Thursday 26 December 2019

ఇది మూడు తరాల పాత పగ నుంచి పుట్టిన కాలకూట విషం!నేడు జరుగుతున్నది పతాక సన్నివేశం - ఇది క్షీరసాగరమధనంలోని హాలాహల ప్రాదుర్భావం, అమృత భాండంతో యజ్ఞపురుషుని ఆవిర్భావం ఏది?

"హైకోర్టును మూడు ముక్కలు చేసి ఒక ముక్కను కర్నూలులో పెడితే తమకు ఏం ఒరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో సీమ ప్రజలు ఉన్నారని స్థానిక బీజేపీ నేతలు అనుకోవడం విచిత్రం" అని కొందరు విశ్లేషకులు జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు బీజేపీ నేతలు సూత్రప్రాయమైన ఆమోదం తెలుపుతూ చేసిన ప్రకటన గురించి వ్యాఖ్యానిస్తున్నారు.ఈరోజు కూడా ఒక వైపు నుంచి భాజపా జాతీయ స్థాయి నాయకుడు వెనకయ్య నాయుడు గారు వికేంద్రీకరణను పదే పదే సమర్ధిస్తూ రాజధాని గురించి మాత్రం ఎవరితో మాట్లాదాలో వారితోనే వ్యక్తిగతంగా మాట్లాదతానని సన్నాయి నొక్కులు నొక్కుతుంటే భాజపా ప్రాంతీయ స్థాయి నాయకుడు కన్నాయి లక్షమీ నారాయణ గారు మాత్రం మూడు రాజధానుల ప్రకటనని రాక్షస రాజకీయం అని నిప్పుల సన్నాయి వూదుతున్నారు.అంటే అంతిమ ఫలితం చూపిస్తున్న రెండు పరిష్కారాలలో రెండు వైపులా వారి పార్టీ వారే ఉండి ఫలితం ఎటు తేలితే అటు నిలబడిన వారే దాని ఖ్యాతిని కొట్టెయ్యడం దీని వెనక ఉన్న రాజకీయం.తమ్ముడు జగన్ ప్రతిపాదన మీద నిప్పులు చెరుగుతున్నాడో అదే ప్రతిపాదనని అన్న ప్రశంసించడం కొణిదెల కుటుంబపు అన్నదమ్ముల అనుబంధం సినిమా ట్రిక్కు!
ఇలా తెదెపా తప్ప అన్ని పార్టీలూ తమ పార్టీలోని వ్యక్తుల్ని రెండు వైపులా నిలబెట్టి మూడు రాజధానుల సమస్య నుంచి లాభం పిండుకోవటానికి దొంగాటకం ఆడుతుంటే తెదెపా వారు మాత్రం  అమాయకంగా "బీజెపీ వైకాపాని అధికారంలోకి తీసుకొచ్చినందుకు పశ్చాత్తాప పడుతున్నది.వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ అధికారంలోకి రావడానికి తమకు సహాయం చేస్తుంది.జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది." తరహా ఫాంటసీలతో కాలం గడుపుతున్నారు. కౌంట్ డౌన్ ప్రకటనలు కుండబద్దలు, టేక్ వన్ లాంటి తెదెపా అభిమాన యూట్యూబ్ వీడియో చానళ్ళలో ఇప్పటికి పదిసార్లు వచ్చి ఉంటాయి - కానీ ఒక్కసారి కూడా వారు ఆశించినది జరగలేదు.రేపు రాబోయే ఎన్న్నికల్లో తమని అధికారంలోకి తీసుకొచ్చే సదుద్దేశం ఉన్నవాళ్ళు నిన్నటి ఎన్నికల్లో ఎందుకు అంత నీచమైన ఓటమికి కారణం అవుతారనే కనీసపు కామన్ సెన్సు కూడా లేదు వీళ్ళకి!
As some of the tdp activists and fans are thinking that BJP will help TDP in future to come into power again, I sincerely remind you some strange facts.
1.Nobody thought CBN will be the first CM of newly formed andhra state after bifurcation. Actually the agitation for telangana state formation itself targeted to send CBN into political oblivion! But, miraculously CBN snatched the chance from Jagan, the aspirant CM of new andhra state, nobody could digest it!Even BJP also tried to ditch CBN in that elections by giving tickets for inefficient candidates in the sests awarded for it from the alliance allocations from TDP. I myself published a post in my blog about the danger of that trickery. Luckily CBN smelt the same and took remedial actions like snatching bacj some of the strong constituencies back from BJP.
Why BJP gave tickets for losers in its own seats exposes the cruelty of BJP towards CBN. They perfectly knew that they do not perform nice in AP. So, they want to control CBN by making him humble by the number of seats. The main reason for this trickery is everybody thought bjp will come into power at centre but with a marginal advantage, and if CBN get more sests,he will dominate them as the did at the time of vajpaye.
Now you could understand how seriously BJP fellows hate CBN. They do not want to be dominated by CBN - that was the new avatar of BJP, more dangerous than congress in eating up so called friendly parties! So, BJP never and ever helps TDP to come into power again. If CBN and TDP know this hard truth, then only they will come into power again. Otherwise they would go into the same trap of BJP, actng as a friend and ditching from the back.
2.Another thing which is strange is CBN foolishly took a strategy to go friendly with BJP even though the same reciprocation of friendliness is not evident from BJP,  he wasted three years to come out of the BJP government. what he achieved in all those long years?Nothing!Nothing!Nothing!One of the negative factor that worked against CBN in the recent election is his inability to get special status even though he had shared power by keeping 4 of his party men as central ministers - leave CBN and TDP, you tell me how could you justify his failure in getting special status?
3.Another strange thing is:All this happened while he is saying in so many press meets that BJP is giving him full support and he need not break up with BJP. And what support he got from state BJP leaders of centre or state level? Everytime state BJP leaders come to media focus they are shelling against CBN - some times they cried that CBN is using BJP as an ATM and some times pasing even detogatory remarks on CBN. Is this you call as genuine support from BJP to TDP and you want it again from BJP to TDP?
టేక్ వన్ మీడియా తరచు మోదీ, జగన్, కేసీయార్ చంద్రబాబుని ద్వేషిస్తున్నది అబివృద్ధిలో అతనితో పోటీ పడలేక అతన్ని పోటీలో లేకుండా చెయ్యడానికేనని చెప్తూనే మళ్ళీ మళ్ళీ బీజేపీ పశ్చాత్తాపం గురించి ప్రస్తావిస్తూ ఉండటం అలా జరిగితే బాగుండునని కోరుకోవటమే తప్ప అవి జరగవని నాకు తెలుసు, వారికీ తెలియాలి. వారు గానీ చంద్రబాబును వీలైననత త్వరలో మళ్ళీ అధికారంలో చూడాలనుకుంటున్న వారు గానీ గమనించనిది ఏమిటంటే ఇప్పటికీ వైకాపా ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాలను భాజపా ఆమోదిస్తున్నది, చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఆపేస్తూ జగన్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను సైతం సూత్రప్రాయపు నిరసనలతో సరిపెట్టేస్తున్నది తప్ప నాడు చంద్రబాబును విమర్శించేటపుడు ఉన్న ఘాటు నేడు జగన్ని విమర్శించేటప్పుడు ఉండటం లేదు.జగన్ చేస్తున్న క్రైస్తవీకరణతో సహా అన్ని పనుల్నీ కొంచెం విసుగు, కొంచెం మురుపు అన్నట్టు డబల్ గేం స్టేట్మెంట్లు ఇస్తుండటం కూడా TDP వాళ్ళకెందుకు అర్ధం కావడం లేదో నాకు అర్ధం కావడం లేదు!
ఇప్పటి రాజకీయ సమీకరణలని బట్టి చూస్తే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం!తమ్ముడు వైకాపా మీద కత్తిగట్టి పోరాడుతున్న సమయంలో అన్న వైకాపాని సమర్ధించడం అనేది చాలా గొప్ప వ్యూహాత్మకమైన ఎత్తుగడ - అసలు చిరంజీవి రాజకీయ రంగప్రవేశమే ఇప్పటి ముఖ్యమంత్రి యొక్క తండ్రి ఆశీస్సులతోనే జరిగిందనేది తెలిస్తే రేపటి ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే అవకాశాల్ని తగ్గించడానికే తమ్ముడు కూడా రాజకీయాల్లోకి వచ్చాడనేది కూడా స్పష్టం అవుతుంది కదా!మొన్నటి ఎన్నికల్లో వైకాపా, భాజపా, తెరాసా అనే మూడు పార్టీలనే ఎదుర్కోలేక 23 సీట్లకి కుంచించుకుపోయిన తెదెపా రేపటి రోజున నాలుగు పార్టీల్ని ఎదుర్కొని గెలవడం సాధ్యమా? నలుగురిలో ప్రతి ఒక్కరూ  ఓట్లు చీల్చడం కావచ్చు, విషప్రచారం చెయ్యడం కావచ్చు, వెన్నుపోటు పొడవటం కావచ్చు, డబ్బు వెదజల్లడం కావచ్చు - అన్నింటిలోనూ సమర్ధులే!
బీజేపీకి ఎకాయెకిన అధికారంలోకి వచ్చే సొంత బలం ఆంధ్రలో లేదని నాకూ మీకే కాదు భాజపా వాళ్ళకీ తెలుసు.అందుకే వైకాపా అధికారంలోకి రావడంలో తనూ ఒక భాగమై అతని గెలుపును ఆమోదించి చంద్రబాబును భూస్థాపితం చెయ్యడానికి తన వంతు సహాయ సహకారాలు ఇస్తున్నది.రేపటి ఎన్నికల నాటికి ప్రజల నాడి పవన్ వైపు మొగ్గు చూపితే అతన్ని గానీ లేదంటే మళ్ళీ జగన్ను గానీ సపోర్టు చేస్తుందే తప్ప చంద్రబాబును ప్రోత్సహించదు, ఒకావెళ ప్రోత్సహించినా మొన్నటి తరహా అర్ధాంతరన్యాసపు సహకారమే తప్ప పూర్తి స్థాయి సహకారం ఇవ్వదు గాక ఇవ్వదు.
చంద్రబాబును గురించి అందరూ నలభయ్యేళ్ళ రాజకీయ జీవితం, అనుభవంతో కూడిన పరిపక్వత అని పొగుడ్తలు కురిపిస్తున్నారు గానీ నాకు అతనిలో అలాంటి లక్షణాలు ఏవీ కనపడటం లేదు!ఇక్కడ కూర్చుని కేవలం వార్తాపత్రికల నుంచి విషయాలు సేకరిస్తున్న నాకే ఆనాడు చంద్రబాబు భాజపాని అంటకాగడం కోసం నలుగురు పార్టీ సభ్యుల్ని కేంద్రమంత్రివర్గంలోకి పంపించటం తెలివితక్కువతనం అనిపించిందే! స్థాయి మితృత్వం చూపించలేదు గానీ శత్రుత్వం కూడా చూపించకుండా కేంద్రం ఎంతిస్తే అంత తీసుకుని సర్దుకుపోయిన కేసీయార్ మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చాడు, చంద్రబాబు మాత్రమే అత్యంత దయనీయమైన ఓటమి చవి చూశాడు. అంతే కాదు, ప్రియమార అతను కేంద్రమంత్రివర్గంలోకి పంపించిన పెద్ద పావులు ఇవ్వాళ భాజపాలోకి జంపయ్యాయంటే ఎంత అవమానం?
ఎన్నికల సమయంలోనూ తెలంగాణలో ఆస్తులున్న తెదెపా బలమైన పావుల్ని కేసీయార్ బెదిరించి వైకాపాకి మళ్ళిస్తున్నాడని ఒత్తిడిని ఎదుర్కొంటున్న వ్యక్తి తనముందు గోడు వెళ్ళబోసుకున్నప్పుడు కూడా అతనికీ అతనిలాంటి వాళ్ళకీ భరోసా ఇవ్వకపోవడం బలహీనత వల్ల కాదనీ అది కూడా వ్యూహాత్మకతయేననీ ఎట్లా నమ్మాలి? పదే పదే ఈవీయం ట్యామపరింగ్ వల్ల ఓడిపోయాం అనే సుత్తి ఆపేసి వాస్తవాల్ని చూడాలి పార్టీ - సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి కశ్మలం యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అంత సంపాదించుకుని కూడా ప్రచారంలో పిసినారి తనం చూపించారు,ఓడిపోయిన ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు "ఇవిగో రాజధాని నిర్మాణాలు!ఇవి గ్రాఫిక్సా?" వీడియోలు చూపించి ఏం లాభం?అలాగే వైకాపా ప్రశాంత్ కిషోరుని పక్కన పెట్టుకుని అంత ఖర్చుపెడుతూ ప్రచారం అదరగొడుతుంటే ఇటువైపుంచి జరిగిన ప్రచారం వెలాతెలా పోతున్నట్టు జరిగింది - తమ గురించి చెప్పటానికి అభివృద్ధి పాటా జగను గురించి దెప్పడానికి 1 ముద్దాయి పాటా తప్ప తెదెపా ఎన్న్నికల ప్రచాహరంలో సృజనాత్మకత ఏముంది?ఎంత మేరకు గుడ్విల్ తీసుకొస్తాయో తెలియని ఉద్యమాల కోసం ఇప్పుడు డబల్ ఖర్చు నెత్తి మీద పడింది, ఇలాగే జరుగుతుంది a stitch in time saves nine అనే సామెతల్ని కూడా పట్టించుకోని అతి ధీమా ఉంటే.
తన పార్టీనుంచి కేంద్రంలోకి నలుగురు మంత్రుల్ని పంపించాక కూడా కాస్తకీ కూస్తకీ తను ఢిల్లీ ఎందుకు వెళ్ళేవాడో నాకిప్పటికీ అర్ధం కాదు, అలా కాలికి బలపం గట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరిగి ఏం సాధించాడో కూడా  నాకిప్పటికీ అర్ధం కాదు!మిత్రపక్షం హోదాలో ఉండి కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోయాడు,తను పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక ప్యాకేజీకి కూడా బాబు-జైట్లీ ప్లాను అని పేరు పెట్టి తనకి గుర్తింపు లేకుండా చేసుకున్నాడు, ప్యాకేజికి కూడా చిల్లులు పెడుతున్న సమయంలోనే స్వయాన భాజపా సహకారం అమోఘం అని చెప్తూ వచ్చి తీరా ఎన్నికల ముందు బయటికొచ్చి "మోసం!ద్రోహం!" అనడం ఎలాంటి తెలివి? పెద్దమనిషి భాజపాని ఇంత పొగుడుతున్న సమయంలోనే ఆంధ్ర భాజపా నేతలు మాత్రం ఒక్కసారి కూడా ప్రశంసించలేదు - రాష్తర్ భాజపా నేతలు మీడియా ముందుకొస్తే చాలు బాబు మోదీ ఇచ్చిన నిధుల్ని ఏటీయంలా వాదేసుకుంటున్నాడని ఏడుపు తప్ప ఇంకోటి ఉండేది కాదు, తిరుమల పింక్ దైమండ్ చంద్రబాబు కొట్టేశాదన్న ఆరోపణలు చేసిన రమణ దీక్షితుల్ని పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబుతో బహిరంగ యుద్ధమే చేశారు, పైన తనని సపోర్టు చేస్తున్న వెంకయ్యని రాజ్యసభకి పంపించి మూగనోము పట్టించారు!అంతకాలం అన్నింటిని సహించినవాడు జస్ట్ ఎన్నికల ముందు వీరావేశం ప్రదర్శించితే అతను సమర్ధుడనీ రాజనీతి కోవిదుడనీ పోరాట పటిమ గలవాడనీ ప్రజలు ఎట్లా నమ్ముతారు?
