Wednesday, 15 January 2020

ఎరొటోస్తినిస్ అనే వ్యక్తి భూమి చుట్టుకొలతను కనుక్కున్న పద్ధతి శాస్త్రీయమైనది కాదు - అది ఆధిక్యత కోసం అల్లిన ఒక పిట్టకధ , అస్సలు నమ్మకండి!

"మనవాళ్ళుత్త వెధవాయలోయ్!" అని గురజాడ అప్పారావు వూరికే అన్లేదండి.అది పచ్చి నిజం!నేను ఇంకొంచెం ముందుకెళ్ళి "మనవాళ్ళుత్త పౌరుషం లేని వాజమ్మలోయ్!" అని కూడా అంటాను.ఎందుకంటే, ప్రపంచంలోని జాతీ తమలోనివాడు తమజాతిని అంత మాటంటే సహించి వూరుకోలేదు - నిలదీశారు, అతను చెప్పింది నిజమేనని అనిపిస్తే తలవూపారు, అతను చెప్పింది నిజం కాదని అనిపిస్తే తలతీశారు.మొత్తానికి పట్టించుకున్నారు. మాట తమకి వర్తించదని రుజువు చేసుకున్నారు.కానీ, మనవాళ్ళు మాత్రం గురజాడ అన్న మాటని పట్టించుకోలేదు.మరీ విచిత్రం, పట్టించుకున్న కొద్దిమంది నిజమేనని వొప్పేసుకుని మళ్ళీ మళ్ళీ వెధవాయల మాదిరే ప్రవర్తిస్తున్నారు తప్పితే మాటని అబద్ధం చేస్తూ తమ వెధవాయిత్వాన్ని వొదిలించుకోవాలని అనుకోవటం లేదు.ఇంకా చెప్పాలంటే వెధవాయిత్వాన్నే మేధావిత్వం అని వాళ్ళు భ్రమపడి మనల్ని కూడా భ్రమింపజేస్తున్నారు.
మోడర్న్ సైన్సు అంత గొప్పది, ఇంత గొప్పది అని లెక్చర్లు దంచేవాళ్ళలో సగం మందికి సైన్సు అంటే ఏమిటో తెలీదు - యంత్రాలు కనుక్కోవటమే సైన్సనీ యంత్రాల్ని వాడటమే మోడర్నిటీ అని భావించటం ఒక మూఢనమ్మకం మాత్రమే, ఇది గుర్తుంచుకోండి!ఈ మూఢనమ్మకంతో పాటు ఇస్లామిక్ సైన్సు అనే ఒక దిక్కుమాలిన సైన్సు ఉందనేది కూడా మీరు తెలుసుకోవాలి.ఖురానులో ఉన్న అశాస్త్రీయమైన విషయాల్ని సశాస్త్రీయం అని సమర్ధించుకోవటానికి ముస్లిం మేధావులు వాళ్ళలో వాళ్ళు కొన్ని విచిత్రమైన వాదనల్ని చేసి వాటికి పెట్టిన పేరది.ఉదాహరణకి ఖురానులో ఏదో ఒక సురాలో "నేను తీపినీటినీ ఉప్పునీటినీ పక్కపక్కనే సృజించి యున్నాను!" అని అల్లా మహమ్మదు చెప్పిన దాన్ని తీసుకొచ్చి "చూశారా!భూమ్మీద ఉన్న నీటిలో తియ్యదనమూ ఉప్పదనమూ తప్ప ఇంకే రుచీ లేదనే సారకాలిక సత్యం మా ఖురానులో ఎప్పుడో చెప్పబడింది!కాబట్టి మా ఖురాను సత్యం." అని జబ్బలు చరుచుకోవటాన్ని ఇస్లామిక్ సైన్సు అంటారు.మనం, హిందువులం గనక తప్పిజారి, "ఓరే నాయనా!మీ ఖురాను పుట్టకముందే మా ఋషులు పంచతన్మాత్రల గురించి చెప్పారు" అని చెప్తే "పంచతన్మాత్రల గురించి చెప్పారు గానీ నీటిలో తియ్యదనమూ ఉప్పదనమూ గురించి చెప్పలేదు కదా!" అని హడావిడి చేస్తారు.వాళ్ళు చిన్నప్పట్నించీ వాళ్ళ మతసాహిత్యమే వింటూ పెరిగారు గాబట్టి అలాంటి అజ్ఞానంలో ఉండటం పెద్ద తప్పు కాదు.కానీ మనవాళ్ళలోనే చాలామందికి మన పూర్వఋషుల గొప్పతనం తెలీకపోవడం ఎంత దౌర్భాగ్యం?
