భారత జాతీయ ప్రభుత్వంలో "అవినీతి నిరోధక శాఖ" అనేది అసలు అవినీతిని నిరోధించే శాఖ కాదు.అది "లంచం తీసుకుంటున్నప్పుడు మాత్రమే పట్టుకోవాలి" అన్న నిర్దేశంతో ఏర్పాటు చేసిన అనవసరమైన శాఖ!అసలు సిసలైన అవినీతి నిరోధక శాఖ అయిన "విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్" అనేది ఉన్నప్పుడు దీని అవసరం ఏమిటి? ప్రజలను మభ్యపెట్టటానికే!లంచం ఇచ్చేలా ఏర్పాటు చేసిన విధివిధానాలను వెతికి పట్టుకునే అసలైన అవినీతి నిరోధక శాఖ అయిన "విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్" అనే శాఖని బలహీనం చేసి బలహీనమైన "అవినీతి నిరోధక శాఖ"ని ప్రభుత్వంలోని ఇతర శాఖలకు సమాంతరంగా పనిచేసేలా సృష్టించారు - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?
నిజానికి పోలీసులు ఎలాగైతే సాధారణ ప్రజల మీద నిఘా ఉంచుతూ నేరాలను అరికడతారో "విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్" అలాగే ప్రభుత్వాధికారుల పైన ప్రభుత్వోద్యోగుల పైన నిఘా పెట్టాలి.అనునిత్యం ప్రభుత్వ కార్యాలయాల మీదా ఉద్యోగులూ అధికారుల మీదా ఆడిట్లు నిర్వహిస్తూ క్రమశిక్షణా రాహిత్యాన్నీ అవినీతినీ నేరాల కింద నమోదు చేసి కేసులు పెట్టాలి.కానీ దానికి పనిగట్టుకుని పక్షవాతం తెప్పించి పిల్లుల తలల్ని గొరగడానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని మంగళ్ళతో "అవినీతి నిరోధక శాఖ" అనే పక్షవాతపు రోగిని అవినీతి మీద యుధ్ధానికి పంపిస్తున్నారు - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?
ట్రాఫిక్ పోలీసింగ్ వ్యవస్థ రవాణా శాఖకు అనుబంధమై పని చేయాల్సిన వ్యవస్థ అయితే దీన్ని తీసుకెళ్ళి పోలీసు శాఖకి అనుబంధం చేశారు.ప్రభుత్వ వ్యవస్థల నుంచి ప్రజలకి అందాల్సిన సౌకర్యాలలో సేఫ్టీ,సెక్యూరిటీ అనేవి ముఖ్యమైనవి.వీటిలో సేఫ్టీ అనేది సాంకేతిక విషయం అయితే సెక్యూరిటీ సాధారణ విషయం.రోడ్ల మీద ప్రజల ప్రాణాలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత రవాణా శాఖది - రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు,నిర్మాణం జరిగే పలు స్థాయిల్లో వాడుతున్న మెటీరియల్స్ యొక్క నాణ్యత,రోడ్దు మీద వాహనాలు వెళ్ళాల్సిన పధ్ధతులూ,పార్కింగ్ సౌకర్యాలూ అన్నీ గమనిస్తూ పౌరుల కదలికల్నీ ప్రయాణాల్నీ నియంత్రించే రావాణా శాఖయే ట్రాఫిక్ కంట్రోలింగ్ చెయ్యటం సముచితం అనే ఇంగిత జ్ఞానం రావాణా శాఖలోని ఏ ఒక్కరికీ లేకపోబట్టే ట్రాఫిక్ కంట్రోలింగ్ పోలీసు శాఖ అధీనంలోకి వెళ్ళింది.ట్రాఫిక్ కంట్రోలింగ్ అనేది రవాణా శాఖ నిర్మించిన రోడ్లకు సంబంధించిన సాంకేతిక ఉపశాఖ అయితే దాన్ని పోలీసు శాఖకు సాధారణ ఉపశాఖను చేశారు.ఇది ఆ రెండు శాఖలలోని ఉద్యోగులకూ పై సంపాదన కోసం ఆ రెండు శాఖల మధ్యన ఏర్పాటు చేసిన ఒక అవినీతి వారధి - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?
మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్ అనేది ఎలా ఉంటుందో
రిజిస్ట్రేషన్ శాఖ,రెవెన్యూ శాఖ,పంచాయితీ లేదా పురపాలక శాఖల మధ్యన ఏర్పాటు చేసిన సంబంధ
బాంధవ్యాలను చూస్తే తెలుస్తుంది.రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక ఆద్స్తి యొక్క యాజమాన్యం
మారినప్పుడు అది వయవ్సాయ భూమి అయితే రెవెన్యూ శాఖకూ ఇల్లు లాంటి మానావ్ నిర్మిత ఆస్తి
అయితే స్థానిక పంచాయితీ ఆఫీసుకు గానీ పురపాలక సంఘానికి గానీ రిజిస్ట్రేషన్ ఆఫీసు నుంచి
నోట్ వెళ్ళాలి,అక్కడ రికార్డులు మారాలి.దీనికోసం పౌరులు ఏమీ చెయ్యాల్సిన పని లేదు.బ్రిటిష్
వాళ్ళ కాలంలో ఏర్పాటు చేసిన "పౌరుల వద్దకు ప్రభుత్వ సేవలు వెళ్ళటం" అనే పాత
మంచి విధానాన్ని స్వతంత్రం వచ్చాక తీసేసి "ఒక చిన్న పనికోసం పెద్ద పెద్ద పనులన్నీ
ఆపుకుని ప్రభుత్వాధికారుల చుట్టూ ప్రజలు చక్కర్లు కొట్టటం" అనే కొత్త చెత్త విధానాన్ని
ప్రవేశ పెట్టారు మన అధికారులుం గార్లు - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక
నేర్చిన తనం?
అసలు రవాణా శాఖ చేస్తున్న అత్యంత లాఘవమైన అవినీతి ఇంజనీరింగ్ అద్భుతం నేరాలకి తావు లేదనుకునే చోట కూడా నేరాలను చేయంచగలిగే నియమాలను ఏర్పరచి స్వయాన ప్రజల చేతనే అవినీతి చేయించి జరిమానాలు వెయ్యటం!పౌరుడు స్వంతంగా వాడుకునే ఒక వాహనాన్ని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తీసుకెళ్ళినప్పుడు జరగాల్సిన మామూలు పధ్ధతులను తిరగేసి మరగేసి తప్పుదోవ పట్టించి ఉల్లంఘనలు తప్పనిసరిగా జరిగేటట్టు నిబంధనలను తయారు చేశారు.డిపార్టుమెంటు వారు "మీకు మీరు ఆఫీసుకు వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోండి!" అని పౌరులకు చెప్పటంతోనే మొదటి లెవెల్ అవినీతి మొదలవుతుంది.అది ఆ డిపార్టుమెంటు చెయ్యాల్సిన విధిలోని అత్యంత సహజమైన బాధ్యత అనేది పౌరులకు తెలియదు,తెలియనివ్వలేదు అంటే బాగుంటుంది.వాళ్లు చెయ్యాల్సిన పనిని పౌరులకు చేతి చమురు వదిలించుకునే వ్యవహారంలా తయారు చేసి అప్పగించడం దగ్గిర్నుంచీ పౌరుల్ని కోర్టుల ముందు "పన్నుల ఏగవేత దారుడు" అనే నేరం మోపి నిలబెట్టడం వరకూ జరుగుతున్న అనేకమైన సంఘటనల వెనక ఉన్న అదృశ్య హస్తం ప్రభుత్వాధికారుల అవినీతియే అన్నది నిజం - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?
పౌరుడిని చట్టబధ్ధంగా నడుచుకునేలా చెయ్యడమే ఒక ప్రభుత్వ అధికారి యొక్క ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క బాధ్యత అని చట్టలో ఉంది.కానీ, ఇక్కడ నడుస్తున్నది పూర్తి వ్యతిరేకం.ఇక్కడ నడుస్తున్నది ప్రభుత్వాధికారుల దృష్టిలో చట్టాన్ని అమలు చెయ్యడం అంటే పౌరుల్ని నేరస్థుల కింద తయారు చేసి వాళ్ళనుంచి జరిమానాలు కట్టించుకోవడం మాత్రమే.జరిమానాలు కట్టలేని వాళ్ళ దగ్గిర లంచం తీసుకుని జరిమానా రద్దు చేసి పంపిస్తారు - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?
మీరు గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్ళి అప్లికేషన్ పెట్టినప్పుడు పలు రకాల సర్టిఫికెట్లను జత చేయమంటారు.అందులో కొన్ని ఇతర ఆఫీసుల నుంచి రావలసిన వాటిని తేవడానికి మిమ్మల్నే వెళ్ళమంటారు.వాటిని ఆయా చోట్లనుంచి తెప్పించుకోవడం వాళ్ళ పనే అని మీకు తెలియదు కాబట్టే వెళ్తున్నారు.అక్కడ లంచాలు ఇచ్చి తెచ్చుకుని వీళ్ళకి ఇస్తున్నారు.ఇలా ఎన్నో రకాల సంస్థాగత,వ్యవస్థాగత అపసవ్యతలను సృష్టించి పౌరులకు అవినీతిని తప్పనిసరి చేస్తున్నారు - అవినీతిని క్రమబధ్దం చెయ్యడం ఎంత చక్కటి బతక నేర్చిన తనం?
న్యాయ్వవస్థ కూడా అవినీతికి అతీతం కాదు.ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని నేరం కింద చూసి విజిలెన్స్ శాఖకు అప్పగించి నేరపరిశోధనకు పురమాయించి నేరం రుజువైతే శిక్షించాల్సిన కోర్టులే ఆ పని చెయ్యనప్పుడు పౌరులు ఎంత ఆవేదన పడి మాత్రం ప్రయోజనం ఏమిటి?
No comments:
Post a Comment
సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు