Wednesday, 11 December 2019

అంబేద్కర్ తన The Buddha and his Dharma పుస్తకానికి రాసిన పరిచయాన్ని పుస్తకంతో పాటు ప్రచురించకపోవటానికి అసలు కారణం ఏమిటి?


భీమ్రావ్ రాంజీ "The Buddha and his Dharma" అనే ఉద్గ్రంధం రచించాడు.దానికి ఒక పరిచయం రాశాడు.కానీ ఆ పరిచయం తన పూర్తి రూపంలో ప్రచురణ కాలేదు. ఇదొక విచిత్రం!ఎందుకంటే, ఒకరు ఒక విషయం గురించి కొంత ఎక్కువ సమయం వెచ్చించి చదవాల్సిన స్థాయిలో పుస్తక పరిమాణం ఉంటే చదువరికి తన సమయం విలువైనది కాబట్టి అతనికి ఆసక్తి కలగడం కోసం తన పుస్తకాన్ని ఎందుకు చదవాలో చెప్పడం రచయిత బాధ్యత.మరి అంత ముఖ్యమైన పరిచయ వాక్యాన్ని ఆ రచయిత మీద గౌరవం ఉన్న ప్రచురణకర్త ప్రచురించలేదంటే ఆ రచయితని అవమానించడమే కదా!మరి, ఆ రచయిత మీద గౌరవం లేనివాళ్ళకి ఆ గ్రంధాన్ని ప్రచురించాల్సిన అవసరం ఏమిటి?
భీమ్రావ్ రాంజీ ఆ పరిచయం రచించినది 1956 ఏప్రిల్ 6న, గతించినది 1956 డిసెంబర్ 6న.పుస్తకం తొలి ముద్రణ 1957లో Siddhartha College Publications, Mumbai వారి సంస్థ నుంచి జరిగింది. చరిత్రని బద్ధకంతో చదివితే రచయిత ఆ పుస్తకాన్ని ఆఖరి రోజులలో రాశాడు కాబట్టి సమయం లేక రాయలేదని అనిపిస్తుంది.కానీ, రచయిత రాశాడు, ప్రచురణ కర్తలు ప్రచురించలేదు - ఈ విషయం కూడా 1980లో Bhagvan das అనే Punjabi Buddhist Literateur కొన్ని ఇతర అరుదైన పరిచయ వాక్యాల మధ్యన దీన్ని కూడా చేర్చి ప్రచురించిన తర్వాతనే అందరికీ తెలిసింది!ఇంకొక చిత్రమైన విషయం ఏమితంటే, ఈ వ్యాసంలోని కొన్ని అంశాలని 1967 నవంబర్ 19న ఆ పుస్తకానికి ముందుమాటలో  R.R. Bhole ప్రస్తావించినట్టు కనపడుతుంది.అయితే, ఆయన కూడా మిగిలిన అన్ని విషయాలనూ  స్పృశించారు. కానీ రచయిత తన రెండవ భార్యను గురించి చెప్పిన ఆత్మీయమైన నాలుగు వాక్యాలను మాత్రం ప్రస్తావించలేదు,దీన్ని బట్టి చూస్తే ఆ పుస్తకాన్ని ప్రచురణ కర్తల వద్దకు తీసుకెళ్ళిన వారూ, ప్రచురణ కర్తలూ, ముందుమాట రాసినవారూ ఆ మాటల పట్ల తిరస్కారంతో విస్మరించినట్లు అనుమానించాల్సి వస్తున్నది.
ఈరోజున లభ్యమవుతున్న పూర్తి పాఠం చూస్తే పూర్తిగా దాచెయ్యాల్సినంత ప్రమాదకరమైన విషయాలు గానీ  కొంత తొలగించి ప్రచురించాల్సినంత అపాయకరమైన భావాలు గానీ అందులో లేవు - రచయిత తన రెండవ భార్య తనకు చేసిన సహాయాలకి కృతజ్ఞత తెల్పడం తప్ప! ఆ పరిచయాన్ని ప్రచురణకర్తలూ ఇతర దళిత మేధావులూ దాచెయ్యడానికి నేను అ విషయం గురించి చదివిన అన్ని ప్రస్తావనలలోనూ ఆయా విశ్లేషకులు చెప్పిన ఒకే ఒక ప్రముఖమైన కారణం ఆ రెండవ భార్య బ్రాహ్మణ కులానికి చెందిన స్త్రీ కావడం అట! తన జీవితాన్ని annihilation of caste అనే మహోన్నత లక్ష్యానికి అంకితం చేశాడని తన అనుయాయుల చేత కీర్తించబడే ఒక ప్రముఖ వ్యక్తి యొక్క భార్య అదే ప్రముఖ వ్యక్తి యొక్క అనుయాయుల నుంచి నిరాదరణ ఎదుర్కోవడానికి ఆమె యొక్క కులం కారణం కావడం అంటే ఏమిటి?
