Monday, 6 January 2020

ప్రస్తుతం అమరావతిలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ రాజధానిని జగను ప్రభుత్వం విశాఖకు తరలించడం ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యపడేది కాదు!

"మూడు రాజధానులు అనగానే మూడు ప్రాంతాలలో అన్ని నిర్మాణాలు చేయరు అన్నది గమనించాలి. అధికార వికేంద్రీకరణలో భాగంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పరిపాలక కేంద్రం ఏర్పాటు అన్నది గమనించగలగాలి. ప్రకటన రాగానే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎక్కడుంటారు అని అడగటం అర్థం లేని ప్రశ్న. టెక్నాలజీ పితామహుడిగా, నూతన సాంకేతికతను, మొబైల్స్ ను ప్రవేశపెట్టిన సాంకేతిక దార్శనిక నేతగా చెప్పుకునే ఆయన నుండి ఇటువంటి ప్రశ్న రావడం హాశ్చర్యకరం. అసెంబ్లీ సమావేశాలపుడు అమరావతి, మిగతా సమయంలో అధిక భాగం (అంటే పర్యటనలు వంటివి మినహాయించి) వైజాగ్ లో అన్నది ఆయనకు అర్థం కాలేదేమో. కర్నూలులో హై కోర్ట్ ఉంటుంది, అవసరం ఉన్నవారు అక్కడికెళతారు.
- ఇక దూరం గురించి కర్నూలులో హై కోర్ట్ ఉంటే శ్రీకాకుళం నుండి ఎలా వెళతారు? వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉంటే కుర్నూలు, అనంతపూర్ లనుండి ఎలా వెళతారు? అంటూ కొందరు ప్రసినిస్తున్నారు. అయితే ఢిల్లీలో దేశ రాజధాని, సుప్రీం కోర్ట్ ఉంటే కన్యాకుమారి వంటి ప్రాంతాలనుండి ఎవరూ వెళ్ళట్లేదా? ఆయా కార్యాలయాలకు అవసరం ఉన్నవారు వెళతారు."
పముఖ బ్లాగరు వంశీ కలుగోట్ల గారి విశ్లేషణ, మూడురాజధానుల సమర్ధన!చిత్రం ఏమిటో చూశారా," ప్రకటన రాగానే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎక్కడుంటారు అని అడగటం అర్థం లేని ప్రశ్న. టెక్నాలజీ పితామహుడిగా, నూతన సాంకేతికతను, మొబైల్స్ ను ప్రవేశపెట్టిన సాంకేతిక దార్శనిక నేతగా చెప్పుకునే ఆయన నుండి ఇటువంటి ప్రశ్న రావడం హాశ్చర్యకరంఅని అంటున్నారంటే దాని అర్ధం ఏమిటి?అంతర్జాలం విస్తరించిన రోజుల్లో ప్రతి ఒక్కరూ తమపనులకు వ్యక్తిగతంగానే వెళ్ళాలా అనే వెక్కిరింపు ఉంది అందులో, మరి ఇదే కారణం వారి వాదనకు బెండు కొడుతున్నదనేది కూడా వారికి తోచడం లేదు.టెక్నాలజీని ఉపయోగించుకుని రాజధానికి వ్యక్తిగత ప్రయాణం చెయ్యాల్సిన అవసరం లేనప్పుడు ఇప్పటికే అమరావతిలో ఉన్న భవనాలను ఉపయోగించుకోవటం మాని విశాఖలో కొత్త భవనాల్ని నిర్మించి మరీ తరలించాల్సిన అవసరం ఏమిటనే ఆలోచన వారికెందుకు తోచడం లేదు?
"అయితే ఢిల్లీలో దేశ రాజధాని, సుప్రీం కోర్ట్ ఉంటే కన్యాకుమారి వంటి ప్రాంతాలనుండి ఎవరూ వెళ్ళట్లేదా? ఆయా కార్యాలయాలకు అవసరం ఉన్నవారు వెళతారు." అనే సమర్ధన కూడా అంతే! అసలు సమర్ధన రాజధానిని విశాఖకు తరలించే ప్లానునే వెక్కిరిస్తుందనేది బ్లాగరుకీ ఈయన్ని సమర్ధిస్తున్న జై గొట్టిముక్కల అనే ఆంధ్రా చంకనాకిపోతే బాగుండునని ఎదురు చూసే నిలువెల్ల ఆంధ్రద్వేషం నిండిన లేకి వెధవకీ ఎందుకు తోచటం లేదో నాకు తెలియటం లేదు!
ఆడది అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు ఉంటుందంటారు పెద్దలు. అబద్ధం చెప్పడం కూడా ఒక కళే - కవిత్వం, సంగీతం, సాహిత్యం, నర్తనం, చిత్రకళ వంటివాటి రమ్యతకు ఇలలో జరగనిదాన్ని జరిగినట్టు భ్రంపిమజెయ్యడమే వాటి ప్రజాదరణకు పునాది కదా.చెప్పేవి అబద్ధాలని తెలిసినప్పుడు కూసింత కళాత్మకతని కూడా జోడించలేని అసమర్ధులు వీరు, పాపం!
"అమరావతిలో రైతుల సొంత భూముల ఏమి లేవు అన్ని భీనామి ఆస్తులే ఉన్నాయి టిడిపి రాజకీయ నాయకులు అందరు ఎకరం లక్ష ఐదు లక్షలు కొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు" అని Vemkateswara reddy అనే వ్యాఖ్యాత నా బ్లాగు దగ్గిర కామెంటు వేశారు.కొద్ది రోజుల క్రితం అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్న భాజపా నాయకుడు ఒకరు ఒక రైతుకి పాదాభివందనం చేసి ఆయన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నట్టు వార్త చూశాను - ఆయన అందరు రైతులలోకీ ఎక్కువ ఎకరాల భూమిని ఇచ్చిన వ్యక్తి అట, ఇంతకీ ఆయన ఇచ్చింది 100 ఎకరాలు మాత్రమే!ఇలా వుంటాయి బురద చల్లుడు తొట్టిగ్యాంగు చెప్పే అబద్ధాలకు నిజాల రంగు పులిమి వదిలే కబుర్లు.ఇదే వ్యాఖ్యాత "టీడీపీ మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బినామీల పేరుతో కొన్న భూముల వివరాలను అసెంబ్లీలో బుగ్గన చదివి వినిపించారు. అసలు అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే బాబు బ్యాచ్ 4 వేల ఎకరాలు కొన్నారు." అని మొదలుపెట్టి బుగ్గన పిచ్చవాగుడు నుంచి బయటపడిన  అక్కసు లిస్టును చాంతాడు పొడుగున ఎత్తిపోసి "ఇన్నాళ్లూ అమరావతి కలుగులో దాక్కున్న టీడీపీ నేతల బినామీ బాగోతాలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిలో ఎక్కడ తమ వర్గం నేతల భూముల విలువ పడిపోతుందనే భయంతోనే చంద్రబాబు ఇంతగా కడుపు మంటతో రగలిపోతున్నాడు. తన సామాజికవర్గానికి చెందిన కొంత మంది రైతులు, బినామీ వ్యాపారులతో ఆందోళన చేయిస్తున్నాడు. ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించేలా మాట్లాడుతున్నాడు." అని Sherlock Holmes మాదిరి హడావిడి చేశారు.కానీ నేను "కడప జిల్లా మొత్తం భూమిలో మూడొంతులు రాజా రెడ్డి కుటుంబం పీట కిందే ఉన్నాయి, దాని సంగతి యేంటి?