ఓరి నాయనోయ్!
అన్నా చెల్లెళ్ళు కూడబలుక్కుని పెద్ద స్కెచ్ వేశారు. నిన్న నేను షర్మిల ఆంధ్రలో దిగుతుందని అనుకుంటే తెలంగాణలో దిగుతుందని కొత్త సంగతి తెలిసింది.ఇది పైకి కనిపిస్తున్నట్టు అన్న మీద అలిగిన చెల్లి తిరుగుబాటు సినిమా కాదు.అన్న ఆంధ్రలోనూ చెల్లి తెలంగాణలోనూ అధికారం పంచుకోవడానికి వేస్తున్న మాస్టరు స్కెచ్చి!
బాబు మీద కసితో జగనుని ఆంధ్రలో దింపినందుకు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న క్రైస్తవుల డబ్బునీ దమ్మునీ ఉపయోగించుకుని మోదీకీ కేసీయారుకీ తల తిరిగి ముద్ద నోటికి వచ్చే దెబ్బ కొట్టడానికి అంతర్జాతీయ సేతుక సమూహం వేసిన మాస్టర్ స్ట్రోక్ ఇది.నేను గత వారం నుంచీ అనుకుంటూ ఉన్నది నిజం కాబోతున్నది.ఇక నిన్న నేను చెప్పినట్టు జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆంధ్రలో రాష్ట్రపతి పాలన పెట్టడం కూడా కుదరదు, పెడితే అంతర్యుద్ధం వరకు వెళ్తుంది వ్యవహారం.
ఆంధ్రలో ఇప్పటికీ స్థానిక భాజపా నాయకత్వం జగను అసలు స్వరూపం తెకియకనో తెలిసి కూడా వాళ్ళు సైతం అంతర్జాతీయ సేతుక సమూహానికి అమ్ముడుపోయి ఉండటం వల్లనో జగనుని అంటకాగుతూ హిందువుల్ని మోసం చేస్తున్నారు.
ఇటు ఆంధ్రలో హిందువుల వోట్లు టీడీపీ బీజేపీ జన్సేన వంటి తట్టాయి బుట్టాయి గాళ్ళు చీల్చుకుంటే చెప్పుకోదగ్గ స్థాయిలో హిందువుల వోట్లూ అన్ని హైందవేతర మతాల వోట్లూ గుండుగుత్తం జగనుకే పడతాయి.
అటు తెలంగాణలో చర్చిలు తకువే గానీ పాప్యులరిటీ ఉన్న పాస్టర్లలో అధిక శాతం మందికి హైదరాబాదు ముఖ్య స్థావరం అనేది కళ్ళ ముందు కనపడుతున్న నిజం.ఇటీవల కేసీయారు దూరం చేసుకున్న ఒవైసీ కూడా వాళ్ళతో కలుస్తాడు.అది తెరాసకీ భాజపాకీ సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమా చూపిస్తుంది.ఆంధ్రలో లాగే తెలంగాణలో సైతం కాంగ్రెసుని ఇక మర్చిపోవచ్చు.
తెలంగాణ విభజన వెనక ఉన్నది మతకోణం అని నేను అన్న కొద్ది రోజులకే తెలంగాణ కూడా హిందువుల నుంచి చేజారిపోయి క్రైస్తవుల పరం కావడానికి తొలి అడుగులు పడుతున్నాయి.
హిందువులని నాశనం చేస్తున్నది హిందువులు తమ రక్షకులని నమ్ముతున్న వాళ్ళ నాయకులే.ఆధ్యాత్మిక పరాధీనత అనేది అనుభవంలోకి వస్తే తప్ప ప్రమాదం తెలియనివ్వని మాయరోగం - కానీ, వీళ్ళు అది వచ్చాక చూసుకుందామనే బద్ధకంలో ఉన్నారు.వచ్చాక మూలగడానికి కూడా వోపిక ఉండదని తెలియడం లేదు,పాపం. కానివ్వండి,ఎంతకాలం నిద్రపోతారో పోనివ్వండి.
దేవుడు దిగివస్తే తప్ప రెండు తెలుగు రాష్ట్రాల హిందువులని మానవమాత్రుడు రక్షించలేడు.గజేంద్రుడు పిల్చినట్టు "లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్ ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!ఓ! కమలాప్త! యో! వరద! యో! ప్రతిపక్షవిపక్షదూర! కుయ్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! యో! శరణాగతామరానోకహ! యో! మునీశ్వర మనోహర! యో! విమలప్రభావ! రావే కరుణింపవే తలఁపవే శరణార్థిని నన్నుగావవే." అంటూ నిజమైన ఆర్తితో పిలిస్తే గానీ ఆయన "అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకం" వదిలి రాడు.
అరె వో సాంబా, అబ్ ఆయా మజా ఖేల్ కా!
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు