Monday 15 November 2021

ఆంధ్రలో భాజపా గరుడ వ్యూహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది?అధికారం దక్కేనా!

ఆంధ్ర త్వరలో ఆర్ధిక అత్యయిక పరిస్థితిని ఎదుర్కొంటుందనే కధనం చూసి నవ్వొస్తున్నది నాకు.జగన్మోహన రెడ్డి 151/175 సీట్లు గెల్చుకుని ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే నేను ప్రభుత్వం పూర్తి కాలం ఉండదు,తను జగన్మోహన రెడ్డితో చేయించుకోవాల్సిన పన్లు పూర్తయ్యేవరకు మాత్రమే అతన్ని అధికారంలో ఉంచి అతను తన పని పూర్తి చేశాక గానీ తోక ఝాడించటం మొదలు పెట్టినప్పుడు గానీ భాజపా రాష్ట్రపతి పాలనతో తను అధికారంలోకి రావడానికి సానుకూలతలను సృష్టించుకుంటుంది అని చెప్పాను.

బుద్ధి తక్కువ రెడ్లకి ప్రతినిధి అయిన జగన్మోహన్ రెడ్డి భాజపా తనకు చేసిన సహాయానికి కృతజ్ఞత తీర్చుకుంటున్నట్టు  తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాలతో రాష్ట్రంలోని గనులూ పోర్టులూ అడవులూ పరిశ్రమలూ చాలామటుకు అంబానీ ఆదానీల చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే,త్వరలో విశాఖ ఉక్కు కూడా వెళ్తుంది.ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలూ భాజపా ఆంధ్ర విషయంలో వేస్తున్న ఎత్తుల్ని పసికట్టలేని తెలివి తక్కువ నాయకుల అధ్వర్యంలో నడుస్తున్నాయి.

అమరావతి రైతుల అవిశ్రాంత పోరాటం వెనుక తెలుగుదేశం పార్టీ  ఉన్నదనేది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.నిజానికి జగన్మోహన రెడ్డి అమరావతిని ధ్వంసం చెయ్యటమూ మూడు రాజధానుల ప్రణాళిక వెయ్యడమూ అమరావతి చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ కావడం వల్ల కాదు.ఎప్పుడో కదప నుంచి లోక స్బహకు ఎన్నికై తరండ్రికి ఎన్నికల సమరాలలో సహాయం చేసిన నాటినుంచి అతని రాజకీయపు అనుభవానికి అమరావతిని కొనసాగించి CRDA ఇచ్చిన వెసులుబాటు ప్రకారం ప్రభుత్వానికి దఖలు పడిన అదనపు బూముల్ని అంచెల వారీ అమ్ముకుంటూ పోతే ఉద్యోగులకు జీతాల వంటి రోజువారీ ప్రభుత్వ నిర్వహణకీ అతను వాగ్దానం చేర్సిన నవరత్నాల ఉచిత పధకాలకీ ఇబ్బడి ముబ్బడి అన్న స్థాయిలో దబ్బు సమకూరుతుందని తెలియదా?అతనికి తెలియకపోతే పక్కన ఉన్న అతని అవినీతి కేసుల్లోనే కాదు పేరురూఢికాని పార్టీలో కూడా A2 అనిపించుకుంటున్న అకవుంటెంటు విజయసాయిరెడ్డికి తెలియదా?