న్యాయంగా కొనుక్కోవటం కూడా కాదు, సహకార బ్యాంకుల్లోనో మరొకచోట్లో లోన్లకోసం పెట్టినవాటిని మాయ చేసీ వేలిముద్రలతోనూ రాయించుకున్నారు.తాత తరం నుంచీ జగన్మోహాన్ రెడ్డి సంపాదన మొత్తం నెత్తురు కూడే కదా!వీళ్ళు ముగ్గురే కాదు, అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ వాళ్ళ వాళ్ళ బీరకాయ పీచు వాళ్ళలోనూ తిన్ననైన చరిత్ర ఉన్నవాళ్ళు యెంతమంది?" అని చాలా చిన్న ప్రశ్న వెయ్యగానే ఇక మళ్ళీ పత్తా లేరు.అంత సంచలనాత్మకమైన నేరం అయుతే కోర్టులో చార్జి షీట్ వెయ్యొచ్చు కదా - బాబు కూడా చాలెంజి చేస్తుంటే కేసు వెయ్యకుండా వాళ్ళు ఒణికిపోతున్నారని  వీళ్ళు డప్పాలు కొట్టుకోవడం ఎందుకు?ముఖ్యమంత్రి ఒక్కడే కాదు, ఇవ్వాళ YCP మంత్రులలో బీనామీ ఆస్తులు లేని నిజాయితీ పరులు ఎంతమంది ఉన్నారు?
ఇప్పుడు ఎన్నికై ప్రజాప్రతినిధుల రూపంలో మనముందు రొమ్ములు విరుచుకుని తిరుగుతున్న 174 మంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులలో 150కి పైన నేరచరిత్రులు ఉన్నారు!Andhra Pradesh Election Watch (APEW) మరియు Association for Democratic Reforms (ADR) సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం 55 మంది పైన, అంటే 32 శాతం పజాప్రతినిధుల పైన"serious" అని చెప్పబడిన నేరాలలో పాల్గొన్నట్టు affidavits దాఖలు అయి ఉన్నాయి. 32 శాతం పజాప్రతినిధులలో ఆరుగురు మహిళల మీద అత్యాచారాలకు పాల్పడినవారు ఉన్నారు, ఏడుగురు అపహరణ నేరాలకు పాల్పడినవారు ఉన్నారు,ఎనిమిదిమంది convicted అనే దశకు కూడా వచ్చేశారు.మొత్తం 150 మంది నేరచరిత్రులలో 50(33%) మంది YSRCP, 4/23(17%) మంది TDP పార్టీలకు చెందినవారు, జనసేన తరపున కూడా ఒకరు ఉన్నారు - వీరందరికీ "serious" ముద్ర ఉన్నది, అవి క్రిమినల్ కేసులే!మొత్తం 174 మందిలో 163(94%) మంది కోట్లకు పడగ లెత్తిన వాళ్ళే!140/150(93%) మంది YCP, 22/23(96%) TDP, జనసేఅన తరపున ఒకరు కోట్లలో ఆదాయం ఉన్నవారు.మొత్తాన్ని సగటు తీస్తే ఒక్కో శాసనసభ్యుడి సంపాదన 27.87 కోట్లు అయితే అధికార పక్షపు 150 మంది శాసనసభ్యుల సగటు ఆస్తుల విలువ 22.41 కోట్లు, ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుల సగటు ఆస్తుల విలువ 64.61 కోట్లు - అమ్మ బాబోయ్!
వైసీపీలో అత్యధిక కేసులు పార్టీ అధినేత జగన్ పైనే ఉన్నాయి. మొత్తం 31 కేసులతో ఆయన ముందంజలో ఉన్నారు. వీటిలో 11 సీబీఐ, 7 ఈడీ కేసులు ఉన్నాయి. ఆయన తర్వాతి స్థానంలో దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. ఆయనపై 26 కేసులు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాద్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇలా ఒక్కో అభ్యర్థి నేరాల గురించి చెబితే పెద్ద చిట్టానే అవుతుంది. జనసేన అభ్యర్థుల్లో కొందరిపై ఏకంగా హత్య, దోపిడీ కేసులే ఉన్నాయి.ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బాబ్లీ కేసు మాత్రమే ఉంది. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన సందర్భంలో కేసు నమోదైంది.
ఇవి ఎన్నికలు పూర్తయ్యాక సభలో కొలువు దీరినవారి వివరాలు అయితే అసలు ఎన్నికల్లో నిలబడిన మొత్తం 2007 మందిలో చూస్తే 331(17%) మంది నేరచరిత్రులు! వీరిలో 14 మంది హత్యానేరం,40 మంది హత్యాప్రయత్నం కేసులను ఎదుర్కొంటూ 24 మంది convicted ముద్ర కొట్టించుకున్నారు.పార్టీల పరమైన లెక్కలు చూస్తే 48/171(28%) మంది TDP తరపున పోటీ చేశారు,97/171(57%) మంది YCP తరపున పోటీ చేశారు,19/169(11%) మంది BJP తరపున పోటీ చేశారు,23/166(14%) మంది INC తరపున పోటీ చేశారు,26/1271(217%) మంది JNS తరపున పోటీ చేశారు - వీరందరి మీద కోర్టుల వద్ద నమోదైన కేసులని పరిగణనలోకి తీసుకున్న లెక్కలే ఇవి, పైన తమ ఎన్నికల అఫిడవిట్లలో వారు కూడా పేర్కొన్నారు.వీటిలో మళ్ళీ వడకట్టి చూస్తే  27(16%t) మంది TDP అబ్యర్ధులు, 57(33%) మంది YCP అబ్యర్ధులు, 10(6%) మంది BJP అబ్యర్ధులు, 16(10%) మంది INCs అబ్యర్ధులు and 17(13%) మంది JNS అబ్యర్ధులు serious criminal cases ఎదుర్కొంటున్నారు.మొత్తం 28 మంది మహిళల మీద దుర్భాషలు, అపహరణ, బలాత్కారం వంటి నేరాలకు పాల్పడినవారు.మొత్తం 45/175(26%) నియోజకవర్గాలను Red alert constituencies కింద గుర్తించారు.ముగ్గురు లేదా అంతకన్న ఎక్కువ నేరచరిత్రులు పోటీలో ఉంటే నియోజకవర్గానికి ప్రత్యేకత వస్తుంది!
ఇక అభ్యర్ధుల విద్యను చూస్తే 901(45%) మంది 5 తరగతి నుంచి +2 లోపలనే ఉన్నారు,957(48%) మంది గ్రాడ్యుయేషన్ స్థాయిని దాటినవారు, 18 మంది విద్యావంతులు అని పిలదగిన వారు,66 మంది నిరక్షర కుక్షులు!వయస్సుల పరమైన లెక్కలు తీస్తే 648(32%) మంది 25 నుంచి 45 లోపు వారు,1,128 (56%) మంది 41 నుంచి 60 లోపువారు,220(11%)మంది 61 నుంచి 80 లోపువారు ఉన్నారు.ఇటువంటి పరిస్థితిలో చిక్కుకుపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజ ఇంత భయానకమైన సంస్కృతి గల ప్రజాప్రతినిధుల నుంచి సంస్కారవంతమైన ప్రవర్తననీ రాజ్యాంగబద్ధమైన పరిపాలననీ ప్రజాశ్రేయస్సును కాంక్షించే నిర్ణయాలనీ ఆశించటం ఎంతవరకు సమంజసం? ఆశకీ హద్దుండాలి కద!

