Sunday, 15 November 2020

ఈ కలియుగానికి నరకాసురుణ్ణి నేనే,భేతాళిక సత్యభామ అయితే చిరుడ్రీంసు కృష్ణుడు అయితే యుగధర్మం ప్రకారం అంతిమ విజయం నాదే - అహ్హహ్హహ్హ!

అవును, మీరు చదివింది నిజమే.ముమ్మాటికీ నిజమే!పండగ పూట అబద్ధం చెప్పడం దేనికి?నమ్మట్లేదా!

ఇప్పుడు చెప్పండి, ఇది కృష్ణుడిలా కనిపించే మొహమేనా!రాక్షసుడిలా చూపులో క్రౌర్యమూ నవ్వులో శాడిజమూ ఉట్టిపడటం లేదూ!శిష్టశిక్షణం, దుష్టరక్షణం చేసేస్తా - కొత్త ద్యాముడిలా అవతరిస్తా.ఆ రోజెంతో దూరం లేదూ...రేపో మాపో పార్టీ ఒకటీ పెట్టేస్తా...దుష్టుల్నే ఆకర్షిస్తా,శిష్టుల్నీ మర్దించేస్తా!

ప్రతి చెడులోనూ కొంత మంచి ఉంటుంది, ప్రతి మంచిలోనూ కొంత చెడు ఉంటుంది, నూటికి నూరు శాతం మంచి గానీ నూటికి నూరు శాతం చెడు గానీ ఉండవు అన్నట్టు గీతయే చెప్తున్నప్పుడు తమను తాము రక్షించుకోవడం కోసం తపస్సులు చహెసి దేవతలను మెప్పించి వరాలను పొందగలిగిన హిరణ్యకశిపుడూ నరకాసురుడూ రాక్షసులు అనటం ఎంతవరకు సమంజసం!సృష్టిలో రాజ్యపాలన అనేది మొదలైనప్పటినుంచీ పితృ పుత్ర బంధు మిత్ర సపరివార సమేతం ఇటువంటి కార్యక్రమాలలో నిమగ్నమై గురుశిష్య పరంపరతో కొనసాగుతున్న ఇలాంటి మహనీయులనే జాత్యహంకారం తలకెక్కిన బ్రాహ్మణాధములు అసురులని పేరు పెట్టి నిందించి వారు అమరులని అనుకున్న వారి చేత చంపిస్తూ పురాణ కధలను వ్రాశారు.పోనీ, ఆ బ్రాహ్మణోత్తములు చెప్పిన కధల ప్రకారమే రాక్షసులు అంటే ఎవరు,రాక్షసులు కానివారు ఎవరు - మీరు చెప్పండి!కంసుడు రాక్షసుడు అయితే అతని మేనల్లుడు కృష్ణుడు కూడా రాక్షసుడు అవ్వాలి కదా!రావణుడు రాక్షసుడు అయితే అతని కూతురు సీతను పెళ్ళి చేసుకున్న అల్లుడు రాముడు కూడా రాక్షసుడే అవ్వాలి కదా!

మనం ఒక పార్టీ పెట్టి మన శత్రువులతో యుద్ధం చేసి గెలిచి అధికారంలోకి రావాలనుకున్నాం!మనల్ని మనం గెలిచే పార్టీ అనుకుని మొదలెడితే హుషారుగుంటది కదా - ఎటూ మనం కలియుగంలో ఉన్నాం, మంచికి రోజులు కాని కాలం ఇది,అవునా?అందికే, బుర్రకి పదును పెట్టి ఈ ప్లాను వేశా!

ఇప్పుడు హిందువులు రాక్షసులే!కాదు, కుదరదంటే వూరుకోను.పద్ధతులు మార్చుకోవాల్సిందే!ఎంతకాలం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటాం?మనలో పారేది నెత్తురు కాదా!మనం ఉప్పూ కారం తింటం లేదా?అరె, డిసెంబరు 31 అర్ధరాత్రి వస్తే ఎంత హడావిది,ఎంత భీబత్సం,ఎన్ని లక్షల గ్యాలన్ల సరుకు అమ్ముదవుద్ది?ఎన్ని కోట్ల లెక్కన క్రాకర్సు కాలుస్తారు?ఎవడు ఏ పంచాయితీ లెవెలు ఎలక్షన్లలో గెల్చినా సరే, దారి పొడుగునా జువ్వలు ఎగరాల్సిదే - కానీ, హిందువుల పండగలు వస్తే చాలు  హేటువాదులు "పర్యావరణం,జీవహింస,తొక్కా, తోలు" కార్ణాలతో వూరూ వాడా మోతెక్కించటం,కోర్టుల్లో కేసులు వెయ్యటం, ఆ తెల్లమొహం జడ్జీలు వాళ్ళ పక్షాన తీర్పులు ఇచ్చెయ్యటం!

నెత్తురు మరిగిపోతంది!మన ఇంట్లో మనం కూర్చుని మన బతుకు మనం బతకాలంటే కూడా హిందువులం రాక్షసత్వం అలవాటు చేసుకోవాల్సిందే!ఒక్కొక్కళ్ళం ఎంతకాలం రంకెలు వేస్తాం? అంత కోపమూ పేదవాడి కోపంలా తెల్లారేసరికి ఆవిరైపోద్ది!అందుకే పార్టీ పెట్టేస్తున్నా - కలిసి కుమ్మేద్దాం!

