Wednesday 31 August 2022

వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి సత్యనిష్ఠ ఉన్నవాడు కాదని తెలిసింది శ్యామలీయం మాస్టారూ!

వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి సత్యనిష్ఠ ఉన్నవాడు కాదని తెలిసింది నాకు."కల్లూరి భాస్కరం" అనే కమ్యూనిష్టు భావజాలం ఉన్న వ్యక్తి "మహాభారత తత్త్వ కథనము" రచయితను గురించి కొన్ని వివరాలు ఇచ్చాడు.కల్లూరి భాస్కరం కూడా బ్రాహ్మడే - "మా నాన్నగారు కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు" అని చెప్పుకున్నాడు. వీడు తప్పుడు వెధవ అనేది నిజం. మా మధ్యన కొన్ని వాదనలు జరిగాయి, వాడి అజ్ఞానంతో కూడిన హిందూమతద్వేషం లాంటి మూర్ఖత్వం బయటపడింది.నోరు మూయించాను.కానీ,వీడి తండ్రి గారు మాత్రం సత్యనిష్ఠ గల సజ్జనులే.

నిజానికి వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన భారత తత్వ నిర్ణయము అనేది తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1928లో ‘మహాభారత చరిత్రము అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించితే పెండ్యాలవారి రచనను ఖండిస్తూ 1948-49 ప్రాంతంలో ఆరు సంపుటాలుగా మరో రచన వచ్చింది. దానిపేరు ‘మహాభారత తత్త్వ కథనము. ఈ గ్రంథ రచయిత వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. ఈయన కూడా పిఠాపురం వాస్తవ్యులే. వీరిద్దరూ తమ వాదోపవాదాలు వినిపించడానికి అప్పట్లో పండితుల మధ్యవర్తిత్వంలో సభలు కూడా జరిగాయి.”మహాభారత చరిత్రము” పుస్తకాన్ని ప్రప్రధమంగా ఖండించిన వారిలో ప్రసిద్ధులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు. ఆయన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవి కూడా. పెండ్యాల-శ్రీపాదవార్ల వివాదం చివరికి కోర్టుకు ఎక్కి, ఏడాది- ఏడుమాసాలపాటు కేసు నడిచింది. రాజమండ్రిలోని ఆనరరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు ఇద్దరికీ ఇరవై రూపాయల వంతున అపరాధ రుసుము విధించారు. కృష్ణమూర్తిశాస్త్రిగారు రెండుసార్లు తన సాక్షులను ప్రవేశపెట్టని కారణంగా పెండ్యాల వారికి పన్నెండు రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని కూడా మెజిస్ట్రేటు తీర్పు చెప్పారు.

పెండ్యాలవారే ఇలా రాశారు:”వారు(శ్రీపాదవారు) నా గ్రంథమును నిరాకరింపుచు వ్రాసిన వ్యాసములలోనూ ఆ వ్యాసములన్నిటిని చేర్చి కూర్చిన ‘శ్రీ మహాభారత చరిత్ర నిరాకరణము అను గ్రంథములోనూ నేను వ్యాసాదులను నిందించితిననియు బురాణపురుషులను నిందించితిననియు, బెక్కుసారులు నన్ను దూషించిరి. కాని నా పుస్తకమునకు బూర్వమే వారు వ్యాస, భీష్మ, బలరామ, శ్రీరాముల గూర్చి యెట్లు వ్రాసిరో దిగ్మాత్రముగా వ్రాయుచున్నాడను.

కృష్ణమూర్తిశాస్త్రిగారు ‘కురుపాండవదాయభాగ విమర్శనమున వ్యాసుని గూర్చి యిట్లు వ్రాసిరి.

(1)  “ధర్మశాస్త్రముల మాటకేమిగాని, మహానుభావుడై యడవులలో దపము చేసికొను వ్యాసుడంతవా డిట్టి పాడు పనికీయకొనెనని మన మొప్పుకొనుచున్నప్పుడు రెండు మూడు తడవులకు సందేహించి చర్చింపవలసి యున్నదా?”

అడవులలో దపము చేసికొను వ్యాసుడు రాజాంతఃపురము జొచ్చి ‘అంబికాంబాలికలను దాసిని గూడి బిడ్డల గనుట,‘ఒకటి కాదు, రెండు కావు, మూడుసారులు చేసిన పాడుపనులనియే కృష్ణమూర్తిశాస్త్రిగారి ముఖ్యాభిప్రాయము.(మానవసేవ పత్రిక 1912 ఆగస్టు సంచిక)

భీష్ముని గూర్చి యిట్లు తమ వజ్రాయుధ పత్రిక (1927 సం.రము అక్టోబర్ సంచిక)లో వ్రాసి యున్నారు.