సీ.
శ్రీలు పొంగిన జీవశక్తులు నిండిన గడ్డను వల్లకా డనుచు పేలి
మదాంధులి కెటుల నెరుగుదురీ ధరాఖండపు మహిమను?ఖండనమున
భార్గవు సాటి భూమిసుతులు!సంపదల యందిక కుబేరదేవు యంత
వారు! పారేటి జీవనదులదౌ మృత్తికల దెచ్చి ఇంపుగ కట్టిన అమ
తే.
రావతిని కదిలించుచో రాజునుండి
రైతు వరకు మాడుచు మసి రేణులట్లు
రాలి పోయెదరు, మరియు రంకు బొంకు
రద్దు పద్దుల కిక కీడు రానె వచ్చు!
(03:01:2020 01:01 AM)

2014 నుంచీ ప్రతిపక్షంగా తిరిగినప్పుడు మామూలుగానే కనిపించిన ప్రాంతం తాము అధికారంలో ఉన్న ఇప్పుడు స్పీకరుకి ఎడారిలానూ ఒక మంత్రికి స్మశానంలానూ కనపడటం అంటే రాక్షసులూ పిశాచాలూ దెయ్యాలూ అయిన తమకి అధికారం ఇవ్వడం వల్లనే అలా జరుగుతున్నదని తమ గురించిన నిజాన్ని ఒప్పేసుకోవడం అని అర్ధమైన నాకు వారి అమాయకత్వానికి జాలి వేస్తున్నది, పాపం బొత్సత్సత్సత్స పాపం చెవిసీతమ్మినేనిరాం!అమరావతి మీద వీళ్ళ యేడుపుకి కారణమూ రాజధాని విశాఖను తరలించడం కోసం పడుతున్న అగచాట్లకి నేపధ్యమూ 2014 నాడు రాజధాని ప్రకటన వెలువడకముందే కొందరు తెలివైనవాళ్ళు విజయవాడ చుట్టుపట్ల ఉన్న భూములని తక్కువకి కొనేసుకుని బాగుపడటం చూసి ఈర్ష్యపడి తామూ అదే పని చేసి బాగుపడాలనే ఇమిటేషన్ కక్కుర్తియే కారణం.
ఆప్పటి భూముల రేట్ల పెరుగుదల నిజానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాజధానిగా విజయవాడను ప్రకటించిన తర్వాత హఠాత్తుగా జరిగినది కాదు.తెలంగాణ ఉద్యమం తీవ్రమైన సమయంలో ఇటువైపున సామాన్య ప్రజలలో కూడా విభజన వల్ల తెలంగాణ కన్న ఆంధ్రకే ఎక్కువ లాభం అని తెలిసిపోయిందనేది వాస్తవం! తమను బండబూతులు తిడుతున్న తెలంగాణ్యులతో కలిసుండటం కన్న విడిపోవటమే మంచిదనీ విడిపోవటం వల్ల భూముల రేట్లు పెరిగితే అమ్మేసుకుని మొండి బాకీల్ని తీర్చేసుకుని కొత్త బతుకు మొదలెట్టొచ్చుననీ సామాన్య ప్రజలు రాజకీయ నాయకుల కన్న చాలా తెలివిగా ఆలోచించారు.తెలంగాణ ఉద్యమానికి ఆంధ్ర ప్రజల నుంచి ఏమాత్రం వ్యతిరేకత రాలేదు, కాంగ్రెసు నాయకులు చేసిన సమైక్య ఉద్యమం వెలాతెలా పోయింది - అదీ ఆంధ్ర ప్రజల రాజకీయ పరిణితి!అసలు శివరామకృష్ణన్ కమిటీ వెయ్యడమే అనవసరం - ముందునుంచే విడిపోతే ఇటువైపున ఉన్న ముక్కకి రాజధాని విజయవాడయే అవుతుందని లోపాయకారీగా అందరికీ తెలుసు!అయిదేళ్ళ క్రితం రాష్ట్రం విడిపోయిన నాడు విజయవాదకు ఉన్న హైప్ విడిపోయి అయిదేళ్ళు గడిచాక విశాఖకు ఉంటుందని అనుకోవడం జగన్ గ్యాంగు యొక్క అమాయకత్వం మాత్రమే - ప్లాను వికటించి లాభం గూబల్లోకి వచ్చే అవకాశమే ఎక్కువ.ఢిల్లీలో మొన్నటి AAP గెలుపు దగ్గర్నుంచీ నిన్నటి AP ఎన్నికల వరకు నేను అన్ని లెక్కలూ సరిచూసి వేసిన అంచనా కూడా తప్పు కాలేదు.అధికారం ఆశించినది సొంతానికి ఆర్జించుకోవటానికే అయినప్పటికీ తెదెపాను భూస్థాపితం చెయ్యడమే అదనపు లక్ష్యం అయినప్పటికీ రెండు లక్ష్యాలూ నెరవేరే మాస్టర్ ప్లానుని వదిలేసి మూడు రాజధానుల ప్లాన్ ఎత్తుకోవడం శుద్ధ మూర్ఖత్వం!
అప్పుడు ఒక్క రాజధానిలోనే కాదు రాష్ట్రం మొత్తం భూముల రేట్లు పెరగడమూ అమ్ముకుని బాగుపడాలనుకున్నవాళ్ళు అమ్మేసుకోవడమూ కొనుక్కుని బాగుపడాలనుకున్నవాళ్ళు కొనేసుకోవడమూ అయిపోయి చాలాకాలం అయ్యింది.విశాఖ లోని రిజిస్ట్రార్ ఆఫీసుల దస్త్రాల్ని చూసినా విషయం అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడు ప్రతిపక్షాలు వైకాపా వాళ్ళు ఎప్పుడెప్పుడు భూముకు కొన్నర్పె వివరాల్ని బుగ్గన సేకరించినట్ట్టే రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచే సేకరించారు కదా!అదే చేత్తో అయిదేళ్ళలో బూం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు తగ్గిందో కూడా తెలుస్తుంది కదా!అనాది కాలం నుంచీ అన్ని రకాల వ్యవస్థలలోనూ అత్యంత బలమైనదీ తెలివైనదీ అయిన రియల్ ఎస్టేట్ రంగం నిరాధారమైన హడావిడికి కంగారుపడి తెలివితక్కువ అమ్మకాలు చేసి బుద్ధిమట్టం జగన్ బ్యాచ్చిని లాభాల్లో ముంచి తేల్చుతారని అనుకోవటం అమాయకత్వం తప్ప ఇంకొకటి కాదు!
నెత్తిమీద శని గజ్జె కట్టి డ్యాన్సు చేస్తూంటే లాభం నష్టంలా కనిపించి  దూరం తరిమేస్తుంది, నష్టం లాభంలా కనిపించి వూరిస్తుంది!నిజానికి జగన్మోహన్ రెడ్డీ మరియు అతని ప్రభుత్వంలో మంత్రులైన బొత్స తదాది బుగ్గన లాంటి మేధావులూ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ కొనసాగించి ఉంటే ఈపాటికి చంద్రబాబుతో సహా తెలుగుదేశం పార్టీ రాజకీయ రంగం నుంచి అదృశ్యమై పోయి ఉండేది."చంద్రబాబు అన్నీ హైదరాబాదులోనే పెట్టాడు, అందువల్లనే విడిపోవాల్సి వచ్చింది - మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు" అని పాటలు పాడేవాళ్ళు ఇవ్వాళ్టికీ తెలంగాణ ఆదాయంలో అధికశాతం ఒక్క హైదరాబాదు నుంచే వస్తుందనీ కేసీయార్ దాదాపు రాష్ట్రంలో అన్ని పార్టీలూ స్టూడెంట్లూ విద్యాధికులూ ఎప్పుడు ఎక్కడ విధాన దొరికినా నలిపేద్దామని చూస్తున్నా దొరక్కుండా అంత ధీమాగా ఉన్నాడంటే దానికి కారణం అతను జగనులా అంతకుముందువాళ్ళు చేసిన అభివృద్ధి మొత్తాన్ని ఆపెయ్యాలనే బుద్ధిమట్టం పన్లు చెయ్యకుండా దానిని ఉపయోగించుకుని బాగుపడే తెలివి ఉండటమే అని ఎంతమందికి తెలుసు!ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు గానీ రాష్ట్రాలు గానీ వాటి వైభవోపేతమైన రాజధానుల మరియు ప్రముఖ నగరాల వల్లనే వాసికెక్కాయనేది ఎకనామిక్సులో బేసిక్సు తెలిసినవాళ్ళకి కూడా అర్ధం అవుతుంది - ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు?
