Saturday, 12 December 2020

విశ్వతోభద్ర కార్యకర్తలకు మూడవ పాఠం

కళ్ళముందు కనిపిస్తున్న శత్రువుని ఎందుకు గుర్తించడం లేదు?

బూచాడి నుంచి పరిణామం చెందిన విలను గార్ని చూసి వినోదించడం తర్వాత ఆనాటికీ ఈనాటికీ పిల్లలనే కాదు పెద్దలనీ ఆకర్షిస్తున్న మరో వినోదం పదచిత్రాలూ పజిల్సూ అధిక్షేపమూ. వీటన్నిటిలో ఒక బొమ్మలో ఇంకో బొమ్మని ఇరికించి కనుక్కోమని చాలెంజి చెయ్యటం.చూడ్డానికి చెట్లూ, ఆకులూ, పువ్వులూ,కొండలూ ఉంటాయి.కానీ, కింద ముగ్గురు అందమైన అమ్మాయిలు దాక్కుని ఉన్నారని రెచ్చగొడతాడు ఆర్టిస్టు.ఆర్టిస్టు చాకచక్యాన్ని బట్టీ రీడరు ఓపీకని బట్టీ “hidden picture”  కనిపించడంలో తేడాలు ఉంటాయి, కదూ!

కొందరు ఆర్టిస్టులు " ముసలామె బొమ్మని తల్లకిందులు చేస్తే ఒక పడుచామె బొమ్మ కనిపిస్తుంది!" అని హింట్ ఇస్తారు.అలా హింట్ ఇవ్వనప్పుడు అసలు మనకి తల్లకిందులు చెయ్యాలని ఎట్లా తెలుస్తుంది చెప్పండి?అలాగే, ప్రస్తుతం మన చుట్టు ఉన్న శత్రువులు అలాగే హింట్ ఇవ్వనప్పుడు అసలు వాళ్ళు మోసం చేస్తున్నారని ఎట్లా తెలుస్తుంది చెప్పండి?భలే ఉందీ మెలిక మనని మోసం చేసి లాభం పొందాలనుకున్న శత్రువు మనకి హింట్స్ ఎట్లా ఇస్తాడు చెప్పండి!

రోజూ వార్తా పత్రికల్ని పైనుంచి కిందకి ఇడ్లీ కాఫీలతో పాటు చప్పరిస్తూ అన్ని న్యూస్ చానళ్ళనీ మోర్నింగ్ టైం లంచితోనూ మిడ్డే లైట్ మీల్సుతోనూ నైట్ టైం హెవీ సప్పరుతోనూ నమిలి మింగేస్తూ తిన్నది అరక్క ఆపసోపాలు పడుతూ అజీర్తి దోషానికి పధ్యంలాంటి పేరున్న పొలిటికల్ ఎనలిస్టుల లెక్చర్లని గటగట తాగేస్తూ తమ చుట్టు జరుగుతున్న జగన్నాటకం  అంతా తెలిసిపోయిందని బ్రేవున త్రేన్చి సంతృప్తి పడిపోతున్న గాగా జీకే రావులు కొందరే ఉంటారు, వీటిలో ఒక్క చిన్న పనికీ తీరిక లేని గోగో బిజీరావులు ఎక్కువమంది ఉంటారు - తీరిక ఉన్నప్పటికీ ఇలాంటి వాటిని తెలుసుకోవడం హత్య, మానభంగం,దోపిడీ లాంటి నేరాల కింద భావించి అసహ్యించుకునే ఇగో లేజీరావులు కూడా ఉంటారు!వీళ్ళలో మిమ్మల్ని చేర్చలేదు.చేరిస్తే సుత్తి వేసే పని తప్పేది నాకు:-)

మీరే కాదు, వారూ వీరూ అని లేకఇక్కడ ఏదో మోసం జరుగుతుంది!” అని తెలిసి కూడా ప్రహేళికా రచయితల మాయాజాలం వల్ల  “real picture” కనపడకనూ కనపడీ కనపడినట్టుగానూ ఉండటంతో తొందరపడి రియాక్ట్ అయితే తర్వాత వైలెంట్ అవుతుందనే అహమహమికతోనూ ఇంపాక్ట్ చూపించాల్సిన చోట కూదా సైలెంట్ అయిపోతున్నవాళ్ళు లక్షల్లోనూ కోట్లలోనూ ఉన్నారు.