ముస్లిములు చాదస్తపోళ్ళు.కానీ, క్రైస్తవులు అట్లా కాదు అని అనిపిస్తుంది మనకి ఇవ్వాళ క్రైస్తవులు తమకి తాము ఇచ్చుకున్న ఇమేజిని బట్టి. కొంతమంది పాస్టర్లు "బాల్ పెన్ను కనుక్కున్నది మా క్రైస్తవుడు!మోటారు కారును కనుక్కున్నది మా క్రైస్తవుడు!మీహిందువులు ఏం కనుక్కున్నారు?" అని వీరంగాలు ఎయ్యటం కూడా మీరు చూసే ఉంటారు. వాళ్ళు సైన్సును వ్యతిరేకించలేదు, పైన సైన్సును బాగా డెవలప్ చేశారు, ఎన్నెన్నో కొత్త వస్తువుల్ని కనిపెట్టారు,ఇవ్వాళ మనం అనుభవిస్తున్న సౌకర్యాలు చాలామట్టుకు వాళ్ళ పుణ్యమే అనే వాళ్ళు కూడా ఉన్నారు.ఇలాంటివాళ్ళలో గోగినేని బాబు, దేవరాజు మహారాజు, శ్రీనివాస చక్రవర్తి లాంటివాళ్ళు నిష్పక్షపాతపు క్రెడిబిలిటీ కోసం అప్పుడప్పుడు ప్రాచీన భారతీయ ఋషుల కృషిని పొగుడుతారు గానీ వాళ్ళ సాహిత్యజీవితంలో ఎక్కువ శాతం యూరోపియన్లు సృష్టించిన సైన్సును పొగడటానికే పరిమితమై ఉంటుంది. అసలైన కవిహృదయం ఎక్కడ తెలుస్తుందంటే, వాళ్ళు ప్రాచీన ఋషుల గొప్పదనాన్ని పొగిడే సందర్భంలో కూడా అస్పృశ్యతనో మరొకదాన్నో గుర్తుచేస్తూ పుల్లవిరుపు వ్యాఖ్యలు చేస్తారు - మనస్పూర్తిగా పొగడలేని ఇబ్బంది నుంచి పుట్టిన దరిద్రం కాకపోతే అక్కడ కూడా మతద్వేషపు పైత్యప్రకోపం దేనికి చెప్పండి!
సైన్సు అంటే సైన్సు అంతే, ఇస్లామిక్ సైన్సు, క్రిస్టియన్ సైన్సు, హిందూ సైన్సు అని అన్ని సైన్సులు లేవు.అది నాకు తెలుసు.యూరోపియన్లు ఇన్నిన్ని పరిశోధనలు చేసి ఇన్నిన్ని వస్తువులని కనుక్కోవడానికి మూలమైన ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఆనాటి కాలంలోనే ప్రపంచం మొత్తానికి పంచిపెట్టిన వేదశాస్త్రాల నుంచే పుట్టిందనేది సత్యం పట్ల నిబద్ధత గల ప్రతి చరిత్రకారుడూ ఒప్పుకుంటున్న పరమసత్యం!అయితే, వాళ్ళు కనుక్కున్న వస్తువులు మనవాళ్ళు ఎందుకు కనుక్కోలేదనే ప్రశ్న తప్పకుండా వస్తుంది.వీటిని మెచ్చుకుంటున్న వాళ్ళే కాదు, వాడుతున్న వాళ్ళు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి - వీటి వాడకంలో సౌకర్యం ఒక్కటే కాదు హాని కూడా ఉంటున్నది.అంతే కాదు, సౌకర్యం మీద ఉన్న వ్యామోహం వల్ల తెలియటం లేదు గానీ వీటి తయారీలోనే సౌకర్యం కన్న ప్రమాదం తెచ్చిపెట్టే లక్షణాలే ఎక్కువ ఉంటున్నాయి!అదే ఈనాటికీ మనం అనుసరిస్తున్న పూర్వఋషుల ఆవిష్కరణలైన ఆయుర్వేదం, యోగశాస్త్రం వంటివాటిలో ప్రయోజనం తప్ప ప్రమాదం ఏమి ఉంది?వాటిని కూడా వెక్కిరించేవాళ్ళకి వాళ్ళు కనుక్కున్న వస్తువులు మనవాళ్ళు ఎందుకు కనుక్కోలేదనే ప్రశ్న అడిగే అధికారం లేదు.
నేను పోష్టులు రాయడానికి పెట్టుకున్న ఒకే ఒక నియమం నాకు వచ్చిన సందేహాల్ని నివృత్తి చేసుకుని దాన్ని ఇతర్లతో పంచుకోవటం.సందేహం ఏ విషయం గురించి వస్తే ఆ విషయం గురించి జవాబుల కోసం శాస్త్రీయమైన పద్ధతిలోనే వెతుకుతున్నాను.నాకు వచ్చిన సందేహం తీరడం నాకు ముఖ్యం గానీ ఎవరినో మెప్పించాల్సిన అవసరం నాకు లేదు!ఈ "ఎరొటోస్తినిస్ అనే వ్యక్తి భూమి చుట్టుకొలతను కనుక్కున్న పద్ధతి" గురించిన సందేహం గురించి చెప్పాలంటే, శ్రీనివాస చక్రవర్తి గారు తన శాస్త్ర విజ్ఞానం బ్లాగులో "ఎరొటోస్తినిస్ కనుక్కున్న భూమి చుట్టుకొలత" పోష్టు వేశారు. దాన్ని చదివి అర్ధం చేసుకున్న శ్యామలీయం October 5, 2019 at 7:50 PM టైమ్ స్టాంపు దగ్గిర వేసిన '"భూమి ఉపరితలం మీదుగా చూస్తే అలెగ్జాండ్రియాకి, సీన్ నగరానికి మధ్య వారడి ఏడు డిగ్రీలు ఉంటుంది. " ఈ విషయం అప్పటికే నిర్ధారణగా తెలుసా? అదెలాగో ముందు వివరించవలసి ఉంది కదా మీరు? ఎందుకంటే ఈ వారడి - డిగ్రీలు అనగానే భూమి గోళత్వం యొక్క వివరాలు అప్పటికే - దాని వ్యాసంతో సహా తెలిస ఉండాలి కదా అన్న అనుమానం కలుగుతున్నది.' అనే కామెంటు చదివాక నాకూ అదే సందేహం వచ్చింది.నేనూ అడిగాను.
నా సందేహానికి శ్రీనివాస చక్రవర్తి గారు October 12, 2019 at 9:23 AM టైమ్ స్టాంపు దగ్గిర "సీన్ నగరానికి, అలెగ్జాండ్రియా కి మధ్య దూరం 800 కిమీలు అన్న విషయం మాత్రమే అతడికి ముందే తెలుసు. ప్రయోగం చేశాక కోణీయ దూరం 7 డిగ్రీలు అని తెలిసింది. 7 డిగ్రీలు = 800 కిమీలు అయితే, 360 డిగ్రీలు = ? 800 * 360/7 = 41,142 కిమీలు. ఇది ఉజ్జాయింపుగా భూమి చుట్టుకొలతతో సరిపోతుంది." అని జవాబు చెప్పారు.అసలు ఏడు డిగ్రీలు అనేదాన్ని కోణీయదూరం అని అనకూడదు.అది కేవలం కోణమే.ఒక నియమిత వ్యాసార్ధం గల వృత్తం పరిధి మీద ఏడు డిగ్రీల కోణం ఎంత పొడుగు ఉంటుందో ఆ కొలతని కోణీయ దూరం అనాలి. అప్పుడు నాకది ముఖ్యం అనిపించలేదు గానీ జవాబు నుంచే మరొక ప్రశ్న పుట్టింది.అదే ఇది.