అందరికీ అన్నీ తెలుసు.ప్రస్తుతం ఆంధ్రలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం భాజపా ఆంధ్రలో రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి నడిపిస్తున్న నటుడు శివాజీ అప్పుడెప్పుడో బయటపెట్టిన గరుడ వ్యూహంలోని ఆఖరి అంకం యొక్క మొదటి దృశ్యం!అమరావతిని కొనసాగించితే CRDA నిధులతో బడ్జెట్లేసుకునీ నవరత్లాల పేరున గుడ్విల్ కొట్టేసీ జగన్ పాతుకుపోతాడు గనకనే అమరావతిని ప్రస్తుతానికి ఆపేయమన్నారు.చంద్రబాబు గిజిగాడిలా అల్లిన CRDA నిబంధనల వల్ల జగన్ వెయ్యేళ్ళు తల్లకిందులు తపస్సు చేసినా అమరావతిని పూర్తిగా రద్దు చేసి మూడు రాజధానుల ప్లానుని అమలు చెయ్యలేడు - అది భాజపా కేంద్ర నాయకత్వానికీ రాష్ట్ర నాయకత్వానికీ తెలుసు.ఒక మధ్యతరగతి బడుగు జీవి స్థానంలో ఉండి ఆలోచిస్తే అది చాలా దుర్మార్గమైన ప్లాను అని భాజపా మీద చాలా కోపం వచ్చేస్తుంది,నాకూ కోపం వచ్చింది కూడా.కానీ, ఒక రాజకీయ విశ్లేషకుడి స్థానంలో నిలబడి చూస్తే వ్య్యూహం ఒక హఠాత్ ఆలోచన నుంచి పుట్టింది కాదనీ అని వైపుల నుంచీ చూసి ఇలా తప్ప ఇంకోలా ఆంధ్రలో మనం కాలు మోపడం కష్టం అని తెలిశాకనే తప్పనిసరై వెయ్యాల్సి వచ్చినట్టు అనిపిస్తున్నది నాకు.

ఎందుకంటే, ఒక ప్రాంతంలో ఒక పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లోనే అధికారంలోకి రావడం ప్రాపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు.ఒక ననదమూరి రామారవౌ స్థాపించిన తెకుగుదేశానికే ఖ్యాతి దక్కింది.అయితే, అది పార్టీ నాయకుల ప్రతిభ వల్ల సాధ్యం కాలేదు,అప్పటి కాంగ్రెసు పరిపాలన వల్ల సాధ్యపడింది,అవునా? ఒక్క ఎన్నికలోనూ అద్ర్ష్టం తాయెత్తు పని చేసినప్పటికీ తర్వాత పార్టీ యొక్క  ప్రాభవానికి కమ్మ కులస్థులు అపార్టీని సొంతం చేసుకోవదం ఒక ముఖ్యమైన కారణం.అప్పట్లో ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడికి విస్తరించుదామనుకున్న కాన్షీరాం విలేఖర్లతో ఆంధ్ర ప్రాంతపు రాజకీయ సమీకరణాలను గురించి "కాంగ్రెసు పార్తీ రెడ్ల పార్టీ తెలుగుదేశం కమ్మవాళ్ళ పార్టీ!" అని తేల్చి చెప్పడం ఎవరికి తెలియదు?

అది పచ్చి నిజం!ఇక స్వతంత్రం రావడం ఖాయం అనుకున్న ఆఖరి దశాబ్దం నుంచి కాంగ్రెసులో రెడ్ల హవా మొదలైంది.జాతీయ స్థాయిలో చూస్తే కాగ్రెసు పార్టీ వాళ్ళూ వీళ్ళూ అని లేదు జమీందార్లూ రాజులూ బ్రాహ్మలూ పెద్ద కులాల వాళ్లతోనే నిండిపోయింది.అంతెందుకు, పీడిత తాడిత దళిత అట్టడుగు ప్రజలను ఉద్ధరించడానికి బయల్దేరిన విప్లవ పార్టీలలో కూడా పైస్థాయి నాయకులు మూడొంతుల మంది బ్రాహ్మలూ కమ్మలూ రెడ్లే ఉన్నారు, ఇప్పటికీ!మచ్చుకు కొన్ని ఉదాహరణలు చెప్తాను - S.A.Dange అని పొట్టి పేరుతో మాంకి తెలిసిన శ్రీపాద్ అమృత డాంగే బౌద్ధ బ్రాహ్మడు,D.D.Kaushambi అని పొట్టిపేరుతో మనకి తెలిసిన దేవానాంద ధర్మానంద కౌశాంబి బౌద్ధ బ్రాహ్మడు,జంఝం తెంపేసిన శ్రీశ్రీ ఆరుద్రలు కూడా బ్రాహ్మలే! ఇది అంత అసహజమైనది కూడా కాదు.అజ్ఞానం దారిద్య్రం కవల పిల్లలు అన్నట్టు అప్పటికే పొట్ట గదవటానికి తిప్పలు పడుతున్న చదువూ సంధ్య లేని వాళ్ళు తమ దరిద్రంలో తలమునకలవుతూ ఒక రాజకీయ పార్టీలో చేరి పని చేస్తూ పార్టీని ఎట్లా పోషించగలరు? వెసులుబాటు ఉన్న అగ్రకులాలలోని యువకుల్లో కొందరు ఆదర్శాలకీ కొందరు ద్రవ్యార్జనకీ ఉన్న అవకాశాలను బట్టి ఆయా పార్టీల్లో చేరుతున్నారు.