అసలు అమరావతికి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు.రాజధాని కోసం సేకరించిన భూములే రాజధాని నిర్నాణం కోసం అయ్యే ప్రతి రూపాయినీ సమకూర్చుతాయి.ఈ విషయాన్ని చంద్రబాబు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ప్రతిపక్ష నేతగానూ రెండుసార్లు చెప్పినా జగనుకి అర్ధం కాలేదంటే నేను నమ్మలేకపోతున్నాను!ల్యాండ్ పూలింగ్ పధకం ద్వారా సేకరించినవి 33,000 ఎకరాలు,ఎస్సైన్‌డ్ భూములు 21000 ఎకరాలు కలిపి CRDA పరిధిలో ఉన్నవి 54000 ఎకరాలు.ఎకరా భూమిని అభివృద్ధి చెయ్యడానికి జగన్ ప్రభుత్వం చెప్పిన లెక్కయే 2 కోట్లు - మొత్తం భూమిని డెవలప్ చెయ్యటానికి 1.08 కోట్లు అవుతుంది.అయితే అమరావతి కోసం ఇప్పటి ప్రభుత్వం చెయ్యాల్సిన ఖర్చు 51,687(అసలు)+3656(వడ్డీ) కలిపి మొత్తం 55, 343 కోట్ల రూపాయలు.రైతులు ఉచితంగా ఇచ్చిన భూమికి  జగన్ ప్రభుత్వమే ఎకరాకు కోటి రూపాయలుగా నిర్ధారించడం వల్ల మొత్తం ఖర్చు 1,1 కోట్ల రూపాయలు అవుతుంది.ఇది మొత్తం అమరావతి అభివృద్ధి అనే ప్రాజెక్టు యొక్క నిర్ధారిత విలువ.ఇందులో నిర్మాణ ఖర్చు 51, 687 కోట్లు మాత్రమే!మొత్తం ఒకేసారి ఖర్చు పెట్టడం అవసరమూ కాదు, కుదిరేదీ కాదు.వచ్చే ఏడేళ్ళలో ప్రభుత్వం కేటాయించాల్సింది 12,600 కోట్లు మాత్రమే.విశాఖకు పదివేల కోట్లు ఖర్చు చెయ్యడానికి సిద్ధపడిన ప్రభుత్వం అమరావతికి ఏడాదికి 1800 కోట్ల చొప్పున ఏడేళ్ళలో 12,000 కోట్లు ఖర్చు చెయ్యడానికి సుముఖత చూపించకపోవడానికి విశాఖలో తాము కొన్న భూములకి విలువ పెంచుకోవడం కాక ప్రజాహితం కారణం అని ఎలా నమ్మాలి?12,600లో గ్రాంట్ల రూపంలో చెల్లించాల్సింది 5,971 కోట్లు అయితే ప్రభుత్వం వాటా 6,629 కోట్లు.అవీ ఇవీ కలిపి ఏడాదికి ఇవ్వాల్సిన నికర మొత్తం 1800 కోట్లు అయితే 2037 నుంచీ అమరావతి(CRDA) అప్పటికి ఆదాయ వనరు అవతారం యెత్తి వడ్డీతో సహా ప్రభుత్వానికే తిరిగి ఇస్తుంది!
అభివృద్ధి చేసి రైతుకి ఇస్తామన్న క్లాజు ప్రకారం ఇచ్చేవి పోను ప్రబుత్వం(CRDA) దగ్గిర క్రయవిక్రయాది సర్వహక్కులతోనూ ఉండేది 8,274 ఎకరాలు.ఇందులో 5,020 ఎకరాల భూమిని అముకోవచ్చు.ఈ మొత్తం భూమిలో 3,709 ఎకరాలను 2023 నుంచి 18 ఏళ్ళ పాటు ఏడాదికి కొంత అమ్ముతూ వెళ్తే సుమారు 78,000 కోట్ల ఆదాయం వస్తుంది.మిగిలిన 1,311 ఎకరాలను 2037 నుంచి అమ్ముకుంటే మరో 93,000 కోట్ల ఆదాయం వస్తుంది.ఇది మాత్రమే కాదు, CRDA అధీనంలో ఉన్న మరో 3,254 ఎకరాల భూమిని తెలివిగా ఉపయోగించుకుంటే మరో 14000 కోట్ల ఆదాయం వస్తుంది.అంటే,అమరావతిని కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయమూ CRDAను రద్దు చేసి అమరావతిని తరలించితే ప్రభుత్వం కోల్పోయే ఆదాయమూ 1,86,000 కోట్లు. చంద్రబాబు పిలిస్తే వచ్చిన కంపెనీల్ని నేనెందుకు ఉంచాలని పంతం పట్టి అన్ని కంపెనీల్ని తరిమేసినప్పటికీ ఒక్క రాజధాని ప్లానుని మక్కీకి మక్కీ కొనసాగిస్తే తొమ్మిదికి మరో తొమ్మిది రత్నాల్ని ప్రజలకి అందించి ఇప్పటికే తెదెపాని భూస్థాపితం చేసేసి అయిదేళ్ళ తర్వాత కూడా తనే ముఖ్యమంత్రి కావడం కోసం పునాది వేసుకోగలిగేవాడు - అలాంటిది రేపటికి ఆదాయం తెచ్చే అన్ని దారుల్నీ వెర్రెత్తినట్టు మూసేసి తను కదిలించలేని రాజధానిని కదిలంచగలనని గొప్పలు చెబుతున్న అమాయకుణ్ణి మహామేధావి కింద జమకట్టి ఈ నడివయసుపసివాడు చెప్పిన గాలికబుర్లని నమ్మి వైకాపా పిచ్చోళ్ళు కొన్న భూములని ఎక్కువ ధరకి ఎవరు కొంటారు - విశాఖ రియల్టర్లలోనూ బిజినెస్ మ్యాగ్నెట్లలోనూ అంత పిచ్చోళ్ళు ఉన్నారంటే నమ్మలేకుండా ఉన్నాను.
ఇప్పటివరకు అమరావతిపై గత ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు పెట్టింది.గత ప్రభుత్వం దుబార చేసినట్టు చెప్పిందని అంటున్న ప్రస్తుత ప్రభుత్వం నియమించిన రేమండ్ పీటర్ నివేదిక మరియు మంత్రుల లెక్కల్ ప్రకారమే అమరావతిపై ఇప్పటివరకు పెట్టిన ఖర్చు 5,400 కోట్లు!ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం చూస్తే 8829 కోట్ల రూపాయలు!రాజధాని తరలింపుకి అన్నిటికన్న ముఖ్యమైనదీ సాంకేతికపరమైనదీ అయిన అడ్డంకి నష్తపరిహారం.అమరావతి రైతులు బాబు ముఖారావిందం చూసి రాష్ట్రం కోసం అని త్యాగాలు చెయ్యలేదు.ఒక రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వంతో తమ భూమికి సంబంధించిన లీగల్ హక్కులను వదులుకోకుండా ఒప్పందపత్రాలతో తమ అధీనం నుంచి ప్రభుత్వ అధీనంలోకి స్థలాలను మార్చడమే అక్కడ జరిగింది తప్ప వారు అమ్మనూ లేదు,దానం చెయ్యనూ లేదు!
ఇప్పుడు ప్రభుత్వం భూముల్ని వెనక్కి ఇచ్చేటప్పుడు కౌలును వాళ్ళ ముఖాన కొడతామనీ దాంతో మళ్ళీ వాళ్ళ భూముని బాగు చేసుకుని వాడుకోవచ్చుననీ అంటున్న మాటలు వెర్రి వాగుడు తప్ప మరొకటి కాదు.భూమిని వెనక్కి ఇస్తే భూమి విలువకి 2.5 రెట్లు పరిహారం ఇవ్వనిదే కుదరదు.ఇప్పటికే రోడ్లనూ భవంతులనూ నిర్మించి ఉన్నారు కాబట్టి కొందరికే తిరిగి ఇవ్వడంలో న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి.నష్టపరిహారం ప్రతి రైతుకీ చెల్లించకుండా ఈ ప్రభుత్వం రాజధానిని ఒక్క అంగుళం కూడా కదిలించలేదు -  ఇరు పక్షాలకీ చట్టపరమైన రక్షణ ఉన్న ఒక ఒప్పందం రద్దు కావాలంటే ఆ ఒప్పందానికి ఒక వైపున ఉన్న రైతులు తమకు తాము ముందుకు వచ్చి తీరాలి, 151 కాదు 175 స్థానాలతో అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం తనంతట తను రద్దు చెయ్యలేదు!
జగన్ ప్రభుత్వం లెక్క కట్టిన కోటి రూపాయల రేటును బట్టి 34,281X2.5=85,702 కోట్ల రూపాయలు ఇవ్వాలి.దీనికి తోడు కంపెనీలకు ఇచ్చిన 30,000 కోట్ల కాంట్రాక్టుల్ని రద్దు చెయ్యటానికీ పరిహారం ఇవ్వాలి - కనీసం పదివేలన్నా ఇవ్వనిదే వాళ్ళు వెనక్కి తగ్గరు.వాణిజ్య సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకోవడానికి కనీసం 5000 కోట్లు ఇవ్వాలి.ఇవన్నీ ఉజ్జాయింపు లెక్కలు మాత్రమే ఆయా కంపెనీలూ సంస్థలూ ఔదార్యం చూపిస్తేనే అంకెలు ఇక్కడ ఆగుతాయి,రాష్ట్ర ప్రజల మీద వాళ్ళ వోట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికే లేని ఔదార్యం వ్యాపార సంస్థలకు ఉంటుందా?తమ నగరంలో రాజధాని కొలువు దీరుతున్నదనే విశాఖ ప్రజల ముచ్చటని తీర్చడం కోసం వాళ్ళతో సహా కర్నూలు వాసుల్ని కూడా కలుపుకుని రాష్ట్ర ప్రజలు అమరావతి రైతులకి 1,00,702 కోట్లు చెల్లించాల్సి వస్తుంది.
జగన్ ప్రభుత్వ నిర్వహణ ఎంత పరీనితి గలదో గతంలో చంద్రబాబు వేసిన వెదహవ పనికే అతను కొత్త వేషం కట్టి జనం మీదకి వదిలిన విలేజి అసిస్టెంట్ల వ్యవస్థయే తార్కాణం.నెలకి 250 కోట్లంట విలేజి అసిస్తెంట్లకి జీతాల కింద పొయ్యేది! ఉద్యోగాల అవసరం ఏమిటో ఇవ్వాల్టికీ ఎవరికీ తెలియదు - మీకు తెలుసా! అందులో ఎన్ని కోట్లు జగన్ సొంత జేబు నుంచి తీసి ఇస్తున్నాడు?ప్రజల కష్టార్జితం నుంచి నెలకి 250 కోట్లు కొంతమందిని కూర్చోబెట్టి మేపడానికి వెళ్తుంటే అదేమిటని అనిపించలేదా మీకు?విజయ సాయి రెడ్డి పబ్లిక్ డయాస్ మీదనే అంతా మనోళ్ళే సెలక్టయ్హారు అని చంకలు గుద్దుకోవటం తెలియదా? గ్రామ వాలంటీర్ల పదవీ బాధ్యతలు ఏమిటో చెప్పగలరా?మొదట రేషను సరుకుల్ని సంచుల్లో వేసుకుని ఇంటింటికీ తిరిగి అందించటం కోసం అని చెప్పారు. సంచులేవీ కనబడని స్థితి ఇవ్వాళ.ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష జరిపి మరీ ఎన్నుకున్న గొప్ప ఉద్యోగం సృష్టించబడిన ఉద్దేశం ఏమిటి?
AP GRAMAVOLUNTEER / WARD VOLUNTEER JOBS RECRUITMENT 2019 పేజి దగ్గర కనబడుతున్న సమాచారం ప్రాకారం చూసినా the work of Door Delivery of the welfare schemes of Government of Andhra Pradesh to each necessity house under his/her appointed area.- పధకాల్ని మోసుకు పోయి గుమ్మాల దగ్గిరకి చేర్చడం అంటే ఏమిటి?
The Group of houses which handled to the volunteers will do the service to the necessity houses/ peoples irrespective of Caste, Religious, and Politics. అని మాత్రమే చెప్పారు, ఎలాంటి సర్వీసుల్ని వారికి అనుసంధానించారనేది స్పష్తత లేదు.The volunteer has to attend the meeting held in Grama/ ward secretariat and should have to maintain the record of the issues and requests which collected from the Group of Houses under him/ her and also submit the maintained record to the competent authority. అనేవి పంచాయితీ క్లర్కులు చేస్తూనే ఉన్నారు కదా!
The volunteer has to do surveillance of the Group of Houses under him/ her regarding security, Educational, Health and should have told them or aware them about employment. - సెక్యూరిటీ పోలీసింగ్  అనుకుని ఆరోగ్య రక్షణ వైద్యశాఖకి సంబంధించినది అనుకున్నా ఆయా శాఖలలో చట్టపరమైన సవరణలు చేసి ఒక్కో పనికీ ఒక్కో ఉద్యోగిని పూర్తి కాలం విధికే నియమిస్తే ఫలితం బాగుంటుంది.రేషన్ సరుకుల డెలివరీ పౌర సరఫరాల శాఖకు సంబంధించినదిఆ శాఖకు ఈ విలేజి అసిస్టెంట్లని సాంకేతికపరమైన నియమనిబంధనలతో అనుబంధం చెయ్యడం జరిగిందా?ఆరోగ్య విధుల కోసం విలేజి అసిస్టెంట్ల వ్యవస్థని వైద్యశాఖకు అనుబంధం చెయ్యడానికి రూపందించిన నిబంధనలు ఉన్నాయా? చెయ్యాల్సిన పనుల్లో ఇంత వైవిధ్యం ఉన్న విధుల్ని సాంకేతికపరమైన నియమనిబంధనలూ జాగ్రత్తలూ ఏమీ లేకుండా కలగాపులగం చేసి ఒకే వ్యక్తికి దఖలు పరచడం ఎంతవరకు సమంజసం?
నాకైతే అయోమయంగా ఉంది!