పార్టీ పేరు "విశ్వతోభద్ర"!మొదట నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ పెట్టిన "లోక్ సత్తా" తరహాలో "లోకసత్త్వం" అని పెట్టాలని అనుకున్నా.మొదట్లో బాగానే అనిపించింది గానీ పోను పోను ఫెయిలైన పార్టీ పేరుని పెట్టటం అంటే హేరోదు సభలో నువ్వు దేవుడివని నిరూపించుకుంటే వదిలేస్తానని అన్నప్పుడు నిరూపించుకోలేక శిలువ మీద చచ్చిపోయిన యేసుక్రీస్తుని తిరిగి బతికిన దేవుడనీ లోక రక్షకుడనీ అన్నట్టు ఉంటుందనిపించేది.అలా ఆలోచిస్తూ చిస్తూ ఉన్న సమయంలో ఒక జ్యోతిషం గురించిన పోష్టు దగ్గిర "సర్వతోభద్ర చక్రం" గురించి చదివాక ఆ పేరు నచ్చి మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటుంటే ఈ పేరు తట్టింది - సూపర్ ఉంది కదూ!

పతాకం ఎప్పుడో డిజైన్ చేసుకున్నా!అంటే, మొత్తం పూర్తి కాలేదు.నేను ప్రోగ్రామర్ని.డిజైనింగులో అంత సూపర్ కాదు.మెయిన్ పాయింట్ నిపించే వైర్ ఫ్రేమ్ ప్లాన్ వేసుకున్నా.ఒకవైపున నలుపు రంగులోనూ ఒకవైపున తెలుపు రంగులోనూ ఉంటుంది.పొడవు వెడల్పులు అయితే 1:2 లేదంటే 1:1.6 అవుతాయి.నలుపు రంగు వైపున తెల్ల గీతలతోనూ తెలుపు రంగు వైపున నల్ల గీతలతోనూ నడిమధ్యన శ్రీచక్రం లాంటి అమరిక ఉంటుంది.
నలుపు రంగు వైపున తెల్ల గీతలతో చిహ్నానికి పైన "అంధం తమః ప్రవిశంతి అసంభూతిం ఉపాసతే/తతో భూయ ఇవతే తమోయ ఉ సంభూత్యాం రతాః" అనీ తెలుపు రంగు వైపున నల్ల గీతలతో చిహ్నానికి పైన "అంధం తమః ప్రవిశంతి అవిద్యాం ఉపాసతే/తతో భూయ ఇవతే తమోయ ఉ విద్యాయాం రతాః" అనీ వ్రాసి ఉంటుంది.

నలుపు రంగు వైపున తెల్ల గీతలతో చిహ్నానికి కింద "అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః/అనంత మవ్యయం కవిం సముద్రేంతం విశ్వసంభువం" అనీ తెలుపు రంగు వైపున నల్ల గీతలతో చిహ్నానికి కింద "పతిం విశ్వేశ్వాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం/నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం" అనీ వ్రాసి ఉంటుంది.

ఇది విశ్వంలోని వ్యక్తావ్యక్తమైన దృశ్యమాన ప్రపంచపు ద్వైదీభావపు సంకేతం.వైదిక సాహిత్యంలోని శుక్ల,కృష్ణ యజుర్వేదాల వర్ణాలు సంభూతి-అసంభూతి,విద్య-అవిద్య పదాలు కలిసి లక్ష్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి కదూ!

ఇక పతాక వందన గీతం అయితే పదహారు చరణాల రధిక సూక్తం!సంపదనీ వైభవాన్నీ రాజ్యాన్నీ విజయాన్నీ కోరుకునే ప్రతి ఒక్కరికీ పోరాటస్పూర్తిని రగిలించే వేదమంత్రం:
01.రధే తిష్ఠస్ తిష్ఠన్ రధే 
   రధే తిష్ఠన్ నయతి నయతి 
   తిష్థన్ రధే రధే తిష్థన్నయతి
02.తిష్ఠన్ నయతి నయతి తిష్థన్ 
   తిష్ఠన్ నయతి వాజినో వాజినో నయతి
   నయతి తిష్ఠస్ తిష్ఠన్ నయతి వాజినో
03.నయతి వాజినో వాజినో నయతి
   నయతి వాజినః పురః పురో వాజినో
   నయతి నయతి వాజినః పురః
04.వాజినః పురః పురో వాజినో వాజినః
   పురో యత్రయత్ర యత్రయత్ర పురో 
   వాజినో వాజినః పురో యత్రయత్ర
05.పురో యత్రయత్ర యత్రయత్ర పురః 
   పురో యత్రయత్ర కామయతే కామయతే 
   యత్రయత్ర పురః పురో యత్రయత్ర కామయతే
06.యత్రయత్ర కామయతే కామయతే యత్రయత్ర 
   యత్రయత్ర కామయతే సుషారధిస్ సుషారధిః
   కామయతే యత్రయత్ర యత్రయత్ర కామయతే సుషారధిః
07.యత్రయత్రేతి యత్రాత్=యత్రాత్
   కామయతే సుషారధిస్ సుషారధిః కామయతే
   కామయతే సుషారధిః సుషారధి రితి సు=సారధిః
08.అభీశూనాం మహిమానం మహిమాన మభీశూనా 
   మభీశూనాం మహిమానం పనాయత పనాయత 
   మహిమానమభీశూనా మభీశూనాం మహిమానం పనాయత
09.మహిమానం పనాయత పనాయత మహిమానం 
   మహిమానం పనాయత మనో మానః పనాయత 
   మహిమానం మహిమానం పనాయత మనః
10.పనాయత మనో మనః పనాయత 
   పనాయత మనః పశ్చాత్ పశ్చాన్ మనః 
   పనాయత పనాయత మన@ పశ్చాన్
11.మనః పశ్చాత్ పశ్చాత్ మనో మనః 
   పశ్చాదన్వను పశ్చాన్ మనో మనః పశ్చాదను
12.పశ్చాదన్వను పశ్చాత్ పశ్చాదను యఛ్చంతి
   యఛ్చంత్యను పశ్చాత్ పశ్చాదను యఛ్చంతి
13.అను యఛ్చంతి యఛ్చంత్యన్వను 
   యఛ్చంతి రశ్మయో రశ్మయో 
   యఛ్చంత్యన్వను యచ్చంతి రశ్మయః
14.యఛ్చంతి రశ్మయో రశ్మయో యఛ్చంతి 
   యఛ్చంతి రశ్మయః రశ్మయ ఇతి రశ్మయః
15.రధే తిష్ఠన్నయతి వాజినః 
   పరో యత్రయత్ర కామయతే సుషారధిః
16.అభీశూనాం మహిమానం పనాయత 
   మనః పశ్చాదను యఛ్చంతి రశ్మయః
ఇంతకాలమూ పార్టీ ఎలా మొదలుపెట్టాలి అని ఒక గందరగోళం ఉండేది.క్రౌర్యమూ కదాని ఏదో ఒక మూల నిరాడంబరంగ ముగించేసి బాక్సు ఐటముకు మించని స్థాయిలో ప్రచారం ఉంటే చంద్రబాబు, జగన్, కేసీయార్ లాంటి దిగ్గజాల ముందు ఒక రేంజిలో నిలబడటానికి ఏ ముప్పయ్యేళ్ళో పడుతుంది.కానీ, ఈ మధ్యన జరిగిన అన్ని యజ్ఞాలూ సక్సెస్ కావడం చూశాక గొప్ప హుషారు వచ్చింది.పార్టీ ప్రారంభం అదిరిపోయేలా ఉండేటట్టు ప్లాన్ చేశా!సిరంజీవి అయితే సినిమా ఫంక్షనులా లైటింగులతో మెరుపులు మెరిపించేసినట్టు గుర్తుంది,పవనాలు అయితే అసలు ఓపెనింగు ఎలా చేశాడో గుర్తే లేదు - నేను మాత్రం మంచి జ్యోతిష పండితుణ్ణి కలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని అశ్వమేధ యాగం చేస్తా!

