Friday 20 December 2019

మోదీ ఇంకో వరస ఇలాగే పరిపాలిస్తే మనమే రోహింగ్యాల మాదిరి దేశాలు పట్టి పోవాల్సి వస్తుంది - తస్మాత్ జాగ్రత్త!

మనకి స్వతంత్రం వచ్చి 72 యేళ్ళు - కొందరికి "అరె,అప్పుడే డెబ్భయ్యేళ్ళు గడిచాయా!" అనిపిస్తుంది, కొందరికి "వౌ,ఇప్పటికి గడిచింది డెబ్బయ్యేళ్ళు మాత్రమేనా?" అనిపిస్తుంది.అభివృద్ధి విషయంలో "ఇంత తక్కువ కాలంలో ఈ మాత్రం అభివృద్ధి సాధించడం గొప్పే!" అని కొందరూ "ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కూడా ఏమాత్రం అభివృద్ధి సాధించలేదు!" అని కొందరూ మాట్లాడుతూ ఉంటారు గానీ అవినీతి విషయంలో మాత్రం అలా చీలిపోవాల్సిన అవసరం లేదు.1948 నుంచి 2008 మధ్య కాలంలో లంచాలు, పన్నుల యేగవేతతప్పుడు పద్ధతుల్లో ధరలు పెంచెయ్యటంపెట్టుబడులు-ఋణాల వ్యవస్థకి సంబంధించిన స్కాముల వంటి అనితిక కార్యకలాపాల రూపంలో గల్లంతైన మొత్తం ఎంతో తెలుసా - 213 బిలియన్ డాలర్లు!నష్టానికి లెక్క దండగ అనుకోవటం వల్ల యేడుపు తగ్గుతుంది గానీ లెక్కలు వేసుకోకుండా ఉండలేం గదా!మనుషులు నిలవంటూ ఉంటే వడ్డీకి తిప్పుతారు గదా, ఆ వడ్డీ కూడా కలిపి లెక్కలు తీస్తే అప్పుడు 462 బిలియన్ డాలర్లు అవుతుంది - గుండె డక్కుమనటం లేదూ!
ఈ లెక్కలు తీసిన సంస్థ కూడా అణాపైసలతో సహా కట్టిన లెక్క కాదనీ దొరకని దొంగల్ని వదిలేసిన ఉజ్జాయింపు లెక్కలు మాత్రమేనని చెప్పిందిదీనికి స్మగ్లింగూ ఇన్సైడర్ ట్రేడింగూ, వ్యాపారస్థుల తప్పుడు రికార్డుల మాటున దాక్కున్నదీ కలిపితే - వద్దులెండి, చదువరుల్లో సున్నిత మనస్కులు గుండె పోటు లాంటి జబ్బులు ఉన్నవాళ్ళు ఉంటే నాకు హత్యానేరమో ఆత్మహత్యకి పురికొల్పిన కుట్ర నేరమో చుట్టుకుంటుంది!ఇంత దాకా వచ్చాక చెప్పకపోతే కడుపులో గుడ గుడ యెక్కువై నా ఆరోగ్యానికి ప్రమాదం వచ్చేలా ఉంది,చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా -  మొత్తం బొక్కపడిన సొమ్ము అర్ధ ట్రిలియన్ డాలర్ల పైనే ఉంటుందండి!ఇదండీ డబ్బుని లక్ష్మీ దేవి అని పూజించే సంప్రదాయం ఉన్న మన హిందువుల అవినీతి విశ్వరూపం!రేపేప్పుడో దీన్ని హిందూదేశం చేస్తే గానీ మనుగడ సాగించలేమని ఆవేశపడుతున్న వారికి నాటినుంచి నేటివరకు హిందువుల నైతికత ఏ స్థాయిలో ఉందో తెలియజెప్పడానికి పనికొస్తుందని గ్రంధ విస్తర భీతి అనేది లేకుండా కొందరు చదువర్లు నాకు పొడుగాటి పోష్టులు రాసే దురదను ఆపాదించటాన్ని పట్టించుకోకుండా ఎత్తి రాస్తున్నాను.
1947 - INA treasure chest disappearance:The Indian government was made aware of a number of these individuals allegedly using part of the recovered treasure for personal use. However, despite repeated warnings from Indian diplomats in Tokyo,Nehru is said to have disregarded allegations that men previously associated with Azad Hind misappropriated the funds for personal benefit. Some of these are said to have travelled to Japan repeatedly with the approval of Nehru government and were later given government roles implementing Nehru's political and economic agenda.
1948 - Jeep scandal case:The jeep scandal in 1948 was first major corruption case in independent India.V.K. Krishna Menon, the then Indian high commissioner to Britain, ignored protocols and signed a Rs 80 lakh contract for the purchase of army jeeps with a foreign firm.
