Monday 29 August 2022

ఎవడీ భుట్ జొలోకియా?ఏమిటీ దరిద్రపు తెలుగు!

ప్రపంచంలో మాతృభాషలో మాట్లాడ్డానికి సిగ్గుపడేవాడు ఒక్క తెలుగువాడే అని ఎప్పుడో రూఢి అయిపోయింది.మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం అని పేరు తెచ్చుకున్నది గానీ 1952లో ఏర్పడిన రాష్ట్రం 2014 వరకు తెలుగును అధికార భాష కింద ప్రవేశపెట్టలేకపోవటానికి కారణం ఏమిటి?


ఢిల్లీలో చెత్త రాజకీయాలు నడిపి ముఖ్యమంత్రుల్ని మార్పించుకునే లాలూచీలు చెయ్యటమే ప్రధానం అయిపోయిన కాంగ్రెసు వాళ్ళు భాష కోసం పట్టు పట్టకపోవటమే కదా!


1913 మే 20న బాపట్లలో సర్‌ బయ్యా నరసింహేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన సమగ్ర ఆంధ్రమహాసభలో ప్రత్యేక ఆంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. పురాణం వెంకటప్పయ్య పంతులు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రతిపాదనని బాపట్ల ఆంధ్రోద్యమ సభలో ప్రవేశపెట్టగా సమావేశమై ఉన్న 800 మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తరువాత జరిగిన ఆంధ్రోద్యమ సభలకు పానుగంటి రామారాయణింగారు, మోచర్ల రామచంద్రరావు, సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు,  సర్‌ విజయానంద గజపతి అధ్యక్షులుగా ఉండి ప్రత్యేక ఆంధ్రను బలపరిచారు. ఇందులో సర్వేపల్లి రాధాకృష్ణయ్య (ఆయన తెలుగులో అలానే సంతకం చేసేవారు) అధ్యక్షత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఆ సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా వున్నారు. ప్రత్యేక ఆంధ్రకు ప్రభుత్వం సుముఖంగా లేదు. స్వతహాగా మితవాది, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే విద్యాజీవి రాధాకృష్ణ పండితుడు సైతం ప్రత్యేక ఆంధ్ర ఆవశ్యకతని గుర్తించి ఆంధ్ర తీర్మానాన్ని బలపరిచే సభకు అధ్యక్షత వహించారు.


బ్రిటిష్‌ ఇండియాలో భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం క్రీ.శ. 1910 నుండే భారతీయుల కృషి మొదలయ్యింది. 1912లో పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జాతీయాభిమాని అయిన కొవ్వూరి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ సభలు జరిగాయి. అప్పుడే కొండ వెంకటప్పయ్య పంతులు, జొన్నవిత్తుల గురునాథం తెలుగువారికి ప్రత్యేకరాష్ట్రం గురించి ఆలోచన మొదలుపెట్టారు.1913 మే 20న బాపట్లలో సర్‌ బయ్యా నరసింహేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన సమగ్ర ఆంధ్రమహాసభలో ప్రత్యేక ఆంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. పురాణం వెంకటప్పయ్య పంతులు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రతిపాదనని బాపట్ల ఆంధ్రోద్యమ సభలో ప్రవేశపెట్టగా సమావేశమై ఉన్న 800 మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.


తరువాత కాలంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధీజీ శిష్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్‌ 19 నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌తో మహర్షి బులుసు సాంబ మూర్తిగారి యింటిలో మద్రాసులో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించి డిసెంబర్‌ 15వ తేదీన ఆత్మార్పణ చేసుకున్నారు. వారి త్యాగాల ఫలితంగా నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్‌ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలనే బలమైన ప్రజల కోరికకు అనుగుణంగా 1956 నవంబర్‌ 1న హైదరాబాద్‌ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినారు. ఈవిధంగా మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తరచూ కాంగ్రెస్‌ని దుష్టకాంగీ అని అభివర్ణిస్తూ ఉండేవారు. ప్రముఖ కథారచయిత , ప్రబుద్దాంధ్ర పత్రికా సంపాదకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ సంపాదకీయాలలో ‘కాంగ్రెస్‌ ఆంధ్రుల పాలిట నెత్తిమీద పిడుగు వంటిది. ఆంధ్రులకు ఎప్పటికయినా కాంగ్రెస్‌ చేటు  తెస్తుంది’ అని స్వతంత్రానికి పూర్వమే హెచ్చరిస్తూ ఉండేవారు. ఆ మాటలను నిజం చేస్తూ పార్లమెంటు తలుపులను మూసి మరీ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రులను అవమానకరంగా విడదీసింది.


“ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వారు” ఉండడమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి మూల సిద్ధాంతం.“ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అన్న ప్రాతిపదికన మాత్రమే హిందీ భాషకు అన్ని రాష్ట్రాలు ఉండడాన్ని అర్ధం చేసుకోగలం.“ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అంటే ఒక రాష్ట్రంలో రెండు భాషలు మాట్లాడెవారు ఉండకూడదన్నదే అర్ధం తప్ప ఒకే భాష మాట్లాడేవారు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో ఉండకూడదని అర్ధం కాదు.హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఒకటి కంటె ఎక్కువ ఉన్నాయి. కాని ఆ రాష్ట్రాల్లో హిందీ తప్ప మరొక భాష మాట్లాడేవారు లేకుండా చూశారు.అలాగే ప్రస్తుతం తమిళం మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి. ఈ రెండు రాష్ట్రాల్లో తమిళం తప్ప వేరే భాష మాట్లాడేవారు లేరు, వలస వెళ్ళి స్ధిరపడ్డవారు తప్ప.అలాగే ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పటికీ అది ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల’ సిద్ధాంతానికి వ్యతిరేకం కాదు.ఎందుకంటె విడిపోయాక కూడా ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణలోనూ తెలుగు భాష మాట్లాడేవారు మాత్రమే ఉంటారు.


“ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వారు” ఉండాలని భాసహ కోసం పోట్లాడి సాధించిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రలో తెలుగు అధికార భాష కాకపోవటమూ ప్రజల ఆస్తుల్ని సొంతానికి దిగమింగి పంచుకునే గొడవల్లో ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలు చెయ్యటమూ ఆంధ్ర దోపిడీకి వ్యతిరేక ఉద్యమం నడిపి సాధించుకున్న రాష్ట్రంలో కూడా అదే ప్రజల ఆస్తుల్ని సొంతానికి దిగమింగి పంచుకునే గొడవల్లో  మునిగి తేలతమూ లాంటివన్నీ పై స్థాయిలో పదవుల కోసం ఆరాటపడే కుక్కల గోల అయితే ఆయా ఉద్యమాల్లో వీరావేశంతో పాలు పంచుకున్న మేధావులూ వీరులూ వాటికి మద్దతు ఇచ్చిన సామాన్యులూ ఎందుకని తాం మాతృభాషని తామే అవమానించుకుంటున్నారు?


మల్లిఖార్జున రావు అని వ్రాయకూడదు "మల్లికార్జునుడు" అనేది శ్రీశైలం మల్లికార్జున స్వామి పేరు.చనువు కొద్దీ ఒక భక్తురాలు "ఓ చెవిటి మల్లయ్యా!" అని పిలిచినది ఆత్మీఅయతతోనే గానీ పూర్తి పేరును మల్లికార్జున అనే పలకాలి,వ్రాయాలి.శాకములతో కూర్చిన ఆహారం శాకాహారం అవుతుంది గానీ కొమ్మల్ని నరుక్కునీ కొరుక్కునీ తింటున్న అర్ధం వచ్చేటట్టు శాఖాహారం అని వ్రాయడం తప్పు.


ఇంత చిన్న చిన్న తప్పుల్ని సరిదిద్దుకోవటానికి కూడా శ్రధ్ధ లేనప్పుడు మనం తెలుగువాళ్ళం,మన భాష గొప్పది అని జబ్బలు చరుచుకోవటం దేనికి?మాతృభాషాదినోత్సవం అనేది ఒకటి పెట్టి ఆ ఒక్కరోజూ తప్పనిసరి తద్దినంలా భాషాసేవ చెయ్యడం వల్ల ఎవరికి లాభం,అసలు అంత టైం బొక్క పనులు అవసరమా!


సంస్కృతానికి పాణిని ఎలాగో తెలుగుకి నన్నయ్య అలాగ - సంస్కృత వర్ణమాల కన్న గొప్పగా ఉంచాలని తెలుగు వర్ణమాలని మనుషులు,జంతువులు,యంత్రాలు సృష్టించే ప్రతి శబ్దానికీ ఒక అక్షరాన్ని ఏర్పరచి తెలుగును ధ్వని ప్రధానం చేశాడు."ఎద్దు" అనే మాటలో ఉన్న హ్రస్వాక్షరం సంస్కృతంలో లేదు.అచ్చు,హల్లు,అమ్మ,నాన్న,అత్తయ్య,మామయ్య లాంటి ఏకాక్షర ద్విత్వాలు సంస్కృతంలో చాలా అరుదు."త్ర్వ్వటా బాబా" పద్యాన్ని మరొక భాషలో ఆమాత్రం కూడా వ్రాయలేము కదా!


పదిమందిలో మాట్లాడేటప్పుడు సభ్యత,సంస్కారం ఉన్నవాడు వాళ్ళకి అర్ధం అయ్యే భాషలో మాట్లాడతాడు - అది మర్యాదస్తుడి లక్షణం.మన భావాల్ని చెప్పటానికి ఉపయోగపడే భాష విషయంలోనే ఇంత నిర్లక్ష్యం ఏమిటి?


ఇప్పుడు భుట్ జొలోకియా గొడవని చూద్దాం.తలకట్టు "భుట్ జొలోకియా - ఇది చాలా ఘాటు గురూ !" అని పెట్టాడు.ఏంటి దీనర్ధం?"భుట్ జొలోకియా" అనేది వంటకమా?"భుట్ జొలోకియా" అనేది సినీతారయా?ఇప్పుడు "హాట్" అనేది ఆ రెంటికే వాడుతున్నారు మరి.


