Saturday, 26 December 2020

విశ్వతోభద్ర కార్యకర్తలకు ఆఖరి పాఠం

మనం శత్రువులని గెలవలేం అని భయపడితే స్వతంత్రం వస్తుందా?

ఇవ్వాళ భారత దేశపు రాజకీయ రంగస్థలం మీద కేంద్రప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్నీ అమరావతినీ ధ్వంసం చెయ్యడం వెనక అంతర్జాతీయ స్థాయి కుట్ర దాగి ఉంది.అయితే, ఆ కుట్ర అమలు కావడంలో పాలు పంచుకుంటున్నది మనం మానవోత్తములనీ మహనీయులనీ మనల్ని రక్షించడం కోసం కంకణం కట్టుకున్న వీరాధివీరులనీ నమ్మి వోట్లు వేసి అధికారం కట్టబెట్టిన మనవాళ్ళే కావడం వల్ల కొందరికి నమ్మబుద్ధి కావడం లేదు. దేశంలో జరిగిన జరుగుతున్న జరగబోయే అవినీతి మొత్తం కాంగ్రెసు వల్లనే అని మనం నమ్మడం వల్ల ఆ కాంగ్రెసుని భూస్థాపితం చేసిన మోదీ పవిత్రమైనవాడని  నమ్ముతున్నారు కొందరు - కానీ, అది నిజమా!

రేషను షాపుల కాడనుంచి మొదలు హాస్టళ్ళ వార్డెన్లుగ,రిజిస్ట్రేషను క్లర్కులుగ,మినిస్టర్ల ఓసీడిలుగ,నెలవారీ బేటాల పోలీసులుగ,సెక్రటేరియటు లోగిళ్ళ పండిన బ్రోకర్లుగ,మినిస్టర్ల బినామి కాంట్రాక్టుల ఎంగిలి వార్కు లక్షల కోట్ల జనండబ్బును దొడ్డిదారి పట్టించే గుంటనక్కల్ని కాంగ్రెసు తయారు చేసిందా?కలిగినోళ్ళ మోచేతి నీళు తాగుతు బనాయింపు కేసులల్ల ఇరుక్కున్న బీదోళ్ళని తప్పుడు తీర్పులిచ్చి జైళ్ళకి పంపించే బలిసిన ఎనుబోతులంటి కఠీనపు జడ్జీల్ని కాంగ్రెసు తయారు చేసిందా?చదువులు తిన్నగ జెప్పకుండ బుడ్డోళ్ళని గాడిదుల్నీ దున్నల్నీ కాయించే ఎలిమెంటరీ స్కూలు టీచర్లకి కాంగ్రెసు అవినీతి నేర్పిందా?ఏర్లన్ని ఎండిపోయి ఊళ్ళన్ని పాడుబడి పల్లెటూళ్ళు వల్లకాళ్ళై జనం మాడి చస్తంటె చూస్తా నిమ్మళంగ తొంగున్న పల్లెల సర్పంచులకి కాంగ్రెసు అవినీతి నేర్పిందా?కాష్ఠంల కాలేటి దేహపు అందాల్ని ముక్కుతో, చేతితో, మూతితో రాపాడి రొమ్ముల్నీ తొడల్నీ బొడ్డునీ చూసి సొల్లు గార్చుకుంట కడదాక నిలిచే మనసు బంధాల్ని తన్ని తగిలేసి పోయే శాడిష్టు పీనిగల్ని కాంగ్రెసు తయారు చేసిందా!

2014లో ఈవీయం ట్యాంపరింగు చేసి జాతీయ స్థాయిలో తను గెల్చి రాష్ట్ర స్థాయిలో జగన్ని గెలిపించి మొత్తం దేశాన్నీ మన రాష్ట్రాన్నీ భవిష్యత్తు తరాలకి చిల్లికానీ సంపాదించటానికి కూడా వీలివ్వని భయానక స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగంలోకి, December 9, 2020 నాటికి ₹ 86,548,035,832,732 ఉన్న అప్పుని తీర్చడానికి వెసులుబాటే ఇవ్వని పాపంలా పెరిగిపోతున్న అప్పులోకి, వైభవాల మీద ఆశ ఉండీ ఆశల్ని నెరవేర్చుకునే చురుకుతనం ఉండీ మనమే కాదు మన పిల్లలూ మనవలూ ఏనాటికీ వదిలించుకోలేని అనంత కాలపు దరిద్రంలోకి నెట్టేస్తున్న మోదీని -  సొంతానికి సంపాదించుకోవటం లేదన్న ఒకే ఒక కారణంతో అవతార పురుషుడి కింద కొలిచే దౌర్భాగ్యులకి ఎన్నిసార్లు ఎన్ని నిష్ఠుర సత్యాలు చెప్తే అసలు కుట్ర తెలుస్తుంది?