(2)“భీష్ముని మెచ్చుకొనినారు దానికి సంతోషింపవలసినదేకా? భీష్ముని బ్రహ్మచర్యము స్వచ్ఛందమైనది కాదు. తండ్రి కోర్కెం దీర్ప వ్రతంబు బూనెగాని విరక్తుండై కాదు. అది యుత్తమ మన నొప్పదు. భీష్ముం డుత్తమపాత్రమే గాని తాను సమర్థుండై యుండియు నెవరికిం జెప్పవలసినట్లు వారికి జెప్పి యుద్ధము గాకుండం జేయవలయు. అటులం జేయక తానొక పక్షముం జేరి పాండవులతో భండనము జేసినాడు సరే! దుర్యోధనుని యుప్పు దినుచున్నాడట! అందుచేత యుద్ధము జేసినాడనుకొందము. తన చేరిన పక్షమునకు జేటుగా దన చావునకు మార్గము తానే చెప్పి పరులకు లోలోన సలహా నిచ్చినాడు. ఇది స్వామిద్రోహము కాదా? స్వామిద్రోహపాతకము సామాన్యమా?”

(3) “వీరు (గరికపాటి రామమూర్తి గారు) రాముని మాత్ర మవతారపురుషుడని యన్యాయము లేనివాడని వ్రాసిరి. సంతోషమే గాని మాటవరసకుం జెప్పుచున్నాము. రాముడు మహానుభావుడే కదా, లోకవృత్తముతో నవసరము లేక యొకరి జోలికిం బోక యొక యడవిలో గూర్చుండి ముక్కు మూసికొని తపము జేయుచున్న శంబూకుని తల నరికినాడు. ఇది న్యాయమా? వాలి సుగ్రీవులు పోరాడుచుండ జాటునుండి వాలిం దెగవేసినాడు. ఇది న్యాయమా? అగ్నిశుద్ధిం బొందియున్న సీతను సంపూర్ణ గర్భవతిని నరణ్యములకుం బడద్రోసినాడు. ఇది న్యాయమా? (వజ్రాయుధ పత్రిక, సంపుటము 2, సంచిక 9)

శ్రీపాదవారు భీష్ముడి గురించి, రాముడి గురించి ఇలా రాయడమే నమ్మశక్యం కాని ఆశ్చర్యం. శ్రీపాదవారు రాశారని చెప్పకుండా ఇవే వాక్యాలను చూపించి ఇవి ఎవరు రాసుంటారని ఇప్పటి వారిని అడిగి చూడండి, తప్పకుండా ఏ త్రిపురనేని రామస్వామి చౌదరిగారి పేరో చెబుతారు. అంటే, నాటి సంప్రదాయపండితులలోనే కొందరిలో త్రిపురనేని రామస్వామి చౌదరిగారి అంశ కూడా ఉండడం ఎంత విలక్షణం! వ్యాసాదులను, పురాణపురుషులను నిందించారని పెండ్యాలవారిని దూషించిన శ్రీపాదవారే ఆ పని చేయడం ఎలాంటిది?

విచిత్రం ఏమిటంటే, సంప్రదాయభిన్నంగా మాట్లాడడానికి ఇప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసివస్తుంటే, సంప్రదాయ వర్గానికి చెందిన శ్రీపాదవారు ఏ జాగ్రత్తా తీసుకోకుండా వ్యాఖ్యానించడం! భీష్ముని గురించి ఆయన అన్న మాటలే చూడండినిజానికి భీష్మునిలో ఆయన ఎత్తి చూపిన లోపాలకు సాంప్రదాయిక పాఠం లోనే కావలసినంత సమర్థన ఉంది. ఆదిపర్వం తృతీయాశ్వాసం ప్రకారమే చూస్తే, కురుక్షేత్రయుద్ధం జరిగింది భూభారం తగ్గించడం కోసం. భూదేవి ప్రార్థనపై బ్రహ్మ దేవుడు రచించిన కురుక్షేత్రయుద్ధమనే విశాల వ్యూహంలో,‘భీష్మాది వీరులు దేవదానవ అంశలతో పుట్టి యుద్ధం చేసి మరణించడం ఒక భాగం. అప్పుడు బ్రహ్మదేవుని వ్యూహం అనే పెద్ద గీత ముందు; కురుపాండవ శత్రుత్వం, పాండవులకు రాజ్యం దక్కడం, ఆయా పాత్రల లోపాలోపాలు వగైరాలు చిన్న గీతలు అయిపోతాయి. అయినా సరే, మహాభారత అనువాదకులు కూడా అయిన శ్రీపాదవారు స్వతంత్రించి సంప్రదాయభిన్న వ్యాఖ్య చేయడం ఆసక్తికరం.

మహాభారతాన్ని సంప్రదాయేతర కోణం నుంచి పరిశీలించిన రచనలు కొన్ని పెండ్యాలవారి రచనలకు ముందే వచ్చాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారు మద్రాసులోని గోఖ్లేహాలులో ఇచ్చిన మహాభారతోపన్యాసం పెక్కుమంది ఆంధ్రులను భారతంపై దృష్టి మళ్లించేలా చేసిందని పెండ్యాలవారు అంటారు. అప్పటికే రావుబహద్దర్ పనప్పాకం అనంతాచార్యులుగారు, విమర్శకాగ్రేసర కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు ‘కురుపాండవ దాయభాగ నిర్ణయముల గురించి గ్రంథాలు రాశారు. బ్రహ్మయ్యశాస్త్రిగారి గ్రంథాన్ని ఖండిస్తూ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు ‘కురుపాండవ దాయభాగ వినిర్ణయమనే గ్రంథం రాశారు. దుర్యోధనుని పక్షంలోనే న్యాయముందని చెబుతూ కోటమర్తి చినరఘుపతిరావు అనే కవి ‘సుయోధన విజయము అనే కావ్యం రాశారు. వజ్ఝల చిన సీతారామస్వామిశాస్త్రి గారు సంప్రదాయాభిన్న వివరణతో ‘కర్ణచరిత్రము రాశారు. పూర్తిగా సంప్రదాయ పక్షం నుంచి ‘మహాభారత తత్త్వ కథనము రచించిన వారణాసివారు ఇలాంటి రచనలను అన్నిటినీ ఖండించారు. ఆర్ష సాహిత్యంపై సాంప్రదాయిక భాష్యం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి ఒక ఆసక్తికరమైన ఆధారం వారణాసివారి రచన.

