Thursday, 7 November 2019

నన్నయ భారతం లోని యయాతికి అనువైన పద్యం పోతన భాగవతం లోని మురారికి కూడా వర్తిస్తుందా?

జలధి విలోల వీచి విలస త్కలకాంచి సమంచితావనీ
తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునన్ దదున్నమ
ద్గళదురుఘర్మవారికణ కమ్ర కరాబ్జము వట్టి నూతిలో
వెలువడ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్
-నన్నయ
(శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)
కీర్తిమంతుడైన యయాతి, మధురధ్వని చేస్తూ చలించే అలలనే  ప్రకాశించే వడ్డాణాన్ని ధరించిన భూమిని మోయడానికి సమర్థమైన తన కుడి చేతిని చాచాడు. విపరీతంగా చెమట బిందువులు జారుతున్న పద్మం లాంటి అందమైన చేతిని అందుకుని  ప్రేమతో ఆ కోమలిని నూతిలోంచి పైకి తీశాడు.

ఇది శర్మిష్ఠ బావిలోనికి తోసేసి నగరానికి వెళ్ళీపోయాక వేటకు వచ్చిన యయాతి బావిలో ఒక తీగకు వ్రెళ్ళాడుతున్న దేవయానిని చెయ్యి పట్టుకుని బావిలోనుండి పైకి లాగి భూమి మీదకి దించటాన్ని అవ్ర్ణించే పద్యం కదా!

జలధి విలోల వీచి విలస త్కలకాంచి సమంచితావనీ
తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునన్ దదున్నమ
ద్గళదురుఘర్మవారికణ కమ్ర కరాబ్జము వట్టి తేరుపై
వెలువడ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి మురారి ప్రీతితోన్
-నన్నయ
(శ్రీ మదాంధ్ర భాగవతం, దశమ స్కంధము, రుక్మిణీ గ్రహణంబు)
కీర్తిమంతుడైన మురారి, మధురధ్వని చేస్తూ చలించే అలలనే  ప్రకాశించే వడ్డాణాన్ని ధరించిన భూమిని మోయడానికి సమర్థమైన తన కుడి చేతిని చాచాడు. విపరీతంగా చెమట బిందువులు జారుతున్న పద్మం లాంటి అందమైన చేతిని అందుకుని  ప్రేమతో ఆ కోమలిని రధం పైకి లాగాడు.

ఇది రుక్మిణి అగ్నిద్యోతనుల వారితో కబురు పంపిస్తే వస్తానని చెప్పిన ద్విబాహు రపరో హరి నగరానికి బైట దేవి ఆలయం దగ్గిర ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, కని తదీయ రూప వయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి, మనోభవశరాక్రాంతయై రథారోహణంబు గోరుచున్న య వ్వరారోహం జూచి, పరిపంథి రాజలోకంబు చూచుచుండ మందగమనంబున గంధసింధురంబు లీలం జనుదెంచి ఫేరవంబుల నడిమి భాగంబుఁ గొనిచను కంఠీరవంబు కైవడి, నిఖిల భూపాలగణంబుల గణింపక దృణీకరించి, రాజకన్యకం దెచ్చి హరి తన రథంబుమీఁద నిడికొని పోవు సందర్భమునకు ఈ కలికాలపు హరికాలం అతికించిన చోద్యం, ఎలా వుంది?

3 comments:

  1. కేసు కేసు అని పలవరించడేమిటి రా? కేసువేసే మొహాలు ఇలా బ్లాగులో చేరి అజ్ణాతంగా వాగడమెందుకు ఫేస్ బుక్ లైవ్ లోకి రా!

    ReplyDelete
  2. అహా! బాబోరికి కొంచెం ధైర్యమొచ్చిందీ. అక్కడికిరా, ఇక్కడికిరా, ఇక్కడైతే నా వల్ల అస్సలవదు అంటూ చాలెంజిలు మొదలెట్టేశాడూ.

    ReplyDelete
    Replies
    1. చెట్టు బోదెల మీదా కరెంటు స్తంభాల మీదా ఉచ్చలు పోసుకునే కుక్క బతుకులు మీవి!

      AnonymousNovember 8, 2019 at 11:09 AM
      This comment has been removed by uyyaala blog administrator.

      సిగ్గుండాల్రా మనిషి జన్మ ఎత్తాకా - ఎక్కడ కామెంటేస్తే అక్కడ బ్లాగోనర్లు ఈడ్చి తంతన్నారు మిమ్మల్నీ మీ చవకబారు భాషనీ, ధూ!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

పరిశోధన పత్రం ధార్మిక క్షేత్రాల పరిరక్షణ - చట్టం (PROTECTION OF DHARMIC PLACES - BILL) సూరానేని హరిబాబు1 1.M.Sc,Andhra University,Wa...