మీరొక మర్డర్ సినిమాకి ఆట కొంత అయ్యాక వెళ్ళారు.పనివాడే హంతకుడు అని మీరు అనుకున్నారు.ఎందుకంటే డైరెక్టరు వాణ్ణి ఎప్పుడూ కత్తితోనే చూపించాడు,వాడెప్పుడూ గుడ్లు మిటకరించుకుని చూస్తున్నడు,హత్యకి గురయిన యజమాని ఫొటో వంక కోపంగా చూస్తున్నాడు.ఇంకా చెప్పాలంటే డైరెక్టరు పనివాడు మీకు నచ్చని కులాన్నికి చెందినవాడని చూపించాడు - ఇంకేం, ఆ కులంవాళ్ళంతే అని రీజనింగు చెప్పేసుకున్నారు.కానీ, చివర్లో అప్పటివరకు భర్త పోయినందుకు ఏడుస్తూ కనబడి మీనుంచి సింపతీ కొట్టేసిన ఇంటి యజమాని భార్య హంతకురాలని తేలింది - హర్రె, ఇంత తెలివైన వాణ్ణి నేనెలా మోసపోయాను అనుకున్నారు మీరు!బహుశః సినిమా మొదటినుంచీ చూస్తే డైరెక్టరు ఇచ్చిన క్లూలు మీ తెలివికి అంది వుండేవి కాబోలు!

ఇక్కడ దేశపు రాజకీయ రంగం మీద కూడా అలాంటి కధే నడుస్తున్నది.మన కళ్ళ ముందు కనపడుతున్న సమస్తం "వాళ్ళు" మనకి చూపించాలనుకున్న దృశ్యం.మనం ఏది చూస్తే "వాళ్ళ" కుట్ర తెలుస్తుందో అది కనపడకపోవటం వల్లనే అది కుట్ర అని తెలియడం లేదు.ఒక కుట్ర విజయవంతం కావాలంటే కుట్ర చేసేవాళ్ళు మొదట చేసేది తమ కుట్రకి బలయ్యేవాళ్ళకి అసలు తమమీద కుట్ర జరగడం లేదని నమ్మించాలి, నమ్మిస్తారు, నమ్మిస్తున్నారు.ఒకవేళ కుట్రకి బలయ్యేవాళ్ళకి కుట్ర జరుగుతున్నదని అనుమానం వస్తే కుట్రని వేరేవాళ్ళ మీదకి తోసెయ్యాలి, తోసేస్తారు, తోసేస్తున్నారు.వీలయితే కుట్రని బయట పెట్టాలనుకుంటున్న వాళ్ళనే కుట్రదారుల కింద కుట్రకి బలయ్యేవాళ్ళకి చూపించి భయపెట్టాలి, భయపెడతారు, భయపెడుతున్నారు.

కుట్ర అంటే అబద్ధం.దేవుడు ఉన్నాడా లేడా అని జరుగుతున్న చర్చలో ఒక సూడో రేషనలిస్ట్ ఠపీమని "పాత రాతి యుగానికి ముందు లేని దేవుడు తర్వాత వచ్చాడు" అనేశాడు.అక్కడ చర్చలో పాల్గొంటున్న మిగిలిన వాళ్ళకి అది చాలా గంభీరమైన స్టేట్మెంట్ అనిపించింది. బహుశః మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంది కాబోలు!కానీ, అతను "కొలంబస్ కనుక్కోకముందు అమెరికా లేదు" అని ఉంటే అక్కడ చర్చలో పాల్గొంటున్న మిగిలిన వాళ్ళకి అది చాలా గంభీరమైన స్టేట్మెంట్ అనిపించేదా!మీ సంగతి యేంటి?ఇట్లా ఉంటాయి కుట్రదారులు చెప్పే అబద్ధాలు.అబద్ధాలని చెప్పడం కన్న నమ్మడం పదింతలు ప్రమాదం, అది మీకు తెలుసా! మనం కూడా అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాం కదా, ఒకసారి మీరు అబద్ధాలు చెప్పిన సందర్భాల్ని గుర్తు చేసుకుని చూడండి.మనం అబద్ధం చెప్పేది కూడా ఎదటివాళ్ళని మోసం చెయ్యడానికే, నమ్ముతారని తెలిసిన పిచ్చోళ్ళకే చెప్తాం - అది వాళ్ళు తెలుసుకోవటానికి కొంత సమయం పడుతుంది.తెలుసుకున్నాక వాళ్ళు తిడితే గతిలేక చేశాను తప్పయిపోయిందని సారీ చెప్పటమో నువ్వు మోసం చెయ్యలేదా అని రెచ్చిపోవటమో జరిగే ఉంటుంది, అవునా?కానీ, ఎదటివాళ్ళు చెప్పిన అబద్ధాల్ని మనం నమ్మితే నష్టం ఎవరికి?

కేసీయార్ దగ్గిర్నుంచి గోరేటి వెనకన్న వరకు పాడిన పాట "ఆంధ్రా దోపిడీ" అనేది సర్వాబద్ధం - నిజానికి ఆంధ్రాతో కలిసింది మొదలు తెలంగాణ వాళ్ళు గయ్యాళితనంతో చేసిన దగాకోరు రాజకీయం వల్ల సర్వనాశనం అయ్యింది ఆంధ్రావాళ్ళే!కేసీయార్ చంద్రబాబుకి తెలంగాణ శత్రువు ముద్ర వెయ్యటం వ్యక్తిగత కక్ష వల్ల చేసి ఉండొచ్చు గానీ మీడియా అందిపుచ్చుకుని ప్రచారం చెయ్యడం వల్ల వీధుల్లోనూ కొందరు పిచ్చోళ్ళ మెదళ్ళలోనూ నాటుకుపోవడం వెనక ఇప్పుడు అమరావతిని ధ్వంసం చేస్తున్న అంతర్జాతీయ స్థాయి కుట్రదారుల ప్రమేయం ఉంది.