hari.S.babu Posted on October 12, 2019 at 10:48 AM :
"సీన్ నగరానికి, అలెగ్జాండ్రియా కి మధ్య దూరం 800 కిమీలు అన్న విషయం మాత్రమే అతడికి ముందే తెలుసు. ప్రయోగం చేశాక కోణీయ దూరం 7 డిగ్రీలు అని తెలిసింది."
hari.S.babu
"linar distance" 800 కిమీలు అన్నది మాత్రమే తెలిసి దానినుంచి "angular distance" తెలియాలంటే "radius" కావాలి కదా!7 డిగ్రీలు అనేది "కోణీయ దూరం" అనటంలో పొరపాటు పడ్డారేమో!అది ప్రయోగం చేశాక తెలిసిందని మీరే అంటున్నారు.అది సరి చూసుకోండి.కానీ "linar distance" 800 కిమీలు అన్నది మాత్రమే తెలిసి దానినుంచి "angular distance" తెలియాలంటే "radius" అవసరం కదా!
అయితే, సందేహం అంటూ వస్తే అక్కడే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోని నా అలవాటు చొప్పున వెతికితే Did Eratosthenesreally measure the size of the earth? అనే బ్లాగు పోస్టు దొరికింది! పోష్టు రాసింది కూడా సైన్సు గురించి తెలిసిన వ్యక్తియే!అక్కడ శ్రీనివాస చక్రవర్తి గారికే గాక మనకు కూడా కళ్ళు తెరిపించే సమాచారం ఉంది.The problem is that everything we know about Eratosthenes is hearsay. None of his alleged many writings have survived. We only have second hand reports of his supposed achievements, most of them centuries after he lived. This raises the question, how reliable are these reports? అని బ్లాగు రచయిత ప్రశ్నిస్తున్నారు - జవాబు ఉందా మన దగ్గిర గానీ శ్రీనివాస చక్రవర్తి గారి దగ్గిర గానీ?
అసలైన చిత్రం యేమిటంటే fourth century BCE నాటికే Aristotle వంటివాళ్ళు empirical evidence చూపించి చెప్పిన Earth is a sphere అనే విషయం పూర్వసామాన్యశకం మూడవ శతాబ్దంలో పుట్టిన Eratosthenes అనే లైబ్రేరియనుకి తెలియదని శ్రీనివాస చక్రవర్తి గారు అనుకుని భూమి గోళాకారం అనే విషయాన్ని కూడా అతనే తొలిసారి కనుక్కున్నట్టు మనకి చెప్తున్నారు. మహా అయితే, Eratosthenes భూమి చుట్టుకొలతని పద్ధతిలో లెక్కించి ఉండొచ్చు!అయినా, తన లైబ్రరీలో Aristotle వంటివాళ్ళ రచనలు ఉంటాయి కదా, వాటిలోనే మన దేశపు విజ్ఞానులు చాలా కాలం క్రితమే కనుక్కున్నట్టు trigonometry ఉపయోగించి భూమి వ్యాసం కనుక్కోవడానికి క్లూలు దొరికేవి కదా! మాట నేనట్లేదండి, వ్యాసరచయితే అంటున్నాడు.
