Tuesday, 19 November 2019

మోడర్న్ యూరోపియన్ కాస్మాలజిస్టులు సూర్యగ్రహణానికి చెప్తున్న "భూమికీ సూర్యుడికీ మధ్యన చంద్రుడు ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది!" అనే విశ్లేషణ శాస్త్రీయమైన యదార్ధం కాదు - అదొక ఆధారం లేని కట్టుకధ!

వేదం మొదట ఒక్కటే, అలాంటి వేదం శాఖోప శాఖలుగా విస్తరించి, విస్తృతి చెంది అనేక విధ్యా రూపాలుగా మనకు కనిపిస్తుంది. అలాంటి విద్యలు మన దేశంలో ప్రాచీన గురుకులాల్లో సులభ రీతిలో అధ్యయనాలు చేసేవారు. అలాంటి భారతీయ ప్రాచీన విధ్య గొప్పతనాన్ని, మరియూ ప్రాచీన భారతీయ విధ్యని పాశ్చాత్య క్రైస్తవ దేశాలు ఆక్రమించుకోని తామే ముందు ప్రపంచానికి తెలియజేశాం అని ప్రచారం చేసుకుంటూ ప్రపంచాభివృద్ధి మా విజ్ఞానం వల్లే అంటూ గొప్పలకి పోతున్నారు. వందల సంవత్సరాల క్రితమే క్రైస్తవుల చేతుల్లో వక్రీకరణలు చెయ్యబడిన మన వేద విజ్ఞానం గురించిన అసలు రహస్యాలు ఇలా ఉన్నాయి.
శ్లో.మందామరేజ్య భూపుత్ర సూర్య శుక్రేందు జేందవః
పరిభ్రమం త్య దోదస్థా స్సిద్ధ విద్యాదధరా ఘనాః
(సూర్య సిద్ధాంతము, భూగోళాధ్యాయము)
అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన సృష్టికర్త ప్రస్తుతం మనం ఉంటున్న భూమిని మనకు నివాసయోగ్యం చెయ్యటానికి 14 లోకాల అండకటాహంతో విరాట్ స్వరూపమై అవతరించాక మానవులు పరస్పర కలహాలతో అంతరించి పోకుండా వారికి క్రమబద్ధమైన పరిపాలన అందించమని సూర్యదేవుణ్ణి ఆదేశించాడు.అయితే సూర్యుడికి అనేకమైన కర్తవ్యాలు ఉన్నాయి.సూర్యుడు మేరు పర్వతాన్ని ఒకసారి చుట్టి రావడానికి 26,000 సంవత్సరాలు పడుతుంది.ఆయన యుగపరిమాణాల్ని లెక్కించడానికి ప్రమాణం అయిన 432 కోట్ల సంవత్సరాల లెక్కను ఒడిదుడుకులు లేకుండా నడిపించాలి.సకల ప్రాణులకూ ఆహారాన్ని సమకూర్చాలి.ఆయనకి ఇద్దరు భార్యలు సౌంజ్ఞ(వెలుగు), ఛాయ(నీడ) అని ఉన్నారు. భూమిని ప్రాణులకు నివాసయోగ్యం చెయ్యడం, సముద్రాల్లో నీటిని ఆవిరి చెయ్యటం లాంటి బాధ్యతల వల్ల కొన్ని ప్రజాధిపత్యపు బాధ్యతల్ని చంద్రుడికి అప్పగించటం జరిగింది.ఆయన చూస్తే 27 మంది భార్యల ముద్దుల మొగుడు, అందర్లోకి ఆఖరుదని కొంచెం ఒక పెళ్ళాన్ని ఎక్కువ ముద్దు చెయ్యగానే గభీమని శాపం నెత్తి మీదకి వచ్చేసరికి తనేమిటో తన తిరుగుడేమిటో అన్నట్టు ఉండిపోయి అదనపు బాధ్యతల్ని తీసుకోనని మొండికేశాడు. ఉన్న 24 గంటల్లో 12 గంటలు సూర్యుడూ 12 గంటలు చంద్రుడూ పనిచేస్తున్నారు. అన్ని పనులూ ఒక్కళ్ళకో ఇద్దరికో అప్పజెప్తే సమ్మెలూ తిరుగుబాట్లూ జరుగుతాయి కాబట్టి సృష్టికర్త ఒక ఏడు గ్రహాలకి హోరాధిపత్యాన్ని పంచిపెట్టాడు. ఈ హోరా అనే పదం సూర్యుడి వల్ల ఏర్పడే 12 గంటల అహస్సునీ చంద్రుడి వల్ల ఏర్పడే 12 గంటల రాత్రినీ కలిపి పిలిచే "అహోరాత్రం" అనే పదంలోని మొదటి చివరి అక్షరాల్ని  తీసేస్తే ఏర్పడింది.
ఈ హోరా అనే పదం అరబ్బుల దగ్గిరకి వెళ్ళినప్పుడు హవర్ అయ్యి శీతల దేశల వారి పలుకుబడిలో అవర్ అయ్యింది!శాస్త్ర సాంకేతిక విషయాల ప్రకారం చంద్రుడు భూమి చుట్టూ తిరగడమూ భూమి సూర్యుడి చుట్టూ తిరగడమూ సత్యమే అయినప్పటికీ భూమినుంచి చూస్తే కనబడే సాపేక్షతలని బట్టి భూమి చుట్టూ లేదా భూమి మధ్య నుంచి నిలువునా సాగుతున్న విశ్వాక్షం చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నట్టు చెప్పడం కూడా గణితశాస్త్ర పరంగా సమర్ధనీయమే!
భూమి నుంచి అతి దూరంగా ఉన్న గ్రహం - మంద.దీనినే మనం శని గ్రహం అని పిలుస్తుంటే యూరోపియన్లు Saturn అని పిలుస్తున్నారు.తర్వాత దగ్గిర గ్రహం అమరేజ్య, దేవతల గురువు. దీనినే మనము గురుగ్రహమనీ లక్ష్మీగ్రహమనీ అంటున్నాము.యూరోపియన్లు Jupiter అంటున్నారు, నిజనకి ఈ పదం జ్యోపితాః అనే పదానికి అపభ్రంశ రూపం.దీని తర్వాత భూపుత్ర అంటే భూమి నుంచివిడిపోయి పుట్టినది అని అర్ధం.యూరోపియన్లు దీనిని mars అని అంటున్నారు.మనం కుజగ్రహం అని అంటున్నాము.దీనినే మంగళగ్రహం అని కూడా పిలవడం మన అలవాటు.దీని తర్వాత దగ్గిరగా ఉండేది సూర్యగ్రహం. దీనినే sun అని యూరోపియన్లు పిలుస్తున్నారు.సూర్యుణ్ణి గ్రహం అనడాన్ని పాశ్చాత్యులూ వారి అనుయాయులైన భారతీయులూ అపహాస్యం చేస్తారు గానీ గ్రహం అంటే  గ్రహించేది అని అర్ధం.దేనిని గ్రహిస్తుంది అంటే మన ఆయుష్షుని గ్రహిస్తుంది అని చెప్పుకోవాలి.మన కర్మఫలాన్ని బట్టి ప్రభావితం చేస్తాయి కాబట్టి పీడించేవి అనే అర్ధంలో కూడా గ్రహం అనే పదం వాడతారు - జామాతా దశమగ్రహం అనడం అట్లాంటిదే! దీని తర్వాత దగ్గిర గ్రహం శుక్ర గ్రహం.యూరోపియన్లు venus అని అంటున్నారు.మనం భార్గవుడని కూడా వ్యవహరిస్తాము.దీని తర్వాత వచ్చేది ఇందుజ - చంద్రుడికీ తారకీ పుట్టిన బుధగ్రహం.యూరోపియన్లు mercury అని పిలుస్తారు.ఈ బుధుడికే సౌమ్యుడనే మరొక పేరు కూడా ఉంది.ఇక ఏడవది భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఇందుగ్రహం - చంద్రుడే,moon అని యూరోపియన్లు పిలుస్తారు.మూన్ అనేది మేన అనే పదానికి దగ్గిర పదమే!రక్తసంబంధీకులకి మేన అని కలపటం ఉంటుంది - నాన్నగారి అక్కచెల్లెళ్ళని మేనత్తలు అంటాం, వాళ్ళ భర్తల్ని మటుకు మామయ్యలు అని మాత్రమే అంటాం.అలాగే అమ్మకు అన్నదమ్ముల్ని మేనమామలు అని అంటాం కానీ వాళ్ళ భార్యల్ని అత్తయ్యలు అని మాత్రమే అంటాం.
భారతీయ కాలమానం ప్రకారం దినం సూర్యోదయంతో మొదలవుతుంది.పాశ్చాత్య కాలమానం అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలవుతుంది - ఖర్మ!చీకట్లో చేసే పనులు దొంగతనాలూ రంకుతనాలూ చేసుకోవడానికి పనికొచ్చే సమయం దిన ప్రారంభమా - హవ్వ!సూర్యోదయం అయ్యే సమయానికి ఏ గ్రహం హోరాధిపత్యం వహిస్తుందో ఆ గ్రహం పేరు మీద ఆ రోజుకి పేరు పెట్టారు.శని సూర్యోదయ సమయానికి హోరాధిపత్యం వహించే రోజుని శనివారం అన్నారు.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Saturn's day అని పిల్చుకుని తర్వాత Saturday కింద మార్చుకున్నారు. అయితే మరుసటి రోజును ఆదివారం లేక భానువారం అని ఎందుకన్నారు అనేది తెలియాలంటే ఈ హోరాధిపత్యపు వరసని గుర్తుంచుకోవాలి - 1.మంద(శని/Saturn), 2.అమరేజ్య(గురు/Jupiter), 3.భూపుత్ర(మంగళ/mars),4.సూర్య(భాను/sun), 5.శుక్ర(శుక్ర/venus), 6.ఇందుజ(బుధ/mercury), 7.ఇందు(సోమ/moon) అనే ఈ వరస అనంత కాలగమనంలో ఒక్కొక్క గంటకి హోరాధిపత్యం వహిస్తారు.సోమగ్రహం హోరాధిపత్యం వహించిన తర్వాత గంటకి మళ్ళీ మందగ్రహం హోరాధిపత్యం వహిస్తూ మరొక వలయం ప్రారంభం అవుతుంది.ఇప్పుడు శనివారం సూర్యోదయ సమయంలో హోరాధిపత్యం వహించిన మందగ్రహం నుంచి 24 గంటల తర్వాత 3 పూర్తి వలయాలు దాటిన 21వ స్థానంలో సోమగ్రహం ఉంటుంది కాబట్టి అక్కణ్ణుంచి మూడు స్థానాల తర్వాత 25వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు.కనకనే శనివారం తర్వాత ఆదివారం వస్తుంది.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Sun's day అని పిల్చుకుని తర్వాత Sunday కింద మార్చుకున్నారు.ఈ ఆదివారపు తొలి హోరా నుంచి లెక్కపెడితే 25వ స్థానంలో సోముడు ఉన్నాడు కాబట్టి అది సోమవారం అని పేరు వచ్చింది.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Moon's day అని పిల్చుకుని తర్వాత Monday కింద మార్చుకున్నారు.