పెండ్యాలవారే ఇంకా ఇలా అన్నారు:

“ఆంధ్రభాషలో విమర్శన గ్రంథములు తక్కువ. మహాభారతమును తత్రస్థవ్యక్తులను విమర్శించుట మరియును దక్కువ. దుర్బలమానసులకట్లు విమర్శించుట భీతావహముగా నుండును. విమర్శించినవారి కేదేని యనిష్టము సంభవించునని వారు తలంతురు. నా నేత్రవ్యాధికి గారణమిదియ యని యసూయాపరులు హేళనము చేయుటయే కాదు, కొందరు మిత్రులును నయోక్తులతో నయనిష్ఠురోక్తులతో గూడ నను నీ కార్యమునుండి మరలింప బ్రయత్నించిరి.”

పెండ్యాల, వారణాసి వార్ల మధ్య తలెత్తిన ఒక వివాదంలో జమ్మలమడక మాధవరామశర్మ గారు ఒక తీర్పరిగా ఉన్నారు. బ్రహ్మసూత్రాలు రచించిన బాదరాయణుడు, వ్యాసుడు ఒకరు కారని పెండ్యాలవారి వాదన అయితే, ఒకరే నని వారణాసివారి వాదన. ఎవరి వాదన సమంజసమో నిర్ణయించడానికి 1947 జూలై, 2న అన్నవరం దేవస్థానంలో సభ ఏర్పాటు చేశారు. పెండ్యాలవారు ఎన్నుకున్న జమ్మలమడకవారిని, వారణాసివారు ఎన్నుకున్న పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రిగారిని తీర్పరులుగా నియమించారు. మళ్ళీ వీరిద్దరూ కలసి రాళ్ళభండి వేంకట సీతారామశాస్త్రి గారిని తీర్పరిగా ఎన్నుకున్నారు. పెండ్యాలవారు చారిత్రకమైన దృష్టితో సమీక్షిస్తే, చరిత్ర సంబంధములేని ప్రామాణిక దృష్టితో వారణాసి వారి వాదము సాగిందనీ, ఎవరి విమర్శ కూడా గాఢంగా లేదనీ, నేను ఈ తగాయిదాను త్రోసివేస్తున్నాననీ జమ్మలమడకవారు తీర్పు చెప్పారు. మిగిలిన ఇద్దరూ వారణాసి వారి పక్షం వహించి ఆయనకు అనుకూలంగా మెజారిటీ తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరిలో సంప్రదాయ పాక్షికత వ్యక్తమైతే, జమ్మలమడకవారిలో విషయ ప్రధానమైన నిష్పాక్షికత కనిపిస్తుంది.

ఇది ఆనాటి పండిత శ్రేష్ఠులైన బ్రాహ్మణ కులస్థులు ఉన్న తీరు.ఇప్పటికీ ఇలాగే ఉన్నారు.ఎవడి పాండిత్యం వాడిది,ఎవడి వాదన వాడిది,ఎవడి ఆర్జన వాడిది,ఎవడి శాఖ వాడిది,ఎవడి పెత్తనం వాడిది - వేరేవాళ్ళు పోటీకి వచ్చి తమ ఆర్జనకి బొక్క పడుతుందనుకున్నప్పుడు మాత్రమే అందరూ ఒక్కటై అవతలివాళ్ళని ఓడించేసి పాండిత్యం,ఆర్జన,అధికారం తమ చెయ్యి దాటి పోకుండా చూసుకుంటారు.వేదం,ఉపనిషత్తులు,పురాణకధలు మొదలైన సంస్కృత భాషా సాహిత్యం మీద తమకు మాత్రమే పేటెంటు ఉన్నదని అనుకుంటూ తమ పాండిత్యాన్ని ప్రదర్శించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ పురాణేతిహాసాల మూలపాత్రల్ని విమర్శిస్తే పేరొస్తుందని అనిపిస్తే విమర్శించడం సమర్ధిస్తే పేరొస్తుందని అనిపిస్తే సమర్ధించడం అలవాటైన పుట్టు బ్రాహ్మణులను సమర్ధించే దౌర్భాగ్యం పట్టలేదు నాకు.అన్ని కులాలలోనూ ఉన్నట్టే బ్రాహ్మణుల్లోనూ మంచివాళ్ళూ చెడ్డవాళ్ళూ ఉన్నారు.పుట్టుక చేత మాత్రమే బ్రాహ్మడై బుధ్ధిలో దోషం ఉన్న చెడ్డవాళ్ళని నేను పుట్టు బ్రాహ్మణులు అని అంటున్నాను.పుట్టుక చేత గాక బుధ్ధిలో సజ్జనత్వం ఉన్న మీలాంటి వాళ్ళని మాత్రమే నేను బుధ్ధి బ్రాహ్మణులు అని గౌరవిస్తాను.ఇంతటి సుదీర్ఘమైన రచనా వ్యాసంగంలో ఒక్క బుధ్ధి బ్రాహ్మణుణ్ణి కూడా అవమానించలేదు,ఒక్క పుట్టు బ్రాహ్మణుణ్ణి కూడా ప్రశంసించలేదు.ఇకముందు సైతం ఒక్క బుధ్ధి బ్రాహ్మణుణ్ణి కూడా అవమానించను,ఒక్క పుట్టు బ్రాహ్మణుణ్ణి కూడా ప్రశంసించను.