నిజానికి అంత ముఖ్యమైన విషయాన్ని అంత సులువుగా తేల్చెయ్యడం శాస్త్రీయమైన పద్ధతి కాదు.కనీసం రెండు సార్లు అదే ప్రయోగం చేసి వాటిని సరిపోల్చి ఎన్ని సార్లు అదే ప్రయోగం చేసినా అవే విలువలు వస్తున్నాయని నిర్ధారణ అయ్యాకనే వాటినుంచి సూత్రీకరణలను రాబట్టాలి.కానీ, Eratosthenes అలాంటి శ్రమ పడినట్టు ఆధారాలు లేవు.అదీగాక, పైన everything we know about Eratosthenes is hearsay అని తేల్చి చెప్పిన రచయితయే None of Eratosthenes’ writings survive, however, and some have questioned whether he ever found either the circumference of the Earth, or – as is often stated – the obliquity of the ecliptic, on the basis of measurements. అని బల్లగుద్ది చెప్తున్నారు.Greek astronomer Cleomedes తను రాసిన On the Circular Motions of the Celestial Bodies అనే పుస్తకంలో ఉదహరించటం ఒక్కటే కధకు సంబంధించిన ఆధారం.అయితే, అసలు Cleomodes ఎప్పటివాడో ఇప్పటికీ తెలియదు. అన్ని కధల్ని ఒక్కచోట కూర్చి హడావిడి చేస్తున్న Stuart Clark రాసిన వ్యాసం మీదనే రచయిత తన పరిశోధన చేశాడు.ఇంతకీ విషయాలు Stuart Clark గారికి ఎలా తెలిశాయి!I first heard the story when it was told by Carl Sagan in his masterpiece TV series, Cosmos. అని Stuart Clark గారు అంటున్నారు.”In other words Stuart Clark is just repeating verbatim a story, which Carl Sagan, and or his scriptwriters, made up in 1980 without taken the trouble to verify the accuracies or even the truth of what he saw more than thirty years ago!” అనేది వాస్తవం.
ఇది చదివాక లింకును మళ్ళీ శాస్త్ర విజ్ఞానం బ్లాగు దగ్గిర October 12, 2019 at 10:59 AM టైమ్ స్టాంపు దగ్గిర వేశాను.తర్వాత October 12, 2019 at 1:51 PM టైమ్ స్టాంపు దగ్గిర "The idea of a spherical Earth was floated around by Pythagoras around 500 BC and validated by Aristotle a couple centuries later. If the Earth really was a sphere, Eratosthenes could use his observations to estimate the circumference of the entire planet" అనే కామెంటు కూడా వేశాను. దానికి ఆయన "కోణీయ దూరం తెలియడానికి వ్యాసం తెలియనక్కర్లేదు. పైన చిత్రంలో చూడండి. నీడ పొడవు/కట్టెపుడవు తెలిస్తే అది tan(theta) అవుతుంది. theta = కోణీయ దూరం." అని  October 12, 2019 at 7:33 PM టైమ్ స్టాంపు దగ్గిర జవాబు చెప్పారు.మళ్ళీ దూడలు వేస్తున్నారు.tanΘ was mentioned in 1583 by T. Fincke who introduced the word "tangens" in Latin. But this gentleman, Eratosthenes lived in 300 B.C అనే చిన్న నిజం కూడా తెలియదా అంతకాలం నుంచీ సైన్సు వ్యాసాలు రాస్తున్న పెద్దమనిషికి!
ఇక ఆయన్ని ప్రశ్నలు అడిగి లాభం లేదనిపించి October 13, 2019 at 8:03 PM టైమ్ స్టాంపు దగ్గిర “1).Eratosthenes of Cyrene was the chief librarian at the great library of Alexandria in the third century BC. 2).Eratosthenes knew that the Earth’s surface was curved, as did every educated Greek scholar in the third century BCE.3).The first to realise that the Earth was a sphere were the Pythagoreans in the sixth century BCE. Aristotle had summarised the empirical evidence that showed that the Earth is a sphere in the fourth century BCE.4).Eratosthenes, as chief librarian in Alexandria, would have been well acquainted with above details. Put simply, Eratosthenes knew that he could, using trigonometry, calculate the diameter of the Earth’s sphere with the data he had accumulated, because he already knew that it was a sphere.5).Eratosthenes may or may not have calculated the tilt of the Earth’s axis but this is of no real historical significance, as the obliquity of the ecliptic, as it is also known, was, like the spherical shape of the Earth, known well before his times.” అనే కామెంటునూ October 14, 2019 at 1:52 PM టైమ్ స్టాంపు దగ్గిర “I think the story of Eratosthenes calculating the circumference of the earth with the help of two sticks and by a simple cross multiplication is a fiction and not an authentic fact by the above observations.” అనే కామెంటునూ వేశాను.