కేవలం ఈ పరిచయాన్ని దాచెయ్యడం అయితే పొరపాటుననో అపార్ధాల చేతనో జరిగిందని అనుకోవచ్చు.ఆ ప్రముఖవ్యక్తి యొక్క కన్న కొడుకుతో సహా ఆమె మీద ఆ ప్రముఖవ్యక్తిని ప్రణాళికాబద్ధమైన కుట్రతో హత్య చేసిన నేరం మోపారు, ఆందోళనలు చేశారు, పట్టుబట్టి విచారణ జరిపించారు, ప్రభుత్వం ఆమె నేరాన్ని రుజువు చెయ్యలేకపోయింది, కిరాయి హంతకులతో ఆమెని హత్య చేయించడానికి ప్రణాళికలు వేశారు - కులభేదాలకి గురయి అవమానించబడ్డామని ఆక్రోశించే అభ్యుదయ పురోగామి సర్వసమతావాదులలో ఏమిటీ కులోన్మాదం!
పోనీ భీమ్రావ్ రాంజీ ఆమె గురించి పేజీలకి పేజీలు పొగిడి ప్రింటు ఖర్చులు పెంచాడా అంటే అదీ లేదు.When I took up the task of composing the book I was ill, and [I] am still ill. During these five years there were many ups and downs in my health. At some stages my condition had become so critical that doctors talked of me as a dying flame. The successful rekindling of this dying flame is due to the medical skill of my wife and Dr. Malvankar. They alone have helped me to complete the work. I am also thankful to Mr. M. B. Chitnis, who took [a] special interest in correcting [the] proof and to go [=in going] through the whole book.” అనే ఇంత చిన్న భాగంలో "due to the medical skill of my wife" అనే చిన్న ముక్క వీళ్ళకి అంత కోపాన్ని తెప్పించడం అంటే ఈ అభ్యుదయ పురోగామి సర్వసమతావాదులైన దళిత వీరులు ఎంత భయంకరమైన మనస్తత్వంలో ఉన్నారో తెలియడం లేదా?
అసలు నిచ్చెనమెట్ల కులవ్యవస్థ వల్లనూ అగ్రకుల దురహంకారం నుంచి పుట్టిన అస్పృశ్యత వల్లనూ అణగారి పోయామని చెప్పి దానిమీద తిరగబడే అభ్యుదయపురోగామిసర్వసమతావాదులైన దళిత వీరులు తమ కులగురువు యొక్క రెండవ భార్యనే కులవివక్షతో వేధించడం అనేది మొదటిసారి తెలిసినప్పుడు నాకు ఆశ్చర్యంతో పాటు కుతూహలం కూడా పుట్టింది - తమ మీద ఇతరులు చేస్తున్న ఈ దుర్మార్గమైన ఆరోపణలను అటువైపునుంచి ఖండించిన వివరణలు యెక్కడ ఉన్నాయి?నాకైతే కనపడలేదు - యేకపక్షపు విమర్శ నాకు అలవాటు లేదు కాబట్టి ఇది చదువుతున్నవాళ్ళలో చూసినవాళ్ళు చెబితే చూస్తాను.నేను చూసిన మొదటి ప్రస్తావన RAKSHIT SONAWANE తన బ్లాగు వద్ద May 30, 2003 at 0000hrs IST సమయంలో పోస్ట్ చేసినది.
అంటే. 1960ల నాటినుంచి 2000ల నాటివరకు "నిచ్చెనమెట్ల కులవ్యవస్థ వల్లనూ అగ్రకుల దురహంకారం నుంచి పుట్టిన అస్పృశ్యత వల్లనూ అణగారి పోయామని చెప్పి దానిమీద తిరగబడే అభ్యుదయపురోగామిసర్వసమతావాదులైన దళిత వీరులు తమ కులగురువు యొక్క రెండవ భార్యనే కులవివక్షతో వేధించడం" అనే దుర్మార్గమైన ఆరోపణలను ఖండించలేదన్నమాట - దొరికిపోయి సిగ్గు పడటం వల్ల ముఖం చెల్లలేదా?సిగ్గు వదిలేసిన పట్టుబడని దొంగల ధైర్యంతో జవాబు చెప్పలేదా!