కేసీయారు చంద్రబాబుని తిట్టింది తెలంగాణ తెచ్చుకోవడం కోసమే అయితే తెలంగాణ తెచ్చుకున్నాక తన యేడుపు తను యేడవవచ్చు కదా!అసలు చంద్రబాబుని హైదరాబాదులో కూడా ఉండనివ్వని పంతం దేనికి పట్టాడు?పోనీ గదాని హైదరాబాదు నుంచి పోయి అతని రాష్ట్రాన్ని అతను బాగు చేసుకుంటుంటే  తన రాష్ట్రాన్ని తను బాగు చేసుకుంటూ కూర్చోక చంద్రబాబుకి రిటయిర్మెంటు ఇప్పించే పనెందుకు పెట్టుకున్నాడు?పోనీ కేసీయారుకి చంద్రబాబుతో పోటీ పడలేక తరుగులో విడిపోయిన ఆంధ్ర మెరుగుతో విడిపోయిన తెలంగాణ కన్న పరుగులు పెట్టటం వల్ల కళ్ళు కుట్టి యేడ్చాడని సరిపెట్టుకోవచ్చు - మోదీ చంద్రబాబు మీద యుద్ధం ప్రకటించటానికి చంద్రబాబు మోదీకి చేసిన ద్రోహం ఏమిటి?

పాత కధలు దేనికి గానీ 2014 మొదలు 2019 వరకు చంద్రబాబు మోదీకి గానీ శీలా వారికి గానీ సోమూ వారికి గానీ ఛోటా మోటా భాజపా నాయకులకీ కార్యకర్తలకీ చేసిన ద్రోహం ఏమిటి?ఏమీ లేదు!అది వాళ్ళ అంతరాత్మలకీ తెలుసు. ఒకవైపు రాష్ట్ర స్థాయి భాజపా అధికారిక ప్రతినిధుల్లో ఎవడు అమరావతికి మనస్పూర్తిగా సపోర్టు చేసినా తెల్లారేసరికి వాణ్ణి పీకేసి ఇంకోణ్ణి పెడుతున్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రకి అన్యాయం చెయ్యడానికి ఎంత రాక్షసమైన పనులైనా చెయ్యగలదని తెలుసుకోలేకపోవటానికి ఆంధ్రా వోటర్లు చెవుల్లో పువ్వులు పెట్టుకుని కూర్చున్నారా!నిన్నటికి నిన్న ముష్టి మూడు శాతం వోట్లు కూడా లేని భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు ఎవరూ వూహించని రీతిలో అధికారంలోకి వస్తాం అంటే దాని అర్ధం ఏమిటి?ఇప్పటికీ ఎన్నికలలో ఒక్క సీటుని కూడా గెలిచే దమ్ము లేని పార్టీ 175 సీట్లు ఉన్న అసెంబ్లీలో 116 సీట్లు తెచ్చుకోవడం సాధ్యం కానప్పుడు "అనూహ్యమైన పద్ధతిలో అధికారం చేజిక్కించుకోవడం" అంటే "అసహ్యకరమైన పద్ధతిలో అధికారం చేజిక్కించుకోవడం" అనే అర్ధం ఎందుకు రాదు?

 నేను ప్రతి ఎన్నికకీ బెట్టింగు రాజాలకి పనికొచ్చే అవకాశం ఉన్న గెస్సింగులు చెయ్యలేదు గానీ ఆనాడు కేజ్రీవాల్ మొదటిసారి ఢిల్లీలో గెలిచిన ఎన్నికలకి ఒక్క రోజు ముందు "అక్కడ బీజేపీ గెలవదు!" అని చెప్పాను, ఈనాడు చంద్రబాబు గెలిచే అవకాశం లేదు గానీ గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుంది,గెలవకపోతే రాష్ట్రం పాడుపడుతుంది అని చెప్పాను.అన్నింటికన్న ముఖ్యమైనది 2014లో మోదీ గెలిచిన మొదటి ఏడాదిలోనే 2019 లోపు రామాలయం కడతాడు, అదీ ఎన్నికలకి ముందు మిగిలిన అన్ని రంగాల్లో ఫెయిలయితే చచ్చినట్టు కడతాడు అని చెప్పాను.అన్నీ అచ్చు గుద్దినట్టు అలాగే జరిగాయి.బాబుకో మోదీకో బాజాలు మోగించే డప్పాసి తెలివి ఉన్నవాడు అలా చెప్పనూ లేడు, అవి నిజం కానూ కావు.అలాంటివాడు వాడికి జరిగితే బాగుండునని అనిపించినవాటినే జరుగుతాయని చెప్తాడు - నిజమయితే నా గొప్ప అంటాడు, అబద్ధమయితే పోల్ సర్వే వాళ్ళని తిడతాడు.