ఇప్పటికీ ఆంధ్ర భాజపా నేతలు చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూలగొట్టడం దగ్గిర్నుంచీ మూడు రాజధానుల ప్రకటన వరకు జరిగిన ప్రతి సంఘటనలోనూ వైకాపా ప్రభుత్వానికి అనేక విధాల సహాయ సహకారాలు అందించారు.తమ పార్టీ నాయకుల ఇళ్ళ జోలికి వస్తే వూరుకోమని వార్నింగులు ఇవ్వటం తప్ప చంద్రబాబు ఇంటిని కూలగొట్టటాన్ని గురించి అటో దెబ్బా ఇటో దెబ్బా అన్నట్టు మాట్లాడి సరిపెట్టేశారు.ఆంధ్రకు సంబంధించి మిగిలిన చోట్ల లాగే తను వ్యాపించటానికి వ్యూహం పాటిస్తున్నదో అంతకన్న ప్రత్యేకత ఏమీ ఇవ్వటం లేదు.నిన్నటి రోజున బాబును గానీ ఇప్పటి రోజున జగన్ను కానీ రేపటి రోజున పవన్ను కానీ తమకు అధికారం కట్టబెట్టేలా ఆంధ్రప్రజల్ని మార్చటానికే వాడుకుంటుంది, అతని వల్ల అది కుదరకపోతే అధికారం నుంచి లాగి పారేస్తుంది.చంద్రబాబు నుంచి సామాన్య తెలుగుదేశం కార్యకర్త వరకు భాజపా గానీ జనసేన గానీ తమకు నిరపేక్షపు సాయం చేసి తమను అధికారంలోకి పంపిస్తుందని ఆశించకుండా ఒంటరి పోరాటం చెయ్యడానికి సిద్ధపడాలి.
పదే పదే "చెన్నైని పోగొట్టుకుని హైదరాబాదు నుంచి తన్నించుకుని అమరావతికి వచ్చినప్పటికీ పాఠం నేర్చుకోని ఆంధ్రావాళ్ళు..."అంటున్న సీనియర్ విశ్లేషకులు సైతం మూడు చారిత్రక సన్నివేశలకీ మధ్యన ఉన్న లింకును విస్మరించడం నాకు విచిత్రంగా ఉంది! మూడు సన్నివేశాలలోనూ ఒక ప్రాంతపు రాజకీయ నేయకుల్నే టార్గెట్ చేసుకుని నిందించడం జరిగింది. అది ఎవరో తెలియాలంటే తొలినాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవి "రెండున్నర జిల్లాల వాళ్ళ కర్ర పెత్తనం" అనే మాటని ఎవరి గురించి వాడాడో తెలుసుకోవాలి - కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలను గురించే కదూ మాట వాడింది!
బ్రిటిష్ అధీనంలో ఉన్న మద్రాస్ ప్రసిడెన్సీ నాటి కాలం నుంచీ తెలుగువాళ్ళు అన్ని రంగాలలో ప్రముఖ స్థానంలోనే ఉండేవాళ్ళు.జనాభా పరమైన ఆధిక్యత కూడా తెలుగువాళ్ళకే అనుకూలంగా ఉండేది.చెన్నై పేరు చెన్న పట్నం అనేది పెద్ద విషయం కాదు గానీ ఇప్పటికీ రాష్ట్రం మొత్తం చూస్తే తెలుగు వాళ్ళు మెజారిటీ ఐన ప్రాంతాలు చాలా ఉన్నాయంటే అప్పటి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.1855 నుంచి 1957 వరకు కొనసాగిన Madras Presidency Legislative Council అని పీచే అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం 12 ముఖ్యమంత్రుల వరసలో 1.B. Munuswamy Naidu(1885–1935), 2.Ramakrishna Ranga Rao(1901–1978),3.Ramakrishna Ranga Rao(1901–1978), 4.Kurma Venkata Reddy Naidu(1875–1942), 5.Tanguturi Prakasam(1872–1957), 6.P. S. Kumaraswamy Raja(1898–1957) అనే అయిదుగురు ఆరుసార్లు ముఖ్యమంత్రులు అయ్యారు.ఇక ఇది స్వాతంత్య్రాననతరం 26 January 1950 మద్రాసు రాష్టం అయ్యాక P. S. Kumaraswamy Raja(1898–1957) కొనసాగడం తప్పించి మరొక తెలుగు ముఖ్యమంత్రి అంటూ లేడు.తమిళులు మొదట్లో చూపించిన ద్రవిడ భాషా కుటుంబపు ఆప్యాయత పెరియార్ అప్పటి ఆంగ్లేయ అనుకూల జస్టిస్ పార్టీ పేరును ద్రవిడ మున్నేట్ర కజగం ఆని పేరు మార్చాక క్రమేణ తగ్గి తమిళ జాతీయత పెరిగింది.13-18 సామాన్య శకాల మధ్యన కృష్ణా గోదావరి డెల్టాల ప్రజలు విశేష ఖ్యాతిని గడించారు - ఇది కావేరీ డెల్టా తమిళుల ప్రాభావంతో నువ్వా నేనా అన్నట్టు సాగింది.కర్ణాటక సంగీతం ఆనెదానికి తెలుగే అధికార భాష అయ్యింది.ఇప్పటికీ చెన్నై, తంజావూరు, హోసూరు, వేలూరు ప్రాంతాలలో తెలుగు వినపడుతుంది! అయినప్పటికీ తెలుగువాళ్ళని అధికారంలోకి రానివ్వదం లేదు. ముత్తువేల్ కరుణానిధి అనే ఉద్దండుడు తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి - కానీ తన తెలుగుదనం గురించి చెప్పుకోడు.వయ్యాపురం గోపాలకృష్ణ వైగో అని తన పేరుని కుదించుకుంటాడు.కానీ వి.శేఖర రెడ్డి అనే ఇసక మాఫియా నేతకి మాత్రం అవసరం లేదు - అదీ ఇవాళ్టి పరిస్థితి! అణచివేతకు విరుగుడు కోసం వెతుకుతున్న దశలో అయాచితపు అవకాశం భాషాప్రయుక్త రాష్ట్రాల నినాదం రూపంలో వచ్చింది. అప్పటికే ప్రాముఖ్యతను సంతరించుకున్న భాషా ప్రయుక్త రాష్ట్రాల మిషతో తెలుగువాళ్ళు తమిళుల జాత్యహంకారం మీద తిరగబడి వేరుపడాలని నిశ్చయించుకున్నారు.
అయితే, విడిపోవటం తప్పదనే అత్యవసరపు హడావిడి తప్ప ప్రణాళికాబద్ధమైన వ్యవహారం లేకపోవటంతో కర్నూలులో తేళ్ళూ మండ్రగబ్బలు తిరిగే టెంపర్వరీ గుడారాలలో కొంతకాలం గడిపి 1947లో నిజాము పాలన నుంచి బయటపడి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిత్వంలో ఏర్పడిన హైదరాబాదు రాష్ట్రంతో కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నారు.కేవలం చొరవ ఇటువైపునుంచి వెళ్ళడం అనే ఒక్క అంశాన్నే తీసుకుని నిన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమవీరులు కలయికని ఎంత పులిమేశారో తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది - 1953లో ఏర్పడిన States Reorganisation Commission రెండు సంవత్సరాలు తన పని చేసి అన్ని భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును గురించి చెప్పినట్టే 1955లో ""After taking all these factors into consideration we have come to the conclusions that it will be in the interests of Andhra as well as Telangana, if for the present, the Telangana area is to constitute into a separate State, which may be known as the Hyderabad State with provision for its unification with Andhra after the general elections likely to be held in or about 1961 if by a two thirds majority the legislature of the residency Hyderabad State expresses itself in favor of such unification"" అని తేల్చి చెప్పింది.అయితే, సభలో హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో కలయికను Hyderabad Legislative Assembly చాలా ఎక్కువ మెజారిటీతో ఆమోదించింది.మొత్తం 174 మందిలో 147 మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు.అప్పటి జనాభా దామాషాను బట్టి సబహ్లో ఉన్న కన్నద, మరాఠీ భసహలు మాట్లాడేవాళ్ళతో సహా 103 మంది ఆంధ్రతో విలీనాన్ని ఆమోదించటమే గాక కమిషన్ ప్రస్తావించిన అయిదేళ్ళ పాటు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలసీన ప్రత్యేక కొనసాగింపును కూడా వ్యతిరేకించారు.అప్పటి హైదరాబాద్ చట్ట సభలో ఉన్న 94 మంది సభ్యుల్లో 36 మంది కమ్యునిష్టులు,40 మంది కాంగెసువాళ్ళు, 11 మంది సోషలిస్టులు, 9 మంది ఇండిపెండెంట్లు ఉంటే వీళ్ళలో 59 మంది విలీనాన్ని సమర్ధించారు.