అదే ఎందుకు చెయ్యాలి అంటే కౌసల్య యజ్ఞాశ్వాన్ని కత్తులతో గాట్లు పెట్టి చంపిందనీ ఒక రాత్రి ఆ గుర్రంతో రమించిందనీ బ్రాహ్మణాధములు చెప్పిన తప్పుడు కధలు అబద్ధం అని నిరూపించాలి.యజ్ఞం అనగానే భారీగా ఉండదు,కష్టం మాత్రమే ఉంటుంది.యజ్ఞకుండంలో వ్రేల్చాల్సిన సమిధల్ని హవిస్సులతో కొలుస్తారు.ఒక హవిస్సుకి ఇంత నెయ్యి,ఇన్ని కట్టెలు,ఇన్ని సమిధలు అని లెక్కలు వేస్తారు.మధ్యలో ఆచమనం కోసం వాడే నీటికీ లెక్క వుంటుంది.యజ్ఞం కోసం వాడే కట్టెల్ని గొడ్డలితో నరికి తీసుకు రాకూడదు,ఎండిన చెట్ల నుంచి విరిచి గానీ ఎండి చెట్ల కింద రాలినవి గానీ సేకరిస్తారు.ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి.ఒకటి,ఎంత ఎండితే అంత స్వచ్చమైన పొగలేని మంట వస్తుంది,రెండు గొడ్డలి వాడటం చెట్టుని హింసించడం అవుతుంది - అహింసకి ఇంత ప్రాధాన్యత ఇచ్చే యజ్ఞ ప్రక్రియని జంతుబలులతో సమానం చెయ్యడం ఎంత నీచత్వం!యజ్ఞంలో వ్రేల్చడం కోసం వాడే సమిధల్ని కూడా అలానే సేకరిస్తారు.ఆవు నెయ్యిని తప్ప యజ్ఞంలో ఇంకొక జంతు సంబంధమైన ద్రవ్యాన్ని వాడరు, వాడకూడదు.యజ్ఞం మొదలు పెట్టేముందు యూపస్తంభం ఒకటి పాతి ఆవుల్నీ గుర్రాల్నీ మేకల్నీ కట్టెయ్యటం అనేది ఒకటి పట్టుకుని క్రైస్తవులూ మహమ్మదీయులూ జంతుబలులు ఇవ్వడానికి కట్టిన రాటకీ యూపస్తంభం అని పేరు పెట్టుకుని యజ్ఞమూ బలీ ఒకటే అని తేల్చి పారెయ్యడం కాదు, హిందువులు యూపస్తంభం పాతేది యజ్ఞవాటికని వాటి పేడతో అలికి శుభ్రం చెయ్యడం కోసమే ఆ జంతువులని అక్కడ కట్టేస్తారని తెలుసుకోవాలి.ఇవన్నీ ఆదరా బాదరా అని హడావిడి పడితే జరగకపోవడమూ చాలా ఓపికా తీరికా అవసరం కావడమూ తెలుస్తున్నది గదా, అందుకే కష్టమైన పనుల్ని యజ్ఞంతో పోలుస్తున్నారు - అర్ధమైందా బడుద్ధాయిలూ!

యజ్ఞం ఒక్క రోజు కాదు, వారం గానీ పదిరోజులు గానీ జరిగేటట్టు ప్లాన్ చేస్తాను.ఇందులో పెద్ద ఖర్చు ఉండదు గానీ నేను  పిలిచేది సామాన్యులని మాత్రమే కాదు, అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖుల్నీ పిలుస్తాను.ఒకరోజు సాహితీవేత్తల్నీ ఒకరోజు ప్రవచనకర్తల్నీ ఒకరోజు రాజకీయనాయకుల్నీ ఒకరోజు న్యాయశాస్త్రకోవిదుల్నీ ఒకరోజు ఆర్ధిక వేత్తల్నీ ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడికి చేర్చి ముఖాముఖి పేరున నేను వాళ్ళని ప్రశలు అడగటం వాళ్ళు నన్ను ప్రశ్నలు అడగటం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాను.దీనివల్ల ఇతర పార్టీల నాయకుల,కార్యకర్తల కన్న మన పార్టీలోని నాయకుల,కార్యకర్తల వైవిధ్యం అందరికీ తెలుస్తుంది!