1950s:Mundhra scandal (₹12 million),Cycle import scam, BHU funds misappropriation (₹5 million)
1960s:Teja loan scandal (₹220 million),
1964 Pratap Singh Kairon inquiry(In 1964, following the publication of the report of the commission of inquiry which had exonerated him of the bulk of the allegations made against him by his political adversaries, Partap Singh Kairon resigned from his position as chief minister of the Punjab), Kalinga tubes scandal
1970s:1971 Nagarwala scandal (₹6 million), Maruti scandal, Kuo oil scandal (₹22 million)
1980s:Cement scam (₹300 million),Fodder scam (₹9.5 billion),Bofors scandal, St Kitts forgery
1990s:SNC-Lavalin Kerala hydroelectric scandal (₹3.74 billion), Hawala scandal, Indian Bank scandal (₹13 billion),Palmolein Oil Import Scam (Kerala), Harshad Mehta securities scam (₹50 billion), Purulia arms drop case(The Purulia arms drop happened on 17 December 1995 when unauthorised arms were dropped from an Antonov An-26 aircraft in Purulia district in the state of West Bengal in India.The chief accused "Kim Davy" (real name Niels Holck, alias Niels Christian Nielsen) claims that it was a conspiracy of the Congress Indian government together with RAW and MI5 to overthrow the communist government in West Bengal and he was given assurances from the central government about his safety and return to Denmark. He further alleges that MP Pappu Yadav in association with the then Prime Minister of India P. V. Narasimha Rao facilitated his safe exit from India.),Yugoslav dinar scam (₹4 billion),Preferential allotment scam (₹50 billion),Meghalaya forest scam (₹3 billion),Fertiliser import scam (₹1.33 billion),C. R. Bhansali scam (₹11 billion),Kerala ice cream parlour sex scandal,Sheregar scam,Cobbler scam,Jalgaon housing scam,1998 Anubhav Plantations scam,1996 disproportionate assets case against Jayalalithaa, Babanrao Gholap disproportionate-assets case,1998 Ajmer rape case
2000:India-South Africa match fixing scandal - Mohammed Azharuddin and Ajay Jadeja were banned from cricket for 5 years and 4 years respectively.
2001:Calcutta Stock Exchange scam,Ketan Parekh securities scam (₹320 million),Operation West End
2002:Taj corridor case,Provident Fund scam,Stamp paper scam (₹200 billion)
2003:Haryana teacher-recruitment scam,Uttar Pradesh food grain scam,Andhra Pradesh Social Welfare scholarship scam,Housing and Urban Development Corporation scam
2004:Oil for Food scandal,Bihar flood-relief scam (₹170 million),IPO scam,Taj Co-operative Group Housing Scheme scam (₹45 billion)
2005:Scorpene deal scam - part of the Navy war room leak,Jharkhand medical-equipment scam,Bhanu Pratap Sahi disproportionate-assets case
2006:Navy war room leak (US$6 billion),Uttar Pradesh ayurveda scam (₹260 million),Punjab city-centre project scam (₹15 billion)
2008:Cash-for-votes scandal, Power-theft scandal, 2G spectrum case,Cash at judge's door scam,Paazee Forex scam (₹8 billion),Army ration-pilferage scam (₹50 billion),State Bank of Saurashtra scam (₹950 million),Hasan Ali Khan money-laundering case
2009:Satyam scandal, Madhu Koda disproportionate-assets case,Gujarat VDSGCU sugarcane scam (₹187 million),Austral Coke scam (₹10 billion),Vasundhara Raje Deendayal Upadhyaya Trust land scam,Sukhna land scam (Darjeeling),Orissa paddy scam,Rice export scam (₹25 billion),JVG scam,Goa special economic zone scam
2010:Gegong Apang PDS scam (₹100 billion),Maharashtra Adarsh Housing Society scam,Odisha illegal-mining scam (₹59,203 crore),Chandigarh booth scam,Medical Council of India bribery scandal in which Ketan Desai was arrested by CBI on 22 April,Uttarakhand Citurgia land scam,Karnataka housing-board scam (₹350 million),Karnataka land scam,Andhra Pradesh Emmar scam (₹25 billion),Indian Space Research Organisation S-band scam, also known as the ISRO-Devas deal (₹2 billion),Housing-loan scam
2011:Pune ULC scam,Assam education scam,B. L. Kashyap, Employees' Provident Fund Organisation scam (₹1.69 billion),Bihar solar lamp scam (₹400 million),Indian Air Force land scam,Orissa MGNREGA scam,Uttar Pradesh Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA) scam,Uttar Pradesh Teacher Eligibility Test scam,Maharashtra public distribution system scam,Maharashtra education scam (₹10 billion),Mumbai sales tax fraud (₹10 billion),Kerala investment scam (₹10 billion),Orissa pulse scam (₹7 billion),Pune land scam,Pune housing scam,Himachal Pradesh housing scam,Bruhat Bengaluru Mahanagara Palike scam (₹32.07 billion),Goa mining scam,National Technical Research Organisation scam (₹8 billion),Tatra scam (₹7.5 billion),Belekeri port scam
2012:Maharashtra Irrigation Scam (about ₹720 billion),DIAL Scam (₹1,669.72 billion),MSTC gold-export scam (₹4.64 billion),Aadhaar scam,Delhi surgical-glove procurement scam,Tax refund scam (₹30 million),Patiala land scam (₹2.5 billion),Uttar Pradesh elephant-memorial scam (₹1,400 crore),Uttar Pradesh seed scam (₹500 million),Uttar Pradesh palm tree plantation scam (₹550 million),Uttar Pradesh horticulture scam (₹700 million),Uttar Pradesh stamp duty scam (₹1,200 crore),Toilet scam,Punjab paddy scam (₹180 million),Jammu and Kashmir Cricket Association scam (about ₹500 million),Flying Club fraud – ₹1.9 billion (US$27 million),Ministry of External Affairs gift scam,Maharashtra Housing and Area Development Authority repair scam (₹1 billion),Maharashtra land scam,Maharashtra stamp duty scam (₹6.4 billion),Service Tax and Central Excise fraud (₹19,000 crore),Foreign exchange derivatives scam (₹320 billion),Ultra Mega Power Projects scam – The central government lost ₹290.33 billion (US$4.2 billion) due to undue benefits to Reliance Power,NHAI allegations – The World Bank's Institutional Integrity Unit identified fraud and corruption for which requesting an investigation,Granite scam in Tamil Nadu (about ₹160 billion (US$2.3 billion))
2013:Railway bribery scam - The CBI arrested railway minister Pawan Kumar Bansal's nephew for allegedly accepting a ₹9 million bribe for a Railway Board member,Vodafone tax controversy (₹11,000 crore),Uttar Pradesh illegal sand mining,Railway iron ore freight scam (₹17,000 crore),NSEL case (₹5,500 crore),Directorate General of Civil Aviation "free ticket" scam,Haryana seed scam (₹5 crore),Madhya Pradesh wheat-procurement scam (₹4 crore),Virbhadra Singh bribery controversy (₹2.4 crore)
2014:Delhi Jal Board scam (₹10,000 crore), Hindustan Aeronautics Limited and Rolls-Royce defence scam (₹10,000 crore), Nationalist Congress Party (NCP) unaccounted-cash case (₹34 crore), Hari Kumar Jha disproportionate assets case (₹15 crore), Madhya Pradesh farmer welfare and agriculture development minister Gauri Shankar Chaturbhuj Bisen disproportionate assets case (₹2,000 crore), Odisha industrial-land mortgage scam (₹52,000 crore), Siliguri Jalpaiguri Development Authority scam of West Bengal (₹200 crore),Aavin scam - Ten-year adulteration of milk supplied from societies of the Tamil Nadu State Milk Union estimated at ₹27 lakh per day,Mumbai International Airport scam - FIRs were registered against GVK and Airports Authority of India officials for cheating and forgery. The project was deliberately delayed for three years to funnel ₹5,000 crore to GVK.