ఈ ఆంధ్రా బీజేపీ వాళ్ళకి రేపెప్పుడో అనూహ్యమయిన రీతిలో ఆటలాడి అధికారంలోకి వచ్చే దమ్ము ఉంటే మొన్నటి 2019 నాడు జగనుకి బదులు వాళ్ళే అధికారంలోకి వచ్చి ఉండొచ్చు కదా - ఎవడు అడ్డు పడ్డాడు! చంద్రబాబు రాష్ట్రద్రోహి అని పైకి రంకెలు వేశారు,మిత్రద్రోహి అని లోపల పళ్ళు కొరుక్కున్నారు.మోదీ వీళ్ళకి గొప్ప వక్తలా కనబడుతున్నాడు గానీ మాట్లాడేది హిందీ గాబట్టి ఉత్తరాది వాళ్ళకి కనీసం అర్ధం అవుతుంది గాబట్టి కొట్టే చప్పట్లు నిజం అనుకోవాలి, మరి ఆంధ్రాలో ఎంతమందికి హిందీ అర్ధం అవుతుంది?ఉత్తరాది నుంచి మోదీని దించనక్కరలేదు అంటే రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఎన్నికల ప్రచార సభల్లో గానీ కార్యక్రమాలకి సంబంధించిన సభల్లో గానీ ప్రజల్ని మెప్పించి పార్టీకి నాలుగు వోట్లు వేయించుకోగలిగిన వక్తలు ఎంతమంది ఉన్నారు?రామారావూ చంద్రబాబూ వీళ్ళకు కేటాయించిన సీట్లలోనే ఆన్నీ గెలవలేదు, చందబాబుని వోడించింది మేమే అని గప్పాలు కొట్టుకుంటున్న మొన్నటి ఎన్నికల్లో అవతార పురుషుడు మోదీ వచ్చి ఉద్ధరించిన ఘనకార్యం ఏమిటి?

నిన్న గాక మొన్న వోటు హక్కు వచ్చిన కుర్రాడికి కూడా కామన్ సెన్సు ఉంటే 2014 నుంచి 2019 వరకు జాతీయ ప్రాంతీయ భాజపా నాయకులు చేసిన పనులు ఆంధ్రాలో వోట్లు పెంచుకుని సీట్లు గెల్చుకుని అధికారంలోకి వచ్చేటందుకు దోహాద పడేలా ఉన్నాయని అనిపిస్తుందా!2014కి ముందు రాష్ట్రాన్ని విభజిస్తే రెండు చోట్లా పార్టీ నష్తపోతుందని దాదాపు ప్రతి కాంగ్రెస్ సీనియర్ నాయకుడూ చెవినిల్లు గట్టుకుని చెప్పినప్పటికీ పార్టీకి జరిగే నష్టాన్ని పట్టించుకోని సోనియా ప్రవర్తనలానే 2014 తర్వాత మోదీ ప్రవర్తన కూడా ఆంధ్రాకి అన్యాయం చేస్తే రెండు చోట్లా పార్టీ నష్టపోతుందని తెలియనట్టు ఉండటం ఎంత విచిత్రం!

రాష్ట్ర విభజన ఆంధ్రాకి అన్యాయం జరిగేలా పరమ భయానకమైన రీతిలో జరగటానికి కాంగ్రెసుతో పాటు భాజపా కూడా కారణం అని ఆంధ్ర వోటర్లు భావిస్తున్నారని తెలిసినప్పుడు ఆంధ్రలో అధికారం కోరుకునే ఒక రాజకీయ పార్టీ యొక్క అధినాయకత్వం ఇలా ప్రవర్తించడంలో ఉన్న హేతుబద్ధత ఏమిటి?భాజపా వాళ్ళని కెలికితే అక్కసు పట్టలేక ఏదైన క్లూ వొదులుతారేమోనని ధొలేరా కోసమూ సెంట్రల్ విస్టా కోసమూ మోదీ అమరావతిని చంపేస్తున్నాడని అంటున్నాను గానీ అందులో పూర్తి నిజం ఉందని నేనూ అనుకోవటం లేదు.అది మొత్తం కుట్రలో కొంత భాగమే,అసలు "వాళ్ళు" దేశం బయట ఉన్నారు.మోదీ,జగన్,కేసీయార్ సర్వస్వతంత్రులు కారు - వీళ్ళకన్న పైన ఒక బొమ్మలో ఇంకో బొమ్మని ఇరికించి “hidden picture” గురించి హింట్ ఇవ్వని శాడిస్టు ఆర్టిస్టుల “real picture” అయిన "ముసలామె బొమ్మని తల్లకిందులు చేస్తే కనిపించే పడుచామె బొమ్మ!"యే అసలైన కళావరు రాజు/రాణి!

తెదెపా అభిమానులూ సీనియర్ విశ్లేషకులూ కేసుల భయంతో జగన్ భాజపాకి కాళ్ళకి మొక్కి వాళ్ళ కోరిక మేరకే రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నాడని భ్రమ పడుతున్నారు.కానీ ఎన్నికలకి నుందు తెదెపా వాళ్ళు చూపించిన ఒక వీడియోలో విజయసాయి రెడ్డి "బీజేపీ వాళ్ళని కూడా మనకి సాయం చేస్తున్నట్టు అతిగా నమ్మొద్దు మనమే వాళ్ళని ఉపయోగించుకుని అధికారంలోకి వద్దాం, ఆ తర్వాత మన దమ్ము మనం చూపిద్దాం!" అనటమూ శివాజీ చూపించిన వీడియోలో జగన్మోహన్ రెడ్డి "ఇప్పుడు కష్టపడి గెలిస్తే ఒక్కొక్కడూ 400 కోట్లు సంపాదించుకునేలా చేస్తాను!" అనటమూ నిన్నటి రోజున అమరావతి సమైక్య సమితి సభకి భాజపా అగ్రనాయకులని గాక వూరూ పేరూ లేని నాయకులని పంపించడమూ తెల్లవారే సరికి A2 రెడ్డి గారు "మేము ఎవరిని సంప్రదించాలో వారిని సంప్రదించాకనే రాజధాని తరలింపు మొదలు పెట్టాము, కాబట్టి అది ఆగుతుందని ఎవరూ ఆశలు పెట్టుకోవద్దు!" అనటమూ కలిపి చూస్తే తెర వెనక జరుగుతున్న మాయా భేతాళం రివర్సులో నడుస్తున్నదని అనిపిస్తున్నది నాకు.