అయినప్పటికీ ఆనాటి విలీనం ఆంధ్ర పెత్తందార్ల కుట్ర కింద పులిమేశారు - కేసీయారు నుంచి గల్లీల్లో పల్లీలమ్ముకునే వాళ్ళ వరకు సభ్యతా సంస్కారాలలో ఉండాల్సిన కనీస పరిధుల్ని కూడా పట్టించుకోకుండా రెచ్చిపోయారు.తమ సిద్ధాంత వ్యాప్తి కోసం పనికొస్తుందని "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అని పుస్తకం రాయటం తప్ప కమ్యునిష్టులు విలీనం కోసం అంటూ ప్రత్యేకించి ఉద్యమం ఏదీ చెయ్యలేదు.ఆంధ్రమహాసభ తెలుగు భాషనీ జాతినీ ఉద్దేశించి సాహితీ సృష్టి చేసింది గానీ ప్రత్యేకించి "తెలుగువాళ్ళు - ఒక రాష్ట్రం" అనే నినాదం ఇచ్చి పనిచేసిన దాఖలాలు లేవు.ప్రాంతీయ స్థాయిలో అటువైపునా ఇటువైపునా జాతీయస్థాయిలోనూ కాంగ్రెసు పార్టీకి చెందిన రాజకీయ నాయకులే అందరూ - అయితే గియితే వారిలో వారు సహకారం అందించుకుని పరస్పర లాభం పొందడమే తప్ప ఒకరిని ఒకరు తొక్కెయ్యటానికి ఎలాంటి అవకాశమూ లేని ఏకపక్షపు విలీనం అది!
కలయిక వల్ల హదరాబాద్ రాష్ట్రం చాలామేరకు తన సరిహద్దుల్ని కోల్పోవడం మాత్రం వాస్తవమే - అయితే అది ఆంధ్ర రాజకీయనాయకుల వల్ల జరిగిన దుర్మార్గం కాదు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం యొక్క పొరపాటు!ఆనాడు గోల్కొండ పత్రికలో ఆంధ్ర ప్రాంతపు నాయకులకు "పెద్దన్న" అనే పేరునీ తెలంగాణ ప్రాంతపు నాయ్కులకు "చిన్నన్న" అనె పేరునీ తొడిగి అనుమానం వ్యక్తం చేస్తూ ఒక వార్త కనిపిస్తున్నది తప్ప నెహ్రూ కలయికను సమర్ధించలేదనీ ఆంధ్రా అనే గడుసు చిన్నోడూ తెలంగాణ అనే బిడియపు చిన్నదీ చేస్తున్న కాపరం అన్నాడనీ చెప్తున్న సంగతి మలినాటి ఉద్యమ వీరుల కల్పన కావచ్చు! కృష్ణా గోదావరీ డెల్టా వాసులు దాదాపు అన్ని రంగాల్లోనూ కావేరీ డెల్టావాసులతో సమంగానూ కొన్ని రంగాల్లో ఎవరూ అందుకోలేని శిఖరాల్ని అందుకున్న గడుగ్గాయిలు కాగా నిజాము పుణ్యాన ఇంగ్లీషు చదువులకి నోచుకోని బెరుగ్గాయిలైన తెలంగాణ ప్రాంతపు విద్యార్ధులూ మేధావులూ నాయకులూ శ్రీబాగ్ ప్పందం లాంటి ఎన్ని రకాల రక్షణలు ఇచ్చినప్పటికీ ముందుకు రాలేకపోయారు - వాళ్ళు ఒక అడుగు వేసేలోపు ఎదటివాళ్ళు పదడుగులు వేసేస్తుంటే అందుకోవటం మానవమాత్రులకి సాధ్యమా?
19169 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమస్యల ప్రాతిపదికన రగిలింది కాబట్టి Eight point plan అమలు చెయ్యటానికి ప్రభుత్వం ఒప్పుకోవడంతో చల్లారిపోయింది.నిజానికి ఇది చెన్నారెడ్డి తనకు పార్టీలో సన్నగిల్లుతున్న ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడానికి వాడుకున్న ఉద్యమం అనేది నా అభిప్రాయం. తర్వాత మూడు నాలుగేళ్ళ కాలం గడిచేసరికి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ప్రత్యేక రాష్త్రం వాదన మొదలైంది.ఎప్పుడో నిజాము కాంలో ఉద్యోగ నియామకాల్లో పెట్టిన ముల్కీ నిబంధనలు అప్పటికీ కొనసాగుతుండటం వల్ల ఆంధ్ర ప్రాంతపు వారికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మొదలైన 1972 నాటి ముల్కీ ఉద్యమం విభజన కోరుకుంటున్న "జై ఆంధ్ర" ఉద్యమం కింద మారింది.అయితే ముల్కీ నిబంధనల్ని రద్దు చస్తూ ఆరు సూత్రాల పధకం అమలులోకి రావడంతో ఉద్యమం కూడా ఆగిపోయింది.
కానీ, 2014కి ముందు జరిగిన తెలంగాణ ఉద్యమం మొత్తం ఆంధ్ర ప్రాంతపు రాజకీయ నాయకుల్ని మరీ ముఖ్యం చంద్రబాబునే టార్గెట్ చేసిందనేది వాస్తవం!ఒక విచిత్రం యేమిటంటే అప్పటి పొలిటికల్ ఈక్వేషన్ల ప్రకారం చంద్రబాబును బలహీన పర్చటానికి కాంగ్రెసులోనే ఒక గ్రూపును విడదీసి గాలికొట్టి వదిలినది ఇప్పటి ముఖ్యమంత్రి యొక్క తండ్రియే, తనకు కావలసిన లక్ష్యాన్ని సాధించుకున్నాక కేసీయారు నేతృత్వంలో నడుస్తున్న ఉద్యమాన్ని నీరు కార్చటానికి శతవిధాల కృషి చేసిందీ ఇప్పటి ముఖ్యమంత్రి యొక్క తండ్రియే!మలినాటి ఉద్యమంలో ఎలా విదదియ్యాలన్న పీటముడిని ఆర్టికిల్ మూడును సూచించి విప్పింది కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డియే! అయినా తెలంగాణ పట్ల ఇలాంటి ట్రిక్కులు ఏవీ చెయ్యని చంద్రబాబు నాయుడు ఇప్పటికీ జై గొట్టిముక్కల లాంటి కొందరు విద్యావంతులైన నిరక్షరాస్యుల దృష్టిలో తెలంగాణ ద్రోహియే అని ఒక ముద్ర పడిపోయిందంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు.
శివరామకృష్ణన్ సంఘంలో ఉన్నది మహామేధావులే కావచ్చు గానీ అది కూడా ఇప్పటి GNR కమిటీలా జగన్ మనోగతాన్ని బట్టి వండివార్చిన పెయిడ్ ఆర్టిస్టుల చెత్త యవ్వారమే - రాజధాని కోసం కనీసపు నీటి వసతి కూడా లేని విమానాశ్రయానికి చాలా దూరంలో ఉన్న అటవీ భూమిని ప్రతిపాదించదంలోనే కమిటీ ఎంతటి మేధావులతో ఏర్పడిందో తెలుస్తుంది!అసలు రాజధాని గురించి ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్నవాళ్ళు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి అన్ని అమోఘమైన సలహాలను ఇచ్చి  రాజధాని గురించి ఇంత చెత్త ప్రతిపాదన ఎట్లా చెయ్యగలిగారు?అప్పటికే ముఖ్యమంత్రిత్వం కోసం తండ్రి చచ్చిన మరుసటి క్షణం నుంచే అర్రులు చాస్తూ సోనియా గాంధీకి కొర్పం తెప్పించి వదెరే పార్టీ పెట్టినప్పటికీ తల్లి పార్టీలో అతనికి ఉన్న అస్మదీయుల/శ్రేయోభిలాషుల చేతివాటమే శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి దొనకొండను ఎంచుకోవడానికి అతి ముఖ్యమైన కారణం.
ఇప్పటి ముఖ్యమంత్రి చేస్తున్నవి అనాలోచితమైన చర్యలు కావు - మూడు తరాల పాటు అణిచెయ్యాలని ప్రతికక్షులు సర్వశక్తులూ కూడదీసుకుని ప్రయత్నించి కూడా విఫలం అయిన కృష్ణా గోదావరి డెల్టాని ఎడారినీ స్మశానాన్నీ చెయ్యాలని శతవిధాల ప్రయత్నిస్తున్న శక్తుల దుస్సంకల్పమే అతని ప్రతి అడుగునూ నడిపిస్తున్నది.అదే రాష్ట్రపు చట్టసభలో మంత్రులుగా స్పీకరుగా ఉన్నవాళ్ళ నోటితోనే పైరు పచ్చలతో కళకళలాడుతున్న ప్రాంతాన్ని ఎడారిగానూ స్మశానంగానూ పిలిచే నీచత్వాన్ని పుట్టిస్తున్నది - ప్రాంతాన్ని అలా చూడాలన్న వాళ్ళ కోరికయే వాళ్ళ మాటల్లో బయటపడుతున్నదనేది యదార్ధం!
రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిలో ఉంచకపోవడానికి జగన్ యొక్క క్రైస్తవమతభావనలు కారణం అని కమలానంద భారతి అంటున్నారు గానీ నా సుదీర్ఘమైన పరిశీలన అనంతరం నాకు పదే పదే గోచరిస్తున్న విషయం ఏమిటంటే అవినీతి పరులైన వ్యాపారవేత్తలకు గానీ వేర్పాటువాదులైన రాజకీయనాయకులకు గానీ కులం,మతం,ప్రాంతం,జాతి అనే గంభీరమైన విషయాల పట్ల కనీసపు గౌరవం కూడా ఉండదు గాక ఉండదు - ఆయా అంశాల పట్ల ప్రీతి ఉన్నవాళ్ళని రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలన్న కండూతీయే తప్ప వాటిపట్ల స్వకీయమైన ప్రీతి ఉండదు గాక ఉండదు!