ఆయన నుంచి మళ్ళీ జవాబు రాలేదు గానీ October 15, 2019 at 12:13 PM టైం స్టాంపు దగ్గిర బ్లాగు కూడా మాలికలో మూసేపియ్యడానికి "..." బుజానేసుకొచ్చిన హరిబాబుకి స్వాగతం.’ అని అనామక వ్యాఖ్యాత మంగళవాక్యం పలికారు - శుభం! అక్కడ శ్రీనివాస చక్రవర్తి గారు తన మిడిమేలపు/ ఇమిటేషను/అనువదింపు శాస్త్రజ్ఞానంతో కొట్టిన పోజుల భాగోతానికి మంగళం పడటం సరే గానీ నేను మాత్రం ఆగిపోలేదు.మీకు www.quora.com గురించి తెలుసా!అక్కడ నేను ఇదివరకు అలెగ్జాండరు-పురుషోత్తముడి యుద్ధం గురించిన ఒక ప్రశ్నకీ గాంధీ భగత్సింగు ఉరిని ఎందుకు ఆపలేదనే ప్రశ్నకీ జవాబులు చెప్పి చాలా upvotings(Likes in FB parlance) తెచ్చుకున్నాను.ఇప్పుడు అక్కడ Why-do-some-intellectuals-claim-that-Eratosthenes-measured-the-size-of-the-Earth-is-a-concoction అని ప్రశ్న వేశాను.
ఒకే ఒకరు జవాబు చెప్పారు. ఈ Eratosthenes చేసిన ఇదే ప్రయోగాన్ని flat earth society వాళ్ళు భూమి బల్లపరుపుగా ఉందనే విషయాన్ని రుజువు చెయ్యటానికి వాడుకుంటున్నారట - ఇక్కడ మనకి ఎక్కువ సంగతులు తెలియక పోవటం వల్ల ఈ flat earth society కమేడియన్ల మాదిరి అనిపిస్తారు గానీ అక్కడ గట్టి పోటీయే ఇస్తున్నారు!నాకు సమాధానం ఇచ్చిన పెద్దమనిషి కేవలం సైన్సు మీద అభిమానం పెంచుకుని వ్యాసాలు రాస్తున్న మామూలు వ్యక్తి కాదు, Carl Ejnar Nielsen అనే ఆ వ్యక్తి University of Copenhagen నుంచి University degree in Biology అందుకున్న మేధావి.జవాబులో ఉన్న ట్రిక్ ఏంటంటే ఆయనకి Eratosthenes చారిత్రకత గురించి తెలియక కాబోలు, ఆ ప్రయోగాన్ని గురించి flat earth sociey వాదనని కూడా ఉదహరించి “In modern times, we can accurately measure the distance between the Sun and Earth, and can therefore see that assumption 1 is the correct one.” అని తేల్చేశారు. అసలు విషయం వరకు చూస్తే నేను అడిగిన దానికి అదే సరైన జవాబు అవుతుంది గానీ విషయం Eratosthenes యొక్క చారిత్రక యదార్ధతతో కూడా ముడిపడివుంది గాబట్టి ‘I have asked this question after reading this web page, in which, the author doubts the validity of the story."Did Eratosthenes really measure the size of the earth?"The author expressed so many doubts which appear very logical to me:’ అని మొదలుపెట్టి ఆ బ్లాగరు సందేహాల్ని పాయింట్ల వారీ ఉదహరించి “P.S:If you read the article thoroughly, you could know sundials were there already at the time of Eratosthenes.Then we can take the measurements of the shadows for the sundial pointer and there is no necessity of two sticks at a different places at the same time.Please clarify me all these points.” అనే కొసమెరుపు ఇస్తూ ఒక కామెంటు వేశాను.మా ఇద్దరి సంభాషణ జరిగింది అక్టోబర్ 24, 2019న - తర్వాత చర్చ ఇక ముందుకు వెళ్ళలేదు.