జై శ్రీ రాం! 

9 comments:

  1. హరిబాబు గారు, మీ యీ టపాలో వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు సత్యనిష్ఠ గల వారు కాదని (శీర్షికలో తప్ప) మరెక్కడా ప్రస్తావించ లేదు. మీ వ్యాసంలో ఏ విధంగానూ వారి సత్యనిష్ఠను తప్పుపట్టే విషయాలు ప్రస్తావించకుండానూ ఋజువు చేయకుండానూ ఉండటం ఆశ్చర్యం‌ కలిగించింది. పోనీయండి. ఈవిషయంలో నా దగ్గర వాదించటానికి ఏమీ లేదు. మీరప్పుడే వారి షడ్భాగప్రయుక్తగ్రంథాన్ని అమూలాగ్రం చదివి ఉండవచ్చును కాని నేను అక్కడక్కడ మాత్రమే చదువగలిగాను సమయాభావం వలన. చదివినంతవరకు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి గ్రంథంతో నాకు ఇబ్బంది కలుగలేదు. మీ అభిప్రాయం మీది వేరుగా ఉండవచ్చును దానికేమి.

    ReplyDelete
    Replies
    1. "పెండ్యాల, వారణాసి వార్ల మధ్య తలెత్తిన ఒక వివాదంలో జమ్మలమడక మాధవరామశర్మ గారు ఒక తీర్పరిగా ఉన్నారు. బ్రహ్మసూత్రాలు రచించిన బాదరాయణుడు, వ్యాసుడు ఒకరు కారని పెండ్యాలవారి వాదన అయితే, ఒకరే నని వారణాసివారి వాదన. ఎవరి వాదన సమంజసమో నిర్ణయించడానికి 1947 జూలై, 2న అన్నవరం దేవస్థానంలో సభ ఏర్పాటు చేశారు. పెండ్యాలవారు ఎన్నుకున్న జమ్మలమడకవారిని, వారణాసివారు ఎన్నుకున్న పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రిగారిని తీర్పరులుగా నియమించారు. మళ్ళీ వీరిద్దరూ కలసి రాళ్ళభండి వేంకట సీతారామశాస్త్రి గారిని తీర్పరిగా ఎన్నుకున్నారు. పెండ్యాలవారు చారిత్రకమైన దృష్టితో సమీక్షిస్తే, చరిత్ర సంబంధములేని ప్రామాణిక దృష్టితో వారణాసి వారి వాదము సాగిందనీ, ఎవరి విమర్శ కూడా గాఢంగా లేదనీ, నేను ఈ తగాయిదాను త్రోసివేస్తున్నాననీ జమ్మలమడకవారు తీర్పు చెప్పారు. మిగిలిన ఇద్దరూ వారణాసి వారి పక్షం వహించి ఆయనకు అనుకూలంగా ‘మెజారిటీ’ తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరిలో సంప్రదాయ పాక్షికత వ్యక్తమైతే, జమ్మలమడకవారిలో విషయ ప్రధానమైన నిష్పాక్షికత కనిపిస్తుంది." అని వ్రాశాను కదండీ!

      Delete
  2. మరొకసారి మీటపాను పరిశీలించాను.
    వారణాసి వారు సత్యనిష్ఠ లేని వారని మీరు ఏఆధారమూ చూపినట్లు నాకు కనిపించ లేదండీ.

    ReplyDelete
    Replies
    1. వ్యాసాదులను, పురాణపురుషులను నిందించారని పెండ్యాలవారిని దూషించిన శ్రీపాదవారే ఆ పని చేయడం ఎలాంటిది?సంప్రదాయభిన్నంగా మాట్లాడడానికి ఇప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసివస్తుంటే, సంప్రదాయ వర్గానికి చెందిన శ్రీపాదవారు ఏ జాగ్రత్తా తీసుకోకుండా వ్యాఖ్యానించడం! భీష్ముని గురించి ఆయన అన్న మాటలే చూడండి…నిజానికి భీష్మునిలో ఆయన ఎత్తి చూపిన లోపాలకు సాంప్రదాయిక పాఠం లోనే కావలసినంత సమర్థన ఉంది.