తక్కువో ఎక్కువో అసలు ఖర్చు అంటూ ఉంటుంది కదా, పార్టీకి నిధులు ఎక్కణ్ణుంచి కొట్టుకు రావాలి?మొదట కదపలో పునాది గట్టి చేసుకుని తర్వాత రాష్ట్రం మొత్తానికి ఎగబాకిన జగన్ మాదిరి నేను మొదటి కృష్ణాతీరం మీద పట్టు బిగిస్తాను.అంటే, కనీసం రెండు సంవత్సరాల వరకు ఒక పార్టీ ఆఫీసును మెయింటెయిన్ చేస్తూ ప్రచార సభలూ ఇతర కార్యక్రమాలూ చెయ్యడానికి మూలధనం కోసం సహృదయులైన ధనవంతులని ఉపయోగించుకోవటం తప్ప వేరు దారి లేదు.అవినీతిపరుల నుంచి గానీ, అనుమానాస్పద చరిత్ర ఉన్నవారినుంచి గానీ,ధనసహాయం చేసినందుకు ప్రతిఫలం ఆశించిన వారినుంచి గానీ ఒక్క రూపాయి కూడా తీసుకోను.అదీ గాక, వీళ్ళ నుంచి తీసుకున్న మొత్తాన్ని రెండేళ్ళ తర్వాత తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను.న్యాయపరమైన ఒప్పందంలా లొసుగులు లేని పద్ధతిలోనే నిధుల సేకరణ జరుగుతుంది.రెండేళ్ళ పాటు వీళ్ళు పార్టీకి ట్రస్టీలు/ఓనర్లు/స్పాన్సరర్లు అవుతారు.

అయితే, పార్టీ పెట్టిన ఒక సంవత్సరం లోపు ప్రజలకు నేను ముఖ్యమంత్రి అయితే తమ జీవితాలు బాగుపడతాయని నమ్మకం కలిగించే ఒక అద్భుతమైన కార్యక్రమం నా మనసులో ఇప్పటికే ఉంది.అది నేను అనుకున్న స్థాయిలో జయప్రదం అయ్యాక ప్రజల నుంచి ఒక్కొక్క ఇంటినుంచి సంవత్సరానికి గానీ నెలకి వెయ్యికి మించని విరాళం తీసుకుంటాను.ఇలా ఒక్కొక్కరి నుంచి తక్కువ మొత్తం ఆశించడం కొందరికి తెలివి తక్కువ అనిపించవచ్చు గానీ వెయ్యి రూపాయలు మాత్రమే ఇవ్వమనడం వెనక నేను పెట్టిన మెలిక నేను ముఖ్యమంత్రిని అయితే వాళ్ళకి లాభం ఉంటుందని నమ్మడం కాబట్టి కొద్దిమందినుంచి లక్షల్లో తీసుకోవడం కన్న ఎక్కువమందినుంచి వేలల్లో తీసుకోవడం వల్ల విరాళం ఇవ్వడంతో పాటు ఓట్లు కూడా మనకే వేస్తారన్న గ్యారెంటీ ఉంటుంది కదా!  

ఇది ఎప్పుడు ట్రస్టీలు ఇచ్చిన మొత్తాన్ని మించితే అప్పుడు ఒప్పందం ప్రకారం ట్రస్టీలకి వాళ్ళు ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసి ప్రజల నుంచి వచ్చిన సొమ్ముతోనే పార్టీని నడుపుతాను.ఎప్పుడు ప్రజల నుంచి విరాళం ఆగిపోయి పార్టీకి నిధులు తగ్గుతాయో అప్పుడు పార్టీని రద్దు చెయ్యడం తప్ప ట్రస్టీలని కొనసాగించడం గానీ అవినీతికి తలవంచడం గానీ చెయ్యను.ఇప్పుడు అవినీతి పరుల కొమ్ము కాస్తున్న పార్టీలు తమ తొలినాళ్ళలో ఆదర్శంగానే ఉండేవి,నిధుల కొరత ఎదురయ్యాక రాజీ పడటమే వాళ్ళనిలా తయారు చేసింది కాబట్టి ఆ తప్పు నేను ఎప్పటికీ చెయ్యను.

ఇంతకీ, నా విజిటింగ్ కార్డు ఎలా ఉంటుందో తెలుసా!నా పేరులో ఒక తమాషా ఉంది.నేను నా పేరుని hari.S.babu అని ఎందుకు రాస్తున్నానో చెప్తే మీరు అద్దిరిపోతారు!అటునుంచీ ఇటునుంచీ ఒకేలా కనిపిస్తున్న పదాల్ని ఇంగ్లీషులో ambigram అంటారు. దాని గురించి గూగుల్ చేస్తున్నప్పుడు మనం ఇచ్చిన పదాల్ని కూడా ambigram మింద చూపించే ఒక సైటు దగ్గిర haribabu అని ఇస్తే దానికీ ambigram చేసి ఇచ్చింది.ఇంకొంచెం క్రియేటివిటీ ఉపయోగించి దాన్ని రెక్కలు చాపి ఎగురుతున్న పక్షి బొమ్మలో ఇరికించాను.దాన్ని ఒక ఆర్టిస్టుకి ఇచ్చి విజిటింగ్ కార్డ్ చేయించాను.
అన్ని విజిటింగ్ కార్డులూ ఒకవైపున మాత్రమే ప్రింట్ అవుతాయి.కానీ, నా కార్డు రెండు వైపులా ప్రింటవుతుంది - ఒకవైపున Political Aanlyst అని ఉంటే ఒకవైపున Political Activist అని ఉంటుంది.అత్యంత అరుదైన విజిటింగ్ కార్డ్ అవుతుంది కదూ!

అసలు మనం పార్టీ పెట్టి చెయ్యాల్సిన కుట్రలు ఏంటో చెప్పలేదు ఇంతవరకు.అవతలివాళ్ళు మనమీద రహస్యకుట్రలతోనే గెల్చారు.మనం కూడా కుట్రలు చెయ్యడానికి జంకకూడదు.కొన్ని కుట్రల్ని పబ్లీకునా కొన్ని కుట్రల్ని ప్రైవేటునా చెయ్యందే అధికారం మనకి రాదు, వచ్చిన అధికారం మన దగ్గిర ఉండదు!

