Tuesday, 2 February 2021

ఉత్తరాది లాబీ దక్షిణాది రాష్ట్రాల్ని దోచుకోవడం కొత్త కధ కాదు - దక్షిణాది వాళ్ళకి చురుకు ఎప్పుడు పుడుతుందన్నదే ప్రశ్న!

 ఉత్తరాది లాబీ దక్షిణాది రాష్ట్రాల్ని దోచుకోవడం కొత్త కధ కాదు.

మొన్నటి నిర్మలమ్మ బడ్జెట్టును చూసి చాలామందికి ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళని దోచెయ్యడం కనిపించింది.కొందరు భాజపా అభిమానులైన సీనియర్ విశ్లేషకులు తమ ముఖపుస్తకపు గోడ మీద  నార్త్ లాబీ ఉందంటున్న వాళ్లని వెక్కిరిస్తూ ఒక పోష్టు వేశారు.అయితే, నార్త్ లాబీ ఉనద్నీ అది కొత్తది కాదనీ బల్లగుద్ది చెప్తున్నాను నేను.

1980ల నాడు Ashish Bose (12 July 1930 – 7 April 2014)  అనే ప్రముఖ ఆర్ధిక విశ్లేషకుడు Bihar, Madhya Pradesh, Rajasthan, Uttar Pradesh రాష్త్రాల మొదటి అక్షరాల్ని కలిపి BIMARU STATES అనే పదాన్ని సృష్టించాడు.అది bīmār (बीमार) అనే హిందీ పదానికి దగ్గిర కావడంతో అవి రెండూ పర్యాయపదాలు అయిపోయాయి.ఆయన BIMARU STATESకి ఆ పేరు పెట్టడానికి కూడా అవి sick states కావడమే కారణం.

దక్షిణాదిలోని ఏ రాష్ట్రమూ ఆ లిస్టులో లేదు.విచిత్రం ఏమిటంటే, స్వతంత్రం రావడానికి ముందునుంచీ సంపద సృష్టిలో ఉత్తరాది కన్న దక్షిణాది అద్భుతమైన ప్రజ్ఞ చూపించేది.అసలు వెనకటి కాలపు రాజ్యాల విషయం తీసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు బాబరు సమకాలికుడే - సొంత రాజ్యం నుంచి మేనమామలతో గెంటించుకుని కేవలం 12,000 మంది సైనికులతో వచ్చిన బాబరు లక్షమంది ఉన్న ఢిల్లీ సుల్తాను సైన్యాన్ని గెల్చిన దుస్థితి అక్కడ వుంటే తుపాకిమందుతో సహా అన్ని ఆయుధాల్నీ సమకూర్చుకుని బాబరు పేరాశ కొద్దీ దక్షిణాదికి వచ్చుంటే చచ్చుండేవాడు అనిపించేటంత వైభవం ఇక్కడుంది.బ్రిటిషువాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిన తదాది నిన్నమొన్నటి నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం Uttarakhand, Rajasthan, Madhya Pradesh and Uttar Pradesh ఇప్పటికీ worst-performing states అనే దుస్థితిలోనే ఉన్నాయి.ఇది విచిత్రమే కాదు, పరమ దారుణం కూడా!