ఈ యేడాదిలో ఆంధ్రాలో ఢిల్లీలో జరిగిన అన్ని ముఖ్యమైన సన్నివేశాల్నీ ఒకసారి సింహావలోకనం చేసి చూస్తే జగన్ మోదీకి గానీ  తన మీదున్న కేసులకు గానీ భయపడటం లేదని తను ఏది తల్చుకుంటే అది కనీసం ప్రజలు వోట్లు వెయ్యరేమోననే అనుమానం కూడా లేకుండా చేసుకు పోతున్నట్టు అనిపించడం లేదూ!జగన్ ప్రజల్ని వేధించడం అటుంచి బీజేపీ పరువు ప్రతిష్ఠల్ని కూడా భంగం చేస్తున్నప్పటికీ బీజేపీ అతనికి సహాయం చెయ్యడం అనే వింతకి జగను వెనక ఉండి అమరావతీ విధ్వంసాన్నీ ఆంధ్రను అధః పాతాళానికి తొక్కెయ్యడానికి అతన్ని నడిపిస్తున్నది భాజపా కూడా నిగ్రహించలేని మహాశక్తి కారణం అనుకుంటే అప్పటివరకు కనిపించని hidden picture కనిపించడం లేదూ!

భాజపా అభిమానులు కంగారు పడతారు, నాకు పచ్చ పిచ్చిని అంటగడతారు - తెలుసు.తెదెపా అనుకూల విశ్లేషకుల వెర్షన్ కనీసం మోదీకి జగను మీద పైచేయి ఉన్నట్టు చెప్పడం వల్ల పుడుతున్న ఎగో సాటిస్ఫాక్షన్ ఇందులో ఉండదు.తెదెపా అనుకూల విశ్లేషకులు కూడా కంగారు పడతారు.చంద్రబాబుని హీరోని చేసి మోదీ, జగన్, కేసీయార్ అనే ముగ్గుర్నీ దుష్టత్రయం అని వర్ణిస్తే సెంటిమెంటు పండి జనం నమ్ముతారు గానీ కనిపించని ఒక మహాశక్తి అంటే దాన్ని బయటపెట్టాలి.నిరూపించగలిగితే కొత్త శత్రువుని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాలు పన్నడం అనే రిస్కూ నిరూపించలేకపోతే మూలిగే నక్క మీద తాటిపండులా నవ్వుల పాలు అయ్యే రిస్కూ ఉన్నాయి.కేసీయార్,మోదీ అనే ఇద్దరు బద్ధ శత్రువులు జగను అధికారంలోకి రావడానికి అంత ఐకమత్యాన్ని ప్రదర్శించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుని మాత్రం అధికారంలోకి రానివ్వకూడదని కాదూ!

జగనుకి పదవి లాభం,కేసీయారుకి కసి తీరిన సంతోషం - మరి మోదీ సంగతి యేంటి?మోదీ తనకి లాభం గూబల్లోకి వచ్చే పని చేస్తున్నాడూ అంటే తన పైన ఉన్న "వాళ్ళ" లాభం కోసం కాదూ!ఒక రాజకీయ విశ్లేషకుడి స్థానంలో తెలంగాణ ఉద్యమ కాలంలో కామెంట్లు వేస్తున్న నాటినుంచి పత్రికలూ టీవీలూ చూపిస్తున్న ప్రతి దృశ్యాన్నీ అసలు శత్రువు ఆనవాళ్ళ కోసం వెయ్యి కళ్ళతో చూస్తూనే ఉన్నాను.2014లో మోదీ చెంబుడు నీళ్ళూ కుండెడు మట్టీ ఇచ్చి పోయినప్పుడే అసలు శత్రువు భాజపా కూడా నిగ్రహించలేని మహాశక్తి అని అనుమానం వచ్చింది.ప్రణాళికా సంఘం ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందని పచ్చి అబద్ధం చెప్పినప్పుడు రూఢి అయిపోయింది.