      మహాభారత చరిత్రము ఎప్పుడు వచ్చింది?1928లో!"మహాభారత తత్త్వ కథనము" ఎప్పుడు వచ్చింది?1948లో!పెండ్యాల-శ్రీపాదవార్ల వివాదం చివరికి కోర్టుకు ఎక్కి, ఏడాది- ఏడుమాసాలపాటు కేసు నడిచింది ఎప్పుడు?కృష్ణమూర్తిశాస్త్రిగారు రెండుసార్లు తన సాక్షులను ప్రవేశపెట్టని కారణంగా పెండ్యాల వారికి పన్నెండు రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని కూడా మెజిస్ట్రేటు తీర్పు ఎందుకు చెప్పారు?

      "నేను అక్కడక్కడ మాత్రమే చదువగలిగాను సమయాభావం వలన. చదివినంతవరకు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి గ్రంథంతో నాకు ఇబ్బంది కలుగలేదు" అంటున్నారు మీరు.ఆ వివాదాల చరిత్రనీ ఆ వివాదంలో వారణాసి సుబ్రమణ్య శాస్త్రి పోషించిన పాత్రనీ చూశాక అసలు "మహాభారత తత్త్వ కథనము" చదవాల్సిన అవసరం లేదనిపించింది నాకు.మీరు చదివిన భాగంలో శాసనాల సాక్ష్యంతో తరచి చూస్తే నిరూపణకు పనికొచ్చే చరిత్రకు సంబంధించిన భౌతిక సాక్ష్యాలు ఉన్నాయా?

      నేను అసలు చదవలేదని కూడా మీరు అనుకోకూడదు."వాల్మీకి నిషాదత్వ నిరాకరణము" చదివాను కదా,అక్కడ తిమ్మిని బమ్మిని చేసి "విజయుడను వాడు నిషాదుడని యున్నది.విజయుడు నిషాదుడని యున్నప్పుడు ఆ విజయుడే తుదకు వాల్మీకి యయ్యెను గనుక వాల్మీకిని నిషాదు డని చెప్పినట్లే భావింపరాదు.వాల్మీకి తపోవినిహతపూర్వదేహుడై తేజరిల్లె నని యున్నది.అట్లు నిషాద శరీర మంతరింప వాల్మీకి స్వరూప మావిర్భూతమైనందున వాల్మీకిని నిషాదు డనుట తప్పు" అనేది మీకు ఇబ్బంది కలిగించలేదు కాబట్టి ఆ పుట్టు బ్రాహ్మణుడు నాకు కూడా సత్యనిష్ఠ గలవాడు ఐపోతాడా?

      "అట్లు నిషాద శరీర మంతరింప వాల్మీకి స్వరూప మావిర్భూతమైనందున వాల్మీకిని నిషాదు డనుట తప్పు" అనే విశ్లేషణ ఎలా ఉందంటే శ్రీశ్రీ అనే కలంపేరుతో వ్రాశాడు తప్ప తన సొంత పేరుతో వ్రాయలేదు గాబట్టి శ్రీశ్రీ మరియు శ్రీరంగం శ్రీనివాస రావూ ఒక్కరు కాదు అనాల్సి వస్తుంది.కానీ,శ్రీరంగం శ్రీనివాస రావు అనే వ్యక్తి తన రచనలను ఇతరులు చదివే సందర్భాల్లోనే శ్రీశ్రీ అనే పేరు వాడాడు కానీ రెమ్యునరేషన్ తన సొంత పేరుతోనే తీసుకున్నాడు.

      మీలానే నేనూ కొంత చదివాకనే వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి సత్యనిష్ఠ ఉన్నవాడు కాదని తెలిసింది నాకు.మొత్తం చదివాక కూడా ఆ అభిప్రాయం మారదు.నేను ఏ మాట చెప్పినా అన్ని సాక్ష్యాలూ సేకరించుకున్నాకనే చెప్తాను.అన్ని సాక్ష్యాలూ వ్యాసంలో చూపించలేదు గాబట్టి లేవని మీరు అనుకోకూడదు.

      నేను వేదం ఒక్కటే స్వతఃప్రమాణం అని నమ్ముతాను.అందులోనూ సృష్టికర్త ద్రష్టలకు ద్యోతకం చేసిన సంహితాపాఠం ఒక్కటే పరమప్రమాణం అనెది మరింత గట్టిగా నమ్ముతాను.అది తప్ప బ్రాహ్మణాలూ అరణ్యకాలూ ఉపనిషత్తులూ పురాణేతిహాసాలు సమస్తమూ మానవ నిర్మితమైనవి కాబట్టి స్వతఃప్రమాణం కాదని నేను నమ్మదమే కాదు అలా నమ్మమని మీకు కూడా చెప్తున్నాను.స్వతఃప్రమాణం కానివాటిలో ఉన్న అబధ్ధాల్ని సబధ్ధాలని నిరూపించడానికి అంత ప్రయాస పడటం అనవసరం - ఒక పరిమితి దాటిదే అది సత్యద్రోహం కూడా అవుతుంది.అక్కడ వాళ్ళు చేసిందీ ఇక్కడ మీరు చేస్తున్నదీ అదే, పొరపాటు.