ఇంతకీ, RAKSHIT SONAWANE దగ్గర్నుంచి సంఘరక్షిత వరకు అందరూ అనుకున్నట్టు వాళ్ళు ఆ పరిచయవాక్యం ప్రచురించనిది "due to the medical skill of my wife" అనే చిన్న మాటకేనా?అసలు చూపించకుండా దాచెయ్యాల్సినంత ప్రమాదకరమైన విషయం ఏముంది అందులో?ఇప్పుడు ఆ బౌద్ధమత పండితుడు సేకరించి ప్రచురించిన పరిచయం చదువుతుంటే నాకు అందులోని ఇతర విషయాల పట్ల కొన్ని అనుమానాలు వస్తున్నాయి?ఇదివరకు రేఖామాత్రం చదివిన జీవితచరిత్రలో తనకు సన్మానం జరిగినప్పుడు Dada Keluskar బుద్ధుడి జీవితం గురించిన పుస్తకం ఇచ్చాకనే రాంజీకి బుద్ధుడి గురించి తెలిసినట్టు ఉంటుంది - ఆ రచయిత నాటకీయత కోసం అలా  రాసి ఉండవచ్చు.అయితే, ఇక్కడ రాంజీ చెప్పీన దాని ప్రకారం తండ్రి సన్మానం ఆలోచనని తిరస్కరిస్తే ఈ కేలుస్కర్ మహాశయుడు ఆయన్ని ఒప్పించి సన్మానం జరగడానికి కారణమయిన ముఖ్యవ్యక్తి అని తెలుస్తున్నది!అంటే, ఈ కేలుస్కర్ కేవలం స్కూల్లో టీచరు మాత్రమే కాదు, రాంజీ తండ్రికి చాలా కాలం నుంచి స్నేహితుడు కూడా అనేది స్పష్టం, అవునా?
“My father was a military officer, but at the same time a very religious person. He brought me up under a strict discipline. From my early age I found certain contradictions in my father's religious way of life. He was a Kabirpanthi, though his father was Ramanandi. As such, he did not believe in Murti Puja (Idol Worship), and yet he performed Ganapati Puja--of course for our sake, but I did not like it. He read the books of his Panth. At the same time, he compelled me and my elder brother to read every day before going to bed a portion of [the] Mahabharata and Ramayana to my sisters and other persons who assembled at my father's house to hear the Katha. This went on for a long number of years.” - ఇది బుద్ధుడి జీవితం పరిచయం కాకముందరి ఇంటి వాతావరణం. తండ్రిగారు ఒక ఆదర్శవంతుడైన హిందువు,కబీర్ పంధి కాబట్టి రోజూ విగ్రహారాధన చెయ్యకపోయినా గణపతి పూజ లాంటివి నిష్ఠగా చేస్తున్నారు.బుద్ధుడి పుస్తకం అనే బహుమతి రాకముందునుంచీ కుర్రాడికి ఆ కాస్త పూజలు కూడా ఇష్టం ఉండేవి కాదట.పుస్తకం చదివాక వచ్చిన సందేహాలకు బుద్ధచరిత్ర కారణమైతే మరి, ముందరినుంచీ ఉన్న విముఖతకి కారణం ఏమిటి?"I asked my father why he insisted upon our reading the Mahabharata and Ramayana, which recounted the greatness of the Brahmins and the Kshatriyas and repeated the stories of the degradation of the Shudras and the Untouchables." అని అంటున్న రాంజీని మనం ఎలా అర్ధం చేసుకోవాలి?