First:Economic Conspiracy->మొదటి కుట్ర:కాగితపు కరెన్సీని రద్దు చేసి నాణేల వ్యవస్థని ప్రవేశపెట్టాలి.

ఇవ్వాళ మన వాడుతున్న రూపాయి నుంచి దాన్ని వాడుకోవాల్సిన పద్ధతులు సమస్తమూ ఈస్టిండియా కంపెనీ 1892 CE నుంచి దశల వారీ మనమీద రుద్దిన కొత్త అందమైన రూపం!ఇవ్వాళ మనం ఉన్న విచిత్రమైన దీనస్థితి ఏంటంటే, మంచిగా ఉందాలనుకున్నవాళ్ళు కూడా తప్పులు చెయ్యాల్సి రావటం!ఎందుకిలా జరుగుతుందో తెలియక "కలికాలంలో ఇంతే!" అనుకుని సర్దుకుపోతున్నాం.కానీ కీలకం మనం వాడుతున్న రూపాయిలో ఉంది.

ఇదివరకటి రాజ్యాలు ముద్రించే నాణెం అంటే ఏదో ఒక లోహపు ముద్ద కాదు,ప్రతి రాజ్యమూ తన గనుల్లో దొరికే లోహాలలో అత్యంత విలువైన లోహాన్నే నాణేల తయారీకి వాడుకుంటుంది.దాని తయారీ మొదలు విలువని నిర్ధారించడం వరకు రాజు అధికారమే నడుస్తుంది.

ఇప్పటి రూపాయి నోటు నుంచి వెయ్యి రూపాయల నోటు వరకు గల కాగితపు కరెన్సీ అట్లా కాదు,సెంట్రల్ బ్యాంకు ముద్ర లేకపోతే అది ఒక చెత్త వస్తువు.పైన దాని తయారీ నుంచి విలువని నిర్ధారించడం వరకు ఏదీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అజామాయిషీ కింద ఉండదు!

నాణేల తయారీ వ్యవస్థలో మారకానికి రాకముందు విలువ లేనివి అనిపించే వస్తువులు రాజ్యంలో కల్లా అత్యంత విలువైన వస్తువుతో మారకం అవడం వల్ల వాటి విలువ పెరిగినట్టే కదా!కాగితపు కరెన్సీ వ్యవస్థలో మారకానికి రాకముందు విలువ గల వస్తువులు రాజ్యంలో కల్లా అత్యంత విలువ లేని వస్తువుతో మారకం అవడం వల్ల వాటి విలువ తరిగినట్టే కదా!

విలువలూ వలువలూ వాటంతటవి వూడిపోవు, మనం జార్చుకుంటేనే జారిపోతాయి.నాణేల వ్యవస్థ బదులు కాగితపు కరెన్సీని రుద్దిన వాళ్ళకి తెలుసు దాన్ని వాడుతూ వాడుతూ మనుషులు మారుతూ మారుతూ వాళ్ళకి బానిసలు అవుతారని.ప్రజల్ని నాణేల వ్యవస్థ నుంచి బయటికి లాగి కాగితపు కరెన్సీకి అలవాటు చెయ్యడానికి ఇక్కడ వాళ్ళు మోనిటరీ మెయింటెనెన్సు కోసం పెట్టిన ఉద్యోగులే ఎందుకంత అర్ధం పర్ధం లేని సంస్కరణ చేస్తున్నారో తెలియక పిచ్చెక్కిపోయి గగ్గొలు పెట్టినప్పటికీ వినిపించుకోని మొండితనం చూపించారు.

Second:Adninistrative Conspiracy->ఆరోగ్యవంతమైన ఆహారం, పరిశుభ్రమైన పరిసరాలు, అత్యవసరమైన వైద్యం, ఉపాధి హామీ గల విద్య  అనేవాటిని కుల,మత,ప్రాంత,ఆర్ధిక భేదాలకు అతీతమైన సమదృష్టితో ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించడం.

ఇవ్వాళ వోట్లు వేస్తున్న వాళ్ళకి గానీ వోట్లు వేయించుకుంటున్న వాళ్ళకి గానీ ఇవన్నీ ప్రజలకి ఉచితంగా ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత అనీ ఇవన్నీ ప్రభుత్వం నుంచి ఉచితంగా పొందడం ప్రజల హక్కు అనీ అర్ధం కావడం లేదు గాబట్టి ఇక్కడ నేను ప్రత్యేకించి చెప్పాల్సి వచ్చింది!

"అసలు ప్రజలు పన్నులు ఎందుకు కట్టాలి?అసలు ప్రజలు పన్నులు ఎవరికి కడుతున్నారు?ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నది ఎవరు?ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వాలకు చేరిన ఆదాయం తిరిగి ప్రజల వద్దకు ఎంత వస్తున్నది?" అని ఆలోచిస్తే మనమీద జరుగుతున్న కుట్ర ఎంత బలమైనదో అర్ధం అవుతుంది.వాళ్ళ కుట్ర నుంచి బయట పడటానికి మనం కుట్రలు చెయ్యాలని నేను ఎందుకు అన్నానో కూడా అర్ధం అవుతుంది కదూ!

Third:Religious Conspiracy->హిందువుల ఆలయాల్ని ప్రభుత్వం యొక్క అజమాయిషీ నుంచి వూడబెరికి ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించటం.