సమర్ధులు గాబట్టి పైకొచ్చారు అని సమర్ధించుకున్నపటికీ ఆదర్శం,నీతి పేరున జడ్జి చేస్తే ఇది కూడా పక్షపాతం,బంధుప్రీతి అనే లెక్కలోకి రావాల్సిందే!కానీ,ప్రత్యామ్నాయం లేని సహజమైన రీతిలో తక్కువ స్థాయిలో జరుగుతున్నది కాబట్టి మినహాయింపు ఇవ్వొచ్చు,ఇస్తున్నాం కూడా!అయితే, కాంగ్రెసు, తెలుగుదేశం అనే రెండు పార్టీలనీ రెండు కులాలూ పంచుకుని పక్షపాతం,బంధుప్రీతి అనేవాటిని తారాస్థాయికి తీసుకెళ్ళి సామాన్య ప్రజల జీవితాల్ని సంక్షోభానికి గురి చేస్తున్నాయి.

ఇక్కడ ఇతర ఎనలిష్టులు గమనించని ఒక విశేషాన్ని నేను గమనించాను.ఓటర్లు తెలివి తక్కువ వాళ్ళనీ వాళ్ళు ఉచితాల కోసం ఆశపడి తప్పుడు వెధవల్ని ఎన్నుకుంటున్నారని అంటున్న మాటల్లో నిజం లేదు.ప్రత్యేకించి నేనెప్పుడూ ఎన్నికల విశ్లేషణల్ని చెయ్యలేదు గానీ ఫలితాల్ని గమనిస్తూనే ఉన్నాను - ఓడిపోయిన పార్టీలు తమ లోపాల్నీ అసమర్ధతల్నీ ఒప్పుకోలేక తమకు అనుకూలమైన మీడియాలో అలా వ్రాయించుకుంటున్నారు, అంతే! ఉదాహరణకి 2014 నాడు విభజన జరిగిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెసు చేసిన తెలివి తక్కువ విభజనని తనకు అనుకూలం చేసుకుని చంద్రబాబు "సమస్యలతో విడిపోయిన రాష్ట్రానికి అనుభవజ్ఞు డైన ముఖ్యమంత్రి చాలా అవసరం!" అని తనను తను ప్రొజెక్ట్ చేసుకోగలిగాడు కాబట్టి విశ్లేషకులు వూహించని రీతిలో గెల్చాడు.అప్పటి ఎన్నికల ప్రచారంలో కేసీయార్ "ఇక్కద నేనూ అక్కడ జగనూ" అనడాన్ని గుర్తుకు తెచ్చుకుంటే అప్పటి చంద్రబాబు గెలుపు ఎవరూ వూహించనిదే అని అర్ధం అవుతుంది.పైన అతని ప్రతికక్షి జగన్మోహన రెడ్డి ఋణమాఫీ పధకాన్ని వ్యతిరేకించడం లాంటి పిచ్చిపనుల్ని చేసి తన అనుభవలేమిని చూపించేసుకున్నాడు కూదాను.మరి అప్పుడు వోటర్లు కులపిచ్చితోనూ ఉచితాల పట్ల ఆశతోనూ గాక తెలివిని చూపించినట్టు తెలుస్తున్నది కదా!