అలా సందేహపడటానికి కారణం ఏమిటో తెలుసా!మనకు తెలియకుండానే నడుస్తున్న చరిత్రలో మనం ఇన్వాల్వ్ అయి వున్నామనీ మన రియాక్షన్ వైలెంట్ అయినప్పటికీ సైలెంట్ అయినప్పటికీ అది ఇవ్వేళ్టి నుంచి రేపటికి నడుస్తున్న చరిత్ర యొక్క గమనాన్ని ఏదోలా ప్రభావితం చేస్తూనే ఉందనీ తెలియకపోవడం వల్ల మన శత్రువులు చరిత్రను తమకు అనుకూలమైన దిశలోకి నడుపుకుంటున్నారు.

స్వతంత్రం వచ్చాక ఎన్నికల వ్యవస్థను అలవాటు చేశాక  "దారిద్య్ర రేఖను పాతాళానికి పోకుండా ఆపుతా"మని ఒకడూ "ప్రజల సొమ్మునుంచి చిల్లిగవ్వ కూడా వృధా అవకుండా ప్రభుత్వ దుబారాను అదుపు చేస్తా"మని ఒకడూ "ద్రవ్యోల్బణాన్ని కనీసపు స్థాయికి దించి అక్కడే కూర్చోబెట్టేస్తా"మని ఒకడూ "నేరస్థుల్ని ఎక్కడుంచాలో అక్కడుంచటంలో అహర్నిశలూ సతమతమైపోతా"మని ఒకడూ చెప్తుంటే నమ్మి అంతమంది ముఖ్యమంత్రుల్నీ ప్రధానమంత్రుల్నీ ఒకరి తర్వాత ఒకర్ని బర్బీ బొమ్మకి బట్టలు మర్చినట్టు మార్చితే ఏం జరుగుతున్నది?

NCP,BJP,TDP,TRS.YCP,XXP - ఎవడైతేనేం ఒక్కొక్కడూ ఒక్కో నరహంతకుడు అన్నట్టు ప్రచారం అప్పుడు చేసిన వాగ్దానాల్ని గెల్చిన మొదటి రోజునుంచే తుంగలో తొక్కి షరా మామూలే అన్నట్టు ఇదివరకటి "వాళ్ళు" చేసిన దోపిడీని మక్కీకి మక్కీ దించేస్తున్నారు - ప్రస్తుతం జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో పనిచేస్తున్న ఆంధ్ర రాష్ట్రపు ప్రభుత్వాధినేతల ధోరణి చూస్తుంటే "మాకు ప్రజభిమానం వద్దు!మరుసటి ఎన్నికల్లో ప్రజలు మాకు వోట్లు వెయ్యకపోయినా ఫర్వాలేదు!రాష్ట్రాన్ని స్మశానం కింద మార్చటమే మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రం మొత్తాన్ని ఎడారిగానూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అగ్నిగుండంగానూ మార్చేవరకు మమ్మల్ని ఎవరూ ఆపలేరు!" అని శపధం పట్టినట్టు కనిపించడం లేదూ?

మనకు తెలియకుండానే నడుస్తున్న చరిత్రలో మనం ఇన్వాల్వ్ అయి వున్నామనీ మన రియాక్షన్ వైలెంట్ అయినప్పటికీ సైలెంట్ అయినప్పటికీ అది ఇవ్వేళ్టి నుంచి రేపటికి నడుస్తున్న చరిత్ర యొక్క గమనాన్ని ఏదోలా ప్రభావితం చేస్తూనే ఉందనీ మనకు తెలియనప్ప్పటికీ చరిత్ర మాత్రం వలపక్షం లేని అమాయకత్వంతో తనను స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్న "వాళ్ళ"కి అనంత కోటి వైభవాలనీ ఉపయోగించుకోలేని మనకి శత కోటి దరిద్రాలనీ ఇస్తూనే ఉంది!