అయితే అక్కడ ఒకరు When-and-how-did-scientists-measure-the-radius-of-the-earth అని అడిగిన పశ్నకు ఇచ్చిన జవాబులలో “One of most Efficient, easy and ancient method to calculate radius of Earth was discovered by Al-Biruni” జవాబుని ఇతర్లు కూడా మెచ్చుకోవటం జరిగింది.ఇంకొక సంతోషకరమైన విషయం ఏమిటంటే How did Aryabhata calculate the accurate circumferenceof Earth? అనే ప్రశ్నకి Abd Ul-Rahman Lomax గారు తను ఇచ్చిన జవాబులో Eratosthenes చేసినట్టు చెప్తున్న ప్రయోగాన్ని ఉన్న పరిమితుల్నీ లోపాల్నీ మరింత శాస్త్రీయమైన వివరణతో ఎత్తి చూపించారు.అదే సమయంలో ఆ కధనం చెప్పిన విలువలో కూడా ఖచ్చితత్వం లేదనే విషయాన్ని నిరూపించారు.Modern measurements (Earth) have it that the meridional circumference is 40,007.86 km and the equatorial circumference is 40,075.017 km. The precision of those numbers is ridiculously high. I don’t know what “circumference” actually means to that precision.In miles, they would be 24,860 miles and 24,901 miles.” అని తేల్చి చెప్పిన Abd Ul-Rahman Lomax గారే 499CEకి చెందిన భారతీయ ఖగోళ గణిత వేత్త ఆర్యభటుడు చెప్పిన 24,835 miles విలువని కూడా ఉదహరించారు. It is an excellent approximation to the currently accepted value of 24,902 miles అని ప్రశంసించారు.
మన ఆర్యభటుడైతే ఒక్క భూమియే కాదు మన కంటికి కనిపిస్తున్న ముఖ్యమైన గ్రహతారకల యొక్క ఆకార, స్థల, కాల, దూర, భ్రమణాలకు సంబంధించిన ఎన్నో విషయాల్ని చెప్పాడు. అయినా ఒప్పుకోవటానికి ఇష్టం ఉండదు. తప్పిజారి వాటిని చదవటం తప్పులు పట్టటానికే!అక్కడ లేని తప్పుల్ని ఇరికించి మరీ వెక్కిరించే పాపాత్ములు కూడా ఒకప్పుడు ఉన్నారు, ఇప్పటికీ ఉంటున్నారు, ఎప్పటికీ ఉంటారు!
ఇంతకీ శ్రీనివాస చక్రవర్తి గారు Eratosthenesను పొగుడుతూ రాసిన వ్యాసంలో అతను దూరాన్ని కొలిచినట్టు చెప్పిన 5000 stadia అనే కొలత ఇప్పటి ప్రమాణాలలో దేనికి కలుస్తుందో తెలియదు, అది 24,902 miles అనే విలువతో ఎట్లా సమానమౌతుందో కూడా ఎవరూ చెప్పట్లేదు, ఇప్పుడు కొలిచి నిరూపించుదామంటే ఆ బావి ఎక్కడుందో తెలీదు - కావమ్మ మొగుడంటే కామోసనుకున్నట్టు ఎరొటోస్తినిస్ అనే వ్యక్తి భూమి చుట్టుకొలతను కనుక్కున్నాడనంగానే ఒప్పేసుకోవడం తప్ప అస్సలు కామన్ సెన్సుతో వచ్చే అనుమానాలు కూడా రావు, అదేంటో!

2 comments:

  1. శుభోదయం హరి బాబు గారు
    ఇప్పుడు జరుగుతున్న రాజకీయ క్రీడా రచ్చ గురించి మండలి అంటే ఏమిటిది అసెంబ్లీ రాజ్యసభ మండలికి తేడా ఏమిటిది ఈ మూడు సభలకు తేడా ఏమిటిది దీని గురించి ఒక పోస్టు పెట్ట గలరా నాకు ఈ సభల గురించి పెద్దగా తెలియదు తెలియని వారు ఉంటే తెలుసు కుంటారు అని నేను అనుకుంటూ ఉన్నాను దయచేసి నా మనవి మనించి తెలుప గలరని నా ఆశ..