రామాయణ మహాభారతాల రచయితలకి అసలు కులం అనే భావనే లేదు, పాత్రలు కూడా వైదిక సంప్రదాయానికి లోపలివారే తప్ప దళిత, అస్పృశ్య పదాలతో పిలవడానికి తగిన నేపధ్యమే లేదు. రావణలంకలో వేదాధ్యయనమూ యజ్ఞయాగాది క్రతువులూ జరిగేవి,దుర్యోధనుడూ కర్ణుడూ బ్రాహ్మణులకి గోదాన భూదానాది కర్మలతో సహా వైదిక ధర్మాన్ని అనుసరించినవారే!రెండు కధల్లోనూ సీతాహరణం,మాయాద్యూతం లాంటి లాంటి పాపిష్టి పనులు చెయ్యడం వల్ల రావణ దుర్యొధనులు ప్రతి నాయకు లయ్యారే తప్ప పుట్టుక వల్ల అంటగడుతున్న అస్పృశ్యత రెండు కధల్నీ కంచు కాగడాతో వెదికి చూసినా ఏ పాత్రకీ లేనే లేదు.మరి ఇంతటి మహామేధావికి అంత చిన్నప్పుడే ఆ కధల్లో degradation of the Shudras and the Untouchables ఎలా కనబడింది! అంత భక్తి తత్పరుడైన తండ్రికి పుట్టిన గారాల కొడుకులో "I do not like Bhishma and Drona, nor Krishna. Bhishma and Drona were hypocrites. They said one thing and did quite the opposite. Krishna believed in fraud. His life is nothing but a series of frauds. Equal dislike I have for Rama. Examine his conduct in the Sarupnakha [=Shurpanakha] episode [and]  in the Vali Sugriva episode, and his beastly behaviour towards Sita." అనేటంత స్థిరమైన విముఖత ఎట్లా సాధ్యం?అదీ, తండ్రి "The reason why I ask you to read the Mahabharata and Ramayana is this: we belong to the Untouchables, and you are likely to develop an inferiority complex, which is natural. The value of [the] Mahabharata and Ramayana lies in removing this inferiority complex. See Drona and Karna--they were small men, but to what heights they rose! Look at Valmiki--he was a Koli, but he became the author of [the] Ramayana. It is for removing this inferiority complex that I ask you to read the Mahabharata and Ramayana." అని వివరించిన తర్వాత కూడా సమాధాన పడలేనంత విముఖత అంత చిన్న వయసులోనే ఎలా సాధ్యం?ఒక ప్రతిజ్ఞకి బద్ధుడై తన స్వంత సుఖాల్ని కూడా వదులుకుని కధలో ఏ దుర్మార్గమూ చెయ్యని భీష్ముణ్ణి కూడా హిపోక్రయిట్ అనడం చూస్తే ఈ రచయిత ఇప్పటి కత్తి మహేష్, కదిరి కృష్ణ, కంచె ఐలయ్యల కంటె ఏ విధంగానూ ఉన్నతుడు కాదని అనిపిస్తుంది!
కాంగ్రెసు వాళ్ళూ భాజపా వాళ్ళూ దళితుల వోట్ల కోసం ఇతన్ని మోశారు, మోస్తున్నారు, మోస్తారు గానీ నాకైతే భీమ్రావ్  రాంజీ సక్పాల్ ఉరఫ్ అంబేద్కర్ అనే వ్యక్తి మనం నెత్తిన పెట్టుకుని మ్మొయ్యాల్సిన ఔన్నత్యం ఉన్నవాడు కాదు.1924 మార్చి 9Bombay నగరంలోని Damodar Hall వేదిక మీద చేసిన ప్రసంగంతో అతని రాజకీయ జీవితం మొదలైంది - అప్పటి వరకు అతను ఎక్కడ ఉన్నాడు?బ్రిటిష్ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా మంత్రిత్వం వెలగబెడుతున్నాడు!1920 నాటికే లోకమాన్య తిలక్ అస్తమించాడు,గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ స్వానంత్య్రోద్యమాన్ని ఉధృతం చేసింది,చంపారన్ సత్యాగ్రహం  విజయవంతంగా ముగిసి ప్రకంపనాలు సృష్టించింది,ఖిలాఫత్ ఉద్యమం వచ్చి పోయింది,రౌలట్ చట్టం మీద ప్రతిఘటన కూడా ముగిసింది, పంజాబులో జలియన్ వాలాబాగ్ నరమేధం కూడా అప్పటికి జరిగిన కధే! అయినప్పటికీ అతని నోట బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకమూ స్వాతంత్య్రోద్యమానికి అనుకూలమూ అయిన ఒక్క వ్యాఖ్య కూడా చెయ్యలేదు,ఎందుకని?
ఇంగ్లీషువాళ్ళు మంచివాళ్ళా చెడ్డవాళ్ళా అనేది ఎప్పటికీ తేలనిదే, కాంగ్రెసు కూడా ప్రాచీన కాలపు రాజవంశీయులకి సెక్యులర్ ముద్ర కొట్టి కొత్త రకం వేషాలతో అధికారం అప్పజెప్పటానికే రాజకీయాలు నడిపింది.అందులో నాకు ఎలాంటి అనుమానమూ లేదు.కానీ, ఈ అంబేద్కర్ మహానుభావుడు చేసింది మాత్రం ఏమిటి?ఈ రోజున 14 వాల్యూముల మొత్తం 9,996 పేజీల సాహిత్య సర్వస్వంలో అప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో ఏ ఒక్క దాన్నీ ప్రశంసించలేదు, పైన ఫెయిలైన వాటిని "నేను ముందే చెప్పాను!" అంటూ వెక్కిరంచడమూ సక్సెసయిన వాటిని "ఇంతేనా!ఇందులో ఏముంది?" అంటూ చిన్నబుచ్చడమూ చేశాడు.అయినా నెహ్రూ స్వాతంత్య్రానంతరం ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రి అయ్యాడు - వింతగా లేదూ!