      జై శ్రీ రాం!

      Delete
    2. "నిషాద శరీరము వేరు.వాల్మీకి శరీరము వేరు.కనుక వాల్మీకిత్వనిషాదత్వములు విరుధ్ధ ధర్మములు" - :-)

      Delete
  3. నాకు మీవాదనతో పేచీ లేదు. మీధోరణి మీది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మీకు సలహా ఇచ్చేంతటి వాడిని కాను గానీ ఒక్కమాట. మీకు వారణాసి వారిని గురించి సూచించటం పొరపాటు అయినదేమో అనిపించిస్తున్నది. నావలన వారికి మాటవచ్చింది. పోనివ్వండి. ఇకపై జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను..

    ReplyDelete
    Replies
    1. వారణాసి అనే గొట్టాం మీరు పరిచయం చెయ్యకపోయినా ఎక్కడో అక్కడ దొరికేవాడు నాకు.ఇవే తిట్లు తిని ఉండేవాడు.బ్రాహ్మణ కొంపలో పుడితే చాలు ఎన్ని అబధ్ధాలు చెప్పినా తిట్టకూడదు,అంతేనా?ఇకపై మీరు వహించే జాగ్రత్త ఏమిటి?బ్రాహమణులు అబధ్ధాలు చెప్తున్నారని తెలిసినా ఆ సంగతి ఇతరులకి చెప్పకపోవటం, నేరస్తులైన పుట్టు బ్రాహ్మల్ని సత్యనిష్ఠ గలవారి విమర్శల నుంచి దాచెయ్యటం - అంతేనా!

      "ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అన్నది వేదమంత్రం కాదు,ఉపనిషద్వాక్యం.అది కూడా వేదాలకు ఎవడిష్టం వచ్చిన అర్ధం వాడు చెప్పుకోవచ్చనే దురుద్దేశంతోనే చెప్పారు.ఏ ఒక్క వేదమంత్రానికీ కనీసం రెండు రకాల అర్ధాలు కూడా చెప్పకూడదు.ఎందుకంటే ఏ ఒక వేదమంత్రమూ మరొక వేదమంత్రంతో అర్ధాత్ విభేదించదు.వేదంలో ఏముందో తెలుసుకోవాలనే నిజాయితీతో వేదం చదివిన విదేసీయులు సైతం ఒప్పుకున్నారు వేదమంత్రాలలో చెప్పబడిన విషయాలలో వైరుధ్యాలకు తావు లేని ఏకసూత్రత ఉందని.మరి అలాంటప్పుడు ఒకే సత్యానికి విప్రులు అనేక అర్ధాలు తియ్యడం వేదద్రోహం,సత్యద్రోహం,ధర్మద్రోహం కాదా!

      ఇవన్నీ తమ జీవిక కోసం పుట్టు బ్రాహ్మణులు చెప్తున్న తప్పుడు మాటలు.వేదానికి యాస్కుని నిరుక్తం ప్రకారం సాయణుల వారు వ్రాసిన భాష్యం ఒక్కటే సర్వజనామోదయోగ్యమైనది.అది తప్ప బ్రాహ్మణాలూ అరణ్యకాలూ ఉపనిషత్తులూ పురాణేతిహాసాలు సమస్తమూ మానవ నిర్మితమైనవి కాబట్టి వేదం చెప్తున్న సత్యంతో ఏకీభవించినవి మాత్రమే సత్యం అవుతాయి.వేదంలోని ఒక భాగమైన తర్కాన్ని ఉపయోగించడం వల్లనే వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి సత్యనిష్ఠ ఉన్నవాడు కాదని తెలిసింది నాకు.రాసింది బ్రాహ్మణ కులస్థుడు అయితే చాలు తర్కబధ్ధమైనది కాకపోయినప్పటికీ ఇబ్బంది పడని మీరు తర్కశాస్త్రసమ్మతమైన నా వాదనకి ఇబ్బంది పడుతున్నారు.అంటే, సత్యవిక్రముడైన రాముడి మీద అన్ని కీర్తనాలు రాశాక కూడా సత్యం మీద గౌరవం లేదు మీకు,కులం మీద వ్యామోహం చావలేదు.

      చిత్తశుధ్ధిలేని శివపూజ లేల అన్నట్టు సత్యనిష్ఠ లేని మీ పెదవి చివరి పొగడ్తలని రాముడు మెచ్చుతాడనే నమ్మ్మకం ఉందా మీకు?

      Delete
  4. మిత్రులు హరిబాబు గారు,

    మీరు "వారణాసి అనే గొట్టాం" అనటం సముదాచారం కాదండీ.ఔనని మీరనుకుంటే ఒక నమస్కారం పెట్టి ఊరుకుంటాను.