కమ్యూనిష్టుల దగ్గిర్నుంచి వైకాపా వరకు చంద్రబాబుని పెట్టుబడి దారుల బానిస అనీ అయ్యమ్మ్మెఫ్ బంటు అనీ తిడుతుంటే నేను "వాళ్ళు" ఆంధ్రలో చంద్రబాబుని అధికారంలోకి రానివ్వటం లేదనటం చూసి చంద్రబాబుని ద్వేషించేవాళ్ళూ చంద్రబాబుని దేవుడని నమ్మేవాళ్ళూ నన్ను వెర్రివెధవ కింద జమకట్టి జోకులేసుకుంటారని తెలుసు.నేను ఇవ్వాళ రాష్ట్రంలో లేను, రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా నాకు వెంట్రుక ముక్క కూడా వూడదు.మీలో కూడా నాలా రాష్ట్రానికి బయట వుండి "రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా నాకు వెంట్రుక ముక్క కూడా వూడదు" అనుకోగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు.కానీ, రాష్ట్రం సరిహద్దుల లోపల "రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా నాకు వెంట్రుక ముక్క కూడా వూడదు" అని ఎంతమంది అనుకోగలరు? ఇవ్వాళ రాష్ట్రం సరిహద్దుల లోపల "రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా నాకు వెంట్రుక ముక్క కూడా వూడదు" అనుకునేవాళ్ళు అంత మంది ఉండటం చూస్తే భయం వెయ్యటం లేదూ మీకు!

"నాకు చాక్లెట్ ఇవ్వకపోతే అమ్మతో నువ్వు నన్ను కొట్టావని చెప్పి నిన్ను తన్నిస్తాను, ఏమనుకున్నావో!" అన్న లెవెల్లో "మా జోలికి వస్తే మీ పార్టీ ఎమ్మెల్యేల్ని లాగేసుకుంటాను!" అని కేసీయారుని బెదిరిస్తున్న బండి సంజయ గార్ని చూశాక కూడా భాజపా లోని ఏ నాయకుడికీ ప్రజలని మెప్పించి వాళ్ళ వోట్లతో అధికారంలోకి వచ్చే సదుద్దేశం లేదనీ ఆంధ్రలో కూడా బాబుని ప్రత్యేక హోదా ఇవ్వక ఏడిపించి అసమర్ధుడి/మిత్రద్రొహి/రాష్ట్రద్రోహి కింద బద్నాం చేసి ఓడగొట్టి జగన్ని గెలిపించటమూ బాబుని భూస్థాపితం చేస్తూ తనని నూరు తప్పులు చెయ్యనిచ్చి జగన్ని పడగొట్టి అన్ని రకాల నీతుల్నీ రీతుల్నీ ఉఛ్చనీచాల్నీ వొదిలేసి ప్రజలకి తాము తప్ప వేరే దిక్కు లేదనిపించే స్థితిలోకి అన్ని రంగాల్నీ భ్రష్టుపట్టించి ప్రజల మీద పెత్తనం చెయ్యటమే వాళ్ళ దురుద్దేశం అని నమ్మలేని రెండవ స్థాయిలోని భాజపా నాయకులూ క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలూ అభిమానులూ నేను చెప్పేది నమ్మరని తెలుసు గానీ రాష్ట్రం పట్ల నిజాయితీ ఉన్నవాళ్ళు నమ్ముతారు.వాళ్ళకోసం "కమ్యూనిష్టుల దగ్గిర్నుంచి వైకాపా వరకు చంద్రబాబుని పెట్టుబడి దారుల బానిస అనీ అయ్యమ్మ్మెఫ్ బంటు అనీ తిడుతుంటే నేను 'వాళ్ళు' ఆంధ్రలో చంద్రబాబుని అధికారంలోకి రానివ్వటం లేదనటం" గురించి ఉన్న సందేహాన్ని నివృత్తి చేస్తాను.

చంద్రబాబు కూడా మోదీ,జగన్,కేసీయార్ లాంటి రాజకీయ నాయకుడే - అతనొక్కడూ నిస్వార్ధపరుడు మిగిలిన అందరూ స్వార్ధపరులు అనే భ్రమ లేదు నాకు.అతనూ ఎన్నికల్లో గెలవటానికి డబ్బు మీదనే ఎక్కువ ఆధార పడతాడు,తక్కువ స్థాయిలోనే అయినప్పటికీ ఫ్యాక్సహ్నిస్టుల్ని చేరదీస్తాడు,తను నిప్పు అని చెప్పుకుంటూనే తన పార్టీలోని అవినీతి పరుల్ని చూసీ చూడనట్టు వొదిలేస్తాడు.కానీ తేడా తెలుసుకోవాలంటేనూ అసలు "వాళ్ళ"కి ఇతని మీద పగకి కారణం తెలుసుకోవాలంటేనూ పరిపాలనా శైలిని చూడాలి.అది నేను చెబితే భజంత్రీ అని అనడం ఖాయం కాబట్టి రాయలసీమకే చెందిన భాజపా అభిమాని అయిన ఒక రెడ్డి గారి జ్ఞాపకాల నుంచి ఎత్తి చూపిస్తాను:"1994ల నాడు NTR రెండో సారి అధికారంలోకి వచ్చేటప్పటికి రాజశేఖరరెడ్డి కొంచెం మెత్తబడిపోయాడు.నలభయిల్లోకి వచ్చి పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళని సెటిల్ చెయ్యటం, నిత్య అసమ్మతి గోల మాని ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు పెంచుకోవటం, పొలిటికల్ ఇమేజి కోసం ఫ్యాక్షనిజానికి దూరం కావడం - రాజశేఖరరెడ్డిలో ఒకలాంటి ట్రాన్సిషన్ నడుస్తుంది.అటు రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక రకమైన ట్రాన్సిషన్ నడుస్తుంది.IT మోజు సీమలోకి కూడా పాకింది.రాజశేఖరరెడ్డికి తెలిసిన చాలామంది లాయలిస్టులు తమ పిల్లల్ని IT jobs వైపుకి తరుముతున్నారు.ఒక పెళ్ళికి కడప వెళ్ళి నేనూ local factionist politicians బదులు NRI Reddy boys హీరో వర్షిప్ తెచ్చుకుంటూ అదర గొట్టెయ్యటం చూశాను.చంద్రబాబు రామారావును పడగొట్టి ముఖ్యమంత్రి కావడంతో సినిమా నటుడిగా NTR మీద ఉన్న అభిమానంతోనూ చంద్రబాబు పాతుకు పోతే తను ఇక జన్మలో ముఖ్యమంత్రి కావడం కల్ల అనే భయంతోనూ చురుకు తెచ్చుకున్నాడు." అనేది రాజశేఖరరెడ్డి గారిని చాలా దగ్గర్నుంచి చూసిన ఒక Reddy BJP fan చెప్పిన కధ.