"All me to say that the British have a moral responsibility towards the scheduled castes. They may have moral responsibilities towards all minorities. But it can never transcend the moral responsibility which rests on them in respect of the untouchables. It is a pity how few Britishers are aware of it and how fewer are prepared to discharge it. British rule in India owes its very existence to the help rendered by the untouchables. Many Britishers think that India was conquered by the Clives, Hastings, Coots and so on. Nothing can be a greater mistake. India was conquered by an army of Indians and the Indians who formed the army were all untouchables. British rule in India would have been impossible if the untouchables had not helped the British to conquer India. Take the Battle of Plassey which laid the beginning of British rule or the battle of Kirkee which completed the conquest of India. In both these fateful battles the soldiers who fought for the British were all untouchables..." - ఇవ్వాళ బ్రాహ్మణుల చేత అణగదొక్కబడి కృంగి కృశించి మానసికంగా కుమిలిపోయి బలహీనులైపోయారని వారికి రిజర్వేషన్లు ఇవ్వకపోతే అంతరించి పోవడం ఖాయం అని బెదరగొట్టిన B R Ambedkar అనే కులవేర్పాటువాదపితామహుడు A V Alexander అనే ఆంగ్లేయుడికి 1946 మే 14న రాసిన ఆత్మలోని మిత్రవాక్యం British rule in India would have been impossible if the untouchables had not helped the British to conquer India అని స్పష్టం చేస్తున్నది.అందుకే నేను "ఇంగ్లీషువాళ్ళు మంచివాళ్ళా చెడ్డవాళ్ళా అనేది ఎప్పటికీ తేలనిదే" అని అంటున్నది.
ఇప్పుడు నేను దళితేతరులకి వేస్తున్న ప్రశ్న యేమిటంటే "ఇంగ్లీషువాళ్ళు మీ దేశానికి ద్రోహం చేశారని మీ నాయకుల సారధ్యంలో పోరాడి వాళ్ళనుంచి విముక్తులైన మీకు మీ శత్రువులు మీ దేశాన్ని ఆక్రమించడానికి సాయపడినవారు ఏమవుతారు?" అని.మీ శత్రువులకి సాయం చేసినవాళ్ళు మీకు శత్రువులు కారా?అవుతారు, అయి తీరాలి - ఇంతవరకు తెలియక పోతే ఇప్పుడు తెలుసుకుని యుద్ధం మొదలుపెట్టండి!వాళ్ళే ప్రముఖం చేసుకున్న పుట్టుకను బట్టి వచ్చే వారసత్వం ఉన్న ఈనాటి మూలవాసీ వారసులైన కత్తి మహేష్, కదిరి కృష్ణ, కంచె ఐలయ్య కూడా మీకు శత్రువులే అవుతారు కదా!
అట్లాగే దళిత వీరులకి వేస్తున్న ప్రశ్న యేమిటంటే "మీరు సాయం చేసి అధికారంలోకి తీసుకొచ్చిన ఇంగ్లీషువాళ్ళు వాళ్ళ దేశానికి ద్రోహం చేశారని వాళ్ళ నాయకుల సారధ్యంలో పోరాడి మీవాళ్ళనుంచి విముక్తులైన వాళ్ళకు వాళ్ళ దేశాన్ని ఆక్రమించడానికి సాయపడిన మీరు ఏమవుతారు?" అని.ఈ దేశం మీకు స్వదేశమా, శత్రుదేశమా, లేక మిత్రదేశమా?ఏ జవాబు చెప్పినా కారణాలు చెప్పాలి, జై భీం దళీత టైగర్లు ఏమి జవాబు చెప్తారో మరి.
అసలు ఆది నుంచీ అంతం వరకు కాంగ్రెసునీ గాంధీనీ పడదిట్టినవాడికి బాబూ జగజ్జీవన్ రాం సిఫారసుతో నెహ్రూ మంత్రివర్గంలో దూరాల్సిన ఖర్మ దేనికి పట్టింది!ఈ దేశాన్ని సెంట్రల్ రిజర్వ బ్యాంకు రూపంలో స్వతంత్రం కాని స్వతంత్రాన్నీ ప్రజాస్వామ్యం కాని ప్రజాస్వామ్యాన్నీ లౌకికత్వం కాని లౌకికత్వాన్నీ ప్రజలకు చూపిస్తూ తన దోపిడీని చట్టబద్ధం చెయ్యటానికి పధక రచన చేసిన Rothschilds మందకి ఒక వింత సంప్రదాయం ఉంది.ఒక కీలుబొమ్మకి అధికారం ఆశపెట్టి తమ వెంట తిప్పుకుంటూనే ఇంకో కీలుబొమ్మని తయారు చేసి రెంటికీ పోటీ పెట్టి ఏది గెలిచినా తమకే లాభం వచ్చేలా చూసుకుంటారు.ఒక కీలుబొమ్మ కొంచెం తోక ఝాడించితే మరొక కీలుబొమ్మని అధికారంలోకి తెచ్చుకునే సామ్రాజ్యవాదపు వ్యూహాత్మక చదరంగంలో గాంధీని ప్రోత్సహించినట్టుగానే అంబేద్కరును కూడా ప్రోత్సహించి రంగంలోకి దింపారు.