    ఆ వారణాసి గారు పుట్టుబ్రాహ్మణుడే కాని పండితుడు కాదనీ సత్యనిష్ఠకలవా డసలే కాదనీ మీ అభిప్రాయం ఐతే కానివ్వండి. దాని గురించి వాదించను. మీ అభిప్రాయం మీది. కాని "అబధ్ధాలు చెబుతున్నారని తెలిసీ, పుట్టు బ్రాహ్మల్ని సత్యనిష్ఠ గలవారి విమర్శల నుంచి దాచెయ్యటం" అనేది నా పద్దతి అన్న మీఆరోపణ అసంగతం. మీరటువంటి దురభిప్రాయంలో పడటానికి కారణం మీఅంతట మీరే అమితసత్యనిష్ఠకలవాడననీ యితరులు కారనీ అనుకోవటం ఐతే విచారించవలసిన సంగతి. నేను వారణాసి వారిని దాచి ఉంచానో ఇప్పటి వారికి కొంతమందికి నావ్యాఖ్యల ద్వారానూ టపాలద్వారానూ పరిచయం చేసానో అందరికీ తెలుసును.

    "ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అంటే ఒకే సత్యానికి విప్రులు అనేక అర్ధాలు తియ్యటమూ ఆవిధంగా వేదద్రోహం,సత్యద్రోహం,ధర్మద్రోహం చేయటమూ కాదండీ. మీరు పెద్దలనడిగి దీని తాత్పర్యాన్ని తెలుసుకొనవలసింది. నాకంటే పెద్దలెవ్వరూ అని మీరంటే మరొక నమస్కారం.

    "వేదంలోని ఒక భాగమైన తర్కాన్ని ఉపయోగించడం వల్లనే వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి సత్యనిష్ఠ ఉన్నవాడు కాదని తెలిసింది నాకు" అన్నారు. అంటే? వేదవిహితమైన తర్కశాస్త్రాన్ని ఆధారం చేసుకొని మాట్లాడటం సత్యనిష్ఠకు విరుధ్ధం అంటున్నారన్న మాట. బాగుంది. అప్పీలు లేదు. మళ్ళా మీరే "తర్కశాస్త్రసమ్మతమైన నా వాదనకి ఇబ్బంది పడుతున్నారు" అని నన్నంటున్నారు. మీదగ్గర ఉన్నది వేదవిభాగమైన తర్కం కాదా? అది వేరే ప్రమాణమా అంటే మీరే "వేదం ఒక్కటే స్వతఃప్రమాణం అని నమ్ముతాను" అంటారు!

    ఇకపోతే మీరు నన్ను కూడా ఒక దులుపు దులిపారు! "సత్యవిక్రముడైన రాముడి మీద అన్ని కీర్తనాలు రాశాక కూడా సత్యం మీద గౌరవం లేదు మీకు,కులం మీద వ్యామోహం చావలేదు." అనీ "చిత్తశుధ్ధిలేని శివపూజ లేల అన్నట్టు సత్యనిష్ఠ లేని మీ పెదవి చివరి పొగడ్తలని రాముడు మెచ్చుతాడనే నమ్మ్మకం ఉందా మీకు?" మీకు ఈసారి శతకోటినమస్కారాలు. వారణాసి వారికి సత్యనిష్ఠలేదనటం మీద అభ్యంతరం చెప్పినందుకు నాకే సత్యనిష్ఠ లేదు అన్నారు. శహబాసు. మధ్యలో నామూలాన రాముణ్ణి లాగవలసి వచ్చింది మీకు. ఇంకా నేను ఏమన్నా మాట్లాడితే ఆ రాముడి సత్యనిష్ఠనీ దెప్పేటట్లు ఉన్నారు మీరు! నావి పెదవిచివరి పొగడ్తలని మీనమ్మకం ఐతే దానికి నేనేమి చేసేది రాముడేమి చేసేది! మీ ధోరణి మీది నేనేమీ అనుకోను లెండి. (మీరీ మాట అన్నారు కాబట్టి నాగురించి కూడా నేను కొంత వ్రాయవలసి ఉందేమో - ఒకవేళ వ్రాసినా అది నాఅనంతరమే వెలుగుచూస్తుంది. అప్పుడు కూడా మీరో‌ మరొకరో ఈగొట్టంగాడి మాటలకు విలువ యేమిటీ అనవచ్చును. అది వేరే సంగతి.)

    చూసారా, వాదం అనేది ఎంత చెడ్డదో. దాని వలన ఇతరులపట్ల మనం మాటతూలటమూ జరుగవచ్చును మనపట్ల ఇతరులూ మాటతూల వచ్చును. అందుకని నాకు వాదాలకు దిగటం ఎన్నడూ అంతగా రుచించదు.నావల్ల మరొకరికి - ఆ మరొకరు వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారయ్యేది, హరిబాబు గారయ్యేది, మీపుణ్యమా అని రాముడయ్యేది - ఎవరికీ మాట రావటం హితవుగా ఉండదు.

    ఇకపై ఈటపాను సందర్శించను. కాబట్టి మీ‌రు ప్రతిస్పందిచ నవసరం లేదు. నేనే మన్నా అధికం మాట్లాడి ఉంటే‌ మన్నించండి.

    అనవసరమైన వాదవివాదాల జోలికి పోయినందుకు గాను రేపు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అది కొంత కఠినంగానూ నాఆరోగ్యాన్ని ప్రభావితం చేసేదిగానూ ఉండవచ్చును. కాని తప్పదు. అడుసు త్రొక్కినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి కదా.