అయితే, హిందువుల ఆలయాల్ని ప్రభుత్వం యొక్క అజమాయిషీ నుంచి వూడబెరికి ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించటం లేదంటే ఇతర మతస్థుల సాంఘిక కూటముల్ని కూడా ప్రభుత్వం పరిధిలోకి తీసుకు రావటం - రెండింటిలో ఏది జరిగినప్పటికీ మంచిదే గానీ ఇప్పటిలా ఇతర మతస్థులు తమ మతాల్ని స్వేచ్చగా ప్రచారం చేసుకుంటుంటే హిందువులు తమ పండగల్ని చేసుకోవటానికి కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టే దిక్కు మాలిన స్థితి మాత్రం ఉండకూడదు.

ఒకసారి ఆలయాలు ప్రభుత్వ పరిధి నుంచి బయటపడి ధర్మకర్తల చేతికి వస్తే హిందువులు ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.ప్రతి ఆలయమూ తన నిధుల నుంచి అప్పులు ఇస్తూ ప్రజలు ప్రైవేటు రంగ ప్రభుత్వ రంగ బ్యాంకుల చుట్టూ తిరగడాన్ని తగ్గించవచ్చును - క్రమేణ ఇవ్వాళ్టి దోపిడీకి మూలస్తంభం అయిన బ్యాంకింగ్ వ్యవస్థ నడ్డి విరిగిపోతుంది!రాక్ ఫెల్లర్ గాడు జెకిల్ ఐలాండులో తీర్చిదిద్దిన మోసకారి బ్యాంకింగు వ్యవస్థ నుంచి బయటపడకపోతే అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ఇంతకు ముందు తీసుకున్న ఇకముందు తీసుకుంటున్న అప్పుల్ని తీర్చేసి నిలవలోకి రావడం ఎప్పటికీ సాధ్యం కాదు!

Fourth:Educational Conspiracy->ప్రాధమిక విద్యని మాతృభాషలో బోధించడాన్ని పిల్లల ప్రాధమిక హక్కు కింద మార్చి రాజ్యాంగం గుర్తించిన ప్రతి భాషలోనూ ప్రాధమిక విద్యకు సంబంధించిన పాఠ్యపుస్తకాల్నీ ఉపాధ్యాయుల్నీ ఏర్పాటు చెయ్యడం విద్యా శాఖ యొక్క ప్రదమ కర్తవ్యం కింద ఏర్పాటు చెయ్యాలి.

ప్రాధమిక విద్య అయిన తర్వాత మొదట ప్రభుత్వం నేర్పాలనుకంటున్న అన్ని భాషల నుంచి ఒకదాన్ని రెండు సంవత్సరాల పాటు Second language కింద పరిచయం చెయ్యాలి.తెలుగు మాతృభాష కింద చదివిన వాడికి హిందీ, తమిళం,కన్నడం వంటి స్వదేశీభాషలే కాదు,చైనీస్, జపనీస్, ఫ్రెంచి వంటి విదేశీ భాషల్ని కూడా నేర్పితే అధికస్య అధికం ఫలం!అప్పుడు తర్వాత నుంచి బోధనా భాష(medium of instruction)ను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మాతృభాష,ఇప్పుడు నేర్చుకున్న నూత్నభాష అనే రెంటినుంచి ఎన్నుకునే అవకాశం ప్రతి విద్యార్ధికీ కల్పించాలి.

ఇందువల్ల ఉపాధి కోసం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కాక ఇక్కడ చదివిన కుర్రాళ్ళు ప్రపంచం నలుమూలలకీ పోవడం వల్ల ఇక్కడ పోటీ తగ్గుతుంది,అక్కడ మన రాష్ట్రానికి పేరు వస్తుంది!

Fifth:Agricultural Conspiracy->విత్తనాల్నీ ఎరువుల్నీ పురుగుమందుల్నీ ప్రభుత్వం ఇవ్వటం,వరదలు వచ్చి పంటనష్టం జరిగినప్పుడు ప్రభుత్వం గిట్టుబాటు ధరను ప్రకటించటం, తనే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవటం అనేవి తప్ప ప్రస్తుతం వ్యవసాయ శాఖకు సంబంధంచిన మంత్రులూ అధికార్లూ ఇంకేమీ చెయ్యటం లేదు!ప్రభుత్వం వ్యవసాయానికి చెయ్యాల్సిన అసలు పనులు ఇవి కావు.పండించే ప్రతి పంటకీ నికరమైన మార్కెట్ వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి.ప్రతి పంటను గురించీ మొదట ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి.వరిపంటను అంత ఎక్కువ స్థాయిలో ఎందుకు వేస్తున్నారో అర్దం కావటం లేదు నాకు.ఒక్కొక ఎకరాన్ని చెరువులా తయారు చేసి రోజుల తరబడి నానబెట్టి ఎంత నీటిని వృధా చేస్తున్నారు?ఆ నీళ్ళ కోసం గ్రామాల స్థాయి నుంచి రాష్ట్రాల స్థాయి వరకు అలజడులు, గొడవలు, రాజకీయాలు అవసరమా!గోధుమ, జొన్న, సజ్జలు అంత నీరు అడగవు,బలానికీ ఆరోగ్యానికీ కూడా వరి కన్న అవే చాలా రెట్లు మెరుగు.వ్యవసాయం అంటే తిండి కోసమే అన్న మైండ్ సెట్ పోయి cash crops మోతాదుని పెంచాలి.

నిజానికి నీటి ఎద్దడిని పెంచుతున్న వరి పొలాలని ప్రోత్సహించడమూ అన్ని గొడవలతో సతమతమౌతూ ఉండి కూడా కొనసాగించడమూ కుట్ర అనే అనిపిస్తుంది నాకు. ప్రభుత్వంలోని అతి ముఖ్యమైన వ్యవసాయ శాఖయే వ్యవసాయాన్ని లాభసాటి చెయ్యటానికి బదులు మరింత నష్టపెట్టటం కుట్ర కాక మరేమిటి?మొదట గోధుమ లాబీని ఏర్పాటు చేసుకుని వరిపంట గుత్తాధిపత్యానికి గండి కొట్టాలి - ఇందుకు పెద్ద కుట్రకి, అంటే ధర్నాలూ హర్తాళ్ళూ చాలకపోతే నకలైట్లు చేసినట్టు లాండ్ మైన్లు పేల్చడానికి కూడా సిద్ధపడాలి!