మొన్నటి ఎన్నికలను చూస్తే ఎన్నికల సమయానికి చంద్రబాబు ప్రత్యేకహోదాని సాధించడం, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చెయ్యడం వంటి విషయాలను గురించి చెప్పుకోవడం కుదరని స్థితిలో ఉన్నాడు.చాల ఎక్కువ చేసి చెప్పుకున్న ప్రపంచ స్థాయి రాజధానికి శంకుస్థాపన ఒక్కటే చేశాడు, నాలుగేళ్ళ తర్వాత కూడా లే అవుట్ ప్లాన్ ఫైనలైజ్ చెయ్యలేకపోయాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేల కరప్షన్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మహిళల మానమర్యాదల్ని మంటగలిపే స్థాయిలో జరుగుతున్న వడ్డీ వ్యాపారం లాంటి ప్రతికూలతల మధ్యన గెలిచి ఉంటేనే ఆశ్చర్యపడాల్సిన స్థితిలో ఉంది తెలుగుదేశం పార్టీ అప్పుడు.ఎన్నికల సమయానికి ఏయే అంశాలు గెలుపోటముల్ని నిర్ణయిస్తాయో ఆయా అంశాలని పూర్తిగా నిర్లక్ష్యం చేసిననదువల్లనే ప్రజలు తిరస్కరించినట్టు స్పష్టమై తెలుస్తుంటే వోటర్లని కృతఘ్నులనీ దురాశాపరులనీ అజ్ఞానులనీ తిట్టడంలో ఏమి న్యాయం ఉంది?

ఇవన్నీ ఆయా పార్టీలకు గాలి కొట్టి అవి ప్రభుత్వంలోకి వస్తే ప్రతిఫలం కోరుకునే భజనపరులు చెప్తున్న అబద్ధాలు. రెండు ఎన్నికలే కాదు,దేశంలో ఎన్నికల వ్యవస్థని అమలు చేసిన తొలినాటినుంచీ నూటికి తొంభై శాతం ఎన్నికలు వోటర్ల తీర్పు సరైనదేనని రుజువు చేస్తున్నాయి.

కీలకం ఏమిటంటే,ప్రతి ఎన్నికలోనూ ఆయా రాజకీయ పార్టీలకు ధనసహాయం చేసే పారిశ్రామిక వ్యాపారవేత్తల అవసరాలూ చొరవలూ ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపుని నిర్ణయిస్తున్నాయి. మొన్నటి చంద్రబాబు వోటమికి కారణమైన అంశాల్లో అతి ముఖ్యమైన కారణం అప్పటికే స్థిరపడిపోయిన ప్రతికూలతల వల్ల సంప్రదాయిక స్పాన్సరర్లు  మొహం చాటేశారు.తెలుగుదేశం ప్రచార సరళి కూడా చాలా పేలవమైన రీతిలో సాగడం ఎంతమంది గమనించారో తెలియదు గానీ వేమూరి రాధాకృష్ణ తన కొ{చె}త్తపలుకులో ప్రస్తావించిన ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తాను.ఒక తెలుగుదేశం సానుభూతిపరుడు కేసీయార్ ఆంధ్రమూలాలు ఉండి తెలంగాణలో వ్యాపారాలు ఉన్న బలమైన రాజకీయ వ్యాపార వర్గాల్ని జగన్ వైపుకు తరుముతున్నాదని చెప్తుంటే నటుడు పృధ్వీ పాప్యులర్ చేసిన "థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ!" డైలాగుకి ప్యారడీలా " నలబై ఇయర్స్ అనుభవం ఇక్కడ!" అని చెప్పుకునే చంద్రబాబు గారు ఏమాత్రం కంగారు పడక "నువ్వూ పొవచ్చు గదా,మాకుందుకు చెప్తున్నావు!" టైపు కుళ్ళు జోకులు వేశారే తప్ప రెమిడియల్ యాక్షన్ కోసం ప్రయత్నించలేదట - అసలు అది పెద్ద సమస్య కాదని అనుకున్నట్టు రెమిడియల్ యాక్షన్ తీసుకోకపోవటమే సాక్ష్యం,కదా!రెమిడియల్ యాక్షన్ అంటే ఆర్ధికపరమైన భరోసా ఇవ్వటం తప్ప ఇంకేం ఉంటుంది, చెప్పండి!అప్పటికే దరిద్రుడికి ఆకలెక్కువన్నట్టున్నూ అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకన్నట్టునూ ఆలోచిస్తున్న స్పాన్సరర్లు పైన నేను చెప్పిన ప్రతికూలతల్ని లెక్కేసుకుని అసలుకే పిడికిళ్ళు మూసేస్తే కొసర్లకి డబ్బు ఎలా వస్తుంది?