    ReplyDelete
    Replies
    1. "అనవసరమైన వాదవివాదాల జోలికి పోయినందుకు గాను రేపు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అది కొంత కఠినంగానూ నాఆరోగ్యాన్ని ప్రభావితం చేసేదిగానూ ఉండవచ్చును. కాని తప్పదు. అడుసు త్రొక్కినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి కదా." అంటే ఏమిటి అర్ధం?గాంధీలా తిండి మానేస్తాను,నీరసపడతాను,ఆరోగ్యం పాడు చేసుకుంటాను అనే కదా!

      అడుసు తొక్కడం ఏంటి?అసలు వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రస్తావన ఎప్పుడు వచ్చింది?భారతం వేదవ్యాసుల వారి పదివేల శ్లోకాలు లక్ష శ్లోకాలకి పెరగడం గురుంచి నేను చెప్పినది శాసనాల సాక్ష్యం ఉన్న భోజరాజు తన రాజ్యంలో జరిగిన,జరుగుతున్న సంగతులను గుదిగుచ్చిన చరిత్ర.అది చెప్పినప్పుడు దాన్ని ఖండిస్తూ మీరు భారత తత్వ నిర్ణయంలో వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి మహాభారతం అంతా వ్యాసకృతమే అని నిరూపించేశారు అని అన్నారు.అంటే, నేను భోజుడి గురించి చెప్పినది మీరు ఖండిస్తున్నట్టే కదా!

      ఇక్కడ మీరు ""వేదంలోని ఒక భాగమైన తర్కాన్ని ఉపయోగించడం వల్లనే వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి సత్యనిష్ఠ ఉన్నవాడు కాదని తెలిసింది నాకు" అన్నారు." అని అన్నప్పుడు మీ ఉద్దేశం ఏమిటి?నేను అన్నాను గానీ దాన్ని మీరు ఒప్పుకోవటం లేదనే కదా!మరి దానికి మీరు సపోర్టుగా ఇచ్చిన స్టేట్మెంట్ "అంటే? వేదవిహితమైన తర్కశాస్త్రాన్ని ఆధారం చేసుకొని మాట్లాడటం సత్యనిష్ఠకు విరుధ్ధం అంటున్నారన్న మాట." యొక్క అర్ధం ఏమిటి?మీరు వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి యొక్క "విజయుడను వాడు నిషాదుడని యున్నది.విజయుడు నిషాదుడని యున్నప్పుడు ఆ విజయుడే తుదకు వాల్మీకి యయ్యెను గనుక వాల్మీకిని నిషాదు డని చెప్పినట్లే భావింపరాదు.వాల్మీకి తపోవినిహతపూర్వదేహుడై తేజరిల్లె నని యున్నది.అట్లు నిషాద శరీర మంతరింప వాల్మీకి స్వరూప మావిర్భూతమైనందున వాల్మీకిని నిషాదు డనుట తప్పు" అనే తలాతోకా లేని సుత్తిని శాస్త్రీయమైన తర్కం అని అంటున్నట్టే కద.

      చెప్పకూడని అబధ్ధాలన్నీ చెప్పేసి నాదీ వేదవిహితమైన తర్కమే ఆ వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిదీ వేదవిహితమైన తర్కమే అంటూ గయ్యాళితనం చూపించి "నేను అడుసు తొక్కాను,నేను తిండి మానేస్తాను" అంటే కుదరదు.అయిదువేఅల సంవత్సరాల క్రితం జరిగిన కధలోని దాయభాగనిర్ణయాన్ని తప్పులు పడుతూ 1920లో భీష్ముడి బ్రహ్మచర్యాన్ని సైతం అనుమానించిన శుంఠలు మీకు సత్యసంధులా?ఈపాటి బోడి పాండిత్యం కవిత్రయానికి లేకనా అట్లా తెనిగించింది?సత్యవరత గాంగేయుడు ఆ సపధం చేసినప్పుడు ఆత్న్ని నదరూ భీష్ముడు అని పిలిచి మెచ్చుకున్నార్ని వ్రాసిన వ్యాసుణ్ణి అవమానించటం కాదా అది?నా అంతట నేఅనే అమితసత్యనిష్ఠకలవాడననీ యితరులు కారనీ అనుకోవటం మీరు విచారించవలసిన సంగతి ఎట్లా అవుతుందో చెప్పండి కొంచెం.చారితరక ప్రమాణాలతో వాదిస్తున్న నేను అసత్యవాదినా?వాదనకి సాక్ష్యాలు తేలేని మీ డొల్లాత్నాన్ని కప్పిపుఇచ్చుకోవటానికి "వారణాసి అనే గొట్టాం" అనే ఒక్క మాటని పట్టుకుని "నేను అడుసు తొక్కాను,నేను తిండి మానేస్తాను" అని సానుభూతి తెచ్చుకునే కబుర్లు చెప్పి జారుకుంటున్న మీరు సత్యసంధులా?

      నేనొక శాసనాల సాక్ష్యం ఉన్న చారిత్రక సత్యం చెప్పాను.దాన్ని మీరు సాక్ష్యాలు లేని బూకరింపులతో అబధ్ధం అంటున్నారు.అది కళ్ళముందు కనపడుతున్న నిజం.

      జై శ్రీ రాం!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...