Sixth:Marketing Conspiracy-> ఉత్పత్తి, వస్తువు, ధర, అమ్మకందారు, కొనుగోలుదారు, లాభం, నష్టం, పన్ను అనే అన్ని అంశాలనూ గందరగోళం లేని సరళమైన పద్ధతిలోకి ఒదిగించాలి.ఇవ్వాళ మనం కడుతున్న పన్నుల్లో కట్టాల్సిన అవసరం ఏమాత్రం లేనివి ఉన్నాయి.ఒకే రకమయిన లక్ష్యం కోసం వేసిన కొన్ని పన్నుల్ని రెండేసి చోట్లా మూడేసి చోట్లా కడుతున్నవి చాలా ఉన్నాయి.పన్నుల వ్యవస్థని streamline చెయ్యకపోవడమే ఇప్పటి వ్యవస్థ యొక్క మరియు ప్రభుత్వం యొక్క ప్రత్యేక లక్షణం!

పన్నుల వ్యవస్థని సరిదిద్దాక చెయ్యాల్సిన మరొక ముఖ్యమైన కుట్ర - లాభసాటి కాని వస్తువుల్ని మార్కెట్ల నుంచి బయటికి లాగి మళ్ళీ మార్కెట్టు వైపుకు రానంత దూరానికి విసిరెయ్యాలి."ఆరోగ్యవంతమైన ఆహారం,పరిశుభ్రమైన పరిసరాలు,అత్యవసరమైన వైద్యం,ఉపాధి హామీ గల విద్య" మాత్రమే కాదు, ప్రజలకి అవసరం లేనివాటిని అవసరాల కింద తయారు చేసిన అనేకానేకమైన వస్తువుల్ని కూడా మార్కెట్ల నుంచి నిషేధించాలి.

Seventh:Social Conspiracy-> బ్యాంకింగ్ సిస్టం గురించిన కుట్రని నేను ఇంతకుముందు చెప్పాను గానీ చాలామంది నమ్మలేదు.ఎందుకంటే, అవి నా సొంత విశ్లేషణలు కాబట్టి నాలోనూ మానవ సహజమైన దైర్బల్యాలు ఉండి ఉన్నది లేనట్టూ లేనిది ఉన్నట్టూ పులిమేశానని అనుకోవడానికి ఆస్కారం ఉంది.అందువల్ల ఇప్పుడు ఆ కుట్రకు సహకరించిన లోపలివాళ్ళ సొంత మాటల్నే చూపిస్తున్నాను - చూడండి!

"The U.S. dollar is a 'faith-based currency' dependent on the credibility of a central bank" --- Dallas Federal Reserve Bank President Richard
Fisher

“I am afraid that the ordinary citizen will not like to be told that banks can and do create money…..And they who control the credit of the nation [and its citizens and corporations] direct the policy of Governments and hold in the hollow of their hands the destiny of the people”…- Reginald McKenna, a past Chairman of the Board, Midlands Bank of England.

మొదటి పెద్దమనిషి చాలా సూటిగా చెప్పేశాడు అమెరికన్ డాలర్ విలువని అమెరికన్ ప్రభుత్వం గాక సెంట్రల్ బ్యాకు నిర్ణయిస్తుందని.రెండవ్ పెద్దమనిషి బ్యాకంకులు మనకి అప్పులు ఇచ్చే నోట్లకట్టలు వాళ్ళ సొంత ముల్లె కాదనీ బ్యాంకులు శూన్యం నుంచి సృష్టించి మన డబ్బునే మనకి అప్పు ఇస్తున్నాయని."I am afraid..." అన్నాడు కదాని అతను ఉద్యోగంలో ఉండి  చేసిన తప్పుడు పనికి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడని అనుకోకండి.నోటి దూల కొద్దీ చెప్తూ రెటైరై కోరలు పీకిన పాములా ఉన్నాడు కాబట్టి తెలిసీ ఎందుకంత తప్పుడు పని చేశావని జనం తంతారేమోనని ఆ మాట వాడాడు గానీ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏ మాత్రమూ "అయ్యో!" అనుకోలేదు - నాది గ్యారెంటీ!

ఈ కుట్రని బద్దలు కొట్టటానికి మనం చెయ్యాల్సిన కుట్రలకు తల్లి లాంటి అసలైన కుట్ర "Competetion is a sin!" అని కొవ్వు పట్టి వాగుతున్న రాక్ ఫెల్లర్ లాంటివాళ్ళకి నచ్చేటట్టు అన్ని రంగాల్లోనూ ఒక అతి పెద్ద పిరమిడ్ పైన కొందరు కూర్చుని అటు తమపైన ఉన్న ప్రభుత్వాన్నీ ఇటు తమ కింద ఉన్న ప్రజల్నీ శాసించే పద్ధతికి బదులు అన్ని రంగాల్నీ చిన్న చిన్న పిరమిడ్ల కింద విడగొట్టాలి!ఆర్ధికమే కాదు సాహిత్యం లాంటి రంగాలలో కూడా ఇవ్వాళ గుత్తాధిపత్యం ఉన్నది.గరికిపాటీ చాగంటీ తప్ప ఇంకెవరూ ప్రవచనాలు చెప్పగలిగినవాళ్ళు లేరా!గురజాడ తప్ప పాత్రోచితమైన వాడుకభాషలో కధలూ నవలలూ ఇంకొకడు ఎందుకు రాయలేకపోతున్నాడు?సినిమా రంగంలో చూడండి ఇదీవరకు ఉన్న రెండు కుటుంబాలకు ఇంకో కొత్త కుటుంబం చేరడం తప్ప మార్పు ఏముంది?