ఇక ఆఖరి సంవత్సరంలో భాజపాతో తెగదెంపులు చేసుకుని ఒంటరి పోరుకు సిద్ధపడటం అసలైన తప్పు.పేరురూఢికాని పార్టీ చాలా ముందునుంచే చంద్రబాబు "ఒకే వరసన రెండు సార్లు ఎప్పుడూ గెలవలేదు,ఒంటరి పోరులో ఎప్పుడూ గెలవలేదు,ఈసారి కూడా అదే రిపీటవ్వుద్ది" అని ఒక మూఢనమ్మకాన్ని ప్రజల మెదళ్ళలోకి ఎక్కించేస్తున్న తర్వాత కూడా తెలుగుదేశం నాయకత్వం అంత తెలివితక్కువ నిర్ణయం ఎలా తీసుకున్నదో అర్ధం కావడం లేదు నాకు.

ఇక్కడ మిగిలిన విశ్లేషకులు ఇప్పటివరకు చెప్పని ఒక విషయం చెప్తాను.అయిదుగురు తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్ని తన మంత్రువర్గంలోకి తీసుకున్న కేంద్ర భాజపా నాయకత్వం పొమ్మనక పొగబెట్టిన చందాన సహాయ నిరాకరణ చరెసి విసిగించి విసిగంచి ఎన్నీలకి ముందు అతడే బయటికి పోయేలా చెయ్యదం ఎప్పటినుంచి మొదలు పెట్టిందో తెలుసా! రెండు పార్టీలకీ మధ్యన తిరుమల చుట్టూ రమణ దీక్షితులు పాత్రధారిగా జరిగిన దొంగాట చాలా నిగూఢమైనది.అక్కద మనకు మీడియా ముందు కనబడి వినబడి తెలిసినది రమణ దీక్షితుల్ని ప్రధాన పూజారి హోదానుంచి తొలగించడమూ పింక్ దైమండ్ కనబడకుండా పోవడమూ మాత్రమే.అప్పట్లోనే చంద్రబాబు సమస్య యొక్క సంక్లిష్టతని అర్ధం చేసుకోక తప్పుడు ఎత్తులు వేస్తున్నాడు,ప్రతిస్పందన సరైనది కాదు,వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదేమో అనిపించింది నాకు.అదే జరిగింది కదా!

ఇది సంచలనమై ఫ్రంట్ లైన్ హెడర్లు మోతెక్కిస్తున్న హడావిడి మధ్య తెలుగుదేశం సన్నాయినొక్కుల్లో బయటపడిన భాజపా ప్రాచీన ఆలయాల సంరక్షణ పేరున తిరుమలని కేంద్ర ప్రభుత్వం అధికార పరిధిలోకి తీసుకుపోవాలని అనుకోవటమే రెండు పార్టీలకీ శత్రుత్వం ఏర్పడటానికి కారణం.అక్కడున్న నిధుల్ని ప్రభుత్వం వాడుకునే వెసులుబాటు ఉన్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం అనే ప్రాతిపదికన నేను సైతం అప్పుదు వ్యతిరేకించాను గానీ తిరుమల యొక్క ఆధ్యాత్మిక పవిత్రతని గురించి ఆలోచిస్తే చాలా మంచి నిర్ణయం అని ఇప్పుడు అనిపిస్తున్నది.తనేదో సుద్దపూస అయినట్టు ఆలయాలను పడగొడుతున్నట్టు జగన్ని తిడుతున్నాడు గానీ అలిపిరి నాకు పునర్జన్మ ఇచ్చిందనే పెద్దమనిషి కూడా టీటీడీ కార్యవర్గంలోకి క్రైస్తవుల్ని పంపిన వాడే,చంద్రన్న క్రిస్మస్ కానుకలు అందించిన వాడే కదా.అప్పుడు తిరుమల భాజపా చేతికి వెళ్ళి ఉంటే రెండో రోజుకే ఏళ్ళ తరబడి తిష్ఠ వేసుకుని కూర్చున్న హైందవేతరుల్ని మెడపట్టి బైటికి గెంటటం సాధ్యపడేది.

గతంలో పైకి అమాయకంగా కనబడుతున్న సన్నివేశాల వెనక ఉన్న భాజపా అసలైన వ్యూహాలు నాకు అలా అర్ధం అయ్యాయి.ఇది కరెక్టా కాదా అనేది భాజపా క్రియాశీలక సభ్యులు చెప్పాలి.నిజమైతే సంతోషం - కాలరెగరేస్తాను.నిజం కాకపోతే పెద్ద విచారమూ లేదు.ఎందుకంటే సీనియర్ విశ్లేషకులు సైతం ఇలాంటి విశ్లేషణలు చేసినప్పుడు కొన్నే రైటని తేల్తున్నాయి.కుర్ర వెధవని, ఎగరేసిన కాలర్ దించి మడిస్తే సరిపాయె!