రాం గోపాల్ వర్మ తన సినిమాకి "కమ్మరాజ్యంలో కడప రెడ్లు" అని పేరు పెట్టి వూరుకోలేదు, ప్రచార చిత్రపు కొన్ని కుడ్యచిత్రాల్లో "కమ్మరాజ్యంలో(కి) కడపరెడ్లు (వచ్చేశారు!)" అని అదనపు ముక్తాయింపులు అనుకోకుండా ఇచ్చినవి కావు - ఒకానొక ముఖాముఖి సంభాషణలో ప్రాంతపు నాయకుల కంచుకోటలోకి ప్రాంతపు నాయకులు వచ్చారనేది చెప్పడమే తన లక్ష్యం అని స్పష్టం చేశాడు!తన సినిమా కేవలం ట్రోలింగ్ అని చెప్పినప్పటికీ అతనికి రాజకీయం గురించి చాలామంది రాజకీయ విశ్లేషకుల కన్న స్పష్టత ఉన్నదని నాకు అనిపిస్తున్నది.ఇంతకీ ఇప్పటి జగన్ ఆర్ధిక విధ్వంసం వెనక "మూడు తరాల నుంచి కృష్ణా గోదావారి డెల్టా వాసుల మీద జరుగుతున్న దాడి తప్ప ఇంకే అంశాలూ లేవా?" అనే ప్రశ్నకు "ముమ్మాటికీ ఇవే!" అని తప్ప వేరే కారణాలు తోచడం లేదు.రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడి మూడోసారి 151 మంది మద్దతుతో అధికార పీఠం ఎక్కిన ఒక రాజకీయ నాయకుడు తన కన్న ముందు పరిపాలించిన వాళ్ళ కన్న మెరుగైన పాలన అందించి మంచిపేరును దక్కించుకోవాలని ఆశించడం సహజం గానీ కనీసపు అభివృద్ధిని కూడా ఆపేసి కేవలం ఆరు నెలల్లో 50 వేల కోట్ల అప్పుని పెంచడం అసహజమూ విచిత్రమూ కాదా!
విశాఖ ప్రాంత వాసుల్లోనూ అందరూ అమాయకులు కారు, చాలా కాలం క్రితమే తెలుగు బ్లాగుల్లో కళింగ కేక అనేచోట పెద్దనను "పెద్దిరాజు" అని వెక్కిరించడమూ శ్రీకృష్ణదేవరాయల్ని "స్ఫోటకం మచ్చలవాడు, తొందరగా చచ్చినవాడు.." అని ఈసడించటమూ నేను వ్యతిరేకించటమూ జరిగింది. బ్లాగరుకి తమ ప్రాంతపు రాజుల పట్ల ఉన్న ప్రీతియే రాజుని ఓడించిన రాజుని ద్వేషించేలా చేసింది.దాదాపు ప్రతి ప్రాంతంలోనూ కొందరు మేధావులూ కళాకారులూ విశ్లేషకులూ చరిత్రకారులూ ఇలాంటి తప్పుడు భావాల్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు.వీటిని తప్పుడు భావాలు అని ఎందుకు అంటున్నానంటే ఆనాటి కాలంలో ఎవరు ఓడినా ఎవరు గెల్చినా సైనికశక్తిని ఉపయోగించుకోవటంలోని మెలకువలకి సంబంధించినవి అయితే వాటిని తీసుకొచ్చి ఎన్నికల్లో ప్రజాభిమానం కూడగట్టుకుని అధికారంలోకి రావలసిన ఈనాటి రాజకీయ సంస్కృతికి అతికించి ఆనాటి ప్రాభవం ఈనాడు తిరిగి సాధించుకోవాలని బోధించటం తప్పు.
విశాఖ నగరవాసులు అనవసర  ప్రలోభాలకి గురి కాకూడదు.ప్రస్తుతం విశాఖ నగరం రాజధాని ఇక్కడ ఉంటే తప్ప ఎదగలేని దుస్థితిలో లేదు, ఇప్పటికే చాలా ఎదిగింది, ఇంకా ఎదుగుతుంది - పైన ప్రశాంతమైన మీ నగరంలోకి కదపరెడ్లను రానిస్తే మీకు ప్రమోదం ఉండదు గాక ఉండదు!ఒకసారి అడుగు పెట్టారో ఇక మీరు పొమ్మన్నా పోరు - అమరావతికి పట్టించిన గతినే విశాఖకీ పట్టిస్తారు. జయమ్మని మీరు ఓడించిన కక్ష వాళ్ళ మనసులో ఉంది, ఆలోచించుకోండి!ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న దానికి తెలంగాణలోనూ ప్రతిధ్వనులు వినబడుతున్నాయి గాబట్టి దీన్ని ఆంధ్ర రాష్ట్రపు సమస్యలా కాకుండా ప్రజల్ని కులాల పేరున మతాల పేరున ప్రాంతాల పేరున చీల్చి పబ్బం గడుపుకోవాల్ని చూస్తున్న రాజకీయ ధోరణిలా గుర్తించి రెండు రాష్ట్రాలోనే కాదు ప్రాపంచంలోని ప్రతి తెలుగువాడూ ప్రతిస్పందించాలి - కృష్ణా గోదావరి జిల్లాల్ని స్మశానసదృశం చెయ్యాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలపాలి.
ఈర్ష్య అనేది ప్రముఖమై తర్కం లుప్తమై ఎవరికి వారు దఖలు పర్చుకుంటున్న ప్రాంతీయమైన భాషాపరమైన జాతిపరమైన అధిపత్య దాసత్వ వాదనలను సత్యం పునాదుల నుంచి నిలబడి చూస్తే వాటి డొల్లతనం బయటపడటానికి చాలా తక్కువ సమయమే పడుతుంది - ఐన్స్టీన్ ఫలానా మతంలో పుట్టడం వల్లనే సైంటిస్టు కాలేదు,ఆదిశంకరులు కాలడిలో పుట్టడం వల్లనే జగద్గురువు కాలేదు, శ్రీరాముడు సూర్యవంశంలో పుట్టడం వల్లనే దేవుడు కాలేదు. కృష్ణా గోదావరి వాసుల ప్రాభవం కూడా అలాంటిదే, యాదృచ్చికం అయినదాన్ని ఉద్దేశపూర్వకం చెయ్యటమే అసలైన దుర్మార్గం.
ఒకటి మాత్రం ఒప్పుకు తీరాలి - జిల్లాల కింద పరుచుకున్న మట్టి అత్యంత సారవంతమై ఏడాది పొడుగునా అన్ని రకాల పంటల్నీ పండించటానికి అనువైనది. చాణక్యుడు చెప్పినా ప్రొఫెసర్ కీత్ చెప్పినా సంపద సృష్టికి మూలం భూమియే అనేది తిరుగు లేని నిజం.ఒక ప్రాంతంలో వ్యవసాయం బాగుంటే మొదట అక్కడివాళ్ళ కడుపు నిండుతుంది,కడుపు నిండిన మనిషియే తర్వాత ఏమిటి అని ఆలోచిస్తాడు, అవకాశం లేని మనిషి కూడా రేపు ఎట్లా గడుస్తుంది అని ఆలోచిస్తాడు - అన్ని నాగరికతల్ని పుట్టించిన సృజనాత్మకల వెనక ఉన్నవి రెండు రకాల మనస్థితులే కారణం కదా! ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు సస్యశ్యామలం చేసుకుని బాగుపడాల్సింది పోయి మన కన్న ముందు బాగుపడటం అవతలివాళ్ళ నేరం అన్నట్టు ఆలోచించడం ఏమి తెలివి?నిజంగా అన్యాయం జరిగితే పోరాడి న్యాయం పొందవచ్చు కదా!
ఆధిపత్యం చెలాయిస్తున్నవాళ్ళకి అది న్యాయమార్గంలో దక్కినప్పుడు ఆమోదించే కనీసపు సంస్కారం లేనివాళ్ళే మూడు తరాల పాటు కృష్ణా గోదావరి డెల్టా వాసుల మీద జరుగుతున్న విషప్రచారంతో కూడిన వ్యక్తిగత దాడి వెనక ఉన్నారనేది నేను గమనించాను.రెండు చేతులూ కలవనిదే చప్పట్లు రావు అనే లాజిక్ తీసుకుని వీళ్ళని కూడా తప్పు పట్టవచ్చు - అంత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నపుడు మొండిగా అధికారానికి అంటిపెట్టుకోకుండా ఔదార్యం చూపించి ఇతర్లకు అధికారం ఇవ్వవచ్చు కదా అనే వాదన కూడా బలమైనదే.కానీ అవతలి వాళ్ళు వీళ్ళకన్న సమర్ధులైతే అధికారం అందుకోవటానికి కులం,మతం, ప్రాంతం వంటివాటిని ఉపయోగించుకుని ప్రజల్ని చీల్చే దొడ్డిదారిని ఎంచుకోవాల్సిన పని ఏమిటి? వీళ్ళను వ్యతిరేకించి వీళ్ళతో పోరాడుతున్నవాళ్ళు అర్హత లేని అధికారం కోసం అర్రులు చేస్తున్న ప్రమాదకారులు.
"పోటీలో ఉన్న సమర్ధుణ్ణి మించిపోలేనప్పుడు వాణ్ణి పోటీలో లేకుండా చేస్తే ప్రజల నుంచి సమర్ధుడితో పోలిక చూపించి సమర్ధతను పెంచుకోమనే ఒత్తిడి ఉండదు కదా!" అనే చావు తెలివి ఉన్నవాళ్ళని అధికారంలోకి తీసుకురావడమే ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల ప్రజానీకం అనుభవిస్తున్న అనేకానేక దౌర్భాగ్యాలకి మూలకారణం అనేది కట్టెదుట గోచరిస్తున్న కఠిన సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