కత్తికి కత్తి, పన్నుకి పన్ను అన్నట్టు కుట్రకి కుట్రయే జవాబు తప్ప నీతులు చెప్పి లాభం లేదు.అందుకే, మనకి అధికారం కావాలి!మన పార్టీ కేవలం మన రాష్ట్రానికీ దేశానికే కాదు,ప్రపంచంలోని అన్ని దేశాలకీ వ్యాపించాలి!ఏం?రష్యాలో పెట్టిన కమ్యూనిష్టు పార్టీకి ఇక్కడ బ్రాంచి పెట్టలేదా!చైనాలో పెట్టిన కమ్యూనిష్టు పార్టీకి ఇక్కడ బ్రాంచి పెట్టలేదా!మనం కూడా అదే చేద్దాం!అలా నిలబడాలంటే సిరంజీవిలా పవనాలులా ఎన్నికల ముందు హడావిడి చేసి ఎన్నికల తర్వాత గప్ చుప్ అయిపోకూడదు.కమ్యునిష్టు పార్టీల మాదిరి నిరంతరం పనిచెయ్యాలి.

పార్టీలోకి మన రాక్షస జాతి వాళ్లని మాత్రమే తీసుకుంటాను - పొరపాటున రాహుకేతువుల మాదిరి దూరితే తన్ని తగిలేస్తాను తప్ప తస్మదీయుల్ని మన పక్కన కూర్చుని అమృతం జుర్రుకోనివ్వను, అమ్మతోడు!

ఇంతకీ పార్టీ గుర్తు ఏంటో తెలుసా - దక్షిణావర్త శంఖం!

జై శ్రీ రామ్!


4 comments:

  1. సర్వ జగద్రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ పద్యాలు సంకలనం చేయించాలి అనుకుంటున్నాను గోవిందాక్షర శతకం : అక్షరానికి వంద పద్యాలు
    ఛందస్సు : మీ ఇష్టం
    భాష : తేట తెలుగు, సంస్కృతం , ద్విభాషా మిళితం
    మొదటి శతక పద్యం: (అకార పద్యాలు వంద సేకరిస్తాము)
    అక్షరములోని ప్రతి పదమూ "అ" తో మొదలవ్వాలి లేదా "అ కార అక్షరము" తో మొదలవ్వాలి.
    పద్య భావము వేంకటేశ్వరుని కీర్తిస్తూ కానీ స్వామి రూపాన్ని వర్ణిస్తూ కానీ స్వామి లీలలు తెలుపుతూ కానీ ఉండాలి.
    ప్రతి పదార్ధ భావాలూ కూడా పద్యముతో పాటూ తెలపాలి
    మాకు అందిన పద్యాల ను వీడియో సంకలనం చేస్తాము. ప్రతీ పద్యముతో పాటూ రచయిత /రచయిత్రి పేరు ముఖ చిత్రము మరియు వారి వివరాలు వీడియో లో నిఖిప్తం చేస్తాము
    గమనిక : ఒకరు ఎన్ని పద్యాలు అయినా రాయవచ్చు
    send your poems to slokalupadyalu@gmail.com / slokalu@rcsindia.co.in
    Whats app : 9490702244

    ReplyDelete
    Replies
    1. Shankar babu27 November 2020 at 23:34
      1.శతకం : అక్షరానికి వంద పద్యాలు
      2.అక్షరములోని ప్రతి పదమూ "అ" తో మొదలవ్వాలి లేదా "అ కార అక్షరము" తో మొదలవ్వాలి.

      hari.S.babu
      ఇక్కడ మీరు అక్షరము అని దేన్ని అంటున్నారో తెలియడం లేదు.

      మామూలు వాడకం వాక్యంలో పదములు, పదంలో అక్షరాలు ఉంటాయి అంటారు.రెండో వాక్యంలో మొదట్లో ఉన్న అక్షరము దేనిని సూచిస్తుంది?

      Delete
    2. పద విచ్చేదనం జరిగిన తర్వాత వచ్చేది తరువాతి పదం
      హనుమ మధ్య వర్తియై రామ సుగ్రీవ
      హ , మ, వ , రా , సు
      మొదటి  మూడు పదాలు అకారముతో మొదలైనవి  ( హ , మ)
      నాల్గవ పదము ఆకారముతోనూ,  ఐదవ పదము ఉ కారముతోనూ మొదలైనవి
      కానీ మన పద్యములో అన్ని పదాలూ అకారముతో నే మొదలవ్వాలి

      మొదటి పాదము లోని ఆఖరి పదము రెండవ పాదములోని  మొదటి పద భాగముతో సంధి కలిగి ఉన్నచో రెండవ పాదములో ని పద భాగాన్ని పదముగా గుర్తించము  
      ex:
      ఆతతసేవఁ జేసెద సమస్తచరాచర భూతసృష్టి వి

      జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి ని

      పదారంభ అక్షరాలు
      ఆ,జే,స,భూ
      భా,హృ,సౌ,వి,వే,ని

      Delete
  2. పద విచ్చేదనం జరిగిన తర్వాత వచ్చేది తరువాతి పదం
    హనుమ మధ్య వర్తియై రామ సుగ్రీవ
    హ , మ, వ , రా , సు
    మొదటి  మూడు పదాలు అకారముతో మొదలైనవి  ( హ , మ)
    నాల్గవ పదము ఆకారముతోనూ,  ఐదవ పదము ఉ కారముతోనూ మొదలైనవి
    కానీ మన పద్యములో అన్ని పదాలూ అకారముతో నే మొదలవ్వాలి
    మొదటి పాదము లోని ఆఖరి పదము రెండవ పాదములోని  మొదటి పద భాగముతో సంధి కలిగి ఉన్నచో రెండవ పాదములో ని పద భాగాన్ని పదముగా గుర్తించము
    ex:
    ఆతతసేవఁ జేసెద సమస్తచరాచర భూతసృష్టి వి
    జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి ని
    పదారంభ అక్షరాలు
    ఆ,జే,స,భూ,వి
    భా,హృ,సౌ,వి,వే,ని


    Shankar : 9490702244

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...