2015:Uttarakhand flood-relief scam (₹100 crore) - When hundreds of thousands of people in Uttarakhand went hungry during the 2013 floods and state officials partied on flood-relief funds, NSE co-location scam (about ₹50,000 crore) – Insider trading on the National Stock Exchange of India (NSE) from 2010 to 2014 and the case came to light in 2015, 2015 Cash for Vote Scam - MLA Revanth Reddy was jailed in Telangana, Lalit Modi corruption case - The former Indian Premier League (IPL) commissioner used eight credit cards and none of which were in his name, Maharashtra Annabhau Sathe Development Corporation scam (₹141 crore) – MLA Ramesh Kadam was arrested by the CID for siphoning funds from the state-run ASDC, GIDC plot-allotment bribery case - Goa chief minister Laxmikant Parsekar's brother-in-law Dilip Malvankar, a field manager attached to the Goa Industrial Development Corporation (GIDC) was arrested while allegedly accepting a ₹10,000 bribe to allot a plot in the Tuem Industrial Estate, Gujarat fisheries scam (₹400 crore) - Gujarat ministers Purshottam Solanki and Dileepbhai Sanghani were accused of illegally granting fishing contracts for 58 reservoirs, Delhi power scam - The CAG reported that Reliance Anil Dhirubhai Ambani Group subsidiary BRPL is accused of inflating their rates by almost ₹8,000 crore and rates in the city should be reduced, Delhi CNG scam (₹100 crore) - Former Delhi Chief Minister Sheila Dikshit and Lieutenant Governor Najeeb Jung were accused in the scam, Delhi Jal Board tanker scam (₹400 crore),The Supreme Court found that the Ministry of Housing and Urban Poverty Alleviation's National Urban Livelihood Mission had built only 208 houses for nine lakh (900,000) homeless people, although the central government had allocated ₹1,078 crore to the mission.
2017:A public-interest litigation petition was filed against Adani Group, Reliance Group, Essar Group and other mining and energy companies for an investigation of alleged ₹290 billion overcharges for Indonesian coal and imported power equipment from 2011 to 2015, On 5 April 2017, the CBI registered six cases against Winsome Diamonds and Jewellery and Forever Precious Jewellery and Diamonds and their chief promoter, Jatin Mehta, for allegedly cheating three government banks of ₹1,530 crore, Maharashtra scholarship scam - An investigation of alleged misappropriation of government scholarships intended for Other Backward Class students found that hundreds of institutes across the state had pocketed several thousand crore rupees since 2010,Noida Ponzi scheme - A special investigation team (SIT) probing an alleged Ponzi scheme run by Anubhav Mittal, managing director of Ablaze Info Solution, concentrated their efforts on suspicious transactions by nearly 200 gold and diamond dealers.
2018:Punjab National Bank Scam: A fraudulent letter of undertaking worth ₹11,600 crore (US$1.77 billion) was issued at the Punjab National Bank branch in Brady House of Mumbai making the bank liable for the amount in the fraudulent transactions which are  linked to Nirav Modi were first noticed by a new employee of the bank,Rotomac bank fraud: According to an 18 February 2018 Central Bureau of Investigation first information report, Rotomac allegedly defaulted on loans worth ₹3,695 crore (₹36.95 billion).
2019:D. K. Shivakumar money-laundering case, INX Media case against former Union Minister P. Chidambaram, PMC Bank scam.
పైన చెప్పినవి అక్కడొక వ్యక్తీ ఇక్కడొక వ్యక్తీ పెద్ద యెత్తున చేసి దొరికిపోయిన చెదురు మదురు అవినీతులు.మన ఇంటి పక్కన కనపడుతున్న రేషన్ షాపు డీలర్లు తమకు కేటాయించిన రెండు బస్తాల బియ్యంలో ఒక బస్తాని మార్కెట్ దగ్గిర అమ్ముకోవడం లాంటివి మనం ఒక్క్కొక్కటే చూస్తున్నాం గాబట్టి చిన్నమొత్తం అనిపిస్తూ మొత్తం దేశంలో ఉన్న అన్ని రేషన్ షాపుల్నీ కలిపి లెక్కిస్తే ప్రతి నెలకీ జరుగుతున్న అవినీతుల లెక్క కూడా చిన్నదేం కాదని తెలుస్తుంది.నేనొకసారి ఒక రోజంతా నూజివీడు సెషన్స్ కోర్టులో గడిపాను. పక్కింటి వాళ్ళ మీద వేసిన కోడిపెట్ట దొంగతనాల కేసులు కూడా నడుస్తూ ఉండటం చూసి అప్పుడు నవ్వొచ్చింది గానీ ఇప్పుడు ఆలోచిస్తే భయం వేస్తున్నది - సంక్రాంతి పండగల వేళ జరిగే కోడి పందేల వల్ల లక్షణాల్ని బట్టీ చరిత్రని బట్టీ ఒక్కో కోడిపుంజు ఖరీదు వేల నుంచి లక్షల్లో ఉంటుంది.ఒక్కో కోడిపుంజు చుట్టూ పందేలు కాయటం కూడా చాలా పెద్ద స్థాయిలో చేస్తున్న అక్రమార్జనయే కదా!గుర్రపు పందేల బెట్టింగులూ క్రికెట్ ఆటల బెట్టింగులూ IPL యవ్వారాలూ కూడా కలిపితే ఎంత ఉంటుంది?