అయితే,1937 ఎన్నికల్లో దారుణమయిన దెబ్బ తినటంతో ఇతన్ని ఇంగ్లీషువాళ్ళు ప్రోత్సహించదం మానేశారు. అప్పటి బ్రిటిష్ ఇండియా ఏర్పాటు చేసిన 11 ప్రావిన్షియల్ అసెంబ్లీలలో ఉన్న మొత్తం 1,585 సీట్లలో Chambers of Commerce, plantations, labour వంటి ప్రత్యేక కేటాయింపుల సీట్లు ఏకగ్రీవం అయ్యాయి.మిగిలిన 808 జనరల్ సీట్లలో అంబేద్కరూ జిన్నా ఇతర్లూ గొంతులు చించుకుని అరిచి గోల చేసి ఓడించాలని చూసిన కాంగ్రెసు 456 సీట్లలో గెల్చింది! Madras, United Provinces, Central Provinces, Bihar, Orissa అనే 5 ప్రావిన్సులూ కాంగ్రెసుకి అత్యధిక మెజారిటీని ఇచ్చాయి,Bombay, Bengal, Assam, NWFP అనే 4 ప్రావిన్సుల్లో కాంగ్రెసు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయ్యింది.దీంతో బ్రిటిష్ వాళ్ళ దగ్గిర దళిత వోట్లతో పాటు దళితేతరుల్లో కూడా తనకి వోట్లు పడతాయని చెప్పుకున్న గొప్పలన్నీ గప్పాలని తేలిపోయింది.హరిజనులకి అకెటాయించిన సీట్లలో కూడా కాంగ్రెస్ బంపర్ మెజారిటీ సాధించింది - Madras Presidencyలో 26/26,Bihar Provinceలో 9/24 unopposed 14/14 contested సీట్లలో గెల్చింది, Bombay Provinceలో 1/15 unopposed 5/8 contested సీట్లలో గెల్చింది, United Provincesలో 1/20 unopposed 16/17 contested సీట్లలో గెల్చింది,Bengal Provinceలో ఉన్న 30 reserved సీట్లలో కాంగ్రెసు 6/17 contested సీట్లలో గెల్చింది,Central Provincesలో ఉన్న 19 reserved సీట్లలో కాంగ్రెసు 5/9 contested సీట్లలో గెల్చింది.
Reporting to the Viceroy on the result in the Bombay Presidency, the Governor, Lord Brabourne wrote, "Dr Ambedkar's boast of winning, not only 15 seats which are reserved for the harijans, but also a good many more -- looks like being completely falsified, as I feared it would be."
రేసుల్లో వెనకబడిన గుర్రాన్ని కాల్చిపారేసే మనస్తత్వం ఉన్న ఇంగ్లీషువాళ్ళు(Rothschilds Banking Syndicate) అంబేద్కరు పార్టీకి ఫండ్స్ ఇవ్వటం మానేశారు గానీ రిజర్వ్ బ్యాంకును ప్రతిపాదించి సభ చేత ఒప్పించటానికి కాంగ్రెసులో తగినవాడు లేకపోవటం చేత ఆర్ధికశాస్త్రంలో కాంగ్రెసు వాళ్ళకన్న పండితుడు గనక గాంధీకీ నెహ్రూకీ సిఫారసు చేసి ఈ కాంగ్రెసు ద్వేషిని నెహ్రూ ప్రభుత్వంలోకి దూర్చారు.
మన రాగద్వేషాల్ని పక్కన పెట్టి ఆనాటి రాజకీయ వాతావరణంలో నిలబెట్టి చూస్తే సొంతంగా అధికారం సాధించటానికి తగిన సీట్లు గెల్చుకోలేకపోయినా వాళ్ళకీ వీళ్ళకీ తన ఎమ్మెల్యేల్ని మార్చి తార్చి బతికే ఈనాటి 20 సీట్లతో ముఖ్యమంత్రి కాగలిగిన కుమారస్వామి లాంటి నేలబారు మనిషి B.R.Ambedkar!
