ్ళని వాళ్ళు సర్వనాశనం చేసుకున్నది చాలక వాళ్ళకన్న పదింతలు తెలివైనవాళ్ళైన ఆంధ్ర ప్రాంతపు ప్రజల్ని కూడా సర్వనాశనం చేశారు!

కేసీయార్ చంద్రబాబుకి తెలంగాణ శత్రువు ముద్ర వెయ్యటం వ్యక్తిగత కక్ష వల్ల చేసి ఉండొచ్చు గానీ మీడియా అందిపుచ్చుకుని ప్రచారం చెయ్యడం వల్ల వీధుల్లోనూ కొందరు పిచ్చోళ్ళ మెదళ్ళలోనూ నాటుకుపోవడం వెనక ఇప్పుడు అమరావతిని ధ్వంసం చేస్తున్న అంతర్జాతీయ స్థాయి కుట్రదారుల ప్రమేయం ఉంది.

కేసీయార్ దగ్గిర్నుంచి గోరేటి వెనకన్న వరకు పాడిన పాట "ఆంధ్రా దోపిడీ" అనేది సర్వాబద్ధం - నిజానికి ఆంధ్రాతో కలిసింది మొదలు తెలంగాణ వాళ్ళు గయ్యాళితనంతో చేసిన దగాకోరు రాజకీయం వల్ల సర్వనాశనం అయ్యింది ఆంధ్రావాళ్ళే!

తెలంగాణ మేధావి ఆంధ్రావాళ్ళకి అన్యాయం చేసి బలిసిన తమ దోపిడీ చరిత్రని చూసుకుని గర్వపడుతున్నాడు? తెలంగాణ మేధావి ఆంధ్రావాళ్ళకి తమ ముఖ్యమంత్రి చేసిన చేస్తున్న చెయ్యబోతున్న అన్యాయం గురించి తెలుసుకుని సిగ్గుపడుతున్నాడు!

ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి. 

3 comments:

  1. You are going to face the consequences for all this. We will teach you a terrific lesson for calling our kcr drunken idiot.

    ReplyDelete
    Replies
    1. Is it?
      hhahhahha!
      Is it my mistake to call a drunkard a drunkard!
      Go, tell him to stop drinking.
      jai Sree raam!

      Delete
    2. Drunken is drunken as you are a bastard. Then calling him idiot also is not objectable. Got it u bloody son of bitch? Get ready to get ur ass torned a part.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

"వేదాలు చదివిన వారు యజ్ఞయాగాదు లందు పశువులను వధిస్తారు" - ఇది నిజమా?

hari.S.babu: గురువు గారూ ! మహాభారతంలో ధర్మవ్యాధుని కధ వస్తుంది కదా . అక్కడ ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మబోధ చేస్తూ ఒకచోట ," ...