ఇలాంటి అవినీతి సంపాదనని ఆ వ్యక్తులు దాచుకుంటున్నారు కాబోలు, అంతకన్న ఏం చేస్తారు, అందువల్ల ప్రమాదం ఏముందిలే అనుకోకండి - ఆ సకల విధాలైన అవినీతి ఆర్జనలూ మత్తుమందుల వ్యాపారం నుంచి టెర్రరిస్టు ఉద్యమాలకి పెట్టుబడుల కింద మారి ఒక pareleli economy/underground economy నడుస్తూ ఉన్నది దేశంలో. ఎప్పటినుంచీ అనుకుంటున్నారు? నెహ్రూ కాలం నుంచీ!2008 నాటికి ఇలా పైకి కనపడని parallel economy/underground economy యొక్క విస్తృతి పైకి కనిపించే GDPలో 50 శాతం అయింది, నిక్కచ్చి అంకె సుమారు $650 billion ఉంటుంది.ఇవ్వాళ బెంగాల్లో రోహింగ్యాలకు మద్దతు హింస లాంటి సన్నివేశాల వెనక parallel economy/underground economy కామందులే ఉంటారు.బూర్జువా రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, నక్సలైట్లతో సహా అన్ని కమ్యునిష్టు పార్టీలు కూడా తమ ఉద్యమ ఖర్చుల్ని parallel economy/underground economy నుంచే తీసుకుంటారు.శతకోటి లింగాల్లో ఒక బోడిలింగం అవినీతి చేస్తే మనకి నష్టం లేదనుకుని వాడి పాపాన వాడే పోతాడులే అనుకోవటం వల్లనే ఈ విషవలయం ఆగటం లేదని నా నమ్మకం.
ఇక్కడ బెంగాల్లో రోహింగ్యాలకు మద్దతు హింస లాంటి సన్నివేశాల వెనక పనితనం చూపించేది 25 శాతం మాత్రమే50 శాతంలో 75 శాతం దేశం దాటి పోతుంది. International Monetary Fund తరపున ఈ లెక్కలు తీసిన Dev Kar గారు "All countries need investment  and get the capital from domestic savings and foreign savings," అని అంటున్నారు. దాని భావం ఏమిటో తెలుసా!మనం పిచ్చోళ్ళలా దేశం దాటి వెళ్ళీన డబ్బు స్విస్సు బ్యాంకులో మూలుగుతున్నదని అనుకుని మోదీ గారు 100 రోజుల్లో వెనక్కి రప్పిస్తానని అనగానే హయ్యరహయ్య అని గంతులేశాం గానీ అది అక్కడ ఉండదు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న pareleli economy/underground economy లోకి వెళ్తుంది!తను చెప్పింది అబద్ధమని మోదీ గారికి తెలుసు, అందుకే నిజ్ఝంగా స్విస్సు బ్యాంకు నుంచి నల్లడబ్బుని వెనక్కి తీసుకు రావడానికి నిజాయితీతో ప్రయత్నించడం లేదు.
శ్రీమాన్ చాయ్వాలా నరేంద్ర మోదీ గారి అధ్వర్యంలో భారత దేశపు ఆర్ధికాభివృద్ధి ఎంత దయనీయమైన స్థితిలో ఉందో తెలుసా!భవిష్యత్తులో భారతదేశపు ఆర్ధిక చరిత్రను రాస్తే స్వాతంత్య్రానంతరం అత్యంత దుర్భరమైన దశాబ్దం కింద 2010 - 20220ని మాత్రమే పేర్కొని తీరాలి!సొల్లు కబుర్లు అనుకోకండి, లెక్కలతొనే చూపిస్తాను.2010లో real GDP growth చాలా ఎక్కువ, 13.3%.2019లో real GDP growth చాలా తక్కువ, 6.3%! అది అక్కడ కూడా ఆగలేదు, ప్రస్తుతం real GDP growth 4.5% ఉన్నది.ఈ మధ్యన జరిగిన ఎన్నికల్లో పదవిని కొల్పోయిన ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో సాధించిన అభివృద్ధియే అప్పట్లో ఎదుగుదల కనపడటానికీ ఆంధ్రలో అతని ఓటమియే ఈ దిగుడుదలకీ కారణం అనేది కఠిన వాస్తవం. ఈ చూపిస్తున్న అంకెలు కూడా పరువు కోసం భాజపా కనీసం 2.5 శాతం వరకు పెంచి చెప్పడం జరిగిందని ఆర్ధిక నిపుణులైన Arvind Subramaniam గారు అన్నారు.ఆ పార్టీకే చెందిన సుబ్రమణ్య స్వామి గారు నిజమైన real GDP growth 1.5% మాత్రమే అని అంటున్నారు.అంశాల వారీ చూసినా ఇదే రకం లెక్కలు కనపడుతున్నాయి - 2010లో వ్యవసాయరంగం 17.5% GDPని చూపిస్తే పారిశ్రామికరంగం 45.4% GDPని చూపించింది, 2019లో వ్యవసాయరంగం 15.6% GDPని చూపిస్తే పారిశ్రామికరంగం 26.5% GDPని చూపించింది.ఒక దేశపు ఆర్ధికాభివృద్ధి యొక్క దిశని పెట్టుబడుల శాతం, ఉద్యోగితని బట్టి తెలుసుకోవడం జరుగుతుంది -  capital investment 2010లో 39.8% ఉంటే ఇప్పుడు 10% తగ్గింది.capital investment పెరగనిదే పెట్టుబడుల వల్ల మాత్రమే పుంజుకోవాల్సిన పారిశ్రామిక రంగం బలపడటం అసాధ్యం!