26 comments:

  1. jai uttarandhra jai vishakha jai jagan downdown graphic babu kulagajji nashinchali

    ReplyDelete
    Replies
    1. So, you had such greet respect for the party which had more than half candidates were reddi and filling most of the posts with single caste as not casteist party!Would you accept If I give statistics for the allocation of posts and nominations for strategic positions?

      Delete
    2. "jai uttarandhra jai vishakha" - with such a shameless regional fanaticism showing , you claim babu as klagaji fellow.Do you have any conscience or remorse?

      Delete
    3. what nonsense u r talking? u no what caste is vizag mp caste mvv garu? even tdp ganta is supporting vizag peoples dont supports any waste cast feelings

      Delete
    4. He is just provoking you Sir!! Ignore and keep your good work!! Its just like winking at a girl in the dark.. No need to respond!

      Delete
  2. Replies
    1. Do you like only rayala sheema?Where do you live?Do you feel happy if all the people belong to other regions gone astray!

      Delete
  3. రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం ఒక పంట పండడం చాలా గొప్ప అలాంటి చోట ఒక ప్రభుత్వం కార్యాలయం వచింది అంటే సంతోసించే విషయం రాయలసీమ లో పుట్టిన బాబు ఏమి చేసినాడు కుల రాజకీయాలు పుటించి ప్రజలలో లేని పోని సందేశాలు పుటించి ఒకరిని కులస్తులను ఒకరు కొట్టుకొన్నట్లు చేసి అమరావతిలో వర్షం పడితే కరిపోయే అసెంబ్లీ కట్టి గ్రాఫిక్స్ మెడలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుతెచ్చి ఆ డబ్బులు ఎక్కడ పెట్టినది ఎవరికి తెలియదు అమరావతిలో నిర్మాణాలు ఏమి జరగ లేదు మాటలతో ప్రజలను మాయ చేసి భీనామి ఆస్తులు కూడా బెట్టు కొని ఇప్పుడు దొంగ ఎడుపులు ఏడిస్తే ఎలా ఆలోచించండి ప్రతి ఒక్కరు..

    ReplyDelete
    Replies
    1. అధికార వికేంద్రీకరణ అంటే అసలైన అర్ధం కూడా తెలియక సెక్రటేరియట్ ఒకచోట, అసెంబ్లీ ఒకచోట పెట్టడమే అధికార వికేంద్రీకరణ అవుతుందని అనే స్థాయిలో అజ్ఞానం పేరుకుపోయిన మీరు "రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం ఒక పంట పండడం చాలా గొప్ప అలాంటి చోట ఒక ప్రభుత్వం కార్యాలయం వచింది అంటే సంతోసించే విషయం రాయలసీమ లో పుట్టిన బాబు ఏమి చేసినాడు" అని ఎలా వాదించగలుగుతున్నారు?

      మూడు రాజధానులకు సంబంధించి కొన్ని అతి ముఖ్యమైన అనుబంధ ప్రశ్నలు:ప్రస్తుతం రాష్ట ప్రభుత్వం యొక్క నికరమైన మిగులు ఆదాయం యెంత(పన్నుల రూపంలో మనం కట్టినది ఈ రాష్త్ట్రం యొక్క మొత్తం ఆదాయం,అయితే అది రాగానే రాష్ట్రప్రభుత్వం వెంటనే వాడుకోకేదు. కేంద్రానికి పంపిస్తే మొదట సైన్యం లాంటి ఉమ్మడి అవసరాలకీ స్వతంత్రం వచ్చినప్పట్నుంచీ కొనసాగుతున్న ఉత్తరాది బీమారీ రాష్త్రాల పేరున వేస్తున్న వీరముష్టికీ తీసేసి తర్వాత అంతర్జాతీఎయ ద్రవ్యనిధి దగ్గిరా కేంద్రం దగ్గిరా మనం ఇదివరకు తీసుకున్న అప్పుల్లో కొంత చెల్లు చేసి మిగిలిన అప్పు లెక్క చూపించటమే తప్ప మన, అంటే మీబోటి నాబోటి వాళ్ళ కష్టార్జితంలో ఒక్క రూపాయి కూడా వెనక్కి రావటం లేదు -ఇవన్నీ మీకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు! ఈ యవ్వారాలన్నీ అయిపోయాక వడ్డీతో కేంద్రం మనకి ఇచ్చే అప్పునే మన రాష్ట్రం యొక్క నికరమైన ఆదాయం అంటున్నారు ఇప్పుడు.ఈ అప్పులు కాక చేసే కేటాయింపులు కూడా వడ్డీ లేని అప్పులే - చేబదులు అంటాం జనవ్య్వహారంలో.) ఉంటుంది?ఇది యెంతో తెలిశాకనే బడ్జెట్లు వేసుకునేందుకు అవసరమైన అంచనాలు జరుగుతాయి.

      ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సిన అసలైన లెక్కలు ఇవి- ప్రభుత్వోద్యోగులకి జీతాలు పోను,నవరత్నాలకు కేటాయింపులు పోను వైజాగులోనూ కర్నూలులోనూ ఒక్క కొత్త భవనం కట్టడానికైనా మిగులు నిధులు ఉంటాయా?ప్రజలు వైకాపాకి 151 సీట్లు ఇవ్వటం గురించి డప్పు కొడుతున్నారు గానీ, ఆర్నెల్ల క్రితం ఏం జరిగిందో నాలుగేళ్ళ క్రితం ఏమి జరిగిందో నాకు అనవసరం - ఈ ఆర్నెల్లలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళలో ఒక్కడికైనా ఈ రాష్ట్రం యొక్క ఆర్ధిక స్థితి తెలుసా?అది తెలియనప్పుడు 151 అయితే ఏంటి 10000 అయితే ఏంటి? మీకూ వాళ్ళకీ శ్రమ అక్కర్లేదు, బుగ్గన స్వయంగా చెప్పాడు కదా రాష్ట్రం యొక్క ఆర్ధిక స్థితి బాగలేదని.మరి,అలాంటప్పుడు అమరావతిలో తయారై ఉన్న భవనాల నుంచే పరిపాలిస్తూ పొదుపు చెయ్యాల్సింది పోయి అదనపు ఖర్చులు చెయ్యటం అవసరమా?

      "అమరావతిలో నిర్మాణాలు ఏమి జరగ లేదు" అంటున్నారు, ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగాయని అనుకుంటున్నారు?

      Delete
    2. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన రాజధానికి ఖర్చు చెయ్యటానికి దబ్బుల్లేవని ఏడుస్తున్న ముఖ్యమంత్రి తాడేపల్లి గూడెంలో సొంత ఇంటి మరమ్మత్తులకి ఎంత ప్రజాధనం ఖర్చుపెట్టాడో తెలుసా!

      విశాఖలో గానీ కర్నూలులో గానీ ఫర్నిచరుతో సహా ఒక మోస్తరు పెద్ద నివాస భవనం కట్టడానికి ఎనత్ మినిమం చూసుకున్నా అర కోటి అవుతుంది. అలాంటిది ప్రాణబహ్యంతో గజలాడుతూ ఎక్కడో నీళ్ళలో మునిగిన బోటును గాల్లో ఎగురుతూ వెళ్ళడానికే కింద రోడ్ల మీద 144 సెక్షన్ పెట్టించుకున్న పెద్దమనిషికి భయం లేని స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటలతో సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ గానీ కట్టటానికి ఎంత ఖర్చవుతుందో మీరు అంచనా వేసి చెప్పండి!

      కానీ ఖర్చు లేకుండా కాపరం పెట్టాలంటే వైజాగులో రావలసిన అక్కడినుంచి తెలంగాణకి తన్ని తగిలేసిన డాటా సెంటరు కోసం చంద్రబాబు కట్టించిన భవంతులు ఖాళీగా ఉన్నాయి.కర్నూలులో అవీ లేవుగా!

      జస్ట్ ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజుకి 2,5 లక్షల కోట్లు ఉన్న అప్పు సరిగ్గా ఆరునెలలు పూర్తయ్యేలోపునే 3 లక్షాల్ కోట్లకి పెరిగింది - ఇది కూడా ప్రయోజకత్వమేనా?పోనీ తను ఈ ఆర్నెల్లలో అభివృద్ధికరమైన కార్యక్రమం ఒక్కటి మొదలుపెట్టాడా?మొత్తం రాష్ట్రానికి అప్పులు పెంచి ఆదాయం తగ్గించినవాడు మీ ప్రాంతంలో ఒక బిల్డింగు కడితే చాలు రాయలసీమకి మహోపకారం చేస్తున్నాడని ఎట్లా సంతోషపడగలుగుతున్నారో నాకు అర్ధం కావటం లేదు!