"వాళ్ళు" ఒక బొమ్మలో ఇంకో బొమ్మని ఇరికించి "ఈ ముసలామె బొమ్మని తల్లకిందులు చేస్తే ఒక పడుచామె బొమ్మ కనిపిస్తుంది!" అని హింట్ ఇవ్వని శాడిస్టు ఆర్టిస్టుల మాదిరి మనల్ని దోచుకోవడం కోసమూ ఆ దోపిడీని శాశ్వతం చేసుకోవడం కోసమూ నిన్నటి రోజున "వాళ్ళు" చేసిన దోపిడీని హిస్టరీ పేరుతోనూ ఇప్పటి రోజున "వాళ్ళు" చేస్తున్న దోపిడీని మీడియా పేరుతోనూ మనం ఏది చూస్తే "వాళ్ళ"ని ప్రేమిస్తూ "వాళ్ళ"ని రక్షకులని నమ్ముతామో అది మాత్రమే మనకి చూపిస్తారు.

ఇప్పుడు ఢిల్లీలో మోదీ కడుతున్నCentral Vista project లేఅవుట్ అప్పుడు చంద్రబాబు కట్టాలనుకున్న అమరావతిలాగే ఉంది.ఎక్కడో తను కట్టలేని ధొలెరాని మించిపోతుందని ఈర్ష్యపడి ఇక్కడ బాబు కట్టబోతున్న అమరావతిని చంపేసి దాన్ని కాపీ కొట్టిన ఉత్తరాది మోదీని చూసి అంతటి సమర్ధతకి ఉర్రూతలూగి  వెర్రెత్తిపోయే మేధావులు అంధ్రలో ఎంతమంది వున్నారో!అదే లేఅవుట్ ఖాయం అయితే అది ఆంధ్రా వోటర్ల ముఖం మీద వుమ్మేసి కమ్చీతో కొట్టినట్టే - సిగ్గు లేని మందకి శాస్తి జరగాల్సిందే.

ఇవన్నీ ఆయా నాయకులు అలవాటుగానో పొరపాటుగానో అలవాటులో పొరపాటులానో హఠాత్తుగా వచ్చిపడిన ఉద్రేకంలోనో చెయ్యడం లేదు.ప్రతి నాయకుడికీ తనదైన లక్ష్యమూ ప్రణాళికా ఉంటుంది.నేడు ఏయే సంఘటనలు జరుఫుతున్నాయో ఆయా సంఘటల్ని ఆయా సమయాలకి ఆయా శైలులలో జరపాలనే ఆదేశాలు "వాళ్ళు" ఇస్తారు. మాన్ కళ్ళముందు అత్యనత సమర్ధుల కింద భ్రమింపజేస్తున్న అధినేతలు సర్వస్వతంత్రులు కారు - వీళ్ళకన్న పైన ఒక బొమ్మలో ఇంకో బొమ్మని ఇరికించి “hidden picture” గురించి హింట్ ఇవ్వని శాడిస్టు ఆర్టిస్టుల “real picture” అయిన "ముసలామె బొమ్మని తల్లకిందులు చేస్తే కనిపించే పడుచామె బొమ్మ!"యే అసలైన కళావరు రాణి!బాబు కట్టబోతున్న అమరావతిని చంపేసి దాన్ని కాపీ కొట్టిన ఉత్తరాది మోదీ ఒక్కదే కాదు,తను కట్టాలనుకున్న అమరావతిని చంపొద్దని జగన్ ముందు కళ్ళనీళ్ళ పర్యంతం అయిన చంద్రబాబు కూడా  సర్వస్వతంత్రుడు కాడు.