2010లో ఉన్న 10.7% growth rate నిలకడగా ఉండి ఉంటే 2050 కల్లా $30 trillion GDPని సాధించి భాతదేశం చైనాతో పోటాపోటీగా ఉండేది, కానీ అది నిజం కావడానికి కనీసం 7% దగ్గ్గిర growth rateని నిలబెట్టాలి.తమను తాము సమర్ధించుకోవడానికి మన్మోహన్ సింగు గారి రెండవ సారి అపజయాలకీ సోనియా గాంధీ గారి పాప్యులిస్ట్ పధకాల మీదకీ తోసేస్తున్నారు. కానీ మోదీ గారు ఆ తప్పుల్ని సరిదిద్దలేక పోవడమే కాకుండా ఆర్ధిక పరమైన అవగాహహన లేని చాయ్‌వాలా ట్రిక్కులతో కాలం గడిపేస్తున్నారు.
నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవటానికి సైన్యపు నైతిక స్థాయిని కూడా తగ్గించే సర్జికల్ స్ట్రైక్ లాంటివాటిని వాడుకోవటమూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆర్టికిల్ 370ని రద్దు చెయ్యటమూ అయోధ్య తీర్పుని హిందువులకి అనుకూలం చెయ్యటమూ CAB బిల్లుని ప్రవేశ పెట్టటమూ ఆర్ధికరంగంలో తన దారుణమైన అపజయాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి వేస్తున్న ప్రణాళికాబద్ధమైన ఎత్తుగడల క్యాలెండర్ నుంచి చింపుతున్న పేజీలు - తను ఇస్తున్న టీలో క్వాలిటీ లేకపోయినా కస్టమర్లని పెంచుకోవటానికి ఒక చాయ్‌వాలా ఏం చేస్తాడో నరేంద్ర మోదీ కూడా అదే చేస్తున్నాడు.ఇవన్నీ మాకు అక్కర్లేదు అభివృద్ధి చేసి చూపించమని ఒత్తిడి పెట్టడం కూడా అనవసరమే - అది అతనికి తెలియని విద్య. మనం మరీ ఒత్తిడి పెడితే పదేళ్ళ తర్వాత తెచ్చే దరిద్రాన్ని ఇప్పుడే తెస్తాడు, ఉన్న నాలుగెంట్రికలూ గొరిగి బోడుగుండు చేసి చూపిస్తాడు!నిజమైన అభివృద్ధిని చూపించడం అతని లక్ష్యం కానే కాదని ఆంధ్రప్రదేశ్ విషయంలో అతని వ్యవహార శైలిని చూస్తే తెలుస్తుంది.అచ్చం ఒక చాయ్‌వాలా తన షాపుకు వచ్చి కూర్చున్నవాళ్ళకి తప్ప వేరే షాపులో కూర్చున్నవాళ్ళకి టీ ఇవ్వనట్టుగానే ఆంధ్రాకి ఇవ్వాల్సిన ప్రత్యేకహోదాని ఇవ్వకుండా తొక్కిపెట్టేశాడు.ప్రత్యేక హోదా ఇవ్వకుండానే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన రాష్ట్రపు పెరుగుదల రేటును రెండంకెలకు చేర్చి దేశపు పెరుగుదల రేటును కూడా పెంచడం పట్ల కలిగిన ఈర్ష్యయే అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోవటానికీ నిన్నటి ఎన్నికల్లో అతన్ని పదవీచ్యుతుణ్ణి చెయ్యడంలో జగన్,కేసీయార్ ద్వయానికి జత కలిసి ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానం నుంచి అధమ స్థానం చేరుకునేలా చెయ్యడానికీ ముఖ్యమైన చోదక శక్తి అయ్యిందనేది ఎల్లరకూ తెలిసినదే కదా!
మోదీ తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకోవటానికి CAB బిల్లును ఉపయోగించుకుని గుడ్విల్ తెచ్చుకుంటుంటే దీదీ తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకోవటానికి అదే CAB బిల్ల్లును వ్యతిరేకిస్తూ గుడ్విల్ తెచ్చుకుంటున్నది.మెడికల్ స్కాము నిందితుణ్ణి దొడ్డిదారిన మళ్ళీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడి కింద తీసుకోవడంలో మోదీ ములాయం చాలా గొప్ప ఐకమత్యం చూపిస్తున్నారు.ఇంతటి అవినీతికి అంకితమైపోయిన హిందువులు ఏకం కావడం అనేది సంభవమా?అదీగాక, వాళ్ళలోని అవినీతిని అలాగే ఉంచి ఏకం చెయ్యడం అంటే మరింత ప్రజల్ని పెనంమీద నుంచి పొయ్యిలోకి విసిరినంత ప్రమాదం కదా!
ప్రజలు నిజాయితీపరులైన నాయకుల్ని చట్టసభలకి పంపిస్తే వారు అవినీతిని అతి తక్కువ కాలంలో కట్టడి చేసి నిజమైన అభివృద్ధిని ప్రజలకు పరిచయం చెయ్యగలుగుతారు. అసలు సమస్య ఓటర్లు అవినీతి పరులు కావడమే నన్నది చాలామంది ఒప్పుకోలేని నిజం!కొందరు నిజాయితీ గల నాయకులు ఎన్నిక కాలేకపోవడానికి దేశంలోని అధిక అసంఖ్యాకులు నిరక్షరాస్యులు కారణం అని వాదిస్తూ ఉంటారు.కానీ అది సరి కాదు.విద్యావంతులు, మేధావులు కూడా సరైన పద్ధతిలో ఆలోచించడం లేదు.నిన్న గాక మొన్న ఒక వ్యక్తి వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే లైంగిక హింస తగ్గుతుందని ప్రతిపాదించాడు.ఆ వ్యక్తికి ఇంగ్లీషు రాదు.నేను ఇంగ్లీషులో వేసిన కామెంటుని గూగుల్ ట్రాన్స్లేటరును వాడితే తప్ప నేను చెప్తున్నది అర్ధం చేసుకోలేని వాడు ఫేస్ బుక్ ఎక్కవుంట్ ఓపెన్ చెయ్యగానే ప్రపంచ స్థాయి మేధావిలా ఫీలైపోతూ అంత గంభీరమైన విషయాలను గురించి ఉచిత బోడి సలహాలు ఇస్తున్నాడు.ఉండాల్సిన తెలివి వీసమెత్తు లేదు గానీ ఉండకూడని తెలివి మాత్రం తెగ బారెడు ఉంది.అసలు వ్యాసంలో తిన్నగా చెప్పకుండా ధ్వనించి సరిపెట్టాడు. నాకు అర్ధమై నిలదీస్తుంటే జవాబు చెప్పకుండా మీకూ నాకూ వాదన సరిపడదనీ అంటూ నేను వేరే చోట I want India as hindu state అన్నదాన్ని రౌండ్ చేసి చూపిస్తూ మీరు హిందూమతం కోసం పోరాడుతున్నారు నేను సర్వ మానవ సమానత్వం కోసం పోరాడుతున్నాను అంటున్నాడు - గవర్నమెంటు ముండల కంపెనీల్ని పెడితే రేపులూ అక్రమసంబంధాలూ తగ్గుతాయనడం సర్వసమానత్వం కోసం పోరాడటమా అని ఒక బూతు తగిలించేసరికి అన్‌ఫ్రెండ్ చేసేసుకున్నాడు కాబోలు మళ్ళీ దొరకడం లేదు!ఒక్కళ్ళూ ఇద్దరూ కాదు, ఇతనిలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో కొల్లలు కొల్లలు ఉన్నారు - ఇలాంటివాళ్ళు నిజాయితీ గల నాయకుణ్ణి ఎన్నుకోవడం సాధ్యమా?నేను ఉండేది వైజాగు కాబట్టి జగన్ మూడు రాజధానుల ప్లాను నాకు నచ్చిందని అనేవాళ్ళు విద్యావంతులా!విద్యావంతులు అనగానే వాళ్ళకి అన్నీ తెలుసనీ నిరక్షరాశ్యులు అనగానే వళ్ళకి ఏమీ తెలియదనీ ఎలా ప్రచారంలోకి వచ్చిందో గానీ ఓ నాలుగు కార్ల ఫ్యాక్టరీలు మూతబడితే నష్టమేం లేదు ప్రజలు నడక నేర్చుకుని ఆరోగ్యవంతులవుతారు, కాబట్టి బీజేపీ ఆర్ధికనియంత్రణ బాగానే ఉందని ధైర్యం చెబుతున్న జర్నలిస్టు సాయి గారిని విద్యావంతుడు కాబట్టి ప్రమాణం కింద తీసుకోగలమా?
జస్ట్ ఎన్నికలకి ముందు రెండంకెలు నమోదు చేసిన గ్రోత్ రేటుని ఆర్నెల్లలో అట్టడుగుకి దించి కొత్త స్కీములకి సొమ్ము కోసం పాత స్కీముల్ని రద్దు చేస్తూ సాక్షాత్తూ విత్తమంత్రి బుగ్గనయే ఆర్ధికం దిగనాసిల్లిపోయిందని వొప్పుకుంటుంటే ఒక్క రాజధాని పనులు పూర్తి చెయ్యటానికే ఏడుస్తుంటే మూడు రాజధానులు ఎలా కట్టగలడనే ఆలోచన కూడా లేనివాళ్ళు అక్షరాస్యులమూ విద్యావంతులమూ మేధావులమూ అని జబ్బలు చరుచుకుంటున్నారే వీళ్ళు తమ ముందు నిలబడిన అబ్యర్ధులలోని నిజాయితీని గుర్తించి సరైనవాళ్ళని చట్టసభలకి పంపించడం సాధ్యమా!