ఎందుకంటే, నెహ్రూ కాలం నుంచి మోదీ కాలం వరకు దేశ ప్రజల నుంచి పన్నుల వల్ల కేంద్రానికి చేరుతున్న ఆదాయం తిరిగి ప్రజల వద్దకు రావాడంలో ఆరు దశలు నడుస్తున్నాయి.1).పన్నుల వ్యవస్థ చాలా గందర్గోళంగా ఉంది కాబట్టి దాన్ని గురించి ఎక్కువ చెప్పను.కేంద్రం విధంచే ట్యాక్స్, రాష్ట్రాలు విధించే ట్యాక్స్ అనే రెండు క్యాటగిరీల పన్నుల్నీ మొదట రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే వసూలు చేస్తుంది.రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చాలావర్కు జిల్లా కలక్టర్ అధ్వర్యంలో పని చేస్తుంది.ఏ జిల్లా కలక్టర్ ఆ జిల్లానుంచి వసూలయిన పన్ను ఆదాయం మొత్తాన్ని రాష్త్ర ప్రభుత్వానికి అందిస్తారు.వీళ్ళు సంచుల్లోనూ బస్తాల్లోనూ తీసుకెళ్ళి ఇవ్వరు,కరెన్సీ కట్టల్ని బ్యాంకు అక్కవుంట్లలో డిపాజిట్ చేసి లెక్కలు పంపిస్తారు.2).రాష్ట్ర ప్రభుత్వం ఆ లెక్కల్ని కలక్ట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం వారి అక్కవుంట్లలోకి డిపాజిట్ చెస్తుంది.3).అలా పోగుపడిన మొత్తాన్ని దేశం మొత్తం బాధ్యత వహించాల్సిన మిలిటరీ, టెలీ కమ్యూనికేషన్ వంటి రంగాలకు కామన్ ఫండ్ కింద పక్కన పెట్టేస్తుంది.4).అప్పుడు మిగిలిన ఆదాయాన్ని మదింపు చేసి తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తుంది. ఇది, ఆయా రాష్ట్రాలకు తమ న్యాయమైన వాటా కింద నిర్నిబంధం ఇచ్చే నిధులు, రైలు మార్గాల కేటాయింపు అవంటి సౌకర్యాలు,కొన్ని ప్రభుతవ్కార్యక్రామాల్కు ఇచ్చే సబ్సిడీలూ మినహాయింపులూ, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి తను తీసుకున్న అప్పు నుంచి కొంత అప్పుగానూ రకరకాల కేటగిరీల్లో ఉంటంది - ఈ కేటగిరీల ఏర్పాటులోనే అసలైన కుట్ర దాగి ఉంది.5).మళ్ళీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా కలక్టర్లకు పంపిస్తాయి.6).చివరాఖర్న ప్రభుత్వం నుంచి ప్రజలకు వెళ్ళే ప్రతి సౌకత్ర్యానికీ కలక్టరు ప్రమేయం ఉంటుంది.

బీమారీ రాష్ట్రాలు అన్న పేరయితే 80ల నాడు వచ్చింది గానీ 50ల నాటినుంచీ ఆ రాష్ట్రాలు అలా వుండటం వల్ల    దక్షిణాది రాష్ట్రాలకు పోలీసు దెబ్బలాంటి అన్యాయం అతి సహజంగా జరుగుతూ వస్తున్నది.దేశం మొత్తం నుంచి కేంద్రప్రభుత్వం దగ్గిరకి చేరుతున్న ప్రతి 100 రూపాయలకీ 75 రూపాయలు దక్షిణాది నుంచీ 25 రూపాయలు ఉత్తరాది నుంచీ వస్తూ ఉన్నప్పుడు దేశం మొత్తం నుంచి కేంద్రప్రభుత్వం దగ్గిరకి చేరుతున్న ప్రతి 100 రూపాయలకీ కామన్ ఫండ్ కింద 20 రూపాయలు తీసి 80 రూపాయల్ని సమాన పంపిణీ చేసినా దక్షిణాదికి అన్యాయం జరిగినట్టు కాదా!ఆ కామన్ ఫండ్ కాకుండా మానవత్వం పేరుతో సొల్లు కబుర్లు చెప్పి బీమారీ రాష్ట్రాలను ఆదుకోవడానికి అన్న పేరుతో కొత్త ఖాతా కూడా పెట్టి ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత అవి ఇప్పటికీ బీమారీ రాష్ట్రాల మాదిరి ఉండటం అంటే అక్కడ జరుగుతున్నది ఉత్తరాది రాష్ట్రాల "వాళ్ళు" పట్టపగలు చేస్తున్న నిలువు దోపిడీ కాదా?ఇది దోపిడీ కాదని మీకు అనిపిస్తుందా!అక్కడ జరుగుతున్నది దోపిడీయే అయితే దోచుకుంటున్నది ఎవరు?1950 నుంచి 2020 వరకు మనం వోట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలు కాదూ మనల్ని వెర్రి వెధవల్ని చేసి మోసం చేస్తున్నది!

హైస్కూలు రోజుల్లో మనం చదువుకున్న చరిత్ర పాఠాలు మీకు గుర్తుంటే గుప్తుల కాలం స్వర్ణయుగం అనే పొగడ్తలూ మౌర్యులు ప్రపంచ స్థాయి విజేతలు అని వాళ్ళు మొత్తం దేశానికంతటికీ సంబంధించినవాళ్ళు అని చదువుకోవడమే తప్ప శాతవాహనుల గురించి ఎంత తెలుసు మనకి.కానీ, నిజం అది కాదు.ఇప్పటి భారతదేశపు సరిహద్దుల్ని అబ్ట్టి చూస్తే మౌర్యులూ గుప్తులూ యూరోపు వైపుకీ అస్సాము వైపుకీ ఎక్కువ విస్తరించినప్పటికీ వింధ్య దాటి దక్షిణానికి వ్యాపించలేదు.అయినప్పటికీ వాళ్ళని మొత్తం దేశానికి పరిపాలకులు అయినట్టు చూపించహెశారు.శాతవాహనులు వింధ్య దాటి వెళ్ళారు, రెండు రాజధానులతో ఉత్తరాదికి కూడా వ్యాపించారు.అయినప్పటికీ మన దేశపు మెయిన్ స్ట్రీం హిస్టరీ రైటర్స్ శాతవాహనుల్ని దక్షిణాదికి చెందిన మౌర్యుల సామంతరాజ్యం కిందనే చూశారు,చూస్తున్నారు,చూస్తారు.

మౌర్య వంశం 321 B.C.E నాడు చంద్రగుప్త మౌర్యుడితో మొదలై 185 B.C.E నాటికి అంతరించి పోయింది.చంద్రగుప్త మౌర్యుడు, బిందుసార మౌర్యుదు, అశోక మౌర్యుడు,దశరధ మౌర్యుడు, బృహద్రధ మౌర్యుడు అనే అయిదు తరాల వంశం మనం చూస్తున్న అతి పెద్ద సామ్రాజ్యం స్థాయిలో వ్యాపించి ఉన్నది 298 B.C.E మొదలు 231 BCE వరకే.అప్పుడు శాతవాహనుల వల్ల కొంత కుంచించుకుపోయి 190 B.C.E తర్వాత ఇటువైపున శుంగవంశానికీ అటువైపున గ్రీకులకీ చోటు ఇస్తూ 180 B.C.E నాటికి కాలగర్భంలో కలిసిపోయింది.

ఈనాటికీ టీవీల వాళ్ళకి అలవాటు లేదు గానీ రేడియో కార్యక్రమాలు మొదలయ్యేముందు తేదీని చెప్పే శక సంవత్సరం శాలివాహనులదే!ఉత్తరాదికి కూడా వ్యాపించిన శాతవాహనులు భౌగోళికంగా అతి పెద్ద స్థాయికి విస్తరించలేదు గానీ పాలనా దక్షత చూపించి వ్యాపార పరమైన ఆధిక్యతతో ఈరోజుకీ ప్రపంచంలోని హిందువులు అందరూ పాటిస్తున్న వైదిక సంస్కృతికి పునాదులు వేస్తూ సుమారు 40 తరాల పాటు 30 మంది ప్రఖ్యాతులైన రాజులతో 600 యేళ్ళ చరిత్రని ప్రభావితం చేసింది.చరితర్ రచనలో కనబడుతునన్ ఈ పక్షపాతం ఇప్పటిది కాదే!

పాత కధలు దేనికి గానీ 2014 మొదలు 2019 వరకు చంద్రబాబు మోదీకి గానీ శీలా వారికి గానీ సోమూ వారికి గానీ ఛోటా మోటా భాజపా నాయకులకీ కార్యకర్తలకీ చేసిన ద్రోహం ఏమిటి?ఏమీ లేదు!అది వాళ్ళ అంతరాత్మలకీ తెలుసు. ఒకవైపు రాష్ట్ర స్థాయి భాజపా అధికారిక ప్రతినిధుల్లో ఎవడు అమరావతికి మనస్పూర్తిగా సపోర్టు చేసినా తెల్లారేసరికి వాణ్ణి పీకేసి ఇంకోణ్ణి పెడుతున్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రకి అన్యాయం చెయ్యడానికి ఎంత రాక్షసమైన పనులైనా చెయ్యగలదని తెలుసుకోలేకపోవటానికి ఆంధ్రా వోటర్లు చెవుల్లో పువ్వులు పెట్టుకుని కూర్చున్నారా!నిన్నటికి నిన్న ముష్టి మూడు శాతం వోట్లు కూడా లేని పార్టీకి చెందిన నాయకుడు ఎవరూ వూహించని రీతిలో అధికారంలోకి వస్తాం అంటే దాని అర్ధం ఏమిటి?ఇప్పటికీ ఎన్నికలలో ఒక్క సీటుని కూడా గెలిచే దమ్ము లేని పార్టీ 175 సీట్లు ఉన్న అసెంబ్లీలో 116 సీట్లు తెచ్చుకోవడం సాధ్యం కానప్పుడు "అనూహ్యమైన పద్ధతిలో అధికారం చేజిక్కించుకోవడం" అంటే "అసహ్యకరమైన పద్ధతిలో అధికారం చేజిక్కించుకోవడం" అనే అర్ధం ఎందుకు రాదు?