The electorate, including the harijans, may have punctured his claims but there was always the possibility of reviving one's fortunes through politicking and manoeuvres. Efforts of all these elements were focused on the objective of installing non-Congress ministries in Bombay and wherever else this was a possibility.
Brabourne reported to the viceroy that Jamnadas Mehta, the finance minister "who is chief minister in all but name", was telling him that the ministry in Bombay would survive motions on the budget and may even get through the motion of no-confidence:"His calculations are based on the fact that he expects to get the support of the bulk of the Muhammadans, the whole of Ambedkar's Scheduled Castes Party, and of half a dozen or so of those individuals who stood as Congressmen merely to get elected," he reported.
But added, "I gather that he is in touch with Ambedkar, who is carrying on negotiations for him, but, as you will find from the next succeeding paragraph, it rather looks to me as if Ambedkar is playing a thoroughly double game, in which case Jamnadas Mehta's hopes are likely to be rudely shattered." అనేది అంబేద్కర్ ఆనాడు ఫిరాయింపు/బెదిరింపు రాజకీయం నడిపాడనేదానికి సాక్ష్యం!
సమాజం యొక్క దిశనూ దశనూ నిర్ణయించే చారిత్రక సన్నివేశాల విశ్లేషణ పక్కన పెట్టి చూస్తే దళిత వీరుల వ్యక్తిగతమైన నైతికత కూడా అధమ స్థాయిలోనే ఉంది!అంబేద్కర్ మొదటి భార్య కొడుకైన యశ్వంత రావు ఆస్తుల మీద హక్కుల కోసం అంబేద్కర్ రెండవ భార్య మీద కేసులు వెయ్యటమూ అంబేద్కర్ చనిపోయేటప్పటికి అతను మతమార్పిడి చేసుకున్న సమయంలో ఏర్పరచిన Buddhist Society of India సంఘానికి రెండవ భార్య సహజమైన అధికారిణి అయితే యశ్వంత రావు దానికి పోటీగా తానొక సంఘాన్ని స్థాపించటమూ మొదటిదాన్ని రద్దు చేయటానికీ అంబేద్కర్ ఆస్తుల మీద exclusive property rights దఖలు పర్చుకోవటానికీ కోర్టులో కేసు వేస్తే సుదీర్ఘకాలపు కోర్టు ప్రొసీడింగ్స్ తర్వాత కోర్టు అంబేద్కర్ రెండవ భార్యకే అనుకూలమైన తీర్పును ఇవ్వటమూ ఆ రెండు వర్గాలలోనూ దళిత జనోద్ధరణ కన్న కుక్షింభరత్వమే ప్రధానపాత్ర వహించాయని ఋజువు చెయ్యడం చూస్తుంటే ఆశ్చర్యం వెయ్యడం లేదూ!దాదాపు 1953 కాలంలోనే నా కెప్టెన్లు నన్ను మోసం చేస్శారు, కుక్షింభరులైపోయారని డంబేద్కరుడే కన్నుల నీరు చెంపల మీదకి జాలువారుతున్నప్పటికీ ఆపుకోలేని దుఃఖంతో అలమటించిపోయాడే!
1953, అక్టోబర్ 3న అంబేద్కర్ చనిపోయిన 10 నెలలకి స్థాపించిన Republican Party of India అనే రాజకీయ పార్టీ ఎప్పుడు పుట్టిందో కూడా జనాలకి తెలియనంత స్థాయిలో అంబేద్కర్ అనుయాయులు ముసలం పుట్టిన యాదవకులంలా అంతరించిన సమయం భారతదేశపు రాజకీయ చరిత్రలోనూ దళిత ఉద్యమ చరిత్రలోనూ ఎంత కీలకమైన సన్నివేశం? మధ్య యుగాల్లో అనేకమంది హిందూ రాజుల పాలనలో ఉండి,మొదట ముసల్మాన్ పిదప క్రైస్తవ మతస్థుల పరిపాలనలను కూడా చూసి, బహుముఖీనమైన ప్రజాసంఘాల ఆకాంక్షలను నెరవేర్చడానికి సెక్యులర్ రాజ్యాంగవిధానం పాటిస్తూ స్వేచ్చా స్వాతంత్య్రాలను పొంది దశాబ్దం కూడా గడవని అత్యంత కీలకమైన చారిత్రక సంధ్యలో ఎవరి కోసం తమ ప్రియతమనేత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉండితీరాలని ప్రస్తావించి, వాదించి, యుద్ధం చేసి గెలిచాడో ఆ రిజర్వేషన్లను ఉపయోగించుకుని తమ జాతిని సమున్నత స్థానంలో నిలపడానికి రాజకీయపరమైన పునాదులు వేసుకోవాల్సిన సమయం అది!