అంటే ఒక రోజున వచ్చిన గ్రహం నుంచి రెండు గ్రహాల్ని వదిలి మూడో గ్రహం తర్వాత వచ్చే రోజుని శాసిస్తుంది అని తెలుస్తున్నది కదా!ఆ వరస ప్రకారం సోమవారం తర్వాత కుజవారం లేక మంగళవారం వస్తుంది.దీనికి యూరోపియన్ ఆంగ్లోసాక్సన్ భాషలో Tiw అని పేరు.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Tiw's Day అని పిల్చుకుని తర్వాత Tuesday కింద మార్చుకున్నారు.దీని తర్వాత సూర్యుణ్ణీ శుక్రుణ్ణీ వదిలేస్తే బుధగ్రహం వస్తుంది గనక అది బుధవారం అయ్యింది. Mercuryకి యూరోపియన్ ఆంగ్లోసాక్సన్ భాషలో Woden అని పేరు.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Woden's day అని పిల్చుకుని తర్వాత Wednesday కింద మార్చుకున్నారు.దీని తర్వాత ఇందవ, మంద వదిలేస్తే 25వ స్థానంలో అమరేజ్య అనే గురుగ్రహం వస్తుంది కాబట్టి అది గురువారం అయ్యింది. Jupiterకి యూరోపియన్ ఆంగ్లోసాక్సన్ భాషలో Thor అని పేరు.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Thor's day అని పిల్చుకుని తర్వాత Thursday కింద మార్చుకున్నారు.దీని తర్వాత భూపుత్ర సూర్య వదిలేస్తే 25వ స్థానంలో శుక్రగ్రహం వస్తుంది కాబట్టి అది శుక్రవారం అయ్యింది.Venusకి యూరోపియన్ ఆంగ్లోసాక్సన్ భాషలో Frigg అని పేరు.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Frigg's day అని పిల్చుకుని తర్వాత Friday కింద మార్చుకున్నారు.దీని తర్వాత ఇందుజ, ఇందవ వదిలేస్తే మళ్ళీ మందగ్రహం వచ్చి వలయం పూర్తయిపోయింది.
ఎక్కిరాల కృష్ణమాచార్య గారు చెప్పిన దాని ప్రకారం సూర్యుడు ఒక ఫుట్ బాల్ సైజులో ఉంటే భూమి ఒక బఠానీ గింజంత వుంటుంది,ఇక చంద్రుడు ఆవ గింజంత ఉంటాడు. భూమి నుంచి చంద్రగ్రహం 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటే సూర్యగ్రహం 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.వీటిని ఎంత చిన్న సైజుకు కుదించినా పూర్తి దృశ్యాన్ని మనం యధాతధ సంబంధాలతో ఒకే పరిదృశ్యంగా చూడలేము.ఎందుకంటే లక్షని సెంటీమీటరు కింద తీసుకుంటే చంద్రుడు 4 సెంటీమీటర్ల దూరంలో ఉండటం వరకు బాగానే ఉంటుంది, కానీ సూర్యుణ్ణి మాత్రం 15 మీటర్ల దూరంలో పెట్టాలి.ఎందుకూ అంటే కోటి కిలోమీటర్లు వంద లక్షలకి సమానం.వంద లక్షల్ని వంద సెంటీమీటర్ల కింద తీసుకుంటే వంద సెంటీమీటర్లు ఒక మీటరు కదా.ఆ లెక్కన 15 కోట్లు అంటే 15 మీటర్లు అవుతుంది.అయితే మీటరుకి మూడడుగులు కాబట్టి 45 అడుగుల దూరం. దీనికి నాలుగున్నర అంతస్థుల భవనాన్ని వూహించుకుంటే ఈ దూరాల్ని చిన్న చిన్న పుస్తకాల్లో ఇమడ్చటం సాధ్యం కాదని తెలుస్తుంది.ఇలాంటి విషయాల్ని విడివిడిగా తెలుసుకుని మన మనస్సులో వూహించుకోవడం తప్ప మొత్తం విశ్వనిర్మితిని ఒకేసారి చూడటం మానవ నేత్రాలకి సాధ్యం కాదని తెలుసుకోవాలి.ప్రస్తుతం యూరోపియన్ శాస్త్రజులు సేకరించిన సమస్త జ్ఞానం మొత్తం విశ్వనిర్మితిని ఒకేసారి మన మనస్సులో వూహించుకోవడం అనే లక్ష్యానికి చాలా దూరంలో ఉంది, కొన్ని విడి అంశాలలోనే చాలా లోపాలు ఉన్నాయి, నిర్ధారితమైన కొన్ని అంశాలు ఒక సమగ్రనిర్మితికి అవరోధం అవుతున్నాయి.
ఫుట్ బాలంత సూర్యుడూ ఆవ గింజంత చంద్రుడూ బఠానీ గింజంత భూమి మీద నుంచి చూస్తే దాదాపు ఒకే పరిమాణంలో కనిపించడానికి భూమి నుంచి అవి ఉన్న దూరాలకీ వాటి పరిమాణాలకీ ఉన్న నిష్పత్తి ఒకటే కావటం ముఖ్యకారణం - ఆ నిష్పత్తి 108. అనుమానమా?చంద్రుడి వ్యాసం 3,499 కిలోమీటర్లు. భూమి వ్యాసం 12,798 కిలోమీటర్లు.సూర్యుడి వ్యాసం 1,390, 000 కిలోమీటర్లు.భూమి నుంచి చంద్రుడి దూరం 3,81,000 కిలోమీటర్లు. భూమి నుంచి సూర్యుడి దూరం 14,99,00,000 కిలోమీటర్లు.ఇప్పుడు వీటినుంచి నిష్పత్తులు తీస్తే: భూమి వ్యాసానికి సూర్యుడి వ్యాసం 108 రెట్లు - 12798X108=1,382,184. భూమికీ సూర్యుడికీ మధ్య దూరం సూర్యుడి వ్యాసానికి 108 రెట్లు - 13,90,000X108=15,01,20,000. భూమికీ చంద్రుడికీ మధ్య దూరం చంద్రుడి వ్యాసానికి 108 రెట్లు - 3,499X108=3,77,892.వాటి సైజులకీ వాటి దూరాలకీ ఉన్న నిష్పత్తి ఒకటే అనీ అది 108అని నిరూపణ అయింది కదా!హిందూ ఖగోళ జ్యోతిష శాస్త్రాలు రెండింటిలో ఈ 108కి చాలా ప్రాముఖ్యత ఉన్నది.అది వారు ఆ సంఖ్య తమకి ఇష్టమై పులిమిన ప్రాధాన్యత కాదు.వీరి పరిశోధనల వల్ల విశ్వంలో 108 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలిశాకనే హిందువులకి 108 అనే సంఖ్య ప్రీతిపాత్రం కావడం యదార్ధం.
విశ్వాన్ని గోళాకారం అని వూహించుకుంటే సుదూర తీరంలో దాదాపు గోళం పైకప్పు దగ్గిర ఉన్నట్టు అనేకమైన నక్షత్రాలు ఉంటాయి.ఈ తారల సమూహంలో సూర్యుడూ చంద్రుడూ 16 డిగ్రీల వెడల్పు ఉన్న పటకా వంటి నక్షత్ర సమూహంలో తిరుగుతున్నట్టు మనకి అనిపిస్తుంది.ఈ నక్షత్ర చక్రాన్నే మనవాళ్ళు రాశిచక్రం లేక శింశుమార చక్రం అన్నారు.ఈ శింశుమార చక్రం లోపల సూర్యుడు ఒక బిందువు నుంచి తిరిగి అదే బిందువుకి రావడానికి 365.1/4 రోజుల సమయం పడుతుంది.ఈ మార్గాన్ని ఋగ్వేదంలో 360 భాగాలు చేశారు.ఋగ్వేదం 1వ మండలం, 164వ అనువాకం,11వ శ్లోకంలో "ద్వాదశారం నహి తజ్జరాయ వర్వర్తి చక్రం పరిధ్యామృతస్య ఆ పుత్రా అగ్నే మిధునాసో అత్ర సప్త శతాని వింశతిశ్చ తత్స్థుః" అని ఉన్నది.సప్త శతాని వింశతి అంటే 720, అంటే పగలూ రాత్రుల జంటల్ని విడదీసి చెప్పారు కాబట్టి సగం చేస్తే 360 వస్తుంది కదా.వృత్తానికి ఉండే డిగ్రీలు కూడా 360 కదూ!ఇప్పుడు ఈ 360 అనే అంకెని 12తో భాగిస్తే 30 వస్తుంది, అవునా!తమాషా యేంటంటే ప్రతి రాశీ తన 30 డిగ్రీల గడిలో తను ఒదిగిపోవటం - వీళ్ళు చెప్పారని ఒదిగిపోయాయా, ఆ గళ్ళలో ఉన్నవాటినే వీళ్ళు పట్టించుకున్నారా!ఇలాగ చక్రాన్ని విడగొట్టాక మీరు భూమి నుంచి సూర్యుణ్ణి చూసే చూపుని ఒక గీతలా గీస్తే ఆ గీతనుంచి ముప్పయ్ డిగీల వెడల్పులో ఉన్న ఒక నక్షత్ర సమూహం గొర్రెలా కనపడితే దాన్ని మేషరాశి అన్నారు.ఆ తర్వాత వచ్చే 30 డిగీల భాగంలో ఎద్దులా కనిపిస్తే దాన్ని వృషభ రాశి అన్నారు.రాశిచక్రంలో మొదటిది మేషం చివరిది మీనం. వీటన్నిటినీ ఇలా గుర్తించాలంటే ఎంత సమయం పడుతుంది, ఆకాశాన్ని పట్టి పట్టి చూడటానికి ఎంత ఓపిక కావాలి, తల్చుకుంటేనే చిరాకు పుడుతుంది, అప్పటివాళ్ళు ఎట్లా చేశారు?ఎవడన్నా పనీ పాటా లేకుండా కూర్చుంటేనో పనిలోకి దిగకుండా కాలయాపన చేస్తుంటేనో మీనమేషాలు లెక్కపెడుతున్నాడంటారు - ఎంత తప్పండీ!