నేను ఆ పోష్టు వైపు తొంగి చూసింది,"జెట్ భులోకియా

సుధీర్‌కి ఏక్టింగ్ రాదు. మీకు ళ పలకడం రాదు. దొందుకు దొందే." అనే కామెంటును మాలిక వ్యాఖ్యల సెక్షన్లో చూసి.ఇక్కడ ఒక వింత ఉంది - "సుధీర్‌కి ఏక్టింగ్ రాదు. మీకు ళ పలకడం రాదు. దొందుకు దొందే." అనే వాక్యంలోని భావం ఇతర్లు అతన్ని వెక్కిరిస్తున్నట్టు ఉంది.కానీ,కామెంటు పైన కనిపిస్తున్న ఐడీ కూడా తనదే!ఒకటి జరిగుండొచ్చు,ఎవరో ఆ కామెంటు వేస్తే ఎడ్మిన్ సెక్షనునుంచి ఆ కామెంటుదారును ఇక్కడ చూపించకూడదన్న వెకిలితనంతో కామెంటును మాత్రమే తన ఐడీతో పబ్లిష్ చేసి తన ముఖం మీద తనే వుమ్మేసుకున్నట్టు తన జవాబును కూడా వేసి ఉండొచ్చుననేది నా వూహ.


ఇదే మొదటిసారి కాదు,ఇతర్లూ నేనూ ఇదివరకే తన వచనంలోని తప్పుల్ని ఎత్తి చూపించాం.అప్పుడు కూడా "రాకపోవడానికీ, పట్టించుకోక పోవడానికి తేడా ఉందండీ ! నేను మరీ అంతగా పట్టించుకోను కొన్నింటిని." అనే రెటమతం జవాబే చెప్పాడు.


దానికి నేను వేసిన కామెంటు ఇది:kinghari010

కొన్నింటిని,అదీ మీలోపాల్ని పట్టించుకోని మీరు ఇతర్ల లోపాల్ని కూడా పట్టించుకోకుండా వదిలెయ్యొచ్చ్గు కదా!కానీ,”యాక్టింగు వచ్చినోళ్ళూ” అని రాయటానికి కొన్ని మాటలకి ముందు “మిగిలిన వాల్లు” అని రాయటమూ మీరు రాస్తున్న దాని చదువుతున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నామని మొత్తుకుంటున్నా సరే “మీ విమర్శల్ని నేను పట్టించుకోను,అలానే రాస్తాను – నా బ్లాగు నాఇష్టం,నచ్చకపోతే ఫో!” అనే బలుపుతో మాట్లాడుతున్న మీరు “సుధీర్ కి యాక్టింగ్ రాదు. అనసూయకు ఏమీ రాదు” అంటే ఎవడు పట్టించుకుంటాడు?ఎందుకు పట్టించుకోవాలి!


ఎందుకీ తొక్కలో ఏడుపు?


దానికి అతని రెస్పాన్సు ఇది:భుట్ జొలోకియా

నీ కోసమే, నీలాంటోళ్ళు వచ్చి ఇక్కడ ఏడిస్తే విందామని …


“వాంటెడ్ పండుగాడ్” సినిమాలో భుట్ జొలోకియా పేరుతో పోష్టులు పెడుతున్న వ్యక్తికి కనిపించిన సమస్యేమిటి ?సినిమా చూశాడు,ఆ సినిమాలో అతనికి కొన్ని నచ్చాయి,కొన్ని నచ్చలేదు.అయితే ఎవరన్నా ఇతన్ని అడిగారా - ఆ సినిమా గురించి చెప్పి మా సినీ పరిజ్ఞానాన్ని వృధ్ధి చెయ్యి అని?లేదే!ఆ సినిమా గురించి చెప్పాలన్న సరదా తనకి పుట్టిందే కదా!వ్రాసి అఘోరిస్తున్నది తెలుగులోనే కదా!మరి,"మిగిలిన వాల్లు,వాల్ల తప్పేం లేదు" అని ఎందుకు వ్రాస్తున్నాడు?


"నేను తోపుని ఇతర్లు బేకులు.నా బ్లాగు చూట్టానికి వచ్చేవాళ్ళు వెర్రివెధవలు." అనే కొవ్వు ఉన్నవాడు తప్ప మర్యాదస్తుడు ఇలా మాట్లాడుతాడా?


దీనికి నేను ఇచ్చిన రిప్లై ఇంకా పబ్లిష్ కాలేదు.బహుశా పబ్లిష్ కాకపోవచ్చు.ఒకవేళ పబ్లిష్ చేసినా ఎవరికీ ఉపయోగం లేదు.ఆ బ్లాగుకి మళ్ళీ మళ్ళీ వెళ్ళడం వల్ల మీకూ నాకూ కూడా ఎలాంటి ఉపయోగమూ లేదు.


జై శ్రీ రాం!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...