అప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయి ఉండకపోతే అంతమైపోవాల్సిన ఫ్యాక్షనిజం చంద్రబాబు వోడిపోవడం వల్ల పునరుద్ధరించబడింది, అవునా?ఇప్పుడు చంద్రబాబు ఓడిపోయి ఉండకపోతే కాలు మీద కాలేసుకుని కూర్చోవాల్సిన 25,000 మంది అమరావతి జిల్లాలోని రైతులు చంద్రబాబు వోడిపోవడం వల్ల రోడ్డున పడి ఏడుస్తున్నారు, అవునా?మిగిలిన వాళ్ళు, అంటే మోదీ,జగన్, కేసీయార్ తదితరులు చేతకాకనో శ్రద్ధ లేకనో ప్రజలకి ఎంతో కొంత అభివృద్ధిని చూపించి దోచుకోవడం కన్న కబుర్లతో సరిపెట్టేద్దామని చూస్తే చంద్రబాబు ఎంతో కొంత అభివృద్ధిని ప్రజలకి చూపించాలని అనుకుంటాడు.చంద్రబాబు పరిపాలన ఎక్కువ కాలం సాగితే ఉపాధి కల్పన పెరిగి ఒకనాటికి ప్రజలు నిలవలోకి వచ్చి రాష్ట్రం కూడా తన అప్పుల్ని తీర్చేసుకుని కాలరెత్తుకు నిలబడడం వల్ల బ్యాంకింగ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది!

2050 నాటికి ప్రపంచం మొత్తాన్ని తమ పీట కిందకి తెచ్చేసుకోవాలనుకుంటున్న “వాళ్ళు” ఆంధ్ర రాష్ట్రం ఒక్కటీ తమ దగ్గిర అప్పు చెయ్యాల్సిన అవసరం లేని ఒక ద్వీపకల్పంలా నిలబడటాన్ని ఎట్లా సహిస్తారు?బహుశః మోదీ,కేసీయార్ తదితరులు ఇది తెలుసుకుని నిజమైన అభివృద్ధిని చెయ్యకపోవటం వల్లనే మళ్ళీ మళ్ళీ గెలుస్తున్నారు కాబోలు! నలభయ్యేళ్ళ అనుభవం అంటారు గానీ చంద్రబాబు ఉన్నచోట నేనుంటే వీళ్ళనీ "వాళ్ళ"నీ కూడా గుడుగుడుగుంచం ఆడించగలిగిన సమర్ధత ఉంది నాకు.మచ్చుకి మొన్నటి GHMC ఎన్నికల గురించి ఇతర విశ్లేషకులు ఎవరూ చెప్పని రెండు టుమ్రీలు చెప్పనా?భాజపా ఆంధ్రలో ఈ తొండాటలు ఆడకపోయింటే కార్పొరేషన్ భాజపాకే దక్కి వుండేది.ఎందుకంటే, తెలంగాణలోనూ హైదరాబాదులోనూ సెటిలర్లు అనబడే ఆంధ్ర మూలాలు వుండి ఆంధ్రప్రాంత వాసుల పట్ల ఆప్యాయతలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు.వాళ్ళలోనూ ఇతర తెలంగాణ వాసుల్లోనూ తెదెపా అభిమానులు చాలామంది ఉన్నారు.భాజపా ఆంధ్రలో అమరావతి విధ్వంసాన్ని ఆపితే వాళ్ళు బీజేపీకి వేసి ఉండేవాళ్ళు.ఎన్నికల గెలుపోటముల్ని నిర్ణయించటానికి నాలుగు శాతం వోట్లు చాలు.ఆ నాలుగు శాతం వోట్లలో సెటిలర్లు ఇరుక్కున్నారు.అందువల్లనే, భాజపాకి కార్పొరేషన్ దూరమైంది - మోరేల్ బూస్టర్ మాత్రం దక్కింది!అదే చంద్రబాబు బలమైన క్యాండిడేట్లని నిలబెట్టి కొంచెం హడావిడి చేసి ఉంటే బీజేపీ వెనక్కి తగ్గి కేసీయారు మీద దాడి తగ్గించి అతనికి సహాయం చేసి ఉండేది,అవునా కాదా?