వాస్తవ యదార్ధం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ తులా రాశిలో ప్రవేశించడం అయితే, సాపేక్ష యదార్ధం సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ మేషరాశిలో ప్రవేశించడం అవుతుంది!అలా సూర్యుడు మార్చి 20, 21వ తేదీలలో మేషరాశి ఉన్న 30 డిగ్రీల గడిలోకి వచ్చి 30 రోజులు అదే రాశిలో ఉంటాడు.ఇది యెలా తెలుస్తుంది?385 రోజుల్లో 360 డిగ్రీలు తిరగడాన్ని బట్టి ఒక రోజుకి యెన్ని డిగ్రీలు కదుల్తాడు అని చూస్తే 0.98 వస్తుంది.దీన్ని పూర్ణాంకం చేస్తే 1 అవుతుంది, అలా 30 రోజులకి 30 డిగ్రీలు అవుతుంది కదా!సూర్యమాసాల్లో సూర్యుడు మేషరాశిలో ఉండే మాసాన్ని మేషమాసం అని అంటారు.ఒకప్పుడు ప్రపంచం మొత్తం భారతీయులు కనిపెట్టిన ఈ కాలమానాన్నే అనుసరించేది.దానికి సాక్ష్యం చూపిస్తాను చూడండి.మన ఉగాది మార్చి నెలలోనే వస్తుంది ఇప్పటికీ. ఇదే మార్చి ఒకప్పుడు ప్రపంచవ్యాప్తం మొదటి నెలగా ఉండేది.దానికి బలమైన సాక్ష్యం ఇప్పుడు మనం వాడుతున్న గ్రిగెరియన్ క్యాలేండరులోనే మార్చి నుంచి ఆగష్టు ఆరవ నెల కావడమే!ఆగష్టు తర్వాతి నెలకి వచ్చిన సెప్టెంబర్ సప్తమం అనే సంస్కృత పదానికి వికృత స్వరూపం.అదే వరసలో అక్టోబర్ అనేది అష్టమం అనే సంస్కృత పదానికి వికృత స్వరూపం, నవంబర్ అనేది నవం అనే సంస్కృత పదానికి వికృత స్వరూపం, డిసెంబర్ అనేది దశం అనే సంస్కృత పదానికి వికృత స్వరూపం.అంధయుగం తర్వాత కాబోలు, మొదట మార్చి నుంచి డెసెంబర్ వరకు గల పది నెలల్తోనే కొంతకాలం తంటాలు పడీ పడీ విసుగెత్తి పోయి చివర్న జనవరి ఫిబ్రవరిల్ని కలిపి మళ్ళీ వాటిని ముందుకు చేర్చి ఎన్నో కప్పల తక్కెడ యవ్వారాలు చేశాక గానీ వాళ్ళ క్యాలెండరు ఇప్పటి దారికి రాలేదు. మొదటి ఆరు నెలల్లో రెండు నెలల పేర్లని ఇద్దరు రాజులు వాళ్ళ పేర్ల మీద ఫిరాయించుకున్నారు.సూర్యుడు 360 డిగ్రీల్ని తిరగటానికి 365 రోజుల మీద 1/4 రోజు పడుతుంది కదా, దాన్ని లెక్కలోకి తీసుకోకపోతే కొన్ని వలయాల తర్వాత ఆ మాసాల పేర్లకీ ఆయా సమయాల్లో చెయ్యాల్సిన పనులకీ తేడా వచ్చేస్తుంది కాబట్టి మనవాళ్ళు అధికమాసం, క్షయమాసం వేసినట్టు కొన్ని నెలలకి 31 రోజులు వేసి నాలుగేళ్ళకొకసారి చివరిదైన ఫిబ్రవరికి ఒక రోజును కలిపేసి "హమ్మయ్య!" అనుకున్నారు.మీరు గ్రెగేరియన్ క్యాలెండరు నెలల పేర్ల చరిత్ర గురించి ఏదో ఒక ఎన్సైక్లోపెడియా చూస్తే చాలు ఈ కీలకం తెలుస్తుంది.
ఇప్పుడు నగరవాసులైన మెకాలే చదువుల విద్యాధికులకి కూడా తెలియనంత స్థాయి ఖగోళ విజ్ఞానం ఒకప్పుడు పల్లెటూళ్ళలోని సామాన్య రైతులకి కూడా ఉండేది.ఎందుకంటే, ఏ కార్తె వచ్చినప్పుడు ఏ పంట వెయ్యాలి, ఏ కార్తె వచ్చినప్పుడు ఏ పంట కొయ్యాలి అనేది అప్పటి వ్యవసాయ విధానం.ఏ ఋతువులో ఏ కాలంలో ఏ పంట వేస్తే అత్యధిక దిగుబడి వస్తుందనేది అనేక వైదిక శాస్త్రాలను ఆపోశన పడితే తప్ప తెలియదు. మన వ్యవసాయ దారులు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ముప్పై రోజులు ఉండటం వల్ల ఏర్పడే సౌరమాసాలకు బదులు చంద్రుడి పరిభ్రమణం వల్ల ఏర్పడే చాంద్రమాసాలను తమ వ్యవసాయపు లెక్కల కోసం వాడుకుంటున్నారు.
చంద్రుడు మేషరాశి నుంచి మొదలుపెట్టి మళ్ళీ మేషరాశికి చేరుకోవటానికి 27 రోజులు పడుతుంది. అయితే, 27 రోజుల్లో 360 డిగ్రీలు తిరిగితే ఒక రోజుకి ఎంత తిరుగుతాడోనని చూస్తే 360/27=13.33 అవుతుంది.ఒక డిగ్రీకి అరవై నిమిషాలు అని ముందే విడగొట్టారు, అందులో మూడో వంతు 20 నిమిషాలు ఔతుంది.అనగా చంద్రుడు ఒక రోజుకి కక్ష్యలో తిరిగే దూరం యొక్క కోణం 13 డిగ్రీల 20 నిమిషాలు అని తెలిసింది కదా!
సూర్యుడిలానే భూమినుంచి చంద్రుడి వైపుకి గీసే సరళరేఖ మేషానికి ముందు ఉంచి అక్కణ్ణించి 13 డిగీల 20 నిముషాల తర్వాత ఉన్న బింద్యువు నుంచి భూమి వైపుకి ఒక సరళరేఖ గీస్తే ఈ రెంటి మధ్యన కనిపించే గుర్రం ముఖంలా ఉన్న నక్షత్రరాశిని అశ్విని అన్నారు. తర్వాతి 13 డిగ్రీల 20 నిముషాల మధ్యన ఉన్న నక్షత్ర సమూహాన్ని భరణి అన్నారు.
ఇక్కడ కుంచెం నా సొంత తెలివి చూపిస్తానేం. మరి, 12 రాశుల్ని 360 డిగ్రీలకి సర్దితే 30 పూర్ణాకం వచ్చింది కదా, మరి ఈ 13 డిగ్రీల 20 నిమిషాల్నీ 27 నక్షత్రాలకి కలిపితే 360 అనే పూర్ణాంకం వస్తుందా?వస్తుంది!అయితే, గభీమని 13 డిగ్రీల 20 నిమిషాల్ని 13.20 అనుకుని హెచ్చవేతలూ భాగహారాలూ చేసేస్తే మాత్రం తప్పులో కాలేసినట్టే. 1 డిగ్రీకి 60 నిమిషాలనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ లెక్క ప్రకారం 13X60=780, 780+20=800 నిమిషాల కోణం ఒక్కొక్క నక్షత్రం యొక్క భాగం అవుతుంది.ఇప్పుడు దీన్ని 27తో హెచ్చించితే 800X27=21,600 వస్తుంది. ఇది 27 నక్షత్రాలూ శింశుమార చక్రం మీద పరుచుకున్న మొత్తం నిమిషాలకి సమానం - దీన్ని మళ్ళీ డిగ్రీలలోకి మారిస్తే 21,600/60=360 అవుతుంది, హయ్యరహయ్య!
అంటే, 360 డిగ్రీల ఒకే శింశుమార చక్రంలో 12 రాశులూ 27 నక్షత్రాలూ వాటికవి చోట్లు చూసుకుని సర్దుకున్నాయి.మరి ఈ రెండు రకాల సమూహాలకీ పరస్పర సంబంధం ఏమైనా ఉందా? ఉందంటే ఉంది, లేదంటే లేదు - ఏది బల్లగుద్ది చెప్పినా తంటాయే!ఎందుకంటే, అనంతమైన విశ్వంలో మనం కంటితో చూడగలిగిన చిన్న చుక్కల్లా కనిపించే నక్షత్రాలే కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి.అంత దూరంలో ఉన్నప్పటికీ ఇంత మాత్రం కనబడుతున్నాయంటేనే అవి ఎంత పెద్దవో వూహంచుకోండి - సూర్యుడి కన్న పెద్ద నక్షత్రాలు కూడా చాలానే ఉన్నాయి. మరి వీటిమధ్య సంబంధం ఉండటం ఎట్లా సాధ్యమౌతుందండీ?కాలం తెలియని ఒక స్థలంలో పరమ పురుషుడు పుట్టీ పుట్టగానే తన చుట్టూ వ్యాపించి వున్న యేమీలేనితనం చూసి బోరు కొట్టి 3డి బ్రష్ ఒకదాన్ని అలవోకన కదిలించి ఈ అనంతకోటి విశ్వాల్నీ యేది కిందో యేది మీదో తెలియని విశ్వ ఘనంలో మునగానాం తేలానాం అంటూ వేలాడుతూ హేలగా కదులుతున్న పాలపుంతల్నీ బృహత్తారల్నీ సహస్రాధిక భాను మండలాల్నీ సృష్టించుకుని సదా యోగనిద్రాముద్రితుడై అలరారుతూ తన అర్ధనిమీలిత నేత్రాల వెనక ఆయన భావిస్తున్న స్వప్నసీమలోని లీలావినోదమే మనకు యదార్ధ ప్రపంచమై కనిపిస్తుంటే ఆ చలచ్చంచల స్మితాస్మిత చకిత సౌందర్యంలో భాగమై మోహమాయాపాశబద్ధులమైన మనలాంటి అజ్ఞానసింధువులకి వాటిని స్కేళ్ళతో కొలిచి తాళ్ళు కట్టి సంబంధాలు కలపటం సాధ్యమా!కానీ మనకన్న కొంత మెరుగై విజ్ఞానసింధువులైన వైదికఋషులు అలాంటి అద్భుతాన్ని సాధించారు, మనకు అందించారు.
వాళ్ళు చెప్పాక ఇవన్నీ చిన్న చిన్న లెక్కలే అనిపిస్తాయి,  కానీ ఆ సంబంధాల్ని కనుక్కునే మీనమేషాలు లెక్కపెట్టడం ఎంత కష్టమో, ఎంత సహనం కావాలో!"30 డిగ్రీల 12 రాశులకీ 13 డిగ్రీల 20 నిమిషాల 27 నక్షత్రాలు సమానం అయితే 30 డిగ్రీల ఒక రాశిలో ఎన్ని నక్షత్రాలు సర్దుకుంటాయి?" అనేది చాలా మామూలు లెక్క - వేద్దామా?12R=27N, 1R=xN అయితే x=27/12 - దీన్ని simplify చేస్తే 9/4 వస్తుంది.ఆకాశం ఏమైనా చపాతీయా పిజ్జానా ఇట్టా 9/4 ముక్కల్లా విరచటానికి, పెద్దలు నిజ్జంగా ఈ లెక్కని ఇట్టాగే ఇచ్చుంటే చచ్చుండేవాళ్ళం!ఆ 9/4 ఎట్టా వచ్చిందో గుర్తుకు తెచ్చుకోండి - 3 అనే common devider(హిహిహి!కసాగు అని కూడా అనొచ్చు:-{p) అక్కడ ఉంది కదా, దాన్నిక్కడికి లాక్కు రండి. 12 రాశుల్నీ ఒక్కో బాగంలో నాలుగేసి వచ్చేట్టు 3 భాగాలుగా విడగొట్టి 27 నక్షత్రాల్నీ ఒక్కో భాగంలో తొమ్మిదేసి వచ్చేట్టు 3 భాగాలుగా విడగొడితే లెక్కెట్టాల్సిన పెతిసారీ ఆకాశాన్ని చపాతీ ముక్కల్లా చింపి పోగులు పెట్టాల్సిన పనుండదు, ఇన్నావా సెగట్రీ!