      Delete
  4. Interesting must read the behavior of Irfan Habib, left historian..
    discussion on citizwn ship act.

    https://www.opindia.com/2019/12/kerala-governor-arif-mohmmad-khan-historian-irfan-habib-speech-stop-heckle-caa/?utm_source=quora&utm_medium=referral

    ReplyDelete
    Replies
    1. కుళ్లు రాజకీయాలు రాష్ట్రంలో ఎప్పుడు ఉండేటివి దేశంలో జరిగే విషయాలు CAB NRC మాట్లాడితే కొంచం ఇతర మత కులగజ్జి తగ్గుతుంది ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన భారతదేశం పౌరునిగా బ్రతక వచ్చు..

      Delete
  5. అమరావతిలో రైతుల సొంత భూముల ఏమి లేవు అన్ని భీనామి ఆస్తులే ఉన్నాయి టిడిపి రాజకీయ నాయకులు అందరు ఎకరం లక్ష ఐదు లక్షలు కొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు పోలవరం రైతుల భూములు పోయినప్పుడు లేని ధర్నాలు ఓడరేవుకు రైతులు పోగొట్టు కున్న భూములకు అప్పుడు చేయని ధర్నాలు ఇప్పుడు అందరూ రోడ్డు ఎక్కి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు ఇతర ప్రాంతాల రైతులు కనిపించడం లేదు ఒక్క అమరావతి రైతులు మాత్రమే భూములు పోయినాయ అమరావితిలో భూములు అన్ని బినామిలు కాబట్టి నష్టపోతున్నాము అనే ఉద్దేశ్యంతో ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు

    ReplyDelete
  6. టీడీపీ మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బినామీల పేరుతో కొన్న భూముల వివరాలను అసెంబ్లీలో బుగ్గన చదివి వినిపించారు. అసలు అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే బాబు బ్యాచ్ 4 వేల ఎకరాలు కొన్నారు. అందులో 90 శాతం బాబుగారి సామాజికవర్గానికి చెందినవారే. 2014 జూన్‌ 1 నుంచి డిసెంబరు వరకు కేవలం ఆర్నెళ్ల వ్యవధిలో 4,070 ఎకరాలను చంద్రబాబు, ఆయన సన్నిహితులు ఎక్కడి నుంచో వచ్చి లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం, తుళ్లూరు .. లాంటి మారుమూల పల్లెల్లో కొనడం చూస్తుంటే..ఇది పక్కా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని అర్థమవుతోంది. తన కుల ప్రతికలలో రాజధాని ఏలూరు, గన్నవరం, నూజివీడు అంటూ రకరకాల పేర్లు రాయించి…అందరూ అక్కడ భూములు కొంటుంటే బాబు బ్యాచ్ మాత్రం లింగాయపాలెం, ఉద్ధండరాయపాలెం వంటి మారుమూల పల్లెల్లో భూములు కొన్నారు. బాబుకు అత్యంత సన్నిహితుడు, ఇప్పటి బీజేపీఎంపీ సుజనా చౌదరికే 600 కు పైగా ఎకరాలు బినామీల పేరుతో ఉన్నాయంటే ఏ స్థాయిలో బాబు బ్యాచ్ బినామీల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతిలో చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌ 14.22 ఎకరాలు కొనుగోలు చేసింది. ఈ మొత్తం 14.22 ఎకరాలు డైరెక్ట్‌గా హెరిటేజ్‌ఫుడ్స్‌ పేరు మీదే ఉన్నాయి. హెరిటేజ్ ప్రెష్ ఫ్యూచర్ గ్రూపుకు అమ్మేసినా..ఇందులో 10 శాతం వాటా బాబుకు ఉంది. మిగతా హెరిటేజ్ సంస్థలన్నీ బాబు ఫ్యామిలీ చేతుల్లోనే ఉండడం గమనార్హం.

    ఇక అప్పటి మంత్రి నారాయణ ఆవుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, ప్రమీల అనే తన బంధువులు, ఉద్యోగుల పేరుతో 55.27 ఎకరాల భూమి కొన్నారు. అయితే అసలు రాజధాని ప్రాంతంలో తనకు భూములే లేవని, తన బంధువులు, మిత్రులు భూములు కొనుక్కున్నారని మాజీ మంత్రి నారా‍యణ బీద అరుపులు అరుస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన కూడా నారాయణకు స్థలాలు, పొలాలు ఉన్నాయని చెప్పలేదు, ఆయన బినామీల పేర్లు చదివి మరీ 55 ఎకరాలకు పైగా భూములు పోగేసుకున్నారని వివరించారు. కాగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అని తెలిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోండి అంటూ బిల్డప్ ఇస్తున్న నారాయణ, మరి తన బినామీలు అక్కడెందుకు ఆస్తులు కొన్నారో, అది కూడా రాజధాని ప్రకటన రావడానికి ముందు తన బంధులు, మిత్రులు ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారో ఆయనే సమాధానం చెప్పాలి. ఇక అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు బినామీ పేర్లతో కొన్నారు. బాబు హయాంలో నాటి మరో మంత్రి పరిటాల సునీత కూతురు భర్త పేరు మీద భూమి కొనుగోలు చేశారు. మాజీమంత్రి రావెల కిషోర్‌ బాబు 40.85 ఎకరాలు మైత్రీ ఇన్‌ఫ్రా సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. నాటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ చౌదరి 68.60 ఎకరాలను అభినందన హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట కొనుగోలు చేశారు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జీవీఎస్‌ ఆంజనేయులు చౌదరి 37.84 ఎకరాలు బినామీ పేరుతో కొనుగోలు చేయగా పయ్యావుల కేశవ్‌ చౌదరి పయ్యావుల శ్రీనివాసులు అండ్‌ వేం నరేందర్‌ రెడ్డి పేరుతో 15.30 ఎకరాలు కొన్నారు.

    ఇక లోకేష్‌కు బినామీ, వ్యాపార భాగస్వామి అయిన వేమూరు రవికుమార్‌ ప్రసాద్‌ చౌదరి 25.68 ఎకరాలు కొన్నారు. బాబుగారు ఉంటున్న అక్రమనివాసం ఓనర్ లింగమనేని రమేష్‌ 351 ఎకరాలను సుజనా, ప్రశాంత్‌ పేరు మీద, ఇతర కంపెనీలు మీద కొనుగోలుచేశారు. అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌ యాదవ్‌ 7 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ 17.13 ఎకరాలు శశి ఇన్‌ఫ్రా పేరు మీద కొన్నారు. అలాగే నాటి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి 13.50 ఎకరాలను ధూళిపాళ్ల వైష్ణవి, దేవురపుల్లయ్య పేర్లతో కొనుగోలు చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి 7.56 ఎకరాలు తన కుమారుడు పల్లె వెంకట కిషోర్‌ కుమార్‌ అని పేరు మీద కొనుగోలు చేశారు. టీడీపీ నాయకులు, వారి బంధువులు అక్కడ రాజధాని వస్తుందని తెలిసే 2014 జూన్‌ 1 నుంచి డిసెంబరు వరకు 4,070 ఎకరాలు కారుచౌకగా కొన్నారు. అయితే తప్పులు చేసి అంత తేలిగ్గా దొరికిపోవడానికి టీడీపీ నేతలేం ఆషామాషీ మనుషులు కాదు కదా, అన్నీ పక్కాగా లెక్క చూసుకుని మరీ బినామీలను రంగంలోకి దింపారు. తాము బినామీలుగా ఉండాల్సిన వారి కోసం కూడా తమ బినామీలను తెరపైకి తెచ్చారు. అలా ఎకరాలకెకరాలు టీడీపీకి చెందిన నేతలు పోగేసుకున్నారు. తమవాళ్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మొత్తంగా బుగ్గన బయటపెట్టిన పచ్చనేతల బినామీల లిస్ట్ రాష్ట్రవ్యాప్తగా సంచలనం రేపుతోంది.ఇన్నాళ్లూ అమరావతి కలుగులో దాక్కున్న టీడీపీ నేతల బినామీ బాగోతాలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిలో ఎక్కడ తమ వర్గం నేతల భూముల విలువ పడిపోతుందనే భయంతోనే చంద్రబాబు ఇంతగా కడుపు మంటతో రగలిపోతున్నాడు. తన సామాజికవర్గానికి చెందిన కొంత మంది రైతులు, బినామీ వ్యాపారులతో ఆందోళన చేయిస్తున్నాడు. ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించేలా మాట్లాడుతున్నాడు. అదన్న మాట అసలు సంగతి.

    ReplyDelete
    Replies
    1. కడప జిల్లా మొత్తం భూమిలో మూడొంతులు రాజా రెడ్డి కుటుంబం పీట కిందే ఉన్నాయి, దాని సంగతి యేంటి?న్యాయంగా కొనుక్కోవటం కూడా కాదు, సహకార్ బ్యాకుల్లోనో మరొకచోట్లో లోన్లు పెట్టీనవాటిని మాయ చేసీ వేలిముద్రలతోనూ రాయిచుకున్నారు.తాత తరం నుంచీ జగన్మోహాన్ రెడ్డి సంపాదన మొత్తం నెత్తురు కూడే కదా!వీళ్ళు ముగ్గురే కాదు, అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ వాళ్ళ వాళ్ళ బీరకాయ పీచు వాళ్ళలోనూ తిన్ననైన చరిత్ర ఉన్నవాళ్ళు యెంతమంది?