15 comments:

  1. ఐదేళ్ల క్రితం ఏర్పాటైన రాజ‌ధాని అమ‌రావ‌తి పునాదులు క‌దులుతున్నాయి. ‘క్యాపిటలిస్టు’ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడు తున్నాయి. కొత్త ప‌రిపాల‌న రాజ‌ధాని విశాఖ వైపు ప‌రుగెడుతోంది. అమ‌రావ‌తి నుంచి విశాఖ వైపు రాజ‌ధాని వెళ్ల‌డానికి నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌నా విధానాలే కార‌ణ‌మ‌నేందుకు అనేక నిద‌ర్శ‌నాలున్నాయి. బాబు నియంతృత్వ పునాదుల‌పై నిర్మిత‌మైన అమ‌రావ‌తి రాజ‌ధాని త్వ‌ర‌లో చ‌రిత్ర‌లో క‌లిసిపోనుంది.

    నాల్గో శ‌తాబ్దానికి చెందిన ప్రసిద్ధ గ్రీకు త‌త్వ‌వేత్త ప్లేటో చెప్పిందాన్ని ఒక‌సారి గుర్తు చేసుకుందాం. ‘ఏ న‌గ‌ర‌మైనా అదెంత చిన్నదైనా వాస్త‌వానికి రెండుగా విభ‌జించ‌బ‌డి ఉంటుంది. ఒక‌టి పేద‌ల న‌గ‌రం. రెండు ధ‌నికుల న‌గ‌రం. ఈ రెండూ ఎప్పుడూ ఒక‌దానితో ఒక‌టి పోరాడుతూ ఉంటాయి’ అని వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం చెప్పిన మాట‌లు నాడు రాజ‌ధాని ఏక‌ప‌క్ష ఎంపిక‌, నేడు విశాఖ‌, క‌ర్నూల్‌కు త‌ర‌లింపునకు అద్దం ప‌ట్టాయి.

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ -6 ప్ర‌కారం భార‌త ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధాని స్థ‌లాన్ని నిర్ణ‌యించ‌డానికి, ప్ర‌త్యామ్నాయాల‌ను అధ్య‌య‌నం చేయ‌డానికి 2014లో నాటి యూపీఏ-2 ప్ర‌భుత్వం శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీని నియ‌మించింది. అయితే రాజ‌ధాని ఎంపిక అధికారం రాష్ట్రం చేతిలో ఉండ‌డం, శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ సిఫార్సుల‌ను నాటి చంద్ర‌బాబు స‌ర్కార్ చెత్త‌బుట్ట‌లో ప‌డేయ‌డం వ‌ల్లే నేడు రాజ‌ధాని అగ్గిని రాజేసింది.

    ReplyDelete
    Replies
    1. శివరామ కృష్ణ కమిటీ వేసిన ప్రధాన ఉద్దేశం రాజధానిని సూచించడం అయితే పరీశ్రమలు ఎక్కడ పెట్టాలి, నీటి పారుదల సౌకర్యాలు ఎలా సమన్వయించాలి అనేవాటిని గురించి అంత సమయం ఎందుకు తీసుకున్నట్టు?

      వాళ్ళకి అప్పగించిన పనేమిటి?వాళ్ళు చేసిందేమిటి?ప్రభుత్వం వేసిన ఏ కమిటీ అయినా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికీ తమ అభిప్రాయాలు చెప్ప్పడానికే తప్ప పెత్తనం చెయ్యడానికి కాదు కదా!కమిటీ వేశారు గాబట్టి చచ్చినట్టు వాళ్ళు చెప్పింది పాటించి తీరాల్సిందే అంటున్నారా మీరు?

      పోనీ మీరు అంటున్నట్టు బుట్ట దాఖలా చెయ్యకుండా పాటించడానికి ఆ కమిటీ ఏ నాగ్రాన్ని సూచిందింది?నేను కూడా శివరామకృష్ణన్ కమిటీ నివేదికని చూశాను, మీరు చెప్పండి ఆ కమిటీ ఏ నగరాన్ని రాజధాని కింద నిర్ధారించి చెప్పింది!

      Delete
    2. @Vemkateswara reddy6 January 2020 at 10:37
      ఐదేళ్ల క్రితం ఏర్పాటైన రాజ‌ధాని అమ‌రావ‌తి పునాదులు క‌దులుతున్నాయి. ‘క్యాపిటలిస్టు’ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడు తున్నాయి.

      hari.S.babu
      మీరు కమ్యునిష్టులా?ఒక భావంతిలో పెట్టా పెట్టని 13 బోగస్ బినామీ కంపెనీలతో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సంపదని అడ్డంగా దోచేసినవాడు మీకు అభివృద్ధి కాముకుడిలా కనపడుతున్నాడా?అతని తాత ఎవరో మీకు తెలుసు కదా!ఫ్యాక్షనిస్టుల్ని సమర్ధించే మీరు ఏ పెట్టుబడి దారుల్ని వ్యతిరేకించి ఏ ప్రజల పక్షాన నిలబడుతున్నారు?

      Delete
    3. @Vemkateswara reddy6 January 2020 at 10:37
      ఐదేళ్ల క్రితం ఏర్పాటైన రాజ‌ధాని అమ‌రావ‌తి పునాదులు క‌దులుతున్నాయి. ‘క్యాపిటలిస్టు’ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడు తున్నాయి.
      hari.S.babu
      పైన నేను చెప్పిన అడ్డంకులు దాటకుండా రాజధాని కదలదు. అమరావతి రైతులకి ప్రతి ఎకరానికీ 2,5 కోట్ల పరిహారం చెల్లించి CRDAని రద్దు చెయ్యనంతవరకు రాజధానిని ఒక్క అంగుళం కూడా ఎవ్వరూ కదిలించలేరు - నిజానికి ఇప్పుడు కదులుతున్నవి గత తొమ్మిదేళ్ళుగా జగన్ పరివారం చెబుతున్న అబద్ధాల పునాదులే!

      Delete
    4. ప్లేటో చెప్పినట్టు చంద్రబాబు కలల రాజధాని అమరావతి ధనిక నగరంగా, మిగిలిన ప్రాంతాలు ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు పేదల ప్రాంతాలు విభజింపబడ్డాయి. ఈ రెండింటి మధ్య ఆర్థిక అసమానతలే నేడు రాజధానుల ఏర్పాటుకు దారి తీశాయని చెప్పొచ్చు.

      రాజధాని స్థల ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది. అయితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా శివరామకృష్ణన్ కమిటీ పనిచేయడం లేదని గ్రహించారు. అధికారంలోకి రాక ముందునుంచే బాబు మనసంతా అమరావతి, గుంటూరు, విజయవాడ చుట్టే పరిభ్రమిస్తూ ఉండేది. ఆ ప్రాంతాలకు సమీపంలోనే రాజధాని పెట్టాలని బాబు అండ్ కో ముందస్తు ప్రణాళికలతో సిద్ధమైంది.

      ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ ఒకవైపు పర్యటిస్తుండగానే, బాబు సర్కార్ పురపాలకశాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని ఎంపిక కమిటీ వేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలను శివరామకృష్ణన్ కమిటీ పసిగట్టింది.

      శివరామకృష్ణన్ కమిటీలో నిపుణులు

      యూపీఏ-2 ప్రభుత్వం శివరామకృష్ణన్ చైర్మన్‌గా మరికొంత మంది నిపుణులను సభ్యులుగా నియమిస్తూ కమిటీ వేసింది. ఈ కమిటీలోని శివరామకృష్ణన్ భారత ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిశాఖకు మాజీ కార్యదర్శి. ఈయనకు పట్టణాల నిర్మాణంలో అనుసరించాల్సిన విధివిధానాలపై మంచి పట్టు ఉంది. ఈ కమిటీలోని మిగిలిన సభ్యులు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవారే. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్ డాక్టర్ రతిన్‌రాయ్‌ , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగన్‌షా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ అరోమార్ రవి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్ ప్రొఫెసర్ రవీంద్రన్ ఈ కమిటీలో ఉన్నారు.

      వ్యాపారవేత్తలతో బాబు సర్కార్ కమిటీ

      తమ ఇష్టానికి అనుగుణంగా రాజధానిని ఎంపిక చేయాలనే కుట్రతో చంద్రబాబు సర్కార్ ...నిపుణుల కమిటీని కాదని మంత్రి నారాయణ నేతృత్వంతో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. 2014, ఆగస్టు 31లోపు శివరామకృష్ణ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉండింది. అంతకు ముందే జూలై 21న మంత్రి నారాయణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, తెలుగుదేశం నేత (వ్యాపారి) బీద మస్తాన్‌రావు, పారిశ్రామిక వేత్తలు సంజ య్‌రెడ్డి, శ్రీనివాస్ శ్రీనిరాజు, ప్రభాకర్‌రావులతో చంద్రబాబు సర్కార్ రాజధాని అధ్యయన కమిటీని వేసింది.