సరే, జోకులాపి ముందు పని చూద్దాం, 4 రాశుల ఒక భాగం 4X30=120 డిగ్రీలు కదా, మేషరాశి నుంచి కర్కాటకం వరకు ఉంటాయి.ఇందులోనే అశ్విని నుంచి ఆశ్లేష వరకు ఉన్న నక్షత్రాలు సర్దుకుని ఉంటాయి.ఇన్ని తంటాలు పడినప్పటికిన్నీ 30 డిగ్రీల ఒక రాశికీ ఒక్కోటీ 13 డిగ్రీల 20 నిమిషాల నక్షత్రాల్నీ పంచటమెట్లా అనే గొడవ ఇంకా చల్లారనే లేదు - దీని తస్సదియ్య!ఇంట్లో నలుగురు పిల్లలున్న తల్లికి తొమ్మిది జాంపళ్ళిస్తే ఏం చేస్తుంది చెప్పండి? మొదట నలుగురికీ తలో రెండూ ఇస్తుంది, అవునా?తర్వాత మిగిలిన జాంపడుని నాలుగు ముక్కలు చేసి నలుగురికీ ఇస్తుంది, అంతేనా?దీన్నే మరోలా కూడా చెయ్యొచ్చు - మొదటే అన్నిట్నీ నాలుగేసి ముక్కలు చేసి నలుగురికీ పంచితే అప్పుడు కూడా ముక్కలు సమానంగానే వస్తాయి కదూ - ఇదీ అంతే! మొదటి మేషరాశిలో అశ్విని, భరణి అనే రెండు ఫుల్ నక్షత్రాలూ కృత్తిక అనే మూడో నక్షత్రపు మొదటి నాలుగో భాగం అమరిపోతాయి – హమ్మయ్య, అల్లాండం బెల్లాండం అనుకున్నది కాస్తా బూడిద గుమ్మడికాయలా బద్దలయ్యింది!ఈ నాలుగో భాగాన్ని పాదం అనేసరికి గోగినేని బాబు లాంటి టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చికి మనిషి కాళ్ళు గుర్తొచ్చాయి, ఖర్మ!నక్షత్రాలకి కాళ్ళుంటాయా క్కిక్కిక్కి అని ఒకటే గోల.కనీసం పల్లెటూరివాళ్ళు నూనెలో పప్పులో తూచేటప్పుడు నాలుగింట మూడోవంతుని ముక్కాలు అని అనటం కూడా తెలీదు కాబోలు వీళ్ళకి - హవ్వ!తెలుగే సరిగ్గా రాదు, కామన్ సెన్సు అసలే లేదు, వీళ్ళంట వేదాల్లో బ్రాహ్మణులు గోమాంసం తిన్నట్టూ మంత్రాలు ఉన్నాయని నిర్రూపించేత్తారంట!
మొదటిదాని లెక్క తేలిస్తే మిగతావి అదే మోడల్లో ఉంటాయి కదా - మేషరాశిలో అశ్విని, భరణి పూర్తిగా ఉండి కృత్తిక ఒక పాదం మాత్రమే ఉంటుంది.కొన్ని నక్షత్రాల్ని పూర్తిగానూ కొన్నింటిని భాగాలుగానూ తీసుకుంటే లెక్క బేబెలు టవరు మాదిరి ఉంటుంది, ఒక రాశికి 27 నక్షత్రాల నాలుగేసి ముక్కల్లో తొమ్మిది చక్కగా అమిరిపోతాయి.ఇలా చూస్తే వృషభ రాశి కృత్తిక రెండో పాదం నుంచి మొదలవుతుంది గనక దీని మూడు భాగాలతో రోహిణీ నాలుగు భాగాలూ కలిశాక ఇంక రెండు భాగాలకే చోటు ఉంటుంది కదా,మృగశిర రెండు భాగాలు మాత్రమే వృషభ రాశిలో సర్దుకుంటాయి. మిగిలినవాట్ని కూడా ఇలాగే సర్దితే లెక్క సరిపోతుంది.ఇక్కడొక తమాషా లెక్క చెప్తాను చూడండి - 12X9=108, 27X4=108. ఇప్పుడు 108 హిందువులకి ఎందుకు విశిష్టమైన సంఖ్య అయిందో తెలిసిందా!
కాలగణనకి సంబంధించి ఈ నూట ఎనిమిది యొక్క అసలైన విశేషం ఏమిటంటే, భూమి మీద ఏ కాలంలో ఏ ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా ఆ సమయానికి 9 గ్రహాలూ 12 రాశులూ 27 నక్షత్రాలతో ప్రాచీన భారతీయ ఖగోళ విజ్ఞానులు మనకు చూపిస్తున్న శింశుమార చక్రంలో వీటి సంభావ్యతలు(combinations of independent assortment of all the items belong to all the classes) 108 మాత్రమే ఉంటాయి, 109వ కాంబినేషన్ ఉండదు గాక ఉండదు!
ఇప్పటి వరకు మనం పీకిన గోగునారకట్ట ఏమిటయ్యా అంటే మీనమేషాలు లెక్కపెడుతూ పొద్దెంక చూసీ చూసీ శింశుమార చక్రాన్ని తయారు చెయ్యటమే! మరి, ఇది ఎట్లా పని చేస్తుందీ అంటే భూమి మీదకి రావాలి.వచ్చి సూర్యుడూ చంద్రుడూ రోజుల వారీ ఎలా ఈ శింశుమార చక్రం మీద ఎలా కదుల్తున్నారో చూడాలి.బుధ, గురు, శుక్ర, శని, కుజ, రాహు, కేతు గ్రహాలు జ్యోతిష శాస్త్ర సంబంధమైన పరిశీలనకు ఉపయుక్తం అవుతాయి గానీ అసలు వాటికి కూడా పనికొచ్చే కాలం యొక్క నిర్వచనానికీ విభజనకీ గణనానికీ సూర్యచంద్రులు ఇద్దరు చాలు, ఇద్దరూ కావాలి!
ఇప్పుడు మనం సృష్టి ప్రారంభం దగ్గిర ఉన్నామనుకోండి!భూమి ఈ శింశుమార చక్రం మీద కేంద్ర స్థానంలో ఉందనుకోండి!సూర్యుడు మేషరాశికీ మీనరాశికీ మధ్యన ఉన్న గీత మీద ఉన్నాడనుకోండి!చంద్రుడు కూడా అదే గీత మీద ఉంటే ఆ రోజున అమావాస్య అవుతుంది. మన నెలలన్నీ అమావాస్యతో మొదలై 15వ రోజున పౌర్ణమి వస్తూ మరుసటి అమావాస్య ముందు రోజున ముగుస్తాయి - ఖచ్చితంగా 30 రోజులు.గెగెరియన్ క్యాలెండరులా ఏ నెలకి 31, ఏ నెలకి 30 అని బుర్రలు బద్దలు కొట్టుకుని చావనక్కర లేదు!
అయితే, చంద్రుడు భూమీ సూర్యుడూ ఉన్న గీత మీదనే ఉంటాడు గానీ దానికి పైన గానీ కింద గానీ ఉంటాడు.ఒకే తలంలో ఉంటే పౌర్ణమి కూడా అమావాస్యలానే ఉంటుంది.ఎందుకంటే చంద్రగ్రహం సూర్యగ్రహంలా స్వయంప్రకాశం కాదు, సూర్యకాంతి చంద్రుడి ఉపరితలం మీద పడి అది పరావర్తనం చెందిన భాగం మాత్రమే మనకు తెల్లగా కనిపిస్తుంది, మిగిలినది నీడలా కనిపిస్తుంది.ఈ మూడూ ఒకే తలంలో ఉంటే చంద్రుడు సూర్యుడికి 108 డిగీల కోణంలో ఉంటాడు గనక సూర్యకాంతి చంద్రుడి మీద పడే అవకాశం లేదు. సూర్యకాంతిలో infra red rays శాతం ఎక్కువ కావడం వల్ల వేడీ చురుకుదనమూ ఉంటుంది, చంద్రకాంతిలో ultra violet rays శాతం ఎక్కువ కావడం వల్ల చలీ మత్తెక్కించే లక్షణమూ ఉంటుంది.అందువల్లనే పెద్దలు ధనార్జన పగటి పూట పూర్తి చేసుకుని శృంగారాన్ని రాత్రిపూట చెయ్యమని చెప్పారు.ఇది ఇలాగే ఎందుకు జరుగుతుంది అంటే దానికీ ఒక లెక్కుంది!
ఇద్దరూ మేషరాశికీ మీనరాశికీ మధ్యన ఒకే గీతమీద ఉన్న మొదటి రోజునుంచి మరుసటి రోజుకి సూర్యుడు రోజుకి 1 డిగ్రీ తిరిగితే చంద్రుడు 13 డిగ్రీల 20 నిమిషాల కోణం మేరకు కదులుతాడు కదా!వీటి మధ్యన ఉన్న 12 డిగ్రీల కోణీయ భేదపు సమయమే అప్పటి తిధి అవుతుంది.అమావాస్య తర్వాతి రోజుకి పాడ్యమి అని పేరు పెట్టారు.ఈ రొజున చంద్రుడి మనవైపుకి కనిపిస్తున్న సగభాగంలోకి సూర్యకాంతి పడుతున్న భాగం వచ్చి అది పరావర్తనం చెందితే మనకి చంద్రుడు నెలవంకలా కనిపిస్తాడు.మళ్ళీ మీరు క్యాలిక్యులటర్లు తీస్కుని కుస్తీలు పట్టడం దేనికి? 0.అమావాస్య - 0, 1.పాడ్యమి - 12, 2.విదియ - 24, 3.తదియ - 36, 4.చవితి - 48, 5.పంచమి - 60, 6.షష్ఠి - 72, 7.సప్తమి - 84,8.అష్టమి - 96, 9.నవమి - 108, 10.దశమి - 120, 11.ఏకాదశి - 132, 12.ద్వాదశి - 144, 13.త్రయోదశి - 156, 14.చతుర్దశి - 168, 15.పౌర్ణమి - 180.అసలు కనిపించని అమావాస్య నుంచి మొత్తం కనిపించే పౌర్ణమికి వచ్చే ఈ పక్షాన్ని శుక్లపక్షం అన్నారు. పౌర్ణమి నుంచి అమావాస్యకు ఈ వెలుగు నీడలు విలోమదిశలో నడిచే పక్షాన్ని కృష్ణపక్షం అన్నారు.రెండు పక్షాల్లోనూ సప్తమికీ అష్టమికీ చంద్రుడు సూర్యుడికి 90 డిగ్రీల కోణంలోకి వస్తాడు కాబట్టి అర్ధచంద్రుడు కనిపిస్తాడు.
"చంద్రుడు భూమీ సూర్యుడూ ఉన్న గీత మీదనే ఉంటాడు గానీ దానికి పైన గానీ కింద గానీ ఉంటాడు" అనేది చదవగానే మీకు మోడర్న్ యూరోపియన్ కాస్మాలజిస్టులు సూర్యగ్రహణానికి చెప్తున్న "భూమికీ సూర్యుడికీ మధ్యన చంద్రుడు ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది!" అనే విశ్లేషణ గురించి అనుమానం వచ్చిందా?నా విషయసంగ్రహణలో ఆ ప్రతిపాదన చదవగానే నాకు వచ్చింది!ఈ మూడూ ఒకే తలంలో ఉంటే పౌర్ణమి కూడా అమావాస్యలాగే ఉంటుందనేది ఖాయం, అవునా?ఈ మూడూ ఒకే తలంలో లేనప్పుడు సూర్యుడి నుంచి భూమి వైపుకు దూసుకు వచ్చే కాంతిని చంద్రుడు అడ్డుకోవటం జరగదనేది కూడా ఖాయం, అవునా!మరొక వింత యేమిటంటే, ఇప్పుడు మనం చిన్నప్పట్నించీ చదువుకుని ఒప్పుకుంటున్న సౌరమండల నమూనా సాక్ష్యాధారాలతో నిరూపించబడినది కాదు!శాస్త్రీయత గురించి పెద్ద పట్టింపు లేని సామాన్యుల నుంచి మెప్పు పొందడం కోసం కొంత హేతుబద్ధమైన విషయాల్ని పుస్తకాల్లోకి ఎక్కించి చదివించి నమ్మిస్తున్నారు, అంతే!ఒక విషయం చెబుతాను, కంగారు పడకండి - మన దేశపు మొన్నటి చంద్రయాన్ ఫెయిల్యూర్ నాసా వాళ్ళ మూన్ వాక్ లాంటి దొంగ నాటకమే - అని నా అనుమానం!అంత ఖర్చు పెట్టి అంత సాంకేతికతను ఉపయోగించి కూడా ఆఖరు నిమిషాల్లో వచ్చిన చిన్న కుదుపుకి కమ్యూనికేషన్ బాక్సులు బద్దలైపోవటం ఏంటి?అది ఎక్కడ కూలిందో తెలుసుకోలేకపోయారంటే మరీ వింతగా లేదూ! ఆఖరు నిమిషం వరకు భూమిమీదనుంచి దాన్ని కంట్రోల్ చేస్తూ గమనించగలిగే సాంకేతికతని సాధించినవాళ్ళకి దానికో సెల్ఫీ క్యామెరాని పెట్టాలన్న కామన్ సెన్సు కూడా లేకపోయిందా?పోనీ కూలిన మెషీన్ భూమి నుంచి సరాసరి అక్కడికి వెళ్ళలేదు, అక్కడ చంద్రుడి చుట్టూ కక్ష్యలో ఒక మాస్టర్ యూనిట్ ఉండదా?దాని నుంచి మానిటర్ చేస్తూ సంకేతాలు పంపించితే అసలు ఆఖరి నిమిషాల్లో ఢమీమని గుద్దుకోవడం కూడా జరిగేది కాదు గదా?నా లెక్క ప్రకారం నాసా వాళ్ళు ఒకసారి వాళ్ళ మూన్ వాక్ ప్రాజెక్టు బోగసని తేలాక మళ్ళీ అటుకేసి పోనట్టే ఇస్రో వాళ్ళు కూడా ఏదో ఒక కహానీ వినిపించి వూరుకుంటారు.