నిజమైన చరిత్ర అమాయకమైనది ఎప్పటికీ కాదు.అది తనను నడిపిస్తున్న వ్యక్తుల సంకల్పం నుంచి పుట్టడం వల్ల  వ్యక్తుల సంస్కృతినే అది ప్రతిబింబిస్తుంది.చంద్రబాబుకి తను ప్లాన్ చేసిన అమరావతిని కట్టగలిగే సమర్ధత ఉంది, అయితే చరిత్రను శాసించే సమర్ధత అతనికి లేదు.కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎన్నికల్లో గెలవడానికి అభివృద్ధికి సంబంధించిన వాగ్దానాలు గెలుపుకి కారణం అవుతూ ఉండేవి.అక్కడక్కడ డబ్బులు పంచిపెట్టి ఓట్లు వేయించుకోవడం,దొంగవోట్లు వెయ్యడం లాంటివి కొంతమేరకు కొన్ని నియోజకవర్గాల ఫలితాలను తారుమారు చేసేవి గానీ అంతిమ ఫలితం గెలిచిన వాళ్ళది న్యాయమైన గెలుపే అనిపించేది.

కానీ గత కొన్ని దశాబ్దాల నుంచి అభివృద్ధికి సంబందించిన వాగ్దానాలు తక్కువై కులమతప్రాంతమతతత్వాలను రెచ్చగొట్టే ప్రసంగాలు గెలుపోటముల్ని శాసిస్తున్నాయి.నిజానికి ప్రజలు వీటికి ఉద్రేకపడి ఓట్లు వేస్తున్నారని చెప్పడానికి బలమైన సాక్ష్యం లేదు.చాటున జరిగే అక్రమ పద్ధతుల వల్ల సాధ్యపడుతున్న గెలుపును నిజమైన గెలుపు అని భ్రమింపజెయ్యడానికే ఆయా నాయకులు చేస్తున్న హడావిడి సీనియర్ అనలిస్టులని కూడా మోసం చేస్తున్నదని  అనిపిస్తున్నది నాకు.కేవలం నవరత్నాలకు ఆశపడి రాజకీయానుభవం పుష్కలంగా ఉండి అయిదేళ్ళ క్రితం ప్రతికక్షులు గెలిచే చాన్సు లేదనుకున్నప్పుడు కూడా గెలిచి అయిదేళ్ళ పాటు విభజన సమస్యలను అధిగమించి కేంద్రం నుంచి రావలసిన ప్రత్యేక హోదా రాకపోయినప్పటికీ మిగులుతో విడిపోయిన తెలంగాణను మించిపోయి ఆంధ్ర రాష్ట్రం యొక్క ఎదుగుదల సూచి కలవడం వల్లనే మొత్తం దేశపు ఎదుగుదల సూచిని రెండంకెలను దాటించిన చంద్రబాబుని నమ్మలేని వోటర్లు అసలు రకమైన ఘనతలూ లేని జగన్ని నమ్మేసి 151/175 మెజారిటీ వచ్చేలా వోట్లు వేశారంటే ఎలా నమ్మాలి?

సీక్రెట్ బ్యాలెట్ అనేది కనిపెట్టింది ఇలాంటి వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకు రావడం కోసమే అయినప్పుడు చంద్రబాబు అభివృద్ధిని గురించే చెప్తాను, ఉద్రేకాలు రెచ్చగొట్టను అని మడిగట్టుకుని కూర్చుంటే ఎట్లా గెలుస్తాడు?నా లెక్క ప్రకారం మొన్నటి హైదరాబాదు GHMC ఎన్నికల్లో తెదెపా బలమైన అభ్యర్ధుల్ని నిలబెట్టి చంద్రబాబు వెళ్ళు కొంత హడావిడి చేసి ఉంటే భాజపా దూకుడు తగ్గించి వెనక్కి తగ్గి కేసీయారుకు సాయం చేసి ఉండేది - భాజపాకి కేసీయారు జగన్ల కన్న చంద్రబాబే ప్రధాన శత్రువు!