నేను ప్రతి ఎన్నికకీ బెట్టింగు రాజాలకి పనికొచ్చే అవకాశం ఉన్న గెస్సింగులు చెయ్యలేదు గానీ ఆనాడు కేజ్రీవాల్ మొదటిసారి ఢిల్లీలో గెలిచిన ఎన్నికలకి ఒక్క రోజు ముందు "అక్కడ బీజేపీ గెలవదు!" అని చెప్పాను, ఈనాడు చంద్రబాబు గెలిచే అవకాశం లేదు గానీ గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుంది,గెలవకపోతే రాష్ట్రం పాడుపడుతుంది అని చెప్పాను.అన్నింటికన్న ముఖ్యమైనది 2014లో మోదీ గెలిచిన మొదటి ఏడాదిలోనే 2019 లోపు రామాలయం కడతాడు, అదీ ఎన్నికలకి ముందు మిగిలిన అన్ని రంగాల్లో ఫెయిలయితే చచ్చినట్టు కడతాడు అని చెప్పాను.అన్నీ అచ్చు గుద్దినట్టు అలాగే జరిగాయి.బాబుకో మోదీకో బాజాలు మోగించే డప్పాసి తెలివి ఉన్నవాడు అలా చెప్పనూ లేడు, అవి నిజం కానూ కావు.అలాంటివాడు వాడికి జరిగితే బాగుండునని అనిపించినవాటినే జరుగుతాయని చెప్తాడు - నిజమయితే నా గొప్ప అంటాడు, అబద్ధమయితే పోల్ సర్వే వాళ్ళని తిడతాడు.

ఈ ఆంధ్రా బీజేపీ వాళ్ళకి రేపెప్పుడో అనూహ్యమయిన రీతిలో ఆటలాడి అధికారంలోకి వచ్చే దమ్ము ఉంటే మొన్నటి 2019 నాడు జగనుకి బదులు వాళ్ళే అధికారంలోకి వచ్చి ఉండొచ్చు కదా - ఎవడు అడ్డు పడ్డాడు! చంద్రబాబు రాష్ట్రద్రోహి అని పైకి రంకెలు వేశారు,మిత్రద్రోహి అని లోపల పళ్ళు కొరుక్కున్నారు.మోదీ వీళ్ళకి గొప్ప వక్తలా కనబడుతున్నాడు గానీ మాట్లాడేది హిందీ గాబట్టి ఉత్తరాది వాళ్ళకి కనీసం అర్ధం అవుతుంది గాబట్టి కొట్టే చప్పట్లు నిజం అనుకోవాలి, మరి ఆంధ్రాలో ఎంతమందికి హిందీ అర్ధం అవుతుంది?ఉత్తరాది నుంచి మోదీని దించనక్కరలేదు అంటే రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఎన్నికల ప్రచార సభల్లో గానీ కార్యక్రమాలకి సంబంధించిన సభల్లో గానీ ప్రజల్ని మెప్పించి పార్టీకి నాలుగు వోట్లు వేయించుకోగలిగిన వక్తలు ఎంతమంది ఉన్నారు?రామారావూ చంద్రబాబూ వీళ్ళకు కేటాయించిన సీట్లలోనే ఆన్నీ గెలవలేదు, చందబాబుని వోడించింది మేమే అని గప్పాలు కొట్టుకుంటున్న మొన్నటి ఎన్నికల్లో అవతార పురుషుడు మోదీ వచ్చి ఉద్ధరించిన ఘనకార్యం ఏమిటి?

రాష్ట్ర విభజన ఆంధ్రాకి అన్యాయం జరిగేలా పరమ భయానకమైన రీతిలో జరగటానికి కాంగ్రెసుతో పాటు భాజపా కూడా కారణం అని ఆంధ్ర వోటర్లు భావిస్తున్నారని తెలిసినప్పుడు ఆంధ్రలో అధికారం కోరుకునే ఒక రాజకీయ పార్టీ యొక్క అధినాయకత్వం ఇలా ప్రవర్తించడంలో ఉన్న హేతుబద్ధత ఏమిటి? ఒక్క దక్షిణాది అనే కాదు ఇవ్వాళ రాజకీయ నాయకులు నిరంతరం ఎన్నికల్లో గెలుపు గురించే ఆలోచిస్తూ గెలిచాక  స్పాన్సరర్లకీ అస్మదీయులకీ దోచిపెట్టడంలోనే మునిగి తేల్తూ ఉండటం వల్ల అసలు కుట్రని ఇప్పటికీ గమనించలేకపోతున్నారు గానీ దక్షిణాది నాయకుల్లో ఏ ఒక్కడు ప్రజల కోసం నిజాయితీగా ఆలోచించినప్పటికీ ఈ దోపిడీకి అడ్డుకట్ట వెయ్యటం ఎప్పుడో జరిగి ఉండేది.

దోపిడీ చాలా కాలం నుంచి జరుగుతున్నది - దక్షిణాది వాళ్ళకి చురుకు ఎప్పుడు పుడుతుందన్నదే ప్రశ్న!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...