      Delete
    2. https://www.youtube.com/watch?v=0Zx6sRWeWGI&feature=youtu.be
      Amaravathi Money Facts by Dr Guntupalli Srinivas | Andhra Pradesh

      Delete
    3. @you:మొత్తంగా బుగ్గన బయటపెట్టిన పచ్చనేతల బినామీల లిస్ట్ రాష్ట్రవ్యాప్తగా సంచలనం రేపుతోంది.

      me:అంత సంచలనాత్మకమైన నేరం అయుతే కోర్టులో చార్జి షీట్ వెయ్యొచ్చు కదా - బాబు కూడా చాలెంజి చేస్తుంటే కేసు వెయ్యకుండా వాళ్ళు ఒణికిపోతున్నారని మీకు మీరే డప్పాలు కొట్టుకోవడం ఎందుకు?

      Delete
    4. నెలకి 250 కోట్లంట విలేజి అసిస్తెంట్లకి జీతాల కింద పొయ్యేది! ఆ ఉద్యోగాల అవసరం ఏమిటో ఇవ్వాల్టికీ ఎవరికీ తెలియదు - మీకు తెలుసా!

      పంచాయత్ రాజ్ వ్య్వస్థ ఉంది కదా, ఇదెందుకు మల్లీ అనే ప్రశ్న మీకు మీరైనా వేసుకున్నారా?అందులో ఎన్ని కోట్లు జగన్ సొంత జేబు నుంచి తీసి ఇస్తున్నాడు?ఆ సొమ్ములో మీ వాటా లేదా? ప్రజల కష్టార్జితం నుంచి నెలకి 250 కోట్లు కొంతమందిని కూర్చోబెట్టి మేపడానికి వెల్తుంటే అదేమిటని అనిపించలేదా మీకు?

      విజయ సాయియ్ రెడ్డి పబ్లిక్ డయాస్ మీదనే అంతా మనోళ్ళే సెలక్టయ్హారు అని చంకలు గుద్దుకోవటం మీకు తెలియదా?అది చమ్మగా ఉందా మీకు!

      Delete
  7. cbn telling he is hindu but worst disrepcting to honurable ramana deekshithulu gaaru and kicking out from tirumala. even ntr scoldig hindus like anything in dvs karna cinema and getouting temple archakas when he is in cm khurchi.

    jagan atleast bringing back dikshitulu sir. even he is fully supported nagarikta shanshodhan in lokasabha for hindues from pak, afghan and b'desh.

    we hindus dont want fake nastikulu like waste babu

    ReplyDelete
    Replies
    1. Ramaan deekshitulu has his own black marks.He lied about pink diamond!

      Do you know what are the main virtues of a brahmin - read gita!

      I repeatedly are expressing my views about brahmins - I respect only a genuine brahmin by character, but not a corrupt brahmin by birth.

      Of course, I condemned some of the TDP(kammas by their second name I guess)using fowl language aaginst ramaan deekshitulu, But I cannot support him once I knew he lied about the pink diamond and sided with a christian jagan!

      Delete
    2. I do not have any inclination towards babu, I also hate his psuedo secularist blasphemy.

      I fully agree with BJP on CAA and NRC!But, we have to limit it a point based support because BJP also played, playing and will play dirty politics with AP.

      Delete
    3. what ramana deekshithulu garu told about pink daimond stealing is 1000% truth. just u wait and see. even dr. subramanyam swamyji will put case in court soon.

      jagan is converted xian. his mummy always keeping bible in hand. but cbn is worst type of psudo waste fellow doing midnite kshudra puja in kanakadurga ammavaru only for power greedy

      Delete
    4. Anonymous3 January 2020 at 01:23
      what ramana deekshithulu garu told about pink daimond stealing is 1000% truth.

      hari.S.babu
      How you could believe it?Current Government itself Declared it as there is no pink diamond in the history of the temple!Then why ramana deekshitulu himself was silent on that pablic statement?

      Delete
    5. తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన విషయం జగమెరిగిన సత్యం. ప్రభుత్వా మారవచ్చు.

      ముఖ్యమంత్రులు మారవచ్చు గానీ, రాజకీయాలు సేమ్ టు సేమ్. వివాదాలు సేమ్ టు సేమ్

      కొద్ది కాలం కిందట తిరుమలలో పింక్ డైమండ్ మాయం అనే వార్త దేశవ్యాప్తంగా దుమారం రేపింది. గుర్తందా?

      అది దేశ ఎల్లలు దాటిపోయిందని లండన్‌లో ఎక్కడో ఉందని పెద్ద ఎత్తున దుమారం రేగింది. బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది.

      అయితే పింక్ డైమండ్ ఉందని ఒక వర్గం. పింక్ డైమండ్ లేదని మరొక వర్గం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న విషయమూ తెలిసిందే.

      పింక్ డైమండ్‌ను మాయం చేశారని, గుడిలోనే గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని మాజీ ప్రధనార్చకులు,ప్రస్తుత గౌరవ ప్రధానార్చకులు రమణ ధీక్షుతులు ఆరోపించిన విషయం తెలిసిందే.

      అదే సమయంలో ఆ పింక్ డైమండ్ ఫలానా చోట ఉందని వైసిపి నేత విజయ సాయి రెడ్డి అన్నారు. అసలు పింక్ డైమండే లేదని ప్రస్తుత అదనపు ఈవో అప్పుడు, ఇప్పుడు వాదిస్తున్నారు.

      దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం 200 కోట్ల రూపాయలకు విజయసాయిరెడ్డి మీద, రమణదీక్షితులు మీద కేసు వేశారు. ఇందుకోసం రూ. 2 కోట్ల రూపాయల ఫీజులు కూడా చెల్లించారు.

      ఇలాంటి సమయంలో పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

      అదే సమయంలో ఆగమశాస్త్ర సలహా మండలి సభ్యులుగానూ, గౌరవ ప్రధానార్చకులుగాను రమణదీక్షితులు తిరుమలలో రంగ ప్రవేశం చేశారు.

      ఇలాంటి సమయంలో తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ విషయమై కోర్టులో ఉన్న కేసు ఏమవుతుంది. కొనసాగుతుందా?

      పింక్ డైమండ్ అనేదే లేదన్న ధర్మారెడ్డిగారు, పింక్ డైమండ్ తరలించారన్న రమణదీక్షితులు, పింక్ డైమండ్ టీడీపి నాయకుల ఇంట్లో ఉందన్న వియజ సాయిరెడ్డి ముగ్గురు ఒకే తాటిపై ఉన్నారు.

      ఇలాంటి స్థితిలో కేసు ఏమవుతుంది.? రమణదీక్షితులును తిరిగి గౌరవ ప్రధానార్చకులుగా తీసుకోవడంతో మరో తెరపైకి వచ్చింది.
      ఒక వేళ రాజీ కుదర్చుకోవాలన్నా లోకాయుక్తకు వెళ్ళాళి. అక్కడ ఎవరో ఒకరు తప్పని ఒప్పుకోవాల్సిందే. గతంలో ప్రధానార్చకులుగా, ప్రస్తుతం గౌరవ ప్రధానార్చకులుగా ఉన్న రమణదీక్షితులు ఒప్పుకుంటారా?

      గతంలో పాలక మండలి పని చేసి, ప్రస్తుతం ఎంపిగా ఉన్న విజయసాయి రెడ్డి ఒప్పుకుంటారా? లేక తప్పు తమదేనని పింకు డైమండ్ ఉన్నది అది వెళ్ళిపోయిందని టీటీడీ ఒప్పుకుంటుందా? అనే విషయం బయట చర్చనీయాంశంగా మారింది.

      Delete
  8. ఈ కుళ్లు రాజకీయాల వలన దేశం నష్టపోతోంది ఇది నెహ్రూతో మొదలై ఇప్పటికి కూడా రాష్ట్రాలలో అవినీతి కుల రాజకీయాలతో ప్రజలు ఎవరిని నమ్మలో అర్థం కాక వాళ్ళ ప్రసంగాలు టివి డిబేట్ ప్రోగ్రాం లతో బ్రెయిన్ వాష్ చేసి నమించి గెలిచిన తరువాత వాళ్ళ చేతి వాటంతో ఆస్తులు కూడా బెట్టుకొని ప్రజలను భానీసలు చేస్తూ ఉన్నారు డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ల మాటే చెల్లుతుంది సామాన్య రైతు ప్రజలు నష్ట పోతున్న పఠించు కొనే నాధుడే కరువు అయినారు ఇది ఇప్పుడు జరుగుతున్నది దేశంలో రాష్ట్రంలో

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...