జగన్మోహాన్ రెడ్డి కొందరు తెదెపా అభిమానులు అనుకుంటున్నట్టు తెలివి తక్కువ వాడు కాదు - బాగా ఆలోచించి పక్కా ప్లానుతో కదులుతున్నాడు, అతని ప్లాన్లు అర్ధం కానివాళ్ళకే అతను పిచ్చివాడిలా కనబడతాడు.అప్పట్లో చంద్రబాబు అధికారంలోకి వస్తాడని వూహించక తనకున్న అనుకూలతల్ని బట్టి ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకంతో తమ అస్మదీయులకి భూములు ఉన్న దొనకొండలో రాజధాని పెట్టడం కోసం శ్రేయోభిలాషుల ద్వారా లాబీయింగు చేసుకుని మంఛి హుషారుగా ఉన్నాడు.తీరా చూస్తే చంద్రబాబు గెల్చి అమరావతిని రాజధాని చేసి తన పార్టీవాళ్ళకు మేలు చేసుకోవడంతో దిమ్మ దిరిగి మైండు బ్లాకయ్యి అలా ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు అమరావతి పేరు చెప్పి బెజవాడ చుట్టుపక్కల భూములకి  రేట్లు పెంచి తనవాళ్ళకి వాటిని కట్టబెట్టినట్టు తను మూడు రాజధానుల్ని చేస్తానని ఆ మూడు చోట్ల ఉన్న భూముల రేట్లని పెంచి తనవాళ్ళకి కట్టబెట్టాలనే చావు తెలివి ఉంది మూడు రాజధానుల ప్రకటన వెనక!అయితే, రాష్ట్ర ఆదాయపు ఎదుగుదలలోనూ ఉద్యోగ కల్పనలోనూ దక్షత చూపించిన చంద్రబాబు కూడా అన్నేళ్ళలో రాజధానికి పక్కా ప్లాను వెయ్యలేకపోయాడు. ప్లాను తయారు చేయించి రిజిస్టర్ చేసి ఉంటే ఇవ్వాళ వీళ్ళు కమిటీ వెయ్యడానికి కూడా వీలు ఉండేది కాదు కదా - మరి అంత చిన్న పని కూడా ఎందుకు వెయ్యలేకపోయాడు? పోలవరం, రాజధాని అని జపం చెయ్యటం, కంపెనీల్ని తెచ్చి ఉద్యోగాలు కల్పించడం మాత్రమే వోట్లు తెస్తాయనుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవినీతికి లాకులెత్తేస్తుంటే పట్టించుకోకుండా ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకున్న వాళ్ళకే మళ్ళీ సీట్లు ఇచ్చాడు. అటువైపున జగన్ పీకేని పెట్టుకుని ప్రచారం అదరగొడుతుంటే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పిసినారితనం చూపించాడు.ఓడిపోయిన ఆర్నెల్లకి చూపించిన రాజధానిలో తను కట్టిన భవనాల ఫొటోలు ఎన్నికల్లో ఎందుకు చూపించలేదో నాకిప్పటికీ అర్ధమే కావడం లేదు:-)
ఇలా అన్ని వైపుల నుంచి చూస్తే ఓటర్లూ లీడర్లూ అనే రెండు వర్గాలలోనూ అభివృద్ధి - అవినీతి అనే వాటిని గురించి సమగ్ర జ్ఞానం లేని శుంఠలే ఎక్కువమంది ఉన్నారు.Nirav Modi మీద పడిన కేసుని బయటికి లాగింది Punjab National Bankలో కొత్తగా చేరిన ఉద్యోగి.అదే బ్రాంచిలోని ఇద్దరు పాత ఉద్యోగుల ప్రమేయం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది.core banking system మీద హ్యాకింగ్ తరహా వ్యవహారం నడిచింది.Allahabad Bank, Axis Bank, Union Bank of India వంటి ఇతర బ్యాంకుల core banking system మీద కూడా అదే తరహా దాడి చేశారు.వాస్తవానికి నీరవ్ మోదీ ప్రేరేపిస్తే బ్యాంకు ఉద్యోగులు సహకరించడం కాదు అక్కడ జరిగింది, ఏళ్ళ తరబడి సర్వీసు తర్వాత ఉద్యోగులే core banking system యొక్క బలహీనతలని స్టడీ చేశాక వాళ్ళు చొరవ చూపించి Nirav Modiని ఉపయోగించుకుని చేసిన మహామోహమాయాజాలం అది.ఒక్క నీరవ్ మోదీ కేసు మాత్రమే కాదు, INA treasure నుంచి INX Media వరకు గల అన్ని స్కాముల్లోనూ బ్యాంకుల పాత్ర ఉండటం గమనించితే చాలు అభివృద్ధికి అడ్డం వస్తున్నదీ అవినీతిని పెంచి పోషిస్తున్నదీ ప్రభుత్వరంగ ప్రైవేటురంగ బ్యాంకులే అన్నది బోధపడుతుంది.
ఇంగ్లీషువాళ్ళ కాలం వరకు ఎంతో బుద్ధిమంతులైన హిందువులు స్వతంత్రం వచ్చాక ఇంత అవినీతితో కుళ్ళిపోవటానికి బ్యాంకింగ్ వ్యవస్థయే మూలకారణం.ఇంగ్లీషువాళ్ళు ఇతర దేశాల్లో మాదిరి ఇక్కడ కూడా సెంట్రల్ బ్యాంకు పెట్టడానికి 1850కీ 1900కీ మధ్యన చాలాసార్లు ప్రయత్నించి వ్యతిరేకత రావడంతో అప్పటికి వెనక్కి తగ్గారు. 1940ల నాటికి స్వతంత్రం ఇస్తూనే ఆనాటి స్వాతంత్య్ర వీరుల తెలివితక్కువని చూసి దాచిపెట్టిన తమ సెంట్రల్ బ్యాంకు ప్లానుని అమలు చేసేశారు.భారత ప్రభుత్వంతో నామమాత్రపు సంబంధం ఉండి "IMF" నుంచి అప్పు తీసుకుని మనకు అప్పు ఇచ్చే Reverve Bank of Indiaని ఏర్పాటు చేసింది.దీని స్వభావంలోనే అవినీతిని పెంచి పోషించే తత్వం ఉంది.