అదేదో రెండేళ్ళ తర్వాత తేలాల్సిన సంగతి గానీ ఇప్పుడు ఇక్కడ మనం తర్కించుకుంటున్నది అమావాస్య పౌర్ణమిల గురించే కదా, మరి పూర్ణచంద్రుణ్ణి చూసిన జ్ఞాపకం ఉందా!నీరెండలో కూడా సూర్యుణ్ణి మనం ఎక్కువ సేపు తేరిపార చూస్తే కళ్ళు మండుతాయి.కానీ చంద్రుడి దగ్గిర ఆ ఇబ్బంది లేదు కాబట్టి అలా తేరిపార చూస్తే పూర్ణచంద్రుడు ఉండాల్సినంత తెలుపు కక కొంచెం మసక దేరి ఉన్నట్టు కనిపిస్తాడు.సూర్యకాంతిని భూమి చంద్రుడి వైపుకి reflect చేస్తున్న earthshine వల్ల ఆ మసక అలా కనిపిస్తుంది.అవును, భూమిమీద 80% నీరు ఉంటుందిఉ కాబట్టి అది అద్దంలా పని చేసి చంద్రుణ్ణి మసకపరిచే ఈ earthshine గురించి సైంటిస్టులకి కూడా తెలుసు - ఆ పదం వాళ్ళ సృష్టే కదా!నిజానికి సైజుల దృష్ట్యా చూస్తే భూమియే చంద్రుడి కన్న చాలా పెద్దది కాబట్టి moonshine కన్న earthshine కూడా గాఢమైనదే అని తెలుస్తుంది.ఈ లెక్కన పౌర్ణమి నాడే చంద్రుణ్ణి మసకబరుస్తున్న earthshine ఇప్పుడు చెప్తున్న "చంద్రుడు భూమికీ సూర్యుడికీ మధ్యన ఉండటం" అనే సంఘటన జరిగితే కనీసం పదిరెట్లు ఎక్కువ వెలిగేటట్టు చేస్తుంది భూమి వైపుకు ఉన్న చంద్రుడి ఉపరితలాన్ని, మరి సూర్యగ్రహణం అప్పటి చంద్రుడు అలా వెలగటం లేదే! నాసా వాళ్ళ లెక్కల ప్రకారమే సూర్యగ్రహణపు నీడ భూమి మీద 167 మైళ్ళ మేర మాత్రమే పడుతుంది.అలాంటప్పుడు మిగిలిన భూమి మీద పడుతున్న సూర్యకాంతి reflect అయ్యి mooon surface మీద earthshine పడటానికి ఎలాంటి అవరోధమూ లేనట్లే కదా - ఆహా మోడరన్ సైన్సు ఓహో మోడరన్ సైన్సు ఛీఛీ వేదిక్ సైన్సు అంటున్నవాళ్ళు దీనికి ఏం జవాబు చెప్తారో చూడాలి.
పక్షం అనే పదంలో ఉన్న అర్ధం పక్షికి ఉన్న రెండు రెక్కల్లా మాసం అనే పక్షికి రెండూ అవసరమే అని చెప్తున్నట్టు లేదూ!ఇంతకీ అమావాస్య నాడు అశ్వినితో మొదలుపెట్టి పౌర్ణమి నాటికి చిత్ర దగ్గిర ఉంటాడు కాబట్టి ఆ నెలకి చైత్రమాసం అని పేరు పెట్టారు.అయితే, చంద్రుడికి ఈ చక్రం మొత్తాన్ని అశ్విని దగ్గిర్నుంచి రేవతి వరకు తిరగటానికి 27 రోజులే పడుతుంది, నక్షత్రాలు కూడా 27 మాత్రమే, నెలకి మాత్రం 30 రోజులు - ఇదేమి తిరకాసు?అంటే, చైత్రమాసపు 15వ రోజున పౌర్ణమి నాడు చిత్ర దగ్గిర ఉన్నవాడు 27వ రోజుకి రేవతి దగ్గిర ఉంటాడు, తర్వాతి మూడు రోజులకి 40 డిగ్రీలు కదిలి కృత్తిక దగ్గిర రెండో పాదంలో ఆగుతాడు.ఇక్కణ్ణించి 800X15=12,000, 12,000/60=200,200/30=6.6 అనే లెక్కల ప్రకారం పౌర్ణమి నాటికి ఆరు రాశులు దాటి విశాఖ నక్షత్రం దగ్గిర ఉంటాడు - పాదం అనేది అన్నిట్లోకి చిన్న కొలత కాబట్టి ఈ లెక్కల్ని ఇలా కడితేనే చంద్రుడు ఏ రోజు ఎక్కడ ఉంటాడు అనే లెక్కలో స్పష్టత వస్తుంది.నిజానికి చంద్రుడు 27 రోజుల్లోనే చక్రాన్ని పూర్తి చేస్తున్నాడు కాబట్టి నెలకి 27 రోజులు పెట్టి ఉంటే అసలు నెల మారటం అంటూ ఉండేది కాదు - అని నెలలూ ఒకేలా చంద్రుడు అమావాస్య నాడు అశ్విని దగ్గిర ఉంటూ పౌర్ణమి నాడు చిత్ర దగ్గిర ఉంటూ 27వ రోజున రేవతి దగ్గిర ఉంటూ గడిచిపోయేవి!
ఈ గొడవ దేనికి అనుకుంటే పౌర్ణమి నుంచి పౌర్ణమికి లెక్క కడితే 28వ రోజుకి చిత్ర దగ్గిరకి వచ్చి 29, 30 రోజుల మధ్యన విశాఖ దగ్గిరకి వస్తాడు, దాన్ని విశాఖమాసం అన్నారు. అలాగే తర్వాత పౌర్ణమి జ్యేష్ఠ దగ్గిర ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి దాన్ని జ్యేష్ఠమాసం అన్నారు.మిగిలిన నెలలకి కూడా పేర్లు అదే వరసలో వచ్చాయి.ఇలా 12 చాంద్రమాసాలు గడిచి చాంద్రమానపు సంవత్సరానికి 354 రోజులు అవుతాయి.సూర్యమానపు సంవత్సరానికి 365 రోజులు కదా, ఈ రెంటికీ తేడా 11 రోజులు.అందుకనే ఒక సంవత్సరం ఏప్రిల్ 11న ఉగాది వస్తే తర్వాత సంవత్సరం ఏప్రిల్ 1కే వస్తుంది.దీన్ని ఇలాగే వదిలేస్తే అసలు ఈ శ్రమ మొత్తం వృధాయే కదా, అందుకోసం చాంద్రమానం,సూర్యమానం అనే ఈ రెంటికీ interpolation కింద అధిక మాసాలూ క్షయమాసాలూ వేసి కాలగణనాన్ని సరి చేస్తుంటారు.ఈ మొత్తం కాలగణనంలో అధిక మాసాలు ఎప్పుడు వెయ్యాలి, ఎప్పుడు శూన్యమాసం కింద తీసెయ్యాలి అనేది మహా జటిలమైన గణిత శాస్త్ర సిద్ధాంతాలతో కూడుకొని ఉంటుంది.అయితే, చిన్నతనం నుంచే నేర్పితే చాలా తేలిగ్గా అర్ధమవుతుంది. ఇప్పుడు నేనిక్కడ చెప్పిన వాటిల్లో చాలామటుకు ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం వారు చిన్నపిల్లల కోసం ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో ఉన్నవే - కానీ చెప్పే ఉపాధ్యాయులకీ చదివే విద్యార్ధులకీ శ్రద్ధ లేకపోవటం వల్ల అవి అక్కడ ఉన్నాయని కూడా తెలియడం లేదు ఎవరికీ. ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మొదట కాలం విలువ ఏమిటో తెలుస్తుంది. కాలం విలువ తెలిసినవాడు ఎవ్వడూ తులువ పనులు చెయ్యడు. మరీ ముఖ్యమైన సాంకేతికపరమైన విషయం Y2K వంటి అసంగతమైన సమస్యలు రానే రావు.
ప్రభుత్వం, అనగా విద్యాశాఖ కేవలం టెక్స్టు పుస్తకాలు మాత్రమే ముద్రించి ఇవ్వటం కాదు,పాఠశాలల్లో గ్రంధాలయాలను ఉంచాలి, వాటిలో మంచి పుస్తకాలను ఉంచాలి,పిల్లలకు పిఉస్య్తక పఠనం అనేది ఆసక్తికరమైన అలవాటు కింద.తెలుగు అకాదమీ అనేది కూడా ప్రభుత్వ సంస్థయే - అక్కడ ముద్రించిన మంచి పుస్తకాలని అన్ని పాఠశాలల గ్రంధాలయాల్లో ఉంచాలి.కానీ అటు టీచర్లూ ఇటు స్టూడెంట్లూ కూడా పాత క్వెశ్చన్ పేపర్లు జల్లెడపట్టి expected questions కొన్నింటిని filter చేసి వాటికి selected answers రాసుకుని బట్టీ పట్టెయ్యడం మీద తప్ప ఇంకొక దానిమీద దృష్టి పెట్టకపోవడం వల్ల పిల్లలకి మన సంస్కృతి గొప్పదనం తెలియడం లేదు.ఈ రకం చదువులతో పెరిగి గానుగెద్దు జీవితాలతో యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు గడిపేసిమ్రిటైఅరయ్యాకనే ఇలాంటి వాటిని పట్టించుకుంటున్నారు - చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు!
అలా కొన్ని వందల సంవత్సరాల క్రితమే క్రైస్తవులు క్రైస్తవ దేశాలు మన సనాతన ధర్మంలొ గల విజ్ఞానాన్ని  తస్కరించి మాసాల  పేర్లనూ వారాల పేర్లనూ మార్చేసి  ప్రపంచానికి మేమే కాల గణనాన్ని పరిచయం చేశాము అంటూ తమకు లాభం చేకూర్చే అవాస్తవాల చరిత్రను రాసుకున్నారు. ఖగోళశాస్త్ర ఆధారంగా మన పూర్వీకులు చేసిన కాల గణనంపై పాశ్చాత్య క్రైస్తవ దేశాల వక్రీకరణలు ఇవి!
శాంతి కాముకులైన హిందువుల సహనాన్ని, స్నేహభావాన్ని ఆసరాగా తీసుకుని, ఆదరించిన చేతినే నరకడానికి చూస్తున్న పరమత ప్రచారకుల ఆటకట్టించడానికి నడుంకట్టిన యువకుల సమ్మేళనమే భరతమాతకు శ్రీరామరక్ష అనేది వ్యాసపరాశరాదిసత్యసాయిపర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన ఆచార్యపరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్న సార్వకాలిక సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