భాజపా నాయకులు తమ పార్టీకి ప్రజల్లో అభిమానం పెంచుకునే పనులు మానేసి తమ పార్టీకి నష్టం కలిగించే పన్లు చేస్తున్నారంటే అది మరొకరికి లాభం చెయ్యడం కోసం కాదూ!చల్ల కొచ్చి ముంత దాచడం దేనికి ఆ ఒకరే నేను "వాళ్ళు" అని అంటున్న మన అసలైన శత్రువులు.మతపరమైన అనుకూలత వల్ల భాజపా నాయకులు నిలువరించలేని మహాశక్తితో వ్యక్తిగత పరిచయాలు కూడా A1కు ఉన్నాయనేది A2 రెడ్డి గారు "మేము ఎవరిని సంప్రదించాలో వారిని సంప్రదించాకనే రాజధాని తరలింపు మొదలు పెట్టాము, కాబట్టి అది ఆగుతుందని ఎవరూ ఆశలు పెట్టుకోవద్దు!" అన్న వెంఠనే  ఠంగుమని గంట కొట్టినట్టు తెలిసింది నాకు!

CRDA నిబంధనలను బట్టి చూస్తే 151/175 కాదు, 175/175 స్థానాలు వచ్చినప్పటికీ జగన్ అమరావతిని కదిలించడం రాజ్యాంగ బద్ధమైన ప్రయత్నాలతో జరిగే పని కాదు.ఒక వ్యక్తికి నోటు రాసి అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు తీర్చకుండా నోటును రద్దు చెయ్యడం ఎంత అసాధ్యమో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు గత ప్రభుత్వంతో బిజినెస్ పార్టనర్ స్థాయిలో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఏకపక్షం రద్దు చెయ్యడం అంతటి అసాధ్యం!అది అయిదేళ్ళలోనే 46,000 కోట్లు సంపాదించలిగిన పారిశ్రామిక వేత్త జగన్మోహాన్ రెడ్డికి తెలియదా?అన్ని ప్రముఖ కంపెనీలకి ఆర్ధిక సలహాదారు పనిచేసిన చార్తర్డ్ అక్కవుంటెంటు విజయ సాయి రెడ్డికి వ్యాపార ఒప్పందాల చట్టబద్ధత గురించి తెలియదా! తెలుసు, అమరావతి విధ్వంసం అనేది ఒక డైవర్షన్ ట్రిక్, అసలు యుద్ధం ఎక్కడ చెయ్యాలో తెలియక శత్రువుని తికమక పెట్టడం కోసం తెరిచిన రెండవ రంగమే అమరావతి!వాళ్ళ వ్యూహం పని చేస్తున్నది, "వాళ్ళ"ను గెలవగలిగిన బలమైన యోధులు పిచ్చివాళ్ళలా నీడలతో యుద్ధం చేస్తున్నారు.

"వాళ్ళు" ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూపిస్తున్న దృశ్యం కొత్తది కాదు, "Supreme excellence in warfare lies in the destruction of your enemy's will to resist in advance of perceptible hostilities." అన్న రాచరికాల కాలం నాటి యుద్ధనీతి.వైకాపా నాయకులూ పోలీసులూ ఇంతవరకు కమ్మ కులస్థులలో ఏ ఒక్కరినీ దెబ్బతియ్యలేదు."వాళ్ళు" కొడుతున్నది వెనకబడిన మరియు కింది కులాల వాళ్ళనే. చంద్రబాబుతో సహా తెదెపా అభిమానులు అది అనుకోకుండా జరుగుతున్నదనో జగన్ పైవాళ్ళని టచ్ చెయ్యడానికి భయపడుతున్నాడనో అనుకుంటున్నారు గానీ అది చాలా ప్రమాదకరమైన వ్యూహం.ఇప్పుడు జరుగుతున్న నిరంతర దాడుల వల్ల బీసీ నాయకులూ వోటర్లూ తెదెపాలో ఉంటే రక్షణ ఉండదని యుశ్రారై వైపుకు జరుగుతారు.ఒకవేళ బీసీ నాయకుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మిన్నకుండిపోయి కమ్మ కులస్థుల్ని టచ్ చేసినప్పుడు ప్రతీకార దాడులు చేస్తే అప్పుడు తెదెపా కమ్మకులస్థుల మీద దాడి జరిగితే తప్ప ఇతర కులస్థుల మీద దాడి జరిగితే ప్రతీకారం తీర్చుకోదు అనే ముద్ర వేస్తారు - దాంతో అసలే తుమ్మితే వూడిపోయేట్టు ఉన్న బీసీ కులాల సపోర్టు జాటర్ ఢమాల్ అయిపోద్ది!

రహస్య కుట్రల వల్ల జరిగే విధ్వంసం నుంచి ప్రజల్ని రక్షించాలనుకున్న ప్రతి ఒక్కడూ కుట్ర గురించి తెలుసుకుని ప్రజలకి నిజాలు చెప్పడం తప్ప మరో మార్గం లేదు.ప్రజలు నిజాలు తెలుసుకుని స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధపడితే ఎన్నికలలో అక్రమాలు చెయ్యడం కూడా సాధ్యపడదు.

మనకు శత్రువు భయపడినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు - విజయోస్తు!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...