తెలుగుదేశం పార్టీయే కాదు, పార్టీని మోస్తున్న వాళ్లలోని హిందువులు కూడా సూడో సెక్యులరిస్టు పైత్యంతో రాష్ట్రంలో హిందూమతం అంతరంచి పోతున్న వాస్తవాన్ని గమనించడం లేదు.సామాన్య హిందువులలో గమనిక ఉంది,హిందూ అనుకూల ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు.తెలుగుదేశమే కాదు పేరురూఢికాని పార్టీకి స్పాన్సర్ చేస్తున్నవాళ్ళలో కూడా హిందువులు ఉన్నారు.వీళ్ళ బుద్ధి ఎప్పుడూ వ్యాపారం, లాభం చుట్టూనే తిరుగుతుంది.విజయవాడ చుట్టుపక్కల బలమైన పునాది ఉన్న కమ్యూనిష్టుల్లో చాలామంది కమ్మ కులస్థులు.రాయలసీమలో రెడ్లలో చాలామంది మతం మారిపోయారు. వీళ్ళ దినసరి,నెలసరి, జీవన పర్యంత కార్యక్రమం రెండిట్లో ఏదో ఒక పార్టీకి స్పాన్సర్ చేస్తూ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకాస్త బలిసిపోవదం,రెండో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి వెన్నపూసి ఇంకాస్త బలిసిపోవడం తప్ప మతం,ఆధ్యాత్మికత,నైతికత వంటివాటిమీద శ్రద్ధ లేదు. అప్పుడప్పుడూ గుడులకీ యాత్రలకీ వెళ్ళడం కూడా పుణ్యం వస్తుందనో వ్యాపారంలో ఎదగడం కోసం చేసిన పాపాలు పోతాయనో వెళ్తారే తప్ప భక్తితో జ్ఞానం కోసం వెళ్ళే రకాలు కాదు.

మరి,సామాన్య హిందువుల్లో మతాభిమానం పెరిగి హిందూ అనుకూల ప్రభుత్వాన్ని కోరుకుంటున్న సాక్ష్యాలు కనబడుతున్నప్పటికీ భాజపా తన వోట్ల శాతాన్ని పెంచుకోలేకపోవడానికి ముఖ్యమైన కారణం నమ్మకమైన స్పాన్సరర్లు లేకపోవటమే, నిజం!ఒక పార్టీ తను అధికారంలోకి వస్తే ప్రజలకు భదర్త ఇస్తానని చెప్పి ఒప్పించటం అనేది అంత సుకువైన పని కాదు.గ్రామ స్థాయిలో చిన్న బహిరంగ సభ పెట్టటానికి సైతం చాలా డబ్బు కావాలి.పార్టీ శాఖకి ఒక చిన్న కార్యాలయం పెట్టి నడపటాని కి డబ్బుతో పాటు అంకిత భావంతో పని చేసే ఇద్యోగులు కావాలి. రెండు పార్టీల్ని మోస్తున్న మూర్ఖపు స్పాన్సరర్లు భాజపా వైపుకు రావదం లేదు గనక తనకంటూ నమ్మకమైన స్పాన్ససర్లు అయిన అంబానీ ఆదానీల్ని రాష్ట్రంలోకి దించుతున్నది బీజేపీ కేంద్ర నాయకత్వం. విశ్లేషణ వాస్తవాన్ని పట్టుకోగలిగిందా లేదా అనేది తెలియాలంటే భాజపా అనుకూల పారిశ్రామిక వర్గాలు రాష్ట్ర ఆర్ధిక వేదిక మీద బలపడేవరకు ఆగాలి.అందుకు రెండేళ్ళు సరిపోతుందని అనుకుంటున్నాను నేను.రెండేళ్ళ తర్వాత రాష్ట్ర భాజపా నాయకత్వం పాదయాత్రలూ జనసమీకరణలూ అని హడావిడి మొదలెడితే అది నా విశ్లేషణకి బలమైన సాక్ష్యం అవుతుంది.