      రెండు కమిటీలకు తేడా

      శివరామకృష్ణన్ కమిటీలో వివిధ రంగాల్లో నిపుణులైన సభ్యులున్నారు. వారికి పట్టణాభివృద్ధి, పర్యావరణం, వ్యవసాయం...ఇలా అన్ని రంగాల్లో మంచీచెడుల గురించి అధ్యయనం చేసి ప్రజలకు ఎలాంటి నగరం లాభదాయకమో, సౌకర్యవంతమో చెప్పగలిగే శక్తిసామర్థ్యాలున్నాయి. ఇదే నారాయణ కమిటీలో ఉన్నవారంతా వ్యాపారవేత్తలే. వీరికి లాభనష్టాలతో తప్ప ప్రజలతో పనిలేదు. నారాయణ కార్పొరేట్ విద్యా వ్యాపారి, గల్లా జయదేవ్ బ్యాటరీస్‌, ఇతరత్రా అనేక వ్యాపారాలు, సుజనాచౌదరికి బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన ఘనత ఉండనే ఉంది. మిగిలిన వారు కూడా పారిశ్రామికవేత్తలేనని నాటి ప్రభుత్వమే చెప్పింది.

      హరితక్షేత్రంలో రాజధాని వద్దని....

      చంద్రబాబు ప్రభుత్వానికి శివరామకృష్ణన్ కమిటీ పలు సిఫార్సులు చేసి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించింది. ప్రధానంగా కొత్త రాష్ట్రానికి కేంద్రీకృతమైన హరితక్షేత్ర నగరం సరైంది కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు జీఎన్‌రావు, బోస్టన్ నివేదికలు కూడా అమరావతి సరైన రాజధాని కాదని తేల్చడం గమనార్హం. అలాగే రాజధాని కార్యకలాపాలను భిన్నమైన స్థలాలకు పంపిణీ చేయాలని సూచించింది. వ్యవసాయానికి, పర్యావరణానికి అతి తక్కువ నష్టం జరగాలని, రాజధాని నిర్మాణానికి ప్రభుత్వంపై తక్కువ ఆర్థిక భారం పడాలని సిఫార్సు చేసింది.

      Delete
    5. I have asked you a single straight question. This junk material I already read and it wss clear to me.

      The main purpose of the forming that committee is to decide the capital,and you please tell me whuch city it suggested as capital?

      Why you are not even understanding my question and dumping this already known junk!

      Delete
    6. @yyyy
      నారాయణ కార్పొరేట్ విద్యా వ్యాపారి, గల్లా జయదేవ్ బ్యాటరీస్‌, ఇతరత్రా అనేక వ్యాపారాలు, సుజనాచౌదరికి బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన ఘనత ఉండనే ఉంది. మిగిలిన వారు కూడా పారిశ్రామికవేత్తలేనని నాటి ప్రభుత్వమే చెప్పింది.

      hari.S.babu
      So, jagan is so poor. He is not a capitalist.I am not an innocent lamb to allow you comments freely. Just trying to expose your castiest mindset.

      Be careful in your trials of covering up a factionist as messiah!

      Delete
    7. ఏవంటి పిచ్చిరెడ్డీ!

      పాయింటు ఉంది గదాని పబ్లిష్ చేస్తుంటే పిచ్చోడిలా కనబడుతునట్టున్నాను - పోటుగాడిలా తెగబారెడుఇ కామెంట్లు వేసేసి వెళ్ళిపోతున్నావు, ఒళ్ళెలా వుంది?

      ఇదివరకటి పోష్టులో "టీడీపీ మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బినామీల పేరుతో కొన్న భూముల వివరాలను అసెంబ్లీలో బుగ్గన చదివి ..........బినామీ వ్యాపారులతో ఆందోళన చేయిస్తున్నాడు. ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించేలా మాట్లాడుతున్నాడు. అదన్న మాట అసలు సంగతి." అని నువ్వు వేసిన కామెంటు మీద "కడప జిల్లా మొత్తం భూమిలో మూడొంతులు రాజా రెడ్డి కుటుంబం పీట కిందే ఉన్నాయి, దాని సంగతి యేంటి?న్యాయంగా కొనుక్కోవటం కూడా కాదు, సహకార్ బ్యాకుల్లోనో మరొకచోట్లో లోన్లు పెట్టీనవాటిని మాయ చేసీ వేలిముద్రలతోనూ రాయిచుకున్నారు.తాత తరం నుంచీ జగన్మోహాన్ రెడ్డి సంపాదన మొత్తం నెత్తురు కూడే కదా!వీళ్ళు ముగ్గురే కాదు, అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ వాళ్ళ వాళ్ళ బీరకాయ పీచు వాళ్ళలోనూ తిన్ననైన చరిత్ర ఉన్నవాళ్ళు యెంతమంది?" అని అడిగాను.దానికీ జవాబు లేదు.

      ఇప్పుడు కూడా "శివరామ కృష్ణ కమిటీ వేసిన ప్రధాన ఉద్దేశం రాజధానిని సూచించడం అయితే పరీశ్రమలు ఎక్కడ పెట్టాలి, నీటి పారుదల సౌకర్యాలు ఎలా సమన్వయించాలి అనేవాటిని గురించి అంత సమయం ఎందుకు తీసుకున్నట్టు?.......నేను కూడా శివరామకృష్ణన్ కమిటీ నివేదికని చూశాను, మీరు చెప్పండి ఆ కమిటీ ఏ నగరాన్ని రాజధాని కింద నిర్ధారించి చెప్పింది!" అని అడిగిన సూటి ప్రశ్నకి తిన్ననైన జవాబు చెప్పడం మానేసి యెత్తిపోతల చెత్త అవెస్తున్నావు, ఏంటి కధ?

      చంద్రబాబు మాత్రమే నీకు "పెట్టుబడి దారు"లా కనిపిస్తున్నాడు.బెంగుళూరు, హైదరాబాదు, తాడేపల్లి గూడెం - వూరికో ఇంద్రబహవనం ఉన్న రాజారెడ్డి మనవడు నీకు కడుబీదవాడిలా కనిపిస్తున్నాడు.ఒకే బావంతిలో 13 బోగస్ బీనామీ కంపెనీలతో కోట్లకి పడగలెత్తిన A1 నీకు హీరోలా కనపడుతున్నాడు.అలా ఉంది నీ కులపిచ్చి!

      ఆ రెండు ప్రశ్నలకీ జవాబు చెప్పిన తర్వాతనే మిగిలిన కామెంట్లు ఇక్కడ పడతాయి.