6 comments:

  1. Anonymous
    వేదాల్లో గోవుని తిన్న ఇసయం, కూసింత సదువుకున్న పతోడికీ తెలిసిపొయిందిలేండి. సదువు సట్టబండ లేని మీఅసుమంటోల్లకి తప్ప.

    hari.S.babu
    అట్టనా!తెలిసిపోయాక ఏం పీకతన్నావ్?నీ సంకల్ల మట్టి నువ్వే దులుపుకుంటన్నావా!పిచ్చనాకొండె!

    "నేను టెంతు ఫెయిల్డు, నాకు సదువ్ రాదు" అని తెలిసేటట్టు ఇలా తప్ప ఇంకోలా మాట్లాడలేని దౌర్భాగ్యం దేనికిరా మీకు?నీ కామెంట్లు చూసి నేనేదో ఫీలవుతానని శాడిస్టు గెలివి చూపిస్తున్నావేమో - అస్సలు ఫీలవ్వను.నువ్వు నీ నీచత్వం చూపిస్తే నాకు నెప్పి దేనికి?నేను మాట్లాడే మాటల వల్లనే కదా నాకు అవమానం జరగాల్సింది,అదీ నేను మర్యాదస్తులని అనుకునే నా స్నేహితులు నన్ను అవమానిస్తే బాధ కలుగుతుంది గానీ మీలాంటి గొట్టాంగాళ్ళు ఎన్ని తిడితే మాత్రం నాకు లెక్కేంటి? కాస్త ఆలోచించి చూడు - ఓహ్, ఆలోచించటానికి నీకు బుర్ర లేదు కదూ!