మరి, ఆనాటి దళిత మేధావులు ఏమి చేశారు?94 సంవత్సరాల సుదీర్ఘ జీవితం గడిపిన తమ ప్రీయతమ నేత యొక్క రెండవ భార్య మీద అక్కసు వెళ్ళగక్కి ఆమెను విస్మృతం చెయ్యడానికి చూపించిన మహోద్రేకంలోనూ వెచ్చించిన సమయంలోనూ సగం నిజమైన దళిత జనోద్ధరణకు వెచ్చించి ఉంటే ఎంత బావుండేది!ఒక క్రికెట్ ప్రపంచ కప్ పోటీల ఫైనల్ మ్యాచిలో జారవిడుచుకున్న ఒక క్యాచ్ ఆ టీముకి ఎంత నష్టం చేస్తుందో స్వాతంత్య్రానంతర భారత దేశపు ఆనాటి దళిత మేధావుల చారిత్రక తప్పిదం అంత నష్టం చేసింది.కొన్ని వేల సంవత్సరాల క్రితపు చరిత్రని జల్లెడపట్టి అప్పుడు మా ముందు తరాల వాళ్ళని పుట్టుకని బట్టి చిన్న చూపు చూశారని మొత్తం హిందూమతానికే బ్రాహ్మణ మతం అనే పేరు పెట్టి బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతివాణ్ణీ తమ జాతి శత్రువు కింద పరిగణించి తిట్టరాని తిట్లు తిట్టిన అంబేద్కరీయులు సాక్షాత్తూ తమ ప్రియతమ నేత యొక్క భార్యని ఆమె జన్మని బట్టి చిన్న చూపు చూడటం ఎంత హేయం!పైన, ఈ కుక్కజట్టీలలో తలబంటి మునకలు వేస్తూ కళ్ళముందు కదులుతున్న చరిత్రలో జారిపోతున్న తమ స్థానాన్ని కూడా గమనించకపోవటం ఇంకెంత నీచం!
అప్పుడు చేజార్చుకున్న అవకాశం అరవయ్యేళ్ళ మొద్దు నిద్ర తర్వాత ఇప్పుడు వస్తుందా?రాదు గాక రాదు!వీరి సిద్ధాంత కర్త ఎవరెవరిని శత్రువులని అన్నాడో ఆ శత్రువులు మరింత బలపడ్డారు.ఆనాడు రిజర్వేషన్ల వ్యవస్థను వ్యతిరేకించిన వారు ఏ వాదనలు చేశారో అవి నిజమై కులాల మధ్య ద్వేషాలను రగిలించడం తప్పించి రిజర్వేషన్ల వల్ల ఆశించిన ఫలితం రాలేదు,ఇకముందు వస్తుందని కూడా అనిపించడం లేదు.ఆనాడు వీరు సహాయం తీసుకుందామనుకున్న అగ్రకులాల్లోని ఉదారవాదులు కూడా దళిత ఉద్యమంలోని శూన్యత వల్ల తమ స్వకులాలకు చెందిన పార్టీలలోకి వెళ్ళిపోయి క్రమేణ పదవుల వైభవాల మత్తులో కులపిచ్చి పెంచుకుని అంతరించిపోయారు.ఇక మళ్ళీ రాజకీయ రంగంలో ఆనాటి ఔన్నత్యాన్ని చూడలేని పరిస్థితి దాపరించింది.బ్రాహ్మణులు తమని తొక్కేశారని ఆరోపిస్తున్న నోటితోనే ఇతరుల్ని తొక్కెయ్యాలనే తెంపరితనం/గయ్యాళితనం చూపిస్తే ఎవరు సమర్ధిస్తారు?బహుముఖీనమైన కులమతప్రాంతభాషాపరమైన ఉపజాతీయతలు కూడా ఉన్న దేశంలో ఒక చట్టసభకు సబ్యుడిగా ఎన్నిక కావడానికి అన్ని వర్గాలనూ కలుపుకుపోవాలనే ఇంగితజ్ఞానం కూడా లేని కంచె ఐలయ్య, కదిరె కృష్ణ, కత్తి మహేష్ లాంటివాళ్ళను ముందు వరసలో నిలబెట్టి ఈనాటి దళిత మేధావులు యేమి సాధించాలనుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు!
నిజమైన అధికారం అబద్ధాలతో రాదు, సత్యం పునాదుల మీద నిలబడి మాట్లాడితే వస్తుంది.

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...