తర్వాతి దశలో రెండు పార్టీల్ని మోస్తున్న మూర్ఖపు స్పాన్సరర్లు అడుక్కు తినాల్సిన పరిస్థితికి కూడా వెళ్తారు.అలా పంపకపోతే అసలుకే మోసం వస్తుంది కాబట్టి భాజపా అలా చేసి తీరుతుందనే అనుకుంటున్నాను నేను. చాలామంది భాజపా అభిమానులు సైతం త్వరలోనే జగన్ జైలుకి వెళతాడని ఎదురు చూస్తున్నారు గానీ జగన్ ఎప్పటికీ జైలు మొహం చూసే రోజు రాకపోవచ్చు. జగన్ జైలుకి వెళ్ళడం వెళ్ళకపోవడం తెలుగుదేశాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది తప్ప భాజపాకి అసలు పట్టించుకోవాల్సిన అంశమే కాదు. అతని వల్ల జరగాల్సిన సాయం అల్లా తనకు బలమైన స్పాన్సరర్లని రాష్ట్ర ఆర్ధిక రంగంలోకి దించడమే.

పొలిటికల్ ఎనలిస్టు హోదాలో నేను సెంటిమెంట్లకీ పైకి కనిపించే అమాయకపు దృశ్యాలకీ మోసపోని ప్రాక్టికాలిటీతో చూస్తే ఎన్నికలు దరిదాపుల్లో లేని ఇప్పుడు అతన్ని జైలుకి పంపిస్తే సింపతీ ఫ్యాక్తరు పనిచేసి ఎన్నికల సమయానికి గట్టి పోటీ అవుతాడు.అతన్ని ముఖ్యమంత్రిలానే ఉంచి అతను చేస్తున్న అరాచకపు పనుల వల్ల ఒకవేళ ఎన్నికల సమయానికి తెలుగుదేశం బలం పెరిగినప్పుడు అతని కేసుల్ని ఎత్తేస్తే అతని అభిమానుల హుషారు వల్ల రెండు పార్టీల వోటర్లు అయోమయానికి గురై వాళ్ళ వోట్లు అటూ ఇటూ చీలడం భాజపాకి అనుకూలం అయ్యే అవకాశం కూడా ఉంది, కదా!

ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన ఆర్ధిక సంక్షోభం పేరున రాష్ట్రపతి పాలన విధించదం జరిగితే చాలా కాలం క్రితం నేను భాజపా అమలు చేస్తుందని చెప్పిన ప్రణాళికలో మొదటి దశ పూర్తయినట్టు.అప్పుడు ప్రత్యేక హోదా నుంచి పొలవరం పూర్తి చెయ్యదం వరకు స్థానిక భాజపానాయకుల్ని ముందు నిలబెట్టి జరిపిస్తే హందూ వోట్ బ్యాంక్ తయారవుతుంది.స్పాన్సరర్ల వైపునుంచి ధనసహాయం కూడా తీసుకుని భాజపా రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేవి అక్కడి ఇక్కడి భాజపా నాయకుల వ్యూహం అనుకుంటున్నాను నేను.. 

ప్లాను పని చేస్తుందా లేదా అని అనుమానించాల్సిన అవసరం లేదు.పనిచేస్తుంది.అయితే, ఇప్పటికి దక్షిణాదిలో వేలు పెట్టిన ప్రతి రాష్ట్రంలోనూ చితక్కొట్టించుకున్నది గుర్తుంచుకోవాలి.ఒళ్ళు దగ్గిర పెట్టుకుని ప్లాను అమలు చేస్తేనే ఆంధ్రలో భాజపా అధికారంలోకి వస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నమ్మకమైన స్పాన్సరర్లు లేకపోవడమే కారణం అనిపిస్తున్నది నాకు.ఆఖరి టార్గెట్ ఆంధ్రా కూడా మిస్సయితే ఇక ఉత్త్తరాదిలో కూడా మొహం చెల్లని పరిస్థితి వస్తుంది. అదే ఆంధ్రలో ఎత్తుగడలు ఫలిస్తే దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలని ఆక్రమించడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టొచ్చు.

జై శ్రీ రాం! 

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...