బ్యాంకింగ్ చట్టాలను మార్చి బ్యాంకులకు కొత్త రూపమిచ్చి పెట్టుబడుల రంగాన్ని వాస్తవిక దృక్పధంతో శాసించేవరకూ అవినీతిని అంతం చెయ్యడమూ అభివృద్ధిని పరుగులు పెట్టించటమూ సాధ్యం కాదు.కానీ మోదీ గారు అటువంటి సంస్కరణలు ఇంతవరకు చెయ్యలేదుఇకముందు చెయ్యరు - బ్యాంకింగ్ చట్టాలను ఎలా మార్చాలో తనకు తెలియదు కాబట్టి చెయ్యలేరు కూడా.ఈ మధ్యనే నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటివాళ్ళు అప్పులు ఎగవెయ్యదం ద్వారా దివాళాకు సిద్ధమైన బ్యాంకుల్లో కొన్నిటిని ప్రజాధనం వెచ్చించి అప్పుల్ని చెల్లుచేసి నిలబెట్టటమూ కొన్నింటిని రద్దు చేసి పారెయ్యటమూ జరిగింది, మీకు తెలుసా? కొద్దిమంది చేసిన కూసిన్ని స్కాముల వల్ల జరిగిన అపారమైన నష్టాన్ని జాతీయ సంపద నుంచి పక్కకి తీసి చెల్లు చేశారు - ప్రజల పట్ల నిజాయితీ ఉన్న నాయకుడు చెయ్యాల్సిన పని అదేనా?
సర్జికల్ స్ట్రైక్ దగ్గర్నుంచి పౌరసత్వ బిల్లు సవరణ వరకు గల అన్ని వ్యవహారాలలోనూ నాటకీయత శివాజీగణేశన్Xశివాజీగణేశన్ అంత ఎక్కువ ఉంది, నిజానికి సభ లోపల నాయకులూ బయట ప్రజలూ అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం పౌరులై ఉన్న ముస్లిములకి వీటన్నిటిలో ఏ ఒక్కదాని వల్లనూ చిన్నమెత్తు నష్టం కూడా లేదు.ఆర్ధికం ఇంకొంచెం దిగజారితే రోహింగ్యాలు మనం పొమ్మనకుండా వాళ్ళంతట వాళ్ళే తట్టా బుట్టా సర్దుకు పోతారు, ఇంకొంచెం దిగజారితే ఆ బిల్లు కిందకి వచ్చే ఇతర దేశాల వాళ్ళు మనం తోరణాలు కట్టి పిల్చినా రారు - ఎందుకొచ్చిన గోల?
వీటన్నిటిలోనూ పైకి కనపడని మరొక విచిత్రం ఉంది - తొలినాటివి మోదీ ముందు వుండి నడిపించినవి, అంలినాటి వ్యవహారాలలో క్రమేణ మోదీ వెనక్కి పోయి షా ముందుకు వస్తున్నాడు. ఈయన పక్క వ్యాపారి, తన పార్టీకి లాభమా నష్టమా అనేవి తప్ప ప్రజలకి మంచిదా చెడ్డదా అని చూసే అలవాటు లేదు. తనకి నష్టం అనిపించేవరకు తన నియంతృత్వ ధోరణిని మార్చుకోడు.జస్ట్ ఎన్నికలకి ముందు రెండంకెలు నమోదు చేసిన గ్రోత్ రేటుని ఆర్నెల్లలో అట్టడుగుకి దించి కొత్త స్కీములకి సొమ్ము కోసం పాత స్కీముల్ని రద్దు చేస్తూ సాక్షాత్తూ విత్తమంత్రి బుగ్గనయే ఆర్ధికం దిగనాసిల్లిపోయిందని వొప్పుకుంటుంటే వినపడనట్టు ఒక్క రాజధాని పనులు పూర్తి చెయ్యటానికే ఏడుస్తుంటే మూడు రాజధానులు ఎలా కట్టగలడనే ఆలోచన కూడా లేకుండా నేను ఉండేది వైజాగు కాబట్టి జగన్ మూడు రాజధానుల ప్లాను నాకు నచ్చిందని అంటూ అక్షరాస్యులమూ విద్యావంతులమూ మేధావులమూ అని జబ్బలు చరుచుకుంటున్నవాళ్ళు భాజపాని నష్టపెట్టగలరా?
వ్యవస్థ రూపాన్ని మార్చనంత కాలం నిజమైన అభివృద్ధి సాధ్యం కాదువ్యవస్థ రూపాన్ని మార్చాలంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని విప్లవాల కన్న గొప్పదైన విప్లవం రావాలివిప్లవం రావాలంటే కార్యాచరణ వేదిక కావాలివేదిక దగ్గరికి విప్లవకారులు వెళ్ళి ప్రణాళిక వేసుకుని పని చెయ్యాలంటే డబ్బు కావాలిఆ డబ్బును బ్యాంకుల నుంచే తెచ్చుకోవాలి  - నిన్ను చంపటానికి తుపాకీ కొనుక్కోవాలి అప్పివ్వమంటే ఏ బ్యాంకరు ఇస్తాడండీ!
Our bankers know these systematic siphons of pubic funds; our labourers know these exploitative capitalists; our brokers know these operators; our politicians know these funders; our media knows these frauds. However, we collectively put up with these frauds - again and again!ఇవ్వాళ పొలిటీషియన్స్ రెండు రకాల ప్రమాదాలు తెచ్చిపెడుతున్నారు. అధికారంలో లేనివాళ్ళు వాళ్ళని అధికారంలోకి తెస్తే తప్ప ప్రజల బతుకులు బాగుపడవని కాల్చుకు తింటున్నారు!అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల బతుకుల్ని బాగుచెయ్యటం మానేసి ప్రజల్ని కాల్చుకు తింటూ అధికారంలో ఉండటానికి దొడ్డిదార్లు వెతుకుతున్నారు!ఏ పార్టీ మంచిదో తెలియక జనం ఏ పార్టీ కుదురుగా ఉంటే దానికి అలవాటు పడిపోవాలని చూస్తుంటే అదీ కుదిరి చావటం లేదు. పార్టీల ఖర్మో ప్రజల ఖర్మో మరి!
శివోహం, శివోహం, శివోహం!!!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...