      Delete
    8. 2014 నుంచీ ప్రతిపక్షంగా తిరిగినప్పుడు మామూలుగానే కనిపించిన ఈ ప్రాంతం తాము అధికారంలో ఉన్న ఇప్పుడు స్పీకరుకి ఎడారిలానూ ఒక మంత్రికి స్మశానంలానూ కనపడటం అంటే రాక్షసులూ పిశాచాలూ దెయ్యాలూ అయిన తమకి అధికారం ఇవ్వడం వల్లనే అలా జరుగుతున్నదని తమ గురించిన నిజాన్ని ఒప్పేసుకోవడం అని అర్ధమైన నాకు వారి అమాయకత్వానికి జాలి వేస్తున్నది, పాపం బొత్సత్సత్సత్స పాపం చెవిసీతమ్మినేనిరాం!అమరావతి మీద వీళ్ళ యేడుపుకి కారణమూ రాజధాని విశాఖను తరలించడం కోసం పడుతున్న అగచాట్లకి నేపధ్యమూ 2014ల నాడు రాజధాని ప్రకటన వెలువడకముందే కొందరు తెలివైనవాళ్ళు విజయవాడ చుట్టుపట్ల ఉన్న భూములని తక్కువకి కొనేసుకుని బాగుపడటం చూసి ఈర్ష్యపడి తామూ అదే పని చేసి బాగుపడాలనే ఇమిటేషన్ కక్కుర్తియే కారణం.
      ఆప్పటి భూముల రేట్ల పెరుగుదల నిజానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాజధానిగా విజయవాడను ప్రకటించిన తర్వాత హఠాత్తుగా జరిగినది కాదు.తెలంగాణ ఉద్యమం తీవ్రమైన సమయంలో ఇటువైపున సామాన్య ప్రజలలో కూడా విభజన వల్ల తెలంగాణ కన్న ఆంధ్రకే ఎక్కువ లాభం అని తెలిసిపోయిందనేది వాస్తవం! తమను బండబూతులు తిడుతున్న తెలంగాణ్యులతో కలిసుండటం కన్న విడిపోవటమే మంచిదనీ విడిపోవటం వల్ల భూముల రేట్లు పెరిగితే అమ్మేసుకుని మొండి బాకీల్ని తీర్చేసుకుని కొత్త బతుకు మొదలెట్టొచ్చుననీ సామాన్య ప్రజలు రాజకీయ నాయకుల కన్న చాలా తెలివిగా ఆలోచించారు.తెలంగాణ ఉద్యమానికి ఆంధ్ర ప్రజల నుంచి ఏమాత్రం వ్యతిరేకత రాలేదు, కాంగ్రెసు నాయకులు చేసిన సమైక్య ఉద్యమం వెలాతెలా పోయింది - అదీ ఆంధ్ర ప్రజల రాజకీయ పరిణితి!అసలు శివరామకృష్ణన్ కమిటీ వెయ్యడమే అనవసరం - ముందునుంచే విడిపోతే ఇటువైపున ఉన్న ముక్కకి రాజధాని విజయవాడయే అవుతుందని లోపాయకారీగా అందరికీ తెలుసు!అయిదేళ్ళ క్రితం రాష్ట్రం విడిపోయిన నాడు విజయవాదకు ఉన్న హైప్ విడిపోయి అయిదేళ్ళు గడిచాక విశాఖకు ఉంటుందని అనుకోవడం జగన్ గ్యాంగు యొక్క అమాయకత్వం మాత్రమే - ప్లాను వికటించి లాభం గూబల్లోకి వచ్చే అవకాశమే ఎక్కువ.ఢిల్లీలో మొన్నటి AAP గెలుపు దగ్గర్నుంచీ నిన్నటి AP ఎన్నికల వరకు నేను అన్ని లెక్కలూ సరిచూసి వేసిన ఏ అంచనా కూడా తప్పు కాలేదు.అధికారం ఆశించినది సొంతానికి ఆర్జించుకోవటానికే అయినప్పటికీ తెదెపాను భూస్థాపితం చెయ్యడమే అదనపు లక్ష్యం అయినప్పటికీ ఆ రెండు లక్ష్యాలూ నెరవేరే మాస్టర్ ప్లానుని వదిలేసి ఈ మూడు రాజధానుల ప్లాన్ ఎత్తుకోవడం శుద్ధ మూర్ఖత్వం!
      అప్పుడు ఒక్క రాజధానిలోనే కాదు రాష్ట్రం మొత్తం భూముల రేట్లు పెరగడమూ అమ్ముకుని బాగుపడాలనుకున్నవాళ్ళు అమ్మేసుకోవడమూ కొనుక్కుని బాగుపడాలనుకున్నవాళ్ళు కొనేసుకోవడమూ అయిపోయి చాలాకాలం అయ్యింది.విశాఖ లోని రిజిస్ట్రార్ ఆఫీసుల దస్త్రాల్ని చూసినా ఈ విషయం అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడు ప్రతిపక్షాలు వైకాపా వాళ్ళు ఎప్పుడెప్పుడు భూముకు కొన్నర్పె ఆ వివరాల్ని బుగ్గన సేకరించినట్ట్టే రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచే సేకరించారు కదా!అదే చేత్తో ఈ అయిదేళ్ళలో బూం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు తగ్గిందో కూడా తెలుస్తుంది కదా!అనాది కాలం నుంచీ అన్ని రకాల వ్యవస్థలలోనూ అత్యంత బలమైనదీ తెలివైనదీ అయిన రియల్ ఎస్టేట్ రంగం నిరాధారమైన హడావిడికి కంగారుపడి తెలివితక్కువ అమ్మకాలు చేసి బుద్ధిమట్టం జగన్ బ్యాచ్చిని లాభాల్లో ముంచి తేల్చుతారని అనుకోవటం అమాయకత్వం తప్ప ఇంకొకటి కాదు!

      Delete
  2. i am requesting centre govt shri modi sir pls making amaravathi kendra paltha prantam. this way it will become devloped goodly. plez give some land in amaravathi to our poor hindu brothers coming from pak and also bild bhavya sriram mandir in amaravathi also. all patriyats will be supporting why bcos it is for every1 happyness. jai sriram. bmkj

    ReplyDelete
    Replies
    1. You are very innocently hoping about modi will do such foolish things - still BJP favors JGN, not CBN!

      Delete
  3. cbn dalita employee ni "gadu" annadu, randi andaru discussion petti cbn ni thitti poste nenu eeroju prasantanga nidra potanu - Jai Gottimukkala

    aayana aa maata analedu, chevulu pani chesete kinda video lo vinochu. kabatti nuvvu nidrapotaniki sleeping pills vesuko - Janaalu

    https://m.facebook.com/story.php?story_fbid=10220435471411933&id=1085791310

    ReplyDelete
  4. పాయింటు ఉంది గదాని పబ్లిష్ చేస్తుంటే పిచ్చోడిలా కనబడుతునట్టున్నాను - పోటుగాడిలా తెగబారెడుఇ కామెంట్లు వేసేసి వెళ్ళిపోతున్నావు, ఒళ్ళెలా వుంది?

    నన్ను చమించాలి..🙏🙏

    మీకు కోపం తెపించి నాను

    ప్రజలకు అన్యాయం చేస్తే దేవుడు చమించాడు కాలగర్బములో కలిపి వేస్తాడు దేవుడు.. రాజశేఖర్ రెడ్డి తిరుమలలో చర్చికి అనుమతి ఇచ్చి శ్రీవేంకటేశ్వర స్వామికి కోపానికి గురి అయినాడు ప్రజలు అనుకుంటూ ఉన్నారు అదేవిదంగా ఇప్పుడు ఉండే నాయకులు కూడా తప్పు చేస్తే రాజశేఖర్ రెడ్డి పట్టిన గతి వీళ్లకు కూడా పడుతుంది గుస గుసలు వినిపిస్తూ ఉన్నాయి ఇది నా అభిప్రాయం కాదు ప్రజల మనసులో అనుకుంటూ ఉన్న మాటలు ఆళ్లగడ్డలో కూడా భూమా నాగిరెడ్డి కుటుంబం కూడా దైవ కోపానికి గురి అయినారు అనుకుంటూ ఉన్నారు అది కూడా ఉన్న బస్టాండు కాదు అని కొత్త బస్టాండు డబ్బులకోసం సిటీ అవతల కొత్త బస్టాండు కటించే టప్పుడు పెద్ద పుట్ట ఉండేది దానిలో చాలా పొడవు అయిన పాము ఉండేది క్రైన్తో త్రోవ్వే తప్పుడు పాము రెండు ముక్కలు అయి ఆ శ్యాపము భూమా కుటుంబానికి తగిలింది ప్రజలు అనుకుంటూ ఉన్నారు నేను చెప్పేవి అన్ని నిజాలు

    మిమ్మలను భాద పెట్టి ఉంటే నన్ను చమించాలి🙏🙏

    ReplyDelete
  5. hapi pongal to haribabu sir

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...