    వాడు తన బ్లాగు పోష్టులో రాసింది అబద్ధమని వాడికి తెలుసు.అసలికి అక్కడ చూపించినవి అధికారికమైన మంత్రాలే అయితే పోష్టు వేసేటప్పుడే ఏ మండలం, ఏ సూక్తం , ఏ దేవత అన్నీ అక్కడ చెప్పేవాడు.

    ఏరా మీకు మైండు దొబ్బిందని అందరూ మీలా ఉంటారనుకున్నావా - గంజి తాగేవోడికి మీసాలెత్తేవాడిలా ఆడికి నువ్వు డప్పు కొడతన్నావు?వాడు కక్కింది సొల్లు కాదని వాడి పోష్టులో అప్డేట్ చేసుకుని చూపిస్తే సాల్దూ - నా బ్లాగులో కామెంట్ల మోడరేషన్ ఎత్తెయ్యాల్సిన అవసరం ఏంట్రా?

    తనే అశుద్ధం తింటున్న నోటితో పూటకో అబద్ధాల సిగ్గు లేని బతుకు బతికేస్తూ నన్ను మా అమ్మ శీలం పేరుతో చాలెంజి చేస్తాడా?వాడి అంతు చూస్తాను!ఏరా, మీరంతా అసలు వూరూ పేరూ చెప్పకుండా అనామకం ముసుగు కప్పుకున్నది ఎన్ని బూతులు మాట్లాడినా మీరెవరో మీ ఇంట్లోవాళ్ళకి కూడా తెలియకుండా ఉండటానికే కదా,తెలిస్తే మా హిందువులు కైమా కొట్టెయ్యడమన్నా జరుగుతుంది, లేదంటే మీ సొంత మనుషులే మీ మొహాల మీద వుయ్యడమన్నా జరుగుతుంది - అది మీకూ తెలుసు కదూ!


    ఇంకెప్పుడూ ఇక్కడికి రాకు, పోరా గజ్జికుక్కా!

    ReplyDelete
  2. Chiru DreamsNovember 21, 2019 at 7:45 AM
    >>నువ్వు కక్కింది సొల్లు కాదని నీ పోష్టులో అప్డేట్ చేసుకుని చూపిస్తే సాల్దూ - నా బ్లాగులో కామెంట్ల మోడరేషన్ ఎత్తెయ్యాల్సిన అవసరం ఏంట్రా?

    అక్కడైతే నీ తొక్కలో జ్ఞానం ఎవడు చూస్తాడ్రా? మిగిలిన సైకో నాకొడుకులుకూడా నీ జ్ఞానం దెబ్బకి మూసుకోని కూర్చోవాలంటే నీ బ్లాగే కర్రెక్టురా బేవకూఫ్.

    hari.S.babu
    నీ తొక్కలో బ్లాగుని ఏవడూ చూట్టం లేదని ఎంత చక్కగా ఒప్పేసుకున్నావో!

    ReplyDelete
  3. Mr. AP Political Reviews Admin,
    మీరు తెలియని అమాయకత్వంతో ఇలా ప్రవర్తిస్తున్నారో తెలిసే నామీద మీకు కూడా వ్యక్తిగత కక్ష ఉండి ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు.

    hari.S.babuNovember 20, 2019 at 8:53 PM దగ్గిర నేను వేసిన కామెంటులో సభ్యత ఏమైనా లోపించందా?"మీ ఇద్దరి వాదనలూ మరికొన్ని బ్లాగుల్లో కూడా చూశాను. మీ ఇద్దరి వాదనలు ఆయా బ్లాగు పోస్టుల మీద కంటే వ్యక్తిగతమైన దూషణలే ఎక్కువ చూశాను" అంటున్నారు, ఎక్కడెక్కడి సంగతులో పక్కన పెడితే ఇక్కడి కామెంట్లలో ఎవరు వ్యక్తిగత దూషణ చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది కదా - తెలుగు చదవడంలో అర్ధం చేసుకోవడంలో మీకు సమస్య ఉందా?

    అసలు రెండు సార్లు మూడుసార్లు సమయం ఇవ్వడం కూడా అనవసరమే , అయినా మీకు మర్యాద ఇవ్వడం నా బాధ్యత అనుకున్నాను - నేను లీగల్ యాక్షన్ తీసుకునే ప్రయత్నాలు చెస్తున్ననని చెప్పాక కూడా మీరు వాటిని తొలగించకుండా నాకు నీతులు చెప్పడం వల్ల కోర్టు కేసును ఎదుర్కోవడానికి సైతం సిద్ధపడి మీరు అతను నన్ను అవమానించడాన్ని ప్రోత్సహిస్తున్నారని అర్ధం అయ్యింది.

    {వాడితో వాదించి నా స్థాయిని దిగజార్చుకోను."2.జగన్ క్రైస్తవ మతస్థుడై ఉండీ తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు?" అనేదానికి "మళ్ళీ తొక్కలో ప్రశ్న. ఈ విషయం మీకు ఓడీపొయ్యాకే గుర్తొచ్చిందా? అధికారంలో ఉన్నప్పుడు, డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి అనుమతించినోల్లని ఏం పీకకుండా ఇప్పుడు పచ్చ చిందులు తొక్కుతున్నారా?" అనేది సరైన జవాబే అనుకుంటున్నారా?మరి, ">>ఎన్టీఆర్ కాలిగోటికి చంద్రబాబు సరితూగడన్న కొడాలి నాని చంద్రబాబు నుంచి టికెట్ ఎలా తీసుకుని పోటీ చేసారు"> అనే ప్రశ్నకి"ఇదో తొక్కలో ప్రశ్నా, మళ్ళీ నువ్వడగటం. నీ పచ్చనాయకుడు చెంబుతో సహా, అందరూ ఇలాంటి డైలాగులన్నొల్లే, మళ్ళీ పార్టీలు మారినోల్లే." అని ఇక్కడ తను అంటున్నదేమిటి? చాలామంది అలా చేసారు గాబట్టి ఇప్పుడు వీళ్ళని అడక్కూడదనే కదా!మరి తిరుమల విషయంలో "అప్పుడెందుకు నిలదియ్యలేదు, ఇప్పుడెందుకు నిలదీస్తున్నారు" అంటాడేమిటి?తను వేసిన కామెంటులోనే ఒక ప్రశ్నకి తను చెప్పిన జవాబుని మరొక ప్రశ్నకి చెప్పిన జవాబుతో అడ్డంగా నిలువుగా నరికిపారెదుకున్నాడు - ప్చ్, వీడి జవాబుని ఇంకెవరో ఖండించాల్సీన అవసరం లేకుండా తనని తనే చెప్పుచ్చుక్కొట్టూన్నాక కూడా Now its proved "బుద్ది లేని సన్నాసులకే అవి ప్రశ్నల్ల కనబడతాయ్" అని జబ్బలు చరుచుకుంటున్నాడు - హ్మ్.అదీ వాడి స్థాయి.

    తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలన్నది ప్రభుత్వం పెట్టిన నియమమే!శ్రీమాన్ అబుల్ కలాం ఇచ్చారు, శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చారు.హిందువులు తమ ఆలయ ప్రవేశ నిబంధనలను గురించి గట్టిగా పట్టించుకుంటే మతకలహాలు రెచ్చగొట్టడం కిందకి వస్తుందా?ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పట్టించుకోవడంలేదు గనకనే అడుగుతున్నారు, ఇందులో ఉన్న దుర్మార్గం ఏమిటి?}

    మీరు ఒక విషయం గురించి చర్చించమని అందర్నీ పిల్చారు, నేనూ వచ్చాను.ఒక వ్యక్తిని ఒక ప్రశ్న వేశాను.దానికి అతను చెప్పిన జవాబు సరైనది కాదు అని {} మధ్యన నిరూపణ చూపించాను, మీరు నాకు చెప్తున్న సభ్యతా సంస్కారమూ ఉన్నవాడైతే వాడు ఆ జవాబు చెప్పి వూరుకోవాలి.కానీ వెంటనే నా గురించి అసభ్యమైన విషయాలతో అన్ని కామెంట్లు వేశాడు.తిరిగి వాటికి జవాబు చెప్పేటప్పుడు కూడా నేను వాడి వ్యక్తిగత విషయాలని ప్రస్తావించలేదు.అయినా అసభ్యంగా ఉన్న వాడి కామెంట్లని తీసెయ్యకుండా మీరు నాకు సభ్యత గురించి సలహాలు ఇస్తున్నారు.ఇటువంటి చోట నేను వాద, ప్రతివాదాలు చెయ్యను. ఇకముందు నేను మీ బ్లాగులో జరిగే వాదనల్లో పాల్గొనను.అంతే కాదు, నా ప్రస్తావన చేస్తూ ఇతరుల కామెంట్లు కూడా ఉండటానికి వీల్లేదు..కనీసపు చదువూ సంస్కారమూ కామన్ సెన్సూ లేని ఈ టెంతు ఫెయిల్డు ఫ్యార్టిగు బ్యాచ్చి మీకు సభ్యతా సంస్కరములు గల మేధావుల్లా కనపడినప్పుడు నేను మరోలా కనపడటంలో ఆశ్చర్యం లేదు.కానీ కోర్టు మాత్రం మీరు "మీరు,మీరు కామెంట్ బాక్సులలో తిట్టుకుంటూ ఉంటే భాధ్యులు మీరు గాని బ్లాగరుకు ఎలా సంబంధం ఉంటుంది?" అనే అభిప్రాయాన్ని ఒప్పుకోదండీ!ఒక వ్యక్తి తన గురించి ఇతర్లు మాట్లాడిన మాటలలో తనను ఉద్దేశించి అబద్ధాలు చెప్తే వాటి గురించి నిలదియ్యడం ఆ వ్యక్తి యొక్క ప్రాధమిక హక్కు అని కూడా తెలియదా మీకు? సాంకతికంగా చూస్తే ఇక్కడ కామెంటు వేసిన వాళ్ళ మీద కేసు వెయ్యడం చాలా అక్ష్టం - అదే వాళ్ళ మొండిధైర్యం కూడా..కానీ సాంకేతికంగా వాళ్ళకున్న వెసులుబాటు మీకు మాత్రం లేదు.ఎందుకంటే, నేను అడిగిన తర్వాత కూడా నన్ను కించపరిచే కామెంట్లను తియ్యకపోవ డం అనేది ఖచ్చితంగా నాకు గల రాజ్యాంగపరమైన ప్రాధమిక హక్కుల ధిక్కరణ కిందకే వస్తుంది.

    Bye
    హరి.S.బాబు

    ReplyDelete
  4. "అదేదో రెండేళ్ళ తర్వాత తేలాల్సిన సంగతి గానీ ఇప్పుడు ఇక్కడ మనం తర్కించుకుంటున్నది అమావాస్య పౌర్ణమిల గురించే కదా, మరి పూర్ణచంద్రుణ్ణి చూసిన జ్ఞాపకం ఉందా!నీరెండలో కూడా సూర్యుణ్ణి మనం ఎక్కువ సేపు తేరిపార చూస్తే కళ్ళు మండుతాయి.కానీ చంద్రుడి దగ్గిర ఆ ఇబ్బంది లేదు కాబట్టి అలా తేరిపార చూస్తే పూర్ణచంద్రుడు ఉండాల్సినంత తెలుపు కక కొంచెం మసక దేరి ఉన్నట్టు కనిపిస్తాడు.సూర్యకాంతిని భూమి చంద్రుడి వైపుకి reflect చేస్తున్న earthshine వల్ల ఆ మసక అలా కనిపిస్తుంది.అవును, భూమిమీద 80% నీరు ఉంటుందిఉ కాబట్టి అది అద్దంలా పని చేసి చంద్రుణ్ణి మసకపరిచే ఈ earthshine గురించి సైంటిస్టులకి కూడా తెలుసు - ఆ పదం వాళ్ళ సృష్టే కదా!నిజానికి సైజుల దృష్ట్యా చూస్తే భూమియే చంద్రుడి కన్న చాలా పెద్దది కాబట్టి moonshine కన్న earthshine కూడా గాఢమైనదే అని తెలుస్తుంది.ఈ లెక్కన పౌర్ణమి నాడే చంద్రుణ్ణి మసకబరుస్తున్న earthshine ఇప్పుడు చెప్తున్న "చంద్రుడు భూమికీ సూర్యుడికీ మధ్యన ఉండటం" అనే సంఘటన జరిగితే కనీసం పదిరెట్లు ఎక్కువ వెలిగేటట్టు చేస్తుంది భూమి వైపుకు ఉన్న చంద్రుడి ఉపరితలాన్ని, మరి సూర్యగ్రహణం అప్పటి చంద్రుడు అలా వెలగటం లేదే! నాసా వాళ్ళ లెక్కల ప్రకారమే సూర్యగ్రహణపు నీడ భూమి మీద 167 మైళ్ళ మేర మాత్రమే పడుతుంది.అలాంటప్పుడు మిగిలిన భూమి మీద పడుతున్న సూర్యకాంతి reflect అయ్యి mooon surface మీద earthshine పడటానికి ఎలాంటి అవరోధమూ లేనట్లే కదా - ఆహా మోడరన్ సైన్సు ఓహో మోడరన్ సైన్సు ఛీఛీ వేదిక్ సైన్సు అంటున్నవాళ్ళు దీనికి ఏం జవాబు చెప్తారో చూడాలి."
    సార్! చంద్రునిపై ఎర్త్ షైన్ స్పస్టం గా కనపాడాలంటే"అదేదో రెండేళ్ళ తర్వాత తేలాల్సిన సంగతి గానీ ఇప్పుడు ఇక్కడ మనం తర్కించుకుంటున్నది అమావాస్య పౌర్ణమిల గురించే కదా, మరి పూర్ణచంద్రుణ్ణి చూసిన జ్ఞాపకం ఉందా!నీరెండలో కూడా సూర్యుణ్ణి మనం ఎక్కువ సేపు తేరిపార చూస్తే కళ్ళు మండుతాయి.కానీ చంద్రుడి దగ్గిర ఆ ఇబ్బంది లేదు కాబట్టి అలా తేరిపార చూస్తే పూర్ణచంద్రుడు ఉండాల్సినంత తెలుపు కక కొంచెం మసక దేరి ఉన్నట్టు కనిపిస్తాడు.సూర్యకాంతిని భూమి చంద్రుడి వైపుకి reflect చేస్తున్న earthshine వల్ల ఆ మసక అలా కనిపిస్తుంది.అవును, భూమిమీద 80% నీరు ఉంటుందిఉ కాబట్టి అది అద్దంలా పని చేసి చంద్రుణ్ణి మసకపరిచే ఈ earthshine గురించి సైంటిస్టులకి కూడా తెలుసు - ఆ పదం వాళ్ళ సృష్టే కదా!నిజానికి సైజుల దృష్ట్యా చూస్తే భూమియే చంద్రుడి కన్న చాలా పెద్దది కాబట్టి moonshine కన్న earthshine కూడా గాఢమైనదే అని తెలుస్తుంది.ఈ లెక్కన పౌర్ణమి నాడే చంద్రుణ్ణి మసకబరుస్తున్న earthshine ఇప్పుడు చెప్తున్న "చంద్రుడు భూమికీ సూర్యుడికీ మధ్యన ఉండటం" అనే సంఘటన జరిగితే కనీసం పదిరెట్లు ఎక్కువ వెలిగేటట్టు చేస్తుంది భూమి వైపుకు ఉన్న చంద్రుడి ఉపరితలాన్ని, మరి సూర్యగ్రహణం అప్పటి చంద్రుడు అలా వెలగటం లేదే! నాసా వాళ్ళ లెక్కల ప్రకారమే సూర్యగ్రహణపు నీడ భూమి మీద 167 మైళ్ళ మేర మాత్రమే పడుతుంది.అలాంటప్పుడు మిగిలిన భూమి మీద పడుతున్న సూర్యకాంతి reflect అయ్యి mooon surface మీద earthshine పడటానికి ఎలాంటి అవరోధమూ లేనట్లే కదా - ఆహా మోడరన్ సైన్సు ఓహో మోడరన్ సైన్సు ఛీఛీ వేదిక్ సైన్సు అంటున్నవాళ్ళు దీనికి ఏం జవాబు చెప్తారో చూడాలి."
    సార్! చంద్రునిపై ఎర్త్ షైన్ స్పస్టం గా కనపాడాలంటే పౌర్ణమి ముందు మరియు తదుపరి రెండు రోజులు, సూర్యోదయానికి ముందు కానీ, సూర్యాస్తమయం తదుపరి కానీ చూడాలి.(పది నిమిషాలలోపు)గ్రహణం ఆ సమయములలో రావడం జరిగితే ఈ ఎర్త్ షైన్ ప్రభావము కొంత వుంటుందెమో, అంతే గాని సూర్య, చంద్ర గమనాలు తప్పు కాదు, దానితో పాటు గ్రహణాలు ఏర్పడే విధానమూ తప్పు కాదు.

    ReplyDelete
    Replies
    1. It is a technical mismatched theory. What European sciencetis telling is not a blunder, but it is vague. The importance of raahu and ketu as nodal points of crossing the planes of sun and moon, which are comparatively bent, which was clearly explained by Indian cosmologists is more scientific - that is the point.

      Delete
  5. సీ:
    అమరులు నడయాడు నగరము నేడిట
    అసురుల పదములు తగిలి మలిన

    మాయెను గదటరా!మాయావినోదపు
    తెలగాణ కద్రువ తెలుగు తల్లి

    నోట మన్నును కొట్టెను గద!దుర్రాస
    భముల ఓండ్రలు భీషణమయి

    చెవులందు నెత్తురు చారికలవి కాల్వ
    లుగ పారుచుండె!వలవల యేడ్చు

    తే:
    జనులు వేలు లక్షలై చచ్చుచుండ
    ముండమోపి దొరలు తిట్టి నోళ్ళు
    పాపులని వదరుట తప్ప పని చేసి
    బాగు చేయుటయె లేదు - భవవినాశ!
    (23/11/2019)

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...