మనల్ని నష్టపెట్టి లాభపడుతున్న "వాళ్ళ"కి తమ శత్రువు ఎవరో ఫుల్ క్లారిటీ ఉంది.అందుకే, ఆంధ్రలో జగన్ ప్రజలకి ఎంత దరిద్రమైన పరిపాలన అందిస్తున్నప్పటికీ అతన్ని ఆపడం లేదు.ఒకవేళ ఖర్మకాలి అతన్ని విమర్శించాల్సి వస్తే నాలుగు తిట్లు తిట్టాక ఎలాగోలా చంద్రబాబు పేరును లాక్కొచ్చి "రాఘవా స్వస్తి రావణా స్వస్తి!" అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.వాళ్ళు మటుకు ఏం చేస్తారు పాపం - సాక్షాత్తూ జగన్ గారితోనే కాంట్రాక్టులూ డీలింగ్సూ ఉన్న ఫుల్ టైం బిజెనెస్సు మ్యాన్లూ పార్ట్ టైం పొలిటీషియన్లూ అయి చచ్చారు,వాళ్ళ బిజెనెస్సుల్ని నష్టపెట్టుకోలేక అలా ఏడుస్తున్నారు!

మన నష్టం మీద "వాళ్ళు" లాభం తీస్తున్నప్పుడు మనం లాభపడాలంటే వాళ్ళని నష్టపెట్టాలి.అది చెయ్యాలంటే మనకి కావలసినది ఏమిటి అక్కర్లేనిది ఏమిటి అనే క్లారిటీ మనకు ఉండాలి.దొంగవోట్లు వెయ్యడం నుంచి ఈవీయం ట్యాంపరింగ్ వరకు జరిగే తప్పుడు పద్ధతులు అన్నీ ప్రజలు గందరగోళానికి గురయ్యారని నమ్మకం కలిగిస్తూ వోటింగ్ ధోరణిలో అయోమయం ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. ప్రజలకు ఎవరికి వోటు వెయ్యాలనే విషయంలో స్పష్టత ఉన్నప్పుడు వాళ్ళు అవేవీ చెయ్యరు, చేసినా ఫలితం ఉండదు - నిజం."వాళ్ళు" మోసం చేస్తున్నారని తెలిసి కూడా "వాళ్ళ"కే ఎందుకు వోటు వేస్తున్నారనే ప్రశ్న వేసినప్పుడు మంచి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అనే జవాబు వస్తున్నది. జవాబు చెప్పేవాళ్ళలో కొంత జిత్తులమారితనం కనిపిస్తుంది నాకు - ఎందుకంటే, ఆమ్నాయం అనేది మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాల్సిన వేదాలకి పేరు.ప్రత్యామ్నాయం అంటే ఇప్పటి అలవాటుకి భిన్నమైనది.అలవాటు చొప్పున ఇప్పటి చెడ్డ వాళ్ళకే వోటు వేస్తూ ఉంటే వీళ్ళు కోరుకునే మంచి ప్రత్యామ్నాయం ఎలా అనుభవంలోకి వస్తుంది?

మంచి ప్రత్యామ్నాయం కావాలంటే నిర్దాక్షిణ్యంగా చెడ్డ ప్రత్యామ్నాయాలని తిరస్కరించాలి.NCP, BJP, TDP, TRS. YCP, XXP - ఎవడైతేనేం ఒక్కొక్కడూ ఒక్కో నరహంతకుడు అన్నట్టు ఉన్న జగన్,,కేసీయార్, చంద్రబాబు, మోదీల్ని చూసి వెర్రెక్కిపోవడం ఆపి ఆయా నియోజకవర్గాలలో వాళ్ళు పోటీకి నిలబెట్టిన అభ్యర్ధుల్ని మాత్రమే పట్టించుకుని వోటు వెయ్యడం,అభ్యర్ధుల్లో ఒక్కడూ మీకు నచ్చకపోతే NOTaకి వోటు వెయ్యడం అలవాటు చేసుకుంటే మనకి రావలసిన లాభం మనకి చచ్చినట్టు వస్తుంది. ట్రిక్కుని ఆంధ్రా వోటర్లు ఫిబ్రవరి లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రయత్నించి చూస్తే ఒక్క ఎన్నికతో ఆంధ్రా రాజకీయమే కాదు దేశపు రాజకీయం కూడా అంచనాలను మించి ప్రజల్ని సంతోషపెడుతుంది - ఒట్టు, అమ్మతోడు,నమ్మకపోతే అడ్డంగా నరికేస్తా:-)

కనిపిస్తున్న శత్రువుమీద కోపం రానివాళ్ళు యుద్ధంలో ఎట్లా గెలుస్తారు?

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...