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ శాసనమండలి మరియు అక్కడి రాజ్యసభ అనేవి ఎన్నికలలో పాల్గొని గెలవాల్సిన అవసరం లేకుండా స్మాజంలో ఉన్న లబ్ధప్రతిష్ఠులైన కవులు, మేధావులు, శాస్త్రజులు వంటివారికి కూడా శాసనాధికారం ఇవ్వడానికి ఏర్పరచిన అధికారికమైన సంస్థలు.ఉదాహర్ణకి ఒక వ్యక్తి ఒక 20, 30 యేళ్ళపాటు కవిత్వం చెప్పడమో, నాట్యం చెయ్యడమో - ఏదో ఒక కళఓ ప్రజల్ని రంజింపజేస్తూ ప్రజల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంటే ఆ వ్యక్తికి యేదో ఒక స్థాయిలో ప్రజల పట్లా సమాజం పట్లా బాధ్యత ఉంటుంది కదా!

      అలాంటి వ్యక్తులు అప్పటికే ప్రజలకు తెలిసి ఉంటారు, కాబట్టి వాళ్ళని మళ్ళీ ఎన్నికల్లో నిలబెట్టటం, ఎన్నికల ప్రచారం పేరుతో చెత్త మాటలు మాట్లాడించటం లాంటివి చెయ్యకుండా శాసనాధికారం ఇవ్వడం కోసం చేసిన ఏర్పాటు అది.సమైక్య రాష్ట్రంలో ఏర్పడిన మొదటి శాసనమండలి నుంచి ఇప్పటి వరకు చాలామంది మేధావులకి స్థానం దక్కింది.NTR హయాంలో అది రద్దయింది కూడా చిన్న మాట పట్టింపు వల్లనే - NTR కోపం సంగతి మీకు తెలిసిందే కదా!మళ్ళీ దాన్ని April 2007లో పునరుద్ధరించినది ఇప్పటి ముఖ్యమంత్రి గారి పితృదేవులే!

      ఇక దాని నిర్మితి గురించి చెప్పాలంటే:
      MLCs are chosen in the following manner:

      *One third are elected by the members of local bodies such as municipalities, Gram panchayats, Panchayat samitis and district councils.
      *One third are elected by the members of Legislative Assembly of the State from among the persons who are not members of the State Legislative Assembly.
      *One sixth are nominated by the governor from persons having knowledge or practical experience in fields such as literature, science, arts, the co-operative movement and social service.
      *One twelfth are elected by persons who are graduates of three years' standing residing in that state.
      *One twelfth are elected by persons engaged for at least three years in teaching in educational institutions within the state not lower than secondary schools, including colleges and universities.

      ఇక్కడ అవినీతి, బంధుప్రీతి, ఎన్నికల రాజకీయం లాంటివి తెలియని పెద్దమనుషులు ఉంటారు గాబట్టి "పెద్దల సభ" అని కూడా అంటారు.

      నాకు గుర్తున్నంత వరకు అప్పట్లో ఈనాడు బాగా పాప్యులర్.అందులో "పెద్దల సభలో గలభా!" అని ఒక వార్త వచ్చింది.అదే NTR శాసామందలిని రద్దు చెయ్యటానికి కారణం అయ్యుండొచ్చు.ఇప్పటి రోజున శాసనమండలి ఉండబట్టి, రైతుల అదృష్తం కొద్దీ తెలుగుదేశం పార్టీకి తగిననత బలం ఉండబట్టి ఒక ఘోరం జరగకుండా ఆపగలిగారు - లేకపోతే ఈసరికి CRDA రద్దయిపోయి అమరావతి రైతులు అన్యాయమైపోయేవాళ్ళు!

      లింకు చూస్తే మీకు జగన్మోహాన్ రెడ్డి శాసనమండలి రద్దు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...